‘‘వర్తమాన సీజన్లో ఒక్క ‘పాయింట్’ అన్న పదాన్ని మూడు రూపాలతో స్మృతి మరియు స్వరూపంలోకి తీసుకురావడము - ఇదే రక్షణ యొక్క సాధనము’’
విశ్వకళ్యాణకారి అయిన బాప్‌దాదా తమ మాస్టర్ విశ్వకళ్యాణకారి పిల్లలందరినీ చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి ఈ బ్రాహ్మణ జీవితం యొక్క లక్ష్యము అతి శ్రేష్ఠమైనది. ప్రతి ఒక్కరూ నంబర్‌వన్ పురుషార్థం చేయాలనే లక్ష్యమును ఉంచుకొని ముందుకు ఎగురుతూ వెళ్తున్నారు. లక్ష్యము అందరిదీ నంబర్‌వన్‌గా అవ్వడమే కానీ లక్షణాలు నంబరువారుగా ఉన్నాయి. మరి లక్ష్యము మరియు లక్షణాలు రెండింటిలో తేడా ఎందుకుంది? జ్ఞానదాత అయిన తండ్రి కూడా ఒక్కరే, యోగం యొక్క విధి కూడా ఒక్కటే, దివ్య గుణాలను ధారణ చేసేందుకు సహజ ప్రత్యక్ష ప్రమాణమైన సాకార బ్రహ్మా తండ్రి కూడా ఒక్కరే, సేవా సాధనాలు మరియు సేవ యొక్క విధిని నేర్పించేవారు కూడా ఒక్కరే. ముఖ్యమైన విషయము - చదువు మరియు పాలన - రెండింటినీ ఇచ్చేవారు ఒక్కరే మరియు వారు మొదటి నంబరువారు, అయినప్పటికీ ప్రత్యక్ష జీవితంలో లక్షణాలు నంబరువారుగా ఎందుకున్నాయి? వాస్తవానికి అందరికీ స్వయం గురించి మంచి రీతిలో తెలుసు - లక్షణాలను ధారణ చేయడంలో నేను ఏ నంబరులో ఉన్నాను అని. నంబరువారుగా అవ్వడానికి విశేషమైన ఆధారము ఒకే పదము - ‘పాయింట్’. పాయింట్ స్వరూపాన్ని అనుభవం చేయడము. రెండవది, ఏవైనా సంకల్పాలు, మాటలు లేక కర్మలు వ్యర్థంగా ఉంటే వాటికి పాయింట్ పెట్టడము అనగా బిందువు పెట్టడము. మూడవది, జ్ఞానము మరియు ధారణ యొక్క అనేక పాయింట్లను మననం చేసి స్వయం పట్ల మరియు సేవ పట్ల సమయానికి కార్యంలో ఉపయోగించడము. కనుక ‘పాయింట్’ అన్న పదము ఒక్కటే కానీ మూడు స్వరూపాల పాయింట్‌ను సమయానికి స్మృతిలోకి, స్వరూపంలోకి తీసుకురావడము - ఇందులో తేడా వచ్చేస్తుంది. స్మృతి అందరికీ ఉంటుంది కానీ స్మృతిని స్వరూపంలోకి తీసుకురావడము, ఇందులో నంబరువారుగా అవుతున్నారు. చాలా సార్లు బాప్‌దాదా పిల్లలందరూ స్మృతిలో చాలా చురుకుగా ఉండడాన్ని చూస్తారు. ఇలా జరగాలి - అని ఆలోచిస్తూ కూడా ఉంటారు, ఇది రైట్, ఇది రాంగ్, ఈ జ్ఞానం కూడా ఇమర్జ్ అవుతుంది. జ్ఞానము అనగా నాలెడ్జ్ మరియు నాలెడ్జ్ ఈజ్ లైట్, నాలెడ్జ్ ఈజ్ మైట్ (జ్ఞానము ప్రకాశము, జ్ఞానము శక్తి) అని అంటారు కనుక ఎక్కడైతే ప్రకాశం కూడా ఉంటుందో, శక్తి కూడా ఉంటుందో అక్కడ ‘ఇది జరగాలి’ అనేది ఉండదు. ఏమి ఆలోచిస్తారంటే - బాప్‌దాదా అయితే ఇలా చెప్తారు, అవ్వాల్సిందే, జ్ఞానమైతే ఇదే, కానీ ఆ సమయంలో నాలో ఏముంది - ఇది జరగాలి, ఇది జరగాలి అన్నదానిలోనే ఉండిపోతారు. దీని అర్థమేమిటంటే జ్ఞానాన్ని ప్రకాశము మరియు శక్తి రూపంలో సమయమనుసారంగా కార్యంలో ఉపయోగించలేకపోతున్నారు. దీనినే - స్మృతిలో ఉంది కానీ స్వరూపంలోకి తీసుకొచ్చే శక్తి తక్కువగా ఉంది అని అంటారు. ఎప్పుడైతే - ఇది రాంగ్, ఇది రైట్, ఇది అంధకారము, ఇది ప్రకాశము, ఇది వ్యర్థము, ఇది సమర్థము అన్న లైట్ అనగా ప్రకాశముందో, అప్పుడు అంధకారమని అర్థమై కూడా అంధకారంలో ఉంటే, అటువంటివారిని జ్ఞానీ లేక తెలివైనవారని అంటారా? జ్ఞానీగా లేరంటే ఎలా ఉన్నట్లు? భక్తులుగానా లేక అసంపూర్ణ జ్ఞానులుగానా? రాంగ్ అని అర్థమై కూడా రాంగ్ కర్మలకు లేక సంకల్పాలకు లేక స్వభావ-సంస్కారాలకు వశీభూతులైతే వారిని ఏమి అంటారు? వారికి ఏ టైటిల్ ఉండాలి? బాప్‌దాదా సమయం యొక్క వేగాన్ని చూసి పిల్లలందరికీ పదే-పదే అటెన్షన్ ఇప్పిస్తున్నారు.
