‘‘పవిత్రతతో కూడిన ఆత్మిక పర్సనాలిటీ యొక్క స్మృతి స్వరూపము ద్వారా మాయాజీతులుగా అవ్వండి’’
ఈరోజు స్నేహ సాగరుడైన బాప్‌దాదా నలువైపులా ఉన్న సర్వ స్నేహీ పిల్లలను చూస్తున్నారు. స్నేహీ పిల్లలు ప్రతి ఒక్కరి మూర్తిలో ఆత్మిక పర్సనాలిటీ యొక్క మెరుపును చూస్తున్నారు. బాహ్య రూపంగా అయితే సాధారణ పర్సనాలిటీ కలిగినవారు కానీ ఆత్మిక పర్సనాలిటీలో అందరికంటే నంబర్‌వన్. ప్రపంచంలో అనేక రకాల పర్సనాలిటీల గురించి గాయనం చేస్తారు. శారీరక పర్సనాలిటీ, ఏదైనా విశేషత యొక్క పర్సనాలిటీ, ఏదైనా విశేష పొజిషన్ యొక్క పర్సనాలిటీ, కానీ మీ అందరి ముఖాలపై, నడవడికలో ఏ పర్సనాలిటీ కనిపిస్తుంది? పవిత్రతా పర్సనాలిటీ. పవిత్రతయే పర్సనాలిటీ. ఎవరైనా ఎంతెంతగా పవిత్రంగా ఉంటారో అంతంతగా వారి పర్సనాలిటీ కనిపించడమే కాదు కానీ అనుభవం కూడా అవుతుంది. అందరూ మీ ఆత్మిక పర్సనాలిటీని అనుభవం చేసుకుంటున్నారా? మీ వంటి పర్సనాలిటీ సత్యయుగం నుండి ఇప్పటివరకు ఎవరికైనా ఉందా? పూర్తి కల్పం చుట్టి రండి, మీ వంటి పర్సనాలిటీ ఎవరికైనా ఉందా? లేదు కదా! మరి మీకు మీ ఆత్మిక పర్సనాలిటీ యొక్క నషా ఉందా! అనాది కాలంలో అయితే పరంధామంలో కూడా విశేష ఆత్మలైన మీ పర్సనాలిటీ అందరికంటే ఉన్నతమైనది. ఆత్మలన్నీ మెరుస్తూ ఉన్నటువంటి జ్యోతులే అయి ఉండవచ్చు కానీ ఆత్మిక పర్సనాలిటీ కలిగిన ఆత్మలైన మీ మెరుపు ఇతర ఆత్మలు అన్నింటికన్నా అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. మీ అనాది కాలంలోని పర్సనాలిటీని స్మృతిలోకి తీసుకురండి. గుర్తుకు వచ్చిందా? చూసుకుంటున్నారా? బాప్‌దాదాతో పాటు ఈ విధంగా ఆత్మిక పర్సనాలిటీతో ఎలా కనిపిస్తున్నారో చూసుకుంటున్నారా. మిమ్మల్ని మీరు చూసుకోగలుగుతున్నారా? అయితే అనాది కాలంలోకి వెళ్ళిపోండి. ఎంత సమయంలో వెళ్ళగలరు? వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? సెకండు కన్నా తక్కువ కదా! లేక ఒక రోజు, ఒక గంట పడుతుందా? సెకండు కన్నా తక్కువ సమయంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోగలరు. మరి అనాది కాలంలోని మీ పర్సనాలిటీని చూసుకున్నారా? ఇప్పుడు అనాది కాలం నుండి ఆది కాలంలోకి రండి. వచ్చేసారా లేక ఇంకా వస్తూ ఉన్నారా? చేరుకున్నారా? అనాది కాలం తర్వాత ఆది కాలంలో మీ ఆత్మిక పర్సనాలిటీని చూడండి - ఎంతటి శ్రేష్ఠమైన పర్సనాలిటీ! తనువు పరంగా కూడా, మనసు పరంగా కూడా, అలాగే ధనము పరంగా కూడా మరియు సంబంధాల పరంగా కూడా. అన్ని రకాలుగా పర్సనాలిటీ ఎంత శ్రేష్ఠమైనది! మరి ఆది కాలంలోని పర్సనాలిటీని చూసుకుంటున్నారా? ఎంత సుందరంగా అనిపిస్తున్నారు, ఎంతగా అలంకరించబడి ఉన్నారు, ఎంతగా సుఖము, శాంతి, ప్రేమ, ఆనంద స్వరూపులుగా ఉన్నారు, ఇలా ఆది కాలంలో కూడా మీ పర్సనాలిటీని చూసుకోండి. స్పష్టంగా కనిపిస్తుందా లేక 5 వేల సంవత్సరాల క్రితం విషయం కాబట్టి అంత స్పష్టంగా లేదా? అందరికీ స్పష్టంగా ఉందా? అందరూ తెలివైనవారు. అయితే ఆది కాలంలో కూడా మీది చూసుకున్నారు. ఇప్పుడు మధ్య కాలంలోకి రండి, మధ్య కాలంలో కూడా మీ పర్సనాలిటీ ఎలా ఉంది? మీ జడ చిత్రాలు ఎంత విధి పూర్వకంగా పూజింపబడుతున్నాయి మరియు మహిమ చేయబడుతున్నాయి. ధర్మాత్ములు, మహాత్ములు, నేతలు వీరందరూ ఎంతగా పర్సనాలిటీ కలిగినవారిగా గాయనం చేయబడినా కానీ మీ జడ చిత్రాల పర్సనాలిటీ ముందు వారి పర్సనాలిటీ అసలేమీ కాదు! మీ అందరికీ పూజ జరిగిన విధంగా ఏ మహాత్మకైనా, నేతకైనా లేక ధర్మాత్మకైనా విధి పూర్వకంగా పూజ జరుగుతుందా? ఎప్పుడైనా చూసారా? మీ జడ చిత్రాలకు జరిగినంత అలంకరణ ఇంకెవరికైనా జరుగుతుందా? కావున మధ్య కాలంలో కూడా ఆత్మలైన మీ పవిత్రతా పర్సనాలిటీ యొక్క విశేషత ఎంత శ్రేష్ఠమైనది! మీ చిత్రాన్ని చూసుకున్నారా? మీ పూజ జరుగుతుందా లేదా? కేవలం పెద్ద-పెద్ద వారి పూజే జరుగుతుంది, మాది కాదు అంటారా! డబల్ విదేశీయుల మందిరం ఉందా? చూసారా, అందులో మీ చిత్రము ఉందా? లేక విన్నాము కాబట్టి అవును, ఉంటాము అంటున్నారా! గుర్తుకు వచ్చిందా? మరి మీ మధ్య కాలం కూడా అతి శ్రేష్ఠంగా ఉంది. ఇప్పుడు చివరి జన్మలో ఉన్నది మరజీవా బ్రాహ్మణ జన్మ, ఇక్కడ పర్సనాలిటీని చూడండి, ఎంత గొప్పది! ఎంత గాయనం ఉంది - ఏ శ్రేష్ఠ కార్యమునైనా ఇప్పటికీ మీ నామధారీ బ్రాహ్మణులే చేస్తున్నారు. ఇప్పటి బ్రాహ్మణులు బ్రాహ్మణులుగా లేకపోయినా కానీ పేరుకైతే బ్రాహ్మణులే కదా! మీ పేరుతో మీ పర్సనాలిటీ కారణంగా వారు కూడా శ్రేష్ఠమైనవారిగా గాయనం చేయబడుతున్నారు. మరి బ్రాహ్మణ జన్మ యొక్క పర్సనాలిటీ ఎంత శ్రేష్ఠమైనది! ఆది కాలము, అనాది కాలము, మధ్య కాలము మరియు ఇప్పుడు అంతిమ కాలము - పూర్తి కల్పంలో మీ పర్సనాలిటీ సదా మహాన్గానే ఉంది.
