‘‘సంగమయుగము ఉత్సవాల యుగము - ఉత్సవము జరుపుకోవడము అనగా అవినాశీ ఉల్లాస-ఉత్సాహాలలో ఉండడము’’
ఈరోజు త్రిదేవుల రచయిత అయిన త్రిమూర్తి శివబాబా తమ ఆత్మిక డైమండ్లతో కలిసి డైమండ్ జూబిలీ లేక డైమండ్ జయంతిని జరుపుకునేందుకు వచ్చారు. ఈ విచిత్ర జయంతినే డైమండ్ జయంతి అని అంటాము ఎందుకంటే తండ్రి అవతరించిందే గవ్వ సమానమైన ఆత్మలను వజ్రతుల్యంగా తయారుచేయడానికి. కావున బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలను, ఎవరైతే వజ్రం కన్నా అమూల్యంగా ఉన్నారో వారందరినీ ఎదురుగా చూస్తున్నారు. బాప్‌దాదా ఎదురుగా కేవలం మధుబన్ యొక్క సభ మాత్రమే కాదు, విశ్వంలోని నలువైపుల ఉన్న బ్రాహ్మణ పిల్లల యొక్క సభ ఉంది. అందరి హృదయపూర్వక అభినందనల యొక్క స్నేహంతో నిండిన గీతాలు అనండి, మాటలు అనండి, వాటిని తండ్రి సమీపంగా ఉండి వింటున్నారు. హృదయంలోని ధ్వని హృదయాభిరాముని వద్దకు మొదట చేరుకుంటుంది. బాప్‌దాదా చూస్తున్నారు - పిల్లల సేవ యొక్క ప్రత్యక్ష ప్రమాణము నలువైపుల నుండి తండ్రి యొక్క స్వీట్ హోమ్ అయిన మధుబన్ వరకు చేరుకుంటుంది. మామూలుగా కూడా శివజయంతిని ఉత్సవము అని అంటారు. యథార్థ రీతిలో ఉత్సవాన్ని బ్రాహ్మణులైన మీరే జరుపుకుంటారు ఎందుకంటే ఉత్సవం యొక్క అర్థమే - సర్వులు ఉల్లాస-ఉత్సాహాలలో ఉండడము. మరి మీరెవరెవరైతే ఇక్కడ కూర్చున్నారో మీ అందరి హృదయాలలో ఉల్లాస ఉత్సాహాలు ఎంత వరకు ఉన్నాయి? అవినాశిగా ఉన్నాయా లేక ఈ రోజు కోసమే ఉన్నాయా? అవినాశీగా ఉన్నాయి కదా? అందుకే బాప్‌దాదా ఈ శ్రేష్ఠ సంగమయుగాన్ని ఉత్సవము యొక్క యుగము అని అంటారు. ప్రతి రోజూ మీ కొరకు ఉత్సాహ సంపన్నమైనది. ప్రతి రోజూ ఉత్సవమే.
‘‘అనేకతలో ఏకత’’ అని గాయనం కూడా ఉంది, ఈ టాపిక్‌ను కూడా మీరు పెడతారు. ప్రాక్టికల్‌గా అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రూపాలు, రంగులు ఉన్నా కూడా అనేకతలో కూడా అందరి హృదయాలలో ఐక్యత ఉంది కదా! ఎందుకంటే తండ్రి ఒక్కరే. అమెరికా నుండి వచ్చినా, ఆఫ్రికా నుండి వచ్చినా హృదయంలో ఒక్క తండ్రే ఉన్నారు, ఒక్క శ్రీమతంపై నడిచేవారిగా ఉన్నారు. కావున అనేక భాషలు ఉంటూ కూడా మనసు యొక్క గీతము, మనసు యొక్క భాష ఒక్కటే ఉండడము అనేది బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తుంది. ఏ భాషకు చెందినవారైనా సరే అందరికీ నల్ల కిరీటమైతే లభించింది (అందరూ హెడ్ ఫోన్స్ ద్వారా తమ తమ భాషల్లో వింటున్నారు), ఇప్పుడు ఈ నల్ల కిరీటమే మారి గోల్డెన్ కిరీటంగా అవుతుంది. కానీ అందరి మనస్సులోని భాష ఒక్కటే మరియు ‘నా బాబా’ అన్న ఒకే పదము ఉంది. అన్ని భాషల వారు ‘నా బాబా’ అని అనండి. అవును, ఈ ఒక్క పదమే ఉంది. కావున అనేకతలో ఏకత ఉంది కదా!
ఉత్సాహంలో ఉండేవారు అనగా సదా ఉత్సవాన్ని జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలు. ఎప్పుడూ ఉత్సాహము తగ్గకూడదు. ఇంతకుముందు కూడా వినిపించాము - బ్రాహ్మణ జీవితం యొక్క శ్వాస ఉల్లాస-ఉత్సాహాలు. ఒకవేళ శ్వాస పోయినట్లయితే జీవితము క్షణంలో అంతమైపోతుంది కదా! కావున బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ ఉల్లాస-ఉత్సాహాల శ్వాస లేకపోతే బ్రాహ్మణ జీవితమే లేదు. ఎవరైతే సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉంటారో వారు - బ్రాహ్మణులు అంటేనే ఉల్లాస-ఉత్సాహాలు అని నషాతో అంటారు మరియు ఎవరి ఉల్లాస-ఉత్సాహాలైతే తగ్గిపోతాయో వారి మాటలే మారిపోతాయి. వారంటారు - అది నిజమే... అలాగే అవ్వాలి... అయిపోతుందిలే... ఈ భాషకు, ఆ భాషకు ఎంత తేడా ఉంటుంది! వారి ప్రతి మాటలో ‘అవ్వాలి’ అన్నది తప్పకుండా ఉంటుంది - అలాగే అవ్వాలి... అని అంటూ ఉంటారు. ఈ ‘అవ్వాలి-అవ్వాలి’ అన్నది ఉంటుంది కదా. ఉల్లాస ఉత్సాహాల ప్రెజర్ తక్కువ అవ్వడంతోనే ఇటువంటి మాటలు, బలహీనతతో కూడుకున్న మాటలు వస్తాయి. కావున ఉల్లాస ఉత్సాహాలు ఎప్పుడూ తక్కువవ్వకూడదు. ఉల్లాస-ఉత్సాహాలు ఎందుకు తక్కువవుతాయి? బాప్‌దాదా సదా ‘వాహ్-వాహ్’ అనండి అని చెప్తారు కానీ మీరు ‘వై-వై (ఎందుకు-ఎందుకు)’ అని అంటారు. ఒకవేళ ఏ పరిస్థితిలోనైనా ఎందుకు అన్న పదము వస్తే ఉల్లాస-ఉత్సాహాల ప్రెషర్ తక్కువైపోతుంది. బాప్‌దాదా గత సంవత్సరంలో కూడా విశేషంగా డబల్ విదేశీయులకు చెప్పారు - వై (ఎందుకు) అన్న పదాన్ని బ్రాహ్మణుల డిక్షనరీలో మార్చివేయండి, వై (ఎందుకు) అన్న పదము వచ్చినప్పుడు ఫ్లై (ఎగిరిపోవటము) అన్న పదాన్ని గుర్తుంచుకున్నట్లయితే వై (ఎందుకు) అనేది సమాప్తమైపోతుంది. ఏదైనా చిన్న పరిస్థితి పెద్దగా అనిపించినప్పుడు వై (ఎందుకు) అన్న పదము వస్తుంది - ఇది ఎందుకు, ఇది ఏమిటి... అక్కడ ఎగిరిపోతే అప్పుడు పరిస్థితి ఏమవుతుంది? ఒక చిన్న ఆట వస్తువుగా అవుతుంది. కావున ఎప్పుడైనా వై అన్న పదము మనస్సులోకి వచ్చినప్పుడు ఇలా చెప్పండి - బ్రాహ్మణ డిక్షనరీలో వై అన్న పదము లేదు, ఫ్లై అన్నదే ఉంది ఎందుకంటే వై, వై అన్నది అయ్యో, అయ్యో అనేలా చేస్తుంది. బాప్‌దాదాకు నవ్వు కూడా వస్తుంది, ఒకవైపు - మాలాంటి శ్రేష్ఠ భాగ్యము ఇంకెవరికీ లేదు అని అంటారు. ఇప్పుడిప్పుడే ఇలా అంటారు, మళ్ళీ ఇప్పుడిప్పుడే ఉత్సాహము తగ్గిపోతే - ఏమో, నా భాగ్యమే ఇలా ఉందేమో, నా భాగ్యంలో ఇంతే ఉందేమో! అని అంటారు. మరి ఇది అయ్యో-అయ్యో అన్నట్లే కదా. కావున ఎప్పుడైనా అయ్యో-అయ్యో అనే దృశ్యాలు వస్తే అక్కడ వాహ్, వాహ్ అని అనండి, అప్పుడు దృశ్యము కూడా మారిపోతుంది మరియు మీరు కూడా మారిపోతారు.
డబల్ విదేశీయులు ఈ రోజుల్లో ‘పాజిటివ్ థింకింగ్’ అనే కోర్సును చేయిస్తున్నారు కదా. అందరూ విదేశాల్లో విశేషంగా ఈ కోర్సును చేయిస్తున్నారా? మరి మీకు కూడా చేసుకుంటున్నారా లేక ఇతరులకే చేయిస్తున్నారా? అటువంటి పరిస్థితి ఏమైనా వచ్చిన సమయంలో స్వయాన్ని ఒక విద్యార్థిగా చేసుకొని, స్వయమే టీచర్‌గా అయి స్వయానికి ఈ కోర్సును చేయించుకోండి. మీకు మీరు చేయించుకోగలరా లేక కేవలం ఇతరులకు మాత్రమే చేయించగలరా? ఇతరులకు చేయించడం సహజము. ప్రతి వ్యక్తిని, ప్రతి విషయాన్ని పాజిటివ్ వృత్తితో చూడడము, వినడము మరియు ఆలోచించడము అనేది న్యాచురల్ స్థితిగా అయినప్పుడు స్థితి ఎలా ఉంటుంది? ఈ రోజుల్లో సైన్స్ ద్వారా ఎటువంటి సాధనాలు వెలువడ్డాయంటే - వాటి ద్వారా కూడా రఫ్‌గా ఉన్న ముడి సరుకును కూడా చాలా సుందరమైన రూపంలోకి మార్చివేస్తారు. ఎలా ఉన్నవాటిని ఎలా తయారుచేస్తారో చూసారు కదా! మరి మీ వృత్తి ఇటువంటి పరివర్తన చేయలేదా? రావడం నెగెటివ్ రూపంలో వచ్చినా కానీ మీరు నెగెటివ్‌ను పాజిటివ్ వృత్తితో మార్చివేయండి. ఒకవేళ అలజడిలోకి వస్తే దానికి కారణము ఏమిటంటే – నెగెటివ్‌ను వినడము, ఆలోచించడము, మాట్లాడడము లేక చేయడము. నెగెటివ్‌ను ఆలోచించకండి, చూడకండి, మాట్లాడకండి, చేయకండి అనే మోడల్‌ను తయారుచేస్తారు కదా. సైలెన్స్ శక్తి నెగెటివ్‌ను పాజిటివ్‌లోకి మార్చలేదా? మీ మనసు మరియు బుద్ధి ఎలా తయారవ్వాలంటే ఇక దానిని నెగెటివ్ అనేది టచ్ చేయకూడదు, క్షణంలో పరివర్తన అయిపోవాలి. ఇటువంటి తీవ్రవేగంతో కూడిన అనుభూతిని చేయగలరా? మనస్సు మరియు బుద్ధి ఇటువంటి తీవ్రవేగంతో కూడుకున్న యంత్రాలుగా అవ్వాలి. అలా అవ్వగలదా లేక సమయం పడుతుందా? లేక నెగెటివ్ విషయం వచ్చినప్పుడు కొద్దిగా ఆలోచించనివ్వండి, ఇదేమిటో చూడనివ్వండి అని అంటారా! తీవ్ర వేగంతో పరివర్తన అయిపోవాలి - దీనినే బ్రాహ్మణ జీవితం యొక్క సంతోషము లేక ఆనందము అని అంటాము. జీవించాలంటే ఆనందంగా జీవించండి. ఆలోచిస్తూ, ఆలోచిస్తూ జీవించడమంటే అది జీవించడం కాదు. మీరు ఇతరులకు - రాజయోగము జీవించే కళ అని చెప్తారు. మరి మీరు రాజయోగీ జీవితము కలవారు కదా. లేక కేవలం చెప్పేవారేనా? రాజయోగము అనేది జీవించే కళ అన్నప్పుడు మరి రాజయోగుల కళ ఏమిటి? ఇదే కదా? కావున ఉత్సవాన్ని జరుపుకోవడము అనగా ఆనందంగా ఉండడము. మనసు కూడా ఆనందంగా, తనువు కూడా ఆనందంగా, సంబంధ-సంపర్కాలు కూడా ఆనందంగా ఉండడము.
