‘‘స్వమానము యొక్క స్మృతి అనే స్విచ్‌ను ఆన్ చేయడము ద్వారా దేహ భానమనే అంధకారం యొక్క సమాప్తి”
ఈరోజు అకాల మూర్తి అయిన తండ్రి అకాల సింహాసనాధికారులు, విశ్వ కళ్యాణ కిరీటధారులు, మస్తకంలో మెరుస్తూ ఉండే బిందువు యొక్క తిలకధారులైన పిల్లలందరినీ చూస్తున్నారు. ప్రతి ఒక్కరు సింహాసనాధికారులు కూడా, కిరీటధారులు కూడా, తిలకం కూడా అందరిదీ మెరుస్తూ ఉంది. అందరి మస్తకం మధ్యలో ఆత్మ బిందువు సితార సమానంగా కనిపిస్తూ ఉంది. మీరందరూ కూడా తమ సింహాసనం, కిరీటం మరియు తిలకాన్ని చూస్తున్నారా. మొత్తం సభ బాప్‌దాదాకు కిరీటధారులుగా మరియు తిలకధారులుగా, సింహాసనాధికారులుగా కనిపిస్తూ ఉంది. ఈ అలౌకిక సభ, కలియుగీ రాజ్య సభ మరియు సత్యయుగీ రాజ్య సభ కన్నా ఎంత అతీతమైనది మరియు ఎంత ప్రియమైనది! కావున ఇటువంటి సభకు అధికారులైన ఆత్మలు ఎంత ప్రియమైనవారు! మీ అందరికీ కూడా మీ ఈ సింహాసనం, కిరీటం మరియు తిలకధారి స్వరూపం ప్రియమనిపిస్తుంది కదా! ఎప్పుడైతే అకాల సింహాసనాధికారి, అకాలమూర్తి, శ్రేష్ఠ ఆత్మ స్థితిలో స్థితులై సింహాసనంపై కూర్చుంటారో, ఈ స్థితి ఎంత శ్రేష్ఠమైనది! అందరి శ్రేష్ఠ స్థితి యొక్క మెరుపు ఈ ముఖాన్ని ఫరిశ్తాగా చేస్తుంది. సాధారణ ముఖము కాదు, ఫరిశ్తా ముఖము. మరి ఫరిశ్తా ముఖం కూడా ఎంత ప్రియమైనది! ఫరిశ్తా అందరికీ చాలా ప్రియమనిపిస్తారు ఎందుకంటే ఫరిశ్తా అనగా సర్వులకు చెందినవారిగా ఉంటారు, ఒకరిద్దరికి చెందినవారు కాదు. అనంతమైన దృష్టి, అనంతమైన వృత్తి, అనంతమైన స్థితి కలిగినవారు. ఫరిశ్తా అనగా సర్వాత్మల కోసం పరమాత్మ సందేశ వాహకులు. ఫరిశ్తా అనగా సదా ఎగిరే కళలో ఉండేవారు. ఫరిశ్తా అనగా సర్వుల యొక్క సంబంధాన్ని ఒక్క తండ్రితో జోడింపచేసేవారు. ఫరిశ్తా అనగా డబల్ లైట్. దేహము మరియు దేహ సంబంధాలకు అతీతంగా, తేలికగా ఉండేవారు. ఫరిశ్తా అనగా స్వయం యొక్క నడవడిక మరియు ముఖం ద్వారా సర్వులను తండ్రి సమానంగా తయారుచేసేవారు. ఫరిశ్తా అనగా సహజంగా మరియు స్వతహాగా అనాది మరియు ఆది సంస్కారాలను సదా ఇమర్జ్ స్వరూపంలో చూపించేవారు. ఫరిశ్తా అనగా నిమిత్త భావము, నిర్మాన స్వభావం మరియు సర్వుల పట్ల కళ్యాణం యొక్క శ్రేష్ఠ భావన కలిగినవారు. ఇటువంటి ఫరిశ్తాలే కదా? మేము కాకపోతే ఇంకెవరు అవుతారు అని నషాతో చెప్పండి. నషా ఉంది కదా! కావున బాప్‌దాదా ఇటువంటి ఫరిశ్తాల దర్బారును చూస్తున్నారు. కేవలం ఇదే స్వమానంలో స్థితులై ఉండడము ద్వారా దేహ భానం స్వతహాగానే సమాప్తమవుతుంది.
పిల్లలు దేహ భానం విడిచిపెట్టడానికి చాలా శ్రమ చేయడాన్ని తండ్రి చూస్తున్నారు. దేహ భానం యొక్క ఒక రూపాన్ని వదిలేస్తే రెండవది వచ్చేస్తుంది, మళ్ళీ రెండవది వదిలేస్తే మూడవది వచ్చేస్తుంది. కానీ విడిచిపెట్టడము సదా కష్టముగా ఉంటుంది మరియు ధారణ చేయడము సహజముగా ఉంటుంది. కనుక బాప్‌దాదా అంటారు, స్వమానంలో సదా ఉండండి. ఎక్కడ స్వమానం ఉంటుందో అక్కడ దేహ భానం రానే రాలేదు. కనుక వదలాలనే శ్రమ చేయకండి కానీ స్వమానంలో స్థితులయ్యే అటెన్షన్ పెట్టండి మరియు సంగమయుగంలో స్వయము తండ్రి ద్వారా ఎన్ని మంచి-మంచి స్వమానాలు ప్రాప్తించాయి. ప్రాప్తి చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రాప్తించి ఉన్నాయి. తమ స్వమానాల లిస్టు తీయండి. ఎంత పెద్ద లిస్ట్ ఉంది! మొత్తం కల్పములో ఏ ప్రసిద్ధ ఆత్మలకైనా ఎన్నో స్వమానాలు అనగా టైటిల్స్ ఉండవచ్చు, రాజకీయ వేత్తలు కావచ్చు, అభినేతలు కావచ్చు, ధర్మాత్మలు కావచ్చు, మహాన్ ఆత్మలు కావచ్చు, వారి టైటిళ్ళను ఒకవేళ లెక్కపెట్టినా కూడా మీ స్వమానాల లిస్టు కన్నా ఎక్కువ ఉండగలవా? మరియు రోజూ ఉదయాన్నే బాప్‌దాదా స్వమానం యొక్క స్మృతినిప్పిస్తారు, స్వమానంలో స్థితులయ్యేటట్లు చేస్తారు. రోజూ కూడా ఒక సరికొత్త స్వమానాన్ని స్మృతిలో ఉంచుకున్నట్లయితే ప్రకాశం ఎదురుగా అంధకారం పారిపోయినట్లుగా స్వమానం ముందు దేహ భానం పారిపోతుంది. సమయము పట్టదు, శ్రమ అనిపించదు. కావున పదే-పదే రకరకాల దేహ భానాలను సమాప్తం చేసే శ్రమ ఎందుకు చేస్తారు? స్వమానం యొక్క స్మృతి అనే స్విచ్‌ను ఆన్ చేయడము రావడము లేదా ఏమిటి? ఎంతటి గాఢమైన నల్లని మేఘాలైనా, సూర్యుడి ప్రకాశాన్ని దాచేసేవే కావచ్చు, కానీ మీ దగ్గర ఆటోమెటిక్ డైరెక్ట్ పరమాత్మ లైట్ యొక్క కనెక్షన్ ఉంది. డైరెక్ట్ లైన్ ఉంది కదా? లైన్ స్పష్టంగా ఉందా లేక లీకేజ్ ఉందా? కొంతమందికి లింక్ ఉంటుంది కానీ లీకేజ్ అయిపోతుంది. కావున డైరెక్ట్ లైన్ ఎంత