‘‘స్నేహానికి రిటర్న్ - స్వయాన్ని టర్న్ (పరివర్తన) చేసుకోవడము’’
ఈరోజు స్నేహము మరియు శక్తి మూర్తి అయిన బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ స్నేహీ పిల్లలను చూస్తున్నారు. సాకారంలో ఎంత పెద్ద సభ ఉందో దానికంటే పెద్ద సభ ఆకారీ రూపంలో ఉంది. సాకార రూపధారి మరియు ఆకార రూపధారి పిల్లలందరూ బాప్‌దాదా యొక్క స్నేహ బాహువులలో ఇమిడి ఉన్నారు. స్నేహ బాహువులు ఎంత పెద్దవి! ఏ విధంగా నది సాగరంలో ఇమిడిపోతుందో, అలా నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహ బాహువులలో ఇమిడిపోయారు. స్నేహ బాహువులు అనంతమైనవి మరియు స్నేహ సాగరుడు అనంతమైనవారు. పిల్లలందరూ నంబరువారుగా ఉన్నా కానీ స్నేహంలో అందరూ బంధింపబడి ఉన్నారు. పిల్లలందరిలోనూ బాప్‌దాదా స్నేహం ఇమిడి ఉంది. స్నేహం యొక్క శక్తి ద్వారానే అందరూ ముందుకు ఎగురుతూ వెళ్తున్నారు. స్నేహముతో ఎగరటం అనేది పిల్లలందరినీ తనువు ద్వారా మరియు మనస్సు ద్వారా, హృదయం ద్వారా తండ్రికి సమీపంగా తీసుకొస్తుంది. స్నేహం యొక్క విమానం సెకండు యొక్క వేగంతో తండ్రికి సమీపంగా తీసుకువస్తుంది. జ్ఞానము, యోగము, ధారణ - వీటిలో యథాశక్తిగా నంబరువారుగా ఉన్నారు కానీ స్నేహంలో అందరూ స్వయాన్ని నంబర్‌వన్‌గా అనుభవం చేసుకుంటారు. స్నేహము పిల్లలందరికీ బ్రాహ్మణ జీవితాన్ని ప్రసాదించేందుకు ముఖ్య ఆధారము. ఒకవేళ పిల్లలందరినీ ఇలా అడిగితే - మీరు నిరంతర యోగులేనా? నిరంతర జ్ఞాన స్వరూపులేనా? జ్ఞాని అని కాదు కానీ జ్ఞాన స్వరూపులేనా? ఇలా అడిగితే ఆలోచిస్తారు, ఉన్నాము, కానీ... అని అంటారు. నిరంతర ధారణా స్వరూపులేనా అని అడిగితే ఏమంటారు? లక్ష్యం అయితే ఉంది అని అంటారు. కానీ నిరంతర స్నేహీలేనా అని అడిగితే అవును అని అంటారు. స్నేహంలో అందరూ పాస్ అయ్యారు. కొందరు పాస్ విత్ ఆనర్ మరియు కొందరు పాస్. పాస్ అయ్యారు కదా! డబల్ విదేశీయులు, భారతవాసులు అందరూ పాస్ అయ్యారా? పాస్ అవ్వకపోతే సమీపంగా రారు. సమీపంగా వచ్చారంటేనే పాస్ అయ్యారని నిరూపించబడుతుంది. స్నేహానికి కల అర్థమే సమీపంగా ఉండటము మరియు పాస్ అవ్వటము మరియు ప్రతి పరిస్థితిని చాలా సహజంగా దాటడము. మరి అందరూ మూడింటిలోనూ పాస్ అయ్యారు కదా? దాటడం కూడా సహజమే కదా? లేక దాటడమనేది అప్పుడప్పుడు కష్టంగా, అప్పుడప్పుడు సహజంగా అనిపిస్తుందా? సమీపంగా ఉండటంలోనైతే ఆనందమే ఆనందము, మరి దాటడంలో నంబరువారుగా ఉన్నారా లేక అందరూ నంబర్‌వన్‌గా ఉన్నారా? చూడండి, నంబర్‌వన్‌గా ఉన్నాము అని అనటం లేదు, అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు అంటే ఏదో ఉంది అని అర్థము. కానీ సమయమనుసారంగా స్నేహమనే శక్తితో దాటడమనేది కూడా - సమీపంగా ఉండటం ఎంత సహజమో అంత సహజం అవుతుంది మరియు అలా అవ్వాల్సిందే. ఎప్పుడైతే దాటడం సదా సహజం అవుతుందో అప్పుడు పాస్ అవ్వడం ఏమిటి, పాస్ అయ్యే ఉన్నారు అని అర్థం. పాస్ అయ్యే ఉన్నాము అన్న విషయంలో పక్కా నిశ్చయం ఉంది. కేవలం రిపీట్ చేయాలి. ఇంతటి స్థిరమైన నిశ్చయం ఉంది కదా? దూరంగా ఉన్నా కానీ అందరూ సమీపంగానే ఉన్నారు కదా! హృదయ సింహాసనంపై ఉన్నారు. కొందరు కంటి వెలుగు వంటివారు, కొందరు హృదయ సింహాసనాధికారులు. అన్నింటికంటే సమీపమైనవి - నయనాలు మరియు హృదయము. మీరందరూ ఓంశాంతి భవనంలో కూర్చోలేదు, బాప్‌దాదా యొక్క హృదయ సింహాసనంపై కూర్చున్నారు లేదా కంటి వెలుగుగా అయి నయనాలలో ఇమిడి ఉన్నారు. ఇమిడి ఉన్నవారు ఎప్పుడూ దూరం అవ్వరు.