కొందరు పిల్లలు ఏమంటారంటే - మా వరకు మేము బాగానే ఉంటాము, మా ఆనందంలో మేముంటాము కానీ సంబంధ-సంపర్కాలలో ఆనందంగా ఉండడము అనేది అప్పుడప్పుడే జరుగుతుంది. కానీ సంబంధ-సంపర్కాలే మీ స్థితికి పేపర్ (పరీక్ష) వంటివి. ఒకవేళ విద్యార్థి ఇలా అంటే - మామూలుగా అయితే నేను పాస్ విత్ ఆనర్‌గా ఉంటాను కానీ పరీక్ష సమయంలో మార్కులు తగ్గిపోతాయి, ఇటువంటి వారిని ఏమంటారు? మరి మీరైతే అలా లేరు కదా! మీరు ఫుల్ పాస్ అయ్యేవారే కదా? బాప్‌దాదా వినిపించారు - ఎవరైతే సదా తండ్రికి సమీపంగా ఉంటారో వారు పాస్. సమీపంగా లేకపోతే పాస్ కానట్లే. మరి సదా ఎక్కడ ఉంటారు? దూరంగా ఉంటారా, సమీపంగా ఉండరా! డబల్ విదేశీయులైతే డబల్ సమీపంగా ఉండాలి కదా! అచ్ఛా.
డబల్ విదేశీయులు ఈసారి హై జంప్ చేసారు. మధుబన్కు హై జంప్ చేసి చేరుకున్నారు. (ఈ సారి డబల్ విదేశీయులు ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ సంఖ్యలో మధుబన్కు చేరుకున్నారు) అచ్ఛా, డబల్ విదేశీయులలో కూడా చాలా మందికి పట్టపురాణులుగా అయ్యే (నేలపై పడుకునే) అవకాశం మంచిగా లభించింది. పట్టపురాణులుగా అవ్వడంలో (నేలపై పడుకోవడంలో) ఆనందం ఉందా లేదా? మీ సూట్కేసులే ఎంత ఉంటాయంటే వాటిపైనే పడుకుండిపోవచ్చు ఎందుకంటే ఒకటి పెద్దది తీసుకొస్తారు, ఇంకొకటి చిన్నది తీసుకొస్తారు, ఆ చిన్నదానిని దిండుగా చేసుకోండి. స్థలం మిగులుతుంది కదా! మంచిగా అనిపిస్తుంది. పెద్ద పెద్ద సూట్‌కేస్‌లను ఏ విధంగా లాక్కుంటూ తీసుకొస్తున్నారు అన్న దృశ్యాన్ని బాప్‌దాదా చూస్తారు! ఆ దృశ్యం మంచిగా అనిపిస్తుంది కదా! సంగమంలో ఈ శ్రమ కూడా కొద్ది సమయం కొరకే ఉంటుంది, ఆ తర్వాత ప్రకృతి కూడా మీకు దాసిగా అవుతుంది, అలాగే దాసీలు కూడా ఎంతో మంది ఉంటారు. అప్పుడిక మీకు సామానులు మోయవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు మీ రాజ్యం స్థాపనవుతూ ఉంది, ఈ సమయంలో గుప్త వేషంలో ఉన్నారు, సేవాధారులుగా ఉన్నారు, తర్వాత రాజ్యాధికారులుగా అవుతారు. మరి సేవాధారులు అన్ని రకాల సేవలను చేయవలసి ఉంటుంది. ఎంతగా ఇక్కడ తనువు, మనస్సు, ధనము మరియు సంపర్కముతో సేవ చేస్తారో అంతగా అక్కడ సేవాధారులు లభిస్తారు. అన్నింటి కన్నా ముందు ప్రకృతి యొక్క ఈ పంచ తత్వాలు మీ సేవాధారులుగా అవుతాయి. మీ రాజ్యభాగ్యము స్మృతిలో ఉంది కదా! ఎన్ని సార్లు రాజ్యాధికారులుగా అయ్యారు? లేక్కలేనన్ని సార్లు అయ్యారు మరియు అవుతూనే ఉంటారు. కానీ రాజ్యాధికారుల కన్నా కూడా ఇప్పటి సేవాధారీ జీవితము శ్రేష్ఠమైనది ఎందుకంటే ఇప్పుడు తండ్రి మరియు పిల్లలు కలిసి ఉన్నారు. ఏ రకమైన సేవ అయినా కానీ సేవ యొక్క ప్రత్యక్ష ఫలము ఇప్పుడే లభిస్తుంది. తండ్రి యొక్క స్నేహము, సహయోగము మరియు తండ్రి ద్వారా లభించిన ఖజానాలు ప్రత్యక్ష ఫలం రూపంలో లభిస్తాయి. ఎప్పుడైనా ఏదైనా విశేష సేవను చేసినప్పుడు మరియు యుక్తియుక్తంగా సేవ చేసినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది! ఆ సమయంలోని మీ ముఖం యొక్క ఫొటోను తీసినట్లయితే అది ఎలా ఉంటుంది! ఒకవైపేమో సేవ చేస్తారు ఇంకొకవైపు ప్రత్యక్ష ఫలము మీ కొరకు సదా సిద్ధంగా ఉండనే ఉంటుంది. ఒక చేతితో సేవ చేయండి, ఇంకొక చేతితో ఫలాలు తినండి... ఈ విధంగా అనుభవం అవుతుందా? లేక సేవలో ఎంతో శ్రమ ఉందా? సేవలో అలజడి కలుగుతుందా లేదా? అప్పుడప్పుడు కలుగుతుంది. ఈ అలజడే పరిపక్వంగా చేస్తుంది, అనుభవజ్ఞులుగా చేస్తుంది. అలజడిలోకి ఎందుకు వస్తారంటే కేవలం వర్తమానాన్నే చూస్తారు. కానీ వర్తమానంలో దాగి ఉన్న భవిష్యత్తు ఏదైతే ఉందో, అది స్పష్టంగా కనిపించదు, అందుకే అలజడిలోకి వస్తారు. ఎంత పెద్ద నాజూకు పరిస్థితి అయినా సరే వాస్తవానికి అది భవిష్యత్తు కొరకు చాలా పెద్ద పాఠాన్ని నేర్పిస్తుంది, అది పరిస్థితి కాదు కానీ అది మీకు టీచర్ వంటిది. ఈ పరిస్థితి నాకు ఏ పాఠాన్ని నేర్పించింది అన్న దృష్టితో చూడండి. దీనిని నెగెటివ్‌ను పాజిటివ్‌లోకి పరివర్తన చేయడం అని అంటాము. కేవలం పరిస్థితిని మాత్రమే చూస్తే భయపడిపోతారు మరియు పరిస్థితి అనేది మాయ ద్వారా సదా కొత్త-కొత్త రూపాలలో వస్తుంది. ఇంతకుముందు ఏ రూపంలో వచ్చిందో అదే రూపంలో రాదు, కొత్త రూపంలో వస్తుంది. అప్పుడు - ఇది కొత్త విషయము, ఇది ఇలా జరగడం లేదు, ఇది ఇలా జరగకూడదు... అని అంటూ భయపడిపోతారు. కానీ మాయ అంతిమం వరకు బహురూపిగా అయి బహురూపాలను చూపిస్తుంది అని అర్థం చేసుకోండి. మాయకు బహురూపిగా అవ్వడం చాలా త్వరగా మరియు మంచిగా వస్తుంది. మీ స్థితి ఏ విధంగా ఉంటుందో, అటువంటి పరిస్థితినే తయారుచేసి తీసుకుని వస్తుంది. ఒకవేళ ఈరోజు మీరు కాస్త నిర్లక్ష్యంతో కూడిన జీవితంలో ఉంటే మాయ కూడా అలాగే నిర్లక్ష్యం కలిగించే పరిస్థితి రూపంలో వస్తుంది. ఈరోజు కాస్త మూడ్ ఆఫ్‌గా ఉంది, మూడ్ ఎలా ఉండాలో అలా లేదు, అప్పుడు మాయ కూడా మూడ్ ఆఫ్ చేసే పరిస్థితి రూపంలోనే వస్తుంది. అప్పుడు అనుకుంటారు - ఇప్పటికే నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇప్పుడింకా ఇలా జరిగిందేమిటి? అందుకే మాయను చూసేందుకు, తెలుసుకునేందుకు త్రికాలదర్శులుగా మరియు త్రినేత్రులుగా అవ్వండి. ముందు, వెనుక, ఎదురుగా త్రినేత్రులుగా అవ్వండి.
