‘‘త్రికాలదర్శి స్థితి అనే శ్రేష్ఠ ఆసనం ద్వారా సదా విజయులుగా అవ్వండి’’
ఈరోజు త్రికాలదర్శి అయిన బాప్‌దాదా తమ సర్వ మాస్టర్ త్రికాలదర్శి పిల్లలను చూస్తున్నారు. బాప్‌దాదా త్రికాలదర్శిగా అయ్యే సాధనము పిల్లలు ప్రతి ఒక్కరికీ దివ్య బుద్ధి అనే వరదానముగా లేక బ్రాహ్మణ జన్మ యొక్క విశేష కానుకగా ఇచ్చారు ఎందుకంటే దివ్య బుద్ధి ద్వారానే తండ్రిని, స్వయాన్ని మరియు మూడు కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. దివ్య బుద్ధి మరియు స్మృతి ద్వారానే సర్వ శక్తులను ధారణ చేయగలుగుతారు. అందుకే మొదటి వరదానము దివ్య బుద్ధి. ఈ వరదానాన్ని బాప్‌దాదా పిల్లలందరికీ ఇచ్చారు. కానీ, ఈ వరదానాన్ని ప్రత్యక్ష జీవితంలో నంబరువారుగానే కార్యంలో ఉపయోగిస్తారు. దివ్య బుద్ధి త్రికాలదర్శి స్థితిని అనుభవం చేయిస్తుంది. నాలుగు సబ్జెక్టులనూ ధారణ చేసేందుకు ఆధారము దివ్య బుద్ధియే. నాలుగు సబ్జెక్టుల గురించి పిల్లలందరికీ బాగా తెలుసు, వర్ణన కూడా చేస్తారు కానీ తెలుసుకోవడము, వర్ణించడము అనేది అందరికీ వచ్చు. వారు కొత్తవారైనా లేక పాతవారైనా ఇందులో అందరూ తెలివైనవారే కానీ ధారణ చేయడంలో నంబరువారుగా అవుతారు. దివ్య బుద్ధి యొక్క విశేషతలు ఏమిటంటే - దివ్య బుద్ధి కల ఆత్మలు ఏ సంకల్పాన్ని అయినా, కర్మలోకి మరియు వాణిలోకి తీసుకొచ్చే సమయంలో ప్రతి మాట మరియు ప్రతి కర్మ యొక్క మూడు కాలాలను తెలుసుకొని, ఆ తర్వాతనే ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు. సాధారణ బుద్ధి కల ఆత్మలు చాలా వరకు వర్తమానాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు కానీ భవిష్యత్తును మరియు గతాన్ని స్పష్టముగా తెలుసుకోరు. దివ్య బుద్ధి కల ఆత్మలకు వర్తమానము ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంతే స్పష్టంగా గతము మరియు భవిష్యత్తు కూడా తెలుస్తుంది. మూడు కాలాలు ఒకే సమయంలో స్పష్టంగా అనుభవమవుతాయి. ఆ మాటకొస్తే - ఏది ఆలోచించినా, ఏది చేసినా, ఏది మాట్లాడినా, ముందూ వెనుకా ఆలోచించి అర్థం చేసుకొని చేయండి అని అందరూ అంటారు కూడా. కర్మ చేసే కన్నా ముందు దాని పరిణామాన్ని ఎదురుగా పెట్టుకోండి, ఆ పరిణామమే - భవిష్యత్తు. కావున నంబర్‌వన్ అయినది త్రికాలదర్శి బుద్ధి. త్రికాలదర్శి బుద్ధి ఎప్పుడూ అసఫలతను అనుభవం చేయదు. కానీ పిల్లలలో మూడు రకాల బుద్ధి కలవారు ఉన్నారు. మొదటి నంబరును వినిపించాము - సదా త్రికాలదర్శి బుద్ధి కలవారు, రెండవ నంబరువారు - అప్పుడప్పుడు త్రికాలదర్శి మరియు అప్పుడప్పుడు ఏక కాలదర్శి. మూడవ నంబరువారు నిర్లక్ష్య బుద్ధి కలవారు, వారు సదా వర్తమానాన్నే చూస్తారు, వారు సదా ఎలా ఆలోచిస్తారంటే - ఏదైతే ఇప్పుడు జరుగుతుందో లేక లభిస్తుందో లేక నడుస్తుందో అందులో బాగానే ఉన్నాము, భవిష్యత్తు ఎలా ఉంటుంది అన్నది ఎందుకు ఆలోచించాలి అని భావిస్తారు. కానీ, నిర్లక్ష్యపు బుద్ధి కలవారు ఆదిమధ్యాంతాలను ఆలోచించని కారణంగా సదా సఫలతను ప్రాప్తి చేసుకోవడంలో మోసపోతారు. కావున త్రికాలదర్శి బుద్ధి కలవారిగా అవ్వాలి.
త్రికాలదర్శి స్థితి అనేది ఎటువంటి శ్రేష్ఠ ఆసనమంటే - ఆ ఆసనము అనగా స్థితి ద్వారా స్వయం కూడా సదా విజయులుగా ఉంటారు మరియు ఇతరులను కూడా విజయులుగా తయారుచేసే శక్తి లేక సహయోగాన్ని ఇచ్చేవారిగా ఉంటారు. దివ్య బుద్ధి విశాల బుద్ధి. దివ్య బుద్ధి అనంతమైన బుద్ధి. కావున స్వయం యొక్క బుద్ధిని ఏ నంబరు బుద్ధిగా తయారుచేసుకున్నారు? అన్నది చెక్ చేసుకోండి. బాప్‌దాదా పిల్లల రిజల్టులో ఏమి చూసారంటే - జ్ఞానము, గుణాలు, శక్తుల యొక్క ఖజానాలు పిల్లలందరి వద్ద జమ అయ్యి ఉన్నాయి కానీ, జమ అయి ఉన్నా కూడా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? ఖజానాలు జమా అయి లేనివారు ఒక్కరు కూడా కనిపించలేదు. అందరి వద్ద జమ అయ్యి ఉన్నాయి కదా! మరి నంబరువారుగా ఎందుకు ఉన్నారు? ఒకవేళ ఎవరినైనా ఇలా అడిగారనుకోండి - మీకు స్వయం యొక్క జ్ఞానము ఉందా, తండ్రి యొక్క జ్ఞానము ఉందా, చక్రము యొక్క జ్ఞానము ఉందా, కర్మల గతి యొక్క జ్ఞానము ఉందా? అందరి వద్ద సర్వశక్తులు ఉన్నాయా? లేక కొన్ని ఉండి, కొన్ని లేవా? జ్ఞానంలోనైతే, అందరూ అవును ఉంది అని అన్నారు, మరి శక్తులలో - అవును ఉన్నాయి అని ఎందుకు అనడం లేదు? అచ్ఛా, అన్ని గుణాలు ఉన్నాయా? సర్వ గుణాలు బుద్ధిలో ఉన్నాయా? బుద్ధిలో జ్ఞానం కూడా ఉంది, శక్తులు కూడా ఉన్నాయి అయినా నంబరువారుగా ఎందుకు ఉన్నారు? ఏం తేడా వస్తుంది? ఖజానాలను విధి పూర్వకంగా కార్యంలో ఉపయోగించడము రావడం లేదు. సమయం గడిచిపోయిన తర్వాత ఆలోచిస్తారు - ఇలా చేసి ఉంటే, ఈ విధి అనుసారంగా నడిచి ఉంటే సిద్ధి లభించి ఉండేది అని. కావున సమయాన్ని తెలుసుకోవడానికి మరియు సమయమనుసారంగా శక్తులను లేక గుణాలను