‘‘ప్రత్యక్షతకు ఆధారము - దృఢ ప్రతిజ్ఞ’’
ఈరోజు సమర్థుడైన తండ్రి తమ సమర్థ పిల్లలతో మిలనం జరుపుకుంటున్నారు. సమర్థుడైన తండ్రి పిల్లలు ప్రతి ఒక్కరికి సర్వ సమర్థతల ఖజానాను అనగా సర్వ శక్తుల ఖజానాను బ్రాహ్మణ జన్మ అవుతూనే జన్మ సిద్ధ అధికార రూపంలో ఇచ్చేసారు మరియు ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ తమ ఈ అధికారాన్ని ప్రాప్తి చేసుకొని స్వయం సంపన్నంగా అయి ఇతరులను కూడా సంపన్నంగా చేస్తూ ఉంది. ఈ సర్వ సమర్థతల ఖజానాను బాప్‌దాదా ప్రతి ఒక్క బిడ్డకు అతి సహజంగా మరియు క్షణంలో ఇచ్చారు. ఎలా ఇచ్చారు? క్షణంలో స్మృతినిప్పించారు. కనుక స్మృతియే సర్వ సమర్థతలకు తాళం చెవి అయ్యింది. ‘నా బాబా’ అని స్మృతి కలిగింది మరియు తండ్రి ‘నా పిల్లలు’ అని అన్నారు. ఈ ‘ఆత్మిక స్మృతి’ - అనే సర్వ ఖజానాల తాళం చెవిని క్షణంలో ఇచ్చారు. నాది అనుకున్నారు మరియు సర్వ జన్మ సిద్ధ అధికారము ప్రాప్తించింది! కనుక సహజంగా లభించింది కదా. ఇప్పుడు ప్రతి బ్రాహ్మణాత్మ, తండ్రి ఖజానాయే నా ఖజానా అని నిశ్చయంతో మరియు నషాతో అంటుంది. తండ్రి ఖజానాను తమదిగా చేసుకున్నారు.
ఈరోజును కూడా విశేషమైన స్మృతి-దివసమని అంటారు. ఈ స్మృతి-దివసము పిల్లలకు సర్వ సమర్థతలను ఇచ్చే దినము. వాస్తవానికి బ్రాహ్మణ జన్మ దినమే సమర్థతలను ప్రాప్తి చేసుకునే దివసము కానీ నేటి స్మృతి-దివసమునకు విశేషమైన మహత్వముంది. ఆ మహత్వమేమిటి? నేటి స్మృతి-దివసమున విశేషంగా బ్రహ్మా తండ్రి తమను తాము అవ్యక్తంగా చేసుకొని వ్యక్త సాకార రూపంలో విశేషమైన పిల్లలను విశ్వం ముందు ప్రత్యక్షం చేయడానికి విశేషమైన విల్ పవర్‌ను విల్ చేసారు. ఎలాగైతే ఆదిలో స్వయాన్ని, సర్వ సంబంధాలను మరియు సంపదను సేవార్థము శక్తుల ఎదుట విల్ చేసారో, అలా నేటి స్మృతి దివసమున బ్రహ్మా తండ్రి సాకార ప్రపంచంలో సాకార రూపం ద్వారా విశ్వ సేవకు నిమిత్తమైన శక్తి సైన్యాన్ని తమ సాకార రూపం యొక్క పాత్రను అభినయించడానికి సర్వ విల్ పవర్స్‌ను పిల్లలకు విల్ చేసారు. స్వయం అవ్యక్తంగా గుప్త రూపధారిగా అయ్యి, పిల్లలను వ్యక్త రూపంలో విశ్వ-కళ్యాణం కోసం నిమిత్తంగా చేసారు అనగా సాకార రూపంలో సేవ యొక్క విల్-పవర్స్‌ను విల్ చేసారు, అందుకే ఈ రోజును స్మృతి దివసము లేక సమర్థ దివసము అని అంటారు.
బాప్‌దాదా చూస్తున్నారు, ఈ స్మృతి ఆధారంగా దేశ-విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలు నిమిత్తంగా అయి సేవలో సదా ముందుకు వెళ్తూ ఉన్నారు మరియు వెళ్తూనే ఉంటారు ఎందుకంటే విశేషంగా త్రిమూర్తి వరదానం పిల్లలతో పాటు ఉంది. శివబాబాదైతే ఉండనే ఉంది కానీ దానితో పాటు భాగ్యవిధాత అయిన బ్రహ్మా తండ్రి యొక్క వరదానం కూడా ఉంది, దానితో పాటు జగదంబ సరస్వతి తల్లి నుండి మధుర వాణి యొక్క వరదానం కూడా ఉంది, అందుకే త్రిమూర్తి వరదానాలతో సహజంగా సఫలత యొక్క అధికారాన్ని అనుభవం చేస్తున్నారు. మున్ముందు ఇంకా సహజ సాధనాలు మరియు శ్రేష్ఠ సఫలత అనుభవమవ్వాల్సిందే. త్వర త్వరగా ప్రత్యక్షత జరగాలి అని బాప్‌దాదాను ప్రత్యక్షం చేసే ఉల్లాస-ఉత్సాహాలు నలువైపులా ఉన్నాయి. అందరూ ఇదే కోరుకుంటున్నారు కదా! ఎప్పుడు జరగాలి? రేపే జరిగిపోవాలా, ఎందుకంటే అప్పుడు ఇక్కడే కూర్చుని-కూర్చుని ప్రత్యక్షత యొక్క ఢంకా వినగలగాలి. జరిగే ఉంది. కేవలం ఏం చేయాలి? చేస్తున్నారు కూడా మరియు చేయాలి కూడా. సంపూర్ణ ప్రత్యక్షత యొక్క ఢంకాను మ్రోగించేందుకు కేవలం ఒక పని చేయాలి. ప్రత్యక్షతకు ఆధారం పిల్లలైన మీరే మరియు పిల్లలలో విశేషంగా ఒక విషయాన్ని అండర్లైన్ చేయాలి. ప్రత్యక్షత మరియు ప్రతిజ్ఞ - రెండింటి బ్యాలెన్స్, సర్వాత్మలకు బాప్‌దాదా ద్వారా ఆశీర్వాదాలు ప్రాప్తించేందుకు ఆధారము. ప్రతిజ్ఞ అయితే రోజూ చేస్తారు, మరి ప్రత్యక్షతలో ఆలస్యం ఎందుకు? ఇప్పుడిప్పుడే జరిగిపోవాలి కదా.
