‘‘అతీతమైన-ప్రియమైన, అద్భుతమైన, స్నేహమయమైన మరియు సుఖభరితమైన అవతరణ - శివ జయంతి’’
ఈరోజు త్రిదేవ రచయిత అయిన తండ్రి తమ పూజ్య సాలిగ్రామ పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఎలాగైతే జ్యోతిర్బిందు స్వరూపుడైన తండ్రి పూజ జరుగుతుందో, స్మృతిచిహ్నాన్ని జరుపుకుంటారో, అలాగే తండ్రితో పాటు సాలిగ్రామ ఆత్మలైన మీకు కూడా పూజ జరుగుతుంది. తండ్రి ఒక్క త్రిమూర్తి శివునిగా గాయనం చేయబడతారు మరియు పూజించబడతారు మరియు సాలిగ్రామ ఆత్మలైన మీరు అనేకమంది ఉన్నారు. పూజ ఇరువురికీ జరుగుతుంది ఎందుకంటే తండ్రి పిల్లలందరినీ తమ సమానంగా పూజ్యులుగా తయారుచేసారు. ఎప్పుడైనా సాలిగ్రామాలను చూస్తే ఏమి అనుభవం చేస్తారు? ఇది మేమే అని అనిపిస్తుందా? మరి తండ్రి పిల్లలను సమానంగానే కాక, తమ కన్నా కూడా శ్రేష్ఠంగా, పూజ్యులుగా తయారుచేసారు. పిల్లల పూజ డబల్ రూపంలో జరుగుతుంది. తండ్రికి పూజ ఒక్క శివలింగం రూపంలోనే జరుగుతుంది. పిల్లలైన మీకు సాలిగ్రామ రూపంలో కూడా పూజ జరుగుతుంది మరియు దేవాత్మల రూపంలో కూడా జరుగుతుంది. తండ్రి కన్నా కూడా ఎక్కువగా డబల్ రూపంలో పూజకు అధికారీ ఆత్మలు మీరు. ఎలాగైతే డబల్ విదేశీయులు అని పిలవబడతారో, అలాగే డబల్ పూజ్యులు కూడా. డబల్ కిరీటధారులుగా కూడా మీరు అవుతారు. నిరాకార తండ్రి అలా అవ్వరు. అక్కడక్కడ భక్తులు శివుని ప్రతిమకు కిరీటం పెడతారు ఎందుకంటే వారు కిరీటధారులుగా చేసారు, అందుకే అక్కడక్కడ కిరీటం చూపిస్తారు. కానీ తండ్రి ఎప్పుడూ కూడా రత్నజడిత బంగారం-వెండి కిరీటధారిగా అవ్వరు ఎందుకంటే కిరీటం ప్రాక్టికల్‌గా మస్తకంపై ధరించడం జరుగుతుంది. మరి నిరాకార తండ్రికి మస్తకం ఉంటుందా! శరీరమే లేకపోతే కిరీటాన్ని ఏం ధరిస్తారు! కానీ స్నేహం కారణంగా కిరీటం చూపిస్తారు. మరి తండ్రి పిల్లలను తమ కన్నా కూడా ముందు పెట్టారు. ఇంతటి సంతోషం మరియు ఇంతటి శ్రేష్ఠ స్మృతి ఉంటుందా? బాప్‌దాదాకు తమ జయంతిని జరుపుకోవాలనే సంతోషం ఉండదు కానీ ఇది మీ అందరి జయంతి కూడా, కావున పిల్లల జయంతి యొక్క సంతోషం ఉంటుంది ఎందుకంటే తండ్రి ఒంటరిగా ఏమీ చేయలేరు మరియు మీరు కూడా ఒంటరిగా ఏమీ చేయలేరు. అక్కడక్కడ కొంతమంది పిల్లలకు, నేనే చేసేవాడిని అని కొంచెం అనిపిస్తుంది, కానీ తండ్రి లేకుండా సఫలత లభించదు. మరి తండ్రి ఒంటరిగా ఏమీ చేయలేరు, అలాగే పిల్లలు ఒంటరిగా ఏమీ చేయలేరు. ఒకవేళ తండ్రి పిల్లలతో సాకారంలో కానీ లేదా ఆకారంలో కూడా కానీ మిలనం జరుపుకోవాలనుకున్నా కూడా, బ్రహ్మాను ఆధారంగా తీసుకోవాల్సే ఉంటుంది. బ్రహ్మా లేకుండా కూడా ఏమీ చేయలేరు. మాధ్యమము లేకుండా సాకార మిలనం చేసుకోలేరు. మరి తండ్రికి పిల్లలపై మరియు పిల్లలకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది! ఒకరు లేకుండా మరొకరు ఏమీ చేయలేరు. ఒకవేళ తండ్రిని పక్కకు పెట్టారు, తోడుగా పెట్టుకోలేదు, అప్పుడు ఒంటరిగా ఏమైనా చేయగలరా? తండ్రి చేయగలరా? తండ్రి కూడా చేయలేరు. కనుక ఈ తండ్రి మరియు పిల్లలు కలిసి దివ్య జన్మ తీసుకోవడము, కలిసి విశ్వ పరివర్తన చేయడము మరియు కలిసి తమ మధురమైన ఇంటికి వెళ్ళడము - ఇది డ్రామా యొక్క అవినాశీ నిర్ణయము. దీనిని ఎవరూ మార్చలేరు. మరి ఈ నిర్ణయం బాగుంది కదా! ప్రియమనిపిస్తుంది కదా! ఈ రోజు అందరూ తండ్రి యొక్క జన్మదినాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేక మీది జరుపుకునేందుకు వచ్చారా? తండ్రి, మీది జరుపుకునేందుకు అని అంటారు మరియు పిల్లలు, మీది జరుపుకునేందుకు వచ్చామని తండ్రితో అంటారు.
ఈ దివ్య అవతరణ, దేనినైతే శివ జయంతి లేక శివ రాత్రి అని అంటారో, ఆత్మల కోసం ఎంతో స్నేహభరితమైన, సుఖభరితమైన అవతరణ. సత్యయుగంలో కూడా ఈ విధమైన జన్మదినాన్ని జరుపుకోరు. ఆత్మలు, ఆత్మల జన్మదినాన్ని జరుపుకుంటారు కానీ ఈ సమయంలో ఆత్మలు పరమ ఆత్మ జన్మదినాన్ని జరుపుకుంటారు. కల్పమంతటిలో ఇది అతీతమైన మరియు ప్రియమైన, అద్భుతమైన జన్మదినము, ఒక్క సమయంలోనే తండ్రిది కూడా జరుగుతుంది మరియు పిల్లలది కూడా జరుగుతుంది. ఇలా ఎప్పుడైనా జరుగుతుందా? ఒకవేళ తేదీ ఒకటే అయినా కూడా, సంవత్సరం లేదా నెల లేదా తారీఖు తేడా ఉంటుంది. కానీ ఈ అవతరణ దినోత్సవం ఎంత అద్భుతమైనది, తండ్రి మరియు పిల్లలది కలిసే జరుగుతుంది.