ఈ సంవత్సరం ఏం చేస్తారు? ఈ సంవత్సరం మిలనాలలో ఇది అంతిమ టర్న్ అని అనటమైతే అంటారు. కానీ అంతము, ఆది యొక్క స్మృతిని ఎక్కువగా ఇప్పిస్తుంది. ఆది అనేది మధ్యమాన్ని స్మృతి తెప్పిస్తుంది కానీ అంతము అనేది ఆదిని స్మృతి తెప్పిస్తుంది. కనుక ఇది అంతము కాదు, ఆది. తీవ్ర వేగంతో ఎగరడానికి ఆది. అనాది స్వరూపం యొక్క వేగం ఉంటుంది కదా, అనాది స్వరూపం అంటే ఆత్మ స్వరూపం, మరి అనాది స్వరూపం యొక్క వేగం ఏమిటి? ఎంత తీవ్ర వేగము! ఈనాటి రకరకాల సైన్స్ సాధనాల యొక్క తీవ్ర వేగం కంటే కూడా తీవ్ర వేగం కలది. సైన్స్ సాధనాల యొక్క వేగము ఎంతైనా సైన్స్‌పై ఆధారపడి ఉంటుంది, సైన్స్ ద్వారా వేగాన్ని తగ్గించవచ్చు కూడా మరియు ఆ వేగాన్ని పట్టుకోవచ్చు కూడా కానీ ఆత్మ యొక్క వేగాన్ని ఇప్పటివరకూ ఎవ్వరూ పట్టుకోలేకపోయారు మరియు పట్టుకోలేరు కూడా. దీనిలోనే సైన్స్ తనను తాను ఫెయిల్ అయినట్లు భావిస్తుంది. ఎక్కడైతే సైన్స్ ఫెయిల్ అయ్యిందో అక్కడ సైలెన్స్ శక్తి ద్వారా ఏది కావాలంటే అది చేయవచ్చు. కనుక ఆత్మ శక్తితో ఎగరటములో తీవ్ర వేగాన్ని ఆరంభించండి. స్వపరివర్తనలోనైనా లేక ఎవరి వృత్తినైనా పరివర్తన చేయటంలోనైనా, వాయుమండలాన్ని పరివర్తన చేయటంలోనైనా, సంబంధ-సంపర్కాల పరివర్తనలోనైనా, ఇప్పుడు తీవ్ర వేగాన్ని తీసుకురండి. తీవ్రతకు గుర్తు ఏమిటంటే - ఆలోచించగానే అయిపోవటము. ఆలోచించడమైతే ఆలోచించాము, అయిపోతుందిలే... అని ఇలా కాదు. ఆలోచించిన వెంటనే జరిగిపోవాలి, సంకల్పం, మాట మరియు కర్మ మూడూ కలిసి-కలిసి శ్రేష్ఠంగా ఉండాలి. వ్యర్థాన్ని లేక వ్యతిరేక సంకల్పాలను చెక్ చేయండి, వాటి వేగం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే సంకల్పం వస్తుంది, ఇప్పుడిప్పుడే మాట్లాడేస్తారు, ఇప్పుడిప్పుడే చేసేస్తారు కూడా. సంకల్పం, మాట, కర్మ మూడు కలిసి-కలిసి చాలా వేగంగా జరిగిపోతాయి. వాటి వేగం ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఇక శ్రేష్ఠ సంకల్పాలు, కర్మలు, మర్యాదలు మరియు బ్రాహ్మణ జీవితపు మహానత యొక్క తెలివి సమాప్తం అయిపోతుంది. వ్యర్థం యొక్క బలము అనేది - సత్యత యొక్క తెలివిని, యథార్థత యొక్క తెలివిని సమాప్తం చేస్తుంది మరియు కొద్ది సమయం తర్వాత ఎప్పుడైతే స్పృహ వస్తుందో, అప్పుడు ఈ విధంగా ఆలోచిస్తారు - అలా చేయకుండా ఉండాల్సింది, అది యథార్థము కాదు అని. కానీ ఆ సమయంలో ఆ వేగంలో ఉన్నప్పుడు యథార్థతను గ్రహించకుండా అయథార్థాన్ని యథార్థంగా అనుభవం చేస్తారు. కనుక వ్యర్థం యొక్క బలము అనేది, తెలివిని సమాప్తం చేసేస్తుంది. కావున ఈ సంవత్సరం పిల్లలందరూ విశేషంగా వ్యర్థం నుండి ఇనోసెంట్ (అమాయకులు) గా అవ్వండి. ఏ విధంగా ఆత్మలైన మీరు సత్యయుగ రాజ్యంలో ఉన్నప్పుడు వ్యర్థం మరియు మాయ నుండి అమాయకులుగా ఉండేవారు, అందుకే దేవతలను మహానాత్మలు అని, సెయింట్ అని అంటారు, మీ ఆ సంస్కారాలను బయటకు తీయండి, వ్యర్థములో అవిద్యా స్వరూపులుగా అవ్వండి. సమయం, శ్వాస, మాట, కర్మ అన్నింటిలోనూ వ్యర్థం నుండి అవిద్యగా అనగా అమాయకులు అవ్వండి. ఎప్పుడైతే వ్యర్థం నుండి అవిద్యగా అవుతారో అప్పుడు దివ్యత స్వతహాగానే, సహజంగానే అనుభవం అవుతుంది మరియు అనుభవం చేయించగలరు. పురుషార్థం అయితే చేస్తూనే ఉన్నాము... అని ఇప్పటివరకు ఇదే ఆలోచించకండి. పురుష్ (ఆత్మ) ఈ రథంపై సవారీ చేస్తుంది కావున పురుష్ (ఆత్మ) గా అయ్యి రథం ద్వారా చేయించాలి - దీనినే పురుషార్థం అని అంటారు. పురుషార్థం నడుస్తూ ఉంది, అలా కాదు, పురుషార్థీ సదా ఎగురుతూ ఉన్నారు అన్నట్లు ఉండాలి. అటువంటివారినే యథార్థ పురుషార్థీ అని అంటారు. పురుషార్థం అంటే ఒకసారి చేసిన పొరపాటును మళ్ళీ-మళ్ళీ చేస్తూ ఆ పురుషార్థం అనే పదాన్ని ఆసరాగా చేసుకోవడం కాదు. యథార్థ పురుషార్థీగా ఉండాలి, స్వభావం కూడా స్వాభావికంగా, అతి సహజంగా ఉండాలి. ఇప్పుడిక శ్రమను పక్కన పెట్టేయండి. అల్పకాలిక ఆధారాల సహాయము, దేనినైతే పక్కన పెట్టుకుని ఉంచుకున్నారో, ఈ అల్పకాలిక ఆధారాల తీరాన్ని ఇప్పుడు విడిచిపెట్టండి. ఎప్పటివరకైతే ఈ తీరాలు ఉంటాయో అప్పటివరకు తండ్రి యొక్క ఆధారము అనుభవం అవ్వదు మరియు తండ్రి యొక్క ఆధారము లేదు కావుననే హద్దు యొక్క తీరాలను ఆధారంగా చేసుకుంటారు. మీ స్వభావ-సంస్కారాల యొక్క లేదా పరిస్థితుల యొక్క తీరాలు ఏవైతే తయారుచేసుకున్నారో అవన్నీ అల్పకాలికమైనవి, చూపించుకోవడానికి ఉన్నవి మరియు మోసం చేసేవి. ఆ మోసములో ఉండిపోకండి. తండ్రి యొక్క ఆధారము ఛత్రఛాయ. అల్పకాలిక విషయాలు మోసం చేసేటువంటివి. మాయ యొక్క మధురాతి-మధురమైన విషయాలను చాలా వింటూ ఉంటారు, చాలా విన్నారు కూడా. ద్వాపరములో శాస్త్రాలు తయారుచేసేవారు విషయాలను తయారుచేయడంలో చాలా తెలివైనవారు, ఎంత మధురాతి-మధురమైన విషయాలను తయారుచేసారు. అలా విషయాలను తయారుచేయకండి, విషయాలను తయారుచేయడంలో అందరూ ఒకరికంటే ఒకరు తెలివైనవారు. విషయాలను తయారుచేయకండి, విషయాలను చూడకండి, విషయాలను మాట్లాడకండి. మరి ఏం చేయాలి? తండ్రిని చూడండి, తండ్రి సమానంగా చేయండి, తండ్రి సమానంగా అవ్వండి. ఏదైనా విషయం ఎదురుగా వచ్చినప్పుడు, క్షణంలో విషయాన్ని తయారుచేసేస్తారు ఎందుకంటే మాయ యొక్క వేగం కూడా తీవ్రంగా ఉంది కదా. ఎంత సుందరమైన విషయాలను తయారుచేస్తారంటే అవి విన్నప్పుడు బాబాకు అయితే నవ్వు వస్తుంది. కానీ ఇతరులు వాటికి ప్రభావితం అయిపోతారు. కరెక్టుగా చెప్తున్నారు, చాలా బాగుంది, విషయమైతే కరక్టే అని అంటారు మరియు స్వయానికి కూడా అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ సమయం యొక్క తీవ్ర వేగాన్ని చూసి ఇప్పుడు ఈ తీరాల నుండి తీవ్ర వేగంతో ఎగిరిపోండి. ఈ అనేక రకాల విషయాలు రిజిస్టర్లో వ్యర్థపు రోల్ (కట్ట)ను తయారుచేస్తూ ఉంటాయి. ఒక రోల్‌పై ఇంకొక రోల్ (కట్ట పై కట్ట) తయారవుతూ ఉంటుంది, అందుకే దీని నుండి అమాయకులుగా అవ్వండి. ఈ అమాయకపు స్థితితో రెడీమేడ్ స్టేజ్ మీ ఎదురుగా వస్తుంది. ఈ సంవత్సరంలోని యథార్థ పురుషార్థం యొక్క ప్రత్యక్ష ఫలానికి గుర్తుగా రెడీమేడ్ సేవ మీ ఎదురుగా వస్తుంది. వ్యర్థాన్ని ఎదుర్కోవడము సమాప్తం చేయండి, అప్పుడు సేవా అవకాశం మీ ఎదురుగా వస్తుంది. మీరందరూ అనేక సంవత్సరాలుగా సేవకు నిమిత్తులుగా అయ్యారు, ఇప్పుడు ఇతరులను నిమిత్తంగా చేసే సేవకు నిమిత్తులు అవ్వండి. వారు మైక్‌గా అవ్వాలి మరియు మీరు మైట్‌గా ఉండాలి. చాలా సమయం నుండి మీరు మైక్‌గా అయ్యారు, ఇప్పుడు ఇతరులను మైక్‌గా చేయండి, మీరు మైట్‌గా అవ్వండి. మీ మైట్ ద్వారా మైక్‌లు నిమిత్తమవ్వాలి. దీనినే తీవ్ర వేగంతో ఎగురుతూ ఉన్నదానికి గుర్తు అని అంటాము. ఏం చేయాలో అర్థమైందా? తీవ్ర వేగంతో ఎగురుతున్నారు కదా. లేక అప్పుడప్పుడు తీవ్ర వేగంతో, అప్పుడప్పుడు నెమ్మదిగానా? సదా తీవ్ర వేగంతో ఎగురుతూ ఉండాలి. మేఘాలను చూసి భయపడకండి. ఈ విషయాలే మేఘాలు వంటివి. వీటిని సెకండులో దాటి వేయండి. విధిని తెలుసుకోండి మరియు క్షణంలో విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకోండి. ఒక వైపు మంత్ర-తంత్రాల శక్తి ఉంది మరియు మీది విధి సంపన్న సిద్ధి యొక్క శక్తి. మంత్ర-తంత్రాలు అల్పకాలికమైనవి మరియు విధి ద్వారా సిద్ధి అనేది సదాకాలికమైనది.