లేక జ్ఞానాన్ని కార్యంలో వినియోగించడానికి దివ్య బుద్ధి యొక్క విశేషత అవసరము. జ్ఞానం యొక్క పాయింట్లు ఎంతో ఆలోచిస్తూ ఉంటారు, వినిపిస్తూ ఉంటారు కూడా, అలాగే పుస్తకాలలో కూడా నిండి ఉంటాయి, అందరి వద్ద ఎన్ని డైరీలు పోగయ్యి ఉంటాయి, ఎంతో స్టాక్ పోగయ్యింది కదా. బాబా విషయంలో - నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా నన్ను తెలుసుకునేవారు కోట్లాదిమందిలో ఏ ఒక్కరో ఉంటారు అని అంటారు కదా. వారి గురించి తెలియడము అందరికీ తెలుసు కానీ అండర్లైన్ చేయాల్సిన విషయము ఏమిటంటే - నేను ఎవరినో, ఎలా ఉన్నానో అలా యథార్థ రీతిగా తెలుసుకోవడంలో తేడా వచ్చేస్తుంది. అదే విధంగా ఎటువంటి సమయమో దానికి అనుకూలంగా ఏ జ్ఞానం యొక్క పాయింటు లేక గుణము లేక శక్తి అవసరమో, దానిని కార్యంలో వినియోగించడంలో తేడా వస్తుంది మరియు ఈ తేడా కారణంగానే నంబరు ఏర్పడుతుంది. కావున కారణము అర్థమైందా? ఒకటేమో, సమయమనుసారంగా విధిలో తేడా వచ్చేస్తుంది, రెండవది, ఏదైనా కర్మను లేక సంకల్పాన్ని త్రికాలదర్శిగా అయి చేయరు, అందుకే నంబరు ఏర్పడుతుంది. ఏదైనా సంకల్పం బుద్ధిలోకి వచ్చినప్పుడు ఆ సంకల్పము బీజము, వాచా మరియు కర్మణా అనేవి ఆ బీజము యొక్క విస్తారము. ఒకవేళ సంకల్పాన్ని అనగా బీజాన్ని త్రికాలదర్శి స్థితిలో స్థితులై చెక్ చేసుకున్నట్లయితే, శక్తిశాలిగా చేసుకున్నట్లయితే వాణి మరియు కర్మలో స్వతహాగా, సహజంగా సఫలత ఉండనే ఉంటుంది. ఒకవేళ సంకల్పాన్ని చెక్ చేసుకోకపోతే అనగా బీజం శక్తిశాలిగా లేకపోతే, వాణి మరియు కర్మలో కూడా సిద్ధి యొక్క శక్తి ఉండదు. అందరి లక్ష్యము సిద్ధి స్వరూపులుగా అవ్వాలనే కదా, కావున సదా సిద్ధి స్వరూపులుగా అయ్యేందుకు ఏదైతే విధిని వినిపించామో, దానిని చెక్ చేసుకోండి. మధ్యమధ్యలో బుద్ధి నిర్లక్ష్యంగా అయిపోతుంది, అందుకే అప్పుడప్పుడు సిద్ధిని అనుభవం చేస్తారు, అప్పుడప్పుడు శ్రమను అనుభవం చేస్తారు.
బాప్‌దాదాకు పిల్లలందరిపైనా ప్రేమ ఉంది అనడానికి గుర్తు ఏమిటంటే - వారు పిల్లలందరూ సదా సహజంగా సిద్ధి స్వరూపులుగా అవ్వాలని కోరుకుంటారు. మీ జడమైన చిత్రాల ద్వారా భక్త ఆత్మలు సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు, మీరు చైతన్యంలో సిద్ధి స్వరూపులుగా అయ్యారు కావుననే జడమైన చిత్రాల ద్వారా కూడా ఇతర ఆత్మలు సిద్ధిని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. త్రికాలదర్శి స్థితిలో స్థితులై ఉన్నవారికి ఆ త్రికాలదర్శి స్థితి అనేది సమర్థ స్థితి. ఇటువంటి సమర్థ స్థితి కలవారు వ్యర్థాన్ని ఎంత సహజంగా సమాప్తం చేస్తారంటే ఇక స్వప్నమాత్రముగా కూడా వ్యర్థము సమాప్తమైపోతుంది. ఒకవేళ త్రికాలదర్శి బుద్ధి ద్వారా కర్మ చేయకపోతే, ఆ వ్యర్థము యొక్క భారము పదే-పదే ఉన్నతమైన నంబరులో అధికారులుగా అవ్వనివ్వదు. కావున దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని సదా అన్ని వేళలా కార్యంలో ఉపయోగించండి.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా సూచనను ఇచ్చారు - మీరు జ్ఞానీ-యోగీ ఆత్మలుగా అయితే అయ్యారు కానీ ఇక జ్ఞానము మరియు యోగం యొక్క శక్తిని ప్రయోగంలోకి తీసుకొచ్చే ప్రయోగశాలీ ఆత్మలుగా అవ్వండి. ఏ విధంగానైతే సైన్స్ శక్తి యొక్క ప్రయోగము కనిపిస్తుంది కదా, కానీ ఆ సైన్స్ శక్తి యొక్క ప్రయోగానికి కూడా మూలాధారం ఏమిటి? ఈరోజుల్లో సైన్స్ ఏయే ప్రయోగాలనైతే చేసి సాధనాలను అందించిందో, ఆ సాధనాలన్నింటికీ ఆధారం ఏమిటి? సైన్స్ ప్రయోగాలకు ఆధారమేమిటి? చాలా వరకు లైట్ (విద్యుత్తు) యే ఆధారము. లైట్ ద్వారానే ప్రయోగాలు జరుగుతాయి. ఒకవేళ కంప్యూటర్ పని చేసినా అది దేని ఆధారంగా పని చేస్తుంది? కంప్యూటర్ మైట్ కానీ దానికి ఆధారం లైట్ (విద్యుత్తు) కదా. మరి మీ సైలెన్స్ శక్తికి కూడా ఆధారం ఏమిటి? లైట్ కదా. ఆ ప్రకృతి యొక్క లైట్ ద్వారా ఒక్క లైట్ అనేక రకాల ప్రయోగాలను ప్రత్యక్షంగా చేసి చూపిస్తున్నప్పుడు, మీది అవినాశీ పరమాత్మ లైట్, ఆత్మిక లైట్ మరియు దానితో పాటు ప్రాక్టికల్ స్థితి లైట్, కావున దాని ద్వారా ఏ ప్రయోగమైనా చేయగలరు! మీ వద్ద ఉన్న స్థితి కూడా లైట్ మరియు మీ మూల స్వరూపం కూడా లైట్. ఎప్పుడైనా ఏదైనా ప్రయోగము చేయాలనుకున్నప్పుడు మొదట మీ మూల ఆధారాన్ని చెక్ చేసుకోండి. ఏ విధంగానైతే ఏదైనా సైన్స్ సాధనాన్ని ఉపయోగించినప్పుడు లైట్ (విద్యుత్తు) ఉందా లేదా అని మొదట చెక్ చేస్తారు కదా, అదే విధంగా ఎప్పుడైతే యోగాన్ని, శక్తులను, గుణాలను ప్రయోగం చేస్తారో అప్పుడు మూల ఆధారమైన ఆత్మిక శక్తి, పరమాత్మ శక్తి మరియు లైట్ (తేలిక) స్థితి ఉన్నాయా అని మొదట చెక్ చేసుకోండి. ఒకవేళ స్థితి మరియు స్వరూపము డబల్ లైట్‌గా ఉన్నట్లయితే ప్రయోగం యొక్క సఫలతను చాలా సహజంగా పొందగలరు. మరియు