‘‘ప్రతి గుణము మరియు శక్తి యొక్క అనుభవాలలో లీనమైపోవటము అంటే అదృష్టవంతులుగా అవ్వటము’’
ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్‌దాదా తమ ప్రేమ స్వరూప పిల్లలతో మిలనం జరుపుకుంటున్నారు. తండ్రికి కూడా పిల్లల పట్ల అతి ప్రేమ ఉంది మరియు పిల్లలకు కూడా తండ్రి పట్ల అతి ప్రేమ ఉంది. ఈ ప్రేమ బంధము పిల్లలని కూడా ఆకర్షించి తీసుకువస్తుంది మరియు తండ్రిని కూడా ఆకర్షించి తీసుకువస్తుంది. ఈ పరమాత్మ ప్రేమ ఎంత సుఖదాయకమైనదో పిల్లలకు తెలుసు. ఒకవేళ ఒక్క క్షణమైనా ప్రేమలో లీనమైతే అనేక దుఃఖాలను మర్చిపోతారు, సుఖం యొక్క ఊయలలో ఊగడం మొదలుపెడతారు. ఇటువంటి అనుభవం ఉంది కదా? ప్రపంచం లెక్కలో ఎంత సాధారణమైన ఆత్మలుగా ఉన్నారు కానీ భాగ్యం ఎంత శ్రేష్ఠంగా ఉంది - అన్నది బాప్‌దాదా చూస్తున్నారు. మొత్తం కల్పంలో ధర్మాత్మకైనా లేక మహానాత్మకైనా, ఎవ్వరికీ ఇటువంటి శ్రేష్ఠ భాగ్యం ప్రాప్తించలేదు మరియు ప్రాప్తించదు కూడా. కావున మీరు అతి సాధారణమైనవారు మరియు అతి శ్రేష్ఠ భాగ్యవంతులు. బాప్‌దాదాకు సాధారణ ఆత్మలే ఇష్టం, ఎందుకు? స్వయం తండ్రి కూడా సాధారణ తనువులోకే వస్తారు. ఏ రాజు తనువులోకో లేక రాణి తనువులోకో రారు. ఏ ధర్మాత్మ లేక మహాత్మ తనువులోకో రారు. స్వయం కూడా సాధారణ తనువులోకే వస్తారు మరియు పిల్లలు కూడా సాధారణమైనవారే వస్తారు. ఈ నాటి కోటీశ్వరులు కూడా సాధారణమైనవారే. సాధారణ పిల్లలలో భావన ఉంటుంది. తండ్రికి భావన కావాలి, దేహభానం కలవారు వద్దు. ఎంత పెద్దవారో, అంతగా వారిలో భావన ఉండదు, భానం ఉంటుంది. కావున తండ్రి భావనకు ఫలాన్ని ఇస్తారు, భావన సాధారణ ఆత్మలలో ఉంటుంది. పేరు-ప్రఖ్యాతులు కలవారికి భావనా ఉండదు, సమయమూ ఉండదు. కనుక మీరు ఉండడము ఎంత సాధారణంగా ఉన్నారు కానీ శ్రేష్ఠ భావన యొక్క ఫలాన్ని ఎంతగా ప్రాప్తి చేసుకుంటున్నారు అన్నది తండ్రి చూస్తున్నారు. అందుకే డ్రామానుసారంగా సంగమయుగంలో సాధారణమైనవారిగా అవ్వటం కూడా భాగ్యానికి గుర్తు ఎందుకంటే సంగమంలోనే భాగ్యవిధాత భాగ్యం యొక్క శ్రేష్ఠ రేఖను గీస్తున్నారు మరియు దానితో పాటు భాగ్యపు రేఖను గీసే కలమును కూడా పిల్లలకు ఇచ్చేసారు. కలం లభించింది కదా? భాగ్యపు రేఖను గీయటం వస్తుందా? ఎంత పొడవాటి రేఖను గీసారు? చిన్న గీతనైతే గీయలేదు కదా? ఎంత కావాలంటే అంత భాగ్యం తయారుచేసుకోవచ్చు. దీనికి పూర్తి అనుమతి ఉంది మరియు అందరికీ అనుమతి ఉంది. కొత్తవారైనా లేక పాతవారైనా సరే - 7 రోజుల కోర్సు చేసి తండ్రిని గుర్తించారంటే, తండ్రి భాగ్యం యొక్క కలమును ఇచ్చేస్తారు. ఇదే పరమాత్మ ప్రేమ, ప్రేమకు గుర్తు ఏమిటి? జీవితంలో ఏదైతే కావాలో, దానిని ఎవరైనా ఎవరికైనా ఇస్తే అదే ప్రేమకు గుర్తు. అలాగే తండ్రి ప్రేమకు గుర్తు ఏమిటంటే - జీవితంలో ఏవైతే కావాలో ఆ సర్వ కామనలన్నింటినీ పూర్తి చేసేస్తారు. సుఖ-శాంతులైతే కావాలి కదా! ఒకవేళ ఒకరికొకరు ఏ వస్తువునైనా ఇచ్చుకుంటే, దాని ద్వారా సుఖం లభిస్తుంది కదా? కానీ తండ్రి కేవలం సుఖాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, సుఖం యొక్క భాండాగారముగా మిమ్మల్ని అందరినీ తయారుచేస్తున్నారు. సుఖం యొక్క భాండాగారము (ఖజానా) కదా! మొత్తం స్టాక్ అంతా ఉందా? లేక ఒకటి, రెండు గదులు ఉన్నాయా! భాండాగారము ఉందా. ఎలాగైతే తండ్రి సుఖ సాగరుడు, అంతేకానీ నది లేక కాలువ కాదు, వారు సాగరుడు, కనుక పిల్లలను కూడా సుఖం యొక్క భాండాగారానికి యజమానిగా తయారుచేస్తారు. ఏదైనా సుఖం యొక్క లోటు ఉందా? ఏదైనా అప్రాప్తి ఉందా? కాబట్టి కొంచెం శక్తి ఇవ్వండి - అని ఇక అనకండి. ‘ఇచ్చేసాను’. ‘ఇవ్వండి’ అని అడగాల్సిన అవసరమే లేదు. తండ్రి అయితే ఇచ్చేసారు, కేవలం దానిని కార్యంలో ఉపయోగించే విధి కావాలి. అందుకు విధులు కూడా తండ్రి ద్వారా అనేక రకాలవి లభిస్తాయి. కేవలం వాటిని సమయం అనుసారంగా కార్యంలో ఉపయోగించరు, అందుకే అవి ఉన్నా కూడా వాటి ద్వారా లాభం తీసుకోలేకపోతారు. ఎంత గొప్ప భాగ్యము! మరియు ఎంత సహజంగా లభించింది! ఏదైనా శ్రమ చేశారా? ఒంటి కాలిపై నిలబడవలసిన అవసరం రాలేదు కదా? లేదా క్షణకాలపు దర్శనం కోసం క్యూలో నిలబడ్డారా? అలా అయితే కాదు కదా. ప్రశాంతంగా కూర్చున్నారు కదా. క్రింద అయినా కానీ పరుపుపై కూర్చున్నారు. ప్రశాంతంగా మరియు సహజంగా శ్రేష్ఠ భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు. ఈ నషా ఉంది కదా? భాగ్యవిధాత మా వారు అని అందరూ నషాతో అంటారు. భాగ్యవిధాతయే మీ వారు అయినప్పుడు మరి భాగ్యాన్ని ఎవరికి ఇస్తారు?