ఈ స్మృతిచిహ్నం రోజున విశేషంగా భక్తులు కూడా రెండు విశేషతలతో ఈ రోజును జరుపుకుంటారు. రెండు విశేషతలు ఏమిటి? ఒకటి, విశేషంగా వ్రతాన్ని ధారణ చేస్తారు మరియు రెండవది, స్వయాన్ని సమర్పితము చేసుకోకుండా ఇంక దేనినైనా బలి ఇస్తారు. కావున బలి ఇవ్వడము మరియు వ్రతం ధారణ చేయడము, ఈ రెండు విశేషతలు ఈ రోజుకు సంబంధించినవి. అనేక రకాల వ్రతాలను ధారణ చేస్తారు. కొంతమంది భోజనం యొక్క వ్రతం చేస్తారు, కొంతమంది జాగరణ యొక్క వ్రతం చేస్తారు, కొంతమంది దూర-దూరాల నుండి నడుస్తూ వెళ్ళే వ్రతం పెట్టుకుంటారు, ఎంత అలసిపోయినా కానీ తమ వ్రతాన్ని పూర్తి చేస్తారు. ఎన్ని రోజులు పట్టినా సరే, ఎంత సమయం పట్టినా సరే, వ్రతాన్ని విడిచిపెట్టరు. మరి ఈ స్మృతిచిహ్నాన్ని ఎవరి నుండి కాపీ చేసారు? మీది బ్రాహ్మణ జీవితం యొక్క వ్రతం మరియు భక్తులది ఒక రోజు యొక్క వ్రతం. మీరు కూడా ఎప్పుడైతే బ్రాహ్మణ జన్మ లేదా దివ్య జన్మ తీసుకున్నారో, అప్పుడు ఏం వ్రతం తీసుకున్నారు? సదా అజ్ఞాన నిద్ర నుండి జాగరణ అనే వ్రతాన్ని తీసుకున్నారు కదా లేదా కొద్ది-కొద్దిగా నిద్రపోతాము అన్న వ్రతం తీసుకున్నారా? లేదా కొంచెం-కొంచెం తూగుతూ ఉంటాము, ఇటువంటి వ్రతాన్ని అయితే తీసుకోలేదు కదా? మీరందరూ కూడా శివ జయంతి లేదా దివ్య జన్మ దినాన జాగరణ యొక్క వ్రతాన్ని తీసుకున్నారు, అందుకే భక్తులు కూడా స్మృతిచిహ్న రూపంలో జాగరణ చేస్తారు. మీరందరూ కూడా శుద్ధ భోజనం యొక్క వ్రతం తీసుకున్నారు, అందుకే భక్తులు కూడా, ఏమైనా కానీ, అనారోగ్యంగా ఉన్నా గానీ, భోజనం యొక్క వ్రతాన్ని ఉల్లంఘించరు. మరి మీరందరూ కూడా మనసుకు, తనువుకు ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, వ్రతాన్ని ఉల్లంఘిస్తారా ? ఎప్పుడైనా ఏదైనా మిక్స్ అయినదానిని తినేయడం, ఇలా చేస్తారా ? ఎవరూ చూడడమైతే లేదు, ఇక తినేసాము! మీ నియమాన్ని పక్కాగా ఉంచుకుంటారు కదా? లేక కచ్చాగా ఉన్నారా? అప్పుడప్పుడు వాటిని చూసి కొంచెం తినాలనిపిస్తుందా? ఒకే విధమైన ఆహారాన్ని తింటూ-తింటూ అప్పుడప్పుడు వేరేది కూడా తినాలని మనసుకి అనిపిస్తుందా? అచ్ఛా, ఇందులో అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, ఆసియా లేక రష్యా, అందరూ పక్కాయే కదా? లేదా కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉన్నారా?
డబల్ విదేశీయులందరూ పాస్ అయ్యారు! మరియు భారత్ వారైతే పాస్ అయ్యే ఉన్నారు కదా! భారత్ వారికి ఎంతైనా సహజము. డబల్ విదేశీయులకు ఇందులో డబల్ శ్రమ కూడా ఉంది. కానీ పాస్ అయ్యారు, దీనికి శుభాకాంక్షలు. మరి ఒకటేమో, జన్మదిన శుభాకాంక్షలు, రెండవది పాస్ అయినందుకు శుభాకాంక్షలు మరియు మూడవది, ఎప్పుడూ కూడా అలజడిలోకి రాకుండా సదా స్థిరంగా ఉండడము, దీనిలో పాస్ అయ్యారా? ఇందులో, ఏం చేయాలి! అప్పుడప్పుడు ఉంటాము అని అంటారు. ఈరోజు బాప్‌దాదా డబల్ విదేశీయుల కోసం చాలా రమణీకమైన భాషను ఇమర్జ్ చేసారు ఎందుకంటే డబల్ విదేశీయులు ఎంజాయ్ చేయడాన్ని ఎక్కువగా ఇష్టపడతారు కదా! ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి ఎంజాయ్ చేయాలి, ఇలా శాంతి, శాంతిగా ఎలా ఉంటాము! కనుక బాప్‌దాదా శివరాత్రికి ఈ పదాల విషయంలో అందరి చేత దృఢ వ్రతం చేయిస్తున్నారు. వ్రతాన్ని తీసుకోవడం కోసం తయారుగా ఉన్నారా? లేక ఎప్పుడైతే వింటారో, అప్పుడు, ఇదైతే కొంచెం-కొంచెం కష్టము అంటారా! మొదట ‘కష్టం’ అన్న పదాన్ని సంకల్పంలోకి కూడా తీసుకురాము అని ఈ వ్రతాన్ని తీసుకోవడం కోసం తయారుగా ఉన్నారా? మరి బాప్‌దాదా చూసారు, ఎప్పటివరకైతే సంకల్పంలో దృఢత ఉండదో, అప్పటి వరకు సఫలత ఉండదు. సంకల్పం ఉంటుంది కానీ దృఢంగా లేకపోతే బలహీనత వస్తుంది. చాలావరకు బలహీనతతో కూడిన ఈ పదాలనే అంటారు - ఏం చేయాలి! వాట్ (ఏమిటి). మరి ఇప్పుడు వాట్ అని అనకండి, కానీ వాట్‌కు బదులుగా ఏమంటారు? ఫ్లై (ఎగరాలి). కావున ఎప్పుడు వాట్ అన్న పదం వచ్చినా, బ్రాహ్మణ డిక్షనరీలో వాట్‌కు బదులుగా ఫ్లై అన్న పదం ఉండాలి. ఇంకో పదం ఏం మాట్లాడుతారు? వై(ఎందుకు), మరి వై (ఎందుకు) అనే పదాన్ని ఏం చేస్తారు? బై-బై. సదా కోసం బై-బై చేస్తారా లేక కొద్ది సమయం కోసమా? మరియు మూడవ పదం ఏం మాట్లాడుతారు? హౌ (ఎలా). మరి హౌ(ఎలా) అని కాదు, నో(know) అంటే, తెలుసు, ఎలా కాదు, నో అంటే తెలిసినవారు. ఎప్పుడైతే త్రికాలదర్శిగా అవుతారో, తెలిసినవారిగా అవుతారో, అప్పుడు ఎలా అని అంటారా? ఎలా అని అనడము అంటే భూతం రావడము. మరి భూతం మంచిగా అనిపిస్తుందా ? అందుకే ఈ పదాలే బలహీనతను తీసుకువస్తాయి. ఈ పదాలే వ్యర్థ సంకల్పాల ద్వారాన్ని తెరుస్తాయి. ఆలోచించండి! ఎప్పుడైతే వ్యర్థ సంకల్పాల క్యూ మొదలవుతుందో, అప్పుడు ఏ పదాలతో మొదలవుతుంది? ఈ పదాలతోనే మొదలవుతుంది కదా! లేదా ఎందుకు జరిగింది, ఏం జరిగింది లేదా ఎలా జరిగింది. ఇది ఎలా జరిగింది! వీరు ఎలా అన్నారు! వీరు ఎందుకు అన్నారు! ఇప్పుడు ఏమి చేయాలి!... ఎలా చేయాలి! కావున బలహీనతకు లేదా వ్యర్థ సంకల్పాలకు ద్వారాలు ఈ పదాలే. వీటిని డిక్షనరీలో మార్చండి. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు కూడా మారిపోతారు కదా! మరి భక్తులు మిమ్మల్నే కాపీ చేస్తున్నారు. మీది అనంతమైన విషయము మరియు వారు హద్దు రూపంలో స్మృతిచిహ్నాన్ని పెట్టుకున్నారు. మరి ఈ దృఢ వ్రతాన్ని పెట్టుకోవడము, ఇదే శివజయంతిని లేదా శివరాత్రిని జరుపుకోవడము. జరుపుకోవడము అంటే తయారవ్వడము. అంతేకానీ, కేవలం కేక్ కట్ చేసాము, లైట్లు వెలిగించాము, దీపాలు వెలిగించాము, ఇది జరుపుకోవడము కాదు, ఈ మనోరంజనం కూడా అవసరమే కానీ దీనితో పాటు కొన్ని కట్ చేయాలి మరియు కొన్ని వెలిగించాలి కూడా.
