‘‘ఏకాగ్రత శక్తితో దృఢత ద్వారా సహజ సఫలత యొక్క ప్రాప్తి’’
ఈరోజు బ్రాహ్మణ ప్రపంచం యొక్క రచయిత తమ నలువైపులా ఉన్న బ్రాహ్మణ పరివారాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇది చిన్నని, అతీతమైన మరియు అతి ప్రియమైన అలౌకిక బ్రాహ్మణ ప్రపంచము. ఇది మొత్తము డ్రామాలో అతి శ్రేష్ఠమైన ప్రపంచము ఎందుకంటే బ్రాహ్మణ ప్రపంచములోని ప్రతి గతి, విధి అతీతమైనవి మరియు విశేషమైనవి. ఈ బ్రాహ్మణ ప్రపంచములోని బ్రాహ్మణ ఆత్మలు కూడా విశ్వములోకెల్లా విశేష ఆత్మలు, అందుకే ఇది విశేష ఆత్మల ప్రపంచము. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క శ్రేష్ఠమైన వృత్తి, శ్రేష్ఠమైన దృష్టి మరియు శ్రేష్ఠమైన కృతి విశ్వంలోని సర్వాత్మలను శ్రేష్ఠంగా తయారుచేయడానికి నిమిత్తమైనవి. ప్రతి ఆత్మపై ఈ విశేష బాధ్యత ఉంది కావున ప్రతి ఒక్కరూ ఈ బాధ్యతను అనుభవము చేస్తున్నారా? ఇది ఎంత పెద్ద బాధ్యత! మొత్తము విశ్వము యొక్క పరివర్తన! మీరు కేవలము ఆత్మలను మాత్రమే పరివర్తన చెయ్యరు, ప్రకృతిని కూడా పరివర్తన చేస్తారు. ఈ స్మృతి సదా ఉండాలి, ఇందులో నంబరువారుగా ఉన్నారు. బ్రాహ్మణ ఆత్మలు ప్రతి ఒక్కరిలో ఈ సంకల్పము సదా ఉండాలి - విశేష ఆత్మలమైన మేము నంబర్‌వన్‌గా అవ్వాలి అని, కానీ సంకల్పము మరియు కర్మలో తేడా వచ్చేస్తుంది. దీనికి కారణమేమిటి? కర్మ చేసే సమయంలో సదా తమ స్మృతిని అనుభవీ స్థితిలోకి తీసుకురారు. వినటము, తెలుసుకోవటము, ఈ రెండూ గుర్తుంటాయి కానీ స్వయము ఆ స్థితిని స్వీకరించి నడుచుకోవడము, ఇందులో మెజారిటీ ఒక్కోసారి అనుభవజ్ఞులుగా అవుతారు మరియు ఒక్కోసారి కేవలము స్వీకరించేవారిగా మరియు తెలుసుకునేవారిగా అవుతారు. ఈ అనుభవాన్ని పెంచుకునేందుకు రెండు విషయాల యొక్క విశేష మహత్వాన్ని తెలుసుకోండి. ఒకటి స్వయము యొక్క మహత్వాన్ని, రెండు సమయము యొక్క మహత్వాన్ని. స్వయము గురించి చాలా బాగా తెలుసు. ఒకవేళ ఎవరినైనా మీరు ఎటువంటి ఆత్మ అని ప్రశ్నిస్తే లేక స్వయాన్ని అయినా నేను ఎవరు అని ప్రశ్నించుకుంటే ఎన్ని విషయాలు గుర్తుకొస్తాయి? ఒక్క నిమిషములో తమ స్వమానాలు ఎన్ని గుర్తుకొస్తాయి? ఒక్క నిమిషంలో ఎన్ని గుర్తుకొస్తాయి? చాలా గుర్తుకొస్తాయి కదా. స్వయము యొక్క మహత్వం గురించి ఎంత పెద్ద లిస్ట్ ఉంది! కనుక తెలుసుకోవటములో చాలా తెలివైనవారు. అందరూ తెలివైనవారే కదా? మరి అనుభవము చెయ్యటంలో తేడా ఎందుకు వస్తుంది? ఎందుకంటే సరైన సమయములో ఆ స్థితి అనే సీట్‌పై సెట్ అవ్వరు. ఒకవేళ సీట్‌పై సెట్ అయినట్లయితే ఏదీ కూడా, అది బలహీన సంస్కారమైనా, లేక ఆత్మలైనా, లేక ప్రకృతి అయినా, ఏ విధమైన రాయల్ మాయ అయినా కానీ డిస్టర్బ్ చెయ్యలేదు. ఏ విధంగా శరీరం పరంగా కూడా చాలామంది ఆత్మలకు ఒక సీటుపై లేక ఒక స్థానములో ఏకాగ్రులై కూర్చునే అభ్యాసము లేకపోతే వారేం చేస్తారు? కదులుతూ ఉంటారు కదా. అదే విధంగా మనసు మరియు బుద్ధికి ఏదైనా అనుభవం అనే సీట్‌పై సెట్ అవ్వడం రాకపోతే ఇప్పుడిప్పుడే సెట్ అవుతాయి, ఇప్పుడిప్పుడే అప్సెట్ అవుతాయి. శరీరాన్ని కూర్చోబెట్టేందుకు స్థూల స్థానము ఉంటుంది మరియు మనసు, బుద్ధిని కూర్చోబెట్టేందుకు శ్రేష్ఠ స్థితులు అనే స్థానము ఉంది. బాప్‌దాదా పిల్లల యొక్క ఈ ఆటను చూస్తుంటారు - ఇప్పుడిప్పుడే మంచి స్థితి అనే అనుభవములో స్థితులవుతారు మరియు ఇప్పుడిప్పుడే తమ స్థితి నుండి అలజడిలోకి వచ్చేస్తారు. చిన్న పిల్లలు చంచలంగా ఉంటారు కావున ఒకే స్థానంలో ఎక్కువ సమయం కూర్చోలేరు, అలా చాలామంది పిల్లలు కూడా ఈ చిన్ననాటి ఆటను చాలా ఎక్కువగా ఆడుతూ ఉంటారు. ఇప్పుడిప్పుడే చూస్తే చాలా ఏకాగ్రంగా ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే చూస్తే ఏకాగ్రతకు బదులుగా రకరకాల స్థితులలో భ్రమిస్తూ ఉంటారు. కనుక ఈ సమయములో మనసు మరియు బుద్ధి సదా ఏకాగ్రంగా ఉండే విశేష అటెన్షన్ ఉండాలి.
ఏకాగ్రతా శక్తి సహజంగా నిర్విఘ్నంగా చేస్తుంది. శ్రమించే అవసరమే లేదు. ఏకాగ్రతా శక్తి స్వతహాగానే ‘ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు’ అన్న ఈ అనుభూతిని సదా చేయిస్తుంది. ఏకాగ్రతా శక్తి సహజంగా ఏకరస స్థితిని తయారుచేస్తుంది. ఏకాగ్రతా శక్తి సదా సర్వుల పట్ల ఒకే ఒక కళ్యాణ వృత్తిని సహజంగా తయారుచేస్తుంది. ఏకాగ్రతా శక్తి సర్వుల పట్ల భాయి-భాయి దృష్టిని స్వతహాగా తయారుచేస్తుంది. ఏకాగ్రతా శక్తి ప్రతి ఆత్మ యొక్క సంబంధములో స్నేహము, గౌరవము, స్వమానాలతో కూడిన కర్మలను సహజంగా అనుభవము చేయిస్తుంది. కనుక ఇప్పుడేం చెయ్యాలి? ఏ అటెన్షన్ పెట్టాలి? ‘ఏకాగ్రత’. స్థితులవుతారు, అనుభవము కూడా చేస్తారు కానీ ఏకాగ్ర అనుభవజ్ఞులుగా అవ్వరు. ఒక్కోసారి శ్రేష్ఠ అనుభవములో, ఒక్కోసారి మధ్యమ అనుభవములో, ఒక్కోసారి సాధారణ అనుభవములో, మూడింటిలో తిరుగుతూ ఉంటారు. ఎంతటి సమర్థులుగా అవ్వాలంటే మనసు-బుద్ధి సదా మీ ఆర్డర్ అనుసారంగా నడవాలి. స్వప్నములో కూడా క్షణకాలము కోసం కూడా అలజడిలోకి రాకూడదు. మనసు అనేది యజమానిని పరవశం చేయకూడదు.
