‘‘పరమాత్మ పాలన మరియు పరివర్తనా శక్తి యొక్క ప్రత్యక్ష స్వరూపము - సహజయోగి జీవితం’’
ఈరోజు బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకంపై విశేషంగా శ్రేష్ఠ భాగ్యపు మూడు రేఖలను చూస్తున్నారు. పిల్లలందరి భాగ్యము సదా సర్వ శ్రేష్ఠమైనదే కానీ ఈరోజు విశేషంగా మూడు రేఖలు మెరుస్తున్నాయి. ఒకటేమో, పరమాత్మ పాలన యొక్క భాగ్య రేఖ. రెండవది, అనంతమైన, ఉన్నతోన్నతమైన చదువు యొక్క భాగ్య రేఖ. మూడవది, శ్రేష్ఠ మతము ప్రాప్తించిన భాగ్యపు రేఖ, అది లౌకికమైనా లేక అలౌకికమైనా ప్రతి ఒక్కరికీ ఈ జీవితంలో ఈ మూడు ప్రాప్తులు తప్పకుండా లభిస్తాయి. పాలన కూడా లభిస్తుంది, చదువు కూడా లభిస్తుంది మరియు మతము కూడా లభిస్తుంది. ఈ మూడింటి ద్వారానే ప్రతి ఆత్మ తన వర్తమానాన్ని మరియు భవిష్యత్తును తయారుచేసుకునేందుకు నిమిత్తంగా అవుతుంది. శ్రేష్ఠ ఆత్మలైన మీ అందరికీ ఎవరి పాలన లభిస్తూ ఉంది? పరమాత్మ పాలనలో ప్రతి క్షణము పాలింపబడుతున్నారు. ఏ విధంగా పరమ ఆత్మ ఉన్నతోన్నతమైనవారో అదే విధంగా పరమాత్మ పాలన కూడా ఎంతో శ్రేష్ఠమైనది! మరి ఈ పరమాత్మ పాలనకు పాత్రులుగా ఎవరు అయ్యారు మరియు ఎంతమంది అయ్యారు? మొత్తం విశ్వంలోని ఆత్మలందరూ ‘తండ్రి’ అని అంటారు కానీ పాలనకు మరియు చదువుకు పాత్రులుగా అవ్వరు. మరి ఎంత కొద్దిమంది ఆత్మలైన మీరు ఈ భాగ్యానికి పాత్రులుగా అవుతారు! మొత్తం కల్పమంతటిలో ఈ కొద్ది సమయం మాత్రమే పరమాత్మ పాలన లభిస్తుంది. దైవీ పాలన, మానవ పాలన, ఇవి అనేక జన్మలు లభిస్తాయి కానీ ఈ శ్రేష్ఠ పాలన ఇప్పుడు లేకుంటే మరెప్పుడూ లభించదు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము యొక్క శ్రేష్ఠ రేఖను సదా మీ మస్తకంలో మెరుస్తూ ఉన్నట్లు అనుభవం చేసుకుంటున్నారా? ఏ ప్రాప్తినైనా సదా పొందాలని అనుకుంటున్నారా లేక అప్పుడప్పుడు పొందాలని అనుకుంటున్నారా? మరి ఆ ప్రాప్తి యొక్క పురుషార్థం కూడా సదా ఉండాలా లేక అప్పుడప్పుడు ఉండాలా? ఆ పురుషార్థం సదా తీవ్రంగా ఉండాలా లేక అప్పుడప్పుడు సాధారణంగా, అప్పుడప్పుడు తీవ్రంగానా? మరి ప్రాక్టికల్‌లో ఎలా ఉంది? కోరుకుంటున్న దానికి మరియు ప్రాక్టికల్‌గా జరుగుతున్న దానికి మధ్యన తేడా వచ్చేస్తుంది కదా! ఆలోచించడమైతే చాలా ఆలోచిస్తారు కానీ స్మృతిలో తక్కువగా ఉంచుకుంటారు. ఆలోచించే స్వరూపులుగా అవ్వాలా లేక స్మృతి స్వరూపులుగా అవ్వాలా? మీరు స్మృతి స్వరూపులుగా అయ్యేవారే కదా! కావున ఒక్క విషయాన్ని అయినా స్మృతిలో ఉంచుకోండి - అమృతవేళ మిమ్మల్ని లేపేవారు ఎవరు? తండ్రి ప్రేమ మిమ్మల్ని లేపుతుంది. రోజు యొక్క ప్రారంభము ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! స్వయంగా తండ్రి, మిలనం జరుపుకునేందుకు పిలుస్తారు, ఆత్మిక సంభాషణ చేస్తారు, శక్తులు నింపుతారు! కావున ప్రతి రోజు యొక్క ఆది ఎంత శ్రేష్ఠంగా ఉంది! తండ్రి యొక్క ప్రేమతో లేస్తారా లేక అప్పుడప్పుడు బలవంతంగా కూడా లేస్తారా? యథార్థం ఏమిటంటే ప్రేమతో కూడిన పాటలు మిమ్మల్ని లేపుతాయి. అమృతవేళ నుండి తండ్రి మిమ్మల్ని ఎంతో ప్రేమగా పిలుస్తారు, లేపుతారు - మధురమైన పిల్లలూ, ప్రియమైన పిల్లలూ, రండి... ఎవరి ఆది కాలము ఇంత శ్రేష్ఠంగా ఉంటుందో వారి మధ్యకాలము మరియు అంత్యకాలము ఎలా ఉంటాయి? శ్రేష్ఠంగా ఉంటాయి కదా!
