‘‘సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మలకు గుర్తు - సంతుష్టత మరియు ప్రసన్నత’’
ఈరోజు సర్వ ప్రాప్తులను కలిగించే బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న ప్రాప్తి సంపన్నులైన పిల్లలను చూస్తున్నారు. మీరు సర్వ ప్రాప్తుల దాత, సంపన్నమైన మరియు సంపూర్ణమైన తండ్రికి పిల్లలు, కావున పిల్లలు ప్రతి ఒక్కరికీ తండ్రి సర్వ ప్రాప్తుల వారసత్వాన్ని ఇచ్చారు. కొందరికి 10 ఇచ్చి, కొందరికి 20 ఇచ్చారు అని కాదు. పిల్లలందరికీ సర్వ ప్రాప్తుల యొక్క అధికారాన్ని ఇచ్చారు. పిల్లలందరూ పూర్తి వారసత్వానికి అధికారులు. అధికారులైన పిల్లలు ప్రతి ఒక్కరూ స్వయములో ప్రాప్తుల యొక్క అధికారాన్ని ఎంతగా ప్రాప్తి చేసుకున్నారు అని బాప్‌దాదా చూస్తున్నారు. తండ్రి అన్నింటినీ ఇచ్చారు. తండ్రిని సర్వ శక్తిమంతుడు మరియు సంపన్న సాగరుడు అని అంటారు. కానీ పిల్లలు ఆ ప్రాప్తులను ఎంతవరకు తమవిగా చేసుకున్నారు? తండ్రి ద్వారా ఇవ్వబడిన వారసత్వాన్ని ఎప్పుడైతే తమదిగా చేసుకుంటారో, అప్పుడు ఎంతగా తమదిగా చేసుకుంటారో అంతగా - ఇది నా ఖజానా అని నషా మరియు సంతోషము ఉంటుంది. ఇచ్చింది తండ్రియే కానీ స్వయములో ధారణ చేసి తమదిగా చేసుకున్నారు. మరి ఏం చూసారు? తమదిగా చేసుకోవడంలో నంబరువారుగా అయిపోయారు. తండ్రి నంబరు తయారుచేయలేదు, కానీ తమ తమ ధారణ యొక్క యథా శక్తి అనేది నంబరువారుగా తయారుచేసింది. ఏ ఆత్మ అయితే సంపూర్ణ అధికారము మరియు సర్వ ప్రాప్తులతో సంపన్నమై, సదా అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రాప్తుల నషా మరియు అనుభవములో ఉంటుందో, ఆ ఆత్మ యొక్క గుర్తు ఏమిటి? ప్రాప్తులకు గుర్తు సంతుష్టత. వారు సదా సంతుష్టమణులుగా అయి ఇతరులకు కూడా సంతుష్టతా ప్రకాశం యొక్క వైబ్రేషన్లను వ్యాపింపజేస్తూ ఉంటారు. వారి ముఖము సదా ప్రసన్నచిత్తముగా కనిపిస్తుంది. ప్రసన్నచిత్తము అనగా సర్వ ప్రశ్నచిత్తము నుండి అతీతంగా ఉండడము. ఎటువంటి ప్రశ్నలు ఉండవు, ప్రసన్నంగా ఉంటారు. ఎందుకు, ఏమిటి, ఎలా - ఇవన్నీ సమాప్తమైపోతాయి. మరి ఇటువంటి ప్రసన్నచిత్తులుగా అయ్యారా? లేక ఇప్పుడు కూడా - ఇది ఏమిటి, ఇది ఎందుకు, ఇది ఎలా అవుతుంది, ఎప్పుడు అవుతుంది అనే ఈ ప్రశ్నలు అప్పుడప్పుడు కలుగుతున్నాయా? ఈ ప్రశ్నలు మనస్సులోనైనా లేక ఇతరుల ద్వారానైనా ఉత్పన్నమవుతున్నాయా? ప్రశ్నచిత్తులుగా ఉన్నారా లేక ప్రసన్నచిత్తులుగా ఉన్నారా? లేక అప్పుడప్పుడు ప్రశ్నచిత్తులుగా మరియు అప్పుడప్పుడు ప్రసన్నచిత్తులుగా ఉన్నారా? ఎలా ఉన్నారు? బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు అన్న గాయనం ఉంది. ఇది ఏ బ్రాహ్మణుల గాయనము? ఇది మీదా లేక ఇతరులు ఎవరైనా రానున్నారా? మీరే కదా! మరి అప్రాప్తి కలిగినప్పుడు అప్రాప్తి అనేది అసంతుష్టతకు కారణము. మీ అనుభవాన్ని చూడండి - ఎప్పుడైనా మనస్సు అసంతుష్టంగా అయినప్పుడు దానికి కారణం ఏమిటి? ఏదో ఒక అప్రాప్తిని అనుభవం చేస్తారు, అప్పుడే అసంతుష్టత ఏర్పడుతుంది. అప్రాప్తి అనే వస్తువేది లేదు అన్న గాయనమైతే ఉంది. ఇది ఇప్పటి గాయనమా లేక వినాశన సమయానికి సంబంధించిన గాయనమా? వినాశన సమయంలో సంపన్నంగా అవుతారా లేక ఇప్పుడే అవ్వాలా? మేము సదా ప్రసన్నచిత్తులుగా ఉంటాము, ఎప్పుడూ ఏ విషయంలోనూ తమకు సంబంధించి అయినా లేక ఇతరులకు సంబంధించి అయినా ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు, సదా సంతుష్టంగా ఉంటాము అని ఎవరైతే భావిస్తున్నారో, అటువంటి సంతుష్ట ఆత్మలు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారా! అచ్ఛా! ఎవరైతే - సదా ప్రసన్నంగా ఉంటాము, మాయ ఎంత కదిలించినా కానీ మేము చలించము, మాయనే చలింపజేస్తాము, మాయ నమస్కారం చేస్తుంది, మేము అంగదులము, మాయ ఓడిపోతుంది కానీ మేము విజయులుగా ఉంటాము అని భావిస్తారో, వారు చేతులెత్తండి, సదా అన్న పదాన్ని గుర్తుంచుకోండి, అప్పుడప్పుడు వారు కాదు. చాలా కొద్దిమంది ఉన్నారు, కోట్లాది మందిలో కొందరు ఉన్నారు. ప్రశ్నార్థకమైతే ఉత్పన్నమవుతుంది కదా. ప్రశ్నార్థకము డిక్షనరీ నుండి తొలగిపోవాలి. అలజడి కూడా కలగకూడదు. కంప్యూటర్ వాడుతున్నప్పుడు అందులో వస్తుంది కదా? మీ బుద్ధి రూపీ కంప్యూటర్లో సదా ఫుల్స్టాప్ చిహ్నము రావాలి. ప్రశ్నార్థక చిహ్నము, ఆశ్చర్యార్థక చిహ్నము సమాప్తమైపోవాలి. అటువంటివారినే సదా ప్రసన్నచిత్తులు అని అంటాము. ఇటువంటి ప్రసన్నచిత్తులు ఇతరుల ప్రశ్నార్థకాలను కూడా సమాప్తం చేసేస్తారు. లేదంటే స్వయంలో ఒకవేళ ప్రశ్నార్థక చిహ్నము ఉంటే, ఏ విషయాన్ని అయినా విన్నప్పుడు, చూసినప్పుడు ఇలా అంటారు - అవును, ఇదైతే జరగకూడదు కానీ జరుగుతుంది, నేను కూడా అర్థం చేసుకున్నాను, జరగకూడదు - ఇలా అన్నీ మిక్స్ అయిపోతాయి. ఇతరుల ప్రశ్నలకు వారు ఇంకా అండర్ లైన్ చేస్తారు. అవును, ఇది సరికాదు, కానీ జరుగుతుంది... అని దానికి ఆధారాన్ని అయితే ఇచ్చేసారు కదా. కావున వారు ఇతరులను ప్రసన్నచిత్తులుగా చెయ్యటానికి బదులుగా ఇంకా ప్రశ్నలను పెంచేసారు. ఎడిషన్ అయిపోయింది. వాస్తవానికి ఒక్కరి ప్రశ్నగా ఉండేది, ఇప్పుడు ఇద్దరిదిగా అయింది, ఇద్దరి నుండి నలుగురిదిగా అవుతుంది. ప్రసన్నచిత్త వైబ్రేషన్ బదులుగా ప్రశ్నచిత్త వైబ్రేషన్ త్వరగా వ్యాపిస్తుంది. అవునా! అలా జరిగిందా... అని తోడును అందించేసారు. అవునా! అని ఆశ్చర్యార్థకము వచ్చేసింది కదా. మరి ఫుల్స్టాప్ అయితే అవ్వలేదు కదా. స్వయం పట్లనైనా - ఇది నాకు జరగకూడదు, ఇది నాకు లభించాలి, ఇది ఇతరులకు జరగకూడదు... కావున ఈ కావాలి, కావాలి అన్నది ప్రశ్నచిత్తులుగా చేసేస్తుంది, ప్రసన్నచిత్తులుగా కాదు. మరి అందరి లక్ష్యము ఏమిటి? సంతుష్టత, ప్రసన్నచిత్తత.