‘అటెన్షన్’ అన్న పదాన్ని కూడా డబల్ అండర్లైన్ చేయిస్తున్నాము - ఈ ప్రకృతి యొక్క తమోగుణీ శక్తి మరియు మాయ యొక్క సూక్ష్మ రాయల్ తెలివి యొక్క శక్తి తమ కార్యాన్ని తీవ్ర వేగంతో చేస్తున్నాయి మరియు చేస్తూ ఉంటాయి. ప్రకృతి యొక్క భయంకర రూపాన్ని తెలుసుకోవడం సహజమే కానీ రకరకాల భయంకర అలజడులలో అచలంగా ఉండాలి, ఈ విషయంలో ఇంకా అటెన్షన్ కావాలి. మాయ యొక్క అతి సూక్ష్మ స్వరూపాన్ని తెలుసుకోవడంలో కూడా మోసపోతారు. మాయ ఎటువంటి రాయల్ రూపాన్ని ధరిస్తుందంటే రాంగ్‌ను రైట్‌గా అనుభవం చేయిస్తుంది. అది పూర్తిగా రాంగ్ కానీ బుద్ధిని ఎలా పరివర్తన చేస్తుందంటే - అది సత్యమైన తెలివిని, రియలైజ్ అయ్యే శక్తిని మాయం చేస్తుంది. ఏ విధంగానైతే ఎవరైనా మాయ-మంత్రాలు చేస్తారు కదా, అప్పుడు పరవశులవుతారు, అలా రాయల్ మాయ రియలైజ్ అయ్యే శక్తిని మాయం చేసి సత్యాన్ని అర్థం చేసుకోనివ్వదు. అది పూర్తిగా రాంగ్ అయి ఉంటుంది కానీ మాయ యొక్క నీడకు వశీభూతులైన కారణంగా రాంగ్‌ను రైట్‌గా భావిస్తారు మరియు ఋజువు చేయడంలో మాయ యొక్క సుప్రీమ్ కోర్టుకు వకీలుగా అవుతారు. మరి వకీలు ఏం చేస్తారు? అబద్ధాన్ని సత్యము అని నిరూపించడంలో తెలివైనవారిగా ఉంటారు. సత్యాన్ని సత్యంగా నిరూపించడంలో కూడా తెలివైనవారిగా ఉంటారు కానీ అబద్ధాన్ని సత్యమని నిరూపించడంలో తెలివైనవారిగా ఉంటారు, రెండింటిలోనూ తెలివైనవారిగా ఉంటారు. అందుకే బాప్‌దాదా ‘అటెన్షన్’ అన్న పదాన్ని డబల్ అండర్లైన్ చేయిస్తున్నారు. రియలైజ్ అయ్యే శక్తిని పరివర్తన చేసే సూక్ష్మ స్వరూపమైన మాయ నీడ నుండి సదా స్వయాన్ని సురక్షితంగా ఉంచుకోండి ఎందుకంటే మాయ విశేషంగా ఈ స్వరూపంలో తన కార్యాన్ని చేస్తుంది. అర్థమయిందా? ఇప్పుడేం చేస్తారు? జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎవరైనా విశేష ఆత్మలు సూచన ఇచ్చారంటే, మంచి రీతిలో మాయ యొక్క ఈ నీడ నుండి బయటపడి తండ్రి ఛత్రఛాయలోకి స్వయాన్ని, విశేషంగా మనసు-బుద్ధిని ఈ ఛత్రఛాయ ఆధారంలోకి తీసుకురండి ఎందుకంటే మనసులో నెగెటివ్ భావము మరియు భావనలను ఉత్పన్నం చేసేలా విశేషంగా మాయ యొక్క ప్రభావము నడుస్తూ ఉంది మరియు బుద్ధిలో యథార్థమైన రియలైజేషన్‌ను సమాప్తం చేసేటువంటి విశేషమైన మాయ యొక్క కార్యం నడుస్తూ ఉంది. ఏ విధంగానైతే ఏదైనా సీజన్ ఉన్నప్పుడు, సీజన్ నుండి రక్షించుకునేందుకు దాని అనుసారంగా విశేషమైన అటెన్షన్ పెట్టడం జరుగుతుంది. ఉదాహరణకు వర్షాలు పడితే గొడుగులు, రెయిన్ కోట్లు మొదలైనవాటి గురించి అటెన్షన్ పెడతారు, చలికాలం వస్తే వెచ్చదనాన్ని కలిగించే వస్త్రాలను ఉంచుకుంటారు, అటెన్షన్ పెడతారు కదా. అలాగే మనసు మరియు బుద్ధిపైన ప్రభావం పడకుండా ఉండేందుకు ముందుగానే రక్షణా సాధనాన్ని విశేషంగా అలవరచుకోండి. ఆ విశేషమైన సాధనము చాలా సహజము, ఇంతకుముందు కూడా వినిపించాము - అది ఒకే పదము ‘పాయింట్’. సహజమే కదా. విస్తారంగా ఏమీ వినిపించలేదు కదా. నిజమే, నేను ఆత్మను, బిందువును, జ్యోతి రూపాన్ని అని అంటూ ఉంటారు, కానీ అందులో స్థితులవ్వరు. పాయింట్ పెడదామని అనుకుంటారు కానీ ప్రశ్నార్థక చిహ్నము మరియు ఆశ్చర్యార్థక చిహ్నము వస్తాయి. పాయింట్ పెట్టడం సహజమా లేక ప్రశ్నార్థక చిహ్నము లేక ఆశ్చర్యార్థక చిహ్నము పెట్టడం సహజమా? ఏది సహజము? బిందువు పెట్టడం సహజము కదా. మరి అటువంటప్పుడు ప్రశ్న మరియు ఆశ్చర్యంలోకి ఎందుకు వెళ్తారు? ఈ విధిని అలవరచుకోండి. ఇది అబద్ధము సత్యముగా నిరూపణ అయ్యే సీజన్ మరియు అబద్ధము, సత్యము కన్నా స్పష్టంగా మరియు ఆకర్షణీయంగా ఉంటుంది. ఏ విధంగా ఈ రోజుల్లోని ఫ్యాషన్ కదా, అసత్యమైన వస్తువులు ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి, వాటి ముందు సత్యమైనవాటి విలువ తగ్గిపోతుంది. సత్యమైన వెండిని చూడండి మరియు వైట్ సిల్వర్‌ను చూడండి, ఏది సుందరంగా అనిపిస్తుంది? సత్యమైన వెండి నల్లగా అయిపోతుంది మరియు వైట్ సిల్వర్ సదా మెరుస్తూ ఉంటుంది. మరి వైట్ సిల్వర్ ఆకర్షిస్తుందా లేక సత్యమైనది ఆకర్షిస్తుందా? కనుక సీజన్‌ను గుర్తించండి, మాయ యొక్క స్వరూపాలను గుర్తించండి, ప్రకృతి యొక్క రకరకాల తమోగుణీ రంగులను గుర్తించండి. ఒకటేమో తెలుసుకోవడము, రెండవది, గుర్తించడము. తెలియడం ఎక్కువ తెలుసు, గుర్తించడంలో అప్పుడప్పుడు పొరపాట్లు చేస్తారు, అప్పుడప్పుడు రైట్ చేస్తారు. ఇప్పుడేం చేస్తారు? సురక్షితంగా ఉంటారు కదా. ఇక తర్వాత - మేము అర్థం చేసుకోలేదు, ఇలా కూడా జరుగుతుందా ఏమిటి? అని అనకండి. ఈ ఏమిటి-ఏమిటి అనేది నడవదు. ఇప్పుడైతే ఇంకా తండ్రి కొద్ది-కొద్దిగా దయ చూపిస్తున్నారు, కొద్ది-కొద్దిగా అడుగులు వేస్తున్నారు. కానీ తర్వాత ‘ఏమిటి’ మరియు ‘ఎందుకు’ అనేది ఎవ్వరూ వినరు. ఇలా కాదు, అలా... ఈ వాదనలు నడవవు. జడ్జిగా అవ్వండి, మాయకు వకీలుగా అవ్వకండి. ఎప్పుడైతే వాదిస్తారో, అప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. అందరూ అనుభవజ్ఞులే కదా, అనుభవమవుతుంది కదా. వింటూ-వింటూ సాక్షీగా అయి హర్షిస్తున్నారు. మంచి రీతిలో అర్థం చేసుకున్నారా? పాండవులు, శక్తులు అర్థం చేసుకున్నారా, టీచర్స్ అర్థం చేసుకున్నారా? అందరూ అవును-అవును అనైతే అంటున్నారు. అవును అంటున్న ఫోటో తీయబడుతుంది.
మూడవ సీజన్ విశేషంగా బలహీన స్వభావ-సంస్కారాలు, సంబంధ-సంపర్కంలోకి రావడము, దీని విస్తారం కూడా చాలా పెద్దదిగా ఉంది. అది ఈ రోజు వినిపించము. చాలామంది పిల్లలు ఏమంటారంటే - ఏం చేయాలి, ఇంతకుముందైతే నాలో ఇది లేనే లేదు, ఇప్పుడు ఏమయిందో తెలియదు, ఈ సంస్కారం నాలో ఉండేదే కాదు, ఇప్పుడు వచ్చేసింది. దానికి కారణాలు ఏమిటి మరియు విధి ఏమిటి అనే విస్తారాన్ని ఇంకెప్పుడైనా వినిపిస్తాము. అచ్ఛా!