బాప్‌దాదా ఇప్పుడు ఏ విధమైన గ్రూపును కోరుకుంటున్నారంటే, వారు సదా మనస్సులో, మాటలో, సంపర్కంలో ముందుగా సేవా బాధ్యతను స్వీకరించే అర్జునులుగా ఉండాలి. నేను అర్జునుడిని. నేను ఏది చేస్తానో, నన్ను చూసి ఇతరులు చేస్తారు (‘నేను’ అంటే దేహాభిమానంతో కూడిన నేను కాదు, నేను అంటే నేను శ్రేష్ఠ ఆత్మను). ఇలా ఎవరు ముందుగా చేస్తే వారే అర్జునుడు. మొదటి నంబరు అంటే అర్జునుడు, అలౌకిక జనుడు అన్న గాయనము ఉంది. ఇటువంటి గ్రూపును బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు. విషయాలను చూడకండి, ఇతరులను చూడకండి, ఇతరుల వ్యర్థాన్ని వినకండి. కేవలం అలౌకిక జనులుగా ఉండాలి. సంకల్పాలు, మాటలు మరియు కర్మలు అన్నింటిలో అలౌకికత మరియు దివ్యత యొక్క మెరుపు ఉండాలి. అటువంటివారినే అర్జునుడు, అలౌకిక జనుడు అని అంటాము. ఇటువంటి గ్రూప్ ఈ సంవత్సరంలో తయారవుతుందా లేక రాబోయే సంవత్సరంలో తయారవుతుందా? ఎవరైతే ఈ గ్రూపులోకి రావాలనుకుంటున్నారో వారు చేతులెత్తండి. నేను తయారవ్వాలి, నేను అర్జునుడిని. ఏం చేయాలి... అలా అయిపోతుంది... పరిస్థితులు అలాంటివి... సహాయం లభించడం లేదు... ఆశీర్వాదాలు లభించడం లేదు... తోడు లభించడం లేదు... అనే సమాచారం రాకూడదు. ఎవరికైతే ఇంకా కొంచెం సమయం కావాలో వారు చేతులెత్తండి. ఒకటి, రెండు నెలలు కావాలా లేక ఒక సంవత్సరం కావాలా! ఏ గ్రూప్ వచ్చినా వారిని అడగండి, తర్వాత రిజల్టు వినిపించండి. ముందు టీచర్స్, ఎందుకంటే ఎవరైతే నిమిత్తం అవుతారో వారి సూక్ష్మ వాయుమండలం, వైబ్రేషన్స్ తప్పకుండా వెళ్తాయి. పదమా రెట్లు పుణ్యం కూడా లభిస్తుంది మరియు పదమా రెట్లు నిమిత్తంగా కూడా అవుతారు. వేరే మాట మాట్లాడరు కదా. టీచర్‌గా అవ్వటం చాలా మంచిది, గద్దీ అయితే లభిస్తుంది కదా! దాదీ, దీదీ అనే టైటిల్ లభిస్తుంది కదా. కానీ బాధ్యత కూడా మరి అంతగానే ఉంటుంది. ఈ సంవత్సరంలో ఏదో ఒక నవీనతను చూపించండి. చేతులైతే చాలా సార్లు ఎత్తాము, ప్రతిజ్ఞలు కూడా చాలా సంవత్సరాల నుండి చేస్తున్నాము అని అనుకోకండి, ఇటువంటి సంకల్పాలు సూక్ష్మంగా కూడా రాకూడదు, ఇతరులు గురించి కూడా రాకూడదు. ఈ సంకల్పాలు కూడా ఢీలా చేస్తాయి. ఇది ఇలా నడుస్తూనే ఉంటుంది, ఇది ఇలా అవుతూనే ఉంటుంది... అన్న ఇటువంటి వైబ్రేషన్స్ కూడా బలహీనంగా చేస్తాయి. దృఢ సంకల్పం చేయండి, ఆ దృఢత సఫలతను తప్పకుండా తీసుకువస్తుంది. బలహీన సంకల్పాలను ఉత్పన్నం చేయకండి. వాటి పాలనలో చాలా సమయం వ్యర్థంగా పోతుంది. ఇవి చాలా త్వరగా ఉత్పన్నం అవుతాయి. ఒక్క సెకండులో వంద పుడతాయి. అప్పుడిక వాటిని పాలన చేయటానికి ఎంత సమయం పడుతుంది! వాటిని తొలగించుకోవడానికి శ్రమ కూడా చేయాల్సి వస్తుంది, సమయం కూడా పడుతుంది మరియు బాప్‌దాదా యొక్క వరదానాలు లేదా ఆశీర్వాదాల నుండి కూడా వంచితులుగా అవుతారు. సర్వుల శుభ భావనల ఆశీర్వాదాల నుండి కూడా వంచితులుగా అవుతారు. శుద్ధ సంకల్పాలతో అందరినీ ఎలా బంధించాలి లేదా చుట్టుముట్టాలి అంటే, ఎవరైనా కొద్దిగా బలహీనంగా ఉన్నా కానీ, వారి కొరకు కూడా ఈ శుద్ధ సంకల్పాలతో చుట్టుముట్టడం అనేది ఒక ఛత్రఛాయ వలె అవ్వాలి, రక్షణా సాధనంగా అవ్వాలి, కోటగా అవ్వాలి. శుద్ధ సంకల్పాల శక్తిని ప్రస్తుతం తక్కువగా గుర్తించారు. ఒక్క శుద్ధమైన లేక శ్రేష్ఠమైన శక్తిశాలి సంకల్పం ఏం అద్భుతం చేయగలదో - ఆ అనుభూతిని ఈ సంవత్సరంలో చేసి చూడండి. అభ్యాసంలో మొదట యుద్ధం జరుగుతుంది, వ్యర్థ సంకల్పము శుద్ధ సంకల్పాన్ని కట్ చేస్తుంది. ఏ విధంగా కౌరవులు మరియు పాండవుల బాణాలను చూపిస్తారు కదా, అక్కడ ఒక బాణం మరో బాణాన్ని దారిలోనే అంతం