ఎవరి చిత్తమైతే ప్రసన్నముగా ఉంటుందో, వారి మనస్సు-బుద్ధి యొక్క వ్యర్థపు గతి వేగంగా ఉండదు. సదా నిర్మలంగా, నిర్మానంగా ఉంటారు. నిర్మానంగా ఉన్న కారణంగా తమ ప్రసన్నచిత్తత యొక్క ఛాయలో అందరికీ శీతలతను ఇస్తారు. అగ్ని సమానంగా కాలిపోతున్నటువంటి, చాలా వేడెక్కిన బుద్ధి కలిగి ఉన్నటువంటి వారైనా కానీ, ప్రసన్నచిత్త వైబ్రేషన్ల ఛాయలో శీతలంగా అయిపోతారు. బలహీనత ఏమిటి వస్తుంది? మామూలుగా సరిగ్గానే నడుస్తారు, తమదైన రీతిలో మంచిగా నడుస్తారు, కానీ ఎప్పుడైతే సంబంధ-సంపర్కాలలోకి వస్తారో, అప్పుడు ఇతరుల యొక్క బలహీనతను చూస్తూ, వింటూ, వర్ణన చేస్తూ ప్రభావంలోకి వచ్చేస్తారు. అప్పుడు - వీరు చేసారు కదా, కాబట్టే నా ద్వారా కూడా జరిగిపోయింది అని అంటారు. వీరు అన్నారు, అందుకే నేను కూడా అన్నాను. వారు యాభై సార్లు అన్నారు, నేను ఒక్క సారే అన్నాను. మళ్ళీ తండ్రి ముందు కూడా చాలా మధురాతి-మధురమైన మాటలను ఉంచుతారు, ఇలా అంటారు - బాబా, మీరు అర్థం చేసుకోండి కదా, ఇంతగా సహనం ఎంతవరకు చేస్తాము! ఎంతైనా పురుషార్థులము కదా, కావున ఎంతోకొంత వస్తుంది కదా! తండ్రికి కూడా అర్థం చేయించడం మొదలుపెడతారు. ఇక్కడ ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, వారికి ఎన్నో కథలను వినిపిస్తారు. ఇలా ఉంది కదా, అలా ఉంది కదా, ఇలా ఉంది కదా... ఇలా ఉంది -ఇలా ఉంది అనే మాలను జపిస్తూ ఉంటారు. బాప్‌దాదా సదా సూచనను ఇస్తూ ఉంటారు - ఇటువంటి విషయాలను కేవలం రెండు పదాలలో వర్ణన చేయండి. ఎక్కువగా వర్ణన చేయకండి ఎందుకంటే ఈ వ్యర్థమైన విషయాలు చాలా రుచికరంగా ఉంటాయి. ఆసక్తికరంగా అనిపిస్తాయి. ఎలాగైతే తినే పదార్థాలలో కూడా కాస్త తియ్యగా, పుల్లగా ఉండేవి మంచిగా అనిపిస్తాయి కదా మరియు చప్పగా, సాధారణంగా ఉంటే ఇవైతే తింటూనే ఉంటాము అని అంటారు. అలాగే వ్యర్థమైన విషయాలను, వ్యర్థ చింతనను - వినడము, మాట్లాడడము మరియు చేయడము... ఇందులో నడుస్తూ, నడుస్తూ ఇంటరెస్ట్ పెరిగిపోతుంది. మళ్ళీ ఆలోచిస్తారు - నేను కోరుకోవడం లేదు కానీ వారు వినిపించారు కదా, కావున సరే విందాములే, వారి మనస్సును తేలిక చేద్దాము అని నేను అనుకున్నాను. వారి మనస్సు అయితే ఖాళీ అయ్యింది కానీ మీరు మనస్సును నింపుకున్నారు. అలా కొద్ది-కొద్దిగా మనస్సులో నింపుకుంటూ-నింపుకుంటూ అది ఇక సంస్కారంగా అయిపోతుంది మరియు ఎప్పుడైతే సంస్కారంగా అవుతుందో, అప్పుడిక ఇది తప్పు అని కూడా అనిపించదు. ఈ వ్యర్థ సంస్కారాలు బుద్ధి యొక్క నిర్ణయాన్ని సమాప్తం చేసేస్తాయి. అందుకే సదా సంతుష్టంగా ఉండేందుకు అన్నింటికన్నా సహజమైన విధి - సదా మీ ముందు ఏదో ఒక విశేష ప్రాప్తిని ఉంచుకోండి ఎందుకంటే ప్రాప్తిని ఎప్పుడూ మర్చిపోలేరు. జ్ఞానం పాయింట్లను మర్చిపోవచ్చు కానీ ఏ ప్రాప్తులనూ మర్చిపోరు. తండ్రి ద్వారా ఏమేమి లభించాయి, ఎంత లభించాయి... వెరైటీ ఇష్టమనిపిస్తుంది కదా! ఒకే విధంగా ఉంటే ఇష్టమనిపించదు. కావున మీరు మీ ప్రాప్తులను చూడండి - జ్ఞాన ఖజానా యొక్క ప్రాప్తి ఎంత ఉంది, యోగము ద్వారా శక్తుల యొక్క ప్రాప్తి ఎంత ఉంది, దివ్య గుణాల ప్రాప్తి ఎంత ఉంది, ప్రాక్టికల్‌గా నషాలో, సంతోషంలో ఉండే ప్రాప్తులు ఎన్ని ఉన్నాయి? చాలా పెద్ద లిస్ట్ ఉంది కదా! ఇంతకుముందు కూడా వినిపించాము - ఒకసారి ఒక గుణాన్ని, ఒకసారి మరొక గుణం యొక్క ప్రాప్తిని ఎదురుగా ఉంచుకుంటూ సంతుష్టంగా ఉండండి ఎందుకంటే ఒక్క గుణాన్ని తమదిగా చేసుకున్నా - ఏ విధంగా వికారాలకు పరస్పరం చాలా లోతైన సంబంధం ఉందో, ఒకవేళ బాహ్య రూపంలో క్రోధము ప్రత్యక్షమైనా ఆంతరిక రూపంలో పరిశీలించినట్లయితే క్రోధంతోపాటు లోభము మరియు అహంకారము కూడా తప్పకుండా ఉంటాయి. ఇవన్నీ పరస్పరంలో సహచరులు. కొన్ని ఇమర్జ్ రూపంలో ఉంటాయి, కొన్ని మర్జ్ రూపంలో ఉంటాయి. అలాగే గుణాలు కూడా ఏవైతే ఉన్నాయో, వాటికి కూడా పరస్పరంలో సంబంధం ఉంది. ఒక్క గుణాన్ని ఇమర్జ్ రూపంలో ఉంచుకున్నా కానీ, ఇతర గుణాలు కూడా దానితోపాటు మర్జ్ రూపంలో ఉంటాయి. కావున రోజూ ఏదో ఒక ప్రాప్తి స్వరూపం యొక్క అనుభవాన్ని తప్పకుండా చేయండి. ఒకవేళ ప్రాప్తి ఇమర్జ్ రూపంలో ఉన్నట్లయితే ప్రాప్తి ఎదురుగా అప్రాప్తి సమాప్తమైపోతుంది మరియు సదా సంతుష్టంగా ఉంటారు. మామూలుగా చూడండి, ప్రపంచంలో కూడా అందరూ ఏ ముఖ్య ప్రాప్తిని కోరుకుంటారు?
