‘‘సంగమయుగములోని ప్రియమైన రాజా పిల్లలే భవిష్య రాజ్య అధికారులు’’
ఈరోజు పిల్లలందరి మనోభిరాముడైన తండ్రి తమ నలువైపులా ఉన్న ప్రియమైన రాజా పిల్లలందరినీ చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ మనోభిరాముని అనురాగానికి పాత్రులు. ఈ దివ్యమైన అనురాగము, పరమాత్మ అనురాగము కోట్లలో కొద్దిమంది అయిన భాగ్యవాన్ ఆత్మలకే ప్రాప్తిస్తుంది. అనేక జన్మలు ఆత్మల ద్వారా మరియు మహానాత్మల ద్వారా అనురాగాన్ని అనుభవము చేసారు. ఇప్పుడు ఈ ఒక్క అలౌకిక జన్మలో పరమాత్మ ప్రేమను లేక అనురాగాన్ని అనుభవము చేస్తున్నారు. ఈ దివ్యమైన అనురాగము ద్వారా ప్రియమైన రాజా పిల్లలుగా అయ్యారు, అందుకే మనోభిరాముడైన తండ్రికి కూడా ఎటువంటి అలౌకిక నషా ఉందంటే - నా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు. రాజులే కదా? ప్రజలైతే కారు కదా? అందరూ మీ టైటిల్‌ను ఏమని చెప్పుకుంటారు? రాజయోగి. అందరూ రాజయోగులేనా లేక ఎవరైనా ప్రజాయోగులు కూడా ఉన్నారా? అందరూ రాజయోగులైనట్లయితే మరి ప్రజలు ఎక్కడి నుండి వస్తారు? ఎవరిపై రాజ్యము చేస్తారు? ప్రజలైతే కావాలి కదా? మరి ఆ ప్రజాయోగులు ఎప్పుడు వస్తారు? ప్రియమైన రాజా పిల్లలు అనగా ఇప్పటి రాజులు కూడా మరియు భవిష్య రాజులు కూడా. డబల్ రాజ్యము. కేవలము భవిష్య రాజ్యము కాదు. భవిష్య రాజ్యాధికారి కన్నా ముందు ఇప్పుడు స్వరాజ్య అధికారిగా అయ్యారు. మీ స్వరాజ్యము యొక్క రాజ్య కార్య వ్యవహారాలను చెక్ చేసుకుంటారా? ఏ విధముగా భవిష్య రాజ్యము గురించి ఏమని మహిమ చేస్తారంటే - ఒకే రాజ్యము, ఒకే ధర్మము, సుఖము, శాంతి, సంపదతో సంపన్నమైన రాజ్యము. అటువంటి ఓ స్వరాజ్య అధికారీ రాజులారా, స్వరాజ్యము యొక్క రాజ్య కార్య వ్యవహారాలలో ఈ అన్ని విషయాలు సదా ఉంటున్నాయా?
ఒకే రాజ్యము అనగా ఆత్మనైన నా రాజ్యము ఈ రాజ్య కార్య వ్యవహారాలు చేసే అన్ని కర్మేంద్రియాలపై సదా ఉంటుందా లేక మధ్యమధ్యలో స్వరాజ్యానికి బదులుగా పర-రాజ్యము తన అధికారాన్ని అయితే చెయ్యదు కదా? పర-రాజ్యము - మాయ రాజ్యము. పర-రాజ్యానికి గుర్తు పరాధీనులుగా అయిపోతారు. స్వరాజ్యానికి గుర్తు సదా శ్రేష్ఠ అధికారులుగా అనుభవము చేస్తారు. పర-రాజ్యము - పర-అధీనంగా మరియు పర-వశంగా చేస్తుంది. ఎప్పుడైనా, ఎవరైనా వేరే రాజు ఏ రాజ్యముపైనైనా అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటే, ముందుగా అక్కడి రాజును ఖైదీగా చేస్తాడు అనగా పర-అధీనంగా చేస్తాడు. మరి చెక్ చేసుకోండి - ఒకే రాజ్యము ఉందా? లేక మధ్యమధ్యలో మాయ యొక్క రాజ్య అధికారులు, స్వరాజ్య అధికారీ రాజులైన మిమ్మల్ని లేక మీ రాజ్య కార్య వ్యవహారాలను నిర్వర్తించే ఏ కర్మేంద్రియాలనైనా పరవశంగానైతే చెయ్యటం లేదు కదా? మరి ఒకే రాజ్యము ఉందా లేక రెండు రాజ్యాలు ఉన్నాయా? స్వరాజ్య అధికారులైన మీ లా అండ్ ఆర్డర్ నడుస్తుందా లేక మధ్యమధ్యలో మాయ ఆర్డర్ కూడా నడుస్తుందా?
అలాగే ఒకే ధర్మము, ధర్మము అనగా ధారణ. మరి స్వరాజ్యము యొక్క ధర్మము లేక ధారణ ఏది? ‘పవిత్రత’. మనసు, మాట, కర్మ, సంబంధ-సంపర్కము, అన్ని రకాలుగా పవిత్రత, దీనినే - ఒకే ధర్మము అనగా ఒకే ధారణ అని అనడం జరుగుతుంది. స్వప్న మాత్రముగా, సంకల్ప మాత్రముగా కూడా అపవిత్రత అనగా ఇతర ధర్మము ఉండకూడదు ఎందుకంటే ఎక్కడైతే పవిత్రత ఉంటుందో అక్కడ అపవిత్రత అనగా వ్యర్థము లేక వికల్పాల యొక్క నామరూపాలు కూడా ఉండవు. అటువంటి సమర్థ సామ్రాట్లుగా అయ్యారా? లేక ఢీలా రాజులా? లేక అప్పుడప్పుడు ఢీలా, అప్పుడప్పుడు సామ్రాట్‌లా? ఎటువంటి రాజులు? ఒకవేళ ఇప్పుడు చిన్నపాటి ఈ ఒక్క జన్మలో రాజ్యాన్ని నడిపించలేకపోతే ఇక 21 జన్మల రాజ్య అధికారాన్ని ఎలా ప్రాప్తి చేసుకుంటారు? సంస్కారాలు ఇప్పుడు నిండుతున్నాయి. ఇప్పటి శ్రేష్ఠ సంస్కారాలతో భవిష్య ప్రపంచము తయారవుతుంది. కనుక ఇప్పటి నుండే ఒకే రాజ్యము, ఒకే ధర్మము కల సంస్కారాలు భవిష్య ప్రపంచానికి పునాది.
