‘‘బ్రాహ్మణ జన్మ యొక్క ఆది వరదానము - స్నేహము యొక్క శక్తి’’
ఈరోజు నలువైపులా ఉన్న సర్వ పిల్లల యొక్క స్నేహంతో నిండిన స్మృతులు సమర్థుడైన బాప్‌దాదా వద్దకు స్నేహ సాగరము సమానంగా చేరుకున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయంలో హృదయాభిరాముడు ఇమిడి ఉన్నారు మరియు హృదయాభిరాముడి హృదయంలో సర్వ స్నేహీ పిల్లలు ఇమిడి ఉన్నారు. స్నేహము చాలా పెద్ద శక్తి.
• స్నేహం యొక్క శక్తి శ్రమను సహజము చేస్తుంది. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ శ్రమ ఉండదు. శ్రమ మనోరంజనముగా అయిపోతుంది. ఆటలా అనిపిస్తుంది.
• స్నేహం యొక్క శక్తి దేహాన్ని మరియు దేహం యొక్క ప్రపంచాన్ని క్షణంలో మరపింపజేస్తుంది. స్నేహంలో ఏది మర్చిపోవాలనుకుంటే దానిని మర్చిపోగలరు, ఏది గుర్తు పెట్టుకోవాలనుకుంటే దానిలో ఇమిడిపోతారు.
• స్నేహం యొక్క శక్తి సహజంగా సమర్పణ చేయిస్తుంది.
• స్నేహం యొక్క శక్తి తండ్రి సమానంగా చేస్తుంది.
• స్నేహం సదా ప్రతి సమయంలో పరమాత్మ తోడును అనుభవం చేయిస్తుంది.
• స్నేహం సదా స్వయంపై తండ్రి ఆశీర్వాదాల హస్తాన్ని ఛత్రఛాయ సమానంగా అనుభవం చేయిస్తుంది.
• స్నేహం అసంభవాన్ని ఎంత సహజంగా సంభవం చేస్తుందంటే కార్యము జరిగే ఉందని అనిపిస్తుంది.
• స్నేహము ప్రతి సమయము నిశ్చింతతను అనుభవం చేయిస్తుంది.
• స్నేహము ప్రతి కర్మలో నిశ్చిత విజయీ స్థితిని అనుభవం చేయిస్తుంది. ఇటువంటి స్నేహం యొక్క శక్తిని అనుభవం చేస్తున్నారు కదా?
బాప్‌దాదాకు తెలుసు, అనేక జన్మలు, అనేక రకాలుగా శ్రమించి అలిసిపోయిన ఆత్మలు మీరు. భిన్న-భిన్న బంధనాలలో బంధించబడి ఉన్న ఆత్మలైన కారణంగా శ్రమ చేస్తూ ఉన్నారు, అందుకే బాప్‌దాదా శ్రమ నుండి ముక్తులుగా అయ్యేందుకు సహజ విధి అయిన స్నేహం యొక్క శక్తిని పిల్లలందరికీ వరదానముగా ఇస్తారు. తమ బ్రాహ్మణ జీవితం యొక్క ఆది కాలాన్ని గుర్తు తెచ్చుకోండి. జన్మించడంతోనే అందరికీ స్నేహం యొక్క శక్తియే కొత్త జీవితాన్ని ఇచ్చింది. స్నేహం యొక్క అనుభూతి కోసం శ్రమ చేసారా? శ్రమ చేయవలసి వచ్చిందా? సహజంగా అనుభవం చేసారు కదా. మరి ఈ ఆది జన్మ యొక్క అనుభూతియే వరదానము. ప్రేమలోనే మీరు మైమరచిపోయారు. సదా ఈ స్నేహం యొక్క వరదానాన్ని స్మృతిలో ఉంచుకోండి. శ్రమ అనిపించే సమయంలో ఈ వరదానం ద్వారా శ్రమను పరివర్తన చేయగలరు. బాప్‌దాదాకు పిల్లలు శ్రమ పడటం మంచిగా అనిపించదు. స్నేహ శక్తి యొక్క విస్మృతి శ్రమను అనుభవం చేయిస్తుంది.
ఎంత పెద్ద పరిస్థితి అయినా గానీ, ఎటువంటి పరిస్థితి అయినా గానీ, ప్రేమతో, స్నేహంతో పరిస్థితి రూపీ పర్వతము కూడా పరివర్తన అయి నీటి సమానంగా తేలికగా అవ్వగలదు. రాయిని నీటిలా చేయగలరు. మాయ యొక్క ఎటువంటి భయంకర రూపమైనా లేక రాయల్ రూపమైనా ఎదుర్కున్నప్పుడు క్షణంలో స్నేహ సాగరంలో ఇమిడిపోతే, అప్పుడు ఎదుర్కొనే మాయ యొక్క శక్తి సమాప్తమైపోతుంది. మీ ఇముడ్చుకునే శక్తి ఛూ-మంత్రంగా కాక శివ-మంత్రంగా అయిపోతుంది. అందరి వద్ద శివ-మంత్రపు శక్తి ఉంది కదా లేక పోగొట్టుకున్నారా? శివ స్నేహంలో ఇమిడిపోండి, కేవలం మునకలు వేసి బయటకు రాకండి. కొద్ది సమయం స్మృతిలో ఉంటారు - మధురమైన బాబా, ప్రియమైన బాబా అని మునకలు వేసి మళ్ళీ బయటకు వచ్చేస్తారు, అప్పుడు మాయ దృష్టి పడుతుంది. మునిగిపోండి, అప్పుడు మాయ యొక్క దృష్టి నుండి దూరమైపోతారు. ఏమీ రాకపోయినా కూడా స్నేహం యొక్క శక్తి జన్మ యొక్క వరదానము. ఆ వరదానంలో నిమగ్నమైపోండి. నిమగ్నమైపోవడము రాదా? స్నేహమైతే సహజమైనది కదా! అందరికీ అనుభవమే కదా! బ్రాహ్మణ జీవితంలో ఆత్మిక స్నేహం యొక్క అనుభవం లేనివారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా?
• స్నేహమే సహజ యోగము, స్నేహంలో ఇమిడిపోవడమే సంపూర్ణ జ్ఞానము.
• ఈరోజు యొక్క మహత్వము కూడా స్నేహమే.
అమృతవేళ నుండి విశేషంగా ఏ అలలో తేలి ఆడుతున్నారు? బాప్‌దాదా యొక్క స్నేహంలోనే తేలి ఆడుతున్నారు. ఆత్మలందరిలో ఒక్క తండ్రి తప్ప ఇంకేమైనా గుర్తుందా? సహజ స్మృతి ఉంది కదా? లేక శ్రమించవలసి వచ్చిందా? మరి సహజంగా ఎలా అయింది? స్నేహం కారణంగా. మరి కేవలం ఈ రోజు మాత్రమే స్నేహపూరితమైనదా? సంగమయుగం ఉన్నదే పరమాత్మ స్నేహం యొక్క యుగము. కావున యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని స్నేహం యొక్క అనుభూతులను అనుభవం చేసుకోండి. స్నేహ సాగరుడు స్నేహం యొక్క వజ్రాలను-ముత్యాలను పళ్ళాలలో నింపి ఇస్తున్నారు. కావున స్వయాన్ని సదా నిండుగా చేసుకోండి. కొద్దిపాటి అనుభవంలోనే సంతోషపడిపోకండి. సంపన్నంగా అవ్వండి. భవిష్యత్తులోనైతే స్థూల వజ్రాలు-ముత్యాలతో అలంకరించబడతారు. పరమాత్మ ప్రేమ యొక్క ఈ వజ్రాలు-ముత్యాలు అమూల్యమైనవి, కావున వీటితో సదా అలంకరించబడి ఉండండి.
నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్మృతి, స్నేహం యొక్క పాటలను బాప్‌దాదా సదా వింటూనే ఉంటారు కానీ ఈరోజు విశేషంగా స్నేహ స్వరూపులైన పిల్లలకు స్నేహానికి రిటర్న్‌గా సదా స్నేహీ భవ, సదా స్నేహపు వరదానం ద్వారా సహజంగా ఎగిరే కళ యొక్క వరదానాన్ని విశేషంగా మళ్ళీ ఇస్తున్నారు. సదా ఎలాగైతే చిన్న పిల్లలు ఎటువంటి కష్టమైన విషయం వచ్చినా లేక ఎటువంటి పరిస్థితి వచ్చినా ఏ విధంగా మాతా-పితల ఒడిలో ఇమిడిపోతారో, అలాగే క్షణంలో స్నేహపు ఒడిలో ఇమిడిపోయినట్లయితే శ్రమ నుండి విముక్తులవుతారు. క్షణంలో ఎగిరే కళ ద్వారా బాప్‌దాదా వద్దకు చేరుకున్నట్లయితే ఎటువంటి స్వరూపంలో వచ్చే మాయ అయినా దూరం నుండి కూడా మిమ్మల్ని ముట్టుకోలేదు ఎందుకంటే పరమాత్మ ఛత్రఛాయ లోపలకే కాదు, దూరం నుండి కూడా మాయ యొక్క ఛాయ రాజాలదు. కావున పిల్లలుగా అవ్వడము అనగా మాయ నుండి సురక్షితులుగా అవ్వడము. పిల్లలుగా అవ్వడమైతే మంచిదే కదా. పిల్లలుగా అవ్వడము యొక్క అర్థమే స్నేహంలో ఇమిడిపోవడము. అచ్ఛా!
నలువైపులా ఉన్న హృదయాభిరాముని హృదయంలో ఇమిడిపోయి ఉండే పిల్లలకు, సదా శ్రమను ప్రేమలోకి పరివర్తన చేసే శక్తిశాలి ఆత్మలకు, సదా పరమాత్మ స్నేహపు సంగమయుగమును మహాన్‌గా అనుభవం చేసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్నేహం యొక్క శక్తితో తండ్రి తోడును మరియు ఆశీర్వాదాల చేతిని అనుభవం చేసుకొని ఇతరులకు కూడా అనుభవం చేయించే విశేష ఆత్మలకు, సదా స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉండే సమాన పిల్లలకు స్నేహ సాగరుడైన బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో కలయిక:- ఈరోజు ఏమేమి గుర్తుకు వచ్చాయి? విశేషంగా విల్ పవర్ యొక్క చేయి గుర్తుకు వచ్చిందా? విల్ పవర్ అన్ని కార్యాలను సహజం చేసేస్తుంది. బ్రహ్మా తండ్రి ఎక్కువగా గుర్తుకు వచ్చారా లేక బాప్‌దాదా ఇరువురూ గుర్తున్నారా? అయినా కూడా బ్రహ్మా తండ్రి స్మృతి యొక్క చరిత్రలు విశేషంగా అందరికీ గుర్తుకు వచ్చాయి. ఎప్పుడైతే బాప్‌దాదా ఇరువురూ కంబైండ్‌గా అయ్యారో, అప్పుడే బ్రహ్మా బ్రహ్మాతండ్రిగా అయ్యారు. పరమాత్మ ప్రవేశించినప్పుడే బ్రహ్మా యొక్క కర్తవ్యము కూడా ప్రారంభమయ్యింది. ఈ అవ్యక్త స్వరూపం యొక్క అవ్యక్త రూపం యొక్క చరిత్రలు కూడా అతీతమైనవి మరియు ప్రియమైనవి. 25 సంవత్సరాల సేవ యొక్క చరిత్రను ఆది నుండి గుర్తు చేసుకోండి, ఎంతటి తీవ్ర గతితో కూడిన చరిత్ర అది. అవ్యక్తమవ్వడము అనగా తీవ్ర గతితో సర్వ కార్యాలు జరగడము. సమయం యొక్క పరివర్తన కూడా తీవ్ర గతితో మరియు సేవ యొక్క వృద్ధి కూడా తీవ్ర గతితో జరిగింది. వేగంగా జరిగింది కదా! అందుకే అవ్యక్తమవ్వడం ద్వారా సమయానికి కూడా తీవ్ర గతి కలిగింది, అలాగే సేవకు కూడా తీవ్ర గతి లభించింది. అవ్యక్త పాత్రలో వచ్చే ఆత్మలకు కూడా పురుషార్థంలో తీవ్ర గతి యొక్క భాగ్యము సహజంగానే లభించి ఉంది. అవ్యక్త పాత్రలో వచ్చిన ఆత్మలకు లాస్ట్ సో ఫాస్ట్, ఫాస్ట్ సో ఫస్ట్ అన్న వరదానము ప్రాప్తించింది. (సభతో)
వరదానాన్ని కార్యంలో వినియోగించండి, కేవలం స్మృతి వరకే పెట్టుకోకండి. సమయానుసారంగా వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురండి. వరదానాన్ని స్వరూపంలోకి తీసుకురావడం ద్వారా స్వతహాగానే తీవ్ర గతిని అనుభవం చేస్తారు. అవ్యక్త పాలన సహజంగానే శక్తిశాలిగా తయారుచేస్తుంది, అందుకే ఎంతగా ముందుకు వెళ్ళాలనుకుంటే అంతగా ముందుకు వెళ్ళగలరు. బాప్‌దాదాకు మరియు నిమిత్త ఆత్మలకు మీ అందరిపైనా విశేషంగా సదా ముందుకు ఎగురుతూ ఉండాలి అన్న ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇలా ఉంది కదా? దాదీల ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. కేవలం లాభాన్ని తీసుకోండి. లభించడమైతే చాలా లభిస్తోంది, తక్కువగా ఉపయోగిస్తున్నారు. కేవలం బుద్ధిలో పక్కకు పెట్టుకుంటూ ఉండకండి, తినండి, ఖర్చు చేయండి. ఉపయోగించడం వస్తుందా, ఖర్చు చేయడం వస్తుందా లేక కేవలం సంభాళించి పెట్టుకుంటున్నారా? చాలా బాగుంది, చాలా బాగుంది అని అనడము - ఇది సంభాళించి పెట్టుకోవడము. మంచిని స్వయం పట్ల మరియు ఇతరుల పట్ల కార్యంలో వినియోగించండి. ఇక్కడ ఖర్చు పెట్టడము అంటే పెంచుకోవడము. ఎలాగైతే ఈ రోజుల్లో ఫ్యాషన్ కదా, అమూల్యమైన వస్తువు ఏదైతే ఉంటుందో, దానిని ఎక్కడ పెడతారు? (లాకరులో). వాటిని ఉపయోగించరు, లాకరులో పెట్టుకొని సంతోషిస్తూ ఉంటారు. కావున అనేక సార్లు పాయింట్లు చాలా బాగున్నాయి, విధి చాలా బాగుంది అంటూ కేవలం బుద్ధి యొక్క లాకరులో చూసుకుంటూ సంతోషిస్తూ ఉంటారు. మరి మీరందరూ లాకరులో ఉంచుకుంటున్నారా లేక ఉపయోగిస్తున్నారా? అచ్ఛా!
పాండవ సైన్యం యొక్క స్థితి ఎలా ఉంది? (బాగుంది). కేవలం బాగుంది-బాగుంది అనేవారిగా అయితే లేరు కదా. ఎటువంటి సైన్యం తయారవ్వాలంటే క్షణంలో ఏ ఆర్డర్ అయితే లభిస్తుందో దానిని చేసేయాలి. ఇలా సిద్ధంగా ఉన్నారా? శక్తి సైన్యం సిద్ధంగా ఉందా? శక్తుల సేవ శక్తులది, పాండవుల సేవ పాండవులది. పాండవుల సహయోగము లేకుండా కూడా శక్తులు నడవలేరు, శక్తుల సహయోగము లేకుండా కూడా పాండవులు నడవలేరు.
(దాదీజీ మెక్సికో కాన్ఫరెన్స్ యొక్క సమాచారాన్ని బాప్‌దాదాకు వినిపించారు)
బాగుంది, సైన్సువారు పనిలో నిమగ్నమయ్యే ఉన్నారు. ప్రయోగాలు చేయడంలో సైన్స్ వారు తెలివైనవారు కదా. వారిలో ఒక్కరైనా మంచిగా, యోగిగా మరియు ప్రయోగిగా అయినా చాలా పెద్ద మైక్ యొక్క పని చేస్తారు.