పరవశ ఆత్మల గుర్తు - ఆ ఆత్మ అంత సమయము కోసం సుఖాన్ని, ప్రశాంతతను, ఆనందాన్ని అనుభూతి చేయాలనుకున్నా చేయలేకపోతుంది. బ్రాహ్మణ ఆత్మ ఎప్పుడూ ఎవరికీ పరవశం అవ్వలేదు, తమ బలహీన స్వభావము మరియు సంస్కారానికి కూడా వశమవ్వలేదు. నిజానికి ‘స్వభావము’ అన్న పదానికి అర్థము ‘స్వయము యొక్క భావము’. స్వయము యొక్క భావమైతే మంచిగా ఉంటుంది, చెడుగా ఉండదు. ‘స్వ’ అని అనటంతోనే ఏం గుర్తుకొస్తుంది? ఆత్మిక స్వరూపము గుర్తుకొస్తుంది కదా. కనుక స్వ-భావము అనగా స్వయము పట్ల మరియు సర్వుల పట్ల ఆత్మిక భావము ఉండాలి. ఎప్పుడైనా బలహీనతకు వశమై నా స్వభావమే లేక నా సంస్కారమే అటువంటిది, ఏం చెయ్యాలి, ఉన్నదే అలా... అని ఇలా ఆలోచిస్తే, ఇలా ఎటువంటి ఆత్మ మాట్లాడుతుంది? ఇటువంటి మాటలు లేక సంకల్పాలు పరవశ ఆత్మలవి. కనుక ఎప్పుడైనా - నా స్వభావమే అటువంటిది అన్న సంకల్పం వస్తే, వెంటనే శ్రేష్ఠ అర్థములో స్థితులవ్వండి. ఇవి నా సంస్కారాలు... అని సంస్కారాలు ఎదురుగా వచ్చినప్పుడు ఇలా ఆలోచించండి - వేటినైతే నా సంస్కారాలు అని అంటున్నానో, అవి విశేష ఆత్మనైన నా సంస్కారాలా? నావి అని అనేసరికి బలహీన సంస్కారాలు కూడా నావి అని అన్నందుకు నన్ను విడిచిపెట్టవు ఎందుకంటే నియమము ఏమిటంటే - ఎక్కడైతే నాది అన్న భావము ఉంటుందో అక్కడ నా వారు అన్న భావన ఉంటుంది మరియు ఎక్కడైతే నా వారు అన్న భావన ఉంటుందో అక్కడ అధికారము ఉంటుంది. కావున బలహీన సంస్కారాలను తమవిగా చేసుకున్నందుకు అవి తమ అధికారాన్ని విడిచిపెట్టవు, అందుకే పరవశులై తండ్రి ముందు విన్నపాన్ని పెట్టుకుంటారు - విడిపించండి-విడిపించండి అని. ‘సంస్కారము’ అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు అనాది సంస్కారాలు, ఆది సంస్కారాలే నా సంస్కారాలు అని గుర్తు చేసుకోండి. వేరేవి మాయ సంస్కారాలు, నావి కావు. కనుక ఏకాగ్రతా శక్తితో పరవశ స్థితిని పరివర్తన చేసి యజమానత్వపు స్థితి అన్న సీట్‌పై సెట్ అవ్వండి.
యోగములో కూడా కూర్చుంటారు, కూర్చోవడమైతే అందరూ అభిరుచితోనే కూర్చుంటారు కానీ ఎంత సమయము, ఏ స్థితిలో స్థితులవ్వాలనుకుంటారో, అంత సమయము ఏకాగ్ర స్థితి ఉండాలి, ఇది అవసరము. మరేం చెయ్యాలి? ఏ విషయాన్ని అండర్లైన్ చేస్తారు? (ఏకాగ్రత). ఏకాగ్రతలోనే దృఢత ఉంటుంది మరియు ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత మెడలోని హారంగా ఉంటుంది. అచ్ఛా!
నలువైపులా ఉన్న అలౌకిక బ్రాహ్మణ ప్రపంచపు విశేష ఆత్మలకు, సదా శ్రేష్ఠ స్థితి యొక్క అనుభవము అనే సీట్‌పై సెట్ అయ్యి ఉండే ఆత్మలకు, సదా స్వయము యొక్క మహత్వాన్ని అనుభవము చేసేవారికి, సదా ఏకాగ్రతా శక్తితో మనసు, బుద్ధిని ఏకాగ్రము చేసేవారికి, సదా ఏకాగ్రతా శక్తితోనే దృఢత ద్వారా సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే సర్వ శ్రేష్ఠ, సర్వ విశేష, సర్వ స్నేహీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1
ఎగిరే కళలోకి వెళ్ళేందుకు డబల్ లైట్‌గా అవ్వండి, ఎటువంటి ఆకర్షణా ఆకర్షించకూడదు
అందరూ స్వయాన్ని వర్తమాన సమయం అనుసారంగా తీవ్రగతితో ఎగిరేవారిగా అనుభవము చేస్తున్నారా? సమయం యొక్క వేగం తీవ్రంగా ఉందా లేక ఆత్మల పురుషార్థం యొక్క వేగం తీవ్రంగా ఉందా? సమయము మీ వెనుక ఉందా లేక మీరు సమయమనుసారంగా నడుస్తున్నారా? చివర్లో అన్నీ బాగైపోతాయి, సంపూర్ణమైపోతాము, తండ్రి సమానంగా అయిపోతాము అని సమయము కోసమైతే ఎదురుచూడటం లేదు కదా? ఇలా అయితే లేరు కదా! ఎందుకంటే డ్రామా లెక్కలో వర్తమాన సమయము చాలా తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉంది, అతిలోకి వెళ్తూ ఉంది. నిన్న ఎలాగైతే ఉందో దానికన్నా ఈరోజు ఇంకా అతిలోకి వెళ్తూ ఉంది. ఇదైతే తెలుసు కదా? ఏ విధంగా సమయము అతిలోకి వెళ్తూ ఉందో, అలా శ్రేష్ఠ ఆత్మలైన మీరు కూడా పురుషార్థములో అతి తీవ్రగతితో అనగా వేగమైన గతితో వెళ్తున్నారా? లేక ఒక్కోసారి ఢీలాగా, ఒక్కోసారి వేగంగా వెళ్తున్నారా? కిందకు వచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం కాదు. కిందకు పైకి అయ్యేవారి వేగం ఎప్పుడూ ఏకరసంగా, తీవ్రంగా ఉండదు. సదా సర్వ విషయాలలో శ్రేష్ఠమైన మరియు తీవ్ర వేగంతో ఎగిరేవారిగా ఉండాలి. ‘మీరు ఎక్కే కళలో ఉంటే అందరికీ మంచి జరుగుతుంది’ అన్న గాయనము ఉంది కానీ ఇప్పుడు ఏమని అంటారు? ‘ఎగిరే కళ ఉంటే అందరికీ మంచి జరుగుతుంది’. ఇప్పుడు ఎక్కే కళ యొక్క సమయము కూడా సమాప్తమైపోయింది, ఇప్పుడిది ఎగిరే కళ యొక్క సమయము. మరి ఎగిరే కళ ఉన్న సమయములో ఎవరైనా ఎక్కే కళతో చేరుకోవాలనుకుంటే చేరుకోగలరా? చేరుకోలేరు. కనుక సదా ఎగిరే కళ ఉండాలి. ఎగిరే కళకు గుర్తు సదా డబల్ లైట్‌గా ఉండటము. డబల్ లైట్‌గా లేనట్లయితే ఎగిరే కళ ఉండజాలదు. కొద్దిపాటి బరువు ఉన్నా అది కిందకు