అన్నింటికన్నా ముందు ఈ అభ్యాసాన్ని శక్తిశాలిగా చేసుకునేందుకు మొదట మీపై మీరు ప్రయోగం చేసి చూడండి. ప్రతి నెలకు లేక ప్రతి 15 రోజులకు ఏదో ఒక విశేష గుణాన్ని లేక ఏదో ఒక విశేష శక్తిని స్వయం పట్ల ప్రయోగం చేసి చూడండి ఎందుకంటే సంగఠనలో లేక సంబంధ-సంపర్కంలో పరీక్షలైతే వస్తూనే ఉంటాయి, కావున మొదట మీపై మీరు ప్రయోగం చేసి చెక్ చేసుకోండి - ఏదైనా పరీక్ష వచ్చినా సరే, ఏ శక్తి లేక గుణం యొక్క ప్రయోగము చేయాలి అన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారో అందులో ఎంతవరకు సఫలత లభించింది? మరియు ఎంత సమయంలో సఫలత లభించింది? ఏ విధంగా సైన్స్ యొక్క ప్రయోగము రోజు-రోజుకూ కొద్ది సమయంలోనే ప్రత్యక్ష రూపాన్ని అనుభవం చేయించడంలో ముందుకు వెళ్తుంది కావున సమయం కూడా తగ్గిపోతూ ఉంటుంది. కొద్ది సమయంలో ఎక్కువ సఫలత - ఇది సైన్స్ వారి లక్ష్యము కూడా. అదే విధంగా ఏ లక్ష్యము పెట్టుకున్నా అందులో సమయాన్ని కూడా చెక్ చేసుకోండి మరియు సఫలతను కూడా చెక్ చేసుకోండి. ఎప్పుడైతే స్వయం పట్ల చేసే ప్రయోగములో సఫలత పొందుతారో, అప్పుడు ఇతర ఆత్మల పట్ల ప్రయోగం చేయడం సహజమవుతుంది మరియు ఎప్పుడైతే స్వయం పట్ల సఫలతను అనుభవం చేసుకుంటారో అప్పుడు మీ హృదయంలో ఇతరులకూ ప్రయోగం చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. ఇతర ఆత్మల సంబంధ-సంపర్కంలో ఉన్నప్పుడు స్వయం యొక్క ప్రయోగం ద్వారా ఆ ఆత్మలపై కూడా మీ ప్రయోగం యొక్క ప్రభావము స్వతహాగానే పడుతూ ఉంటుంది. ఒక ఉదాహరణ తీసుకోండి - నేను సహన శక్తిని ప్రయోగించాలి, అప్పుడు స్వయముపై సహన శక్తి యొక్క ప్రయోగాన్ని చేస్తారు కావున ఇతర ఆత్మలలో మీ సహన శక్తిని చలింపజేసేందుకు ఎవరైతే నిమిత్తులై ఉన్నారో వారు కూడా రక్షించబడతారు కదా, వారు కూడా దీని నుండి పక్కకు వచ్చేస్తారు కదా. ఏ విధంగా మీరు చిన్న-చిన్న గ్రూపులలో ఉంటారో, సెంటర్లలో చిన్న-చిన్న గ్రూపులే ఉంటాయి కదా, కావున మొదట స్వయంపై ప్రయత్నించి చూడండి, ఆ తర్వాత మీ చిన్న-చిన్న గ్రూపులలో ప్రయత్నించి చూడండి! సంగఠిత రూపంలో ఏదైనా గుణాన్ని లేక శక్తిని ప్రయోగించే ప్రోగ్రామ్ తయారుచేయండి. దాని ద్వారా ఏమవుతుంది? సంగఠన శక్తితో ఆ గుణము లేక శక్తి యొక్క వాయుమండలము తయారవుతుంది, వైబ్రేషన్ వ్యాపిస్తుంది మరియు ఆ వాయుమండలము లేక వైబ్రేషన్ యొక్క ప్రభావము అనేక ఆత్మలపై తప్పకుండా పడుతుంది. కావున ఇటువంటి ప్రయోగశాలీ ఆత్మలుగా అవ్వండి. మొదట స్వయములో సంతుష్టతను అనుభవము చేయండి, అప్పుడు ఇతరులకు సహజమవుతుంది ఎందుకంటే ఆ విధి వస్తుంది. ఏ విధంగానైతే సైన్స్ యొక్క ఏ సాధనాన్ని అయినా మొదట శ్యాంపుల్ రూపంలో ప్రయోగిస్తారు, ఆ తర్వాత విశాల రూపంలో ప్రయోగిస్తారు, అలా మీరు మొదట స్వయాన్ని శ్యాంపుల్ రూపంలో ఉపయోగించండి. ఎంతగా ఈ ప్రయోగాన్ని పెంచే అభిరుచి పెరుగుతూ ఉంటుందో అంతగా మనస్సు, బుద్ధి ఇందులోనే బిజీగా ఉంటాయి. కావున చిన్న-చిన్న విషయాలలో మీరు ఎంత సమయాన్ని అయితే వినియోగిస్తారో, ఎన్ని శక్తులనైతే వినియోగిస్తారో వాటి పొదుపు జరుగుతుంది. సహజంగానే అంతర్ముఖత యొక్క స్థితి తన వైపుకు ఆకర్షిస్తుంది ఎందుకంటే ఏ వస్తువు యొక్క ప్రయోగమైనా మరియు ఆ ప్రయోగం యొక్క సఫలత అయినా స్వతహాగానే ఇక అన్ని వైపుల నుండి పక్కకు తప్పించేస్తుంది. ఈ ప్రయోగాన్ని అయితే అందరూ చేయగలరు కదా, లేక కష్టమా? ఈ సంవత్సరం ప్రయోగశాలీ ఆత్మలుగా అవ్వండి. ఏం చేయాలో అర్థమైందా? అలా ప్రతి ఒక్కరూ స్వయం పట్ల ప్రయోగం చేసుకోవడంలో నిమగ్నమవ్వండి, అప్పుడు ఆ ప్రయోగశాలీ ఆత్మల సంగఠన ఎంత శక్తిశాలిగా అవుతుంది! ఆ సంగఠన యొక్క కిరణాలు అనగా వైబ్రేషన్స్ ఎన్నో కార్యాలను చేసి చూపిస్తాయి. ఇందులో కేవలం దృఢత కావాలి - ‘నేను చేయాల్సిందే’. ఇతరుల నిర్లక్ష్యం యొక్క ప్రభావము పడకూడదు. మీ దృఢత యొక్క ప్రభావము ఇతరులపై పడాలి ఎందుకంటే దృఢతా శక్తి శ్రేష్ఠమైనదా లేక నిర్లక్ష్యం యొక్క శక్తి శ్రేష్ఠమైనదా? ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ సఫలత తప్పకుండా ఉంటుంది అన్నది బాప్‌దాదా ఇచ్చిన వరదానము. మరి ఎలా తయారవుతారు? ప్రయోగశాలీ, త్రికాలదర్శి ఆసనధారులు. మరియు మూడవది ఏం చేస్తారు? ఎటువంటి సమయమో అటువంటి విధి ద్వారా సిద్ధి స్వరూపులుగా అవుతారు. కావున ఇది ఈ సంవత్సరం యొక్క హోమ్‌వర్క్. ఈ హోమ్‌వర్క్ స్వతహాగానే తండ్రికి సమీపంగా తీసుకువస్తుంది. ఏ విధంగానైతే బ్రహ్మా బాబాను చూసారు - వారు ఏ కర్మనైనా చేసేందుకు ముందు ఆదిమధ్యాంతాల గురించి ఆలోచించి, అర్థం చేసుకొని కర్మ చేసారు మరియు చేయించారు. ఎలా జరిగినా ఫరవాలేదు, ఏదో నడిపించేద్దాము అన్న నిర్లక్ష్యం లేదు. కావున బ్రహ్మా బాబాను ఫాలో చేయండి. ఫాలో చేయడం సహజమే కదా! కాపీ చేయాలి కదా! కాపీ చేసే తెలివైతే ఉంది కదా!
