‘‘బాప్‌దాదాకు విశేషంగా నచ్చినది మరియు జ్ఞానానికి పునాది - పవిత్రత’’
ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్‌దాదా తమ ప్రేమ స్వరూపులైన పిల్లలను కలవడానికి వచ్చారు. పిల్లలందరిలో తండ్రి ప్రేమ ఇమిడి ఉంది. ప్రేమ పిల్లలందరినీ దూరం నుండి దగ్గరకు తీసుకువస్తుంది. భక్త ఆత్మలుగా ఉన్నప్పుడు తండ్రికి ఎంత దూరంగా ఉండేవారు, అందుకే నలువైపులా వెదికేవారు. ఇప్పుడు ఎంత సమీపంగా ఉన్నారంటే పిల్లలు ప్రతి ఒక్కరూ నిశ్చయంతో మరియు నషాతో - నా బాబా నాతో ఉన్నారు అని అంటున్నారు. తోడుగా ఉన్నారా లేక ఇటు వైపు ఉన్నారా లేక అటు వైపు ఉన్నారా అని వెతకాల్సి వస్తుందా? మరి ఎంత సమీపంగా వచ్చేసారు! పరమాత్మ ఎక్కడున్నారు అని ఎవరైనా అడిగితే ఏమని చెప్తారు? నాతో ఉన్నారు అని చెప్తారు. ఇప్పుడైతే తండ్రి కూడా నేను లేకుండా ఉండలేరు అని నషాతో చెప్తారు. ఇంత దగ్గరగా, సహచరులుగా అయ్యారు. మీరు కూడా ఒక్క సెకండైనా తండ్రి లేకుండా ఉండలేరు. కానీ మాయ వచ్చిన సమయంలో ఎవరు తోడుగా ఉంటున్నారు? ఆ సమయంలో ఒకవేళ తండ్రి మీతోపాటు ఉన్నట్లయితే మాయ రాగలదా? కానీ వద్దనుకున్నా కానీ మధ్య-మధ్యలో పిల్లలు తండ్రితో దాగుడుమూతలాట ఆడుతారు. బాప్‌దాదా పిల్లలు ఆడే ఈ ఆటను కూడా చూస్తూ ఉంటారు - పిల్లలు ఒక వైపు నా బాబా, నా బాబా అని అంటూ ఉన్నారు, మరో వైపు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ ఇలా దూరంగా వెళ్ళిపోతే మిమ్మల్ని చూడలేము కదా. మరి మీరు కూడా మాయ వైపుకు అలా వెళ్ళిపోతారు. తండ్రిని చూసే దృష్టి మూసుకోపోతుంది మరియు మాయను చూసే దృష్టి తెరుచుకుంటుంది. ఇలాంటి దాగుడుమూతలాట అప్పుడప్పుడూ ఆడుతూ ఉంటారా? అయినా కానీ తండ్రి పిల్లల పట్ల దయార్ద్రహృదయులై ఏదో ఒక విధంగా మాయ నుండి దూరం చేస్తూ ఉంటారు. అది స్పృహ కోల్పోయేలా చేస్తుంది మరియు తండ్రి - మీరు నా వారు అని చెప్పి స్పృహలోకి తీసుకువస్తారు. మూసుకున్న నేత్రాలను స్మృతి అనే ఇందజ్రాలంతో తెరుస్తారు.
బాప్‌దాదా అడుగుతున్నారు - అందరి ప్రేమ ఎంత శాతంలో ఉంది? అప్పుడు అందరూ 100 శాతంకన్నా ఎక్కువ ఉంది అని అంటారు. పదమాల రెట్ల ప్రేమ ఉంది, ఇలాగే చెప్తారు కదా? ఎవరికైతే పదమాల రెట్ల కన్నా తక్కువ ప్రేమ ఉందో, కోటి, లక్ష, వేయి, వంద ఉన్నవారు చేతులెత్తండి. (ఎవ్వరూ చేతులు ఎత్తలేదు). అచ్ఛా, అందరూ పక్కాగా ఉన్నారు! బాప్‌దాదా ఇప్పుడు రెండో ప్రశ్న అడుగుతారు, అప్పుడు మార్చవద్దు. అచ్ఛా, పదమాల రెట్ల ప్రేమ ఉంది అని చాలా మంచి శుభవార్తను వినిపించారు.
ఇప్పుడు బాబా అడుగుతున్నారు, ప్రేమకు ఋజువు ఏమిటి? (సమానంగా అవ్వడము). మరి సమానంగా అయ్యారా? (లేదు). అలా అయితే పదమాల రెట్ల కన్నా తక్కువ ఉన్నట్లు. సంపూర్ణంగా అవ్వడానికి ఇంకా కొద్ది సమయం ఉంది కదా, అప్పటికల్లా అయిపోతాము అని అంటారా? కానీ ఒకవేళ ప్రేమ ఉన్నవారు నువ్వు ప్రేమ కోసం ప్రాణ త్యాగం చేయి అని అంటే వారు ప్రాణమివ్వడానికి కూడా సిద్ధమవుతారు. బాప్‌దాదా ప్రాణాన్ని అయితే తీసుకోరు ఎందుకంటే ప్రాణంతోనే సేవ చేయాలి. కానీ ఒక విషయం చూసి బాప్‌దాదా కొంత సమయం ఆశ్చర్యపోవలసి వస్తుంది. ఆశ్చర్యం చెందకూడదు, ఈ విషయాన్ని మీకు కూడా చెప్తూ ఉంటారు కానీ బాప్‌దాదా కూడా ఆశ్చర్యపోవలసి వస్తుంది, పాత్రను పోషిస్తారు. ప్రాణ త్యాగం అన్న మాటను విడిచిపెట్టండి, ప్రేమకు గుర్తు బలిహారమవ్వడము, ఏది చెప్తే అది చేయడము. తండ్రి అయితే కేవలం ఒక్క విషయంలో బలిహారమవ్వడాన్ని చూడాలని అనుకుంటున్నారు. విషయాలు అనేకం ఉన్నాయి, కానీ తండ్రి ఆ అనేక విషయాలను ప్రస్తావించడం లేదు, కేవలం ఒక్క విషయంలో బలిహారం అవ్వాలి. దానికోసం చేతులు ఎత్తుతారు, ప్రతిజ్ఞను కూడా చేస్తారు కానీ ప్రతిజ్ఞ చేసిన తర్వాత కూడా చేస్తూ ఉంటారు, అదేమిటి? ప్రతి ఒక్కరూ - నేను పదే-పదే తండ్రి నుండి దూరమవ్వడానికి కారణమైన నా ముఖ్య సంస్కారము లేక ముఖ్యమైన బలహీనత ఏమిటి అని స్వయం అర్థం చేసుకుంటారు. ప్రతి ఒక్కరికీ మీ ముఖ్యమైన బలహీనత ఏమిటో తెలుసు కదా? మరి ఆ బలహీనత తెలిసి కూడా ఎందుకు అర్పించరు? 63 జన్మలుగా తోడు ఉంది, అందుకే దానిపై ప్రేమ ఉందా?