ఇప్పుడు మీరందరూ త్రినేత్రులు మరియు త్రికాలదర్శులే కదా? డబల్ విదేశీయులు త్రికాలదర్శులేనా - అవునా, కాదా? అందరూ చెప్పండి - హాజీయా లేక నాజీయా. (హా జీ) మీ భాషలో కన్నా ఈ భాషలో చాలా బాగా చెప్తారు. అందరూ సంతోషంగా ఉన్నారా? (హా జీ). ఇంత పెద్ద సమూహంలో సంతోషంగా ఉన్నారా? (హా జీ). వచ్చే సంవత్సరం ఇంతమంది గుంపులో రాకూడదు, కాస్త ఆలస్యంగా వద్దాము అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? సంగఠనలోని సంతోషం కూడా ప్రియంగా అనిపిస్తుంది. ఆ మాటకొస్తే ఇచ్చిన ప్రోగ్రామ్ అనుసారంగానే రావాలి, ఎక్కువ మంది రాకూడదు కానీ అన్నింటిలోనూ ఎడ్జెస్ట్ అవ్వగలిగే అలవాటు ఉండాలి. ఎడ్జెస్ట్ అవ్వగలిగే శక్తి సదా విజయులుగా చేస్తుంది. బ్రహ్మా బాబాను చూసారు, చిన్న పిల్లలతో చిన్న పిల్లవానిగా అయి ఎడ్జెస్ట్ అయ్యేవారు, పెద్దవాళ్ళతో పెద్దవారిగా అయి ఎడ్జెస్ట్ అయ్యేవారు. బెగ్గరీ జీవితంలోనైనా, సాధనాల జీవితంలోనైనా రెండింటిలోనూ ఎడ్జెస్ట్ అవ్వాలి మరియు సంతోషంగా అవ్వాలి, అంతేకానీ ఆలోచించి కాదు. ఇక్కడ దుఃఖితులుగా అయితే అవ్వరు కానీ సంతోషానికి బదులుగా కాస్త ఆలోచనలో పడతారు - ఇదేమిటి ఇలా అయ్యింది, ఎలా అయ్యింది... కావున ఆలోచించేవారికి ఎడ్జెస్ట్ అయ్యే సంతోషాన్ని పొందేందుకు కాస్త సమయం పడుతుంది. మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - ఎటువంటి పరిస్థితి అయినా అది మంచిదైనా లేక కదిలించేదైనా కానీ అన్ని వేళలా, అన్ని పరిస్థితులలో స్వయాన్ని ఎడ్జెస్ట్ చేసుకోగలరా? డబల్ విదేశీయులకు ఒంటరితనం కూడా మంచిగా అనిపిస్తుంది మరియు కంపానియన్స్ (సహచరులు) కూడా చాలా మంచిగా అనిపిస్తారు. కానీ కంపెనీలో ఉన్నా లేక ఒంటరిగా ఉన్నా రెండింటిలోనూ ఎడ్జెస్ట్ అవ్వడము ఇదే బ్రాహ్మణ జీవితము. సంగఠనలో ఉన్నప్పుడు తల బరువెక్కిపోవడం అన్నట్లు ఉండకూడదు - వద్దు, నాకు ఏకాంతం కావాలి, ఈ గోలలో వద్దు, నాకు ఒంటరిగానే కావాలి... అని అలా ఉండకూడదు. మనస్సు ఒంటరిగా ఉండడమంటే బాహ్యముఖత నుండి అంతర్ముఖతలోకి వెళ్ళిపోండి, అప్పుడు ఏకాంతము ఉంటుంది. కొంతమంది - ఒక్కరికే గది కావాలి, ఇద్దరు కూడా వద్దు అని అంటారు కదా, అలా ఒక్కరికే లభించినా సంతోషంగా పడుకోండి మరియు పది మందిలో పడుకోవలసి వచ్చినా సంతోషంగా పడుకోండి. విదేశీయులు పది మంది మధ్యలో పడుకోగలరా లేక అది కష్టమా? పడుకోగలరా? (హా జీ) అచ్ఛా, ఇప్పుడు వచ్చే సంవత్సరంలో 20-20 మందిని పడుకోబెడదాము. చూడండి, సమయం మారుతూ ఉంది మరియు మారుతూనే ఉంటుంది. ప్రపంచంలోని పరిస్థితులు నాజూకుగా అవుతూ ఉన్నాయి, ఇంకా అవుతాయి కూడా. ఇలా అవ్వవలసిందే. ఇప్పుడు కేవలం ఒక్కో స్థానంలో వేర్వేరుగా అవుతున్నాయి కానీ చివర్లో అన్నివైపులా ఒకేసారి జరుగుతాయి. కనుక నాజూకు సమయం రావాల్సిందే. సమయం నాజూకుగా ఉన్నా కానీ మీ స్వభావం నాజూకుగా ఉండకూడదు. చాలా మంది స్వభావం చాలా నాజూకుగా ఉంటుంది కదా, కొద్దిగా శబ్దం వచ్చినా, కొద్దిగా ఏమైనా జరిగినా డిస్టర్బ్ అయిపోతారు. దీనినే నాజూకు స్థితి, నాజూకు స్వభావము అని అంటాము. కావున నాజూకు స్వభావము ఉండకూడదు. సమయం ఏ విధంగా ఉంటుందో, ఆ విధంగా స్వయాన్ని ఎడ్జెస్ట్ చేసుకోగలగాలి. ఈ అభ్యాసము మున్ముందు మీకు చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే పరిస్థితులు సదా ఒకే రకంగా ఉండవు మరియు మీ ఫైనల్ పేపర్ నాజూకు సమయంలో రానున్నది. అది ప్రశాంతమైన సమయంలో రాదు. నాజూకు సమయంలో వస్తుంది. కావున ఎంతగా ఇప్పటి నుండే స్వయాన్ని ఎడ్జెస్ట్ చేసుకునే శక్తి ఉంటుందో