శక్తివంతంగా ఉంటుంది! డైరెక్ట్ కనెక్షన్ ఉందా లేక ఇన్‌డైరెక్ట్‌గా ఉందా? అందరికీ డైరెక్ట్ లైన్ ఉంది కదా? అందరికీ డైరెక్ట్ లైన్ లభించిందా? అప్పుడిక ఒక మేఘం ఏమిటి, మేఘాలన్నీ వచ్చేసినా కానీ అంధకారమయంగా చేయగలవా? స్మృతి అనే స్విచ్‌ను డైరెక్ట్ లైన్‌తో ఆన్ చేసిన వెంటనే ఎంత లైట్ వచ్చేస్తుందంటే స్వయమైతే లైట్ లోనే ఉంటారు, అంతేకాక ఇతరుల కోసం కూడా లైట్ హౌస్‌గా అవుతారు. ఇలా జరుగుతుంది కదా? అనుభవీలే కదా? కానీ అప్పుడప్పుడు అనుభవాన్ని పక్కన పెట్టేస్తారు. ఆధారం లభించింది కానీ అప్పుడప్పుడు ఆధారానికి బదులుగా పక్కకు తప్పుకుంటారు. శ్రమ అనిపిస్తుందా? సదా అనిపించడము లేదు, అప్పుడప్పుడు అనిపిస్తుందా! స్విచ్ ఆన్ చేయడము మర్చిపోతున్నారా? వాస్తవానికి ఒకవేళ మాస్టర్ సర్వశక్తిమాన్ అనే ఒక్క స్వమానము గుర్తున్నా కూడా శ్రమ అనే విషయము ఏదీ ఉండనే ఉండదు. మార్గం శ్రమతో కూడినది కాదు కానీ హైవేకి బదులుగా సందులలోకి వెళ్ళిపోతున్నారు లేదా గమ్యం యొక్క గుర్తు కన్నా ఇంకా ముందుకు వెళ్ళిపోతున్నారు, కావున తిరిగి వచ్చే శ్రమ చేయవలసి వస్తుంది. బాప్‌దాదా సదా తమ స్నేహము మరియు సహయోగము అనే ఒడిలో కూర్చోబెట్టుకుని గమ్యానికి తీసుకువెళ్తున్నారు. ఒడిలో కూర్చుని గమ్యాన్ని చేరడానికి శ్రమ ఎందుకు అనిపిస్తుంది? స్నేహము మరియు సహయోగము అనే ఒడి నుండి బయటకు వచ్చి అప్పుడప్పుడు వేరే ఆకర్షణ లాగినట్లయితే తిరగడానికి బయటకు వెళ్ళిపోతారు. అలసిపోతారు కూడా, మళ్ళీ శ్రమను కూడా అనుభవం చేస్తారు. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు? శ్రమ సమాప్తము. ప్రేమలో, లవ్‌లో లీనమైపోండి, లవలీనమై ప్రతి కార్యం చేయండి. ఎవరైతే లీనమవుతారో, వారికి ఇంకేదీ కనిపించదు, ఆకర్షించదు. మరి లవ్‌లో ఉంటున్నారా. నాకు తండ్రిపై ప్రేమ లేదు, లవ్ లేదు అనేవారు ఎవరైనా ఉంటారా! అందరికీ లవ్ ఉంది కదా! కానీ అప్పుడప్పుడు లవ్‌లో ఉంటారు, అప్పుడప్పుడు లవ్‌లో లీనమైపోతారు. లేదంటే చూడండి, మనసు-బుద్ధి ద్వారా స్థితిలో తండ్రి సర్వ సంబంధాలతో తోడుగా ఉన్నారు. తోడుగా కూడా ఉన్నారు మరియు సేవలో తండ్రి ప్రతి సమయం సహచరునిగా ఉన్నారు. కావున స్థితిలో కూడా తోడుగా ఉన్నారు మరియు సేవలో సహచరునిగా ఉన్నారు. ఎక్కడైతే సదా తోడుగా కూడా ఉంటారో మరియు సహచరునిగా కూడా ఉంటారో, అక్కడ కష్టమేముంది! పరమ ఆత్మ మహిమయే ఉంది - కష్టాన్ని సహజం చేసేవారు అని. ఇటువంటి తండ్రి మీకు తోడుగా ఉన్నారు మరియు సహచరునిగా ఉన్నారు, మరి కష్టం ఉండగలదా? మరి ఎందుకు కష్టతరము చేస్తున్నారు?
సమయానుసారంగా తండ్రి స్వయంగా ప్రతి బిడ్డకు సర్వ సంబంధాలను ఆఫర్ చేస్తారు. ఎటువంటి సమయమో అటువంటి సంబంధంతో తోడుగా ఉండండి లేదా సహచరునిగా చేసుకోండి. కొన్ని సమయాలలోనైతే సంబంధంతో సహచరునిగా చేసుకుంటున్నారు మరియు కొన్ని సమయాలలో సహచరుడిని దూరంగా పెట్టేస్తున్నారు. మళ్ళీ, ఒంటరితనం అనుభవమవుతుందని అంటారు. నడుస్తూ-నడుస్తూ ఒంటరితనం అనిపిస్తుంది. ఒంటరితనం ఉండడము వలన ఏమవుతుంది? తమ శ్రేష్ఠ జీవితం సాధారణ జీవితంగా అనుభవమవుతుంది. అప్పుడు అంటారు, బోరింగ్ లైఫ్ అయిపోయింది, కొంచెం మార్పు కావాలి. ఒక వైపు, మేమైతే కంబైండుగా ఉన్నామని బాప్‌దాదాను సంతోషపెడతారు. కంబైండుగా ఉన్నవారు ఎప్పుడైనా ఒంటరిగా అవుతారా ఏమిటి? చాలా మంచి-మంచి మాటలు మాట్లాడుతారు -బాబా, మేమైతే ఉన్నదే కంబైండ్‌గా. మళ్ళీ 15-20 సంవత్సరాలు గడిచిన తర్వాత అంటారు, మార్పు కావాలి, ఒంటరిగా అయిపోయాము. మామూలుగా కూడా చూడండి, ప్రపంచంలో ఒకవేళ మార్పు కావాలనుకుంటే కొంతమంది సాగర తీరానికి వెళ్ళి నిద్రపోతారు, కొంతమంది మనోరంజనంలోకి వెళ్ళిపోతారు, డాన్స్ చేస్తారు, కొందరు పాటల యొక్క ఆనందంలో ఆనందాలు జరుపుకుంటారు, కొంతమంది కంపెనీ లేదా కంపానియన్ యొక్క తోడును తీసుకుంటారు. ఇవే చేస్తారు కదా! ఆట ఆడుతున్నారా? ఆటల ప్రపంచంలోకి, తోటలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ జ్ఞాన సాగరుని తీరం ఉంది అన్నది మర్చిపోతారు. ఒకవేళ సాగరం ఇష్టమనిపిస్తే సాగర తీరంలో కూర్చుండిపోండి. తండ్రి జ్ఞాన సాగరుడు కదా. తండ్రి కంపానియన్ కాదా ఏమిటి? వారితో ఆనందముగా అనిపించదా? బిందువుతో ఏం ఆనందం కలుగుతుంది అని భావిస్తున్నారా! మిమ్మల్ని అందరినీ సదా వినోదపర్చడము కోసమే బ్రహ్మా తండ్రి కూడా అవ్యక్తమయ్యారు. కానీ ఇక్కడైతే సదా కోసం సహచరుడు కావాలి కదా. ఎప్పుడైనా మీకు ఒంటరితనం