‘‘సంతుష్టతకు ఆధారము - సంబంధము, సంపద మరియు స్వస్థత (ఆరోగ్యము)’’
ఈరోజు హృదయాభిరాముడైన తండ్రి తమ సదా సంతుష్టంగా ఉండే సంతుష్ట ఆత్మలను లేదా సంతుష్టమణులను చూస్తున్నారు. ఈ ఆత్మిక మణుల ప్రకాశము మొత్తం సభను మెరిపింపజేస్తుంది. సంతోషకరమైన ఆత్మలు స్వయానికి కూడా ప్రియంగా మరియు సర్వులకు కూడా ప్రియంగా ఉంటారు మరియు తండ్రికైతే ప్రియమైనవారిగానే ఉన్నారు. ఇలాగే ఉన్నారు కదా! ఎందుకంటే ఈ శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అన్న పేరే లేదు. సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మలు మీరు. కావున ఎక్కడ సర్వ ప్రాప్తులు ఉంటాయో అక్కడ సదా సంతుష్టత స్వతహాగా మరియు స్వాభావికంగానే ఉంటుంది. వారి సహజ స్వభావమే సంతోషమైనదిగా ఉంటుంది. సంతుష్టత యొక్క స్వరూపం లేదా స్వభావం, సంతుష్టత అనే వాస్తవిక సంస్కారం ఎంత శ్రేష్ఠమైనదంటే అసంతుష్ట ఆత్మను కూడా సంతుష్టత యొక్క వైబ్రేషన్స్ మరియు వాయుమండలం, సంతోషం యొక్క వాయుమండలంలోకి మార్చేస్తాయి. ఈ సంగమయుగంలో విశేషంగా బాప్‌దాదా ఇచ్చిన కానుక - సంతుష్టత. సంతుష్టత అనే ఒక్క విశేషత మిగిలిన విశేషతలన్నింటినీ కూడా సహజంగానే తమ సమీపానికి తీసుకువస్తుంది. కానీ సదా సంతుష్టంగా ఉండాలి. పరిస్థితి ఎంతగా మారినా కానీ సంతుష్టత అనే స్థితిని పరిస్థితి మార్చలేదు. పర-స్థితి అంటేనే మారిపోయేటువంటిది. కానీ స్వ సంతుష్టత అనే స్థితి సదా ప్రగతిశీలంగా ఉంటుంది. మీ ఎదురుగా ఎటువంటి కదిలించే పరిస్థితి వచ్చినా కానీ, అది ఎలా అనుభవం అవుతుంది అంటే - ఎలాగైతే తోలు బొమ్మలాట చూస్తారు కదా. అన్నీ జరుగుతాయి కానీ అది తోలుబొమ్మ రూపంలోనే జరుగుతుంది. మరి ఎటువంటి పరిస్థితి అయినా తోలు బొమ్మలాటగా అనిపిస్తుందా లేదా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిన కార్టూన్ షో ఉంది, అది మంచిగా అనిపిస్తుంది కదా. ఉండడమైతే సింహం కూడా ఉంటుంది, పిల్లి కూడా ఉంటుంది, కానీ ఏం జరుగుతుంది? కార్టూన్. కథ పూర్తిగా ఉంటుంది కానీ అది కార్టూన్ కథ, నిజమైనది కాదు. ఎప్పుడైనా, ఏదైనా పరిస్థితి వస్తే - ఒక అనంతమైన స్క్రీన్‌పై కార్టూన్ షో నడుస్తుంది లేదా తోలు బొమ్మలాట నడుస్తుంది అనే భావించండి. మరి దానిని చూసి చింతిస్తారా లేక మనోరంజనంగా భావిస్తారా? షో చూడడమైతే మంచిగానే ఉంటుంది కదా. అలాగే ఈ మాయ లేదా ప్రకృతి, ఇది కూడా ఒక షో. దీనిని సాక్షి స్థితిలో, సదా సంతుష్టతా స్వరూపంలో చూస్తూ ఉండండి. నేను సంతుష్టమణిని, సంతోషీ ఆత్మను - అని మీ ఆత్మగౌరవంలో ఉంటూ చూడండి. ఇది సంగమము యొక్క శ్రేష్ఠ ఆత్మగౌరవము. మరి ఆత్మగౌరవంలో స్థితులవ్వడము వస్తుంది కదా? లేక వ్యాకులత చెందడం మంచిగా అనిపిస్తుందా? సదా సంతుష్టత అనే విశేషతను ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకోండి.
