‘‘పరమాత్మ మిలన మేళా యొక్క కానుకలు - కిరీటము, సింహాసనము మరియు తిలకము’’
ఈరోజు అనంతమైన తండ్రి తమ పిల్లలందరినీ అనంతములో చూస్తున్నారు. వారు అనంతమైన తండ్రి మరియు మీరందరూ కూడా అనంతమైన యజమానులు మరియు బాలకులు. బాప్‌దాదా స్నేహీ సహయోగీ పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు మరియు పిల్లలు తండ్రిని చూసి హర్షిస్తున్నారు. తండ్రికి ఎక్కువ సంతోషము ఉందా లేక పిల్లలకు ఎక్కువ సంతోషము ఉందా - ఏమంటారు? ఇద్దరికీ ఉంది! దీనినే పరమాత్మ మిలన మేళా అని అంటాము. మేళాలైతే ఎన్నో జరుగుతాయి కానీ పరమాత్మ మిలన మేళా ఒక్క సంగమయుగములోనే జరుగుతుంది. ఇది మొత్తము కల్పంలో జరుగదు. ఇప్పుడు జరుగుతూ ఉంది మరియు జరుగుతూ ఉంటుంది. మీ అందరికీ కూడా మేళా మంచిగా అనిపిస్తుంది కదా! బాప్‌దాదా అయితే పిల్లల భాగ్యాన్ని చూసి హర్షితులవుతారు మరియు మనసులో - వాహ్ పిల్లలూ వాహ్ అన్న పాటను పాడుతారు. ఏ భాగ్యమైతే స్వప్నములో కూడా లేదో, సంకల్పములో కూడా లేదో, ఆ శ్రేష్ఠ భాగ్యము ఇప్పుడు సాకారములో అనుభవమవుతూ ఉంది. ప్రతి ఒక్కరి మస్తకముపై శ్రేష్ఠ భాగ్య రేఖ మెరుస్తూ ఉంది. అందరూ మెరుస్తూ ఉన్న సితారలే కదా? మీ ఈ శ్రేష్ఠ భాగ్యము స్మృతిలో ఉంటుంది కదా! ఎందుకని ఇది శ్రేష్ఠ భాగ్యము? ఎందుకంటే భాగ్య విధాత ద్వారా భాగ్యవాన్ ఆత్మలైన మీ యొక్క దివ్య బ్రాహ్మణ జన్మ జరిగింది. తండ్రిని కూడా భాగ్యవిధాత అని అంటారు మరియు బ్రహ్మాను కూడా భాగ్యవిధాత అని అంటారు. మరియు మీ అందరి జన్మ బాప్‌దాదా ద్వారా జరిగింది. కనుక ఎవరి తండ్రి అయితే స్వయం భాగ్యవిధాతనో వారి భాగ్యము ఎంత శ్రేష్ఠంగా ఉంటుంది! పరమాత్మ మిలనాన్ని జరుపుకుంటున్నారు కదా! (డబల్ విదేశీయులతో) వీరు కూడా జరుపుకుంటున్నారు! అనంతమైన మేళాలో ఒకవేళ డబల్ విదేశీయులు లేకపోతే దానిని అనంతమైనది అని అనరు. కనుక మీది కూడా విశేష పాత్ర, దానిని తండ్రి మరియు పిల్లలందరూ చూసి-చూసి హర్షిస్తారు. భాగ్యవిధాత ద్వారా జన్మ లభించటము - ఇది అన్నింటికన్నా నంబర్‌వన్ భాగ్యము. అలాగే మొత్తము కల్పములో మరే జన్మలోనూ ఒక్క పరమాత్మయే తండ్రిగా కూడా అవ్వటము, శిక్షకునిగా కూడా అవ్వటము, సద్గురువుగా కూడా అవ్వటము మరియు సర్వ సంబంధాలను నిర్వర్తించటము - ఇటువంటి భాగ్యము సత్యయుగము నుండి కలియుగము వరకు ఎవరికైనా లభించిందా? ఇది ఇప్పుడు మీకు లభించింది! మా పాలన చేసేవారు స్వయం పరమాత్మ అని ఇప్పుడు మీరు నిశ్చయము మరియు నషాతో చెప్తారు. ప్రపంచములోనివారు పరమాత్మయే పాలన చేస్తున్నారు అని ఏదో మాట వరుసకు అంటారు కానీ ఇప్పుడు మీరు ప్రాక్టికల్‌గా అనుభవముతో అంటారు - పరమాత్మయే తండ్రి మరియు ఆ తండ్రియే పాలన చేసేవారు, వారే పాలన చేస్తూ ఉన్నారు! ఈ నషా ఉంది కదా లేక కొద్ది-కొద్దిగా మర్చిపోతున్నారా? నడుస్తూ-నడుస్తూ మీ శ్రేష్ఠ భాగ్యాన్ని సాధారణంగా భావిస్తూంటారు, అది ఉండడము శ్రేష్ఠంగా ఉంది కానీ దానిని సాధారణంగా భావిస్తారు. అందుకే ఏ నషా మరియు సంతోషపు మెరుపు సదా ఉండాలో అది ఉండటం లేదు. నిజానికి ఒక్క సెకండు కూడా మర్చిపోలేరు కానీ - తండ్రి లభించారు, వారు మా వారిగా అయ్యారు, మేము కూడా తండ్రికి చెందినవారిగా అయ్యాము... దీనిని అంతటినీ సాధారణంగా భావిస్తారు. వారు మా వారు అన్నప్పుడు నషా ఉండాలి కదా? కానీ అది ఒక్కోసారి ఉన్నతంగా, ఒక్కోసారి మధ్యమంగా, ఒక్కోసారి సాధారణంగా అయిపోతుంది. ఆలోచించండి, మన తండ్రి పరమ ఆత్మ! అలాగే శిక్షకుడు కూడా డైరెక్టుగా పరమ ఆత్మ! ఏ శిక్షణను ఇచ్చారు? మిమ్మల్ని ఎలా తయారుచేసారు? త్రినేత్రి, త్రికాలదర్శి, త్రిలోకీనాథ్. ఇటువంటి చదువును ఎవరైనా చదువుతారా! ఇప్పటివరకు ఇటువంటి డిగ్రీ గురించి విన్నారా? జడ్జి, బ్యారిస్టరు, డాక్టరు, ఇంజినీరు ఈ డిగ్రీలన్నీ చూసారు కానీ త్రిలోకీనాథ్, త్రికాలదర్శి, త్రినేత్రి, నాలెడ్జ్‌ఫుల్... ఇటువంటి డిగ్రీలు చూసారా? ద్వాపరం నుండి కలియుగం వరకు ఎవ్వరికైనా లభించాయా? మీకు లభించాయా? మీరు కూడా 63 జన్మలు తీసుకున్నారు కదా. ఇవి ఎవ్వరికీ లభించలేదు, లభించవు కూడా. మన శిక్షకుడు ఇటువంటివారు. సైన్సువారు సైన్సు పరంగా ఎంత ప్లాన్ చేసినా కానీ మూడు లోకాల వరకైతే చేరుకోలేరు. మూడు