(లాస్ ఏంజిలిస్‌లో భూకంపం వచ్చింది) ఈ సమయం యొక్క తీవ్ర గతికి గుర్తులను ఎప్పటికప్పుడు ప్రకృతి చూపిస్తుంది. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1 - ఫలము యొక్క కోరికను విడిచి దయా హృదయులుగా అయి శుభ భావన యొక్క బీజాన్ని వేస్తూ ఉండండి
బాప్‌దాదా ద్వారా సర్వ పిల్లలకు ఈ సంగమయుగంలో విశేషంగా ఏ ఖజానా లభించింది? ఖజానాలైతే చాలా ఉన్నాయి కానీ విశేష ఖజానా సంతోషమనే ఖజానా. కావున సంతోషమనే ఖజానా ఎంత శ్రేష్ఠమైనది లభించింది! ఇది సదా తోడుగా ఉంటుందా లేక అప్పుడప్పుడు పక్కకు కూడా తప్పుకుంటుందా? లెక్కలేనంతగా లభించినప్పుడు అన్నివేళలా ఖజానాను కార్యంలో వినియోగించాలి కదా. అవసరమైనప్పుడు పనికి వస్తుందని మనుష్యులు పక్కకు తీసి పెట్టుకుంటారు. కానీ మీ వద్దనైతే అపారంగా ఉంది. ఈ జన్మ విషయం విడిచిపెట్టండి, కానీ అనేక జన్మలు ఈ సంతోషపు ఖజానా తోడుగా ఉంటుంది. లెక్కలేనంతగా ఉంది కాబట్టి ఉపయోగించండి కదా. బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ప్రాణాలు పోయినా కానీ సంతోషం పోకూడదు అందుకే, సంతోషాన్ని ఎప్పుడూ పక్కకు పెట్టకండి, ఇంకా మహాదానులుగా అవ్వండి ఎందుకంటే వర్తమాన సమయంలో ఏదైనా లభించగలదు కానీ సత్యమైన సంతోషము లభించలేదు. అల్పకాలికమైన సంతోషాన్ని పొందేందుకు మనుష్యులు ఎంత సమయాన్ని లేక ధనాన్ని ఖర్చు చేస్తారు, అయినా కూడా సత్యమైన సంతోషము లభించదు. కావున ఇటువంటి అవసరమైన సమయంలో ఆత్మలైన మీరు మహాదానులుగా అవ్వాలి. ఎటువంటి అశాంత ఆత్మ అయినా, దుఃఖిత ఆత్మ అయినా ఒకవేళ వారికి సంతోషం యొక్క అనుభూతిని కలిగించినట్లయితే ఎంతగా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను ఇస్తారు. మీరు దాత పిల్లలు, కావున విశాలహృదయంతో పంచండి, పంచడమైతే వస్తుంది కదా? మరి ఎందుకు పంచడం లేదు? సమయాన్ని చూస్తున్నారా? హృదయపూర్వకంగా దయ కలగాలి. ఎవరైతే అశాంతిలో, దుఃఖంలో భ్రమిస్తున్నారో వారు మీ పరివారమే కదా. పరివారానికి సహయోగము ఇవ్వడం జరుగుతుంది కదా. కావున వర్తమాన సమయంలో మహాదానులుగా అయ్యేందుకు విశేషంగా దయా హృదయులుగా అయ్యే గుణాన్ని ఇమర్జ్ చేయండి. మీ జడ చిత్రాలు వరదానాలను ఇస్తున్నాయి. కావున మీరు కూడా చైతన్యంలో దయా హృదయులుగా అయి పంచుతూ ఉండండి ఎందుకంటే వారు పరవశ ఆత్మలుగా ఉన్నారు. వీరైతే వినేవారు కాదు, వీరైతే నడిచేవారు కాదు అని ఎప్పుడూ భావించకండి. అలా కాదు, మీరు దయా హృదయులుగా అవ్వండి, ఇస్తూ ఉండండి. భావనకు తగినట్లుగా ఫలము లభిస్తుందని గాయనం చేయబడింది. కావున ఆత్మలకు జ్ఞానము పట్ల, యోగము పట్ల శుభ భావన లేకపోయినా కానీ మీ యొక్క శుభ భావన వారికి ఫలమును ఇస్తుంది. ఇంత సేవ చేసాము కానీ ఫలమైతే లభించనే లేదు అని ఈ విధంగా ఆలోచించకండి. ఫలాలు ఒకే విధంగా ఉండవు. కొన్ని సీజన్ ఫలాలు ఉంటాయి, మరికొన్ని సదా పండే ఫలాలు ఉంటాయి. కావున సీజన్ యొక్క ఫలము సీజన్లోనే ఫలము ఇస్తుంది కదా. మరి మీరు శుభ భావన యొక్క బీజాన్ని వేసారు, ఒకవేళ సీజన్ యొక్క ఫలమైతే సీజన్లోనే వెలువడుతుంది కదా. మామూలుగా చూస్తే, ఎవరైతే వ్యవసాయం చేస్తారో, వారు ఏదైతే సీజన్లో వెలువడేది ఉంటుందో దాని కోసం, ఇది 6 నెలల తర్వాత వెలువడుతుంది, అందుకే బీజాన్ని వేయనే వద్దు అని ఈ విధంగా ఆలోచించరు. కావున మీరు కూడా బీజాలను వేస్తూ వెళ్ళండి. సమయానికి సర్వ ఆత్మలు మేల్కోవలసిందే. మీ దయా భావన, శుభ భావన ఫలమును తప్పకుండా ఇస్తుంది. ఒకవేళ ఎవరైనా వ్యతిరేకిస్తున్నా కూడా మీరు మీ దయా భావనను వదలకూడదు, ఇంకా ఈ వ్యతిరేకత లేక అవమానము, నిందలు, ఇవి ఎరువులా పని చేస్తాయి అని భావించాలి. కావున ఎరువులు పడడం ద్వారా మంచి ఫలము వెలువడుతుంది. ఎంతగా నిందిస్తారో, అంతగా మీ గుణాలను గానం చేస్తారు, అందుకే ప్రతి ఆత్మకు దాతగా అయ్యి ఇస్తూ ఉండండి. మంచిగా ఉన్నారని భావిస్తేనే ఇస్తాము, అలా కాదు. అలా అయితే తీసుకునేవారిగా అయ్యారు! తీసుకునే కోరికను పెట్టుకోకండి - వారు మంచిగా మాట్లాడాలి, మంచివారిగా భావించాలి అప్పుడు ఇస్తాము. అలా కాదు. వీరినే దాత పిల్లలైన మాస్టర్ దాతలు అని అంటాము. వృత్తి ద్వారా కానీ, వైబ్రేషన్ల ద్వారా కానీ, వాణి ద్వారా కానీ ఇస్తూ ఉండండి. ఇంతగా నిండుగా ఉన్నారు కదా? అన్ని ఖజానాలు ఉన్నాయా?