ప్రాప్తులలో విశేషంగా సంబంధము మరియు సంపద అవసరము. సంబంధాలలో కూడా ఒకవేళ ఒక్క సంబంధం యొక్క అప్రాప్తి ఉన్నా సంపూర్ణ సంతుష్టత ఉండదు. కనుక సంబంధాలలో కూడా అన్ని సంబంధాలు ఉండాలి మరియు అవినాశీగా ఉండాలి. ఒకవేళ ఏ సంబంధం అయినా వినాశీగా ఉంటే అప్రాప్తి మరియు అసంతుష్టత స్వతహాగా ఉంటాయి. కానీ ఒక్క వర్తమాన సంగమయుగంలోనే సర్వ అవినాశీ సంబంధాలను ఒక్క తండ్రితో అనుభవం చేసుకోగలరు. సత్యయుగంలో కూడా సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి, అన్నీ ఉండవు, కానీ ఈ సమయంలో ఏ సంబంధం యొక్క ఆకర్షణ ఉంటే, ఏ అనుభూతిని చేసుకోవాలనుకుంటే ఆ సంబంధాన్ని పరమ ఆత్మ ద్వారా అనుభవం చేసుకోగలరు. ప్రతి ఒక్కరి జీవితంలో సంబంధంలో కూడా వేర్వేరు అభిరుచులు ఉంటాయి. కొంతమందికి తండ్రి సంబంధం అంత ఇష్టంగా అనిపించదు, స్నేహితుని సంబంధం ఎక్కువ ఇష్టంగా అనిపిస్తుంది. కానీ ఒకే సమయంలో మరియు ఒకరి ద్వారానే సర్వ సంబంధాలు ప్రాప్తించాయా? సర్వ ప్రాప్తులు లభించాయా లేక ఏమైనా మిగిలిపోయాయా? వెనుక కూర్చున్నవారు ఏమని భావిస్తున్నారు? ఈ రోజు క్రొత్త-క్రొత్త వారికి ముందు కూర్చునే అవకాశం ఇచ్చారు. అచ్ఛా, ఎవరైతే ఈ కల్పంలో ఈసారి మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. మంచిది, విచ్చేసారు. బాప్‌దాదా కూడా పదమా రెట్ల స్నేహ సంపన్నంగా స్వాగతం చెప్తున్నారు. క్రొత్తవారైనా కూడా కల్ప-కల్పానికి అధికారులము అని ఇలా అయితే భావిస్తున్నారు కదా! బాప్‌దాదా ఎల్లప్పుడూ అంటారు, పెద్దవారు పెద్దవారే కానీ చిన్నవారు తండ్రి సమానమైనవారు, అందుకే సదా తమ ఆత్మిక అనంతమైన సంపూర్ణ అధికారం యొక్క నిశ్చయము మరియు నషాలో ఉండండి. ఇది అనంతమైన నషా, హద్దు నషా పెట్టుకోకండి. చూడండి, ఎంతటి శ్రేష్ఠ అధికారులు మీరు, స్వయం ఆల్మైటీ అథారిటీ అయిన తండ్రిపై అధికారం పెట్టుకున్నారు. పరమాత్మ అధికారి, ఇంతకన్నా గొప్ప అధికారం ఇంకేదైనా ఉంటుందా! బీజాన్నే తమదిగా చేసుకున్నప్పుడు, వృక్షమైతే ఇమిడి ఉండనే ఉంటుంది. సర్వ సంబంధాల అవినాశీ అధికారాన్ని కూడా తీసుకున్నారు మరియు సంపదలో కూడా ఒకవేళ కేవలం స్థూల సంపద ఉన్నా కూడా సదా సంతుష్టంగా ఉండలేరు. స్థూల సంపదతో పాటు ఒకవేళ సర్వ గుణాల సంపద, సర్వ శక్తుల సంపద