‘‘సమయము, సంకల్పాలు, మాటల ద్వారా సంపాదనను జమ చేసుకునేందుకు ఆధారము - మూడు బిందువులను పెట్టడము’’
ఈరోజు బాప్‌దాదా ఏ సభలోకి వచ్చారు? ఈ సభ అంతా ఏ ఆత్మలది? ప్రతి ఒక్కరూ హైయ్యెస్ట్ (అతి ఉన్నతం) గా, రిచ్చెస్ట్ (అతి ధనవంతులు) గా ఉన్నారని బాప్‌దాదా చూస్తున్నారు. ప్రపంచంలోని వారు రిచ్చెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు కానీ మీరందరూ రిచ్చెస్ట్ ఇన్ కల్పా. ఈ సమయంలో జమ చేసుకున్న ఖజానా మొత్తం కల్పమంతా తోడుగా వస్తుంది. ఈ జన్మలోనైతే నేను ధనవంతుడిగా ఉన్నాను కానీ భవిష్యత్తులో కూడా అనేక జన్మలు షావుకారుల కన్నా షావుకారులుగా ఉంటాను అని భావించేవారు మొత్తం కల్పమంతటిలో ఎవ్వరూ దొరకరు. ఇప్పుడు మీరందరూ నిశ్చయము మరియు నషాతో మా యొక్క ఈ ఖజానా అనేక జన్మలు తోడుగా ఉంటుంది అని అంటారు. గ్యారంటీ ఉంది కదా? ఇటువంటి ధనవంతులను మొత్తం కల్పమంతటిలో ఎక్కడైనా చూశారా? మరి ఈరోజు బాప్‌దాదా తమ రాజులకు కూడా రాజులుగా ఉండే పిల్లలను చూస్తున్నారు. ఒక్కొక్క రోజులో, ఎంతటి సంపాదనను జమా చేసుకుంటారు? లెక్క వేయండి, జమా ఖాతా ఎంత తీవ్రగతితో పెరుగుతూ ఉంది? మరియు దానిని పెంచే సాధనము ఎంత సహజంగా ఉంది! ఇందులో ఏమైనా శ్రమ ఉందా? మీ సంపాదన లేక జమా ఖాతా పెరిగేందుకు అన్నింటికన్నా సహజ సాధనము - బిందువు పెడుతూ వెళ్ళండి మరియు పెంచుకుంటూ వెళ్ళండి. మీరూ బిందువు, తండ్రి కూడా బిందువు మరియు డ్రామాలో కూడా గతించినదానికి బిందువు పెట్టండి. కావున సంపాదనకు ఆధారము బిందువు పెట్టడము, ఇంకేమీ లేనే లేదు. ఎందుకు, ఏమిటి, ఎలా - ఇవన్నీ ప్రశ్నార్థకము, ఆశ్చర్యార్థకము, వీటి అవసరం లేదు ఎందుకంటే మీరు మాస్టర్ జ్ఞాన స్వరూపులుగా అయిపోయారు కావున ‘ఎలా’ అన్న పదము ‘ఇలా’గా మారిపోయింది. మారిపోయిందా లేక ఇప్పుడు కూడా ‘ఎలా-ఎలా’ అని అంటూ ఉంటారా? ‘ఏమో తెలియదు’ అన్న ఈ పదము సంకల్పం నుండి కూడా మారిపోయిందా? త్రికాలదర్శులుగా ఉన్నవారు ఈ విధంగా స్వప్నంలో కూడా ఆలోచించలేరు, మరి నోటితో అనే ప్రశ్నే లేదు. సంగమయుగంలోని ఆట అంతా ఈ మూడు బిందువులపైనే ఉంది. అన్నింటికన్నా సహజమైనది బిందువా లేక ప్రశ్నార్థకమా? బిందువు సహజమే కదా? బిందువును పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? క్షణం కన్నా తక్కువ. బిందువు పెట్టడం వచ్చా లేక కలం జారిపోతుందా? చాలా సార్లు బిందువు పెట్టేందుకు బదులుగా కలం పెద్ద గీతను గీసేస్తుంది. బిందువును పెట్టడం ద్వారా ఒక్క క్షణంలో మీ ఖజానాలు ఎన్ని రక్షింపబడతాయి. ఖజానాల లిస్ట్ అయితే మీకు తెలుసు కదా? ఒకవేళ బిందువుకు బదులుగా ఇంకేదైనా పెట్టినా లేక ఇంకేదైనా పడినా ఏమని భావించాలంటే - జ్ఞాన ఖజానా పోయింది, శక్తుల ఖజానా పోయింది, గుణాల ఖజానా పోయింది, సంకల్పాల ఖజానా పోయింది, ఎనర్జీ (శక్తి) పోయింది, శ్వాస సఫలమయ్యేందుకు బదులుగా అసఫలమయ్యింది, సమయం పోయింది! అలా ఎన్ని పోతాయి. లిస్ట్ చాలా పెద్దదైపోయింది కదా? కావున ఒకటో రెండో క్షణాలే పోయాయి కదా అని భావించకండి కానీ ఒక్క క్షణంలో ఎంత పోగొట్టుకున్నారు? ఒక్క క్షణం కూడా ఎంత భారీ అయినది. ప్రతి సమయమూ మీ జమా ఖాతాను పెంచుకుంటూ వెళ్ళండి. సంపాదించింది ఎంత, పోగొట్టుకున్నది ఎంత? ఈ అన్ని ఖజానాలలో ఎన్ని ఖజానాలను పోగొట్టుకున్నారు? బాప్‌దాదా కూడా పిల్లల యొక్క జమా ఖాతాను పరిశీలిస్తూ ఉంటారు. ఖాతాలను చూసినప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏమి చూసిన కారణంగా నవ్వుతారు? అమృతవేళ మిలనము కూడా జరుపుతారు, ఆత్మిక సంభాషణ కూడా ఎంతో చేస్తారు. ఇది చేస్తాము, అది చేస్తాము అంటూ మంచి-మంచి ప్రతిజ్ఞలు కూడా చేస్తారు. చాలా మంచి-మంచి మాటలు కూడా మాట్లాడుతారు. కానీ నడుస్తూ-నడుస్తూ రోజంతటిలో ఏదో ఒక ఖజానాను పోగొట్టుకుంటూ కూడా ఉంటారు. ఇక దేనిని ఆధారంగా చేసుకుంటారు? బాప్‌దాదాకు కూడా తమ మంచి-మంచి మాటలను వినిపించడం మొదలుపెడతారు. ఒకవేళ వ్యర్థ సంకల్పాలు నడిచినట్లయితే, అవి జమా అవుతున్నాయా లేక పోగొట్టుకుంటున్నారా? అప్పుడు మళ్ళీ ఏం మాట్లాడుతారు? కేవలం సంకల్పాలలోనే నడిచింది కదా, అదైతే బాగైపోతుంది లేండి, తండ్రికి కూడా ఊరటను ఇస్తారు - బాగైపోతుంది లేండి, పురుషార్థులం కదా, సంపూర్ణంగా అయితే ఇంకా అవ్వలేదు, అయిపోతుంది... మరి బాప్‌దాదా అంటారు - ఇలా అవుతాము, అవుతాము అనే పాటను రోజంతటిలో చాలా వింటాము