పాలన యొక్క భాగ్యము వర్తమాన సమయంలో పిల్లలకు ఎంతగా ప్రాప్తించింది అన్నది బాప్‌దాదా చూస్తున్నారు! ఎంతగా ప్రాప్తించిందో అంతగా దాని లాభాన్ని పొందుతున్నారా? ఇంతటి భాగ్యానికి పాత్రులుగా అవుతాము అని స్వప్నంలో కూడా సంకల్పమాత్రంగా కూడా లేదు! మీ ఆలోచనలకు అందుబాటులో లేదు కానీ ఎంత సహజంగా లభించింది! తండ్రి ప్రేమతో కూడిన పాలన యొక్క ప్రత్యక్ష స్వరూపమే ‘సహజయోగి జీవితము’. ఎవరి పట్లనైతే ప్రేమ ఉంటుందో, వారికి ఏదైనా కష్టమైన పరిస్థితి లేక కష్టమైన విషయము ఉండడాన్ని చూడలేము మరియు వినలేము. మరి తండ్రి కూడా కష్టాన్ని సహజతరం చేసారు కదా! సదా సహజమే. కావున సదా పురుషార్థం యొక్క గతి తీవ్రంగా ఉండాలి. ఈ రోజు పురుషార్థం చాలా బాగుంది మరియు రేపు కొద్దిగా పర్సెంటేజ్ తగ్గిపోయింది, దానిని సదా సహజము అని అంటారా? సదా కష్టతరంగా ఎవరు తయారుచేస్తారు? స్వయమే తయారుచేసుకుంటారు కదా? కారణం ఏమిటి? ఆలోచించే అలవాటైతే ఉంది కానీ స్మృతి స్వరూపం యొక్క సంస్కారాన్ని అప్పుడప్పుడు ఇమర్జ్ చేస్తారు, అప్పుడప్పుడు మర్జ్ అయిపోతుంది. కానీ స్మృతి స్వరూపులే సమర్థ స్వరూపులు. ఆలోచించడమనేది సమర్థ స్వరూపము కాదు. స్మృతి అనేది సమర్థత. విస్మృతిలోకి ఎందుకు వచ్చేస్తారు? అలవాటుకు వశమైపోతారు. ఒకవేళ దృఢంగా లేకపోతే నిస్సహాయులైపోతారు. ఎక్కడైతే దృఢత ఉంటుందో అక్కడ నిస్సహాయత ఉండదు. మీ ఒరిజినల్ అలవాటు విస్మృతితో కూడుకున్నది కాదు. మీరు ఆదిలో స్మృతి స్వరూపులుగా ఉన్నందుకు ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకునే దేవాత్మలు, యోగము జోడించేందుకు పురుషార్థము చేయరు కానీ స్మృతి స్వరూపపు ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటారు. కావున ఆదిలో కూడా స్మృతి స్వరూపం యొక్క ప్రత్యక్ష జీవితము ఉంది. అనాది ఆత్మలుగా ఎప్పుడైతే పరంధామం నుండి వచ్చారో అప్పుడు విశేష ఆత్మలైన మీ సంస్కారము స్వతహాగానే స్మృతి స్వరూపంతో కూడుకున్నదై ఉంది. అలాగే అంతిమంలో సంగమంలో కూడా స్మృతి స్వరూపులుగా అవుతారు కదా! కావున అనాది, ఆది మరియు అంతిమము - మూడు కాలాలలోనూ స్మృతి స్వరూపులుగా ఉన్నారు. విస్మృతి అనేది మధ్యలో వచ్చింది. మరి ఆది, అనాది స్వరూపాలు సహజముగా ఉండాలా లేక మధ్యలో వచ్చిన స్వరూపమా? అవును, నేను ఆత్మను అని ఆలోచిస్తారు, కానీ స్మృతి స్వరూపులై నడుచుకోవడము, మాట్లాడడము, చూడడము, ఇందులో తేడా వచ్చేస్తుంది. కావున మేము పరమాత్మ పాలనకు అధికారీ ఆత్మలము అన్నది స్మృతిలో ఉంచుకోండి.
