‘‘బ్రాహ్మణుల స్వభావము విశేషతతో కూడిన స్వభావము - దీనిని సహజమైన స్మృతి స్వరూపముగా తయారు చేసుకోండి’’
ఈరోజు బాప్‌దాదా తమ సర్వ విశ్వం యొక్క విశేష ఆత్మలను చూస్తున్నారు. డ్రామానుసారంగా ఆత్మలైన మీది ఎంతటి విశేష పాత్ర రచించబడి ఉంది. ఈరోజు బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి విశేషతలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిని చూసి ‘వాహ్ పిల్లలు’ అన్న స్నేహపు గీతము హృదయంలో మోగుతోంది. దానితో పాటు ఇది కూడా చూస్తున్నారు, పిల్లల ప్రతి ఒక్కరి హృదయం నుండి ‘వాహ్-వాహ్’ అన్న గీతము సదా వెలువడుతోందా? ప్రతి కర్మలోను, ప్రతి అడుగులోను, ప్రతి సంకల్పములోను ఈ శ్రేష్ఠ అనుభవము కలుగుతోందా లేక అప్పుడప్పుడు కలుగుతోందా? సాధారణ జీవితం నుండి వేరుగా ఈ విశేష జీవితము సదా స్వతహాగా ఉంటుందా? లేక స్మృతి తెచ్చుకున్నప్పుడే అనుభవమవుతుందా? ఎప్పుడైతే జీవితము ఉందో, జీవితము యొక్క అర్థమే - సదా మరియు స్వతహాగా ఉండేది. స్మృతిలోకి తెచ్చుకున్నప్పుడు అనుభవం చేసుకోవడము మరియు స్మృతిలోకి తెచ్చుకోనప్పుడు విశేషతకు బదులుగా సాధారణ జీవితము అనుభవమవ్వడము - ఇది విశేష ఆత్మలైన మీ యొక్క విశేషత కాదు. బ్రాహ్మణ జన్మయే విశేష జన్మ. ఎవరి జన్మ అయితే విశేషముగా ఉంటుందో వారి జీవితము ఎలా ఉంటుంది? విశేషముగా ఉంటుందా లేక సాధారణంగా ఉంటుందా? బ్రాహ్మణ జన్మ కూడా శ్రేష్ఠమైనది, బ్రాహ్మణ ధర్మము కూడా శ్రేష్ఠమైనది మరియు బ్రాహ్మణ కర్మ కూడా శ్రేష్ఠమైనది ఎందుకంటే బ్రాహ్మణ జన్మ దాత, బ్రాహ్మణ ధర్మ స్థాపకులు, సర్వశ్రేష్ఠులైన పరమ ఆత్మ మరియు ఆది ఆత్మ అయిన బ్రహ్మా తండ్రి. ఏ విధంగా రచయిత సర్వశ్రేష్ఠమైనవారో, అలాగే రచన కూడా సర్వశ్రేష్ఠమైనది అనగా విశేషమైనది. బ్రాహ్మణుల కర్మ ఎందుకు విశేషమైనది? ఎందుకంటే కర్మలో అనుసరించేందుకు మీ అందరి ముందు ఆది ఆత్మ అయిన బ్రహ్మా తండ్రి శ్యాంపుల్ రూపంలో ఉన్నారు. కర్మలో సాకార బ్రహ్మా తండ్రిని అనుసరిస్తారు, అందుకే భాగ్యవిధాత అనగా కర్మ ద్వారా భాగ్య రేఖను శ్రేష్ఠముగా తయారుచేసేవారు బ్రహ్మా అని అంటూ ఉంటారు. భాగ్యం యొక్క రేఖకు కలము కర్మలు. కావున శ్రేష్ఠ కర్మకు సహజమైన చిహ్నము బ్రహ్మా తండ్రి, అందుకే మీరందరూ విశేష పురుషార్థము అనే పదాన్ని ఈ విధంగానే వర్ణిస్తారు - తండ్రి సమానంగా అవ్వాలి.
ఈ అవ్యక్త సంవత్సరంలో అందరి లక్ష్యము ఏముంది? నిరాకారీ స్థితిలో నిరాకారుడైన తండ్రి సమానంగా అశరీరి స్థితిని అనుభవం చేసుకున్నారా? సాకార కర్మలో బ్రహ్మా తండ్రి సమానంగా అయ్యే అనుభవాన్ని నంబరువారుగా చేసుకున్నారా? కావున విశేష జీవితానికి ఆధారము విశేష జన్మ, ధర్మము మరియు శ్రేష్ఠ కర్మ. ఏ విధంగా లౌకిక జీవితంలో కూడా ఒకవేళ ఏ ఆత్మ యొక్క జన్మ అయినా విశేష రాజ పరివారంలో జరిగినట్లయితే, వారు రాజకుమారులుగా లేక రాజకుమారీలుగా ఉన్నట్లయితే, ఈ విశేషత జన్మ యొక్క విశేషత అయిన కారణంగా ప్రతి సమయము సదా మరియు స్వతహాగా ఉంటుందా లేక నేను రాజకుమారిని అని పదే-పదే స్మృతిలోకి తీసుకువస్తారా? సహజంగా స్మృతి ఉంటుంది కదా. ఏమైనా పురుషార్థం చేస్తారా? తమ అభిరుచి కారణంగా కర్మ ఎంతటి సాధారణంగా ఉన్నా కానీ తమ జన్మ యొక్క విశేషతను ఏమైనా మర్చిపోతారా? అది సహజముగా మరియు స్వాభావికంగా అయిపోతుంది. కావున బ్రాహ్మణ ఆత్మలైన మీ యొక్క స్వభావం ఏమిటి? విశేషమైనవారా లేక సాధారణమైనవారా? ఇప్పుడు కూడా కొంతమంది పిల్లలు ఎప్పుడైనా సాధారణ కర్మలు చేసేస్తే బాప్‌దాదా ఎదురుగా స్వయాన్ని నిర్దోషులుగా నిరూపించుకునేందుకు ఏం చెప్తారు? ఈ కర్మ చేయాలి అని నేను అనుకోలేదు కానీ ఇది నా స్వభావము, అందుకే అలా జరిగిపోయింది అంటారు. వాస్తవానికి ఇలా అనడము లేక ఆలోచించడము యథార్థమైనదా? నేను ఎవరు? బ్రాహ్మణ జీవితము కలవారు కదా. మరి బ్రాహ్మణ జీవితము కల ఆత్మ, ఇది నా స్వభావము అని ఆలోచించవచ్చా? ఇలా అనడము రైటా? మరి ఆ సమయంలో ఎందుకు అలా అంటారు? ఆ సమయంలో మాట్లాడేది బ్రాహ్మణులు కాదు, మాయ మాట్లాడుతుంది. కావున ఈ సాధారణ స్వభావము లేక మాయావి స్వభావము సహజంగా పని చేసేస్తుంది కదా, అందుకే, నేను అలా కావాలనుకోలేదు, కానీ జరిగిపోయింది అని అంటారు. బ్రాహ్మణుల స్వభావం అనగా విశేషత యొక్క స్వభావం కూడా సహజంగా ఉండాలి. సహజ సిద్ధమైనది సదా