కానీ ఇది కూడా ఎంతవరకు? మరి అంతిమంలో సంపూర్ణంగా అవుతారా లేక బహుకాలపు అభ్యాసం ద్వారా బహుకాలపు వారసత్వాన్ని పొందుతారా? మీకు వారసత్వం అవినాశీగా కావాలనుకుంటున్నారా, సంపూర్ణ వారసత్వం కావాలనుకుంటున్నారా లేక అసంపూర్ణమైనా ఫర్వాలేదా? పురుషార్థంలో అసంపూర్ణ పురుషార్థం ఫర్వాలేదా? మరి పురుషార్థం యొక్క సమయంలో చేస్తాము, చూస్తాము, అవుతాము, చేసేస్తాములే, అయిపోతుందిలే... అంటూ ఇలా ఆలోచిస్తారు. మరియు ప్రాప్తి సమయంలో కూడా లే, లే... అని అంటారా? అందులోనైతే సంపూర్ణ ప్రాప్తి కావాలి, సంపూర్ణ వారసత్వం కావాలి. అందరూ లక్ష్మీ-నారాయణులుగా అవుతామని చేతులెత్తుతారు. లక్ష్మీ-నారాయణులవి కూడా 8 సింహాసనాలు నడుస్తాయని తెలుసు. కానీ చేతినైతే లక్ష్మీ-నారాయణులుగా అవుతామనే ఎత్తుతారు కదా. లక్ష్మీ-నారాయణుల అర్థము నంబర్‌వన్‌గా పాస్ విత్ ఆనర్‌గా అవ్వడము. బాప్‌దాదా పిల్లల ధైర్యాన్ని చూసి సంతోషిస్తారు కూడా. సీతా-రాములుగా అవుతామని ఎవ్వరూ చేతులెత్తరు. ధైర్యము మంచిగా ఉంది మరియు ధైర్యము కలవారికి సహాయం కూడా లభిస్తుంది. కేవలం పురుషార్థం సమయంలో ఎలాగైతే తండ్రి ఎదురుగా సంకల్పం చేస్తారో అలాగే దానిని మాటల్లోకి మరియు కర్మల్లోకి తీసుకురండి.
బాప్‌దాదా చూసారు - సమయపు ఖజానా యొక్క మహత్వాన్ని ఎంతగా ఉంచాలో అంతగా చాలామంది పిల్లలు ఉంచడం లేదు. ఒక్కరోజుదైనా కూడా చార్ట్ చెక్ చేసినట్లయితే మెజారిటీ పిల్లల సమయము వ్యర్థం యొక్క ఖాతాలోకి వెళ్తున్నట్లు కనిపిస్తుంది. ద్వాపర సమయం నుండి వ్యర్థం వినడం, చూడడం మరియు తర్వాత ఆలోచించడం అనే అలవాటు వద్దనుకున్నా కూడా ఆకర్షితం చేస్తుంది. ఈ కారణం వలన సమయపు ఖజానా వ్యర్థ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఒక్క క్షణానికి కూడా ఎంత మహత్వం ఉంది అని ఇంతకుముందు కూడా వినిపించడం జరిగింది! రెండవ విషయము - మెజారిటీ వ్యర్థమైన మాటలలో కూడా సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. ఒక గంటలో కూడా మీరు చెక్ చేసుకోండి, ఏవైతే మాటలు మాట్లాడారో, ఆ ప్రతీ మాటలో ఆత్మిక భావము మరియు శుభ భావన ఉన్నాయా? మాటల ద్వారా భావము మరియు భావన రెండూ అనుభవమవుతాయి. ఒకవేళ ప్రతి మాటలో శుభ భావన మరియు శ్రేష్ఠ భావన లేకపోతే తప్పకుండా మాయ యొక్క భావనలు ఉన్నట్లు. అవైతే అనేకం ఉన్నాయి, ఈర్ష్య, ద్వేషం, అయిష్టం... ఈ భావనలు ఎంతో కొంత శాతంలో ఇమిడి ఉంటాయి. చాలా సార్లు మాటల యొక్క టేప్ రికార్డును బాప్‌దాదా వింటారు. ప్రతి ఒక్కరి టేప్ ఆటోమెటిక్‌గా నిండుతూ ఉంటుంది మరియు ఏ సమయంలో ఎవరిది వినాలనకుంటే వారిది వినగలను. ప్రతి మాటకీ సారము ఉండదు. చాలా సార్లు అంటారు కూడా - నా భావన, నా భావము చెడుగా లేదు, ఏదో అలా వచ్చేసింది లేదా అలా మాట్లాడేసాను కానీ ఏ మాటలలోనైతే ఆత్మిక భావము మరియు శుభ భావన లేదో, అవి ఏ ఖాతాలో జమా అవుతాయి? వ్యర్థంలోకి వెళ్తాయి కదా? మరి సంపాదన యొక్క ఖాతా ఎక్కువగా ఉంటుందా లేక పోగొట్టుకునే ఖాతా ఎక్కువగా ఉంటుందా? ఇదైతే పోగొట్టుకోవడము కదా? కావున మాటలలో కూడా పోగొట్టుకునే ఖాతా ఎక్కువగా ఉంటుంది. మరి మాటలను కూడా చెక్ చేసుకోండి. ఏదో అలా మాట్లాడేసాను - ఈ భాషను మార్చుకోండి. సమర్థ మాటలకు అర్థమే - ఆ మాటలలో ఏ ఆత్మ కొరకైనా ప్రాప్తి యొక్క భావము లేక సారము ఉండాలి. ఒకవేళ సారము లేకపోతే జమా ఖాతా అయితే ఉండదు కదా? ఒక్క రోజులో ఎంత జమా చేసుకోగలరు, మరి ఎంత చేసుకోగలరో అంతగా చేసుకోలేదు అని బాప్‌దాదా చూసారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? లక్ష్మీ-నారాయణులుగా అవ్వవలసిందే కదా. లేకపోతే అవ్వకపోయినా ఫర్వాలేదా! మొదటి జన్మ నుండి శ్రేష్ఠ ప్రారబ్ధాన్ని పొందాలా లేక రెండవ, మూడవ జన్మలో ప్రారంభిస్తారా? మొదటి జన్మలో రాకుండా రెండవ, మూడవ జన్మలో రావడము మీకు ఇష్టమేనా? ఇష్టం లేదు కదా? మరి ఇంత జమా ఖాతా ఉందా? ఖాతా తక్కువగా జమా అయితే ప్రారబ్ధాన్ని ఏం తీసుకుంటారు? ఎంత జమా చేసుకున్నారో అంతే తీసుకుంటారు కదా. కావున ఈరోజు బాప్‌దాదా అందరి జమా ఖాతాను చూసారు. ఇతరులకు సమయం యొక్క మహత్వం గురించి చాలా బాగా వినిపిస్తారు, సంగమయుగం యొక్క మహిమను ఎంత మంచి రీతిలో చేస్తారు! మరి స్వయం కూడా సదా సమయం యొక్క మహత్వాన్ని ఎదురుగా పెట్టుకోండి. సమయానికి ముందే మీ శ్రేష్ఠ భాగ్యం యొక్క ఆధారంతో ప్రాప్తుల ఖాతాను పూర్తిగా జమా చేసుకోండి.