బాప్‌దాదా చార్టు చెక్ చేసినప్పుడు ఈ రేఖ ఒక్కోసారి పైకి, ఒక్కోసారి కిందకు ఉంటుంది, ఒక్కోసారి ఒక్కో మచ్చ ఉంటుంది, ఒక్కోసారి జీవితమనే కాగితంపై ఏ మచ్చా ఉండదు కూడా మరియు ఒక్కోసారి మచ్చలే మచ్చలు కనిపిస్తాయి, ఒకదాని తర్వాత ఒకటి, దాని తర్వాత ఇంకొకటి అలా మచ్చలే కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు? ఒకటేమో, పొరపాటు జరిగిపోతుంది కానీ పొరపాటు జరిగిన తర్వాత కూడా అదే పొరపాటు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలా కాదు అలా... అనేక రూపాలతో ఆ విషయాన్ని వదలరు. విషయం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది కానీ మీరు ఆ విషయాన్ని వదలరు. ఎంత సమయమైతే ఆలోచించే స్వరూపులుగా అవుతారో, అంత సమయము యథార్థ స్మృతి స్వరూపులుగా అవ్వరు కావున ఆ మచ్చపై మచ్చ పడిపోతూ ఉంటుంది. పరీక్ష సమయం తక్కువగా ఉంటుంది కానీ వ్యర్థము ఆలోచించే సంస్కారము ఉన్న కారణంగా ఆ పరీక్ష సమయాన్ని పెంచేస్తారు. ఆ క్షణం పూర్తవ్వగానే నిర్వికల్ప స్థితి తయారవ్వాలి... ఈ సంస్కారాన్ని ఇమర్జ్ చేయండి. నిర్వికల్పులుగా అవ్వడము వస్తుందా? మీ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలోకి తెచ్చుకొని సదా హర్షితంగా ఉండండి. మీ పరమాత్మ పాలనను సదా పదే-పదే స్మృతిలోకి తీసుకురండి. వినడం కూడా వస్తుంది, ఆలోచించడం కూడా వస్తుంది కానీ తేడా ఎక్కడ వస్తుంది? బాప్‌దాదా పిల్లల ఆటను చూస్తూ ఉంటారు. మొత్తం రోజంతటిలో ఏయే ఆటలు ఆడుతూ ఉంటారు - ఇది రాత్రి సమయంలో చెక్ చేసుకుంటారు కదా? మాయ యొక్క ఆట బొమ్మలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కావున ఆ బొమ్మలతో ఆడుకోవడం మొదలుపెడతారు. మొదటైతే మాయ చాలా ప్రేమగా ఆటలాడిస్తుంది మరియు ఆటలు ఆడిస్తూ-ఆడిస్తూ ఎప్పుడైతే ఓడిస్తుందో అప్పుడు స్పృహలోకి వస్తారు. మెజారిటీలో ఒక విశేషమైన శక్తి యొక్క లోటు ఉంటోంది. ఒక్కోసారి చాలా బాగా నడుస్తారు, ఒక్కోసారి నడుస్తారు, ఒక్కోసారి ఎగురుతారు, ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ మళ్ళీ కిందకు ఎందుకు వచ్చేస్తారు? దీనికి విశేష కారణమేమిటి? పరివర్తనా శక్తి యొక్క లోటు. ఇది యథార్థం కాదు అని అర్థం చేసుకుంటారు కూడా కానీ పరివర్తన అవ్వడంలో లోటు ఉంటుంది. బ్రాహ్మణ జీవితంలో పరివర్తనలోకి వచ్చారు, ఇప్పుడు ఎవరైనా మేము బ్రాహ్మణులము కాము అని అంటారా? అందరూ మీ పేరు ముందు బి.కె. అని వ్రాసుకుంటారు కదా! మేము బ్రాహ్మణులము అనైతే భావిస్తారు కదా? బ్రాహ్మణ జీవితంలో ఏవైతే పరీక్షలు వస్తాయో, వాటిలో పరివర్తన చేసే శక్తి అవసరముంటుంది. వ్యర్థ సంకల్పాలు వచ్చినప్పుడు ఇవి వ్యర్థము అని అర్థం చేసుకుంటారు కూడా. కానీ, వ్యర్థ సంకల్పాల ప్రవాహం ఎంత తీవ్రంగా ఉంటుందంటే అది తన వైపుకు లాగుతూ ఉంటుంది. ఏ విధంగా నది లేక సాగరం యొక్క ఫోర్స్ చాలా తీవ్రంగా ఉన్నప్పుడు, స్వయాన్ని ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా కానీ ఆ ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉంటారు. అలాగే ఇక్కడ కూడా - అర్థం చేసుకుంటారు, ఇది కరెక్టు కాదు, ఇందులో నష్టం ఉంది అని ఆలోచిస్తారు కూడా, అయినా ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు, దీనికి కారణం ఏమిటి? పరివర్తనా శక్తి యొక్క లోటు. మొదటి విశేష పరివర్తన - స్వరూపం యొక్క పరివర్తన. నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను, ఈ స్వరూపం యొక్క పరివర్తన. ఇది ఆది పరివర్తన. ఇందులో కూడా చెక్ చేసుకోండి - ఎప్పుడైతే దేహ భానపు ఫోర్స్ ఉంటుందో అప్పుడు ఆత్మ అభిమానపు స్వరూపంలో నిలువగలరా లేక ప్రవాహంలో కొట్టుకుపోతారా? ఒకవేళ క్షణంలో పరివర్తనా శక్తి కార్యంలోకి వస్తే సమయము, సంకల్పాలు ఎన్ని మిగులుతాయి. వేస్ట్ నుండి బెస్ట్లోకి జమ అవుతాయి.
