‘‘బ్రాహ్మణులు అనగా ధర్మ సత్తా మరియు స్వరాజ్య సత్తా కలిగిన అధికారీ ఆత్మలు’’
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలలో రెండు విశేష సత్తాలను చూస్తున్నారు. ఆ రెండు సత్తాలు ఏమిటంటే - ఒకటి ధర్మ సత్తా మరియు రెండవది స్వరాజ్య సత్తా. బ్రాహ్మణ జీవితం యొక్క విశేషత ఏమిటంటే - ఈ రెండు సత్తాలు ప్రతి ఒక్కరికీ ప్రాప్తిస్తాయి. ధర్మ సత్తా అనగా సత్యత, పవిత్రత యొక్క ధారణా స్వరూపము మరియు స్వరాజ్య సత్తా అనగా అధికారులుగా అయ్యి సర్వ కర్మేంద్రియాలను తమ అధికారంతో ఆజ్ఞానుసారంగా నడిపించడము. స్వరాజ్య అధికారులు లేక స్వరాజ్య సత్తా యొక్క అధికారులు ఏ విధమైన పరిస్థితి, ప్రకృతి లేక మాయ యొక్క సర్వ స్వరూపాలలో ఆధీనులుగా అవ్వరు, అధికారులుగా ఉంటారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు బాప్‌దాదా ఈ రెండు సత్తాలను ప్రాప్తింపజేసారు కదా? అందరిలోనూ ఈ రెండు సత్తాలు ఉన్నాయా లేక ఇంకా పూర్తిగా లేవా? ఇప్పుడు ఈ రెండు సత్తాలనూ ప్రాప్తి చేసుకునేవారే భవిష్యత్తులో ధర్మ సత్తా మరియు రాజ్య సత్తాకు అధికారులుగా అవుతారు. రెండు సత్తాలను ధారణ చేసారా? మీ చిత్రాన్ని చూసారా? ఇది డబల్ విదేశీయుల చిత్రమా లేక ఇతరుల చిత్రమా? మరి ఈ చిత్రంలో రెండు సత్తాల గుర్తులను చూసారా? ధర్మ సత్తాకు గుర్తు ప్రకాశ కిరీటము మరియు రాజ్య సత్తాకు గుర్తు రత్నజడిత కిరీటము. మరి మీ ఈ చిత్రాన్ని చూసారా? రెండు సత్తాలను ఈ సమయంలోనే ధారణ చేస్తారు. అర్థకల్పము రెండు సత్తాలు కేవలం మీ అందరి చేతిలో, ఒకే చేతిలో ఉండేవి. ద్వాపరం నుండి చూస్తే ధర్మ సత్తా వేరైపోయింది మరియు రాజ్య సత్తా వేరైపోయింది, అందుకే ధర్మ పితలు రావలసి వచ్చింది. కావున ధర్మ పితలు మరియు రాజులు ఇరువురూ వేర్వేరుగా అయిపోయారు. కానీ మీ రాజ్యంలో వేర్వేరుగా ఉంటారా? ప్రతి ఒక్కరి వద్ద రెండు సత్తాలు కలిపి ఉంటాయి, అందుకే అఖండమైన, నిర్విఘ్నమైన రాజ్యం కొనసాగుతుంది. కావున ప్రతి ఒక్కరిలోనూ ఈ రెండు సత్తాలను చూస్తున్నారు - ప్రతి ఒక్కరూ ఎంతవరకు తమలో ధారణ చేసారు? ఎంతవరకు అధికారులుగా అయ్యారు? సదా అధికారులుగా ఉంటున్నారా లేక అప్పుడప్పుడు ఆధీనులుగా, అప్పుడప్పుడు అధికారులుగా ఉంటున్నారా? ఇప్పుడిప్పుడే అధికారులుగా ఉంటూ మళ్ళీ ఇప్పుడిప్పుడే ఆధీనులుగా అయిపోతే మంచిగా అనిపిస్తుందా? లేక సదా అధికారులుగా ఉంటే మంచిగా అనిపిస్తుందా? సదా అధికారం కావాలా లేక కొద్ది సమయం కోసమైనా సరిపోతుందా? స్వయంగా తండ్రి అధికారాన్ని ఇస్తున్నప్పుడు, ఇచ్చేవారు ఇస్తున్నప్పుడు, తీసుకునేవారు ఏం చేయాలి? తీసుకోవడం సులభమా లేక ఇవ్వడం సులభమా? తీసుకోవడంలో కష్టమేమీ లేదు కదా? ఇచ్చేటప్పుడు ఆలోచిస్తారు - ఇవ్వాలా, ఇవ్వవద్దా, తక్కువ ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వాలా... కానీ తీసుకోవడంలో అందరూ - ఎంత లభిస్తే అంత తీసేసుకోవాలి అని అంటారు. మరి తీసుకోవడంలో నంబర్‌వన్‌గా ఉన్నారా, నంబర్ టూ గా ఉన్నారా? ఇందులోనైతే ఎవ్వరూ నంబర్ టూ గా అవ్వరు. మరి ఇవ్వాల్సి వచ్చినప్పుడు... ఇవ్వడంలో కూడా నంబర్‌వన్‌గా ఉన్నారా లేక ఆలోచించవలసి వస్తుందా, ధైర్యం పెట్టవలసి వస్తుందా! వాస్తవానికి ఏమి ఇస్తున్నారో చూడండి? బ్రాహ్మణ జీవితంలో ఇవ్వడం ఉందా లేక తీసుకోవడం ఉందా? ఒకవేళ ఇచ్చే వస్తువు కన్నా తీసుకునే వస్తువు శ్రేష్ఠంగా ఉన్నట్లయితే, అది తీసుకోవడం అయినట్లా లేక ఇవ్వడం అయినట్లా? ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వాలి - ఇలా ఆలోచిస్తే భారీగా అయిపోతారు. తీసుకోవాలి - అని అనుకుంటే సదా సంతోషంగా ఉంటారు, ధైర్యంగా ఉంటారు. ఇచ్చే విషయంలో ఇవ్వడము కష్టమని అనుకుంటారు. కానీ మీరు మొదట తీసుకుంటారు, ఆ తర్వాత ఇవ్వడమైతే ఏమీ ఇవ్వరు. బాబాకు ఇవ్వడానికి మీ వద్ద ఏమైనా ఉందా? ఇచ్చేటప్పుడు మంచి వస్తువును ఇస్తారా లేక పాడైన వస్తువును ఇస్తారా? మరి మీ వద్ద మంచిది ఏముంది - తనువు మంచిది ఉందా? మనస్సు మంచిది ఉందా? ధనము మంచిది ఉందా? అన్నీ పనికిరానివిగానే ఉన్నాయి. మందులతో శరీరాన్ని ముందుకు తోస్తున్నారు, అలా తోస్తూ నడిపే బండి ఏమైనా మంచిగా ఉంటుందా! కావున బ్రాహ్మణ జీవితంలో తీసుకోవడమే తీసుకోవడము మరియు పిల్లలు తండ్రి కన్నా తెలివైనవారు అని తండ్రి నవ్వుకుంటూ ఉంటారు. మొదట తీసేసుకుంటారు, ఆ తర్వాత ఇవ్వడము గురించి ఆలోచిస్తారు. తెలివైనవారే కదా! మంచిది, పిల్లలు తెలివైనవారు అయితే తండ్రికి మంచిగానే అనిపిస్తుంది కానీ నడుస్తూ-నడుస్తూ ఒకవేళ డల్‌గా అయిపోతే మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు పిల్లల ముఖం ఎలా అయిపోతుందంటే, ఏమైందో అర్థం కాదు! ఏ విధంగానైతే శరీరంలో నడుస్తూ-నడుస్తూ ఉండగా రక్తం తక్కువైపోతే బలహీనంగా అయిపోతారు కదా, ముఖంలో కూడా ఆ బలహీనత కనిపిస్తుంది. అలాగే ఇక్కడ కూడా సంతోషం యొక్క, శక్తుల యొక్క లోటు ఏర్పడుతుంది కదా, అప్పుడు ముఖం ఎలా అయిపోతుందంటే... అందరికీ తెలుసు, అందరూ అనుభవజ్ఞులే. ఒకవైపేమో సంతోషాల గని లభించింది, అది కూడా అవినాశీగా లభించింది అని అంటారు, మరి అది ఎలా తగ్గిపోతుంది? మరి తండ్రి వద్ద మీ రోజంతటి మనస్సు యొక్క మూడ్ మరియు ఆ మూడ్ అనుసారంగా ముఖ కవళికలు ఏవైతే మారిపోతాయో, ఆ రోజంతటి చిత్రాలు వారి వద్ద ఉంటాయి. మీరు చిత్రాలతో మ్యూజియం తయారుచేస్తారు కదా, తండ్రి వద్ద మీ చిత్రాల మ్యూజియం ఉంటుంది. కావున బ్రాహ్మణ ఆత్మనైన నేను రాజ్య సత్తా మరియు ధర్మ సత్తా యొక్క అధికారీ ఆత్మను అన్నది సదా గుర్తుంచుకోండి. ఈ స్మృతి యొక్క నిశ్చయము ఉన్నట్లయితే నషా ఉంటుంది, నిశ్చయం తక్కువగా ఉంటే నషా కూడా తక్కువగా ఉంటుంది. కావున చెక్ చేసుకోండి - ఈ సత్తాలు సదా తోడుగా ఉంటాయా లేక అప్పుడప్పుడు ఉంటున్నాయి మరియు అప్పుడప్పుడు పోగొట్టుకుంటున్నారా?