అంతగానే నాజూకు సమయంలో పాస్ విత్ ఆనర్‌గా అవ్వగలుగుతారు. పేపర్ ఎక్కువ సమయమేమీ ఉండదు, పేపర్ చాలా తక్కువ సమయం ఉంటుంది కానీ నలువైపులా ఉన్న నాజూకు పరిస్థితులు ఉండగా వాటి మధ్యన పేపర్ ఇవ్వవలసి ఉంటుంది, అందుకే స్వయాన్ని స్వభావంలో కూడా శక్తిశాలిగా చేసుకోండి. ఏం చేయను, నా స్వభావం ఇలా ఉంది, నా అలవాటే ఇలా ఉంది అని అనడం కాదు, దీనిని నాజూకు స్వభావము అని అంటాము. చూడండి, బాప్‌దాదా స్థాపన యొక్క ఆది సమయంలో అన్నీ అనుభవం చేయించారు. ఆది సమయంలో రాజకుమారులు, రాజకుమారీల కన్నా కూడా ఎక్కువ పాలనను, సాధనాలను అన్నింటినీ అనుభవం చేయించారు, ఆ తర్వాత బెగ్గరీ జీవితాన్ని కూడా పూర్తిగా అనుభవం చేయించారు. కావున ఎవరైతే రెండింటినీ అనుభవం చేసారో వారికి అలవాటైపోయింది. కానీ మీ ముందుకు ఇటువంటి సమయం ప్రస్తుతం ఇంకా రాలేదు కానీ రానున్నది. మీరు ఎక్కడ ఉన్నా కానీ అన్నీ కదలనున్నాయి, అన్ని ఆధారాలు తెగిపోనున్నాయి. మరి ఇటువంటి సమయంలో ఏం కావాలి? కేవలం ఒక్క తండ్రి యొక్క ఆధారము. మీరందరూ చాలా-చాలా అదృష్టవంతులు. మీరు వచ్చిన సమయము సాధనాలు సహజంగా లభించే సమయము. సహజ సాధనాలతో పాటు మీ యొక్క బ్రాహ్మణ జన్మ జరిగింది. కానీ సాధనాలు మరియు సాధన - సాధనాలను చూస్తూ సాధనను మర్చిపోవద్దు ఎందుకంటే చివర్లో సాధనయే ఉపయోగపడనున్నది. అర్థమైందా? అచ్ఛా.
బాప్‌దాదా సంతోషిస్తున్నారు, డబల్ విదేశీయులు సందేశం ఇవ్వడంలో చాలా మంచి పాత్రను పోషిస్తున్నారు. సెంటర్స్ కూడా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో తెరుస్తున్నారు. కాబట్టి బాప్‌దాదా ఈరోజు మీ అందరికీ ఉత్సవం జరుపుకునేందుకు అభినందనలు కూడా ఇస్తున్నారు, అలాగే సేవకు కూడా అభినందనలు ఇస్తున్నారు. కేవలం ఇంకా అండర్లైన్ చేయిస్తున్నారు - సేవ మరియు స్వ-స్థితి రెండింటిలో తీవ్రగతి ఉండాలి. స్వ-స్థితి మరియు సేవ రెండింటి బ్యాలెన్స్ సదా స్మృతిలో ఉండాలి. అప్పుడప్పుడు బాప్‌దాదా వింటారు, చూస్తారు కూడా, ఎప్పుడైనా సేవలో చాలా పెద్దగా పరుగులు పెట్టే కార్యం చేస్తారు కదా, అప్పుడు కార్యం యొక్క ఉల్లాసంలో కార్యం అయితే చేసేస్తారు, కానీ అప్పుడప్పుడు కొందరు అంటారు - సేవలోకి వెళ్లాము కదా, అందుకే మా స్థితి కొద్దిగా ఢీలా అయిపోయింది. అలా జరగకూడదు. అంతే, ఇప్పుడు యోగంలో కూర్చున్నాము, సేవ చేయము, యోగంలోనే కూర్చుంటాము! యోగం మరియు సేవ రెండూ కలిసికట్టుగా ఉండాలి.
బాప్‌దాదా మీ అందరి ఉత్తరాలు, సమాచారాన్ని చదువుతారు! చాలామంది పిల్లలు అంటారు - 6-6 పేజీలు వ్రాశాము, జవాబు అయితే రాలేదు. ఇన్ని కార్డులు పంపాము, జవాబు రాలేదు. కానీ బాప్‌దాదా అందరికీ రెస్పాండ్ తప్పకుండా చేస్తారు. మీకు వ్రాయాలనే సంకల్పం కలుగుతుంది, అది అక్కడ బాబా వద్దకు చేరిపోతుంది. కానీ మంచిదే చేస్తున్నారు, కేవలం పొడవుగా వ్రాయకండి, షార్ట్‌గా వ్రాయండి. ఎందుకంటే వ్రాయడం వలన మనసులో ఏది నడుస్తూ ఉంటుందో అది సమాప్తమైపోతుంది, తేలికగా అయిపోతారు. అందుకే తప్పకుండా వ్రాయండి, కానీ షార్ట్‌గా వ్రాయండి. మీ అందరి కార్డులు మొదలైన వాటి ఎగ్జిబిషన్ వతనంలో కూడా ఏర్పాటు అవుతుంది. (అందరి కార్డులను స్టేజ్‌పై చాలా అందంగా అలంకరించి ఉంచారు) ఇక్కడ కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు కదా. కాబట్టి చేరిందా లేదా అని ఆలోచించకండి. తప్పకుండా చేరుతుంది. బాప్‌దాదా ప్రతి ఒక్కరి సమాచారాన్ని, అది సేవకు సంబంధించినదైనా, స్థితికి సంబంధించినదైనా చూస్తారు మరియు చూసి శక్తుల వైబ్రేషన్ ఇస్తారు. అచ్ఛా!