అనుభవమైతే ఆ సమయంలో బిందువు రూపాన్ని గుర్తు చేయకండి. అది కష్టమవుతుంది, దానితో బోర్ అయిపోతారు. కానీ తమ బ్రాహ్మణ జీవితంలో భిన్న-భిన్న సమయాలలో కలిగిన రమణీకమైన అనుభవాల కథలను స్మృతిలోకి తెచ్చుకోండి. అనుభవాల కథల పుస్తకం అందరి దగ్గర ఉంది. ఎప్పుడైతే బోర్ అవుతారో, అప్పుడు నవల్స్ చదువుతారు కదా! కనుక మీరు మీ కథల పుస్తకాన్ని తెరవండి మరియు దానిని చదవడములో బిజీ అయిపోండి. తమ స్వమానాల లిస్టును ఎదురుగా తెచ్చుకోండి, తమ ప్రాప్తుల లిస్టును ఎదురుగా తెచ్చుకోండి. బ్రాహ్మణ ప్రపంచంలోని విచిత్రమైన ప్రాక్టికల్ కథలను స్మృతిలోకి తెచ్చుకోండి. ఎలాగైతే స్వయాన్ని మార్చుకోవడము కోసం వార్తాపత్రికలను చదవడాన్ని కూడా ఆధారంగా తీసుకుంటారు, అలాగే బ్రాహ్మణ ప్రపంచంలో ఆది నుండి ఇప్పటి వరకు ఎన్ని అలౌకిక సమాచారాలను చూసారు లేక విన్నారు, వార్తాపత్రికలు కూడా మీ దగ్గర ఉన్నాయి. చాలామందికి పేపర్ చదవకపోతే మనశ్శాంతి అనిపించదు. పేపర్ కూడా మీ దగ్గర ఉంది. పేపర్ చదవండి. డాన్స్ మరియు పాటల గురించి అయితే తెలుసు. అలసట లేకుండా డాన్స్ చేస్తారు. మన్మనాభవగా అవ్వడమే అన్నింటికన్నా గొప్ప మనోరంజనము ఎందుకంటే సర్వ సంబంధాల రసాన్ని అనుభవము చేయడము లేక అనుభూతులను పొందడమే మన్మనాభవ. కేవలం తండ్రి రూపంలో లేక విశేషంగా మూడు రూపాల సంబంధాలతో అనుభవం చేసుకోవడము కాదు, కానీ సర్వ సంబంధాల స్నేహాన్ని అనుభవం చేసుకోగలరు. సంబంధాలతో స్మృతి అయితే చేస్తారు కానీ తేడా ఎక్కడ వస్తుంది? ఒకటేమో, బుద్ధితో జ్ఞానం ఆధారంగా సంబంధాన్ని స్మృతి చేయడము మరియు రెండవది, హృదయముతో ఆ సంబంధం యొక్క స్నేహంలో, లవ్‌లో లీనమైపోవడము. సగం అయితే చేస్తారు కానీ మిగతా సగం ఉండిపోతుంది, అందుకే కొద్ది సమయమైతే సరిగ్గా ఉంటారు, కొద్ది సమయం తర్వాత కేవలం బుద్ధి ద్వారానే సంబంధాన్ని స్మృతి చేస్తారు మరి బుద్ధిలో మరో విషయం రావడము వలన మనసు మారిపోతుంది. మళ్ళీ శ్రమ చేయవలసి వస్తుంది. మళ్ళీ ఏమంటారు - మేము స్మృతి అయితే చేసాము, బాబా నా కంపానియన్, కానీ కంపానియన్ తోడునైతే నిర్వర్తించలేదు! అనుభవమైతే ఏమీ కాలేదు! ఇది బుద్ధితో స్మృతి చేసారు. హృదయములో స్నేహాన్ని ఇముడ్చుకోలేదు. ఎప్పుడైనా ఏ విషయమైనా బుద్ధిలోకి వస్తే అది త్వరగా తొలగిపోతుంది కూడా. కానీ హృదయంలో ఇమిడిపోతే దానిని మొత్తం ప్రపంచం కూడా హృదయం నుండి తొలగించాలని అనుకున్నా కూడా తొలగించలేరు. కావున సర్వ సంబంధాలను సమయానుసారంగా, ఏ సమయంలో ఏ సంబంధం అవసరము ఉందో, స్నేహితుని అవసరం ఉంది మరియు స్మృతి తండ్రిని చేసినట్లయితే ఆనందం అనిపించదు, అందుకే ఏ సమయంలో, ఏ సంబంధం యొక్క అనుభూతి కావాలో, ఆ సంబంధాన్ని స్నేహంతో, హృదయంలో అనుభవం చేసుకోండి. అప్పుడు శ్రమ కూడా అనిపించదు, బోర్ కూడా అవ్వరు, సదా మనోరంజనంగా ఉంటుంది. మరి ఈ సంవత్సరం ఏం చేస్తారు?
శ్రమ నుండి బయటకు రావాలి. ప్రతి నెల కేవలం ఓ.కె అని రాయాలి, ఇంకేమీ రాయకండి. ఓ.కె తో శ్రమ నుండి బయటకు వచ్చారని అర్థం చేసుకుంటాము. పెద్ద-పెద్ద ఉత్తరాలు రాయకండి. లేదంటే ఉత్తరమైతే రాసాము, జవాబు రాలేదు అని అంటారు. మీ ఉత్తరాలు చేరకపోవడము అనేది ఉండదు. ఉత్తరం రాయడము ప్రారంభించిన వెంటనే మరియు అక్కడి కంప్యూటర్లోకి ముందే వచ్చేస్తుంది, పోస్ట్‌లో తర్వాత చేరుకుంటుంది. మామూలుగా బాప్‌దాదా ఇంత పెద్ద ఉత్తరాలకు రోజూ మురళీలో అందరికీ జవాబు ఇస్తారు. రోజూ ఉత్తరాలు రాస్తారు. ఇంత పెద్ద ఉత్తరం ఎవరైనా రాస్తారా! కావున మీ స్వమానాన్ని చూసుకోండి - మీ అందరిపై పరమాత్మకు ఎంత ప్రేమ ఉంది. పరమాత్మకు ప్రేమ ఉంది, అందుకే ఉత్తరాలు రాస్తారు అనగా మురళీలో జవాబులు కూడా ఇస్తారు మరియు ప్రియస్మృతులు కూడా ఇస్తారు. ఒకవేళ ఏదైనా ప్రశ్న వస్తే లేదా ఏదైనా సమస్య ఎదురుగా వస్తే మురళీ ద్వారా సమాధానం లభిస్తుంది. కనుక జవాబు రాలేదు అని ఇంకెప్పుడూ ఫిర్యాదు చేయకండి. ఇకపోతే, మంచి పని చేస్తున్నారు, మనసులోకి ఏ విషయము వచ్చినా, దానిని తండ్రి ఎదురుగా పెట్టడము అంటే మనసు నుండి దానిని తీసేసారు. అదైతే చేయండి, కానీ క్లుప్తంగా రాయండి. ఉత్తరం రాసేటప్పుడు ఆ సమయంలోనే మనసు అయితే తేలిక అయిపోతుంది కదా! ఎందుకంటే ఇచ్చేసారు కదా. మళ్ళీ రెండవ రోజు మురళీని ఆ విధితో చూడండి, నేను ఏదైతే ఉత్తరం రాసానో దానికి జవాబు ఏమిటి? బదులు అయితే లభిస్తుంది కదా. అనంతమైన తండ్రి కనుక ఉత్తరం కూడా అనంతమైనది రాస్తారు, చిన్నదిగా ఏమైనా రాస్తారా!