అచ్ఛా, ఈ రోజు డబల్ విదేశీయులు మెజారిటీ ఉన్నారు. బాప్‌దాదా విశేషంగా డబల్ విదేశీయులను అడుగుతున్నారు - రోజంతటిలో మీ అధికారం యొక్క సీటుపై సెట్ అయి ఉంటున్నారా లేక చాలా త్వరగా అప్సెట్ (డిస్టర్బ్) అవుతున్నారా? లేక అప్సెట్ అవ్వడము అనేది గతంలోని విషయము, ఇప్పుడు అలా అవ్వటం లేదు. గతానికి సంబంధించిన విషయమైంది కదా! ఇప్పుడైతే అలా అవ్వడం లేదు కదా! ఇప్పుడు నాలెడ్జ్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా అయిపోయారు. చిన్న విషయానికే అప్సెట్ అయిపోవడం, ముఖం మారిపోవడం, మూడ్ మారిపోవడం, అలా ఉండకూడదు! అలా అప్పుడప్పుడు అవుతూ ఉందా? అప్పుడప్పుడు అప్సెట్ అవుతున్నారా? అచ్ఛా! అప్సెట్ అవ్వడం అంటే ఏమిటో కూడా మర్చిపోయాము అని భావించే శక్తిశాలి ఆత్మలు ఎవరైతే ఎప్పుడూ అప్సెట్ అవ్వరో వారు చేతులెత్తండి. మీరు నిజం చెప్తున్నారు, అందుకు అభినందనలు. ఇప్పుడు ఈ సీజన్లో ఏదో ఒకటి మధుబన్‌లో వదిలేసి వెళ్తారా లేక ఏదైనా తీసుకొని వెళ్తారా? మెజారిటీ మధుబన్‌లో శివరాత్రిని జరుపుకున్నారు కదా! ఎవరి బర్త్ డే అయితే జరుపుకుంటారో వారికి గిఫ్ట్ ఇస్తారు కదా. మరి బాబాకు ఏం గిఫ్ట్ ఇచ్చారు? ఈ అప్సెట్ అవ్వడము అన్నదానినే గిఫ్ట్‌గా ఇవ్వండి - మేమెప్పుడూ అప్సెట్ అవ్వము. ధైర్యముందా? అచ్ఛా, చేతులెత్తండి మరియు టి.వి.లో అందరి చేతులను ఫోటో తీయండి. ఆలోచించి, అర్థం చేసుకుని పక్కాగా చేతులెత్తండి. చూడండి, అందరి చేతులది ఫొటో తీసారు. ఇప్పుడు ఫొటో తీసేసారు, చూసుకోండి. బాప్‌దాదాకు ఆ ముఖం మంచిగా అనిపించదు. బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ సదా వికసించి ఉన్న ఆత్మిక గులాబీలుగా చూడాలనుకుంటారు. వాడిపోయినట్లు కాదు, వికసించి ఉండాలి. ఎవరి పట్లనైతే ప్రేమ ఉంటుందో, వారికి ఏది మంచిగా అనిపిస్తుందో, అదే చేయడం జరుగుతుంది! డబల్ విదేశీయులైతే బాబాను ఎంతగానో ప్రేమిస్తారు. కావున బాబాకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో అదే మీకు మంచిగా అనిపిస్తుంది కదా! ఇప్పుడు ఇక ఎవ్వరి నుండి ఇటువంటి సమాచారం రాకూడదు - ఏం చేయాలి, విషయమే అలా ఉంది, అందుకే అప్సెట్ అయ్యాము! ఒకవేళ అప్సెట్ చేసే విషయం వచ్చినా కానీ మీరు అప్సెట్ స్థితిలోకి రాకండి. ఏ విధంగా అయితే ఊయల ఊగుతారు కదా, అప్పుడది పైకీ-కిందికీ ఊగుతుంది, చాలా కిందకు వచ్చినా, చాలా పైకి వెళ్ళినా, చాలా ఫాస్ట్‌గా ఊగినా, అది శరీరాన్ని అప్సెట్ చేస్తుంది కదా, అప్పుడు మీరేమైనా అప్సెట్ అవుతారా? ఎందుకవ్వరు? దానిని ఆటగా భావిస్తారు కావున అప్సెట్ అయ్యేందుకు బదులుగా మనోరంజనంగా భావిస్తారు. కారణమేమిటి? అది ఒక ఆట. అలా ఒకవేళ ఏమైనా అప్సెట్ చేసే విషయాలు వచ్చినా కానీ, తప్పకుండా వస్తాయి కూడా, ఎవరైతే చేతులు ఎత్తారో వారి వద్దకు ఇంకా పెద్ద అప్సెట్ చేసే విషయాలు వస్తాయి ఎందుకంటే మాయ కూడా మురళి వింటుంది. కానీ దానిని ఒక ఆటగా భావించండి, భయపడకండి. అచ్ఛా, అది ఊపుతుంది, ఊపనివ్వండి. కానీ మనసు భయపడకూడదు. నాలెడ్జ్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా అవ్వండి. ఆ సీట్‌ను వదలకండి. ఒకవేళ మీరు అప్సెట్ అయ్యేవారు కాదు అని మాయ ఒకటి, రెండు సార్లు గమనించినా కూడా, అది స్వయం అప్సెట్ అవుతుంది, మిమ్మల్ని అప్సెట్ చేయదు. విషయం గురించి చర్చించడమైతే చేయండి, ఏదైనా విషయం వచ్చినప్పుడు నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్న కారణంగా - ఇది కరెక్ట్, ఇది కరెక్ట్ కాదు, ఇది జరగాలి, ఇది జరగకూడదు... అని అర్థమవుతుంది కదా. కానీ విషయం గురించి చర్చించేటప్పుడు దానిని ఒక విషయంలా చర్చించండి, అంతేకానీ అప్సెట్ అవుతూ కాదు. ఒక వైపు చెప్తూ ఉంటారు, ఇంకొక వైపు గంగ, యమునలు ప్రవహిస్తూ ఉంటాయి. మనస్సులో ప్రవహించినా లేక కళ్ళ నుండి ప్రవహించినా, రెండూ కరెక్ట్ కాదు. మరి గిఫ్ట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారా? ఆలోచించి చెప్పారా లేక ఊరికే అవును అని చెప్పేసారా?
బాప్‌దాదా చాలా సహజమైన పదాలతో యుక్తిని తెలియజేస్తున్నారు. ఎప్పుడైనా, ఏ పరిస్థితి అయినా లేక ప్రకృతి అయినా అలజడి రూపంలో వస్తే రెండు పదాలను గుర్తుంచుకోండి. దీనికి విధి ఏమిటంటే - అయితే ‘నాట్’ (వద్దు) అని అనండి లేక ‘డాట్’ (బిందువు) పెట్టండి. నాట్ లేక డాట్. ఒకవేళ ఏదైనా విషయం తప్పుగా ఉన్నట్లయితే ‘నాట్’ అనగా చేయకూడదు అని భావించండి. ఆలోచించకూడదు, చేయకూడదు, మాట్లాడకూడదు. బిందువు పెట్టినట్లయితే అది నాట్ అన్నట్లు అవుతుంది. వద్దు అని భావించండి, బిందువు పెట్టండి, ఫినిష్. బిందువు పెట్టడానికి ఎంత సమయం పడుతుంది? ఒక్క క్షణం కన్నా తక్కువ సమయము. కానీ జరిగేదేమిటి? ఇది చేయకూడదు, ఇది సరి కాదు అని భావిస్తారు కానీ బిందువు పెట్టడం రాదు. నాలెడ్జ్‌ఫుల్‌గా అయితే అయ్యారు కానీ కేవలం నాలెడ్జ్‌ఫుల్‌గా ఉంటే సరిపోదు, నాలెడ్జ్ ఉండడంతో పాటు పవర్‌ఫుల్‌గా కూడా ఉండాలి. పవర్ఫుల్ స్థితి యొక్క లోటు ఉంది, అందుకే బిందువు పెట్టలేకపోతారు. ఎవరికైతే బిందువు పెట్టడం వస్తుందో, వారు బాబాను కూడా మర్చిపోరు ఎందుకంటే బాబా కూడా బిందువు. మీరు కూడా బిందువే కదా. కావున అన్నీ గుర్తుకు వచ్చేస్తాయి. ఫుల్ స్టాప్. ప్రశ్నార్థకము (?), ఆశ్చర్యార్థకము (!) లేక కామా (,)... ఇవి పెట్టకండి. ఫుల్ స్టాప్ (.). ఫుల్ స్టాప్ గుర్తు సహజం కదా. మిగిలినవన్నీ కష్టమే. అన్నింటికన్నా కష్టమైనది ప్రశ్నార్థకం. అది పెట్టడం చాలా త్వరగా వస్తుంది. వై (ఎందుకు) అన్న పదం వచ్చినప్పుడు ఏం చేయాలో వినిపించాము కదా? ఫ్లై. పైకి ఎగిరిపోండి. వై కాదు ఫ్లై. ఎగిరిపోవడం వస్తుందా?