ఒక వైపు దీపాలను లేదా క్రొవ్వొత్తులను వెలిగిస్తారు, మరొక వైపు కేక్ కట్ చేస్తారు, మూడవది, జెండా ఎగురవేస్తారు, నాలుగవది, పాటలు పాడుతారు, ఐదవది, డాన్స్ కూడా చేస్తారు. ఇంకేం చేస్తారు? మిఠాయిని పంచుతారు మరియు తింటారు. మరి ఇప్పుడు ఈ 6 విషయాలనే చేయాల్సి ఉంటుంది. మొదట అయితే మీ మనసులో ధృఢ సంకల్పమనే దీపాన్ని వెలిగించండి - ఇప్పటి నుండి దృఢత ద్వారా సఫలతను పొందవలసిందే. చూస్తాములే, తెలియదు, తెలియదు, ఇలా కాదు. అవ్వాల్సిందే, చేయాల్సిందే, చేస్తాములే అన్న పదం కాదు, చేయాల్సిందే. రెండవది, ఏం కేక్‌ను కట్ చేస్తారు? కేక్‌ను ఒక్కసారిగా తినడం జరగదు, కట్ చేసి తినడం జరుగుతుంది. మరి ఏం కట్ చేస్తారు? సంపన్నంగా అవ్వడములో లేదా సంపూర్ణంగా అవ్వడంలో సంకల్పమాత్రమైనా ఏదైనా ఆటంకం వస్తే, దానిని ఇప్పటి నుండి కట్ చేయండి, సమాప్తము చేయండి. ఏదైతే బలహీనత ఉందో దానికి బదులుగా శక్తిని ధారణ చేసే కేక్‌ను నోట్లో వేసుకోండి. మొదట కట్ చేయండి, తర్వాత నోటి ద్వారా తినండి. అర్థమైందా! ఏ జెండాను ఎగురవేస్తారు? ఇదైతే స్మృతిచిహ్న రూపంలో జెండాను ఎగురవేస్తున్నారు, కానీ మీ మనసులో ప్రతి సంకల్పం, మాట మరియు కర్మల ద్వారా సదా తండ్రిని ప్రత్యక్షం చేసే జెండాను ఎగురవేయండి. ఏ సంకల్పం, మాట మరియు కర్మ అయినా, తండ్రిని ప్రత్యక్షం చేయని విధంగా ఉండకూడదు ఎందుకంటే అందరి మనసులలో తండ్రిపై స్నేహం ఉన్న కారణంగా తండ్రిని ప్రత్యక్షం చేయాలి అన్న సంకల్పమే ఉంది. మరి ఎలా చేస్తారు? సదా మీ సంకల్పం, మాట మరియు కర్మల ద్వారా మనసులో ప్రత్యక్షం చేసే జెండాను ఎగురవేయండి మరియు సదా సంతోషంగా ఉండే డాన్స్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు సంతోషంగా, అప్పుడప్పుడు ఉదాసీనంగా, ఇలా కాదు. ఎప్పుడైనా ఉదాసీనంగా అయినప్పుడు ఆ సమయంలో కూడా మీ ఫోటో ఒకటి తీసుకోండి. ఎప్పుడైతే సంతోషంగా ఉంటారో, అప్పుడు కూడా ఫోటో తీసుకోండి. రెండు ఫోటోలను ఒక దగ్గర పెట్టుకోండి. అప్పుడు చూడండి, ఏది బాగుందో? నేను ఇలా ఉన్నానా లేక అలా ఉన్నానా? మరి సదా హర్షితంగా ఉండే, సంతోషంగా ఉండే డాన్స్ చేయండి. ఏం జరిగినా కానీ, ఎవరు ఎంతగా సంతోషాన్ని దొంగలించడానికి ప్రయత్నించినా, ఎందుకంటే మాయ ఎవరో ఒకరి ద్వారా అయితే చేయిస్తుంది కదా! ఏది జరిగినా కానీ, ఎవరు ఎంతగానైనా ఏ రకంగానైనా సంతోషం తక్కువ చేయడానికి లేదా సంతోషం మాయం చేయడానికి ప్రయత్నించినా కానీ, ఎప్పటివరకైతే జీవించనున్నారో, అప్పటి వరకు సంతోషంగా ఉండాలి. ఈ వ్రతాన్ని పక్కాగా తీసుకున్నారు కదా. మీరు ఇది చేయలేరా! విల్ పవర్ ఉంది కదా! మరి ఎవరి వద్ద విల్ పవర్ ఉంటుందో వారు చేయలేనిది ఏముంటుంది! ఒకవేళ మాస్టర్ సర్వశక్తిమంతులైన మీరే చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు! ఇంకా మరెవరైనా జన్మించాల్సినవారు ఉన్నారా లేక మీరేనా? మాలలో మణులుగా మీరే అవ్వాలా లేక ఇతరుల కోసం ఎదురుచూస్తున్నారా? ఫస్ట్ డివిజన్‌లోకి రావాలి కదా! లేదా సెకెండ్ కూడా నడుస్తుందా? మరి ఈ దృఢ సంకల్పాన్ని అనగా వ్రతాన్ని తీసుకోండి - ఎప్పటివరకైతే జీవించనున్నామో అప్పటి వరకు సంతోషంగా ఉండాలి. ఎవరైతే సంతోషంగా ఉంటారో, వారు సంతోషమనే మిఠాయిని పంచుతూ ఉంటారు. ఆ మిఠాయితోనైతే కేవలం నోరు తీపి అవుతుంది మరియు దీనితో మనసు, తనువు, హృదయం అన్నీ సంతోషంగా అవుతాయి. కనుక ఈ మిఠాయిని పంచాలి. ఏ పాటను సదా పాడుతారు? మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ఈ పాటనే పాడుతారు కదా! సదా ఈ పాట స్వతహాగా మోగుతూ ఉండాలి. అంతేకానీ, బ్యాటరీ స్లో అయితే పాట ఆగిపోవడం కాదు. బ్యాటరీ స్లో అవ్వకూడదు. అలా కాదు. బ్యాటరీ స్లో అయినప్పుడు ఏ పాటను పాడుతారో తెలుసా? అందరికీ అనుభవమైతే ఉంది కదా. అప్పుడు ఏం జరుగుతుంది? నాకైతే బాబాయే, అయితే-అయితే అని వచ్చేస్తుంది. కేవలం నా బాబా అని అనరు, నాకైతే బాబాయే. ఇది మిక్స్ అయినట్లు కదా. బ్యాటరీ స్లో అయినప్పుడు శబ్దం స్లో అయిపోతుంది మరియు అందులో పదాలు కలిసిపోతాయి. నా బాబా అని నషాతో కాదు, నాకైతే ఉన్నదే బాబా.