తీసుకొస్తుంది. ఏ విధంగా ప్లేన్‌లో వెళ్ళేటప్పుడు, ఎగిరేటప్పుడు ఒకవేళ మిషనరీలో లేక పెట్రోల్‌లో కొద్దిపాటి చెత్త వచ్చినా అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? ఎగిరే కళ నుండి పడిపోయే కళలోకి వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఒకవేళ ఏ విధమైన భారము ఉన్నా, అది తమ సంస్కారాలదైనా, వాయుమండలముదైనా, ఏ ఆత్మ యొక్క సంబంధ-సంపర్కానిదైనా, ఏ భారమున్నా సరే ఎగిరే కళ నుండి అలజడిలోకి వచ్చేస్తారు. మామూలుగా అయితే నేను మంచిగానే ఉంటాను కానీ ఇదిగో, ఈ కారణం ఉంది కదా, దీనివల్ల ఈ సంస్కారాల యొక్క, వ్యక్తుల యొక్క లేక వాయుమండలము యొక్క బంధనము ఉంది అని అంటారు. కానీ కారణము ఏదైనా, ఎటువంటిదైనా కానివ్వండి, తీవ్ర పురుషార్థులు అన్ని విషయాలనూ ఎలా దాటేస్తారంటే అసలేమీ లేనే లేదు అన్నట్లుగా ఉంటారు. శ్రమను కాకుండా మనోరంజనాన్ని అనుభవము చేస్తారు. ఇటువంటి స్థితినే ఎగిరే కళ అని అంటాము. మరి ఎగిరే కళ ఉందా లేక అప్పుడప్పుడు కిందకు రావాలని, చక్కర్లు కొట్టాలని మనసు కలుగుతుందా! దేనిపైనా మోహం ఉండకూడదు. కొద్దిగా కూడా ఏ ఆకర్షణ ఆకర్షించకూడదు. రాకెట్ కూడా భూమి యొక్క ఆకర్షణ నుండి దూరమైనప్పుడే ఎగరగలదు. లేదంటే పైకి ఎగరలేదు. వద్దనుకున్నా కూడా కిందకు వచ్చేస్తుంది. కనుక ఎటువంటి ఆకర్షణ పైకి తీసుకువెళ్ళలేదు. సంపూర్ణంగా అవ్వనివ్వదు. కనుక చెక్ చేసుకోండి - సంకల్పములో కూడా ఎటువంటి ఆకర్షణా ఆకర్షించకూడదు. తండ్రి ఆకర్షణ తప్ప మరే ఇతర ఆకర్షణ ఉండకూడదు. పాండవులు ఏమనుకుంటున్నారు? ఇటువంటి తీవ్ర పురుషార్థులుగా అవ్వండి. అవ్వాల్సిందే కదా. ఎన్నిసార్లు అలా అయ్యారు? చాలాసార్లు అయ్యారు. మీరే అలా అయ్యారా లేక ఇతరులెవరైనా అయ్యారా? మీరే అయ్యారు. కనుక నంబరువారులోకైతే రాకూడదు కదా, నంబర్‌వన్‌లోకి రావాలి. మాతలు ఏం చేస్తారు? నంబర్‌వన్ లోకి వస్తారా లేక నంబరువారు అయినా ఫరవాలేదా? 108వ నంబరు అయినా ఫరవాలేదా? 108వ నంబరు వారిగా అవుతారా లేక మొదటి నంబరు వారిగా అవుతారా? తండ్రికి చెందినవారిగా అయ్యారంటే, యజమానులుగా అయ్యారంటే మరి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలా లేక కాస్త తక్కువగానా? కావున మరి నంబర్‌వన్‌గా అవుతారు కదా. దాత పూర్తిగా ఇస్తున్నప్పుడు తీసుకునేవారు తక్కువగా తీసుకుంటే ఏమంటారు? అందుకే నంబర్‌వన్‌గా అవ్వాలి. నంబర్‌వన్‌గా అయ్యేది ఒక్కరే కానీ నంబర్‌వన్ డివిజన్లో అయితే చాలామంది ఉంటారు కదా. కనుక రెండవ నంబర్‌లోకి రాకూడదు. తీసుకోవాలనుకుంటే పూర్తిగా తీసుకోవాలి. సగం-సగం తీసుకునేవారైతే తర్వాత-తర్వాత చాలామంది వస్తారు. కానీ మీరు పూర్తిగా తీసుకోవాలి. అందరూ పూర్తిగా తీసుకునేవారేనా లేక కొంచెము దానికే సంతోషపడిపోయేవారా? తెరిచి ఉన్న భండారీ అన్నప్పుడు మరియు అది తరగనంతగా ఉన్నప్పుడు తక్కువ ఎందుకు తీసుకోవాలి? ఇది అనంతమైనది కదా. ఒకవేళ 8000 వీరికి లభించాలి, 10000 వీరికి లభించాలి అని హద్దు ఉంటే వీరి భాగ్యములో ఇంతే ఉంది అని అనచ్చు, కానీ తండ్రిది తెరిచియున్న భండారీ, తరగని ఖజానా, ఎంత తీసుకోవాలనుకుంటే అంత తీసుకోవచ్చు, అయినా కానీ తరగదు. మీరు తరగని ఖజానాకు యజమానులు. బాలకులు మరియు యజమానులు. మరి అందరూ సదా సంతోషంగా ఉండేవారేనా లేక అప్పుడప్పుడు కొద్ది-కొద్దిగా దుఃఖపు అల వస్తుందా? దుఃఖపు అల స్వప్నములో కూడా రాలేదు. సంకల్పాల విషయం పక్కన పెట్టండి, స్వప్నములో కూడా రాలేదు. ఇటువంటివారినే నంబర్‌వన్ అని అంటాము. మరి ఏ అద్భుతాన్ని చేసి చూపిస్తారు? అందరూ నంబర్‌వన్‌లోకి వచ్చి చూపిస్తారు కదా?
మామూలుగా కూడా ఢిల్లీని దిల్ (మనసు) అని అంటారు. మరి మనసు ఎలా ఉంటే శరీరము అలా నడుస్తుంది. ఆధారమైతే మనసే కదా. మనసు అంటే మనోభిరాముని మనసు. కనుక మనసు యొక్క సీట్ యథార్థమైనదిగా ఉండాలి కదా, కిందకు పైకి అవ్వకూడదు. కనుక మేము అంటే మనోభిరాముని మనసు అనే నషా ఉంది కదా. కావున ఇప్పుడు మీ శ్రేష్ఠ సంకల్పాల ద్వారా స్వయాన్ని మరియు విశ్వాన్ని పరివర్తన చెయ్యండి. సంకల్పము చేసారు మరియు వెంటనే కర్మ జరిగింది అన్నట్లుగా ఉండాలి. చాలా ఆలోచించారు లేక చాలా ఆలోచిస్తారు కానీ చేసేది చాలా తక్కువగా ఉండటము, ఇలా ఉండకూడదు. ఇటువంటివారు తీవ్ర పురుషార్థులు కారు. తీవ్ర పురుషార్థీ అనగా సంకల్పము మరియు కర్మ సమానంగా ఉండాలి, అప్పుడే తండ్రి సమానము అని అంటాము. సంతోషంగా ఉన్నారు మరియు సదా సంతోషంగా ఉంటారు. ఈ పక్కా నిశ్చయముంది కదా. సంతోషంగా ఉండేవారే భాగ్యశాలి. ఇది పక్కానేనా లేక కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉంటారా? కచ్చాగా (అపరిపక్వంగా) ఉన్న వస్తువు మంచిగా అనిపిస్తుందా? పరిపక్వంగా ఉన్నదానినే ఇష్టపడతారు కదా. కనుక పూర్తిగా పక్కాగా (పరిపక్వంగా) ఉండాలి.