ప్రతి ఒక్కరూ తమ పేరు మంచిగా ఉండాలని, రెండవది గౌరవము, మూడవది ప్రతిష్ట బాగుండాలని కోరుకుంటారు. పేరు, గౌరవం, ప్రతిష్ఠ - వీటిని ప్రాప్తి చేసుకోవాలని అనుకుంటారు. మీరు కూడా ఏం కోరుకుంటారు? మీరు కూడా ఇదే కోరుకుంటారు కదా! కానీ హద్దులో కాదు, అనంతములో. కావున ప్రపంచంలోని వారు హద్దులోని పేరు వెనుక పరిగెడుతూ ఉంటారు మరియు మీ పేరు విశ్వంలో ఎంత ఉన్నతంగా ఉంటుందో అంతగా ఇంకెవరికైనా ఉంటుందా? మరి మీరు మీ పేరును చూడండి. అన్నింటికన్నా పేరు యొక్క విశేషత ఏమిటంటే మీ పేరును ఎవరు జపిస్తారు? స్వయంగా భగవంతుడు మీ పేరును జపిస్తారు! మరి ఇంతకన్నా పెద్ద పేరు ఇంకేముంటుంది! మీ పేరుతో ఇప్పుడు చివరి జన్మలో కూడ అనేక ఆత్మలు తమ శరీర నిర్వహణను నడిపిస్తున్నారు. మీరు బ్రాహ్మణులు కదా, మరి బ్రాహ్మణుల పేరుతో ఈ రోజు కూడా నామమాత్రపు బ్రాహ్మణులు ఎంతగా సంపాదిస్తున్నారు! ఇప్పటివరకు కూడా నామమాత్రపు బ్రాహ్మణులు ఎంత ఉన్నతంగా గానం చేయబడతారు! కావున మీ పేరుకు ఎంత మహిమ ఉంది. ఇంతటి శ్రేష్ఠమైన పేరు మీది అయ్యింది, అందుకే హద్దులోని పేరు-ప్రతిష్టల వెనుక పరిగెత్తకండి. నా పేరును ఎప్పుడూ ఎందులోనూ తీసుకోనే తీసుకోరు, నా పేరు సదా వెనుకే ఉంటోంది, సేవ నేను చేస్తాను, పేరు ఇతరులకు వస్తుంది... ఇలా హద్దులోని పేరు వెనుక పరిగెత్తకండి. తండ్రి హృదయంలో మీ పేరు సదా శ్రేష్ఠంగా ఉంది. తండ్రి హృదయంలో మీ పేరు ఉన్నప్పుడు, ఏదైనా సేవలో లేక ఏదైనా ప్రోగ్రాంలో లేక ఏవైనా విషయాలలో మీ పేరు రాకపోయినా అందులో ఏముంది, తండ్రి వద్దనైతే ఉంది కదా! ఏ విధంగా భక్తి మార్గంలో హనుమంతుని చిత్రాన్ని చూపిస్తారు కదా, వారి హృదయంలో ఎవరు ఉన్నారు? రాముడు ఉన్నారు. అలాగే తండ్రి హృదయంలో ఎవరు ఉన్నారు? (పిల్లలు). మరి ఆ పిల్లలలో మీరు ఉన్నారా, లేరా? మరి అందరి పేర్లూ ఉన్నాయా! చూసారా? పక్కాయేనా? ఎప్పుడైనా మిస్ అయితే! మీ అందరి పేర్లు ఉన్నాయి! మరి వేరే పేరు వెనుక ఎందుకు పడుతున్నారు? ఎందుకంటే చాలా వరకు ఈ పేరు-ప్రతిష్ఠలు, గౌరవాలే కింద పడేస్తాయి, అలాగే ఈ పేరు-ప్రతిష్ఠలు, గౌరవాలే నషా కూడా ఎక్కిస్తాయి. కావున ప్రాప్తి యొక్క రూపంలో చూడండి. ఒకవేళ ఏదైనా కారణం వలన మీ పేరు గుప్తంగా ఉంది, కానీ మీరు నా పేరు ఉండాలి, అది యథార్థము అని భావిస్తున్నారు, ఏ ఆత్మతో అయినా ఉన్న లెక్కాచారాల కారణంగా లేక వారి సంస్కారాల కారణంగా మీ పేరు రావడం లేదు, మీరు రైటైనా వారు రాంగైనా వారికి పేరు వస్తుంది, మీకు కాదు, అయినా కానీ విజయ మాలలో మీ పేరు నిశ్చితమవుతుంది. అందుకే దీని గురించి కూడా చింతించకండి. ఈ రూపంలో మాయ ఎక్కువగా వస్తుంది. అందుకే ఇప్పుడు పొరపాటుగా పేరు మిస్ అయినా నష్టమేమీ లేదు. కానీ విజయమాలలో మీ పేరు మిస్ అవ్వ లేదు. మొదట మీ పేరే ఉంటుంది. కావున మీ పేరు యొక్క మహిమను గుర్తుంచుకోండి - నా పేరు తండ్రి హృదయంలో ఉంది, విజయమాలలో ఉంది, అంతిమం వరకు నా పేరు సేవ చేస్తోంది.
మరియు మీకు ఎంత గౌరవం ఉంటుంది? భగవంతుడు కూడా మిమ్మల్ని తమ కన్నా ముందు ఉంచారు! మొదట పిల్లలు. కావున స్వయంగా తండ్రియే గౌరవాన్ని ఇచ్చారు. ఎంతగా మీకు గౌరవం ఉంది, దాని ప్రమాణమును చూడండి, మీ జడ చిత్రాలకు కూడా చివరి జన్మ వరకు ఎంతటి గౌరవం ఉంది! వారికి తెలిసినా, తెలియకపోయినా, ఏ దేవీ-దేవతా చిత్రాలు ఉన్నా ఎంత గౌరవంగా వాటిని చూస్తారు! అన్నింటికన్నా శ్రేష్ఠమైన గౌరవము ఇప్పటివరకు మీ చిత్రాలకు కూడా లభించింది. ఇదే ప్రమాణము. మరి మీ చిత్రాలే ఇంత గౌరవనీయంగా, పూజనీయంగా ఉన్నాయంటే, ఎవరి పట్లనైతే గౌరవము ఉంచుతారో, వారిని పూజనీయులుగా భావించడం జరుగుతుంది. వీరు మా పూజ్యనీయులు, పూజ్యులు అని ఎల్లప్పుడూ అంటారు కదా. మీ చిత్రాలకు కూడా గౌరవం ఉంది, చైతన్యములో ఉంది కావుననే చిత్రాలకు కూడా గౌరవముంది, ఇదే ప్రాక్టికల్ ప్రూఫ్. ఒకవేళ చైతన్యంలో గౌరవం లేకపోతే చిత్రాలకు ఎలా లభిస్తుంది? తండ్రి అయితే సదా - మొదట పిల్లలు అని అంటారు. పిల్లలకు డబుల్ పూజ లభిస్తుంది, తండ్రికి సింగిల్ పూజ లభిస్తుంది. మరి మీ గౌరవము తండ్రి కన్నా ఎక్కువగా ఉన్నట్లే కదా! ఇంతటి శ్రేష్ఠమైన గౌరవం లభించింది! కావున ఎప్పుడైనా ఏదైనా హద్దులోని గౌరవం యొక్క విషయం వస్తే ఇలా ఆలోచించండి - ఆత్మల గౌరవం ఏం చేస్తుంది, నాకు స్వయంగా పరమాత్ముని గౌరవమే లభించింది. మేము ఇంత చేసినా గౌరవం ఇవ్వరు, అడగనే అడగరు అని ఈ విధంగా ఆలోచించకండి! ఇలా ఆలోచించడం వ్యర్థము ఎందుకంటే ఎంతగా మీరు హద్దులోని గౌరవాల వెనుక పరిగెడతారో, ఈ హద్దులోని విషయాలన్నీ నీడ వంటివి. నీడ వెనుక పరిగెత్తడం ద్వారా ఎప్పుడైనా నీడ లభిస్తుందా, లేక ఇంకా ముందుకు వెళ్తూ ఉంటుందా? కావున ఈ హద్దులోని పేరు, ఈ హద్దులోని గౌరవము - ఇవి నీడ వంటివి. ఇవి మాయ యొక్క ఎండలో కనిపిస్తాయి కానీ నిజానికి అవేమీ కావు. కావున పేరు కూడా మీకు లభించింది, గౌరవం కూడా లభించింది మరియు ప్రతిష్ఠ ఎంతగా ఉంది! మీ ఒక్కొక్క ప్రతిష్టను గుర్తు చేసుకోండి మరియు ఎవరు మిమ్మల్ని ఇంతటి ప్రతిష్టలో కూర్చోబెట్టారు? తండ్రి కూర్చోబెట్టారు. మీరు తండ్రి హృదయ సింహాసనాధికారులు. అన్నింటికన్నా పెద్ద ప్రతిష్ట - రాజ్య పదవి కదా! కావున మీకు సింహాసనము, కిరీటము లభించాయి కదా! ఎవరైతే పరమాత్మ సింహాసనాధికారులుగా ఉన్నారో, వారికి ఇంతకన్నా గొప్ప ప్రతిష్ట ఏముంటుంది!