డబల్ విదేశీయులను చూసి బాప్‌దాదా డబల్ సంతోషిస్తారు, ఎందుకు? డబల్ పురుషార్థం చేస్తారు. ఒకటేమో, తమ ఆచార-వ్యవహారాలను పరివర్తన చేసేందుకు పురుషార్థము కూడా చేస్తారు. బాప్‌దాదా చూస్తారు, ఉల్లాస ఉత్సాహాలు మెజారిటీలో మంచిగా ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా ఉల్లాస-ఉత్సాహాలు మధ్య-మధ్యలో పైకి కిందికి అయినట్లయితే ఈరోజు విధి వినిపించాము - ఇమిడిపోండి, స్నేహము యొక్క ఒడిలో దాగిపోండి, అప్పుడు మాయ రానే రాదు. ఇదైతే సహజమే కదా. బీజ రూపంగా అవ్వడంలో శ్రమ ఉంది, దీనిలో శ్రమ ఉండదు. ఇంకేమీ రాకపోయినా కానీ స్నేహంలో ఇమిడిపోవడమైతే వస్తుంది కదా లేక ఇది కష్టమా? (కాదు) కావున ఇది చేయండి. ఇప్పుడు కష్టము అన్న పదాన్ని అనకండి. కిందికి వచ్చినట్లయితే చిన్న వస్తువు కూడా పెద్దగా అనిపిస్తుంది. పైకి వెళ్ళినట్లయితే పెద్ద వస్తువు కూడా చిన్నగా అనిపిస్తుంది. మీరు ఫరిశ్తాలా లేక సాధారణ మనుష్యులా? (ఫరిశ్తా). ఫరిశ్తాలు ఎక్కడ ఉంటారు? పైన ఉంటారా లేక క్రిందనా? (పైన). మరి కింద ఎందుకు ఉంటున్నారు, మంచిగా అనిపిస్తుందా? అప్పుడప్పుడు కిందకు రావాలని మనసుకు అనిపిస్తుందా? లేదు, మరి ఎందుకు వస్తారు? తండ్రి తోడును విడిచిపెడతారు అప్పుడు కిందకు వస్తారు.
మరి డబల్ విదేశీయులకు డబల్ పురుషార్థం యొక్క ప్రత్యక్ష ఫలము డబల్ అవకాశము ఉంది. దీని లాభాన్ని తీసుకోండి. ఈ సంవత్సరం ఏం చేస్తారు? డబల్ సేవ. మహాదానిగా-వరదానిగా అవుతారా లేక స్వయం తండ్రి ఎదురుగా శక్తిని ఇవ్వండి, ఇతరులకు కూడా శక్తులను ఇవ్వండి అని అంటారా? బాగుంది, ధైర్యము పెట్టడంలో నంబరు తీసుకున్నారు ఇప్పుడు తీవ్ర పురుషార్థం చేసి ముందుకు ఎగురుతూ ఉండండి.
గ్రూప్ నం. 2 - ఒకే బలం, ఒకే నమ్మకం ద్వారా సదా ఏకరస స్థితిని అనుభవం చేసుకోండి
అందరూ ఒకే బలం, ఒకే నమ్మకాన్ని అనుభవం చేసుకుంటున్నారా? ఒకే బలం, ఒకే నమ్మకం కలవారి గుర్తు ఏమిటి? ఒకే బలం, ఒకే నమ్మకంలో ఉండే ఆత్మ సదా ఏకరస స్థితిలో స్థితి అయి ఉంటుంది. ఏకరస స్థితి అనగా సదా అచలంగా ఉండటం, అలజడి ఉండదు. మరి అలా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు అలజడి, అప్పుడప్పుడు అచలంగా ఉంటున్నారా? అలజడి సమయంలో ఒకే బలం, ఒకే నమ్మకం అని అంటారా లేక అనేక బలాలు, అనేక నమ్మకాలు అని అంటారా? ఒక్క బాబా ద్వారా సర్వశక్తులు ప్రాప్తించినప్పుడు ఒకే బలం, ఒకే నమ్మకం కావాలి కదా. ఒక్కరిని మర్చిపోతేనే అలజడి కలుగుతుంది. మరి అచలంగా ఉండేవారే కదా?
ఇక్కడ మీ స్మృతిచిహ్నం ఏది? అచల్ ఘర్ లేదా హల్చల్ ఘర్? లేక అచల్ ఘర్ అప్పుడప్పుడు హల్చల్ ఘర్‌గా అయిపోతుందా! స్మృతిచిహ్నం మీదే కదా. మరి అలజడిలోకి ఎందుకు వస్తున్నారు? ప్రాక్టికల్దే స్మృతిచిహ్నంగా తయారైంది కదా. కావున సదా ఒకే బలం, ఒకే నమ్మకంలో ఉండేవారము అని గుర్తుంచుకోండి. ఎందుకంటే భక్తిలో అనేకమందిపై నమ్మకం ఉంచి అనుభవం చేసుకున్నారు కదా, మరి ఏమి లభించింది? అన్నీ పోగొట్టుకున్నారు కదా. సత్యయుగం యొక్క అంతటి ధనాన్ని ఎక్కడ పోగొట్టుకున్నారు? భక్తిలో పోగొట్టుకున్నారు కదా. బాగా అనుభవం చేసుకున్నారు కదా. కావున ఎప్పుడైనా ఇటువంటి అలజడి కలిగించే పరిస్థితి వచ్చినప్పుడు మీ స్మృతిచిహ్నమైన అచల్ ఘర్ను గుర్తు చేసుకోండి. స్మృతిచిహ్నమే అచల్ ఘర్ అయినప్పుడు నేను అలజడిలోకి ఎలా రాగలను! ఇది సహజంగా గుర్తుకొస్తుంది కదా.
ఏకరస స్థితి యొక్క అర్థమే ఒక్కరి ద్వారా సర్వ సంబంధాల, సర్వ ప్రాప్తుల రసాన్ని అనుభవం చేసుకోవడం. మరి అనుభవం అవుతోందా లేక మధ్యమధ్యలో ఇంకేదైనా సంబంధం ఆకర్షిస్తోందా? సర్వ సంబంధాలను ఒక్కరి ద్వారానే అనుభవం చేసుకున్నప్పుడు ఇతర సంబంధాల వైపు ఆకర్షణ కలిగే విషయమే ఉండదు. సర్వ సంబంధాల అనుభవం ఉందా లేక కొన్ని సంబంధాల అనుభవమే ఉందా? సర్వ సంబంధాలతో బాబాను మీవారిగా చేసుకున్నారా లేక ఏదైనా సంబంధాన్ని పక్కన పెట్టేసారా? అన్నీ ఉన్నాయా లేక ఒకటి-రెండింటి వైపు అటెన్షన్ వెళ్తుందా? కొందరికి సోదరునిపై, కొందరికి పిల్లలపై, కొందరికి మనవడిపై! లేదా? బాధ్యత నిర్వర్తించడం వేరే విషయం, ఆకర్షితమవ్వడం వేరే విషయం. మరి నష్టోమోహాగా ఉన్నారా? పాండవులకు డబ్బు సంపాదించడంలో మోహం లేదా? ట్రస్టీగా ఉండి సంపాదించడం వేరే విషయం. మమకారంతో సంపాదించడం, మోహంతో సంపాదించడం వేరే విషయం.
ఎప్పుడైనా ధనంపై మోహం వెళ్తుందా? కొద్దిగా-కొద్దిగా వెళ్తుందా? ఏమవుతుంది, ఎలా అవుతుంది, జమ చేసుకుందాం, ఏదైనా చేసుకుందాం, ఎన్ని సంవత్సరాల తరువాత వినాశనం అవుతుందో తెలియదు, పది సంవత్సరాలు పడుతుందా లేక 50 సంవత్సరాలు పడుతుందా... ఇలా అనిపించదా? నష్టోమోహాగా అయ్యి, ట్రస్టీగా నడవడం మరియు మోహంతో నడవడం మధ్య ఎంత తేడా ఉంది! నష్టోమోహా యొక్క గుర్తు ఏమిటి? సంపాదించడంలో, ధనాన్ని సంభాళించడంలో ఎప్పుడూ దుఃఖపు అల రాదు. అప్పుడప్పుడు తక్కువ, అప్పుడప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు దుఃఖపు అల వస్తుందా? మనవడు-మనవరాలు కొద్దిగా అనారోగ్యానికి గురైతే దుఃఖపు అల వస్తుందా? నష్టోమోహాగా ఉన్నారా? ఏది జరిగినా నిశ్చింతగా ఉన్నారా? నష్టోమోహా అనగా దుఃఖం మరియు అశాంతి యొక్క నామ-రూపాలు కూడా లేకపోవడం. ఇలా ఉన్నారా లేక అవ్వాలా? కావున ఒకే బలం, ఒకే నమ్మకం అనగా కొద్దిగా కూడా దుఃఖపు అల యొక్క అలజడి ఉండకూడదు. సదా ఒకే బలం, ఒకే నమ్మకం కలవారము మరియు ముందు కూడా సదా అలాగే ఉంటాము అనే స్మృతి స్వరూపులుగా ఉండండి. నేనే ఉండేవాడిని, నేనే ఉన్నాను మరియు నేనే అవుతాను అనే సంతోషం ఉండాలి. అచ్ఛా!