డబల్ విదేశీయులలో మంచి-మంచి రత్నాలు వెలువడ్డారు. బాప్‌దాదా ఇటువంటి రత్నాలను చూసి హర్షిస్తారు. అలాగే ఇటువంటి రత్నాలెవరైతే చాలా అమూల్యంగా ఉన్నారో ఇటువంటి అమూల్య రత్నాలలో చాలా చిన్న మచ్చ అయినా ఎక్కడైనా కనిపిస్తే ఆ అమూల్య రత్నాల ముందు ఆ మచ్చ మంచిగా అనిపించదు. చూడడానికి చిన్న మచ్చే కానీ దానిని మచ్చ అనే అంటారు కదా! మరి అమూల్య రత్నాలుగా అయినప్పుడు ఆ చిన్న మచ్చను ఎందుకు ఉంచుకున్నారు? మంచిగా అనిపిస్తుందా? చంద్రుడిలో కూడా నల్లని మచ్చ కనిపిస్తుంది కదా, అందుకే అది మంచిదేలే అని అయితే అనుకోవడం లేదు కదా! డబల్ విదేశీయులు శ్యాంపుల్‌గా అయి చూపించండి. కొద్దిగా కూడా ఎటువంటి లోపము ఉండకూడదు. మామూలుగా కూడా మచ్చకు కారణం ఏమిటి? మచ్చ అంటుకోవాలి అని అనుకోరు కానీ అంటుకుంటుంది. ఎందుకు అంటుకుంటుంది? మూల కారణం తెలుసా? తెలుసుకోవడంలోనైతే తెలివైనవారు. అది మీకు తెలుసు కూడా మరియు పరస్పరంలో వర్క్‌షాప్ చేసుకున్నప్పుడు బాప్‌దాదా ఆ వర్క్‌షాప్ ఫొటోను కూడా చూస్తారు. ఇది కారణము, అది కారణము... అంటూ ఎన్నో కారణాలను తీస్తారు. మంచి-మంచి విషయాలను వర్క్‌షాప్‌లో తీస్తారు కానీ వాటిని వర్క్‌లోకి తీసుకురారు. దేహాభిమానము ఎన్నో సూక్ష్మరూపాలలో వస్తూ ఉంది. ఇప్పుడు దేహాభిమానము స్థూలరూపంలో రావటం లేదు కానీ సూక్ష్మమైన మరియు రాయల్ రూపంలో వస్తుంది. బుద్ధిని చాలా బాగా నడిపిస్తారు. మంచి-మంచి విషయాలను ఆలోచించినప్పుడు బాప్‌దాదా సంతోషిస్తారు కానీ మంచి విషయాలను ఆలోచిస్తూ-ఆలోచిస్తూ ఉండగా ఎవరైనా కొద్దిగా ఏదైనా ఎడిషన్, కరెక్షన్ చేస్తే నేను అనేది వచ్చేస్తుంది. ఏ విధంగా మీ అభిప్రాయాలను సంతోషంగా ఇస్తారో, అలాగే ఇతరుల అభిప్రాయాలను కూడా సంతోషంగా తీసుకోండి. ఇది ఎలా అవుతుంది, ఇలా చేసారేమిటి, ఇలా జరిగే అవకాశమే లేదు, ఇది నడవదు... అంటూ గాభరా పడకండి. మీ విషయాలకు ఎంత గౌరవం ఇస్తారో, ఇతరుల సలహాలకు, ఇతరుల విషయాలకు కూడా అంతే గౌరవం ఇవ్వండి. అభిప్రాయం చెప్పడం వేరే విషయము. వారి అభిప్రాయాలు మీకు కరక్ట్‌గా అనిపించకపోయినా వాటి ప్రభావంలోకి వస్తే, అవస్థ కింద-మీద అయితే, ఆ సేవ సేవ కాదు. ఎడ్జెస్ట్ అవ్వడము, ఇతరుల అభిప్రాయాలను కూడా తమ అభిప్రాయాల మాదిరిగానే ఆలోచించడము, అర్థం చేసుకోవడము చేస్తే - ఇదే ఇతరుల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడము. నేను ఇది ఆలోచించాను లేక ఈ ఐడియా తీసాను, ఈ విధంగా ఆలోచించాను, పని చేసాను కావున నా అభిప్రాయాలకు ప్రాముఖ్యత ఇవ్వాలి, ఇతరులు గౌరవించాలి అని భావిస్తారు కదా, అలాగే ఇతరుల అభిప్రాయాలను తమ అభిప్రాయాలతో కలుపుకోవాలి, అలా చేయడం రావటం లేదు. ఇతరుల అభిప్రాయాలను ఇతరుల అభిప్రాయాలు అనే భావిస్తున్నారు. ఇప్పుడు డబల్ విదేశీయులు కూడా సేవా క్షేత్రంలో ప్లాన్ తయారుచేయడంలో మంచిగా ప్రోగ్రెస్ అవుతున్నారు. ఇంకా ముందు-ముందు కూడా అవ్వనున్నారు. కానీ ఎడ్జెస్ట్‌మెంట్ యొక్క విశేషతను ఉపయోగించండి. ఒకవేళ ఏ బిడ్డ అయినా ముందుకు వెళ్తే బాప్‌దాదాకు ఎంతో సంతోషం కలుగుతుంది. అంతేకానీ వీరు ఎందుకు ముందుకు వెళ్ళారు అని ఆలోచించరు. ఎవరు ముందుకు వెళ్ళినా చాలా మంచిది. డబల్ విదేశీయుల పట్ల బాప్‌దాదాకు స్నేహమైతే ఉంది కానీ సేవ యొక్క ప్లాను లేక ప్రాక్టికల్ సేవ కొరకు ఏదైతే చేస్తారో, చేస్తున్నారో దాని కొరకు చాలా-చాలా గౌరవముంది.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - ఒకవేళ డబల్ విదేశీయులైన మీరు లేకపోతే బాబా యొక్క ఒక టైటిల్ ప్రాక్టికల్‌లో నిరూపించబడదు. అది ఏమిటి? విశ్వ కళ్యాణకారి. ఇప్పుడు చూడండి, విశ్వంలో నలువైపులా బాబా సందేశాన్ని ఇస్తున్నారు కదా! ఈ సీజన్లో నలువైపుల నుండి వచ్చారు కదా! మొత్తం ఎన్ని దేశాల వారు వచ్చారు? (58). ఇంకా ఎన్ని ముఖ్యమైన దేశాలు ఉన్నాయి? (125). చిన్న-చిన్న దేశాలైతే ఎన్నో ఉంటాయి కానీ ముఖ్యమైన దేశాలు ఇంకా 125 మిగిలి ఉన్నాయి! మరి ఇప్పుడు డబల్ విదేశీయులు ఇంకా ఎంతో పనిచేయవలసి ఉంటుంది. భారత్‌లోనూ చేయాలి మరియు విదేశాలలోనూ చేయాలి, రెండు చోట్లా చేయాలి. బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - సేవ యొక్క సంపూర్ణ సఫలతకు గుర్తు ఏమిటంటే మా వైపు సందేశము చేరుకోలేదు అని ఎటువైపు నుండీ ఏ ఆత్మా ఫిర్యాదు చేయకూడదు. సందేశాన్ని చేర్చిన తర్వాత, ఎవరైనా అది విని కూడా తమ భాగ్యాన్ని తయారు చేసుకోకపోతే ఆ ఫిర్యాదు మీకు వర్తించదు, అది ఆ ఆత్మలకు సంబంధించినదే. కానీ మీపై ఎటువంటి ఫిర్యాదు ఉండకూడదు. మాస్టర్ విశ్వ కళ్యాణకారులు అని అన్నప్పుడు విశ్వం నలువైపులకు సందేశమైతే చేరుకోవాలి. భారత్‌లో కూడా చేరుకోవాలి, అలాగే విదేశాలలో కూడా చేరుకోవాలి. ఏ సమయంలోనైతే మీ విజయం యొక్క జెండాను ఎగురవేస్తారో, ఆ సమయంలో ఏ ఆత్మ అయినా వచ్చి ఈ ఫిర్యాదు చేస్తే, మంచిగా అనిపిస్తుందా? ఒక వైపు మీరు జెండాను ఎగురవేస్తున్నారు మరియు ఇంకొక వైపు వ్యక్తులు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు అంటే మంచిగా అనిపిస్తుందా? అనిపించదు కదా! డబల్ విదేశీయుల ధైర్యము బాగుంది, బాబాపై ప్రేమ అయితే ఉండనే ఉంది కానీ సేవ పట్ల ప్రేమ కూడా బాగుంది. రెండింటి పట్ల ప్రేమ యొక్క సర్టిఫికెట్ బాగుంది. ఇప్పుడు ఏ సర్టిఫికెట్‌ను తీసుకోవాలి? ఎంత సేవాధారులో అంతే శక్తిధారులు. కావున శక్తిస్వరూపులుగా అయిపోయారు - అన్న ఈ సర్టిఫికెట్‌ను తీసుకోవాలి. బాప్‌దాదా చూసారు - మెజారిటీ బాబా పట్ల మరియు సేవ పట్ల ప్రేమ ఉండడంలో పాస్ అయ్యారు. అచ్ఛా.