సంగమయుగ సమయం యొక్క విశేషత - మూడు రూపాలలో ప్రాప్తి. ఒకటి వారసత్వ రూపంలో, రెండవది చదువును సోర్స్ ఆఫ్ ఇన్కమ్ (ఆదాయము) అని అంటారు కావున చదువు యొక్క ప్రాప్తి ఆధారముతో, మరియు మూడవది వరదాన రూపంలో. వారసత్వం కూడా ఉంది, సంపాదన కూడా ఉంది మరియు వరదానము కూడా ఉంది. ప్రాప్తి చాలా గొప్పగా ఉంది, చాలా పెద్దది. కేవలం సంభాళించేవారిగా అవ్వండి. వారసత్వం కూడా అనంతమైనది ఉంది, ఇన్కమ్ (ఆదాయము) కూడా అనంతంగా ఉంది మరియు వరదానాలు కూడా అనంతమైనవి ఉన్నాయి. రోజూ భగవంతుని వరదానం లభిస్తుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని వరదానాలు ఎవ్వరికీ, ఎప్పుడూ లభించజాలవు. కానీ మీరు ఇది మా అధికారము అని అంటారు. మీకు వారసత్వంపైన, చదువుపైన మరియు వరదానంపైన కూడా అధికారం ఉంది. ఇదేమీ చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయము. మూడు సంబంధాలతోనూ మూడింటిపైన మీ అధికారాన్ని పొందారు కదా? తండ్రి నా వారు అని అధికారంతో అందరూ అంటారు కదా. లేక ఇది నాది కాదు నీది అని అంటారా? మా కొరకు బాబా చదివించడానికి వచ్చారు అని భావిస్తున్నారు కదా? మరి చదువుపైన అధికారం ఉంది కదా? మరియు వరదాత వద్ద వరదానాలు ఎవరి కోసం ఉన్నాయి? నా కొరకే వరదాత తండ్రి ఉన్నారు అని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కావున మూడింటిపైన అధికారం ఉంది. చెప్పేందుకు చాలా సాధారణమే కావుననే ప్రపంచంలోనివారు - వీరు ఎలా ఉన్నారు మరియు ఏం మాట్లాడుతున్నారు అని నవ్వుకుంటూ ఉంటారు. మరి అధికారమును సదా స్మృతిలో ఉంచుకొని అడుగులు వేయండి. ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి, మర్జ్ రూపంలో కాదు. ఉన్నది బ్రహ్మాకుమారులుగానే కదా, మేమున్నదే బాబాకు చెందినవారిగా కదా అని కాదు. మనస్సులో, బుద్ధిలో, కర్మలో ఇమర్జ్ రూపంలో ఉంచండి. నేను ఇది అని మనస్సులో సంకల్ప రూపంలో ఇమర్జ్ అయి ఉండాలి. బుద్ధిలో స్మృతి స్వరూపులుగా ఉండాలి మరియు కర్మలో యజమానిని అన్న నిశ్చయము మరియు నషాతో ప్రతి కర్మ జరగాలి. అమృతవేళలో ఇమర్జ్ అయి ఉంటుంది కానీ రోజంతటిలో మర్జ్ అయిపోవడం కాదు. సదా ఇమర్జ్ రూపంలో ఉండాలి. మరి జమా ఖాతాను పెంచండి, తీవ్రగతితో పెంచండి, ఏదో సాధారణంగా కాదు ఎందుకంటే సమయము మాస్టర్ రచయితలైన మీ కొరకు ఆగి ఉంది. ఇప్పుడు కూడా ప్రకృతికి ఆర్డర్ వేస్తే అది ఏమైనా చేయగలదు. ఈ పంచ తత్వాలు అలజడి చేయడం ప్రారంభిస్తే ఏదైనా జరగవచ్చు మరియు ఎంతసేపటిలో జరుగుతుంది? కావున సమయము, ప్రకృతి మరియు మాయ, వీడ్కోలు పలికేందుకు ఎదురుచూస్తున్నాయి. మీరు సంపూర్ణత యొక్క అభినందనలను జరపండి, అప్పుడు అవి వీడ్కోలు తీసుకునే వెళ్తాయి. ఇప్పుడు వీరు సిద్ధంగా లేరు అని మాయ కూడా గమనిస్తుంది కావుననే అవకాశాన్ని తీసుకుంటూ ఉంటుంది. మరి ప్రకృతికి ఆర్డర్ ఇద్దామా, పురుషులు సిద్ధంగా ఉన్నారా? ప్రకృతి అయితే సిద్ధమైపోతుంది, మరి ఆర్డర్ ఇద్దామా? లేక జ్ఞాన సరోవరం తయారైన తర్వాత ఆర్డర్ ఇద్దామా? ఈ విధంగా ఎవరెడీగా ఉన్నారా లేక రెడీగా ఉన్నారా? శక్తులు ఎవరెడీగా ఉన్నారా? సంపూర్ణంగా అయిపోయారా? కొద్దిమందిని మాత్రమే ఎవరెడీ అని అనము కదా? ఇది ఆలోచించండి, చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ ఘడియలో కూడా మహావినాశనం జరిగితే జ్ఞానమనే దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి, నేను ఏమవుతాను అని. దర్పణమైతే అందరి వద్దా ఉంది కదా? స్పష్టంగా ఉంది కదా? మరి మీ భాగ్యం యొక్క ముఖాన్ని చూసుకోండి. తండ్రికి ఏమైనా సమయం