మరియు శ్రేష్ఠ సంపన్నమైన జ్ఞాన సంపద లేకపోతే సంతుష్టంగా సదా ఉండలేరు. కానీ మీ అందరి వద్ద ఈ శ్రేష్ఠ సంపదలు ఉన్నాయి. సంపన్నవంతులే కదా! ప్రపంచంలోని వారైతే కేవలం స్థూల సంపద కలవారికి సంపద భవ అనే వరదానం ఇస్తారు, కానీ మీ అందరికీ వరదాత తండ్రి సర్వ శ్రేష్ఠ సంపద భవ అనే వరదానాన్ని ఇస్తారు. మరి అన్ని సంపదలు ఉన్నాయి కదా? లేక ఏమైనా తక్కువగా ఉన్నాయా? పూర్తిగా ఉన్నాయా? వెనుక ఉన్నవారిపై అందరికన్నా ఎక్కువ ధ్యాస ఉంది. ముందు ఉన్నవారికి తండ్రిపై ధ్యాస ఎక్కువగా ఉంది మరియు తండ్రి ధ్యాస వెనుక ఉన్నవారిపై ఎక్కువగా ఉంది. ఎంతగానైతే దూరంగా ఉన్నారో అంతగానే నయనాలలో ఇమిడి ఉన్నారు.
సాకార వతనంలోనైతే సాకార విషయాలు ఉంటాయి. చూడండి, పరంధామంలో ఆత్మలైన మీరందరూ ఎంత సమీపంగా ఉంటారు! అందరూ కలిసి ఉంటారు కదా! సూక్ష్మవతనంలో కూడా, ఎంత అనంతంగా ఉంటుందంటే ఎవరు ఎంత సమీపంగా రావాలనుకుంటే అంత రాగలరు. కానీ పిల్లల స్నేహం నిరాకారుడిని మరియు ఆకారిని కూడా సాకారిగా చేయాలనుకుంటుంది. మరి తండ్రి ఏమంటారు? జీ హజూర్, జీ హాజిర్. పిల్లలైతే తండ్రికి కూడా హజూర్(ప్రభువు)లు, యజమానులు కదా! యజమానిని ప్రభువు అని అంటారు మరియు పిల్లలను కూడా యజమాని అని అంటారు. మరి మీరందరూ ఎవరు? సంతుష్టమణులు. సంబంధంలో కూడా సంతుష్టత మరియు సంపదలో కూడా సంతుష్టత. సంబంధం, సంపద మరియు మూడవది స్వస్థత, ఆరోగ్యము. మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారు కదా లేక అనారోగ్యంగా ఉన్నారా? ఆత్మ అయితే ఆరోగ్యంగా ఉంది కదా, శరీరం యొక్క విషయమే లేదు. ఆత్మ సదా శక్తిశాలిగా ఉంది. ఆత్మ యొక్క ఆరోగ్యమే సంగమములో శ్రేష్ఠమైన స్వస్థత లేదా ఆరోగ్యము. ఈ సమయంలోని ఆత్మ యొక్క ఆరోగ్యం జన్మ-జన్మలకు శారీరక ఆరోగ్యాన్ని కూడా ఇప్పిస్తుంది. కానీ ఈ సమయంలో ప్రకృతి కొంచెం తన రూపాన్ని చూపిస్తుంది. ఇందులో కూడా ఏదీ పెద్ద విషయం కాదు. ఇది కూడా కార్టూన్ షో. మరి సర్వ ప్రాప్తులు ఉన్నాయి కదా. సంబంధాలు కూడా ఉన్నాయి, సంపద భవ కూడా ఉంది, సర్వ సంబంధ భవ కూడా ఉంది మరియు సదా స్వస్థ భవ కూడా ఉంది. మూడు వరదానాలు వరదాత తండ్రి ద్వారా లభించి ఉన్నాయి. కనుక వరదానాలను సమయానికి కార్యంలో వినియోగించండి. అవును, నాకు చాలా మంచి