చేసేస్తుంది, అలాగే సంకల్పం, సంకల్పాన్ని సమాప్తం చేయడానికి ప్రయత్నిస్తుంది మరియు సమాప్తం చేస్తుంది కానీ దృఢ సంకల్పం ఉన్నవారికి బాబా తోడుగా ఉన్నారు. వారికి విజయ తిలకం సదా ఉండనే ఉంటుంది. ఇప్పుడు దీనిని ఇమర్జ్ చేయండి, అప్పుడు వ్యర్థం స్వతహాగా మర్జ్ అయిపోతుంది. వ్యర్థానికి సమయం ఇస్తున్నారు, దానిని కట్ చేయటం లేదు కానీ దాని రంగులో రంగరింపబడుతున్నారు. సెకండు కంటే కూడా తక్కువ సమయంలో వ్యర్థాన్ని కట్ చేయండి. దానిని శుద్ధ సంకల్పాలతో సమాప్తం చేయండి. సర్వుల శుభ సంకల్పాల వాయుమండలం యొక్క చుట్టుముట్టడం అనేది అద్భుతం చేసి చూపిస్తుంది. ఇది అవ్వదు, చేయటం అయితే చాలా చేస్తాము, వినటం అయితే చాలా వింటాము, చాలా మంచిగా కూడా అనిపిస్తుంది కానీ అవ్వదు అని ముందు నుండే ఇలా ఆలోచించకండి. ఈ వ్యర్థ వాయుమండలం కూడా బలహీనంగా చేస్తుంది. అవ్వాల్సిందే అనే దృఢత పెట్టుకోండి, ఎగరండి. మీరు చేయలేనిది ఏముంది! కానీ మొదట స్వయంపై అటెన్షన్ పెట్టండి. స్వయంపై అటెన్షన్ అనేది టెన్షన్‌ను సమాప్తం చేస్తుంది. ఏం చేయాలో అర్థమైందా? ఇది ఇలా అవుతూనే ఉంటుంది, ఇంతకుముందు కూడా ప్రతిజ్ఞ చేసాము అని ఎవరైనా అంటే మీరు అది వినకండి. ఈ విషయంలో బలహీనులకు సహకరించకండి, వారికి మీ తోడును అందించండి. ఒకవేళ ఎవరైనా అలా-ఇలా మాట్లాడితే - శుభం మాట్లాడండి, శుభం ఆలోచించండి, శుభం చేయండి అని ఒకరికొకరు చెప్పుకుంటారు కదా. అచ్ఛా. అందరూ సంతోషంగా, సంతుష్టంగా ఉన్నారు కదా! అందరితో మాట్లాడాము కదా! ఇది కూడా తండ్రి యొక్క స్నేహం. స్నేహానికి గుర్తు ఏమిటంటే - వారు స్నేహితుడిలో లోపాన్ని చూడలేరు. స్నేహితుడి పొరపాటును తమ పొరపాటుగా భావిస్తారు. తండ్రి కూడా ఎప్పుడైనా పిల్లల గురించి ఏ విషయమైనా వింటే అది నా విషయం అని భావిస్తారు. కనుక స్నేహితులుగా ఉన్నవారిని సంపన్నంగా, సంపూర్ణంగా, సమానంగా చూడాలనుకుంటారు. అందరూ స్నేహంలో బాప్‌దాదా ముందు ఒక మాటను తప్పకుండా అంటారు, అది మనస్సుతో కావచ్చు, పాటతో కావచ్చు, మాటతో కావచ్చు, సంకల్పంతో కావచ్చు, బాప్‌దాదా అయితే అందరిదీ వింటారు కదా. అందరూ ఒక మాటను పదే-పదే అంటారు – బాబా, స్నేహానికి రిటర్న్ ఏమి ఇవ్వాలి? ఎందుకంటే ఎటువంటివారి నుండి ఎటువంటివారిగా అయ్యారు. కోట్లలో కొద్దిమందిగా అయితే అయ్యారు కదా, కానీ కొద్దిమందిలో కొద్దిమందిగా అవ్వలేదు. కోట్లలో కొద్దిమందిగా అయితే అయ్యారు, దీనిలో అందరూ పాస్ అయ్యారు. తండ్రి రిటర్న్‌లో ఏం కోరుకుంటున్నారు? మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోవటమే (పరివర్తన చేసుకోవటమే) రిటర్న్ ఇవ్వటము. అర్థమైందా! ఇంతే, ఇదే రిటర్న్ ఇవ్వటము. ఇదైతే చేయగలరు కదా! స్నేహం కోసం ఇది కూడా చేయలేరా! ఏదో అవసరం కోసం చేసే స్నేహం అయితే కాదు కదా! స్నేహం కోసం త్యాగం చేయడానికి సిద్ధమేనా? తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చినా సిద్ధమేనా? స్నేహం అందరికీ వంద శాతం ఉందా లేక వేరే శాతం ఉందా? మిమ్మల్ని మీరు టర్న్ చేసుకోవటానికి (పరివర్తన చేసుకోవటానికి) సిద్ధమేనా? స్నేహంలో ఇది త్యాగమా లేక భాగ్యమా? భక్తులైతే తల తీసి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కానీ మీరు రావణుడి తల తీసి ఇవ్వడానికి సిద్ధమేనా? శరీరం యొక్క తలను తీయకండి, రావణుడి తలను తీసేయండి. ఐదు తలలనూ తీసేస్తారా లేక ఒకటి-రెండు ఉంచుకుంటారా? ఏదైనా బలహీనత అనే తలను ఉంచుకుంటారా? పోనీ ఈ ఐదు కాకపోయినా, మూర్ఖత్వం అనే ఆరవ తలను చూపిస్తారు కదా, దానిని ఉంచుకుంటారా? అచ్ఛా. ఇప్పుడు ఒక్కొక్క జోన్ చేతులెత్తండి.