లోకాల జ్ఞానము ప్రాప్తించదు. కానీ మీలో అయితే 5 సంవత్సరాల పిల్లలు కూడా మూడు లోకాల జ్ఞానాన్ని ఇస్తారు! అది కూడా ఎంతో నషాతో చెప్తారు - అవును, సూక్ష్మవతనము ఉంది, మూల వతనము ఉంది. కావున పరమ ఆత్మ శిక్షకుడు కూడా. శ్రేష్ఠమైన శిక్షణతో ఈ డిగ్రీలను ప్రాప్తింపజేసారు కానీ ప్రపంచంలో అన్నింటికన్నా అతి పెద్ద పదవి రాజ్య పదవి. చదువు ద్వారా పదవి కూడా లభిస్తుంది కదా! మరి మిమ్మల్ని రాజుగా చేసారా? ఇప్పుడే రాజుగా ఉన్నారా లేక అలా అవ్వాలా? మీరు ఉన్నదేమో రాజులుగా కానీ కూర్చుంది నేలపై! పక్కా ఇంట్లో కాదు, టెంటులో కూర్చున్నారు! చూడండి, శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన పదవి రాజ్య పదవి. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులుగా ఉన్నారు మరియు భవిష్యత్తులో కూడా విశ్వ రాజ్యాధికారులుగా అయ్యేదే ఉంది. ఇది పక్కా కదా? రాజ్యం ఎవరు చేయాలి? మీరు రాజ్యం చేస్తారా లేక మీపై వేరే రాజు ఎవరైనా రాజ్యం చేస్తారా? లేదు. వీరంతా ఇంతమంది రాజులుగా అవుతారు! ఇంతమంది రాజ్యం చేస్తారు! ప్రజలను కూడా తయారుచేసుకున్నారా లేక మీపై మీరే రాజ్యం చేస్తారా? కావున మీ భాగ్యాన్ని చూసుకోండి - పరమ ఆత్మ నా శిక్షకుడు, రాజ్య పదవిని ఇచ్చేవారు. అలాగే సద్గురువుగా అయ్యి... గురువు ఏమి చేస్తారు? మంత్రం ఇస్తారు కదా. మరి సద్గురువు ఏ మంత్రాన్ని ఇచ్చారు? మన్మనాభవ. సద్గురువు ద్వారా మహామంత్రము కూడా లభించింది మరియు సర్వ వరదానాలు కూడా లభించాయి. ఎన్ని వరదానాలు లభించాయి? వరదానాల లిస్టును చూడండి, ఎంత పెద్దగా ఉంది! రోజూ వరదానము లభిస్తుంది కదా! అవి ఎంత సమయం నుండి లభిస్తున్నాయి! ఇన్ని వరదానాలను ఏ శిష్యునికీ ఏ గురువూ ఇవ్వనే ఇవ్వలేరు. ఇలా రోజూ వరదానాలను ఇచ్చే సద్గురువును చూసారా? ఇప్పుడు నషా ఉంది కదా! (హాజీ) చాలా మంచిది. సదా ఉంచుకోండి. అంతే కానీ, ఇక్కడి నుండి బస్సులో వెళ్ళగానే నషా తగ్గిపోవడం మొదలవ్వకూడదు. ఇది సదా పెరుగుతూనే ఉండాలి.
బాప్‌దాదా పిల్లలందరినీ సదా ప్రతి సబ్జెక్టులోనూ నంబర్‌వన్‌గా చూడాలనుకుంటున్నారు. మరి నంబర్‌వన్‌గా ఉన్నారా లేక ఇప్పుడింకా అవ్వాలా? నషాతో చెప్పండి - మేము అవ్వకపోతే ఇంకెవరు అవుతారు! విదేశీయులకు డబల్ నషా ఉంది కదా! మంచిది. నా పిల్లలు ఒక్కొక్కరూ రాజా పిల్లలు, ప్రజలు కాదు అని తండ్రి కూడా సంతోషిస్తారు. ప్రజలైతే తర్వాత వస్తారు. ఈ మాత్రమైనా కలుసుకునేందుకు అవకాశం లభించినందుకు మీరు ఎంతైనా లక్కీ. టెంటులో ఉండాల్సి వస్తే ఏమయింది. మట్టిలోనైతే పడుకోవడం లేదు కదా, పరుపు మీదనే పడుకుంటున్నారు. బ్రహ్మా భోజనమైతే మంచిగా లభిస్తుంది కదా? మట్టి కలిసింది అయితే లభించడం లేదు కదా? ప్రేమగా తింటారు కదా? కొద్దో గొప్పో అయితే జరుగుతూనే ఉంటుంది, జరగాల్సిందే. ఎందుకని? మాయ మరియు ప్రభువు యొక్క ఆట కలిసి-కలిసి జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ పరమాత్మతో మేళా జరిగితే మాయ కూడా గందరగోళం తప్పకుండా చేస్తుంది. మీ పని మేళా జరుపుకోవడం, దాని పని గందరగోళం చేయడము. కావున గందరగోళం కూడా జరిగింది, మేళా కూడా జరిగింది. (తుఫాను వచ్చింది అని ఎవరో చెప్పారు) ఏమీ ఫర్వాలేదు. మీది పురుషార్థపు తుఫాను మరియు అది గాలి తుఫాను. ఏమి జరుగుతుందో అని గాభరా పడటం లేదు కదా? వద్దు, తుఫాను వచ్చినా లేక వర్షము వచ్చినా, ఎంతటి అలజడి వచ్చినా కానీ మీ మనసు అయితే అచంచలంగా ఉంది కదా? మాతలు గాభరా పడలేదు కదా, టెంటు ఎగిరిపోయింది, ఏమి చేయాలి? కొద్ది-కొద్దిగా గాభరా పడ్డారా, ఏమవుతుందో, ఆరోగ్యం బాగుంటుందో లేదో అని గాభరా పడ్డారా? ఏది జరిగినా కానీ భక్తిలో ఉన్న ఎదురుదెబ్బలు, శ్రమకన్నా తక్కువే కదా. భక్తిలోని ఎదురుదెబ్బలనైతే తినడం లేదు కదా, ఆనందంలో ఉంటున్నారు కదా! మరి ఈ మేళా మంచిగా అనిపించిందా లేక గందరగోళాన్ని చూసి గాభరా పడ్డారా? లేదా, ఎవ్వరూ గాభరా పడలేదా? ఒకరిద్దరు అయితే గాభరా పడి ఉంటారు కదా? ఆనందంగా అనిపిస్తుందా? ఇంకో రెండు రోజులు ఉంచాలా? అచ్ఛా. బాప్‌దాదా కూడా మాయ గందరగోళాన్ని చూసి చుట్టూ తిరిగి వస్తూ ఉంటారు. పిల్లలు ఏమి చేస్తున్నారు మరియు మాయ ఏమి చేస్తుంది అన్న ఆటను చూస్తారు.