వరదానం లభించింది అని కేవలం వరదానం విని సంతోషపడకండి లేదా కేవలం నోట్ చేసుకుని ఉంచుకోకండి, కానీ సమయానికి వరదానాన్ని కార్యంలో వినియోగించడం ద్వారా వరదానం స్థిరంగా ఉంటుంది. ఒకవేళ వరదానాలను సమయానికి కార్యంలో వినియోగించలేదు అంటే ఆ వరదానం ఫలాన్ని ఇవ్వదు. వరదానమైతే అవినాశీ తండ్రికి సంబంధించినది, కానీ వరదానాన్ని ఫలీభూతము చేయాలి. బీజమైతే ఉంది కానీ దాని ద్వారా ఎన్ని ఫలాలు వచ్చేలా చేస్తారు అన్నది మీ చేతిలో ఉంది. కొంతమంది కేవలం వరదానం యొక్క బీజాన్ని చూసి చాలా బాగుంది, చాలా బాగుంది అని సంతోషపడుతూ ఉంటారు, కానీ ఫలదాయకంగా చేసుకోండి. పదే-పదే స్మృతి అనే నీటిని ఇవ్వండి, వరదానం యొక్క స్వరూపంలో స్థితులవ్వడము అనే ఎండను ఇవ్వండి, అప్పుడు చూడండి, వరదానం సదా ఫలీభూతమవుతూ ఉంటుంది, ఇతర వరదానాలను కూడా తోడుగా తీసుకువస్తుంది. వరదానాల ఫల స్వరూపులుగా అయిపోతారు. కావున ఈ రోజు మూడు వరదానాలను ఫలీభూతము చేయండి మరియు సమయానికి తప్పకుండా గుర్తు పెట్టుకోండి. సమయానికి మర్చిపోతారు, అవును, ఈ వరదానమైతే ఉండేది అని తర్వాత చదువుకుంటూ ఉంటారు. వరదానాలను ఎంతగా సమయానికి కార్యంలో వినియోగిస్తారో, అంతగా వరదానం ఇంకా శ్రేష్ఠ స్వరూపాన్ని చూపిస్తూ ఉంటుంది. మరి అందరికీ వరదానం లభించింది కదా! అచ్ఛా.
ఇప్పుడు 5 వైపుల నుండి వచ్చిన గ్రూపులు నంబరువారీగా చేతులు ఎత్తండి.
ఆసియా - ఇందులో భారతవాసులు మరియు మధుబన్వాసులు కూడా చేతులు ఎత్తండి. మధుబన్వాసులు అయితే విశేషమైనవారు. ఇది పెద్ద గ్రూప్. భారతవాసులు కూడా ఛాన్స్ తీసుకోవడంలో తెలివైనవారు. అయితే ఆసియా నివాసుల పట్ల ఈరోజు విశేషంగా మూడు వరదానాలు అందరికీ ఉన్నవే, కానీ ప్రత్యేకంగా ఆసియా పట్ల ‘సదా శుభ భావన మరియు శ్రేష్ఠ భావ భవ’. శుభ భావన మరియు శ్రేష్ఠ భావము - ఈ విశేష వరదానం ఆసియా నివాసుల కోసం ఉంది.
యూరప్ - యూరప్‌లో ఇంగ్లాండ్ కూడా వచ్చేసింది. యూరప్ నివాసుల పట్ల విశేష వరదానం ‘సదా జీరో మరియు హీరో భవ’. జీరో అంటే ఏమిటో తెలుసు కదా. మూడు జీరోలను గుర్తుంచుకోండి, కేవలం ఒక్కటి కాదు. జీరో మరియు హీరో యాక్టర్లు మరియు వజ్రం సమానమైనవారు, డబల్ హీరో. అయితే మూడు జీరోలు మరియు డబల్ హీరో. ఈ వరదానం యూరప్ నివాసుల కోసం ఉంది.