ఉండగలదు. కావున విశేష జీవితం యొక్క స్మృతి స్వభావం రూపంలో సహజంగా ఉండాలా లేక అప్పుడప్పుడు మర్చిపోవడము, అప్పుడప్పుడు గుర్తుండడము, అలా ఉండాలా? సదా స్మృతి స్వరూపంలో ఉండండి. స్మృతిని తెచ్చుకునేవారిగా కాకుండా స్మృతి స్వరూపులుగా అవ్వండి, మరి బాప్‌దాదా చూసారు - అవ్యక్త సంవత్సరము సమయమనుసారంగా పూర్తయిపోయింది కానీ బాప్‌దాదా సమానంగా స్వయాన్ని సంపన్నంగా చేసుకున్నారా? ఈ అవ్యక్త సంవత్సరానికి విశేష లక్ష్యాన్ని పెట్టుకున్నారు - అవ్యక్తము అనగా ఫరిశ్తా స్వరూపంగా అవ్వాలి మరియు తయారుచేయాలి అని. అందరూ ఇదే లక్ష్యాన్ని పెట్టుకున్నారు కదా, మరి రిజల్టు ఏం వెలువడింది? మిమ్మల్ని మీరు చెక్ చేసుకున్నారా? ‘ఫరిశ్తా భవ’ అన్న వరదానము కూడా వరదాత నుండి లభించింది మరి వరదానము మరియు లక్ష్యము - రెండింటి స్మృతి ద్వారా ఎంతవరకు సఫలతను అనుభవం చేసుకున్నారు, ఈ స్వయము యొక్క సూక్ష్మ చెకింగ్‌ను చేసుకున్నారా? లేక అవ్యక్త సంవత్సరం పూర్తయింది, యథాశక్తి ఎంత అనుభవమైతే చేసుకున్నారో అంత డ్రామానుసారంగా సరి పోతుందిలే అని అనుకుంటున్నారా? సంవత్సరం పరివర్తన అవ్వడంతోపాటు స్వ పరివర్తన యొక్క గతి ఎలా ఉంది - ఈ విధితో చెక్ చేసుకున్నారా? ఏ విధంగా సంవత్సరం సమాప్తమయ్యిందో అలా స్వయం కూడా లక్ష్యము మరియు లక్షణాలలో సంపన్నంగా అయ్యారా లేక ఈ సంవత్సరంలో ఇంకా అవుతాము అని ఇలా ఆలోచిస్తున్నారా? సమయము మరియు స్వయం యొక్క గతి సమానంగా ఉందా? వాస్తవానికి స్వయం యొక్క గతి సమయంకన్నా తీవ్రంగా ఉండాలి ఎందుకంటే సమాప్తి యొక్క సమయాన్ని తీసుకురావడానికి విశేష ఆత్మలైన మీరు నిమిత్తులు. తీవ్ర గతితో సంవత్సరమైతే సంపన్నమైపోయింది. అసలు ఈ సంవత్సరం ఎలా పూర్తయిపోయిందో తెలిసిందా? కావున చెక్ చేసుకోండి, విశేష ఆత్మనైన నా పరివర్తన యొక్క గతి తీవ్రంగా ఉందా లేక అప్పుడప్పుడు తీవ్రంగా, అప్పుడప్పుడు మధ్యస్థంగా ఉందా?
ఎవరికైతే పాత సంస్కారాలతో మరియు ప్రపంచంతో సంబంధం ఉండదో, వారిని ఫరిశ్తా అని అంటాము. కావున చెక్ చేసుకోండి, పాత ప్రపంచంతో ఏదైనా ఆకర్షణ, సంబంధం రూపంలో కానీ, తమ దేహం వైపు ఆకర్షణ కానీ లేదా ఎవరైనా దేహధారి వ్యక్తి పైన ఆకర్షణ కానీ, ఏదైనా వస్తువుపై ఆకర్షణ కానీ ఎంత పర్సెంటేజ్ ఉంది? అలాగే పాత సంస్కారాల వైపు ఆకర్షణ, సంకల్ప రూపంలో కానీ, వృత్తి రూపంలో, వాణి రూపంలో, సంబంధ సంపర్కాలలో అనగా కర్మ రూపంలో ఎంత పర్సెంటేజ్ ఉంది? ఫరిశ్తా అనగా డబల్ లైట్. కావున వాస్తవమైన లైట్ స్వరూపము స్మృతి స్వరూపంలో ఎంతవరకు ఉంది? దానితోపాటు లైట్ అనగా తేలికదనము, స్వ పరివర్తన యొక్క పురుషార్థంలో ఎంతవరకు లైట్ అనగా తేలికగా ఉన్నారు? మనసు అనగా సంకల్ప శక్తిలో వ్యర్థాన్ని సమర్థములోకి పరివర్తన చేయడంలో అనగా వ్యర్థము యొక్క భారాన్ని తేలిక చేయడంలో ఎంతవరకు సఫలమయ్యారు? ఇదే రకంగా వ్యర్థ సమయము, వ్యర్థ సాంగత్యము, వ్యర్థ వాతావరణము - వీటన్నింటినీ ఎంతవరకు పరివర్తన చేయడంలో తేలికగా ఉన్నారు? బ్రాహ్మణ పరివారముతో సంబంధంలో, సేవ యొక్క సంబంధంలో ఎంతవరకు తేలికగా ఉన్నారు? దీన్నే ఫరిశ్తా స్వరూపము యొక్క తీవ్ర గతి యొక్క స్థితి అని అంటారు. ఈ విధితో చెక్ చేసుకోండి మరియు భవిష్యత్తు కోసం చేంజ్ అనగా పరివర్తన చేయండి. తమ బ్రాహ్మణ జన్మ యొక్క విశేషతను సహజమైన స్వభావంగా తయారుచేసుకోవడము, దీనినే సహజ పురుషార్థము అని అంటాము. కేవలం నేను ఒక విశేష ఆత్మను - ఈ స్మృతి స్వరూపంలో స్థితులవ్వండి, అప్పుడు తండ్రి సమానంగా అవ్వడము అతి సహజంగా అనుభవం చేస్తారు ఎందుకంటే స్మృతి స్వరూపము నుండి సమర్థ స్వరూపముగా అయిపోతారు. సంవత్సరమైతే పూర్తయిపోయింది. బాప్‌దాదా రిజల్టు అయితే చూస్తారు కదా. మరి రిజల్టులో యథాశక్తిగా మెజారిటీ ఉన్నారు మరియు యథాశక్తి యొక్క మెజారిటీతో పోలిస్తే సదా శక్తిశాలిగా ఉన్నవారు మైనారిటీలో ఉన్నారు.
స్మృతి దినమును కూడా చాలా స్నేహంతో జరుపుకున్నారు. ఇప్పుడు విశేషంగా ఎలాగైతే స్నేహంతో జరుపుకున్నారో, అలాగే స్నేహం యొక్క ఋజువులో తండ్రి సమానంగా స్మృతి స్వరూపముగా అవ్వాల్సిందే. రిజల్ట్ విన్నారా? ఇక ముందు ఏం చేయాలి? యథాశక్తిగా ఉండాలా లేక సదా శక్తి స్వరూపులుగా ఉండాలా? మరి చూస్తాము, ఈ సంవత్సరంలో మెజారిటీ సదా శక్తిశాలి యొక్క ఋజువును ఎంతవరకు ఇస్తారు?