ఈ సీజన్లో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి. మొత్తం ఎంతమంది ఉన్నారు? 600 మంది మొదటిసారి వచ్చారు. మీరు చాలా లక్కీ. ఎందుకంటే మీకు సేవ కోసం చాలా మంచి మార్జిన్ లభించింది. ఇంకా నూట ఇరవై ఐదు స్థానాలు మిగిలి ఉన్నాయి మరియు మీరు 600 మంది ఉన్నారు, కనుక 2-2, 3-3 మంది కలిసి చేసినా పూర్తి అయిపోతుంది. మీ కోసం సేవ యొక్క ఆహ్వానం ముందుగానే తయారుగా ఉంది. చాలా మంచి ప్రోగ్రెస్ చేసారు. ఈ సీజన్లో 600 మంది కొత్తగా వచ్చారు అంటే సేవ చేసారు కాబట్టే వచ్చారు కదా! కనుక ఎన్ని అభినందనలు! పదమాపదమ్ అభినందనలు.
(బాప్‌దాదా డ్రిల్ చేయించారు)
ఒక్క సెకండులో డాట్ పెట్టగలరా? ఇప్పుడిప్పుడే కర్మలో మరియు ఇప్పుడిప్పుడే కర్మ నుండి అతీతంగా, కర్మ యొక్క సంబంధం నుండి అతీతంగా అవ్వగలరా? ఈ ఎక్సర్సైజ్ వచ్చా? ఏ కర్మలోనైనా చాలా బిజీగా ఉన్నారు, మనస్సు-బుద్ధి కర్మ యొక్క సంబంధంలో నిమగ్నమై ఉంది, బంధనంలో కాదు, సంబంధంలో, కానీ డైరెక్షన్ లభించింది - ఫుల్స్టాప్. అప్పుడు ఫుల్స్టాప్ పెట్టగలరా లేక కర్మ యొక్క సంకల్పాలు నడుస్తూనే ఉంటాయా? ఇది చేయాలి, ఇది చేయకూడదు, ఇది ఇలా ఉంది, అది అలా ఉంది... అని. కనుక ఈ ప్రాక్టీస్ ఒక్క సెకండు కోసమైనా చేయండి, కానీ అభ్యాసం చేస్తూ వెళ్ళండి, ఎందుకంటే అంతిమ సర్టిఫికెట్ ఒక్క సెకండులో ఫుల్స్టాప్ పెట్టడం పైనే లభించాలి. సెకండులో విస్తారాన్ని ఇముడ్చుకొని, సార స్వరూపంగా అయిపోవాలి. కనుక ఈ ప్రాక్టీస్ ఎప్పుడెప్పుడు ఛాన్స్ లభిస్తే, చేయగలిగితే చేస్తూ ఉండండి. యోగంలో కూర్చుంటే ఫుల్స్టాప్ పడుతుంది అని కాదు. గందరగోళంలో ఫుల్స్టాప్. అంత పవర్ఫుల్ బ్రేక్ ఉందా? లేక బ్రేక్ ఇక్కడ వేస్తే అక్కడ ఆగుతుందా! మరియు సమయానికి ఫుల్స్టాప్ పడాలి, సమయం గడిచిపోయిన తరువాత ఫుల్స్టాప్ పెడితే దాని వల్ల లాభం లేదు. ఆలోచించారు మరియు జరిగిపోయింది. నేను శరీరాన్ని కాదు ఆత్మను, ఆత్మను, నేను ఫుల్స్టాప్ పెట్టాలి మరియు ఇంకేమీ ఆలోచించకూడదు అని ఆలోచిస్తూనే ఉండకండి, ఇలా ఆలోచించడంలో కూడా టైమ్ పట్టేస్తుంది. ఇది సెకండు యొక్క ఫుల్స్టాప్ అవ్వలేదు. ఈ అభ్యాసాన్ని స్వయమే చేయండి. ఎవరికీ చేయించవలసిన అవసరం లేదు. ఎందుకంటే కొత్తవారైనా, పాతవారైనా, అందరికీ ఈ విధి తెలుసు కదా! కనుక చాలా కాలం యొక్క అభ్యాసం కావాలి. ఆ సమయంలో నేను ఫుల్స్టాప్ పెట్టేస్తాను అని అనుకోకండి! ఫుల్స్టాప్ పడదు, ఇది ముందుగానే అర్థం చేసుకోండి. ఆ సమయంలో, సమయం అనుసారంగా చేసుకుంటాము! లేదు, జరగనే జరగదు. చాలా కాలం యొక్క అభ్యాసమే పనికి వస్తుంది. ఎందుకంటే కనెక్షన్ ఉంది. ఇక్కడ చాలా కాలం యొక్క అభ్యాసం చాలా కాలం యొక్క రాజ్య-భాగ్యాన్ని ప్రాప్తింపజేస్తుంది. ఒకవేళ అల్పకాలం యొక్క అభ్యాసం ఉంటే ప్రాప్తి కూడా అల్పకాలానిదే ఉంటుంది. కనుక ఈ అభ్యాసాన్ని రోజంతటిలో ఎప్పుడెప్పుడు ఛాన్స్ లభిస్తే చేస్తూ ఉండండి. ఒక్క సెకండులో ఏమీ పాడవదు. తరువాత పని చేయడం ప్రారంభించండి. కానీ గందరగోళంలో ఫుల్స్టాప్ పడుతుందా లేదా - ఇది చెక్ చేసుకోండి. కర్మ యొక్క సంబంధంలోకి రావడం మరియు కర్మ యొక్క బంధనంలోకి రావడం, ఇందులో కూడా తేడా ఉంది. ఒకవేళ కర్మ యొక్క బంధనంలోకి వస్తే కర్మ మిమ్మల్ని లాగుతుంది, ఫుల్స్టాప్ పెట్టనివ్వదు. మరియు అతీతంగా-ప్రియంగా ఉండి ఏ కర్మ యొక్క సంబంధంలో ఉన్నా సెకండులో ఫుల్స్టాప్ పడుతుంది. ఎందుకంటే బంధనం లేదు. బంధనం కూడా లాగుతుంది మరియు సంబంధం కూడా లాగుతుంది, కానీ అతీతంగా ఉండి సంబంధంలోకి రావడం - దీనిని అండర్లైన్ చేయండి. ఈ అభ్యాసం ఉన్నవారే పాస్ విత్ ఆనర్ అవుతారు. ఇదే చివరి కర్మాతీత అవస్థ. పూర్తిగా అతీతంగా ఉండి, అధికారిగా అయి కర్మలోకి రావాలి, బంధనానికి వశం కాకూడదు.
కనుక చెక్ చేసుకోండి, కర్మ చేస్తూ-చేస్తూ కర్మ యొక్క బంధనంలోకి అయితే రావడం లేదు కదా? చాలా అతీతంగా మరియు ప్రియంగా ఉండాలి. ఎలాంటి అభ్యాసం కావాలో అర్థమైందా? కష్టంగా అయితే అనిపించడం లేదు కదా? లేక కొద్దిగా-కొద్దిగా కష్టంగా అనిపిస్తుందా? కర్మేంద్రియాలకు యజమానులు కదా? మిమ్మల్ని మీరు రాజయోగులు అని పిలుచుకుంటారు, దేనికి రాజులు? అమెరికాకా, ఆఫ్రికాకా! కర్మేంద్రియాలకు రాజులు కదా! మరి రాజు బంధనంలోకి వచ్చేస్తే రాజుగా ఉన్నట్లా? అందరి టైటిల్ అయితే చాలా బాగుంది. అందరూ రాజయోగులే. కనుక రాజయోగులా లేక ప్రజాయోగులా? అప్పుడప్పుడు ప్రజాయోగి, అప్పుడప్పుడు రాజయోగి? మరి డబల్ విదేశీయులు అందరూ పాస్ విత్ ఆనర్ అవుతారా? విదేశీయులందరూ పాస్ విత్ ఆనర్ అయితే బాప్‌దాదాకు చాలా సంతోషం కలుగుతుంది. కొద్దిగా కష్టమా లేక సహజమా? మంచిది. కష్టం అనే పదం మీ డిక్షనరీ నుండి తొలగిపోయింది. ఈ బ్రాహ్మణ జీవితం కూడా ఒక డిక్షనరీ. కనుక బ్రాహ్మణ జీవితం యొక్క డిక్షనరీలో కష్టం అనే పదమే లేదు, లేక అప్పుడప్పుడు ఎగిరి వచ్చేస్తుందా?
ఎన్ని వరదానాలు లభిస్తున్నాయి! ఇప్పటివరకు లభించిన వాటి లిస్ట్ తీసినా ఎన్ని వరదానాలు లభించాయి! చాలా లభించాయి కదా! రోజూ వరదానం లభిస్తుంది. భక్తి మార్గంలో భక్తునికి ఒక వరదానం లభించినా అతను ఏమి నుండి ఏమిగా అయిపోతాడు! మరి మీరు ఎంత లక్కీ అంటే భగవంతుడు రోజూ వరదానాలు ఇస్తున్నారు. పాలనే వరదానాలతో జరుగుతోంది. మరి వరదానం గుర్తుంటుందా? లేక వినే సమయంలోనే గుర్తుంటుందా? ఒకటి గుర్తుండటం మరియు రెండవది వరదానాన్ని కార్యంలో ఉపయోగించడం. వరదానం ఎటువంటి వస్తువు అంటే ఎలాంటి పరిస్థితి ఉన్నా వరదానం యొక్క శక్తి పరిస్థితిని అగ్ని నుండి నీరుగా మార్చేస్తుంది. అంత శీతలంగా చేసేస్తుంది. కేవలం యూజ్ చేసే విధి రావాలి. రెండవ విషయం, సమయానికి కార్యంలో ఉపయోగించండి. సగం సమయం గడిచిపోయిన తరువాత స్పృహలోకి రావడం కాదు. కనుక వరదానాన్ని యూజ్ చేయడం వచ్చా? చేస్తారా లేక విని-విని సంతోషపడతారా? డైరీలో అయితే చాలా వరదానాలు నిండిపోయాయి, బుక్ కూడా తయారైంది. అలమారాలో బుక్ అయితే ఉంది, కానీ సమయానికి కార్యంలో ఉపయోగించండి. మరియు ఎంతగా కార్యంలో ఉపయోగిస్తూ వెళ్తారో అంతగా వరదానం ఇంకా పెరుగుతూ వెళ్తుంది. వరదానం యొక్క విశాల రూపం ఇంకా అనుభవంలోకి వస్తూ ఉంటుంది. అచ్ఛా!