అమెరికా - మొత్తం అమెరికా చేతులు ఎత్తండి. ఎక్సర్సైజ్ చేయండి మరియు పెద్దగా చేతులు ఎత్తండి. చాలామందికి చిన్నగా చేయి ఎత్తే అలవాటు ఉంది. బాప్‌దాదాకు చిన్న చేయి ఉన్నవారు హాఫ్ కాస్ట్‌గా అనిపిస్తారు. ఫుల్‌గా చేయి ఎత్తండి.
అయితే అమెరికా నివాసులైన సర్వ ఆత్మలకు విశేషంగా ఇదే వరదానం - ‘సదా మాయతో ఇనోసెంట్ మరియు విజయములో సెంట్ పర్సెంట్ మరియు స్థితిలో సదా సెంట్’. సెంట్ అంటే సువాసన కలిగినవారు కూడా మరియు సెంట్ అంటే మహాన్ ఆత్మ, డబల్ సెంట్. అయితే ‘సదా ఇనోసెంట్ కూడా మరియు డబల్ సెంట్ భవ’.
ఆఫ్రికా, మారిషస్ - ఈరోజు బాప్‌దాదా నేరుగా చేయి ఎత్తే డ్రిల్ చేయిస్తున్నారు. డాక్టర్లు కూడా డ్రిల్ చేయమని చెబుతారు కదా. సర్వ ఆఫ్రికా నివాసి పిల్లల కోసం విశేషంగా ఇదే వరదానం - ‘సదా సర్వ సమృద్ధి మరియు సదా ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో సహజమైన ఆనేస్టీ(నిజాయితి) భవ, ప్రాసపర్టీ(సమృద్ధి) భవ మరియు త్రి-స్వరూపం ద్వారా సహజమైన ఆనేస్టీ భవ’.
ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ - ఆస్ట్రేలియా నివాసి సర్వశ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మల కోసం విశేషంగా ఇదే వరదానం - ‘సదా మాయతో విజయీ మరియు దానితో పాటు మాయాజీత్, విశ్వ రాజ్యజీత్ శ్రేష్ఠ వరదానం భవ’. దానితో పాటు ‘సదా నిశ్చింత మరియు నిశ్చయము నిశ్చిత్ భవ’. ఆస్ట్రేలియా నివాసులు ప్రత్యేకంగా బాబాకు ప్రియమైనవారు. అందరూ ప్రియమైనవారే కానీ ఆస్ట్రేలియా నివాసులు ప్రత్యేకంగా ఎందుకు ప్రియమైనవారు? బాబా యొక్క విశేష స్నేహ దృష్టి ఆస్ట్రేలియా నివాసులపై ఉంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆస్ట్రేలియా నివాసుల ధరణి అద్భుతాన్ని చేయడంలో చాలా మంచిది, కానీ బాబా ప్రత్యేకంగా ఆ ధరణికి స్నేహపు నీటిని ఇస్తారు. అందుకే ప్రత్యేక స్నేహం ఉంది. అర్థమైందా? అయితే ఆస్ట్రేలియా వారు చాలా కమాల్ చేయగలరు. ఇప్పుడైతే కొంచెం కొంచెమే చేశారు. మరియు ఆస్ట్రేలియా పేరును కూడా చివరలో తీసుకున్నారు కాబట్టి చివరివారికి ఏదైనా ఎక్స్ట్రా ఇవ్వాలి. అయితే అందరికీ వరదానం లభించింది.