ప్రేమ అంటేనే అర్థము ప్రేమించిన వ్యక్తికి ఏది ఇష్టమో అది చేయడము. ఒకవేళ ప్రేమించే వ్యక్తి ఒకటి చెప్పినప్పుడు, రెండవవారు మరొకటి చేస్తే దానిని ఏమంటారు? అప్పుడు ప్రేమ ఉంటుందా లేక గొడవ జరుగుతుందా? ఆ సమయంలో ప్రేమ అంటారా లేక కర్ర తీసుకుని మంచిగా ఒకరికొకరు దెబ్బలు వేసుకుంటారా? మరి తండ్రికి ఏమి ఇష్టము? బాప్‌దాదా అంటారు, సమానంగా అవ్వడంలోనైతే అనేక విషయాలున్నాయి. బ్రహ్మాబాబాలోని విశేషతలను చూడండి, బ్రహ్మాబాబా సమానంగానే అవ్వాలి అంటే ఎంత పెద్ద లిస్టు ఉంది! దానికి కూడా బాప్‌దాదా - సరే, ఫర్వాలేదు అంటారు. ఒకటి రెండు విషయాలు తక్కువైనా ఫర్వాలేదు. కానీ ఏదైతే ముఖ్యమైన పునాది ఉందో, ఏదైతే బ్రహ్మాబాబాకు మరియు జ్ఞానానికి ఆధారమైన విషయముందో, అది ఏమిటి? బ్రహ్మాబాబాకు మరియు శివబాబాకు విశేషంగా ఇష్టమైనది ఏమిటి? (పవిత్రత, అంతర్ముఖత, నిశ్చయబుద్ధి, సత్యత-స్వచ్ఛత). వాస్తవానికి పునాది - ‘పవిత్రత’. కానీ పవిత్రత యొక్క పరిభాష చాలా గుహ్యమైనది. ఎక్కడైతే పవిత్రత ఉంటుందో, అక్కడ నిశ్చయము, సత్యత-స్వచ్ఛత, ఇవన్నీ వస్తాయి. కానీ బాప్‌దాదా చూసారు - పవిత్రత యొక్క గుహ్య భాష, పవిత్రత యొక్క గుహ్య రహస్యము బుద్ధిలో ఇంకా పూర్తిగా స్పష్టంగా లేదు. వ్యర్థ సంకల్పాలు రావడము మరియు తెప్పించడము, మీ లోపల కూడా వస్తాయి మరియు ఇతరులలో కూడా వ్యర్థ సంకల్పాలు వచ్చేందుకు నిమిత్తం అవుతారు. మరి వ్యర్థ సంకల్పాలు - ఇది పవిత్రత అవుతుందా? మరి సంకల్పాల పవిత్రత యొక్క రహస్యాన్ని అందరూ ప్రాక్టికల్లోకి తీసుకురావాలి కదా. అలా చూస్తే పంచ వికారాలు, కామము అయినా, మోహము అయినా, అన్నింటికన్నా నంబర్‌వన్ కామ వికారము మరియు చివరిది మోహము. కానీ ఏ వికారమైనా వచ్చినప్పుడు, ముందుగా సంకల్పంలో వస్తుంది. వ్యర్థ సంకల్పాలు క్రోధాన్ని కూడా ఉత్పన్నం చేస్తాయి. కామము అనగా వ్యర్థ దృష్టి, ఏ ఆత్మ వైపు అయినా ఒకవేళ వ్యర్థ దృష్టి వెళ్తే ఆ సమయంలో దానిని పవిత్రత అని అనము. మరి ఈ వ్యర్థ సంకల్పాలను తండ్రి ప్రేమ వెనుక ఎందుకు బలిహారం చేయడం లేదు? చేయగలరా? (హా జీ). హా జీ అనడం చాలా సహజము. కానీ బాప్‌దాదా వద్దనైతే అందరి చార్టులు ఉంటాయి కదా. ఇప్పటివరకూ పంచ వికారాల వ్యర్థ సంకల్పాలు మెజారిటీలో వస్తున్నాయి. అది ఏ వికారమైనా కావచ్చు. ఇది ఎందుకు, ఇది ఏమిటి, ఇలా జరిగి ఉండకూడదు, ఇలా జరగాలి... లేదా కామన్ విషయాన్ని కూడా బాప్‌దాదా వినిపిస్తారు - జ్ఞానీ ఆత్మలలో అయితే తమ గుణము, తమ విశేషత యొక్క అభిమానము వస్తుంది లేక ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా తమకు సంబంధించిన ఏ విషయములోనైనా లోటును చూస్తారు, తమ పురుషార్థంలోని లోటును చూడరు, కానీ రావలసిన పేరులో, గౌరవంలో, ప్రతిష్ఠలో, అడగడంలో, ముందుకు రావడంలో, సెంటరు ఇన్ఛార్జ్ చేయడంలో, సేవలో, విశేష పాత్రను ఇవ్వడంలో లోటును చూస్తారు - ఈ లోటు, ఈ వ్యర్థ సంకల్పం కూడా విశేషంగా జ్ఞానీ ఆత్మలకు చాలా నష్టం కలిగిస్తుంది. ఈ రోజుల్లో ఈ రెండే విశేషంగా వ్యర్థ సంకల్పాలకు ఆధారము. మరి మీరు సేవ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్క రోజు అయినా దినచర్యను నోట్ చేసుకోండి మరియు చెక్ చేసుకోండి - ఒక్క రోజులో ఈ రెండింటిలో ఏదైనా కానీ, అభిమానం అయినా లేక ఇంకో మాటలో అవమానం అని అయినా అనండి - నాకెందుకు తక్కువ ఇచ్చారు, నాకు కూడా ఈ పదవి ఇవ్వాలి కదా, నన్ను కూడా ముందుంచాలి, ఇది కూడా అవమానంగా భావిస్తారు కదా. మరి ఈ రెండు విషయాలు, అభిమానము మరియు అవమానము - ఈ రోజుల్లో ఈ రెండే విశేషంగా వ్యర్థ సంకల్పాలకు కారణము. ఈ రెండింటినీ ఒకవేళ బలిహారం చేసేస్తే తండ్రి సమానంగా అవ్వడము ఏమంత కష్టము కాదు. మరి బలిహారం చేసే శక్తి ఉందా? అచ్ఛా, ఎంత సమయంలో? ఈ రోజు ఇప్పుడిది నవంబరు కదా, క్రొత్త సంవత్సరం రావడానికి రెండు నెలలు పడుతుంది కదా! క్రొత్త సంవత్సరంలో ఎలాగైనా క్రొత్త ఖాతాను పెట్టడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరూ, టీచరు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మహారథులు కావచ్చు, పాదచారులు కావచ్చు. అంతేకానీ ఇదంతా మహారథుల కోసం, మేమైతే చిన్నవారిమి అని కాదు! రాజ్య భాగ్యాన్ని తీసుకునే సమయంలో - నేను చిన్నవాడిని అని ఎవ్వరూ అనరు. ఆ సమయంలోనైతే రెండవ నారాయణుడిగా నన్నే చేయండి అని అంటారు. కావున ప్రతి ఒక్కరూ కేవలం రెండు మాటలలో మీ సమాచారాన్ని ఇవ్వాలి మరియు ఆ పోస్టుపై విశేషంగా ఇలా వ్రాయండి - ‘‘అవస్థ యొక్క చార్టు’’. అప్పుడు ఆ పోస్టును విడిగా పెట్టడం జరుగుతుంది. లోపల వ్రాయండి - వ్యర్థ సంకల్పాలు ఎంత శాతం బలిహారం అయ్యాయి? 