అలాగే సుఖము, శాంతి, సంపదను చెక్ చేసుకోండి అనగా సదా హద్దు ప్రాప్తుల ఆధారంపై సుఖం ఉందా లేక ఆత్మిక అతీంద్రియ సుఖము, పరమాత్మ సుఖమయ రాజ్యము ఉందా? సాధనాలు లేక సౌకర్యాలు లేక ప్రశంసల ఆధారంపై సుఖం యొక్క అనుభూతి ఉందా లేక పరమాత్మ ఆధారంపై అతీంద్రియ సుఖమయ రాజ్యము ఉందా? ఇదే విధంగా అఖండ శాంతి - ఏ రకమైన అశాంతి కల పరిస్థితి అయినా అఖండ శాంతిని ఖండితమైతే చెయ్యటం లేదు కదా? అశాంతి యొక్క తుఫాను, అది చిన్నదైనా లేక పెద్దదైనా కానీ స్వరాజ్య అధికారుల కొరకు తుఫాను అనేది అనుభవీలుగా తయారుచేసేందుకు ఎగిరే కళ యొక్క కానుకగా అవ్వాలి, లిఫ్ట్ అనే గిఫ్ట్‌గా అవ్వాలి. దీనినే అఖండ శాంతి అని అంటాము. మరి చెక్ చేసుకోండి - అఖండ శాంతిమయ స్వరాజ్యము ఉందా?
అలాగే సంపద అనగా స్వరాజ్యము యొక్క సంపద - జ్ఞానము, గుణాలు మరియు శక్తులు. ఈ అన్ని సంపదులతో సంపన్న స్వరాజ్య అధికారులుగా ఉన్నారా? సంపన్నతకు గుర్తు - సంపన్నత అనగా సదా సంతుష్టత, అప్రాప్తి అన్నదాని నామరూపాలు ఉండవు. హద్దు కోరికల అవిద్య, ఇటువంటివారినే సంపన్నులు అని అంటాము. రాజు అంటేనే దాత అని అర్థము. ఒకవేళ హద్దులోని కోరికలు లేక ప్రాప్తుల కోరికలు ఉత్పన్నమవుతున్నట్లయితే వారు రాజుకు బదులుగా (యాచించేవారిగా) అడిగేవారిగా అవుతారు, అందుకే మీ స్వరాజ్య అధికారాన్ని బాగా చెక్ చేసుకోండి - నా స్వరాజ్యము ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు సుఖశాంతులతో సంపన్నంగా అయ్యిందా? లేక ఇప్పటివరకూ తయారవుతూనే ఉందా? రాజుగా అవుతున్నప్పుడు ఒకవేళ రాజ్య అధికారీ స్థితి లేకపోతే ఆ సమయములో ఏమైనట్లు? ప్రజాగా అవుతారా లేక రాజుగానూ కాదు, ప్రజాగానూ కాదు అన్నట్లా? మధ్యలో ఉంటారా? ఇప్పుడిక మధ్యలో ఉండకండి. చివర్లో తయారైపోతాము అని ఇలా కూడా ఆలోచించకండి. ఒకవేళ బహుకాలపు రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవలసిందే అని అనుకుంటే, బహుకాలపు స్వరాజ్యానికి ఫలము బహుకాలపు రాజ్యము. పూర్తి సమయపు రాజ్య అధికారానికి ఆధారము వర్తమానములోని సదా కాలపు స్వరాజ్యము. అర్థమైందా? ఎప్పుడూ నిర్లక్ష్యముగా ఉండకండి. అయిపోతుంది, అయిపోతుంది అని అంటూ ఉండిపోకండి. బాప్‌దాదాను చాలా మధురమైన మాటలతో ఆహ్లాదపరుస్తారు. రాజుకు బదులుగా చాలా పెద్ద వకీలుగా అవుతారు. ఎటువంటి లా పాయింట్లను వినిపిస్తారంటే వాటిని విని తండ్రి కూడా నవ్వుతూ ఉంటారు. వకీలుగా ఉండటము మంచిదా లేక రాజుగా ఉండటము మంచిదా? చాలా తెలివిగా వాదిస్తారు, అందుకే ఇప్పుడు వాదించడము ఆపు చేయండి, ప్రియమైన రాజా పిల్లలుగా అవ్వండి. తండ్రికి పిల్లలపై స్నేహము ఉంది, అందుకే వింటూ-చూస్తూ కూడా నవ్వుతూ ఉంటారు. ప్రస్తుతం ధర్మరాజుతో పని తీసుకోరు.
స్నేహము అందరినీ నడిపిస్తుంది. స్నేహము కారణంగానే చేరుకున్నారు కదా. కనుక స్నేహానికి బదులుగా బాప్‌దాదా కూడా పదమా రెట్ల స్నేహాన్ని రిటర్న్ ఇస్తున్నారు. దేశ-విదేశాలలోని పిల్లలందరూ స్నేహమనే విమానము ద్వారా మధుబన్కు చేరుకున్నారు. బాప్‌దాదా సాకార రూపములో మిమ్మల్నందరినీ మరియు స్నేహ స్వరూపములో పిల్లలందరినీ చూస్తున్నారు. అచ్ఛా!
స్నేహములో ఇమిడిపోయి ఉన్న సమీప పిల్లలందరికీ, స్వరాజ్య అధికారి నుండి విశ్వ రాజ్య అధికారిగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలందరికీ, సర్వ ప్రాప్తులతో సంపన్నమైన శ్రేష్ఠ సంపన్న విశేష ఆత్మలకు, సదా ఒకే ధర్మము, ఒకే రాజ్యము కల సంపన్న స్వరాజ్య అధికారులైన తండ్రి సమాన భాగ్యవాన్ ఆత్మలకు భాగ్య విధాత బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- అన్ని కార్యాలూ బాగా జరుగుతున్నాయి కదా? మంచి ఉల్లాస-ఉత్సాహాలతో కార్యం జరుగుతూ ఉంది. చేయించేవారు చేయిస్తున్నారు మరియు నిమిత్తులుగా అయ్యి చేసేవారు చేస్తున్నారు. ఈ విధంగానే అనుభవము అవుతుంది కదా? సర్వుల సహయోగము అనే వ్రేలు ద్వారా ప్రతి కార్యము సహజంగా సఫలమవుతుంది. ఎలా జరుగుతుంది, ఇదంతా ఇంద్రజాలంలా అనిపిస్తుంది కదా. ప్రపంచంలోనివారైతే ఇదంతా చూసి, ఆలోచిస్తూ ఉండిపోతారు. మరియు నిమిత్త ఆత్మలైన మీరు సదా ముందుకు వెళ్తూ ఉంటారు ఎందుకంటే మీరు నిశ్చింత చక్రవర్తులు. ప్రపంచములోనివారికైతే ప్రతి అడుగులో చింత ఉంటుంది మరియు మీ అందరి ప్రతి సంకల్పములో పరమాత్మ చింతన ఉంది, అందుకే నిశ్చింతులు. నిశ్చింతులే కదా? మంచిది, అవినాశీ సంబంధము ఉంది. అచ్ఛా, మరి అందరూ మంచిగా నడుస్తున్నారు మరియు నడవాల్సిందే. నిశ్చయము ఉంది మరియు నిశ్చింతగా ఉన్నారు. ఏమవుతుంది, ఎలా అవుతుంది, ఈ చింత లేదు.