బాప్‌దాదాకు పిల్లల స్నేహము చూసి సంతోషంగా ఉంది. ఈ స్నేహమే మేళాను రచించింది. తండ్రికి కూడా స్నేహము ఉంది మరియు పిల్లలకు కూడా స్నేహము ఉంది, ఇద్దరూ కలిస్తే ఏమవుతుంది? మేళా. దృశ్యం కూడా ఎంత బాగా అనిపిస్తుంది. ఇంత పెద్ద పరివారము లభిస్తుంది అని ఎప్పుడైనా అనుకున్నారా మరియు ఇంత పెద్ద పరివారం ఎవరికి ఉంటుంది? మీకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? (ఒకటి) మీ సేవా స్థానాలు ఎన్ని ఉన్నాయి? (అనేకము) వాటిని కూడా బాబా ఇళ్లు అనే అంటారు కదా! మరి బాబా ఇల్లు అంటే మీ ఇల్లు. ప్రపంచము - మీరు ఇళ్ళు-వాకిళ్ళను వదిలేస్తారు అని అంటుంది కానీ మీరు ఎన్ని ఇళ్ళను తయారుచేసుకున్నారు! లెక్కపెట్టలేరు, గుర్తుంచుకోవాల్సి వస్తుంది. కావున ఇది వదలడం కాదు, తయారు చేసుకోవడం. అలాగే పరివారాన్ని విడిచిపెట్టారా లేక ఎంత పెద్ద పరివారాన్ని తయారుచేసుకున్నారంటే వారందరినీ కలవడమే కష్టమవుతుందా! మొత్తం బ్రాహ్మణులందరూ, ఎవరు ఎక్కడ ఉన్నా కానీ అందరూ ఒకే స్థానంలో కలవడం వీలవుతుందా? కష్టమవుతుంది కదా! ఎందుకంటే ఇది ఇతరుల రాజ్యం కదా, మీ రాజ్యమైతే కాదు! కానీ తండ్రి లభించారు, అనంతమైన పరివారం లభించింది. మరి అనంతమును గుర్తు చేస్తే అనంతమైన సంతోషము, అనంతమైన నషా ఉంటుంది. ఒకవేళ హద్దుగా భావిస్తే - నేను ఫలానా దేశంలో ఉంటాను, ఫలానా దేశస్థుడిని, ఫలానా జోనుకు చెందినవాడిని, ఇదంతా హద్దు అవుతుంది కానీ ఈ విధంగా గుర్తించడం కోసమని నిమిత్తమాత్రంగా చెప్తారు - ఇది ఫలానా జోను, ఇది ఫలానా స్థానము అని. కానీ స్వయాన్ని అయితే అనంతముకు చెందినవారిగా భావిస్తారు కదా. నియమాలు కూడా పెట్టాల్సి ఉంటుంది. కొందరు ఇలా కూడా ఆలోచిస్తారు - ఇదేంటి బ్యాడ్జి పెట్టుకుంటేనే భోజనం లభిస్తుంది అని అంటున్నారు? మిమ్మల్ని భోజనం దగ్గర విసిగిస్తారు కదా? కానీ ఇదంతా చేయవలసే వస్తుంది ఎందుకంటే నియమములో లాభము ఉంటుంది. ఇది బంధనము కాదు కానీ విఘ్నాల నుండి నిర్బంధనులుగా చేసేందుకు సాధనము. ఇదేంటి కొత్త పద్ధతి పెట్టారు అని ఇలా ఆలోచించకండి. సంకల్పాలైతే తండ్రి వద్దకు చేరుకుంటాయి కదా. కానీ మర్యాదా పురుషోత్తములు మీరే కదా. లేక కేవలం పెద్ద దాదీలు మాత్రమే మర్యాదా పురుషోత్తములు మరియు మీరు ఫ్రీనా? మర్యాదా పురుషోత్తములు అనగా మర్యాదల లోపల ఉండేవారు, వాటి అనుసారంగా నడుచుకునేవారు. హాజీ పాఠం పక్కాగా ఉంది కదా? అచ్ఛా! ఎప్పుడైనా ఏదైనా విషయము జరిగితే అందులో హాజీ అంటారా లేక నాజీ అని కూడా అంటారా? ఇలాంటి విషయము ఏదైనా జరిగినప్పుడు ఒక్కోసారి హాజీ కి బదులు నాజీ అనడంలో ఎంత పక్కాగా ఉంటారంటే ఇక తండ్రి చెప్పినా కూడా వినరు. స్థాపన సమయంలో చిన్న-చిన్న పిల్లలు వచ్చినప్పుడు బాప్‌దాదా వారికి పాఠాన్ని పక్కా చేయించడానికి ఎప్పుడూ ఈ విధంగా చెప్పేవారు - నా (కాదు) అని అనడమంటే నాస్తికులు, హా (సరే) అని అనడమంటే ఆస్తికులు. మరి మీరంతా ఎవరు? ఆస్తికులు. నాస్తికులైతే కారు కదా! అప్పుడప్పుడూ అవుతుంటారా? ఆట ఆడుతూంటారు! మాయ గురించి కూడా నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యారు! ఎందుకంటే మాయ కూడా నాలెడ్జ్‌ఫుల్. పడవేయడంలో మాయ నాలెడ్జ్‌ఫుల్ మరియు పైకి ఎగరడంలో మీరు నాలెడ్జ్‌ఫుల్. ఎవరైనా ఎగరడంలో కొద్దిగా కింద-మీద అయితే మాయ చూసి దాడి చేస్తుంది. అయితే మీరు నాలెడ్జ్‌ఫుల్ అయిన కారణంగా తెలుసుకుంటారు, ఓడిపోరు, విజయమాలను మెడలో వేసుకుంటారు. అందరి మెడలో విజయమాల ఉందా లేక అప్పుడప్పుడూ తీసేస్తుంటారా? అచ్ఛా.