భాగ్యవిధాతను మీ వారిగా చేసుకున్నారంటే భాగ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నట్లు. ఎవరికైతే నషా ఉంటుందో వారు సదా ఎలా అనుభవం చేస్తారంటే - భాగ్యం అనేది నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? ఎందుకంటే భాగ్యవిధాతయే నా వారు. ఇంత నషా ఉందా లేక నషా అప్పుడప్పుడు ఎక్కుతూ, అప్పుడప్పుడు దిగుతూ ఉంటుందా? సంగమములో సమయమే ఎంత తక్కువ ఉంటుంది! మీలో మెజారిటీ అందరూ కొత్తవారే. ఎంత కొద్ది సమయం లభించింది! కానీ డ్రామాలో విశేషంగా ఈ సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే - ఎవరైనా కొత్తవారైనా లేక పాతవారైనా, కొత్తవారికి కూడా ముందు నంబరు తీసుకోవడానికి గోల్డెన్ ఛాన్స్ ఉంది. మరి కొత్తవారిలో ఉల్లాసం ఉందా? లేక మా కంటే ముందు చాలా మంది ఉన్నారు, మేము వచ్చిందే ఇప్పుడు... అని అనుకుంటున్నారా? అలా కాదు. ఎవరు ఎంత ముందుకు వెళ్ళాలనుకుంటే అంత వెళ్ళవచ్చు, ఈ విషయంలో అందరికీ అవకాశం ఉంది, కేవలం అభ్యాసం పట్ల అటెన్షన్ ఉండాలి. కొంతమంది పాతవారు నిర్లక్ష్యులుగా అవుతారు. కొత్తవారైన మీరు నిర్లక్ష్యులుగా అవ్వకండి, అప్పుడు ముందుకు వెళ్ళిపోతారు, నంబరు తీసుకుంటారు. నంబరు తీసుకోవాలి కదా? ఫస్ట్ నంబరు కాదు, ఫస్ట్ డివిజన్. ఫస్ట్ నంబరు అయితే బ్రహ్మాబాబాకు నిశ్చితం అయ్యింది కదా. కానీ ఫస్ట్ డివిజన్‌లోకి ఎంతమంది కావాలంటే అంతమంది రావచ్చు. మరి అందరూ ఏ డివిజన్‌లోకి వస్తారు? అందరూ ఫస్ట్ డివిజన్లోకే వస్తే మరి సెకెండ్లోకి ఎవరు వస్తారు? మాతలు ఎందులోకి వస్తారు? ఫస్ట్లోకి వస్తారా? చాలా మంచిది. ‘రావాల్సిందే’ - ఈ దృఢ నిశ్చయం భాగ్యాన్ని నిశ్చితం చేస్తుంది. ఏమో తెలియదు... వస్తామో, రామో... మున్ముందు ఏమైనా మాయ వస్తుందేమో తెలియదు... మాయ చాలా తెలివైనది - ఇటువంటి వ్యర్థ సంకల్పాలు ఎప్పుడూ చేయవద్దు. సర్వశక్తిమంతుడు తోడుగా ఉన్నప్పుడు, మాయ వారి ఎదురుగా కాగితం పులి వంటిది, అందుకే భయపడకండి. ‘ఏమో తెలియదు’ అన్న సంకల్పం ఎప్పుడూ చేయవద్దు. మాస్టర్ నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యి ప్రతి కర్మనూ చేస్తూ ఉండండి. తోడు యొక్క అనుభవం సదా సహజంగా మరియు సురక్షితంగా ఉంచుతుంది. తోడును మర్చిపోతే కష్టమవుతుంది. కానీ అందరూ చేసిన ప్రతిజ్ఞ ఏమిటంటే - మీతోనే ఉంటాము, మీతోనే వస్తాము, ప్రతిజ్ఞ ఇదే కదా? లేక ఒంటరిగా ఉంటారు మరియు ఒంటరిగా వెళ్తారా? కనుక తోడు యొక్క అనుభవాన్ని పెంచండి. తోడుగా ఉన్నారు అన్నది తెలుసు కూడా మరియు అంగీకరిస్తారు కూడా, కానీ తేడా ఏం వస్తుంది? తెలుసు కూడా మరియు అంగీకరిస్తారు కూడా, కానీ సమయానికి ఆ విధంగా నడుచుకోరు. మాయ ఫోర్స్ అనేది ఈ కోర్సు ఏదైతే ఉందో, దానిని మరపింపజేస్తుంది. కానీ మాయ ఏమైనా చాలా బలమైనదా? మాయ బలమైనదా లేక మీరు బలమైనవారా? లేక ఒక్కోసారి మాయ బలమైనది, ఒక్కోసారి మీరు బలమైనవారా? మీ బలహీనతయే మాయ, ఇంకేమీ కాదు. మీ బలహీనతయే మాయ రూపంలో మీ ఎదురుగా వస్తుంది. ఏ విధంగానైతే శరీరం యొక్క బలహీనత వ్యాధి రూపంలో మీ ఎదురుగా వస్తుంది కదా, అదే విధంగా ఆత్మ యొక్క బలహీనత మాయ రూపంలో ఎదుర్కొంటుంది. కనుక బలహీనంగా అవ్వకండి, అప్పుడు మాయ రాదు. మీ లక్ష్యమే - మాయాజీత్ జగత్జీత్గా అవ్వడము. ఎన్ని సార్లు విజయులుగా అయ్యారు? లెక్కలేనన్ని సార్లు, అయినా కూడా భయపడిపోతారు! ఏదైనా కొత్త