టీచర్లు ఏం భావిస్తున్నారు? ఏ లైన్లోకి వస్తారు? సదా శక్తిశాలి! అందరిది టి.వి.లో ఫొటో తీయబడుతుంది. ఏం జరిగినా కానీ, ఎటువంటి పరిస్థితి ఏర్పడినా కానీ సదా శక్తిశాలి. పేర్లు నోట్ అవుతున్నాయి కదా, ఎవరెవరు ఏ గ్రూపులో వచ్చారు? ఇప్పుడు టీచర్ల యొక్క సమ్మేళనము జరగనున్నది కదా. అప్పటివరకు టీచర్లందరి రిజల్టు ఏముంటుంది? ఎవరికైతే చేసేది ఉందో, వారు ఎప్పుడో చేస్తాము అని ఆలోచించరు. దృఢ సంకల్పము యొక్క అర్థమే - ఇప్పుడు. సాధారణ సంకల్పం యొక్క అర్థము - ఎప్పుడో అవుతుందిలే! మరి ‘ఎప్పుడో’ అనేవారిగా ఉన్నారా లేక ‘ఇప్పుడు’ అనేవారిగా ఉన్నారా? శక్తి సైన్యము చాలా పెద్ద సైన్యము. ‘ఎప్పుడో’ అనేవారా లేక ‘ఇప్పుడు’ అనేవారా? పాండవులు ఏమని భావిస్తారు? చూడండి, అందరి పేర్లు నోట్ అయి ఉన్నాయి. ఇప్పుడు పేర్లను వినిపించము, ఆఖరుకు పేర్లను వినిపించే సమయము కూడా వస్తుంది. అర్థమైందా!
అందరికన్నా ఎక్కువ సంఖ్య ఏ జోన్ వారిది వచ్చింది? పంజాబ్, ఇండోర్ వారు ఏ అద్భుతాన్ని చేసి చూపిస్తారో చూస్తాము. టీచర్లు కూడా ఎక్కువగా వస్తారు, సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు టీచర్లు కూడా ఎక్కువగా ఉంటారు. పంజాబ్ వారు నంబర్‌వన్ తీసుకుంటారా లేక సెకండు నంబరా? ఇండోర్ వారు కూడా నంబర్‌వన్ తీసుకుంటారా? కర్నాటకవారు ఏం చేస్తారు? ఎటువంటి నాటకాన్ని చూపిస్తారు? కర్-నాటక్ (నాటకం చేసి చూపించండి), మరి హీరో నాటకాన్ని చూపించండి, అలాంటి-ఇలాంటి నాటకాన్ని చూపించకండి. మరియు మహారాష్ట్రవారైతే మహాన్గానే అవుతారు కదా? మరియు యు.పీ.ని ఏమంటారు? యు.పీ.లో నదులు ఉన్నాయి అనగా యు.పీ. పతితులను పావనంగా చేసేది. పావనంగా అవ్వడము-తయారుచేయడంలో నంబర్‌వన్. మరి యు.పీ.వారు కూడా నంబర్‌వన్ అవుతారు. ఈ సమయంలోనైతే ఎవరినీ నంబరు టూ అని అనము. రాజస్థాన్ అయితే ఉన్నదే లక్కీ, రాజస్థాన్‌లోనే చరిత్ర భూమి ఉంది. హెడ్ క్వార్టర్ రాజస్థాన్‌లో ఉంది కదా. మరి ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉందో అది ఏమవుతుంది? హెడ్ అవుతుంది కదా! అందరూ సంతోషంతో నంబర్‌వన్ అని అంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళి ఈ విధంగా అనకండి - ఏం చేయాలి... చేయలేకపోతున్నాము... కావాలనుకోవడం లేదు కానీ జరిగిపోతుంది... ఇలాంటి భాషను ఆలోచనలోకి కూడా తీసుకురాకండి. అచ్ఛా, డబల్ విదేశీయులు కూడా సేవలో మంచిగా రేస్ చేస్తున్నారు మరియు రేస్‌లో నంబర్‌వన్‌లోకి రావాలి కదా. దేశంలో ఉన్నవారికి ధైర్యాన్ని ఇవ్వడములో విదేశము మంచిగా నిమిత్తముగా అయ్యింది. ఈ ధైర్యాన్ని ఇప్పించిన కారణంగా ఎక్స్ట్రా సహాయం కూడా లభిస్తుంది. అర్థమైందా! దీనినే స్మృతిలో పెట్టుకొని సహజంగా ముందుకు వెళ్తూ ఉండండి మరియు ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న సర్వ విశేష ఆత్మలకు, సదా సాకార బ్రహ్మా తండ్రి యొక్క శ్రేష్ఠ కర్మలను ఫాలో చేసే కర్మయోగీ ఆత్మలకు, సదా విశేషతలను సహజము మరియు స్వభావముగా తయారుచేసుకునే కోటిలో ఏ కొందరిగానో ఉన్న ఆత్మలకు, సదా దృఢ సంకల్పము ద్వారా విశేష జన్మ, ధర్మము మరియు కర్మ యొక్క స్మృతి స్వరూప ఆత్మలకు బాప్‌దాదా యొక్క విశేషతా సంపన్నమైన ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో కలయిక:- బ్రాహ్మణులైన మీరు ఎంతగా సంపన్నముగా అవుతూ ఉంటారో, అంతగా భవిష్యత్తులో ప్రకృతి కూడా ప్రగతిని ప్రాప్తి చేసుకుంటుంది ఎందుకంటే ప్రకృతి ఎప్పటికప్పుడు తన సిగ్నల్‌ను చూపిస్తూ ఉంది. మరి ఎంత ప్రకృతి యొక్క అలజడి ఉందో, అంత స్థిరమైన స్థితి ప్రకృతిని పరివర్తన చేస్తుంది. ఎంతమంది ఆత్మలు ఎప్పటికప్పుడు దుఃఖము యొక్క అలలోకి వస్తారు. మరి అటువంటి దుఃఖితులైన ఆత్మలకు ఆధారము తండ్రి మరియు మీరే. కావున దయ కలుగుతుంది కదా. ఎప్పుడైతే సమాచారము వింటారో, అప్పుడు మనసులో ఏమనిపిస్తుంది? నథింగ్ న్యూ, తమ స్థిరమైన స్థితి ఉండడమైతే సరైనదే కానీ ప్రకృతి యొక్క అలజడిలో ఆత్మలు ఎప్పుడైతే ఆర్తనాదాలు చేస్తారో, వారు ఎవరి కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు? మరి ఎప్పుడైతే వారు దయ, కృప యాచిస్తున్నారో, అప్పుడు మీ వద్దకు దయ కోసం చేసే వారి పిలుపు చేరుకుంటుంది కదా! ఈ చిన్న-చిన్న ఆపదలు ఇంకా విలవిలలాడేలా చేస్తాయి. బ్రాహ్మణులు సంపన్నంగా అయితే దుఃఖం యొక్క ప్రపంచము సంపన్నమైపోతుంది. మరి దయ కలుగుతుందా లేదా? దయ కలుగుతున్నప్పుడు మరి ఏం చేస్తున్నారు? వారు కూడా ఈశ్వరీయ పరివారానికి చెందినవారే కదా. మరి పరివారం యొక్క ఎటువంటి దుఃఖమైనా సుఖంలోకి పరివర్తన చేసే సంకల్పమైతే వస్తుంది కదా. ఎవరైనా పరివారంలో వ్యాధిగ్రస్థులుగా అయితే ఏం సంకల్పము వస్తుంది? త్వరగా నయమైపోవాలి. ఆర్తనాదాలు చేస్తూ-చేస్తూ మరణించడము మరియు ఒక్క దెబ్బతో పరివర్తన జరగడము, తేడా అయితే ఉంది కదా. మహావినాశనము మరియు రిహార్సల్ యొక్క వినాశనము, తేడా ఉంది. మహావినాశనము అనగా మహాన్ పరివర్తన. దానికి నిమిత్తులుగా మీరు ఉన్నారు. సంపన్నులుగా అయినట్లయితే సమాప్తి జరుగుతుంది. మరి ఎవరైతే వ్యాకులతలో ఉన్నారో, వారు ప్రత్యక్షత యొక్క తెర తెరుచుకోవాలి అని భావిస్తారు, కానీ స్టేజిపైకి