‘‘అవ్యక్త సంవత్సరంలో లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి’’
ఈరోజు నిరాకారి మరియు ఆకారి అయిన బాప్‌దాదా సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణాత్మలను ఆకార రూపంతో మరియు సాకార రూపంతో చూస్తున్నారు. సాకార రూపం కల ఆత్మలైన మీరందరూ కూడా తండ్రి సమ్ముఖంలో ఉన్నారు మరియు ఆకారి రూపధారి పిల్లలు కూడా సమ్ముఖంలో ఉన్నారు. ఇరువురిని బాప్‌దాదా చూసి హర్షిస్తున్నారు. అందరి మనసులో ఒకే సంకల్పం ఉంది, మేమందరము తండ్రి సమానంగా సాకారి నుండి ఆకారి మరియు ఆకారి నుండి నిరాకారి తండ్రి సమానంగా అవ్వాలి అన్న ఉల్లాసం ఉంది. బాప్‌దాదా అందరి యొక్క ఈ లక్ష్యాన్ని మరియు లక్షణాలను చూస్తున్నారు. ఏం కనిపించింది? మెజారిటీ యొక్క లక్ష్యము చాలా బాగా దృఢంగా ఉంది కానీ లక్షణాలు అప్పుడప్పుడు దృఢంగా, అప్పుడప్పుడు సాధారణంగా ఉన్నాయి. లక్ష్యము మరియు లక్షణాలలో సమానత రావడము, ఇది సమానంగా అయ్యేందుకు గుర్తు. లక్ష్యాన్ని ధారణ చేయడంలో 99% కూడా కొంతమంది ఉన్నారు, మిగిలినవారు నంబరువారుగా ఉన్నారు. కానీ సదా, సహజంగా మరియు సహజ స్వభావంగా లక్షణాలను ధారణ చేయడంలో ఎక్కడి వరకు ఉన్నారు, ఇందులో మైనారిటీ 90% వరకు ఉన్నారు, మిగిలినవారు నంబరువారుగా ఉన్నారు. కనుక లక్ష్యము మరియు లక్షణంలో మరియు లక్షణాలను కూడా సహజంగా మరియు స్వభావంగా తయారుచేసుకోవడంలో తేడా ఎందుకుంది? సమయానుసారంగా, పరిస్థితులు అనుసారంగా, సమస్య అనుసారంగా చాలామంది పిల్లలు పురుషార్థం ద్వారా తమ లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా కూడా తయారుచేసుకుంటారు. కానీ ఇది సహజంగా మరియు స్వభావంగా అయిపోవాలి, ఇందులో ఇప్పుడు ఇంకా అటెన్షన్ కావాలి. ఈ సంవత్సరాన్ని అవ్యక్త ఫరిశ్తా స్థితిలో స్థితులై ఉండేదిగా జరుపుకుంటున్నారు. ఇది చూసి బాప్‌దాదా పిల్లల ప్రేమ మరియు పురుషార్థము - రెండింటినీ చూసి-చూసి సంతోషిస్తున్నారు, ‘‘వాహ్ పిల్లలు, వాహ్’’ అనే పాటను కూడా పాడుతారు. దానితో పాటు ఇప్పుడు మరియు మున్ముందు సర్వ పిల్లలందరిలో లక్ష్యము మరియు లక్షణాలలో సమానతను చూడాలనుకుంటున్నారు. మీరందరూ కూడా ఇదే కోరుకుంటున్నారు కదా. తండ్రి కూడా కోరుకుంటున్నారు, మీరు కూడా కోరుకుంటున్నారు, మరి మధ్యలో ఇంకేముంది? అది కూడా మంచి రీతిలో తెలుసు. పరస్పరంలో వర్క్‌షాప్ చేస్తారు కదా!
బాప్‌దాదా లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉండడానికి విశేషంగా ఒక విషయాన్నే చూసారు. ఆకారి ఫరిశ్తా కావచ్చు, నిరాకారి కావచ్చు, అది నిరంతరం సహజ స్వభావంగా అయిపోవాలి - దీనికి మూల ఆధారము నిరహంకారిగా అవ్వడము. అహంకారం అనేక రకాలుగా ఉంటుంది. అన్నింటిలోనూ విశేషంగా చెప్పడానికైతే ‘దేహాభిమానము’ అనే ఒకే పదం ఉంది కానీ దేహాభిమానం యొక్క విస్తారం చాలా ఉంది. ఒకటి - స్థూల రూపంలో ఉండే దేహాభిమానము, ఇది చాలామంది పిల్లలలో లేదు కూడా. స్వయం యొక్క దేహంపై కావచ్చు, ఇతరుల దేహంపై కావచ్చు, ఒకవేళ ఇతరుల దేహంపై కూడా ఆకర్షణ ఉంది అంటే అది కూడా దేహాభిమానము. చాలామంది పిల్లలు ఈ స్థూల రూపం విషయంలో పాస్ అయ్యారు, స్థూల రూపంతో దేహం యొక్క ఆకారంపై ఆకర్షణ లేక అభిమానము లేవు. కానీ దీనితో పాటు దేహ సంబంధం విషయంలో, మా సంస్కారాలు విశేషమైనవి, బుద్ధి విశేషమైనది, గుణాలు విశేషమైనవి, ఏవో కళలు విశేషమైనవి, ఏదో ఒక శక్తి విశేషమైనది, వీటి అభిమానము అనగా అహంకారము, నషా, ఆవేశము - ఇది సూక్ష్మమైన దేహాభిమానము. ఒకవేళ ఈ సూక్ష్మ అభిమానాలలో ఏ అభిమానం ఉన్నా కూడా ఆకారి ఫరిశ్తాగా సహజంగా-నిరంతరం అవ్వలేరు, నిరాకారిగా అవ్వలేరు ఎందుకంటే ఆకారి ఫరిశ్తాలో కూడా దేహ భానం ఉండదు, వారు డబల్ లైట్‌గా ఉంటారు. దేహ అహంకారము నిరాకారిగా అవ్వనివ్వదు. అందరూ ఈ సంవత్సరం అటెన్షన్ బాగా పెట్టారు, ఉల్లాస-ఉత్సాహాలు కూడా ఉన్నాయి, కోరిక కూడా చాలా బాగుంది, కోరుకుంటారు కూడా కానీ ముందు కోసం దయచేసి ఇంకా అటెన్షన్ పెట్టండి! చెక్ చేసుకోండి, ‘‘ఏ రకమైన అభిమానము లేక అహంకారము సహజ స్వరూపం నుండి పురుషార్థీ స్వరూపంగా అయితే చేయడం లేదు కదా? ఏదైనా సూక్ష్మ అభిమానము అంశ రూపంలో కూడా మిగిలిపోలేదు కదా, అది సమయానుసారంగా మరియు సేవ అనుసారంగా కూడా ఎక్కడా ఇమర్జ్ అవ్వడం లేదు కదా?’’ ఎందుకంటే అంశమాత్రముగా ఉన్నదే సమయానికి మోసం చేస్తుంది, అందుకే ఈ సంవత్సరంలో ఏ లక్ష్యమైతే పెట్టుకున్నారో, ఆ లక్ష్యం సంపన్నమవ్వాల్సిందేనని బాప్‌దాదా కోరుకుంటున్నారు.