మరి శివరాత్రిని జరుపుకోవడము అనగా ఈ దృఢ వ్రతాన్ని తీసుకోవడము. ఇటువంటి శివరాత్రిని జరుపుకున్నారు కదా? లేదా ఆలోచించి తర్వాత జవాబు చెప్తారా! అచ్ఛా, చాలా తెలివైనవారు, ఇప్పుడిప్పుడే ఆలోచించారు. డబల్ విదేశీయులు, అందుకే డబల్ తెలివైనవారు. అచ్ఛా!
డబల్ విదేశీయులు మధుబన్‌లో ఏ విశేష సేవను చేసారు? ఏం చేసారు? బ్రహ్మా బాబాను ప్రత్యక్షం చేసారు. స్టాంప్‌కు సంబంధించిన ఫంక్షన్‌ను జరిపారు. విశేష యోగం కూడా పెట్టుకున్నారు కదా. శక్తిశాలి యోగం పెట్టుకున్నారు, అందుకే విఘ్న వినాశకులుగా అయ్యారు కదా. మధుబన్ నివాసుల యోగం కావచ్చు, డబల్ విదేశీయుల యోగం కావచ్చు, నలువైపులా ఉన్న బ్రాహ్మణ పిల్లల యోగం కావచ్చు, అద్భుతం చేసింది కదా ఎందుకంటే నలువైపులా అందరికీ ఈ ఒక్క సంకల్పమే ఉండేది - బ్రహ్మా తండ్రిని ప్రత్యక్షం చేయాల్సిందే. కొంతమంది పరుగులు పెట్టే సేవను చేసారు, కొంతమంది మనసా సేవ చేసారు, కొంతమంది వాచా సేవ చేసారు, కానీ ఎవరైతే యోగయుక్తులుగా అయ్యి సేవ చేసారో, అటువంటి సేవాధారులకు సఫలత యొక్క శుభాకాంక్షలు. ఎంత సంతోషం కలిగింది! ఎందుకంటే బ్రహ్మా తండ్రి అంటే అందరికీ హృదయపూర్వకమైన అతి సూక్ష్మమైన ప్రేమ ఉంది. అందరూ బ్రహ్మా తండ్రిని చూసారా లేదా తెలుసుకున్నారా? ఏమంటారు, చూసారా లేక తెలుసుకున్నారా? ఎవరైతే, మేము చూసాము అని అంటారో వారు చేతులెత్తండి. ఎవరైతే, తెలుసుకున్నాము కానీ ఇప్పుడు చూడాలి అని అంటారో వారు చేతులెత్తండి. (కొద్దిమంది చేతులెత్తారు) అచ్ఛా, అనుభవం చేసారా? బ్రహ్మా తల్లి తండ్రి అన్న అనుభవం చేసుకున్నారా? ఎందుకంటే అనుభవం కూడా ఒక నేత్రం వంటిది, ఎలాగైతే స్థూల నేత్రాలతో చూడడం జరుగుతుందో, అలాగే అన్నింటికన్నా పెద్ద నేత్రము అనుభవము. అనుభవమనే నేత్రంతో చూసినా కూడా చూసామనే అంటారు. ఒకవేళ అనుభవం కూడా చేసుకోలేదు మరియు అవ్యక్త రూపంతో, అవ్యక్త స్థితి ద్వారా చూడలేదు అంటే, మీ పేర్లు దాదీ దగ్గర నోట్ చేయించండి, అప్పుడు వారు అనుభవం చేయిస్తారు. అనుభవం చేయకుండా ఉండిపోవద్దు ఎందుకంటే స్టాంప్ ద్వారా ఇతరులకు బ్రహ్మా తండ్రి యొక్క అనుభవం చేయిస్తున్నారు మరియు స్వయం అనుభవం చేసుకోకపోతే మంచిగా ఉండదు కదా. ఎప్పుడైతే బ్రహ్మా తండ్రి చిత్రం ఎదురుగా కూర్చుంటారో, అప్పుడు చిత్రం ద్వారా చైతన్యతతో మిలనం, అనుభవం యొక్క అనుభూతి అవ్వడం లేదా! ఆత్మిక సంభాషణకు రెస్పాన్స్ లభించడం లేదా? లభిస్తుంది కదా. తండ్రి ఉన్నారు, అందుకే వింటారు మరియు జవాబు ఇస్తారు. అయినా కూడా ఈ అనుభవం నుండి వంచితమవ్వకూడదు. అర్థమైందా! మరి అందరూ ఏ సేవనైతే చేసారో, విశేషంగా భారతవాసులు సేవలో ఎక్కువ ఛాన్స్ తీసుకున్నారు, మరి బాప్‌దాదా పేర్లు తీసుకోరు కానీ అందరూ తమ సేవకి రిటర్న్‌లో పేరు సహితంగా శుభాకాంక్షలను స్వీకరించండి. డబల్ విదేశీయులకు కూడా సేవా అవకాశం లభించింది. మంచిగా అనిపించింది కదా! నాట్యం చేస్తున్నారు కదా! అచ్ఛా!
నలువైపులా ఉన్న బ్రాహ్మణ జన్మ అనే దివ్య జన్మకు అధికారి ఆత్మలకు, సదా తండ్రి మరియు మీరు కలిసి కంబైన్డుగా ఉండే సమీపాత్మలకు, సదా డబల్ పూజ్య స్వరూపం యొక్క స్మృతిలో ఉండే సమర్థ ఆత్మలకు, సదా దృఢ సంకల్పం లేదా దృఢ వ్రతాన్ని నిర్వర్తించే సఫలత యొక్క అధికారి ఆత్మలకు, సదా సంతోషంగా ఉండేవారు మరియు ఇతరులను కూడా సంతోషపరిచే అదృష్టవంతులైన పిల్లలకు, త్రిదేవ రచయిత అయిన తండ్రి మరియు బ్రహ్మా తండ్రి నుండి విశేషంగా జన్మదిన శుభాకాంక్షలు కూడా మరియు ప్రియస్మృతులు కూడా. దానితో పాటు సర్వ శ్రేష్ఠ ఆత్మలకు నమస్తే.
దాదీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము -
(దాదీజీ బ్రహ్మా బాబా స్టాంప్ యొక్క ఆల్బమ్‌ను బాప్‌దాదాకు చూపించారు)
అందరి బుద్ధులను టచ్ చేశారు. అందరి పురుషార్థం మరియు అందరి శ్రేష్ఠ సంకల్పం సఫలతను పొందేలా చేసింది. సఫలత అధికారం. పురుషార్థం చేయడం కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది మరియు సఫలత ప్రాప్తి అవడం కూడా నిశ్చితమే. కేవలం నిశ్చయాన్ని చూడడం కోసం మధ్య మధ్యలో అలజడి జరుగుతుంది. అయితే అనుభవం చేశారు, యోగం యొక్క ప్రయోగంతో సహజంగా అయిపోయింది కదా. కేవలం పురుషార్థంతో కాదు, పురుషార్థంలో ఎక్కువగా నిమగ్నమై, యోగం యొక్క ప్రయోగం తక్కువగా చేస్తే సఫలత కొంచెం దూరమైపోతుంది. పురుషార్థం మరియు యోగం యొక్క ప్రయోగంతో అందరి వృత్తులను పరివర్తన చేయడం - ఇది తోడుగా ఉంటే సఫలత సమీపంగా వస్తుంది. అయితే యోగం యొక్క ప్రయోగం యొక్క ఈ అనుభవాన్ని కూడా చూసేశారు. ఒకటి దృఢ నిశ్చయం మరియు రెండవది ప్రయోగం ద్వారా ఎవరి బుద్ధినైనా పరివర్తన చేయవచ్చు కానీ అంత పవర్ఫుల్ యోగం ఉండాలి. ఈ సంఘటన యొక్క ప్రయోగం సఫలతను ప్రత్యక్ష రూపంలో చూపించింది. హిస్టరీలో చూడండి, ఆదినుండి సేవ యొక్క హిస్టరీలో ఎప్పుడైనా ఏదైనా అలజడి జరిగినప్పుడు సఫలత యోగం యొక్క ప్రయోగం యొక్క విశేషతతోనే జరిగింది. పురుషార్థం నిమిత్తంగా అవుతుంది, పురుషార్థం ధరణిని తయారుచేస్తుంది, అది కూడా అవసరమే. కానీ సఫలత యొక్క బీజం ఉత్పన్నమయ్యే సాధనం, బయటకు వచ్చే సాధనం అయినా కూడా యోగం యొక్క ప్రయోగమే అయింది. ఇది అందరికీ అనుభవమే కదా. ధరణిని తయారుచేయడం కూడా అవసరమే కానీ బీజం నుండి ఫలం ప్రత్యక్ష రూపంలో రావడానికి బ్యాలెన్స్ కావాలి. బ్యాలెన్స్‌లో కొంచెం కూడా, 5%, 10% కూడా లోపం ఉంటే తేడా వచ్చేస్తుంది. కానీ అందరూ ఉల్లాస-ఉత్సాహాలతో సహయోగం ఇచ్చి సఫలతను పొందారు. అయితే బాప్‌దాదా అందరు పిల్లలకు సఫలతకు అభినందనలు ఇస్తున్నారు. మంచిది!
అవ్యక్త బాప్‌దాదా యొక్క పర్సనల్ మిలనము
డబల్ విదేశీ సోదరసోదరీలతో
గ్రూప్ నం. 1
స్వయం మరియు సమయంపై నమ్మకం లేదు - అందుకే దృఢ సంకల్పంతో బలహీనతలను తొలగించండి
అందరూ తమను విశ్వ సేవాధారీగా అనుభవం చేస్తున్నారా? ఎవరి వద్ద అయితే సర్వశక్తుల ఖజానా సంపన్నంగా ఉంటుందో వారే విశ్వ సేవాధారీ లేదా విశ్వ కళ్యాణకారీగా అవ్వగలరు. అయితే సర్వశక్తుల స్టాక్ జమ అయి ఉందా? సర్వశక్తులు ఉన్నాయా లేదా ఏదో ఒక శక్తి ఉంది, మరొకటి లేదా? ఎప్పుడైనా ఏదైనా తక్కువ అయిపోతుందా? సదా మీకు మీరు చెక్ చేసుకోండి సర్వశక్తులు ఉన్నాయా లేదా ఏదైనా శక్తి లోపం ఉందా? లోపం ఉంటే దాని కారణాన్ని ఆలోచించండి. ఎందుకంటే కారణాన్ని అర్థం చేసుకుంటే నివారణ చేయగలరు. ఎందుకంటే ఇది మాయ యొక్క నియమం, మీలో ఏ బలహీనత ఉంటుందో అదే బలహీనత ద్వారా మిమ్మల్ని మాయాజీత్గా అవ్వనివ్వదు. అయితే వర్తమాన సమయంలో కూడా ఎప్పటికప్పుడు మాయ అదే బలహీనత యొక్క లాభాన్ని తీసుకుంటుంది మరియు ముందుకు వెళ్లి అంతిమ సమయం వచ్చినప్పుడు కూడా ఆ బలహీనత మోసం చేస్తుంది. అయితే ఇలా ఆలోచించకండి - కొంచెమే బలహీనత ఉంది, ఒకే బలహీనత ఉంది, మిగతా నేను చాలా బాగున్నాను, బాగున్నాను! ఒక బలహీనత కూడా మోసం చేస్తుంది. అందుకే ఏ బలహీనతనూ మీలో ఉండనివ్వకండి. స్వయంగా తొలగించలేకపోతే ఎవరి సహయోగమైనా తీసుకోండి, శక్తిశాలి ఆత్మల సహయోగం తీసుకోండి. విశేష యోగం యొక్క ప్రయోగం చేయండి. ఏ విధంగానైనా బలహీనతను తొలగించాల్సిందే - ఈ దృఢ సంకల్పం చేయండి. భవిష్యత్తులో అయిపోతానులే అని ఇలా కూడా ఆలోచించకండి. ఇప్పటి నుండే తొలగించండి. ఎందుకంటే స్వయంపై మరియు సమయంపై ఎలాంటి నమ్మకం లేదు. ఇలా ఆలోచించకండి, ఇక మీదట ఇది చేస్తాము, అయిపోతుందిలే. కాదు. మీ స్లోగన్ ‘ఇప్పుడు కాదు అంటే ఎప్పుడూ కాదు’ అయితే చేయాల్సింది ఇప్పుడే చేయాలి. ఎందుకంటే బాబా సంపన్నంగా ఉన్నారు మరియు మీకు బాబాపై ప్రేమ ఉంది అయితే బాబా సమానంగా అవ్వడమే ప్రేమకు ప్రాక్టికల్ స్వరూపం. ఎంతగా బాబాపై చాలా-చాలా ప్రేమ ఉందో అంతగానే పురుషార్థంతో కూడా చాలా-చాలా ప్రేమ ఉందా? ఎంతగా బాబాపై ప్రేమ కోసం గర్వంతో చెబుతారో 100% కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని, అలాగే పురుషార్థం కోసం కూడా చెప్పండి. ఆలోచిస్తాము, చేస్తాము.. కాదు. అన్ని బలహీనతలు సమాప్తం. లే, లే... కాదు. శివరాత్రి జరుపుకోవడానికి వచ్చారు కాబట్టి ఏదో ఒకటి బలి అవుతుంది కదా. బాప్‌దాదా పిల్లలందరినీ సంపన్నంగా చూడాలని కోరుకుంటున్నారు. బాబా ప్రేమ ఉంది అందుకే పిల్లల లోపం బాగుండదు. అయితే ఏమి గుర్తుంచుకుంటారు - సదా సంపన్నంగా, సంపూర్ణంగా ఉండాల్సిందే అనా లేక కొంచెం-కొంచెం కంప్లెయింట్ చేస్తూనే ఉంటారా? కంప్లీట్! కంప్లెయింట్ సమాప్తం. సంపన్నంగా అవ్వడమే జరుపుకోవాలి.