ముందు అందరికీ వేరు-వేరుగా డైరెక్షన్స్ ఇచ్చాము. ఈ సీజన్ తరువాత విశేషంగా అందరూ భిన్న-భిన్న శక్తులను తమలో 100 శాతం నింపుకోవాలి. ఏ శక్తినైతే అలవర్చుకోగలరో ఆ ఒక్క శక్తిని లక్ష్యంగా చేసుకోండి, ఈ సంవత్సరం మేము విశేషంగా ఈ శక్తిని స్వరూపంలోకి తీసుకురావలసిందే అని.
అమెరికా ఏ శక్తిని అలవర్చుకుంటుంది? శక్తుల గురించి తెలుసు కదా? ఏ శక్తి ఇష్టం? (లవ్) స్నేహం యొక్క శక్తిని ఎదురుగా ఉంచుకుంటారు, లక్ష్యంగా ఉంచుకుంటారు! మంచిది, స్నేహం యొక్క శక్తితో అమెరికా వారు ఏమి చేస్తారు? స్నేహం ఎటువంటి శక్తి అంటే అజ్ఞానంలో కూడా స్నేహం రాయిని సైతం నీరుగా మార్చేస్తుంది అని గాయనం చేయబడింది. మరి మీరు ఏమి చేస్తారు? మాయ 100 హిమాలయాలంత పెద్ద పర్వతంగా వచ్చినా ఆ పర్వతాన్ని కూడా నీరుగా మార్చేయండి. మార్చగలరా లేక మాయ చాలా పవర్‌ఫుల్‌గా ఉందా? అమెరికా వారు చెప్పండి - మీరు పవర్‌ఫుల్‌గా ఉన్నారా లేక మాయా? కనుక ఒకటి మాయ అనే పర్వతాన్ని నీరుగా మార్చేయడం మరియు రెండవది ఎవరైనా ఏదైనా ఇవ్వనీ కానీ మీరు ఆత్మిక స్నేహాన్ని ఇవ్వండి. దేహము యొక్క స్నేహాన్ని ఇవ్వకండి, ఆత్మిక స్నేహాన్ని ఇవ్వండి. ఎవరైనా మిమ్మల్ని నిందించినా మీరు స్నేహాన్ని ఇవ్వండి. స్నేహం యొక్క శక్తి ఒక అయస్కాంతం, అయస్కాంతం దూరంగా ఉన్నదానిని దగ్గరకు తీసుకువస్తుంది కదా! కనుక స్నేహం యొక్క శక్తితో బాబాకు దూరంగా ఉన్నవారిని సమీపంగా తీసుకురండి మరియు పరస్పరం స్నేహాన్ని ఇచ్చిపుచ్చుకోండి. స్నేహం లేని ఒక్క మాట కూడా వెలువడకూడదు. ఎవరెలా ఉన్నా కానీ మీ మాటల్లో స్నేహం యొక్క శక్తి ఉండాలి. మంచిది!
ఆఫ్రికా వారు ఏ శక్తిని అలవర్చుకుంటారు? (పీస్) వీరికి శాంతి యొక్క శక్తి ఇష్టం, ఎందుకంటే ఆఫ్రికాలో ఘర్షణలు చాలా జరుగుతాయి కదా, అందుకే శాంతి యొక్క శక్తి ఇష్టం. కనుక శాంతి యొక్క శక్తికి గుర్తు - ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సదా సంతుష్టత ఉంటుంది. ఎందుకంటే అశాంతిగా చేసేది అసంతుష్టత. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ శాంతి ఉంటుంది మరియు ఎక్కడ శాంతి ఉంటుందో అక్కడ సంతుష్టత ఉంటుంది. శాంతి యొక్క శక్తి కలవారు సదా సంతోషకరమైన స్వభావం కలిగి ఉంటారు. ఎంత శాంతి ఉంటుందో అంత సంతోషం వారి ముఖం నుండి, నడవడిక నుండి అనుభవమవుతుంది. కనుక శాంతి యొక్క శక్తికి గుర్తును చూపించండి. సదా అందరి ముఖం హర్షితంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి ఉన్నా కానీ సంతోషాన్ని వదలకండి. అది మీ ప్రాపర్టీ కదా. మరి ప్రాపర్టీని ఎవరైనా వదులుకుంటారా? కనుక శాంతి యొక్క శక్తికి గుర్తు - సదా సంతోషంగా ఉండటం మరియు సంతోషాన్ని పంచడం. శాంతి యొక్క శక్తితో సహజంగా మనసా సేవ చేయగలరు. ఎంత శాంతిగా ఉంటారో అంత మనసా సేవ చాలా శక్తిశాలిగా ఉంటుంది. కనుక ఆఫ్రికా వారు ఇలా శాంతి యొక్క శక్తి స్వరూపంగా అయి ఈ సంవత్సరం బహుమానం తీసుకోండి. అందరూ బహుమానం తీసుకుంటారు కదా! మంచిది! రిజల్ట్ వస్తూనే ఉంటుంది. ప్రతి సెంటర్లోని ప్రతి స్టూడెంట్ యొక్క రిజల్ట్ వస్తూనే ఉంటుంది. తరువాత ఎవరు నంబర్లో ముందుకు వస్తారో, మూడు నంబర్లకు బహుమానం ఇస్తాము. మిగిలిన వారికి సెకండ్ నంబర్ ఇస్తాము. కనుక శాంతిగా ఉండాలి, గందరగోళంలోకి రాకూడదు. ఏమైనా జరిగిపోనీ, శాంతిగా ఉండాలి. కనుక మీ శాంతి గందరగోళంలో ఉన్నవారిని కూడా శాంతింపజేయగలదు. ఇటువంటి పవర్ఫుల్ వైబ్రేషన్స్ వ్యాపింపజేయండి. ఈ సేవ వాణి ద్వారా జరగదు, మనసా ద్వారా జరగగలదు. అచ్ఛా!
ఆస్ట్రేలియా వారు ఏ శక్తిని అలవర్చుకుంటారు? (సహయోగం) ఇది చాలా మంచి విషయం చెప్పారు. ఆస్ట్రేలియా సేవలో సహయోగిగా అవ్వవలసిందే. ఎందుకంటే సహయోగంతో అసంభవమైన విషయం కూడా సంభవమవుతుంది. కష్టమైన విషయం సహజమవుతుంది. సహయోగం యొక్క శక్తితో ఒకరికొకరిలో ధైర్యం, ఉల్లాసం, ఉత్సాహం చాలా పెంచగలరు. సహయోగం యొక్క శక్తి ఆస్ట్రేలియాలోని ఏ సెంటర్ యొక్క బ్రాహ్మణ ఆత్మనూ బలహీనంగా అవ్వనివ్వదు. సహయోగం యొక్క శక్తి ఒక సేఫ్టీ కోట. కోట ఎలా తయారవుతుంది? ఇటుకల సహయోగంతో కోట తయారవుతుంది, సేఫ్టీకి సాధనంగా అవుతుంది. కనుక సహయోగం యొక్క శక్తితో దృఢమైన కోటను కూడా తయారుచేస్తారు మరియు అసంభవమైన విషయాన్ని సంభవం చేసి చూపిస్తారు. ఎవరైతే సహయోగులుగా ఉంటారో, సహయోగం ఇస్తారో వారికి సహయోగం కూడా చాలా లభిస్తుంది. కోరిక లేకపోయినా నలువైపుల నుండి సహయోగం ఇచ్చేవారికి సహయోగం లభిస్తుంది. చేసి చూడండి. మంచిది.