నడుస్తూ-నడుస్తూ ఏదైనా విశేషమైన స్థూల రూపంలో ఆ రోజు, ఆ సమయంలో ఏ పొరపాటును కూడా చేయరు కానీ అప్పుడప్పుడు ఈ అనుభవం చేస్తారు కదా - ‘‘ఈరోజు లేక ఇప్పుడు ఏమైందో తెలియదు, ఎంతగా సంతోషం ఉండాలో అంతగా లేదు, ఈరోజు ఒంటరితనం లేక నిరాశ లేక వ్యర్థ సంకల్పాల అకస్మాత్తు తుఫాను ఎందుకు వస్తుందో తెలియదు! అమృతవేళ కూడా చేసాము, క్లాసు కూడా చేసాము, సేవ కూడా చేసాము, ఉద్యోగానికి కూడా వెళ్ళాము కానీ ఇలా ఎందుకు జరుగుతుంది?’’ కారణం ఏముంటుంది? స్థూల రూపాన్ని అయితే చెక్ చేసుకుంటారు మరియు అందులో ఎలాంటి పొరపాటు జరగలేదని భావిస్తారు. కానీ సూక్ష్మ అభిమానం యొక్క స్వరూపాల అంశము సూక్ష్మంగా ప్రత్యక్షమవుతుంది, అందుకే ఏ పనిలోనూ మనసు లగ్నమవ్వదు, వైరాగ్యము, ఉదాసీనంగా అనుభవమవుతుంది. లేదా ఇలా ఆలోచిస్తారు, ఏదైనా ఏకాంత స్థానానికి వెళ్ళిపోవాలి, లేదా ఇలా ఆలోచిస్తారు నిద్రపోవాలి, విశ్రాంతిలోకి వెళ్ళిపోవాలి లేదా కొద్ది సమయం కోసం పరివారం నుండి దూరంగా వెళ్ళిపోవాలి. ఈ అన్ని స్థితులకు కారణము, అంశం యొక్క అద్భుతము. అద్భుతమని అనకండి, అల్లకల్లోలం అనే అనండి. కనుక సంపూర్ణ నిరహంకారిగా అవ్వడము అనగా ఆకారి మరియు నిరాకారిగా సహజంగా అవ్వడము. ఎలాగైతే అప్పుడప్పుడు మనసు పెట్టాలని అనిపించదు, సదా ఒకే దినచర్యలోనే నడవాలా ఏమిటి, మార్పు అయితే ఉండాలి కదా అని అనుకుంటారు. కోరుకోకపోయినా కూడా ఈ స్థితి వచ్చేస్తుంది.
ఎప్పుడైతే నిరహంకారిగా అవుతారో, అప్పుడు ఆకారి మరియు నిరాకారి స్థితి నుండి కిందికి రావాలని మనసుకు అనిపించదు. దానిలోనే లవలీనంగా ఉండడాన్ని అనుభవం చేస్తారు ఎందుకంటే మీ ఒరిజినల్ అనాది స్థితి అయితే నిరాకారియే కదా. నిరాకార ఆత్మ ఈ శరీరంలో ప్రవేశించింది. శరీరం ఆత్మలో ప్రవేశించలేదు, ఆత్మ శరీరంలో ప్రవేశించింది. కనుక అనాది ఒరిజినల్ స్వరూపమైతే నిరాకారియే కదా లేక శరీరధారియా? శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు కానీ తీసుకున్నది ఎవరు? ఆత్మలైన మీరు, నిరాకారులైన మీరు సాకార శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు. మరి ఒరిజినల్ ఏదైనట్లు, ఆత్మనా లేక శరీరమా? ఆత్మ. ఇది పక్కా కదా? కనుక ఒరిజినల్ స్థితిలో స్థితమవ్వడము సహజమా లేక ఆధారం తీసుకునే స్థితిలో స్థితమవ్వడము సహజమా?
అహంకారం రావడానికి ద్వారము ఒకే పదము, అదేమిటి? ‘‘నేను’’ కనుక ఈ అభ్యాసం చేయండి - ఎప్పుడు ‘‘నేను’’ అన్న పదము వచ్చినా కూడా ఒరిజినల్ స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి ‘నేను’ ఎవరు? నేను ఆత్మనా లేక ఫలానా-ఫలానానా? ఇతరులకు జ్ఞానమిస్తారు కదా ‘నేను’ అన్న పదమే ఎగిరేలా చేస్తుంది, ‘నేను’ అన్న పదమే కిందికి తీసుకువచ్చేటువంటిది. ‘నేను’ అని అనడముతో ఒరిజినల్ నిరాకార స్వరూపం గుర్తుకు రావాలి, ఇది సహజమైపోవాలి. మరి ఈ మొదటి పాఠం సహజమే కదా. కనుక దీనిని చెక్ చేసుకోండి, అలవాటు చేసుకోండి ‘నేను’ అని అనుకోగానే నిరాకారి స్వరూపం స్మృతిలోకి రావాలి. ఎన్నిసార్లు ‘నేను’ అన్న పదాన్ని అంటారు! నేను ఇలా అన్నాను, ‘నేను’ ఇది చేస్తాను, ‘నేను’ ఇలా ఆలోచిస్తాను... అనేకసార్లు ‘నేను’ అనే పదాన్ని ఉపయోగిస్తారు. కనుక నిరాకారిగా లేక ఆకారిగా అయ్యేందుకు ఇదే సహజ విధి - ‘నేను’ అనే పదం ఎప్పుడు ఉపయోగించినా కూడా వెంటనే తమ నిరాకారి ఒరిజినల్ స్వరూపం ఎదురుగా రావాలి. ఇది కష్టమా లేక సహజమా? ఇక అప్పుడు లక్ష్యము మరియు లక్షణాలు సమానంగా అయ్యే ఉన్నాయి. కేవలం నిరహంకారిగా తయారుచేసే ఈ యుక్తిని సహజ సాధనాన్ని తమదిగా చేసుకుని చూడండి. ఈ దేహ భానం యొక్క ‘నేను’ సమాప్తమైపోవాలి. ఎందుకంటే ‘నేను’ అనే పదమే దేహ-అహంకారంలోకి తీసుకొస్తుంది మరియు ఒకవేళ ‘నేను’ నిరాకారి ఆత్మ స్వరూపాన్ని - దీనిని స్మృతిలోకి తీసుకొస్తే, అప్పుడు ఈ ‘నేను’ అన్న పదమే దేహ భానము నుండి అతీతంగా తీసుకువెళ్తుంది. అంతే కదా. రోజంతటిలో 25-30 సార్లు అయితే తప్పకుండా అంటూ ఉంటారు. బయటకు చెప్పకపోయినా కానీ ఆలోచిస్తూ అయితే ఉండవచ్చు ‘నేను’ ఇది చేస్తాను, నేను ఇది చేయాలి... అని. ప్లాన్ కూడా తయారుచేస్తున్నప్పుడు ఆలోచిస్తారు కదా. కనుక ఇన్నిసార్లు చేసే అభ్యాసము, ఆత్మ స్వరూపం యొక్క స్మృతి ఎలా తయారుచేస్తుంది? నిరాకారిగా చేస్తుంది. నిరాకారిగా అయి, ఆకారి ఫరిశ్తాగా అయి కార్యం చేసాము, మళ్ళీ నిరాకారిగా అయ్యాము! కర్మ సంబంధపు స్వరూపంతో సంబంధంలోకి రండి, సంబంధాన్ని బంధనంలోకి తీసుకురాకండి. దేహాభిమానంలోకి రావడము అనగా కర్మ బంధనంలోకి రావడము. దేహ సంబంధంలోకి రావడము అనగా కర్మ సంబంధంలోకి రావడము. రెండింటిలో తేడా ఉంది. దేహాన్ని ఆధారంగా తీసుకోవడము మరియు దేహానికి వశమవ్వడము - రెండింటిలో తేడా ఉంది. ఫరిశ్తా లేక నిరాకారి ఆత్మ దేహాన్ని ఆధారంగా తీసుకొని దేహపు బంధనంలోకి రాదు, సంబంధం ఉంచుకుంటుంది కానీ బంధనంలోకి రాదు. కనుక, నిరహంకారి, ఆకారి ఫరిశ్తా మరియు నిరాకారి స్థితిలో లక్ష్యము మరియు లక్షణాలలో ఎంతగా సమానంగా అయ్యారు అని బాప్‌దాదా మళ్ళీ ఈ సంవత్సరంలో రిజల్టు చూస్తారు.