లౌకిక పర్సనాలిటీ కలవారికి ఒకవేళ పేరు వచ్చినా కానీ ఏదైనా విశేష పుస్తకంలో వారి పేరు వస్తుంది - ఫలానా ఫలానా వారు అని. కానీ మీ పేరు ఎందులో వస్తుంది? సాధారణ పుస్తకములో రాదు, శాస్త్రాలలో వస్తుంది. ఆది కాలం నుండి ఏవైతే శాస్త్రాలు తయారయ్యాయో, వాటిలో ఎవరి చరిత్ర ఉంది? ఎవరి గాయనం ఉంది? ఎవరి కథలు ఉన్నాయి? లౌకిక పర్సనాలిటీ కలవారి గాయనము విశేషమైన పుస్తకంలో ఉంటుంది మరియు మీ గాయనము శాస్త్రాలలో ఉంటుంది. ఆ శాస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉంది! ఎంతో విధి పూర్వకంగా శాస్త్రాలను సంభాళిస్తారు, వాటిని కూడా ఎంతో పూజ్య రూపంలో చూస్తారు. సత్యమైన భక్తులు ఎవరైతే ఉంటారో, వారు శాస్త్రాలను విధి పూర్వకంగా పెట్టుకుంటారు కూడా మరియు చదువుతారు కూడా. సాధారణ పుస్తకాల వలె పెట్టుకోరు. మరి మీ పవిత్రతా పర్సనాలిటీని సదా ఇమర్జ్ రూపంలో స్మృతిలో ఉంచుకోండి. తెలుసులే... అది మేమే కదా... అని మర్జ్ రూపములో కాదు. స్మృతి స్వరూపంలో ఉంచుకోండి. ఎవరి బుద్ధిలో అయితే ఇమర్జ్ రూపంలో ఈ స్మృతి ఉంటుందో, ఆ స్మృతియే సమర్థతకు ఆధారము. మరియు ఎక్కడైతే సమర్థత ఉంటుందో, అక్కడకు మాయ రాగలదా? సమర్థ ఆత్మ వద్దకు మాయ రావడము అసంభవము. శ్రమించే అవసరమే లేదు. మాయ పని రావడము కానీ మీ పని ఇప్పటి సమయమనుసారంగా మాయను పారద్రోలడము కాదు. మాయ వచ్చింది, పారద్రోలాము, కాదు. మీ పని సదా మాయాజీతులుగా ఉండటము. మరి మాయాజీతులుగా ఉన్నారా లేక మాయను పదే-పదే పారద్రోలేవారా? ఇప్పటికీ పారద్రోలవలసి వస్తుందా, కొద్దికొద్దిగా అది మీకు దర్శనం ఇవ్వడానికి వస్తూ ఉంటుందా! అలా కాదు కదా! డబల్ విదేశీయులు మాయను సదా కోసం పారద్రోలారా? లేక పారద్రోలుతూనే ఉంటారా? ఏమిటి పరిస్థితి? మాయ సదా కోసం వెళ్ళిపోయిందా? ఇప్పుడిక రాదు కదా? లేక కొద్దికొద్దిగా వచ్చినా ఫర్వాలేదా? ఎంతైనా అర్థకల్పపు స్నేహము ఉంది, ఫ్రెండ్ కదా! మరి దానిని అలా, అస్సలు రానే రానంతగా వదిలేస్తారా! సమయం సమాప్తి అవ్వకముందే బహుకాలపు మాయాజీతులుగా అయ్యే అభ్యాసం ఉండాలి అని వినిపించాము కదా. ఇది చివరిలో సాధ్యం కాదు. ఒకవేళ అంతిమంలో మాయాజీతులుగా అయ్యే పురుషార్థం చేసినా పరిస్థితి ఎలా ఉంటుంది. బాప్‌దాదా చిలుక కథను వినిపిస్తారు కదా, చిలుకకు కుళాయిపై కూర్చోవద్దు అని చెప్పారు, కానీ అది కుళాయిపై కూర్చునే ఆ మాట చెప్తూ ఉంటుంది. అలాగే అంతిమ సమయంలో ఒకవేళ బహుకాలపు అభ్యాసం లేకపోతే మనసులో నేను ఆత్మను, నేను ఆత్మను అని అనుకుంటూ ఉంటారు కానీ మాయ ప్రభావం కూడా ఉంటూ ఉంటుంది, నేను ఆత్మను, నేను ఆత్మను అన్న ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు కానీ అది జరగదు. అందుకే ఏం చేయాలి? ఇప్పటి నుండే మాయాజీతులుగా అయ్యే అభ్యాసం చేయండి. అందుకు సహజ సాధనము - తమ ఆత్మిక పర్సనాలిటీని స్మృతి స్వరూపంలో పెట్టుకోండి. పర్సనాలిటీ కలవారి గుర్తులు ఏమి ఉంటాయి? ఉన్నత పర్సనాలిటీ కలిగినవారి దృష్టి ఎక్కడికి, ఎవరివైపుకు వెళ్ళదు. వీరిలా ఉన్నారు, వీరిలా ఉన్నారు, ఇతను ఇలా చేస్తారు, ఈమె ఇలా చేస్తుంది, నేనెందుకు చేయకూడదు, నేనెందుకు చేయలేను... ఇతరుల ప్రాప్తి వైపుకు వారి దృష్టి వెళ్ళదు. ఎందుకు? ఆత్మిక పర్సనాలిటీ కలవారు సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. స్వభావంలో కూడా సంపన్నము, సంస్కారాలలో కూడా సంపన్నము మరియు సంబంధ-సంపర్కాలలో కూడా సంపన్నముగా, నిండుగా ఉంటారు. వారు ఎప్పుడూ తమ ప్రాప్తుల భాండాగారములో ఏ అప్రాప్తిని అనుభవం చేయనే చేయరు. ఎందుకని? ఆత్మిక పర్సనాలిటీ కారణంగా వారు సదా మనసుతో నిండుగా ఉన్న కారణంగా సంతుష్టంగా ఉంటారు. స్వయంలో అప్రాప్తి అనుభవం చేసుకున్నప్పుడు దృష్టి ఇతరుల వైపుకు వెళ్తుంది. మరి మీకు ఏదైనా అప్రాప్తి ఉందా? పాట ఏమని పాడుతారు - బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువే లేదు... ఈ పాటను నోటితో కాకుండా మనసుతో పాడుతారు కదా? అలా పాడేవారు చేతులెత్తండి. అచ్ఛా, డబల్ విదేశీయులు కూడా పాట పాడుతారా? అచ్ఛా!