ఢిల్లీ - ఢిల్లీ వారు ఏ అద్భుతం చేస్తారు, రిటర్న్ యొక్క టర్న్ చేస్తారా? త్యాగం యొక్క భాగ్యం తీసుకోవడంలో ఎంత నంబర్ వస్తుంది? ఫస్ట్! అందరూ ఫస్ట్ నంబర్ తీసుకుంటారు, పరివర్తన అవ్వడంలో ఫాస్ట్‌గా వెళ్తారా? ఢిల్లీ కోట బలంగా ఉంది కదా.
మహారాష్ట్ర జోన్ - మహారాష్ట్ర వారు ఏ నంబర్ తీసుకుంటారు? ఫస్ట్! మరి ఫస్ట్ కంటే ముందుగా ఏముంది? ఎ వన్ ఎవరు అవుతారు? మహారాష్ట్ర ఎ వన్ అవుతుందా లేదా వన్ అవుతుందా? ఎ వన్ ముందుకు వెళ్లాలి. అలాగే ఢిల్లీ వారు కూడా ఎ వన్ అని చెప్పవచ్చు కానీ ఎ వన్ ఉన్నారా లేదా వన్ ఉన్నారా? వన్ అంటే విన్, ఎ వన్ అంటే డబల్ విన్. మహారాష్ట్ర వారు వన్ కంటే కూడా ముందుకు వెళ్లి ఎ వన్ అవ్వాలి.
కర్ణాటక - ఇప్పుడు కర్ణాటక ఏమి చేస్తుంది? సదా ఎ వన్ యొక్క నాటకం చూపించండి, ఇతర నాటకాలు చూపించకండి. కర్ణాటకలో నాటకాలు చాలా జరుగుతాయి. ఇప్పుడు ఎ వన్ యొక్క నాటకం చూపించాలి.
ఈస్టర్న్ - ఈస్టర్న్ జోన్ ఏ అద్భుతం చేస్తుంది? అన్ని వైపులా ఎ వన్ యొక్క సూర్యోదయం చేస్తుంది.
తమిళనాడు, కేరళ - తమిళనాడులో ప్రత్యేకంగా డాన్స్‌కు ప్రాముఖ్యత ఉంది. అయితే అన్ని వైపులా ఎ వన్ యొక్క సంతోషపు నాట్యం చూపిస్తారు. అందరూ ఎ వన్.
ఇందోర్ జోన్ - ఇందోర్ వారు ఏమి చేస్తారు? ఇన్-డోర్ అంటే అంతర్ముఖత. అయితే ఇందోర్ వారు అన్ని వైపులా అంతర్ముఖత యొక్క శక్తి వైబ్రేషన్స్‌తో అన్ని వైపులా ఎ వన్ యొక్క వైబ్రేషన్స్ వ్యాపింపజేస్తారు. సమ్మతమేనా?
యు.పి. - యు.పి. వారు ఏ అద్భుతం చేస్తారు? యు.పి. ప్రత్యేకత నదుల గొప్పతనం. అన్ని ప్రత్యేక నదులు ఎక్కడ ఉన్నాయి? యు.పి.లో ఉన్నాయి కదా. అయితే ఎ వన్ అవ్వడానికి మరియు తయారు చేయడానికి నదులను ప్రవహింపజేస్తారు. సమ్మతమేనా? నది ఎక్కడి నుండి బయలుదేరుతుంది? కాన్పూర్ నుండా లేదా అలహాబాద్ నుండా లేక అన్నిటి మిలనం జరుగుతుందా? ఆ మూడు నదులు కలుస్తాయి కదా. యు.పి. యొక్క అన్ని సెంటర్ల నదులు కలిసి సంగమమై బయలుదేరాలి. సరే కదా!