మహానతకు గుర్తు నిర్మానత. ఎంతగా నిర్మానంగా ఉంటారో, అంతగా అందరి మనసులలో మహాన్‌గా స్వతహాగానే అవుతారు. నిర్మానత లేకుండా సర్వులకు మాస్టర్ సుఖదాతలుగా అవ్వలేరు. నిర్మానత నిరహంకారిగా సహజంగానే చేస్తుంది. నిర్మానత యొక్క బీజము మహానత అనే ఫలాన్ని స్వతహాగానే ప్రాప్తి చేయిస్తుంది. నిర్మానత అందరి హృదయాల నుండి ఆశీర్వదాలను ప్రాప్తి చేయించే సహజ సాధనము. నిర్మానత అందరి మనసులో నిర్మానత కల ఆత్మ పట్ల సహజంగానే ప్రేమ యొక్క స్థానాన్ని తయారుచేస్తుంది. నిర్మానత మహిమా యోగ్యంగా స్వతహాగానే తయారుచేస్తుంది. కనుక నిరహంకారిగా అయ్యేందుకు విశేషమైన గుర్తు - నిర్మానత. వృత్తిలో కూడా నిర్మానత, దృష్టిలో కూడా నిర్మానత, వాణిలో కూడా నిర్మానత, సంబంధ-సంపర్కంలో కూడా నిర్మానత. నా వృత్తిలో లేదు కానీ మాటలలో వచ్చేసింది అని కాదు. అలా కాదు. ఎటువంటి వృత్తి ఉంటుందో అటువంటి దృష్టి ఉంటుంది, ఎటువంటి దృష్టి ఉంటుందో అటువంటి వాణి ఉంటుంది, ఎటువంటి వాణి ఉంటుందో అదే సంబంధ-సంపర్కంలోకి వస్తుంది. నాలుగింటిలోనూ ఉండాలి. మూడింటిలో ఉండి, ఒకదానిలో లేకపోయినా కూడా అహంకారం రావడానికి మార్జిన్ ఉంది. ఇలా నిర్మానంగా ఉండేవారిని ఫరిశ్తా అని అనడం జరుగుతుంది. కనుక అర్థమయిందా, బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారు మరియు మీరేం కోరుకుంటున్నారు అని? ‘కోరుకోవడము’ ఇరువురిది ఒక్కటే, ఇప్పుడు ‘చేయడము’ కూడా ఒకటిగా చేయండి. అచ్ఛా!
మున్ముందు సేవ కోసం కొత్త-కొత్త ప్లాన్లు ఏం తయారుచేస్తున్నారు? కొన్ని తయారుచేసారు, కొన్ని తయారుచేస్తారు. ఈ సంవత్సరం కోసం కావచ్చు, రాబోయే సంవత్సరం కోసం కావచ్చు, ఎలాగైతే ఇతర ప్లాన్లు ఆలోచిస్తారో - భాషణ కూడా చేస్తాము, సంబంధ-సంపర్కాలను కూడా పెంచుతాము, పెద్ద ప్రోగ్రామ్‌లు కూడా చేస్తాము, చిన్న ప్రోగ్రామ్‌లు కూడా చేస్తాము, అని ఇలా అయితే తప్పకుండా ఆలోచిస్తారు కానీ వర్తమాన సమయపు వేగం అనుసారంగా ఇప్పుడు సేవది కూడా తీవ్ర వేగం కావాలి. అది ఎలా జరుగుతుంది? వాణి ద్వారా, సంబంధ-సంపర్కాల ద్వారా అయితే సేవ చేస్తూనే ఉన్నారు, మనసా-సేవ కూడా చేస్తారు కానీ ఇప్పుడు కావాల్సింది - కొద్ది సమయంలో సేవా సఫలత ఎక్కువ ఉండాలి. సఫలత అనగా ఫలితము. దానికి విధి - వాణితో పాటు మొదట తమ స్థితి మరియు స్థానం యొక్క వైబ్రేషన్లను శక్తిశాలిగా చేసుకోండి. ఎలాగైతే మీ జడ చిత్రాలు ఏం సేవను చేస్తున్నాయి? వైబ్రేషన్ల ద్వారా ఎంతమంది భక్తులను ప్రసన్నము చేస్తున్నాయి! డబల్ విదేశీయులు మందిరాలను చూసారా? మీ మందిరాలే కదా! కేవలం భారతవాసుల మందిరాలా? మీ చిత్రాలు సేవ చేస్తున్నాయి కదా! కనుక వాణి ద్వారానైతే చేయండి కానీ ఇప్పుడు ఇటువంటి ప్లానింగ్ చేయండి, వాణితో పాటు వైబ్రేషన్ యొక్క ఎలాంటి విధిని తయారుచేయాలంటే, దానితో వాణి మరియు వైబ్రేషన్ డబల్ పని చేయాలి. వైబ్రేషన్ చాలా కాలం ఉంటుంది. వాణి ద్వారా విన్న విషయాలు అప్పుడప్పుడు చాలామంది మర్చిపోతారు కూడా కానీ వైబ్రేషన్ యొక్క ముద్ర ఎక్కువ సమయం నడుస్తుంది. ఎలాగైతే మీరు మీ జీవితంలో అనుభవజ్ఞులు కదా - ఎవరిదైనా వ్యతిరేకపు వైబ్రేషన్ ఒకవేళ మీ మనసులో లేక బుద్ధిలో కూర్చుండిపోతే, ఆ వ్యతిరేకపు వైబ్రేషన్ ఎంత సమయం నడుస్తుంది! వైబ్రేషన్ లోపల కూర్చుండిపోతుంది కదా. మాటనైతే ఆ సమయంలోనే మర్చిపోతారు కానీ వైబ్రేషన్ రూపంలో మనసు, బుద్ధిలో ముద్ర పడిపోతుంది. మరియు ఎంత సమయం అదే వైబ్రేషన్లకు వశమై, ఆ వ్యక్తితో వ్యవహారంలోకి వస్తారు? వ్యతిరేకమైనది కావచ్చు, సరైనది కావచ్చు కానీ వైబ్రేషన్ కష్టం మీద తొలగుతుంది.
కానీ ఈ ఆత్మిక వైబ్రేషన్లను వ్యాపింపజేసేందుకు మొదట తమ మనసులో, బుద్ధిలో వ్యర్థ వైబ్రేషన్లు సమాప్తం చేయాలి, అప్పుడే ఆత్మిక వైబ్రేషన్లు వ్యాపింపజేయగలరు. ఎవరి పట్ల అయినా ఒకవేళ వ్యర్థ వైబ్రేషన్లు ధారణ చేసి ఉంటే ఆత్మిక వైబ్రేషన్లను వ్యాపింపజేయలేరు. వ్యర్థ వైబ్రేషన్లు, ఆత్మిక వైబ్రేషన్ల ముందు ఒక గోడ వలె అవుతాయి. సూర్యుడు ఎంత ప్రకాశమయంగా అయినా ఉండవచ్చు, ఒకవేళ ఎదురుగా గోడ వచ్చింది, మేఘాలు వచ్చాయి అంటే సూర్యుని ప్రకాశాన్ని ప్రజ్వలితము కానివ్వవు. పక్కా వైబ్రేషన్ ఏదైతే ఉందో, అది గోడ వంటిది మరియు తేలికపాటి వైబ్రేషన్లు ఏవైతే ఉన్నాయో, అవి తేలికైన మేఘాలు లేక నల్లని మేఘాల వంటివి. అవి ఆత్మిక వైబ్రేషన్లను ఆత్మల వరకు చేరనివ్వవు. ఎలాగైతే సాగరంలో ఎవరైనా వల విసిరి అనేక వస్తువులను ఒక్కసారే పోగు చేస్తారు లేక తమ వలను ఎక్కడైనా వ్యాపింపజేసి ఒకే సమయంలో అనేకమందిని తమవారిగా చేసుకుంటారు, అలా వైబ్రేషన్లు ఒక్క సమయంలోనే అనేక ఆత్మలను ఆకర్షించగలవు. వైబ్రేషన్లు వాయుమండలాన్ని తయారుచేస్తాయి. కనుక జరగబోయే సేవలో వృత్తి ద్వారా ఆత్మిక వైబ్రేషన్లతో పాటు సేవ చేయండి, అప్పుడే ఫాస్ట్‌గా జరుగుతుంది. వైబ్రేషన్లు మరియు వాయుమండలంతో కలిపి వాణి యొక్క సేవను కూడా చేస్తే ఒక సమయంలోనే అనేక ఆత్మల కళ్యాణం చేయగలరు.