బాప్‌దాదా చూసారు, నలువైపులా ఉన్న డబల్ విదేశీ పిల్లలు సేవలో మంచి తపనతో నిమగ్నమై ఉన్నారు. ఒక్కొక్కరిని చూస్తుంటే ప్రతి ఒక్కరు ఒకరికన్నా ఒకరు ప్రియమనిపిస్తారు. ఒకవేళ పేర్లు తీసుకుంటే ఎన్ని పేర్లు తీసుకుంటాము! అందుకే అందరూ విశేష సేవకు రిటర్న్‌గా తమ పేరుతో శుభాకాంక్షలు స్వీకరించండి. పేర్లు తీసుకోవడము ప్రారంభించినట్లయితే మాలను తయారుచేయవలసి వస్తుంది. కానీ మాలలోని మణులందరూ బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు. ఎప్పటికప్పుడు సేవ అనంతమైనదిగా అవుతూ ఉంది మరియు సఫలతా సంపన్నంగా అవుతూ ఉంది. వర్తమాన సమయంలో విశేషంగా విదేశములో రెండు సేవల రిజల్టు మంచిగా ప్రత్యక్షమయ్యింది. అనేక రకాల సేవలైతే నడుస్తూనే ఉంటాయి, కానీ విశేషంగా ఒకటేమో ఈ గ్లోబల్ బుక్, శ్రమ చేసి తయారుచేసారు, దీని నిమిత్తంగా నలువైపులా ఉన్న విశేష ఆత్మలతో సంబంధ సంపర్కములోకి రావడము సహజమైపోయింది. కనుక ఏ పిల్లలైతే ప్రాణప్రదముగా, ఎంతో ప్రేమతో సమయాన్ని కేటాయించారో, సహయోగము ఇచ్చారో, దానికి ప్రత్యక్షఫలంగా సేవకు నిమిత్తమైన ఆత్మలకు బాప్‌దాదా పదమారెట్లు అభినందనలు చెప్తున్నారు. దానితో పాటు ఎవరైతే ఇప్పుడు డైలాగ్ లేక రిట్రీట్ చేసారో, దాని రిజల్టు కూడా ముందు నుండే చాలా మంచిగా ఉంది. మిగిలిన అన్ని దేశాలవారు ఇందులో ఎవరైతే సహయోగం ఇచ్చారో, వారందరికీ కూడా అభినందనలు. లక్ష్యము మంచిగా పెట్టుకున్నారు. కావున నలువైపులా ఇప్పుడు ఈ రెండు రకాల సేవలు మంచి ఆర్భాటముగా నడుస్తున్నాయి మరియు ఇక ముందు కూడా నడుస్తూ ఉంటాయి. బాప్‌దాదాకు గుర్తుంది, మొదట విదేశాల నుండి వి.ఐ.పి.ల సంగతైతే వదిలేయండి, ఐ.పి.లను తీసుకురావడము కూడా కష్టమనిపించేది. మరియు ఇప్పుడైతే సహజమనిపిస్తుంది కదా! మరి ఇది సేవకు ప్రత్యక్ష ఫలము. మరియు ఎంతమంది ఆశీర్వాదాలు లభించాయి! ఎవరి చేతిలోకైతే పుస్తకం వెళ్తుందో, వారందరి ఆశీర్వాదాలు ఎవరి ఖాతాలో జమ అవుతాయి? ఎవరైతే నిమిత్తులుగా అవుతారో వారి ఖాతాలో జమ అవుతాయి. ఇచ్చే సేవ కావచ్చు, తయారుచేసే సేవ కావచ్చు, ఐడియాలను ఇచ్చే సేవ కావచ్చు, రాసే సేవ కావచ్చు - అందరికీ ఆశీర్వాదాలు లభిస్తాయి. మరి ఎన్ని ఆశీర్వాదాలు లభిస్తున్నాయి! చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి, మీరు కేవలం రిసీవ్ చేసుకోండి. స్వయములోనే బిజీగా ఉంటారు కనుక ఆశీర్వాదాలను రిసీవ్ చేసుకోరు. మరియు ఐ.పి.లు లేక వి.ఐ.పి.లు ఎవరైతే సంపర్కములోకి వస్తారో, వారు ఒక్కరే ఎంతమందికి అనుభవము వినిపిస్తారు, అప్పుడు వారందరి ఆశీర్వాదాలు బ్రాహ్మణాత్మలకు చాలా-చాలా ప్రాప్తిస్తాయి. ఒకవేళ ఆశీర్వాదాలను రిసీవ్ చేసుకున్నా కూడా సంపన్నంగా అయిపోతారు. బుక్‌ను కూడా మంచిగా చేసారు మరియు ఈ ప్రోగ్రాం కూడా చాలా మంచిగా ఉంది. భారతవాసుల విశేష సేవగా ఇప్పుడు కారు యాత్ర నడుస్తుంది. (బిజినెస్ వింగ్‌లోని సోదర-సోదరీలు 11 కార్లతో కూడిన ఒక ర్యాలీని రాజ్‌కోట్ నుండి బాంబే వరకు చేసారు, ఇందులో అనేక రకాల సేవలు జరుగుతున్నాయి). దాని రిజల్టు కూడా చాలా మంచిగా వెలువడుతూ ఉంది మరియు ఇకముందు ఒక్కరు నిమిత్తముగా అయినా కూడా అనేకుల భాగ్యాన్ని మేల్కొలుపుతూ ఉంటారు. కావున ఈ సేవా రిజల్టు కూడా మంచిగా కనిపిస్తుంది. ఈ సేవలో ఎవరైతే నిమిత్తముగా అయ్యారో, ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారో, వారందరికీ కూడా, నలువైపులా ఉన్న భారతవాసులైన పిల్లలకు, సహయోగీ పిల్లలకు, నిమిత్త పిల్లలకు బాప్‌దాదా అభినందనలు చెప్తున్నారు. శ్రమ నామ మాత్రము మరియు సఫలత ఎక్కువ, ఇప్పుడు ఇటువంటి సేవా ప్లానులు తయారుచేయండి. ఈ సేవలో కూడా ఇదే కనిపిస్తుంది - శ్రమ తక్కువ, రిజల్టు ఎక్కువ. విదేశములోని రెండు ప్రోగ్రాములలో కూడా ఇలాగే ఉంది. అచ్ఛా!