బాప్‌దాదా చూసారు - ప్రతిజ్ఞను హృదయపూర్వకంగా, ప్రేమగా చేస్తారు కూడా కానీ ఒకటి ఉంటుంది - ‘ప్రతిజ్ఞ’, రెండవది ఉంటుంది - ‘దృఢ ప్రతిజ్ఞ’. దృఢ ప్రతిజ్ఞకు గుర్తులేమిటి? ప్రాణం పోయినా కానీ ప్రతిజ్ఞ పోకూడదు. ప్రాణాన్ని పణంగా పెట్టే విషయం వచ్చినప్పుడు, చిన్న-చిన్న సమస్యలు లేక సమయానుసారంగా ఎంతో భయంకర రూపాన్ని ధరించిన పరిస్థితులు ఉన్నా సరే... ప్రాణాన్ని పణంగా పెట్టడము ముందు అవేమిటి! కనుక, ఎటువంటి పరిస్థితులైనా సరే పర-స్థితి, స్వ-స్థితిని కదిలించకూడదు - దీనినే దృఢ ప్రతిజ్ఞ అని అంటాము. ఎప్పుడూ ఎటువంటి పరిస్థితిలోనూ ఓడిపోలేరు(హార్) కానీ కంఠహారంగా(హార్) అవుతారు, విజయీ రత్నాలుగా అవుతారు, పరమాత్మ మెడలో అలంకారంగా అవుతారు. దీనినే దృఢ సంకల్పము అనగా దృఢ ప్రతిజ్ఞ అని అంటాము. కనుక ‘దృఢత’ అన్న పదాన్ని అండర్లైన్ చేయాలి. ప్రతిజ్ఞ చేయడము అనగా ప్రత్యక్ష ఋజువును చూపించడము. కానీ అప్పుడప్పుడు చాలామంది పిల్లలు ప్రతిజ్ఞ కూడా చేస్తారు మరియు దానితో పాటు ఒక ఆటను కూడా చాలా బాగా ఆడుతారు. ఎప్పుడైనా ఏదైనా సమస్య లేక పరిస్థితి వచ్చినప్పుడు, అది ప్రతిజ్ఞను బలహీనం చేయడానికి కారణము అవుతుంది, ఆ కారణాన్ని నివారణ చేయడానికి బదులుగా సాకులు చెప్పే ఆటలు చాలా ఆడుతారు. ఇందులో చాలా తెలివైనవారిగా ఉన్నారు.
సాకులు చెప్పేవారి గుర్తులేమిటి? వారు అంటారు - అలా లేదు, ఇలా ఉంది, అలా జరిగి ఉండకపోతే ఇలా జరిగి ఉండదు, వీరు ఇలా చేసారు, పరిస్థితే అలాంటిది, విషయమే అలాంటిది. కనుక ‘ఇలా’ మరియు ‘అలా’ - ఇది సాకులు చెప్పేవారి భాష. దృఢ ప్రతిజ్ఞ చేసేవారి భాష - ‘ఇలా’ ఉన్నా కానీ లేక ‘అలా’ ఉన్నా కానీ నేను ‘తండ్రి వలె’ అవ్వాలి. నేను అవ్వాలి. ఇతరులు నన్ను తయారుచేయడం కాదు, నేను తయారవ్వాలి. ఇతరులు అలా చేస్తే నేను బాగుంటాను, ఇతరులు సహయోగమిస్తే నేను సంపన్నంగా లేక సంపూర్ణంగా అవుతాను, ఇలా కాదు. ఇలా తీసుకునేందుకు బదులుగా మాస్టర్ దాతగా అయి సహయోగము, స్నేహము, సహానుభూతిని ఇవ్వడమే తీసుకోవడము. గుర్తు పెట్టుకోండి, బ్రాహ్మణ జీవితానికి అర్థమే - ‘ఇవ్వడమే తీసుకోవడము’, ‘ఇవ్వడంలోనే తీసుకోవడము ఉంది’. అందుకే దృఢ ప్రతిజ్ఞకు ఆధారము - స్వయాన్ని చూసుకోవడము, స్వయాన్ని మార్చుకోవడము, స్వమానంలో ఉండడము. స్వమానమే మాస్టర్ దాతాతనము. ఈ అవ్యక్త సంవత్సరంలో ఏం చేస్తారు? మధుబన్‌లో ప్రతిజ్ఞ చేసి వెళ్తారు మరియు అక్కడికి వెళ్ళి సాకులు చెప్పే ఆటను ఆడుతారా?
ప్రతిజ్ఞ దృఢంగా అయ్యేందుకు బదులు బలహీనంగా అయ్యేందుకు లేక ప్రతిజ్ఞలో లూజ్ అయ్యేందుకు ముఖ్య కారణం ఒక్కటే. ఎలాగైతే ఎంత పెద్ద మెషినరీ అయినా కానీ, ఒక చిన్న స్క్రూ లూజ్ అయితే మొత్తం మెషీన్‌ను పనికి రాకుండా చేస్తుంది. అలాగే ప్రతిజ్ఞను పూర్తి చేసేందుకు ప్లాన్లు చాలా మంచి-మంచివి తయారుచేస్తారు, పురుషార్థం కూడా చాలా చేస్తూ ఉంటారు కానీ పురుషార్థాన్ని లేక ప్లాన్‌ను బలహీనం చేసే స్క్రూ ఒక్కటే - ‘నిర్లక్ష్యము’. అది రకరకాల రూపాలలో వస్తుంది మరియు సదా కొత్త-కొత్త రూపంలో వస్తుంది, పాత రూపంలో రాదు. కనుక ఈ ‘నిర్లక్ష్యము’ అనే లూజ్ స్క్రూను టైట్ చేయండి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, అలా కాదు. జరగాల్సిందే. నడుస్తూనే ఉంటుంది, జరుగుతూనే ఉంటుంది - ఇది నిర్లక్ష్యము. అయిపోతుందిలే - చూస్తూ ఉండండి, విశ్వాసం పెట్టుకోండి, దాదీ-దీదీ నన్ను నమ్మండి, అయిపోతుంది - అలా కాదు. తండ్రి వలె అవ్వాల్సిందే, ఇప్పుడిప్పుడే అవ్వాలి. మూడవ విషయము - ప్రతిజ్ఞను దృఢము నుండి బలహీనంగా చేసే ఆధారము, ఇంతకుముందే నవ్వు వచ్చే విషయాన్ని వినిపించాము - చాలామంది పిల్లలలో సమీప దృష్టి బలహీనంగా ఉంది మరియు దూరదృష్టి చాలా-చాలా తీక్షణంగా ఉంది. సమీప దృష్టి అంటే స్వయాన్ని చూసుకోవడము, స్వయాన్ని మార్చుకోవడము మరియు దూర దృష్టి అంటే ఇతరులను చూడడము, అందులో కూడా బలహీనతలను చూడడము, విశేషతలను కాదు, అందుకే ఉల్లాస-ఉత్సాహాలలో వ్యత్యాసం వచ్చేస్తుంది. పెద్ద-పెద్దవారు కూడా ఇలా చేస్తారు, మేమైతే చిన్నవారము. కనుక దూరంలో ఉన్న బలహీనతలను చూసే దృష్టి మోసం చేస్తుంది, ఈ కారణంగా ప్రతిజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకురాలేరు. అర్థమయిందా, కారణమేమిటో? కావున ఇప్పుడు స్క్రూను టైట్ చేయడం వస్తుందా లేక రాదా? ‘వివేకం’ అనే స్క్రూ-డ్రైవర్ అయితే ఉంది కదా, యంత్రమైతే ఉంది కదా.