వెనుక ఉన్నవారు ఆనందంలో ఉన్నారా? ఇది కూడా మధుబన్ ప్రాంతమే కదా, మరి మధుబన్‌లో తప్ప ఇంకెక్కడైనా ఇంత పెద్ద మేళా జరుగగలదా? వీలవ్వదు కదా. కావున మధుబన్ అనంతమైన ఇల్లు. ఇక్కడంతా అనంతము, వేరే-వేరే స్థానాలలోనైతే ఎంతైనా అన్నీ చూసుకోవాల్సి వస్తుంది, కానీ ఇక్కడైతే సంకల్పం చేయగానే జరిగిపోతుంది. మరి అందరూ మీ భాగ్యము ద్వారా పరమాత్మ మేళాకు చేరుకున్నారు. ఎవరైతే ఈ కల్పంలో మొదటిసారి వచ్చారో, వారు చేతులెత్తండి. (సుమారుగా 13-14 వేల మంది సోదరీ-సోదరుల సభ ఉంది, అందులో చాలామంది కొత్త సోదరీ-సోదరులు ఉన్నారు). మంచిది, టి.వి.లో చూస్తున్నారు. ఇది కూడా చూడండి, మెజారిటీ సైన్సు సాధనాలన్నీ ఈ మధ్య కాలంలోనే వెలువడ్డాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఈ సైన్సు సాధనాలు కూడా లేవు. మరి ఎవరి కోసం ఇవన్నీ వెలువడ్డాయి? మీ కోసం. బాప్‌దాదా కూడా సైన్సు పిల్లలకు అభినందనలు తెలియజేస్తున్నారు ఎందుకంటే బాబా యొక్క పిల్లలు ఆ సాధనాలతో సుఖాన్ని పొందుతున్నారు కదా. మరి ఎంత బాగా అనిపిస్తుంది. కానీ బాప్‌దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? డైమండ్ జూబిలీ జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాప్‌దాదా ఇప్పుడు పిల్లలందరినీ రాజా పిల్లలు అని అన్నారు కదా, అందరూ రాజులే. రాజు సింహాసనాధికారిగా ఉంటారు కదా? రాజ్యానికి గుర్తు కిరీటము, సింహాసనము మరియు తిలకము. మరి బాప్‌దాదా ఈ సంవత్సరము కొత్తవారైనా, పాతవారైనా సరే - ఒకవేళ ఎవరైనా కొత్తవారైనా సరే, సమాప్తి సమయము కొత్తవారికి కూడా సమీపంగా ఉంది, అలాగే పాతవారికి కూడా సమీపంగా ఉంది. బహుశా మాకు కూడా 60 సంవత్సరాలు లభిస్తాయి అని అనుకోకండి. లేదు, మీరు కవర్ చేసుకోవాలి. ఒకవేళ లాస్టులో వచ్చి ఉంటే ఫాస్టుగా వెళ్ళాలి. సంపన్నంగా అయ్యేందుకు, సమాప్తి సమయము అందరికీ ఒక్కటే, అందుకే కొత్తవారైనా లేక పాతవారైనా సరే, నేను స్వరాజ్య అధికారి ఆత్మను - అనే ఈ స్మృతి తిలకము సదా పెట్టబడే ఉంది. ఒకసారి తిలకము ఉండి, మరొకసారి తిలకము చెరిగిపోయి... అలా కాదు, రాజ్య అధికారి అనగా తిలకధారి - ఈ స్మృతి తిలకము అవినాశీగా ఉండాలి, సాధారణంగా కాదు. నేను తిలకధారిని, నేను విశ్వ కళ్యాణ బాధ్యత యొక్క కిరీటధారిని. ఇది ఎంత పెద్ద విశ్వము మరియు మీరందరూ విశ్వ కళ్యాణకారులు. కేవలం తండ్రి మాత్రమే విశ్వ కళ్యాణకారి కాదు, మీరందరూ తండ్రికి సహచరులు. కావున విశ్వ కళ్యాణ బాధ్యతా కిరీటధారులు మరియు సదా తండ్రి హృదయ సింహాసనాధికారులు. క్రిందకు దిగకండి. సదా సింహాసనాధికారి. మామూలుగా కూడా చూడండి, ఎవరైతే చాలా ప్రియంగా ఉంటారో, ప్రియమైన పిల్లలుగా ఉంటారో, వారిని తల్లిదండ్రులు మట్టిలోకి వెళ్ళనివ్వరు, నేలపై పాదం పెట్టనివ్వరు. మరి మీరెంత ప్రియమైన పిల్లలు! మీరు ప్రియమైన పిల్లలేనా లేక ఇంకా ఎవరో వచ్చేది ఉందా? మీరే కదా. మరి సింహాసనాన్ని విడిచి సాధారణ స్వరూపము, సాధారణ సంకల్పము... ఈ మట్టి లేక నేలపై అడుగు పెట్టకండి. బుద్ధి రూపీ పాదము సదా సింహాసనంపై ఉండాలి. పరమాత్మ అయిన తండ్రికి పిల్లలు మీరు. మహాత్ములకు, ధర్మాత్ములకు కాదు, పరమ ఆత్మకు పిల్లలు. ఇప్పుడైతే అందరూ నషాలో మంచిగా ఉన్నారు, అది కనిపిస్తుంది కానీ ఇది సదా ఉంటుంది కదా? లేక కొద్ది-కొద్దిగా ఉంటుంది, మళ్ళీ యుద్ధం చేస్తారు, ఆ తర్వాత విజయాన్ని పొందుతారు - ఇలా అయితే కాదు కదా? మీరు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? మీరు బ్రాహ్మణులు. క్షత్రియులు కాదా, యుద్ధం చేయరా? లేక ఒక్కోసారి బ్రాహ్మణులుగా అవుతారు మరియు ఒక్కోసారి క్షత్రియులుగా అవుతారా? ఒకవేళ మాయతో యుద్ధం చేయవలసి వస్తుంది అంటే క్షత్రియులు అయినట్లు. బ్రాహ్మణులు అనగా విజయీ మరియు క్షత్రియులు అనగా యుద్ధం చేసేవారు. బాప్‌దాదాకు అప్పుడప్పుడు పిల్లలపై చాలా దయ కలుగుతుంది, కూర్చునేది యోగములో కానీ చేసేది యుద్ధము! ఒక గంట యోగం చేసాము అని అంటారు కానీ ఒక్క గంటలో యుద్ధం ఎంత సమయం జరిగింది మరియు యోగం ఎంత సమయం ఉంది? ఒకవేళ ఏ కారణం చేతనైనా అనుభూతి కలగడం లేదంటే తప్పకుండా యుద్ధం చేసే స్థితి ఉన్నట్లే. బాప్‌దాదా అంటారు - మీరు యోగీ పిల్లలు కానీ యోధులైన పిల్లలుగా అవుతారు! ఎప్పటివరకు యుద్ధం చేస్తారు? అంతిమం వరకు యుద్ధం చేస్తారా? యుద్ధం చేయండి - అని అనుమతిని ఇవ్వమంటారా? అనుమతి కావాలా? వద్దా? మరి ఎందుకు చేస్తారు? బలహీనంగా అయినప్పుడు మాయ ఎంతగా ఆధీనులుగా చేస్తుందంటే మీరు వద్దనుకున్నా కానీ యుద్ధం చేస్తారు. ఏ విధంగానైతే కొంతమంది పనివాళ్ళు చాలా అమాయకంగా ఉన్నప్పుడు యజమాని వారిని ఆధీనం చేసుకుంటారు, ఆ పనివాడు చేయలేని పనిని కూడా యజమాని - నీవు చెయ్యి, లేకపోతే ఉద్యోగం ఎందుకు చేస్తున్నావు అని అంటారు. మాయ కూడా అలాగే చేస్తుంది, మీరు వద్దనుకుంటారు కానీ బలహీనంగా ఉన్న కారణంగా మాయకు ఆధీనులుగా అవ్వవలసి ఉంటుంది. మరి ఆ సమయంలో మీరు యోగీలా లేక యోధులా? యోగీ అనైతే అనలేము కదా? మరి బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరూ యోగీ పిల్లలుగా ఉండాలి, యోధులుగా కాదు. బాప్‌దాదాకు పిల్లలు చేసే యుద్ధం యొక్క శ్రమ మంచిగా అనిపించదు. పరమాత్ముని పిల్లలైతే సదా ఉత్సాహంలో ఉండేవారు, ఆనందంలో ఉండేవారు, యుద్ధం యొక్క శ్రమ చేసేవారు కాదు. మరి ఎలా తయారవుతారు? యోగీ పిల్లలుగానా లేక యోధులైన పిల్లలుగానా? యోగీగా అవుతారా లేక కొద్ది-కొద్దిగా యుద్ధం చేయడం మంచిగా అనిపిస్తుందా? చెప్పేటప్పుడు అవును, అవును అని అంటారు, కానీ చేసేటప్పుడు ఫోటో తీయడం జరుగుతుంది. కావున ఈ సంవత్సరము అందరి చార్టు ఈ విధంగా ఉండాలి - సదా రాజ్యాధికారి, ఆధీనత సమాప్తము. 63 జన్మలు అధీనంగా ఉన్నారు కదా, ఇప్పుడు ఒక జన్మ అధికారిగా అయ్యేందుకు లభించింది, ఇందులో కూడా అధీనంగా ఉంటారా? అధీనంగా అయ్యేందుకు ఇంకొక జన్మ ఎక్స్ట్రాగా ఇచ్చేయమంటారా, మజా తీసుకోండి. వద్దా! అధికారం అయితే లభించింది, కేవలం అధికారాన్ని సంభాళించండి. నిర్లక్ష్యంగా అవ్వకండి, బలహీనంగా అవ్వకండి. చెప్పేటప్పుడు చూడండి ఏమని చెప్తారు - నేను మాస్టర్ సర్వశక్తిమంతుడిని. ఎవరైనా నేను మాస్టర్ బలహీనుడిని అని అంటారా? కానీ అయ్యేది ఏమిటి? మాస్టర్ సర్వశక్తిమంతుడు బలహీనంగా ఉండటమా! మరి బాగుంటుందా? వినడానికి కూడా బాగుండదు!