దేశ-విదేశాలలోని సర్వ సేవలలో ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారికి, అలసటలేనివారిగా అయ్యి ఇతరులకు దానము-వరదానము ఇచ్చే ఆత్మలకు, నలువైపులా ఉన్న తండ్రి యొక్క సర్వ సంబంధాల లవ్‌లో లీనమై ఉండే లవలీన ఆత్మలకు, సదా సహజ అనుభవం చేసే, ఇతరులకు కూడా సహజ అనుభవం చేయించే సహయోగీ ఆత్మలకు, సదా స్వయాన్ని స్వమానము ద్వారా సహజంగా దేహ భానము నుండి ముక్తులుగా చేసుకునే జీవన్ముక్త ఆత్మలకు, సదా తండ్రి తోడును అనుభవము చేసుకునే మరియు సహచరునిగా అనుభవము చేసుకునే సమీప ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
రిట్రీట్ మరియు విదేశ సేవలో సహయోగులైన సోదర సోదరీలతో మరియు దాదీలతో అవ్యక్త బాప్‌దాదా యొక్క మిలనము -
అందరూ సంతోషంగా సేవ చేస్తే దాని రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. సమయం ఎలా సమీపంగా వస్తుందో, సమయంతో పాటు సఫలత కూడా సమీపంగా వస్తోంది. కొంత సమయం క్రితం సఫలత దూరంగా అనిపించేది కానీ ఇప్పుడు సఫలత ఎంత సమీపంగా అనుభవమవుతోంది. ఇప్పుడు ఏ కార్యం చేసినా సఫలత అయిపోయి ఉందని అనిపిస్తుంది కదా. అందరి స్థితి కూడా సహజయోగిగా పెరుగుతూ వెళ్తోంది కదా. ఎంతగా సహజయోగి స్థితి పెరుగుతుందో అంతగా సఫలత కూడా స్వయంగా ముందుకు వస్తుంది. సఫలత వెనుక వెళ్ళరు, కానీ సఫలత స్వయంగా వస్తుంది. మంచి విధి. ఇప్పుడు స్వయంగా ఆఫర్ చేస్తున్నారు. ముందు కాంటాక్ట్ చేయడం కష్టంగా ఉండేది. బాప్‌దాదాకు జయంతి (లండన్‌కు చెందిన జయంతి సోదరి) విషయం గుర్తుకు వస్తోంది. బయట సేవ గురించి చెప్పినప్పుడు అందరితో చాలా కష్టం, విదేశం. మీకు విదేశాల గురించి తెలియదు అని చెప్పేవారు. ఇప్పుడు వ్యక్తులు లభిస్తున్నారు, స్థానం తక్కువగా ఉంది. మధుబన్‌లో కూడా చూడండి స్థానం కారణంగా నంబర్ లభిస్తోంది. అందరూ మంచి శ్రమ చేసారు. ప్రేమలో ఉంటూ శ్రమ చేసారు అందుకే శ్రమ ప్రేమగా మారిపోయింది. (సోదరీలు బాప్‌దాదాకు గ్లోబల్ బుక్ మరియు జివెల్ ఆఫ్ లైట్ బుక్ చూపించారు, బాప్‌దాదా సేవలో సహయోగం అందించిన వారందరినీ స్టేజ్ పైకి పిలిచారు) ఇంటర్నేషనల్ కదా. వస్తువు తయారైపోయినప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది. ముందు తయారు చేయబడుతుంది, తరువాత తయారైపోయినప్పుడు అందరి ముందుకు వస్తుంది. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా అందరూ ఇందులో మంచి సహయోగం అందించారు. అందువలన ఎవరెవరు నిమిత్తమయ్యారో అందరూ తమ తమ పేరుతో ప్రియస్మృతులను స్వీకరించండి. బాప్‌దాదా నిమిత్తమైన పిల్లలందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. (చికాగో కాన్ఫరెన్స్ కూడా బాగా జరిగింది) కాన్ఫరెన్స్ సఫలత కూడా బాగుంది. అందరూ మంచి సేవ చేసారు. మంచి ధైర్యాన్ని ఉంచారు మరియు ధైర్యానికి ప్రత్యక్షఫలంగా అందరి సహాయం లభించింది. బ్రాహ్మణ సమాచార పత్రికలలో అయితే విశేషంగా పేరు వచ్చింది. ఎవరైతే విశేష సేవ చేస్తారో దాని ప్రత్యక్షఫలం మొదట మనసులో సంతోషం కలుగుతుంది మరియు దానితో పాటు బ్రాహ్మణుల బుక్‌లో జమ అయిపోతుంది. (మెక్సికో కాన్ఫరెన్స్ కూడా బాగా జరిగింది) చెప్పాము కదా ప్రతి కార్యంలో సఫలత సమీపంగా వస్తోంది. ఎవరైనా, ఎక్కడైనా సేవ చేస్తున్నప్పుడు అందరి సంగఠన యొక్క వైబ్రేషన్స్ ద్వారా విశేష కార్యంలో సఫలత లభిస్తోంది. బిల్డింగ్ తయారవుతుంది కదా, అప్పుడు ఒక్కొక్క కణం యొక్క సహయోగం ఉంటుంది, ఒక్కొక్క ఇటుక యొక్క సహయోగం ఉంటుంది, అప్పుడే బిల్డింగ్ తయారవుతుంది. చెప్పడానికి ఫలానా కాంట్రాక్టర్ తయారు చేసారని అంటారు కానీ ఇటుక లేకపోతే కాంట్రాక్టర్ ఏమి చేస్తారు? కావున మీరందరూ సేవ యొక్క సఫలత అనే బిల్డింగ్‌కు ఒక్కొక్క విశేష ఇటుక, ఫౌండేషన్. మిగిలిన ఏ కార్యానికి ఎవరైతే నిమిత్తమవుతారో వారి విశేష పేరు వస్తుంది. (ఇది యు.ఎన్. యొక్క గోల్డెన్ జూబిలీ. ఫ్యామిలీ ఇయర్ నడుస్తోంది) అయితే గోల్డెన్ సఫలతను తీసుకువస్తారు కదా. మీకు అయితే ప్రతి సంవత్సరం ఫ్యామిలీ ఇయర్ నడుస్తోంది. ఫ్యామిలీ పెరుగుతోంది, ఫ్యామిలీ సుఖంగా అవుతోంది. ఫ్యామిలీ ప్లానింగ్ అయితే మీకు ఉంది. ఫ్యామిలీ కంట్రోల్ ప్లానింగ్ కాదు, ఫ్యామిలీని పెంచే ప్లానింగ్. ప్రపంచంలోని వారు చిన్న కుటుంబం సుఖమైన కుటుంబం అని అంటారు, ఇక్కడ పెద్ద కుటుంబం, సుఖమైన కుటుంబం అని అంటారు. అందరూ మంచి శ్రమ చేస్తున్నారు. ‘శ్రమ’ అనే పదానికి బదులుగా, మంచి సేవ చేస్తున్నారు. ‘శ్రమ’ అనే పదం కొంచెం బాగా అనిపించదు. సేవ ద్వారా ప్రత్యక్షఫలాన్ని తింటున్నారు. డైలాగ్ బాగుంది కదా? సేవతో అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ముందుకు వెళ్తున్నారు మరియు ముందుకు వెళ్తూనే ఉంటారు. బుద్ధిని బాగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు ఏ ఆత్మ కూడా బ్రాహ్మణ కుటుంబం నుండి పక్కకు వెళ్ళిపోకుండా ఉండేలా ప్లాన్ తయారు చేయండి. కోటను ఎంత దృఢంగా చేయాలంటే ఎవరూ వెళ్ళనే వెళ్ళకూడదు. ఇప్పుడు కూడా మంచి మంచి వారు వెళ్ళిపోయారు, ఎందుకు వెళ్ళిపోయారు, ఎక్కడికి వెళ్ళిపోయారు? అని వింటున్నారు. కావున అటువంటి కోటను దృఢంగా చేయండి, ఎవరైనా వెళ్ళాలని ఆలోచించినా కూడా వెళ్ళలేకపోవాలి. నాలుగు వైపులా కరెంట్ వైర్లు వేస్తారు కదా, అలాగే మీరు కూడా వైబ్రేషన్స్ ద్వారా కరెంట్ వైర్లు వేయండి, తద్వారా వారికి స్మృతి కలగాలి. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదా యొక్క పర్సనల్ మిలనము
గ్రూప్ నం. 1 - సర్వ ఖజానాలతో నిండుగా ఉండేవారే విశ్వ కళ్యాణకారులు
అందరూ మిమ్మల్ని మీరు విశ్వ కళ్యాణకారి అయిన బాబా పిల్లలు, విశ్వ కళ్యాణకారి ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? విశ్వ కళ్యాణకారి ఆత్మల విశేషత ఏమిటి? విశ్వ కళ్యాణం చేసే ఆత్మ మొదట స్వయంగా సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉంటుంది. అయితే సర్వ ఖజానాలతో నిండుగా ఉన్నారా? ఎన్ని ఖజానాలు ఉన్నాయి? చాలా ఉన్నాయి కదా! అయితే అన్ని ఖజానాలతో నిండుగా ఉన్న ఆత్మలే ఇతరులకు ఇవ్వగలుగుతారు. జ్ఞాన ఖజానా ఉంటే ఫుల్ జ్ఞానం ఉండాలి, ఏ లోటు ఉండకూడదు, అప్పుడే నిండుగా ఉన్నారని అంటారు. అయితే ఫుల్‌గా ఉన్నారా లేక అప్పుడప్పుడు ఏదైనా తక్కువ అవుతుందా? ఉంది కానీ సమయానికి కార్యంలో ఉపయోగించగలగాలి - ఈ చెకింగ్‌ను సదా చేస్తూ ఉండండి. అయితే సమయానికి యూజ్ చేయగలుగుతున్నారా లేక సమయం గడిచిపోయిన తరువాత ఆలోచిస్తున్నారా? అప్పుడు ఏమని చెప్పవలసి వస్తుంది - ఇలా చేసేవారము, ఇలా జరిగేది, అప్పుడు ‘చేసేవారము’, ‘జరిగేది’ అని అవుతుంది. ఏమి చెక్ చేయాలంటే సమయానికి ఏ ఖజానా కావాలో ఆ ఖజానా కార్యంలో ఉపయోగించామా లేదా? విశ్వ కళ్యాణకారి ఆత్మలు సదా ప్రతి సమయంలో మనసా, వాచా, కర్మణా, సంబంధ-సంపర్కంలో ప్రతి సమయంలో సేవలో బిజీగా ఉంటారు. అయితే అంత బిజీగా ఉంటున్నారా? అందరికంటే ఎక్కువగా సేవలో బిజీగా ఎవరు ఉంటారు? ఎందుకంటే పేరే విశ్వ కళ్యాణకారి, అయితే ఇది వృత్తి అయిపోయింది కదా. వృత్తి ఏదైతే ఉంటుందో అది లేకుండా ఉండలేరు. అయితే సదా బిజీగా ఉన్నారు మరియు సదా ఉంటారు. రోజంతా బుద్ధిలో ఏమి ఉంటుంది? ఏదైనా ఆత్మ లభిస్తే సందేశం ఇవ్వాలి. మంచిది, భారతవాసులు తమ విధితో సేవలో ముందుకు వెళ్తున్నారు మరియు మలేషియా వారు తమ విధితో, రష్యా వారు తమ విధితో, కానీ అందరూ స్మృతి మరియు సేవ యొక్క లగనంతో ముందుకు వెళ్తున్నారు.