ఈ సంవత్సరం అర్థం చేసుకోవడము, కోరుకోవడము మరియు చేయడము - మూడింటినీ సమానంగా చేసుకోండి. మూడింటినీ సమానంగా చేసుకోవడము అనగా తండ్రి సమానంగా అవ్వడము. ఒకవేళ బాప్‌దాదా అందరూ రాసి ఇవ్వండి అని అంటే క్షణంలో రాసేస్తారు! కాగితంపై రాయడము పెద్ద విషయమేమీ కాదు. మస్తకంపై దృఢ సంకల్పమనే సిరాతో రాసుకోండి. రాయడం వస్తుంది కదా. మస్తకంపై రాయడం వస్తుందా లేక కేవలం కాగితంపై రాయడం వస్తుందా? అందరూ రాసుకున్నారా? పక్కా? రెండు రోజులలో చెరిగిపోయేలా కచ్చాగా అయితే రాసుకోలేదు కదా? చేయాల్సిందే, ప్రాణం పోయినా సరే ప్రతిజ్ఞ పోకూడదు - ఇటువంటి దృఢ సంకల్పమే సహజంగా తండ్రి సమానంగా చేస్తుంది. లేదంటే అప్పుడప్పుడు శ్రమ, అప్పుడప్పుడు ప్రేమ - ఈ ఆటలోనే నడుస్తూ ఉంటారు. ఈ రోజు దేశ-విదేశాలలోని పిల్లలందరూ తనువుతో అక్కడ ఉన్నారు కానీ మనసుతో మధుబన్‌లో ఉన్నారు, అందుకే స్మృతి దివసమున పిల్లలందరి అలౌకిక అనుభవాలను బాప్‌దాదా చూసారు, మంచి-మంచి అనుభవాలు చేసుకున్నారు, సేవ కూడా చేసారు. అలౌకిక అనుభవాలకు మరియు సేవకు ప్రతి ఒక్క బిడ్డకు అభినందనలు తెలుపుతున్నాము. అందరి శుద్ధ సంకల్పాలు, మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ మరియు ప్రేమ యొక్క ముత్యాల మాలలు బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. రిటర్న్‌లో బాప్‌దాదా కూడా స్నేహ మాలలను పిల్లలందరి మెడలో వేస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ తమ-తమ పేరుతో విశేషమైన ప్రియస్మృతులను స్వీకరించండి. బాప్‌దాదా వద్ద ఉన్న ఆత్మిక వైర్లెస్ సెట్ ఎంతటి శక్తిశాలి అంటే, ఒకే సమయంలో అనేక పిల్లల హృదయం యొక్క శబ్దము వారి వద్దకు చేరుకుంటుంది. కేవలం శబ్దమే చేరుకోదు కానీ అందరి స్నేహముతో కూడిన మూర్తి కూడా ఇమర్జ్ అవుతుంది, అందుకే అందరిని సమ్ముఖంలో చూస్తూ విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నాము. అచ్ఛా!
సర్వ సమర్థ ఆత్మలకు, సర్వ దృఢ ప్రతిజ్ఞ మరియు ప్రత్యక్షత యొక్క బ్యాలెన్స్ పెట్టుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా అర్థం చేసుకోవడము, కోరుకోవడము మరియు చేయడము, మూడింటినీ సమానంగా చేసే తండ్రి సమానమైన పిల్లలకు, సదా సమస్యలను ఓడించేవారు, పరమాత్మ మెడలో హారంగా అయ్యే విజయీ రత్నాలకు సమర్థుడైన బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము
అందరూ రెండు విల్లకు పాత్రులు, ఆదిలోని విల్‌కు కూడా పాత్రులు మరియు సాకార స్వరూపం యొక్క అంతిమంలోని విల్‌కు కూడా పాత్రులు. విల్ పవర్ వచ్చేసింది కదా! విల్ పవర్ యొక్క విల్, విల్ పవర్ ద్వారా సదా స్వ పురుషార్థంతో అదనపు కార్యం చేయిస్తుంది. ఈ ధైర్యానికి ప్రత్యక్ష ఫలంగా పదమారెట్ల సహాయానికి పాత్రులుగా అయ్యారు. ఈ ఆత్మలే నిమిత్తంగా ఎందుకు అయ్యారని చాలామంది ఆలోచిస్తారు. మరి దీని రహస్యమేమిటంటే, విశేషమైన సమయంలో విశేషమైన ధైర్యం పెట్టినందుకు ప్రత్యక్ష ఫలము సదాకాలానికి ఫలంగా అయ్యింది, అందుకే అంటూ ఉంటారు, ధైర్యం యొక్క ఒక్క అడుగు మరియు పదమాల అడుగుల సహాయము తండ్రిది, అందుకే సదా అన్ని విషయాలను దాటే విల్ పవర్ విల్ రూపంలో ప్రాప్తించింది. ఇలాగే ఉన్నారు కదా! మీరందరూ కూడా సహచరులు. తోడును బాగా నిర్వర్తిస్తున్నారు. నిర్వర్తించేవారితో తండ్రి కూడా ప్రతి సమయము సహయోగమిచ్చే తమ ప్రతిజ్ఞను నిర్వర్తిస్తారు. కావున ఈ గ్రూపు అంతా నిర్వర్తించే గ్రూపు. (అందరినీ అడుగుతూ) మీరందరూ కూడా నిర్వర్తించేవారే కదా. లేక కేవలం ప్రీతినుంచేవారా? ప్రీతినుంచేవారు అనేకమంది ఉంటారు కానీ నిర్వర్తించేవారు ఎవరో కొందరే ఉంటారు. మరి మీరందరూ ఎందులో ఉన్నారు? కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరు! చూడండి, ప్రపంచంలో హంగామాలు జరుగుతున్నాయి మరియు మీరేం చేస్తున్నారు? ఆనందాన్ని జరుపుకుంటున్నారు. లేక ఏం చేయాలి, ఏం జరగనున్నది అని తికమకలో ఉన్నారా? అంతా మంచే జరగనున్నది అని మీరంటారు. కనుక ఎంత తేడా ఉంది! ప్రపంచంలో ప్రతి సమయము ఏమవుతుంది అన్న ప్రశ్నార్థకం ఉంది. మరియు మీ వద్ద ఏముంది? ఫుల్ స్టాప్. ఏదైతే జరిగిందో అది మంచిది మరియు ఏదైతే జరగనున్నదో అది మా కోసం మంచిదే. ప్రపంచానికి అకాల మృత్యువు మరియు మీకు ఆనందము. భయమనిపిస్తుందా? రక్తం చూసి కొద్ది కొద్దిగా భయమనిపిస్తుందా? మీ ఎదురుగా 7-8 మందికి తుపాకి గుండ్లు తగిలితే భయపడతారా? నిద్రలో కూడా అదే కనిపించదు కదా! శక్తి సైన్యము అనగా నిర్భయులు. మాయ అన్నా భయం లేదు, ప్రకృతి యొక్క అలజడి అన్నా కూడా భయం లేదు. ఇటువంటి నిర్భయులేనా లేక కొద్ది-కొద్దిగా బలహీనత ఉందా? అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1
సర్వ శక్తులు ఆర్డర్లో ఉంటే మాయాజీతులుగా అవుతారు
అందరూ స్వయాన్ని సదా మాయాజీతులము, ప్రకృతిజీతులమని అనుభవం చేస్తున్నారా? మాయాజీతులుగా అవుతున్నారా లేక ఇప్పుడు అవ్వాలా? ఎంతెంతగా సర్వ శక్తులను తమ ఆర్డర్లో పెట్టుకుంటారో మరియు సమయానికి కార్యంలో వినియోగిస్తారో, అంత సహజంగా మాయాజీతులుగా అవుతారు. ఒకవేళ సర్వ శక్తులు మీ కంట్రోల్లో లేకపోతే ఎక్కడో ఒక చోట ఓడిపోవాల్సి ఉంటుంది.