వచ్చే హీరో యాక్టరు సంపన్నంగా తయారవ్వాలి కదా, అప్పుడే తెర తెరుచుకుంటుందా లేక సగంలోనే తెరుచుకుంటుందా? పరివర్తన యొక్క శుభ భావనను తీవ్రము చేయడము అనగా స్వయాన్ని తీవ్ర గతితో సంపన్నంగా చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ఒకలా, ఇంకోసారి ఇంకోలా ఉంటే, ప్రకృతి కూడా ఒకసారి చాలా తీవ్ర గతితో కార్యం చేస్తుంది, ఇంకోసారి చల్లబడిపోతుంది. మరి ఇప్పుడేం చేయాలి? స్వయం పట్ల కానీ, సర్వాత్మల పట్ల కానీ దయాభావనను ఇమర్జ్ చేయండి. దయ కలుగుతుంది కదా! అలను వ్యాపింపజేయండి. దయా భావనతో విఘ్నాలు కూడా సహజంగానే సమాప్తమైపోతాయి. ఎక్కడైతే దయ ఉంటుందో, అక్కడ నీది-నాది అనే అలజడి ఉండదు. పూజ్య స్వరూపమును, దయాహృదయాన్ని ధారణ చేయండి. సరేనా. ఇప్పుడు ఈ అలను వ్యాపింపజేయండి. ప్రతి సంకల్పములో దయాహృదయము. సంకల్పంలో ఉన్నట్లయితే వాణి మరియు కర్మ స్వతహాగానే అయిపోతాయి. అందరూ ఏమని ఆర్తనాదాలు చేస్తారు? మర్సీ – మర్సీ (దయ చూపించండి-దయ చూపించండి). అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం. 1 - మాయ యొక్క ఛాయ నుండి రక్షించుకునే సాధనము బాప్‌దాదా యొక్క ఛత్రఛాయ
సదా స్వయాన్ని బాప్‌దాదా యొక్క ఛత్రఛాయ క్రింద ఉండేవారిగా సదా సురక్షితంగా ఉండే ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? సదా ఛత్రఛాయ ఉందా లేక అప్పుడప్పుడు బయటకు వెళ్ళిపోతున్నారా? అయితే తండ్రి ఛత్రఛాయ అయినా ఉంటుంది లేక మాయ ఛాయ అయినా ఉంటుంది. కావున మాయ యొక్క ఛాయ నుండి రక్షించుకునేందుకు సాధనము ఛత్రఛాయ. మరి ఛత్రఛాయలో ఉండేవారు ఎంత సంతోషంగా ఉంటారు ఎందుకంటే నిశ్చింతా చక్రవర్తులుగా అయ్యారు కదా. చింత ఉన్నట్లయితే సంతోషము మాయమైపోతుంది. ఎప్పుడైనా చూడండి, సంతోషము మాయమైపోతే కారణం ఏముంటుంది? ఏదో ఒక చింత, వ్యాకులత, భారము సంతోషాన్ని మాయం చేస్తాయి. సంతోషము మాయమై, బలహీనంగా అయినట్లయితే మాయ ఛాయ యొక్క ప్రభావము తప్పకుండా పడుతుంది. బలహీనత మాయను ఆహ్వానిస్తుంది. ఎలాగైతే శారీరక బలహీనత వ్యాధులను ఆహ్వానిస్తుందో, అలాగే ఆత్మిక బలహీనత మాయను ఆహ్వానిస్తుంది. తర్వాత ఆ ఛాయ నుండి బయటపడేందుకు ఎంతగా శ్రమ చేయవలసి వస్తుంది. ఒకవేళ మాయ యొక్క ఛాయ స్వప్నంలో పడితే స్వప్నం కూడా వ్యాకులపరుస్తుంది. అప్పుడు బ్రాహ్మణుల నుండి క్షత్రియులుగా అయిపోతారు, అప్పుడు యుద్ధం చేయవలసి వస్తుంది. క్షత్రియ జీవితం శ్రమతో కూడుకున్నది మరియు బ్రాహ్మణ జీవితం సంతోషంతో కూడుకున్నది. మరి ఏది ఇష్టము? అప్పుడప్పుడు యుద్ధం చేయవలసి వస్తుందా? యుద్ధం చేయడము మంచిగా అనిపిస్తుందా? చిన్నని వ్యర్థ సంకల్పము యొక్క ఛాయ అయినా ఎంతగా శ్రమ చేయిస్తుంది, అందుకే సదా తండ్రి స్మృతి అనే ఛత్రఛాయలో ఉండండి. స్మృతియే ఛత్రఛాయ. మరి సదా కాలము కోసం ఛత్రఛాయలో ఉండడం వస్తుందా? అప్పుడప్పుడు కోసం కాదు, సదా. అవినాశీ తండ్రి కదా. కావున వారసత్వం కూడా సదా కోసం తీసుకోవాలి. సదా సంతోషంలో ఉండేవారు. ఛత్రఛాయ అనగా సంతోషంలో ఉండడము. నిశ్చింతగా ఉంటారు కదా. అన్ని చింతలను తండ్రికి ఇచ్చేసారా లేదా ఒకటి-రెండు సంభాళించి పెట్టుకున్నారా? ఏం చేయాలి... ఎలా చేయాలి... ఈ పదాలు చింతకు సంబంధించినవి. నిశ్చింతగా ఉండేవారి పదాలు సదా విజయానికి చెందినవిగా ఉంటాయి. ‘ఏమిటి’, ‘ఎలా’ అని ఈ విధంగా ఉండవు. మరి ఎల్లప్పుడూ మేమందరము తండ్రి ఛత్రఛాయలో ఉండేవారము అని గుర్తు పెట్టుకోండి. అన్ని వైపులకు తిరిగి వచ్చేవారు కాదు. సంకల్పంలో కూడా అన్ని వైపులా తిరిగి వచ్చినట్లయితే అలా తిరిగి వచ్చేవారు నష్టపోతారు. మీరైతే అమరులు కదా. అమరులుగా అయ్యాము - ఈ స్మృతి సదా స్వయాన్ని కూడా నిశ్చింతగా మరియు ఇతరులను కూడా నిశ్చింతగా తయారుచేస్తూ ఉంటుంది. సదా సంతోషంలో పాటను పాడుతూ ఉంటారు - పొందాల్సినదేదో పొందేసాము. పిల్లలుగా అవ్వడము అనగా పొందడము. పిల్లలుగా అయ్యారు అంటే పొందేసారు. అచ్ఛా!
బనారస్ వారు ఏ అద్భుతం చేస్తున్నారు? బనారస్‌లో చాలా పెద్ద పెద్ద మైక్‌లు ఉన్నారు. మండలేశ్వరులు చాలా మంది ఉన్నారు కదా. మరి ఎవరైనా మహామండలేశ్వరులు సమీపంగా వస్తున్నారా? మీకు బదులుగా వారు మీ విశేషతను వర్ణించాలి. ఇప్పుడు ఇంతవరకు వచ్చారు, వీరి కార్యం కూడా మంచిదే అని అంటున్నారు కానీ ‘ఇదే మంచిది’ అని అనడం లేదు. ఇది కూడా ఉంది అని అంటున్నారు. ఇదే ఉంది అని అన్నప్పుడు ధ్వని బిగ్గరగా వ్యాపిస్తుంది. ఇప్పుడే చెప్పినట్లు కదా, 24 అవతారాలలో 25వదిగా దీనిని కూడా లెక్కించండి. మరి ఇది ఏమైంది? ఇది కూడా ఉందా లేక ఇదే ఉందా? ‘ఇదే ఉంది, ఇదే ఉంది’ అని అంటే దీనినే మైక్‌గా అయ్యి ధ్వనిని వ్యాపింపజేయడం అని అంటాము. ఎవరైనా అథారిటీ కలవారు, అథారిటీతో మాట్లాడితే మైక్ పని చేస్తారు. మరి ఇందులో నంబరు ఎవరు తీసుకుంటారో చూస్తాము? నలువైపులా ఈ పాట పాడడం మొదలుపెట్టాలి - ఇదే ఉంది, అది ఇదే. ఇది జరగాల్సిందే కదా. నిశ్చితంగా ఉంది. కేవలం నిమిత్తంగా అయ్యి రిపీట్ చేయాలి. అచ్ఛా, రాజస్థాన్ నుండి కూడా అనేక స్థానాల నుండి వచ్చారు. ఇప్పుడు రాజస్థాన్‌లో ఇంకా చుట్టుముట్టండి. ఇప్పుడు రాజస్థాన్‌లో చాలా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అచ్ఛా!