బాప్‌దాదా ఈ రోజు నలు వైపుల ఉన్న పిల్లల పవిత్రతా పర్సనాలిటీని చెక్ చేస్తున్నారు. పవిత్రత యొక్క నిర్వచనము గురించి కూడా బాగా తెలుసుకున్నారు. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు, బ్రహ్మచర్య వ్రతంలో అయితే నేటి పరిస్థితుల అనుసారంగా ఎంతోమంది అజ్ఞానులు కూడా ఉంటున్నారు. జ్ఞానంతో కాదు కానీ పరిస్థితులను చూసి. ఎందరో భక్తులు కూడా ఉంటున్నారు. అదేమంత పెద్ద విషయము కాదు. కానీ పవిత్రతను రోజంతటిలో చెక్ చేసుకోండి - పవిత్రతకు గుర్తు స్వచ్ఛత, సత్యత. ఒకవేళ రోజంతటిలో లేవడములో, కూర్చోవడములో, మాట్లాడడములో, సేవ చేయడములో, స్థూల సేవ చేసినా లేక సూక్ష్మ సేవ చేసినా, దానిని ఒకవేళ విధి పూర్వకంగా చేయకపోతే, విధిలో కూడా ఒకవేళ కొద్దిగా తేడా వచ్చినా అది కూడా స్వచ్ఛత అనగా పవిత్రత కాదు. వ్యర్థ సంకల్పాలు కూడా అపవిత్రతయే. ఎందుకని? మేము పాపమైతే చేయలేదు కదా, ఎవరికీ దుఃఖమైతే ఇవ్వలేదు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఒకవేళ వ్యర్థం నడిచినా, సమయం వృథా అయినా, సంకల్పాలు వృథా అయినా, సంతుష్టత కోల్పోయినా, మీ పవిత్రత యొక్క ఫైనల్ స్టేజ్ యొక్క డిగ్రీలో తేడా వచ్చేస్తుంది. 16 కళలు కలవారిగా అవ్వలేరు. 15 కళలు, 14 కళలు, పదిహేనున్నర కళలు... నంబరువారుగా అయిపోతారు. కనుక అపవిత్రత అంటే కేవలం ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వడమో లేక పాప కర్మ చేయడమో మాత్రమే కాదు. స్వయంలో సత్యత మరియు స్వచ్ఛతలను విధి పూర్వకంగా అనుభవం చేస్తే మీరు పవిత్రులు. అలా వచ్చేసింది, అలా మాట్లాడకూడదు కానీ మాట్లాడేసాను, దీనిని ఏమంటారు? యజమానులా? అందుకే అమృతవేళ నుండి రాత్రి వరకు మీ సంకల్పాలు, మాటలు, కర్మలు మరియు సేవ - అన్నింటినీ చెక్ చేసుకోండి. బయటకు కనిపించే విషయాలలోనే చెక్ చేసుకోవడం కాదు. బయటకు కనిపించే విషయాలలోనే చెక్ చేసుకుంటే, చూడండి, చంద్రవంశీయులకు గుర్తుగా విల్లు-బాణము ఇచ్చారు మరియు సూర్యవంశీయులకు ఎంత చిన్నని మురళిని ఇచ్చారు. మురళి ఎంత తేలికగా ఉంటుంది! విల్లు-బాణము ఎంత కష్టము! ముందేమో గురిని కుదర్చాలి, ఆపై బరువు ఎత్తి పట్టుకోవాలి. అదే మురళిని చూడండి - ఆడండి, పాడండి, నవ్వండి, ఆడుకోండి. అందుకే పురుషార్థాన్ని కానీ, చెకింగ్‌ను కానీ కేవలం కనిపించే విషయాల వరకే పరిమితం చేయకండి. ఇప్పుడు సూక్ష్మ బుద్ధి కలవారిగా అవ్వండి ఎందుకంటే సమయము యొక్క సమాప్తి అకస్మాత్తుగా జరుగనున్నది, చెప్పి జరగదు. బాబా, మీరు ముందే ఎందుకు చెప్పలేదు అని ఫిర్యాదు చేయకండి అని బాప్‌దాదా అయితే ముందే చెప్పారు. తండ్రి ఎప్పుడూ టైమ్ కాన్సెస్గా చేయరు. ఇప్పుడు పూర్తి డైమండ్గా అవ్వాలి కదా! మరి ప్రతిజ్ఞ చేసారు కదా! డైమండ్ జూబిలీ జరుపుకోవాలా లేక డైమండ్గా అవ్వాలా? ఏమి చేయాలి? అవ్వాలి కూడా, జరుపుకోవాలి కూడా. రెండూ కలిపి చేయాలి. మరి బాప్‌దాదా వచ్చే సంవత్సరం చెక్ చేస్తారు - ప్రతిజ్ఞను నిలబెట్టుకున్నారా లేక కేవలం నోరు తీపి చేసుకున్నారా? మీరు ఎవరు? కేవలం మాట్లాడేవారా లేక నిలబెట్టుకునేవారా? అచ్ఛా! చూడండి, టి.వీ.లో మీ అందరి ఫోటో వస్తుంది, తర్వాత మారిపోకండి - నేను లేనే లేను, నేను చెప్పలేదు అనకండి! తయారవ్వడమైతే మంచిదే కదా, మరి మంచి విషయాన్ని త్వరగా చేయాలా లేక ఆలస్యంగానా? త్వరగా చేయాలి కదా!