మాస్టర్ సర్వశక్తిమంతులు అంటే కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఏ సమయంలో, ఏ శక్తిని ఆహ్వానిస్తారో అది హాజరవ్వాలి, సహయోగిగా అవ్వాలి. ఈ విధంగా ఆర్డర్లో ఉన్నాయా? సర్వ శక్తులు ఆర్డర్లో ఉన్నాయా లేక ముందు-వెనుక అవుతున్నాయా? ఇప్పుడు ఆర్డర్ చేస్తే గంట తర్వాత వస్తే వారిని మాస్టర్ సర్వశక్తిమంతులని అంటామా? మీ అందరికీ మాస్టర్ సర్వ శక్తిమంతులు అనే బిరుదు ఉన్నప్పుడు, ఎలాంటి బిరుదో అలాంటి కర్మలే ఉండాలి కదా. మాస్టర్‌గా అయి ఉండి కూడా శక్తి సమయానికి ఉపయోగపడకపోతే బలహీనులని అంటామా లేక మాస్టర్ అని అంటామా? కనుక సదా చెక్ చేసుకోండి, మళ్ళీ ఛేంజ్ (పరివర్తన) చేసుకోండి - ఏ-ఏ శక్తి సమయానికి కార్యంలో ఉపయోగపడుతుంది మరియు ఏ శక్తి సమయానికి మోసగిస్తుంది? ఒకవేళ సర్వ శక్తులు మీ ఆర్డర్‌పై నడవలేకపోతే విశ్వ రాజ్యాధికారులుగా అవుతారా? ఎవరిలోనైతే కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ ఉంటాయో, వారే విశ్వ రాజ్యాధికారిగా అవ్వగలరు. మొదట స్వయంపై రాజ్యము, తర్వాత విశ్వంపై రాజ్యము. స్వరాజ్యాధికారి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా కంట్రోల్ చేయగలరు.
ఈ సంవత్సరంలో ఏం నవీనతను చేస్తారు? ఏది చెప్తారో అది చేసి చూపిస్తారు. చెప్పడము మరియు చేయడము, రెండూ సమానంగా ఉండాలి. ఎలాగైతే మాస్టర్ సర్వ శక్తిమంతులమని అంటారు కానీ చేయడములో ఒకసారి విజయులుగా అవుతున్నారు, ఒకసారి తక్కువ విజయం లభిస్తుంది. కనుక చెప్పడము మరియు చేయడములో తేడా వచ్చేసింది కదా! మరి ఇప్పుడు ఈ తేడాను సమాప్తం చేయండి. ఏదైతే చెప్తారో దానిని ప్రాక్టికల్ జీవితంలో స్వయం కూడా అనుభవం చేయండి మరియు ఇతరులు కూడా అనుభవం చేయాలి. ఇతరులు కూడా, ఈ ఆత్మలు అతీతంగా ఉన్నారని భావించాలి. వేల మంది మనుష్యులున్నా కానీ, వేల మందిలో కూడా మీరు అతీతంగా కనిపించాలి, సాధారణంగా కాదు ఎందుకంటే బ్రాహ్మణులు అనగా అలౌకికమైనవారు. ఇది అలౌకిక జన్మ కదా. కనుక బ్రాహ్మణ జీవితమంటేనే అలౌకిక జీవితము, సాధారణ జీవితము కాదు. ఇటువంటి అనుభవం చేస్తున్నారా? వీరు అతీతమైనవారని మనుష్యులు భావిస్తున్నారా? లేక మేము ఎలా ఉన్నామో అలాగే వీరు కూడా ఉన్నారని భావిస్తున్నారా?
అతీతంగా అయ్యేవారి గుర్తు - ఎంతగా అతీతంగా అవుతారో, అంతగా సర్వులకు ప్రియంగా అవుతారు. తండ్రి అందరితో అతీతంగా ఉన్నారు మరియు అందరికి ప్రియమైనవారు. కనుక అతీతత్వము ప్రియంగా చేస్తుంది. మరి ఇలా అతీతంగా మరియు ఆత్మలకు ప్రియంగా ఎంతవరకు అయ్యాను అన్నది చెక్ చేసుకోండి. లౌకిక జీవితంలో కూడా అలౌకికతను అనుభవం చేయించండి. అతీతంగా అయ్యే యుక్తి అయితే వస్తుంది కదా. ఎంతగా తమ దేహ-భానం నుండి అతీతంగా అవుతూ ఉంటారో, అంతగా ప్రియంగా అనిపిస్తారు. దేహ-భానము నుండి అతీతము. కావున అలౌకికంగా అయినట్లే కదా! మరి దేహ భానము నుండి అతీతంగా ఉంటున్నానా అని సదా స్వయాన్ని చూసుకోండి. పదే పదే దేహ భానంలోకైతే రావడం లేదు కదా? దేహ భానములోకి రావడమంటే లౌకిక జీవితము. మధ్య-మధ్యలో ఈ అభ్యాసం చేయండి - దేహములో ప్రవేశించి కర్మ చేసాను మరియు ఇప్పుడిప్పుడే అతీతంగా అయ్యాను. కావున అతీత అవస్థలో స్థితులై ఉండడంతో కర్మ కూడా బాగా జరుగుతుంది మరియు తండ్రికి లేక సర్వులకు ప్రియంగా కూడా అవుతారు. డబల్ లాభం ఉంది కదా. పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవ్వడము - ఇది ఎంత గొప్ప లాభము! ఇటువంటి అధికారిగా అవుతానని ఎప్పుడైనా ఆలోచించారా? స్వప్నంలో కూడా ఆలోచించి ఉండరు, కానీ ఇటువంటి అధికారులుగా అయ్యారు. కనుక సదా దీనిని స్మృతిలోకి తీసుకురండి, పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలము! ప్రపంచమైతే వెతుకుతూ ఉంది మరియు మీరు పాత్రులుగా అయ్యారు. కనుక సదా వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము! ఈ పాటను పాడుతూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎగిరే కళ అందరికీ మేలు చేస్తుంది. మీరు ఎగిరితే అందరికీ మేలు జరుగుతుంది, విశ్వ కళ్యాణం జరుగుతుంది. అచ్ఛా! అందరూ సంతోషంగా ఉంటున్నారా? సదా సంతోషంగానే ఉండండి మరియు ఇతరులను కూడా సంతోషపరచండి. ఎవరు ఎలా ఉన్నా కానీ, సంతోషంగా ఉండాలి మరియు సంతోషపరచాలి. అచ్ఛా!
గ్రూప్ నం. 2
విశ్వకళ్యాణకారిగా అయి సేవలో ఉంటే సేవ యొక్క ఫలము మరియు బలము లభిస్తూ ఉంటాయి
పూర్తి కల్పములో మీకున్న శ్రేష్ఠమైన భాగ్యం గురించి తెలుసా? అర్థకల్పం రాజ్యాధికారులుగా అవుతారు మరియు అర్థకల్పం పూజ్యాధికారులుగా అవుతారు. కానీ పూర్తి కల్పము యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునే సమయం ఏది? ఇప్పుడే కదా! మరి భాగ్యం తయారుచేసుకునే సమయం ఎంత, భాగ్యం ప్రాప్తించుకునే సమయం ఎంత అనేది స్మృతిలో ఉంటుందా లేక మర్జ్ అయి ఉంటుందా? ఎందుకంటే ఎంత సమయం ఇమర్జ్ (తేటతెల్లంగా) ఉంటుందో అంత సమయం సంతోషం ఉంటుంది, మర్జ్ అయి ఉంటే సంతోషం ఉండదు. పాండవులకు పనుల్లోకి వెళ్ళినప్పుడు గుర్తుంటుందా లేక పని చేసే సమయంలో ‘నేను ఫలానా’ అనే పని యొక్క నషానే ఉంటుందా? క్లర్క్ అయినా, బిజినెస్‌మ్యాన్ అయినా, ఇంకేదైనా కానీ అది గుర్తుంటుందా లేక ‘నేను కల్పకల్పం యొక్క భాగ్యశాలిని’ అని ఇది గుర్తుంటుందా? ఎందుకంటే మీ అసలైన ఆక్యుపేషన్ (వృత్తి) విశ్వకళ్యాణకారి. ఇది గుర్తుంటుందా లేక హద్దు యొక్క పని గుర్తుంటుందా? మాతలకు వంట చేసేటప్పుడు ఏమి గుర్తుంటుంది? ‘విశ్వకళ్యాణకారిని’ అని గుర్తుంటుందా లేక వంట చేసేదాన్ని అని గుర్తుంటుందా?