ప్రతి రోజూ అమృతవేళ ఈ పాఠాన్ని పక్కా చేసుకోండి - ఏం జరిగినా కానీ సంతోషంగా ఉండాలి, ఇతరులను సంతోషపరచాలి. అచ్ఛా, వేరే ఏ ఆటలను చూపించవద్దు. ఈ ఆటనే చూపించాలి, వేరే-వేరే ఆటలు ఆడవద్దు. అచ్ఛా!
గ్రూప్ నెం. 2
అపకారికి కూడా ఉపకారం చేయడం – ఇదే జ్ఞాని తూ ఆత్మ యొక్క కర్తవ్యము
నేను విశ్వ కళ్యాణ కార్యానికి నిమిత్తంగా అయిన ఆత్మను, అని నిమిత్త భావనతో ప్రతి కార్యాన్ని చేస్తున్నారా? విశ్వ కళ్యాణానికి నిమిత్తమైన ఆత్మలు స్వయం, తమ గురించి అకళ్యాణకారి సంకల్పాన్ని కూడా చేయలేవు. ఎందుకంటే విశ్వ బాధ్యత కలిగిన మీ నిమిత్త ఆత్మల వృత్తి ద్వారానే వాతావరణం పరివర్తన అవ్వాల్సి ఉంది. కాబట్టి సంకల్పం ఎలా ఉంటే వృత్తి ఖచ్చితంగా అలాగే ఉంటుంది. ఎప్పుడైనా ఎవరి పట్లనైనా లేదా తమ పట్లనైనా ఏదైనా వ్యర్థ సంకల్పం వస్తే వృత్తిలో ఏముంటుంది? అదే భావం వృత్తిలో ఉంటుంది, అదే కర్మ స్వతహాగానే జరుగుతుంది. కాబట్టి ఒక్క సెకను కూడా వృత్తిని వ్యర్థంగా చేసుకోలేరు. ఒక్క సెకను కూడా వ్యర్థ సంకల్పం చేయలేరు, ఎందుకంటే మీ వెనుక విశ్వ బాధ్యత ఉంది. ఇలా భావిస్తున్నారా? ఇది బాబా బాధ్యత, మీది కాదని భావిస్తున్నారా? లేదా మేము చిన్నవారము కాబట్టి చిన్న బాధ్యత చాలు అని భావిస్తున్నారా? లేదు, పెద్ద బాధ్యతను తీసుకున్నారు. కాబట్టి విశ్వ కళ్యాణకారులు. తండ్రి ఎలాగో, పిల్లలు అలాగే. పరిస్థితి ఎలాంటిదైనా, వ్యక్తి ఎవరైనా కానీ స్వయం యొక్క భావన, స్వయం యొక్క వృత్తి ఏది? విశ్వ కళ్యాణకారి. ఇంత గుర్తుంటుందా లేదా నిర్లక్ష్యం కూడా వస్తుందా? కాబట్టి నిర్లక్ష్యంగా అవ్వకూడదు. విశ్వ కళ్యాణకారియే విశ్వ రాజ్యాధికారి కాగలరు. ఒకవేళ విశ్వ కళ్యాణ భావన లేకపోతే విశ్వ రాజ్యంపై కూడా అధికారం లభించదు. సంబంధం ఉంది కదా! కాబట్టి సదా అందరి పట్ల శుభభావన, శుభకామన ఉండాలి. ఉండగలదా? ఎవరైనా మిమ్మల్ని నిందించినా కూడా వారి పట్ల శుభకామన ఉంచగలరా? ఎవరైనా తిట్టినా కూడా శుభభావన ఉంచుతారా? లేదా మనస్సులో కొద్దిగా అయినా వస్తుందా? వీరేంటి ఇలా చేస్తున్నారు, ఈమె ఏమి చేస్తోంది అని కొద్దిగా అయినా వస్తుంది కదా! ఒకరు మీకు కళ్యాణం చేస్తే, మరొకరు అకళ్యాణం చేస్తే రెండూ సమానంగా అనిపిస్తాయా? కొద్దిగా అయినా తేడా ఉంటుంది కదా? ఎవరైనా రోజూ మిమ్మల్ని నిందిస్తూ, ఒక సంవత్సరం వరకు అలాగే చేసి, ఒక సంవత్సరం తర్వాత కూడా మారకపోతే మీరు కళ్యాణం చేస్తారా? వారు అకళ్యాణం చేసినా, మీరు కళ్యాణమే చేస్తారా? అలా చేస్తున్నారా లేదా కొద్దిగా ముఖం తిప్పేసుకుంటున్నారా? పోనీ, ద్వేషభావం లేకపోయినా మనస్సులో కొద్దిగా పక్కకు తప్పుకుంటారా – వీరు సరిగ్గా లేరు అని, లేదా వారిని సరిదిద్దుతారా? ఏమి చేస్తారు? సరిదిద్దుతారా? చేస్తామని చెప్పడం సహజమే కానీ చేస్తున్నారా? అపకారికి కూడా ఉపకారం చేయడం – ఇదే జ్ఞాని తూ ఆత్మ యొక్క కర్తవ్యము. తండ్రి మీ అకళ్యాణాన్ని చూశారా? ఎన్ని జన్మలు తండ్రిని తిట్టారు? 63 జన్మలు తిట్టారు. అయినా తండ్రి ఆ నిందను కూడా కళ్యాణకారి దృష్టితోనే చూశారు. కాబట్టి ఫాలో ఫాదర' చేయాలి కదా! ఉపకారికి ఉపకారం లోకంలో ఉన్నవారు కూడా చేస్తారు, భక్త ఆత్మలు కూడా చేస్తారు. కానీ జ్ఞాని తూ ఆత్మ వారికంటే శ్రేష్ఠమైనది. మరి మీరు ఎవరు? జ్ఞాని తూ ఆత్మనా లేదా జ్ఞాని తూ ఆత్మగా అవుతున్నారా? అందరూ ఉన్నారా లేదా సగం భక్తులు, సగం జ్ఞానులా? పూర్తిగా జ్ఞాని తూ ఆత్మలా లేదా కొద్దికొద్దిగా భక్తులు కూడానా? లేదు, జ్ఞాని తూ ఆత్మ. కాబట్టి జ్ఞాని తూ ఆత్మ అంటేనే సర్వుల పట్ల కళ్యాణ భావన ఉండటం. అకళ్యాణ సంకల్ప మాత్రములో కూడా ఉండకూడదు. విశ్వ కళ్యాణకారిగా ఉన్నప్పుడు యజమానులుగా అయ్యారు కదా! యజమాని ముందు అందరూ పిల్లల లాంటివారే కదా! కాబట్టి తండ్రి పిల్లలపై కళ్యాణ, దయా భావనను ఉంచుతారు. పిల్లలు ఎలా ఉన్నా తండ్రి బాధ్యత ఏమిటి? దయ మరియు కళ్యాణ భావన. అందుకే తండ్రి మహిమలో ‘రహమ్దిల్’' (దయార్ద్ర హృదయుడు) అని ప్రత్యేకంగా గాయనం