నలువైపులా ఉన్న బాప్‌దాదా మహావాక్యాలను వినే మరియు ధారణ చేసే చాతక పిల్లలకు, అన్ని సబ్జెక్టులను స్మృతితో పాటు స్వరూపంలోకి తీసుకొచ్చే సమీప ఆత్మలకు, సదా జ్ఞానం యొక్క ప్రతి విషయాన్ని లైట్ మరియు మైట్ స్వరూపంతో కార్యంలోకి తీసుకొచ్చే శ్రేష్ఠ ఆత్మలకు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకునే తండ్రి యొక్క జ్ఞానయుక్త ఆత్మలకు, సదా తండ్రి ఛత్రఛాయలో ఉండే, మాయ నీడ నుండి సురక్షితంగా ఉండే, తెలుసుకోవడం మరియు గుర్తించడం, రెండింటి విశేషతను జీవితంలోకి తీసుకొచ్చే విశేష ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో మిలనము:- శక్తి సైన్యము తీవ్రవేగంతో నడుస్తుంది కదా! సైన్యాన్ని నడిపించేందుకు బాప్‌దాదాతో పాటు నిమిత్త ఆత్మలైన మీరు కూడా నిమిత్తంగా ఉన్నారు. తండ్రి అయితే సదా తోడుగా ఉన్నారు మరియు సదా ఉంటారు కూడా. అయినా మీరు బాప్‌దాదాకు శ్రేష్ఠమైన భుజాలు కదా. తండ్రి శక్తినిస్తారు, తండ్రి శక్తి రూపంలో ఉన్నారు కానీ నిమిత్తంగా అర్థం చేయించేందుకు మైక్లుగా మీరు నిమిత్తులై ఉన్నారు. ఎంత సరదా విషయాలు వింటారు. ఆటలా అనిపిస్తుంది కదా. ఆటే కదా. ఆట-ఆటలో విజయులుగా అయి అందరినీ మాయాజీతులుగా, విజయులుగా చేయాల్సిందే, ఇదైతే గ్యారంటీ. కానీ మధ్య-మధ్యలో ఈ ఆటలు చూడాల్సి వస్తుంది. మరి అలసిపోవడం లేదు కదా? నవ్వుతూ, ఆడుతూ, దాటుతూ మరియు దాటిస్తూ నడుస్తున్నారు. ఏదైనా అలాంటి మాట విన్నప్పుడు మనసు నుండి ఏం వెలువడుతుంది? వాహ్ డ్రామా వాహ్. అయ్యో డ్రామా అయ్యో అని వెలువడదు. వాహ్ డ్రామా. వాహ్-వాహ్ అంటూ అందరూ వాహ్-వాహ్గా అవ్వాల్సిందే. ఇవన్నీ దాటాల్సిందే. అచ్ఛా!
అవ్యక్త బాప్‌దాదాతో వ్యక్తిగత మిలనము
గ్రూప్ నం.1 - విజయము మా జన్మ సిద్ధ అధికారము - ఈ నిశ్చయము మరియు నషాతో నిర్విఘ్న స్థితిని అనుభవం చేయండి
ఏ విధంగానైతే తండ్రి ఉన్నతోన్నతమైనవారో, అదే విధంగా ఆత్మలమైన మనం కూడా ఉన్నతోన్నతమైన శ్రేష్ఠ ఆత్మలము - ఈ అనుభవం చేస్తూ నడుస్తున్నారా? ఎందుకంటే ప్రపంచంలోని వారికి అందరికన్నా శ్రేష్ఠమైనవారు, ఉన్నతోన్నతమైనవారు తండ్రి తర్వాత దేవతలు. కానీ దేవతల కన్నా ఉన్నతమైనవారు బ్రాహ్మణాత్మలైన మీరు, ఫరిశ్తాలైన మీరు - ఇది ప్రపంచంలోని వారికి తెలియదు. దేవతా పదవిని ఈ బ్రాహ్మణ జీవితం కన్నా ఉన్నతమైనది అని అనరు. ఉన్నతమైనది ఇప్పటి ఈ బ్రాహ్మణ జీవితము. మీరు దేవతల కన్నా ఎందుకు ఉన్నతమైనవారు అనేది మంచి రీతిలో తెలుసు కదా. దేవతా రూపంలో తండ్రి యొక్క జ్ఞానం ఇమర్జ్ అవ్వదు. పరమాత్మ మిలనం యొక్క అనుభవాన్ని ఈ బ్రాహ్మణ జీవితంలో చేస్తారు, దేవతా జీవితంలో కాదు. బ్రాహ్మణులే దేవతలుగా అవుతారు కానీ ఈ సమయంలో మీరు దేవతా జీవితంలోని వారి కన్నా ఉన్నతమైనవారు, కనుక ఇంతటి నషా సదా ఉండాలి, అప్పుడప్పుడు కాదు ఎందుకంటే తండ్రి అవినాశీ మరియు అవినాశీ తండ్రి ఏ జ్ఞానాన్ని అయితే ఇస్తారో, అది కూడా అవినాశీ, ఏ స్మృతినైతే ఇప్పిస్తారో అది కూడా అవినాశీ, అప్పుడప్పుడు ఉండేది కాదు. కనుక ఇది చెక్ చేసుకోండి - ఈ నషా సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా? ఎప్పుడైతే సదా ఉంటుందో, అప్పుడే ఆనందం కలుగుతుంది. ఒకసారి ఉండి, ఒకసారి లేకపోతే అప్పుడప్పుడు ఆనందంలో ఉంటారు, అప్పుడప్పుడు తికమకలో ఉంటారు. కనుక అప్పుడప్పుడు ఆనందం, అప్పుడప్పుడు తికమక కాదు, సదా ఉండాలి. ఏ విధంగానైతే ఈ శ్వాస సదా నడుస్తుంది కదా. ఒకవేళ ఒక్క సెకండు శ్వాస ఆగినా లేక అప్పుడప్పుడు మాత్రమే శ్వాస నడిస్తే, దానిని జీవితము అని అంటారా? కనుక ఈ బ్రాహ్మణ జీవితంలో నిరంతరం ఆనందంలో ఉన్నారా? ఒకవేళ ఆనందంలో లేకపోతే తప్పకుండా తికమకపడతారు. మరి మాతలు సదా ఆనందంలో ఉంటున్నారా? మీరు శక్తులు కదా, సాధారణమైనవారైతే కాదు, లేదా ఇంటికి వెళ్తే సాధారణ మాతలుగా అయిపోతారా? అలా కాదు, సదా మేము శక్తులము అన్నది గుర్తుండాలి. మీరు హద్దుకు సంబంధించినవారు కాదు, మీరు అనంతమైన విశ్వకళ్యాణకారులు. శక్తులు అనగా అసురులపై విజయం పొందేవారు. శక్తులను అసుర సంహారిణి అనగా అసుర సంస్కారాలను సంహరించేవారు అని అంటారు. కనుక శక్తులందరూ ఇటువంటి ధైర్యవంతులేనా? మరియు పాండవులు అనగా విజయీ. పాండవులు ఎప్పుడూ - కావాలనుకోవడం లేదు కానీ ఓటమి కలుగుతుంది అని ఈ విధంగా ఎప్పుడూ అనలేరు ఎందుకంటే అర్థకల్పం ఓటమి పొందారు, ఇప్పుడిది విజయాన్ని ప్రాప్తి చేసుకునే సమయము, మరి విజయం పొందే సమయంలో కూడా ఒకవేళ ఓడిపోతే ఇక విజయులుగా ఎప్పుడు అవుతారు? అందుకే ఈ సమయంలో సదా విజయీ. విజయము జన్మ-సిద్ధ అధికారము. అధికారాన్ని ఎవరూ వదిలిపెట్టరు, గొడవపడి-కొట్లాడి అయినా సరే తీసుకుంటారు మరియు ఇక్కడైతే సహజంగా లభిస్తుంది. విజయము మన జన్మ-సిద్ధ అధికారము. అధికారము యొక్క నషా లేక సంతోషం ఉంటుంది కదా? హద్దు అధికారంలో కూడా ఎంత నషా ఉంటుంది! ప్రైమ్ మినిస్టరు ఏమైనా - నేను ప్రైమ్ మినిస్టర్‌ను అన్నది మర్చిపోతారా? నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు - నేను ప్రైమ్ మినిస్టర్‌ను అన్నది ఏమైనా మర్చిపోతారా? కనుక హద్దు అధికారాన్ని