ఏదైనా చేయండి కానీ మీ ఆక్యుపేషన్ను మరచిపోకండి. ఎలాగైతే మీ స్మృతిచిహ్నంలో కూడా చూపించారు - పాండవులు గుప్త వేషంలో ఉద్యోగం చేశారు అని, కానీ నషా ఏముండింది? విజయం యొక్క నషా. మరి మీరు కూడా గవర్నమెంట్ సర్వెంట్ అవుతారు కదా, ఉద్యోగం చేస్తారు. కానీ ‘విశ్వకళ్యాణకారిని’ అనే నషా ఉండాలి. అప్పుడు ఈ స్మృతి వల్ల స్వతహాగానే సమర్థంగా ఉంటారు మరియు సదా సేవా భావన ఉండడం వల్ల సేవ యొక్క ఫలము మరియు బలము లభిస్తూ ఉంటాయి. ఫలము కూడా లభించి, బలము కూడా లభిస్తే డబల్ లాభమే కదా! అలా అని బట్టలు ఉతుకుతుంటే ‘నేను బట్టలు ఉతికేదాన్ని’ అని అనుకోకూడదు. ఎప్పుడైతే విశ్వకళ్యాణకారి అనే సంకల్పం ఉంచుకుంటారో, అప్పుడు మీ ఈ భావన అనేక ఆత్మలకు ఫలాన్ని ఇస్తుంది. ‘భావనకు తగిన ఫలం లభిస్తుంది’ అన్న గాయనం ఉంది కదా. కాబట్టి మీ భావన ఆత్మలకు శాంతి, శక్తి అనే ఫలాన్ని ఇస్తుంది. ఈ ఫలం లభిస్తుంది. అలాంటి సేవ చేస్తున్నారా? లేక సమయం లభించడం లేదా? మీ ప్రవృత్తి చాలా పెద్దగా ఉందా? నిభాయించాల్సి వస్తోంది! అనంతమైన స్థితిలో ఉండడం వల్ల హద్దు యొక్క భానం నుండి సహజంగా వెలువడతారు. గృహస్థి అనే భానం హద్దు, మరియు ట్రస్టీ అనే భానం అనంతమైనది. కొద్దిగా గృహస్థి, కొద్దిగా ట్రస్టీ అని కాదు. ఒకవేళ గృహస్థి యొక్క బరువు ఉంటే ఎప్పటికీ ఎగిరే కళ యొక్క అనుభవాన్ని చేయలేరు. నిమిత్త భావం బరువును సమాప్తం చేస్తుంది. ‘నా బాధ్యత, నేనే చూసుకోవాలి, నేనే ఆలోచించాలి...’ అంటే బరువు అవుతుంది. బాధ్యత బాబాది, మరియు బాబా ట్రస్టీగా అంటే నిమిత్తంగా తయారుచేశారు! ‘నాది’ అనుకుంటే బరువు మీది, ‘నీది’ అనుకుంటే బాబాది! ఇందులో కొందరు తెలివి తేటలు ఉపయోగిస్తారు - ‘నీది’ అంటారు కానీ ‘నాది’గా చేసుకుంటారు! ఎప్పుడైనా ఏ కార్యంలోనైనా బరువు అనిపిస్తే, అది ‘నీది’ అని అనడానికి బదులు ‘నాది’ అని అంటున్నారని అర్థం. కాబట్టి ఈ తప్పు ఎప్పుడూ చేయకండి. అచ్ఛా!
గ్రూప్ నం. 3
బ్రాహ్మణులు అంటే - అసంభవాన్ని సంభవం చేసేవారు
సదా ఒకే బలము ఒకే నమ్మకము అని అనుభవం చేసుకుంటున్నారా? ఎంతగా ఒక్క బాబాపైన నమ్మకం అంటే నిశ్చయం ఉంటుందో, అంతగా బలం కూడా లభిస్తుంది. ఎందుకంటే ఒక్క బాబాపైన నిశ్చయం ఉంచడం వల్ల బుద్ధి ఏకాగ్రమైపోతుంది, తిరగడం నుండి విముక్తి పొందుతుంది. ఏకాగ్రత యొక్క శక్తితో ఏ కార్యం చేసినా అందులో సహజ సఫలత లభిస్తుంది. ఎక్కడైతే ఏకాగ్రత ఉంటుందో అక్కడ నిర్ణయం చాలా సహజంగా జరుగుతుంది. ఎక్కడైతే అలజడి ఉంటుందో అక్కడ నిర్ణయం యథార్థంగా ఉండదు. కాబట్టి ‘ఒక్క బాబా బలం, ఒక్క బాబా పైననే నమ్మకం’ అంటే ప్రతి కార్యంలోనూ సహజ సఫలతను అనుభవం చేయడం. ఎంత కష్టమైన కార్యమైనా కానీ ‘ఒక్క బాబా బలం, ఒక్క బాబా పైననే నమ్మకం’ ఉన్నవారికి ప్రతి కార్యం ఒక ఆటగా అనిపిస్తుంది. పనిలా అనిపించదు, ఆటలా అనిపిస్తుంది. మరి ఆట ఆడడంలో సంతోషం ఉంటుంది కదా! ఎంత శ్రమపడే ఆట అయినా కానీ ఆట అంటే సంతోషమే. చూడండి, మల్లయుద్ధం చేస్తారు, అందులో కూడా ఎంత శ్రమపడాల్సి వస్తుంది! కానీ ఆట అని భావించి చేస్తారు కాబట్టి సంతోషిస్తారు, శ్రమగా అనిపించదు. చాలా సంతోషంగా కార్యం సహజంగా సఫలం కూడా అయిపోతుంది. ఒకవేళ ఏదైనా కార్యం చేస్తూ, సంతోషంగా ఉండకుండా, చింత లేదా దిగులులో ఉంటే కష్టంగా అనిపిస్తుంది కదా! ‘ఒకే బలము ఒకే నమ్మకము’ ఉందనడానికి నిదర్శనం - సదా సంతోషంగా ఉంటారు, శ్రమ అనిపించదు. ‘ఒకే బలము ఒకే నమ్మకము’ ద్వారా ఎంత అసంభవమైన పనైనా కానీ సంభవంగా కనిపిస్తుంది.