గుజరాత్ జోన్ - గుజరాత్ వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను నీ అతిథిని. తెలివైనవారిగా ఉన్నారు కదా, అయితే గుజరాత్ వారు ఏ అద్భుతం చేస్తారు? అతిథిగా అవ్వడంలో తెలివైనవారిగా ఉన్నారు కదా, అయితే బలహీనత లేదా వ్యర్థం అతిథులుగా వస్తాయి, ఈ బలహీనత ఒరిజినల్ అయితే కాదు. అయితే ఎ వన్ అవ్వడం, తయారు చేయడం అంటే వ్యర్థమైన అతిథిని సమాప్తం చేయడం. అయితే గుజరాత్ వారు తమ శక్తితో, తమ శుభ ఎ వన్ శ్రేష్ఠ సంకల్పంతో ఈ వ్యర్థమైన రాత్రి గడిచిపోయింది అనే శుభవార్త వినిపిస్తారు. గుజరాత్ అంటే రాత్రి గడిచిపోయింది. శ్రేష్ఠత యొక్క రోజును తీసుకువచ్చేవారు. సమ్మతమేనా? అతిథిగా అవ్వడంలో తెలివైనవారు, అతిథిని బయటకు పంపించడంలో కూడా తెలివైనవారు.
రాజస్థాన్ - రాజస్థాన్ ఏమి చేస్తుంది? సమర్థతపై రాజ్యం చేస్తుంది. అర్థమైందా? వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థతపై రాజ్యం చేసే రాజస్థాన్. అయితే ఎ వన్ అయిపోయారు కదా. ఎ వన్ మధుబన్ ఉంది కదా రాజస్థాన్‌లో. అయితే ఎ వన్‌లో ఆల్ వన్ అన్నది యాడ్ చేయండి.
పంజాబ్, హర్యానా - పంజాబ్ ఈ పాత ప్రపంచంలో కూడా ఇప్పటివరకు ఏ అద్భుతం చేసింది? ఉగ్రవాదాన్ని బలహీనపరిచింది. అయితే పంజాబ్ ఏ అద్భుతం చేస్తుంది? రెండు, మూడు, నాలుగు, పది నంబర్‌ను బలహీనపరుస్తుంది. ఈ ఉగ్రవాదాన్ని సమాప్తం చేసి సదా నంబర్‌వన్. అచ్ఛా!
డబల్ విదేశీయులు - విదేశం ఏమి చేస్తుంది? విదేశీయులు బలహీనతను తమ విదేశానికి పంపించండి. పూర్తిగా దూర దేశానికి పంపించండి, అది తిరిగి రాకూడదు. బలహీనత, వ్యర్థాన్ని విదేశానికి పంపి, దేశాన్ని సమర్థంగా చేయండి. భారత్‌లో లేదా దేశంలో మీ సమర్థత యొక్క జెండాను ఎగురవేయండి. ఇందులో సదా ఎవరెడీ, ఎ వన్. అర్థమైందా! అప్పుడప్పుడు రెడీగా ఉండేవారు కాదు. ఎవరెడీ, ఎ వన్. అర్థమైందా!
ఇప్పుడు ఢిల్లీ వారు ఏ అద్భుతం చేస్తారు? ఎందుకంటే ఢిల్లీ సేవకు ఫౌండేషన్. ఢిల్లీ నుండి మొదట పేదల పరిరక్షకుని ఆచారము ప్రారంభమైంది. అవసరమైనప్పుడు ఢిల్లీ సహయోగం ఇచ్చింది. ఢిల్లీ నుండి మొదటి నంబర్‌వన్ పాండవుడు (జగదీష్) వెలువడ్డారు. ఇన్వెన్షన్ కూడా ఢిల్లీ చాలా నంబర్‌వన్‌గా చేసి వెలువరించింది. ఇప్పుడు అందరూ తెలివైనవారిగా అయిపోయారు కానీ నిమిత్తం ఢిల్లీ అయింది. అయితే ఇప్పుడు ఓటే సో అర్జున్‌లో ఎ నంబర్. సరే కదా. పాండవ కోటను బలంగా చేయడంలో ఎ వన్. సమ్మతమే కదా?
అచ్ఛా, అన్ని జోన్లను కలిసాము. కింద కూర్చున్న మధుబన్ వారు, త్యాగం చేశారు, వారికి బాప్‌దాదా హృదయ సింహాసనం యొక్క బహుమతితో సహా విశేషమైన గుర్తు-ప్రేమ మరియు పదమాల రెట్లు అభినందనలు ఇస్తున్నారు. మొత్తం సీజన్ మధుబన్ వారు సేవ చేశారు, అయితే నిర్విఘ్నంగా, అలసటలేని సేవాధారులకు, వారు మధుబన్ నివాసులు అయినా, అన్ని వైపులా ఆతిథ్యాన్ని ఇచ్చే సేవాధారులు అయినా, బాప్‌దాదా - సదా ఉన్నతిని పొందుతూ ఉంటారు, పొందాల్సిందే - ఈ ప్రగతి యొక్క తిలకం ఇస్తున్నారు. హాస్పిటల్లో ఉన్న అందరు డాక్టర్లు లేదా సేవాధారులు, హాస్పిటల్లో ఎవరైతే ఉన్నారో, వారందరూ హెల్తీ మరియు హ్యాపీగా ఉన్నారా? స్థూల హెల్త్ కాదు, ఆత్మిక హెల్త్. అయితే సదా హెల్తీ మరియు సదా హ్యాపీ యొక్క అభినందనలు మరియు ఆబూ రోడ్ వారు లేదా తలేటీ వారు అందరినీ చాలా ప్రేమతో రిసీవ్ చేసుకుంటున్నారు మరియు చల్లని నీటి సౌకర్యాన్ని ఇస్తున్నారు, వేడి టీతో ఉత్సాహాన్ని కలిగిస్తున్నారు మరియు భ్రమిస్తున్న వారికి మార్గాన్ని కూడా చూపిస్తున్నారు. అందుకే రిసీవ్ చేసుకునేవారు, స్వాగతం చేసేవారు మరియు ఆతిథ్యం ఇచ్చేవారు, అందరికీ బాప్‌దాదా సేవ యొక్క అభినందనలతో పాటు ‘సదా ప్రగతి భవ’ అనే వరదానాన్ని ఇస్తున్నారు. ఆబూ నివాసులు ప్రవృత్తి వారు కూడా చాలా మంది ఉన్నారు. సదా ప్రవృత్తిలో ఉంటూ శ్రేష్ఠ వైబ్రేషన్స్ వ్యాపింపజేసినందుకు అభినందనలు. ఆబూ నివాసులు కూడా ఇప్పుడు ఆతిథ్యం బాగా చేస్తారు. స్థానం ఇస్తారు కదా. అందరూ సంతోషిస్తారు కదా. అయితే సదా ఎగురుతూ ఉండండి మరియు ఎగిరించండి.