చేయబడింది. దేశంలో అయినా, విదేశంలో అయినా తండ్రి ముందుకు వస్తే రహమ్దిల్, మెర్సీఫుల్ అంటారు. ఏ చర్చికి వెళ్లినా, ఎక్కడికి వెళ్లినా మెర్సీఫుల్ అని అంటారు కదా! మరి మీరందరూ కూడా రహమ్దిల్లే కదా! కాబట్టి ఎవరు రహమ్దిల్గా ఉంటారో వారే కళ్యాణం చేయగలరు. తండ్రిని అందరూ సాగరము అంటారు – క్షమా సాగరుడు, దయా సాగరుడు... సాగరము అంటే ఏమిటి? అపారమైనది, అనంతమైనది. కాబట్టి ఇంత అపారమైన అంటే అనంతమైన దయ ఉందా? అందరూ రహమ్దిల్లేనా లేదా ద్వేషం ఉన్న హృదయాలు కూడా ఉన్నాయా? లేదు. నాలెడ్జ్‌ఫుల్ ఆత్మ అంటే జ్ఞాని తూ ఆత్మ సదా ప్రతి ఒక్కరి పట్ల మాస్టర్ స్నేహ సాగరులుగా ఉంటారు. స్నేహం తప్ప వారి వద్ద వేరే ఏదీ ఉండదు. ఎవరు వచ్చినా వారికి స్నేహాన్నే ఇస్తారు కదా! మీ వద్ద ఇంకేముంది! సత్యమైన స్నేహం ఉంది. ఈ రోజుల్లో సంపద కంటే కూడా స్నేహం యొక్క అవసరం ఎక్కువగా ఉంది. కాబట్టి స్నేహ ఖజానా జమ అయి ఉంటేనే కదా ఇతరులకు ఇవ్వగలరు! మీ అంతట మీరు ఉపయోగించుకోవడానికే సరిపోతే ఇతరులకు ఏమి ఇస్తారు! అందుకే ప్రతిదానిలో మాస్టర్‌గా అవ్వండి. స్నేహంలో కూడా మాస్టర్ స్నేహ సాగరుడు. మరి ఇంత స్నేహం జమ అయి ఉందా లేదా తక్కువగా ఉందా? దాత యొక్క పిల్లలు కదా! మరి దాత పిల్లలు ఏమి చేస్తారు? ఇస్తారు. తీసుకొని ఇవ్వడం అనేది ఇవ్వడం అనిపించుకోదు. తీసుకుని ఇచ్చేది బిజినెస్ (వ్యాపారం) అవుతుంది. వ్యాపారంలో మొదట తీసుకుంటారు, తర్వాత ఇస్తారు. కానీ మీరు దాత యొక్క పిల్లలు కదా! తీసుకొని ఇవ్వడంలో ఇచ్చేదానికి ప్రాముఖ్యత లేదు. వారిని దాత అనము. ఎవరైనా ఇస్తే మేము ఇస్తాము అనుకోకూడదు. దాత యొక్క పిల్లలు ఇస్తూనే ఉండండి. ఎవ్వరూ ఖాళీగా వెళ్లకూడదు. అపారమైన ఖజానా ఉంది కదా! ఎవరికి ఏది కావాలో అది ఇస్తూ ఉండండి. ఎవరికి శాంతి కావాలో, ఎవరికి సంతోషం కావాలో, ఎవరికి స్నేహం కావాలో ఇస్తూ ఉండండి. వారు ఎంత ఇచ్చారు, నేను ఎంత ఇచ్చాను అని లెక్కలు వేసుకోవడం లేదు కదా? ? ఇది ఓపెన్ ఖాతా (తెరిచిన ఖాతా), లెక్కల ఖాతా కాదు. దాత యొక్క పిల్లలా లేదా కొద్దిగా పిసినారితనం చేస్తున్నారా? సరే, పిసినారితనం కాకపోతే లెక్కలు వేసుకునేవారా? వారు ఇది చేశారు కాబట్టే నేను ఇది చేశాను అనేది కూడా లెక్కల ఖాతానే అవుతుంది కదా! దాత దర్బారులో ఈ సమయంలో అంతా బహిరంగంగా ఉంది. ఈ సమయంలో ఎలాంటి లెక్కలు లేవు, ఎంత కావాలో అంత తీసుకోండి, ఎంత కావాలో అంత ఇవ్వండి. ధర్మరాజ పురిలో లెక్కలు ఉంటాయి, ఇప్పుడు కాదు. కాబట్టి దాత యొక్క పిల్లలమని గుర్తుంచుకోండి, ఇవ్వాలి. అక్కడికి వెళ్లి లెక్కల పుస్తకం ప్రారంభించకండి.
అచ్ఛా, ఇది వెరైటీ గ్రూప్. ఎక్కడి నుండి వచ్చినా ఒకే తండ్రి పిల్లలు, ఒకే పరివారం. డబల్ విదేశీయులు ఏమనుకుంటున్నారు? ఒకే పరివారం కదా? లేదా డబల్ విదేశీయులు వేరు, దేశంలో ఉన్నవారు వేరా? లేదు, అందరూ ఒక్కటే. డబల్ విదేశీయులైనా, దేశం వారైనా అందరూ, మేము బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారీలము అని చెప్తారు. విదేశాలలో ఇంకే పేరు చెప్పరు కదా! ఒకటే – బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారి. కాబట్టి ఒకే పరివారం అయిపోయింది కదా! ఒకే పరివారంలో ఎంత సంతోషం ఉంది! ఇంత పెద్ద పరివారం మొత్తం కల్పంలో ఎక్కడా లభించదు. సత్యయుగంలో ఇంత పెద్ద పరివారం ఉంటుందా? మూడు లక్షలు, నాలుగు లక్షల పరివారం ఉంటుందా!. అక్కడ ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ చూడండి ఎంత పెద్ద పరివారం ఉందో! ఈ అనంతమైన పరివారాన్ని చూసి సంతోషం కలుగుతోంది కదా! చూడండి, విదేశాల నుండి కూడా పరిగెత్తుకుని ఎందుకు వస్తున్నారు? తండ్రిని మరియు పరివారాన్ని కలవడానికి!
మరి అందరూ సంతోషంగా ఉన్నారా? ఎవరైనా నారాజ్ ( అసంతృప్తి)గా ఉన్నారా? ఎందుకు నారాజ్ అవుతారు? రాజ్ (రహస్యం) తెలుసుకోకపోతే నారాజ్ అవుతారు. ఎవరైనా నారాజ్ అయ్యారంటే వారు రహస్యాన్ని అర్థం చేసుకోలేదని అర్థం. రహస్యం తెలిసినవారు నారాజ్ అవ్వరు. అచ్ఛా!