ఇకపోతే, ప్రోగ్రామ్‌ల కోసం ముందుగానే తయారై తయారుచేయబడిన స్టేజ్ యొక్క ప్రయోగాన్ని ఇంకా ఎక్కువ చేయండి, దీనిని ఇంకా పెంచండి. సంపర్కంలో ఉండేవారి ద్వారా ఈ సహయోగం తీసుకొని ఈ సేవలో వృద్ధిని ప్రాప్తి చేసుకోగలరు. సహయోగుల సహయోగాన్ని ఏదో ఒక విధితో పెంచుకుంటూ వెళ్ళినట్లయితే స్వతహాగానే సేవలో సహయోగులుగా అవ్వడంతో సహజయోగులుగా అయిపోతారు. చాలామంది ఇటువంటి ఆత్మలు ఉంటారు, వారు నేరుగా సహజయోగులుగా అవ్వరు కానీ సహయోగం తీసుకుంటూ వెళ్ళండి, సహయోగిగా తయారుచేస్తూ వెళ్ళండి. అలా సహయోగంలో ముందుకు వెళ్తూ-వెళ్తూ సహయోగమే వారిని యోగీగా తయారుచేస్తుంది. కనుక సహయోగి ఆత్మలను ఇంకా స్టేజి పైకి తీసుకురండి, వారి సహయోగాన్ని సఫలం చేయండి. అర్థమయిందా, ఏం చేయాలో? ఎవరైనా ఒక ఆత్మ సహయోగిగా అయినా కూడా, ఆ ఆత్మ ప్రాక్టికల్‌గా సహయోగం తీసుకోవడం ద్వారా, ఇవ్వడం ద్వారా, ప్రత్యక్ష ఆశీర్వాదాల ద్వారా సహజంగా ముందుకు వెళ్తుంది మరియు అనేకుల సేవకు నిమిత్తంగా అవుతుంది.
దానితో పాటు సంవత్సరంలో నెలను ఫిక్స్ చేయండి, కొన్ని నెలలు విశేషంగా స్వ పురుషార్థం లేక శ్రేష్ఠ శక్తిని ధారణ చేసే అభ్యాసం కోసం ఫిక్స్ చేసుకోండి, వీటినే మీరు తపస్య, రిట్రీట్ లేక భట్టీలు అంటారు. ప్రతి ఒక్కరు దేశం అనుసారంగా రెండు- రెండు నెలలు ఫిక్స్ చేసుకోండి, ఎలాగైతే సీజన్ ఉంటుంది. రెండు నెలలు తపస్య కోసము, రెండు నెలలు చిన్న-చిన్న సేవల కోసము, రెండు నెలలు పెద్ద రూపంలో చేసే సేవల కోసము - ఇలా ఫిక్స్ చేసుకోండి. అంతేకానీ, 12 నెలలు సేవలో ఎంతో బిజీగా అయిపోయి స్వ ప్రగతి కోసం తక్కువ సమయం లభించేలా ఉండకూడదు. ఎలాగైతే దేశం యొక్క సీజను ఉంటుందో, కొన్ని సమయాలలో ఎలా ఉంటుంది అంటే, బయట విశేష సేవను చేయలేరు, ఆ సమయాన్ని తమ ప్రగతి కోసం విశేష రూపంలో పెట్టుకోండి. మొత్తం సంవత్సరం సేవ చేయకుండా ఉండడము, ఇలా కూడా జరగదు, మొత్తం సంవత్సరం కేవలం తపస్య చేయడము, ఇలా కూడా జరగదు, అందుకే రెండింటినీ లక్ష్యంగా పెట్టుకొని తమ స్థానం అనుసారంగా ఫిక్స్ చేసుకోండి, అందులో సేవ మరియు స్వ ప్రగతి - రెండూ కలిసి ఉండాలి.
అచ్ఛా, ఇది ఈ సంవత్సరం సీజన్ యొక్క సమాప్తి. సమాప్తిలో ఏం చేస్తారు? సమాప్తిలో ఒకటేమో వేడుక జరుపుకుంటారు మరియు రెండవది ఆధ్యాత్మిక విషయాలలో స్వాహా చేస్తారు. సమారోహమైతే నిన్న జరుపుకున్నారు (నిన్న 10 సంవత్సరాలకంటే ఎక్కువ సమయం నుండి జ్ఞానంలో ఉన్న డబల్ విదేశీ సోదరసోదరీల సెరిమనీ జరిగింది) చూసేవారు కూడా జరుపుకున్నారా లేక కేవలం కూర్చున్నవారే జరుపుకున్నారా?, కేవలం 10 సంవత్సరాల వారే జరుపుకున్నారా? ఇప్పుడు స్వాహా ఏం చేస్తారు? ఒక విషయాన్ని, విశేషంగా మనసు-బుద్ధి ద్వారా స్వాహా చేయండి, వాణి ద్వారా కాదు, కేవలం చదివాము, అలా కాదు, మనసు-బుద్ధి ద్వారా స్వాహా చేయండి. అప్పుడు చూడండి, స్వ మరియు సేవలో తీవ్ర గతి ఎలా ఉంటుందో! కనుక నేటి అల ఏమిటంటే - ఏ ఆత్మ పట్ల నైనా ఉన్న వ్యర్థ వైబ్రేషన్‌ను స్వాహా చేయండి. స్వాహా చేయగలరా? లేక కొద్ది-కొద్దిగా ఉంటుందా? వారు ఉన్నదే ఆ విధంగా, కనుక వైబ్రేషన్ అయితే ఉంటుంది కదా అని ఇలా భావించకండి! ఎలా ఉన్నా కానీ మీరు నెగిటివ్ వైబ్రేషన్‌ను మార్చి పాజిటివ్ వైబ్రేషన్ పెట్టుకున్నట్లయితే ఆ ఆత్మ కూడా నెగిటివ్ నుండి పాజిటివ్‌లోకి తప్పకుండా వచ్చేస్తుంది, రావాల్సిందే ఎందుకంటే ఎప్పటివరకైతే ఈ వ్యర్థ వైబ్రేషన్ మనసు-బుద్ధిలో ఉంటుందో, అప్పటివరకు తీవ్ర వేగంతో కూడిన సేవ జరగనే జరగదు.
వృత్తి ద్వారా ఆత్మిక వైబ్రేషన్లు వ్యాపింపజేయాలి. వృత్తి అనేది రాకెట్, ఎవరైనా సరే ఇక్కడ కూర్చుని-కూర్చుని ఎక్కడికి కావాలనుకుంటే అక్కడ, ఎంత శక్తిశాలి పరివర్తన చేయాలనుకుంటే అంత చేయగలరు. ఇది ఆత్మిక రాకెట్. ఎక్కడి వరకు ఎంతమందికి చేర్చాలనుకుంటే, అంతగా శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్లను, వైబ్రేషన్ల ద్వారా వాయుమండలాన్ని తయారుచేయవచ్చు. వారు వాస్తవానికి రాంగ్ కావచ్చు కూడా, కానీ మీరు వారి రాంగ్‌ను ధారణ చేయకండి. రాంగ్‌ను మీరెందుకు ధారణ చేస్తారు? ఇది శ్రీమతమా ఏమిటి? అర్థం చేసుకోవడము వేరే విషయము. జ్ఞాన స్వరూపంగా అవ్వండి కానీ జ్ఞాన స్వరూపంతో పాటు శక్తిశాలిగా అయి దానిని సమాప్తం చేయండి. అర్థం చేసుకోవడము వేరే విషయము, ఇముడ్చుకోవడము వేరే విషయము, సమాప్తం చేయడము, అదింకా వేరే విషయము. వీరు రాంగ్, వీరు రైట్, వీరు ఈ విధంగా ఉన్నారు అనైతే అర్థం చేసుకుంటారు. కానీ లోపల దానిని ఇముడ్చుకోకండి. ఇముడ్చుకోవడము వస్తుంది, సమాప్తం చేయడం రావడము లేదు. జ్ఞానము అంటే వివేకము. కానీ ఎవరికైతే అర్థం చేసుకోవడం కూడా వస్తుందో మరియు తొలగించుకోవడము కూడా వస్తుందో, పరివర్తన చేసుకోవడము కూడా వస్తుందో, వారినే వివేకవంతులు అని అనడం జరుగుతంది.
ఈ సంవత్సరంలో మనసు మరియు బుద్ధిని పూర్తిగా వ్యర్థం నుండి ఫ్రీ చేసుకోండి. ఇదే తీవ్ర వేగం నుండి సాధారణ వేగంలోకి తీసుకొస్తుంది, అందుకే ఈ సమాప్తి వేడుకను చేసుకోండి అనగా స్వాహా చేయండి. పూర్తిగా స్వచ్ఛంగా అయిపోవాలి. ఎలాంటి వారినైనా సరే, క్షమించండి. శుభ భావన, శుభ కామనల వృత్తి ద్వారా శుభ వైబ్రేషన్లను ధారణ చేయండి ఎందుకంటే లాస్ట్‌లో ముందుకు వెళ్తూ ఇదే వృత్తి-వైబ్రేషన్లు మీ సేవను పెంచుతాయి, అప్పుడు త్వరత్వరగా కనీసం 9 లక్షల మందిని తయారుచేయగలరు. ఏం స్వాహా చేయాలో అర్థమయిందా? వ్యర్థ వృత్తి, వ్యర్థ వైబ్రేషన్లు స్వాహా! అప్పుడు చూడండి, సహజయోగులుగా మరియు స్వభావంలో ఫరిశ్తాలుగా అయ్యే ఉన్నారు. ఈ అనుభవంపై రిట్రీట్ చేయండి, వర్క్ షాప్ చేయండి ‘‘ఎలా అవుతుంది అని కాదు; ఇలా అవుతుంది’’ అచ్ఛా!