మొదటి పరివర్తనా శక్తి ఏమిటంటే - స్వరూపం యొక్క పరివర్తన మరియు స్వభావం యొక్క పరివర్తన. పాత స్వభావము పురుషార్థ జీవితంలో మోసగిస్తుంది. నా ఈ స్వభావము యథార్థమైనది కాదు మరియు ఈ స్వభావము ఎప్పటికప్పుడు మోసగిస్తుంది అని అర్థం చేసుకుంటారు కూడా, అయినా స్వభావానికి వశమైపోతారు. మళ్ళీ స్వయాన్ని రక్షించుకునేందుకు - నా భావము అది కాదు, నా స్వభావము అలా ఉంది, నేను కోరుకోవడం లేదు కానీ అది నా స్వభావము అని అంటారు. బ్రాహ్మణులుగా అయిన తర్వాత జన్మ మారిపోయింది, సంబంధం మారిపోయింది, మాతా-పితలు మారిపోయారు, పరివారం మారిపోయింది, కానీ స్వభావం మారలేదా? అప్పుడిక రాయల్ భాషలో - ఇది నా నేచర్ అని అంటారు. కావున మొదటి బలహీనత స్వరూపం యొక్క పరివర్తన, రెండవది స్వభావం యొక్క పరివర్తన, మూడవది సంకల్పాల పరివర్తన. క్షణంలో వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేయండి. చాలామంది ఎలా భావిస్తారంటే - ఈ తుఫాను కేవలం అరగంట మాత్రమే ఉంది, అరగంట, పదిహేను నిమిషాలు నడిచింది అంతే... కానీ ఆ అరగంట లేక పదిహేను నిమిషాల బలహీనత అనేది సంస్కారాన్ని తయారుచేస్తుంది కదా? ఏ విధంగా శరీరంలో ఏదైనా బలహీనత పదే-పదే వచ్చినట్లయితే సదా కాలానికి బలహీనంగా అయిపోతారు. కావున 15 నిమిషాలు అంటే తక్కువేమీ కాదు. సంగమయుగంలోని ఒక్కొక్క క్షణము ఎన్నో సంవత్సరాలతో సమానము. కావున ఈ విధంగా నిర్లక్ష్యులుగా అవ్వకండి. కాసేపే నడిచింది కానీ పోగొట్టుకున్నది ఎంత? ప్రతి అడుగులో పదమాలు అన్నప్పుడు 15 నిమిషాలలో ఎన్ని అడుగులు వేసి ఉంటారు, మరి ఎన్ని పదమాలు పోగొట్టుకున్నారు? జమ చేసుకునే విషయంలో లెక్క బాగా పెట్టుకుంటున్నారు - అడుగులో పదమాలు జమ అయ్యాయి అని అంటారు, మరి ఈ పోగొట్టుకోవడాన్ని కూడా లెక్క పెట్టుకోండి. కావున వద్దనుకున్నా కూడా సంస్కారాలు తమ వైపుకు ఆకర్షిస్తూ ఉంటాయి. ఏ విషయమైతే పదే-పదే జరుగుతుందో, అది సంస్కార రూపంలో నిండిపోతుంది. కావున సంకల్పాలను పరివర్తన చేయండి. ఇది ఇలా చేయకూడదు, జరిగిపోయింది, ఏం చేయను - అని కేవలం ఆలోచిస్తూ ఉండిపోకండి. అలా కాదు. ఆలోచించండి మరియు చేసి చూపించండి. గతానికి బిందువు పెట్టండి అని చెప్తూ ఉంటారు. ఎవరైనా వచ్చి మాట్లాడినప్పుడు - సరేలే, బిందువు పెట్టేయండి అని ఒకరికొకరు జ్ఞానము ఇచ్చుకుంటూ ఉంటారు కదా, కానీ మీరు స్వయం బిందువు పెడుతున్నారా? బిందువు పెట్టడానికి ఏ శక్తి కావాలి? పరివర్తనా శక్తి. పరివర్తనా శక్తి కలవారు సదా నిర్మలంగా మరియు నిర్మానచిత్తులుగా ఉంటారు. మౌల్డ్ అయ్యేవారే (మలచుకునేవారే) రియల్ గోల్డ్ అని బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. రియల్ గోల్డ్ యొక్క గుర్తు ఏమిటంటే, దానిని మలచగలము. కావున చెక్ చేసుకోండి - పరివర్తనా శక్తి సమయానికి ఉపయోగపడుతుందా లేక సమయం గతించిపోయిన తర్వాత కూడా ఆలోచిస్తూనే ఉంటారా? కావున పరివర్తనా శక్తిని పెంచాలి. ఎవరిలోనైతే పరివర్తనా శక్తి ఉంటుందో వారు అందరికీ ప్రియమైనవారు అవుతారు, ఆలోచనలలో కూడా సరళంగా ఉంటారు. ముందుకు వెళ్తూ సేవలలో ఉంటారు కదా? సేవలో కూడా ఏది విఘ్న రూపము అవుతుంది? నా ఆలోచనలు, నా ప్లాను, నా సేవ ఇంత బాగున్నా కూడా నాది ఎందుకు ఒప్పుకోరు? ఇటువంటివారిని రియల్ గోల్డ్ అని అంటారా? నాది అనేది వచ్చేసింది, నాది అనేది రావడము అనగా అందులో మాలిన్యం కలవడము. స్వచ్ఛమైన బంగారంలో మాలిన్యం కలిస్తే దానిని స్వచ్ఛమైనది అని అంటారా? దానికి అంత విలువ ఉంటుందా? ఎంత తేడా వచ్చేస్తుంది! కావున సమయాన్ని మరియు వాయుమండలాన్ని గుర్తించి స్వయాన్ని పరివర్తన చేసుకోవాలి, ఇప్పుడిది ఎంతో అవసరము. పెద్ద-పెద్ద విషయాలలో పరివర్తన చేసుకోవడం సహజమే కానీ ప్రతి పరిస్థితిలో, ప్రతి సంబంధ-సంపర్కంలో, సమయాన్ని మరియు వాయుమండలాన్ని అర్థం చేసుకొని స్వయాన్ని పరివర్తన చేసుకోవడం, ఇదే నంబర్‌వన్‌గా అవ్వడము. ఫలానావారు కూడా అర్థం చేసుకోవాలి కదా, వారు కూడా పరివర్తన చేసుకోవాలి కదా, కేవలం నేనే పరివర్తన అవ్వాలా అని ఆలోచించకండి. ఎవరైతే ‘ముందు నేను’ అని అంటూ ముందుకు వస్తారో వారే అర్జునులు. ఇందులో ఒకవేళ మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకున్నట్లయితే ఈ పరివర్తనయే విజయులుగా అయ్యేందుకు గుర్తు. అర్థమైందా. అచ్ఛా.