అయితే ఈ సంవత్సరపు రిజల్ట్‌లో ఏమి చేస్తారు? ఇప్పుడు డైమండ్ జూబిలీ జరుపుకునేందుకు తయారీ చేస్తున్నారు కదా! మీరు కూడా జరుపుకుంటారా లేక 60 సంవత్సరాలు అయినవారే జరుపుకుంటారా? ఎందుకంటే ఇది స్థాపన యొక్క డైమండ్ జూబిలీ. మరి స్థాపనలో మీరందరూ ఉన్నారా లేదా? ఎందుకంటే ఇప్పుడు మిక్స్‌గా వచ్చారు, కొందరు రెండు-నాలుగు సంవత్సరాల వారు, కొందరు రెండు-నాలుగు నెలల వారు కూడా ఉన్నారు, కానీ డైమండ్ జూబిలీ అందరిదీ, ఎందుకంటే ఇది స్థాపన యొక్క డైమండ్ జూబిలీ. మరి ఘనంగా జరుపుకుంటారు కదా! జరుపుకోవడం అంటే ఏమిటి? కాన్ఫరెన్స్ చేయడమా, ప్రోగ్రామ్ చేయడమా లేక తయారవ్వడమా? జరుపుకోవడం అనగా తయారవ్వడం మరియు తయారుచేయడం. కేవలం జరుపుకోవడం కాదు, తయారవ్వడం. చూడండి, మీరందరూ ఈ సీజన్ సమాప్తిలో భోగ్ పెట్టే ఆత్మలు. మరి ఎంత మంచి ఛాన్స్ లభించింది. మేళా బాగుందా? ఇప్పుడు మీ అందరి ఫిర్యాదులు పూర్తయ్యాయి కదా! ఛాన్స్ లభించదు, ఛాన్స్ లభించదు - ఈ ఫిర్యాదు అయితే పూర్తయ్యింది కదా. చూడండి, పిల్లల ప్రేమలో పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడికి రావలసి వచ్చింది. ఎందుకంటే బాబాకు తెలుసు, అర్థకల్పం పిల్లలు స్మృతి చేసారు - రండి-రండి. బాబా అయితే తమ సమయానికే వచ్చారు, మీరు పిలిచినప్పుడు రాలేదు, కానీ వింటారు కదా. మరి మీరు అర్థకల్పం రండి-రండి అని అన్నారు మరియు బాబా ఇప్పుడు మేళాకు రండి-రండి అని అన్నారు. అందరూ సంతోషంగా ఉన్నారా? అందరూ ఆరోగ్యంగా కూడా ఉన్నారా లేక ఎవరైనా అనారోగ్యంతో టెంట్లో పడుకొని ఉన్నారా? మీరు ఇక్కడ కూర్చున్నారు, మరి మీ సహచరులు? ఎవరూ లేరు. దీనితో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని ఋజువవుతోంది, అంటే బ్రహ్మా భోజనం చాలా బాగా లభించింది. ఇప్పటికైనా చూడండి, క్రింద పడుకునే ఏర్పాటైతే లభించింది. ముందు ముందు వినాశన సమయంలో చేతులనే దిండుగా చేసుకోవలసి రావచ్చు. మట్టిపైనే హాయిగా పడుకుంటారు, రాళ్లు-కంకరలు తగిలితే వాటిని శుభ్రం చేసుకుంటారు, ప్రక్కకు తీసేస్తారు. ఇప్పుడు బాప్‌దాదా చూసారు, బాప్‌దాదా తిరిగారు, చాలా మంచి ఏర్పాటు చేసారు మరియు అందులో కూడా గుజరాత్ వారికి పదమారెట్లు అభినందనలు. చాలా బాగా చేసారు. హృదయపూర్వకంగా శ్రమించారు. ఎవరైతే హృదయపూర్వకంగా శ్రమించారో వారికి బాప్‌దాదా శ్రమకు పదమారెట్లు ప్రేమను ఇస్తున్నారు. సేవలో నిమిత్తమై సేవ చేసినవారు చేతులెత్తండి? గుజరాత్ వారు చేసారు కదా! గుజరాత్ వారు చేతులెత్తండి. చాలా బాగా చేసారు. చూడండి, పలుచని పలుచని రొట్టెలు లభిస్తున్నాయి. కాలిపోయినవి అయితే లభించడం లేదు కదా? బ్రహ్మా భోజనం చాలా బాగా తయారవుతోందని బాప్‌దాదా రిజల్ట్ విన్నారు. నేలపై పడుకునే అభ్యాసం అయితే అయిపోయింది కదా! బాగుంది, వేసవి సీజన్లో టెంట్ కూడా ఎగిరిపోయిందంటే గాలి కోసం పైకప్పు ఖాళీ అయిపోయింది కదా. నేచురల్ కిటికీలు తయారయ్యాయి. కానీ రెండవ గ్రూపుకు ఇలా ఉండదు, వారి కోసం మంచి ఏర్పాటు చేస్తారు. మరియు మధుబన్ వారు, ఎవరైతే చాలా మంచి సహయోగం ఇచ్చారో వారు చేతులెత్తండి. బాగా శ్రమించారు. (దాదీ చేసారు) దాదీ అయితే నిమిత్తం కదా. దాదీకి రోజంతటిలో ఎన్ని మాలలు పడతాయి! ఆశీర్వాదాల మాలలు ఒకదాని తరువాత ఒకటి పడుతూనే ఉంటాయి, వాటిని తీయవలసిన అవసరం కూడా ఉండదు. పూల మాలలు 10 మెడలో వేస్తే మెడే అలసిపోతుంది, కానీ ఈ ఆశీర్వాదాల మాల ఎంతో తేలికైనది మరియు ఎంతో ప్రియమైనది! ఎవరైతే సేవ చేస్తారో, వాస్తవానికి అందరూ సహయోగం ఇచ్చారు, సహయోగం లేకుండా ఏ కార్యమూ జరగదు. అందరూ హా జీ చేయవలసిందే, చేయండి, ఈ సహయోగపు చేయి అందించినప్పుడే ఈ కార్యం జరిగింది. ఇద్దరు-నలుగురు కూడా సహయోగులు ‘వద్దు, వద్దు’ అని అంటే మేళా జరగదు. కానీ మధుబన్ వారు, తలహటీ వారు కావచ్చు, హాస్పిటల్ వారు కావచ్చు లేదా నలువైపుల