గ్రూప్ నం. 2
వేస్ట్‌ను బెస్ట్‌గా చేయడం అంటే హోలీహంసలుగా అవ్వడం
అందరూ తమను సదా హోలీ హంసలుగా అనుభవం చేస్తున్నారా? హోలీ హంస యొక్క అర్థం సంకల్పం, మాట మరియు కర్మలో ఏది వ్యర్థంగా ఉంటుందో దానిని సమర్థంగా మార్చడం. ఎందుకంటే వ్యర్థం రాయిలా ఉంటుంది, రాయికి విలువ లేదు, రత్నానికి విలువ ఉంటుంది. అయితే వ్యర్థాన్ని సమాప్తం చేయడం అంటే హోలీ హంసలుగా అవ్వడం. అయితే వ్యర్థం వస్తుందా? ఇది పనికొచ్చే వస్తువు కాదు, ఇది పనికొచ్చే వస్తువు అని హోలీ హంసలు వెంటనే గుర్తిస్తారు. అయితే మీరు హోలీ హంస కదా. అయితే వ్యర్థం సమాప్తమైందా? ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారు, ఇప్పుడు సంకల్పం, మాట లేదా కర్మను వ్యర్థంగా పోగొడితే మొత్తం కల్పం కోసం మీ జమ ఖాతాలో లోపం వచ్చేస్తుంది. తెలుసు కదా, నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారా? అయితే తెలిసి కూడా ఎందుకు వ్యర్థం చేస్తారు? చేయాలని అనుకోము కానీ అయిపోతుంది - ఇలా చెబుతారా? ఇప్పటికీ ఇలా చేయవచ్చు అని అర్థం చేసుకునేవారు చేయి ఎత్తండి. మీరు ఎవరు? (రాజయోగి) రాజయోగి యొక్క అర్థం ఏమిటి? రాజు కదా, అయితే మనసును కంట్రోల్ చేయలేరా! కింగ్‌లో రూలింగ్ పవర్ ఉంటుంది కదా! అయితే మీలో రూలింగ్ పవర్ లేదా? అమృతవేళ మరియు మళ్లీ రోజంతటిలో మధ్య మధ్యలో మీ ఆక్యుపేషన్ను(వృత్తిని) గుర్తు చేసుకోండి - నేను ఎవరు? ఎందుకంటే పని చేస్తూ చేస్తూ, నేను రాజయోగిని అన్న ఈ స్మృతి మర్జ్ అయిపోతుంది. అందుకే ఇమర్జ్ చేయండి. ఈ నియమాన్ని పెట్టుకోండి. మనం రాజయోగులమే కదా అని భావించకండి. రాజయోగి యొక్క సీట్‌పై సెట్ అయి ఉండండి. లేకపోతే నడుస్తూ నడుస్తూ కర్మలో బిజీగా ఉండటం కారణంగా యోగాన్ని మర్చిపోతారు, కేవలం కర్మ మాత్రమే మిగిలిపోతుంది. కానీ మీరు కర్మయోగి కంబైండ్‌గా ఉన్నారు. యోగి సదా రూలింగ్ పవర్, కంట్రోలింగ్ పవర్లో ఉండాలి. అప్పుడు రాజయోగి డబల్ పవర్ ఉన్నవారు ఎప్పుడూ వ్యర్థంగా ఆలోచించలేరు. అయితే, రాజయోగి వేస్ట్ చేయగలడు అని ఎప్పుడూ ఇలా అనకండి, ఆలోచించకండి కూడా. అయితే ఇది ఏ గ్రూప్? బెస్ట్ గ్రూప్. బాప్‌దాదాకు కూడా బెస్ట్ గ్రూప్ అత్యంత ప్రియమైనది ఎందుకు? 63 జన్మలు చాలా వేస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఈ చిన్న జన్మ బెస్ట్‌లో బెస్ట్. మంచిది!
గ్రూప్ నం. 3
ప్యూరిటీ యొక్క రాయల్టీయే బ్రాహ్మణ జీవిత విశేషత
అందరికీ బ్రాహ్మణ జీవిత విశేషత లేదా ఫౌండేషన్‌ను తెలుసా? ఏమిటి? (ప్యూరిటీ) ప్యూరిటీనే(పవిత్రత) ఫౌండేషన్ అని ఇది పక్కానా? అయితే అందరూ పక్కా బ్రాహ్మణులే కదా! ప్యూరిటీ యొక్క రాయల్టీ బ్రాహ్మణ జీవిత విశేషత. ఎలాగైతే ఎవరైనా రాయల్ ఫ్యామిలీకి చెందిన పిల్లవాడు ఉంటే అతని ముఖం నుండి, నడవడిక నుండి ఇతను ఏదో రాయల్ కులానికి చెందినవాడు అని తెలుస్తుంది. అలాగే బ్రాహ్మణ జీవితానికి గుర్తింపు ఈ పవిత్రత యొక్క మెరుపు ద్వారానే కనిపిస్తుంది. సదా సంకల్పంలో కూడా పవిత్రత ఉన్నప్పుడు ముఖంలో మరియు నడవడికలో పవిత్రత యొక్క మెరుపు కనిపిస్తుంది. సంకల్పంలో కూడా అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. అయితే అలానే ఉన్నారా లేదా ఎప్పుడైనా సంకల్పంలో కొంచెం ప్రభావం పడుతుందా? ఎందుకంటే ప్యూరిటీ కేవలం బ్రహ్మచర్య వ్రతం కాదు. కానీ ప్యూరిటీ అంటే ఏ వికారము అంటే అశుద్ధి యొక్క ప్రభావం ఉండకపోవడం. అయితే ఫౌండేషన్ పక్కాగా ఉందా లేదా ఎప్పుడైనా క్రోధానికి అనుమతి ఇస్తారా? క్రోధం యొక్క పిల్లలు వస్తారా లేదా అంశం మరియు వంశం అంతా సమాప్తమా! ఏమి అర్థం చేసుకుంటున్నారు? మాతలకు మోహం వస్తుందా? బాడీ కాన్షస్నెస్ యొక్క అటాచ్మెంట్ ఉందా? ఏ వికారము యొక్క అంశమాత్రం కూడా లేదు. ఎందుకంటే పెద్దవారిపై మోహం లేదా మమకారం త్వరగా తొలగిపోతుంది, కానీ చిన్నవారిపై కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎలాగైతే లౌకిక సంబంధంలో కూడా పిల్లలపై ఎంత ప్రేమ ఉంటుందో దానికంటే మనవళ్ళు, మునిమనవళ్ళపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. అలాగే వికారాల యొక్క గ్రేట్ చిల్డ్రెన్పై(మనవళ్ళపై) ప్రేమ అయితే లేదు కదా? ఫౌండేషన్ ప్యూరిటీ, అందుకే ఈ ఫౌండేషన్‌పై సదా అటెన్షన్ ఉండాలి. అందరి లక్ష్యం చాలా బాగుంది. అయితే ఎలాగైతే లక్ష్యం ఉందో అలాగే లక్షణాలు స్వయానికి కూడా అనుభవం అవ్వాలి మరియు ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. ఎందుకంటే అనేక అపవిత్ర ఆత్మల మధ్యలో మీరు పవిత్ర ఆత్మలు చాలా కొద్దిమంది ఉన్నారు. అయితే కొద్దిమంది పవిత్ర ఆత్మలు అపవిత్రతను సమాప్తం చేయాలి. అయితే ఎంత పవర్ కావాలి! అయితే సదా చెక్ చేయండి, అపవిత్రత యొక్క అంశమాత్రం కూడా ఉండకూడదు. ఎందుకంటే మీ జడ చిత్రాలను కూడా సదా నిర్వికారి అని కీర్తిస్తారు. ఇది ఎవరి మహిమ చేస్తున్నారు? మీదా లేదా భారతవాసులదా? అయితే ప్రాక్టికల్‌గా చైతన్యంలో అయ్యారు కాబట్టే మహిమ జరుగుతోంది. ఇది మనమే అన్న పక్కా నిశ్చయం ఉంది కదా! అయితే బ్రాహ్మణులు అంటే పవిత్రత యొక్క రాయల్టీలో ఉండేవారు. పవిత్రత బ్రాహ్మణ జీవిత విశేషత. ధైర్యమును ఉంచుకుని ముందుకు వెళ్తున్నారు మరియు ఇంకా కూడా మున్ముందుకు వెళ్లాల్సిందే. ఎగిరే కళలో ఉన్నారా లేదా నడిచే కళలో ఉన్నారా? ఎప్పుడైనా క్రిందికి పైకి అవుతారా? సదా ఫైన్‌గా ఉన్నారా లేదా అప్పుడప్పుడు ఫైన్‌గా ఉన్నారా? సమ్ టైమ్ సమాప్తమైందా? కొంచెం కొంచెం మిగిలి ఉంది అని ఇప్పుడు ఆత్మిక సంభాషణలోకి వచ్చి ఇలా చెప్పరు కదా! కాదు. ఇప్పుడు ఏమి ఆత్మిక సంభాషణ చేస్తారు? ఓ.కే. ఓ.కే. అనగానే చూడండి ముఖాలు చిరునవ్వులు చిందిస్తాయి. మరియు సమ్‌టైమ్ అని చెప్పినప్పుడు కళ్ళు క్రిందికి అయిపోతాయి. ఇప్పుడు అవ్వకపోతే ఎప్పుడు అవుతాము అన్న మాటను సదా స్మృతిలో పెట్టుకోండి. ఇప్పుడే అవ్వాలి. పురుషార్థం చేస్తాములే, చూస్తాములే, కాదు. అవ్వాల్సిందే, దీనినే నిశ్చయబుద్ధి విజయీ అంటాము. అయితే ఎవరు? ప్యూరిటీ యొక్క రాయల్టీలో ఉండేవారు. మంచిది, అందరూ తమను ఫస్ట్ డివిజన్ ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సదా ఫస్ట్‌గా ఉండాలి మరియు సదా ఇతరులను కూడా ఫాస్ట్ గతితో ముందుకు తీసుకువెళ్లాలి.