గ్రూప్ నెం. 3
మీ శ్రేష్ఠ స్థితిని తయారు చేసుకోవడానికి అమృతవేళ మూడు బిందువుల తిలకాన్ని ధరించండి
సదా అమృతవేళ స్వయానికి మూడు బిందువుల తిలకాన్ని ఇస్తున్నారా? తిలకం అంటే అర్థం ఏమిటి? స్మృతి యొక్క తిలకం. కాబట్టి తిలకానికి చాలా ప్రాముఖ్యత ఉంది. తిలకం రాజ్యాధికారానికి కూడా నిదర్శనం. రాజ్యాధికారం ఇచ్చేటప్పుడు రాజతిలకం అంటారు మరియు భక్తిలో కూడా తిలకపు గుర్తును తప్పకుండా ఉంచుతారు, అలాగే సౌభాగ్యానికి మరియు భాగ్యానికి నిదర్శనం కూడా తిలకమే. కాబట్టి తిలకానికి ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే తిలకం స్మృతికి నిదర్శనం. కాబట్టి జ్ఞాన మార్గంలో కూడా స్మృతికే ప్రాముఖ్యత ఉంది కదా! ఎలాంటి స్మృతి ఉంటే అలాంటి స్థితి ఉంటుంది. స్మృతి శ్రేష్ఠంగా ఉంటే స్థితి కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. స్మృతి వ్యర్థంగా ఉంటే స్థితి కూడా సమర్థంగా ఉండే బదులు వ్యర్థంగా అయిపోతుంది. కాబట్టి తండ్రి మూడు బిందువుల తిలకం అనగా మూడు స్మృతుల తిలకాన్ని ఇచ్చారు. ఎందుకంటే ఈ మూడు స్మృతులు అవసరం మరియు మూడు బిందువులూ సులభమైనవి. చిన్న పిల్లవాడికి కూడా బిందువు పెట్టమంటే పెట్టేస్తాడు కదా! అయితే నేను ఆత్మను - ఇది స్వ యొక్క స్మృతి, తర్వాత తండ్రి స్మృతి మరియు శ్రేష్ఠ కర్మ కొరకు డ్రామా యొక్క స్మృతి. డ్రామా నడుస్తూ ఉంటుంది, గడిచిపోతుంది. ఇప్పుడు వర్తమానంగా ఉన్నది సెకనులో గతంగా (పాస్ట్) అయిపోతుంది. కాబట్టి గడిచిపోతుంది, అందుకే గడిచినది గడిచిపోయింది, ఫుల్స్టాప్ (.). కాబట్టి బిందువు (బింది) అయిపోయింది కదా! కాబట్టి ఈ మూడూ స్మృతులు సదా ఉంటే స్థితి కూడా శ్రేష్ఠంగా ఉంటుంది. కేవలం ఆత్మ యొక్క స్మృతి మాత్రమే కాదు. ఆత్మతో పాటు తండ్రి స్మృతి ఖచ్చితంగా ఉంటుంది, తండ్రితో పాటు డ్రామా యొక్క స్మృతి కూడా అతి అవసరం. ఒకవేళ డ్రామా జ్ఞానం లేకపోతే కర్మలలో హెచ్చుతగ్గులు అవుతాయి. ఏవైతే విభిన్న పరిస్థితులు వస్తాయో, వాటిలో డ్రామా జ్ఞానం అతి అవసరం. అనుభవజ్ఞులే కదా! ఏ స్మృతి ఉంటుంది? జరగాల్సిందే, నథింగ్ న్యూ (కొత్తదేమీ లేదు). ఇది జరగాల్సిందేనని ముందే తెలుసు, కాబట్టి విచలితమవ్వరు. జరగాల్సిందే అనే నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటగా భావించి చూస్తారు. తుఫాను కాదు, ఇదొక ఆట. నాటకంలో కూడా తుఫాను, వరదలు అన్నీ చూస్తారు కదా, కానీ విచితం అవుతారా? ఎందుకంటే ఇది డ్రామా అని అర్థం చేసుకుంటారు. మరి అచలంగా ఉన్నారా లేదా కొద్దికొద్దిగా ఊగిసలాడుతున్నారా? ఎందుకు, ఏమవుతుంది? ఏమవుతుంది, ఎలా అవుతుంది... ఇది వస్తుందా? డ్రామా జ్ఞానం ఉన్నప్పుడు అచలంగా-నిశ్చలంగా ఉంటారు. డ్రామా జ్ఞానం లేకపోతే అలజడి ఉంటుంది. మరి అందరూ సదా అచలంగా ఉన్నారా? ఇప్పుడు కాదు, సదా. ‘సదా’ అనే పదాన్ని మర్చిపోకూడదు. సదా అంటే అవినాశి. సదాకాలం ఉండే వారా లేక ఎప్పుడైనా ఒకసారా? మాతలకు ఎప్పుడైనా కొద్దిగా మోహం రాదా? కొద్దిగా నాది అనేది రాదా? ఎక్కడ నాది అనేది ఉంటుందో అక్కడ అలజడి ఉంటుంది. హద్దు యొక్క నాది కాదు. అనంతమైన నాది, వారు నా బాబా. హద్దు యొక్క నాది-నాది చాలా ఉంది. కాబట్టి హద్దు యొక్క నాది అనేది లేదు కదా? పాండవులు ఏమనుకుంటున్నారు? నా రచన, నా దుకాణం, నా డబ్బు, నా ఇల్లు - ఏమీ రాదా? అంతా నీదే అని చేశారా లేక కొద్దిగా పక్కన ఉంచారా? కొద్దిగా పక్కన ఉంచినా గమ్యం యొక్క తీరం లభించదు. కాబట్టి నాది-నాది ముగిసింది. సదా స్మృతి యొక్క తిలకధారీ ఆత్మలు. ఎక్కడైతే స్మృతి ఉంటుందో అక్కడ సమర్థత ఉంటుంది. స్మృతి లేకపోతే సమర్థత కూడా ఉండదు. మరి అందరూ సంతుష్టంగా ఉన్నారా లేక ఏదైనా అసంతృప్తి ఉందా? అనేక జన్మలు అసంతృప్తిగా ఉన్నారు, ఇప్పుడు కూడా అసంతృప్తిగా ఉంటే ఏమంటాము? అందుకే సదా సంతుష్టంగా ఉండాలి. అచ్ఛా!
గ్రూప్ నెం. 4
సంతోషాల సాగరుని పిల్లలు, కాబట్టి దుఃఖధామానికి సదాకాలానికి వీడ్కోలు ఇచ్చేయండి
సదా మేము భాగ్యవిధాత పిల్లలము అనే నషా ఉంటుందా? భాగ్యవిధాత తండ్రిగా అయ్యారు, ఇంకేమి కావాలి? అన్ని కోరికలు పూర్తయ్యాయా లేక ఇంకా మిగిలి ఉన్నాయా? నషా సదా పెరుగుతూ పోతుందా లేక ఎప్పుడైనా తగ్గి, ఎప్పుడైనా పెరుగుతుందా? మాయ వస్తే అప్పుడు ఏమి చేస్తారు? మళ్లీ తగ్గుతుందా? మాయ అయితే చివరి వరకు రావలసిందే. ఎందుకంటే మాయ రాకపోతే మాయాజీత్ అని ఎలా అనిపించుకుంటారు? కాబట్టి మాయ రావడం అనేది జరగాల్సిందే, కానీ మాయాజీత్గా అవ్వడం మీ పని. మాయాజీత్గా ఉన్నారా లేక ఎప్పుడైనా ఓటమి, ఎప్పుడైనా గెలుపా? ఇప్పుడు చాలాకాలం నుండి మాయాజీత్గా అయ్యే సమయం. ఒకసారి ఓటమి, ఒకసారి గెలుపు కాదు, సదా మాయాజీత్.
ఇంతవరకు హిందీ అర్థం కావడం లేదా! ఎందుకంటే సత్యయుగానికి వెళ్లాలి, అక్కడ మీ ఈ భాష ఉండదు. మీ అందరి ఆది భాష హిందీనే కదా! మాట్లాడటం రాకపోయినా అర్థం చేసుకోవడం అయినా రావాలి కదా! ఎవరు హిందీ అర్థం చేసుకుంటారో చేతులు ఎత్తండి. అర్థం చేసుకోవడానికి పురుషార్థం చేయండి. ఎందుకంటే తండ్రి ఏ భాషలో మాట్లాడతారో ఆ భాషను అర్థం చేసుకోవాలి కదా! అయినా చూడండి, ఇంగ్లీష్ మాట్లాడే తల్లిదండ్రులు ఉంటే పిల్లలు కూడా ఏమి నేర్చుకుంటారు? కాబట్టి తండ్రి భాషను అర్థం చేసుకోవాలి. అచ్ఛా!