50 శాతమా లేక 100 శాతం బలిహారం అయ్యాయా? కేవలం ఒక్క లైన్ వ్రాయండి, ఎక్కువ వ్రాయకండి. ఎవరైతే ఎక్కువ రాస్తారో వారిది ముందే చింపేస్తారు. మరి సిద్ధంగా ఉన్నారా? గట్టిగా చెప్పండి - హా జీ లేక నా జీ? దీని కోసం ధైర్యము కావాలి, సమయం కూడా కావాలి అని భావించేవారు ఇప్పుడే చేతులెత్తండి, అప్పుడు మీకు ముందు నుండే అనుమతి లభిస్తుంది. ఎవరైనా అలా ఉన్నారా లేక - పురుషార్థమైతే చాలా చేసాము కానీ జరగలేదు అని తర్వాత రాస్తారా. అలా అయితే రాయరు కదా? పక్కాగా ఉన్నారా? అచ్ఛా.
బాప్‌దాదా ఏమి చూసారంటే ప్రేమ మధుబన్ వరకైతే తీసుకువస్తుంది. కానీ ఇదే ప్రేమతో ఎక్కడికి చేరుకోవాలి? తండ్రి సమానంగా అవ్వాలి కదా! ఎలా అయితే మధుబన్కు పరుగు పరుగున వస్తారు కదా, నా పేరు తప్పకుండా వ్రాయండి, నా పేరు తప్పకుండా వ్రాయండి అని. ఒకవేళ అలా రాయకపోతే టీచరుపై కొద్దిగా కన్నెర్ర కూడా చేస్తారు. మరి ఎలా అయితే మధుబన్కు ప్రేమగా పరిగెత్తుకుంటూ వస్తారో, అలాగే పురుషార్థం చేయండి, నా పేరు తండ్రి సమానంగా అవ్వడంలో ముందుండాలి అని. అందుకే ఈ పవిత్రతా పునాదిని పక్కా చేసుకోండి. బ్రహ్మాబాబా పవిత్రత కారణంగా, ఒక నవీనత కారణంగా నిందలు కూడా పడ్డారు. కావున పవిత్రత పునాది, పునాది యొక్క బ్రహ్మచర్య వ్రతాన్ని ధారణ చేయడమైతే సామాన్యమైన విషయమే, కానీ ఇప్పుడు ముందుకు వెళ్ళారు కావున బాల్యపు స్థితి కాదు, ఇప్పుడైతే వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాలి. నేను బ్రహ్మచారిగానే ఉన్నాను, పవిత్రత ఉండనే ఉంది అని కేవలం ఇందులోనే సంతోషపడిపోకండి. ఇప్పుడు దృష్టి-వృత్తి యొక్క పవిత్రతనైతే మరింత అండర్లైన్ చేయండి కానీ ముఖ్యమైన పునాది - మీ సంకల్పాలను శుద్ధము చేయండి, జ్ఞాన స్వరూపముగా చేయండి, శక్తి స్వరూపముగా చేయండి. సంకల్పాలలో బలహీనత చాలా ఉంది. ఏమి చేయాలి, చేయలేము, ఏమి జరిగిందో తెలియడం లేదు... ఇది పవిత్రతా శక్తియా? పవిత్ర ఆత్మ అంటుందా - ఏమి చేయను, జరిగిపోయింది, జరుగుతూ ఉంటుంది, అలా జరగాలి అని అనుకోలేదు కానీ...? ఇలా అనేవారు ఎటువంటి ఆత్మ? పవిత్ర ఆత్మ ఇలా అంటుందా లేక బలహీన ఆత్మ అంటుందా? మీరు త్రికాలదర్శి ఆత్మలు. ఎందుకు, ఏమిటి అని అన్నప్పుడు బాప్‌దాదా అంటారు - వీరిని జిజ్ఞాసువుల ముందుకు తీసుకువెళ్ళండి, వారికి 84 జన్మల గురించి మాకు తెలుసు అని చిత్రంపై అర్థం చేయిస్తారు కదా. అర్థం చేయించడమైతే 84 జన్మల గురించి అర్థం చేయిస్తారు, కానీ అనేది మాత్రం ఇప్పుడెలా, ఎందుకు? అని అంటారు. తెలుసు అని అన్నప్పుడు, తెలిసిన వ్యక్తి ఎందుకు, ఏమిటి అంటారా? ఇది ఇందుకు జరిగింది అని వారికి తెలుసు. ఎందుకు అన్నదానికి సమాధానముగా - మాయ ప్రభావానికి పరవశమై ఉన్నారు అన్న సమాధానము దానంతటదే వారి బుద్ధిలోకి వస్తుంది. మహారథులు కావచ్చు, పాదచారులు కావచ్చు. ఒకవేళ మహారథుల ద్వారా కూడా తప్పు జరిగితే ఆ సమయంలో వారు మహారథి కాదు, పరవశులు. పరవశమై ఉన్నవారు ప్రవాహంలో ఎక్కడికైనా కొట్టుకుపోతారు, కానీ మీరు మాత్రం వారిని - వీరు మహారథి అయి ఉండి కూడా ఇలా చేస్తున్నారు అని చూస్తారు. ఆ సమయంలో వారు మహారథి కాదు, పరవశులు. క్రొత్త సంవత్సరంలో ఏమి చేయాలో అర్థమయిందా? వ్యర్థ సమాప్తి యొక్క క్రొత్త ఖాతా. సరేనా? పక్కానా? లేక ఏదో ఒక కారణం చెప్తారా? ఒకవేళ కారణం ఉంటే ఇంకేదైనా కొత్త ప్లాన్ చెప్తాము, కానీ ఇప్పుడు చెప్పము. ఇప్పుడే చెప్తే మీరు ఏదో ఒక కారణాన్ని వెతికి తీస్తారు. కారణము కాదు, నివారణ. సమస్యా స్వరూపము కాదు, సమాధాన స్వరూపము.