సదా స్వయాన్ని పదే-పదే ఒరిజినల్ స్వరూపమైన ‘నేను నిరాకారిని’ - ఇటువంటి నిశ్చయం మరియు నషాలో ఎగిరేవారు, సదా నిర్మానత ద్వారా మహానతను ప్రాప్తి చేసుకునే అనుభవీ ఆత్మలు, ఇటువంటి నిర్మానులు, సదా మహాన్ మరియు సదా ఆకారి, నిరాకారి స్థితిని స్వభావంగా మరియు సహజంగా చేసుకునే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క చాలా-చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.
మధుబన్ నివాసులతో సేవ కోసం అభినందనలు తెలుపుతూ బాప్‌దాదా ఇలా అన్నారు:-
మంచిది, విశేషంగా మధుబన్ నివాసీలకు చాలా చాలా అభినందనలు. సీజన్ అంతా తమ మధురత మరియు అలసట లేని సేవ ద్వారా అందరికీ సేవ చేసే నిమిత్తంగా అయ్యారు. కాబట్టి ముందుగా సీజన్ అంతటిలో నిమిత్త సేవాధారులైన విశేష మధుబన్ నివాసీలకు చాలా చాలా అభినందనలు. మధుబన్ అనగానే మధు అనగా మధురత! ఈ మధురతే అందరినీ తండ్రి స్నేహంలోకి తీసుకువస్తుంది. అందుకే హాల్లో ఉన్నవారైనా లేదా వెళ్లిపోయినవారైనా సరే... అందరికీ, విశేషంగా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కు సేవ పట్ల బాప్‌దాదా విశేష అభినందనలు తెలుపుతున్నారు మరియు “సదా అథక్ భవ (సదా అలసట లేకుండా ఉండుగాక), మధుర్ భవ (మధురంగా ఉండుగాక)” అనే వరదానాలతో ముందుకు పెరుగుతూ, ఎగురుతూ పొండి.
అవ్యక్త బాప్‌దాదా పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1
అలసత్వం బలహీనతను తీసుకువస్తుంది, అందుకే అలర్ట్‌గా ఉండండి
అందరూ సంగమయుగి శ్రేష్ఠ ఆత్మలు కదా! ఏ యుగంలోనూ లేని విశేషత సంగమయుగానికి ఏముంది? సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే - ఒకటి ప్రత్యక్ష ఫలం లభిస్తుంది, రెండవది ఒకటికి పదమా రెట్ల ప్రాప్తి యొక్క అనుభవం ఈ జన్మలోనే అవుతుంది. ప్రత్యక్ష ఫలం లభిస్తుంది కదా! ఒకవేళ ఒక్క సెకను ధైర్యం ఉంచినా ఎంతో సమయం వరకు సహాయం లభిస్తూనే ఉంటుంది! ఏ ఒక్కరికి సేవ చేసినా ఎంత సంతోషం లభిస్తుంది! కాబట్టి ఒకటికి పదమా రెట్ల ప్రాప్తి అనగా ప్రత్యక్ష ఫలం ఈ సంగమంలోనే లభిస్తుంది. మరి తాజా ఫ్రూట్ తినడం బాగుంటుంది కదా! కాబట్టి మీరందరూ ప్రత్యక్ష ఫలం అనగా తాజా పండు తినేవారు, అందుకే శక్తిశాలిగా ఉన్నారు. బలహీనంగా అయితే లేరు కదా! అందరూ పవర్‌ఫుల్‌గా ఉన్నారు. బలహీనతను రానివ్వకూడదు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు బలహీనత స్వతహాగానే సమాప్తమైపోతుంది. సర్వ శక్తిమాన్ తండ్రి ద్వారా సదా శక్తి లభిస్తూనే ఉంటుంది, అలాంటప్పుడు బలహీనంగా ఎలా అవుతారు? బలహీనత రాగలదా ఏమిటి? ఎప్పుడైనా పొరపాటున వచ్చేస్తుందా? కుంభకర్ణుని నిద్రలో అలసత్వం కలిగినవారిగా అయి నిద్రపోయినప్పుడే వస్తుంది, లేకపోతే రానే రాదు. మీరైతే అలర్ట్‌గా ఉన్నారు కదా! నిర్లక్ష్యంగా ఉన్నారా ఏమిటి? అందరూ అలర్ట్‌గా ఉన్నారా? సదా అలర్ట్‌గా ఉన్నారా? సంగమయుగంలో తండ్రి లభించారు, సర్వం లభించేసింది. మరి అలర్ట్‌గానే ఉంటారు కదా! ఎవరికైతే చాలా ప్రాప్తులు లభిస్తూ ఉంటాయో వారు ఎంత అలర్ట్‌గా ఉంటారు! లౌకిక బిజినెస్ మ్యాన్‌కి తన బిజినెస్‌లో ప్రాప్తులు లభిస్తూ ఉంటే నిర్లక్ష్యంగా ఉంటారా లేక అలర్ట్‌గా ఉంటారా? మరి మీకు ఒక్క సెకనులో ఎంత లభిస్తోంది! అలాంటప్పుడు నిర్లక్ష్యంగా ఎలా అవుతారు? తండ్రి సర్వ శక్తులను ఇచ్చేశారు. సర్వ శక్తులు తోడుగా ఉన్నప్పుడు అలసత్వం రానే రాదు. సదా తెలివైనవారుగా, సదా అప్రమత్తంగా గా ఉండండి!
యూ.కే. కి బాప్‌దాదా ఓ.కే. (O.K.) అని అంటారు కదా. మరి ఎవరైతే ఓ.కే. గా ఉన్నారో వారు అలర్ట్‌గా ఉన్నప్పుడే కదా ఓ.కే. అయ్యేది! ఫౌండేషన్ పవర్‌ఫుల్‌గా ఉంది, అందుకే ఏవైతే కొమ్మలు-రెమ్మలు వచ్చాయో అవి కూడా శక్తిశాలిగా ఉన్నాయి. విశేషంగా బాప్‌దాదా, బ్రహ్మాబాబా తమ హృదయపూర్వకంగా లండన్ యొక్క మొదటి ఫౌండేషన్ వేశారు. బ్రహ్మాబాబాకి విశేష గారాల పిల్లలు. కాబట్టి మీరు ప్రత్యక్ష ఫలానికి సదా అధికారి ఆత్మలు. కర్మ చేయడానికి ముందే ఫలం తయారయ్యే ఉంది. అలాగే అనిపిస్తోంది కదా! లేక శ్రమగా అనిపిస్తోందా? ఆడుతూ-పాడుతూ ఫలాన్ని తింటూ ఉంటారు. అయినా డబల్ విదేశీయులకు ఫలాలు (పండ్లు) బాగుంటాయి కదా! బాప్‌దాదా కూడా యూ.కే. అనగా సదా ఓ.కే. గా ఉండే పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. మీ ఈ టైటిల్ సదా గుర్తుంచుకోండి - ఓ.కే. ! ఇది ఎంత గొప్ప టైటిల్! మీరందరూ సదా ఓ.కే. గా ఉండేవారు మరియు ఇతరులను కూడా తమ ముఖంతో, వాణితో, వృత్తితో ఓ.కే. గా చేసేవారు. ఇదే సేవ చేయాలి కదా! మంచిది! సేవా ఆసక్తి కూడా బాగుంది. ఎవరైతే ఎక్కడి నుండి వచ్చారో కానీ అందరూ తీవ్ర పురుషార్థీలు మరియు ఎగిరే కళ గలవారు. అందరికంటే ఎక్కువ సంతోషంగా ఎవరుంటారు? నషాతో ‘నేనే’ అని చెప్పండి. సంతోషం తప్ప ఇంకేముంది! ‘సంతోషం’ అనేది బ్రాహ్మణ జీవితం యొక్క ఆహారం. ఆహారం లేకుండా ఎలా నడుస్తారు? నడుస్తున్నారు అంటే ఆహారం ఉంది కాబట్టే నడుస్తున్నారు కదా! స్థానాలు కూడా పెరుగుతున్నాయి. చూడండి, మొదట్లో మూడు అడుగుల భూమి తీసుకోవడం పెద్ద విషయంగా అనిపించేది, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తోంది? సహజంగా అనిపిస్తోంది కదా! మరి లండన్ అద్భుతం చేసింది కదా! (ఇప్పుడు 50 ఎకరాల భూమి లభించింది). ధైర్యం కల్పించేవారు కూడా మంచివారే మరియు ధైర్యం ఉంచేవారు కూడా మంచివారే. చూడండి, మీ అందరి వేలు (సహకారం) లేకపోతే ఎలా జరిగేది! కాబట్టి యూ.కే. వారందరూ లక్కీ (అదృష్టవంతులు) మరియు వేలు ఇవ్వడంలో ధైర్యశాలురు.