ఆసియా వారు ఏమి చేస్తారు? ఏ శక్తిని అలవర్చుకుంటారు? (అడ్జస్ట్మెంట్) చాలా మంచి విషయం చెప్పారు. అడ్జస్ట్మెంట్ యొక్క శక్తిని అలవర్చుకుంటే చాలా సహజంగా సంపూర్ణంగా అయిపోతారు. ఎందుకంటే మాయ యొక్క ద్వారమే - తమలో అడ్జస్ట్ అవ్వకపోవడం, సేవలో అయినా, సంబంధ-సంపర్కంలో అయినా. అడ్జస్ట్ అయ్యే కళను లక్ష్యంగా చేసుకుంటే అన్నింటికంటే మొదటి నంబర్లో సంపూర్ణంగా ఆసియా వారే అవుతారు. ఈ శక్తి అంత పవర్ఫుల్. ఎందుకంటే ఎవరిలో అడ్జస్ట్ అయ్యే శక్తి ఉంటుందో వారిలో సహనశక్తి, అంతర్ముఖత అన్నీ దాని పిల్లలుగా అయిపోతాయి. కనుక ఆసియా వారు మదర్‌ను ఎంచుకున్నారు. అన్నీ వచ్చేస్తాయి. కానీ ఈ లక్ష్యాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావడానికి ఒక విషయం సదా గుర్తుంచుకోండి - మొదట మీ అడ్జస్ట్మెంట్ను చూడండి, ఇతరులది కాదు. మొదట నేను అడ్జస్ట్ అవ్వాలి. సేవలో మొదట మీరు ఉండాలి, ఇతరులను సహచరులుగా చేసుకోండి, సహయోగులుగా చేసుకోండి, ముందుకు తీసుకువెళ్ళండి, ధైర్యాన్ని పెంచండి. కానీ అడ్జస్ట్ మొదట నేను అవ్వాలి, ఇతరులు తమంతట తామే అవుతారు. ఒకవేళ ఇతరులను చూస్తే స్వయం కూడా అవ్వరు, ఇతరులు కూడా అవ్వరు. ఎవరైతే ముందడుగు వేస్తారో వారే అర్జునుడు, నేను అర్జునుడిని. మరొకరు అర్జునుడిగా అయితే నేను కూడా అర్జునుడిగా అవుతాను! కాదు, ఎవరైతే ముందడుగు వేస్తారో వారే అర్జునుడు. అలాగే ఆసియాలో భిన్న-భిన్న వెరైటీలు ఉన్న కారణంగా సేవలో కూడా ప్లాన్స్‌ను అడ్జస్ట్ చేయవలసి వస్తుంది. వెరైటీ ధర్మాల వారు కూడా ఆసియాలో వస్తారు. చైనా, జపాన్ అన్నీ వస్తాయి కదా. కనుక బౌద్ధ ధర్మం వారు, చైనీస్ అందరితో అడ్జస్ట్ అవ్వవలసి వస్తుంది కదా. వారి మతం వేరు. క్రిస్టియన్స్ అయినా వారికంటే దగ్గరగా ఉన్నారు, గాడ్ ఫాదర్‌ను అయితే నమ్ముతారు. కనుక చాలా మంచి లక్ష్యాన్ని పెట్టుకున్నారు. దీనితో స్వయంలో కూడా అడ్జస్ట్ అవుతారు, సేవలో కూడా అడ్జస్ట్ అవుతారు మరియు ఇతరులతో కూడా అడ్జస్ట్ అవుతారు. కనుక ఇన్‌అడ్వాన్స్ అభినందనలు. అచ్ఛా!
యూరప్ ఏమి చేస్తుంది? యూరప్‌లో యు.కె. కూడా వచ్చింది. యూరప్ ఏ శక్తిని అలవర్చుకుంటుంది? (యూనిటీ) అయితే యూరప్ అన్ని ఖండాలను కలిపి ఒక ఖండంగా చేస్తుంది, అలా చేస్తుందా! ఎందుకంటే భవిష్యత్తులో ఈ వేర్వేరు ఖండాలు ఉండనే ఉండవు. ఒక్కటే ఉంటుంది. కాబట్టి యూరప్ వారు యూనిటీ ద్వారా భిన్నత్వాన్ని సమాప్తం చేసి, విశ్వంలో కూడా ఒక ధర్మం, ఒక రాజ్యం, ఒక ఖండాన్ని తయారు చేసే ఇంత పెద్ద కార్యం చేస్తారు!
అసలు యూరప్‌లో యూనిటీ యొక్క స్తంభం ముందే ఉంది. ఎవరు ఆ స్తంభం? (దాదీ) మీరు కాదా! (దాదీ అయితే అందరివారు) కానీ ఫౌండేషన్ యు.కె.లో వేయబడింది. స్తంభం అనేది నాలుగు వైపుల కోసం ఉంటుంది, ఒక్క ఆ స్థానానికే కాదు. కాబట్టి నాలుగు వైపులా అమెరికా అయినా, ఆఫ్రికా అయినా... కానీ ఒకటే - ఇదే విశేషత. ఆఫ్రికాకు ఏమి చేయాలి, వాళ్ల సంగతి వాళ్లు చూసుకుంటారు అని కాదు. దీనినే యూనిటీ యొక్క స్తంభం అంటాము. కాబట్టి ఒక్క దాదీ కాదు, మొత్తం యూరప్ యూనిటీ యొక్క స్తంభం. ఇవన్నీ ఒక్కొక్క ఎగ్జాంపుల్ మాత్రమే. కానీ ఎగ్జాంపుల్‌ను చూసి కేవలం సంతోషించాలా లేక అలా అవ్వాలా? దాదీని చూసి చాలా మంచిది, చాలా మంచిది అని సంతోషిస్తారా లేక స్వయంగా కూడా అవుతారా? ఏమి చేస్తారు? లండన్ టీచర్లు చెప్పండి. కేవలం చూసి సంతోషిస్తారా లేక అవుతారు కూడానా? యూనిటీ అనగా అనంతమైన వృత్తి, అనంతమైన దృష్టి. అప్పుడే యూనిటీ ఉంటుంది. అనంతమైన దృష్టి మరియు వృత్తి లేకపోతే యూనిటీ ఉండదు. కాబట్టి యు.కె. మరియు యూరప్ వారు అనంతమైన దృష్టి కలవారు కదా! చాలా మంది వచ్చారు. ఇంతమంది అందరూ అనంతమైన వృత్తి, దృష్టి కలవారిగా అయితే మన రాజ్యం రానే వచ్చినట్టు. ఎందుకంటే వృత్తి ద్వారా వాయుమండలం తయారవుతుంది మరియు వాయుమండలం తయారైతే ప్రాక్టికల్‌లో కూడా జరుగుతుంది. యూరప్ వారు యూనిటీని ఇష్టపడ్డారు, చాలా పెద్ద బాధ్యత. మరి ఈ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఉన్నారా? అవునా కాదా చెప్పండి. హా జీ బాగా చెప్పారు. బాబా ఇంగ్లీష్‌లో మాట్లాడినా మీరు హా జీ అనండి. హా జీ బాగా అనిపిస్తుంది. చాలా మంచి విషయం తీసుకున్నారు. మరి ఫారెన్‌లో ముందుగా స్వర్గం వస్తుందా లేక భారతదేశంలో వస్తుందా? ఎక్కడ వస్తుంది? మంచి ధైర్యం ఉంచారు. పిల్లల ధైర్యం మరియు బాబా సహాయం ఉంది. ఇది వరదానం. అర్థమైందా? చేస్తున్నారు కూడా, లక్షణాలు ఉన్నాయి, లక్ష్యం కూడా ఉంది, కేవలం దానిని అండర్లైన్ చేయాలి.
అచ్ఛా, రష్యా వారు చేతులు ఎత్తండి. చూడండి, రష్యా వారిని చూసి అందరూ సంతోషిస్తారు. ఎందుకు సంతోషిస్తారు? ఎందుకంటే వారు చాలా దాహంతో ఉన్నారు. దాహంతో ఉన్నవారికి అమృతం లభిస్తే ఎంత సంతోషపడతారు! కాబట్టి వారి సంతోషం మిమ్మల్ని కూడా సంతోషపరుస్తుంది. రష్యా పేరు వచ్చినప్పుడల్లా చప్పట్లు తప్పకుండా కొడతారు. కాబట్టి రష్యా వారు ఇంత సికీలధే - అర్థమైందా! అందరికీ ప్రేమ ఉంది, ఇది ముందుగా మొత్తం ఒకటిగా ఉండేది, ఇప్పుడు అనేకతలోకి వచ్చింది, కానీ ఇప్పుడు మళ్లీ ఒక రాజ్యంలో, సత్యయుగ రాజ్యానికి అధికారులుగా అవుతారు.
మరి రష్యా వారు ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటారు, ఏ శక్తిని తీసుకుంటారు? (సహనశక్తి) మీ టీచర్ సహనశక్తి అంటున్నారు. నచ్చిందా? నిజానికి సహనశక్తిలో వీరు పాస్ అయ్యారు. సహించడం వీరికి చాలా బాగా వస్తుంది. ఏ పరిస్థితి వచ్చినా సహనశక్తిలో పాస్ అయిపోతారు. అయినప్పటికీ అండర్లైన్ చేయండి. సహనశక్తి యొక్క సంస్కారాలు ఉన్నాయి. ఇప్పటివరకు బంధనంలో ఉంటూ సహనశక్తి యొక్క పాత్రను బాగా పోషించారు. ఇప్పుడు మిమ్మల్ని శ్రేష్ఠంగా తయారు చేసుకునే మధ్యలో ఏ విఘ్నం వచ్చినా సహనశీలత యొక్క శక్తితో నంబర్ ముందుకు తీసుకోండి. ఈ శక్తిని అలవర్చుకోవడం మీకు కష్టం కాదు, సహజం. అందుకే నంబర్ తీసుకోండి. ఏ నంబర్ తీసుకుంటారు? మొదటి నంబరా లేక ఐదవదా? మొదటి నంబర్ తీసుకుంటే అందరికీ సంతోషం ఉంటుంది. మీరు నంబర్‌వన్ తీసుకుంటే ఇప్పుడే చప్పట్లు కొట్టారు కదా, అలాగే చాలా చాలా చప్పట్లు కొడతారు, బాప్‌దాదా కూడా చప్పట్లు కొడతారు. మంచిది, లాస్ట్ వారు ఫాస్ట్‌గా వెళ్లాల్సిందే. చిన్న బిడ్డ అయితే అందరికీ గారాబంగా, ప్రియంగా ఉంటాడు కదా. క్వాలిటీ కూడా మంచిగా వచ్చింది. ఎగ్జాంపుల్‌గా అయ్యేవారు. మెజారిటీ సంతోషంగా ఉంటారు, అప్పుడప్పుడు ఎవరైనా టెన్షన్‌లోకి రావచ్చు, కానీ మెజారిటీ సంతోషంగా ఉంటారు. రష్యాలో బ్రాహ్మణులకు టెన్షన్ ఉందా? అప్పుడప్పుడు టెన్షన్‌లోకి వస్తారా? అప్పుడప్పుడు వస్తారా? ఇప్పుడు రావద్దు. ఇప్పుడు టెన్షన్ ఫ్రీ. పాటలు కూడా ప్రేమతో పాడతారు. అన్ని విషయాలపైనా ఉల్లాసం ఉంది. స్వతంత్రులయ్యారు కదా. కాబట్టి ఉల్లాస-ఉత్సాహాలలో నాట్యం చేస్తూ ఉంటారు. అచ్ఛా!