గ్రూప్ నం. 4
సంతుష్టమణిగా అవ్వడానికి మీ అనాది మరియు ఆది స్వరూపం యొక్క స్మృతిలో ఉండండి
సదా మీ అనాది మరియు ఆది స్వరూపాన్ని సహజ స్మృతిలోకి తీసుకురాగలరా? అనాది రూపం నిరాకార జ్యోతి స్వరూప ఆత్మ మరియు ఆది స్వరూపం దేవ ఆత్మ. అయితే రెండు స్వరూపాలు సదా స్మృతిలో ఉంటున్నాయా మరియు సహజ స్మృతి ఉంటుందా? ఎంతగా దేహభానంలో ఉండటం సహజంగా ఉందో, అంతగానే దేహీ అభిమాని స్థితిలో స్థితులవ్వడం కూడా సహజంగా ఉందా? బాడీ కాన్షస్‌లో ఎంత సమయంలోకి వచ్చేస్తారు? సమయం పడుతుందా? శ్రమ అవసరం లేదు, సమయం అవసరం లేదు. ఎందుకంటే అభ్యాసం ఉంది. అయితే అలాగే ఇప్పుడు నాలెడ్జ్ లభించింది కాబట్టి నాలెడ్జ్ యొక్క లైట్, నాలెడ్జ్ యొక్క మైట్ ఆధారంగా ఇప్పుడు సోల్ కాన్షస్నెస్ యొక్క స్మృతి యొక్క ఇలాంటి సహజ అనుభవం ఉండాలి. ఇది కూడా అభ్యాసం చేస్తూ చేస్తూ సహజంగా అయిపోయింది కదా. లేదా 63 జన్మల అభ్యాసం శక్తిశాలిగా ఉందా? విస్మృతి యొక్క 63 జన్మలు మరియు స్మృతి యొక్క ఈ చిన్న జన్మ కూడా 63 జన్మల కంటే శక్తిశాలిగా ఉంది.
ఎందుకంటే ఈ సమయంలో నాలెడ్జ్ యొక్క లిఫ్ట్ లభించి ఉంది కాబట్టి లిఫ్ట్‌లో చేరుకోవడం సహజంగా ఉంటుంది. లిఫ్ట్ ద్వారా సెకండ్లో చేరుకుంటారు కదా, దిగుతూ ఎక్కుతూ ఉంటారా? సెకండ్లో స్మృతి వచ్చింది మరియు అనుభవంలో స్థితులైపోవాలి. ఎందుకంటే స్మృతి శక్తిశాలిగా ఉంటుంది, విస్మృతి బలహీనంగా చేస్తుంది. అయితే శక్తిశాలిగా ఉన్నారు కదా? ఎంత పవర్ ఉంది? ఫుల్‌గా ఉందా? పవర్ ఫుల్‌గా ఉంది కదా? పవర్ అనే పదం విడిగా అనరు, పవర్ఫుల్ అంటారు. ఇలాంటి ధైర్యవంతులుగా ఉన్నారా లేదా ఎప్పుడైనా ఫెయిల్, ఎప్పుడైనా ఫుల్! ప్రతి కల్పంలో స్మృతి స్వరూపంగా అయ్యారు, ఇప్పుడు కూడా అయ్యారు మరియు ప్రతి కల్పంలో అవుతూ ఉంటారు. ఎన్ని కల్పాల అభ్యాసం ఉంది? అనేకసార్ల అభ్యాసం ఉంది కదా, అనేకసార్లు చేశారు కదా, కొత్త విషయం కాదు కదా? బాబాకు చెందినవారిగా అవ్వడం అంటే పరివర్తన అవ్వడం. బ్రాహ్మణులుగా అవ్వడం అంటే స్మృతి స్వరూపంగా అవ్వడం. ఈ మీ అనాది స్వరూపంలో స్థితులవ్వడం ద్వారా స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులకు కూడా సంతుష్టత యొక్క విశేషతను అనుభవం చేయిస్తారు. అయితే అందరూ సంతుష్టమణులా లేదా అవ్వాలా? అసంతుష్టతకు కారణం అప్రాప్తి. అయితే మీకు ఏదైనా అప్రాప్తి ఉందా? మీ స్లోగన్ ఏమిటి? పొందాల్సినది పొందేశాము. అయితే పొందేశారా లేదా కొంచెం కొంచెం మిగిలి ఉందా? ఎందుకంటే బాబాకు చెందినవారిగా అవ్వడం అంటే వారసత్వానికి అధికారి అవ్వడం. అయితే అధికారీ ఆత్మలే కదా? అయితే సదా ఏ పాట పాడుతారు? పొందేశాము.. ఇది మీ అందరి పాటా లేదా కొందరిదేనా, కొందరిది కాదా? అందరిదా? ఎవరికైనా వేరే పాట ఉంటే చెప్పండి. ఎందుకంటే ఒక్కరి వారైతే పాట కూడా ఒక్కటే. ఇప్పుడు పొందకపోతే ఎప్పుడు పొందుతారు? అయితే మీకు మీరు సదా పదమారెట్లు భాగ్యవంతులుగా భావించండి. పదమారెట్లు కూడా మీ ముందు ఏమీ కాదు. ఇంత నషా ఉంది కదా? ఎంతమంది సాధనాలను ప్రాప్తి చేసుకునే ఆత్మలు ఉన్నారు కానీ ఎంతగా వినాశీ ప్రాప్తులు కలిగినవారో అంతగానే అవినాశీ ప్రాప్తులలో బికారిగా ఉన్నారు. ఇది అనుభవమే కదా? ఎంత ఎక్కువ సాధనాలు ఉంటాయో అంత శాంతిగా నిద్ర కూడా ఉండదు. మరి మీ జీవితం ఎంత శాంతిగా ఉంది! ఏదైనా అశాంతి ఉందా? ఎప్పుడైనా తనువు లేదా మనస్సు యొక్క అశాంతి అయితే లేదు కదా? ఎవర్‌హెల్దీగా ఉన్నారు కదా? మైండ్ కూడా హెల్దీ అయితే హెల్త్ కూడా హెల్దీ. రెండూ ఉన్నాయి కదా? ప్రపంచం ముందు ఛాలెంజ్ చేసేవారు. ఎవ్రహెల్దీని చూడాలంటే ఎవరిని చూడాలి? మిమ్మల్ని! ప్రతి ఒక్కరూ నన్ను చూడండి అంటారా లేదా జానకీ దాదీని చూడండి అంటారా - ఇలా అయితే అనరు కదా? మీరే కదా? ఎందుకు, బాబా ఖజానాలకు యజమానులు కాబట్టి యజమాని ఎప్పుడూ నిండుగా, సంపన్నంగా ఉంటారు. అయితే ఇలా కంప్లీట్‌గా ఉన్నారా లేదా కంప్లెయింట్ మరియు కంప్లీట్ - రెండూ నడుస్తున్నాయా? అయితే ఇదే సదా స్మృతిలో ఉంచుకోండి అధికారి మరియు అనేక జన్మలు అధికారి గానే ఉంటారు. గ్యారంటీ కదా? ఈ సుఖము-శాంతి-పవిత్రత యొక్క అధికారం జన్మ-జన్మలు ఉంటాయి. అయితే, ఒక్క జన్మకు మాత్రమే కాదు, అనేక జన్మలకు అధికారులము అని గర్వంతో చెప్పండి. మంచిది!