జ్ఞాన సరోవరమైతే సరోవరమే. సరోవరంలోకి వెళ్లగానే పరివర్తన జరిగిపోతుంది. అయితే జ్ఞాన సరోవరాన్ని బాప్‌దాదా ఆత్మల వృత్తి మరియు జీవన పరివర్తన చేసే సరోవరం అని అంటారు. అందుకే జ్ఞాన సరోవరంలో సేవ చేసే వారు సదా నిర్విరామ భవ మరియు సదా వృద్ధి ప్రాప్తి భవ ఆత్మలు. ప్రగతి యొక్క సఫలత యొక్క వరదానం జ్ఞాన సరోవరం యొక్క స్థానం మరియు సేవాధారులకు సదా ఉంది. అచ్ఛా!
నలువైపులా ఉన్న మనస్సు అనే విమానం ద్వారా ఎగిరే మధుబన్ నివాసీ అవ్యక్త రూపధారీ ఆత్మలకు, అలాగే సంకల్పం అనే విమానం ద్వారా మధుబన్కు చేరుకునే శ్రేష్ఠ ఆత్మలకు మరియు నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ స్నేహీలకు, స్నేహంలో త్యాగం యొక్క భాగ్యం అనే శ్రేష్ఠ సంకల్పం చేసే ఆత్మలకు, సదా ఎ వన్‌గా అయ్యే సంకల్పాన్ని ప్రత్యక్ష జీవితంలోకి తీసుకొచ్చే తండ్రికి సమీపమైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు దేశ-విదేశాలలోని పిల్లలు ప్రతి ఒక్కరికీ పేరు-పేరున విశేషతా సంపన్న ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము
ప్రతి సమయపు దృశ్యం అతీతముగా మరియు ప్రియంగా ఉంది. మీ అందరి బాల్యపు పాట ఏది? ‘నయా దిన్ లాగే, నయీ రాత్ లాగే.....’ ఈ పాటపై నషాతో డాన్స్ చేసేవారు కదా! అయితే నవీనతలో మజా ఉంది కదా. అదే అదే సీన్ మారాల్సిందే మరియు ఏది మారుతుందో అది కొత్తదిగానే ఉంటుంది. పాతది అయితే సమాప్తమవుతుంది, కొత్తది అవుతుంది. అయితే ప్రతి సమయపు సీన్, ప్రతి సమయపు విషయాలు కొత్తవాటికంటే కొత్తవి. అయితే కొత్తది మంచిగా అనిపిస్తుందా లేదా పాతదా? కొత్తది మంచిగా ఉంది కదా! (గుర్తు పాతదే చేసుకుంటారు) గుర్తు చేసుకుంటారు కానీ ఇష్టం అయితే కొత్తదే కదా. అయితే కొత్తదే అవ్వాలి. అచ్ఛా! అందరూ సంతోషంగా ఉన్నారు కదా? తనువుతో, మనసుతో సంతోషమే సంతోషంగా ఉన్నారు.
1- ఇప్పుడు ఆత్మ-శక్తి యొక్క ఎగిరే వేగాన్ని తీవ్రగతిలో ప్రారంభించండి, అయితే ఏది ఆలోచిస్తారో అదే జరుగుతుంది.
2- సెంట్ (మహాన్) అవ్వడానికి వ్యర్థం నుండి ఇనోసెంట్‌గా అవ్వండి.
3- వ్యర్థం యొక్క అవిద్యగా ఉండటమే దివ్యత యొక్క అనుభూతికి ఆధారం.
4- ఎవరైతే పురుషుడిగా అయ్యి రథం ద్వారా కార్యం చేయిస్తారో వారే నిజమైన పురుషార్థి.
5- హద్దు యొక్క ఒడ్డుల ఆధారాన్ని వదిలి ఒక్క బాబాను మీ ఆధారంగా చేసుకోండి.
6- అల్పకాలపు విషయాలు మోసగించేవి, బాబా ఆధారమే ఛత్రఛాయ.
7- వ్యర్థాన్ని ఎదుర్కోవడం సమాప్తం చేస్తే సేవ యొక్క ఆఫర్ ఎదురుగా వస్తుంది.
8- ఇతరులను మైక్‌గా చేయండి, మీరు మైట్‌గా అవ్వండి.
9- తీవ్రగతి యొక్క ఎగురుటలో అనేక రకాల విషయాలే మేఘాలు, వాటిని సెకండ్లో క్రాస్ చేయండి.
10- శుద్ధ సంకల్పాలతో ఎలా చుట్టుముట్టాలంటే, అది బలహీనమైన ఆత్మలకు సేఫ్టీ సాధనంగా మారాలి.
11- శుద్ధ లేదా శ్రేష్ఠ సంకల్పాలను ఇమర్జ్ చేయండి, అప్పుడు వ్యర్థం స్వతహాగా మర్జ్ అయిపోతుంది.
*** ఓంశాంతి ***