గ్రూప్ నం. 2
తమ సర్వ బాధ్యతలను తండ్రికి ఇచ్చి నిశ్చింత చక్రవర్తులుగా అవ్వండి
సదా మిమ్మల్ని మీరు నిశ్చింత చక్రవర్తులుగా అనుభవం చేసుకుంటున్నారా? లేక కొద్దికొద్దిగా చింత ఉందా? ఎందుకంటే తండ్రి మీ బాధ్యతను తీసుకున్నప్పుడు, ఇక బాధ్యత యొక్క చింత ఎందుకు? ఇప్పుడు తండ్రితో పాటు నడుస్తూ ఉండాలనే బాధ్యత మాత్రమే ఉంది. అది కూడా తండ్రి తోడు తోడుగా ఉన్నారు, ఒంటరిగా కాదు. మరి ఇంకేం చింత ఉంది? రేపు ఏమవుతుందనే చింత ఉందా? జాబ్ చింత ఉందా? ప్రపంచంలో ఏమవుతుందనే చింత ఉందా? ఎందుకంటే, మన కోసం ఏమి జరిగినా మంచిదే జరుగుతుంది అని తెలుసు కదా! నిశ్చయం ఉంది కదా! పక్కా నిశ్చయమా లేక ఎప్పుడైనా కదులుతోందా? ఎక్కడైతే నిశ్చయం పక్కాగా ఉంటుందో, అక్కడ నిశ్చయంతో పాటు విజయం కూడా నిశ్చితం! విజయం లభించే ఉంది అనే నిశ్చయం కూడా ఉంది కదా! లేక ఎప్పుడైనా అవుతుందో లేదో, ఏమో అని ఆలోచిస్తారా? ఎందుకంటే కల్పకల్పపు విజయులు మీరు, సదా ఉంటారు కూడా. కల్పం క్రితం నాటి మీ స్మృతిచిహ్నాన్ని ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు. మేము కల్పకల్పపు విజయులము అనే ఇంతటి నిశ్చయం ఉంది కదా! ఇంతటి నిశ్చయం ఉందా? కల్పం క్రితం కూడా మీరేనా లేక వేరేవారా? కాబట్టి సదా ఇదే గుర్తుంచుకోండి - మేము నిశ్చయబుద్ధి గల విజయి రత్నములము. బాప్‌దాదా కూడా స్మృతి చేసేంతటి రత్నాలు మీరు. ఈ సంతోషం ఉంది కదా? చాలా ఆనందంలో ఉంటున్నారు కదా! ఈ అలౌకిక దివ్య శ్రేష్ఠ జన్మకు మరియు మీ మధుబన్ ఇంటికి చేరుకున్నందుకు అభినందనలు!
గ్రూప్ నం. 3
తండ్రి మరియు మీరు – ఎంతగా కంబైండ్‌గా ఉండాలంటే ఎవ్వరూ మిమ్మల్ని వేరు చేయలేకపోవాలి
అందరూ తమను తమను సదా తండ్రి మరియు నేను కంబైండ్‌గా ఉన్నాము - అని అనుభవం చేసుకుంటున్నారా? ఎవరైతే కంబైండ్‌గా ఉంటారో వారిని ఎప్పుడూ, ఎవ్వరూ వేరు చేయలేరు. మీరు అనేకసార్లు కంబైండ్‌గా ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు మరియు మున్ముందు కూడా సదా ఉంటారు. ఇది పక్కానా? కాబట్టి ఇంత పక్కాగా కంబైండ్‌గా ఉండండి. సదా ఈ స్మృతి ఉంచుకోండి - కంబైండ్‌గా ఉండేవాళ్ళము, కంబైండ్‌గా ఉన్నాము మరియు కంబైండ్‌గా ఉంటాము! అనేకసార్లు ఉన్న కంబైండ్ స్వరూపాన్ని వేరు చేసే శక్తి ఎవరికీ లేదు. మరి ప్రేమకు గుర్తు ఏమిటి? (కంబైండ్‌గా ఉండడం). ఎందుకంటే శరీరంతో అయితే విధిలేక ఎక్కడో ఒకచోట వేరుగా ఉండాల్సి వస్తుంది. ప్రేమ ఉన్నప్పటికీ విధిలేక ఎక్కడో ఒకచోట వేరుగా ఉండాల్సి వస్తుంది. కానీ ఇక్కడ శరీరానికి సంబంధించిన విషయమే లేదు. ఒక్క సెకనులో ఎక్కడి నుండి ఎక్కడికైనా చేరుకోవచ్చు! ఆత్మ మరియు పరమాత్మ తోడు ఉంది. పరమాత్మ అయితే ఎక్కడైనా తోడు నిలుస్తారు మరియు ప్రతి ఒక్కరితో కంబైండ్ రూపంలో ప్రీతి రీతిని నిలబెట్టుకునేవారై ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఏమంటారు - నా బాబా అని అంటారా లేక నీ బాబా అని అంటారా? ప్రతి ఒక్కరూ నా బాబా అనే అంటారు! మరి నా అని ఎందుకు అంటున్నారు? అధికారం ఉంది కాబట్టే అంటారు. ప్రేమ కూడా ఉంది మరియు అధికారం కూడా ఉంది. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో అక్కడ అధికారం కూడా ఉంటుంది. అధికారం యొక్క నషా ఉంది కదా. ఎంతటి గొప్ప అధికారం లభించింది! ఇంతటి గొప్ప అధికారం సత్యయుగంలో కూడా లభించదు! ఏ జన్మలోనూ పరమాత్మ-అధికారం లభించదు. ప్రాప్తి ఇక్కడే ఉంది. ప్రారబ్ధం సత్యయుగంలో ఉంది, కానీ ప్రాప్తి సమయం ఇప్పుడు. మరి ఏ సమయంలో ప్రాప్తి లభిస్తుందో ఆ సమయంలో ఎంత సంతోషం ఉంటుంది! ప్రాప్తించిన తర్వాత అది సాధారణ విషయమైపోతుంది. కానీ ప్రాప్తి లభిస్తున్నప్పుడు, ఆ సమయం యొక్క నషా మరియు సంతోషం అలౌకికంగా ఉంటాయి! మరి ఎంత సంతోషం మరియు నషా ఉన్నాయి! ఎందుకంటే ఇచ్చేవారు కూడా అనంతమైనవారు, కాబట్టి దాత కూడా అనంతమైనవారు మరియు లభించేది కూడా అనంతం. మరి మీరు హద్దుకా లేక బేహద్దుకు యజమానులా? మూడూ లోకాలను తమవిగా చేసేసుకున్నారు. మూలవతనం, సూక్ష్మవతనం మన ఇల్లు మరియు స్థూలవతనంలో అయితే మన రాజ్యం రానే వస్తోంది. మూడు లోకాలకూ అధికారులుగా అయిపోయారు! మరి ఏమంటారు - అధికారి ఆత్మలు. ఏమైనా అప్రాప్తి ఉందా? మరి ఏ పాట పాడుతుంటారు? (ఏది పొందాల్సి ఉందో అది పొందేసాము). పొందాల్సింది పొందేసాము, ఇప్పుడు ఇక పొందాల్సింది ఏమీ మిగలలేదు. మరి ఈ పాట పాడుతున్నారా? లేక ఏమైనా అప్రాప్తి ఉందా - డబ్బు కావాలా, ఇల్లు కావాలా! నాయకుడి కుర్చీ కావాలా? ఏమీ వద్దు. ఎందుకంటే కుర్చీ ఉన్నా ఒక్క జన్మకు కూడా నమ్మకం లేదు, మరి మీకు ఎంత గ్యారెంటీ ఉంది? 21 జన్మాల గ్యారెంటీ ఉంది. గ్యారెంటీ కార్డును మాయ ఏమైనా దొంగిలిస్తోందా ఏమిటి? ఇక్కడ పాస్‌పోర్ట్ పోగొట్టుకుంటే ఎంత కష్టమవుతుంది! మరి గ్యారెంటీ కార్డును మాయ తీసుకోదు కదా? దాగుడుమూతలు ఆడుతుంటుంది. అప్పుడు మీరు ఏమి చేస్తారు? ఎలాంటి శక్తిశాలిగా అవ్వండి అంటే మాయకు ధైర్యమే ఉండకూడదు.