అప్పుడప్పుడు నిర్ణయం తీసుకోవడంలో ఒక చిన్న పొరపాటు చేసేస్తారు. నిజమైన ప్రతిష్ట ఏదైతే ఉందో, ఆత్మిక ప్రతిష్ట ఏదైతే ఉందో, అది ఎప్పుడూ అభిమానం యొక్క ఫీలింగ్‌ను ఇవ్వదు. అప్పుడప్పుడు ఏం చేస్తారు? వాస్తవానికి ఉండేది అభిమానము కానీ - మా ఈ ప్రతిష్ఠను అయితే ఉంచాలి, ఇంతటి గౌరవాన్ని అయితే ఉంచాలి కదా అని భావిస్తారు, ప్రతిష్ఠలో ఉండడం మంచిది, కానీ అది ప్రతిష్ఠయా లేక అభిమానమా అన్నదానిని మంచి రీతిలో చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు అభిమానాన్ని ప్రతిష్ఠగా భావిస్తారు, అప్పుడిక నిర్మానచిత్తులుగా ఉండరు. మీరు మీ ప్రతిష్టను రియల్‌గా భావిస్తారు కానీ ఇతరులు ఇది అభిమానము అని భావిస్తారు, కొద్దిగా ఏమైనా అన్నా మీకు అవమానంగా అనిపిస్తుంది. అభిమానం కలవారికి అవమానము చాలా త్వరగా ఫీల్ అవుతుంది. కొద్దిగా అయినా ఎవరైనా హాస్యానికి ఏమైనా అన్నా కూడా అది అవమానంగా అనిపిస్తుంది. ఇది అభిమానానికి గుర్తు. లేదు, నేను అయితే అలా లేను, ఇలా అనవచ్చా అని ఆలోచిస్తారు. మరి సరైన నిర్ణయాన్ని తీసుకోండి. ఆ సమయంలో నిర్ణయంలో పొరపాటు చేస్తారు. యథార్థానికి బదులుగా మిక్స్ అవుతుంది మరియు మీరు దానిని యథార్థంగా భావిస్తారు. కావున - వీరు చాలా మంచివారు కానీ, వీరి మాటలు, లేవడము, కూర్చోవడము అదంతా అభిమానంగా అనిపిస్తుంది - అని అందరూ అంటారు. ఇలా ఎవరైనా అన్నా అందులో అవమానపు ఫీలింగ్ వచ్చేస్తుంది. మరి స్వమానము మరియు అభిమానం యొక్క తేడాను కూడా చెక్ చేసుకోండి. స్వమానము ఎంత పెద్దది, ప్రతిష్ట ఎంత పెద్దది, ఆ అనంతమైన పేరు, గౌరవం మరియు ప్రతిష్ఠను సదా ఇమర్జ్ రూపంలో ఉంచుకోండి. మర్జ్ కాదు, ఇమర్జ్ చేయండి. ఏ విధంగా స్మృతిలో అప్పుడప్పుడు నిర్లక్ష్యం వస్తే - మేము ఉన్నదే తండ్రికి చెందినవారిగా, ఇక స్మృతి ఏం చేయాలి... అని అంటారు. కానీ ఇమర్జ్ సంకల్పాలతో ప్రాప్తి యొక్క అనుభవం కలుగుతుంది. అలాగే ప్రతి ధారణలోనూ అలర్ట్‌గా ఉండండి, నిర్లక్ష్యులుగా అవ్వకండి ఎందుకంటే సమయం సమీపంగా వస్తుంది మరియు సమయము సమీపంగా రావడమనేది ఏ సూచనను ఇస్తుంది? సమానంగా అవ్వండి, సంపన్నంగా అవ్వండి. కావున సమయం యొక్క ఛాలెంజ్‌ను చూడండి. మీకు ఎటువంటి అప్రాప్తి అనేది లేదు. మీకు లభించిన ప్రాప్తి ఏమిటి? ఒకవేళ స్థూలరీతిగా చూస్తే ఆరోగ్యం కావాలి, సంపద కావాలి, సంబంధాలు కావాలి - ప్రాప్తిలో ఇవే కావాలి కదా! మరి మీ ఆత్మ ఎంత ఆరోగ్యంగా ఉంది? ఆత్మకు లో బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ ఉంటాయా? కాదు, సదా ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే అమృతవేళ ప్రతి రోజూ బాప్‌దాదా “సదా స్వస్థ భవ” అనే వరదానం ఇస్తారు. శరీరానికి అయితే లెక్కాచారం ఉంది, కానీ ఆత్మ సదా ఆరోగ్యంగా ఉంటుంది. ఆత్మకు ఎలాంటి వ్యాధి లేదు. కాబట్టి ఆత్మ ఆరోగ్యంగా ఉంది కదా? లేక అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతారా?
డబల్ విదేశీయులు అనారోగ్యానికి గురవుతారా? కొద్దికొద్దిగా రెస్ట్ తీసుకుంటారా? డబల్ విదేశీయులు అనగా డబల్ హెల్దీ. ఇటువంటి డబల్ హెల్దీ వారిని చూసి అనారోగ్యంగా ఉన్నవారు కూడా హెల్దీ అయిపోతారు. కాబట్టి ఆరోగ్యం యొక్క ప్రాప్తి మీకు ఎంత గొప్పగా ఉంది. ఇంకా సంబంధాలలో చూడండి, ప్రపంచంలోని వారికి ఏదో ఒక సంబంధం ఉంటుంది, మరొకటి ఉండదు. ఉన్న సంబంధం కూడా ఎప్పుడైనా సమాప్తమైపోవచ్చు. కానీ మీ సర్వ సంబంధాలు ఒక్క బాబాతోనే ఉన్నాయి. ఏ సంబంధం యొక్క లోటైనా ఉందా? కేవలం బాబా ఉన్నారు, ఫ్రెండ్ లేరు అని అయితే భావించరు కదా! సర్వ సంబంధాలు బాబాతోనే ఉన్నాయి. ఏ సంబంధంతోనైనా బాబాను స్మృతి చేస్తే, బాబా సదా ఆ సంబంధాన్ని నిర్వర్తించడానికి హాజరుగా ఉంటారు. బాబాకు ఎంత సమయం పడుతుంది! ఒకే సమయంలో అందరితో సంబంధాన్ని నిర్వర్తించగలరు. నేను ఫ్రెండ్ సంబంధాన్ని కోరుకున్నాను కానీ బాబా మరొకదానిలో బిజీగా ఉన్నారు అని అయితే భావించరు కదా! ఏ సెకండులో ఏ సంబంధంతో స్మృతి చేస్తారో, ఆ సంబంధంలో బాబా అంటారు, హే బాలక్ సో మాలిక్, జీ హాజిర్. మాలిక్(యజమాని) పిలిస్తే అక్కడికు చేరుకోకపోవడం ఎలా జరుగుతుంది! కాబట్టి సంబంధాలలో కూడా చూడండి - సర్వ సంబంధాల ప్రాప్తి ఉందా? ఇది అనుభవమా లేక కేవలం విన్నారా?