గ్రూప్ నం. 3 - స్థితికి ఆధారం స్మృతి, స్మృతిని పరివర్తన చేసి కర్మలో శ్రేష్ఠతను తీసుకురండి
అందరూ మిమ్మల్ని మీరు సంగమయుగీ పురుషోత్తమ ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? పురుషోత్తములు అనగా పురుషులలో ఉత్తమ పురుషులు. కావున ఇప్పుడు సాధారణంగా లేరు, పురుషోత్తములు. ఎందుకంటే బ్రాహ్మణులు అనగా శ్రేష్ఠులు. బ్రాహ్మణులను సదా ఉన్నతంగా చూపిస్తారు. ముఖ వంశావళిగా చూపిస్తారు కదా. కావున బ్రాహ్మణులుగా అయ్యారు అనగా శ్రేష్ఠంగా అయ్యారు. సాధారణ పురుషులు పురుషోత్తమ ఆత్మలైన మిమ్మల్ని పూజిస్తారు, ఎందుకంటే బ్రాహ్మణులు అనగా పవిత్రంగా అయ్యారు కదా. పవిత్రతకే పూజ జరుగుతుంది. సాధారణ ఆత్మ కూడా పవిత్రతను ధారణ చేస్తే మహాన్ ఆత్మ అని పిలువబడుతుంది. మరి మీరందరూ పవిత్ర ఆత్మలే కదా లేక మిక్స్ ఆత్మలా? కొద్దిగా అపవిత్రత, కొద్దిగా పవిత్రత! కాదు. పవిత్ర ఆత్మలుగా అయ్యారు. కావున పవిత్రతయే శ్రేష్ఠత. పవిత్రతయే పూజ్యం. మరి మనం పూజారుల నుండి పూజ్యులుగా అయ్యాము అనే నషా ఉంటుందా? బ్రాహ్మణుల పవిత్రత యొక్క గాయనం ఉంది. ఏదైనా శుభకార్యం ఉంటే బ్రాహ్మణులతో చేయిస్తారు. అశుభ కార్యాన్ని బ్రాహ్మణులతో చేయించరు. బ్రాహ్మణులు అశుభకార్యం చేస్తే వీరు పేరుకే బ్రాహ్మణులు, పనిలో కాదు అని అంటారు. మరి మీరు నామధారులా లేక కర్మధారులా? నామధారి బ్రాహ్మణులు అయితే చాలామంది ఉన్నారు. కానీ మీరు పేరు ఎలా ఉందో పని కూడా అలాగే చేసేవారు. సాధారణ ఆత్మలు కాదు, విశేష ఆత్మలు. ఈ సంతోషం ఉంది కదా. నిన్న సాధారణంగా ఉండేవారు మరియు ఈరోజు విశేషంగా అయ్యారు. కావున విశేష ఆత్మగా భావిస్తే ఎటువంటి స్మృతి ఉంటుందో అటువంటి స్థితి ఉంటుంది మరియు ఎటువంటి స్థితి ఉంటుందో అటువంటి కర్మలు ఉంటాయి. స్థితి బలహీనంగా ఉన్నప్పుడు కర్మలు ఎలా ఉంటాయో చెక్ చేసుకోండి. కర్మలో కూడా బలహీనత వచ్చేస్తుంది మరియు స్థితి శక్తిశాలిగా ఉంటే కర్మలు కూడా శక్తిశాలిగా ఉంటాయి. కావున స్థితికి ఆధారం స్మృతి. స్మృతి సంతోషంతో కూడినదైతే స్థితి కూడా సంతోషంగా ఉంటుంది. కర్మలు కూడా సంతోషంగా చేస్తారు. ఫౌండేషన్ స్మృతి. కావున బాబా స్మృతిని మార్చారు. సాధారణం నుండి విశేష ఆత్మలుగా అయ్యారు కావున స్మృతి ఛేంజ్ అయింది. కర్మలు సాధారణమైనవైనా కానీ సాధారణ కర్మలో కూడా విశేషత ఉండాలి. ఉదాహరణకు భోజనం తయారు చేస్తున్నారు, ఇది సాధారణ కర్మే కదా, అందరూ చేస్తారు. కానీ మీరు భోజనం తయారు చేయడానికి మరియు ఇతరులు భోజనం తయారు చేయడానికి తేడా ఉంటుంది కదా. మీ స్మృతితో తయారైన భోజనానికి మరియు సాధారణ భోజనానికి తేడా ఉంది. అది ప్రసాదం, ఇది భోజనం. కావున విశేషత వచ్చేసింది కదా. స్మృతిలో ఉండి ఏ భోజనం తింటారో లేదా తయారు చేస్తారో దానిని బ్రహ్మా భోజనం అని అంటారు. కావున పురుషోత్తమ విశేష ఆత్మలుగా అయ్యాము, ఇక సాధారణ కర్మలు చేయలేము అని సదా గుర్తుంచుకోండి.
గ్రూప్ నం. 4 - సదా విఘ్న వినాశకులుగా అయ్యేందుకు మీ మస్తకంపై పరమాత్ముని హస్తాన్ని అనుభవం చేసుకోండి
బాంబేలో అందరికంటే ఎక్కువగా ఎవరి పూజ జరుగుతుంది? గణేశునిది. గణేశుడిని విఘ్న వినాశకుడు అని అంటారు. మీరందరూ విఘ్న వినాశకులేనా? ఏ విఘ్నానికైనా వశమైతే అవ్వడం లేదు కదా? విఘ్న వినాశకులుగా ఎవరు అవుతారు? ఎవరిలో సర్వశక్తులు ఉన్నాయో వారే విఘ్న వినాశకులు. కావున సర్వశక్తులు మీ జన్మసిద్ధ అధికారము. నేను మాస్టర్ సర్వశక్తిమంతుడిని అనే నషాను సదా ఉంచుకోండి మరియు సర్వశక్తులను సమయానుసారంగా కార్యంలో ఉపయోగించండి. సమయానికి కార్యంలో ఉపయోగించకుండా, సమయం గడిచిపోయిన తరువాత ఇలా చేసి ఉండాల్సింది అని ఆలోచించడం కాదు. మరి అందరూ విఘ్న వినాశకులేనా? మేము మాస్టర్ విఘ్న వినాశకులము అని నషాతో చెప్పండి. మాయ ఎన్ని రూపాల్లో వచ్చినా కానీ మీరు నాలెడ్జ్‌ఫుల్‌గా అవ్వండి. మాయ గురించి కూడా నాలెడ్జ్ ఉంది కదా. బాగా అర్థం చేసుకున్నారా లేక అప్పుడప్పుడు భయపడిపోతారా, కొత్త రూపంగా భావిస్తారా? మాయను చూసి భయపడతారా? అప్పుడప్పుడు ఓటమి, అప్పుడప్పుడు దాడి - ఇలా అయితే లేదు కదా? మాయ జన్మ ఎలా జరుగుతుందో తెలుసా? మాయ జన్మ ఇలా జరుగుతుందని తెలిసి కూడా జన్మనిచ్చేస్తున్నారు! మాయతో ప్రేమ ఉందా? కావున నాలెడ్జ్‌ఫుల్ ఆత్మ ఎప్పుడూ మాయ చేతిలో ఓడిపోదు. మాయాజీత్ అనే టైటిల్ ఉంది, మాయ చేతిలో ఓడిపోయేవారు కాదు. బాప్‌దాదా యొక్క హస్తం మరియు తోడు సదా ఉన్నాయి కావున సదా మాయాజీత్. మరి సదా తోడు ఉందా లేక అప్పుడప్పుడు ఒంటరిగా కూడా అయిపోతున్నారా? కంబైండ్‌గా ఉంటారు కదా. మీ మస్తకంపై సదా బాబా ఆశీర్వాదాల హస్తాన్ని అనుభవం చేసుకోండి. ఎవరి పైన పరమాత్ముని హస్తం ఉందో వారు విఘ్న వినాశకులుగా ఉంటారు కదా. ఎవరి పైన ఆశీర్వాదాల హస్తం ఉందో వారు సదా నిశ్చితంగా మరియు నిశ్చింతగా ఉంటారు. అందరి మస్తకంపై విజయ తిలకం పెట్టబడి ఉంది. ఇది అవినాశీ తిలకం. కావున విజయ తిలకధారులు అనగా విఘ్న వినాశకులు. సదా అమృతవేళ విజయ తిలకాన్ని స్మృతిలోకి తీసుకురండి. భక్తులు కూడా ప్రతిరోజూ తయారై తిలకం తప్పకుండా పెట్టుకుంటారు. మీకైతే అవినాశీ తిలకం ఉంది.