టీచర్లకు ఏదైనా చింత ఉందా? సెంటర్లు ఎలా పెరుగుతాయి, ఈ చింత ఉందా? సేవ ఎలా పెరుగుతుంది, ఈ చింత ఉందా? లేదా? నిశ్చింతులేనా? చింతన చెయ్యటము వేరు, చింత చెయ్యటము వేరు. సేవ పెంచేందుకు చింతనను అనగా ప్లాన్లనైతే తయారుచెయ్యండి. కానీ చింత వలన ఎప్పుడూ సఫలత లభించదు. నడిపించేవారు నడిపిస్తున్నారు, చేయించేవారు చేయిస్తున్నారు కనుక అన్నీ సహజమయ్యేదే ఉంది, కేవలము నిమిత్తులుగా అయ్యి సంకల్పాలను, తనువు, మనసు, ధనాలను సఫలము చేసుకుంటూ వెళ్ళండి. ఏ సమయములో ఏ కార్యము ఉంటుందో ఆ కార్యము మన కార్యము. అది మన కార్యమైనప్పుడు, నా కార్యమైనప్పుడు ఎక్కడైతే నాది అన్న భావము ఉంటుందో అక్కడ అన్నీ స్వతహాగానే ఆ కార్యంలో ఉపయోగించబడతాయి. మరి ఇప్పుడు బ్రాహ్మణ పరివారము యొక్క విశేష కార్యము ఏది? టీచర్లు చెప్పండి. ఇప్పుడు బ్రాహ్మణ పరివారము యొక్క విశేషమైన కార్యము ఏది, ఎందులో సఫలము చేస్తారు? (జ్ఞాన సరోవరములో) సరోవరములో అంతా స్వాహా చేస్తారా! పరివారములో ఏదైనా విశేష కార్యము ఉన్నప్పుడు అందరి అటెన్షన్ ఎటు ఉంటుంది? ఆ విశేష కార్యము వైపే అటెన్షన్ ఉంటుంది. బ్రాహ్మణ పరివారములో వర్తమాన సమయములో అత్యంత పెద్ద కార్యము ఇదే కదా. ఏ సమయము యొక్క విలువ ఆ సమయానిదే, వర్తమాన సమయములో దేశ-విదేశాలలోని సర్వ బ్రాహ్మణ పరివారము యొక్క సహయోగము ఈ విశేష కార్యములో ఉంది కదా, లేక మీ-మీ సెంటర్లలో ఉందా? ఎంత పెద్ద కార్యమో అంత పెద్ద మనసు. మరియు ఎంత పెద్ద మనసు ఉంటుందో, అంతగానే స్వతహాగా సంపన్నత ఉంటుంది. ఒకవేళ చిన్న మనసు ఉన్నట్లయితే రావాల్సింది కూడా ఆగిపోతుంది, జరగాల్సింది కూడా ఆగిపోతుంది కానీ పెద్ద మనసుతో అసంభవము కూడా సంభవమైపోతుంది. మధుబన్ యొక్క జ్ఞాన సరోవరమా లేక మీదా? ఎవరిది? మధుబన్ది కదా? గుజరాతుదైతే కాదు కదా, మధుబన్దా? మహారాష్ట్రదా? విదేశముదా? అందరిదీ. అనంతమైన సేవకు చెందిన అనంతమైన స్థానము అనేక ఆత్మలకు అనంతమైన వారసత్వాన్ని ఇప్పించేది. సరేనా. అచ్ఛా!
అవ్యక్త బాప్ దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1
స్వ పరివర్తన యొక్క వైబ్రేషన్లే విశ్వ పరివర్తనను చేయిస్తాయి
అందరూ స్వయాన్ని భాగ్యశాలీ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సంతోషమనే భాగ్యము, ఏదైతే స్వప్నములో కూడా లేదో, దానిని ప్రాప్తి చేసుకున్నారు. కనుక అందరి మనసు సదా ఈ పాటను పాడుతుంది - అందరికంటే అదృష్టశాలి ఎవరు అంటే నేనే. ఇది మనసు యొక్క పాట. నోటి ద్వారా పాటను పాడాలంటే కష్టపడాల్సి ఉంటుంది. కానీ మనసు యొక్క పాటను అందరూ పాడగలరు. అన్నింటికంటే అత్యంత పెద్ద ఖజానా సంతోషపు ఖజానా ఎందుకంటే ప్రాప్తి ఉన్నప్పుడే సంతోషము ఉంటుంది. ఒకవేళ అప్రాప్తి ఉంటే ఎవరు ఎంతగా ఇతరులను సంతోషంగా ఉండమని చెప్పినా, వారు ఎంతగా ఆర్టిఫిషియల్‌గా సంతోషంగా ఉందామని ప్రయత్నించినా, అలా ఉండలేకపోతారు. మరి మీరు సదా సంతోషంగా ఉంటారా లేక అప్పుడప్పుడు ఉంటారా? మేము భగవంతుని పిల్లలము అని ఛాలెంజ్ చేసినప్పుడు, మరి ఎక్కడైతే భగవంతుడు ఉంటారో అక్కడ ఏ అప్రాప్తి అయినా ఉండగలదా? కనుక సంతోషము కూడా సదా ఉంది ఎందుకంటే సదా సర్వ ప్రాప్తి స్వరూపులు. బ్రహ్మా బాబా పాట ఏముండేది? పొందాల్సినదేదో పొందేసాను. ఇది కేవలము బ్రహ్మా బాబా పాటనేనా లేక మీ అందరిదీ కూడానా? అప్పుడప్పుడు కాస్త దుఃఖపు అల వస్తుందా? ఎప్పటివరకు వస్తుంది? ఇప్పుడు కొద్ది సమయము కొరకు కూడా దుఃఖపు అల రాకూడదు. విశ్వ పరివర్తన చేయడానికి నిమిత్తులైనప్పుడు మరి స్వయంలో ఈ పరివర్తనను చేసుకోలేరా? ఇప్పుడు కూడా సమయము కావాలా, ఫుల్స్టాప్ పెట్టండి. ఇటువంటి శ్రేష్ఠ సమయము, శ్రేష్ఠ ప్రాప్తులు, శ్రేష్ఠ సంబంధాలు మొత్తము కల్పములో మరెప్పుడూ లభించవు. కనుక ముందుగా స్వ పరివర్తనను చేసుకోండి. ఈ స్వ పరివర్తనకు చెందిన వైబ్రేషన్లే విశ్వ పరివర్తనను చేయిస్తాయి.