బాప్‌దాదాకు కూడా పిల్లలందరినీ చూసి సంతోషం కలుగుతుంది, ఎక్కడెక్కడి నుండి విడిపోయిన ఆత్మలు తమ కుటుంబానికి చేరుకున్నారు. మీ అందరికీ కూడా సంతోషంగా ఉంది కదా? మీ కుటుంబాన్ని చూసి సంతోషంతో నాట్యం చేస్తున్నారు కదా? విశ్వ కళ్యాణకారులు కనుక నాలుగు వైపులా ఉన్న విశ్వంలోని ఆత్మల పాత్ర నిశ్చయించబడి ఉంది. ఒక్క మూల మిగిలిపోయినా విశ్వం అని అనము. అచ్ఛా, రష్యాలో సేవ బాగా పెరుగుతోంది. మలేషియా అయితే ముందే ఉంది కదా! మంచి రిజల్ట్ ఉంది. భారత్ అయితే ఫౌండేషన్. భారత్ మేల్కొన్నప్పుడే విదేశాలు మేల్కొన్నాయి కదా. కావున ప్రతి స్థానం మరియు ప్రతి పిల్లవాని మంచి సుగంధం బాబా వద్దకు వస్తూనే ఉంటుంది. భారతవాసులకు అనేక వైపుల ఆత్మలను చూసి ఇంకా ఎక్కువ సంతోషం కలుగుతుంది. భారతవాసులు విశాల హృదయులు. సంతోషం పెరుగుతుంది కదా - వాహ్, మన కుటుంబం. మీ అందరినీ చూసి అందరి హృదయం నుండి ఆశీర్వాదాలు వెలువడతాయి. చాలా మంచిది, మన నుండి విడిపోయిన సోదర సోదరీలు కలిసిపోయారు. విడిపోయిన వారు ఎవరైనా వచ్చి కుటుంబంలో కలిసిపోతే ఎంత సంతోషం కలుగుతుంది! కావున మీకు కూడా సంతోషం మరియు అందరికీ కూడా సంతోషం కలుగుతుంది. శ్రీలంక వారు కూడా లక్కీ. ఎందుకంటే పేరే శ్రీలంక. శ్రీ అనగా సదా శ్రేష్ఠమైనది. అయితే శ్రేష్ఠ ఆత్మలుగా అయ్యారు కదా! ఎక్కడ ఎంత గందరగోళం జరుగుతున్నా మీరు సేఫ్‌గా ఉన్నారు. స్మృతి యొక్క ఛత్రఛాయలో ఉన్నారు. అచ్ఛా!
గ్రూప్ నం. 2 - స్వయం మరియు సమయం యొక్క మహత్వాన్ని తెలుసుకొని భవిష్య ప్రాలబ్ధాన్ని జమ చేసుకోండి
సదా మిమ్మల్ని మీరు బాబాతో పాటు ఉండే శ్రేష్ఠ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సదా తోడుగా ఉండేవారా లేక అప్పుడప్పుడు తోడుగా ఉండేవారా, ఏమని భావిస్తున్నారు? బాబా యొక్క తోడు విడిపోయినప్పుడు ఇంకెవరైనా తోడుగా అవుతారా? మాయ తోడుగా అవుతుంది కదా! ఎన్ని జన్మలు మాయకు తోడుగా ఉన్నారు? చాలా ఉన్నారు కదా. మరి బాబా యొక్క తోడు ప్రాక్టికల్‌గా ఎంత సమయానికి ఉంటుంది? సంగమయుగం కదా మరియు సంగమయుగం అన్నింటికంటే చిన్న యుగం కూడా. అయితే ఏమి చేయాలి? సదా ఉండాలి. ఎందుకంటే మొత్తం కల్పంలో ఎంత పురుషార్థం చేసినా కూడా తోడు యొక్క అనుభవం చేయగలరా? (లేదు) అయితే దీని స్లోగన్ ఏమిటి? (ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు) ఇది గుర్తుంటుందా? సమయం యొక్క మహత్వం కూడా గుర్తుండాలి మరియు స్వయం యొక్క మహత్వం కూడా గుర్తుండాలి. రెండూ మహత్వమైనవే కదా! ఈ సంగమయుగ సమయాన్ని, జీవితాన్ని - రెండింటినీ వజ్రతుల్యమని అంటాము. వజ్రం యొక్క విలువ ఎంత ఉంటుంది! ఇంత మహత్వాన్ని తెలుసుకొని సంగమయుగంలోని తోడును ఒక్క సెకండు కూడా వదలకూడదు. సెకండు వెళ్ళిపోయిందంటే సెకండు మాత్రమే కాదు, చాలా వెళ్ళిపోయినట్లే. ఇటువంటి స్మృతి ఉంటుందా? మొత్తం కల్పం యొక్క ప్రారబ్ధాన్ని జమ చేసుకునే సమయం ఇప్పుడే. సీజన్లో సీజన్ యొక్క మహత్వాన్ని గుర్తించకపోతే సదా కొరకు వంచితులుగా ఉండిపోతారు. కావున ఈ సమయానికి మహత్వం ఉంది, జమ చేసుకునే సమయం. రాజ్యాధికారులుగా అయినా ఇప్పుడు జమ చేసుకున్న దాని లెక్క ప్రకారమే మరియు పూజ్యులుగా అయినా ఈ సమయపు జమ లెక్క ప్రకారమే. ఒక చిన్న జన్మలో అనేక జన్మల ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి. ఇది గుర్తుంటుందా లేక అప్పుడప్పుడా? సమ్ టైమ్ ఉందా? అయితే ఈ సమ్ టైమ్ అనే పదాన్ని ఎప్పుడు సమాప్తం చేస్తారు? సమాప్తి సమారోహం ఎప్పుడు జరుపుకుంటారు? రావణుడిని కూడా చంపిన తరువాత కాల్చి సమాప్తం చేస్తారు కదా? అయితే ఇప్పుడు చంపారు, కాల్చలేదు. అచ్ఛా, ఇది వెరైటీ గ్రూప్. బాప్‌దాదా ఒక్కొక్క రత్నం యొక్క విలువను తెలుసుకుంటారు. అదే అమూల్య రత్నం యొక్క దృష్టితో చూస్తారు. అమూల్య రత్నాలే కదా! ఉన్నతోన్నతమైన భగవంతునికి చెందినవారిగా అయ్యారు, ఇది తక్కువ భాగ్యం కాదు. కావున సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచుతూ వెళ్ళండి. నిండుగా ఉన్నారు కదా లేక కొంచెం తక్కువగా ఉందా? ఎవరైతే ఫుల్‌గా ఉంటారో వారు ఫెయిల్ అవ్వరు. అయితే విజయులే కదా? అచ్ఛా!