గ్రూప్ నం. 5
సహజయోగానికి ఆధారం - సంబంధం మరియు ప్రాప్తి
అందరూ తమను సహజయోగి ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సహజయోగానికి ఆధారం ఏమిటి? విశేషంగా రెండు విషయాలు ఉన్నాయి. ఏవి? సహజమునకు ఆధారం - స్నేహం, కానీ స్నేహానికి ఆధారం సంబంధం. సంబంధం ద్వారా స్మృతి చేయడం సహజంగా ఉంటుంది మరియు సంబంధం ద్వారా ప్రేమ పుడుతుంది. రెండవ విషయం ప్రాప్తులు. ఎక్కడ ప్రాప్తి ఉంటుందో, అది అల్పకాలపు ప్రాప్తి అయినా సరే, మనస్సు మరియు బుద్ధి అక్కడకు సహజంగానే వెళ్లిపోతాయి. అయితే ముఖ్యంగా రెండు విషయాలు ఉన్నాయి - సంబంధం మరియు ప్రాప్తి. అనుభవమే కదా? నిజానికి చూస్తే, ‘బాబా’ అని చెప్పి స్మృతి చేయండి మరియు ‘నా బాబా’ అని చెప్పి స్మృతి చేయండి, అయితే తేడా ఉందా? ‘నా’ అని అనడం ద్వారా సహజంగా అవుతుంది కదా. ఎందుకంటే ఎక్కడ నాది ఉంటుందో అక్కడ అధికారం ఉంటుంది. మరియు అధికారం ఉండటం కారణంగా అధికారికి ప్రాప్తి తప్పకుండా ఉంటుంది. అయితే సర్వ సంబంధాలు ఉన్నాయి కదా, ఒకటి-రెండు కాదు, మిగతా అన్నీ ఉన్నాయా? ప్రాప్తులు ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి కదా. ఇచ్చేవారు ఇస్తున్నప్పుడు తీసుకోవడంలో ఏమి నష్టం ఉంది? ఏ ప్రాప్తులు? బాబా శక్తులను, జ్ఞానమును, గుణాల ఖజానాను ఇచ్చారు, సుఖ-శాంతి, ఆనందం, ప్రేమ, అన్ని ఖజానాలు ఇచ్చారు. అయితే ఎన్ని ప్రాప్తులు ఉన్నాయి! ఎందుకంటే బాబా వద్ద ఈ ఖజానాలు పిల్లల కోసమే ఉన్నాయి. మరి పిల్లలు తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? మేము పిల్లలమేనా కాదా - ఇది కూడా ఆలోచిస్తున్నారా? మరి అధికారం తీసుకోవడంలో ఎందుకు లోపం చేస్తున్నారు? ఇప్పుడు అధికారం తీసుకోకపోతే ఎప్పుడు తీసుకుంటారు? ఏవైతే భిన్న-భిన్న ప్రాప్తులు ఉన్నాయో, ఆ ప్రాప్తులను ముందు ఉంచుకోండి. ప్రాప్తిని ఇమర్జ్ చేయడం ద్వారా ప్రాప్తి యొక్క సంతోషాన్ని అనుభవం చేస్తారు. కేవలం బాబా నావారు, కాదు, కానీ బాబాతో పాటు వారసత్వం కూడా నాది. పిల్లవాడికి ప్రాపర్టీ యొక్క సంతోషం ఉంటుంది కదా. అయితే ఇది అనంతమైన ప్రాపర్టీ. బాలక్ సో యజమానిని - ఈ సంతోషంలో సదా ఉండండి. కోట్లలో కొద్దిమంది మరియు వారిలో కూడా అతి కొద్దిమంది అని ఏ గాయనం ఉందో అది ఎవరిది? మీరు కోట్లలో కొద్దిమంది కాదా? బాప్‌దాదా పిల్లలందరినీ ఇంత శ్రేష్ఠ ఆత్మ రూపంలో చూస్తున్నారు. ప్రపంచం భ్రమిస్తుంది, మీరేమో ఆనందాలు జరుపుకుంటున్నారు. ఆనందంగా ఉంటున్నారు కదా లేదా ఇప్పటికీ ఇక్కడ అక్కడ భ్రమిస్తున్నారా? స్థానం దొరికింది కదా? అయితే పగలు-రాత్రి సంతోషంలో నాట్యం చేస్తూ ఉండండి, సంతోషంలో నిద్రపోండి. జీవితం ఉంటే బ్రాహ్మణ జీవితం. అయితే స్వయం యొక్క మహత్వాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. ఏమిగా ఉండేవారు మరియు ఏమిగా అయిపోయారు! శ్రేష్ఠంగా అయిపోయారు కదా. మీ ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని కర్మ చేస్తూ కూడా స్మృతిలో ఉంచుకోండి. వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము! హృదయంలో ఇది వస్తుందా? అందుకే మీ బర్త్ డే జరుపుకోవడానికి వచ్చాము కదా! మీ బర్త్ డే కూడా జరుపుకోవడానికి వచ్చారా లేదా కేవలం బాబా బర్త్ డే జరుపుకోవడానికి వచ్చారా? ఈ దివ్య జన్మ ఎంత అతీతంగా కూడా ఉంది మరియు ప్రియంగా కూడా ఉంది! ఎందుకంటే బాబాకు ప్రియమైనవారిగా అయ్యారు కదా. భగవంతునికి ప్రియమైనవారి జీవితంలో ప్రేమ ప్రతి సమయంలో ఉంటుంది. అయితే హృదయంతో ఇదే పాట పాడుతూ ఉండండి - వాహ్ బాబా వాహ్ మరియు వాహ్ నా భాగ్యము వాహ్! మంచిది!
బాప్‌దాదా అందరు పిల్లలతో మిలనము జరుపుకున్న తరువాత స్టేజ్‌పై నిలబడి జెండాను ఎగురవేసి 58వ త్రిమూర్తి శివ జయంతి అభినందనలు ఇచ్చారు:-
ఈరోజు ఈ విశేష శివ జయంతి దివసము నాడు నాలుగు వైపులా ఉన్న పిల్లలందరికీ, వజ్రం వంటి జయంతి యొక్క వజ్రం వంటి జీవితాన్ని కలిగిన ఆత్మలకు పదమారెట్లు అభినందనలు, అభినందనలు, అభినందనలు.
*** ఓంశాంతి ***