డబల్ విదేశీ ఆత్మల విశేషత - ఫాస్ట్ లైఫ్ (వేగవంతమైన జీవితము). మరి పరివర్తనలో ఫాస్ట్‌గా ఉన్నారా? ఫారెన్‌లో ఎవరైనా ఢీలాగా నడుస్తుంటే మంచిగా అనిపించదు కదా. కనుక ఈ విశేషతను పరివర్తనలో తీసుకురండి. మంచిది. ముందుకు వెళ్తున్నారు మరియు వెళ్తూనే ఉంటారు. గుర్తించే దృష్టి చాలా తీవ్రంగా ఉంది కావుననే తండ్రిని గుర్తించారు. ఇప్పుడు పురుషార్థములో కూడా తీవ్రము, సేవలో కూడా తీవ్రము మరియు సంపూర్ణంగా అయ్యి గమ్యానికి చేరుకోవటంలో కూడా తీవ్రము. ఫస్ట్ నంబర్లో రావాలి కదా? ఏ విధంగా బ్రహ్మా బాబా ఫస్ట్‌లో ఉన్నారు కదా, అలా బ్రహ్మా బాబాకు సహచరులుగా అయ్యి ఫస్ట్ అయ్యేవారితోపాటు ఫస్ట్‌లో వస్తారు. బ్రహ్మాబాబాపై ప్రేమ ఉంది కదా. అచ్ఛా, మాతలు అద్భుతము చేస్తారు కదా. దేనినైతే ప్రపంచము అసంభవమని భావిస్తుందో, దానిని మీరు సహజముగా చేసి చూపించారు. అటువంటి అద్భుతాన్ని చేస్తున్నారు కదా. మాతలు బలహీనమైనవారని, ఏమీ చెయ్యలేరని ప్రపంచములోనివారు భావిస్తారు, కానీ మీరు అసంభవాన్ని సంభవము చేసి విశ్వ పరివర్తనలో అందరికంటే ముందుకు వెళ్తున్నారు. పాండవులు ఏం చేస్తున్నారు? అసంభవాన్ని సంభవమైతే చేస్తున్నారు కదా. పవిత్రతా జెండాను ఎగరవేసారు కదా. జెండాను చేతిలో మంచిగా పట్టుకున్నారా లేక అది ఎప్పుడైనా కిందకు వచ్చేస్తుందా? సదా పవిత్రతా ఛాలెంజ్ అనే జెండాను ఎగరవేస్తూ ఉండండి.
గ్రూప్ నం. 2
ప్రతిరోజూ అమృతవేళ కంబైండ్ స్వరూప స్మృతి తిలకాన్ని దిద్దుకోండి
సదా స్వయాన్ని సహజ యోగిగా అనుభవము చేస్తారా? పరిస్థితులు ఎంత కష్టాన్ని అనుభవం చేయించేవిగా ఉన్నాకానీ కష్టాన్ని కూడా సహజము చేసే సహజయోగీ, ఇలా ఉన్నారా లేక కష్టకాలంలో కష్టం అనుభవమవుతుందా? సదా సహజము కదా? కష్టంగా అనిపించడానికి కారణము తండ్రి చేతిని వదిలేస్తారు. ఎప్పుడైతే ఒంటరివారిగా అవుతారో అప్పుడు బలహీనంగా అవుతారు మరియు బలహీనమైనవారికి సహజమైన విషయము కూడా కష్టమనిపిస్తుంది, అందుకే బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - సదా కంబైండ్ రూపములో ఉండండి. కంబైండ్‌గా ఉన్నవారిని ఎవ్వరూ విడదీయలేరు. ఎలా అయితే ఈ సమయములో ఆత్మ మరియు శరీరము కంబైండ్‌గా ఉన్నాయో, అలా తండ్రి మరియు మీరు కంబైండ్‌గా ఉండండి. మాతలు ఏమంటారు? కంబైండ్‌గా ఉన్నారా లేక ఒక్కోసారి వేరుగా, ఒక్కోసారి కంబైండ్గానా? ఇటువంటి సహచరుడు మళ్ళీ ఎప్పుడైనా లభిస్తారా? మరి అటువంటప్పుడు తోడును ఎందుకు వదిలేస్తారు? పని కూడా ఏమిచ్చారు? కేవలం ఇది గుర్తుంచుకోండి - ‘మేరా బాబా (నా బాబా)’. దీని కంటే సహజమైన పని ఏముంటుంది? కష్టమా? (63 జన్మల సంస్కారముంది). ఇప్పుడైతే కొత్త జన్మ జరిగింది కదా. కొత్త జన్మ, కొత్త సంస్కారాలు. ఇప్పుడు పాత జన్మలో ఉన్నారా లేక కొత్త జన్మలో ఉన్నారా? లేక సగం-సగమా? మరి కొత్త జన్మలో స్మృతి సంస్కారము ఉందా లేక విస్మృతి సంస్కారము ఉందా? మరి కొత్తదాన్ని వదిలి పాతదాంట్లోకి ఎందుకు వెళ్తారు? కొత్త వస్తువు మంచిగా అనిపిస్తుందా లేక పాత వస్తువు మంచిగా అనిపిస్తుందా? మరి పాతదాంట్లోకి ఎందుకు వెళ్ళిపోతారు? ప్రతిరోజూ అమృతవేళ స్వయానికి బ్రాహ్మణ జీవితము యొక్క స్మృతి తిలకాన్ని పెట్టుకోండి. ఏ విధంగా భక్తులు తిలకం తప్పకుండా పెట్టుకుంటారో, అలా మీరు స్మృతి తిలకాన్ని పెట్టుకోండి. మామూలుగా కూడా చూడండి, తిలకం పెట్టుకునే మాతలు ఎవరైతే ఉంటారో వారు తోడు యొక్క తిలకాన్ని పెట్టుకుంటారు. కనుక సదా గుర్తుంచుకోండి - మేము కంబైండ్‌గా ఉన్నాము, ఈ తోడు యొక్క తిలకాన్ని సదా పెట్టుకోండి. ఒకవేళ యుగళులైతే తిలకం పెట్టుకుంటారు, ఒకవేళ యుగళులు కాకపోతే తిలకం పెట్టుకోరు. ఇది తోడు యొక్క తిలకము. మరి ప్రతిరోజూ స్మృతి తిలకాన్ని పెట్టుకుంటారా లేక మర్చిపోతారా? ఒక్కోసారి పెట్టుకోవటము మర్చిపోతారు, ఒక్కోసారి చెరిగిపోతుంది! ముత్తైదువతనము ఏదైతే ఉంటుందో, తోడు ఏదైతే ఉంటుందో, దానిని ఎప్పుడూ మర్చిపోరు. కనుక సహచరుడిని సదా తోడుగా పెట్టుకోండి.
ఈ గ్రూప్ అందమైన పుష్పగుచ్ఛము లాంటిది. రకరకాల పూలతో కూడిన పుష్పగుచ్ఛము శోభనీయంగా అనిపిస్తుంది. కనుక అందరూ ఎవరైనా, ఎక్కడి నుండి వచ్చినా, అందరూ ఒకరి కన్నా ఒకరు ప్రియమైనవారు. అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా? సదా తోడుగా ఉంటారు మరియు సదా సంతుష్టంగా ఉంటారు. కేవలం ఈ ఒక్క మాటనే గుర్తుంచుకోండి – కంబైండ్‌గా ఉన్నాము మరియు సదా కంబైండ్‌గా ఉంటూ తోడుగా వెళ్తాము, అంతే. కానీ తోడుగా ఉంటేనే తోడుగా వెళ్తారు. తోడుగా ఉండాలి, తోడుగా వెళ్ళాలి. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో, వారి నుండి వేరు కాలేరు. ప్రతి క్షణము, ప్రతి సంకల్పములో తప్పకుండా తోడు ఉండనే ఉంది. అచ్ఛా!