పడుతుందా? సంకల్పంతో సృష్టిని రచించారు అని బ్రహ్మాకు గాయనం ఉన్నప్పుడు మరి సంకల్పంతో వినాశనం జరగదా? తండ్రికి తెలుసు, రాజధాని ఏర్పడనున్నది, మరి అందులో ఒక్క బ్రహ్మా ఏం చేస్తారు? సహచరులు కావాలి కదా? కావున బ్రహ్మాబాబా కూడా సహచరులైన మీ కోసం ఆగి ఉన్నారు. తండ్రి పిల్లలను ప్రశ్న అడుగుతున్నారు. పిల్లలు బాబాను ఎన్నో ప్రశ్నలు అడిగారు, ఇప్పుడు బాబా పిల్లలను ప్రశ్నిస్తున్నారు, డేట్ ఫిక్స్ చేయండి. అందరూ మీ కార్యాలకు డేట్ ఫిక్స్ చేస్తారు కదా? మరి దీని యొక్క డేట్ కూడా ఫిక్స్ చేయండి. దీని ముహూర్తము కూడా కావాలి కదా! ‘జ్ఞాన సరోవరం’ యొక్క డేట్ కూడా ఫిక్స్ అయ్యింది, హాస్పిటల్ డేట్ కూడా ఫిక్స్ అయ్యింది, మరి దీని డేట్ ఏమిటి? దీన్ని ఎవరు ఫిక్స్ చేయాలి? తండ్రి చేయరు. ఇది తండ్రి పిల్లలైన మీ చేతుల్లో పెట్టారు. దీనిని ఫిక్స్ చేయడం బాబా పిల్లలైన మీకు ఇచ్చారు. కొన్ని పనులైనా మీరు చేస్తారా లేక అన్నింటినీ తండ్రే చేస్తారా? డేట్ ఫిక్స్ చేసే ప్రోగ్రామును తయారుచేయండి. అచ్ఛా!
(కొత్త పిల్లలను చూస్తూ) చూడండి - కొత్త-కొత్త పిల్లలు ఎవరైతే వచ్చారో, మీపై అందరికీ ఎంత ప్రేమ ఉంది! మొదటి అవకాశము మీకే ఇచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎన్ని అడుగుల భూమి లభించింది? రెండు అడుగులా లేక మూడు అడుగులా? (రెండు అడుగులు) రెండు అడుగులకు కూడా సంతోషంగా ఉన్నారు, ఏ కష్టమూ లేదు కదా? తినడానికి, త్రాగడానికి అయితే మంచిగా లభిస్తున్నాయి కదా? మేళాలో ఇటువంటి పాలన ఇంకెవ్వరికీ లభించనే లభించజాలదు. మేళాలు చూసారు కదా? ఇటువంటి బ్రహ్మాభోజనము, ఇటువంటి పరమాత్మ పరివారము ఎక్కడైనా లభిస్తుందా? చలిగా అనిపిస్తుందా? వాతావరణముది మిఠాయి ఉంటుంది. మరియు ఈ చలి కూడా వాతావరణం యొక్క మిఠాయి. మిఠాయిని అయితే తినాలి కదా? అందరికీ కానుకగా షాల్ లభిస్తుంది కదా? ఏ మేళాలోనైనా ఇటువంటి కానుక లభిస్తుందా లేక ఖాళీ చేసుకుని వస్తారా? అచ్ఛా, కొత్తవారి మనసు నిండుగా అయ్యిందా, మధువనాన్ని చూసారా? ముందు స్వప్నములో ఉండేది, ఇప్పుడది సాకారమయ్యింది. ఎంతగా స్థానాలను పెంచినా కానీ అవి తక్కువ అయ్యేదే ఉంది, ఎందుకని? ఆలోచించండి, ఇప్పుడు 9 లక్షల మంది జమ అయ్యారా? మొదటి జన్మలోని వారి సంఖ్య తయారవ్వలేదు. వారైతే తయారవ్వాలి కదా? ఎన్ని ఇళ్ళు తయారుచేస్తారు? ఎన్ని జ్ఞాన సరోవరాలను తయారుచేస్తారు? సంఖ్యను పెంచండి అని అందరూ అంటారు. ఎంతగా సంఖ్యను పెంచితే, మరో సంవత్సరంలో ఇంకా అంత సంఖ్య తయారవుతుంది, ఇంకా ఎక్కువైతే ఏం చేస్తారు? ఎంత లభిస్తే అంతలో సంతోషంగా ఉండండి. మేళాను కూడా చెయ్యాలి కదా? (తల్హటీలో బ్రాహ్మణుల విశాల సంగఠన ఏర్పడాలి) వీరైతే మేళాలోకి వచ్చేది లేదు, వీరైతే వచ్చేసారు. ఇతరుల కొరకు ఇంత పెద్ద మేళా ఇష్టమేనా? పది వేల మంది నిద్రించగలరా! ఎక్కువ గుంపు అయిపోదా? వీరు మాకైతే అవకాశమే లభించటం లేదని భావిస్తారు. ఎదురుచూసే క్షణాలు కూడా ప్రియంగా అనిపిస్తాయి. ఒక సంవత్సరం తర్వాత వెళ్ళాలి అని ఇలా ఎదురుచూస్తుంటారు కదా? మరి ఎదురుచూడటంలో పురుషార్థము ఎంత మంచిగా జరుగుతుంది! మరియు ఎప్పుడైతే ఇక్కడకు వచ్చి వెళ్తారో, అప్పుడు చూసేసారు, తర్వాత ఏమవుతుంది? అప్పుడు నిర్లక్ష్యము వస్తుందా? రాదా? ఇంకా ముందుకు వెళ్తారా? ఇది కూడా, డ్రామాలో ఏ విధి అయితే తయారై ఉందో, అది ఎంతో లాభాన్ని కలిగించేదిగా ఉంది. ఒక్క సంవత్సరంలో పక్కాగా అయితే అయిపోతారు కదా? లేదంటే అపరిపక్వంగా వచ్చేస్తారు, మళ్ళీ తరువాత యుద్ధం చెయ్యాల్సి వస్తుంది.