ఇప్పుడు కొద్దిగా ప్రత్యక్షత జరుగుతుంది కదా - ఒకే బాబా ఉన్నారు, ఆయనే అల్లాహ్, ఆయనే ఈశ్వరుడు. కొద్దిగా ప్రత్యక్షత జెండా ఎగిరితే ఎలాంటి దేశమైనా, ఎలాంటి ధర్మమైనా, ముస్లిం దేశమైనా సరే, అల్లాహ్‌ను అయితే అంగీకరిస్తారు కదా. కాబట్టి ఆ రోజు కూడా వస్తుంది, అందరూ అంటారు - ఒక్కరే, ఒక్కరే, వీరే, వీరే. ఈ జెండా కిందకు అందరూ వస్తారు. ఇప్పుడు కొద్దిగా ప్రత్యక్షత జరగనివ్వండి. ఇప్పుడైతే ‘వీరు కూడా ఉన్నారు’ అంటున్నారు. ‘వీరే’ అని అనడం లేదు. ‘వీరు కూడా’ అంటున్నారు. ఇప్పుడు ఆ ‘కూడా’ తొలగిపోవాలి, వీరే’ అని అవ్వాలి. దీనినే ప్రత్యక్షత జెండా ఎగరవేయడం అంటాము. ఈ జెండా ఎగిరినప్పుడు అందరూ ఒకే జెండా కిందకు వస్తారు. అందరూ ఒకే జెండా కింద ఒకే పదం అంటారు - ఓం శాంతి. (బాబా అంటారా) బాబా అయితే తప్పకుండా అంటారు. అచ్ఛా, వీరికి మేరా బాబా అనే పదం బాగా నచ్చుతుంది.
(హాస్టల్ కుమారీలతో) మంచిది, హాస్టల్లో ఎంతమంది ఉన్నారో అంతమంది టీచర్లుగా తయారై బయటకు వచ్చినప్పుడు హాస్టల్ రిజల్ట్ వచ్చింది అని అంటాము. అప్పుడే హాస్టల్ నంబర్‌వన్ అని అంటాము. ఇద్దరు బయటకు వచ్చారు, నలుగురు వెళ్లిపోయారు అని కాదు. హాస్టల్‌కు ఎంతమంది వచ్చారో, కుమారీలుగా వచ్చి టీచర్లుగా బయటకు రావాలి. అప్పుడు హాస్టల్ రిజల్ట్ అందరికంటే ముందుగా ఉందని అంటారు. మరి అంత ధైర్యం ఉందా లేక మాయ వస్తే ఏమి చేయాలి అని అంటారా! బాప్‌దాదా అయితే సంతోషిస్తారు, ఎందుకంటే స్థాపన యొక్క ఫౌండేషన్ ఓం నివాస్‌లో చిన్న చిన్న కుమారీలతోనే ప్రారంభమైంది. కాబట్టి బాప్‌దాదాకు కూడా స్థాపన ప్రారంభంలో ఏమి నచ్చింది? చిన్న పిల్లలే నచ్చారు కదా. ఈ రోజు ఆ చిన్నవారే విశ్వ కళ్యాణకారులయ్యారు. కాబట్టి మీరు కూడా అలాగే అవ్వాలి. ఇది మంచిది, సేఫ్‌గా ఉన్నారు కదా. మాయ ప్రభావం నుండి రక్షించబడి ఉన్నారు.
అచ్ఛా, పోలండ్ వారు ఏమి చేస్తారు? పోలండ్ వారు కూడా మంచి ధైర్యం ఉంచారు. దేశ పరిస్థితులు ఎలా ఉన్నా ధైర్యం ఉంచి బ్రాహ్మణ పరివారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో సఫలమయ్యారు మరియు సఫలమవుతూనే ఉంటారు. పోలండ్ టీచర్ ఎక్కడున్నారు? (ట్రాన్స్లేషన్ చేస్తున్నారు) మంచిది. ఎంతమంది టీచర్లు ఉన్నా, ఇది ఫౌండేషన్. ఎంత గందరగోళం జరిగినా స్వయం నిశ్చలంగా ఉన్నారు, అందుకే సేవ కూడా జరిగింది. సేవకు అభినందనలు. ధైర్యం ఉంచేవారికి సహాయం తప్పకుండా లభిస్తుంది. ధైర్యంలో కదలకూడదు. ఏమవుతుందో తెలియదు! తెలియదు అనే ఆలోచన వచ్చింది, వెళ్లిపోయింది, సమాప్తం! మంచిదే జరగాలి, ఇంకా మంచికంటే మంచిదే జరగాలి. మంచి-మంచిగా ఆలోచిస్తే మంచిదే జరుగుతుంది. ఎందుకంటే మీ మంచి వృత్తి వాయుమండలాన్ని పరివర్తన చేస్తుంది. ఎందుకు-ఏమిటి లోకి వెళ్తే - ఇలా ఉంది, అలా ఉంది అని అనుకుంటే ఎప్పుడూ పరివర్తన జరగదు. మంచి, మంచి అని చెబుతూ ఉండండి, అప్పుడు మంచిగా అవుతారు. మీ మనసా వృత్తిని సదా మంచిగా, పవర్‌ఫుల్‌గా తయారు చేయండి, అప్పుడు చెడు కూడా మంచిగా అయిపోతుంది. బాబా మీ పిల్లలందరిలో చెడ్డవారు, చెడ్డవారు అనే వృత్తి ఉంచారా? ఎలాగున్నా, ఏమున్నా మంచివారిగానే బాబా భావించారు కదా. అందుకే అందరూ మంచివారయ్యారు కదా! ఎవరైనా చెడ్డవారు ఉన్నారా? అందరూ మంచివారే. కాబట్టి మంచి, మంచి, మంచి... ఎవరైనా ఏదైనా మాట్లాడితే కూడా అచ్ఛా జీ, చాలా మంచిది అని చెప్పండి, అప్పుడు మంచిగా అయిపోతుంది. లేదు, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, ఏమి మాట్లాడుతున్నావు... అని గొడవ పడకండి. ఇలా మాట్లాడటం కూడా బాగుండదు, అచ్ఛా జీ అని చెప్పడం బాగుంటుంది కదా. కాబట్టి అచ్ఛా జీ అని చెబుతూ ఉండండి, మంచిగా తయారు చేస్తూ ఉండండి. మీరు మంచిగా అవ్వాల్సిందే కదా, ఇంకెవరైనా రావాలా? ఇందులో అందరూ ముందుగా నేను - అభిమానం ఉన్న నేను కాదు, శుద్ధమైన నేను. అచ్ఛా!