విషయం అయితే - ఇది కొత్త విషయం కదా, నాకు తెలియదు, అందుకే భయపడ్డాను అని అనుకోవచ్చు. కానీ ఒక వైపు - మేము అనేక సార్లు విజయులుగా అయ్యాము అని అంటారు, మరి ఎందుకు భయపడతారు? పిల్లలు ప్రతి ఒక్కరూ శ్రేష్ఠ ఆత్మగా అయ్యి రాజ్యాధికారిగా అవ్వాలి అన్నదే తండ్రి ప్రేమ. ప్రజా అధికారిగా అయితే అవ్వకూడదు కదా? రాజ్యాధికారి అనగా ప్రతి కర్మేంద్రియాన్ని జయించినవారు. ఒకవేళ మీ కర్మేంద్రియాలపై, మనస్సు-బుద్ధి-సంస్కారాలపై విజయులుగా అవ్వకపోతే ఇక ప్రజలపై ఏం రాజ్యం చేస్తారు! ఒకవేళ తమపై తాము విజయం సాధించలేనివారు రాజుగా అయితే సత్యయుగం కూడా కలియుగం అయిపోతుంది. అందుకే ఇది చెక్ చేసుకోండి - మనస్సు, బుద్ధి, సంస్కారాలు కంట్రోల్లో ఉన్నాయా? మనస్సు మిమ్మల్ని నడిపిస్తుందా లేక మీరు మనస్సును నడిపించేవారా? ఈరోజు నా మనస్సు కుదరడం లేదు, ఈరోజు నా మనస్సు భ్రమిస్తూ ఉంది అని ఫిర్యాదు చేస్తున్నారంటే, మనస్సును జయించినవారిగా అయినట్లా? ఈరోజు మనస్సు ఉదాసీనంగా ఉంది, ఈరోజు మనస్సు వేరే ఆకర్షణలోకి వెళ్ళిపోతుంది... ఇవి విజయుల సంకల్పాలేనా? కనుక ఎవరైతే స్వయంపై విజయం పొందలేరో, వారు విశ్వంపై ఎలా విజయం పొందుతారు? అందుకే చెక్ చేసుకోండి - కర్మేంద్రియాలను జయించినవారిగా, మనస్సును జయించినవారిగా ఎంతవరకు అయ్యారు? ఒకవేళ ఫస్ట్ డివిజన్‌లోకి రావాలంటే ఈ లక్షణాలతో లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు.
బాప్‌దాదా చూసారు - పిల్లలు ఉల్లాస-ఉత్సాహాలలో కూడా ఉంటారు, జ్ఞానం యొక్క జీవితం మంచిగా కూడా అనిపిస్తుంది, జ్ఞానం వినడం-వినిపించడంలో కూడా మంచిగా ముందుకు వెళ్తున్నారు. కానీ నడుస్తూ-నడుస్తూ ఉండగా ఒకవేళ బలహీనత వస్తుందంటే దానికి కారణం ఏమిటి? విశేషమైన కారణం ఏమిటంటే - ఏదైతే చెప్తున్నారో, ఏదైతే వింటున్నారో, ఆ ఒక్కొక్క గుణము యొక్క, శక్తి యొక్క, జ్ఞాన పాయింట్ల యొక్క అనుభవం తక్కువగా ఉంది. ఉదాహరణకు మొత్తం రోజంతటిలో స్వయానికి కూడా మరియు ఇతరులకు కూడా ఎన్ని సార్లు ఈ విధంగా చెప్తారు - నేను ఆత్మను, మీరు ఆత్మ, శాంత స్వరూపాన్ని, సుఖ స్వరూపాన్ని, ఇలా ఎన్ని సార్లు స్వయం కూడా ఆలోచిస్తారు మరియు ఇతరులకు కూడా చెప్తారు. కానీ నడుస్తూ-తిరుగుతూ ఉండగా ఆ ఆత్మిక అనుభూతి అనేది, జ్ఞాన స్వరూపం, ప్రేమ స్వరూపం, శాంతి స్వరూపం యొక్క అనుభూతి అనేది తక్కువగా అవుతుంది. వినటం-చెప్పటం ఎక్కువగా ఉంది మరియు అనుభూతి తక్కువగా ఉంది. కానీ అన్నింటికన్నా గొప్ప అథారిటీ - అనుభవం యొక్క అథారిటీ కావున ఆ అనుభవంలో లీనమైపోండి. శాంతి స్వరూపాన్ని అని చెప్పినప్పుడు, ఆ స్వరూపంలో స్వయానికి మరియు ఇతరులకు శాంతి యొక్క అనుభూతి కలగాలి. ఒక్కొక్క గుణాన్ని వర్ణిస్తారు, శక్తులను వర్ణిస్తారు కానీ ఆ శక్తులు లేక గుణాలు సమయానికి అనుభవంలోకి రావాలి. చాలా మంది - సహనశక్తిని ధారణ చేయాలి, సహనశీలత మంచిది అని చెప్తూ ఉంటారు కూడా కానీ ఆ అనుభూతి ఉండదు. అనుభూతి లోపించిన కారణంగా ఎంత కావాలనుకుంటారో అంత పొందలేకపోతారు. ఒకవేళ అందరినీ - ఎంత పురుషార్థం ఉండాలో అంత ఉందా అని అడిగితే, అవును అని కొద్దిమందే అంటారు. కావున ఎంతైతే లభిస్తుందో అంత జీవితంలో మరియు కర్మలలో అనుభవం అవ్వాలి. కేవలం ఆలోచనలలో మాత్రమే అనుభవం అవ్వడం కాదు కానీ నడవడికలో మరియు కర్మలలో - శక్తులు, గుణాలు అనేవి స్వయానికి కూడా అనుభవం