అందరూ సదా సంతోషంగా ఉంటున్నారా లేక సంతోషం అప్పుడప్పుడు తగ్గుతూ, అప్పుడప్పుడు పెరుగుతూ ఉంటుందా? బ్రాహ్మణ జీవితానికి ఆహారం సంతోషం. మరి సదా ఆ ఆహారాన్ని తీసుకుంటున్నారా లేక అప్పుడప్పుడే తీసుకుంటున్నారా? అదృష్టంవంతులుగా ఉన్నారు మరియు సంతోషం అనే ఆహారాన్ని తీసుకునేవారు మరియు సంతోషాన్ని పంచేవారు - ఇది గుర్తుంటుందా? నా అంతటి అదృష్టవంతులు మరెవరూ ఉండలేరు అని హృదయం నుండి వస్తుందా? మొత్తం విశ్వంలో ఇంకెవరైనా ఉన్నారా? లండన్ మహారాణి లేదా అమెరికా ప్రెసిడెంట్ ఉన్నారా? ఎవరూ లేరా? లండన్ రాణి మీకు కిరీటం, సింహాసనం ఇస్తే తీసుకుంటారా? తీసుకోరా? ఇప్పుడు కూడా తీసుకోండి, భవిష్యత్తులో కూడా తీసుకోండి. సింహాసనంపై కూర్చుంటే ఆర్డర్ అయితే చేస్తారు కదా. (బాబా యొక్క సింహాసనం లభించింది, ఆ సింహాసనం అవసరం లేదు) ఆ సింహాసనం ఈ రోజుల్లో సింహాసనం కాదు, కేవలం కంబము మాత్రమే. అంత నిశ్చింతగా ఉంటున్నారా! మీరు నిశ్చింత చక్రవర్తులు. ఇటువంటి నిశ్చింత జీవితాన్ని మొత్తం కల్పంలో ఈ సమయంలో అనుభవం చేసుకున్నట్లుగా మరే యుగంలోనూ అనుభవం చేసుకోరు. సత్యయుగంలో నిశ్చింతగా ఉంటారు కానీ ఇప్పుడు మీకు చింత అంటే ఏమిటి, నిశ్చింత అంటే ఏమిటి అనే జ్ఞానం ఉంది. అక్కడ ఈ జ్ఞానం ఉండదు.
బాంబేవారు డబల్ బేఫికర్ (డబల్ నిశ్చింతులు)! ఎందుకంటే బాంబేవారికి బాంబే పోయినా మనం మాత్రం బాగానే ఉంటాము అని తెలుసు. చూడండి, అలజడి జరుగుతుంది కానీ బ్రాహ్మణులు సేఫ్‌గా ఉంటారు. యోగయుక్త ఆత్మ స్వతహాగా సేఫ్‌గా అయిపోతుంది. మరి బాంబేవారు సముద్రం వచ్చేస్తుందేమో అని భయపడటం లేదు కదా! ముందుగానే నష్టోమోహాగా అయ్యారు. అచ్ఛా, బాంబేవారు ఏ కొత్త ప్లాన్ తయారు చేసారు? (కార్ యాత్రకు కొత్త ప్లాన్ తయారు చేసాము) దీని ద్వారా మైక్‌లు తయారవుతారు కదా? బాంబే విశ్వంలో బిజినెస్‌లో నంబర్‌వన్. మరి జ్ఞానం యొక్క బిజినెస్‌లో ఏ నంబర్? నంబర్‌వన్ కదా. నంబర్ టూ అయితే చంద్రవంశీయులు అయిపోతారు. నంబర్‌వన్ సూర్యవంశీయులు. మరి సూర్యవంశీయులా లేక చంద్రవంశీయులా? అన్నింటిలో నంబర్ ఉంటే ఇందులో వెనుక ఎలా ఉండగలరు. బాంబేవారు సాకార పాలన కూడా తీసుకున్నారు. ఇది కూడా బాంబే యొక్క భాగ్యం. ఇప్పుడు కూడా నిమిత్తంగా ఉన్న బాబా సమాన ఆత్మల పాలన లభిస్తోంది కదా. కావున ఇందులో కూడా నంబర్‌వన్‌గా ఉండండి. చూడండి, మళ్ళీ అప్పుడప్పుడు టూ, అప్పుడప్పుడు వన్‌గా అవ్వకండి. సదా నంబర్‌వన్‌గా ఉండండి. బాంబేవారిలో ధైర్యం బాగుంది. సేవా క్షేత్రంలో, ప్రతి కార్యంలో ధైర్యం ఉంచుతారు. ఎవరైతే ధైర్యం ఉంచుతారో వారికి బాబా యొక్క గుప్త సహాయం స్వతహాగా లభిస్తుంది. సహాయం యొక్క గుర్తు ఏమిటంటే ప్రతి కార్యం సహజంగా జరుగుతుంది. మరి సహజంగా అనిపిస్తుందా లేక అప్పుడప్పుడు కష్టంగా కూడా అనిపిస్తుందా? కష్టాన్ని సహజంగా చేసేవారు, ఇతరుల కష్టాన్ని తొలగించేవారు. కావున కష్టాన్ని సహజంగా క్రాస్ చేసేవారే విఘ్న వినాశకులు. అచ్ఛా!