సెకండులో ఎవరెడీగా అవ్వగలరా? సెకండులో అశరీరిగా అవ్వగలరా? లేక యుద్ధం చేయాల్సి వస్తుందా - కాదు, నేను శరీరాన్ని కాదు, నేను శరీరాన్ని కాదు... ఇలా అయితే లేరు కదా! ఆలోచించడము, జరిగిపోవడము అన్నట్లు ఉండాలి. ఆలోచించడము మరియు స్థితులవ్వడము (బాప్‌దాదా కొన్ని నిమిషాలు డ్రిల్ చేయించారు). మంచిగా అనిపిస్తుంది కదా! మరి రోజంతటిలో మధ్యమధ్యలో ఈ అభ్యాసాన్ని చేయండి. ఎంత బిజీగా ఉన్నా కానీ మధ్య-మధ్యలో ఒక్క సెకండు అయినా అశరీరిగా అయ్యే అభ్యాసాన్ని తప్పకుండా చేయండి. దీనికైతే ఎవ్వరు కూడా - నేను బిజీగా ఉన్నాను అని చెప్పలేరు. ఒక్క సెకండు వెచ్చించాల్సిందే, అభ్యాసం చేయాల్సిందే. ఎవరితోనైనా మాట్లాడుతున్నా సరే, ఎవరితోనైనా కలిసి పని చేస్తున్నా సరే, వారితో కూడా ఒక సెకండు ఈ డ్రిల్ చేయించండి, ఎందుకంటే సమయమనుసారంగా ఈ అశరీరితనము యొక్క అనుభవము, ఈ అభ్యాసము ఎవరికి ఎంత ఎక్కువ ఉంటే, వారు ముందు నంబరు తీసేసుకుంటారు ఎందుకంటే సమయ సమాప్తి అకస్మాత్తుగా జరుగనున్నది అని వినిపించాము కదా. అశరీరిగా అయ్యే అభ్యాసం ఉంటే వెంటనే సమయ సమాప్తి యొక్క వైబ్రేషన్స్ వస్తాయి, అందుకే ఇప్పటి నుండే అభ్యాసాన్ని పెంచండి. అంతేకానీ, వచ్చే సంవత్సరం డైమండ్ జూబిలీ ఉంది కదా, అందుకే ఇప్పుడు చేయము, తర్వాత చేస్తాము అని అనకండి. ఎంతగా బహుకాలాన్ని ఏడ్ (జత) చేస్తూ ఉంటారో, అంతగా రాజ్య భాగ్యపు ప్రాప్తిలో కూడా ముందు నంబరు తీసుకుంటారు. ఒకవేళ మధ్యమధ్యలో ఈ అభ్యాసాన్ని చేసినట్లయితే స్వతహాగానే శక్తిశాలి స్థితిని సహజంగా అనుభవం చేస్తారు. చిన్న-చిన్న విషయాలలో ఏదైతే పురుషార్థము చేయవలసి వస్తుందో, అదంతా సహజంగా సమాప్తమవుతుంది.
అచ్ఛా, అందరూ సంతోషంగా-సంతుష్టంగా ఉన్నారా లేక అడగాల్సిన అవసరముందా? మాతలు సంతోషంగా ఉన్నారా? చాలా మంచిది. చూడండి, ఎక్కడెక్కడి నుండో మేళాకు చేరుకున్నారు. మంచి ఛాన్సు లభించింది కదా, లేకపోతే - మా నంబరు ఎప్పుడు వస్తుంది, మా నంబరు ఎప్పుడు వస్తుంది అని డేట్ కోసం ఎదురుచూస్తూ ఉండేవారు. ఇప్పుడైతే అందరికీ ఆహ్వానం ఉంది కదా! అందరూ మంచిగా ఉంటున్నారా? బేహద్ (అనంతము) అనుభవం అవుతుంది కదా? లేక కొద్ది-కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయా? వృద్ధ మాతలకు ఇబ్బంది కలగలేదా? లైనులో ఉంటేనే భోజనం లభిస్తుంది! లైనులో వేచి ఉండటము వలన అలసట కలగలేదా? మజా వస్తుందా? ఇంత పెద్ద పరివారం ఎప్పుడు లభిస్తుంది! కావున పరివారాన్ని చూసి హర్షితులవుతున్నారు కదా! భక్తి మార్గపు మేళా కన్నా ఇది మంచి మేళా కదా? మరో రెండు రోజులు పెంచమంటారా లేక బస్సు ఖర్చులు ఉంటాయా? ఇల్లు గుర్తుకు రాదా? ఉద్యోగం గుర్తుకు రాదా? ఏదైనా ఒక నవీనత ఉండాలి కదా, మరి ఈ మేళా కూడా ఒక నవీనత. నవీనతను అనుభవం చేసుకున్నారు. ఇప్పుడిక పాత విషయాలు ఉంటాయా, కొత్త విషయాలే ఉంటాయి కదా! కొత్త విషయాలు మంచిగా అనిపిస్తాయా లేక పాతవా? కొత్త విషయాలు మంచిగా అనిపిస్తాయి కదా! అచ్ఛా.
కుమారీలతో:- కుమారీలు ఏమి అద్భుతం చేస్తారు! కుమారీలు టీచర్లుగా అవుతారా? కుమారీలందరూ తమ ముఖం ద్వారా, నడవడిక ద్వారా పవిత్రత యొక్క నిర్వచనాన్ని ప్రసంగిస్తారు. నోటితో ప్రసంగం అయితే అందరూ చేస్తారు, కానీ మీ సంబంధంలోకి ఎవరైతే వస్తారో వారు మీ ముఖం మరియు నడవడిక ద్వారా పవిత్రత యొక్క శ్రేష్ఠత ఏమిటో అనుభవం చేయాలి. ఏ కుమారీ అయినా ఎవరి ముందుకు వెళ్ళినా సాధారణ కుమారీగా కనిపించకూడదు. పవిత్రతా దేవిగా అనుభవం అవ్వాలి. చూడండి, ప్రారంభంలో తపస్సు తరువాత సేవకు వెళ్ళినప్పుడు మీ అందరినీ ఏ రూపంలో చూసేవారు? దేవీలుగా భావించేవారు కదా! వారికి సాధారణ స్వరూపం కనిపించేది కాదు, దేవీ రూపం కనిపించేది. దేవీలు వచ్చారు, కుమారీలు కాదు. కాబట్టి ప్రతి కుమారీ తనను దేవీ స్వరూపంగా అనుభవం చేసుకోవాలి మరియు ఇతరులకు కూడా అనుభవం చేయించాలి. దేవీ రూపంపై ఎప్పుడూ ఎవరి వ్యర్థ దృష్టి పడలేదు. ఇతరులను కూడా రక్షిస్తారు మరియు స్వయాన్ని కూడా రక్షించుకుంటారు. వీరి దృష్టి చెడ్డగా ఉంది కదా, నేను అయితే పవిత్రంగా ఉన్నాను కానీ ఇతరుల దృష్టి చెడ్డగా ఉంది అని చెప్పలేరు. మీ పవర్ఫుల్ పవిత్ర దృష్టి ఉంటే, సూర్యుడు అంధకారాన్ని ఉండనివ్వనట్లుగా, అది సమాప్తమై అంధకారం ప్రకాశంగా మారినట్లుగా, మీ పవిత్ర దృష్టి, దేవీ స్వరూపం అసుర సంస్కారాలను సమాప్తం చేస్తుంది. మరి కుమారీలు ఎవరు? పవిత్ర దేవీలు. కుమారీలు ఇలా భావిస్తున్నారా? హా అని అంటే చేతులెత్తండి, కాదు అయితే చేతులెత్తకండి. పవిత్ర కుమారీలు.