గ్రూప్ నం. 2 - అధీనతను సమాప్తం చేయడానికి అధికారం యొక్క ఆత్మిక నషాలో ఉండండి
సదా మిమ్మల్ని బాబా వారసత్వానికి అధికారులుగా, స్వరాజ్య అధికారులుగా మరియు దానితోపాటు విశ్వ రాజ్య అధికారులుగా అనుభవం చేసుకుంటున్నారా? ఎందుకంటే బాబా వారసత్వమే స్వరాజ్యం మరియు విశ్వ రాజ్యం. కనుక బాబా వారసత్వానికి అధికారులు అనగా స్వరాజ్య మరియు విశ్వ రాజ్య అధికారులు. ఈ విశ్వం మీ చేతులలోకి వస్తుంది. ఇప్పుడు అనేకుల చేతులలో ఉంది కదా. అందుకే విశ్వం కూడా అలజడిలో ఉంది. ఒక్కోసారి ఇక్కడికి దొర్లుతుంది, ఒక్కోసారి అక్కడికి దొర్లుతుంది. మీ చేతులలోకి వచ్చినప్పుడు అలజడి సమాప్తమై, ఏకరసంగా ఉంటుంది. విశ్వంపై ఎన్నిసార్లు రాజ్యం చేసారో గుర్తుకొస్తుందా! అనేకసార్లు చేసారు అని అనుభవం అవుతుందా? బుద్ధి కెమెరాలో మీ రాజ్యం యొక్క చిత్రం స్పష్టంగా వస్తుందా? లేక బాబా చెబుతున్నారు కనుక తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నారా? వర్తమానం ఎంత స్పష్టంగా ఉందో అంతే స్పష్టంగా ఉందా? ఎందుకంటే నిన్నటి విషయమే కదా. నిన్న ఉండేది, రేపు రాబోయేది. ఈ రోజు స్వరాజ్యం, రేపు విశ్వ రాజ్యం. ఈ రోజు రేపటి విషయమే కదా. కనుక అధికారీ ఆత్మ సదా ఆత్మిక నషాలో ఉంటుంది మరియు ఆ నషా పాత ప్రపంచాన్ని సహజంగా మరిపింపజేస్తుంది. స్థూల నషా అన్నింటినీ మరిపింపజేస్తుంది కదా. అది అల్పకాలికమైనది మరియు ఇది సదాకాలికమైనది. అధికారం యొక్క నషా ఉన్నప్పుడు కొత్త ప్రపంచం ముందు ఈ పాత ప్రపంచం ఏమనిపిస్తుంది? ఏమీ కాదు. పాత ప్రపంచాన్ని మర్చిపోవడం కష్టంగా అనిపించదు. అధికారీ ఎప్పుడూ అధీనంగా ఉండరు. ఏ విషయంలోనూ అధీనంగా ఉండరు. ఎక్కడ అధికారం ఉంటుందో అక్కడ అధీనత ఉండదు మరియు ఎక్కడ అధీనత ఉంటుందో అక్కడ అధికారం ఉండదు. అధికారాన్ని మర్చిపోయినప్పుడే అధీనమవుతారు. కనుక ఏ వస్తువుకు, వ్యక్తికి, సంస్కారానికి అధీనంగా అవ్వకూడదు.
మాతలకు కొద్దికొద్దిగా మోహం వస్తుందా? సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వస్తుందా? లేదు. ఎవరైనా ఎక్కువగా అనారోగ్యానికి గురైతే మోహం వస్తుందా? పాండవులకు ఏమి వస్తుంది? క్రోధం రాదా, ఆవేశం వస్తుందా? బాబా లభించారు, అన్నీ లభించాయి. కనుక ఈ హద్దు విషయాలు ఏమీ అనిపించవు. వదలాల్సిన అవసరం ఉండదు కానీ స్వతహాగానే వదిలిపోతాయి. శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు.
అచ్ఛా, ఇది వెరైటీ గ్రూప్. రంగురంగుల వెరైటీ పుష్పాల పుష్పగుచ్ఛం బాగుంది. కానీ ఈ సమయంలో మీరందరూ ఎక్కడివారు? ఈ సమయంలో అందరూ మధుబన్ నివాసులా లేక మీ మీ స్థానాలు గుర్తున్నాయా? ఈ సమయంలో అందరూ ఒక్కటే. మధుబన్ నివాసులుగా అవ్వడంలో ఆనందం వస్తుంది కదా? ఆనందం వస్తే మరి ఎందుకు వెళ్తారు? సేవ కోసం వెళ్తున్నాము అని చెప్పండి. మధుబన్ ప్రియమైనది కానీ సేవ కూడా ప్రియమైనది. కనుక ఎక్కడ ఉన్నా సేవార్థం ఉన్నాము అనే స్మృతి సదా ఉండాలి. లెక్కాచారాల కోసం కాదు, సేవార్థం. బ్రాహ్మణులు అనగా సేవాధారులు. సేవలో ఆనందం ఉంది కదా. ఇల్లు అని భావిస్తే బంధనం, సేవాస్థానం అని భావిస్తే సంతోషం. వెళ్తున్నా సేవార్థమే వెళ్తున్నారు. లెక్కాచారాల కోసం వెళ్ళడం లేదు. అచ్ఛా!