మరియు అనంతమైన అధికారాన్ని ఎవరు ఎంతగా మరపింపజేసినా మర్చిపోలేరు. మాయ పని మరపింపజేయడము మరియు మీ పని విజయిగా అవ్వడము ఎందుకంటే విజయము మరియు ఓటమి అంటే ఏమిటి అన్న తెలివి ఉంది. ఓటమి విషయంలో కూడా అనుభవజ్ఞులు మరియు విజయం విషయంలో కూడా అనుభవజ్ఞులు. మరి ఓడిపోవడం వలన ఏం జరిగింది, విజయం పొందడం వలన ఏం జరిగింది - రెండింటి వ్యత్యాసం గురించి మీకు తెలుసు, అందుకే మీరు సదా విజయిగా ఉన్నారు మరియు సదా విజయిగానే ఉంటారు ఎందుకంటే అవినాశి తండ్రి మరియు అవినాశి ప్రాప్తులకు అధికారులము ఆత్మలమైన మనము - ఇది సదా ఇమర్జ్ రూపంలో ఉండాలి. అలా లేకపోతే ఎలా! అవ్వడమైతే అయ్యాము! తెలుసుకోవడమైతే తెలుసుకున్నాము! అలా కాదు. ప్రాక్టికల్‌గా ఉన్నాము. మరి ఎవరికైతే తెలుసో వారే నిశ్చయంతో నడుస్తారు. కనుక ప్రతి కర్మలో విజయం యొక్క నిశ్చయము మరియు నషా ఉండాలి. నషాకు ఆధారమే నిశ్చయము. నిశ్చయం తక్కువైతే నషా కూడా తగ్గుతుంది, అందుకే నిశ్చయబుద్ధి విజయి అని అంటారు. కనుక పునాది ఏమైనట్లు? నిశ్చయము. నిశ్చయంలో ‘అప్పుడప్పుడు’ అనేవారిగా అవ్వకండి. లేదంటే చివర్లో రిజల్ట్ యొక్క సమయంలో కూడా ప్రాప్తి అప్పుడప్పుడు లభించేదిగా ఉంటుంది, తర్వాత పశ్చాత్తాప పడాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రాప్తి ఉంది, తర్వాత పశ్చాత్తాపం ఉంటుంది. కనుక ప్రాప్తి లభించే సమయంలో ప్రాప్తి అందుకోండి, పశ్చాత్తాప సమయంలో ప్రాప్తిని పొందలేరు. చేసేస్తాములే, అయిపోతుందిలే! అలా కాదు, చేయాల్సిందే అన్న ఈ నిశ్చయం ఉండాలి. చేసేస్తాములే... అన్న ఈ భరోసాతో నడవకండి. చేయడమైతే చేస్తున్నాము కదా... ఇంకేమి అవుతుంది... తయారైపోతాములే... అలా కాదు, ఇప్పుడే తయారవ్వాలి. ‘లే, లే’ అని కాదు. శ్వాసపై ఎలాంటి భరోసా లేదు అని ఇతరులతో ఛాలెంజ్ చేస్తారు కదా, ఇతరులకు జ్ఞానమిస్తారు కదా, మరి మొదట స్వయానికి జ్ఞానమిచ్చుకోండి. ఎప్పుడో చేసేవారా లేక ఇప్పుడే చేసేవారా? కనుక మీరు సదా విజయానికి అధికారి ఆత్మలు. విజయము జన్మ-సిద్ధ అధికారము, ఈ స్మృతితో ఎగురుతూ ఉండండి. ఏం జరిగినా కానీ - నేను సదా విజయిని అన్నది స్మృతిలోకి తీసుకురండి. ఏం జరిగినా, నిశ్చయం స్థిరంగా ఉంది, దానిని ఎవ్వరూ కదిలించలేరు.
అచ్ఛా, ఇప్పుడు అందరూ ఎలాంటి అద్భుతం చేసి చూపించాలంటే ప్రతి స్థానము విజయిగా అనగా నిర్విఘ్నంగా ఉండాలి. ఎలాంటి విఘ్నాలు రాకూడదు. విఘ్నాలు వస్తాయి కానీ ఓడిపోకూడదు. కనుక ఎక్కడైతే విజయముంటుందో, అక్కడ విఘ్నాలు తొలగిపోతాయి, అప్పుడు నిర్విఘ్నంగా అవుతారు. సదా నిర్విఘ్నము - ఈ అద్భుతం చేసి చూపించండి. ఏ గీతా పాఠశాల అయినా, ఉప సేవాకేంద్రాలు అయినా, సేవాకేంద్రాలు అయినా కానీ స్వయం నిర్విఘ్నంగా అవ్వండి మరియు ఇతరులను కూడా నిర్విఘ్నంగా తయారుచేయండి. ఇలాంటి అద్భుతం చూపించండి. చేయాల్సిందే. చేస్తాములే, చూస్తాములే! అలా కాదు! ‘లే, లే’ అని అన్నారంటే నిశ్చయంలో పర్సెంటేజ్ ఉన్నట్లు. అందరూ ఈ శుభవార్తను వినాలి - చిన్న-పెద్ద సెంటర్లు అన్నీ నిర్విఘ్నంగా ఉన్నాయి అని. ఏ రకమైన విఘ్నము రానే రాకుండా ఉండాలి. ఇతరుల విఘ్నాలను కూడా తొలగిస్తాము, విజయులుగా అవుతాము. ఇలాంటి సమాచారాలు రావాలి. ఎక్కడి నుండైనా, విఘ్నానికి సంబంధించిన ఏ సమాచారము రాకూడదు. ఇలా అయితే అనకండి - మేమైతే బాగున్నాము, వీరు చేస్తారు, మేమేమి చేయాలి అని. మూడు నెలలు విజయిగా ఉండి చూపించండి. మూడు నెలల్లోనే తెలిసిపోతుంది. అందరూ సరే అంటే ఈ అద్భుతం చేసి చూపించండి.
గ్రూప్ నం. 2 - ఫరిశ్తాగా అవ్వాలంటే నాది అనే భావన యొక్క భారాన్ని సమాప్తం చేయండి, అందరికీ ప్రియమైనవారిగా అవ్వండి
సదా మిమ్మల్ని మీరు డబల్ లైట్ అనగా ఫరిశ్తా ఆత్మగా అనుభవం చేసుకుంటున్నారా? డబల్ లైట్ యొక్క అర్థమే ఆత్మ లైట్ మరియు ఫరిశ్తా స్వరూపం కూడా లైట్. కర్మలు చేస్తూ కూడా ఫరిశ్తా స్వరూపంలో కర్మలు చేసేవారు. అందరూ ఫరిశ్తాలేనా లేక గృహస్థులా? పిల్లల భారం లేదా? అన్ని భారాలను బాబాకు అప్పగించేసారా? లేక ఇప్పటివరకు ఎవరైనా నావారు ఉన్నారా? మనవడు నావాడు, ఈ ఇల్లు నాది, మిగిలిన నేను బాబావాడిని - ఇలా అయితే లేరు కదా? సత్యమైన పైసా కూడా ఖర్చులేని చక్రవర్తులు. ఒక్క పైసా కూడా లేదు, కానీ చక్రవర్తులు. పైసా కూడా ఖర్చులేని చక్రవర్తిగా ఉండటం ఎంత మంచిది. సంభాళించాల్సిన అవసరమూ ఉండదు, చక్రవర్తులుగానూ ఉంటారు. ఇలా భావిస్తున్నారా? దేహమే నాది కానప్పుడు, దేహ సహచరులు, దేహ పదార్థాలు మరియు దేహ సంబంధాలు, తనువు-మనస్సు-ధనం అన్నీ నీవేనా లేక మనస్సు నీది మరియు ధనం నాది - ఇలా అయితే లేదు కదా? యోగం అయితే చేస్తాము కానీ డబ్బు మాత్రం ఉంచుకోవాల్సిందే. నాది అనే భావన ఉండకూడదు. నాది అనే భావన భారం మరియు భారం కిందకు తీసుకొస్తుంది, ఫరిశ్తాగా అవ్వనివ్వదు. ఏదైనా నాది అనే భావన, నా స్వభావం, నా సంస్కారం, నా నేచర్, ఏదైనా నాది అని ఉంటే అది భారం మరియు భారం ఉన్నవారు ఎగరలేరు, ఫరిశ్తాగా అవ్వలేరు. మరి ఫరిశ్తాలా లేక ఏదో ఒక భారం ఇంకా మిగిలి ఉందా? అవసర సమయం కోసం కొద్దిగా దాచిపెట్టి ఉంచుకున్నారా?
