‘‘వర్తమాన సమయం యొక్క అవసరము - అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారుచేయడం’’
ఈరోజు స్నేహసాగరుడైన బాబా తమ స్నేహంలో ఇమిడి ఉన్న స్నేహీ పిల్లలను చూస్తున్నారు. ఈ ఈశ్వరీయ స్నేహము పిల్లలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. మీ అందరికీ ఈ విశేష ప్రాప్తి ఉంది. ప్రాప్తులైతే పిల్లలందరికీ లభించాయి. కానీ మొదటి స్టేజ్ - ప్రాప్తించడము, ఆ తర్వాత స్టేజ్ - ఆ ప్రాప్తుల అనుభవంలో నిమగ్నమైపోవడము. మొదటి విషయము ప్రాప్తుల యొక్క నషాలో అందరూ అంటారు - మాకు బాబా ప్రేమ లభించింది! బాబా లభించారు అనగా బాబా ప్రేమ లభించింది. అందరి నోటి నుండి ‘నా బాబా’ అని వెలువడుతుంది. కావున మొదటి స్టేజ్‌లో ప్రాప్తి అయితే అందరికీ లభించింది. కానీ అనుభూతిలో సదా నిమగ్నమై ఉండడము, ఇందులో నంబరువారుగా ఉన్నారు. ఎవరైతే పరమాత్మ ప్రేమలో నిమగ్నమై ఉంటారో వారిని ఈ ప్రేమ నుండి ఎవ్వరూ తప్పించలేరు. పరమాత్మ ప్రేమలో మైమరచి ఉన్న ఆత్మ యొక్క ప్రకాశము మరియు నషా, అనుభూతి యొక్క కిరణాలు ఎంత శక్తిశాలిగా ఉంటాయంటే ఎవరైనా దగ్గరకు రావడము కాదు కదా, కనీసం వారిని కళ్ళెత్తి కూడా చూడలేరు. ఇటువంటి అనుభూతి సదా ఉన్నట్లయితే ఎప్పుడూ ఎటువంటి శ్రమ ఉండదు. ఇప్పుడు యోగమును జోడిస్తూ-జోడిస్తూ యుద్ధము చేయవలసి వస్తోంది. యోగంలో కూర్చుంటారు కానీ అనుభూతిలో నిమగ్నమై ఉండని కారణంగా ఒక్కోసారి యోగము, ఒక్కోసారి యుద్ధము, రెండూ నడుస్తూ ఉంటాయి. నేను బాబాకు చెందినవాడిని అని పదే-పదే స్మృతిలోకి తీసుకురావలసి వస్తుంది. పదే-పదే స్మృతిలోకి తీసుకురావడము అంటే విస్మృతిలో ఉన్నారు కాబట్టే స్మృతిలోకి తీసుకువస్తారు కదా? కాబట్టి అవును-కాదు, స్మృతి-విస్మృతి అనే ఈ యుద్ధము లవలీనులుగా అయ్యే అనుభూతిని కలగనివ్వదు. వర్తమాన సమయంలో పిల్లలకు ఏదైతే యుద్ధము లేక శ్రమ చేయాల్సి వస్తుందో, అదేమిటంటే వ్యర్థము మరియు సమర్థము యొక్క యుద్ధము ఎక్కువగా జరుగుతోంది. కొందరు పిల్లలలో వ్యర్థాన్ని చూసే సంస్కారము సహజ స్వభావంగా అయిపోయింది. కొందరిలో వ్యర్థం వినడము, కొందరిలో వర్ణన చేయడము, కొందరిలో ఆలోచించడము యొక్క సంస్కారము ఎంత సహజ స్వభావంగా అయిపోయాయంటే, మేము ఇది చేస్తున్నాము అని కూడా వారు అర్థం చేసుకోరు. తాము ఇది చేస్తున్నాము అన్నది కూడా తెలియడం లేదు. ఎవరైనా వారికి సూచన ఇచ్చినా కూడా మాయ యొక్క తెలివి ఉన్న కారణంగా తమను తాము చాలా వివేకవంతులుగా భావిస్తారు. మాయ యొక్క వివేకవంతులుగా అయినా అయిపోతారు లేక ఇదైతే నడుస్తుందిలే, ఇలా జరుగుతూనే ఉంటుందిలే... అని నిర్లక్ష్యులుగా అయిపోతారు. మాయ యొక్క వివేకము కారణంగా తప్పులలో కూడా స్వయాన్ని రైట్‌గానే భావిస్తారు. అక్కడ ఉండేది మాయ యొక్క వివేకము కానీ నా అంతటి జ్ఞాని, నా అంతటి యోగి, నా అంతటి సేవాధారి మరెవ్వరూ లేరు అని భావిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో మాయ యొక్క ఛాయ తమ మనస్సును, బుద్ధిని ఎలా వశీభూతం చేసుకుంటుందంటే దానితో వారు యథార్థ నిర్ణయాన్ని తీసుకోలేరు. మాయావీ యోగి లేక మాయావీ జ్ఞానంలో వివేకం కలవారిగా అవ్వటమన్నది ఈశ్వరీయ వివేకము నుండి దూరం చేసేస్తుంది. మాయ యొక్క వివేకము కూడా తక్కువేమీ కాదు. మాయతో యోగాన్ని జోడించేవారు కూడా అచలముగా, స్థిరముగా ఉండే యోగులే కావుననే తేడాను అర్థం చేసుకోరు. ఆ సమయంలోని మాటల యొక్క నషా గురించి కూడా అందరికీ తెలుసు కదా, అది ఎంత గొప్పగా ఉంటుంది! అందుకే బాప్‌దాదా కూడా ప్రాప్తుల అనుభూతి యొక్క సాగరంలో ఇమిడి ఉండండి అని సదా పిల్లలకు చెప్తూ ఉంటారు. సాగరంలో ఇమిడిపోవడం అనగా సాగర సమానంగా అనంతమైన ప్రాప్తి స్వరూపంగా అయి కర్మలోకి రావడము.
బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లల చార్టును పరిశీలించారు. బాబా ఏం చూసారు? సమయము యొక్క సామీప్యత అనుసారంగా వర్తమాన వాయుమండలంలో అనంతమైన వైరాగ్యము ప్రత్యక్ష స్వరూపంలో ఉండడము ఎంతో అవసరము. అనంతమైన వైరాగ్యమును మీరు వర్ణన కూడా చేస్తారు. ఎన్నో పాయింట్లను వెలికితీస్తారు, భాషణ కూడా ఎంతో మంచిగా చేస్తారు. అందరి వద్ద పాయింట్లు ఉన్నాయి కదా? పాయింట్లను వర్ణన చేయడము లేక ఆలోచించడము, ఇందులో మెజారిటీ పాసయ్యారు. ఈ చిన్న-చిన్న కుమారీలకు కూడా భాషణ తయారుచేసి ఇస్తే వారు భాషణ చేసేస్తారు. యథార్థ వైరాగ్య వృత్తికి సహజ అర్థము - ఆత్మల సంపర్కములోకి వచ్చినా, సాధనాల సంబంధంలోకి వచ్చినా లేక సేవ యొక్క ఛాన్స్‌లలో ఛాన్సలర్‌గా అయ్యే భాగ్యము లభించినా కానీ సర్వుల యొక్క సంబంధ-సంపర్కంలో ఎంతగా అతీతంగా ఉంటారో అంతగా ప్రియముగా ఉండడము, దీని యొక్క బ్యాలెన్స్ ఉండాలి. కానీ ఏమి జరుగుతుంది? ఒక్కోసారి అతీతంగా ఉండే పర్సెంటేజ్ పెరిగిపోతే మరోసారి ప్రేమగా ఉండే పర్సెంటేజ్ పెరిగిపోతుంది. ప్రియమైనవారిగా ఉండడమంటే అర్థము నిమిత్త భావము, నిర్మాన భావము. కానీ దీనికి బదులుగా నాది అన్న భానము వచ్చేస్తుంది. ఇది నా పనే, ఇది నా స్థానమే... నాకే అన్ని సాధనాలు భాగ్యం అనుసారంగా లభించాయి. ఇంతటి కష్టంతో నేను ఈ సాధనాలను, స్థానాన్ని లేక సేవలను లేక సేవా సహచరులను తయారుచేసాను (విద్యార్థులు కూడా సహచరులే). ఇది నాది, నేను పడ్డ శ్రమకు ఎటువంటి విలువ లేదా? నిమిత్త భావము మరియు ఈ నాది అన్న భావములో తేడా ఉందా, లేదా రెండూ ఒక్కటేనా? ఈ నాది అనేది రాయల్ రూపంలో పెరిగిపోయింది. ఈ నాది అనే రాయల్ భాష, రాయల్ సంకల్పాలు బాబాతో జరిపే ఆత్మిక సంభాషణలో కూడా బాప్‌దాదా ఎంతో వింటూ ఉంటారు. ఎంతో ప్రేమగా బాబాను లేక నిమిత్త ఆత్మలను ఒప్పించేందుకు వస్తారు - బాబా, మీరే నాకు ఇందులో సహాయం చేయాలి, మీరు ఏమని భావిస్తున్నారు - ఇది నా పని కాదా, నా బాధ్యత కాదా, నా అధికారము నాకే లభించాలి. తండ్రికి కూడా జ్ఞానమును ఇచ్చేందుకు ఎంతో తెలివిని చూపిస్తారు. బాప్‌దాదా నవ్వుతూ ఉంటారు. నిమిత్తముగా ఉన్నాము, ఏది లభిస్తే అది, ఎలా లభిస్తుందో అలా, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, ఏది తినిపిస్తే అది, ఏది చేయిస్తే అదే చేస్తాము... ఇది అందరి యొక్క మొట్టమొదటి ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ ఉంది