గ్రూప్ నం. 3
సమయం అమూల్యమైనది, సమయాన్ని ఆదా చేసుకోవడమే తీవ్ర పురుషార్థం
మేము ఇప్పడు కూడా శ్రేష్ఠ ఆత్మలము మరియు భవిష్యత్తులో కూడా అనేక జన్మలు దేవాత్మలుగా ఉంటాము అనే నషా సదా ఉందా? వర్తమానం మరియు భవిష్యత్తు రెండింటి నషా ఉంది కదా. వర్తమానం యొక్క నషా భవిష్యత్తును ప్రత్యక్షం చేస్తోంది. ఇప్పుడు శ్రేష్ఠంగా ఉంటేనే భవిష్యత్తులో దేవాత్మలుగా అవుతారు. వర్తమానం యొక్క ఫలం భవిష్యత్తులో లభిస్తుంది. మహత్వం వర్తమానానికే ఉంది. మరి వర్తమాన సమయం యొక్క మహత్వాన్ని సదా గుర్తుంచుకుంటున్నారా? ఈ సమయం యొక్క ఒక్కొక్క సెకను ఎంత శ్రేష్ఠమైనది! సెకనును కోల్పోయినా, సెకనును కోల్పోయినట్లు కాదు కానీ చాలా ఎక్కువ కోల్పోయినట్లే. సంగమయుగం యొక్క సెకను ఇతర యుగాల ఒక సంవత్సరం కంటే ఎక్కువ. మరి ఇంతటి మహత్వం సదా గుర్తుంటోందా లేక ఎప్పుడైనా గుర్తుంటోందా? సదా గుర్తుంటే ప్రతి సెకను పరమాత్మ దీవెనలు ప్రాప్తిస్తూనే ఉంటాయి. భక్తులైతే దీవెనలు తీసుకోవడానికి ఎంత పురుషార్థం చేస్తారు! ఎంత కష్టపడతారు! మరి మీకు తండ్రి దీవెనలు ప్రతి సమయం లభిస్తూనే ఉన్నాయి. మరి దీవెనలను జమ చేసుకుంటున్నారా లేక ఖర్చైపోతున్నాయా? ఎవరి జోలె అయితే పరమాత్మ దీవెనలతో సదా నిండి ఉంటుందో వారి వద్దకు మాయ ఎప్పటికీ రానేరాదు. మాయ వస్తోందా లేక దూరం నుండే పారిపోతోందా? లేక దగ్గరకు వచ్చి ఆ తర్వాత పారిపోతోందా? ఎందుకంటే వస్తే మళ్ళీ తరిమివేయాల్సి వస్తుంది. కానీ దూరం నుండే పారిపోతే, తరిమివేసేందుకు కూడా సమయం పట్టదు. దూరం నుండే రావడానికి మాయకు ధైర్యం లేకుండా ఉండేంత శక్తిశాలిగా అవ్వండి. ఎంత భయంకరమైన జంతువులైనా సరే మీ దగ్గర లైట్ (వెలుగు), కాంతి ఉంటే అవి ముందుకు రావు. అలాగే సర్వ శక్తుల లైట్ సదా మీతో ఉంటే మాయ దూరం నుండే పారిపోతుంది. మరి మీరు దూరం నుండి తరిమివేసేవారా లేక దగ్గర నుండి తరిమివేసేవారా? ఎందుకంటే సమయం అమూల్యమైనది. సమయాన్ని ఆదా చేసుకోవడమే తీవ్ర పురుషార్థం. మరి తీవ్ర పురుషార్థులా లేక పురుషార్థులా? తీవ్ర పురుషార్థి అనగా మాయాజీత్. తీవ్ర పురుషార్థి అనగా సదా విజయి. యుద్ధం చేసేవారు కారు. మరి సదా విజయులేనా, ఎప్పుడూ ఓటమి జరగదు కదా? చూడండి, ఎక్కడైతే తండ్రి ఉన్నారో అక్కడ విజయం ఖాయం అని గాయనం కూడా చేయబడి ఉంది. తండ్రి సదా తోడు ఉంటే విజయం నిశ్చయం. కొద్దిగా పక్కకు తప్పుకున్నాగానీ యుద్ధం చేయాల్సి వస్తుంది. కాబట్టి యుద్ధం చేసేవారు కారు, విజయీ రత్నాలు. ఎంతకాలం యుద్ధం చేస్తారు? యుద్ధం చేస్తూ చేస్తూ ఏమి కావాల్సి వస్తుంది? చంద్రవంశీ. మరి చంద్రవంశీలా లేక సూర్యవంశీలా? సూర్యవంశీ అనగా సదా విజయి. కాబట్టి విజయం జన్మసిద్ధ హక్కు అనేది అనుభవం కావాలి, చెప్పడం కాదు, అనుభవంలోకి రావాలి. అధికారం ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండదు అని ఉండకూడదు. అధికారం సదా తోడు ఉంటుంది. మంచిది!
తీవ్ర పురుషార్థం చేసేవారు కదా! సేవ చేయడం అనగా ఖాతా జమ చేసుకోవడం. అది సేవ కాదు, మేవా. పేరు సేవ, కానీ అది మేవా. మరి అన్ని చోట్లా సేవ బాగుంది కదా. సేవ మరియు సంపూర్ణత రెండింటిలోనూ ముందున్నారు కదా. నిర్విఘ్న సేవలో ముందున్నారా? నిర్విఘ్న సేవయే ఈ సంగమయుగం యొక్క విశేషత. మరి నిర్విఘ్న సేవ జరుగుతోందా లేక విఘ్నాలు వస్తున్నాయా? విఘ్నాలు వస్తున్నాయనే సమాచారం తండ్రికి తెలుస్తూనే ఉంటుంది కదా. గుజరాత్‌కు సామీప్యత అనే వరదానం ఎంత ఉందో, భూమి (ధరణి) కూడా సాత్వికత అనే వరదానానిదై ఉందో, అలాగే సదా నిర్విఘ్నంగా ఉండే వరదానంలో కూడా సదా ముందుండాలి. ఎంత ఎక్కువ సేవ ఉంటే అంత నిర్విఘ్నంగా ఉంటారనేదానికి ఎగ్జాంపుల్‌గా అవ్వాలి. కాబట్టి నిర్విఘ్న సేవలో నంబర్‌వన్ తీసుకోవాలి. ఏ సెంటర్లోనూ ఎటువంటి గొడవలు లేవా లేక లోపల కొద్దికొద్దిగా జరుగుతోందా? ఆత్మలు చాలా మంచివారు, కేవలం ప్రతి ఒక్కరూ నిర్విఘ్నంగా అయి ముందుకు వెళ్ళే సంకల్పాన్ని దృఢంగా చేసుకోండి. సంఖ్య కూడా బాగుంది, సేవ కూడా బాగుంది. ఇది విశేషత. కానీ ఇప్పుడు ‘గుజరాత్ నిర్విఘ్న సేవలో నంబర్‌వన్’ అనే ఈ విశేషతను యాడ్ (జోడించండి) చేయండి. ధైర్యం ఉందా? తండ్రికి నచ్చారు కాబట్టే తమవారిగా చేసుకున్నారు కదా. కాబట్టి మంచివారే. ఇక విఘ్నాలు రానివ్వకూడదు. విజయం యొక్క అధికారం సదా ప్రత్యక్ష స్వరూపంలో ఉండాలి. మంచిది, విజయి భవ.