బ్రాహ్మణ జీవితంలో స్థూలమైన పనైనా, ఆత్మిక పురుషార్థమైనా సరే, ఏదైనా కానీ అసంభవం కానేరదు. బ్రాహ్మణుడు అంటేనే అసంభవాన్ని కూడా సంభవం చేసేవారు. బ్రాహ్మణుల డిక్షనరీలో ‘అసంభవం’ అనే పదం లేదు, కష్టం అనే పదం లేదు, శ్రమ అనే పదం లేదు. అలాంటి బ్రాహ్మణులే కదా. లేక ఎప్పుడైనా అసంభవంగా అనిపిస్తోందా? ‘ఇది చాలా కష్టం, ఇది మారడం లేదు, తిడుతూనే ఉన్నాడు, ఈ పని జరగడం లేదు, నా భాగ్యం ఏమిటో ఏమో’ అని ఇలా అనుకోవడం లేదు కదా? లేక ఏదైనా పని కష్టంగా అనిపిస్తోందా? ఎప్పుడైతే బాబా తోడును వదిలేసి, ఒంటరిగా చేస్తారో, అప్పుడు బరువు కూడా అనిపిస్తుంది, శ్రమ కూడా అనిపిస్తుంది, కష్టంగా మరియు అసంభవంగా కూడా అనిపిస్తుంది; మరియు బాబాను తోడుగా ఉంచుకుంటే కొండ కూడా ఆవగింజగా అయిపోతుంది. దీనినే ‘ఒకే బలము ఒకే నమ్మకము’లో ఉండేవారు అని అంటాము. ఒకే బలము ఒకే నమ్మకములో ఉండేవారు ఎప్పుడూ సంకల్ప మాత్రంగా కూడా ‘ఏమి జరుగుతుందో, ఎలా జరుగుతుందో?’ అని ఆలోచించలేరు. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉంటే బుద్ధి సరిగ్గా నిర్ణయించలేదు. క్లియర్‌గా ఉండదు! ఏ పని చేస్తున్నా ‘ఏమో, ఏమి జరుగుతుందో? ఎలా జరుగుతుందో?’ అనే క్వశ్చన్ వస్తే దీనిని యుద్ధ స్థితి అంటాము. మరి మీరు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? ఎందుకంటే ఇప్పటివరకు సమయానుసారంగా యుద్ధ సంస్కారాలు ఉంటే సూర్యవంశంలోకి చేరుతారా లేక చంద్రవంశంలోకా? చంద్రవంశంలోకైతే వెళ్ళకూడదు కదా! యోగంలో కూర్చున్నప్పుడు కూడా కొంత సమయం యోగం కుదురుతుంది మరియు కొంత సమయం యుద్ధం చేస్తూ ఉంటారు! ఆ సమయంలోనే శరీరం వదిలేస్తే ఎక్కడికి వెళ్తారు? ‘అంత మతి సో గతి’ ప్రకారం ఏమవుతుంది? అందుకే సదా విజయిగా ఉండే సంస్కారాలను ధారణ చేయండి. సర్వశక్తిమంతుడైన బాబా తోడుగా ఉన్నప్పుడు, భగవంతుడు ఉన్నచోట యుద్ధం ఉంటుందా లేక విజయం ఉంటుందా? కాబట్టి అలాంటి విజయీ రత్నంగా అవ్వండి. దీనినే ఒకే బలము ఒకే నమ్మకము అని అంటాము. అచ్ఛా!
గ్రూప్ నం. 4
అటెన్షన్ మరియు చెకింగ్ అనే కాపలాదారులు సరిగ్గా ఉంటే ఖజానా సేఫ్‌గా ఉంటుంది
సదా మిమ్మల్ని మీరు బాబా యొక్క సర్వ ఖజానాలకు యజమానులము అని అనుభవం చేసుకుంటున్నారా? యజమానులుగా అయిపోయారా లేక అవుతున్నారా? అందరూ బాలకులు సో యజమానులుగా అయినప్పుడు, బాబా అందరికీ ఒకే రకమైన ఖజానాను ఇచ్చారా లేక ఎవరికైనా తక్కువ, ఎవరికైనా ఎక్కువగా ఇచ్చారా? ఒకే రకంగా ఇచ్చారు! లభించడం ఒకే రకంగా లభించినప్పుడు, మరి నంబర్‌వారీగా ఎందుకు ఉన్నారు? ఖజానా అందరికీ ఒకే రకంగా లభించింది, అయినా కొందరు నిండుగా, కొందరు తక్కువగా ఉన్నారు. దానికి కారణం - ఖజానాను కాపాడుకోవడం రాకపోవడం. కొందరు పిల్లలు ఖజానాను పెంచుకుంటారు, కొందరు పిల్లలు పోగొట్టుకుంటారు. పెంచుకునే విధానం - పంచడం. ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఎవరైతే పంచరో వారిది పెరగదు. ఇది అవినాశి ఖజానా, ఈ ఖజానాను ఎంత పెంచుకోవాలనుకుంటే అంత పెంచుకోవచ్చు. సర్వ ఖజానాలను కాపాడుకోవడం అంటే పదే పదే ఖజానాలను చెక్ చేసుకోవడం. ఎలాగైతే ఖజానాను కాపాడుకోవడానికి ఎవరో ఒక కాపలాదారుడిని ఉంచుతారో, అలాగే ఈ ఖజానాను సదా సేఫ్‌గా ఉంచడానికి ‘అటెన్షన్’ మరియు ‘చేకింగ్’ అనే కాపలాదారులు ఉండాలి. కాబట్టి ఎవరైతే అటెన్షన్ మరియు చెకింగ్ చేయడం తెలుసుకుంటారో వారి ఖజానాను ఎవ్వరూ ఎత్తుకెళ్ళలేరు, ఎవ్వరూ పోగొట్టలేరు. మరి కాపలాదారులు తెలివైనవారా లేక అలసత్వపు నిద్రలో నిద్రపోతున్నారా? కాపలాదారులు కూడా నిద్రపోతే ఖజానాను పోగొట్టుకుంటారు. అందుకే ‘అటెన్షన్’ మరియు ‘చేకింగ్’ రెండూ సరిగ్గా ఉంటే ఖజానాను ఎవ్వరూ తాకలేరు! మరి లెక్కలేనంత, ఖాళీ అవ్వని, అఖండమైన ఖజానా జమా అయి ఉంది కదా! ఖజానాలను చూసి సదా హర్షితంగా ఉంటున్నారా? ఎప్పుడైనా ఏ పరిస్థితిలోనైనా దుఃఖపు అల అయితే రావడం లేదు కదా?
స్వప్నంలో కూడా దుఃఖపు అల ఉండకూడదు. దుఃఖపు అల వచ్చినప్పుడు సంతోషము తగ్గుతుంది. ఆ సమయంలో బాబాను సుఖసాగరుని రూపంలో స్మృతి చేయండి. బాబా సుఖసాగరుడు అయినప్పుడు, పిల్లల్లోకి దుఃఖపు అల ఎలా రాగలదు! మీ ఆత్మల అనాది, ఆది స్వరూపం కూడా సుఖ స్వరూపమే. పరంధామంలో ఉన్నప్పుడు కూడా సుఖ స్వరూపంగానే ఉన్నారు, ఆది దేవతలుగా అయినప్పుడు కూడా సుఖ స్వరూపంగానే ఉన్నారు, కాబట్టి మీ అనాది మరియు ఆది స్వరూపాన్ని స్మృతిలో ఉంచుకుంటే ఎప్పుడూ దుఃఖపు అల రాదు. అచ్ఛా! పాండవులకు ఎప్పుడైనా దుఃఖపు అల వస్తుందా? ఎప్పుడైనా కోపం తెచ్చుకుంటారా? కోపపడడం అంటే దుఃఖాన్ని ఇవ్వడం, దుఃఖాన్ని తీసుకోవడం. ఎవరికైతే ఎప్పుడూ కోపం రాదో వారు చేయి ఎత్తండి! ఇంట్లో వారి సర్టిఫికేట్ కూడా కావాలి. ఎవరైనా తిట్టినా, ఇన్సల్ట్ చేసినా కూడా కోపం రాకూడదు. అందరి ఫోటో తీస్తున్నారు. రాకపోతే చాలా మంచిది. కానీ ముందు ముందు ఏ పరిస్థితిలోనూ మాయను రానివ్వకూడదు. ఇప్పటివరకు సేఫ్‌గా ఉంటే అభినందనలు, కానీ ముందు ముందు కూడా అవినాశిగా ఉండాలి. అచ్ఛా! మాతలకు మోహం వస్తుందా? పాండవులలో ఆవేశం ఉంటుంది, అది కోపం యొక్క అంశమే; మాతలలో మోహం ఉంటుంది! మరి ఈ సంవత్సరం ఏమి చేస్తారు? కోపం అసలే రాకూడదు. అలా అని ‘చేయక తప్పదు, లేకపోతే పని జరగదు’ అని అనకూడదు కదా? ఈనాటి సమయానుసారంగా కూడా కోపంతో పని పాడవుతుంది, మరియు ఆత్మిక ప్రేమతో, శాంతితో పాడైన పని కూడా సరివుతుంది. అందుకే ఇది కూడా ఒక చాలా పెద్ద వికారము. కాబట్టి క్రోధజీతులుగా అవ్వడం బ్రాహ్మణ జీవితానికి అతి అవసరము. మాతలు మోహజీతులుగా అవ్వాలి. చాలాసార్లు మోహం కారణంగా కోపం కూడా వచ్చేస్తూ ఉంటుంది! అందరూ ఏమి లక్ష్యం పెట్టుకున్నారు? బాబా సమానంగా అవ్వాలి. మరి బాబాలో కోపం లేక మోహం ఉందా? కాబట్టి సమానంగా అవ్వాలి కదా! ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ మాయాజీతులుగా అవ్వడం అంటే బ్రాహ్మణ జీవితం యొక్క సంతోషాన్ని తీసుకోవడం. కాబట్టి ఇంకా అండర్లైన్ చేసి ఈ సంవత్సరంలో సమాప్తం చేయండి. అచ్ఛా!