కుమారులతో:- కుమారులు కూడా పవిత్ర దేవుళ్ళు. కుమారీలే పవిత్ర దేవతలు అయ్యారు అని కాదు! కుమారులు కూడా పవిత్ర దేవుళ్ళు. ఏ వైపు కూడా అపవిత్ర దృష్టి విషయం వదిలేయండి, కానీ స్వప్నంలో కూడా అపవిత్ర వృత్తి వెళ్ళకూడదు. కుమారులు చేతులెత్తండి. కుమారులు కూడా చాలామంది ఉన్నారు. మరి కుమారులు ఎవరు? పవిత్ర దేవుళ్ళు. నేను దేవ ఆత్మను. నేను ఫలానా అని కాదు. నేను దేవ ఆత్మను, పవిత్ర ఆత్మను.
మాతలతో:- మాతలు చాలామంది ఉన్నారు. మాతలు ఏమి అద్భుతం చేస్తారు? అద్భుతం చేయాలి కదా? కాబట్టి మాతలు సదా ఈశ్వరీయ స్నేహంతో అందరినీ అజ్ఞాన నిద్ర నుండి మేల్కొలపండి. చిన్న పిల్లలను లేపుతారు కదా - లేవండి, తయారవ్వండి, స్కూల్‌కు వెళ్ళండి, అదే విధంగా జగత్ మాతలుగా అయ్యి అజ్ఞాన నిద్రలో నిద్రిస్తున్న పిల్లలను లేపండి. ఆత్మలను మేల్కొలపండి, ఎందుకంటే మీరు జగత్ మాతలు. మిమ్మల్ని మీరు హద్దులోని మాతగా భావించినప్పుడు బాధ్యతను అర్థం చేసుకుంటారు కదా. పిల్లలు 8 మంది ఉన్నా లేదా 6 మంది ఉన్నా బాధ్యతను అర్థం చేసుకుంటారు కదా, అదే విధంగా అనంతమైన జగత్ మాతలుగా అయ్యి పిల్లలపై (ఆత్మలపై) దయ చూపండి. పిల్లలు అనగా బాబా పిల్లలు. చాలా కథలు కూడా వింటారు, చెడు దృష్టి లేదు కానీ ఈమెను తల్లిగా భావిస్తున్నాము అని అంటారు. కానీ బ్రహ్మా బాబా తప్ప మరే ఆత్మ కూడా తల్లి కాలేదు. కాబట్టి మీ పిల్లలుగా చేసుకోకండి, బాబా పిల్లలుగా చేయండి. మరి మాతలు తయారుగా ఉన్నారా? సేవ చేయాలా? అచ్ఛా, చేతులు ఊపుతున్నారు. చాలామంది పిల్లలు చాలా ఆటలు ఆడుతారు, రోజంతటిలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక కొత్త ఆట తప్పకుండా జరుగుతుంది. మరియు మాటలు కూడా చాలా బాగా తయారుచేస్తారు. శాస్త్రాలలో లేని, మురళిలో లేని కొత్త కొత్త మంచి మాటలు తయారుచేస్తారు, మరి ఇప్పుడు ఈ బాల్యపు ఆటలు ఎంతకాలం ఆడతారు? ఇవి బాల్యపు ఆటలు. బొమ్మను తయారుచేస్తారు కదా, దానిని పెద్దగా కూడా చేస్తారు, కుటుంబం వారిని కూడా తయారుచేస్తారు, తరువాత సమాప్తం చేసేస్తారు. కాబట్టి మాటలు తయారుచేసేవారు కూడా ఇలాగే చేస్తారు - మొదట మాటకు జన్మనిస్తారు, తరువాత దానిని విస్తరిస్తారు, తరువాత దానిలో ఉప్పు-కారం వేసి, మసాలా వేసి చాలా టేస్టీగా చేస్తారు, తరువాత ఒకరికొకరు తినిపిస్తారు. ఇప్పుడు మీ అందరిదీ బాల్యమా లేక వానప్రస్థమా? వానప్రస్థం వరకు చేరుకున్నారు కదా? ఇప్పుడు వాణికి అతీతంగా వెళ్ళే సమయం. కాబట్టి వానప్రస్థ స్థితిలో ఉన్నవారు బాల్యపు ఆటలు ఆడరు, కానీ అద్భుతం చేస్తారు. ఆటలో నిమగ్నమైపోయినప్పుడు నేను ఈ ఆట ఏమి చేస్తున్నాను అని అనుభవం కూడా తక్కువగా చేస్తారు. ఆటలో అంతగా మునిగిపోతారు. కాబట్టి ఇప్పుడు వానప్రస్థ స్థితిని అనుభవం చేయండి మరియు చేయించండి. బాల్యపు ఆటలు ఆడారు, చాలా ఆడారు.