కదా? ఈ ప్రతిజ్ఞ ఉందా లేక కేవలం ఇది తాగడానికి, తినడానికి మాత్రమే పరిమితమా? నాది అన్న భావన యొక్క వైరాగ్యమే అనంతమైన వైరాగ్యము. కొత్త-కొత్త రకాలుగా నాది అనేది ఇంకా ఇమర్జ్ అవుతోంది. వర్తమాన సమయంలో మాయ అనేక రకాలుగా నాది అనే నీడను వేస్తోంది కావుననే సమయం యొక్క సామీప్యత ప్రత్యక్ష రూపంలోకి రావడం లేదు. జ్ఞానులైనా, అజ్ఞానులైనా ఇరువురూ - ఈ ప్రపంచపు పరిస్థితులు చాలా పాడైపోయాయి, ఈ ప్రపంచం ఎంతవరకు నడుస్తుంది, ఎలా నడుస్తుంది? అని అంటుంటారు మరియు వారికి తెలుసు కూడా. అయినా ప్రపంచం నడుస్తోంది. సమయ సామీప్యతకు పునాది - అనంతమైన వైరాగ్య వృత్తి. బాప్‌దాదా చెక్ చేసారు, అనంతమైన వైరాగ్య వృత్తికి బదులుగా కొత్త-కొత్త రకాలుగా చిన్న-చిన్న ఆకర్షణల యొక్క విస్తారము చాలా పెద్దదిగా ఉంది. ఈ విస్తారము సారమును దాచి వేసింది. అర్థమైందా? ఇప్పుడేమి చేయాలి?
ఈ ఆకర్షణలు చాలా రుచికరంగా ఉంటాయి. ఒకటి, రెండు సార్లు రుచి చూస్తే ఇక ఆ రుచి ఆకర్షిస్తూ ఉంటుంది. సేవ చేస్తున్నారు, చాలా మంచిది. కానీ నిమిత్త భావము ఉందా లేక ఆకర్షణ యొక్క భావము ఉందా అని మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ‘బాబా-బాబా’ అనడానికి బదులుగా నాది-నాది అనైతే రావడం లేదు కదా? నీది అని అంగీకరిస్తున్నా కానీ నాది అన్నట్లు అయిపోతుంది, మరి ఇప్పుడు ఏం చేస్తారు? నాది, నాది అనేది ఇష్టమా? బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఒక చాలా పెద్ద పొరపాటు చేస్తారు లేక నడుస్తూ-నడుస్తూ అది జరిగిపోతుంది, చెయ్యాలనుకోరు కానీ జరిగిపోతుంది, అది ఏమిటి? ఇతరులకు జడ్జి అయిపోతారు మరియు స్వయానికి వకీలుగా అయిపోతారు. స్వయానికి జడ్జిగా అవ్వాలి కానీ ఇతరులకు జడ్జిగా అవుతారు. వీరు ఇది చేయకూడదు, వీరు మారాలి అని భావిస్తారు. స్వయం కొరకు ఈ విషయం పూర్తిగా సరైనదే అని భావిస్తారు. నేను ఏమి చెప్తున్నానో, అదే రైట్, వీరు ఇలా ఉన్నారు, వారు అలా ఉన్నారు అని అంటారు. వకీళ్లు కూడా సత్యమును అసత్యముగా, అసత్యమును సత్యముగా నిరూపిస్తారు కదా. ప్రమాణాలను ఇవ్వడం వకీళ్లకు ఎంతగా వస్తుందో అంతగా ఇంకెవ్వరికీ రాదు. మీరు మీ జడ్జీలుగా అవ్వండి కానీ ఈ పొరపాటు జరుగుతుంది. ఇతరుల కోసం రిమార్కులు ఇవ్వడం చాలా సహజం. కానీ స్వయాన్ని మార్చుకోవాలి. స్లోగన్ కూడా ఉంది, ‘‘స్వ పరివర్తనతో విశ్వ పరివర్తన’’. మొదట ‘స్వ’. విన్నారా, ఏమి చార్టును చూసామో?