ప్రతి సంవత్సరం మీకు ఇక్కడ (మధుబన్‌లో) ఎన్ని అంతర్జాతీయ మేళాలు జరుగుతాయి? ఇప్పుడు కూడా ఈ మేళా ఏమిటి? అంతర్జాతీయ మేళా కదా? దేశ-విదేశాలలోని అన్ని వైపుల వారు ఉన్నారు కదా? ఐదు సంవత్సరాలలో ఒక్క అంతర్జాతీయ ప్రోగ్రాం చేసినా, మేము చాలా చేసాము అని ప్రపంచములోని వారు అనుకుంటారు. మరి మధుబన్‌లో ఎన్ని జరుగుతాయి, తెలుస్తుందా? అంతర్జాతీయ మేళా అయిపోయింది. అందరూ సంతోషంగా ఉన్నారు! ఆనందం కలుగుతుంది కదా? కానీ మీ టర్న్ వచ్చినప్పుడు రండి. ఇప్పుడు చూడండి, పది వేల మంది వచ్చినా కూడా టెంట్ అయితే లభిస్తుంది కదా? చివరికి అన్ని సాధనాలు సమాప్తమైపోతాయి. మొత్తం ఆబూ పర్వతాలను నిద్రించేందుకు వీలు కల స్థానాలుగా తయారుచేస్తే ఎంత మంది ఉండగలరు? అచ్ఛా!
ఢిల్లీ గ్రూప్:- మొదటైతే ఢిల్లీ వారు డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఢిల్లీని పరిస్తాన్గా తయారుచేయాలి కదా? రాజగద్ది అయితే ఢిల్లీలోనే ఉండాలి కదా? కాబట్టి మొదట ఢిల్లీ వారు తయారీ చేయాల్సి ఉంటుంది, అప్పుడే కదా రాజ్యం చేస్తారు? మరి ఢిల్లీ వారు ఏమి తయారీ చేస్తారు? ఢిల్లీ వారు ఎక్స్ట్రా సేవ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు ఆత్మలను యోగ్యంగా మరియు యోగిగా తయారుచేయాలి, మరొకవైపు ధరణిని కూడా తయారుచేయాలి. కాబట్టి విశేషంగా తమ వాణితో పాటు వృత్తికి (భావనకు) ఇంకా తీవ్ర గతిని ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే వృత్తి ద్వారా వాతావరణం తయారవుతుంది మరియు వాతావరణం యొక్క ప్రభావం ప్రకృతిపై పడుతుంది, అప్పుడు తయారవుతారు. కాబట్టి ఢిల్లీ వారు డబల్ సేవపై సదా అటెన్షన్ ఉంచాలి. వాణి మరియు వృత్తి రెండూ ఒకేసారి సేవలో నిమగ్నమై ఉండాలి. అందరూ పవర్ఫుల్ వృత్తి ఉన్నవారే కదా? ఢీలా పురుషార్థం చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఆలస్యం చేస్తే రాజ్యం కూడా ఆలస్యంగా స్థాపన అవుతుంది. అందుకని ఢిల్లీ వారు సదా డబల్ సేవ ద్వారా తీవ్ర గతితో తయారీ చేయాలి, రాజధానిని తయారుచేయాలి. తయారుచేస్తే సమీపంలో కూడా ఉంటారు కదా? కాబట్టి డబల్ సేవ ద్వారా ఎలాంటి పవర్ఫుల్ వాతావరణాన్ని తయారుచేయండి అంటే ప్రకృతి కూడా దాసిగా అయిపోవాలి, అలజడి చేసే బదులు దాసిగా అయి సేవ చేయాలి. కాబట్టి ఢిల్లీ నివాసులు విశ్వ పరివర్తకులు ఎలాగూ ఉన్నారు, కానీ విశ్వంలో కూడా రాజధాని పరివర్తనకు విశేష నిమిత్తులు. నషా ఉంది కదా? కాబట్టి డబల్ సేవ చేయాలి, అప్పుడే డబల్ కిరీటం లభిస్తుంది, ఊరికే లభించదు. సేవాధారీ అంటే కిరీటధారీ. అచ్ఛా.
బొంబాయి, మహారాష్ట్ర:- బొంబాయి వారు ఏమి చేస్తారు? ఢిల్లీ వారు రాజధానిని తయారుచేస్తారు, మీరు ప్రజలను మరియు రాజు-రాణులను తయారుచేస్తారా? బొంబాయి వారికి విశేషంగా బ్రహ్మా బాబా యొక్క వరదానము ఉంది. (రమేష్ భాయ్‌తో) ఏ వరదానము ఉంది? (నర్దేసావర్) నర్దేసావర్ అంటే సదా సంపూర్ణంగా, సదా నిండుగా ఉండటం. ఎప్పుడూ ఏ లోటు ఉండదు. నర్దేసావర్ అంటే సదా సంపాదించేవారు, సంపాదించడంలో తెలివైనవారు. అలాంటి నర్దేసావర్, సదా నిండుగా ఉన్నారా? లేక ఎప్పుడైనా ఖాళీ అయిపోతున్నారా? ఎంత నిండుగా అంటే ఇతరులను కూడా నిండుగా చేసేవారు. బొంబాయి వారు రాజధాని యొక్క రాజు-రాణులను మరియు ప్రజలను తయారుచేస్తారు. బొంబాయి వారిది అయితే చాలా పెద్ద పని అయిపోయింది! ఢిల్లీ వారిని కూడా రాజ్య అధికారులుగా తయారుచేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు కూడా చూడండి, లాస్ట్ జన్మలో కూడా రాజ్య అధికారులు అయితే ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి ఢిల్లీ మరియు బొంబాయి ఇద్దరూ కలిసి రాజధానిని త్వరత్వరగా తయారుచేయాలి. ఇష్టమేనా? డేట్ కూడా ఫిక్స్ చేస్తారు కదా? డేట్ మర్చిపోకండి. ఢిల్లీ మరియు బొంబాయి వారు ఎప్పుడు ‘రాజధాని తయారైపోయింది’ అని అంటారో అప్పుడే కదా పని జరుగుతుంది? రాజ్య అధికారి కాకపోతే మరియు రాజ్యం తయారైపోతే ఎలా జరుగుతుంది? బొంబాయిలో సేవ యొక్క రత్నాలు కూడా మంచిమంచివారు ఉన్నారు. మంచివారా లేక అందరికంటే మంచివారా? బాబా అంటారు అందరికంటే మంచివారు. చూడండి, ఒక్కొక్క రత్నం, పాతపాత రత్నాలను లెక్కిస్తే ఎంత మంచివారు ఉన్నారు. ఢిల్లీలో కూడా ఉన్నారు, బొంబాయిలో కూడా ఉన్నారు. ఎందుకంటే ఆది నుండి సేవకు నిమిత్తంగా అయ్యారు. అలాగని గుజరాత్ కూడా తక్కువేమీ కాదు. గుజరాత్ లాస్ట్ సో ఫాస్ట్ (చివరగా వచ్చి వేగంగా వెళ్ళడం), వీరు ఆదిలో ఉన్నవారు. గుజరాత్ వృద్ధి చాలా త్వరగా చేసింది.