గ్రూప్ నం. 4
ప్రతి కర్మను త్రికాలదర్శిగా అయి చేయండి
అందరూ తమను తమను సింహాసనాధికారి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఇప్పుడు సింహాసనం లభించిందా లేక భవిష్యత్తులో లభించాలా, ఏమంటారు? అందరూ సింహాసనంపై కూర్చుంటారా? (దిల్-తఖ్త్ చాలా పెద్దది). హృదయ సింహాసనం పెద్దదే, కానీ సత్యయుగం నాటి సింహాసనంపై ఒకే సమయంలో ఎంతమంది కూర్చుంటారు? సింహాసనంపై ఎవరైనా ఒకరు కూర్చున్నా సింహాసనాధికారి రాయల్ ఫ్యామిలీలోకైతే వస్తారు కదా. సింహాసనంపై అందరూ కలిసి కూర్చోలేరు కదా! ఈ సమయంలో అందరూ సింహాసనాధికారులే. అందుకే ఈ జన్మకు మహత్వముంది. ఎంతమంది అనుకుంటే అంతమంది, ఎవరనుకుంటే వారు హృదయ సింహాసననాధికారిగా కావచ్చు. ఈ సమయంలో ఇంకేమైనా సింహాసనముందా? ఏది అది? (అకాల్‌తఖ్త్). మీ అవినాశి ఆత్మ యొక్క సింహాసనమే ఈ భృకుటి (కనుబొమ్మల మధ్య స్థానం). కాబట్టి భృకుటి సింహాసనాధికారులు మరియు హృదయ సింహాసనాధికారులు కూడా. డబల్ సింహాసనముంది కదా! నేను ఆత్మను భృకుటి అకాల్ సింహాసనాధికారిని అనే నషా ఉందా! సింహాసనాధికారి ఆత్మకు స్వయంపై రాజ్యం ఉంటుంది, అందుకే స్వరాజ్య అధికారులు. నేను స్వరాజ్య అధికారిని అనే ఈ స్మృతి సహజంగానే తండ్రి ద్వారా సర్వ ప్రాప్తుల అనుభవం చేయిస్తుంది. కాబట్టి మూడు సింహాసనాల నాలెడ్జ్ ఉంది. నాలెడ్జ్‌ఫుల్ కదా! పవర్ఫుల్ కూడానా లేక కేవలం నాలెడ్జ్‌ఫుల్ మాత్రమేనా? ఎంత నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారో, అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నారా లేక నాలెడ్జ్‌ఫుల్ ఎక్కువ, పవర్ఫుల్ తక్కువా? నాలెడ్జ్‌లో ఎక్కువ తెలివైనవారా! నాలెడ్జ్‌ఫుల్ మరియు పవర్ఫుల్ రెండూ కలిసే ఉంటాయి. కాబట్టి మూడూ సింహాసనాల స్మృతి సదా ఉండాలి.
జ్ఞానంలో ‘మూడు’ కి మహత్వముంది. త్రికాలదర్శిగా కూడా అవుతారు. మూడూ కాలాలను తెలుసుకుంటారా లేక కేవలం వర్తమానాన్ని మాత్రమే తెలుసుకుంటారా? ఏ కర్మ చేసినా త్రికాలదర్శిగా అయి చేస్తారా లేక కేవలం ఏకదర్శిగా అయి చేస్తారా? ఏమిటి మీరు - ఏకదర్శినా లేక త్రికాలదర్శినా? మరి రేపు ఏమి జరగబోతోందో తెలుసా? రేపు ఏది జరుగుతుందో అది చాలా మంచిది జరుగుతుంది అని మాకు తెలుసు అని చెప్పండి. ఇది తెలుసు కదా! కాబట్టి త్రికాలదర్శులు అయ్యారు కదా. ఏదైతే జరిగిపోయిందో అదీ మంచిదే, ఏదైతే జరుగుతోందో అది ఇంకా మంచిది మరియు ఏదైతే జరగబోతోందో అది ఇంకా చాలా చాలా మంచిది! అన్నింటికంటే శ్రేష్ఠమైనదే జరగాల్సి ఉంది, చెడు జరగదు అనే నిశ్చయం ఉంది కదా. ఎందుకు? అందరికంటే శ్రేష్ఠమైన తండ్రి లభించారు, అందరికంటే శ్రేష్ఠంగా మీరు తయారయ్యారు, అందరికంటే శ్రేష్ఠమైన కర్మలు చేస్తున్నారు. కాబట్టి అంతా మంచిదే కదా. లేక కొద్దిగా చెడు, కొద్దిగా మంచి ఉందా? నేను శ్రేష్ఠ ఆత్మను అని తెలిసినప్పుడు, శ్రేష్ఠ ఆత్మ యొక్క సంకల్పం, మాట, కర్మ మంచిగానే ఉంటాయి కదా! కాబట్టి కళ్యాణకారీ తండ్రి లభించారు, కాబట్టి సదా కళ్యాణమే కళ్యాణం ఉంది అనే ఈ స్మృతిని సదా ఉంచుకోండి. తండ్రిని విశ్వ-కళ్యాణకారీ అని అంటారు, మరి మీరు మాస్టర్ విశ్వ కళ్యాణకారీ! కాబట్టి విశ్వ కళ్యాణం చేసేవారికి అకళ్యాణం అసలే జరగదు. అందుకే ప్రతి సమయం, ప్రతి కార్యం, ప్రతి సంకల్పం కళ్యాణకారీ అని నిశ్చయం ఉంచుకోండి. సంగమయుగానికి పేరు కూడా కళ్యాణకారీ యుగం అని ఇస్తారు. కాబట్టి అకళ్యాణం జరగదు. మరి ఏమి గుర్తుంచుకుంటారు? జరుగుతున్నది మంచిది మరియు జరగబోయేది చాలా చాలా మంచిది. కాబట్టి ఈ స్మృతి సదా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. మంచిది, అందరూ మూల మూలలా తండ్రి జెండాను ఎగురవేస్తున్నారు. అందరూ చాలా ధైర్యంతో, తీవ్ర పురుషార్థంతో ముందుకు వెళ్తున్నారు, సదా వెళ్తూనేనే ఉంటారు. ఫ్యూచర్ కనిపిస్తోంది కదా. ఎవరైనా, మీ భవిష్యత్తు ఏమిటి అని అడిగితే, మాకు తెలుసు, చాలా బాగుంటుంది అని చెప్పండి.