ఎప్పుడైనా మీ అవస్థ అనుసారంగా బిందువు స్మృతిలోకి రాకపోతే, బిందువు సూక్ష్మమైనది కదా, మీ స్థితి లేదా అవస్థ బలహీనంగా ఉండి, స్థూలంలో ఉంటే సూక్ష్మమైన బిందువును స్మృతి చేసినా స్మృతిలోకి రాదు. అటువంటి సమయంలో యుద్ధం చేయకండి - లేదు, బిందువే ఉండాలి, బిందువు రావాలి, బిందువు రావాలి... అని కాదు. ప్రాప్తిని స్మృతి చేయండి, సంబంధాన్ని స్మృతి చేయండి, సాకార మిలనాన్ని స్మృతి చేయండి, మీ భిన్న-భిన్న విచిత్ర అనుభవాలను స్మృతి చేయండి. అది సహజమే కదా! ఎవరికైనా భాషణ చేయడం రాకపోతే, నేను భాషణ చేసేదానిగా అవ్వలేదు అని భావించకండి. అన్నింటికంటే మంచి భాషణ - అనుభవాన్ని వినిపించడం. ఇది అందరికీ వస్తుందా లేదా? దీనికి తయారీ కావాలా? ఏ పాయింట్ మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు? అనుభవ రూపంలో మాట్లాడితే చూడండి, నంబర్‌వన్ అయిపోతారు. మీరు చేసిన భిన్న-భిన్న అనుభవాలను పంచుకుంటూ వెళ్తే అవి పెరుగుతూ ఉంటాయి. అందరికీ భాషణ చేయడం వస్తుంది, ఐదు సంవత్సరాల పిల్లలకు కూడా వస్తుంది. కాబట్టి యుద్ధంలో సమయాన్ని పోగొట్టకండి. లేదు, ఇదే జరగాలి అని కాదు. ఏ విధితోనైనా వ్యర్థాన్ని సమాప్తం చేసి సమర్థాన్ని ఇమర్జ్ చేయండి. యుద్ధం చేస్తూ చేస్తూ ఏమవుతుంది? బలహీనత యొక్క సంస్కారాలు ఏర్పడతాయి. తర్వాత నా వల్ల అయితే అవ్వనే అవ్వదు, బాబా వికర్మలను వినాశనం చేయమంటారు, నా వల్ల అయితే అవ్వడం లేదు అని ఆలోచిస్తారు. వికర్మ వినాశనం కాకపోతే సుకర్మలనైనా తయారు చేసుకోండి కదా, వ్యర్థంలో సమయాన్ని పోగొట్టకండి. ఎంతెంత శ్రేష్ఠ కర్మల ఖాతా పెరుగుతూ వెళ్తుందో, అంతంతగా వికర్మల ఖాతా కూడా సమాప్తమవుతూ వెళ్తుంది. అందుకే సమయాన్ని పోగొట్టకండి. అన్నింటికంటే గొప్ప విలువ సమయానికే ఉంది. ఎందుకంటే ఈ సమయానికి మహిమ ఉంది - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు. ఒక్కొక్క సెకండు - ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదు. నడుస్తూ-తిరుగుతూ, దారిలో వెళ్తూ రెండు విషయాలు విన్నారు, రెండు విషయాలు మాట్లాడారు - ఇందులో కూడా సమయం పోతుంది. ఎంత సమయాన్ని పోగొడతారో అంతగా వ్యర్థ సంస్కారాలు పక్కా అవుతూ ఉంటాయి. ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడితే దానిని షార్ట్ చేయండి. వినిపించాము కదా - వ్యర్థ విషయాల వర్ణన చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి వ్యర్థాన్ని తగ్గించండి. అర్థం చేసుకోవడంలో ఇలా ఉంటుంది - నేను ఏమీ చేయలేదు, వినలేదు, మాట్లాడలేదు, కానీ నడుస్తూ నడుస్తూ వారు రెండు మాటలు మాట్లాడారు, వారితో మీరు రెండు మాటలు మాట్లాడారు, వ్యర్థ ఖాతా జమ అయిపోతుంది. వినడం ద్వారా కూడా వ్యర్థం జమ అవుతుంది. ఎవరైనా వ్యర్థాన్ని వినిపిస్తున్నా దానిని కూడా షార్ట్ చేయండి, వారికి నేర్పించండి. ఇదే శుద్ధ సేవ, దయ చూపించడం. దయాహృదయులు కదా!
అచ్ఛా, ఈ రోజు హోలీ జరుపుకోవడానికి వచ్చారు. మరి హోలీగా మీరు అయిపోయారు, ఇప్పుడు ఏ హోలీ జరుపుకుంటారు? హోలీగా అయిపోయారు, హోలీ హంసలు కదా! ఈ హోలీ ఆత్మల సభ ఎంత అతీతంగా మరియు ప్రియంగా అనిపిస్తుంది. హోలీ యొక్క విశేషత రంగు పూయడం. మీ అందరికీ అయితే ఆత్మిక రంగు అంటుకుంది. పక్కాగా అంటుకుంది కదా! లేక మాయ యొక్క కొద్దిపాటి ఎండలో రంగు వెలిసిపోతుందా? వెలిసిపోదు! ప్రపంచంలోని వారు ఒక రోజు కోసం వినోదం చేసుకుంటారు, మీకైతే సదా వినోదమే. మనసు నాట్యం చేస్తూ, ఆడుతూ ఉంటుంది. వాస్తవానికి అన్ని ఉత్సవాలు మీ జీవితం యొక్క స్మృతిచిహ్నాలే. హోలీ యొక్క విశేషత రంగు పూయడం, హోలీని కాల్చడం, తర్వాత మంగళ మిలనం జరుపుకోవడం. బాబా సాంగత్యం యొక్క రంగులో రంగరించబడినప్పుడు, అన్నింటికంటే గొప్ప, అన్నింటికంటే మంచి రంగు సదా బాబా సాంగత్యమే. కాబట్టి సదా సాంగత్యం ఉంది కదా! అందుకే సదా హోలీయే. ఎందుకంటే సాంగత్యం యొక్క రంగు సదా ఉంది. బాబాతో పాటు ఉంటూ, సాంగత్యంలో ఉన్నప్పుడు చెడు స్వతహాగానే కాలిపోతుంది. అపవిత్రతను కాల్చడం అంటే హోలీని కాల్చడం. రంగులో రంగరించబడినప్పుడు, చెడు కాలిపోయినప్పుడు ఏమవుతుంది? మంగళ మిలనం. సదా ఒకరినొకరు కలుసుకున్నప్పుడు అందరి పట్ల శుభ భావనను ఉంచుతారు. కాబట్టి ఈ శుభ భావనతో కలవడం - ఇదే మంగళ మిలనం. సదా శుభమే. కాబట్టి మంగళ మిలనం శుభ మిలనం. ఎటువంటి ఆత్మ అయినా సరే, మీరు శుభ భావనతో వారిని కూడా పరివర్తన చేస్తారు. కాబట్టి సదా మంగళ మిలనాన్ని బాబాతో కూడా మరియు మీలో కూడా జరుపుకుంటూనే ఉంటారు. వారి హోలీ నష్టానికి సంబంధించినది, మీ హోలీ లాభానికి సంబంధించినది. అక్కడ ఎంత నష్టం జరుగుతుంది! రంగు నష్టం, సమయం నష్టం, వస్త్రాల నష్టం కూడా. మీది అయితే జమ చేసుకునేది. హోలీ జరుపుకోవడం నచ్చుతుందా, రంగు పూయడం నచ్చుతుందా? దేవతల సమానంగా కొద్దిగా సహజంగా చేయడం అంటే ఆ రోజుకు మహత్వం ఇవ్వడం. మిగిలినది ఎక్కువగా రంగులు పూయడం అంటే ప్రపంచంలోని వారిలా అయిపోతారు. సదా హోలీయెస్ట్గా అయ్యే హోలీ అభినందనలు. వారు విశేష ఉత్సవం రోజున నోరు తీపి చేసుకుంటారు, మీరు అయితే ప్రతి గురువారం నోరు తీపి చేసుకుంటారు. భోగ్లో స్వీట్ తయారు చేస్తారు కదా? లేక స్వీట్ చేయకుండా హాట్ మాత్రమే చేస్తారా! డబల్ విదేశీయులు తయారు చేస్తారా? లేక బ్రెడ్‌నే భోగ్గా పెడతారా? వినిపించాము కదా, ఇది కూడా విధి. విధిని అనుసరించడం ద్వారా సంతోషం కలుగుతుంది. ఎవరైనా మీ ప్రియమైనవారు వస్తే ఏమి చేస్తారు? ప్రేమతో వారి కోసం తయారు చేస్తారు కదా! బాబాపై ప్రేమ ఉంటే రెండు వస్తువులు తయారు చేయకపోయినా, ఒక్క వస్తువే తయారు చేయండి, కానీ ప్రేమతో మరియు విధిపూర్వకంగా తయారు చేయండి. ఆఫీస్ టైమ్ అయిపోయింది, గ్యాస్‌పై హల్వా తయారవుతోంది, టైమ్ లేదు కాబట్టి ఇదే పెట్టేద్దాం అని కాదు. (అందరూ నవ్వుతున్నారు) మంచిగా అనిపించదు కదా, అందుకే నవ్వు వస్తోంది. బాప్‌దాదా అయితే మీ ప్రేమ యొక్క ఫలాన్ని కూడా ప్రేమతోనే స్వీకరిస్తారు. కానీ వచ్చే స్టూడెంట్స్ తమ తమ స్థానాలలో ఇన్ని వస్తువులు తయారు చేయలేరు. అందుకే బాబా పిల్లల పట్ల కూడా ఈ నియమాన్ని ఉంచుతారు. కనీసం ప్రతి గురువారం వారికి వెరైటీ లభించాలి. అప్పుడు బాబా కూడా తింటారు, పిల్లలు కూడా తింటారు.