మంచిది, అందరూ మంచిగా చేరుకున్నారు కదా? మంచిగానే ఉన్నారు కదా? భక్తిమార్గపు మేళాలలో ఎంత శ్రమ మరియు కష్టం ఉంటుంది! కానీ ఈ మేళా సుఖాన్ని ఇచ్చేది కదా! నిద్ర అయితే మంచిగానే పోతున్నారు కదా? అయినా పడుకోవడానికి నేల, కూర్చోవడానికి ఫోమ్ (మెత్తని పరుపు) అయితే లభించాయి కదా! అదే నది ఒడ్డున జరిగే మేళాలో భోజనం తిన్నా మట్టి తినాల్సి వస్తుంది. మేళాలో మన ప్రోగ్రామ్ పెట్టుకున్నా ఎంత మట్టి ఉంటుంది! ఇక్కడైతే సుఖంగా మంచి బ్రహ్మా భోజనం లభిస్తుంది. ప్రాప్తులను సదా ఎదురుగా ఉంచుకుంటే, ప్రాప్తి యొక్క స్మృతి స్వరూపం ద్వారా బలహీనతలు సహజంగా సమాప్తమైపోతాయి. అమృతవేళ నుండి ఏమేమి ప్రాప్తిస్తాయి? ఎవరైనా ‘మిమ్మల్ని అమృతవేళ ఎవరు లేపుతారు?’ అని అడిగితే, ‘పరమాత్మ వీరిని లేపుతారు’ అని ఎవరైనా అనుకుంటారా? నవ్వుతారు - ‘పరమాత్మ మీ కోసం చాలా ఖాళీగా ఉన్నారా ఏంటి? చదివించడానికి ఖాళీగా ఉన్నారు, లేపడానికి కూడా ఖాళీగా ఉన్నారా?’ అని. కానీ మీరు గర్వంతో చెబుతారు కదా - ‘ఉన్నదే మా కోసం!’ అని. ఎవరైనా వృద్ధ మాతలను ‘మీ టీచర్ ఎవరు’ అని అడిగితే ఏమి చెబుతారు? ‘పరమాత్మ మాకు చదువు చెబుతారు!’ ఆశ్చర్యపోయే విషయమే కదా! పరమాత్మకు వేరే ఏ స్టూడెంట్స్ దొరకలేదా! అచ్ఛా!
ఎలాగైతే మధుబన్‌లో సంతోషంగా ఉంటారో - అలాగే మీ స్థానాలను మధుబన్గా తయారు చేయండి. మాతలకు అన్నింటికంటే ఎక్కువ సంతోషం ఉంది కదా? సంతోషాన్ని సంభాళించుకోవడం వచ్చా? మాతలకు ఎలాగూ వస్తువులను సంభాళించే అలవాటు ఉంటుంది, కాబట్టి సంతోషాన్ని సదా సంభాళించి ఉంచండి. పాండవులకు జమ చేయడం వచ్చు, సంపాదించడం అంటే జమ చేయడం. కాబట్టి పాండవులు జమ చేయడంలో తెలివైనవారు. జేబు ఖర్చు ఉంచుకోవడంలో తెలివైనవారుగా ఉంటారు. కాబట్టి సదా చెక్ చేసుకోండి - ఎంత పోగొట్టుకున్నారు, ఎంత జమ చేసుకున్నారు? జమ ఖాతా సదా పెరుగుతూ ఉండాలి. మంచి సంపాదనాపరుడి గుర్తు ఇదే - ఈరోజు వెయ్యి ఉంటే రేపు రెండు వేలు అవ్వాలి. ఇలా తెలివైనవారే కదా?
దూరంగా కూర్చున్నవారు బాప్‌దాదాకు ఇంకా అత్యంత సమీపంలో ఉన్నారు. ఎందుకంటే బాప్‌దాదా వద్ద అలాంటి టీ.వీ. ఉంది, దూరంగా ఉన్నవారు కూడా నయనాలలోకి వచ్చేస్తారు. అచ్ఛా! అందరూ నాట్యం చేస్తున్నారు. అంతే, నాట్యం చేయండి, పాడండి మరియు బ్రహ్మా భోజనం తినండి.