అచ్ఛా! ఈ గ్రూప్ ఛాన్స్ తీసుకునే గ్రూపే కదా. ఎక్స్ట్రా లాటరీ లభించింది. అకస్మాత్తుగా లాటరీ లభిస్తే దాని సంతోషం ఎక్కువగా ఉంటుంది. మరి ఇది లక్కీ గ్రూప్ కదా, ఛాన్స్ తీసుకునే లక్కీ గ్రూప్. ఇతరులేమో ఎప్పుడు వెళ్తామా అని ఆలోచిస్తూ ఉంటారు మరియు మీరు వచ్చి చేరుకున్నారు. ఇప్పుడు డబల్ విదేశీయుల టర్న్ ప్రారంభమవ్వనున్నది. భారతవాసులు తమ లాటరీని తీసుకున్నారు. నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలు రిట్రీట్ ప్రోగ్రామ్ ఏదైతే తయారుచేసారో అందులో బాగా కష్టపడ్డారు. విశేషమైన నిమిత్త ఆత్మలను సమీపంగా తీసుకొచ్చే విధి బాగుంది. మరియు ఎంతగా ధైర్యం పెట్టి ముందుకు వెళ్తున్నారో అంతగానే సఫలత ప్రతి సంవత్సరము శ్రేష్ఠాతి-శ్రేష్ఠంగా లభిస్తూ ఉంటుంది. ఇలా అనుభవమవుతుంది కదా! ఒకప్పుడు నిమిత్తులైన విశేష ఆత్మల యొక్క సంపర్కంలోకి రావడం కూడా కష్టమయ్యేది. కానీ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎంతగా ఆలోచిస్తారో అంతకన్నా ఎక్కువగానే సంపర్కంలోకి వస్తారు కదా! కావున ఇది ధైర్యం యొక్క ప్రత్యక్ష ఫలము. భారత్‌లో కూడా సంపర్కము పెరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు మీరు ఆహ్వానాన్ని ఇచ్చేందుకు శ్రమించేవారు కానీ ఇప్పుడు వారు స్వయమే మేము వస్తాము అని ఆఫర్ చేస్తున్నారు. తేడా ఉంది కదా! మేము వస్తాము అని వారు అంటారు కానీ సంఖ్య పూర్తి అయిపోయింది అని మీరంటారు. ఇది ‘పిల్లలు ధైర్యము చేస్తే తండ్రి సహాయము చేస్తారు’ అన్నదానికి ప్రత్యక్ష స్వరూపము. అచ్ఛా!
నలువైపులా ఉన్న మాస్టర్ త్రికాలదర్శి ఆత్మలకు, సదా సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని సమయమనుసారంగా ఖజానాలను కార్యంలో ఉపయోగించే దివ్య బుద్ధివాన్ ఆత్మలకు, సదా అంతర్ముఖత యొక్క ప్రయోగశాలలో ప్రయోగం చేసే ప్రయోగశాలీ ఆత్మలకు, సదా ధైర్యం ద్వారా తండ్రి సహాయాన్ని ప్రత్యక్షంగా అనుభవం చేసే ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- నిమిత్త ఆత్మలైన మీరు ఏ ప్రయోగశాలలో ఉంటారు? రోజంతా ఏ ప్రయోగశాల పని చేస్తూ ఉంటుంది? కొత్త-కొత్త ఇన్వెన్షన్లు చేస్తూ ఉంటారు కదా! కొత్త-కొత్త అనుభవాలు చేసుకుంటూ ఉంటారు మరియు కొత్త-కొత్త విధులు కూడా మీకు టచ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే ఎవరైతే నిమిత్తులుగా ఉంటారో వారికి విశేషంగా కొత్త-కొత్త విషయాలు టచ్ అయ్యే విశేష వరదానము ఉంది. కొద్ది సమయం గడిచినా ఆలోచనలు నడుస్తూ ఉంటాయి కదా, ఇప్పుడు ఇది జరగాలి, ఇప్పుడు ఇది జరగాలి, ఇప్పుడు ఇది అవ్వాలి అని టచింగ్ అవుతూ ఉంటుంది కదా. కావున నిమిత్త ఆత్మలు విశేషంగా ఉల్లాస-ఉత్సాహాలను పెంచే మరియు పరివర్తనా శక్తిని పెంచే ప్లాన్ చేసే అవసరముంది. ఇది చేయకుండా ఉండలేరు. బుద్ధి నడుస్తుంది కదా. చూస్తూ-చూస్తూ ఆశ్చర్యపోరు కానీ ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేందుకు ప్లానింగ్ బుద్ధి కలవారిగా అవుతారు. మాయ సంగఠనను కదిలించేందుకు కొత్త-కొత్త ప్లానులు తయారుచేస్తుంది, కొత్త-కొత్త విషయాలు వింటారు కదా కానీ మీరు అందరినీ ధైర్యము-ఉత్సాహాలలోకి తీసుకొచ్చేందుకు ప్లానులు తయారుచేస్తారు. ఎప్పుడైనా ఆశ్చర్యమనిపిస్తుందా? అనిపించదు కదా! మాయ కూడా పాత విధి ద్వారా తనవారిగా ఏమైనా చేసుకుంటుందా! అది కూడా కొత్తదనాన్ని తీసుకొస్తుంది కదా! అచ్ఛా!