బాప్‌దాదా కూడా మాయ యొక్క గతిని చూసి నవ్వుతూ ఉంటారు - మాయ ఎంత తెలివైనది! మాస్టర్ సర్వశక్తిమాన్ ఆత్మలను కూడా తనవారిగా చేసేసుకుంటుంది. మరి ఇప్పుడు ఏం కావాలి? అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారుచేయండి. ఎలాగైతే సేవ యొక్క వాయుమండలాన్ని తయారుచేస్తారు కదా, ప్రోగ్రాములు తయారుచేస్తారు. ఈ వృత్తి కేవలం బుద్ధి వరకు మాత్రమే కాదు, హృదయం వరకు చేరుకోవాలి. అందరి బుద్ధిలోనూ - ఇది జరగాల్సిందే, చేయాల్సిందే అనైతే ఉంది కానీ హృదయంలో ఈ అల ఉత్పన్నమవ్వాల్సిన అవసరముంది. అర్థమయ్యిందా? అందరూ మంచి రీతిలో అర్థం చేసుకున్నారా? లేదా ఇప్పుడు అర్థమయ్యింది కానీ లేచి వెళ్ళిన తర్వాత - ఇది ఎలా అవుతుంది, ఇది చేయడం కష్టము, వినడము, మాట్లాడటము అయితే సహజము, చేయడం కష్టం అని ఆలోచిస్తారా! మరి ఇప్పుడు ఇలా అయితే అనరు కదా?
స్నేహంతో మీరు కూడా వచ్చేసారు మరియు బాప్‌దాదా కూడా వచ్చేసారు. స్నేహంలో ఎంతటి శక్తి ఉందో చూడండి! స్నేహము అవ్యక్తుడిని వ్యక్తంలోకి తీసుకువస్తుంది. అలాగే మీ అందరినీ మధువనం వరకు తీసుకువచ్చింది. అందరూ స్నేహంలో మంచిగా చేరుకున్నారు కదా! మిమ్మల్ని ఎవరు తీసుకువచ్చారు? రైలు తీసుకువచ్చిందా లేక స్నేహం తీసుకువచ్చిందా? ఎక్కడైతే స్నేహము ఉంటుందో అక్కడ శ్రమ, శ్రమగా అనిపించదు, కష్టము, కష్టముగా అనిపించదు. ఈ మూడు అడుగుల భూమికి బదులుగా రెండు అడుగుల భూమియే లభించినా కానీ ఏమనిపిస్తుంది? అది సత్యయుగపు మంచముకన్నా శ్రేష్ఠముగా అనిపిస్తుంది. అందరూ విశ్రాంతిగా ఉన్నారా లేక తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నారా? ఏం చేయాలి, ఉండాల్సిందే కదా... భక్తి మార్గంలోనైతే కేవలం కాళ్ళు పెట్టేందుకు ఇంతగా కష్టపడతారు, మీకు నిదురించేందుకు మూడు అడుగులు కాకపోయినా రెండు అడుగులు అయితే లభించాయి కదా. మీరైతే పాదాల చెంత స్థానమివ్వండి అని అడిగారు కానీ తండ్రి అయితే చరణాలకు బదులుగా పట్టపురాణిగా చేసారు. అయినా ఇది మధువనం యొక్క ప్రాంగణం కదా. ఎక్కడ పడుకున్నా కానీ మధువనం యొక్క ప్రాంగణంలో ఉన్నారు. ఇంతగా తండ్రికి సమీపంగా వచ్చే అధికారం లభిస్తుందని స్వప్నంలో కూడా లేదు. మరి అందరూ సంతోషంగా ఉన్నారు కదా? రెండు అడుగులు కాక ఒక్క అడుగు లభించినా సంతుష్టంగా ఉంటారా? కూర్చొని-కూర్చొనే నిద్రపోతారు! చాలామందికి కూర్చొని ఉన్నప్పుడు మంచి నిద్ర వచ్చేస్తుంది. పడుకుంటే నిద్ర రాదు. యోగంలో కూర్చోగానే నిద్ర ప్రారంభమవుతుంది. 5 రోజులు అఖండ తపస్య చేయవలసి వస్తే మీరందరూ సిద్ధంగా ఉన్నారా? భోజనం దొరకకపోయినా ఫర్వాలేదా? లేక ఇలా జరగకూడదు అని భావిస్తున్నారా? ఏ పదార్థాలనైతే మీరు అక్కడ తినరో అవి కూడా మధువనంలో దొరుకుతాయి. కానీ ఎవరెడీగా ఉండాలి. దొరికితే చాలా మంచిది, దొరకకపోతే ఇంకా, ఇంకా మంచిది ఎందుకంటే అమృతవేళ అందరికీ దిల్ఖుష్ మిఠాయి అయితే తప్పకుండా లభిస్తుంది మరియు రోజంతా సంతోషమనే శక్తిశాలి భోజనం కూడా లభిస్తుంది. కావున ఇది నడవగలదు కదా? ఇది కూడా ట్రయల్ చేద్దాం. అచ్ఛా!