మధుబన్ - మధుబన్ నివాసులు విశేషమైనవారు. ప్రస్తుతం జ్ఞాన సరోవర్ నివాసులైనా, విశ్వాన్ని సదా హెల్దీగా చేసేవారైన హాస్పిటల్ వారైనా, కేవలం హెల్దీ కాదు, హ్యాపీ హెల్దీ. లేదా మధుబన్ను చుట్టుముడుతున్న పిల్లలైనా! ఆబూను చుట్టుముడుతున్నారు కదా. అయితే సర్వ మధుబన్ నివాసి విశేష పిల్లల కోసం విశేష వరదానం - ‘సదా మనసా, వాచా, కర్మణా - మూడింటిలో సెంట్-పర్సెంట్ ప్రగతి భవ’ (వంద శాతం ప్రగతి భవ)
మిగతా ఎక్కడి నుండి అయినా, భిన్న-భిన్న విదేశ దేశాల నుండి లేదా భారతదేశం నుండి వచ్చిన పిల్లలందరికీ విశేషంగా ‘సదా సంపన్న మరియు సంపూర్ణ భవ’. అహ్మదాబాద్ వారు కూడా సేవ చాలా బాగా చేస్తున్నారు. మధుబన్‌లో కూడా నిర్విరామ సేవాధారులుగా ఉన్నారు. అయితే ప్రత్యేకంగా అహ్మదాబాద్, ఢిల్లీ మరియు బాంబే - ఈ మూడు స్థానాలకు కూడా సేవ యొక్క చాలా మంచి ఛాన్స్ లభించి ఉంది. అన్ని స్థానాలు తమ స్నేహ-సంపన్న నిర్విరామ సేవాధారులుగా తయారై సేవ చేస్తున్నాయి మరియు చేస్తూనే ఉంటారు. సేవకు అభినందనలు.
మరియు నాలుగు వైపులా దూరంగా కూర్చున్నా హృదయంలో చాలా సమీపంగా ఉన్నవారు, అయితే నలువైపులా ఉన్న దేశ-విదేశాలలోని సర్వ సంతోషీ ఆత్మలకు, సంతుష్టమణులకు, సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మలకు, ఎవరైతే స్మృతి, ఉత్తరాలు, కార్డులు ఈ రోజు గురించి కూడా పంపించారో, అలా విశేష దినమైన ఈ రోజు కోసం కూడా పిల్లలందరూ పదమా రెట్లు ప్రియస్మృతులను స్వీకరించండి. అయితే దూరంగా కూర్చుని మనసులో, హృదయంలో జరుపుకుంటున్నా లేక సమ్ముఖంలో జరుపుకుంటున్నా సరే, కార్డులు లేదా ఉత్తరాలు అన్నీ మొదట వతనానికి చేరుకుంటాయి. కావున అందరి ఉత్తరాలు, కార్డులు మరియు శుభ సంకల్పాల స్మృతి, శుభ భావనల స్మృతికి రిటర్నులో బాప్‌దాదా యొక్క విశేషమైన ప్రియస్మృతులు మరియు బాలక్ సో మాలిక్ పిల్లలందరికీ నమస్తే. అచ్ఛా.
దాదీలతో మిలనము:
సూక్ష్మ సంకేతాల భాష అయితే తెలుసు కదా. అవ్యక్త బాబాకు కూడా సంకేతాల భాషనే తెలుసు. అవ్యక్త వతనంలో అయితే నయనాల భాష మరియు సంకేతాల భాష ఉంటుంది. అయితే మీకు కూడా తెలుసు కదా. నయనాల భాష తెలుసా? సాకారము నుండి నేర్చుకున్నారు కదా. నోటి భాష అయితే విన్నారు, ఇప్పుడు నయనాల భాష. నయనాల భాష చాలా ప్రియమైనది. ధ్వనికి అతీతంగా అయితే వెళ్లాల్సిందే. అయినా బాబా జీ హజూర్ చేస్తూనే ఉంటారు. అచ్ఛా.
(చివరలో బాప్‌దాదా చేతులు ఎత్తించి అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి వీడ్కోలు తీసుకున్నారు)
ఏ పరిస్థితి వచ్చినా ఇదే అర్థం చేసుకోండి - అనంతమైన స్క్రీన్‌పై కార్టూన్ షో నడుస్తోంది లేదా పపెట్ షో నడుస్తోంది. అయితే దానిని చూసి కలవరపడకండి. ఇది కూడా మాయ యొక్క లేదా ప్రకృతి యొక్క ఒక షో. దీనిని సాక్షీ స్థితిలో సదా సంతుష్టత స్వరూపంలో ఉండి చూస్తూ ఉండండి. మీ స్థితిలో ఉండి చూడండి - సంతుష్టమణిని, సంతోషీ ఆత్మను.
*** ఓంశాంతి ***