డబల్ విదేశీయులు: డబల్ విదేశీయులు చాలా చతురులు. అన్ని గ్రూపులలో డబల్ విదేశీయులు ఉంటూనే ఉంటారు. విదేశీయుల సీజన్లో కూడా భారత్వాసులు ఉండనే ఉంటారు. మొదట ఇక్కడ (ఆబూ) ఉన్న ఐదు స్థానాల వారు ఉంటారు. కాబట్టి డబల్ విదేశీయులు పెద్ద మనసుతో ఉన్నారు, అందుకని భారత్వాసులు కూడా పెద్ద మనసుగలవారిగా అయ్యారు. డబల్ విదేశీయులు సికిలధే (ప్రియమైన) పిల్లలు. విశేషంగా ఉల్లాసం, ఎగురుతున్న కళ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎగురుతున్న కళ యొక్క లక్ష్యం ఎలా ఉందో, అలాగే లక్ష్యం మరియు లక్షణాలను సమానంగా చేసుకుంటూ ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. ఎగిరేవారు ఎలాగూ ఉన్నారు. విమానంలో ఎగిరే వస్తున్నారు కదా! కాబట్టి శరీరంతో కూడా ఎగిరేవారు మరియు పురుషార్థంలో కూడా ఎగురుతున్న కళ. కానీ లక్ష్యం మరియు లక్షణాలను ఇంకా సమీపంలోకి తీసుకురండి. ఉంది, కానీ ఇంకా సమీపంలోకి తీసుకురండి. దీనితో సదా శ్రేష్ఠంగా ఉంటారు. అర్థమైందా! అచ్ఛా!
ఢిల్లీ: ఢిల్లీ యొక్క కల్ప ఆది నుండి ఇప్పటి అంతము వరకు ప్రత్యేకత ఏమిటి? (రాజధానిగా ఉంది) మరి ఢిల్లీ నివాసులు తమను సదా రాజ్య అధికారి ఆత్మలము - ఇలా శ్రేష్ఠమైన స్మృతి స్వరూపంగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే బాప్‌దాదా ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులుగా తయారుచేశారు. కాబట్టి స్వరాజ్య అధికారి అంటే విశ్వ రాజ్య అధికారి. స్వరాజ్య అధికారి తక్కువైతే విశ్వ రాజ్య అధికారి కూడా తక్కువవుతారు. అందుకని ఢిల్లీ వారికి ఈ విశేషమైన నషా ఉంది మరియు సదా ఉండాలి - ‘మేము స్వరాజ్య అధికారులము, అందువలన విశ్వ రాజ్య అధికారులము’ అని. ఇప్పుడు విశ్వ సేవాధారులు మరియు స్వరాజ్యధారులు. ఎందుకంటే ఢిల్లీలో ఏ కార్యం జరిగినా అది విశ్వంలోని నలుమూలలకూ చేరుకుంటుంది. కాబట్టి విశ్వ సేవాధారులు కూడా, స్వరాజ్య అధికారులు కూడా మరియు విశ్వ రాజ్య అధికారులు కూడా. కాబట్టి సేవ మరియు రాజ్యం రెండింటి స్మృతి స్వరూపం - ఇది ఢిల్లీ యొక్క ప్రత్యేకత. అర్థమైందా? అచ్ఛా.
రాజస్థాన్: రాజస్థాన్ యొక్క ప్రత్యేకత ఏమిటి? రాజస్థాన్ అంటే కిరీటధారులు – సింహాసనాధికారులు. రాజుల గుర్తు - కిరీటం ఉంటుంది కదా! కాబట్టి రాజస్థాన్ అంటే సదా సేవా బాధ్యత అనే కిరీటధారులు. దాంతోపాటు బాబా హృదయ సింహాసనాసీనులు. ఒకటి సేవా బాధ్యత అనే కిరీటం, రెండవది లైట్ యొక్క కిరీటం. కాబట్టి డబల్ కిరీటధారులు కూడా, డబల్ సింహాసనధారులు కూడా. బాబా హృదయ సింహాసనం ఉంది మరియు అకాల సింహాసనం కూడా ఉంది. కాబట్టి రెండింటి సింహాసనాలకు అధికారులు. డబల్ సింహాసనధారులు మరియు డబల్ కిరీటధారులు. అర్థమైందా!
ఇప్పుడు రాజస్థాన్ వారు సేవా స్థానాలను ఇంకా పెంచాలి. రాజస్థాన్ సేవా కేంద్రాల సంఖ్యను ఇంకా పెంచండి. అన్ని జోన్లలో కల్లా సేవా కేంద్రాల లిస్ట్ అన్నింటికంటే తక్కువగా ఎవరిది ఉంది? (రాజస్థాన్‌ది) ఈరోజు అయితే రాజస్థాన్ ఉంది కదా! రాజస్థాన్ వారు ఇప్పుడు ఏమి చేస్తారు? సేవా కేంద్రాలు పెంచుతారా? చేసి చూపించండి. కొద్దిగా శ్రమ ఉంది కదా! కానీ ఇప్పుడు సమయం సహయోగిగా తయారవుతోంది, అందుకని ఇప్పుడు శ్రమ తక్కువగా పడుతుంది. అచ్ఛా!
బనారస్, యు.పి.: యు.పి. వారు ఏమి చేస్తారు? విశేషమైన కార్యాలు చేస్తారు కదా! ఢిల్లీ మరియు యు.పి.లలో మొదటగా బ్రహ్మా బాబా సాకారంలో చాలా ప్రేమతో ఆహ్వానాన్ని స్వీకరించారు. బ్రహ్మా బాబా సాకారంలో వెళ్ళిన ధరణి ఇది. మరి ఎక్కడైతే బ్రహ్మా బాబా అడుగులు పడ్డాయో అక్కడ ఏమి జరుగుతుంది? ఎక్కువగా పావనమవుతారు కదా! కాబట్టి యు.పి. వారు సదా తమ శ్రేష్ఠ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని హీరో పాత్రధారులుగా అయి హీరో పాత్ర పోషిస్తారు. బ్రహ్మా బాబా యొక్క ప్రత్యేకత హీరో పాత్రగా ఉన్నట్లుగా, యు.పి. నివాసులు ప్రతి ఒక్కరూ హీరో పాత్రధారులుగా అయి విశేష పాత్ర పోషించడానికి నిమిత్తులు మరియు ఉంటారు కూడా. అర్థమైందా!