కష్టపడటం అయితే చాలా చేస్తారు, కానీ ప్రేమతో కష్టపడితే ఆ కష్టం ప్రేమగా మారిపోతుంది. డబల్ విదేశీయులకు స్వయంగా కూడా వంట చేయడానికి టైమ్ లేకపోవడం వల్ల ఎలా వస్తే అలా నడిపిస్తూ ఉంటారు. డబల్ విదేశీయుల బ్రహ్మా భోజనం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇండియాలో బ్రహ్మా భోజనం మరియు విదేశాలలో బ్రహ్మా భోజనం - ఎంత తేడా ఉంటుంది! ఇండియన్ అక్కయ్యలు ఉన్న చోట అయితే చేస్తూ ఉంటారు. కానీ కేవలం డబల్ విదేశీయులు ఉన్న చోట వారి బ్రహ్మా భోజనం అయితే రోజూ చేయవచ్చు. మంచిదే. ఆరోగ్యానికి కూడా మంచిది, సహజం కూడా. కానీ గురువారం ఏదో ఒకటి తయారు చేయండి.
అచ్ఛా, అన్ని వైపుల నుండి వచ్చారు. డబల్ విదేశీయులు కూడా మంచి రేస్ చేశారు. అందరూ బాగా ఉన్నారా? మంచం లభించిందా లేక పటరాణి, పటరాణే అయ్యారా(నేలపై పడుకున్నారా?)? అందరికీ మంచం లభించిందా లేక ఎవరైనా నేలపై కూడా నిద్రపోతున్నారా? అందరికీ మంచం లభిస్తుంది. ఇది మీకు లభిస్తున్న విశేషమైన ఆతిథ్యం. నేలపై నిద్రపోగలరు కదా లేక లేదా? లేక నడుము నొప్పి వస్తుందా? ఏది లభిస్తే దానిలో సంతుష్టంగా ఉండండి. మంచం లభించినా మంచిదే, నేల లభించినా మంచిదే. అన్నింటికీ అలవాటు పడాలి. అచ్ఛా!
బ్రెజిల్:- ఎక్కువ గ్రూప్ వచ్చింది, అందుకే సంతోషంగా ఉంది. చాలా మంచిది. (ఫస్ట్ టైమ్ వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు) మంచిది, వృద్ధి జరగడం అనేది డ్రామాలో నిశ్చితము. ఇది పెరుగుతూనే ఉంటుంది. సంఖ్య పెరగడం సేవ యొక్క వృద్ధికి గుర్తు. కాబట్టి మంచిది. బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే అన్ని వైపులా మెజారిటీగా చూసినప్పుడు నాలుగు వైపుల గ్రూపులు పెరిగే వచ్చాయి. గత సంవత్సరం సంఖ్యకు, ఈ సంవత్సరం సంఖ్యకు చాలా తేడా ఉంది. మధుబన్ వరకు ఇంతమంది ఎక్కువగా చేరుకున్నారంటే అక్కడ కూడా ఉంటారు కదా! కాబట్టి మంచిది, సేవ యొక్క వృద్ధికి అందరికీ అభినందనలు. అచ్ఛా, బ్రెజిల్ వారు ఏమి చేస్తారు? ఏ నషా ఉంచుకుంటారు? (ఉల్లాస-ఉత్సాహాలు) చాలా ఎక్కువ ఉల్లాసం ఉంది. కాబట్టి సదా ఉల్లాస-ఉత్సాహాలలో ఉండడం అంటే మీ శ్రేష్ఠమైన గౌరవం లేదా స్వమానంలో ఉండడం. అన్నింటికంటే గొప్ప గౌరవం ఏమిటంటే - సదా సంతోషంగా ఉండేవారు మరియు ఇతరులకు సంతోషాన్ని పంచే దాత యొక్క పిల్లలు. సదా ఇచ్చేవారు, తీసుకునేవారు కాదు. బాబా నుండి అడగకుండానే లభిస్తూనే ఉంటుంది. బాబా నుండి లభిస్తుంది, పిల్లలకు పంచాలి. కాబట్టి సదా సంతోష ఖజానాను పంచే మహాదానులు. ఇది బ్రెజిల్ వారి కోసం విశేష వరదానం.
సౌత్ అమెరికా:- అందులో ఎవరున్నారు? చేతులు ఎత్తండి. (ఐదు దేశాలు ఉన్నాయి) మరి ఐదు దేశాలు ఏ టైటిల్‌ను స్మృతి చేస్తాయి? టైటిల్స్ అయితే చాలా ఉన్నాయి కదా! ప్రతి రోజూ ఏదో ఒక విశేషమైన గౌరవం యొక్క టైటిల్ లభిస్తుంది. మరి ఈ ఐదు దేశాలు కలిసి ఏ టైటిల్‌ను స్మృతి చేస్తాయి? (సంతుష్టమణి) అచ్ఛా, మణి ఎక్కడ ఉంటుంది? కిరీటంలో ఉంటుంది కదా! కాబట్టి అన్నింటికంటే ఉన్నతమైన స్థానంలో మణి మెరుస్తుంది. ఈ ఐదు దేశాలవారు సదా ఉన్నతమైన స్థితిలో స్థితులై ఉండే సంతుష్టమణులుగా అయ్యి, తమ సంతుష్టత యొక్క లైట్‌ను నాలుగు వైపులా వ్యాపింపజేస్తారు. కాబట్టి సదా సంతుష్టమణి భవ. ఇది మంచిది. దూరంగా ఉన్నా సమీపంగా ఉన్నారు. దేశం దూరంగా ఉంది కానీ హృదయానికి సమీపంగా ఉన్నారు. అర్థమైందా? అచ్ఛా!
జర్మనీ:- జర్మనీ వారు ఇప్పుడు ఏదైనా కొత్త అద్భుతం చేసి చూపించాలి. అందరూ చేసినది అయితే చేశారు, కానీ జర్మనీ వారు ఏ కొత్తదనం చేస్తారు? కొత్తదనం చేసి చూపిస్తామని భావించేవారు చేతులు ఎత్తండి. వీరు చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కరి వేలు ద్వారా కొత్తదనం అనే పర్వతం ఎత్తబడే ఉంది. ఎత్తబడుతుంది కాదు, ఎత్తబడే ఉంది. అందరూ మంచివారు, ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి, ఇప్పుడు కేవలం ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. హృదయంలో ఉంది, కానీ హృదయంలోని ఉల్లాస-ఉత్సాహాలను బయటకు తీసుకురావాలి. ఎవరూ తయారు చేయని ఇటువంటి ఆత్మలను జర్మనీ తయారు చేసి, అందరూ చప్పట్లు కొట్టేలా అద్భుతం చేసి చూపించండి. వాహ్ జర్మనీ, వాహ్! అయితే జర్మనీ యొక్క సహాయం ఇప్పటికీ బాగా లభిస్తోంది. బాగా కష్టపడుతున్నారు. ఇక్కడ హాస్పిటల్లో ఎంత సహాయం చేస్తున్నారు. హాస్పిటల్లో చేసిన సహాయానికి అభినందనలు. ఇప్పుడు ఇటువంటి మంచి సేవాకేంద్రాన్ని తెరవండి, ఆ సేవాస్థానంలో ఇటువంటి వైబ్రేషన్లు ఉండాలి, వాటి ద్వారా ప్రతి ఒక్కరికీ కొత్తదనం యొక్క అనుభవం కలగాలి. అయస్కాంతం దూరం నుండే ఆకర్షించినట్లుగా, సేవాస్థానంలోని ఆత్మల వైబ్రేషన్లు అందరినీ ఆకర్షించాలి. ధైర్యం ఉంది కదా! సేవాకేంద్రాన్ని తెరవాలనే సలహా నచ్చిందా? జర్మనీ వారు మళ్లీ చేతులు ఎత్తండి. ధైర్యం ఉందా? ఇది ధైర్యం యొక్క చేయా లేక ఊరికే ఎత్తారా! బాప్‌దాదా చూస్తున్నారు, ఆత్మలు మంచివారు. ఏది చేయాలనుకుంటే అది చేయగలరు. కానీ ఇప్పటివరకు గుప్తంగా ఉన్నారు, ఇప్పుడు ప్రత్యక్షమవుతారు. కాబట్టి బ్రాహ్మణులందరి మరియు బాప్‌దాదా సహితంగా జర్మనీ వారికి ఆశీర్వాదాలు ఉన్నాయి. ఎన్ని ఆశీర్వాదాలు లభించాయి! సరే కదా! బ్రాహ్మణులందరి మరియు బాప్‌దాదా యొక్క విశేష దృష్టి జర్మనీపై పడినప్పుడు ఏమవుతుంది? అద్భుతం జరుగుతుంది. కాబట్టి సదా అందరికీ ఆశీర్వాదాలు ఇస్తూ, స్వయాన్ని కూడా బాబా ఆశీర్వాదాలతో నిండుగా ఉన్న ఆత్మగా అనుభవిస్తూ ఉండండి. అర్థమైందా? జర్మనీ గురించి విని మీ అందరికీ కూడా సంతోషంగా ఉంది కదా! చూడండి ఎంత సంతోషంగా ఉంది, అందరి ముఖాలు చిరునవ్వుతో ఉన్నాయి. అచ్ఛా!