నాగపూర్, పూనా:- నాగపూర్ లేదా పూనా వారు రాజధానిలో విశేషంగా ఏమి చేస్తారు? రాజధానిని అలంకరిస్తారా? మహారాష్ట్ర అలంకరించే డ్యూటీ ఎక్కువగా తీసుకుంటుంది కదా? ఎంత తయారైనా కానీ అలంకరణ లేకపోతే ఏమీ లేనట్లే. కాబట్టి మహారాష్ట్ర వారు రాజధానిని అలంకరిస్తారు. అలంకరించడానికి సాధనాలు తయారుచేసుకోవాల్సి వస్తుంది కదా? కాబట్టి మహారాష్ట్ర వారు సదా తమ సహయోగంతో సహయోగి ఆత్మలను నిమిత్తంగా తయారుచేస్తారు. ఎందుకంటే ఎంత ముందుకు వెళ్తుంటారో, సహయోగి ఆత్మలు సదా సహయోగం యొక్క చేతులను చాస్తూ పరివర్తనలో ముందుకు వెళ్తారు. బ్రాహ్మణుల జోన్లలో మహారాష్ట్ర చాలా పెద్దది కదా? కాబట్టి ఇప్పుడు కూడా సేవలో, ప్రతి కార్యంలో ఎలాగైతే సహయోగులుగా అవుతారో, అలాగే ముందు కూడా అనేక సహయోగి ఆత్మల ద్వారా రాజధానిని అలంకరించడంలో సహయోగులుగా అవుతారు. కాబట్టి మహారాష్ట్ర వారు సహయోగం ఇవ్వడంలో మరియు సహయోగులుగా తయారుచేయడంలో మంచి నిమిత్తులు మరియు ముందు కూడా ఉంటారు. ఇలాగే ఉన్నారు కదా? యోగ శిబిరంలో కూడా అన్నింటికంటే ఎక్కువగా మహారాష్ట్ర వారే వస్తారు కదా మరియు బ్రాహ్మణ పరివారంలో సంఖ్య ఎవరిది ఎక్కువగా వస్తుంది? (మహారాష్ట్రది) మంచిది, వృద్ధి ఉంది మరియు సహయోగం అనే విధి ద్వారా సఫలతను పొందుతూనే ఉండాలి. అర్థమైందా? అచ్ఛా!
భోపాల్:- భోపాల్ వారు రాజధానిలో ఏమి తయారీ చేస్తారు? భోపాల్ వారు నగారా మోగిస్తారు. అయినా నగారా మోగనంతవరకు తయారీ ఎలా జరుగుతుంది? కాబట్టి భోపాల్ వారు చాలా జోరుగా నలువైపులా నగారా మోగిస్తారు. ఏ నగారా మోగిస్తారు? ‘బాబా వచ్చేశారు, వారసత్వం తీసుకోండి’ - ఈ నగారా మోగిస్తారు. మ్యాప్ ప్రకారంగా కూడా మధ్యప్రదేశ్ కదా. అయినా ఏదైనా శబ్దాన్ని వ్యాపింపజేయాలంటే మధ్యలో నిలబడి వ్యాపింపజేస్తారు కదా? కాబట్టి బాగా నగారా మోగించండి. మోగిస్తున్నారు మరియు మోగిస్తారు కూడా. అందరికీ అదృష్టవంతులుగా అయ్యే శుభవార్తను వినిపిస్తారు. శుభవార్త వినిపించడంలో తెలివైనవారే కదా? అందరికీ శుభవార్త వినిపించడం, ఇదే అన్నింటికంటే పెద్ద శ్రేష్ఠమైన కర్తవ్యం. ఎందుకంటే నలువైపులా దుఃఖం-అశాంతి వార్తలు వింటూ ఉంటారు. మరి అలాంటి ఆత్మలు శుభవార్త విని ఎంత సంతోషిస్తారు! అందరి హృదయం నుండి వస్తుంది - ‘వాహ్! పరమాత్మ పిల్లలూ వాహ్!’ అని. కాబట్టి అలాంటి శ్రేష్ఠ కార్యాన్ని చేయాల్సిందే. జరిగిపోయి ఉంది, కేవలం నిమిత్తంగా చేయాలి. రాజధాని కూడా తయారై ఉంది, ప్రజలు కూడా తయారై ఉన్నారు, మీరు కేవలం ముద్ర (స్టాంప్) వేస్తూ వెళ్ళండి, అంతే. అచ్ఛా!
కర్ణాటక:- కర్ణాటక వారు ఏమి చేస్తారు? కర్ణాటక ధరణి ప్రత్యేకత ఏమిటి? భావన ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు, మరి భావనా ప్రధాన ఆత్మలు ఏమి చేస్తారు? ఆత్మలలో శ్రేష్ఠ భావనను ఉత్పన్నం చేయడానికి నిమిత్తంగా అవుతారు. ధరణి యొక్క ప్రత్యేకత ఎలా ఉందో, అలాగే నలువైపులా మొత్తం విశ్వాన్ని తయారుచేయడానికి అందరిలో శ్రేష్ఠ భావన, శుభ భావనను ఉత్పన్నం చేస్తారు. శ్రేష్ఠ భావన అంటే ఏమిటి? ‘మేము బాబా వారిమి, బాబా మావారు’. ఈ శ్రేష్ఠ భావన ద్వారా అందరూ భావన యొక్క ఫలాన్ని సహజంగా ప్రాప్తి చేసుకుంటారు. భావన యొక్క ఫలం చాలా త్వరగా లభిస్తుంది. కాబట్టి ఎలాంటి సహజమైన సేవ చేయండి అంటే భావనను ఉత్పన్నం చేయండి మరియు భావన యొక్క ఫలాన్ని సహజంగా పొందుతూ ఉండండి. మరి ఈ సేవ చేయడం వచ్చా, రాదా? ఇప్పటి నుండే ఫరిశ్తాలుగా అయిపోయారు, ఎందుకంటే భాష అర్థం కాదు కానీ సైగలతో అర్థం చేసుకుంటారు. మరి అర్థమైందా, కర్ణాటక వారు ఏమి చేయాలో? సహజంగా ఫలాన్ని తినిపించండి, శ్రమ పెట్టించకండి. కర్ణాటక ధరణిలో వృద్ధి చాలా సహజంగా జరుగుతుంది. కాబట్టి మీ ధరణి ఎలా ఉందో అలాగే ఇతరుల ధరణిని కూడా తయారుచేయండి మరియు ఫల ప్రాప్తిని పొందండి.
ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ఏమి చేస్తుంది? ఏదైనా కొత్త ప్లాన్ తయారుచేయండి. సైన్స్ వారు కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తూ ఉంటారు కదా, అలా తక్కువ సమయంలో ప్రాప్తి ఎక్కువగా ఉండేలా ఆంధ్రప్రదేశ్ అలాంటి ఇన్వెన్షన్ చేయాలి. తక్కువ సమయంలో ఆత్మలకు ప్రాప్తుల అనుభూతి ఎక్కువగా అయ్యేలా చేసే సాధనం ఏమిటి? దాని సాధనం - ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రతి బ్రాహ్మణ ఆత్మ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అవ్వాలి. లైట్ హౌస్ ఎంత త్వరగా వెలుగును వ్యాపింపజేస్తుంది, నలువైపులా వ్యాపింపజేస్తుంది! కాబట్టి ఆంధ్రప్రదేశ్ లైట్ హౌస్, మైట్ హౌస్‌గా అయి ఎలాంటి ప్రకాశాన్ని వ్యాపింపజేయాలి అంటే - ‘నేను ఆత్మను మరియు బాబా వచ్చేసారు’ అని అందరికీ కనిపించాలి. వెలుగులో కనిపిస్తుంది కదా ‘నేను ఎవరిని?’ అని. కాబట్టి ఇలా లైట్ మరియు మైట్ హౌస్‌గా అయి లైట్ మరియు మైట్లను వ్యాపింపజేయండి.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు బాబా యొక్క ఒక టైటిల్‌ను ప్రాక్టికల్ చేశారు. ఏది అది? ‘సర్వవ్యాపి’ అనేదానిని. డబల్ విదేశీయులు లేని ప్రోగ్రామ్ ఏదీ ఉండదు. కాబట్టి సర్వ కార్యములలో వ్యాపించి ఉన్నారు మరియు బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే డబల్ విదేశీయుల వలన ఇంటర్నేషనల్ అయిపోతుంది. బాబా టైటిల్ కూడా ‘విశ్వ కళ్యాణకారి’ కదా. ‘భారత కళ్యాణకారి’ అని లేదు కదా! కాబట్టి డబల్ విదేశీయులు వచ్చినప్పుడు బాబా యొక్క విశ్వ కళ్యాణకారి అనే టైటిల్‌ను కూడా నిరూపిస్తారు. ఒక కళ వచ్చేస్తుంది. డబల్ విదేశీయుల ప్రత్యేకత - ప్రతి కార్యంలో శోభను తీసుకొచ్చేవారు. అక్కడ గోల్డెన్ ప్రపంచంలో (సత్యయుగం)లో కూడా ఏమి చేస్తారు? నలువైపులా శోభను నింపుతారు. విదేశాలలో ఎలాగూ లైట్ల అలంకరణ శోభ చాలా ఎక్కువగా ఉంటుంది కదా! అలాగే బ్రాహ్మణ పరివారానికి ఆత్మిక శోభ ఈ డబల్ విదేశీయులే. డబల్ విదేశీయులు ఎక్కడెక్కడి నుండి వచ్చారు? (లండన్, నైరోబీ, న్యూజిలాండ్, జర్మనీ, జపాన్, మెక్సికో) మెక్సికో నాట్యం చేస్తోంది, మెక్సికో వారి ధైర్యం కూడా చాలా బాగుంది, స్థానం కూడా దూరంగా ఉంది మరియు ఎకానమీ సిస్టమ్ (ఆర్థిక వ్యవస్థ) కూడా విచిత్రంగా ఉంది. అయినా కానీ భావన మరియు స్నేహం ఇక్కడికి చేర్చేస్తుంది. అందుకని మెక్సికో వారికి అభినందనలు. అచ్ఛా, చూడండి లండన్ వారు కూడా చాలా ముందుకు తీసుకెళ్తున్నారు, సమాచారం విన్నాము - తాళంచెవి దొరికిందని! (లండన్ నగరంలో మ్యూజియం కొరకు భవనం లభించింది) దీనితో ఏమి నిరూపణ అయింది? బ్రాహ్మణుల దృఢ సంకల్పం ఏది అనుకుంటే అది చేయగలదని! తెలివైనవారిగా అయి ఎవరి బుద్ధినైనా మార్చగలరు. చట్టాలను మార్చి ప్రయోజనకరంగా మార్చుకుంటారు. విదేశాల చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయి! కానీ చట్టం కంటే ప్రయోజనమే విజయం సాధిస్తుంది. (బాబా చేసేవారు చేయించేవారిగా అయి చేయిస్తున్నారు) కానీ బ్రాహ్మణ పిల్లలు కూడా భుజాలు. భుజాలు లేకుండా ఏ పనీ జరగదు కదా!
జీతూ భాయ్ (జ్ఞాన సరోవర్ కాంట్రాక్టర్) కుటుంబసమేతంగా బాప్‌దాదా ఎదురుగా సభలో కూర్చున్నారు:- బాబా యొక్క భుజం కదా? (రైట్ హ్యాండ్). అభినందనలు! రైట్ హ్యాండ్ అయినందుకు అభినందనలు. పరమాత్మ భుజంగా అవ్వడం ఎంత పెద్ద భాగ్యం! సేవలో సహయోగిగా అవ్వడం అంటే భుజంగా అవ్వడం. అందరికీ బాబాతో మంచి ప్రేమ ఉంది. బాబాకు కూడా ప్రేమ ఉంది. బాబాపై ఎక్కువ ప్రేమ ఉందా లేక ప్రవృత్తి (కుటుంబం)పై ఎక్కువ ప్రేమ ఉందా? (రెండింటిపై) సమాధానం చెప్పడంలో తెలివైనవారు! మంచిది, మీరు ఎంతగా షేర్లు జమ చేసుకున్నారు? మీ అకౌంట్ చూసుకున్నారా? ఇన్ని షేర్లు మొత్తం కుటుంబానికి లభించాయి? ఒకవేళ ఇంట్లో కూర్చునే, ఎటువంటి శ్రమ లేకుండా షేర్లు లభిస్తే దానిని భాగ్యం అనే అంటారు కదా? మంచిది, బాబాను కలుసుకున్నారు, జరుపుకున్నారు కూడా. కుటుంబమే చాలా మంచిది.