అవ్వాలి, ఇతరులకు కూడా అనుభవం అవ్వాలి. జ్ఞాన స్వరూపాన్ని అని అంటూ ఉంటారు, మరి ఆ స్వరూపం కనిపించాలి కదా? మరియు స్వరూపం అనేది సదా ఉంటుంది. స్వరూపం అనేది అప్పుడప్పుడు ఉండదు. అజ్ఞాన కాలపు జీవితంలో కూడా, ఒకవేళ ఎవరికైనా క్రోధ స్వరూపం ఉన్నట్లయితే, ఏ విషయం జరిగినా ఆ స్వరూపం కనిపిస్తుంది, దాగి ఉండదు. అది చిన్న విషయం అయినా లేక పెద్ద విషయం అయినా, ఎవరిది ఏ స్వరూపమో, అది కనిపిస్తుంది. అది స్వయానికి కూడా అనుభవం అవుతుంది మరియు ఇతరులకు కూడా అనుభవం అవుతుంది. అప్పుడు ఏమంటారు - వీరు క్రోధీగానే ఉంటారు, వీరి సంస్కారమే క్రోధ సంస్కారము. అంటే సంస్కారం అనేది కనిపిస్తుంది కదా. అదే విధంగా ఈ జ్ఞాన స్వరూపము, శాంత స్వరూపము, సుఖ స్వరూపము అనుభవంలోకి రావాలి. కావున అనుభవీ మూర్తులుగా అవ్వాలి - ఇదే శ్రేష్ఠ పురుషార్థానికి గుర్తు. అందుకే అనుభవాన్ని పెంచండి. ఏదైతే చెప్పారో, అది అనుభవం అయ్యిందా? ఒకవేళ అనుభవం అవ్వటం లేదంటే దానికి కారణము - సమయమనుసారంగా ఏదైతే విధి లభిస్తుందో ఆ విధి పట్ల అటెన్షన్ తక్కువగా ఉంటుంది. ఎంతగా జ్ఞానాన్ని, గుణాలను, శక్తులను రివైజ్ చేస్తూ ఉంటారో, అంతగా సహజంగా రియలైజ్ అవుతారు. రివైజ్ చేయకపోతే రియలైజేషన్ కూడా తక్కువగా ఉంటుంది. విన్నారు, చాలా మంచిది. కానీ నడుస్తూ-తిరుగుతూ రివైజ్ అవ్వాలి. ఏ విధంగానైతే ప్రపంచంలోనివారు కర్మయే యోగము అని అంటారు. కర్మ మరియు యోగం వేరు అని ఒప్పుకోరు. కర్మయే యోగము అని భావిస్తారు. కర్మతో యోగం జోడించడాన్నే కర్మయోగం అని భావిస్తారు. కానీ కర్మ మరియు యోగం రెండింటి బ్యాలెన్స్ ఉండాలి. కర్మలో బిజీగా ఉండటమంటే యోగం కాదు. కర్మ చేసేటప్పుడు యోగం అనుభవం అవ్వాలి. కర్మలో బిజీ అయిపోతే కర్మయే శ్రేష్ఠం అయిపోతుంది, యోగం పక్కకు వెళ్ళిపోతుంది. నడుస్తూ-నడుస్తూ ఉండగా ఈ నిర్లక్ష్యమే వస్తుంది. కనుక కర్మలో యోగం అనుభవం అవ్వాలి, అటువంటివారినే కర్మయోగి అని అంటాము. ముఖ్యమైన విషయం - అనుభవీ స్వరూపంగా అవ్వండి. ఒక్కొక్క గుణం యొక్క అనుభవంలో లీనమైపోండి. శక్తి స్వరూపంగా అవ్వండి. మీ స్వరూపం ద్వారా శక్తులు కనిపించాలి. ఇప్పుడు కూడా చూడండి, ఒకవేళ ఎవరిలోనైనా ఏదైనా విశేష శక్తి ఉంటే దాని గురించి - వీరు చాలా సహనశీలతా స్వరూపులు, వీరిలో ఇముడ్చుకునే శక్తి చాలా కనిపిస్తుంది అని అంటారు. కావున కొందరిలో కనిపిస్తుంది, కొందరిలో కనిపించదు మరియు ఒక్కోసారి కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించడం లేదంటే అటెన్షన్ తక్కువగా ఉన్నట్లే కదా. కావున ప్రతి శక్తి, ప్రతి గుణం, జ్ఞానం యొక్క ప్రతి పాయింటు మీ స్వరూపంలో అనుభవం అవ్వాలి. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ముందు స్వయానికి అనుభవం అయినప్పుడు. ఒకవేళ స్వయం అనుభవజ్ఞులు అయినట్లయితే, ఇతరులకు వారి నుండి స్వతహాగా అనుభవం అవుతుంది. మరియు అలా అనుభవమైనప్పుడు ఎంత సంతోషం కలుగుతుంది! ఒక్క క్షణమైనా ఏదైనా గుణం లేక శక్తి అనుభవమైతే సంతోషం ఎంతగా పెరిగిపోతుంది మరియు సదా అనుభవీ స్వరూపులుగా అయినప్పుడు సదా ముఖంపై సంతోషం యొక్క మెరుపు, అదృష్టం యొక్క మెరుపు అనుభవం అవుతుంది. కావున అనుభవాన్ని పెంచండి. విధి అయితే స్పష్టంగా ఉంది కదా? అచ్ఛా, అందరూ అదృష్టవంతులే కానీ విశేషంగా సంతోషాన్ని జరుపుకోవటానికి వచ్చారు. మరి అందరికీ సంతోషం లభించిందా?
అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా? మనస్సు ప్రశాంతంగా ఉంటే తనువుకు కూడా తప్పకుండా ప్రశాంతత లభిస్తుంది. స్థానాన్ని ఎంతగా పెంచుతారో, అంతగా అది తక్కువ అవ్వాల్సిందే. ఇది నిశ్చయించబడి ఉంది, దానిని ఏమి చేస్తారు! ఇది మంచిదేలే, రిహార్సల్స్ జరుగుతున్నాయి, ఎక్కడ కూర్చోబెడితే అక్కడ, ఎలా కూర్చోబెడితే అలా, ఎలా పడుకోబెడితే అలా... ఈ రిహార్సల్ జరుగుతుంది. నేలపై పడుకోవడం మంచిది, పట్టపురాజుగా అయ్యారు కదా. శాస్త్రాలలో కూడా పట్టపురాణి, పట్టపురాజుల మహిమ చాలా గొప్పగా ఉంది, మీరు అయితే చాలా సహజంగా అలా అయ్యారు. ఏదైనా కష్టం ఉందా? బాప్‌దాదా మరియు నిమిత్త ఆత్మలు అందరూ ప్రశాంతంగా ఉండాలనే ఆలోచిస్తారు కానీ ఇంత ఎక్కువ సంఖ్యలో కూడా ప్రశాంతంగా అనిపిస్తుందంటే అది సంతోషకరమైన విషయము. ఎక్కడ ఉన్నా కానీ అక్కడ సంతోషంగా ఉన్నారా? కష్టమేమీ లేదు కదా? మరికొంతమందిని పిలవాలా? ఎవరు రావాలనుకుంటే వాళ్ళు వచ్చేయండి అని కేవలం ఒక్క సూచన వెళ్ళిందనుకోండి! అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? అఖండ తపస్య చేయాల్సి ఉంటుంది. సంతోషమనే ఔషధాన్ని తినండి మరియు అఖండ యోగం చేయండి, అప్పుడిక అందరూ రావచ్చు. చేస్తారా? అలసిపోరా! ఆకలి అనిపించదా! ఏడు రోజులు తినకుండా ఉంటారా? ఏడు రోజులు భోజనం లభించదు! బాప్‌దాదా ఇలా హఠంగా ఉంచాలి అని అనుకోవడం లేదు. మీరు సహజయోగులు కదా.
ఈ పరమాత్మ మిలనమనేది తక్కువ భాగ్యం కాదు! ఈ పరమాత్మ మిలనం యొక్క శ్రేష్ఠ భాగ్యం కోట్లలో కొద్దిమంది ఆత్మలైన మీకే లభిస్తుంది. అచ్ఛా! కలుసుకున్నాము కదా? భక్తిలోనైతే జడ చిత్రాలను కలుసుకుంటారు మరియు ఇక్కడ చైతన్యంలో తండ్రి పిల్లలను కలుసుకుంటారు కూడా మరియు ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు. మరి ఈ భాగ్యం ఏమైనా తక్కువా! అయినా మీరందరూ అదృష్టవంతులు, సమయం యొక్క వేగం పరివర్తన అవుతూ ఉంది. ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చుని వింటున్నారు. మున్ముందు వృద్ధి అయితే ఇది మారిపోతుంది కదా, ఎంతైనా మీరు అదృష్టవంతులు ఎందుకంటే టూ లేట్ సమయంలో రాలేదు, కేవలం లేట్ సమయంలో వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారా? అచ్ఛా. ఏ ఏ జోన్లు వారు వచ్చారు?
మహారాష్ట్ర: మహారాష్ట్ర వారు సదా విశేషమైన సంతుష్ట మణులు - ఈ వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురావాలి. అప్పుడు బాప్‌దాదా మరో గ్రూప్‌లో, మహారాష్ట్ర వారు సంతుష్టత యొక్క స్వరూపాన్ని చూపించారా అని అడుగుతారు. కాబట్టి మీరు సదా సంతుష్ట మణులు, అసంతుష్టత యొక్క నామరూపాలు కూడా ఉండకూడదు. కాబట్టి ఇప్పుడు దీనిలో నంబర్‌వన్ రావాలి. ఈ 6 నెలల్లో ఎవరైనా అసంతుష్టంగా ఉన్నారా లేదా అందరినీ సంతుష్ట పరిచారా? అనే రిజల్ట్ చెప్పాలి. స్వయం కూడా సంతుష్టంగా ఉండాలి, ఇతరులను కూడా సంతుష్ట పరచాలి. కాబట్టి మహారాష్ట్రకు ఇది ఇష్టమేనా? ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా అసంతుష్టపరిస్తే అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అసంతుష్టమవుతారా? చేసేవారు మిమ్మల్ని అసంతుష్టపరిచారని మీరు కూడా అలాగే ఉంటారా? లేక శీతలత్వాన్ని (శాంతిని) ధరిస్తారా? వారు తపత్ (ఆవేశం) ఇస్తుంటే మీరు శీతలతలో ఉంటారా? కొద్దిగా అయినా అసంతుష్టమవుతారా? చూడండి! వారు అసంతుష్ట పరిచినా, మీరు మాత్రం సంతుష్టత అనే నీటిని చల్లాలి. వారు నిప్పు రాజేస్తే, మీరు నీళ్ళు పోయాలి. ఇది చేయగలరా లేదా? కాబట్టి ఫలితాన్ని చూద్దాం. మహారాష్ట్ర అంటేనే సదా సంతుష్టంగా ఉండేవారు మరియు అందరినీ సంతుష్ట పరిచేవారు.