(బాప్‌దాదా అన్ని దేశాల సోదరసోదరీలతో వేర్వేరు గ్రూపులుగా చేతులు ఎత్తించారు)
సౌత్ మరియు నార్త్ అమెరికా చేతులు ఎత్తండి. అమెరికా ఏం అద్భుతం చూపిస్తుంది? ఏదైనా కొత్త విషయం చేస్తారు కదా! ఏం చేస్తారు? ఈ రోజు శివరాత్రి జెండా ఎగురవేస్తారు కదా, మరి ప్రత్యక్షత జెండా ముందుగా అమెరికాలో ఎగురుతుందా లేదా ఆఫ్రికాలోనా, లేక భారతదేశంలోనా? ముందుగా ఎక్కడ ఎగురుతుంది? అమెరికాలోనా? యు.ఎన్. బిల్డింగ్‌పై శివబాబా జెండాను ఎగురవేయండి. భారతదేశం వారు ఎర్రకోటపై జెండా ఎగురవేస్తే అందరి దృష్టి అక్కడికి వెళ్తుందని భావిస్తారు కదా, అలాగే యు.ఎన్. బిల్డింగ్‌పై జెండా ఎగురవేస్తే అందరూ ఏమంటారు? వన్స్ మోర్, వన్స్ మోర్. ఆ రోజు కూడా రావాల్సిందే. మరి యూరప్ ఎక్కడ జెండా ఎగురవేస్తుంది? లండన్ మహల్లో. అక్కడ పరేడ్ చూడడానికి వస్తారు కదా, అలాగే ఈ జెండాను చూడడానికి రావాలి. జరగాల్సిందే కదా! ఇంకా వారే మిమ్మల్ని అర్జీలు పెట్టుకొని తీసుకువెళ్తారు - రండి అని. కొద్దిగా అలజడి జరగనివ్వండి, వారి అలజడి జరుగుతుంది, మన జెండా ఎగురుతుంది. మరి ఆఫ్రికా ఎక్కడ జెండా ఎగురవేస్తుంది? ఆఫ్రికాలో ఏదైనా పేరుపొందిన ప్రదేశంలో జెండా ఎగురవేయండి. ఇప్పుడు ఆ మిలిటరీ పరేడ్ నిర్వహిస్తారు, తరువాత బ్రహ్మాకుమారీల యాత్ర జరగాలి. ఆస్ట్రేలియా వారు ఏం చేస్తారు? అచ్ఛా! ఈసారి ఆస్ట్రేలియా వారు తక్కువగా వచ్చారు. లేకపోతే అన్నింటిలో నంబర్ ఆస్ట్రేలియానే తీసుకుంటుంది. ఈసారి ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు? యు.కె.కు. యు.కె. వారు చాలా మంది వచ్చారు. యు.కె. లక్కీ అయింది. శివరాత్రి ఛాన్స్ యు.కె.కు లభించింది. యు.కె. వారు శ్రమ కూడా బాగా చేశారు. మలేషియా సేవ కూడా మంచి వృద్ధిని పొందుతోంది. మంచివారు. యు.కె. అయితే ఫౌండేషన్గానే ఉంది మరియు అమెరికా సేవా వృద్ధి యొక్క ధ్వనిని వ్యాపింపజేసే పెద్ద మైక్. ఇది అమెరికా యొక్క విశేషత. మరి ఆఫ్రికా యొక్క విశేషత ఏమిటి? ప్రపంచం భయంలో ఉన్నా వీరు నిర్భయంగా ఉండటం ఆఫ్రికా వారి అద్భుతం. రియల్‌గా శ్యామము(నలుపు) నుండి సుందరంగా తయారుచేసేది ఆఫ్రికానే కదా! నిర్భయత వీరి అద్భుతం. చూడండి, ఇద్దరు ఇద్దరు అక్కయ్యలు ఉంటారు, కానీ నిర్భయంగా ఉంటారు. ధైర్యం ఉంచుతారు కదా, అప్పుడు బాబా సహాయం ఉంటుంది. ఆఫ్రికా సేవ కూడా మంచి వృద్ధిని పొందుతోంది. అలాగే విదేశాలలో కూడా ఈ సమయంలో అన్ని వైపులా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు మరియు వృద్ధి బాగున్నాయి. ఇప్పుడు పద్ధతి, విధి వచ్చాయి. ధరణి కూడా మారింది మరియు విధి కూడా వచ్చింది. చూడండి, అన్నింటికంటే తరువాత రష్యా తెరవబడింది, అక్కడి సేవ కూడా ఎంతగా ఉందో చూడండి! రష్యా వారు కూడా వచ్చారు కదా! వీరు ఒకే వైపు కూర్చుంటారు. వీరి యూనిటీ చాలా బాగుంది, ఒకరు ఎక్కడికి వెళ్తే అందరూ అక్కడికి వెళ్తారు. మంచిది, లాస్ట్ సో ఫస్ట్ అవుతున్నారు. మంచి రిజల్ట్ ఉంది. చూడండి, ఇప్పుడు స్థానాలు కూడా లభిస్తున్నాయి. ఇప్పుడు గవర్నమెంట్‌ను ఇంకా మీవారిగా చేసుకుంటూ వెళ్లండి. మంచి ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాలో బాప్‌దాదా యొక్క చాలా-చాలా-చాలా శ్రేష్ఠ ఆశల దీపాలు వెలుగుతున్నాయి. ఆస్ట్రేలియా ఎవరూ చేయని అద్భుతం చేస్తుంది. ఎందుకు అద్భుతం చేస్తారు? కారణం చెప్పండి? ఎందుకంటే ఆస్ట్రేలియాలో అన్ని రకాల బుద్ధి కలవారు ఉన్నారు. ఇన్వెంటర్స్ కూడా ఉన్నారు, కార్యాన్ని, ప్లాన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చే బుద్ధి కూడా ఉంది, అందుకే ఆదిలో కూడా ఆస్ట్రేలియా తన అద్భుతాన్ని చాలా చూపించింది. ఇప్పుడు మధ్యలో కొద్దిగా ప్లాన్ తయారుచేస్తున్నారు. ముందు ముందు ప్రాక్టికల్లోకి రావాల్సిందే. కాబట్టి ఆస్ట్రేలియా వైపు బాప్‌దాదా యొక్క విశేష శ్రేష్ఠ సేవా ఆశల దృష్టి ఉంది. అర్థమైందా? ఈసారి తక్కువగా వచ్చారు కానీ అందరూ వింటారు. అచ్ఛా, డైలాగ్‌కు వచ్చినవారు చేతులు ఎత్తండి. (ఆబూ డైలాగ్‌కు వచ్చిన కొంతమంది అతిథులు కూడా బాప్‌దాదా మురళి వింటున్నారు) ఈ కొద్దిమంది ఆత్మలు మహా భాగ్యవంతులు. డైలాగ్‌కు వచ్చి చాలా మంచి శ్రేష్ఠ మైక్లుగా అయి వెళ్తున్నారు. మెసెంజర్స్గా అయి వెళ్తున్నారు. అందరి మనసులో, మొత్తం గ్రూపు మనసులో ఈ ఉల్లాసం ఉంది - ఎక్కువలో ఎక్కువ మెసేజ్ ఇచ్చి అనేక ఆత్మలకు పరిచయం ఇవ్వాలి మరియు స్వీట్ హోమ్‌కు చేర్చాలి. అలాంటి ఉల్లాసం ఉందా? చేతులు ఎత్తినవారికి ఉల్లాసం ఉందా? అచ్ఛా, వీరు ఎటువంటి భాగ్యవంతమైన ఆత్మలో అందరూ చూశారా! రియల్‌గా అయితే వీరి బర్త్ డే అయిపోయింది. కాబట్టి మెసెంజర్‌గా అయ్యే బర్త్ డేకు అభినందనలు.