నాది-నాది అంటూ మలినమయ్యారు, ఇప్పుడు నీది-నీది అంటూ స్వచ్ఛంగా అయ్యారు. కావున ఫరిశ్తా అనగా నాది అనే భావన అంశమాత్రం కూడా ఉండకూడదు. సంకల్పంలో కూడా నాది అనే భావన వస్తే మైలపడ్డారని భావించండి. ఏ వస్తువుపైనైనా మలినం పేరుకుంటే మలినం యొక్క భారం అవుతుంది కదా. కావున ఈ నాది అనే భావన అనగా మైలపడటం. ఫరిశ్తాలు, పాత ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదు. సేవ కొరకు ఉన్నారు, సంబంధం లేదు. సేవాభావంతో సంబంధంలోకి వస్తారు. గృహస్థులుగా అయ్యి సేవ చేయరు, సేవాధారులుగా అయ్యి సేవ చేస్తారు. ఇటువంటి సేవాధారులా? సేవాస్థానంగా భావిస్తున్నారా లేక ఇల్లుగా భావిస్తున్నారా? కావున సేవాస్థానం యొక్క విధి ఎలా ఉంటుందో అదే విధి అనుసారంగా నడుస్తున్నారా లేక గృహస్థుల అనుసారంగా నడుస్తున్నారా? సేవాస్థానంగా భావించే విధి అతీతంగా మరియు బాబాకు ప్రియంగా ఉండటం. కొద్దిగా కూడా నాది అనే భావన యొక్క ప్రభావం పడకూడదు. అగ్ని ఉంది కానీ వేడి తగలకూడదు. ఎందుకంటే సాధనాలు ఉన్నాయి కదా. అగ్నిని ఆర్పేవారు అగ్నిలోకి వెళ్తారు కానీ స్వయం వేడికి ప్రభావితం కారు, సేఫ్‌గా ఉంటారు ఎందుకంటే సాధనాలు ఉన్నాయి. అగ్నిని ఆర్పేవారే కాలిపోతే ప్రజలు నవ్వుతారు కదా. కావున వాయుమండలంలో పరిస్థితుల అగ్ని ఉన్నా కానీ ప్రభావం పడకూడదు, వేడి తగలకూడదు. పరిస్థితి లేనప్పుడు చాలా మంచిగా ఉండి, పరిస్థితి వచ్చినప్పుడు వేడి తగిలింది - ఇలా కాదు.
కావున ఇటువంటి ఫరిశ్తాలే కదా. ఫరిశ్తా ఎంత ప్రియంగా అనిపిస్తారు! స్వప్నంలో కూడా ఎవరి దగ్గరకైనా ఫరిశ్తా వస్తే ఎంత సంతోషిస్తారు. ఫరిశ్తా జీవితం అనగా సదా ప్రియమైన జీవితం. బాబా ప్రియాతి ప్రియమైనవారు కదా, కావున పిల్లలు కూడా సదా అందరికీ ప్రియాతి ప్రియమైనవారు. కేవలం పిల్లలు, మనవలు, మనవరాళ్లకు ప్రియమైనవారు కాదు, హద్దులో ప్రియమైనవారు కాదు, అనంతమైనవారికి ప్రియమైనవారు. ఎందుకంటే సర్వ ఆత్మలు మీ కుటుంబం, కేవలం 10-12 మందితో కూడిన కుటుంబం కాదు. ఎంత పెద్ద కుటుంబం? అనంతమైనది. అందరికీ ప్రియమైనవారు. ఎటువంటి ఆత్మ అయినా కానీ మీరు అందరికీ ప్రియమైనవారు. ఎవరైతే ప్రేమిస్తారో వారికి మాత్రమే ప్రియమైనవారు - ఇలా కాదు. అందరికీ ప్రియమైనవారు. గొడవ చేసేవారు, ఏదైనా మాట్లాడేవారు ప్రియమైనవారు కాదు - ఇలా కాదు, అందరికీ ప్రియమైనవారు. మీరు ద్వాపరయుగం నుండి బాబాను ఎంతగా నిందించారు, అయినా బాబా ప్రేమించారా లేక ద్వేషించారా? ప్రేమించారు కదా. కావున ఫాలో ఫాదర్. ఎటువంటి ఆత్మలైనా కానీ మీ దృష్టి, మీ భావన ప్రేమతో కూడినదిగా ఉండాలి - దీనినే అందరికీ ప్రియమైనవారు అని అంటాము. 12 మందికి ప్రియమైనవారు, ఒక్కరికి ప్రియమైనవారు కాదు. కాదు, అందరికీ ప్రియమైనవారు. ఇలా ఉన్నారా లేక ఏదైనా ఆత్మ పట్ల కొద్దిగా-కొద్దిగా వస్తుందా? ఎవరైనా కొద్దిగా ఇన్సల్ట్ చేస్తే, ఎవరైనా ద్వేషిస్తే ప్రేమ వస్తుందా లేక ద్వేషం వస్తుందా? కాదు, వారు పరవశమైన ఆత్మలు. అందరికీ ప్రియమైనవారు – వీరినే ఫరిశ్తా అని అంటాము. కొందరికి మాత్రమే ప్రియమైనవారైతే ఫరిశ్తాలు కాదు.
ఇప్పుడు ఆలోచించి చెప్పండి, మీరు ఎవరు? మాతలు ఏమంటారు? అత్తగారు చాలా చెడ్డవారు, ఆడపడుచు చాలా చెడ్డది. కాదు, అందరూ ప్రియమైనవారే. ఎవరి పట్ల కూడా వేరే భావన ఉండకూడదు. వారు ఏది చెప్పినా, ఏది చేసినా కానీ మీ భావన శుద్ధంగా ఉండాలి. వీరికి కూడా కళ్యాణం జరగాలి. అందరి పట్ల కళ్యాణ భావన ఉండాలి – వీరినే ఫరిశ్తా అని అంటాము. గమ్యం ఉన్నతమైనది కదా లేక సహజమా? మరి ఇటువంటి ఉన్నత స్థితి కూడా ఉందా? ఎందుకంటే ఫరిశ్తాగా అవ్వకపోతే దేవతగా కూడా ఎలా అవుతారు? దేవతల ప్రపంచంలోకి వెళ్తారు కానీ పదవిని ప్రాప్తి చేసుకోలేరు. పేరు అయితే దేవతగా ఉంటుంది కానీ పదవి ఏమిటి? ఒకే కాలేజీ నుండి ఎవరైనా గొప్పవారిగా, ఇంజనీర్‌గా, డాక్టర్‌గా అవ్వడం మరియు ఎవరైనా బూట్ పాలిష్ చేసేవారిగా అవ్వడం మంచిగా అనిపిస్తుందా? సత్యయుగంలోకి అయితే వస్తారు కానీ ఏ పదవిని ప్రాప్తి చేసుకోవాలి అనేది కూడా ఆలోచించండి. ఉన్నత పదవిని పొందాలా లేక ఏది లభిస్తే అది సరిపోతుందా? ఉన్నత పదవిని పొందే సాధనం - ఫరిశ్తాగా అవ్వడం. కావున ఫరిశ్తా యొక్క నిర్వచనం అర్థమైంది కదా. అందరూ బాబావారిగా అయ్యారు. కావున బాబావారిగా అవ్వడం అనగా బాబా సమానంగా అవ్వడం. బ్రహ్మాబాబా ఫరిశ్తాగా అయ్యారు కదా, కావున ఫాలో ఫాదర్.