ఇప్పుడు ప్రకృతి కూడా అలసిపోయింది. ప్రకృతి శక్తి కూడా పూర్తిగా సమాప్తమైపోయింది. ప్రకృతి కూడా ప్రకృతి పతి ఆత్మలైన మీకు అర్జీ పెట్టుకుంటుంది - త్వరగా చేయండి, ఇప్పుడు ఆలస్యం చేయకండి అని. అచ్ఛా!
బాప్‌దాదాకు కూడా తనువును నడిపించాల్సి వస్తుంది. నడిచినా, నడవకపోయినా కానీ, నడిపించాల్సి అయితే వస్తుంది ఎందుకంటే తండ్రికి పిల్లలపై ప్రేమ ఉంది. మరి ఇంత ప్రియమైన ఆత్మలు వస్తే తండ్రి ఆత్మిక సంభాషణ చేయకపోతే ఎలా అవుతుంది! అందుకే బలవంతంగానైనా నడిపించాల్సి వస్తుంది. అచ్ఛా, అందరూ సంతోషంగా ఉన్నారా? తండ్రి కలిసారు - సంతుష్టంగా ఉన్నారు కదా?
ఈస్టర్న్:- ఎంతమంది సుమారుగా వచ్చారు? (550) కనుక ఐదున్నర వందల మంది వచ్చారు కదా, ఐదున్నరలోని అరను తీసివేస్తే మిగిలింది ఐదు, కనుక ఐదింటిపై విజయం పొందడంలో ఈస్టర్న్ జోన్ నంబర్‌వన్‌గా ఉండాలి. (అందరూ చప్పట్లు కొట్టారు) వ్రాసే సమయంలో కూడా చప్పట్లు కొట్టండి. నంబర్‌వన్. అసలైతే ఈస్టర్న్, బ్రహ్మాబాబా ప్రవేశతలో కూడా మొదటి నంబర్. కనుక బాబా సమానంగా అవ్వడంలో, బాబా ప్రేమ వెనుక సర్వస్వాన్ని అర్పించడంలో కూడా ఈస్టర్న్ మొదటి నంబర్ తీసుకోవాలి. టీచర్లందరూ హా అంటున్నారు కనుక స్టూడెంట్స్ కూడా చేయవలసిందే. ఈస్టర్న్ టీచర్లు లేవండి. టీచర్లందరూ వాగ్దానం చేస్తున్నారా లేక ఏమవుతుందో తెలియదు అని అనుకుంటున్నారా! చూడండి టి.వి.లో వస్తోంది. ఈస్టర్న్ అయితే నంబర్‌వన్ అవ్వవలసిందే.
బొంబాయి, మహారాష్ట్ర:- బొంబాయి ఏమి చేస్తుంది? మహారాష్ట్ర ఏమి చేస్తుంది? సోలాపూర్ కూడా ఉంది, జలగావ్ కూడా ఉంది. ఏ ‘పూర్’ అయినా కానీ బాప్‌దాదా అంటారు సోలాపూర్ కాదు, ‘సోలా సంపూర్ణ్’. కోల్హాపూర్ ఉంది, సోలాపూర్ ఉంది, అనేక ‘పూర్’లు ఉన్నాయి, కనుక వారికి మనం ‘పూర్’గా అయితే ఉన్నాము, కేవలం ముందు ‘సంపూర్ణ్’ యాడ్ చేయాలి అని గుర్తుకు రావాలి. సరేనా సోలాపూర్. సోలాపూర్ టీచర్లు చేతులు ఎత్తండి. ఇప్పుడు ఏమవుతుంది? సోలాపూర్ లేదా సోలా సంపూర్ణ్? ధైర్యం ఉందా లేక మేము చిన్న టీచర్లము అని అంటారా. ఛోటే సుభాన్ అల్లా. అర్థమైందా? అచ్ఛా, జలగావ్ మరియు ఉద్గీర్. జలగావ్ ఏమి చేస్తుంది? తమ వ్యర్థ వికల్పాలను జలంలో సమాప్తం చేస్తుంది. పూర్తిగా సమాప్తం. జలంలో సమాప్తమైపోయింది. కనుక ఏమి చేస్తారు? వికల్పాలను జలమయం చేయడం. ఏ వికల్పమూ మిగలకూడదు. ఎక్కడైనా జలమయం అయితే ఒక్క గుర్తు కూడా మిగలదు కదా. అలా మీరు సమాప్తం చేసేయండి. సరేనా?
అచ్ఛా, బొంబాయి వారు ఏమి చేస్తారు? ఈ రోజుల్లో చాలా పెద్ద పెద్ద బాంబులు వచ్చాయి. దీపావళిలో చూసి ఉంటారు కదా, ఎన్ని బాంబులను ఒకేసారి వెలిగిస్తారంటే వరుసకు వరుస సమాప్తమైపోతుంది. కనుక బొంబాయి వారు అనేక వికల్పాల వరుసకు ఒక అగ్గిపుల్ల వెలిగించండి మరియు అన్నీ సమాప్తమైపోవాలి. బొంబాయి టీచర్లు లేవండి. అచ్ఛా! అగ్గిపుల్ల అయితే ఉంది కదా? మంచి పవర్ఫుల్ అగ్గిపుల్ల ఉందా? లేక అగ్గిపుల్ల వెలిగి మళ్లీ ఆరిపోతుందా. దృఢ సంకల్పం అనే అగ్గిపుల్లతో ఫటాఫట్. ఒకదాని వెనుక ఒకటి, ఒకదాని వెనుక ఒకటి సమాప్తం. అందరూ సంతోషిస్తారు. అచ్ఛా.