గ్రూప్ నం. 5
స్వరాజ్యం మన జన్మసిద్ధ అధికారము - ఈ నషాలో ఉండి ప్రతి కర్మను చేయండి
అందరూ మూడు బిందువుల రహస్యాన్ని తెలుసుకున్నారా? తెలుసుకున్నారా లేక ప్రాక్టికల్‌గా కూడా అనుభవజ్ఞులా? మూడు బిందువులను పెట్టడం వచ్చా? లేక ఎప్పుడైనా మరచిపోతుంటారా, ఎప్పుడైనా పెడుతుంటారా? ఎందుకంటే ఈ మూడింటినీ స్మృతిలో ఉంచుకోవడం అవసరం. ఒకవేళ తండ్రి అనే బిందువును స్మృతి చేస్తే మిగిలిన రెండూ బిందువులు సహజంగానే స్మృతిలోకి వచ్చేస్తాయి. మరి తండ్రిని స్మృతి చేయడం సహజమా లేక కష్టమా? సహజమైతే సదా ఎందుకు ఉండట్లేదు? మాయ పవర్‌ఫుల్లా లేక మాస్టర్ సర్వ శక్తిమాన్ పవర్‌ఫుల్లా? మాస్టర్ అయితే ఇంకా తేజస్సుగా ఉంటారు. మరి మాయ పవర్‌ఫుల్‌గా ఎలా అయిపోతోంది? (స్వయం బలహీనత కారణంగా). బలహీనత ఎప్పటి వరకు ఉండాలి? మరి మరుసటి సంవత్సరం కూడా ఇలాగే అనరు కదా? మాయ ఎంత శక్తిశాలిగా ఉన్నప్పటికీ, సర్వ శక్తిమాన్ తండ్రి కంటే శక్తిశాలి అయితే ఎవ్వరూ లేరు. కాబట్టి ‘మేము మాస్టర్లము’ అనే విషయం మరచిపోతున్నారు. నేను ఫలానా అనే విషయాన్ని ఎప్పుడైనా మరచిపోతారా? శరీరాన్ని మరచిపోరు కానీ మిమ్మల్ని మీరు మరచిపోతున్నారు! ఇది వండర్ (ఆశ్చర్యం) కాదా! మరి మీరు ఆశ్చర్యపోతున్నారా? ఈ ఆశ్చర్యపోవడం చేయకండి. సదా తండ్రి మరియు మీరు తోడుగా ఉన్నారు, కంబైండ్‌గా ఉన్నారు, మరి ఎలా మరచిపోగలరు. తండ్రి నుండి వేరుగా ఉంటున్నారా ఏమిటి? కాబట్టి ‘మరచిపోము, మరచిపోబోము’ అని మాత్రమే చెప్పండి. తండ్రిపై ప్రేమ ఉంది కదా. మరి అందరికంటే ప్రియమైనవారిని మరచిపోగలరా? మరచిపోవాలని అనుకున్నా మరచిపోలేరు. తండ్రియే ప్రపంచం అని అనుభవం చేసుకున్నప్పుడు, ప్రపంచం తప్ప ఇంకేమైనా ఉందా? మరి ఎందుకు మరచిపోతున్నారు? ఆటలు ఆడుతున్నారా? మరచిపోలేము అని చెప్పండి. "సమస్త కల్పంలో తండ్రి ఇప్పుడే లభించారు, మళ్ళీ లభించరు" అని ఆలోచించండి. గోల్డెన్ ఏజ్ (సత్యయుగం) లో కూడా తండ్రి ఉండరు. బ్రహ్మాబాబా తోడుగా ఉంటారు. శివబాబా ఇప్పుడు లభిస్తున్నారు, మరి ఎలా మరచిపోతారు? కాబట్టి ఇప్పుడు ఏమి చెప్తారు - మరచిపోవడం కష్టమా లేక స్మృతి చేయడం కష్టమా? (ఎవరైతే కంబైండ్‌గా ఉన్నారో వారిని వేరు చేయడం కష్టం).
మాస్టర్ సర్వ శక్తిమంతులుగా అయ్యి ప్రతి శక్తిని కార్యంలో ఉపయోగించండి. లభించిన సర్వ శక్తులు సమయానికి యూజ్ (ఉపయోగించడం) చేయడానికే ఉన్నాయి. సమయానికి ఏ వస్తువు పనికి రాకపోతే ఇక ఆ వస్తువు యొక్క మహత్వమేముంది! సమయానికి యూజ్ చేస్తూ-చేస్తూ అభ్యాసకులుగా అయిపోతారు. యజమానిగా అయి శక్తులకు ఆర్డర్ ఇవ్వండి. యజమానిగా అయి ఆర్డర్ ఇస్తే శక్తులు వింటాయి కూడా. ఒకవేళ బలహీనంగా అయి ఆర్డర్ ఇస్తే వినవు. శక్తులు మీ ఆర్డర్‌ను వినడానికి సదా సిద్ధంగా ఉన్నాయి, కేవలం యజమానితనాన్ని మరచిపోకండి. బాప్‌దాదా పిల్లలందరినీ యజమానులుగా చేస్తారు, బలహీనులుగా చేయరు. అందరూ రాజయోగులు, బలహీన యోగులైతే లేరు కదా. రాజు బలహీనంగా ఉంటాడా ఏమిటి? రాజయోగులు. ప్రతి బిడ్డ రాజాయే, ఎవ్వరూ ప్రజలు కారు అనేదే తండ్రికి ఉన్న సంతోషం. సమస్త కల్పంలో ఇంతమంది పిల్లలు రాజులుగా ఉన్నవారు ఎవ్వరూ ఉండరు! కాబట్టి అందరూ రాజులే. స్వరాజ్య అధికారులుగా అయిపోయారు. కాబట్టి, మేమందరం స్వరాజ్య అధికారులము అనే ఈ సంతోషం మరియు నషాని ఉంచుకోండి. ఎవరైనా స్వరాజ్యం లభించిందా? అని అడిగితే ఏమి చెప్తారు? స్వరాజ్యం మా జన్మసిద్ధ హక్కు అని చెప్పండి. స్వరాజ్యం బర్త్-రైట్ అనే నషాని ఉంచుకోండి. బర్త్-రైట్ను ఎవ్వరూ లాక్కోలేరు. ఇప్పుడు వచ్చినవారందరూ వచ్చే సంవత్సరానికి మూడు రెట్లు ఎక్కువ సంఖ్యను పెంచండి. ఎవరు పెద్ద మాల తయారుచేసి తీసుకువస్తారో చూద్దాం. సమస్త ప్రపంచ ఆత్మలు సుఖశాంతుల భిక్ష అడగడానికి మీ ముందుకు రావలసి ఉంది. దాత యొక్క పిల్లలైన మీరు మాస్టర్ దాతగా అయి అందరినీ ధనవంతులుగా చేస్తారు. ఎందుకంటే ఒక్క తండ్రి వద్దకు తప్ప ఇంకెక్కడికి వెళ్తారు? కాబట్టి మీ సర్వ ఖజానాలతో భండారాలను నిండుగా చేసుకుంటూ ఉండండి - ఎవరొచ్చినా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, నిండుగా అయి వెళ్ళాలి. ఈ దృశ్యాన్ని మున్ముందు అనుభవం చేసుకుంటారు.
వీడ్కోలు సమయంలో అందరూ బాప్‌దాదాకు అభినందనలు తెలిపారు మరియు పాట పాడారు. రెస్పాండ్ ఇస్తూ బాప్‌దాదా ఇలా అన్నారు -
అందరూ సంతుష్టమయ్యారా! మంచిది, సదా సంతుష్టంగా ఉన్నవారు చప్పట్లు కొట్టండి. (అందరూ ఎంతో ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు). తండ్రికి ప్రతి బిడ్డ అతి-అతి ప్రియమైనవారు. ఈ సీజన్ నిర్విఘ్నంగా మరియు ఉత్సాహభరితమైన ఉత్సవ సంపన్నంగా పూర్తయింది. ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నారు? చూడండి, శివరాత్రి జరుపుకున్నారు, హోలీ జరుపుకున్నారు మరియు 10 సంవత్సరాల వారికోసం ఎన్ని ఫంక్షన్లు జరుపుకున్నారు! మరి ఎన్ని ఉత్సవాలు జరుపుకున్నారు? మరి ఈ సీజన్ ఎలాంటిదిగా ఉంది? కాబట్టి సదా ఇలాంటి ఉత్సాహంలో ఉంటూ ఉత్సవం జరుపుకుంటూ ఎగురుతూ ఉండండి. ఉత్సవం బాగుంటుంది కదా. బాగుంటుందా? కాబట్టి సదా జరుపుకుంటూ ఉండండి. తండ్రి తోడుగా ఉంటే సమస్త పరివారం బీజంలో ఉన్నట్లే. మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఒంటరిగా అనుభవం చేసుకుంటే టికెట్ లేకుండా మధుబన్కు చేరుకోండి. ఏ ప్లేన్ లభిస్తుంది? దివ్యబుద్ధి అనే విమానంలో టికెట్ లేకుండా రావచ్చు. ఈ ప్లేన్ అందరి దగ్గరా ఉంది కదా! ఎవరెడీగా ఉంది. ఈ ప్లేన్కు ఎప్పుడూ స్ట్రైక్ (సమ్మె) కూడా జరగదు మరియు లేట్‌గా కూడా రాదు, టైమ్‌కి వస్తుంది. అచ్ఛా!
తండ్రి ఒంటరిగా ఏమీ చేయలేరు. మీ అందరికీ తండ్రితో పాటు ధన్యవాదాలు! అచ్ఛా!
*** ఓంశాంతి ***