అచ్ఛా, యూరప్ ఏం చేస్తుంది? యూరప్ తన అంచలిని యు.కె.లో వేస్తుంది, ఇలా! కానీ మంచిదే, ఏ విశేష దేశమూ మా దేశానికి మీ మెసేజ్ చేరనేలేదు అని ఫిర్యాదు ఇవ్వకుండా ఉండాలి. కాబట్టి ఏయే విశేష దేశాలు ఉన్నాయో, చేరుకోవాల్సింది మూలమూలలకు, కానీ మూలమూలలకు మెసేజ్ తప్పకుండా ఇవ్వండి. ఫిర్యాదు వినాల్సి రాకూడదు. అచ్ఛా! మారిషస్ దేశం పరంగా ఎంత చిన్నదో సేవలో అంత పెద్దది. మారిషస్ యొక్క ఈ విశేషత ఏమిటంటే ఐ.పి.లు కూడా హోమ్లీగా ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ అయినా, మినిస్టర్స్ అయినా హోమ్లీ రూపంలో కలుస్తారు మరియు సహయోగులుగా కూడా అవుతారు. శ్రీలంక వారు చేతులు ఎత్తండి. వీరు భాష కారణంగా కలిసి కూర్చున్నారు. శ్రీలంక పేరే ‘శ్రీ’. శ్రీ అంటేనే మహాన్. కాబట్టి శ్రీలంకలో ఎక్కడ అశాంతి ఉందో అక్కడ శాంతిని స్థాపించడం మరియు శాంతి సందేశం ఇవ్వడం ఎంత శ్రేష్ఠ కార్యం! కాబట్టి శ్రీలంక సందేశం ఇచ్చే శ్రీ-కార్యం చేస్తున్నారు. మిడిల్ ఈస్ట్ కూడా వచ్చింది. దుబాయ్ వారు కూడా వచ్చారు. కొద్దిమందే ఉన్నారు కానీ మహావీరులు. మంచిది, శ్రీలంక అయితే కల్పం క్రితం కూడా లంకను జయించి బ్రాహ్మణులుగా పిలవబడ్డారు. కాబట్టి శ్రీలంకపై విజయం జరగాల్సిందే. మిడిల్ ఈస్ట్ కూడా నెమ్మదిగా ముందుకు వెళ్తోంది. ఎందుకంటే గుప్తంలో కూడా గుప్త వేషం ధరించి సేవ చేయాల్సి వస్తుంది కదా, కాబట్టి డబల్ సేవ చేస్తున్నందుకు అభినందనలు. అయినా బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు - వాతావరణం ఎలా ఉన్నా అచలంగా-నిశ్చలంగా-అవినాశీ రత్నాలుగా ఉన్నారు. ఒక్కొక్క రత్నం అమూల్యమైనది. ఇతర ప్రదేశాలలో సేవ చేయడం సహజం, కానీ ఇక్కడ సేవను డబల్ గుప్త రూపంలో చేయాల్సి వస్తుంది. అయినా ధైర్యవంతులు. ధైర్యాన్ని వదిలేవారు కాదు. అచలంగా-నిశ్చలంగా ఉండే ఆత్మలు. అందుకే బాప్‌దాదా ధైర్యవంతులైన పిల్లలకు పదమారెట్లు సహాయం యొక్క అభినందనలు ఇస్తున్నారు. అచ్ఛా. కరీబియన్‌లో ఫౌండేషన్ అయితే బాగా పడింది. ఇప్పుడు కరీబియన్‌లో ఎన్ని సెంటర్స్ అయ్యాయి? (10-12) అయినా ధైర్యం బాగా ఉంచారు. భక్తి విస్తారంలో జ్ఞానీ తూ ఆత్మలుగా తయారుచేయడంలో మంచి ధైర్యం ఉంచారు మరియు బ్రాహ్మణులు కూడా మంచి వృద్ధిని పొందుతున్నారు. ప్రారంభం నుండి ఆదిలో వచ్చినవారు చాలా బాగా నడుస్తున్నారు. ఎక్కువ అలజడిలోకి రాలేదు. ఇది కూడా మంచి రికార్డ్. కరీబియన్ కూడా తక్కువ కాదు, అద్భుతం చేసేది. అచ్ఛా! ఎక్కడివారైనా సరే, అందరూ బాబాకు సమీపంగా మరియు సికీలధే పిల్లలే. బాప్‌దాదా అమృతవేళ నలు వైపులా ఉన్న అమూల్య రత్నాలను చూసి చూసి హర్షితులవుతారు. ఎవరిని చూసినా ఒకరికంటే ఒకరు ముందున్నారు. ఎందుకు? ప్రతి ఒక్కరికీ తమ తమ విశేషత ఉంది.