దేశాల వారు కావచ్చు, జ్ఞాన సరోవర్ వారు కూడా సహాయం చేసారు. జ్ఞాన సరోవర్కు బలిహారం, మీకు మంచి భోజనం లభించింది. (జ్ఞాన సరోవర్ యొక్క స్టీమ్ సిస్టమ్ మరియు పెద్ద పాత్రలు మొదలైనవి మేళాలో ఉపయోగిస్తున్నారు) ఎందుకంటే మీరందరూ జ్ఞాన సరోవర్‌ను తయారుచేసారు కదా, మరి ఏ బీజం వేసారో దాని ఫలాన్ని తింటున్నారు. ప్రత్యక్షఫలం కదా, మరి ప్రత్యక్షఫలం లభించింది మరియు ప్రేమతో తయారుచేస్తున్నారు కూడా. కొంచెం కూడా అలసట యొక్క గుర్తులు ముఖంలో లేవు. అద్భుతం ఇదే కదా! పని చేయాలి మరియు ప్రేమతో చేయాలి. బలవంతంగా పని చేస్తే ఆ పని, పని కాదు. మేళాకు వెళ్ళినప్పుడు ఏదో ఒక వస్తువును స్మృతిచిహ్నంగా తప్పకుండా తీసుకువెళ్తారు కదా. ఈ పరమాత్మ మేళా నుండి ఏ స్మృతిచిహ్నాన్ని తీసుకువెళ్తారు? కిరీటం, సింహాసనం మరియు అవినాశీ తిలకం అనే స్మృతిచిహ్నాలను అందరూ మీతో పాటు తీసుకువెళ్ళండి. మూడు వస్తువులలో ఒకటి ఇక్కడే ఉండిపోయి రెండు మాత్రమే మీతో వెళ్ళేలా చేయకండి. ఇక్కడే వదిలేసి వెళ్ళరు కదా? తీసుకువెళ్ళడం వచ్చా? సీజన్లో అనౌన్స్ చేస్తారు కదా, లాస్ట్ ప్రాపర్టీ ప్రతిరోజూ జమ అవుతుంది, అలా వదిలేసి వెళ్ళకండి. నేను బ్రాహ్మణ ఆత్మను, నేను సర్వశ్రేష్ఠ భాగ్యవంతమైన ఆత్మను - ఈ నిశ్చయం మరియు నషాలో సదా ఉండండి. ఇది కేవలం బుద్ధిలోనే ఉండకూడదు, కానీ నడవడికలో మరియు ముఖంలో కనిపించాలి. మీ సంపర్కంలోకి ఎవరైతే వస్తారో వారు, వీరు సాధారణమైనవారు కాదు, కానీ అతీతంగా ఉన్నారు అని అనుభవం చేయాలి. మరియు అలౌకికమైన అతీత స్థితియే ప్రియంగా అనిపిస్తుంది కదా! మరి అతీతంగా అవ్వడం వచ్చా?
భారతదేశం నలువైపుల నుండి వచ్చారు. అన్ని వైపుల నుండి వచ్చారా లేక ఎవరైనా ఉండిపోయారా? అన్ని జోన్లు వచ్చాయి. మరి రావడంలో ఎవరెడీగా అయ్యి చేరుకున్నట్లే, బాప్‌దాదా ఇప్పుడు ఒక సెకండులో తిరిగి ఇంటికి వెళ్ళేందుకు తయారవ్వండి అని ఆర్డర్ చేస్తే చేయగలరా? లేక టెలిఫోన్ చేసి మేము వెళ్తున్నాము అని చెప్పాలని గుర్తుకొస్తుందా, ప్రవృత్తిలో ఉన్నవారు గుర్తుకొస్తారా? ఇటువంటి ప్రాక్టీస్ చేయండి - ఒక సెకండులో ఆత్మ శరీరం నుండి అతీతంగా అయ్యేందుకు ఎవరెడీగా అవ్వాలి. ఎందుకంటే అందరి వాగ్దానం - కలిసి వెళ్తాము. వాగ్దానం ఉందా, లేదా? బాబా వెళ్ళిపోతారు మరియు మనం చూస్తూ ఉండిపోతామా! కాదు, కలిసి ఉంటాము, కలిసి వెళ్తాము. మరి వెళ్ళేందుకు తయారీ కూడా కావాలి కదా! మీరు ఎగరడానికి ప్రయత్నిస్తే తాడు మిమ్మల్ని క్రిందికి లాగేసేలా ఏవైనా గోల్డెన్, సిల్వర్, కాపర్ యొక్క సూక్ష్మ తాళ్లు అయితే లేవు కదా? కాబట్టి చెక్ చేసుకోండి మరియు ఒక సెకండులో అశరీరిగా అవ్వగలరా అని అభ్యాసం చేయండి. అశరీరి అనగా శరీరం యొక్క ఏ ఆకర్షణ కూడా ఆత్మను తనవైపు ఆకర్షించకూడదు. జీవించి ఉన్నా కూడా జీవిస్తూ మరణించినవారిలా. అలాగే మీ అందరి శరీరం అయితే మీదే కాదు. నా శరీరం అని అంటారా లేక బాబా యొక్క అమానతు అని అంటారా? అది బాబా యొక్క అమానతే అయినప్పుడు అశరీరిగా అవ్వడం ఏమంత కష్టం? కష్టమా లేక సహజమా? (సహజం) చెప్పడంలో అయితే సహజమే. నేను ఆత్మను, నేను ఆత్మను... అని యుద్ధం చేయవలసి రాకూడదు. యుద్ధంలోనే ఒక సెకండు పూర్తయిపోతే ఎక్కడికి చేరుకుంటారు! బాబా చెప్పారు మరియు చేసేసారు. ఒకవేళ కొంచెం కూడా ఆలోచిస్తే - ఇలా కాదు అలా, ఇప్పుడు కొంచెం టైమ్ కావాలి, ఇంత అభ్యాసం ఇంకా కాలేదు, అయిపోతుంది... ఆలోచించారు మరియు వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు? త్రేతాలోకి వెళ్ళారు. హా జీ అంటే బ్రహ్మా బాబాకు సహచరులుగా అవుతారు. అచ్ఛా.
టీచర్లతో:- టీచర్లు అందరూ ముందు కూర్చున్నారు, తెలివైనవారు. చాలా మంచిది. బాప్‌దాదా నిమిత్తమై సేవ చేస్తున్నందుకు అభినందనలు ఇస్తున్నారు. అయినప్పటికీ చూడండి, పురుషార్థం చేసి అందరికీ యాత్ర అయితే చేయించారు.