గ్రూప్ నం. 3 - సుపుత్రులుగా అయి స్వయంపై శ్రీమతం మరియు వరదానాల హస్తాన్ని అనుభవం చేస్తూ సమానంగా అయ్యే ఋజువును ఇవ్వండి
అందరి లక్ష్యం బాబా సమానంగా అవ్వడమే కదా. బాబా సమానంగా అవ్వాలా లేక అయ్యారా? నషాతో చెప్పండి, మనమే అయ్యాము, మనమే ఉన్నాము మరియు మనమే అవుతూ ఉంటాము. మీ అందరి స్లోగన్ ‘ఫాలో ఫాదర్’. అయితే ఫాలో ఫాదర్ చేసేవారిని ఏమని అంటాము? సమానంగా అయ్యారు అని అంటాము కదా. బాబా యొక్క అడుగులే మీ అడుగులు, అప్పుడే ఫాలో ఫాదర్ అని అంటాము. అయితే ఫాలో ఫాదర్ చేస్తున్నారా? బాప్‌దాదా పిల్లలందరినీ సదా సుపుత్రుల రూపంలో చూస్తారు. సుపుత్రులు అని ఎవరిని అంటాము? ప్రతి కర్మలో సుపుత్రులుగా అయి బాబాకు ఋజువు ఇచ్చేవారిని. సుపుత్రులు అనగా ఋజువు ఇచ్చేవారు. ప్రత్యక్షఫలాన్ని తింటున్నారు కదా లేక భవిష్యత్తు కొరకు మాత్రమే జమ అవుతోందా, వర్తమానంలో లేదా. సేవలో ఒక అడుగు వేస్తే లేదా స్మృతిలో ఉంటే శక్తి లభిస్తుంది, సంతోషం కూడా లభిస్తుంది, అనుభవం ఉందా? ప్రత్యక్షఫలాన్ని తినేవారు అనగా సదా హెల్దీ, వెల్దీ మరియు హ్యాపీగా ఉండేవారు. అయితే అందరూ వెల్దీ కూడా. ఎన్ని ఖజానాలు ఉన్నాయి? చాలా ఖజానాలు ఉన్నాయి కదా. నిండుగా ఉన్నారు కదా? లేక కొంచెం కొంచెం ఖాళీగా ఉన్నారా? ఎంతగా ఖజానాలతో నిండుగా ఉంటారో, సంపన్నంగా ఉన్నదానిలో అలజడి కూడా ఉండదు మరియు వేరే వస్తువు నిండడానికి కూడా వీలుండదు. సుపుత్రులు అనగా సదా బాబా యొక్క శ్రీమతం యొక్క హస్తాన్ని మరియు తోడును అనుభవం చేసేవారు. కావున శ్రీమతం యొక్క హస్తాన్ని సదా మీపై అనుభవం చేస్తూ వెళ్ళండి. సదా హస్తం ఉందా? ఎక్కడ బాబా హస్తం ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. బాబా యొక్క శ్రీమతం యొక్క హస్తం అనగా వరదానం యొక్క హస్తం. ఏ కార్యం చేసినా మొదట ఈ స్మృతిలోకి తీసుకురండి - శ్రీమతం యొక్క హస్తం, వరదానం యొక్క హస్తం సదా మనపై ఉంది. అనుభవం చేస్తున్నారు కదా మరియు బాబాకు కూడా సుపుత్రులకు వరదానం ఇవ్వడంలో సంతోషం కలుగుతుంది. ఎప్పుడూ ఈ వరదానం యొక్క హస్తం విడిపోదు. ఎవరైనా విడిపించగలరా, ఎవరికైనా అంత శక్తి ఉందా, అప్పుడప్పుడు మాయకు చెందినవారిగా అయిపోతారా? మాయకు వీడ్కోలు ఇచ్చేసారా లేక అప్పుడప్పుడు దానిని పిలుస్తారా? బలహీనంగా అవ్వడం అనగా మాయను పిలవడం. బలహీనంగా అవుతున్నారా? కోరుకోవడం లేదు కానీ అయిపోతున్నారా? లేదు, అవ్వనే అవ్వలేరు. మాస్టర్ సర్వశక్తిమంతులు బలహీనంగా అవ్వగలరా? వెలుగు ఉన్నప్పుడు అంధకారం ఉంటుందా? అయితే సర్వశక్తిమంతులు మరియు బలహీనులు ఈ రెండు విషయాలు కలుస్తాయా? మరి మాయను ఎందుకు పిలుస్తారు? పిలవడం లేదు, అది బలవంతంగా వస్తుంది. మాయకు మీపై ప్రేమ ఉంది, మీకు మాయపై లేదా? సదా అమృతవేళ మీకు మీరు విజయ తిలకాన్ని పెట్టుకోండి మరియు పదే పదే దానిని రిఫ్రెష్ చేసుకోండి. అనేకసార్లు విజయులుగా అయ్యారు. ఇది పక్కా కదా! ఇంత ధైర్యాన్ని ఉంచి బాబాకు చెందినవారిగా అయ్యారు కనుక అయిన తరువాత ధైర్యానికి పదమగుణాల సహాయం లభిస్తుంది. ఒక అడుగు ధైర్యం మరియు పదమ అడుగుల సహాయం. ఈ అనుభవం ఉంది కదా? పదమగుణాల సహాయాన్ని అనుభవం చేసేవారు అనగా సదా బాబా సమానంగా విజయులుగానే ఉన్నారు. అందరికంటే ఎక్కువ ప్రేమ బాబాపైనే కదా. ఎవరిపై ప్రేమ ఉంటుందో వారిలా అవ్వాల్సిందే. ప్రేమకు రెస్పాన్స్ సమానంగా అవ్వడం. అచ్ఛా, అందరూ మిమ్మల్ని మీరు బాబాకు సమీపంగా, బాబాకు ప్రియమైనవారిలో ప్రియమైన ఆత్మలుగా అనుభవం చేస్తూ ఎగురుతూ వెళ్ళండి.