గ్రూప్ నం. 3 - నేను పరమ పూజ్య ఆత్మను - ఈ స్మృతితో పవిత్రత యొక్క ఫౌండేషన్‌ను దృఢంగా చేయండి
మిమ్మల్ని మీరు కల్ప-కల్పానికి పూజ్య ఆత్మలుగా అనుభవం చేసుకుంటున్నారా? మనమే పూజ్యులుగా ఉండేవారము, మనమే ఉన్నాము మరియు మనమే అవుతాము అనే స్మృతి ఉందా? పూజ్యులుగా అయ్యేందుకు విశేష సాధనం ఏమిటి? ఎవరు పూజ్యులుగా అవుతారు? ఎవరైతే శ్రేష్ఠ కర్మలు చేస్తారో మరియు శ్రేష్ఠ కర్మలకు కూడా ఫౌండేషన్ పవిత్రత. పవిత్రత పూజ్యులుగా చేస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, ఎవరైతే పేరు మాత్రంగానైనా పవిత్రంగా అవుతారో వారు పూజ్యులుగా అవుతారు. కానీ పవిత్రత కేవలం బ్రహ్మచర్యం కాదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేసారు, ఇందులో మాత్రమే శ్రేష్ఠంగా అవ్వడం కాదు. ఇది కూడా శ్రేష్ఠమైనదే కానీ దీనితో పాటు ఇంకా పవిత్రత కావాలి. మనసా సంకల్పంలో కూడా ఏదైనా నెగెటివ్ సంకల్పం ఉంటే దానిని కూడా పవిత్రత అని అనరు, అందువలన ఎవరి పట్ల కూడా నెగెటివ్ సంకల్పం ఉండకూడదు. మాటల్లో కూడా ఏవైనా యథార్థం కాని పదాలు వస్తే దానిని కూడా పవిత్రత అని అనము. సంకల్పం మరియు మాటలు సరిగ్గా ఉన్నా కానీ సంబంధ-సంపర్కంలో తేడా ఉంటే, ఎవరితోనైనా చాలా మంచి సంబంధం ఉండి, ఎవరితోనైనా మంచిగా లేకపోతే దానిని కూడా పవిత్రత అని అనము. కావున ఇలా మనసా-వాచా-కర్మణా అనగా సంబంధ-సంపర్కంలో పవిత్రంగా ఉన్నారా? ఇటువంటి పూజ్యులుగా అయ్యారా? ఒకవేళ ఏ విషయంలోనైనా లోపం ఉంటే దానిని ఖండితం అని అంటాము. ఖండితమైన మూర్తికి పూజ జరగదు. అందువలన కొద్దిగా కూడా మనసా, వాచా, కర్మణాలో ఖండితం కాకూడదు అనగా అపవిత్రత ఉండకూడదు, అప్పుడే పూజ్య ఆత్మ అని అంటాము. మరి ఇటువంటి పూజ్యులుగా అయ్యారా? జడ మూర్తికి కూడా ఖండితం అయితే పూజ జరగదు. దానిని రాయిగా భావిస్తారు, మూర్తిగా భావించరు. మ్యూజియంలో ఉంచుతారు, మందిరంలో ఉంచరు. కావున ఇటువంటి పవిత్రత యొక్క ఫౌండేషన్‌ను చెక్ చేసుకోండి - ఏ సంకల్పం వచ్చినా, నేను పరమ పూజ్య ఆత్మను అనే స్మృతిలోకి తీసుకురండి. ఇది గుర్తుంటుందా లేక ఏదైనా విషయం వచ్చిన సమయంలో మర్చిపోయి, తరువాత గుర్తుకొస్తుందా? అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది - ఇలా చేయకుండా ఉంటే చాలా బాగుండేది. కావున సదా నేను పవిత్ర ఆత్మను, పావన ఆత్మను. పవిత్రత అనగా స్వచ్ఛత. స్వచ్ఛత ఎంత ప్రియంగా అనిపిస్తుంది. మందిరం ఉన్నా, మూర్తి ఉన్నా కానీ స్వచ్ఛత లేకపోతే మంచిగా అనిపిస్తుందా? కావున నేను పూజ్య ఆత్మను, ఈ శరీర రూపీ మందిరంలో విరాజమానమై ఉన్నాను - ఈ స్మృతిని సదా జీవితంలోకి తీసుకురండి. కేవలం ఆలోచించకండి కానీ జీవితంలోకి తీసుకురండి. ఆలోచించేది అయితే చాలా చేస్తారు కదా - ఇది కూడా నేను, అది కూడా నేను.... కానీ ప్రాక్టికల్ అనుభవంలోకి రావాలి. కావున ఏమి గుర్తుంచుకుంటారు? నేను సంపూర్ణ పూజ్య ఆత్మను. పర్సెంటేజ్లో కాదు - 80% పూజ్య, 20% ఖండితం. కాదు. కావున 100% పూజ్య అనగా 100% పవిత్రం. అందరికీ స్వచ్ఛత మంచిగా అనిపిస్తుందా లేక చెత్త మంచిగా అనిపిస్తుందా? కావున మిమ్మల్ని మీరు అడగండి - మనస్సు స్వచ్ఛంగా అయ్యిందా, బుద్ధి స్వచ్ఛంగా అయ్యిందా? లేక కొద్దిగా స్వచ్ఛంగా, కొద్దిగా అస్వచ్ఛంగా ఉందా? ఇక్కడ చెత్త పడి ఉంటే మీరు దానిపై కూర్చుంటారా? దానిపై కూర్చోవడం మంచిగా అనిపించదు కదా. కావున కొద్దిగా కూడా అపవిత్రత అనగా చెత్త ఉంటే బాబాకు మంచిగా అనిపించదు అని భావించండి. చెత్త ఉంటే బాబాకు ప్రియమైనవారిగా అవ్వలేరు కదా. బ్రాహ్మణులుగా అయ్యిందే బాబాకు ప్రియమైనవారిగా అయ్యేందుకు. పూజ్య ఆత్మలు అందరికీ ప్రియమైనవారు. జడ మూర్తి అయినా ఎంత ప్రియంగా అనిపిస్తుంది. తమ చైతన్య కుటుంబం పట్ల ఉన్నంత ప్రేమ కంటే మూర్తి పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది. పరస్పరం గొడవ పడతారు కానీ మూర్తిని ప్రేమిస్తారు. ఎందుకు ప్రేమిస్తారు? పవిత్రత ఉంది కదా. పవిత్రత అనగా కొద్దిగా కూడా అపవిత్రత ఉండకూడదు. అందరికీ చెబుతారు కదా, ఒక మణుగు (40 కిలోల కొలత) పాలలో ఒక్క చుక్క విషం పడినా మొత్తం విషంగా అయిపోతుంది. అలాగే కొద్దిగా కూడా అశుద్ధత ఉంటే ఎటువంటి ఆత్మ అని అంటాము? శుద్ధమా లేక అశుద్ధమా? సగం, హాఫ్ కాస్ట్ అని అంటాము. కావున సదా ప్రతి కర్మ చేస్తూ, సంకల్పం చేస్తూ, మాటలు మాట్లాడుతూ చెక్ చేసుకోండి - బాబాకు ప్రియమైనవారు ఎవరు? పవిత్ర ఆత్మా లేక మిక్స్ ఆత్మా? పవిత్ర ఆత్మ ప్రియమైనది ఎందుకంటే బాబా సదా పరమ పవిత్రమైనవారు, కావున వారికి పవిత్రతే ప్రియంగా అనిపిస్తుంది. మరి ఈ సంవత్సరంలో ఏమి చేస్తారు? కొద్దిగా కూడా ఖండితం కాదు. సదా పరమపూజ్యులు. అద్భుతం చేసి చూపిస్తారు కదా లేక ఆలోచిస్తారా, చూస్తారా? కాదు. చేస్తారు. చేయి ఎత్తిన ఫోటో వస్తోంది. మంచిది, బాబా అయితే సదా పిల్లలపై నిశ్చయం ఉంచుతారు. చాలా మంచిది, ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి. ఎవరైతే ముందుకు వస్తారో వారే అవ్వల్ నంబర్ (మొదటి నంబర్) అర్జునులు. బాబా అయితే అందరినీ అవ్వల్ నంబర్‌గానే చూస్తారు. సెకండ్, థర్డ్లోకి రావద్దు కదా, సరే వీరిపై ఉపకారం చేస్తూ వారికి మొదటి నంబర్ ఇస్తాము అని అనుకుంటున్నారా? పురుషార్థంలో రేస్ చేయండి, ఇతర విషయాల్లో రేస్ చేయకండి. కావున కేవలం పూజ్యులు కాదు, పరమ పూజ్య ఆత్మలం - ఇది సదా స్మృతిలో ఉండాలి. ఇక్కడ పూజ్యులమని చెప్పి వెళ్లి అక్కడ ఖండితంగా అయిపోకండి. తరువాత దెబ్బ తగిలింది అందుకే ఖండితంగా అయ్యాము అని చెప్పకండి. ఎవరైనా ఎంత దెబ్బ కొట్టినా కానీ ఖండితంగా అవ్వకండి. ఎంత పెద్ద, బరువైన సుత్తితో కొట్టినా కానీ ఖండితంగా అవ్వకూడదు. కావున పక్కాగా గుర్తుంచుకుంటారు కదా. రిజల్ట్ చూస్తాము. అచ్ఛా!