(డాక్టర్ అశోక్ మెహతాతో):- వీరు ఏమి జరుపుకోవడానికి వచ్చారు? బర్త్‌డే జరుపుకోవడానికి వచ్చారు. జన్మించగానే శ్రేష్ఠమైన భాగ్యరేఖను తీసుకొని వచ్చారు. పాట ఉంది కదా – అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాము అని. మరి జన్మించగానే శ్రమపడాల్సి వచ్చిందా లేక సహజ ప్రాప్తములతో ముందుకు వెళ్తున్నారా? సహజ ప్రాప్తమే కదా! కాబట్టి అదృష్టాన్ని తీసుకొనే వచ్చారు. మరియు కలం అయితే చేతిలో ఉనే ఉంది. సేవా బలం, పరివారం యొక్క సహయోగం మరియు బాబా ప్రేమ - ఈ మూడూ లభించాయి. కాబట్టి ఈ మూడూ సహజం చేస్తున్నాయి మరియు చేస్తూనే ఉంటాయి. పరివారానికి సమీపంలోకి రావడానికి కూడా ఆలస్యం పట్టలేదు కదా? బాబాకు త్వరగా సమీపంలోకి వచ్చారు, అందుకే పరివారానికి కూడా చాలా తీవ్ర గతితో సమీపంలోకి వస్తున్నారు. చూడండి, అందరికీ ఎంత ప్రియమైనవారో! ఎవరికైతే బాబాపై మరియు సేవపై ప్రేమ ఉంటుందో, వారికి బాబా ప్రేమ మరియు పరివారం ప్రేమ స్వతహాగానే లభిస్తాయి. అంతే కదా? అందరూ పరిచయం ఉన్నవారిలాగే అనిపిస్తున్నారు కదా. ఎక్కడికి వెళ్లినా మిమ్మల్ని త్వరగా గుర్తుపడతారు కదా? మంచిది, అందరూ దిల్ఖుష్ మిఠాయి తిన్నారా?
టీచర్లతో:- చూడండి, టీచర్స్ లేకపోతే మీరు ఎలా వచ్చేవారు? టీచర్ల ప్రాముఖ్యత ఉంది కదా! ఏది ఏమైనా నిమిత్త టీచర్లు అయితే ఉన్నారు కదా. మీ అందరికీ పాఠం పక్కా చేయించడానికి నిమిత్తులు కదా? ఉల్లాస-ఉత్సాహాలను పెంచడానికి నిమిత్తులు టీచర్లు. టీచర్ల విశేష కార్యమే ఉల్లాస-ఉత్సాహాల రెక్కలను తొడిగి, స్వయంగా ఎగురుతూ ఇతరులను కూడా ఎగిరించడం. యోగ్యులైన టీచర్ల ప్రత్యేకత ఏమిటంటే - వచ్చే ప్రతి స్టూడెంట్ సదా సహజ పురుషార్థం ద్వారా ముందుకు ముందుకు ఎగురుతూనే ఉంటారు. అయినా బ్రాహ్మణ పరివారంలో టీచర్ల భాగ్యం ఎక్స్ట్రా కూడా ఉంది. ఎందుకంటే నిమిత్తంగా అవ్వడం అనేది ఒక ఎక్స్ట్రా లిఫ్ట్. సేవాధికారిగా అవ్వడం - ఈ ఎక్స్ట్రా అధికారం లోపల చాలా సహాయం చేస్తుంది. కాబట్టి బాప్‌దాదా టీచర్లను సదా నిమిత్తంగా మరియు సమాన సేవాధారీలుగా భావిస్తారు. బాబా కార్యం ఏదైతే ఉందో, అదే నిమిత్త టీచర్ల కార్యం. కాబట్టి బాప్‌దాదా సదా టీచర్లను సమాన స్వరూపంలో చూస్తారు. బాబా సదా అంత స్నేహాన్ని, అంత గౌరవాన్ని ఇస్తారు మరియు ‘వీరు సమాన సేవాధారీలు’ అనే దృష్టితోనే చూస్తారు. టీచర్లు లేకుండా పని జరగదు కదా! మీ ఫారమ్‌పై టీచర్లే ముద్ర (స్టాంప్) వేయాల్సి ఉంటుంది కదా? ఒకవేళ టీచర్లు మీ ఫారమ్‌పై ముద్ర వేయకపోతే ఎలా వస్తారు? అచ్ఛా!
నలువైపులా ఉన్న హైయ్యెస్ట్ (అతి ఉన్నతమైన) మరియు రిచ్చెస్ట్ (అతి ధనవంతులైన) శ్రేష్ఠ ఆత్మలకు, ప్రతి ఖజానాకు యజమానులైన సంపన్న ఆత్మలకు, సదా స్వయాన్ని ఎవరెడీగా చేసుకునే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా సమయము, సంకల్పాలు, మాటల ద్వారా శ్రేష్ఠ సంపాదన యొక్క ఖాతాను జమ చేసుకునే అతి సమీప ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- అంతా సహజంగా నడుస్తుంది కదా? మేళా జరుగుతుందా లేక ఆట జరుగుతుందా? సంతుష్టత యొక్క ఆట నడుస్తుంది. సంతుష్టపరిచేవారు సంతుష్టం చేస్తారు మరియు సంతుష్టపడేవారు సంతుష్టపడతారు. ఈ సంతుష్టతా ఆట అందరికీ ప్రియంగా అనిపిస్తుంది. అన్నీ మంచిగా ఉన్నాయా? (తల్హటీలో రెండు టర్న్స్ గురించి ఆలోచించాము) మొదట లిస్టును చూడండి, తరువాత రెండు సార్లు రావాల్సి వచ్చినా ఫర్వాలేదు. తండ్రి పిల్లల అన్ని ఆశలను పూర్తి చేస్తారు. రావడానికి బాబాకు ఎటువంటి కష్టమూ లేదు కదా. మధుబన్లోకి వచ్చినా, పాండవ భవన్‌లోకి వచ్చినా, తల్హటీలో వచ్చినా, రావడానికి వారికి ఎటువంటి కష్టమూ లేదు. కష్టమైతే పిల్లలకే ఉంది, కానీ అది కష్టంగా అనిపించదు. మాకైతే ఏ కష్టమూ లేదు, మనోరంజనంగా అనిపిస్తుంది అని పిల్లలు ధైర్యాన్ని పెడతారు. తండ్రి అయితే తనువులోకే రావాల్సి వస్తుంది కదా, అంతే. సంగమంలో చేసేదే ఏముంది? మేళా మరియు ఆట. సేవ అనేది ఆట. మేళాను జరపండి, సేవ యొక్క ఆటను ఆడండి, ఇంకేమి చేయాలి? తినండి-త్రాగండి, బ్రహ్మా భోజనాన్ని తినండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