గ్రూప్ నం. 3 - హోలీహంసగా అయ్యేందుకు సాధనం - మనస్సు-బుద్ధి యొక్క స్వచ్ఛత మరియు జ్ఞాన రత్నాల ధారణ
సదా హోలీహంసలుగా అయ్యాము - ఇలా అనుభవం చేసుకుంటున్నారా? హోలీహంసలు కదా! మరి హంస ఏమి చేస్తుంది? హంస పని ఏమిటి? (ముత్యాలను ఏరుకోవడం) మరియు రెండవది? పాలు మరియు నీటిని వేరు చేయడం. ఒకటి జ్ఞాన రత్నాలను ఏరుకోవడం అనగా ధారణ చేయడం మరియు రెండవ విశేషత నిర్ణయ శక్తి యొక్క విశేషత. పాలు మరియు నీటిని వేరు చేయడం అనగా నిర్ణయ శక్తి యొక్క విశేషత. ఎవరిలో నిర్ణయ శక్తి ఉంటుందో వారు ఎప్పుడూ పాలకు బదులు నీటిని ధారణ చేయరు. పాల విలువ నీటి కంటే ఎక్కువ. కనుక పాలు మరియు నీరు అనగా వ్యర్థం మరియు సమర్థం యొక్క నిర్ణయం చేయడం. వ్యర్థాన్ని నీటితో సమానం అంటారు మరియు సమర్థాన్ని పాలతో సమానం అంటారు. మరి ఇటువంటి హోలీహంసలా? నిర్ణయ శక్తి బాగుందా? లేక ఒక్కోసారి నీటిని పాలు అని భావిస్తారా, ఒక్కోసారి పాలను నీరు అని భావిస్తారా? వ్యర్థాన్ని మంచిదిగా భావించి, సమర్థంలో బోర్ అయిపోతారా. లేదు. కనుక హోలీహంస అనగా సదా స్వచ్ఛంగా ఉండేవారు. హంసను సదా స్వచ్ఛంగా చూపిస్తారు. స్వచ్ఛత అనగా పవిత్రత. మరి ఇప్పుడు స్వచ్ఛంగా అయ్యారు కదా. మలినం తొలగిపోయిందా లేక ఇప్పటికీ కొద్దికొద్దిగా ఉందా? కొద్దికొద్దిగా మిగిలిపోలేదు కదా? ఒక్కోసారి మలినం ఉన్నవారి సాంగత్యం యొక్క రంగు అంటుకోవడం లేదు కదా? ఒక్కోసారి మలినం ప్రభావం పడుతుందా? స్వచ్ఛత శ్రేష్ఠమైనది కదా. మలినం ఉన్నదీ, స్వచ్ఛమైనదీ రెండూ ఉంచితే దేనిని ఇష్టపడతారు? స్వచ్ఛమైనదాన్ని ఇష్టపడతారా లేక మలినం ఉన్నదాన్ని కూడా ఇష్టపడతారా? కనుక సదా మనస్సు-బుద్ధి స్వచ్ఛంగా అనగా పవిత్రంగా ఉండాలి. వ్యర్థం యొక్క అపవిత్రత కూడా ఉండకూడదు. వ్యర్థం ఉంటే సంపూర్ణ స్వచ్ఛత అని అనము. కనుక వ్యర్థాన్ని సమాప్తం చేయడం అనగా హోలీహంసగా అవ్వడం. ప్రతి సమయంలో బుద్ధిలో జ్ఞాన రత్నాలు నడుస్తూ ఉండాలి, మననం నడుస్తూ ఉండాలి. జ్ఞానం నడిస్తే వ్యర్థం నడవదు. దీనినే రత్నాలను ఏరుకోవడం అని అంటాము. వ్యర్థం రాయి వంటిది. ఎప్పుడైనా వ్యర్థం వస్తే దుఃఖపు అల వస్తుంది కదా. ఇది ఎందుకు వచ్చింది అని ఇబ్బంది పడతారు కదా? కనుక రాయి దుఃఖాన్ని ఇస్తుంది మరియు రత్నం సంతోషాన్ని ఇస్తుంది. ఎవరి చేతికైనా రత్నం వస్తే ఇబ్బంది పడతారా లేక సంతోషపడతారా? సంతోషపడతారు కదా. ఎవరైనా రాయి విసిరితే దుఃఖం కలుగుతుంది. కనుక బుద్ధి ద్వారా కూడా రాయిని గ్రహించకూడదు. సదా జ్ఞాన రత్నాలను గ్రహించాలి. ఒక్కొక్క రత్నానికి లెక్కలేనంత విలువ ఉంది! మీ దగ్గర ఎన్ని రత్నాలు ఉన్నాయి? లెక్కలేనన్ని ఉన్నాయి కదా! రత్నాలతో నిండుగా ఉన్నారు, ఖాళీగా లేరు కదా? ఎప్పుడూ బుద్ధిని ఖాళీగా ఉంచకండి. ఏదో ఒక హోమ్‌వర్క్ మీకు మీరు ఇచ్చుకుంటూ ఉండండి. బుద్ధిని హోమ్‌వర్క్‌లో బిజీగా ఉంచండి. ప్రతిరోజూ బాబా హోమ్‌వర్క్ ఇస్తారు కదా. ఈ విశేషతలు, వరదానాలు, విశేష ధారణలు ఏమిటి? ఇవే హోమ్‌వర్క్. హోమ్‌వర్క్ చేస్తారా లేక క్లాస్‌లో విన్నారు, అంతటితో సమాప్తమా? హోమ్‌వర్క్ ఎందుకు లభిస్తుంది? బిజీగా ఉండేందుకు. మరి మాతలు హోమ్‌వర్క్ చేస్తారా? గాడ్లీ స్టూడెంట్ కదా, లేక ఇంటికి వెళ్ళగానే మిమ్మల్ని మీరు మాతగా భావిస్తారా? స్టూడెంట్ పని ఏమిటి? స్టడీ. ఎంత సహజంగా చేసి ఇస్తున్నారు. మరి దేనిలో బిజీగా ఉంటారు? పాండవులు బిజీగా ఉంటారా? బిజీగా ఉండడం అనగా సేఫ్‌గా ఉండడం. మరియు ఎంత సహజమైన హోమ్‌వర్క్! ఏది విన్నారో అది చేయాలి, అంతే. హోమ్‌వర్క్ ఇచ్చేవారు ఎవరు! మరియు ఎక్కడి నుండి వస్తారు! ఎంత దూరం నుండి వస్తారు! ఉన్నతోన్నతుడైన భగవంతుడు శిక్షకుడిగా అయ్యి వస్తారు - ఎంత నషా కలిగించే విషయం! మొత్తం కల్పంలో ఇటువంటి శిక్షకుడు లభించరు. కనుక హోమ్‌వర్క్‌ను బాగా చేయాలి కదా. అచ్ఛా!