గ్రూప్ నం. 4 - స్వయం సంతుష్టంగా ఉండటం మరియు ఇతరులను సంతుష్టపరచడం - ఇదే కర్మయోగి యొక్క ముఖ్యమైన గుర్తు
అందరూ మిమ్మల్ని మీరు సహజయోగిగా అనుభవం చేసుకుంటున్నారా? సహజం యొక్క గుర్తు ఏమిటి? అందులో శ్రమ ఉండదు. అది సదా ఉంటుంది, నిరంతరం ఉంటుంది. కష్టమైన పని అయితే సదా చేయలేరు. ఏది సహజంగా ఉంటుందో అది స్వతహాగా మరియు నిరంతరం నడుస్తూ ఉంటుంది. కావున సహజయోగి అనగా నిరంతర యోగి. అప్పుడప్పుడు సాధారణంగా, అప్పుడప్పుడు యోగిగా, ఇలా కాదు కదా? యోగీ జీవితం అయితే జీవితం సదా ఉంటుంది. అందువలన యోగం చేసేవారు కాదు, కానీ యోగీ జీవితం కలవారు. బ్రాహ్మణ జీవితం అయితే యోగం ఎప్పుడూ కిందకు-పైకి అవ్వనే అవ్వదు. ఎందుకంటే కేవలం యోగి కాదు కానీ కర్మయోగి. కావున కర్మ లేకుండా ఒక్క సెకండు కూడా ఉండలేరు. నిద్రపోయినా నిద్రపోయే కర్మ అయితే చేస్తున్నారు కదా. కావున కర్మ లేకుండా ఎలా ఉండలేరో అలాగే యోగీ జీవితం కలవారు యోగం లేకుండా ఉండలేరు. ఇలా అనుభవం చేసుకుంటున్నారా లేక యోగం తెగిపోతుందా, మళ్ళీ జోడించాల్సి వస్తుందా? మళ్ళీ అప్పుడప్పుడు కుదురుతుంది, అప్పుడప్పుడు టైమ్ పడుతుంది - ఇలా అయితే లేదు కదా. యోగం యొక్క సహజమైన అర్థమే స్మృతి. మరి స్మృతి ఎవరిది వస్తుంది? ఎవరైతే ప్రియంగా అనిపిస్తారో వారిదే. రోజంతటిలో చూడండి, స్మృతి వస్తే అది ప్రియమైన వస్తువుదే అయి ఉంటుంది. మరి అందరికంటే ప్రియాతి ప్రియమైనవారు ఎవరు? (బాబా) అయితే సహజంగా మరియు స్వతహాగా స్మృతి రావాలి కదా. ఎక్కడైనా, దేహంలో, దేహ సంబంధంలో, పదార్థంలో ప్రేమ ఉంటే బాబాకు బదులుగా అదే గుర్తుకొస్తుంది. అప్పుడప్పుడు దేహంతో ప్రేమ ఏర్పడితే బాడీ కాన్షియస్గా అయిపోతారు. కావున బాబా తప్ప ఇంకేదైనా ఆకర్షించే వస్తువు లేదా వ్యక్తి ఉన్నారా అని చెక్ చేసుకోవాలి?
కర్మయోగి ఆత్మ యొక్క ప్రతి కర్మ యోగయుక్తంగా, యుక్తియుక్తంగా ఉంటుంది. ఏ కర్మ అయినా యుక్తియుక్తంగా లేకపోతే యోగయుక్తంగా లేరని భావించండి. సాధారణ కర్మ జరిగినా, వ్యర్థ కర్మ జరిగినా నిరంతర యోగి అని అనరు. కర్మయోగి అనగా ప్రతి సెకండు, ప్రతి సంకల్పం, ప్రతి మాట సదా శ్రేష్ఠంగా ఉండటం. కావున సహజయోగి అనగా కర్మయోగి మరియు కర్మయోగి అనగా సహజయోగి. రోజంతటిలో ఏదైనా సాధారణ కర్మ జరుగుతోందా? శ్రేష్ఠంగా జరిగిందా? అని చెక్ చేసుకోండి. శ్రేష్ఠ కర్మ యొక్క గుర్తు - స్వయం సంతుష్టంగా మరియు ఇతరులు కూడా సంతుష్టంగా ఉంటారు. నేను అయితే సంతుష్టంగా ఉన్నాను, ఇతరులు ఉన్నా లేకపోయినా ఫరవాలేదు - ఇలా కాదు. యోగీ జీవితం కలవారి ప్రభావం స్వతహాగా ఇతరులపై పడుతుంది. ఎవరైనా స్వయంతో అసంతుష్టంగా ఉన్నా లేదా ఇతరులు వారి పట్ల అసంతుష్టంగా ఉన్నా యోగయుక్తంగా అవ్వడంలో ఏదో లోపం ఉందని భావించాలి. మరి అందరూ సంతుష్టంగా ఉంటున్నారా లేక నేను పూర్తిగా సరిగ్గానే ఉన్నాను అని మిమ్మల్ని మీరు సంతోషపరచుకుంటున్నారా?
అందరూ సంతుష్టంగా ఉన్నారా లేక కొందరు సంతుష్టంగా, కొందరు అసంతుష్టంగా ఉన్నారా? మీ పట్ల మీరు సంతుష్టంగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఏదైనా బలహీనత వస్తే అసంతుష్టంగా అవుతున్నారా? అప్పుడప్పుడు ఇలా జరుగుతోందా లేక సంపూర్ణంగా అయిపోయారా? సంతుష్టత యోగి జీవితానికి విశేష లక్ష్యం. మరి మీ సహచరులను అడిగితే సంతుష్టంగా ఉన్నామని చెబుతారా లేక ముఖాన్ని కొద్దిగా అలా పెడతారా? ఎందుకంటే యోగి జీవితానికి మూడు సర్టిఫికెట్లు ఉన్నాయి - ఒకటి, స్వయంతో సంతుష్టత; రెండవది, బాబా సంతుష్టత; మూడవది, లౌకిక-అలౌకిక కుటుంబం సంతుష్టత. మరి మూడు సర్టిఫికెట్లు ఉన్నాయా లేక తీసుకోవాలా? సైన్స్ సాధనాల ప్రభావం వాయుమండలంపై పడుతుంది కదా, ఎయిర్ కండీషన్ నడుస్తుంటే వాయుమండలంలో చల్లదనం యొక్క ప్రభావం పడుతుంది. అలాగే యోగీ జీవితం యొక్క ప్రభావం ఉంటుంది. ఇటువంటి ప్రభావం ఉందా? యోగం అనగా సైలెన్స్ యొక్క శక్తి. దీనినే యోగీ జీవితం అనగా సైలెన్స్ శక్తి కలిగిన జీవితం అని అంటారు. మరి ఇలా ఉన్నారా లేక హా-హా అంటూ ఉంటున్నారా? ప్రతిరోజూ చెకింగ్ ఉండాలి. చెక్ చేస్తే చేంజ్ అవుతారు. అచ్ఛా!