తమిళనాడు:- తమిళనాడు ఏమి చేస్తుంది? తమిళనాడులో డాన్స్ చాలా బాగా చేస్తారు. ఏ దాదీలు వెళ్లినా మంచి మంచి డాన్స్‌లు చూపిస్తారు. శాస్త్రాలలో శంకరుని గురించి చూపిస్తారు కదా, నృత్యం చేస్తూ చేస్తూ మొత్తం వినాశనం చేసేసారు. కనుక తమిళనాడు డాన్స్ చేస్తూ చేస్తూ ఏమి చేస్తుంది? భిన్న-భిన్న రకాలుగా అన్ని విఘ్నాల వినాశనం. డాన్స్‌లో భిన్న-భిన్న పోజులు పెడతారు కదా, అలా ఒక్కొక్క వికల్పాన్ని ఎంత చక్కగా సమాప్తం చేయాలంటే నామ-రూపాలు కూడా మిగలకూడదు. సరేనా? తమిళనాడు టీచర్లు లేవండి. అచ్ఛా. తమిళనాడు టీచర్లు చాలా మంది వచ్చారు. టీచర్లకు కూడా కలిసే ఛాన్స్ లభిస్తుంది. నిజానికి, బాప్‌దాదాకు టీచర్లు చాలా ప్రియంగా అనిపిస్తారు. ఇందులో అయితే చప్పట్లు కొట్టారు కానీ నిజానికి అన్న పదం వెనుక ‘ఇలా’ కూడా ఉంది. టీచర్లను బాప్‌దాదా పూర్తిగా సమాన దృష్టితో చూస్తారు - వీరు బాబా సమానంగా ఉన్నారు, నిమిత్తంగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే ఇలాంటి-అలాంటి తలక్రిందుల డాన్స్ చేస్తారో, అది మనసుకు నచ్చదు, అప్పుడప్పుడు అలాంటి డాన్స్ చేస్తే అందరూ ఆపండి, ఆపండి అంటారు. కనుక టీచర్లు అలాంటిది ఏదైనా చేసినప్పుడు బాప్‌దాదా, ముఖ్యంగా బ్రహ్మాబాబా కళ్ళు క్రిందికి వాలిపోతాయి. టీచర్లు అంత అటెన్షన్ ఉంచాలి. టీచర్లకు టైటిల్ అయితే చాలా బాగుంది, బ్యాడ్జ్ కూడా చాలా త్వరగా ధరించేస్తారు. కానీ టీచర్ అనగా బాబా సమానం. విశేషంగా బ్రహ్మాబాబా టీచర్లను హృదయపూర్వకంగా ప్రేమిస్తారు, కానీ అప్పుడప్పుడు దృష్టిని క్రిందికి దించవలసి వస్తుంది. కనుక అలా చేయకండి. మిగిలినది బాగుంది, తమిళనాడు విస్తరణ బాగా చేసింది మరియు ఒక విశేషత ఏమిటంటే హ్యాండ్స్‌ను కూడా తమ నుండే తయారుచేస్తూ, సేవను కూడా పెంచుతూ వెళ్తున్నారు. కనుక ఇది కూడా మంచి విషయమే. హ్యాండ్స్‌ను తయారుచేయడం మరియు సేవను కూడా పెంచడం - రెండూ చేయాలి.
ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ పరివారంలో ఒక విశేషత ఉంది. అక్కడి నుండి ఒక ప్రియమైన బిడ్డ రాజు వెలువడ్డాడు, ఆ ఒక్కరు ఒక ఎగ్జాంపుల్‌గా అయి అనేక వి.ఐ.పి., ఐ.పి.లకు సేవ చేసి శాంపుల్‌గా అయ్యారు. సేవ చాలా జరుగుతుంది, కానీ ఇతను ధైర్యం ఉంచి ఒక ఎగ్జాంపుల్‌ను స్థాపించాడు. నిజానికి కూడా ఆంధ్రలో వి.ఐ.పి., ఐ.పి.లు ఎక్కువగానే ఉన్నారు. వారు ఏ దేశానికి వెళ్లినా కానీ ఆంధ్రకు చెందిన ఐ.పి., వి.ఐ.పి.లు నలువైపులా చాలా మంది ఉంటారు. కనుక ఆంధ్ర ఒక ఎగ్జాంపుల్‌ను తయారుచేసినట్లే, వికల్ప వినాశనానికి కూడా ఒక ఎగ్జాంపుల్‌ను ఆంధ్ర చూపించాలి. సిద్ధంగా ఉన్నారా? ఆంధ్ర టీచర్లు లేవండి. అచ్ఛా, టీచర్లు అయితే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్‌ను కూడా చూపిస్తారు. చూడండి ఎంత మంచి రత్నం వెలువడింది మరియు అడ్వాన్స్ పార్టీలో కూడా మంచి పాత్రను పోషిస్తున్నారు. కనుక చేస్తారు కదా! ఖిట్ఖిట్ ఉండకూడదు. ఖిట్ఖిట్ సమాప్తం. విజయ పతాకం ప్రతి సేవాకేంద్రంపై ఎగరాలి. ఫలానా సెంటర్లో ఖిట్ఖిట్ ఉంది, అందుకే ఫలానా దాదీని పంపించండి అని బాప్‌దాదా వినకూడదు. ఇలా జరగకూడదు. మధ్య మధ్యలో కొద్దిగా ఇలాంటి ఆటలు ఆడతారు. ఇప్పుడు సమాప్తం. మొదట టీచర్లు సమాప్తం చేస్తేనే వైబ్రేషన్స్ వ్యాపిస్తాయి. ఇవి సూక్ష్మ వైబ్రేషన్స్. ఒకరు చేసారు కదా, అందరికీ ఏమి తెలుస్తుంది అని మీరు అనుకుంటారు? కానీ వైబ్రేషన్ అనేది తెలియకపోయినా... నేను మాత్రమే చేసాను, కాదు. నేను బాబా యొక్క అన్ని సేవాకేంద్రాల వైబ్రేషన్‌ను పాడుచేసాను. ప్రతి టీచర్‌పై ఇంత బాధ్యత ఉంది. బ్యాడ్జ్ ధరించడం అయితే చాలా బాగుంది. బాగా కూడా అనిపిస్తుంది. అందరూ ఒకే విధమైన బ్యాడ్జ్ ధరించి కూర్చుంటే బాగుంటుంది, కానీ బ్యాడ్జ్ యొక్క గౌరవాన్ని నిలబెట్టండి. అచ్ఛా!