గ్రూప్ నం. 4 - సదా బాబా యొక్క హృదయ సింహాసనాధికారులుగా, పరమాత్మకు ప్రియమైనవారిగా అవ్వండి, అప్పుడు నిశ్చింత చక్రవర్తులుగా అవుతారు
అందరూ లాస్ట్ సో ఫాస్ట్ కదా. ఫస్ట్ డివిజన్లో వచ్చేవారే కదా? ఫస్ట్ వచ్చేవారు అనగా రాజ్యాధికారి ఆత్మలు. అయితే అందరూ రాజ్యాధికారులేనా? సత్యయుగం-త్రేతాయుగంలోని విశ్వ రాజ్య సింహాసనాధికారులు సమయానుసారంగా ఎంతమంది అవుతారు? అందరూ అవుతారా! అయితే సింహాసనంపై కూర్చుంటారా లేక కూర్చునేవారికి తోడుగా ఉంటారా? అందరికీ 21 జన్మలు అని వినిపిస్తాము, అయితే నంబరువారుగా ఎంతమంది సింహాసనంపై కూర్చుంటారు? అందరూ కలిసి కలిసి కూర్చుంటారా లేక టర్న్ బై టర్న్ కూర్చుంటారా? అన్నింటికంటే గొప్ప రాజ్యాధికారం యొక్క అనుభవం ఇప్పుడు సంగమంలో స్వరాజ్యం ద్వారా కలుగుతుంది. స్వరాజ్యాధికారిగా ఉండే ఆనందాన్ని ఇప్పుడు అనుభవం చేస్తున్నారు కదా. స్వరాజ్యం యొక్క నషా ఉంది కదా లేక సత్యయుగంలో సింహాసనంపై కూర్చున్నప్పుడు ఉంటుందా? ఇప్పటి నషా గొప్పదా లేక సత్యయుగంలోని నషా గొప్పదా? (ఇప్పటిదే) అయితే నిశ్చయంతో సదా స్వరాజ్యాధికారులే విశ్వ రాజ్యాధికారులు అని అంటారు. స్వరాజ్యం మన బ్రాహ్మణ జన్మ యొక్క అధికారం. గుర్తుంటుంది కదా లేక అప్పుడప్పుడు ప్రజలుగా కూడా అయిపోతారా? ప్రజలు అనగా అధీనంగా ఉండడం మరియు రాజు అనగా అధికారి. అయితే సదా అధికారులుగా ఉంటారా లేక అప్పుడప్పుడు అధీనంగా కూడా అయిపోతారా? ఇప్పుడు సంగమయుగంలో కూడా ‘సమ్ టైమ్’ అయితే ‘సదా’ ఎప్పుడు అవుతారు? ఇప్పుడే సదానా లేక భవిష్యత్తులోనా? పాండవులు విజయులుగా అయ్యారా? ఈ సమయంలో విజయులుగా ఉన్నారా లేక అక్కడికి వెళ్ళిన తరువాత కూడా ఉంటారా, ఏమవుతుంది? ఎందుకంటే మీరందరూ బాబాకు ప్రియమైనవారు కదా, కావున హృదయ సింహాసనాధికారులు. ఎవరైతే హృదయ సింహాసనాధికారులుగా, హృదయానికి ప్రియమైనవారిగా ఉంటారో వారి చిత్రం స్వతహాగానే హృదయంలో ముద్రించబడుతుంది. మీరందరూ ఏమని అంటారు, మనం సదా ఎక్కడ ఉంటాము? బాబా హృదయంలో ఉంటారు కదా? హృదయం నుండి వేరవ్వనే అవ్వలేరు. హృదయాభిరాముడి హృదయం నుండి మిమ్మల్ని వేరు చేయగల ధైర్యం ఎవరికీ లేదు. ఈ నిశ్చయం పక్కాగా ఉంది కదా? మనం వేరవ్వలేము అని పాట పాడుతారు కదా. మొత్తం ప్రపంచం వేరు చేయడానికి ప్రయత్నించినా కూడా వేరవ్వలేరు. ఎందుకంటే కోట్లలో ఏ ఒక్కరో మీరే, మిగిలినవారు మీ ముందు ఏమీ కాదు. ఫాస్ట్ గ్రూప్ యొక్క గుర్తు ఇదే కదా. శరీరం విడిచిపోవచ్చు కానీ హృదయ సింహాసనం విడిపోదు. ఇంత పక్కాగా ఉంది కదా? అయితే ఈ సింహాసనం ఎవరికి లభిస్తుంది? ఎవరైతే పదమాపదమ భాగ్యశాలురుగా ఉంటారో వారికి. అయితే ఎలా వదులుతారు? కావాలంటే ట్రయల్ చేయండి అని ఛాలెంజ్ చేస్తారు. అంత అచంచలంగా ఉన్నారు కదా. పిల్లల ధైర్యాన్ని చూసి బాబా కూడా బలిహారమైపోతారు. ప్రపంచం ముందు గర్వంగా మనం పరమాత్మకు ప్రియమైనవారిగా అయ్యాము అని అంటారు. ఇదే గర్వంలో ఉండేవారు చింత నుండి ముక్తులుగా ఉంటారు. చింత అంతా సమాప్తం అయిపోయింది కదా లేక ఒకటి రెండు మూలల్లో మిగిలిపోయిందా? ఏదైనా జేబులో దాగి ఉండిపోలేదు కదా? బాబా తోడుగా ఉన్నప్పుడు నిశ్చింత చక్రవర్తులు. బాబాకు అన్ని చింతలు ఇచ్చేసారు కదా? ఇవ్వడంలో తెలివైనవారే కదా? లేక సంభాళించడంలో తెలివైనవారా? ఇవ్వడంలో కూడా తెలివైనవారు మరియు తీసుకోవడంలో కూడా తెలివైనవారు! అప్పుడప్పుడు పొరపాటున నా మనసు ఈ రోజు కొంచెం ఉదాసీనంగా ఉంది అని అంటారా, అయితే అది నాదా? లేక నీదిగా అయిపోయిందా? లేక ఆ సమయంలో నాదిగా అయిపోతుందా? నా మనసు లగ్నం కావడం లేదు, నా మనసుకు అనిపించడం లేదు - ఈ మాటలే వ్యర్థమైన మాటలు. నాది అని అనడం అనగా కష్టంలో పడడం. అయితే మనసును ఇచ్చేసారా లేక మీ వద్ద ఉంచుకున్నారా? లేక అప్పుడప్పుడు తిరిగి తీసుకుంటారా? అయితే బ్రాహ్మణుల భాష ఏమిటి? నాదా లేక నీదా? మరి ఎందుకు ఆలోచిస్తారు? ఇది డిక్షనరీలోని భాషే కాదు. నాది-నాది అని అంటూ మైలగా చేసేస్తారు. మనసును ఇచ్చేసారు, తనువును ఇచ్చేసారు, ధనాన్ని ఇచ్చేసారు, ట్రస్టీలు, నాది కాదు. ట్రస్టీలా లేక గృహస్థులా? గృహస్థులు అనగా నాది, ట్రస్టీలు అనగా నీది. అందరూ ఎవరు? మీపై మీకు ట్రస్ట్ ఉందా? బాబా అయితే స్వయంగా ఆఫర్ చేస్తున్నారు - నేను మీతో ఉన్నాను. అచ్ఛా, విశ్వ కళ్యాణం యొక్క యజ్ఞకుండాలను భిన్న-భిన్న దేశాలలో ప్రజ్వలితం చేసారు. బాప్‌దాదా అనేక దేశాలలో మెసేజ్ ఇచ్చే సేవాధారి పిల్లలను చూసి చాలా హర్షితులవుతున్నారు - వాహ్ నా పిల్లలూ వాహ్! ఎవరు మీరు? వాహ్-వాహ్ పిల్లలు. వాహ్-వాహ్ కదా. హాయ్-హాయ్ అనేవారు కాదు కదా? అచ్ఛా, బాబా విశ్వ కళ్యాణకారి కదా, అందువలన ఏ ఏరియా కూడా వంచితంగా ఉండకూడదు. మూల మూల నుండి, ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, తప్పకుండా రావాలి. కావున వృద్ధి జరగాల్సిందే. ధైర్యం ఉంది, సహాయం కూడా ఉంది.
ఎక్కడ బాబా హస్తం ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. బాబా యొక్క శ్రీమతం యొక్క హస్తం అనగా వరదానం యొక్క హస్తం. ఏ కార్యం చేసినా మొదట ఈ స్మృతిలోకి తీసుకురండి - శ్రీమతం యొక్క హస్తం, వరదానం యొక్క హస్తం సదా మనపై ఉంది.
*** ఓంశాంతి ***