గ్రూప్ నం. 5
రాజయోగి అంటే తన కర్మేంద్రియాలను ఆర్డర్లో నడిపించేవారు
అందరూ ఒక్క సెకనులో అశరీరి స్థితి యొక్క అనుభవాన్ని చేయగలరా? లేక టైమ్ పడుతుందా? మీరు రాజయోగులు, రాజయోగి అంటే అర్థం ఏమిటి? రాజులు కదా. మరి మీ శరీరం ఏమిటి? సేవకుడు కదా! మరి సెకనులో అశరీరిగా ఎందుకు అవ్వలేరు? ఆర్డర్ చేయండి - ‘ఇప్పుడు శరీర భానంలోకి రాకూడదు’ అని; మరి శరీరం వినదా? రాజయోగి అంటే మాస్టర్ సర్వశక్తిమంతులు. మాస్టర్ సర్వశక్తిమంతులు కర్మబంధనాన్ని కూడా తెంచుకోలేకపోతే మాస్టర్ సర్వశక్తిమంతులు అని ఎలా అనిపించుకుంటారు? చెప్పడానికి ‘మేము మాస్టర్ సర్వశక్తిమంతులము’ అని అంటారు కదా. కాబట్టి ఈ అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండండి. రాజయోగి అంటే రాజుగా అయి ఈ కర్మేంద్రియాలను తన ఆర్డర్లో నడిపించేవారు. ఎందుకంటే అలాంటి అభ్యాసం లేకపోతే లాస్ట్ టైమ్‌లో ‘పాస్ విత్ ఆనర్’గా ఎలా అవుతారు! నెట్టుకొస్తూ పాస్ అవ్వాలా లేక ‘పాస్ విత్ ఆనర్’గా అవ్వాలా? ఎలాగైతే శరీరంలోకి రావడం సహజమో, సెకను కూడా పట్టదో! ఎందుకంటే చాలా కాలపు అభ్యాసం ఉంది. అలాగే శరీరానికి అతీతంగా అయ్యే అభ్యాసం కూడా కావాలి, అది కూడా చాలా కాలపు అభ్యాసం కావాలి. లక్ష్యం శ్రేష్ఠంగా ఉన్నప్పుడు, లక్ష్యానికి తగినట్లుగా పురుషార్థం కూడా శ్రేష్ఠంగా చేయాలి.
రోజంతా పదే పదే ఈ ప్రాక్టీస్ చేయండి - ‘ఇప్పుడే శరీరంలో ఉన్నాను, ఇప్పుడే శరీరానికి వేరైన అశరీరిని!’ లాస్ట్ సో ఫాస్ట్, మరియు ఫస్ట్ రావడానికి ఫాస్ట్ పురుషార్థం చేయాల్సి వస్తుంది. అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుంది? ఏ విషయం యొక్క సంతోషం ఉంది? సదా మీకు ప్రాప్తించిన భాగ్యం యొక్క లిస్ట్ ఎదురుగా ఉంచుకోండి. ఎన్ని భాగ్యాలు లభించాయి? ఎంతటి భాగ్యం లభించిందంటే - మీ భాగ్యం యొక్క మహిమను ఇప్పుడు కల్పం చివరలో కూడా భక్తులు చేస్తున్నారు. ఎప్పుడైనా కీర్తనలు విన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎవరి మహిమ ఇది? డబల్ ఫారెనర్ల కీర్తన జరుగుతోందా? సంగమంలో భాగ్యశాలులుగా అయ్యారు మరియు సంగమంలోనే ఇప్పుడు కూడా తమ భాగ్యం వర్ణించబడుతుంటే వింటున్నారు. చైతన్య రూపంలో తమ జడ చిత్రాన్ని చూసి హర్షితమవుతున్నారా? అచ్ఛా!
గ్రూప్ నం. 6
అలౌకిక జీవితాన్ని తయారుచేసుకోవడానికి అన్ని విషయాలలో ‘‘తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి’’గా అవ్వండి
(మధుబన్ నివాసులతో మిలనము) మధుబన్ మహిమ నలువైపులా ప్రసిద్ధమే. మధుబన్ మహిమ అంటే మధుబన్ నివాసుల మహిమ. మధుబన్ మహిమ ఎక్కువ ఉందా లేక మధుబన్ నివాసుల మహిమ ఎక్కువ ఉందా? మధుబన్ అని దేనిని అంటారు? ఈ భవనాలను మధుబన్ అంటారా? మధుబన్ నివాసుల వల్ల మధుబన్ ఉంది. ఏది మధుబన్ మహిమో అదే మధుబన్ నివాసుల మహిమ. సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి - ‘మధుబన్ మహిమ అనగా మన మహిమ!’ మహిమ గొప్పగా ఉన్నవారిదే పాడబడుతుంది. సాధారణమైన వారి మహిమ ఉండదు, మహానతకే మహిమ ఉంటుంది. కాబట్టి మధుబన్ నివాసులు మహానుభావులుగా అయిపోయారు కదా! లేక ఎప్పుడైనా సాధారణంగా కూడా అయిపోతారా? మధుబన్ నివాసులు అంటే సర్వశ్రేష్ఠులు, మహానుభావులు. అలౌకికతే మహానత. లౌకికతను మహానత అనరు. కాబట్టి మధుబన్ నివాసులు అంటే ప్రతి కర్మ, ప్రతి మాట, ప్రతి సంకల్పము - అలౌకికము. మధుబన్ నివాసులు అంటే సాధారణతకు అతీతమైనవారు. వారి దృష్టి, వారి వృత్తి, వారి స్మృతి, వారి కృతి - అంతా అలౌకికము అంటే మహాన్. ఇది మధుబన్ నివాసుల మహిమ. అర్థమైందా? కాబట్టి మధుబన్‌లో గోడల మహిమ లేదు, మీ మహిమే ఉంది.