కర్ణాటక:- బెంగళూరు వచ్చింది. బెంగళూరు విశేషత ఏమిటంటే జగదంబ సరస్వతి తల్లి బెంగళూరులో చాలా చాలా సేవ చేసి బీజం వేసారు. బొంబాయి మరియు బెంగళూరులో చేసారు. కనుక బొంబాయి మరియు బెంగళూరు జగదంబ తల్లి బీజానికి సదా ఫలాన్ని ఇవ్వాలి. చూసినట్లయితే బెంగళూరులోని విశేష సేవాధారులు కూడా జగదంబ పాలన యొక్క ఫలమే. కనుక బెంగళూరు వారు, జగదంబ సంపూర్ణంగా అయి భిన్న నామ-రూపాలలో సేవకు నిమిత్తంగా ఉన్నట్లే, జగదంబ పేరును ప్రఖ్యాతం చేయాలి. బెంగళూరు వాయుమండలం ప్రపంచ లెక్క ప్రకారం కూడా ఇతర ప్రాంతాల కంటే కొంత బాగుంది. సేవ కూడా చాలా ఉంది. ఇప్పుడు సేవను వ్యర్థ సంకల్పాలు లేనిదిగా చేయడం - ఇది బెంగళూరు పని. అర్థమైందా? బెంగళూరు టీచర్లు లేవండి. బాగుంది, నిర్విఘ్నంగా తయారవ్వాలి కదా? లేక కొద్దికొద్దిగా ఖిట్ఖిట్ బాగుంటుందా? కనుక జగదంబ పాలన యొక్క నంబర్‌వన్ ఫలాన్ని బెంగళూరు తప్పకుండా ఇవ్వాలి. అర్థమైందా?
రాజస్థాన్:- రాజస్థాన్ ఏమి చేస్తుంది? రాజస్థాన్‌కు ఒక సేవను చాలా కాలం నుండి బాప్‌దాదా చెప్పారు, కానీ అది జరగలేదు. రాజస్థాన్ మినిస్ట్రీని చాలా సమీపంగా తీసుకురావాలి. మినిస్టర్ అయినా, సెక్రటరీ అయినా, కానీ ఒక్కసారి రాజస్థాన్ అద్భుతం చేసి చూపించాలి. ఎవరి సహాయం అయినా తీసుకోండి. అందరూ సహాయం చేస్తారు. కానీ రాజస్థాన్ గవర్నమెంట్‌కు చెందిన విశేష ఆఫీసర్స్‌లో కనీసం 20-25 మందితో ఒక గ్రూప్ తీసుకురావాలి. ఎందుకంటే రాజస్థాన్ ప్రభావం మొత్తం ఇండియాపై పడుతుంది. ఢిల్లీ సేవ వరల్డ్‌లో పేరు ప్రఖ్యాతం చేస్తుంది కదా. జిజ్ఞాసువులుగా అయినా, కాకపోయినా, రాజస్థాన్‌కు చెందిన ఇంతమంది ఇక్కడ ఒకచోట చేరి వచ్చారంటే, ఇక్కడి చిన్నా-పెద్ద ఆఫీసర్స్ బుద్ధి కూడా కొంత తెరుచుకుంటుంది. ఇప్పుడు మారిషస్ది వచ్చింది, మరి రాజస్థాన్? కనుక రాజస్థాన్ ఈ సేవను ఏ విధంగానైనా చేయాలి. ఎవరి సహాయం అయినా తీసుకోండి, గ్రూప్ తయారుచేయండి. ఎక్కడి నుండి చెబితే అక్కడి నుండి సహాయం లభిస్తుంది. కానీ ఒక్కసారి ఆబూ వారి కళ్ళు తెరుచుకోవాలి మరియు ఆ ఆఫీసర్సే ఇక్కడ ప్రసంగం చేసి, అనుభవం వినిపిస్తే ఆబూ వారు చూడండి వెనుక వెనుక... లేకపోతే ఒకవైపు సేవ జరుగుతుంది, మరోవైపు ఆబూ వారు పరిహాసం చేస్తూనే ఉంటారు. కనుక రాజస్థాన్ బాప్‌దాదా యొక్క ఈ ఒక ఆశను పూర్తి చేయాలి. కష్టమా? అప్పుడు ఇక్కడ లడ్డూలు పంచుతారు. ఎవరైతే ఉంటారో వారి నోటిలో లడ్డూ పడుతుంది. ఉదయపూర్ అయినా, జోధ్‌పూర్ అయినా,... ఎక్కడ కార్యం పెరుగుతుందో అక్కడి వారు చాలా సహయోగులుగా ఉండాలి. ఇప్పుడు చూడండి ఢిల్లీ ఆఫీసర్ రాజస్థాన్ ఆఫీసర్‌కు ధైర్యం ఇచ్చి సరిచేస్తున్నారు మరియు అక్కడివారు అసలు కదలడం లేదు. కనుక అద్భుతం చేయండి. ఆబూ వారు కూడా ప్లాన్ తయారుచేయండి. ఆబూ వారు మంచిది అని చెప్పనంతవరకు, వార్తాపత్రికలో అయినా, నోటి ద్వారా అయినా చెప్పనంతవరకు సేవ యొక్క రిజల్ట్ తెర వెనుకే ఉందని బాప్‌దాదా భావిస్తారు. ప్రత్యక్షం కాదు. కనుక రాజస్థాన్‌లోని పెద్దవారు చిన్నవారిని కూడా సరిచేస్తారు. పరమాత్మ కార్యం మరియు ఇంత చిన్న ఆఫీసర్లు పరమాత్మ కార్యం మధ్యలో విఘ్నరూపంగా అయితే వీరు చీమలే కదా. కనుక ఇప్పుడు కొంత కదలాలి. అద్భుతం చేసి చూపించండి. ప్లాన్ తయారుచేయండి. ఒక్కసారి ఈ మూడు-నాలుగు ముఖ్య స్థానాలలో సేవను పట్టుదలగా చేయాలి. పని వచ్చినప్పుడు పని సమయంలో పరుగెత్తి, పని పూర్తయిన తరువాత సమాప్తం - అలా కాదు. రాజస్థాన్ బ్రాహ్మణులకు చాలా నషా ఉంది కదా, రాజస్థాన్‌లోనే ముఖ్య కేంద్రం ఉంది అని. ఇది రాజస్థాన్ యొక్క అదృష్టం, కానీ ఇప్పుడు ఇదే నషాతో ఇది చేసి చూపించండి. నలువైపులా రాజస్థాన్ సమ్మేళనం జరుగుతోంది, రాజస్థాన్ యోగ శిబిరం జరుగుతోంది అని వ్యాపించాలి. అప్పుడు చూడండి మీ వ్యాపారులు మొదలైన వారందరూ తమంతట తామే మేము కూడా కూర్చుంటాము అంటారు. కనుక రాజస్థాన్ ఈ అద్భుతం చేస్తుంది. ఎందుకంటే హెడ్‌క్వార్టర్ బాధ్యత రాజస్థాన్‌పై ఉంది. చాలా పెద్ద కిరీటం ఉంది. అచ్ఛా! పాండవులు కూడా కొంత ధైర్యం చేస్తారు కదా, ధైర్యం చేసి చూపించండి. అచ్ఛా. రాజస్థాన్ టీచర్లు ఎదురుగా కూర్చున్నారు, వీరు చాలా మంది టీచర్లు ఉన్నారు. ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క ఐ.పి.ని తీసుకురాగలరు. ఒక్కొక్కరిని తీసుకువచ్చినా 20-25 మంది గ్రూప్ తయారవుతుంది. చాలా మంచి మంచి టీచర్లు ఉన్నారు. అచ్ఛా.