తమిళనాడు: తమిళనాడు ఏమి చేస్తుంది? తమిళనాడు సదా సుఖదాత యొక్క పిల్లలు మాస్టర్ సుఖదాతలు. ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చినా దానిని సుఖంగా పరివర్తన చేసుకుంటారు. కాబట్టి 6 నెలల రిజల్ట్ చూద్దాం. ఊరికే అలా చప్పట్లు కొట్టకండి. రిజల్ట్ సమయంలో కూడా చప్పట్లు మోగేలా చేయండి. కాబట్టి తమిళనాడు కూడా రేస్ బాగానే చేస్తోంది. సేవలో ముందుకు వెళ్తోంది. ప్రకృతికి కూడా తమిళనాడు బాగా నచ్చుతుంది. అక్కడ ప్రకృతి కూడా దాడి చేస్తుంది. తమిళనాడు వారు ఏమి అవుతారు? మాస్టర్ సుఖదాత. ఇప్పుడు చూద్దాం, మహారాష్ట్ర ముందుకు వెళ్తుందా లేదా తమిళనాడు ముందుకు వెళ్తుందా? అందరి లక్ష్యం అయితే అందరికంటే ముందుకు వెళ్లాలనే ఉంది మరియు వెళ్లగలరు. కష్టమైన విషయమేమీ కాదు.
ఈస్టర్న్ జోన్ (బెంగాల్, బీహార్, ఒరిస్సా, అస్సాం, నేపాల్): ఐదు నదులు కలిసి ఈస్టర్న్ జోన్ తయారైంది. మరి ఈస్టర్న్ జోన్ ఏమి చేసి చూపిస్తుంది? సదా స్వయం కంబైన్డ్ స్వరూపము, మాస్టర్ సర్వశక్తిమంతులుగా అనుభవం చేసుకుంటారు. అన్నింటికంటే ఎక్కువ విస్తారము ఈస్టర్న్ జోన్‌దే. చూడండి, నేపాల్ కూడా ఈస్టర్న్‌లో వచ్చేసింది, ఈస్టర్న్‌లో ఫారిన్ కూడా వచ్చేసింది, కాబట్టి ఎంత పెద్దదో. పెద్ద జోన్ అయినప్పుడు పెద్దగానే చూపిస్తారు కదా! ఈస్టర్న్ జోన్ మహాన్ లక్కీ జోన్. ఎందుకు లక్కీ? ఎందుకంటే బ్రహ్మా బాబా యొక్క కర్మభూమి మరియు ప్రవేశతా భూమి. అందుకని సదా కంబైన్డ్ స్వరూపంలో ఉండే మాస్టర్ సర్వశక్తిమాన్ ఆత్మలు - ఇది ప్రాక్టికల్‌లో చూపిస్తారు కదా! సెకండు కూడా విడిపోకూడదు. కంబైన్డ్ ఎప్పుడూ విడిపోదు. సదా తోడుగా ఉంటూ ఇతరులను కూడా తోడుగా కలిపేవారు. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం, నంబర్ ఎవరు తీసుకుంటారో? ఇప్పుడు పేరు యొక్క నంబర్ కదా, తర్వాత పని యొక్క నంబర్ వస్తుంది.
యు.పి.: లౌకిక సామెతలో యు.పి. యొక్క ప్రత్యేకత ఏంటంటే, యు.పి. వారు ‘పహలే ఆప్, పహలే ఆప్’ (ముందు మీరు, ముందు మీరు) అనే మంత్రాన్ని ఎక్కువగా చదువుతారు. కానీ బ్రాహ్మణులైన మీరు ఏ మంత్రం చదువుతారు? ‘పహలే బాప్’ (ముందు బాబా). ప్రతి విషయంలో ముందు బాబా. బాబా గుర్తుకు వస్తే అంతా వచ్చేసినట్లే. కాబట్టి ప్రతి కర్మలో ముందు బాబా యొక్క స్మృతి ఉండాలి. అందుకని యు.పి. వారు సదా మస్తకంలో పదమపతి, పదమాపదమ భాగ్యము యొక్క రేఖ ఉన్నవారు. సదా మస్తకంలో ఈ పదమాపదమ భాగ్యవాన్ యొక్క రేఖ మెరుస్తూ కనిపించాలి. దీనిలో యు.పి. వారు నంబర్ తీసుకుంటారు కదా? సదా భాగ్యవాన్ భవ! మంచిది, స్థాపనలో ఢిల్లీ పార్ట్ కూడా ఉంది, అలాగే యు.పి. ది కూడా విశేష పాత్ర ఉంది. అందుకని విశేష భాగ్యవాన్ ఆత్మలు.
ఇండోర్: ఇండోర్ వారు ఏమి చేస్తారు? ఇండోర్ వారు విశేషంగా మహాదాని. సదా తమ కర్మ ద్వారా, మాట ద్వారా మహాదాని. దానము చేసేవారు. తీసుకునేవారు కాదు, ఇచ్చేవారు. మరి మహాదానియా? దానము చేయడం వచ్చు కదా? ఎవరైతే మహాదాని అవుతారో వారే వరదాని అవుతారు. కాబట్టి వరదానాలు తీసుకునేవారు మరియు ఇతరులకు వరదానాలు ఇచ్చేవారు - మహాదాని మరియు మాస్టర్ వరదాని. ఎవరు ఎలా ఉన్నా వరదానము ఇవ్వండి, మహాదాని అవ్వండి - ఇదే ప్రత్యేకత. మరి ఇండోర్ వారు ఏమి చేస్తారు? వరదాని అవుతారు. ఎవరైనా తిట్టినా వరదాని అవుతారు కదా! ఎవరైనా ఇన్సల్ట్ చేస్తే ఏమి చేస్తారు? వరదాని అవుతారా లేక ఆ సమయంలో కొద్దిగా ముఖం మారుస్తారా? కొద్దిగా ముఖం మారదు కదా? వరదానము ఇస్తారు! వారు తిట్టినా, మీరు వరదానము ఇస్తారా! అయితే చాలా పాస్ అయిపోయినట్లే, ఇప్పటి నుండే పాస్ అయిపోయారు.