గ్రూప్ నం. 4
మనసా సేవ కొరకు స్వ స్థితిని పవర్‌ఫుల్‌గా చేసుకోండి, నిరంతర సేవాధారిగా అవ్వండి
సదా మిమ్మల్ని మీరు తండ్రి యొక్క స్నేహి, సహయోగి మరియు సదా సేవాధారి ఆత్మలుగా భావిస్తున్నారా? స్నేహం తెగనిదిగా ఉంది కదా. పరమాత్మ స్నేహాన్ని ఏ శక్తి అయినా తెంచగలదా? అసంభవమే కదా లేక కొద్దికొద్దిగా సంభవమా? ఈ అవినాశి స్నేహం వినాశనం కానేరదు. స్నేహంతో పాటు సదా సహయోగులుగా ఉన్నారు. ఏ విషయంలో సహయోగులు? తండ్రి యొక్క డైరెక్షన్లకు సదా సహయోగులు. సదా శ్రీమతంపై నడవడంలో సహయోగులు మరియు సదా సేవాధారులు. సేవ చేసే అవకాశం లభిస్తే సేవాధారి అని కాదు. సదా సేవాధారి. బ్రాహ్మణులుగా అవ్వడం అనగా సేవా స్టేజీపైనే ఉండడం. బ్రాహ్మణుల పని ఏమిటి? సేవ చేయడం. ఆ నామధారీ బ్రాహ్మణులు భోజనాలు (ధామా) తినేవారు, మరి మీరు సేవ చేసేవారు. మరి ప్రతి సెకను సేవా స్టేజీపై ఉన్నామని భావిస్తున్నారా? లేక అవకాశం లభించినప్పుడు సేవ చేస్తున్నారా? ఛాన్స్ లభించినప్పుడు సేవ చేసేవారా లేక సదా సేవాధారులా? వంట చేస్తూ కూడా సేవ చేస్తున్నారా? ఏం సేవ చేస్తున్నారు? స్మృతిలో ఉంటూ వంట చేస్తే ఇది సేవ చేయడమే. ఏ కార్యం చేసినా స్మృతిలో ఉండడం వల్ల వాతావరణం పవిత్రంగా మారుతుంది. ఎందుకంటే వృత్తి నుండి వాతావరణం తయారవుతుంది. కాబట్టి స్మృతి యొక్క వృత్తితో వాతావరణాన్ని తయారుచేస్తున్నారు. సేవాధారి అనగా ప్రతి సమయం తమ శ్రేష్ఠ దృష్టితో, వృత్తితో, కృతితో సేవ చేసేవారు. ఎవరినైనా శ్రేష్ఠ దృష్టితో చూస్తే ఆ శ్రేష్ఠ దృష్టి కూడా సేవ చేస్తుంది. కాబట్టి నిరంతర సేవాధారులు. బ్రాహ్మణ ఆత్మ సేవ లేకుండా ఉండలేదు. ఎలాగైతే ఈ శరీరం ఉందో, శ్వాస లేకుండా ఉండలేదో, అలాగే బ్రాహ్మణ జీవితానికి శ్వాస సేవ. ఎలాగైతే శ్వాస నడవకపోతే మూర్ఛపోతారో, అలాగే బ్రాహ్మణ ఆత్మ సేవలో బిజీగా లేకపోతే మూర్ఛపోతుంది. ఇలాంటి పక్కా సేవాధారులు కదా. మరి ఎంత స్నేహిగా ఉన్నారో, అంత సహయోగి, అంతే సేవాధారి. సేవ చేసే ఛాన్స్ అయితే చాలా ఉంది కదా, లేక ఎప్పుడైనా ఎవరికో ఒకరికి లభించి, మరొకరికి లభించకుండా ఉందా? వాణి ద్వారా సేవ చేసే ఛాన్స్ లభించకపోవచ్చు కానీ మనసా సేవ చేసే ఛాన్స్ అయితే ప్రతి సమయం ఉంది. అన్నింటికంటే పవర్ఫుల్ మరియు అత్యంత పెద్ద సేవ మనసా సేవ. వాచా సేవ సహజమా లేక మనసా సేవ సహజమా? మనసా సేవ కొరకు ముందు స్వయాన్ని పవర్‌ఫుల్‌గా చేసుకోండి. వాచా సేవ అయితే స్థితి హెచ్చుతగ్గులుగా ఉన్నా చేసేస్తారు. భాషణ చేసి వచ్చేస్తారు. కోర్సు తీసుకునేవారు ఎవరైనా వస్తే కోర్సు చెప్పేస్తారు. కానీ మనసా సేవ అలా జరగదు. మనస్సు కొద్దిగా బలహీనంగా ఉన్నా మనసా సేవ జరగదు. వాచా సేవ చేయవచ్చు. అలా చేయకూడదు కానీ నడుస్తోంది. కాబట్టి ఇప్పుడు మనసా, వాచా, కర్మణా అన్ని రకాల సేవలు చేయండి, అప్పుడే ఫుల్ మార్కులు తీసుకోగలరు. నిరంతర సేవాధారిగా అవ్వండి, ఎందుకంటే ఎంత సేవ చేస్తే అంత ప్రత్యక్షఫలం లభిస్తూనే ఉంటుంది. కాబట్టి సేవాధారి అనగా ప్రత్యక్షఫలాన్ని తినేవారు.
అందరూ సంతుష్ట ఆత్మలే కదా. సంగమంలో సంతుష్టంగా ఉండకపోతే ఇంకెప్పుడు ఉంటారు? సంగమయుగమే సంతుష్టత యొక్క యుగం. మరి అందరూ సంతుష్టంగా ఉన్నారా లేక కొద్దిగా గొడవ ఉందా? స్వయంలోనూ లేదు, ఇతరుల సంపర్కంలోకి రావడంలోనూ లేదు. స్వయం సంతుష్టంగా ఉన్నారు కానీ సంపర్కంలోకి రావడంలో సంతుష్టత - ఇందులో కొద్దిగా తేడా ఉంది. మీరు మాల యొక్క పూసలు కదా. మరి మాల ఎలా తయారవుతుంది? సంబంధం ద్వారా. ఒక పూసకు మరొక పూసతో సంపర్కం లేకపోతే మాల తయారవుతుందా? కాబట్టి మాల యొక్క పూసలు మీరు, అందుకే సంబంధ-సంపర్కంలో కూడా సదా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టం చేయాలి. కేవలం ఉండడమే కాదు, చేయాలి కూడా, అప్పుడే మాల యొక్క పూసలుగా అవుతారు. ఎందుకంటే అందరూ పరివారంలో ఉన్నవారు, నివృత్తిలో ఉన్నవారు కారు. పరివారం అంటేనే సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టం చేయడం. బాప్‌దాదా అన్ని స్థానాలను ఒకదాని కంటే ఒకటి ముందే ఉంచుతారు. ఫలానా స్థానాన్ని ముందుంది, మరొకటి వెనుక ఉంది అని కాదు. తండ్రికి అందరూ ముందే ఉన్నారు. కొత్తవారైనా, పాతవారైనా అందరూ ముందే ఉన్నారు. ఒకవేళ గుప్తంగా ఉంటే అందరికంటే ముందే ఉన్నారు. గుప్త దానం మహా దానం అని ఎలా అంటారో, అలాగే గుప్త పురుషార్థీలు అయితే, పేరు బయటకు రాకపోతే, మేము వెనుక ఉన్నాము అని అనుకోకండి, గుప్త పురుషార్థీలు సదా ముందే ఉన్నారు. గుప్త సేవాధారి సదా ముందే ఉన్నారు. మరి అందరూ ఏమి గుర్తుంచుకుంటారు? ఎవరు మీరు? నిరంతర సేవాధారి. సదా సేవా స్టేజీపై పాత్రను అభినయిస్తున్నారు. ఇంట్లో కాదు, స్టేజీపై ఉన్నారు. సెంటర్లో కాదు, స్టేజీపై ఉన్నారు. మరి స్టేజీపై ఉంటే అలర్ట్‌గా ఉంటారు, ఇంటికి వెళ్తే అలర్ట్‌గా ఉండరు, నిర్లక్ష్యంగా అయిపోతారు. స్టేజీపైకి వెళ్తే అలర్ట్ అయిపోతారు. కాబట్టి సదా సేవా స్టేజీపై ఉన్నామనే ఈ స్మృతితో సదా అలర్ట్‌గా ఉండాలి. మంచిది!