మధుబన్ నివాసులు ప్రతి కర్మలోనూ ఫస్ట్ వచ్చేవారు కదా. మరి అవ్యక్త సంవత్సరంలో దేనిలో ఫస్ట్ రావాలి? బాబా సమానంగా అవ్వడంలో, అలౌకికతలో ఫస్ట్ రావాలి. కాబట్టి మధుబన్‌లో ఇప్పటి నుండే సాధారణ నడవడిక, సాధారణ మాటల నామరూపాలు లేనప్పుడు మధుబన్ వారికి విశేషమైన బహుమతి లభిస్తుంది. సంవత్సరం అంతా ప్రతి నెల రిజల్ట్ వస్తుంది. కాబట్టి ప్రతి నెలలో కొద్దిగా కూడా సాధారణత ఉండకూడదు, మహానత ఉండాలి. మహానతే ఫస్ట్ కదా. సాధారణతను ఫస్ట్ అనము. కాబట్టి మధుబన్‌లో ఫస్ట్ ప్రైజ్ ఎవరు తీసుకుంటారో చూద్దాం? మరి ఈ బహుమతి తీసుకుంటారు కదా? చూద్దాం ఎవరు బహుమతి తీసుకుంటారో! ఎందుకంటే మధుబన్ నివాసులకు విశేషంగా డ్రామా అనుసారంగా వరదానాల ప్రాప్తి ఉంది. మధుబన్ నివాసులు ఏది చేస్తారో అది నలువైపులా స్వతహాగా, సహజంగా జరుగుతుంది. కాబట్టి మధుబన్కు ఈ వరదానం యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఎందుకంటే మధుబన్ లైట్ హౌస్, మైట్ హౌస్. లైట్ హౌస్ యొక్క లైట్ నలువైపులా వ్యాపిస్తుంది కదా. బల్బ్ లైట్ నలువైపులా వ్యాపించదు, లైట్ హౌస్ లైట్ నలువైపులా వ్యాపిస్తుంది. లైట్ హౌస్‌గా అయి అవ్యక్త స్థితి, అవ్యక్త నడవడిక యొక్క లైట్‌ను నలువైపులా వ్యాపింపజేయండి. ఇష్టమే కదా! మధుబన్ వారు అనుభవజ్ఞులు. మధుబన్ వారికి కష్టం ఏముంది! ఏమి అనుకుంటే అది చేయగలరు. ఎందుకంటే సాధన యొక్క వాయుమండలం కూడా ఉంది మరియు సాధనాలు కూడా ఉన్నాయి. మధుబన్‌లో ఉన్నన్ని సాధనాలు సేవాకేంద్రాలలో లేవు. ఎలాంటి సాధన యొక్క వాయుమండలం మధుబన్‌లో ఉందో అలాంటిది సేవాకేంద్రంలో తయారుచేసుకోవాల్సి వస్తుంది, ఇక్కడ స్వతహాగా ఉంది.
పురుషార్థం ప్రతి ఒక్కరిదీ ఇండివిడ్యువల్ (వ్యక్తిగతం). సంఖ్య ఎంత ఉన్నప్పటికీ పురుషార్థం ప్రతి ఒక్కరూ ‘స్వ’ కొరకు చేసుకోవాలి. అలౌకికతను తీసుకురావడానికి ఒక స్లోగన్ సదా గుర్తుంచుకోండి, అది బ్రహ్మా బాబాకు సదా ప్రియమైనదిగా ఉండింది! అది ఏ స్లోగన్? ‘‘తక్కువ ఖర్చు ఎక్కువ ఖ్యాతి. ఈ స్లోగన్ సదా గుర్తుంచుకోండి. తక్కువ ఖర్చులో కూడా ఉన్నత ఫలితాన్ని చూపించండి. అలా అని తక్కువ ఖర్చు చేయాలంటే లోటు కనిపించకూడదు. ఖర్చు తక్కువ అవ్వాలి, కానీ దాని వల్ల లభించే ప్రాప్తి చాలా వైభవంగా ఉండాలి. తక్కువ ఖర్చులో వైభవమైన రిజల్ట్ రావడాన్ని ‘‘కమ్ ఖర్చా బాలా నషీన్’’ అంటాము. కాబట్టి అలౌకిక జీవితాన్ని తయారుచేసుకోవడానికి అన్నింటిలోనూ ‘‘కమ్ ఖర్చా బాలా నషీన్’’గా అవ్వాలి - మాటలలోనూ, కర్మలలోనూ. తక్కువ ఖర్చు అంటే ఎనర్జీ, సంకల్పాలు ఎక్కువ ఖర్చు చేయకపోవడం. తక్కువ ఖర్చులో పని ఎక్కువ. అలా అని పనే తక్కువ చేసేయకూడదు. సమయం తక్కువగా ఉండాలి కానీ పని ఎక్కువగా ఉండాలి, మాటలు తక్కువగా ఉండాలి కానీ ఆ తక్కువ మాటలలో స్పష్టీకరణ ఎక్కువగా ఉండాలి, సంకల్పాలు తక్కువగా ఉండాలి కానీ శక్తివంతంగా ఉండాలి - దీనిని ‘కమ్ ఖర్చా బాలా నషీన్’ అంటాము. సర్వ ఖజానాలను తక్కువ ఖర్చులో ఉన్నత ఫలితంగా చేసి చూపించండి. మధుబన్ నివాసులైతే నిండుగా ఉన్నారు. చెప్పాము కదా, మధుబన్ భండారా కూడా నిండుగా, భండారీ కూడా నిండుగా. కాబట్టి మధుబన్ నివాసుల వద్ద కూడా సర్వ శక్తుల ఖజానాలతో భండారాలు నిండుగా ఉన్నాయి. అచ్ఛా!
(బాబా, అడ్వాన్స్ పార్టీకి ఈ సమయంలో ఉన్న పాత్ర ఏమిటి?) మీకు ఎలాంటి పాత్ర ఉందో, వారికి కూడా అలాంటి పాత్రయే ఉంది. మీరు శుభ భావనతో సేవ చేస్తున్నారు కదా. గొడవలు, కొట్లాటల మధ్యలోకి వెళ్ళి చేయడం లేదు కదా, అలాగే వారు కూడా తమ వైబ్రేషన్లతో అంతా చేస్తూ ఉంటారు.
కాన్ఫరెన్స్ కొరకు సందేశం
కాన్ఫరెన్స్‌కు కంటే ముందు ఎంతగా శాంతి వైబ్రేషన్ ఇవ్వండి అంటే, వచ్చే వారు రాగలగాలి. ఇప్పుడు దీని అవసరం ఉంది. మరియు యోగం చేయండి. ఇది కూడా బ్రాహ్మణులకు గోల్డెన్ ఛాన్స్ అవుతుంది! ఎప్పుడైనా ఇలాంటి విషయం జరిగినప్పుడు ఏమి చెబుతారు? ‘యోగం చేయండి, అఖండ యోగం చేయండి’ అని. కాబట్టి ప్రపంచం యొక్క అశాంతి మరియు బ్రాహ్మణుల గోల్డెన్ ఛాన్స్. కాబట్టి ఇది కూడా మధ్యమధ్యలో బుద్ధిని ఇంకా ఏకాగ్రం చేసే ఛాన్స్ లభిస్తుంది. (కర్ఫ్యూ సమయంలో క్లాస్‌కు రాలేరు కదా) కానీ స్టూడెంట్ అంటే స్టడీ తప్పకుండా చేస్తారు. ఇంట్లోనైతే చేయగలరు కదా. టీచర్ పనే తమ యోగశక్తితో తమ ఏరియాలో కర్ఫ్యూను సమాప్తం చేయించడం. ఈ సీన్ చూడడం వల్ల కూడా నిర్భయత యొక్క అనుభవం పెరుగుతూ ఉంటుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