కర్ణాటక: కర్ణాటక వారు ఏమి చేస్తారు? సదా తమను పుణ్యాత్మలుగా భావించి పుణ్యము చేస్తూ ఉంటారు. కర్ణాటక వారి పుణ్యము యొక్క మూలధనం సదా జమ అవుతుంది. కాబట్టి పుణ్యాత్మలుగా అయి పుణ్యము యొక్క మూలధనాన్ని జమ చేసుకునేవారు మరియు పుణ్యాత్మగా అయి ఇతరులను కూడా పుణ్యాత్ములుగా తయారుచేసేవారు. మరి కర్ణాటక వారు ఏమిటి? పుణ్యాత్ములు. పాపాలు అయితే సమాప్తమైపోయాయి కదా! కర్ణాటక వారు పాపము యొక్క ఖాతాను సమాప్తం చేశారు కదా? లేక కొద్దిగా ఉంచారా? అంతా సమాప్తం. అప్పుడే కదా పుణ్యాత్ములుగా అయ్యారు. కాబట్టి పుణ్యాత్ములు, సదా పుణ్యాత్ములుగా ఉంటారు మరియు ఇతరులను కూడా పుణ్యాత్ములుగా తయారుచేస్తారు. తయారుచేయడంలో అయితే తెలివైనవారే కదా! కర్ణాటక వృద్ధి చాలా త్వరగా జరుగుతుంది కదా! అన్నింటికంటే ఎక్కువ ఏ జోన్ సంఖ్య ఉంది? (మహారాష్ట్రది) మంచిది, పేరు ఎలా ఉందో పని కూడా అలాగే ఉంది. మంచిది!
డబల్ విదేశీయులు: డబల్ విదేశీయులు చాలా తెలివైనవారు. ఏ తెలివైన పని చేసారు? పరుగెత్తడంలో తెలివైనవారు! మరియు భాగ్యము తీసుకోవడంలో, భాగ్యము ఇవ్వడంలో కూడా తెలివైనవారు! కొద్దిగా తీసుకునేవారు కాదు, పూర్తిగా తీసుకునేవారు. భాగ్యము తీసుకోవడంలో తెలివైనవారేనా? డబల్ విదేశీయుల ప్రత్యేకత ఏంటంటే ప్రతి విషయంలో డబల్ వాటా తీసుకుంటారు. భారత్వాసుల వాటాలో కూడా తీసుకుంటారు, తమ వాటాలో కూడా తీసుకుంటారు. విదేశీయులకు విశేషంగా అవ్యక్త పాలన యొక్క అనుభూతి అనే విశేష వరదానము ఉంది. కాబట్టి అనుభవం స్వయం కూడా చేస్తారు మరియు డ్రామానుసారంగా డబల్ విదేశీయులకు బాప్‌దాదా ద్వారా కూడా అవ్యక్త పాలన యొక్క విశేష వరదానము లభించింది. కానీ తీసుకోవడంలో కూడా ముందంజలో ఉన్నారు. అందుకని బాప్‌దాదా డబల్ ప్రియస్మృతులను ఇస్తున్నారు. వీరు ముందుకు వెళ్లడానికి ఒక విశేష కారణం ఉంది. ఊరికే వరదానము లభించలేదు, ఏదో ఒక కారణంతో లభిస్తుంది. కాబట్టి వీరి ప్రత్యేకత ఏంటంటే ఏదైనా సరే, మంచిది కానీ లేదా చెడు కానీ, స్పష్టవాది. లోపల ఒకటి, బయట ఇంకొకటి ఉండరు. లోపల ఏది ఉందో, బయట అదే ఉంది. కాబట్టి స్పష్టంగా ఉండటం వల్ల త్వరగా ముందుకు అడుగు వేసేస్తారు. దాచేవారు కాదు. కాబట్టి ఈ స్పష్టవాదిగా అవ్వడం వల్ల విశేషంగా అవ్యక్త పాలన యొక్క వరదానానికి అధికారులుగా అయ్యారు మరియు అవుతూ ఉంటారు. అర్థమైందా!
కాబట్టి మీరు కూడా ఎంత స్పష్టవాదిగా ఉంటారో అంత ఎక్కువ అనుభవం చేస్తారు. స్పష్టవాదిగా అవ్వడం అంటే సహజ శ్రేష్ఠంగా అవ్వడం. ఈ వరదానము స్వతహాగానే లభిస్తుంది.
ఆంధ్రప్రదేశ్: ఆంధ్రాలో కూడా సెంటర్లు చాలా ఉన్నాయి కదా! ఆంధ్రా వారు ఏమి చేస్తారు? ఆంధ్రా వారు కమాల్ చేసేవారు. (మధ్యలోనే చప్పట్లు కొట్టారు) దీనితోనే కమాల్ చేయడంలో తెలివైనవారని నిరూపణ అవుతుంది. కాబట్టి ఆంధ్రా వారు ఈ కమాల్ చేయాలి - సదా డబల్ లైట్ అయి ఎగరాలి మరియు ఎగిరించాలి. నీ ఎగురుతున్న కళ వలన ఇతరులకు మేలు. స్వయం కూడా ఎగురుతున్న కళ మరియు ఇతరులను కూడా ఎగురుతున్న కళలోకి తీసుకువెళ్లడంలో అందరికంటే ముందుకు వెళ్లాలి. తమ భారమును కూడా సెకండులో సమాప్తం చేసుకునేవారు మరియు ఇతరుల భారమును కూడా సమాప్తం చేసి ఎగిరించేవారు. ఇప్పుడు ఎగురుతున్న కళ యొక్క కమాల్ ఆంధ్రా చూపిస్తుంది. ధైర్యము ఉందా? అయితే 6 నెలల్లో మొత్తం ఆంధ్రా జోన్లో ఏ విఘ్నము రాకూడదు. సాధ్యమేనా? ఇప్పుడు ‘హా’ ( సరే) అనడం లేదు, ఏదైనా గందరగోళం ఉందా? తొలగించలేరా? కాబట్టి ఆంధ్రా ప్రైజ్ తీసుకోవాలి. 6 నెలల తర్వాత ఆంధ్రా వారు ప్రైజ్ తీసుకుంటారా?