సదా సంతోషంగా ఉండే వారే కదా! సంతోషంగా ఉండే ఆత్మలు తండ్రికి కూడా ప్రియమైనవారు. ఎందుకంటే తండ్రి సదా సంతోషంగా ఉంటారు, సంతోష సాగరుడు, కాబట్టి పిల్లలు కూడా సంతోషంగా ఉంటే తండ్రికి కూడా సంతోషం కలుగుతుంది. కాబట్టి దుఃఖానికి సదాకాలానికి వీడ్కోలు ఇచ్చేశారు కదా! లేక ఎప్పుడైనా ఒకసారి ఆహ్వానం ఇస్తున్నారా? దుఃఖ ప్రపంచం నుండి బయటకు వచ్చేసారు. దుఃఖధామంలో ఉంటున్నారా ఏమిటి? ఎక్కడ ఉంటున్నారు? సంగమయుగంలో, దుఃఖధామంలో కాదు. ప్రపంచం వారు దుఃఖధామంలో ఉన్నారు, కానీ మీరు సంగమయుగం, సంతోషాల యుగం, ఆనందాల యుగం - దానిలో ఉన్నారు. అలా ఉందా? ఎప్పుడైనా పొరపాటున దుఃఖధామానికి వెళ్లడం లేదు కదా? ఎప్పుడైనా కొద్దిగా వెళ్ళాలని అనిపిస్తుందా? మేము సంగమయుగ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలము అనే నషా ఉంటుందా? అందుకే బ్రాహ్మణులకు సదా ఎత్తైన పిలకను చూపిస్తారు. కాబట్టి ఉన్నతోన్నతంగా గాయనం చేయబడినట్లే సదా ఉన్నత స్థితి కూడా ఉండాలి. సాధారణ స్థితి కాదు, సదా ఉన్నత స్థితి. ఎప్పుడైనా సాధారణ స్థితిలోకి రావడం లేదు కదా? తండ్రి లభించారు అంతా లభించింది - ఈ స్మృతే సదా ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. ఇది గుర్తుంటుంది కదా! ఈ ఆటోమేటిక్ పాట మోగుతూనే ఉంటుంది. కాబట్టి ఎంత సులభంగా సర్వ ప్రాప్తులను పొందేసారు! శ్రమపడాల్సి వచ్చిందా? కొద్దికొద్దిగా శ్రమ అనిపిస్తుందా? టైటిలే ‘సహజయోగి’. ఎవరైనా తనను తాను ‘నేను కష్టయోగిని’ అని చెప్పుకుంటారా? కష్టం లేకుండా పరమాత్మ లభించడని ప్రపంచం వారు అంటారు, మరి మీరు ఏమంటారు? ఇంట్లోనే కూర్చుని తండ్రి లభించారు! తండ్రి ఇంటికి తర్వాత వస్తారు, ముందు ఇంట్లోనే కూర్చుని తండ్రి లభించారు. ఇంత సులభమని అనుకోలేదు, కానీ లభించారు. కాబట్టి సదా మేము భాగ్యవిధాత పిల్లలము అని గుర్తుంచుకోండి. సదా తమ భాగ్యం గుర్తుకు రావడం వల్ల సంతోషంగా ఉంటారు మరియు సంతోషాలను పంచుతారు.
గ్రూప్ నెం. 5
చింతల నుండి ఫ్రీగా, సదా నిశ్చింత లేదా చింతలేని చక్రవర్తిగా అవ్వడానికి నిశ్చయబుద్ధిగా అవ్వండి
సదా మిమ్మల్ని మీరు కల్పకల్పాల అధికారి ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? అనేకసార్లు ఈ ఆధికారాన్ని పొందారు మరియు ముందు కోసం కూడా నిశ్చయంగా ఉంది, కల్పకల్పం పొందుతూనే ఉంటారు. ఇది పక్కా నిశ్చయం కదా! ఎందుకంటే నిశ్చయమే ఈ బ్రాహ్మణ జీవితానికి ఫౌండేషన్ (పునాది). నిశ్చయం అనే ఫౌండేషన్ పక్కాగా ఉంటే ఎప్పుడూ కదలరు. ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని భూకంపాలు వచ్చినా కదలరు. ఎందుకంటే ఫౌండేషన్ పక్కాగా ఉంది. ఇప్పుడు కూడా చూడండి, ప్రకృతి భూకంపం వచ్చినప్పుడు ఏ బిల్డింగ్ పడిపోతుంది? ఏదైతే పచ్చిగా (కచ్చాగా) ఉంటుందో అది పడిపోతుంది. పక్కా ఫౌండేషన్ ఉన్నది పడిపోదు. మరి మీ ఫౌండేషన్ ఎంత పక్కాగా ఉంది? కదిలేదా? కదలదు కానీ కొద్దిగా బీటలు (పగుళ్లు) వస్తాయా? కొద్దిగా కూడా రాదు. ఎందుకంటే కొందరైతే పడిపోతారు, కొందరు పడిపోరు కానీ కొద్దిగా పగుళ్లు వస్తాయి. కాబట్టి మీరు వారి కంటే పక్కాగా ఉన్నారు. కాబట్టి నిశ్చయానికి నిదర్శనం - ప్రతి కార్యంలో మనసాలోనూ, వాచాలోనూ, కర్మలోనూ, సంబంధ-సంపర్కాలలోనూ ప్రతి విషయంలోనూ సహజ విజయం ఉండటం. శ్రమపడి విజయిగా అవ్వడం విజయం అనిపించుకోదు. సహజ విజయి. మరి ఆ నిదర్శనం కనిపిస్తుందా లేక విజయం పొందడంలో శ్రమ అనిపిస్తుందా? ఎప్పుడైనా సహజం, ఎప్పుడైనా శ్రమా? కానీ నిశ్చయానికి నిదర్శనం సహజ విజయం. ఒకవేళ శ్రమ అనిపిస్తే ఏదో మిక్స్ (కల్తీ) అయిందని అర్థం చేసుకోండి. సంశయం లేకపోయినా ఏదో వ్యర్థం మిక్స్ అయింది, అందుకే సహజ విజయం కావడం లేదు. లేకపోతే నిశ్చయబుద్ధి ఆత్మలకు విజయం అనేది సదా ఎవరెడీగా ఉంటుంది. దాని స్థానమే అది. ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. నిశ్చయం ఉన్నవారి వద్దకే వెళ్తుంది కదా! కాబట్టి నిశ్చయం అన్ని విషయాలలోనూ ఉండాలి. కేవలం తండ్రి యందే నిశ్చయం కాదు. స్వయంలోనూ నిశ్చయం, బ్రాహ్మణ పరివారంలోనూ నిశ్చయం, డ్రామా యొక్క ప్రతి దృశ్యంలోనూ నిశ్చయం. అప్పుడే సంపూర్ణ నిశ్చయబుద్ధి అని అంటాము. ఒకవేళ తండ్రి యందు నిశ్చయం ఉండి, స్వయంలో లేక, నడుస్తూ నడుస్తూ స్వయం పట్ల నిరాశ చెందితే నిశ్చయం లేనట్లే కదా! కాబట్టి అది కూడా అసంపూర్ణ నిశ్చయం అవుతుంది. తండ్రి యందు ఉంది, స్వయంలో ఉంది, కానీ పరివారంలో లేదు. పరివారం కారణంగా ఊగిసలాడితే అది కూడా అసంపూర్ణ నిశ్చయం అవుతుంది. డ్రామాలో కూడా ఫుల్ నిశ్చయం ఉండాలి. ఏది జరిగినా మంచిదే జరిగింది. దీనిని డ్రామాపై నిశ్చయం అంటాము. ఇలా సంపూర్ణ నిశ్చయబుద్ధిగా ఉన్నారా? ఎప్పుడైనా