కర్ణాటక: కర్ణాటకలో సంఖ్య బాగుంది, సేవ బాగుంది కానీ విశేషంగా నిర్విఘ్న సేవాధారులుగా అవ్వాలి. నిర్విఘ్న సేవాధారి అంటే నిర్విఘ్న విశ్వ రాజ్య అధికారి భవ. కాబట్టి కర్ణాటక నివాసులకు విశేష టైటిల్ ఉంది - ‘విఘ్న వినాశక ఆత్మలు’. దీనికే గాయనము మరియు పూజనము జరుగుతుంది. కాబట్టి కర్ణాటక వారు తమ ఈ విశేష టైటిల్‌ను స్మృతిలో ఉంచుకుని తమ పూజ్య స్వరూపాన్ని సదా ఎదురుగా ఉంచుకోండి. ప్రతి ఒక్కరూ విఘ్న వినాశకులే కదా? గర్వంతో చెప్పండి - ‘మేము విఘ్న వినాశకులం మరియు సదా ఉంటాము’ అని. ఇప్పుడు చూద్దాం, ఎలాంటి సమాచారాలు వస్తాయో? విఘ్న వినాశకుల సమాచారం వస్తుందా?
మహారాష్ట్ర: పేరు ఎలా ఉందో - ‘మహారాష్ట్ర’ - అలాగే విస్తారము కూడా ఉంది. పేరు మహారాష్ట్ర అని ఉంది, కాబట్టి జోన్ లేదా సంఖ్యలో కూడా మహాన్ మహారాష్ట్ర. అందుకని మహారాష్ట్ర సదా మహాదానిగా అవ్వాలి. ఏ దానము చేస్తారు? మొదట అన్నింటికంటే పెద్ద దానము ‘సర్వీస్ హ్యాండ్స్’ (సేవా హ్యాండ్స్). కాబట్టి మహారాష్ట్ర సేవ కోసం హ్యాండ్స్ తయారు చేయడంలో మహాదానిగా అవ్వాలి. ఎలాగూ వస్తూనే ఉంటారు, కానీ ఇంకా తీయండి. కాబట్టి మహారాష్ట్ర అంటే మహాదాని, మహాదానిగా అవ్వడం అంటే మహాన్‌గా అవ్వడం. కాబట్టి కొద్దిగా ఇంకా పెద్ద మనసుగలవారిగా అవ్వండి. ఎలాగూ రిజల్ట్‌లో చూడబడింది - ట్రైనింగ్‌లో ఏ హ్యాండ్స్ అయితే వస్తారో వారు ఎక్కువగా మహారాష్ట్ర వారే వస్తారు. ఇది ప్రత్యేకత. అందుకని బాప్‌దాదా ఈ ప్రత్యేకతకు అభినందనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ అభినందనలను ఇంకా పెంచుతూ వెళ్ళండి, అప్పుడు ఇంకా అభినందనలు ఇస్తాము.
బొంబాయి వారు కూడా సదా సేవలో ముందుకు వెళ్తూ ఉంటారు మరియు వెళ్తూనే ఉంటారు. సేవ యొక్క ప్లాన్స్ విశేషంగా ఢిల్లీ మరియు బొంబాయిలలో ఎక్కువగా తయారవుతాయి. బొంబాయికి విశేష వరదానము ఉంది - యజ్ఞ సహయోగి ఆత్మలకు నిమిత్తం బొంబాయి అని. ఆంధ్రాలో ఐ.పి.లు సహయోగులు మరియు బొంబాయిలో వారిసులు సహయోగులు. కాబట్టి బొంబాయి ప్రత్యేకత ఏంటంటే వారిస్ క్వాలిటీ ఉన్న సహయోగులు మంచిగా ఉన్నారు. అంతే కదా? భండారా నిండుగా చేసేవారు.
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రా వారు సదా తమను ముందుకు తీసుకెళ్లే ఉల్లాస-ఉత్సాహాలలో మంచిగా ఉన్నారు. ఇంకా ముందుకు వెళ్ళండి, అప్పుడు ఆంధ్రా నుండి విశేష ఐ.పి. ఆత్మలు రావచ్చు. ఆంధ్రా వారికి విశేషంగా సహయోగి ఆత్మలను తయారుచేసే వరదానము ఉంది, కాబట్టి సహయోగులుగా తయారుచేయండి. రెగ్యులర్ స్టూడెంట్స్ కాకపోయినా సహయోగులుగా అవుతారు. కాబట్టి ఏ ప్రత్యేకత ఉందో దానిని ఇంకా పెంచుతూ వెళ్ళండి. ఎంతమంది సహయోగి ఆత్మలను తీయాలనుకుంటే అంతమందిని తీయండి. ఎందుకంటే కర్ణాటక మరియు ఆంధ్రా రెండూ భావనా ప్రధానమైనవి. కర్ణాటక నుండి కూడా స్నేహి ఆత్మలు చాలామంది రావచ్చు. ఇప్పుడు వారిని ముందుకు తీసుకురండి. ఉన్నారు చాలామంది. కాబట్టి ఇప్పుడు చూద్దాం, జ్ఞాన సరోవర్‌లో సహయోగి ఆత్మలను ఎంతమందిని తీస్తారో? అర్థమైందా?