6 నెలల తర్వాత అందరికీ ప్రైజ్ ఇస్తాము. ఏ వరదానము లభించిందో, దానిలో ఎవరైతే పాస్ అవుతారో వారికి ప్రైజ్ లభిస్తుంది. ముందు పాస్ అవుతారు, తర్వాత ప్రైజ్ లభిస్తుంది. కాబట్టి ఫుల్ పాస్ అవ్వాలి. మళ్ళీ ఏమి చేయాలి, అనుకోలేదు, అయిపోయింది... అని అనకూడదు, భాష మార్చేయండి - కావడమే సాధ్యం కాదు. అంత నిశ్చయము ఉందా? మంచిది. కొత్త కమాలు చేసి చూపిస్తారు కదా! అప్పుడు బాబా అంటారు - పాతవారు పాతవారే, కొత్తవారు బాబా సమానంగా ఉంటారు. కాబట్టి ముందుకు వెళ్లడానికి ఈ వరదానము తీసుకోవాలి కదా!
మంచిది, మిగిలినది మధుబన్ నివాసులు మరియు జ్ఞాన సరోవర్. బాప్‌దాదా ముందే చెప్పారు, ఆబూలో అందరికీ ప్రియస్మృతులను ఇవ్వడానికి ఐదు ముఖాల బ్రహ్మా ఉన్నారు, బ్రహ్మావత్సలు ఉన్నారు. ఒకటి మధుబన్, రెండవది జ్ఞాన సరోవర్, మూడవది హాస్పిటల్, నాలుగవది తలహటి మరియు ఐదవది ఆబూ నివాసులు. కాబట్టి ఐదు ముఖాల బ్రహ్మావత్సలు. ఐదుగురికీ బాప్‌దాదా సదా ఉల్లాస-ఉత్సాహాల రెక్కలతో ఎగిరేవారు మరియు ఇతరులను కూడా ఎగిరించేవారు - ఇలాంటి విశేష వరదానము లేదా ప్రియస్మృతులను ఇస్తున్నారు. కాబట్టి మధుబన్ నివాసులకు విశేష ఉల్లాస-ఉత్సాహాల రెక్కలు సదా తొడిగి ఉంటాయి. ఉల్లాస-ఉత్సాహాల రెక్కలు ఎప్పుడూ బలహీనపడవు. దీనికి ప్రూఫ్ జ్ఞాన సరోవర్‌లో రెక్కలు తొడిగారు కదా! ఎవరు చూసినా ఏమి అంటారు? కమాల్! కాబట్టి ఉల్లాస-ఉత్సాహాల రెక్కల యొక్క ప్రాక్టికల్ ప్రూఫ్ జ్ఞాన సరోవర్. ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్దది తయారవుతుందని మీరు అనుకున్నారా? సాధారణంగా ఎవరైనా ఆలోచించగలరా? కాబట్టి జ్ఞాన సరోవర్ వారు లేదా మధుబన్ వారు ఉల్లాస-ఉత్సాహాల రెక్కలతో ఎగిరించేవారు కూడా, ఎగిరేవారు కూడా. బాప్‌దాదా జ్ఞాన సరోవర్ యొక్క సేవాధారులకు విశేషంగా దీవెనలతో నిండిన ప్రియస్మృతులను ఇస్తున్నారు. ప్రత్యేకత ఏమిటంటే నిశ్చయబుద్ధి ఉన్నవారు. ఎంతమంది ఎలా కదిలించినా, డేట్ నాటికి తయారు అవుతుందా? అవ్వదు అని అన్నాగానీ జ్ఞాన సరోవర్ వారు నిశ్చయబుద్ధి నంబర్‌వన్. జ్ఞాన సరోవర్ వారు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు. అచ్ఛా, మన విశేష సేవాధారులు కూడా వచ్చారు. మంచిది, అందరి ధైర్యము, అందరి ఉత్సాహము, కార్యాన్ని ముందుకు నడిపిస్తోంది, అందుకని బాప్‌దాదా ప్రేమ అనే మసాజ్ చేస్తూ ఉంటారు. మధుబన్ వారు అంటే సదా తాజా భోజనం తినేవారు. ఫ్యాక్స్ ద్వారా లేదా టైప్ ద్వారా తినేవారు కాదు, తాజా సరుకు తినేవారు. మధుబన్ వారు శరీరంతో కింద ఉన్నారు, (హాల్ ఫుల్ అవ్వడం వల్ల పాండవ భవన్లో మురళిని వింటున్నారు) మనస్సుతో బాప్‌దాదా ఎదురుగా పైన ఉన్నారు. ఇలా అయితే నలువైపులా ఉన్న పిల్లల హృదయము అనే టీ.వీ. తెరిచి ఉంది, దానిలో చూస్తున్నారు. దేశం కావచ్చు, విదేశం కావచ్చు, పిల్లలందరూ అవ్యక్త రూపంలో మిలనము చేసుకుంటున్నారు. కాబట్టి చూడండి, మీరు విశేషంగా లక్కీ, మొదటి ఛాన్స్ మీకు లభించింది. మంచిది- అందరూ సంతుష్టంగా ఉన్నారు కదా? సంతుష్టంగా ఉన్నారు మరియు ఉంటారు కూడా. మంచిది!
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ భాగ్యవిధాత యొక్క భాగ్యవాన్ ఆత్మలకు, సదా మన్జీత్, జగత్జీత్ యొక్క నిశ్చయం మరియు నషాలో ఉండేవారికి, సదా ప్రతి గుణము, శక్తి మరియు జ్ఞానం యొక్క అనుభవీ ఆత్మలకు, సదా తండ్రిని తోడుగా పెట్టుకునే కంబైండ్ స్వరూప ఆత్మలకు, సదా శ్రేష్ఠ భాగ్య రేఖను సహజంగా శ్రేష్ఠంగా తయారుచేసుకునే వారికి, ఇటువంటి అతి సమీప మరియు శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