గ్రూప్ నం. 5
మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యి సమయానికి ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించండి
మిమ్మల్ని మీరు సదా మాస్టర్ సర్వశక్తిమంతులుగా అనుభవం చేసుకుంటున్నారా? మాస్టర్ అంటే అర్థం ఏమిటంటే - ఏ సమయంలో ఏ శక్తిని ఆహ్వానిస్తే ఆ శక్తి ప్రాక్టికల్ స్వరూపంలో అనుభవమవ్వాలి. ఏ సమయంలో ఏ శక్తి అవసరమో, ఆ సమయానికి ఆ శక్తి సహయోగిగా అవుతోందా? ఏ సమయంలో సహనశక్తి కావాలో ఆ సమయానికి స్వరూపంలోకి వస్తోందా లేక కొద్ది సమయం తర్వాత వస్తోందా? ఒకవేళ ఆయుధం ఒక నిమిషం తర్వాత పనికి వస్తే విజయులుగా అవుతారా? విజయం లభించదు కదా. కాబట్టి మాస్టర్ సర్వశక్తిమాన్ అనగా శక్తికి ఆర్డర్ ఇవ్వగానే హాజరవ్వాలి. అలా కాకుండా సహనశక్తికి ఆర్డర్ ఇస్తే ఎదుర్కొనే శక్తి వస్తే వారిని మాస్టర్ సర్వశక్తిమంతులు అని అంటామా? ఎలాగైతే కొన్ని పరిస్థితుల్లో, పక్కకు తప్పుకోకూడదు, సహించాలి అని ఆలోచిస్తారు, కానీ సహిస్తూ సహిస్తూ ఎదుర్కొనే శక్తిలోకి వచ్చేస్తారు. అలాగే నిర్ణయ శక్తి అవసరం ఉంది. కానీ నిర్ణయ శక్తి యథార్థ సమయానికి యథార్థ నిర్ణయం తీసుకోకపోతే దాన్ని ఏమంటారు? మాస్టర్ సర్వశక్తిమంతులు అంటామా లేక బలహీనులంటామా? కాబట్టి, ఏ సమయంలో ఏ శక్తి అవసరమో ఆ సమయానికి ఆ శక్తి కార్యంలోకి వస్తోందా? అని ట్రయల్ చేయండి. ఒక సెకను తేడా వచ్చినా గెలుపుకు బదులు ఓటమి అయిపోతుంది. సెకను విషయమే కదా. నిర్ణయం చేయడం - ‘అవును’ లేదా ‘కాదు’. ఒకవేళ అవునుకు బదులు కాదు అని చేస్తే సెకను నష్టం సదా కొరకు ఓటమి పాలవడానికి నిమిత్తంగా మారుతుంది. అందుకే మాస్టర్ సర్వశక్తిమంతులు అంటే అర్థమే ప్రతి శక్తి ఆర్డర్లో ఉండడం. ఎలాగైతే ఈ శరీర కర్మేంద్రియాలు ఆర్డర్లో ఉన్నాయి కదా - చేతులు, కాళ్ళు ఎప్పుడు కదిలిస్తే, ఎలా కదిలిస్తే అలా కదులుతాయి కదా; అలాగే సర్వ శక్తులు కూడా అంతగా ఆర్డర్లో నడవాలి. ఎంత యూజ్ చేస్తూ ఉంటారో అంత అనుభవం చేసుకుంటూ ఉంటారు.
మాతలలో ఇముడ్చుకునే శక్తి ఉందా లేక కొద్దిగా ఏదైనా జరిగితే కోపం వచ్చేస్తోందా? పిల్లలపై కొద్దిగా కోపం వస్తోందా? పాండవులకు కోపం వస్తుందా? పిల్లలపై కాదు, పెద్దలపై వస్తుందా? మేము మాస్టర్ సర్వశక్తిమంతులము అనే ఈ స్వమానాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఈ స్వమానం అనే సీటుపై సదా స్థితులై ఉండండి. ఎలాంటి సీటు ఉంటే అలాంటి లక్షణాలు వస్తాయి. ఎలాంటి పరిస్థితి ఎదురైనా సెకనులో మీ ఈ సీటుపై సెట్ అయిపోండి. సీటుపై సెట్ అవ్వకపోతే శక్తులు కూడా ఆర్డర్ వినవు. సీటుపై ఉన్నవారి ఆర్డరే వినబడుతుంది. మరి సెట్ అవ్వడం వచ్చు కదా. సీటుపై కూర్చునేవారు ఎప్పుడూ అప్సెట్ అవ్వరు. ఉంటే సీటు, లేదా అప్సెట్. లక్ష్యం బాగుంది, లక్షణాలు కూడా బాగున్నాయి. అందరూ మహావీరులే. ఎప్పుడైనా కేవలం కొద్దిగా మాయతో ఆటలు ఆడుతుంటారు. ఇప్పుడు విజయులుగా అయ్యేవారే సదా విజయులుగా అవుతారు. ఇప్పుడు విజయులుగా అవ్వకపోతే మళ్ళీ ఎప్పటికీ విజయులుగా అవ్వలేరు. అందుకే సంగమయుగమే సదా విజయులుగా అయ్యే యుగం. ద్వాపర-కలియుగాలు ఓటమి పాలయ్యే యుగాలు మరియు సంగమం విజయాన్ని ప్రాప్తి చేసుకునే యుగం. ఈ యుగానికి వరదానముంది. కాబట్టి వరదానీగా అయి విజయులుగా అవ్వండి.
కొత్త ప్లాన్ ఏదైనా తయారుచేశారా? మంచిది, ఎంత సేవను పెంచుతారో అంత స్వయాన్ని ముందుకు నడిపించుకుంటారు. ఇతరుల సేవ చేసే ముందు స్వయం సేవ స్వతహాగానే అయిపోతుంది. ఇప్పుడు ఎలాంటి ప్రముఖమైన మైక్‌లను తీసుకురండి అంటే వారు స్నేహంతో సామీప్యంగా ఉండే ఆత్మగా అవ్వాలి. ఆ ఒక్కరి ద్వారా అనేకుల సేవ సహజంగా జరుగుతూ ఉండాలి. ఇప్పుడు అలాంటి విశేష ఆత్మలను మైదానంలోకి తీసుకురండి. అర్థమైందా? మంచిది!