అచ్ఛా, ఇప్పుడు ఈ సంవత్సరపు సీజన్ సమయం సమాప్తమవుతోంది. కాబట్టి బాప్‌దాదాకు ఒక సంకల్పం ఉంది. బ్రహ్మచర్య వ్రతాన్ని అయితే అందరూ చాలా సహజంగా ధారణ చేసారు, కానీ వచ్చే సంవత్సరం సీజన్లో క్రోధం చేయనివారే రావాలి. ఇది సాధ్యమేనా లేక ఫెయిల్ అయిపోతారా? చెప్పేది అయితే సత్యమే కదా. అప్పుడు ఆటోమేటిక్‌గా సీజన్ చిన్నదైపోతుంది. అలా చేద్దామా? ఫారమ్‌లో కేవలం బ్రహ్మచర్య వ్రతం గురించి మాత్రమే వ్రాయకండి, 6 నెలల నుండి లేదా 6 సంవత్సరాల నుండి బ్రహ్మచర్యంలో ఉన్నారు అని మాత్రమే కాదు, క్రోధం ఎంతకాలం నుండి చేయలేదు? క్రోధంపై గట్టి దృష్టి ఉంచండి. ఏమనుకుంటున్నారు? ఇష్టమేనా? పాండవులకు ఇష్టమేనా? చూడండి, పేరు అయితే బయటపడిపోతుంది - సీజన్‌కు ఎందుకు రాలేదు! మరి మాతలు చెప్పండి, టీచర్లు చెప్పండి - చేద్దామా? హా జీ అని చెప్పండి. టీచర్లకు కూడా రావడానికి లభించదు! ఎవరైనా కావచ్చు, మహారథి కావచ్చు, పాదచారి కావచ్చు, గుర్రపు స్వారీ చేసేవారు కావచ్చు - మధుబన్ వారు మేము మధుబన్లోనే ఉంటాము అని అంటారు, కానీ వారిని ఎదురుగా కూర్చోనివ్వరు. వెళ్ళి టి.వి.లో చూడండి, వినండి. ఇది ఇన్సల్ట్ కదా. ఎందుకు ఎదురుగా రాలేదు! కాబట్టి మధుబన్ వారు పక్కా కంకణం కట్టుకోవాలి. మొదట మధుబన్ వారు హా అంటారా? మొదట మధుబన్ చేస్తుంది. ఇతరులు మొదట మధుబన్ను చూడండి అని చెప్పేలా ఉండకూడదు, ఇది మంచిది కాదు. అచ్ఛా, అందరూ తయారుగా ఉన్నారా? ఎవరైతే కాదు, చాలా కష్టం అని భావిస్తారో వారు నిలబడండి. ఎందుకంటే వెనుకవారి చేతులు కనిపించవు. మేమైతే చేతులెత్తనే లేదు అని అంటారు. మరి దాదీలు చెప్పండి - చేద్దామా? అచ్ఛా! చూడండి, అందరూ హా-హా అంటున్నారు, మళ్ళీ రేపటి నుండి ఇదేమి జరిగింది అని ఆలోచించడం ప్రారంభించకండి! అంతర్ముఖతతో నోటిని మూసివేయండి. నోరు తెరిస్తేనే కదా క్రోధం వస్తుంది. కాబట్టి ఈ సీజన్లో క్రోధముక్త ఆత్మల మేళా జరుగుతుంది. ఇష్టమే కదా? అచ్ఛా, అయినప్పటికీ బాప్‌దాదా భావిస్తున్నారు, చాలామందికి సంస్కారాలు చాలా పక్కాగా ఉన్నాయి, సాధారణ మాటలు మాట్లాడినా క్రోధం చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. మాటలే అలా ఉన్నాయి, అలవాటు అయిపోయింది. అందుకే ఇప్పుడు సీజన్ ప్రారంభమయ్యే వరకు ఎప్పుడైనా పొరపాటున క్రోధం వచ్చినా మూడు సార్లు క్షమిస్తాము. మూడు సార్లు అనుమతి ఉంది. (అందరూ చప్పట్లు కొట్టారు) అచ్ఛా, మూడు సార్లు అనుమతి కావాలి కాబట్టే చప్పట్లు కొట్టారు. బాప్‌దాదా ట్రయల్ చేసారు, ఫెయిల్ అయ్యారు. మేము చేసి చూపిస్తాము, విజయం పొంది చూపిస్తాము అని చెప్పండి. ఏదో ఒక కొత్తదనం ఉండాలి కదా! అవే ఫారమ్‌లు వస్తున్నాయి - భోజనం చేసారా, చేయలేదా? బ్రహ్మచర్యంలో ఉన్నారా, లేదా? ఇప్పుడు ఫారమ్ మార్చుతాము. కొత్తదనం ఇష్టమే కదా? టీచర్లు కూడా నియమంలో ఉండాలి. టీచర్లకు మినహాయింపు ఇవ్వము. స్టూడెంట్స్‌కు మూడు సార్లు అయితే టీచర్లకు రెండు సార్లు.
పాండవులతో:- పాండవులు ఏమి అద్భుతం చేసి చూపిస్తారు? పాండవులు విజయీ పాండవులుగా గాయనం చేయబడ్డారు. పాండవులు అనే పేరు తీసుకున్నప్పుడు పాండవుల రెండు విషయాలు ఎదురుగా వస్తాయి - ఒకటి బాబా సహచరులు మరియు రెండవది పాండవులు అనగా విజయులు. కాబట్టి పాండవులందరూ ఈ సంకల్పం చేయండి, ఏ విషయంలోనూ ఓడిపోకూడదు. సదా విజయులు. మరియు విజయీ మాలలో పాండవుడైన నాకే పాత్ర ఉంది అనే నిశ్చయం ఉంచండి. నేను విజయీ రత్నాన్ని. సదా అమృతవేళ మీ మస్తకంపై విజయ తిలకాన్ని ప్రతిరోజూ రిఫ్రెష్ చేసుకోండి మరియు అమృతవేళ నుండి మీ మస్తకంపై విజయ తిలకాన్ని ఇమర్జ్ రూపంలో చూడండి. నేను అయితే ఉన్నాను కదా అని కాదు. కాదు... నేను ఉన్నాను అంటే రోజంతటిలో విజయం పొందానా లేదా అని చెక్ చేసుకోండి. కాబట్టి పాండవులు అనగా విజయులు.
టీచర్లతో:- టీచర్లు ఏమి చేస్తారు? టీచర్లు శ్రమ అయితే చేసారు, బస్సులు నింపి నింపి తీసుకువచ్చారు. మరి టీచర్లు ఏమి అద్భుతం చేస్తారు? టీచర్లు విశేషంగా ఈ లక్ష్యాన్ని ఉంచుకోవాలి - సదా ప్రతి పరిస్థితిలో పరిస్థితి మారాలి కానీ స్థితి మారకూడదు. స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా ఉండాలి మరియు సంతుష్టంగా ఉండాలి. పరిస్థితి వస్తుంది మరియు వెళ్ళిపోతుంది. కానీ మీ సంతుష్టతను తీసుకువెళ్ళడానికి పరిస్థితికి ఏ శక్తి ఉంది? కాబట్టి పరిస్థితి యొక్క ఆటను చూడండి, కానీ సాక్షీ స్థితి, సంతుష్టత అనే సీట్‌పై కూర్చుని చూడండి. కాబట్టి టీచర్లు అనగా సదా సంపన్నులు మరియు సంతుష్టులు. టీచర్ల టైటిల్ సంతుష్టమణులు. అలా ఉన్నారు కదా? సదా సంతుష్టమణి.