అవ్యకత్ బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1 - అవినాశీ అధికారం నిశ్చితంగా ఉంది అనే స్మృతితో సదా నిశ్చింతగా ఉండండి, అన్ని భారాలను బాబాకు ఇచ్చేయండి
మీరందరూ మిమ్మల్ని బాబా వారసత్వానికి అధికారీ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? అధికారీ ఆత్మల గుర్తు ఏమిటి? అధికారం యొక్క నిశ్చయం మరియు నషా ఉంటుంది. ఇది అవినాశీ ఆత్మిక నషా. మరి అధికారంలో ఏమేమి లభించాయో వాటి లిస్ట్ తీస్తే ఎంత ఉంటుంది? పెద్ద లిస్ట్ ఉందా లేక చిన్న లిస్ట్ ఉందా? కనుక సదా మీ భిన్న-భిన్న ప్రాప్త అధికారాలను ఎదురుగా ఉంచుకోండి. ఇమర్జ్ రూపంలోకి తీసుకురండి. ఎంత ఇమర్జ్ అవుతుందో, స్మృతిలో ఉంటుందో, అంత స్మృతి యొక్క సమర్థత వస్తుంది. ఒక్కోసారి ఒక అధికారాన్ని గుర్తు చేసుకోండి, ఒక్కోసారి మరొక అధికారాన్ని గుర్తు చేసుకోండి. వెరైటీ ఉంది కదా. ఈ రోజుల్లో మనుష్యులకు కూడా వెరైటీలో ఆసక్తి ఉంటుంది కదా. మరి మీ దగ్గర ఎంత వెరైటీ ఉంది? చాలా ఉంది కదా! ఒక్కోసారి వరదానాన్ని ఇమర్జ్ చేసుకోండి, ఒక్కోసారి వారసత్వంలో లభించిన ఖజానాలను ఇమర్జ్ చేసుకోండి, అప్పుడు స్థితి ఎలా ఉంటుంది? ఎందుకంటే ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి ఉంటుంది. స్మృతి అధికారం గురించి ఉంటే స్థితి ఎలా ఉంటుంది? సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు కదా. ఈ రోజుల్లో ప్రపంచంలో ఎవరికైనా సాంప్రదాయిక అధికారం లభించినా ఎంత శ్రమ చేసి అధికారాన్ని తీసుకుంటారు, అది సదాకాలికమైనది కాదని తెలిసినా ఎంతో చేస్తారు. మరియు మీకు శ్రమ లేకుండానే అధికారం లభించింది. శ్రమ చేయవలసి వచ్చిందా? పిల్లలుగా అవ్వడం అనగా అధికారాన్ని తీసుకోవడం. నావారు అని భావించారు మరియు అధికారం లభించింది. వాహ్ నా అధికారం! వాహ్ నేను శ్రేష్ఠ అధికారీ ఆత్మను! హద్దు అధికారంలో కాదు, అనంతమైన అధికారంలో. హద్దు అధికారం వెనుక ఎవరైనా వెళ్తే అనంతమైన అధికారాన్ని పోగొట్టుకుంటారు. కనుక సదా అనంతమైన అధికారం యొక్క సంతోషంలో ఉండండి. సంతోషంగా ఉంటున్నారు కదా? మీలాంటి సంతోషం ఎవరి దగ్గర ఉంది? నిశ్చింతగా అయ్యారు, ఏదైనా చింత ఉందా? ఏమో, ఏమవుతుందో - ఈ చింత ఉందా? నిశ్చింతగా ఉన్నారు. ఎందుకంటే అవినాశీ అధికారం నిశ్చితంగానే ఉంది. కనుక ఎక్కడ నిశ్చితంగా ఉంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు. ఏదైనా విషయం నిశ్చితంగా లేకపోతే దాని గురించి చింత ఉంటుంది, ఏమో ఏమవుతుందో! మాతలందరూ నిశ్చింతగా ఉన్నారా లేక ఏదో ఒక చింత ఉంటుందా? అన్నీ బాబాకు అప్పగించేస్తే నిశ్చింతగా ఉంటారు. మీపై భారాన్ని పెట్టుకుంటే నిశ్చింతగా ఉండరు, అప్పుడు చింత తప్పకుండా ఉంటుంది. నా బాధ్యత, నా కర్తవ్యం, నాది అనే భావం రావడం అనగా చింత. కర్తవ్యం లేక బాధ్యత ఉంటే అది అనంతమైనది, హద్దుకు సంబంధించినది కాదు. విశ్వానికి సంబంధించినది. ఇద్దరు-నలుగురికి సంబంధించినది కాదు. ఇప్పుడు మిమ్మల్ని మీరు జగత్మాతగా భావిస్తున్నారా లేక నలుగురు-ఐదుగురు పిల్లలు, మనవలు-మనవరాళ్లకు మాతలుగా భావిస్తున్నారా? ఏ ఆత్మను చూసినా ఏమనిపిస్తుంది? ఇది మన కుటుంబమా? లేక కేవలం లౌకికమైన వారినే మీ కుటుంబంగా భావిస్తున్నారా? అనంతమైన కుటుంబానికి చెందినవారు. బాబాకు సహయోగీ ఆత్మలు. అనంతమైన నషా ఉంది కదా, లేక ఒక్కోసారి హద్దు, ఒక్కోసారి అనంతమా? బాబా ఎలా ఉంటే పిల్లలు కూడా అలాగే ఉంటారు. బాబా అనంతమైన బాబా కనుక పిల్లలు కూడా అనంతమైనవారే కదా. మరి ఏమి గుర్తుంచుకుంటారు? మేము అధికారీ ఆత్మలము. కేవలం వారసత్వానికే కాదు, వరదానాలకు కూడా - డబల్ అధికారం ఉంది. వరదానాలు కూడా చూడండి ఎన్ని లభిస్తున్నాయి! రోజూ వరదానం లభిస్తుంది కదా! కనుక వరదానాలతో కూడా జోలె నింపుకుంటారు మరియు వారసత్వంతో కూడా జోలె నింపుకుంటారు. అందుకే సదా నిండుగా ఉంటారు, ఖాళీగా కాదు. సదా ఈ స్మృతిని ఉంచుకోండి - అనేకసార్లు అధికారీ ఆత్మలుగా అయ్యాము.
అందరూ బాగున్నారా? అలజడి అయితే లేదు కదా? ఒక్కోసారి వ్యర్థమైన అలజడి, ఒక్కోసారి ఏదైనా పరిస్థితి యొక్క, ప్రకృతి యొక్క అలజడి కలుగుతుందా? విశ్వాన్ని నిశ్చలంగా, అచంచలంగా చేసేవారు స్వయంగా ఎలా అలజడిలోకి వస్తారు? పరిస్థితి ఎంత పెద్దదైనా కానీ స్వ-స్థితి ముందు ఎంత పెద్ద పరిస్థితి అయినా ఏమిటి? ఏమీ కాదు. మహారథిని ఎవరూ కదిలించలేరు. కనుక స్వయంగా సదా నిశ్చలంగా అయ్యి ఇతరులను కూడా నిశ్చలంగా చేయండి. అలజడి యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. బాబాపై ప్రేమ ఉంది కదా, ప్రేమకు గుర్తు సమానంగా అవ్వడం.
గ్రూప్ నం. 2 - మీ శ్రేష్ఠ టైటిల్స్ యొక్క స్మృతితో ఆత్మిక నషాను అనుభవం చేసుకోండి, వాహ్-వాహ్ అనే పాటను సదా పాడుతూ ఉండండి
సదా, ఏమి నుండి ఏమిగా అయ్యాము - ఈ స్మృతి ఉంటుందా? నిన్న గవ్వ సమానంగా ఉండేవారు మరియు ఈ రోజు వజ్రం సమానంగా అయ్యారు. మరి ఎక్కడ గవ్వ, ఎక్కడ వజ్రం - ఎంత తేడా ఉంది? తేడా తెలిసినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది! బాబా ఏమి నుండి ఏమిగా చేసారు! నిన్న అంధకారంలో ఉండేవారు మరియు ఈ రోజు వెలుగులోకి వచ్చారు. మరి అంధకారంలో ఏమి లభించింది? ఎదురుదెబ్బలు తగిలాయి కదా. అంధకారంలో ఎదురుదెబ్బలు తింటారు మరియు వెలుగులో ఎంజాయ్ చేస్తారు. కనుక నిన్న ఏమిటి మరియు ఈ రోజు ఏమిటి - ఇది సదా ఎదురుగా స్పష్టంగా ఉండాలి. మరియు బాప్‌దాదా సదా చెబుతారు - డబల్ హీరోగా అయ్యారు. ఒకటి వజ్ర సమానమైన జీవితం మరియు రెండవది ఈ డ్రామాలో హీరో యాక్టర్‌గా అయ్యారు. కనుక డబల్ హీరోగా అయ్యారు కదా. మొత్తం డ్రామాలో చూస్తే హీరో పాత్రధారులు ఎవరు? మేమే అని అంటారు కదా. కనుక డబల్ హీరోలు. మరి డబల్ సంతోషం ఉంది కదా. అలాగే చూడండి, మీకు బాబా ద్వారా ఎన్ని టైటిల్స్ లభిస్తున్నాయి? టైటిల్స్ లిస్ట్ ఉంది కదా. రోజూ మురళిలో ఏదో ఒక విశేష టైటిల్ లభిస్తుంది. మరి టైటిల్‌కు ఎంత నషా ఉంటుంది! ఎవరికైనా ప్రధానమంత్రి లేక ప్రెసిడెంట్ టైటిల్ ఇస్తే ఎంత నషా ఉంటుంది! మరి మీకు టైటిల్ ఇచ్చేవారు ఎవరు? భాగ్యవిధాత అయిన బాబా స్వయంగా పిల్లలకు టైటిల్ ఇస్తారు. కనుక బాబా అవినాశీ అయినట్లే టైటిల్ కూడా అవినాశీ. వినాశీ టైటిల్ యొక్క నషా వినాశీగా, అల్పకాలికంగా ఉంటుంది. మరియు ఈ ఆత్మిక టైటిల్ యొక్క నషా అవినాశీ. ఎవరికి అవినాశీ నషా ఉంటుందో వారి హృదయంలో సదా ఈ పాట మ్రోగుతూ ఉంటుంది - వాహ్ నా శ్రేష్ఠ భాగ్యం! ఆటోమేటిక్‌గా మ్రోగుతుంది, మ్రోగించాల్సిన అవసరం లేదు. మిగిలిన ఏ మెషినరీ అయినా ఈ రోజు బాగుంటుంది, రేపు పాడైపోతుంది కానీ ఈ హృదయపు పాట సదా మ్రోగుతూనే ఉంటుంది. మరి ఈ పాట పాడడం వచ్చా? ఏ పాట? వాహ్ నా శ్రేష్ఠ భాగ్యం! దేహం యొక్క ఆక్యుపేషన్ (వృత్తి) స్వతహాగానే గుర్తుంటుంది. ఒక్కసారి నేను ఇది అని తెలిసిన తరువాత మర్చిపోరు. కనుక ‘నేను శ్రేష్ఠ ఆత్మను’ అనే ఈ అవినాశీ ఆక్యుపేషన్ కూడా మర్చిపోకూడదు. ఇది ప్రతి జన్మ యొక్క ఆక్యుపేషన్. అది ఒక జన్మ యొక్క ఆక్యుపేషన్. శరీరం మారినా కానీ ఆత్మ అవినాశీ కదా. ఏ జన్మలో అయినా ఆత్మ అమరమైనదే, అవినాశీ. కానీ ఈ సమయంలో మీరు విశేష ఆత్మలు. ఆత్మలుగా అయితే ఉండనే ఉన్నారు కానీ విశేష ఆత్మలు. మీ విశేషతలు సదా గుర్తుంటున్నాయా?