గ్రూప్ నం. 4 - కుసాంగత్యం మరియు వ్యర్థ సాంగత్యం నుండి రక్షించుకునేందుకు సదా ఈశ్వరీయ సాంగత్యంలో ఉండండి
మీరందరూ జ్ఞాన బలం మరియు యోగ బలం రెండింటిలోనూ సదా ముందుకు వెళ్ళేవారిగా అనుభవం చేసుకుంటున్నారా? ప్రపంచంలో అనేక రకాల బలాలు ఉన్నాయి - సైన్స్ బలం కూడా ఉంది, రాజ్య బలం కూడా ఉంది, భక్తి బలం కూడా ఉంది కానీ మీలో ఏ బలం ఉంది? జ్ఞాన బలం మరియు యోగ బలం. ఇవి అన్నింటికంటే శ్రేష్ఠమైన బలాలు. మరి యోగ బలంలో ఉండే బలం, శక్తి దేనికోసం ఉంటుంది? విజయాన్ని ప్రాప్తి చేసుకునేందుకు. సైన్స్ బలం ఉన్నట్లయితే, సైన్స్ బలం అంధకారంపై విజయం ప్రాప్తి చేసుకుని వెలుగును తీసుకొస్తుంది. అలాగే యోగబలం సదాకాలం కోసం మాయపై విజయులుగా చేస్తుంది. మరి మాయాజీత్గా అయ్యే బలం ఉందా? లేక ఒక్కోసారి ఓటమి, ఒక్కోసారి విజయమా? సదా విజయులు. ఒక్కోసారి విజయులుగా ఉండేవారిని విజయులు అని అనము. ఎందుకంటే బాబా ద్వారా ఈ జ్ఞాన బలం మరియు యోగ బలం ఎంత శ్రేష్ఠంగా లభించిందంటే దాని ముందు మాయ శక్తి ఏమీ కాదు. మరి యోగ బలం గొప్పదా లేక మాయ ఒక్కోసారి ఆట ఆడేందుకు వస్తుందా? మాయాజీత్ ఆత్మలు స్వప్నంలో కూడా ఓటమిని పొందలేరు. స్వప్నంలో కూడా బలహీనత రాలేదు. స్వప్నం కూడా శక్తిశాలిగా ఉంటుంది. ఇటువంటి ధైర్యవంతులా లేక ఒక్కోసారి అనుమతి ఇచ్చి ఉంచారా? సదా విజయులే. మీ మస్తకంపై విజయ తిలకం పెట్టబడి ఉంది కదా. విజయం మా జన్మసిద్ధ అధికారం అనే నషా ఉందా? జన్మసిద్ధ అధికారాన్ని ఎప్పుడూ పోగొట్టుకోలేరు. మేము విజయులము మరియు సదా విజయులుగానే ఉంటాము అనే స్మృతి సదా ఉండాలి. లేక ఏమో, ఉంటామో ఉండమో... అని ఆలోచిస్తారా? ఎప్పుడైనా ఈ సంకల్పం వస్తుందా? ఏమో ముందు ఏమి జరుగుతుందో.... ఏమో మాయ వస్తే... ఎప్పుడైనా సాంగత్యం యొక్క రంగు అంటుకుంటే.... ఇలా వస్తుందా! ఇటువంటి సాంగత్యం ఏదైనా లభిస్తే ఏమి చేస్తారు? వారిని కూడా కుసాంగత్యం నుండి సత్యమైన సాంగత్యంలోకి తీసుకొస్తారా? ఎందుకంటే ఫైనల్ రిజల్ట్ వచ్చేంతవరకు పేపర్ అయితే వస్తూనే ఉంటుంది. పేపర్ పని రావడం మరియు మీ పని పాస్ విత్ ఆనర్ అవ్వడం. ఎటువంటి చెడు సాంగత్యమైనా కానీ దాని ముందు మీ శ్రేష్ఠమైన సాంగత్యం ఎన్ని రెట్లు శక్తిశాలిగా ఉంది! ఈశ్వరీయ సాంగత్యం ముందు మిగిలిన సాంగత్యాలన్నీ ఏమీ కాదు. అన్నీ బలహీనమైనవి. మీరు బలహీనంగా అయినప్పుడే విపరీతమైన సాంగత్యం యొక్క దాడి జరుగుతుంది. కనుక మాయాజీత్ అనగా ఒక్క బాబా తప్ప మరే సాంగత్యం యొక్క రంగుతో ప్రభావితమవ్వనివారు. అందుకే సత్సంగం యొక్క మహిమ గాయనం చేయబడుతుంది. సత్సంగం యొక్క మహిమ ఎంత ఉందో చూడండి! మీరు సత్సంగం అనగా సత్యమైన బాబా సాంగత్యంలో ఉండేవారు. అంతే కదా. ఒక్క బాబా (పరమాత్మ) సాంగత్యమే సత్సంగం మరియు మిగిలినవన్నీ కుసాంగత్యం లేక వ్యర్థ సాంగత్యం. చాలామంది కుసాంగత్యం నుండి తప్పించుకుంటారు, కానీ వ్యర్థ సాంగత్యంతో ప్రభావితమవుతారు. ఎందుకంటే వ్యర్థ విషయాలు రమణీయంగా ఉంటాయి. ఈ రోజుల్లో కథలను ఎంత రమణీయంగా వినిపిస్తారో చూడండి. కనుక వ్యర్థ విషయాలు, వ్యర్థ సాంగత్యం బయటకు ఆకర్షించేవిగా ఉంటాయి. అందుకే బాబా శిక్షణ - వ్యర్థాన్ని వినకండి, వ్యర్థాన్ని మాట్లాడకండి, వ్యర్థాన్ని చేయకండి, వ్యర్థాన్ని చూడకండి, వ్యర్థాన్ని ఆలోచించకండి. చెడు విషయమైతే సమాప్తమైపోయింది. కానీ వ్యర్థంలో ఒక్కోసారి చిక్కుకుంటారు. బయటి షో చాలా బాగుంటుంది కదా. కనుక సదా విజయీ ఆత్మలు - మాయాజీత్, జగత్జీత్. శక్తులు లేక పాండవులు ఇటువంటి మాయాజీత్లా? ఎందుకంటే మాయ కూడా కొత్త కొత్త రూపాలలో వస్తుంది, పాత రూపంలో రాదు. పాతదాన్ని తెలుసుకున్నారు కదా, కనుక కొత్త కొత్త రూపాలలో వస్తుంది. ఇందులో ఇది మాయా లేక పరమాత్మ జ్ఞానమా అని నిర్ణయించే శక్తి కావాలి. మరి ఎంత సమయంలో గుర్తించగలరు? లేక కొద్దిగా చక్కర్లు కొట్టి తరువాత గుర్తిస్తారా? కొద్దిగా కూడా చక్కర్లలోకి వస్తే సమయం వ్యర్థంగా వెళ్ళిపోతుంది మరియు నంబరు వెనుకబడిపోతుంది. తరువాత శ్రమ చేసి ముందుకు వెళ్ళగలరు కానీ అయినా మచ్చ పడింది కదా. ఎంత తుడిచినా తుడిచిన గుర్తు కూడా కనిపిస్తుంది. అందుకే సదా విజయులుగా అవ్వండి. అధికారం ఉంది కదా. మరి అధికారాన్ని ఎవరూ వదులుకోరు.
మీరందరూ విశేషంగా బాబా లభించారు, అన్నీ లభించాయి అనే సంతోషంలో ఉంటారు కదా? లభించాయా లేక ఇంకా లభించాలా? ఎవరైనా వచ్చి మీతో, లేదు ఇంకా ఏదో మిగిలి ఉంది, రండి మేము మీకు ఇస్తాము అని చెబితే టెస్ట్ చేస్తారు కదా, కొద్దిగా టెస్ట్ చేయడంలో నష్టం ఏముంది? ఒకే బలం, ఒకే నమ్మకమా లేక కొద్దికొద్దిగా రెండవది కూడా ఉందా? చాలా మంచి మంచి విషయాలు వినిపిస్తే వింటారా? విని వారిని మార్చేందుకు ప్రయత్నిస్తారా? ఏమి చేస్తారు? విననే వినకూడదు, వింటే చక్కర్లలోకి వస్తారు. ఏది వినాలో అది వినేసారు. అందుకే ఏది పొందాలో, ఏది వినాలో, ఏది చేయాలో అది చేసేసాము అని అంటారు. అంత నిండుగా ఉండండి. కొద్దిగా కూడా ఖాళీతనం ఉంటే ఇంకేదో వచ్చి నిండుతుంది. నిండుగా ఉన్నదానిలో ఇంకేదీ నిండలేదు. కనుక ఎవరి సాంగత్యం యొక్క చక్కర్లలోకి కూడా వచ్చేవారు కాదు. ఇలా పక్కాగా ఉండడంలోనే ఆనందం ఉంది. కచ్చాగా ఉంటే ఒక్కోసారి ఎవరైనా ఇక్కడి నుండి వస్తారు, ఎవరైనా అక్కడి నుండి వస్తారు. పక్కాగా ఉన్నవారిని ఎవరూ ఏమీ చేయలేరు. ప్రకృతి కదిలించలేదు, మాయ కదిలించలేదు. ఎవరి సాంగత్యం కూడా కదిలించలేదు. ఎటువంటి వాయుమండలం ఉన్నా కానీ వాయుమండలాన్ని మార్చేవారు, వాయుమండలానికి వశమయ్యేవారు కాదు. అంత ధైర్యం ఉంది కదా! ఎక్కడ ధైర్యం ఉందో అక్కడ బాబా యొక్క పదమగుణాల సహాయం ఉంది. ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా. ఒక అడుగు మీది మరియు పదమ అడుగులు బాబావి. మరి అందరూ ధైర్యవంతులా లేక కొద్దిగా కదిలేవారు కూడా ఉన్నారా? మేమే ధైర్యం ఉంచకపోతే ఇంకెవరు ఉంచుతారు అనే ధ్వని హృదయం నుండి రావాలి. అచ్ఛా!