కెనడా:- కెనడా వారు ఏమి చేస్తారు? కెనడా స్థానం చాలా పెద్దది, అందులో కొత్తదనం ఏమి చేసారు? సేవాకేంద్రాలు అయితే అన్నీ ఉన్నాయి కానీ కొత్తదనం ఏమి చేసారు? కెనడా వారు అక్కడి స్థానానికి అనుగుణంగా ఏదో ఒక కొత్తదనం చేయండి, మ్యూజియం కామన్ కాదు, ఇప్పటివరకు జరిగిందంతా కామన్ అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఇన్వెన్షన్ చేసి లౌకిక హిస్టరీలో వండర్స్ గురించి చెప్పుకుంటారు కదా, అలా కెనడా స్థానం వండర్స్‌లో చెప్పుకునేలా తయారుచేయండి. అవుతుందా? అవును అయితే చేతులెత్తండి. కొద్దిమందే ఉన్నారు కానీ తోడుగా ఇంకా ఉన్నారు కదా. కాబట్టి అలాంటి ఏదో ఒక అద్భుతం చేసి చూపించండి మరియు సదా స్వయాన్ని బాబా యొక్క ఇన్‌స్ట్రుమెంట్‌గా భావిస్తూ చేయండి. బాబా చేయించేవారు, చేయించేవారి స్మృతితో నిమిత్తమై కార్యం చేసే ఆత్మలు. చేయించేవారి ద్వారా ప్రతి కార్యం సహజమైపోతుంది. అర్థమైందా? చాలా మంచి ఇన్స్ట్రుమెంట్స్. అచ్ఛా!
మెక్సికో:- మెక్సికో వారి అద్భుతం కూడా ఉంది. అక్కడి ఆర్థిక పరిస్థితి అయితే బాగోలేదు కానీ మెక్సికో బ్రాహ్మణుల పరిస్థితి అందరికంటే బాగుంది. నిశ్చింత చక్రవర్తులు. దేశ పరిస్థితి అయితే అలా అవ్వాల్సిందే కానీ అది కలియుగ పరిస్థితి మరియు మీరందరూ సంగమయుగంలో కూర్చున్నారు. అందుకే మెక్సికో వారు సాక్షీ ద్రష్టగా ప్రతి దృశ్యాన్ని చూసేవారు. గందరగోళంలోకి వచ్చేవారు కాదు, కానీ సాక్షితనము అనే సీట్‌పై ద్రష్టగా ఉండి ఆటను చూస్తున్నారు మరియు ఆటలో హర్షితంగా ఉంటున్నారు. పైకి-క్రిందికి అయ్యే ప్రభావం నుండి అతీతంగా మరియు ప్రియంగా. అచ్ఛా, దేశ పరిస్థితి ప్రజలను కదిలిస్తుంది, అలా కదిలినప్పుడు ఇంకా ఎక్కువగా స్పిరిచ్యువాలిటీ వైపు అటెన్షన్ వెళ్తుంది. వైరాగ్యపు ధరణి తయారవుతుంది. ఎంతగా వైరాగ్యపు ధరణి తయారవుతుందో అంతగా బీజం త్వరగా ఫలాన్నిస్తుంది. కాబట్టి మెక్సికోకు ఇప్పుడు ఇంకా సేవ చేసే ఛాన్స్ ఉంది. ఎదగండి మరియు ఎదిగేలా చేయండి. మిగిలిన నిశ్చయబుద్ధి కలిగిన మంచి-మంచి పిల్లలు సదా బాబా ముందు ఉన్నారు మరియు సదా ఉంటారు. అర్థమైందా?
కరేబియన్:- గయానా, ట్రినిడాడ్, సురినామ్, బార్బడోస్... అన్ని వైపులా సేవకు మంచి ఛాన్స్ ఉంది మరియు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కరేబియన్ వారు ఛాన్స్ తీసుకునే విశేష ఛాన్స్లర్స్. ఛాన్స్ బాగా తీసుకుంటూ ఉంటారు. ఎంతగా ఛాన్స్ తీసుకుంటారో అంతగా స్వయానికి కూడా సంతోషం కలుగుతుంది మరియు ఇతరులకు కూడా సంతోషం కలుగుతుంది. ధరణిని బాగా పరివర్తన చేసారు. మొదట భక్తి యొక్క కఠినమైన ధరణిగా ఉండేది, ఇప్పుడు పరివర్తన చెంది జ్ఞానం వినాలనే జిజ్ఞాస కలిగినవారిగా అయ్యారు. కాబట్టి భక్తిపై విజయం పొందారు కదా, విజయులుగా అయ్యారు. మంచి రిజల్ట్ ఉంది, బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. అర్థమైందా! ఛాన్స్లర్స్. అచ్ఛా, ఎన్ని పేర్లు తీసుకుంటాము, అందరికీ ప్రియస్మృతులు అయితే లభిస్తూనే ఉన్నాయి. మిగిలిన అందరి కోసం, పెద్ద నగరాలైనా, చిన్నవైనా, చిన్నవారు మరియు సికీలధే, ఎందుకంటే ఎక్కడ తక్కువమంది ఉంటారో అక్కడ ఆతిథ్యం లభిస్తుంది మరియు ఎక్కువమంది ఉంటే అది పంచబడిపోతుంది. ఉదాహరణకు చూడండి, డబల్ విదేశీయులు కొద్దిమంది ఉన్నప్పుడు పర్సనల్‌గా కలిసేవారము, పెరిగిపోయారు కాబట్టి పంచబడిపోయింది. ఛోటే సుభానల్లా. అందరినీ బాప్‌దాదా చూస్తారు, కేవలం అమెరికా, ఆఫ్రికాను మాత్రమే చూస్తారని భావించకండి. అన్ని చోట్ల చక్కర్లు వేస్తారు. మొదట చిన్నవారిని ప్రేమిస్తారు, తరువాత పెద్దవారిని. కాబట్టి అందరి కోసం ఇదే విశేష వరదానం - బిందువు మరియు సింధువు, ఎంతగా బిందువుగా ఉంటారో అంతగా సింధువుగా అవ్వండి. జ్ఞానం, గుణాలు మరియు శక్తుల ధారణలో సింధువుగా అవ్వండి మరియు స్మృతిలో బిందువుగా అవ్వండి. బిందువుగా అవ్వండి, బిందువును స్మృతి చేయండి మరియు బిందువు పెడుతూ వెళ్ళండి. కాబట్టి బిందు స్మృతి స్వరూపులు మరియు ధారణలో సింధు స్వరూపులు. ఇదే లక్ష్యాన్ని అందరూ పెట్టుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు ఏ రకమైన వేస్ట్ అయినా సమాప్తం చేయండి. ప్రతి కర్మ బెస్ట్. ప్రతి సెకండ్ బెస్ట్‌గా ఉండాలి, మాట కూడా బెస్ట్‌గా ఉండాలి, సంబంధ-సంపర్కం అంతా బెస్ట్‌గా ఉండాలి. ఎంతగా బెస్ట్ చేస్తూ వెళ్తారో వేస్ట్ స్వతహాగానే సమాప్తమైపోతుంది. ఇప్పుడు వేస్ట్ ఖాతా కొంత కనిపిస్తోంది, కాబట్టి బాప్‌దాదాకు బాగా అనిపించడం లేదు. మీ రోజంతటి దినచర్యను చెక్ చేస్తాము, అక్కడ నాలుగు వైపులా అందరి టి.వి.లు అమర్చబడి ఉన్నాయి. ఒక్కొక్క పిల్లవానికి టి.