కనుక డబల్ హీరోలు, సాధారణ పాత్రధారులు కాదు. వజ్ర సమానంగా అయ్యారా లేక ఇప్పటికీ కొంత రాయి, కొంత వజ్రంలా ఉన్నారా? ఎక్కడ వజ్రం యొక్క విలువ, ఎక్కడ రాయి యొక్క విలువ! విస్మృతి ఉంటే రాయి, స్మృతి ఉంటే వజ్రం. ఇప్పుడు విస్మృతి సమయం సమాప్తమైంది. నేను ఎవరిని, ఎలా ఉన్నాను - దానిని మర్చిపోలేను. కనుక విస్మృతి ప్రపంచాన్ని వదిలి వచ్చారు. ఇప్పుడు సంగమయుగం స్మృతి యొక్క యుగం. కలియుగం విస్మృతి యొక్క యుగం. మరి మీరందరూ సంగమయుగ నివాసులా లేక ఒక్కోసారి కలియుగంలో చక్కర్లు కొట్టడానికి వెళ్తారా? కొద్దిగా కూడా బుద్ధి అటువైపు వెళ్తే చక్కర్లలో చిక్కుకుంటారు. విస్మృతి ప్రపంచం నుండి బయటకు వచ్చారు. కలియుగంలో చాలా మెరుపు ఉంది! మరి ఆ మెరుపును ఎందుకు వదిలి వచ్చారు? మెరుపు తప్పకుండా ఉంది కానీ మోసం చేసే మెరుపు. బయటకు మెరుపుగా కనిపిస్తుంది మరియు లోపల మోసం చేసేది. అనుభవం ఏమిటి? మోసం చేసే మెరుపు కదా. అందరూ బాగా అనుభవం చేసేసారు కదా? లేక ఇంకా ఏదైనా అనుభవం చేయడం మిగిలి ఉందా? మోసపోతూ-మోసపోతూ అలసిపోయారు. ఆర్టిఫిషియల్ ప్రపంచం కదా. కానీ ఆర్టిఫిషియల్ మెరుపు ఎక్కువగా ఉంటుంది. మరి ఒక్కోసారి ఆర్టిఫిషియల్ మెరుపు ఆకర్షించడం లేదు కదా? ఒక్కసారి మోసపోయి చూసిన తరువాత మళ్ళీ మోసపోతారా? అందుకే రక్షించబడ్డారు.
మాతలు మీ శ్రేష్ఠ భాగ్యాన్ని చూసి సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు కదా. సంగమంలో శక్తులకు మొదటి అవకాశం ఉంది. ద్వాపర-కలియుగంలో పాండవులకు ఛాన్స్ లభిస్తుంది మరియు సంగమంలో శక్తులకు ఛాన్స్ లభిస్తుంది. ఇప్పుడు చూడండి, బాబా మాతలకు ఛాన్స్ ఇచ్చారు కనుక ప్రపంచంలో కూడా ఈ రోజుల్లో మాతలకు ఛాన్స్ ఇవ్వాలనే ఆలోచన వచ్చింది. ధర్మనేతలలో చూడండి, ఇంతకుముందు మాతలు ఎవరూ ఉండేవారు కాదు కానీ ఇప్పుడు మహామండలేశ్వరీలు కూడా ఉన్నారు. ఇప్పుడు మాతలు కూడా గురువులుగా అవుతున్నారు. కనుక బాబా ఛాన్స్ ఇచ్చినప్పుడు ప్రజలు కూడా ఛాన్స్ ఇవ్వడం మొదలుపెట్టారు. మరి మాతలకు డబల్ సంతోషం ఉంది కదా - బాబా మమ్మల్ని ఉన్నతంగా చేసారు!