ఫుల్, ఎప్పుడైనా హాఫ్ (సగం). అనేకసార్లు అనే నషా ఉన్నప్పుడు అనేకసార్లు విజయులుగా అయ్యారు, ఇప్పుడు రిపీట్ చేస్తున్నారు. కొత్త విషయమేమీ చేయడం లేదు, రిపీట్ చేస్తున్నారు. మరి రిపీట్ చేయడం సులభమే కదా! కాబట్టి నిశ్చయబుద్ధి విజయి - సదా ఇది స్మృతిలో ఉండాలి. నిశ్చయం కూడా ఉంది, విజయం కూడా ఉంది. మాకు విజయం లభించకపోతే ఇంకెవరికి లభిస్తుంది అనే నషా ఉండాలి. విజయం ఉంది మరియు సదా జరుగుతుంది. కాబట్టి స్థిరమైన నిశ్చయం ఉండాలి. చలించేది కాకూడదు, చిన్న విషయం జరగ్గానే నిశ్చయం స్థిరంగా ఉండకపోవడం - అలాంటి నిశ్చయం కాదు. స్థిరమైన నిశ్చయం ఉంటే స్థిరమైన విజయం ఉంటుంది. విజయం యొక్క విధి మారదు. స్థిరమైనది. కాబట్టి ఇలాంటి నిశ్చయబుద్ధి ఆత్మలు సదా హర్షితంగా ఉంటారు, నిశ్చింతగా ఉంటారు. ఎందుకంటే చింత సంతోషాన్ని సమాప్తం చేస్తుంది. నిశ్చింతగా ఉంటే సంతోషం సదా ఉంటుంది. కాబట్టి నిశ్చయబుద్ధికి రెండవ నిదర్శనం నిశ్చింత. లేకపోతే చిన్న విషయం జరిగినా చింత వస్తుంది - ఇదేంటి ఇలా అయింది, ఇది ఇలా అయింది అని. ఈ ‘ఎందుకు, ఏమిటి’ ల నుండి కూడా నిశ్చింత. ఏమిటి, ఎందుకు, ఎలా - ఇవి చింత యొక్క అలలు. ఇప్పుడు పెద్ద చింత ఉండదు, ఈ రూపంలో ఉంటుంది. జరగకూడదు, అయిపోయింది, అలా ఇలా, ఎందుకు, ఏమిటి, ఎలా - ఈ పదాలు మారుతాయి. మరి ఇలా ఎప్పుడైనా క్వశ్చన్ మార్క్ (ప్రశ్నార్థకం) వస్తుందా? నా వద్దకే ఇది ఎందుకు వస్తుంది? నా నుండే ఎందుకు అవుతుంది? నా వెనుకే ఈ బంధనం ఎందుకు ఉంది, నా వెనుకే మాయ ఎందుకు వస్తుంది, నా లెక్కాచారాలు మాత్రమే కఠినంగా ఉన్నాయి ఎందుకు? అని చాలామంది అంటారు కదా! కాబట్టి ‘ఎందుకు’ రావడం అంటేనే చింత యొక్క అల అని అర్థం. కాబట్టి ఈ చింతలన్నింటికీ అతీతంగా ఉండటాన్ని నిశ్చింత అని అంటాము. మరి మీరు ఎవరు? నిశ్చింతగా ఉన్నారా లేక కొద్దికొద్దిగా ఎందుకు, ఏమిటి ఉందా? నిశ్చింత ఆత్మ యొక్క సదా స్లోగన్ - మంచిది జరిగింది, మంచిగా ఉంది, మంచిదే జరగబోతోంది. చెడులో కూడా మంచిని అనుభవం చేస్తారు. చెడు నుండి కూడా తమ పాఠాన్ని నేర్చుకుంటారు. చెడును చెడు రూపంలో చూడరు. వీరిని నిశ్చయబుద్ధి, నిశ్చింత అని అంటాము. ‘చింత’ అనే పదానికి అవిద్య ఉండాలి (చింత అంటే ఏంటో కూడా తెలియకపోవడం). గాయనం ఉంది కదా - ఇచ్చా మాత్రమ్ అవిద్య అని. అలాగే చింతకు కూడా అవిద్య ఉండాలి. చింత అంటే ఏమిటో అనుభవం కాకూడదు. అలాంటి అవస్థను నిశ్చింత అని అంటాము. ఏ విషయం వచ్చినా ‘ఏమవుతుందో’ అని రాదు, వెంటనే ‘మంచిదే అవుతుంది’, గడిచిపోయింది మంచిగానే జరిగింది అని వస్తుంది. ఎక్కడైతే మంచి ఉందో అక్కడ సదా నిశ్చింత చక్రవర్తిగా ఉంటారు. కాబట్టి నిశ్చయబుద్ధి అంటే అర్థం నిశ్చింత చక్రవర్తి. మరి ఇలా ఉన్నారా లేక కొద్దికొద్దిగా ఫికర్ (దిగులు) ఎప్పుడైనా వస్తుందా? కాబట్టి నిశ్చింతచక్రవర్తిగా ఉండేవారు మాత్రమే తండ్రితో సమానం. తండ్రికి ఏమైనా దిగులు ఉందా? ఇంత పెద్ద పరివారం ఉన్నప్పటికీ దిగులు ఉందా? అంతా తెలిసీ, చూస్తూ కూడా నిశ్చింత. ఇలా నిశ్చింతగా ఉన్నారా? మాతలు నిశ్చింతగా ఉన్నారా లేక ప్రవృత్తిలోకి వెళ్లి కొద్దిగా దిగులు పడుతున్నారా? వాతావరణంలోకి వెళ్లి కొద్దిగా ప్రభావం పడుతుందా? వాతావరణ ప్రభావం పడకూడదు! మీ ప్రభావాన్ని వాతావరణంపై వేయండి, వాతావరణ ప్రభావం మీపై పడకూడదు. ఎందుకంటే వాతావరణం రచన, మీరు మాస్టర్ రచయిత. వాతావరణాన్ని తయారుచేసేది ఎవరు? మనుష్యాత్మ. కాబట్టి రచయిత అయ్యారు కదా! కాబట్టి రచయితపై రచన ప్రభావం పడకూడదు, కానీ రచయిత ప్రభావం రచనపై పడాలి. కాబట్టి ఏ విషయం వచ్చినా - నేను విజయి ఆత్మను అని గుర్తు చేసుకోండి.
అచ్ఛా, ఇది మహారాష్ట్ర మరియు గుల్బర్గా గ్రూప్. (భూకంపాలు వస్తూ ఉంటాయి) అందుకే చెప్పాను - నిశ్చయబుద్ధిగా ఉండండి, జరగాల్సిందే. ముందు ముందు అతిగా అవుతుందా లేక తగ్గుతుందా? మరి అతిని ఆహ్వానిస్తున్నారా లేక భయపడుతున్నారా? భయపడాల్సిన పనేమీ లేదు. శరీరం వదిలినా గ్యారెంటీ ఉంది, ఉన్నా సేవ చేయాలి. రెండింటిలోనూ మంచే ఉంది. మూడు అడుగుల నేల అయితే లభిస్తుంది. నిశ్చింతగా ఉన్నారు కదా! నాలెడ్జ్ ఉంది అందుకే నిశ్చింతగా ఉన్నారు. సభ అంతా నిశ్చింత చక్రవర్తులే కూర్చుని ఉన్నారు కదా!
వెళ్లేవారు ఎక్కడ ఉన్నా వెళ్తారు, భూకంపంలో వెళ్లినా, ఏ పరిస్థితిలో వెళ్లినా, మంచి మంచిగా నడుస్తున్నవారు కూడా వెళ్ళిపోతారు. వెళ్లేవారిని ఎవరూ ఆపలేరు. వెళ్లేవారు వెళ్ళిపోయారు, కానీ మీకు దిగులు ఇచ్చి ఎందుకు వెళ్లాలి? దిగులును కూడా తమతో పాటే తీసుకెళ్లాలి కదా! జ్ఞాన శక్తి ఉంది కదా! అచ్ఛా. జరిగేది జరగాల్సిందే. మీరందరూ నిశ్చింత చక్రవర్తులు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