కేరళ: (3-4 మంది ఉన్నారు) మంచిది, కేరళ వారు ప్రియమైనవారు. ఎవరైతే కొద్దిమంది ఉంటారో వారు ప్రియమైనవారిగా ఉంటారు. విశేషంగా ప్రియమైన ఆత్మలు.
గుజరాత్: గుజరాత్ అంటే మధుబన్ యొక్క గది. గుజరాత్ యొక్క ప్రత్యేకత ప్రతి కార్యంలో సహయోగిగా అవ్వడం. మీరు బ్రహ్మా భోజనం తింటారు, మరి గుజరాత్ మాతలు రొట్టెలు కాల్చినట్లు ఇంకెవరూ కాల్చలేరు. అందుకనే కాన్ఫరెన్స్ లేదా ఏ ఫంక్షన్ జరిగినా గుజరాత్ మాతలకే ఆహ్వానం ఎక్కువగా లభిస్తుంది. కాబట్టి గుజరాత్ యొక్క ప్రత్యేకత సహయోగం ఇవ్వడం. అన్ని రకాల సహయోగం ఇస్తారు. సేవా స్థానాలు మరియు గీతా పాఠశాలల ప్రత్యేకత కూడా గుజరాత్‌లోనే ఉంది. కాబట్టి సేవ యొక్క విధి కూడా బాగుంది మరియు వృద్ధి కూడా ఉంది, అందుకనే వరదాని. కాబట్టి గుజరాత్‌కు జన్మతోనే వరదానము ఉంది - ‘‘పెరుగుతూ ఉండండి, పెంచుతూ ఉండండి.’’ అని. పిలుపు ఇవ్వగానే చేరుకుంటారు కదా! ఎలాగైతే గదిలో నుండి ఎవరినైనా పిలిస్తే వచ్చేస్తారో, అలాగే పిలుపు ఇవ్వగానే చేరుకుంటారు. మంచివారు, తేలికగా ఉన్నారు మరియు ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నవారు. సేవలో అలసిపోనివారు. ఏవైతే కష్టమైన డ్యూటీలు ఉంటాయో వాటిని గుజరాత్ వారే తీసుకుంటారు. అన్నింటికంటే కష్టమైన డ్యూటీ వసతి ఏర్పాటు చేయడం, దానిని కూడా గుజరాత్ తీసుకుంటుంది కదా! భోజనం తయారుచేసే, రొట్టెలు కాల్చే డ్యూటీ గుజరాత్ తీసుకుంటుంది. అందరినీ సంతుష్ట పరిచే ప్రత్యేకత కూడా ఉంది. కాబట్టి గుజరాత్ ‘సాల్వేషన్ ఆర్మీ’. అందరికీ సాల్వేషన్ ఇచ్చేవారు. గుజరాత్ తన ప్రత్యేకతను అర్థం చేసుకుంది, ఇప్పుడు దీనిని ఇంకా పెంచాలి. అచ్ఛా!
టీచర్లతో: టీచర్లంతా సదా జ్ఞాన స్వరూపులుగా, స్మృతి స్వరూపులుగా ఉండనే ఉన్నారు ఎందుకంటే ఏ విధంగా తండ్రి శిక్షకునిగా అయి వస్తారో అలా మీరూ తండ్రి సమానమైన నిమిత్త శిక్షకులు. మీరు తండ్రిలా కాదు కానీ నిమిత్త శిక్షకులు. కావున టీచర్ల యొక్క విశేషత - నిమిత్త భావము మరియు నిర్మాన భావము. ఎవరి స్వభావమైతే నిర్మలంగా ఉంటుందో వారే సఫల టీచర్లుగా అవుతారు. ఇప్పుడు నిర్మల స్వభావముపై విశేషంగా అండర్లైన్ చేయండి. ఏమి జరిగినా కానీ మీ స్వభావము సదా నిర్మలంగా ఉండాలి. ఈ నిర్మల స్వభావమే నిర్మానతకు గుర్తు. కావున ‘నిర్మల స్వభావము’ను అండర్లైన్ చేయండి. పూర్తిగా శీతలంగా ఉండాలి. శీతలతకు గుర్తుగా శీతలా దేవి గాయనం ఉంది. కావున నిర్మల స్వభావము అనగా శీతల స్వభావము. విషయం ఆవేశాన్ని కలిగించేదిగా ఉన్నా మీరు నిర్మలంగా ఉన్నట్లయితే సఫల టీచర్లు అని అంటాము. కావున బాప్‌దాదా మళ్ళీ అండర్లైన్ చేయిస్తున్నారు, ఏ విషయంపై? నిర్మల స్వభావము. అర్థమైందా? అచ్ఛా!
నలువైపులా ఉన్న సదా స్మృతి స్వరూప ఆత్మలందరికీ, సదా క్షణంలో పరివర్తనా శక్తి ద్వారా స్వ పరివర్తన చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా సహజయోగులుగా అనుభవం చేసే అనుభవీ ఆత్మలకు, సదా తండ్రికి సమీపంగా మరియు సమానంగా అయ్యే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే సర్వ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