కుమారులతో:- కుమారులు ఏమి చేస్తారు? కుమారులు సదా విశ్వంలో ఏదో ఒక పరివర్తన కొరకు ఎవరెడీగా ఉంటారు. ఏ క్రాంతికైనా నిమిత్తంగా కుమారులు అవుతారు. మరి ఇది శాంతి యొక్క క్రాంతి. కాబట్టి కుమారులందరూ సదా మన ప్రతి కర్మ పరివర్తన చేయడానికి నిమిత్తంగా ఉంది అని గుర్తుంచుకోండి. కుమారులు అనగా విశ్వ పరివర్తకులు. అలా ఉన్నారు కదా? కేవలం చప్పట్లు అయితే కొట్టడం లేదు కదా. చాలా మంచి మంచి కుమారులు ఉన్నారు. చూడండి, బాప్‌దాదా సదా చెబుతారు, సేవాకేంద్రం సేవలో ముందు నంబరులోకి వెళ్ళాలంటే కుమారులు కూడా తప్పకుండా కావాలి. ఎక్కడ కుమారులు ఉండరో అక్కడ సేవా ప్లాన్లు తక్కువగా తయారవుతాయి. కాబట్టి ఇటువంటి నిర్విఘ్న సేవాధారి కుమారులు. గందరగోళం చేసేవారిగా అవ్వకండి. నిర్విఘ్న సేవాధారి కుమారులు. కుమారులే సేవకు శోభ, అందుకే బాప్‌దాదాకు కుమారులు ప్రియంగా అనిపిస్తారు. బాగుంది. ఈ సంవత్సరం అయితే అందరూ నిర్విఘ్నంగా అవ్వాల్సిందే, మీ దగ్గరకు విఘ్నాల గురించి ఉత్తరాలు రావు - ఇది అయింది, అది అయింది... అని. కుమారులను మాయ కూడా చాలా ప్రేమిస్తుంది. మాయ కూడా వీరు నా వారిగా అవ్వాలి అని భావిస్తుంది, అందుకే డబల్ అటెన్షన్. మాయకు చెందినవారిగా అవ్వకండి.
కుమారీలతో:- కుమారీలు ఏమి చేస్తారు? కుమారీలకు అయితే చాలా చాలా గొప్ప భాగ్యం ఉంది. కుమారుడు 25 సంవత్సరాల వాడైనా అతనిని ఎవరూ దాదా అని పిలవరు, కానీ కుమారీలను దాదీ అని పిలుస్తారు, దీదీ అని పిలుస్తారు. కుమారీలు టీచర్లుగా అయితే దాదీ, దీదీ అనే టైటిల్ లభిస్తుంది. దీదీ అని పిలిపించుకునేవారు చాలా మంచివారు మరియు అలా తయారయ్యేవారు కూడా మంచివారు. కానీ దీదీ అనగా పెద్దవారు. కాబట్టి దీదీగా అవ్వడం అనగా విశాల హృదయంతో స్వ పురుషార్థం చేయడం మరియు ఇతరులతో పురుషార్థం చేయించడం. కేవలం దీదీ అనే పేరుతో సంతోషపడిపోకండి. పని కూడా చేయాలి. కుమారులు మరియు కుమారీల విషయంలో మాయకు కొంత ఎక్స్ట్రా ప్రేమ ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ ఇది ప్రేమ కాదు, మోసం. మొదట మాయ చాలా ప్రేమిస్తుంది కానీ అందులో మోసం ఇమిడి ఉంటుంది. ఇప్పుడు ఏ కుమారుడు మరియు కుమారీ గురించి మాయకు సంబంధించిన రిపోర్ట్ రాకూడదు. ఇప్పుడు రిపోర్ట్ వస్తోంది. చాలామంది ఆటలు ఆడుతున్నారు, కుమారులు కూడా, కుమారీలు కూడా. ఇప్పుడు ఆటలు ఆడకండి. ఇప్పుడు విశ్వ పరివర్తకులుగా అయ్యి, అందరూ ఒకరికొకరు సహయోగులుగా అయ్యి ముందుకు ఎగరండి. సరే కదా.
ప్రవృత్తిలో ఉన్నవారితో:- ప్రవృత్తిలో ఉన్నవారు ఏమి చేస్తారు? ప్రవృత్తిలో ఉన్నవారు సదా ఈ వరదానాన్ని గుర్తుంచుకోండి - మనం విశ్వం యొక్క షో కేస్‌లో చాలా మంచి నంబర్‌వన్ షో పీస్లము. మీరు ఎంత మంచి షో పీస్ అనగా శాంపిల్‌గా ఉంటారో, బాబాతో వ్యాపారం చేసేవారు అంతమంది వస్తారు. శాంపిల్‌ను చూసి వారు కూడా కొనుగోలుదారులుగా అవుతారు. ప్రవృత్తిలో ఉన్నవారు తమ పార్ట్‌ను చాలా బాగా పోషిస్తున్నారు. ప్రవృత్తిలో ఉన్నవారు లేకపోతే ఇప్పటివరకు కూడా బాప్‌దాదా తిట్లు తినవలసి వచ్చేది. చూడండి, మొదట ఎన్ని తిట్లు తిన్నారు. కానీ ప్రవృత్తిలో ఉన్న మీ శాంపిల్‌ను చూసి ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రవృత్తిలో ఉన్నవారికి కూడా తమదైన విశేషత ఉంది. కానీ ప్రవృత్తి అనగా ఏమిటి? పర వృత్తిలో ఉండేవారు. ప్రవృత్తి అనగా - నా మనవడు, నా మనవరాలు అని కాదు. పర వృత్తిలో ఉండేవారు. కానీ ఏమవుతుంది? బాప్‌దాదా అతీతంగా మరియు ప్రియంగా ఉండండి అని చెబుతారు, అప్పుడు ప్రియంగా అయితే అవుతారు కానీ అతీతంగా అయ్యి ప్రియంగా అవ్వరు. ఈ పొరపాటు చేస్తారు. ప్రియంగా అయితే అవుతారు కానీ అతీతతనమును మర్చిపోతారు. కాబట్టి ప్రియంగా కూడా మరియు అతీతంగా కూడా - ఇది ప్రవృత్తిలో ఉన్నవారికి వచ్చు కదా! ప్రియంగా మరియు అతీతంగా ఉండడంలో తెలివైనవారు కదా? ఇప్పుడు మాయ వచ్చింది, ఏమి చేయాలి? అని వ్రాయకండి. మాయను ఎప్పటికీ తరిమివేసాము - ఇటువంటి ఉత్తరం వ్రాయండి. ఉత్తరం వ్రాయవలసిన అవసరం కూడా లేదు, బాబా దగ్గరకు చేరుతుంది. వ్రాస్తే 4-4 పేజీల ఉత్తరం వ్రాస్తారు, ఎకానమీ ఉండదు. ఖర్చు అవుతుంది కదా, ఖర్చు ఎవరిది? మీదా లేక బాబాదా? మరి అనవసరమైన ఖర్చు చేసారు కదా మరియు చదివేవారి ఎంత అనవసరమైన టైమ్ పోతుంది. అక్షరాలు కూడా ఎలా వ్రాస్తారంటే కొన్ని ఈస్ట్‌కు వెళ్తాయి, కొన్ని వెస్ట్‌కు వెళ్తాయి. రెండు మాటల్లో వ్రాయండి, డీటెయిల్‌గా వ్రాయకండి. శుభవార్తల ఉత్తరాలు ఎప్పుడూ పొడవుగా ఉండవు. అలాంటి