పంజాబ్: అందరూ నడుస్తూ-తిరుగుతూ సదా ‘మేము విశ్వంలోని సర్వ ఆత్మలకు పూర్వజులము’ అనే అనుభవం చేసుకుంటున్నారా? మీ నుండి అందరూ వచ్చారు కదా! కాబట్టి అందరికంటే పెద్ద పూర్వజులు మీరే. పూర్వజ స్వరూపం ద్వారా సదా విశ్వంలోని సర్వ ఆత్మలను దయాభావనతో చూస్తూ, వరదానిగా అయి శుభ భావన మరియు శుభ కామనల వరదానము ఇస్తూ ఉండండి. సాధారణమైనవారు కాదు, పూర్వజులు. పూర్వజులు అంటే దయా హృదయ ఆత్మలు. దయాభావన, శుభ భావన - ఇదే విశ్వానికి అవసరం. మరి అందరూ తమను ఇలా విశ్వానికి పూర్వజులుగా భావిస్తున్నారా లేక ఎప్పుడైనా తమను సాధారణంగా భావిస్తున్నారా? బ్రహ్మా బాబా ‘గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్’ అయినప్పుడు బ్రాహ్మణులు ఏమిటి? పూర్వజులే కదా? అర్థమైందా?
పంజాబ్ ఏమి అద్భుతం చేసింది? చూడండి, మీ వైబ్రేషన్స్ వల్ల వాతావరణం అయితే మారిపోయింది కదా! ‘మా వైబ్రేషన్స్ ప్రభావమే ఇది’ అని అనుకుంటున్నారా? యోగ తపస్సు అయితే అందరూ బాగా చేశారు కదా! కాబట్టి తపస్సు యొక్క బలం వ్యర్థంగాపోదు, ఫలం తప్పకుండా లభిస్తుంది. అయినా ఏదైనా విఘ్నం వచ్చినప్పుడు అఖండ యోగం పెడతారు కదా? దానితో తేడా వస్తుంది. మరి పంజాబ్ వారికి తపస్సు చేయడానికి సమయం చాలా లభించిందా? మంచిది, వాతావరణం పరివర్తన అయింది, మరి ఇప్పుడు అట్టహాసంగా సేవ చేస్తున్నారా? ఇప్పుడు నలువైపులా సేవ యొక్క సందడి చేయండి. ఎంత సమయం లభిస్తే అంత సమయ ప్రమాణంగా ప్రయోజనం పొందండి. ఒక్కరి నుండి అనేకులు వస్తారు, కాబట్టి ఆ ఒక్కరి నుండి వచ్చే అనేకుల ప్రభావం వాతావరణంపై పడుతుంది. ధరణి యొక్క సఫలత మారిపోతుంది. కాబట్టి ఇప్పుడు జోరుగా సేవ చేయండి. ఇప్పుడు సేవ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ నిమిత్త భావంతో చేయండి, ‘నాది’ అని తీసుకురాకండి. అచ్ఛా!
ఆగ్రా: ఆగ్రాలో ప్రత్యేకత ఏమిటి? ఆగ్రాను ‘తాజ్ నగరి’ అని అంటారు. కాబట్టి ఆగ్రా వారు సదా సేవా నిర్విఘ్న వృద్ధి యొక్క బాధ్యత అనే కిరీటాన్ని ధరించాలి. సేవ జరగాలి, కానీ దాని ప్రత్యేకత నిర్విఘ్న సేవ. కాబట్టి సేవా బాధ్యత అనే కిరీటధారులు మరియు దాంతోపాటు సదా లైట్ యొక్క కిరీటధారులు, అంటే సంపూర్ణ పవిత్రత యొక్క బాధ్యత అనే కిరీటధారులు అవుతారు కదా! సేవ మరియు లైట్ - ఈ డబల్ కిరీటం సదా ప్రాక్టికల్ స్వరూపంలో ఉండాలి. అప్పుడు ఈ కిరీటమే సర్వ ఆత్మలను సహజంగా ఆకర్షిస్తుంది. కాబట్టి సేవలో కూడా ముందుకు వెళ్ళండి మరియు లైట్ యొక్క కిరీటధారులుగా అయి ఇతరులను తయారుచేయడంలో కూడా ముందుకు వెళ్ళండి. అర్థమైందా?
హుబ్లీ, గుల్బర్గా: కర్ణాటక ప్రత్యేకత ఏమిటి? అక్కడ భావన ఎక్కువగా ఉంటుంది కదా! కాబట్టి ధరణి ప్రత్యేకత ఎలాగైతే భావనో, అలాగే కర్ణాటక నివాసులు ఏ స్థానానికి చెందినవారైనా సరే, అందరూ విశేషంగా ప్రతి సెకండు, ప్రతి సంకల్పంలో శుభ భావన, శుభ కామనల సహజ స్వరూపధారులు. వ్యర్థం యొక్క సమాప్తి మరియు శుభ భావన, శుభ కామనల స్వరూపంగా సదా ఉండటమే కర్ణాటక నివాసుల ప్రత్యేకత. వ్యర్థానికి ఫుల్ స్టాప్! శుభ భావన మరియు శుభ కామనల సదా ఫుల్ స్టాక్! మరి స్టాప్ పెట్టడం వచ్చా? శుభ భావన యొక్క స్టాక్ జమ చేయడం కూడా వచ్చా? స్టాక్ జమ చేయడంలో, స్టాప్ పెట్టడంలో తెలివైనవారే కదా! ముందు కూర్చోవడం ఎలాగైతే ఇష్టపడతారో, అలాగే సదా ప్రతి శ్రేష్ఠ ధారణలో కూడా అందరికంటే ముందుండండి. అచ్ఛా.