మధుబన్ నివాసులతో:- మధుబన్ వారు ఏమి చేస్తారు? మధుబన్ వారికి బాప్‌దాదా సేవకు సంబంధించిన అభినందనలు సదా హృదయపూర్వకంగా పదమారెట్లు ఇస్తారు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మధుబన్ వారు ముందు ఏమి చేయాలి? విశేషంగా ఈ పాఠాన్ని పక్కా చేసుకోవాలి - మధుబన్ నివాసులు ప్రతి కర్మలో, ప్రతి సంకల్పంలో విశేష హీరో పాత్రధారులు. మధుబన్ స్టేజ్‌పై కాదు, కానీ విశ్వ స్టేజ్‌పై సంకల్పం, మాట మరియు కర్మలో హీరో పాత్రధారులు. హీరో యాక్టర్‌పై కోరుకోకపోయినా అందరి దృష్టి ఉంటుంది మరియు హీరో యాక్టర్ కొంచెం కూడా పైకి-క్రిందికి చేస్తే హాహాకారం జరుగుతుంది. మరియు బాగా చేస్తే వాహ్-వాహ్ జరుగుతుంది. కాబట్టి మధుబన్ వారు జీరోతో పాటు ఉండేవారు, సదా హీరో పాత్రను పోషించేవారు. మధుబన్‌లో అందరూ వచ్చేసారు, హాస్పిటల్ కూడా వచ్చింది, జ్ఞాన సరోవర్ కూడా వచ్చింది, తల్హటీ కూడా వచ్చింది, అందరూ వచ్చేసారు, ఏ ఎనిమిది భుజాలు ఉన్నాయో అన్నీ వచ్చేసాయి. అర్థమైందా? మధుబన్ నివాసులు అనే పేరు వినగానే అందరూ మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తారు. ఎక్కడికి వెళ్ళినా - ఎక్కడి నుండి వచ్చారు? మధుబన్ వారు. మధుబన్వాలా బాబా ఎలా ప్రసిద్ధి చెందారో అలాగే మధుబన్ వారు కూడా ప్రసిద్ధి చెందారు. అలా భావిస్తున్నారు కదా! బాగుంది, మధుబన్ వారికి నషా అయితే ఉంది.
అచ్ఛా, మేళా నిర్విఘ్నంగా అయిపోయిందా? రేపు అయితే వెళ్ళే మేళా ప్రారంభమవుతుంది. మిలన మేళా సమాప్తమైంది, ఇప్పుడు వెళ్ళే మేళా ఉంటుంది. చూడండి, మీరు ఏమి చేయలేరు! ఏది కావాలంటే అది చేయగలరు! చూసారు కదా! విన్నప్పుడు ఏమవుతుందో, ఎలా జరుగుతుందో...? అని అనుకునేవారు, ఇప్పుడు ఏమంటున్నారు? ఇది అయితే ఏమీ కాదు. ఇప్పుడు ఇది కామన్ అయిపోయింది కదా! లేక గుజరాత్ వారికి చాలా శ్రమ అనిపించిందా? శ్రమ చేయవలసి వచ్చిందా? లేదు, బాగా అనిపించింది. బహుమానం పొందడానికి యోగ్యమైన కార్యం చేసారు. బాప్‌దాదా హృదయపూర్వక స్మృతి-ప్రేమ అనే బహుమానాన్ని గుజరాత్‌కు ఇస్తున్నారు. అచ్ఛా, ఇందులో ఉదయం నుండి రొట్టెలు తయారుచేసే మాతల చేతులు అలసిపోయి ఉంటాయి, కాబట్టి బాప్‌దాదా ఇద్దరూ ఇటువంటి సేవాధారి మాతల చేతులకు మసాజ్ చేస్తున్నారు. రొట్టెలు తయారుచేసేవారు నిలబడండి. హా, చాలా చప్పట్లు కొట్టండి. కూరగాయలు కోసేవారు కూడా ఉన్నారు. కూరగాయలు కోసేవారు లేవండి. అన్నింటికంటే కష్టమైన పని ఏమిటంటే, వేడిలో ఇంత సమయం గ్యాస్ ముందు నిలబడి రొట్టెలు తయారుచేయడం. కాబట్టి అభినందనలు, అభినందనలు. తినేవారు లేకపోతే వీరు ఏమి చేస్తారు! చూడండి, తినేవారి వలనే కదా శోభ ఉంటుంది. మందిరాలలో గంటలు మోగుతాయి కదా, ఎవరు వెళ్ళినా గంటలు మోగిస్తారు. అలాగే ఈ మేళాలో పాత్రల గంటలు మోగుతూనే ఉంటాయి. మంచి దృశ్యం ఉంటుంది, పాత్రలు కడిగేటప్పుడు చాలా గంటలు మోగుతాయి - పాత్రల గంటలు. కాబట్టి అద్భుతం తినేవారిదే కదా!
మధుబన్ వారు కూడా చాలా శ్రమ చేసారు. గుజరాత్‌కు కూడా సహయోగం ఇచ్చేవారు మధుబన్ వారే. చాలా సహయోగం ఇచ్చారు కదా. అందరూ ప్రేమతో చేసారు. మేళా నిర్విఘ్నంగా సమాప్తమైపోవాలి - ఈ దృఢ సంకల్పంతో చాలా చేసారు. మధుబన్ వారు సహయోగం ఇచ్చారు కదా లేక ఇబ్బంది పెట్టారా? మధుబన్ వారు ఇబ్బంది పెట్టరు, అందరినీ సంతోషపరుస్తారు.
బాప్‌దాదా అయితే టి.వి.లో చూస్తారు కదా, కనుక ఈసారి ఎవరి ముఖంలోని భంగిమలు ఎక్కువగా మారలేదు అని చూసారు. మెజారిటీ బాగున్నారు, సంతోషంగా సేవ చేసారు. కొద్దిగా ఏమైనా జరిగినా సహనశక్తి, ఇముడ్చుకునే శక్తిని బాగా యూజ్ చేసారు, అందుకే అభినందనలు. అచ్ఛా, వేడిగా అనిపించిందా? లేక తెలియనేలేదా, మీరు బాప్‌దాదా ప్రియస్మృతుల అలలలో తేలియాడుతూ ఉన్నారు. టెంట్లో నిద్రపోతున్నారా లేక బాప్‌దాదా ఒడిలో నిద్రపోతున్నారా? టెంట్లో అయితే కాదు కదా! టెంట్ ఎగిరిపోయినా ఫర్వాలేదు, ఒడి అయితే ఉంది కదా! కానీ మొదట కొద్దిగా భయపెట్టింది, ఇప్పుడు ప్రకృతి కూడా వీరు వెనక్కి తగ్గేవారు కాదని అర్థం చేసుకుంది. పైకప్పు ఎగిరిపోతే మరొక పైకప్పు వచ్చేస్తుంది.