వి. ఉంది, కాబట్టి వీరు వేస్ట్ చేస్తున్నారా లేక బెస్ట్ చేస్తున్నారా అనేది కనిపిస్తుంది కదా. ఒక్క సెకండ్లో చూసేస్తారు. కాబట్టి ఇప్పటికీ వేస్ట్ ఖాతా కొంత బెస్ట్ కంటే ఎక్కువగా కనిపిస్తోంది. బాప్‌దాదాకు వేస్ట్ చూసి బాగా అనిపిస్తుందా? కాబట్టి ఈ సంవత్సరంలో ఈ ప్రతిజ్ఞ చేయండి - వేస్ట్‌ను సమాప్తం చేస్తాము, బెస్ట్‌గా అవుతాము. ఎన్ని పరీక్షలు వచ్చినా పరీక్ష పరీక్షే, ప్రతిజ్ఞ ప్రతిజ్ఞే. పరీక్ష వచ్చినప్పుడు ప్రతిజ్ఞను స్మృతి చేయండి. అందరూ బెస్ట్‌గా అయినప్పుడే ప్రత్యక్షతా జెండా ఎగురవేస్తాము. అది మీ కోసమే ఆగి ఉంది. అలా తెర తెరుచుకుంటే, మీరు ఇంకా తయారవుతూ ఉంటే బాగుంటుందా! అందుకే తెర మూసి ఉంది. ఎవరైనా మనస్సును సరిచేసుకుంటున్నారు, ఎవరైనా తనువును సరిచేసుకుంటున్నారు, ఎవరైనా స్వభావాన్ని, ఎవరైనా సంస్కారాలను సరిచేసుకుంటున్నారు, అప్పుడు తెర తెరుచుకుంటే బాగుంటుందా! అందుకే త్వరత్వరగా తయారైపోండి. డైమండ్ జూబిలీ జరుపుకునేందుకు తయారీ చేస్తున్నారు కదా. కాబట్టి అందరూ మచ్చలేని డైమండ్లుగా అవ్వండి. డైమండ్ జూబిలీకి అర్థం ఇదే కదా. డైమండ్ జూబిలీ జరుపుకుంటూ, ఫ్లా (మచ్చ) ఉన్న డైమండ్లుగా ఉంటే బాగుంటుందా! అందుకే ఈ సంవత్సరంలో తయారైపోండి. టి.వి. తెరిస్తే అంతా బెస్ట్, బెస్ట్, బెస్ట్‌గా ఉండాలి. వేస్ట్ యొక్క నామరూపాలు కూడా కనిపించకూడదు. అవుతుందా? లేక అవ్వాల్సిందేనా? బాప్‌దాదా కావాలనే అవుతుందా అని అడిగారు. మీరు జవాబు చెప్పండి - అవ్వాల్సిందే. అచ్ఛా.
నలువైపులా ఉన్న సదా సర్వ ప్రాప్తి స్వరూప ఆత్మలకు, సదా సంతుష్టంగా, సదా ప్రసన్నచిత్తంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వయాన్ని శ్రేష్ఠమైన పేరు, గౌరవం మరియు ప్రతిష్ఠకు అధికారులుగా అనుభవం చేసే సమీప ఆత్మలకు, సదా సర్వులకు సంతుష్టత యొక్క వైబ్రేషన్ల లైట్-మైట్‌ను ఇచ్చే ప్రసన్నచిత్త ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
(బాప్‌దాదాతో పాటు దాదీలు స్టేజ్‌పై కూర్చున్నప్పుడు అందరూ ఫోటోలు తీస్తున్నారు) ఇన్ని ఫోటోలు ఏమి చేస్తారు? డబల్ విదేశీయులు ఫోటోలు చాలా తీస్తారు. మీరందరూ హృదయంలో బాబా ఉన్నారని అంటారు, మరి ఫోటోలు ఎందుకు తీస్తారు? హృదయంలో అయితే ఉన్నారు కదా. ఇది కూడా ఒక మనోరంజనం. ఇప్పుడు డబల్ విదేశీయులు కూడా పక్కాగా అయ్యారు. మొదట త్వరగా డిస్టర్బ్ అయ్యేవారు, ఇప్పుడు తక్కువగా అవుతున్నారు. తేడా వచ్చింది కదా. మంచివారు, పరివర్తన బాగా చేసారు. ఇప్పుడు మూడ్ ఆఫ్ చేసుకుంటారా? మూడ్ ఆఫ్ అవుతుందా? లేదు. మీ బుద్ధి యొక్క స్విచ్ ఆన్‌లో ఉంటే మూడ్ ఆఫ్ అవ్వదు. స్విచ్ ఆఫ్ అయిపోతే కదా మూడ్ ఆఫ్ అవుతుంది. కాబట్టి మీది ఆటోమేటిక్ స్విచ్ కదా! లేక ఫ్యూజ్ అవుతుందా? ఎవరిది ఫ్యూజ్ అవుతుందో వారు కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు తేడా ఉంది. ఇప్పుడు ఇంకా ఫ్లై చేస్తూ-చేస్తూ బాబా ఏమి కోరుకుంటున్నారో అది చూపిస్తారు. కానీ బాప్‌దాదా పేరును ప్రత్యక్షం చేయడంలో మీరందరూ విశేష నిమిత్త ఆత్మలు.
అహ్మదాబాద్ (సుఖ-శాంతి భవన్) సోదరసోదరీలతో:- మంచివారు, సేవ కూడా బాగా చేస్తారు. అందరినీ సంతుష్టం చేయడం - ఇదే అన్నిటికంటే గొప్ప సేవ చేస్తున్నారు. సీజన్లో రాకపోయినా బాప్‌దాదా సదా స్మృతి చేస్తారు. కాబట్టి సుఖ-శాంతి భవన్ వారు సదా సుఖ-శాంతిలో ఉండేవారు. అశాంతి యొక్క నామరూపాలు లేవు. మరియు బాప్‌దాదా వద్ద సఫలత యొక్క రిజల్ట్ ఉంది, అందుకే అభినందనలు, అభినందనలు.
తలహటిలో బాప్‌దాదా కార్యక్రమం కోసం వచ్చిన సేవాధారులతో:- అచ్ఛా, గుజరాత్ సేవ యొక్క బాధ్యతను తీసుకోవడంలో నంబర్ ముందుకు తీసుకుంటారు. మొత్తం గుజరాత్యే సంగఠనలో సేవకు నిమిత్తమైంది. ఎవరైతే నిమిత్తమవుతారో వారికి విశేషంగా ఒక అడుగుకు పదమారెట్లు సహయోగం లభిస్తుంది. అందుకే ధైర్యము కూడా బాగా ఉంచారు, శ్రమ కూడా బాగా చేస్తున్నారు. ప్రకృతి కొద్దిగా కదిలిస్తుంది కానీ వీరు నిశ్చలంగా ఉన్నారు. అచ్ఛా, ఒకటి సంగఠన యొక్క శక్తి, రెండవది ధైర్యము ఉంది కాబట్టి కార్యం సఫలమైపోయినట్లే.
నిర్వైర్ అన్నయ్య బాప్‌దాదాకు పూలగుచ్ఛాన్ని సమర్పించారు:- అచ్ఛా, జ్ఞాన సరోవర్ ఏమవుతోంది? ఇప్పుడు మిగిలి ఉన్న పనిలో ఏ విధంగానైనా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితం చూపించండి.
మీరందరూ జ్ఞాన సరోవర్ చూసి సంతోషిస్తారు కదా? జ్ఞాన సరోవర్ ఎవరు నిర్మించారు? (బాబా) మీరందరూ. మీ అందరి వేలు లేకపోతే జ్ఞాన సరోవర్ పర్వతం ఎలా పైకి లేచేది! నిర్మించింది అయితే బాగుంది. అయినా ఎవరు ఏది చేసారో అది చాలా బాగా చేసారు మరియు ఇకముందు కూడా మంచి కంటే మంచిగా చేస్తూనే ఉంటారు. సరే కదా! అందరూ జ్ఞాన సరోవర్‌లో మీ మీ వేలును ఇచ్చారా (సహయోగం చేసారా) లేక ఎవరైనా ఇవ్వలేదా? ఇక్కడ కూర్చున్న మీరందరూ మీ వేలును ఇచ్చారు కదా? అచ్ఛా!
*** ఓంశాంతి ***
