‘‘నిశ్చయబుద్ధి భవ, అమర భవ’’
ఈరోజు బాప్దాదా సర్వ అతి స్నేహీ, ఆది నుండి యజ్ఞ స్థాపనకు సహయోగి అయిన, అనేక రకాలుగా వచ్చిన భిన్న-భిన్న సమస్యలనే పేపర్లలో నిశ్చయబుద్ధి విజయిగా అయి దాటేటువంటి ఆది స్నేహీ, సహయోగులైన, స్థిరమైన, అచంచలమైన ఆత్మలతో మిలనం జరుపుకునేందుకు వచ్చారు. నిశ్చయం అనే సబ్జెక్టులో పాస్ అయ్యేటటువంటి పిల్లల వద్దకు వచ్చారు. నిశ్చయమనేది ఈ పాత జీవితంలో కావచ్చు, రాబోయే జీవితంలో కూడా కావచ్చు, సదా విజయాన్ని అనుభవం చేయిస్తూ ఉంటుంది. ‘నిశ్చయం’ యొక్క వరదానం, ‘అమర భవ’ యొక్క వరదానం సదా తోడుగా ఉండాలి. విశేషంగా ఈ రోజు చాలాకాలం యొక్క అనుభవజ్ఞులైన పెద్దవారు ఎవరైతే ఉన్నారో, వారి స్మృతి మరియు స్నేహ బంధనంలో బంధింపబడి తండ్రి వచ్చారు. నిశ్చయానికి అభినందనలు!
ఒక వైపు యజ్ఞము అనగా పాండవుల కోటకు పునాదిగా ఉన్న అనగా ఫౌండేషన్గా ఉన్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో, వారు కూడా అందరూ ఎదురుగా ఉన్నారు మరియు రెండవ వైపు అనుభవజ్ఞులైన ఆది ఆత్మలైన మీరు ఈ పాండవుల కోట గోడకు మొదటి ఇటుకలు. పునాది కూడా ఎదురుగా ఉన్నారు మరియు ఆది ఇటుకలు, ఎవరి ఆధారంపైన అయితే ఈ కోట దృఢంగా అయి విశ్వానికి ఛత్రఛాయ అయ్యిందో, వారు కూడా ఎదురుగా ఉన్నారు. కనుక ఎలాగైతే తండ్రి పిల్లల స్నేహంలో ‘‘జీ హజూర్, హాజిర్’’ అని చేసి చూపించారో, అలాగే సదా బాప్దాదా మరియు నిమిత్త ఆత్మల శ్రీమతము లేక డైరెక్షన్కు సదా ‘జీ హాజిర్’ చేస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా వ్యర్థమైన మన్మతాన్ని లేక పరమతాన్ని కలపకూడదు. హాజరుగా ఉన్న ప్రభువును తెలుసుకొని శ్రీమతముపై ఎగురుతూ వెళ్ళండి. అర్థమయిందా? అచ్ఛా! (ఈ విధంగా అరగంట తర్వాత ప్రియమైన బాప్దాదా చేయి ఊపుతూ పిల్లలందరి వద్ద వీడ్కోలు తీసుకున్నారు). అచ్ఛా!
*** ఓంశాంతి ***