అచ్ఛా, డబల్ విదేశీయులు ఏమి చేస్తారు? ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు, సికీలధే. కనుక డబల్ విదేశీయులు సదా తమ ముఖాన్ని, రూపాన్ని నడిచే-తిరిగే మ్యూజియంగా తయారుచేస్తారు. మీ నయనాలను ఎవరైనా చూస్తే, నయనాల ద్వారా హర్షితమైన ఆత్మిక ఆకర్షణామూర్తి చిత్రాన్ని చూడాలి. సాధారణ నయనాలను చూడకూడదు. దివ్య నయనాలు. ఏ దివ్య నయనాలలో సదా బాబా బిందువు కనిపించాలి. కనుక మీ నయనాలు నడిచే-తిరిగే మ్యూజియంగా అయిపోవాలి. మీ మస్తకం ఆత్మ సాక్షాత్కారాన్ని చేయించాలి. మీ పెదవులు అందరికీ చిరునవ్వు నవ్వడం నేర్పించాలి. ఇలా నలువైపులా చైతన్య మ్యూజియాలు తమ సేవను చేస్తూ ఉండాలి. చేసేవారే కదా? బాగుంది. ఉల్లాస-ఉత్సాహాలు అయితే బాగున్నాయి, సదా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉంటారు.
డబల్ విదేశీయులకు మేళాలో కలవడంలో ఆనందం కలిగిందా? కేవలం విదేశీ సీజన్ అయితే చూస్తూనే ఉంటారు, కానీ ఇంత పెద్ద పరివారాన్ని చూడరు, కనుక డబల్ లాభం కలిగింది. బాప్‌దాదాతో మిలనము జరిగింది మరియు పరివారంతో కూడా మిలనము జరిగింది. కనుక లక్కీగా ఉన్నారు. అచ్ఛా, ఫారెన్‌లోని ఏ సెంటర్స్లోనైనా ఉండే టీచర్లు చేతులు ఎత్తండి. నలువైపులా సేవలో నిమిత్తంగా ఉండే వారందరినీ బాప్‌దాదా శ్రేష్ఠ సేవ యొక్క భాగ్యవంతులుగా భావిస్తారు. సేవా భాగ్యం ప్రాప్తించడం అనేది చాలా గొప్ప భాగ్యం. సేవలో ప్రత్యక్షఫలం ప్రాప్తించిన అనుభవం చాలా సహజంగా ఉంటుంది. ఇప్పుడిప్పుడే సేవ చేసారు మరియు ఇప్పుడిప్పుడే స్థితిలో ముందుకు వెళ్తూ ఉన్నారు. నిస్వార్థ సేవ చేస్తే సేవ యొక్క ఫలం లభిస్తుంది. స్వార్థానికి ఫలం లభించదు. కానీ మీరందరూ సేవాధారులు. అందుకే సేవ యొక్క ఫలం తప్పకుండా లభిస్తుంది. భవిష్యత్తు అనేది ఏమీ లేదు, ఇప్పటి ప్రత్యక్షఫలం ఆత్మకు ఎగిరే కళ యొక్క బలాన్ని ఇస్తుంది. అందుకే బాప్‌దాదా నిమిత్త సేవాధారులను చూసి సంతోషిస్తారు. కనుక శ్రేష్ఠ భాగ్యవంతులైన ఆత్మలు మరియు సదా తమ శ్రేష్ఠ భాగ్యం ద్వారా అనేకుల భాగ్యాన్ని మేల్కొలుపుతూ ఉంటారు. మంచివారు, అలసటలేకుండా సేవ చేస్తారు. బాప్‌దాదా వద్ద అందరి రికార్డు ఉంది. బాప్‌దాదా వద్దకు మేము వెళ్లనే వెళ్లము, రానే రాము, తెలియనే తెలియదు... అని ఇలా అనుకోకండి. ఎవరైతే గుప్తంగా ఉన్నారో వారు సదా నయనాలలో ఉన్నారు. గుప్తంగా ఉండలేరు, బాబా ముందు ప్రత్యక్షంగా ఉన్నారు. పేరు ఉన్నా, లేకపోయినా, ఎదురుగా వచ్చినా, రాకపోయినా కానీ, ఎదురుగా ఉండటానికి బదులుగా నయనాలలో ఇమిడి ఉన్నారు. అర్థమైందా?
నలువైపులా ఉన్న సర్వ ఆత్మిక పవిత్రతా పర్సనాలిటీ కలిగిన విశేష ఆత్మలకు, సదా ఆది నుండి అంతిమం వరకు పర్సనాలిటీ యొక్క మెరుపును చూపించే శ్రేష్ఠ ఆత్మలకు, సదా పవిత్రత, స్వచ్ఛత, సత్యతా శక్తులతో స్వయాన్ని మరియు విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ పరివర్తక ఆత్మలకు, సదా నిమిత్త భావంతో సేవాధారిగా అయ్యి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే అనుభవీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- మేళా మంచిగా అయ్యిందా? ఏమీ ఇబ్బంది అవ్వలేదు కదా? అందరి శుభ సంకల్పాలు మరియు ఉల్లాస-ఉత్సాహాల సంకల్పాలతో సఫలత ఉండనే ఉంటుంది. ఈ సంగఠనలోని సంకల్పం ఎలా ఉంటుందంటే అది అసఫలతను తొలగించివేస్తుంది. ఎలా అయితే ఒక కోట ఉంటుంది కదా, అందులో ఒక్క ఇటుకు కదిలినా ఆ కోట బలహీనమవుతుంది, అన్ని ఇటుకలు దృఢంగా ఉంటే కోట కదలదు, విజయము ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా సంగఠనతో, ఉల్లాస-ఉత్సాహాలు మరియు శ్రేష్ఠ సంకల్పాలతో, సహయోగముతో సఫలత లభించే ఉంది. మంచిగా అనిపించింది, ఎప్పటికప్పుడు ఇంకా ఇలా అనుభవం చేసుకుంటూ ఉంటారు. మొదట్లో సాధ్యమవుతుందా అని ప్రశ్న వచ్చేది, కానీ ఏది అనుకుంటే అందులో సఫలత ఉండనే ఉంటుంది. కావున సఫలతామూర్త వరదానము సంగఠన శక్తికి లభిస్తుంది. బాప్‌దాదా సదా గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ చెప్తారు. అచ్ఛా, డబల్ విదేశీయులు ఎగురుతున్నారు కదా. మంచిది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