ఇలాంటి వార్తలున్న ఉత్తరం నాలుగు పేజీలు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు శుభవార్తల ఉత్తరాలు రావాలి కదా లేక పొడవైన ఉత్తరాలు రావాలా? ఎవరైనా మీ దగ్గరకు ఎలాంటి ఉత్తరాలు లేదా వార్తలు చెప్పినా మీరు ఏమి చేయాలి? అచలంగా-నిశ్చలంగా ఉండాలి. వేస్ట్ పేపర్ బాక్స్‌లో వేసేయండి. ఇంట్రెస్ట్ తీసుకోకండి - ఇది ఏమిటి, ఇది ఏమైంది... అని. వద్దు, చెప్పేవారు చెబుతున్నారు. మీరు బాబా చెప్పినదే వింటున్నారా లేక ఇతరులు చెప్పేది కూడా వినాలా? వాగ్దానం ఏమిటి? మీ నుండే వింటాము లేక ఇతరుల నుండి కూడా కొంచెం కొంచెం వింటామా? ఎవరైనా ఏదైనా చెప్పనివ్వండి, ఎవరైనా - మేమే బాబా అని అననివ్వండి, ఎవరైనా మేము ఇది అని అననివ్వండి... చెప్పనివ్వండి, ఆనందించనివ్వండి. మీరు బాబాకు చెందినవారు మరియు బాబాకే చెందినవారిగా ఉండాలి. అంగీకారమే కదా లేక కొంచెం కొంచెం ఆనందం తీసుకోవాలా? బాబా ప్రభావంలో ఉండేవారు ఏ ఆత్మ ప్రభావంలోకి రాలేరు. ఇది కూడా బాగా చెబుతారు - విన్నంత మాత్రాన ఏమైంది! కానీ బాబా ఏమి చెప్పారు? ఒక్కరి నుండే వినండి, ఒక్కరిదే వినండి. మరి ఇది ఇష్టమే కదా లేక కొంచెం కొంచెం రామాయణ కథ, మహాభారత కథ వినడం బాగుంటుందా? మధ్య మధ్యలో కొంచెం వినోదం కూడా ఉండాలా! వద్దు, మీరు మీ ఆనందంలో ఉండండి. ఇతరులు ఏదైనా చేస్తే వారిని కూడా ఆనందించనివ్వండి, శుభ భావన ఇవ్వండి. మీరు సేఫ్‌గా ఉండండి. సేఫ్‌గా ఉండడం వచ్చా లేక కొంచెం సెగ తగులుతుందా? సెగ కూడా తగలకూడదు. సదా సేఫ్‌గా ఉండండి.
అచ్ఛా, అందరికీ వరదానాలు లభించాయి. ఎంత పరమాత్మ ప్రేమ ఉంది. పాట పాడుతారు కదా - ఇంత ప్రేమ ఎవరు చేస్తారు? పరమాత్మ ప్రేమను మరెవరూ ఇవ్వలేరు. అసంభవం. మరి ఆశలన్నీ పూర్తయ్యాయా? జీవించి ఉన్నంతవరకు కలుస్తూనే ఉండాలి. ఎప్పుడూ మాయ యొక్క గందరగోళాలకు భయపడకండి. రా, మేము కూడా విజయులమే. ఇంకా ఛాలెంజ్ చేయండి - రా, ఏ నష్టం లేదు. మీకు గందరగోళం అయితే మాకు మేళా.
అచ్ఛా, జ్ఞాన సరోవర్‌లో ఇంత మేళా జరగగలదా? (జరగగలదు) బాప్‌దాదాకు చూపించండి, ఎక్కడ చేస్తారు? బాగుంది, జ్ఞాన సరోవర్ విశ్వానికి ఒక శాంపిల్‌గా తయారైంది. చివరికి అయితే ఆశ్రయస్థానంగా అవ్వాల్సిందే. ఇప్పుడు చూసారు కదా, ఎప్పుడైనా ఏదైనా విషయం పైకి-క్రిందికి అయితే వచ్చేయండి. స్థానం అయితే చూసారు కదా? జ్ఞాన సరోవర్‌లో అన్ని వైపుల మైక్‌ల మేళా జరుగుతుంది. అన్ని వైపుల మైక్‌లు రావాలి కదా? ఇది బ్రాహ్మణుల మేళా మరియు అది నలువైపుల మైక్‌ల మేళా. ఎందుకంటే జ్ఞాన సరోవర్ అందరి బిందువు-బిందువుతో సరోవరంగా తయారైంది మరియు అందరూ హృదయపూర్వకంగా, ప్రాణప్రదంగా ప్రేమతో బిందువు-బిందువు వేసారు. అందుకే మీ అందరి సహయోగానికి శాంపిల్ జ్ఞాన సరోవర్. ఇక్కడ తలహటీ వారు కూడా చాలా కాలం నుండి తపస్సు చేసారు, వారి తపస్సు కూడా పూర్తయింది. అచ్ఛా!
అన్ని వైపులా ఉన్న దేశ-విదేశాలలోని సూక్ష్మ స్వరూపంతో దృశ్యాన్ని చూసే సర్వ ఆత్మలకు, నలువైపులా ఉన్న సదా శ్రేష్ఠ పాలనతో పాలించబడేవారికి, శ్రేష్ఠ చదువుతో రాజ్య పదవిని పొందే ఆత్మలకు, సద్గురువు ద్వారా సర్వ వరదానాలను ప్రాప్తి చేసుకునే ఆత్మలకు, సదా మాయాజీత్ విజయీ రత్నాలకు, సదా యుద్ధాన్ని విడిచిపెట్టి రాజయోగి స్థితిలో స్థితులై ఉండే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా, డబల్ విదేశీయులకు కూడా మేళా బాగుందా? మీరు ఇలా పడుకుంటారా, టెంట్లో పడుకుంటారా? లేక నిద్ర రాదా? పడుకోవడానికి తయారుగా ఉన్నారా? వీరు అయితే తయారుగా ఉన్నారు, మీరే పడుకోనివ్వడం లేదు. చాలా ధైర్యవంతులు, ఎవరెడీగా ఉన్నారు. డన్లప్ లభించినా సరే, నేల లభించినా సరే. అచ్ఛా, డబల్ విదేశీయులు కూడా ఈ సీజన్లో మంచి ఉల్లాస-ఉత్సాహంతో ఉన్నట్లు కనిపించారు. వృద్ధిని కూడా చూసాము, సంఖ్యలో కూడా వృద్ధి ఉంది, స్థితిలో కూడా వృద్ధి ఉంది. ఇప్పుడు బాల్యపు ఆట సమాప్తమైంది, ఇప్పుడు పెద్దవారయ్యారు. అచ్ఛా, అంతా బాగుందా? మేళా నచ్చిందా? ఇలా అయితే అనుకోవడం లేదు కదా - ఇదేమి గందరగోళం? లేదు, చాలా బాగుంది. డ్రామాలో ఏది జరుగుతుందో అది మంచిదే మరియు మంచి కంటే మంచిగా ఉంటుంది.
(స్టేజ్‌ను చాలా సుందరంగా అలంకరించారు, సూక్ష్మవతనం మరియు సత్యయుగం యొక్క దృశ్యాన్ని తయారుచేసారు, బాప్‌దాదా వెనుకకు తిరిగి అన్ని దృశ్యాలను చూసారు) చాలా బాగుంది, అందరూ చాలా బాగా శ్రమించారు. గుజరాత్ వారి అద్భుతం కూడా ఉంది. అలసిపోలేదు కదా? అందరూ బాగా చేసారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