గ్రూప్ నం. 5 - ప్రత్యక్షఫలం యొక్క ప్రాప్తి కలగడం - ఇదే సంగమయుగం యొక్క అన్నింటికంటే గొప్ప విశేషత
మిమ్మల్ని మీరు సంగమయుగీ బ్రాహ్మణ ఆత్మలుగా భావిస్తున్నారా? సంగమయుగం యొక్క మహిమ గురించి బాగా తెలుసు కదా? సంగమయుగం యొక్క అన్నింటికంటే గొప్ప విశేషత ఏమిటి? బాబా మరియు పిల్లల, ఆత్మ మరియు పరమాత్మ యొక్క మేళా సంగమంలో జరుగుతుంది.
ఈ సమయంలో సంగమయుగంలో బాబా మరియు పిల్లల మేళా ఉంది మరియు ప్రజలు ఇక్కడ నదుల మేళాను సంగమంగా చేసేశారు. మరి ఇది దేని నుండి కాపీ చేసారు? ఈ సమయం నుండే కాపీ చేసారు కదా. ఇంకా సంగమయుగం యొక్క ఏ విశేషత ఇతర ఏ యుగంలోనూ లేదు? అన్నింటికంటే మంచి విశేషత ఏమిటంటే సంగమయుగంలోనే ప్రత్యక్షఫలం లభిస్తుంది. కావున ఇది విశేషత కదా. సత్యయుగంలో సంగమయుగ కర్మల ఫలం లభిస్తుంది. కానీ ఇక్కడ బాబావారిగా అయ్యారు మరియు వారసత్వం లభించింది. సేవ చేసారు మరియు సేవ చేయడంతోపాటు సంతోషం లభించింది. స్మృతిలో ఉంటూ ఏ సేవ చేసినా లేదా ఏ కర్మ చేసినా కర్మ యొక్క ప్రత్యక్షఫలాన్ని అనుభవం చేసుకుంటూ వెళ్ళండి. కర్మ చేసారు, సేవ చేసారు కానీ ప్రత్యక్షఫలం రూపంలో ఎటువంటి అనుభవం కలగకపోతే - ఫలం ఎందుకు లభించలేదు? అని చెక్ చేసుకోండి. కర్మలో స్వార్థం ఉంటే, సేవలో స్వార్థం ఉంటే ఫలం లభించదు. కానీ యోగయుక్త కర్మ లేదా యోగయుక్త యథార్థ సేవ యొక్క ఫలంగా సంతోషం, అతీంద్రియ సుఖం లేదా డబల్ లైట్ అనుభూతి, బాబా యొక్క ఏదో ఒక గుణం యొక్క అనుభూతి తప్పకుండా కలుగుతుంది. మరి ప్రత్యక్షఫలం తినేవారే కదా, తింటున్నారా? ప్రత్యక్షఫలం తినేవారికి ఎటువంటి అనుభూతి కలుగుతుంది? సదా మనస్సు మరియు బుద్ధి ఆరోగ్యంగా ఉంటాయి. బలహీనంగా ఉంటే తాజా ప్రత్యక్షఫలం తినడం లేదని భావించండి. ప్రజలు శరీరం కోసం ఫ్రెష్ ఫ్రూట్ ఎందుకు తింటారు? హెల్త్ కోసం తింటారు కదా. కావున ఆత్మ కోసం ఈ ప్రత్యక్షఫలం సదా హెల్దీగా చేస్తుంది. అందుకే మీ స్లోగన్ - ఎవర్ హెల్దీ, ఎవర్ వెల్దీ మరియు ఎవర్ హ్యాపీ. ఎవర్ వెల్దీ కూడా కదా?
ఎన్ని ఖజానాలు లభించాయి? జ్ఞానం యొక్క ఖజానా, శక్తుల యొక్క ఖజానా, గుణాల యొక్క ఖజానా, సమయం యొక్క ఖజానా - అన్ని ఖజానాలు ఉన్నాయి కదా లేక కొన్ని ఉన్నాయి, కొన్ని లేవా? ఎంత ఎక్కువగా ఉన్నాయంటే ఇతరులకు కూడా ఇస్తూ ఉంటారు. మహాదానులే కదా. ప్రతిరోజూ ఇస్తున్నారా లేక అప్పుడప్పుడే ఇస్తున్నారా? అఖండ మహాదానులు. మనసా ద్వారా ఇవ్వండి, వాణి ద్వారా ఇవ్వండి, సంబంధ-సంపర్కం ద్వారా ఇవ్వండి కానీ తప్పకుండా ఇవ్వాలి. ఇది సహజమేనా లేక ఛాన్స్ లభిస్తే ఇస్తారా? ఏమనుకుంటున్నారు? అఖండమే కదా? ఫాలో ఫాదర్ చేసేవారే కదా? ఎవరితో ప్రేమ ఉంటుందో వారిని ఫాలో చేయడం సహజంగా ఉంటుంది. మరి బాబాతో ఎంత ప్రేమ ఉంది? (అన్లిమిటెడ్) అయితే ఖజానాలు కూడా అన్లిమిటెడ్, సేవ కూడా అన్లిమిటెడ్. అనంతమైనది కదా. హద్దు అయితే లేదు కదా. సదా అనంతమైన సంతోషం, అనంతమైన నషా, అనంతమైన ప్రాప్తి.
డబల్ విదేశీయులు ఈ సంవత్సరంలో ఏ నవీనత చేస్తారు? (పురుషార్థంలో ఫస్ట్ నంబర్ తీసుకుంటాము) ఫస్ట్ నంబర్లో అయితే వస్తారు కానీ ఇంకా ఏమి చేస్తారు? మీ మీ స్థానంలో, ఎక్కడి నుండి వచ్చినా, మీ సేవాస్థానం లేదా మీ దేశంలో మొత్తం వాయుమండలాన్ని ఎంత శక్తిశాలిగా చేయాలంటే అందరూ అచలంగా ఉండాలి, ఎవరూ అలజడిలోకి రాకూడదు. ఇది చేయగలరా? ఈ సంవత్సరంలో ఒక్క బ్రాహ్మణ ఆత్మ కూడా అలజడిలోకి రాకూడదు. ఇటువంటి వాతావరణాన్ని తయారుచేయండి. ఈ సంవత్సరంలో ఇదే చూస్తాము. స్వయం నిర్విఘ్నంగా అవ్వాల్సిందే కానీ ఇతరులను కూడా అలా తయారుచేయాలి. ధైర్యం ఉంది కదా?
ఒకటి, పాయింట్ స్వరూపాన్ని అనుభవం చేసుకోవడం. రెండవది, ఏదైనా సంకల్పం, మాట లేదా కర్మ వ్యర్థంగా ఉంటే దానికి పాయింట్ పెట్టడం అనగా బిందువు పెట్టడం. మూడవది, జ్ఞానం లేదా ధారణ యొక్క అనేక పాయింట్లను మననం చేసి స్వయం పట్ల లేదా సేవ పట్ల సమయానుసారంగా కార్యంలో ఉపయోగించడం.
*** ఓంశాంతి ***