తమిళనాడు, కేరళ: తమిళ్ వారు ఏమి చేస్తారు? ఏ విశేష నషా ఉంచుకుంటారు? అన్నింటికంటే పెద్ద ఆత్మిక నషా - ‘మేము బాబా వారిమి, బాబా మావారు’ అని. ఎవరైతే ఈ నషాలో ఉంటారో వారు సదా నిశ్చింతగా, సహజ విజయీగా ఉంటారు. కాబట్టి తమిళ్ వారు లేదా కేరళ వారు సదా ఈ ఆత్మిక నషాలో ఉండేవారు మరియు సదా సహజ విజయం ప్రాప్తి చేసుకునే శ్రేష్ఠ ఆత్మలు. అర్థమైందా?
హైదరాబాద్, సికింద్రాబాద్: ఆంధ్రా వారికి భాష తెలియదు కానీ భావన యొక్క భాష తెలుసు. మరి ఆంధ్రా వారు ఏమి చేస్తారు? ఆంధ్రాలో కూడా సేవ అయితే బాగుంది. సదా తమను ‘మేము కోట్లలో కొందరు, ఆ కొందరిలో కూడా కొందరిగా ఉన్న ఆత్మలము’ అని అనుభవం చేస్తున్నారా? ‘కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరు’ అని ఏ గాయనము ఉందో, అది ఏ ఆత్మల గురించి, ఎవరి గాయనము? ఆంధ్రా వారిదేనా? ఎలాంటి ఆత్మలైనా సరే, బాబాకు ప్రియమైనవారే కదా! కాబట్టి ‘నేను ఏదిగా ఉన్నానో, ఎలా ఉన్నానో కానీ బాబాకు ప్రియమైనవానిగా ఉన్నాను, అందుకనే కోట్లలో కొందరు, కొందరిలో కూడా కొందరు ఆత్మగా అయ్యే భాగ్యము నాకు లభించింది’ అనే ఈ సంతోషం సదా ఉండాలి. అచ్ఛా.
మహారాష్ట్ర: ‘మహారాష్ట్ర’ అనే పేరు వినగానే నషా ఎక్కుతుంది కదా? దేశం పేరు కూడా మహాన్, బ్రాహ్మణులుగా అయ్యారు కాబట్టి ఆత్మలు కూడా మహాన్. మరి మహాన్ ఆత్మల కర్తవ్యం అందరి ఆత్మలను మహాన్‌గా తయారుచేయడం. కాబట్టి మహారాష్ట్ర వారు ప్రతి సమయం సంకల్పంలో, మాటలో, కర్మలో, సంబంధంలో ‘మహాన్’ అనే పదాన్ని సదా స్మృతిలో ఉంచుకోవాలి. మహాన్ స్వరూపం యొక్క స్మృతి స్వరూపులు. సంకల్పం కూడా సాధారణమైనది కాదు, మహాన్. ఒక మాట కూడా సాధారణమైనది కాదు, మహాన్. మరి ఇలా మహాన్ ఆత్మలా? చెప్పండి, హాజీ (అవును). మహాన్ ఆత్మలు మరియు మహాన్ ఆత్మలుగా తయారుచేసేవారు, కాబట్టి మహాన్ అనే పదం సదా స్వరూపంలో ఉండాలి. కేవలం నోటితో కాదు, స్వరూపంలో ఉండాలి.