గ్రూప్ నం. 6
త్రికాలదర్శి స్థితిలో స్థితులై మూడు కాలాలను చూస్తే సదా సంతోషం ఉంటుంది
మేము విశేష ఆత్మలము అనే నషా సదా ఉందా? కోట్లలో కొందరు, ఆ కొందరిలోనూ కొందరు అని గాయనం చేయబడింది అని మునుపు వినేవారు, కానీ ఇప్పుడు అనుభవం చేసుకుంటున్నారు - మేమే ఆ కోట్లలో కొందరు ఆత్మలముగా ఉంటిమి, ఉన్నాము మరియు సదా అవుతాము. ఈ డ్రామాలో మన ఇంతటి విశేష పాత్ర నిశ్చయించబడి ఉంది అని ఎప్పుడైనా ఆలోచించారా! కానీ ఇప్పుడు ప్రాక్టికల్‌గా అనుభవం చేసుకుంటున్నారు. పక్కా నిశ్చయం ఉంది కదా. కల్పకల్పం ఎవరు అవుతారు? ఏమంటారు? మేమే ఉంటిమి, మేమే ఉన్నాము మరియు మేమే ఉంటాము. మూడు కాలాల జ్ఞానం ఇప్పుడు వచ్చేసింది. త్రికాలదర్శులుగా అయ్యారు కదా. ఒక్క సెకనులో మూడు కాలాలను చూడగలరా? ఎలా ఉంటిమి, ఎలా ఉన్నాము మరియు ఎలా అవుతాము అనేది స్పష్టంగా ఉంది కదా. నిన్న పూజారీ, నేడు పూజ్యులుగా అవుతున్నారు. త్రికాలదర్శి స్థితిలో స్థితులైనప్పుడు ఎంత మజా వస్తుంది! ఎలాగైతే ఏ దేశంలోనైనా టాప్ పాయింట్ (శిఖరం) పై నిలబడి నగరమంతటినీ చూస్తే మజా వస్తుంది కదా. అలాగే ఈ సంగమయుగం టాప్ పాయింట్, దీనిపై నిలబడి చూడండి, మజా వస్తుంది. నిన్న ఉంటిమి మరియు రేపు అవ్వబోతున్నాము. ఇంత స్పష్టంగా అనుభవమవుతోందా? రేపు ఏమి అవ్వబోతున్నారు? దేవత. ఎన్నిసార్లు అయ్యారు? అనేకసార్లు అయ్యారు. మరి ఎంత సహజంగా మరియు స్పష్టంగా అయిపోయింది. గర్వంగా చెప్తున్నారు కదా - మేమే ఉంటిమి, ఇంకెవరు ఉంటారు అని. ఇప్పుడు, ఇంకెవరు అవుతారు, మేమే ఉంటిమి, మేమే అవుతున్నాము అని ఈ హృదయమే చెప్తోంది కదా, దీనినే మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్ అంటాము. ఫుల్ నాలెడ్జ్ వచ్చేసింది కదా! ఒక కాలానిది కాదు, మూడు కాలాలది. తండ్రి నాలెడ్జ్‌ఫుల్ అయినట్లుగానే, తండ్రి మహిమలో ఫుల్ అయినందుకే సాగరుడు అని అంటారు. సాగరుడు సదా ఫుల్‌గా ఉంటాడు. కాబట్టి నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారు. ఏ ఒక్క కాల జ్ఞానం యొక్క లోటు కూడా లేదు. పరిపూర్ణం. ఇంతటి నషా ఉందా?
అందరికంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉంటుంది? సదా సమానంగా ఉంటుందా లేక ఎప్పుడైనా తక్కువ, ఎప్పుడైనా ఎక్కువగా ఉంటుందా? కుమారులకు మాయ రాదా? కుమారులైనా, అధర్ కుమారులైనా ఇప్పుడు బ్రహ్మాకుమారులే. అధర్ కుమార్ కూడా కుమారుడే, అధర్ కుమారి కూడా బ్రహ్మా కుమారే. కుమారీ జీవితం లేదా కుమార జీవితం చాలా శ్రేష్ఠమైన జీవితం, కానీ బ్రహ్మా కుమారులుగా ఉన్నప్పుడు మాత్రమే. కాబట్టి ఎవరైతే సదా సంతోషంగా ఉంటారో వారు బ్రహ్మాకుమారులు. ప్రపంచం వారు ఆలోచిస్తూ ఉండిపోతారు, మరి మీరు సదా సంపన్నులుగా అయిపోయారు. ఏమవుతుందో, ఎప్పుడు అవుతుందో అని వారు ఆలోచిస్తూ ఉంటారు, మరి మీరు ఏమి చెప్తారు? ఏది జరగాలో అది జరుగుతోంది, ఏది పొందాలో అది పొందేసాము అని ఛాలెంజ్ చేస్తారు కదా.
‘తండ్రి మమ్మల్ని తమవారిగా చేసుకున్నారు’ అనేది మాతలకు అత్యంత పెద్ద సంతోషం. నిరాశ నుండి సదా ఆశాపూర్ణులుగా అయిపోయారు. ప్రపంచం వారు నిరాశగా చేస్తే తండ్రి ఆశల సితారలుగా చేసారు. మీరు ఇతరులను కూడా ఆశల సితారలుగా చేయడానికి నిమిత్తంగా అయ్యారు. తండ్రి మమ్మల్ని ఇష్టపడ్డారు అనేది ఎక్స్ట్రా సంతోషం. ఎంత సహజంగా ఇష్టపడ్డారు. ఏ కష్టమూ లేదు. పాండవులకు ఉన్న నషా ఏమిటి? పాండవులకు తమ నషా ఉంది, తమ సంతోషం ఉంది. పాండవులను సదా తండ్రి తోడుగా ఉన్నవారిగా చూపిస్తారు. పాండవులు ఎప్పుడూ తోడును వదల్లేదు, చివరి వరకు తోడుగా నిలిచారు. ఆ పాండవులే కదా మీరు. మాకు తోడుగా సదా భగవంతుడు ఉన్నారు అని పాండవులు హృదయపూర్వకంగా పాడుకుంటారు. సదా తోడుగా ఉండేవారు. సదా తోడు నిలిచేవారు. అలాంటి పాండవులు కదా? సదా తోడుగా ఉండే వరదానీ ఆత్మలు. వరదాత తోడుగా ఉన్నప్పుడు వరదానాలు కూడా తోడుగానే ఉంటాయి కదా. వరదానాలతో సదా జోలె నిండి ఉంది. వరదానాలు నింపుకుంటూ నింపుకుంటూ ఎంతటి వరదానీగా అవుతారంటే అనేక జన్మలు అనేక ఆత్మలకు వరదానీ స్వరూపంలో కనిపిస్తారు. మీ జడ చిత్రాల నుండి వరదానాలు తీసుకోవడానికి వస్తారు కదా. అలాంటి వరదానీ ఆత్మలుగా అయిపోయారు. ఎప్పుడూ వరదానాల నుండి వేరు కానేలేరు. సదా నిండుగా ఉన్నారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