గ్రూప్ నం. 3 - సర్వశ్రేష్ఠ శక్తి శాంతి శక్తి - దీనితో అసంభవాన్ని కూడా సంభవంగా చేయగలరు
ఒకే బలం, ఒకే నమ్మకం - ఇటువంటి శ్రేష్ఠ ఆత్మలము అని అనుభవం చేసుకుంటున్నారా? ఒకే బలం, ఒకే నమ్మకమా లేక అనేక బలాలు, అనేక నమ్మకాలా? ఒకే బలం ఏది? సైలెన్స్ బలం, యోగ బలం. ఒక్క బాబాపై నమ్మకం అనగా నిశ్చయం ఉండడం ద్వారా ఈ సైలెన్స్ బలం, యోగ బలం స్వతహాగానే అనుభవం అవుతుంది. కనుక సైలెన్స్ శక్తి కలవారము, యోగ బలం కలవారము - ఈ స్మృతి ఉంటుందా? శాంతి శక్తి సర్వశ్రేష్ఠ శక్తి. ఎందుకంటే మిగిలిన అన్ని శక్తులు ఎక్కడి నుండి వస్తాయి? శాంతి శక్తి నుండే కదా! ఈ రోజు సైన్స్ శక్తి యొక్క ప్రభావం ఉంది కానీ అది కూడా ఎక్కడి నుండి వచ్చింది? శాంతి శక్తి నుండే వచ్చింది కదా? కనుక శాంతి శక్తి ద్వారా ఏది కావాలంటే అది చేయగలరు. అసంభవాన్ని కూడా సంభవంగా చేయగలరు. ప్రపంచం వారు ఈరోజు అసంభవం అని అనేది మీకు సంభవమే కదా! కనుక సంభవం కావడం వలన సహజంగా అనిపిస్తుంది. శ్రమ అనిపించదు. ప్రపంచం వారు ఇప్పటికీ పరమాత్మను పొందడం చాలా కష్టం అని ఆలోచిస్తూ ఉంటారు. మరి మీరు ఏమంటారు? పొందేసాము. వారు పరమాత్మ చాలా ఉన్నతమైనవారు, వేల సూర్యుల కంటే కూడా తేజోమయమైనవారు అని అంటారు మరియు మీరు ఆయన బాబా అని అంటారు. స్నేహ సాగరుడు. కాల్చేవారు కాదు. వేల సూర్యుల కంటే తేజోమయంగా ఉంటే కాల్చేస్తారు కదా మరియు మీరు స్నేహ సాగరుని అనుభవంలో ఉంటారు. మరి ఎంత తేడా వచ్చింది. ప్రపంచం వారు ‘కాదు’ అనేది మీరు ‘అవును’ అంటారు. తేడా వచ్చింది కదా. నిన్న మీరు కూడా నాస్తికులుగా ఉండేవారు మరియు ఈరోజు ఆస్తికులుగా అయ్యారు. నిన్న మాయతో ఓడిపోయేవారు మరియు ఈరోజు మాయాజీత్గా అయ్యారు. తేడా ఉంది కదా. నిన్న పంజరంలోని మైనాలుగా ఉన్న మాతలు ఈరోజు ఎగిరే కళలో ఎగిరే పక్షులుగా అయ్యారు. మరి ఎగిరే కళలో ఉన్నారా లేక ఒక్కోసారి తిరిగి పంజరంలోకి వెళ్తారా? ఒక్కోసారి పంజరంలోకి వెళ్ళాలని మనసు అనిపిస్తుందా? బంధనం పంజరం మరియు నిర్బంధనంగా ఉండడం ఎగరడం. మనస్సుకు బంధనం ఉండకూడదు. ఎవరికైనా తనువు యొక్క బంధనం ఉన్నా కానీ మనస్సు ఎగిరే పక్షి. మరి మనస్సుకు ఏదైనా బంధనం ఉందా లేక కొద్దికొద్దిగా వస్తుందా? మన్మనాభవగా అయినవారు మనస్సు యొక్క బంధనం నుండి సదాకాలం కోసం ముక్తులయ్యారు. అచ్ఛా, ప్రవృత్తిని సంభాళించే బంధనం ఉందా? ట్రస్టీగా అయ్యి సంభాళిస్తున్నారా? ట్రస్టీ అయితే నిర్బంధన మరియు గృహస్థీ అయితే బంధనం. గృహస్థీ అనగా భారం మరియు భారం ఉన్నవారు ఎప్పుడూ ఎగరలేరు. మరి అన్ని భారాలను బాబాకు ఇచ్చేసారా లేక ఒకరిద్దరు మనవలను కొద్దిగా ఉంచుకున్నారా? పాండవులు కొద్దికొద్దిగా జేబు ఖర్చు ఉంచుకున్నారా? కొద్దికొద్దిగా ఆవేశం ఉంచుకున్నారు, క్రోధం ఉంచుకున్నారు, ఇదే జేబు ఖర్చా? నాది అనేదాన్ని నీదిగా చేసేసారా? చేసారా లేక కొద్దికొద్దిగా నాది ఉందా? మోసం చేస్తారు కదా - నాది నాదే మరియు నీది కూడా నాదే. ఇటువంటి మోసం చేయడం లేదు కదా? అర్థకల్పం చాలా మోసం చేసారు కదా. చెప్పేది నీది అని, భావించేది నాది అని అయితే మోసమే కదా. ఇప్పుడు మోసం చేసేవారు కాదు కానీ పిల్లలుగా అయ్యారు. ఎగిరే కళ ఎంత ప్రియమైనది, సెకండులో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. ఎగిరే కళలో ఉన్నవారు సెకండులో తమ స్వీట్ హోమ్‌కు చేరుకోగలరు. దీనినే యోగబలం, శాంతి శక్తి అని అంటాము.
మాతలకు పేరే శివశక్తులు అని ఇచ్చాము. కనుక శక్తి అనే పేరు గుర్తుకు రాగానే స్వతహాగానే శక్తి వస్తుంది. మేము ఇంటి మాతలము అంటే బలహీనులు. శక్తులము అంటే శక్తిశాలులు. ఒకే బలం, ఒకే నమ్మకం అనగా సదా శక్తిశాలిగా ఉండడం. పాండవులను కూడా సదా శక్తిశాలులుగా చూపిస్తారు. కల్ప-కల్పం యొక్క శక్తులు మరియు పాండవ సైన్యానికి చెందినవారము - ఈ స్మృతి స్పష్టంగా ఉంది కదా. కనుక మేమే ఉండేవారము, మేమే ఉన్నాము మరియు సదా మేమే అవుతాము. ఈ స్మృతి స్పష్టంగా ఉందా లేక ఆలోచిస్తే గుర్తుకొస్తుందా? లేక విన్నాము కనుక అర్థం చేసుకుంటున్నారా? కాదు. హృదయంలో అది ఇమర్జ్ అవ్వాలి. బుద్ధిలో స్పష్టంగా ఉండాలి - అవును, మేమే ఉండేవారము, ఉన్నాము మరియు అవుతాము. ఎక్కడ ఒకే బలం, ఒకే నమ్మకం ఉంటుందో అక్కడ ఎవరూ కదిలించలేరు. అంతటి మాయావీ శక్తి ఏదైనా ఉందా? ఒకే బలం, ఒకే నమ్మకం కలిగిన ఆత్మల ముందు మాయ మూర్ఛితమైపోతుంది, సరెండర్ అయిపోతుంది. సరెండర్ అయిపోయిందా లేక ఒక్కోసారి మేల్కొంటుందా? కనుక సదా మాయాజీత్, ఒక్కోసారి ఓటమి ఒక్కోసారి విజయం పొందేవారు కాదు. సదా విజయులు. కనుక విజయం మా జన్మసిద్ధ అధికారం అనే నషా సదా ఉండాలి. ఇది ఆత్మిక నషా కదా. ఈ జన్మసిద్ధ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరు.