గ్రూప్ నం. 5 - స్మృతి శక్తి ద్వారా సెకండులో మనస్సు-బుద్ధిని ఏకాగ్రం చేయడం మరియు సేవ ద్వారా ఖజానాలను పెంచడం - ఈ బ్యాలెన్సే బ్లెస్సింగ్స్ ప్రాప్తి చేసుకునేందుకు సాధనం
సదా స్మృతి మరియు సేవ రెండింటి బ్యాలెన్స్ ఉంచుకునేవారేనా? ఎందుకంటే స్మృతి ద్వారా ఏ శక్తులు లేదా గుణాల ప్రాప్తి కలుగుతుందో వాటిని సేవ ద్వారా ఇతరులకు ఇవ్వాలి. మరి రెండింటినీ బాగా చెక్ చేసుకుంటున్నారా? లేక ఎప్పుడైనా సేవ ఎక్కువగా ఉంటే యోగం తక్కువగా, ఎప్పుడైనా యోగం ఎక్కువగా ఉంటే సేవ తక్కువగా - ఇలా అయితే లేదు కదా? సేవ చేయడం ద్వారా లభించిన ఖజానాలు పెరుగుతాయి, మరి పెంచుకునే విధానం తెలుసు కదా? సేవలో తెలివైనవారా లేక స్మృతిలో తెలివైనవారా? స్మృతి శక్తి అంటే ఎక్కడ బుద్ధిని లగ్నం చేయాలనుకుంటే అక్కడ లగ్నమవ్వాలి. అటువంటి శక్తి ఉందా? ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ మీ బుద్ధిని లగ్నం చేయగలరా లేక టైమ్ పడుతుందా? ఎంత టైమ్‌లో లగ్నం చేయగలరు? ఎలాంటి వాయుమండలం ఉన్నా, ఎలాంటి వాయుమండలం మధ్యనైనా మీ మనస్సును, బుద్ధిని ఎంత సమయంలో ఏకాగ్రం చేయగలరు? (సెకండులో) చెబుతున్నారా లేక చేస్తున్నారా? చెప్పడం సహజమే కానీ ఏకాగ్రతా శక్తి ఉందా లేదా అనేది సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. పరిస్థితి గందరగోళంగా ఉన్నా, వాయుమండలం తమోగుణిగా ఉన్నా, మాయ తన శక్తితో మిమ్మల్ని తనవారిగా చేసుకునే ప్రయత్నం చేస్తున్నా, సెకండులో ఏకాగ్రం కాగలరా లేక టైమ్ పడుతుందా? ఈ అభ్యాసాన్ని సదా చేస్తూ ఉంటే సమయానికి శక్తిని కార్యంలో ఉపయోగించగలరు. దీనినే ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ స్థితి అవ్వగలగడం అని అంటారు. ఎంతగా వ్యర్థ సంకల్పాల తుఫాను ఉన్నా, సెకండులో ఆ తుఫాను ముందుకు వెళ్లేందుకు కానుకగా మారిపోవాలి. అటువంటి కంట్రోలింగ్ పవర్ ఉంటే, అటువంటి శక్తిశాలి ఆత్మకు ‘కావాలని అనుకోవడం లేదు, కానీ జరిగిపోతుంది’ అనే సంకల్పం కూడా రాదు. ఏది అనుకున్నారో అదే జరిగింది. ఇలా కాదు, జరగకూడదని అనుకుంటారు కానీ జరిగిపోతుంది. ఎందుకంటే సమయానికి ఏ శక్తినైనా కార్యంలో ఉపయోగించకపోతే ప్రాప్తికి బదులుగా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. కనుక ప్రాప్తి స్వరూపులుగా అవ్వండి. బాప్‌దాదా సర్వ ఆత్మలకు సర్వశక్తులను వారసత్వంగా ఇచ్చేసారు. మరి వారసత్వంగా లభించిన వస్తువు సదా గుర్తుంటుంది. నషాతో చెబుతారు కదా - ఈ శక్తులు మా జన్మసిద్ధ అధికారము అని.
సదా ‘ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు’ అనే అనుభవంలో ఉంటున్నారు కదా? కేవలం ఒక్కరే ఉన్నారా, లేక రెండవవారు-మూడవవారు కూడా అయిపోతున్నారా? ఒక్క బాబాయే ప్రపంచంగా అయిపోయారు. ఏ ఆకర్షణా లేదు, ఏ కర్మబంధనమూ లేదు. మీలోని ఏ బలహీన సంస్కారపు బంధనమూ లేదా? ఏదైనా బలహీన సంస్కారం ఉందా? ఏదైనా పాత సంస్కారం ఇప్పటికీ ఉందా? అప్పుడప్పుడు కొంచెం పెత్తనం చేస్తారా? అప్పుడప్పుడు చిన్నవారిపై పెత్తనం చేస్తారా? (క్రోధం వస్తుంది) క్రోధం అయితే పెత్తనం చేయడం కంటే కూడా పెద్దది. క్రోధం వస్తుందంటే దాని అర్థం కర్మబంధనం ఉంది. పాండవులలో క్రోధం వస్తుంది మరియు మాతలలో మోహం వస్తుంది. అభిమానం కూడా వస్తుంది - నేను పురుషుడిని, అప్పుడప్పుడు పిల్లలపై, అప్పుడప్పుడు మాతలపై నేను పెద్దవాడిని అనే అభిమానం వస్తుంది. అధికారం చూపిస్తారా - ఇది ఎందుకు చేసారు! నాది అని భావిస్తున్నారా? సేవలో సహచరులు, అంతేకానీ ‘నాది’ అనే అధికారం లేదు. నాది అని భావించడం వల్లనే క్రోధం, అభిమానం లేదా మోహం వస్తాయి. నాది కాకపోతే క్రోధం కూడా రాదు. మాతలూ, పిల్లలపై క్రోధం చేస్తారా? వారు చాలా అల్లరి చేసినప్పుడు క్రోధం చేయరా?
బాబాయే ప్రపంచం, నా బాబా అయినప్పుడు మిగిలిన ‘నాది-నాది’ అంతా ఒక్క ‘నా బాబా’లో ఇమిడిపోతుంది. మరి ఇప్పుడు హృదయంలో ఏమి వస్తుంది? నాదా లేక నీదా? భక్తిలో ‘నీది’ అని అంటారు కానీ ‘నాది’ అని భావిస్తారు కదా, అలా మీరు చేయడం లేదు కదా. నాది అనే భావమే భారం, మరి భారాన్ని వదిలేయడం మంచిదే కదా. కనుక సదా ఇదే గుర్తుంచుకోండి - మనం స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉంచుకునే, బాబా బ్లెస్సింగ్స్‌కు అధికారులైన ఆత్మలం.
గ్రూప్ నం. 6 - సంతుష్టంగా ఉండాలనే దృఢ సంకల్పం చేసుకుంటే సఫలత సదా తోడుగా ఉంటుంది
అందరూ శబ్దానికి అతీతంగా ఉండడాన్ని సహజంగా అనుభవిస్తున్నారా లేక శబ్దంలోకి రావడాన్ని సహజంగా అనుభవిస్తున్నారా? సహజమైనది ఏది? శబ్దంలోకి రావడమా లేక శబ్దానికి అతీతంగా అవ్వడమా? శబ్దానికి అతీతంగా అవ్వడం అంటే అశరీరి స్థితిని అనుభవించడం. మరి దేహభానంలోకి రావడం ఎంత సహజమో, అంతే సహజంగా అశరీరిగా అవుతున్నారా లేక శ్రమ చేయవలసి వస్తుందా? సెకండులో శబ్దంలోకి వచ్చేస్తారు, కానీ సెకండులో ఎంత శబ్దంలో ఉన్నా, అది మీరైనా లేదా వాయుమండలం శబ్దంతో నిండి ఉన్నా, సెకండులో ఫుల్స్టాప్ పెట్టగలరా లేక కామా పడుతుందా, ఫుల్స్టాప్ పడదా? దీనినే ఫరిశ్తా లేదా అవ్యక్త స్థితి అనుభూతిలో ఉండడం, వ్యక్త భావం నుండి సెకండులో అతీతంగా అవ్వడం అని అంటారు. ఇందుకోసమే రోజంతటిలో ట్రాఫిక్ బ్రేక్ అభ్యాసం చేయాలనే నియమం పెట్టబడింది. ఇది ఎందుకు చేస్తారు? ఎంతగా నాలుగు వైపులా శబ్ద వాతావరణం ఉన్నా, ఒక్కసారిగా బ్రేక్ పడిపోయేంతగా అభ్యాసం పక్కా అవ్వాలి. ఆత్మ యొక్క ఆది లేదా అనాది లక్షణమే