నలువైపులా ఉన్న ధర్మ సత్తా యొక్క అధికారీ ఆత్మలకు, సదా స్వరాజ్య సత్తా యొక్క అధికారీ ఆత్మలకు, సదా డబల్ సత్తాధారులు, డబల్ కిరీటధారులైన శ్రేష్ఠ ఆత్మలకు, సదా సర్వశక్తుల ద్వారా శక్తి స్వరూపం యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించే శక్తిశాలి ఆత్మలకు, సదా లక్ష్యమును లక్షణాల రూపంలో చూపించే, అనుభవం చేయించే శక్తిశాలి మహావీరులైన, అచలమైన, స్థిరమైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- (దాదీజీ మరియు దాదీ జానకిజీ బాబాను ఆలింగనం చేసుకున్నారు) అందరికీ లభించింది కదా! సంతుష్టులయ్యారు కదా! చాలా తెలివైనవారు, అర్థం చేసుకునేవారు. అందరూ మిమ్మల్ని మీరు స్టేజ్‌పై చూస్తున్నారా లేక కింద చూస్తున్నారా? ఎక్కడ ఉన్నారు? స్టేజ్‌పైనే ఉన్నారు కదా! ఈ మొత్తం హాలే స్టేజ్. అందరూ సమీపంగా ఉన్నారు, తోడుగా ఉన్నారు. స్టేజ్‌పైకి రావడం అంటే తోడుగా రావడం, సమీపంగా రావడం. మీరు అయితే సదా సమీపంగానే ఉన్నారు. వేరుగా అవ్వనే అవ్వలేరు. ఎవరైనా వేరు చేయాలని ప్రయత్నిస్తే మీరు వేరవుతారా? లేక వారినే వేరు చేస్తారా? వారిని పంపించేస్తారా? కానీ స్వయం సదా తోడుగా ఉంటారు. తోడుగా ఉన్నారు, తోడుగా ఉంటారు మరియు తోడుగా వెళ్తారు. (తోడుగా చక్కర్లు వేస్తారు) చక్కర్లు అయితే తోడుగానే వేస్తున్నారు. చక్కర్లు వేయడం గురించి ఆలోచిస్తున్నారు. 84 జన్మల చక్రం అయితే పూర్తయింది. ఇప్పుడు ఇంటికి వెళ్లాలి. ఇంటికి వెళ్తారా లేక నేరుగా రాజ్యంలోకి వెళ్తారా? ఇంటికి వెళ్లాలా లేక రాజ్యం చేయాలా? ఇంటికి వెళ్లాలి కదా! కాబట్టి తోడుగా అయితే ఉన్నారు. బాప్‌దాదాకు ఒంటరిగా ఉండటం నచ్చదు. మీకు అప్పుడప్పుడు ఒంటరిగా ఉండటం నచ్చుతుందా! ఒంటరిగా కూర్చోరు, సేవ చేస్తూనే ఉంటారు. (దాదీజీ గుజరాత్‌కు మరియు గుల్జార్ దాదీ బాంబేకు చక్కర్లు వేయడానికి వెళ్తున్నారు) చక్కర్లు వేయాలి అంటే చక్కర్లు వేయడానికి తప్పకుండా వెళ్తారు. చక్కర్లు వేయకుండా చక్రవర్తి రాజులుగా అవ్వరు. మీకు కూడా చక్కర్లు వేయడం నచ్చుతుంది కదా! ఏదైనా ఆహ్వానం లభిస్తే ఎంత సంతోషం కలుగుతుంది. మంచిది. చక్కర్లు వేయడం అంటే మీ అనుభవీ మూర్తి స్థితిలో ఇంకా మార్కులు పెంచుకోవడం. జమ అవుతూ ఉంటుంది. కానీ, నాకు చక్కర్లు వేయడానికి ఆహ్వానం రాలేదు అంటే బహుశా నేను మంచివారిని కాను అని అనుకోకండి. అలా అనుకోకండి. కొందరు నోటి ద్వారా భాషణ చేస్తారు, కొందరు మనసా ద్వారా చేస్తారు. కేవలం భాషణ చేయడమే సేవ కాదు. అది కూడా ఒక విధి. కానీ మనసా ద్వారా అయినా, వాచా ద్వారా అయినా, కర్మణా ద్వారా అయినా, సంబంధ-సంపర్కాల ద్వారా అయినా సేవ చేయండి, ఈ నాలుగింటికీ 100 మార్కులే ఉన్నాయి. అందరికీ 100 మార్కులే. కర్మణా సేవ చేసేవారికి 50 మార్కులు, భాషణ చేసేవారికి 100 మార్కులు అని కాదు. ఏ సేవ చేసినా సేవాధారిగా అయ్యి సేవ చేయండి, నిస్వార్థ సేవ చేయండి, అప్పుడు సేవ యొక్క మేవా లభించినట్లే. అలాగే భావిస్తున్నారు కదా? లేక పెద్ద పెద్ద కాన్ఫరెన్సుల్లో భాషణ చేయడమే సేవ అని భావిస్తున్నారా? అక్కడ ఒకరు ఇద్దరే వెళ్తారు కదా! లక్షలాది మంది అందరూ భాషణ చేయడానికి వెళ్తే ఎలా జరుగుతుంది? చెప్పేవారు 3 లక్షలు, వినేవారు 100 మంది అయితే ఎలా ఉంటుంది! కాబట్టి నాకు సేవ యొక్క ఛాన్స్ రాలేదు అంటే నేను సేవకు యోగ్యురాలిని కాదు అని ఎప్పుడూ అనుకోకండి. ఎప్పుడూ నిరాశ చెందకండి. బాప్‌దాదా వద్ద అందరి రికార్డులు ఉంటాయి. ఛాన్స్ లభించినా, లభించకపోయినా, మీరు మనసా సేవ యొక్క ఛాన్స్ తీసుకుంటే, వారు చక్కర్లు వేసి భాషణ చేసి వచ్చారు, మీరు మనసా సేవ చేశారు, మార్కులు మీకు కూడా అలాగే లభిస్తాయి. అందుకే నా భాగ్యమే ఇలాంటిది అని ఎప్పుడూ చింతించకండి. మీ భాగ్యం చాలా గొప్పది. సంతుష్టంగా ఉండండి. కర్మణా సేవ అయినా, వాచా సేవ అయినా, మనసా సేవ అయినా, సంతుష్టంగా ఉండడంలోనే మార్కులు లభిస్తాయి. భాషణ చేయడానికి వెళ్లి అసంతుష్టులయ్యారు, గందరగోళం అయింది, అంతే, ఒక్క మార్కు కూడా లేదు. మీరు ఇంట్లోనే ఉండి చాలా మంచి స్థితిలో ఉంటే మీకు 100 మార్కులు లభిస్తాయి. కాబట్టి లెక్క పూర్తి. లెక్కలో పైకి-కిందికి ఉండదు. మీకు ఫుల్ మార్కులు లభిస్తాయి. ఏ సేవ చేసినా సత్యమైన హృదయంతో చేయండి. నేను మరియు నాది అనే భావం ఉండకూడదు. సేవాభావం ఉండాలి. నేను అనే భావం ఉండకూడదు. సేవాభావం ఉంటే ఫలం మీకు ముందుగానే లభిస్తుంది. సదా రొట్టెలు తయారు చేస్తూ ఉన్నా ఏమీ నష్టం లేదు. అయినప్పటికీ 100 మార్కులు లభిస్తాయి. సత్యమైన హృదయంతో చేస్తారు కదా, అప్పుడు రొట్టెలు తయారు చేస్తూ మీరు నింపే శక్తే భాషణ చేసేవారికి పనికి వస్తుంది. అర్థమైందా! అందుకే నిరాశ చెందకండి, నా పేరు ఏ కాన్ఫరెన్స్‌లోనూ రాలేదు, నా పేరు ఎవరూ తీసుకోరు, బహుశా నేను వెనుక ఉన్నాను అని. కాదు. సంతుష్టంగా ఉండండి. సంతుష్టతే సఫలతకు సాధనం. ఎక్కడ ఉన్నా సంతుష్టంగా ఉండండి. సరేనా! లేక, మహారథులు అయితే వీరే అవుతారు, మేము మహారథుల లిస్ట్‌లోకి రావడం కష్టం అని అప్పుడప్పుడు అనుకుంటారా? కాదు, ముందుగా నంబర్‌వన్ మహారథులు మీరే. బాబా లిస్ట్‌లో మహారథులు మీరే. అర్థమైందా! కాబట్టి ఎప్పుడూ ఇలా-అలా ముఖం పెట్టకండి. బాప్‌దాదా చాలా ముఖాలు చూస్తారు - అప్పుడొకలా, ఇంకొకప్పుడు మరోలా! అలా కాదు, సదా చిరునవ్వుతో ఉండండి. అచ్ఛా, అందరూ బాగున్నారా?
(మున్నీ అక్కయ్య బాప్‌దాదా ముందు పండ్ల పళ్ళాన్ని అలంకరించి ఉంచారు) మీ విగ్రహానికి కూడా విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. మంచిది, విధిపూర్వకంగా తయారు చేయడం, ఉంచడం, ఇది కూడా ఒక విశేషత. ఇది కూడా రావాలి. ఎలా పడితే అలా భోగ్ పెట్టేయడం కాదు. సగం పచ్చిగా, సగం ఉడికినదిగా భోగ్ పెట్టేయడం కాదు! ఎప్పుడైనా తయారు చేయడానికి బద్ధకం వస్తే ఒక పండు మాత్రమే పెట్టేయడం కాదు. (డబల్ విదేశీయులను చూస్తూ) వీరు అలసిపోతారు కదా, డబల్ పని చేస్తారు. లౌకిక పని కూడా చేస్తారు, సెంటర్‌ను కూడా సంభాళిస్తారు, తమ పురుషార్థం కూడా చేస్తారు. అందుకే అలసిపోతారు. అలా సరిపెట్టుకోవద్దు. ఒక వస్తువే అయినా ప్రేమతో తయారు చేయండి. మూడు చేయకపోయినా ఒకటి ప్రేమతో తయారు చేయండి. బ్రెడ్ అయితే తయారుగా ఉంది కదా అని బ్రెడ్‌నే భోగ్ పెట్టేసి సరిపెట్టుకోవద్దు. ఎంత విధి ఉంటుందో అంత సిద్ధి ఉంటుంది. విధిపూర్వకంగా చేస్తే సిద్ధి కూడా లభిస్తుంది. బ్రాహ్మణుడు అనగా ప్రతి కార్యంలో యాక్యురేట్‌గా, శుద్ధిపూర్వకంగా ఉండేవారు. శుద్ధి కూడా ఉండాలి, విధి కూడా ఉండాలి - రెండూ కావాలి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