ఆగ్రా:- ఆగ్రా వారు ఏమి చేస్తున్నారు? ఆగ్రా వారు కూడా ఏ కొత్త అద్భుతాన్ని చేసి చూపించలేదు. జరగవలసిందే కదా! మొత్తం విశ్వంలో బాబా పేరు ప్రఖ్యాతం అవ్వవలసిందే. కానీ ఎవరైతే నిమిత్తంగా అవుతారో వారికి ఎక్స్ట్రా మార్కులు లభిస్తాయి. వారి పదవిలో, ఎంత సేవ చేసారో దాని అనుసారంగా యాడ్ అయి మార్కులు జమ అవుతూ ఉంటాయి. సాధారణంగా ఉన్నారని అనుకోండి, కానీ సేవ నిర్విఘ్నంగా ఉంటే సేవ యొక్క మార్కులు ఎడిషన్ అవ్వడం వల్ల సాధారణ రాజు కంటే ముందు నంబర్‌లోకి వస్తారు. ఇంకా ముందుకు ముందుకు వెళ్తూ చివరికి విశ్వ మహారాజు యొక్క రాయల్ ఫ్యామిలీలోకి వస్తారు. కనుక ఇది చేయాలి కదా! ఆగ్రా కూడా అద్భుతం చేస్తుంది. బాప్‌దాదాకు సదా పిల్లలందరిలో ఆశలు ఉంటాయి మరియు వారు కూడా వెలుగుతున్న ఆశల దీపాలు. ప్రతి బిడ్డ వెలుగుతున్న ఆశల దీపం. కనుక అద్భుతం చేసి చూపించండి. ఎంత సమయంలో అద్భుతం చేస్తారో చూస్తాము. సరేనా? అచ్ఛా.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు ఏమి చేస్తారు? డబల్ అద్భుతం చేస్తారు. డబల్ విదేశీయులలో ఈ విశేషత చాలా బాగుంది - సేవ లేకుండా వారికి ప్రశాంతత ఉండదు, ఆనందం ఉండదు. వారికి సేవ చాలా కావాలి. ఉల్లాస-ఉత్సాహాలతో, సమయం తక్కువగా లభించినా, అలసిపోయినా, స్థూలమైన పని చేసినా, అయినప్పటికీ సేవ కోసం ఎవరెడీగా ఉంటారు. సేవ కోసం పిలుపు వస్తే కూర్చుంటారా లేక పరుగెత్తుతారా? పరుగెత్తుతారు. కనుక సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలే డబల్ విదేశీ ఆత్మలైన మీకు సేఫ్టీ సాధనం. సేవలో నిమగ్నమై ఉంటే మాయ నుండి కూడా రక్షించబడి ఉంటారు. వీరికి తీరిక లేదు అని మాయ కూడా చూసి తిరిగి వెళ్ళిపోతుంది. రెండవ విషయం, తమ పురుషార్థంలో సత్యతతో తమ చెకింగ్‌ను బాగా చేసుకుంటారు, ఆ సత్యత బాప్‌దాదా వద్దకు చేరుతుంది. సత్యత బాప్‌దాదాకు ప్రియమైనది. అందుకే సత్యత యొక్క ఫలస్వరూపంగా బాప్‌దాదా ద్వారా విశేష సహాయం కూడా లభిస్తుంది. ఏదైనా బలహీనత వచ్చినా కానీ బాబా మరియు సేవ పట్ల ప్రేమ ఉండటం వల్ల అది కూడా ఎక్స్ట్రా ధైర్యం యొక్క సహాయం లభించేలా చేస్తుంది. అర్థమైందా? అచ్ఛా! అన్ని ప్రాంతాల వారు ఉన్నారు. మారిషస్ అయితే అద్భుతం చేసింది. ఎందుకంటే ఏ విదేశీ వి.ఐ.పి. లేదా ఐ.పి. అయినా ఇండియాకు వచ్చి తన దేశం నుండి ఇక్కడి ప్రోగ్రామ్‌ను సెట్ చేసి, చేయించడం - ఈ ఒక ఎగ్జాంపుల్‌ను మారిషస్ చూపించింది. వి.ఐ.పి., ఐ.పి.ల ద్వారాన్ని తెరిచింది. కనుక మారిషస్ వారికి అభినందనలు. పెద్దవారు పెద్దవారే, చిన్నవారు సుభాన్ అల్లా అని అంటారు. కనుక మారిషస్ సుభాన్ అల్లా చేసి చూపించింది. చాలా బాగుంది, అభినందనలు. అచ్ఛా!
మధుబన్, జ్ఞాన సరోవర్, హాస్పిటల్, తలహటి:- ప్రతి ఒక్కరూ తమ పేరు అని భావించాలి. బాప్‌దాదా ఇప్పుడు మధుబన్‌లో అయితే వస్తూనే ఉంటారు. కనుక ప్రతి ఒక్కరూ మధుబన్ అయినా, డబల్ మధుబన్ అయినా, ఉపసేవాకేంద్రాలు అయినా, గీతా పాఠశాలలు అయినా, అందరికీ బాప్‌దాదా ప్రియస్మృతులు లభిస్తున్నాయి మరియు లభిస్తూనే ఉంటాయి.
నేపాల్:- (నేపాల్ పేరు మర్చిపోయారు) నేపాల్‌ను మర్చిపోవడం అనగా మీరు గుప్త మహారథులు. దాగి ఉన్న రుస్తమ్లు. నేపాల్ అయితే బాప్‌దాదాకు సదా ప్రియమైనది. ఎందుకంటే నేపాల్‌లో గవర్నమెంట్ సేవ సహజంగా మరియు బాగా ఉంది, జరుగుతూ కూడా ఉంటుంది. చివరికి నేపాల్ రాజు కూడా రావలసిందే. అచ్ఛా, సేవ బాగుంది. ధైర్యవంతులైన టీచర్లు ఉన్నారు. వీరు (రాజ్ అక్కయ్య) కొత్త జన్మ తీసుకొని సేవ యొక్క ఋజువును ఇచ్చారు. షీలాకు కూడా విశేషంగా ప్రియస్మృతులు ఇవ్వండి. అచ్ఛా.