శాంతి, కనుక సెకండులో ‘మీ అనాది స్వరూపంలో స్థితి అవ్వండి’ అనే ఆర్డర్ వస్తే అలా అవ్వగలరా లేక టైమ్ పడుతుందా? చెప్పడం జరిగింది కదా - పెట్టాలనుకున్నది బిందువు, కానీ పడింది క్వశ్చన్ మార్క్ అయితే ఏమవుతుంది? దీనిని ఏ స్థితి అభ్యాసం అని అంటాము? అందరూ ఫరిశ్తా స్థితిని అభ్యాసం చేస్తున్నారా? ఇంకా అభ్యాసం చేయాలి, ఎంత సమయం కావాలంటే అంత సమయం ఆ విధితో స్థితి అవ్వగలగాలి. ఇప్పుడు చూడండి, ఏదైనా ప్రకృతి ఆపద లేదా పరిస్థితుల ఆపద వచ్చినప్పుడు అకస్మాత్తుగా వస్తుంది కదా, రోజురోజుకూ అకస్మాత్తుగా ఈ ప్రకృతి తన గందరగోళాన్ని పెంచుతూ పోతుంది. ఇది తగ్గేది కాదు, పెరగాల్సిందే. అకస్మాత్తుగా ఆపద వచ్చేస్తుంది. అటువంటి సమయంలో ఇముడ్చుకునే లేదా సర్దుకునే శక్తి అవసరం. బుద్ధి మరెక్కడికీ వెళ్లకూడదు, కేవలం బాబా మరియు నేను, బుద్ధిని ఎక్కడ లగ్నం చేయాలనుకుంటే అక్కడే లగ్నమవ్వాలి. ఎందుకు-ఏమిటి అనే వాటిలోకి వెళ్లకూడదు, ఇది ఏమైంది, ఇది ఎలా జరుగుతుంది, ఇలా జరగకూడదు, ఎలా జరిగిపోయింది - దీనిని బ్రేక్ అంటారా? కనుక ఎగిరే కళ కోసం బ్రేక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉండాలి. కొండపైకి ఎత్తుగా ఎక్కేటప్పుడు పదే పదే ఏమంటారు? బ్రేక్ చెక్ చేయండి, బ్రేక్ చెక్ చేయండి అని అంటారు. మరి ఉన్నత స్థితిలోకి వెళ్తున్నారు కదా, కనుక పదే పదే ఈ బ్రేక్‌ను చెక్ చేయండి. ఏ సంకల్పాన్నయినా లేదా సంస్కారాన్నయినా నెగెటివ్ నుండి పాజిటివ్‌గా పరివర్తన చేయగలరా మరియు ఎంత సమయంలో చేయగలరు? సమయం ఒక సెకండు, మీరు ఐదు సెకండ్లలో చేస్తే ఏమవుతుంది? కనుక ఈ పరివర్తనా శక్తిపై అటెన్షన్ ఉండాలి. మొదట స్వయాన్ని పరివర్తన చేసుకోండి, అప్పుడే విశ్వాన్ని పరివర్తన చేయగలరు. మరి స్వ-పరివర్తకులుగా అయ్యారా? మొదట స్వ-పరివర్తకులు, ఆ తరువాత విశ్వ పరివర్తకులు. ఎందుకంటే వ్యర్థ సంకల్పాల వేగం చాలా ఫాస్ట్‌గా ఉంటుందని అనుభవం ఉంటుంది. ఒక్క సెకండులో ఎన్ని వ్యర్థ సంకల్పాలు నడుస్తాయో అనుభవం ఉంది కదా. ఫాస్ట్‌గా నడుస్తాయి కదా. మరి అటువంటి ఫాస్ట్ వేగం ఉన్న సమయంలో పవర్ఫుల్ బ్రేక్ వేసి పరివర్తన చేసే అభ్యాసం కావాలి. మరి ఈ రోజు ఫరిశ్తాతనపు అభ్యాసం చేసారా? సహజంగా అనుభవమైందా లేక శ్రమ అనిపించిందా? ఇప్పుడు సర్వ ఆత్మలు శాంతి-సుఖాలను ఇచ్చే ఫరిశ్తా ఆత్మలైన మిమ్మల్ని స్మృతి చేస్తున్నారు - ఎవరైనా ఫరిశ్తాలు వచ్చి వరదానం ఇచ్చి వెళ్లాలని. మరి ఆ ఫరిశ్తాలు ఎవరు? మీరేనా? మనమే కల్ప-కల్పంలోని శ్రేష్ఠ ఆత్మలం అనే నషా ఉంటుంది కదా. ఈ పాత్రను ఎన్నిసార్లు అభినయించారు? గుర్తుందా లేక మర్చిపోయారా? ఫరిశ్తా స్వరూపం ఎంత ప్రియంగా ఉంటుంది. ఎందుకంటే ఫరిశ్తా దాతగా ఉంటారు, తీసుకునేవారిగా కాదు. మరి మీరు ఇచ్చే దాతలే కదా, లేక తీసుకుని ఇచ్చేవారా? బాబా నుండి తీసుకోవడం వేరే విషయం. ఇతర ఆత్మలు ఏదైనా ఇస్తే మీరు ఇస్తారా, అలా కాదు కదా? ఫరిశ్తా అంటే సంతుష్టంగా ఉండడం మరియు సంతుష్టపరచడం. మరి సంతుష్టంగా ఉంటారా లేక కొన్ని విషయాలలో అసంతుష్టంగా కూడా అవుతారా? ఏది తలక్రిందులైనా అసంతుష్టంగా అవుతారా? ఎవరైనా ఇన్సల్ట్ చేసినా సంతుష్టంగా ఉంటారా? ఎవరైనా తలక్రిందులు చేయడానికి ప్రయత్నించినా సంతుష్టంగా ఉంటారా? పక్కానా? ఏదైనా లోటు ఏర్పడినా సంతుష్టంగా ఉంటారా? చూడండి, ఆలోచించి సమాధానం చెప్పండి. ఏ టీచర్ అయినా మిమ్మల్ని తక్కువగా పట్టించుకున్నా, తక్కువగా మాట్లాడినా సంతుష్టంగా ఉంటారా లేక అసంతుష్టంగా అవుతారా? రికార్డు తెప్పించమంటారా? ఏది జరిగినా, దాత పిల్లలు దాతలు కనుక ఏ విషయంలోనూ అసంతుష్టంగా ఉండలేరు. సంతుష్టత బ్రాహ్మణుల విశేష లక్షణం. స్వయంతో కూడా సంతుష్టంగా మరియు ఇతరులతో కూడా సంతుష్టంగా. ఏ పాత్ర లభించిందో అందులో సంతుష్టంగా ఉండడమే ముందుకు వెళ్లడం. అలా సంతుష్టంగా ఉన్నారా? మాతలూ, సంతోషీ దేవిలే కదా? సంతోషీ మాత పూజ జరుగుతుంది, ఆమె ఎవరు? మీరే కదా. కనుక ఏది జరిగినా మీ విశేషతను సదా మీతో ఉంచుకోండి. దృఢ సంకల్పం ఉంటే, ఎక్కడ దృఢత ఉంటుందో అక్కడ సఫలత ఉండనే ఉంటుంది. సంతుష్టతను ఎప్పుడూ వదలకూడదనే దృఢ సంకల్పం ఉంచుకోండి, అప్పుడు సఫలత సదా మీతోనే ఉంటుంది. సంకల్పంలో కూడా దృఢత, మాటలో కూడా దృఢత మరియు కర్మలో కూడా దృఢత. సంకల్పం అయితే దృఢంగా చేసుకున్నాను కానీ కర్మలో కొంచెం తలక్రిందులైంది - ఇలా కాదు. ఈ సంవత్సరం సదా సంతుష్టంగా ఉండడం అంటే సఫలంగా ఉండడం, సఫలతను వదలకూడదు. ఎంత కఠినమైన పేపర్ వచ్చినా సంతుష్టంగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి. ఎందుకంటే మీ టైటిల్ విశ్వ కళ్యాణకారి.
ఈ రోజును స్మృతి దివసము మరియు సమర్థ దివసము అని అంటారు కదా, అలాగే సంవత్సరం అంతా సమర్థ దివసమును జరుపుకోండి. వ్యర్థం సమాప్తం. దృఢ సంకల్పం అంటే చాలా తీవ్ర పురుషార్థ సంకల్పాలు కలిగి ఉండడం. కనుక పురుషార్థులుగా కాదు, తీవ్ర పురుషార్థులుగా అవ్వాలి. అచ్ఛా!
ఎంత పెద్దదైనా, ఎలాంటి పరిస్థితి అయినా ప్రేమతో, స్నేహంతో పరిస్థితి రూపీ పర్వతాన్ని కూడా పరివర్తన చేసి నీటిలా తేలికగా చేయగలరు. రాయిని నీరుగా చేయగలరు. ఎలాంటి మాయ యొక్క వికరాళ రూపం లేదా రాయల్ రూపం ఎదురుగా వచ్చినా, సెకండులో స్నేహ సాగరంలో ఇమిడిపోండి, అప్పుడు ఎదుర్కొనే మాయ శక్తి సమాప్తమైపోతుంది. మీ ఇముడ్చుకునే శక్తి ‘ఛూ-మంత్రం’ కాదు, ‘శివ-మంత్రం’గా అయిపోతుంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