నలువైపులా ఉన్న అమూల్యమైన విశేష రత్నాలకు, సదా ప్రతి రోజూ ఉత్సాహంతో ఉత్సవాన్ని జరుపుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వస్థితి మరియు సేవ యొక్క ఉన్నతిలో బ్యాలెన్స్ ఉంచే దీవెనలకు అధికారీ ఆత్మలకు, సదా పరిస్థితిని సహజముగా దాటివేసే ఇటువంటి అచలమైన, స్థిరమైన మహావీర్ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
టీచర్లతో:- టీచర్లకు విశేషంగా బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం సేవ యొక్క రిజల్ట్‌లో టీచర్లు మంచి శ్రమ చేసారు. అందుకే ప్రత్యక్షఫలంగా బాబా యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. అర్థమైందా! టీచర్లను, సంతోషంగా ఉన్నారా అని అడగవలసిన అవసరం లేదు. సంతోషంగా ఉన్నారు మరియు సంతోషపరిచేందుకు నిమిత్తంగా ఉన్నారు. కనుక ఎవరైతే ఇతరులను సంతోషపరుస్తారో వారు స్వయంగా తప్పకుండా సంతోషంగా ఉంటారు. టీచర్ అనగా నిశ్చలంగా-అమరంగా ఉండేవారు. కనుక అమరంగా కూడా ఉన్నారు మరియు నిశ్చలంగా కూడా ఉన్నారు. అలాగే ఉన్నారా! లేక అప్పుడప్పుడు సంతోషం కొద్దిగా తగ్గుతుందా? లేదు, అలా జరగనే జరగదు. అంతటి నిశ్చయం ఉంది.
దాదీ జానకితో:- ప్రకృతిజీత్ కదా! ప్రకృతి పని కదిలించడం మరియు మీ పని ప్రకృతిని కదిలించడం. మంచిది, ప్రేమతో రెస్ట్ తీసుకోకపోతే బలవంతంగానైనా చేయిస్తారు. ఏమిటంటే, వీరికి సేవ పట్ల చాలా ప్రేమ ఉంది. ఉల్లాసం ఉంది, ఎవరూ మిగిలిపోకూడదు, ఎవరూ మిగిలిపోకూడదు. అలాగే కదా! (బాబా తమ దగ్గర కూర్చోబెట్టుకున్నారు) తోడుగా ఉంటారు కదా, కనుక తోడుగానే కూర్చోబెట్టుకుంటారు. మంచిది, కొత్త-కొత్త ఇన్వెన్షన్లు వెలువడతాయి. ఏమీ ఫర్వాలేదు. రెస్ట్ కూడా, ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేసేందుకే లభిస్తుంది. అందుకే మీకు ఏదైనా కొత్త విషయం లభిస్తుంది. దాదీలను చూసి అందరికీ చాలా సంతోషం కలుగుతుంది కదా. అందరి స్నేహం కూడా సేవ యొక్క ప్రత్యక్షఫలమే. కనుక రోజంతటిలో ఎన్ని ఫలాలు లభిస్తున్నాయి! ఎవరైతే చూస్తారో వారు ఏ దృష్టితో చూస్తారు? అందరి హృదయం నుండి వాహ్ దాదీ వాహ్, వాహ్ దాదీ వాహ్ అని వెలువడుతుంది. ఇది కూడా సేవ యొక్క ఫలమే. ఎంతగా ఎవరైతే స్నేహంతో, నిస్వార్థంగా సేవ చేస్తారో వారికి ప్రత్యక్ష ఫలం సదా లభిస్తుంది మరియు అందరి నుండి లభిస్తుంది. అందరి హృదయం నుండి, మా దాదీ అని వెలువడుతుంది, లేక వీరు లండన్ దాదీ, వీరు మధుబన్ దాదీ అని అంటారా? అందరికీ దాదీలే. ఎవరైతే విశ్వ అధికారులుగా అవుతారో వారిని ఇప్పటి నుండే అందరూ, అందులోనూ విశేషంగా బ్రాహ్మణులు తమవారిగా భావిస్తారు. మంచిది, బాగున్నారా? అంతా చాలా బాగుంది! చెడుగా అయితే ఉండనే ఉండదు. ఇప్పుడు కేవలం మధ్య-మధ్యలో కొద్దిగా రెస్ట్ తీసుకోండి, మిగిలినదంతా బాగుంది. ఉల్లాస-ఉత్సాహాలు ఉంచుకోవడం ద్వారా ఇతరుల ఉల్లాస-ఉత్సాహాలు కూడా పెరుగుతూ ఉంటాయి. కేవలం ఎగిరేవారు మాత్రమే కాదు, ఎగిరించేవారు కూడా. వారంలో సగం రోజు లేదా ఒక రోజు రెస్ట్ కోసం ఉంచుకోండి, అప్పుడు మీ తనువు చాలా సహాయం చేస్తుంది. ఇప్పుడు కొంత సమయం రెస్ట్ కావాలి. ఇంతమంది రైట్ హ్యాండ్స్ తయారయ్యారు, అన్ని దేశాలలో రైట్ హ్యాండ్స్ ఉన్నారు. కనుక రైట్ హ్యాండ్స్‌ను చేయనివ్వండి. కేవలం బ్యాక్‌బోన్‌గా ఉండండి. పాత-పాత ఆది రత్నాలు కూడా చాలా మంది వచ్చారు. 20 సంవత్సరాల వారు చేతులు ఎత్తండి. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులు ఎత్తండి. ఫస్ట్ టైమ్ వారికి విశేషంగా అభినందనలు. మంచి-మంచి వారు వచ్చారు. ఇప్పుడు అమర భవ అనే వరదానాన్ని సదా తోడుగా ఉంచుకోండి. ఓం శాంతి.
(పిల్లలు బాప్‌దాదాతో కలిసి శివ జయంతిని జరుపుకున్నారు, పాటలు పాడారు, కొవ్వొత్తులు వెలిగించారు, కేక్ కట్ చేసారు. బాప్‌దాదా స్టేజ్‌పై నిలబడి తమ హస్తాలతో జెండాను ఎగురవేసి అందరికీ అభినందనలు ఇచ్చారు)
ఈ జెండాను ఎగురవేయడానికి ముందు అందరి హృదయాలలో స్నేహం యొక్క జెండా ఎగురుతూ ఉండటాన్ని చూసి-చూసి హర్షిస్తున్నాము. మొదట అందరి హృదయాలలో స్నేహం యొక్క, సేవ యొక్క జెండా ఉంది, తరువాత ఇది మీ అందరి స్మృతిచిహ్నము. అందరి సంతోషకరమైన ముఖాలు మొత్తం విశ్వంలో సంతోషాలను వ్యాపింపజేస్తున్నాయి. సంతోషాల వైబ్రేషన్స్ నలువైపులా విశ్వంలోకి వెళ్తున్నాయి. ఇలాగే సదా సంతోషాల వైబ్రేషన్స్ ఇస్తూ ఉండండి మరియు బాబా యొక్క ప్రాక్టికల్ ప్రత్యక్షతా జెండాను ఎగురవేస్తూ ఉండండి. అచ్ఛా!
*** ఓంశాంతి ***