నలువైపుల ఉన్న పదమా రెట్ల ప్రేమ స్వరూపులైన ఆత్మలకు, సదా స్వయాన్ని నిర్వికల్పంగా చేసుకునే విశేష ఆత్మలకు, సదా తండ్రి మరియు నిర్విఘ్న సేవ యొక్క తపనలో నిమగ్నమై ఉండే ఆత్మలకు, సదా తండ్రి స్నేహంలో బలిహారమయ్యే ఆత్మలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా! అందరూ సంతోషంగా ఉన్నారా! నేను కలవలేదు అని ఎవరైనా కోపంగా ఉన్నారా? రహస్యాన్ని తెలుసుకున్నవారు ఎప్పుడూ కోప్పడరు.
దాదీలతో:- చూడండి, ఆది రత్నాలైన మీపై అందరికీ ప్రేమతో పాటు శుద్ధమైన మోహము కూడా పెరుగుతూ ఉంటుంది. ఆది రత్నాలు మంచిగా ఉంటే అంతా మంచిగా ఉంటుంది అని అందరూ చూస్తూ ఉంటారు. అంటే మీపై అందరికీ శుద్ధమైన మోహము పెరిగింది. బాప్‌దాదా ఈ ఇద్దరినీ చూసి (చంద్రమణి దాదీ, రతన్ మోహినీ దాదీ) సంతోషిస్తున్నారు. జ్ఞాన సరోవర్ బాధ్యతను సంభాళించారు. బాధ్యత ఏమిటి, అది ఒక ఆట. భారీతనము ఉందా? ఆట తేలికగా ఉంటుంది కదా? మరి బాధ్యత ఏమిటి? ఇది ఒక ఆట. సమయానికి సహయోగిగా అయినందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు మరియు ఆది నుండి సహయోగిగా ఉన్నారు. ఆది నుండి హా జీ అనేవారు - ఇదే సాకార బాబా మీ అందరికీ ఇచ్చిన విశేష వరదానము. బ్రహ్మాబాబాకు ‘కాదు, లేదు’ అన్న మాట నచ్చేది కాదు. ఇదైతే తెలుసు, మీరు అనుభవజ్ఞులు.
ఈషూ దాదీతో:- వీరు ఆది నుండి ఇప్పటివరకు చాలా మంచి పాత్రను పోషించారు. మరియు మీకు (దాదీజీకి) విశేష సహయోగి. ఏ విషయాన్ని అయినా వినడంలో, వినిపించడంలో చాలా మంచిగా ఉంటారు ఎందుకంటే గంభీరంగా ఉంటారు. ఈ గంభీరతా గుణము చాలా ముందుకు తీసుకువెళ్తుంది. ఏదైనా మాట చెప్తే, ఉదాహరణకు ఏదైనా మంచి చేసి దాని గురించి చెప్పినట్లయితే సగం సమాప్తమైపోతుంది. సగం ఫలం సమాప్తమై, సగం జమ అవుతుంది. మరియు ఎవరైతే గంభీరంగా ఉంటారో, వారికి ఫుల్ జమ అవుతుంది. అంటారు కదా - జగదంబ గంభీరంగా ఉండేవారు, స్థూల సేవ మీ కన్నా తక్కువ చేసారు , మీరు ఎక్కువ చేస్తున్నారు, అయినా కానీ ఈ గంభీరతా గుణము వారికి ఫుల్ ఖాతా జమ చేయించి పెట్టింది. కట్ అవ్వలేదు. చాలామంది ఎంతో చేస్తారు కానీ, సగం, ముప్పావు కట్ అయిపోతుంటుంది. చేస్తారు, ఏదైనా జరిగితే మొత్తానికే కట్ అయిపోతుంది లేదా చిన్న విషయం జరిగినా కానీ ముప్పావు కట్ అయిపోతుంది. అలాగే తమది తాము వర్ణన చేసుకున్నట్లయితే సగం కట్ అయిపోతుంది. ఇక ఏమి మిగిలినట్లు? ఎలా అయితే జగదాంబ విశేషత - జమ ఖాతా ఎక్కువ ఉంది, వారు గంభీరతా దేవి, అలాగే అందరూ కూడా గంభీరంగా ఉండాలి, మధుబన్‌లో ఉండేవారు కావచ్చు, సేవాకేంద్రంలో ఉండేవారు కావచ్చు బాప్‌దాదా అందరికీ గంభీరతా గుణంతో మార్కులు జమ చేసుకోమని చెప్తున్నారు, వర్ణన చేస్తే సమాప్తమైపోతుంది. అది మంచిగా వర్ణించినా లేకు చెడుగా వర్ణించినా కానీ. మంచి అనేది మీకు అభిమానాన్ని తీసుకువస్తుంది, చెడు అనేది ఇతరులను అవమానపరుస్తుంది. కనుక అందరూ గంభీరతా దేవీలుగా, గంభీరతా దేవతలుగా కనిపించాలి. ఇప్పుడు గంభీరత చాలా చాలా అవసరము. ఇప్పుడు మాట్లాడే అలవాటు చాలా ఎక్కువైంది ఎందుకంటే భాషణ చేస్తారు కదా, అప్పుడు ఏది వస్తే అది చెప్పేస్తూ ఉంటారు. కానీ గంభీరత యొక్క ప్రభావము ఎంతగా ఉంటుందో, వాణి ప్రభావము అంతగా ఉండదు. అచ్ఛా.
బాప్‌దాదాకు పుష్పగుచ్ఛాలు సమర్పించారు:- ఈ పుష్పగుచ్ఛాలు ఏమిటి, మీలో ప్రతి ఒక్కరూ ఆత్మిక గులాబీలు, అందరికంటే ప్రియమైనవారు.
(ప్రసిద్ధ గాయకుడు ఓమ్వ్యాస్ గారు కొత్త పాటల క్యాసెట్‌ను బాబా ద్వారా ఆవిష్కరింపజేశారు):- అచ్ఛా, డ్రామా నిమిత్తంగా చేసింది మరియు నిమిత్తంగా అవ్వడమే భాగ్యానికి గుర్తు. కనుక భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు మరియు తయారు చేసుకుంటూనే ఉంటారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