ఇండోర్, హాస్టల్ కుమారీలతో: హాస్టల్ కుమారీలా లేక హైయెస్ట్, హోలీయెస్ట్ కుమారీలా? హైయెస్ట్ కూడా, హోలీయెస్ట్ కూడా! అత్యున్నతమైనవారు మరియు మహాన్ పవిత్ర ఆత్మలు. ఎందుకంటే కుమారీ జీవితం అంటేనే మహాన్ పవిత్రమైనది. అందుకనే కుమారీలను పూజిస్తారు. అదే కుమారీ నుండి మాతగా అయితే అందరి కాళ్ళు మొక్కాల్సి వస్తుంది. ఒకవేళ కోడలై ఇంటికి వస్తే ఏమి చేస్తారు? అందరి కాళ్ళు మొక్కుతారు, కానీ కుమారీల కాళ్ళు పూజించబడతాయి. కాబట్టి కుమారీ జీవితం అంటే మహాన్ పవిత్ర జీవితం. అలాంటి కుమారీలే కదా, లేక ఎప్పుడైనా ఆవేశం (కోపం) వస్తుందా? పరస్పరం ఒకరిపై ఒకరికి ఆవేశం వస్తుందా, రాదా? ఎందుకంటే క్రోధం కూడా అపవిత్రతే. కేవలం కామ వికారమే కాదు, దానికి ఇంకా వేరే సహచరులు కూడా ఉన్నారు. కాబట్టి మహాన్ పవిత్రం అంటే అపవిత్రత యొక్క నామరూపాలు ఉండకూడదు. వీరినే హోలీయెస్ట్, హైయెస్ట్ కుమారీలు అని అంటాము. మరి అలా ఉన్నారా లేక ఎప్పుడైనా మాయకు కొద్దిగా అనుమతి ఇస్తున్నారా? మాయ ప్రియంగా అనిపిస్తుంది, అందుకనే వస్తుంది! కానీ మాయ ఎప్పుడూ రాకూడదు అంటే దానికి సహజ సాధనం సదా గాడ్లీ స్టూడెంట్ లైఫ్‌లో ఉండటం - స్టడీ, స్టడీ, స్టడీ! ఇంకే విషయాలలోకీ వెళ్ళకూడదు. ఒకవేళ కర్మణా సేవ చేసినా అది కూడా స్టడీ యొక్క సబ్జెక్టే. వంట చేయడం కూడా స్టడీయే. కర్మయోగి యొక్క పార్ట్, కాబట్టి చదువే కదా? కాబట్టి కుమారీ జీవితంలో సఫలతకు ఆధారం స్టూడెంట్ లైఫ్. వేరే విషయాలలోకి వెళ్ళనే కూడదు, దారి బంద్! ఇలా ఉందా లేక ఎప్పుడైనా తప్పు దారిలోకి వెళ్ళిపోతున్నారా? లేదు. మంచిది, తమ భాగ్యాన్ని అయితే తయారుచేసుకున్నారు. ఇప్పుడు భాగ్యం యొక్క రేఖను ఎంత పొడవుగా గీసుకోవాలనుకుంటే అంత పొడవుగా గీసుకోవచ్చు. కాబట్టి చిన్న రేఖ గీయకండి, పొడవైనది గీయండి. బాప్‌దాదా కూడా సంతోషిస్తారు - కుమారీ జీవితంలో రక్షించబడ్డారని, భాగ్యవంతులుగా అయ్యారని. ఇంకా కొన్ని స్థానాల నుండి కూడా కుమారీలు వచ్చారు. ట్రైనింగ్ పొందుతున్న కుమారీలు చేతులు ఎత్తండి. ట్రైనింగ్ చేయడం అంటే సేవ యొక్క ట్రైన్లో ఎక్కడం. మరి సేవ యొక్క ట్రైన్ ఎక్కేశారా లేక ఇంకా ఆలోచిస్తున్నారా? సేవలో నిమగ్నమయ్యారా? మంచిది, ఆది నుండి నిఃస్వార్థ సేవాధారులు. సేవాధారులు అందరూ ఉన్నారు, కానీ నిఃస్వార్థ సేవాధారులు కొందరే ఉన్నారు. మీరు ఏ లైన్లో ఉన్నారు? నిఃస్వార్థ సేవాధారులా లేక కొద్దిగా స్వార్థం అయితే ఉంచుకోవాల్సిందేనా! లేదు. ఫౌండేషన్‌ను బలంగా ఉంచుకోండి, ఎందుకంటే సేవలో స్వార్థం మిక్స్ చేస్తే సఫలత కూడా మిక్స్ అయి లభిస్తుంది. కాబట్టి మంచిది, ధైర్యం ఉంచి సేవలో ముందుకు వెళ్తున్న కుమారీలను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ముందుకు వెళ్తున్నందుకు అభినందనలు. అచ్ఛా!