గ్రూప్ నం. 4 - మధుబన్ నివాసులుగా అవ్వడం అనగా అనంతమైన సేవా స్టేజ్‌పైకి రావడం
మధుబన్ నివాసులపై అందరికీ ప్రేమ ఉంది కదా. అందరికీ మధుబన్ నివాసులపై ప్రేమ ఎందుకు ఉంది? కారణం ఏమిటి? మధుబన్ నివాసులపై అందరికీ ప్రేమ ఉండటానికి కారణం మధుబన్ నివాసులు అనగా అందరికంటే గొప్ప సేవాధారులు. మధుబన్ నివాసులుగా ఉండడం అనగా సేవా స్టేజ్‌పైకి రావడం. ఎవరైనా మధుబన్కు వస్తే సేవ కోసం వచ్చారు కదా. బాప్‌దాదా కూడా తనకు అన్నింటికంటే గొప్ప టైటిల్ ‘విశ్వ సేవాధారి’ అనే ఇస్తారు. కనుక మధుబన్ నివాసులు అనగా బాబాపై ఎంత ప్రేమ ఉంటుందో సేవపై కూడా అంతే ప్రేమ. మధుబన్ నివాసులు ప్రతి సెకండు సేవా స్టేజ్‌పై ఉంటారు. నడుస్తూ-తిరుగుతూ కూడా సేవే చేస్తారు కదా! ఎగ్జాంపుల్ కదా! కనుక మధుబన్ నివాసులు ప్రతి ఆత్మను విశేష ఆత్మ రూపంలో చూస్తారు. మధుబన్ నివాసులు అనగా విశేష ఆత్మలు. సంకల్పంలో కూడా విశేషత, మాటలో కూడా విశేషత మరియు కర్మలో కూడా విశేషత. మధుబన్ నివాసీ ఆత్మలకు ఎంత మహత్వం ఉంది. ఇటువంటి స్మృతి ఉంటుందా? మధుబన్ను అందరూ ఫాలో చేస్తారు. మధుబన్ బాబాపై ప్రేమ ఉంది కనుక మధుబన్ నివాసులపై కూడా ప్రేమ ఉంది. మధుబన్ బాబాకు ఎటువంటి మహిమ ఉందో మధుబన్ నివాసులకు కూడా అటువంటి మహిమ ఉంది. ఎందుకంటే మధుబన్ బాబా యొక్క కర్మభూమి, చరిత్రభూమి మరియు తపస్యా భూమి. ఇటువంటి భూమి యొక్క అనుభవం అవుతుంది కదా? భూమి యొక్క వైబ్రేషన్, వాయుమండలం సహయోగం ఇస్తాయి. మధుబన్ నివాసులపై బాప్‌దాదా యొక్క విశేష బ్లెస్సింగ్ కూడా ఉంది. మరి మీ శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాక్టికల్‌గా అనుభవం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారా? అందరూ ఎగిరే కళలో ఉన్నారా లేక ఒక్కోసారి ఆగిపోయే కళ, ఒక్కోసారి ఎగిరే కళలో ఉన్నారా? బ్రహ్మాబాబా యొక్క ఏ విశేషతను గాయనం చేస్తారు? అలసటలేని సేవాధారి. కనుక పురుషార్థం యొక్క వేగంలో కూడా అలసటలేని వారు. అలసిపోయేవారు కాదు, ఇతరులను కూడా ఎగిరేలా చేసేవారు. బాధ్యత ఉంది కదా. ఎందుకంటే మధుబన్ వారిని అందరూ సహజంగా ఫాలో చేస్తారు.
మరి ఈ సంవత్సరంలో మీ తీవ్ర పురుషార్థానికి ఏదైనా విశేష ప్లాన్ తయారు చేసారా? ఎందుకంటే మధుబన్ పురుషార్థం యొక్క అల కూడా నలువైపులా వ్యాపిస్తుంది. మధుబన్ వారు భట్టీ చేస్తారు, తపస్యను పవర్‌ఫుల్‌గా చేస్తారు అంటే నలువైపులా ఆ వైబ్రేషన్ వెళ్తుంది. కనుక ఏదైనా కొత్త తీవ్రగతి ప్లాన్‌ను తయారు చేయండి. ఏదైనా పెద్ద స్థానాన్ని నిర్మించేటప్పుడు మొదట ఏమి చేస్తారు? జ్ఞాన సరోవర్ నిర్మించాల్సి వచ్చినప్పుడు మొదట మోడల్ తయారు చేసారు కదా. కనుక మధుబన్ నివాసులే మోడల్. మోడల్ ఎంత విలువైనదిగా ఉంటుందో ఒరిజినల్ భవనం కూడా అంతే విలువైనదిగా ఉంటుంది. నిమిత్తంగా మోడలే అవుతుంది కదా. ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేసారా? ఎందుకంటే మధుబన్ నివాసులు ఇన్వెంటర్స్ కదా. (మీరు ఇచ్చిన హోమ్‌వర్క్ చేస్తాము) అచ్ఛా, మధుబన్ నివాసులు మొదట మధుబన్ గ్రూప్‌లో ప్రయోగం చేసి అనుభవం వినిపిస్తే అందరిలో ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి. ఎవరిని చూసినా అందరిలో ఒకే దృఢ సంకల్పం ఉంటే సంగఠన బలం లభిస్తుంది కదా. మధుబన్ యొక్క ఈ విశేషతే అందరికీ ప్రియంగా అనిపిస్తుంది - ప్రతి ఆత్మ యొక్క ప్రతి కర్మ విశేషంగా ఉండాలి. సాధారణంగా కాదు. ఎందుకంటే ఇక్కడ సహయోగం చాలా ఉంది. ఒకటేమో అన్ని ఆత్మల శుభభావన యొక్క సహయోగం మధుబన్ నివాసులకు చాలా ఉంది. ఏదైనా విషయం ఉంటే అందరి భావన మొదట మధుబన్ వైపు వెళ్తుంది. వాయుమండలం, చదువు, బయట పొల్యూషన్ నుండి ఇక్కడ మధుబన్‌లో ఎంత సహాయం ఉంది. ప్రకృతి యొక్క పొల్యూషన్ కూడా లేదు. కనుక రిజల్ట్‌లో మధుబన్ నివాసులందరూ ఏ మాలలో వస్తారు? మొదటి మాలలోనా లేక రెండవ మాలలోనా? మొదటిదానిలో. అన్ని సీట్లు మధుబన్ వారే తీసుకుంటారా? అన్ని ఖజానాలతో నిండుగా ఉన్నారా? లేక ఏదైనా లోటు ఉందా? ఏదైనా సాల్వేషన్ (సౌకర్యం) కావాలా? లేక సదా తృప్త ఆత్మలా? జ్ఞాన ఖజానాలలో కూడా అందరూ నిండుగా, శక్తులలో కూడా నిండుగా, గుణాలలో కూడా నిండుగా ఉన్నారా? (హా జీ) గుణమూర్తిని చూడాలంటే ఎక్కడ చూడాలి? మధుబన్లోనా లేక ఇతర స్థానాలలోనా? అన్నింటిలో మధుబన్ నంబర్‌వన్. ఎవరిని ఎప్పుడు చూసినా, ఎక్కడ చూసినా గుణమూర్తి, శక్తిమూర్తి, జ్ఞానమూర్తి, సాధారణంగా కాదు. మధుబన్ అనగానే విశేషమైనది. మధుబన్ వారు నిశ్చింత చక్రవర్తులే కదా లేక ఏదైనా చింత ఉంటుందా? (సంపూర్ణంగా అవ్వాలనే చింత ఉంది) ఈ చింత గర్వంలోకి తీసుకొస్తుంది. ఇది చింత కాదు, గర్వం. అవ్వాల్సిందే. అచ్ఛా.
మధుబన్ నివాసుల తీవ్ర పురుషార్థం యొక్క స్లోగన్ ఏమిటి? (ఏ కర్మ మేము చేస్తామో, మమ్మల్ని చూసి ఇతరులు కూడా చేస్తారు) స్లోగన్ సరిగ్గా చెప్పారు. ఏ కర్మ చేసినా మొదట ఈ స్లోగన్ గుర్తుంచుకోండి - మేము ఏది చేస్తామో అదే అందరూ చేస్తారు. అప్పుడు స్వతహాగానే విశేష కర్మ జరుగుతుంది. అచ్ఛా, మిగిలిన వ్యవహారమంతా బాగానే నడుస్తోంది కదా. అందరి డిపార్ట్మెంట్లు బాగున్నాయా? అచ్ఛా!
స్వయం పట్ల ప్రయోగంలో సఫలమైతే ఇతర ఆత్మల పట్ల ప్రయోగం చేయడం సహజమైపోతుంది మరియు స్వయం పట్ల సఫలతను అనుభవం చేసినప్పుడు ఇతరుల పట్ల ప్రయోగం చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలు మీ హృదయంలో స్వతహాగానే పెరుగుతూ ఉంటాయి. ఇతర ఆత్మల సంబంధ-సంపర్కంలో స్వయం యొక్క ప్రయోగం ద్వారా ఆ ఆత్మలపై కూడా మీ ప్రయోగం యొక్క ప్రభావం స్వతహాగానే పడుతూ ఉంటుంది.
*** ఓంశాంతి ***