గ్రూప్ నం. 5 - సుఖదాత పిల్లలు మాస్టర్ సుఖదాతలుగా అవ్వండి - దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి
మీరందరూ మిమ్మల్ని సింహాసనాధికారి ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? ఈ సమయంలో కూడా సింహాసనాధికారులా లేక భవిష్యత్తులో అవ్వాలా? ఇప్పుడు ఏ సింహాసనం ఉంది? ఒకటి అకాల్ సింహాసనం, రెండవది హదయ సింహాసనం. మరి రెండు సింహాసనాలు స్మృతిలో ఉంటున్నాయా? సింహాసనాధికారి ఆత్మ అనగా రాజ్య అధికారీ ఆత్మ. ఎవరి రాజ్యం ఉంటుందో వారే సింహాసనంపై కూర్చుంటారు. రాజ్యం లేకపోతే సింహాసనం కూడా ఉండదు. కనుక భృకుటి సింహాసనాధికారిగా ఉన్నప్పుడు కూడా స్వరాజ్య అధికారులే మరియు బాబా హృదయ సింహాసనాధికారిగా ఉన్నప్పుడు కూడా బాబా వారసత్వానికి అధికారులే. అందులో రాజ్య-భాగ్యం అన్నీ వచ్చేస్తాయి. కనుక సింహాసనాధికారి అనగా రాజ్య అధికారీ. రాజ్య అధికారులా లేక ఒక్కోసారి సింహాసనం నుండి కిందికి దిగిపోతారా? సదా సింహాసనాధికారులా లేక ఒక్కోసారి మాత్రమేనా? ఒక్కోసారి సింహాసనంపై కూర్చుని అలసిపోతే కిందికి దిగిపోతారా! లేదు. హృదయ సింహాసనం ఎంత పెద్దదంటే అన్నీ చేస్తూ కూడా సింహాసనాధికారులుగానే ఉంటారు. కర్మయోగి అనగా రెండు సింహాసనాలపై ఆసీనులై ఉండేవారు. భృకుటి సింహాసనంపై కూర్చుని కర్మలు చేస్తే ఆ కర్మలు కూడా ఎంత శ్రేష్ఠంగా ఉంటాయి! ఎందుకంటే సర్వ కర్మేంద్రియాలు లా అండ్ ఆర్డర్లో ఉంటాయి. ఎవరైనా సింహాసనంపై సరిగ్గా లేకపోతే లా అండ్ ఆర్డర్ నడవలేదు. ఇప్పుడు చూడండి, ప్రజలపై ప్రజల రాజ్యం ఉంది కనుక లా అండ్ ఆర్డర్ నడవగలదా? ఒకరు లా పాస్ చేస్తే మరొకరు లా బ్రేక్ చేస్తారు. కనుక సింహాసనాధికారి ఆత్మ అనగా సదా యథార్థ కర్మలు చేసేవారు మరియు యథార్థ కర్మల ప్రత్యక్షఫలాన్ని అనుభవించేవారు. శ్రేష్ఠ కర్మ యొక్క ప్రత్యక్షఫలం కూడా లభిస్తుంది మరియు భవిష్యత్తు కోసం కూడా జమ అవుతుంది - డబల్. మరి ప్రత్యక్షఫలం ఏమి లభించింది? సంతోషం లభిస్తుంది, శక్తి లభిస్తుంది. ఏ శ్రేష్ఠ కర్మ చేసినా అన్నింటికంటే ముందు సంతోషం కలుగుతుంది. హృదయం సంతోషంగా ఉంటే ప్రపంచం సంతోషంగా ఉంటుంది. మరి హృదయం సదా సంతోషంగా ఉంటుందా లేక సంకల్పమాత్రంగా అయినా దుఃఖపు అల వస్తుందా? ఎప్పుడూ రాదా లేక ఒక్కోసారి కోరుకోకపోయినా వచ్చేస్తుందా? దుఃఖధామం నుండి దూరమయ్యారు. అయ్యారా లేక ఒక పాదం ఇటువైపు, ఒక పాదం అటువైపు ఉందా? ఒకటి దుఃఖధామంలో, ఒకటి సుఖధామంలో - ఇలా లేదు కదా? మీరు కలియుగ నివాసులా లేక సంగమయుగ నివాసులా లేక ఒక్కోసారి కలియుగంలోకి కూడా వెళ్ళిపోతారా? సంగమయుగీ బ్రాహ్మణులు అనగా దుఃఖం యొక్క నామరూపాలు కూడా ఉండవు. ఎందుకంటే సుఖదాత పిల్లలు. కనుక సుఖదాత పిల్లలు మాస్టర్ సుఖదాతలుగా ఉంటారు. మాస్టర్ సుఖదాత అయినవారు స్వయంగా దుఃఖంలోకి ఎలా రాగలరు. కనుక బుద్ధితో దుఃఖధామం నుండి దూరమయ్యారు. స్వయం సుఖ స్వరూపులే కానీ సుఖదాత పిల్లలు ఇతరులకు కూడా సుఖాన్ని ఇచ్చే మాస్టర్ సుఖదాతలు. మరి ఇతరులకు సుఖాన్ని ఇస్తారా లేక కేవలం స్వయం సుఖంగా ఉంటారా? దాతలు కదా. బాబా కార్యమే పిల్లల కార్యం. మరి బాబా ప్రతి ఆత్మకు సదా సుఖాన్ని ఇస్తారు కదా. అనుభవం ఉంది కదా. కనుక ఫాలో ఫాదర్ చేయండి. ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే మీరు కూడా దుఃఖాన్ని ఇస్తారు - ఇలా కాదు. అచ్ఛా, ఎవరైనా దుఃఖాన్ని ఇస్తుంటే మీరు ఏమి చేస్తారు? దానిని తీసుకుంటారా లేక తీసుకోరా? మీ స్లోగన్యే ‘దుఃఖాన్ని ఇవ్వకండి, దుఃఖాన్ని తీసుకోకండి.’ తీసుకోకూడదు కూడా. తీసుకుంటే సుఖంతో పాటు దుఃఖం కూడా మిక్స్ అయిపోయింది కదా. కనుక తీసుకోకూడదు కూడా. ఎవరైనా ఎంతగా కదిలించేందుకు ప్రయత్నించినా మీరు సదా నిశ్చలంగా ఉండండి. ఎవరూ కొద్దిగా కూడా కదిలించలేరు.
అచ్ఛా, అందరూ అంతర్ముఖులుగా, సదా సుఖంగా ఉన్నారా? పాండవులు ఏమనుకుంటున్నారు? అంతర్ముఖులా లేక కొద్దికొద్దిగా బాహ్యముఖత కూడా ఉందా? బయట ఆకర్షణ ఏదైనా ఆకర్షించడం లేదు కదా? ఒక్కోసారి మన్మత్, ఒక్కోసారి పరమత్ ఆకర్షించడం లేదు కదా? లేక ఒక్కోసారి కొద్దిగా రుచి చూసి, తరువాత మోసపోయినప్పుడు స్పృహలోకి వస్తారా? లేదు. సదా సుఖంగా ఉండేవారే, సుఖదాత పిల్లలు మాస్టర్ సుఖదాతలు. బాహ్యముఖత నుండి ముక్తులైపోయారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