డబల్ విదేశీయులు: (అన్ని స్థానాల నుండి చేరుకున్నారు) డబల్ విదేశీయులు తెలివైనవారు. ఏ విధంగా అన్ని దేశాల యొక్క అంబాసిడర్లను పంపిస్తారో అలా ఇది ఇంటర్నేషనల్ బ్రాహ్మణ పరివారంగా అయిపోయింది కదా. డబల్ విదేశీయుల విశేషత - సదా చేతిలో చేయి ఉంటుంది మరియు తోడు ఉంటుంది. చేతిలో చేయి వేయడం విదేశాల ఫ్యాషన్ కదా! ఇప్పుడు మీరు ఎవరి చేతిలో ఉన్నారు? తండ్రి చేతిలో ఉన్నారు. సదా తండ్రి చేతిలో చేయి వేస్తూ ముందుకు వెళ్ళేవారు. శ్రీమతమే తండ్రి చేయి. మరి శ్రీమతమనే చేయి సదా మీ చేతిలో ఉంది. ఇది పక్కాగా ఉందా లేక ఎప్పుడైనా అలిసిపోతే వదిలేస్తారా? ఎప్పుడైనా చేయి వదిలిపోతుందా? మాయ వదిలింపచేస్తే? వదిలిపోదు కదా? కావున సదా తోడుగా ఉండేవారు మరియు సదా శ్రీమతమనే చేతిలో చేయి వేసి నడిచేవారు. ఎవరి తోడుగా అయితే బాబా ఉన్నారో, ఎవరి చేయి బాబా చేతిలో ఉందో వారు సదా నిశ్చింతులు, నిశ్చింత చక్రవర్తులు ఎందుకంటే తోడు మరియు చేయి, రెండూ దృఢంగా ఉన్నాయి. సరేనా? నైరోబి వారు, చేయి మరియు తోడు రెండూ పక్కాగా ఉన్నాయి కదా! ప్రపంచమంతా కలిసి అక్షోహిణిగా మారి చేయిని వదిలింప చేయాలని చూసినా చేయిని వదులుతారా? ఆ అక్షోహిణి శక్తిహీనము మరియు మీరు ఒక్కొక్కరూ మాస్టర్ సర్వశక్తిమంతులు, అందుకే, బాప్‌దాదా యొక్క ఎక్స్ట్రా చేయి మరియు తోడు ఉంది, లిఫ్ట్ ఉంది అన్నాయి అని డబల్ విదేశీయులకు నషా ఉంది. అచ్ఛా.
టీచర్లతో: టీచర్స్ అన్న టైటిల్ ఏ విధంగా ఉందో అలా ఆ టైటిల్ అనుసారంగా విశేషంగా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని తయారుచేయడంలో టైట్‌గా ఉండాలి. తేలికగా అవ్వకండి ఎందుకంటే నిమిత్త టీచర్ల వాయుమండలము అనేకుల వరకు చేరుకుంటుంది. కావున ఇప్పుడు టీచర్లు ఈ అద్భుతాన్ని చేసి చూపించాలి. పరివర్తనలో ఆజ్ఞాకారులుగా అయ్యారు. ఆజ్ఞాకారులుగా అవ్వడంలో, హాజీ అనే ఒక పాఠాన్ని పక్కా చేసుకున్నారు. కానీ అనంతమైన వైరాగ్య వృత్తి అనే రెండవ పాఠాన్ని పక్కా చేసి చూపించండి. ఎందుకంటే మీరు నిమిత్తులు కదా. మరి నిమిత్త ఆత్మలే నిర్మానులుగా అయి నిర్మాణ కర్తవ్యాన్ని చాలా సహజంగా చేయగలరు. ఇప్పుడు ఈ సంవత్సరమైతే పూర్తి అవుతూ ఉంది. కానీ కొత్త సంవత్సరంలో ఈ నవీనత యొక్క ప్రకాశాన్ని బాప్‌దాదా కూడా చూస్తారు. సేవ చేసారు, సెంటర్లు తెరిచారు, ఎంతగానో పెంచారు. ఐ.పి.లు కూడా వచ్చేసారు, వి.ఐ.పి.లు కూడా వచ్చేసారు, ఇదైతే జరుగుతూనే ఉంటుంది కానీ సేవలో అనంతమైన వైరాగ్య వృత్తి ఇతర ఆత్మలను ఇంకా సమీపంగా తీసుకువస్తుంది. నోటి ద్వారా చేసిన సేవ సంపర్కంలోకి తీసుకువస్తుంది మరియు వృత్తి ద్వారా వాయుమండలం యొక్క సేవ సమీపంగా తీసుకువస్తుంది, అర్థమైందా? బాప్‌దాదా అయితే చార్టును చూస్తారు కదా? అయినా సేవకు నిమిత్తంగా ఉన్నారు - ఈ శ్రేష్ఠ భాగ్యము తక్కువేమీ కాదు! ఇది కూడా విశేషమైన వారసత్వము. మరి ఈ విశేష వారసత్వం యొక్క భాగ్యానికి అధికారులుగా అయ్యారు. అర్థమైందా? అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మలకు, సదా సర్వ ప్రాప్తుల అనుభూతులలో ఇమిడి ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, సదా పరిశీలించే శక్తిని, నిర్ణయం తీసుకునే శక్తిని తీవ్రతరం చేసే సమీప ఆత్మలకు, సదా సేవలలో సమర్థులుగా అయి, సమర్థులుగా చేసే నిమిత్త ఆత్మలకు, సదా అతీతంగా మరియు ప్రియంగా, ఈ రెండింటి బ్యాలెన్సును ఉంచే ఆశీర్వాదాలకు పాత్రులైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
