‘‘బాప్‌దాదా కోరిక - డైమండ్ జూబిలీ సంవత్సరాన్ని మోహ ముక్త సంవత్సరము రూపములో జరుపుకోండి’’
ఈరోజు బాప్‌దాదా సదా హృదయపూర్వకంగా తండ్రి స్మృతిలో ఉండే తమ స్నేహీ, సహయోగీ పిల్లలను కలిసేందుకు వచ్చారు. పిల్లలకు ఎంత స్నేహము ఉందో అంతగానే తండ్రికి కూడా పిల్లలపై స్నేహము ఉంది. తండ్రి పిల్లలందరికీ ఒకే విధముగా అత్యంత స్నేహాన్ని ఇస్తారు. కానీ పిల్లలు తమ-తమ శక్తి అనుసారంగా స్నేహాన్ని ధారణ చేస్తారు, అందుకే తండ్రి కూడా నంబరువారు ప్రియస్మృతులు అని చెప్పాల్సి వస్తుంది. కానీ తండ్రి పిల్లలందరికీ అమృతవేళ నుండి నంబర్‌వన్ హృదయపూర్వకమైన ప్రేమను ఇస్తారు, అందుకే అమృతవేళను విశేషంగా పిల్లల కోసమే పెట్టడం జరిగింది, ఎందుకంటే అమృతవేళ మొత్తము రోజంతటి యొక్క ఆది సమయము. కనుక ఏ పిల్లలైతే ఆది సమయములో తండ్రి స్నేహాన్ని హృదయములో ధారణ చేస్తారో, వారి హృదయములో పరమాత్మ స్నేహము ఇమిడి ఉన్న కారణంగా మరే ఇతర స్నేహము ఆకర్షించదు. ఒకవేళ తమ స్థితి అనుసారంగా పూర్తిగా మనసు నిండుగా స్నేహాన్ని ధారణ చేయకపోతే, ఏ మాత్రం ఖాళీ ఉన్నా, సగమే తీసుకున్నట్లయితే మనసులో ఖాళీ ఉన్న కారణంగా మాయ భిన్న-భిన్న రూపాలలో అనేక స్నేహాలతో, అది వ్యక్తుల రూపంలోనైనా, వైభవాల రూపంలోనైనా - ఈ రెండు రూపాలలో ఆ స్నేహాల వైపుకు ఆకర్షితము చేస్తుంది.
చాలా మంది పిల్లలు బాప్‌దాదాతో ఈ విధంగా అంటారు - మా వద్దకు ఇప్పటివరకూ మాయ ఎందుకు వస్తుంది. మాస్టర్ సర్వశక్తిమంతులుగా అయ్యారు అంటే ఇక మాయ వచ్చే ప్రశ్నే ఉండదు. కానీ కారణం ఏమిటంటే - ఆది కాలమైన అమృతవేళలో తమ మనసులో పరమాత్మ స్నేహాన్ని సంపూర్ణ రూపములో ధారణ చేయరు. ఒకవేళ ఏదైనా వస్తువు సగమే నిండి ఉన్నట్లయితే, ఎక్కడైనా ఖాళీ ఉన్నట్లయితే అలజడి కలుగుతుంది కదా! కూర్చుంటారు కూడా, లేస్తారు కూడా, లక్ష్యము కూడా ఉంది, ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు... అని అంటారు కూడా, ఇలా హృదయపూర్వకంగా అంటారా లేక నోటితోనా? మరి హృదయంలో ఇతర ఆకర్షణ ఉండటానికి కారణము ఏమిటి? తప్పకుండా ఎక్కడో ఇతర వ్యక్తులు లేక వైభవాల వైపుకు స్నేహము వెళ్తుంది, అందుకే అది ఆకర్షిస్తుంది. హృదయంలో సంపూర్ణ పరమాత్మ ప్రేమ పూర్తిగా నిండి ఉండదు. మీరు ఆలోచించండి - ఒకవేళ ఒక చేతిలో మీకు ఎవరైనా వజ్రాన్ని ఇచ్చి, ఇంకొక చేతిలో మట్టి ముద్దను ఇస్తే మీ ఆకర్షణ ఎటువైపుకు వెళ్తుంది? వజ్రము వైపుకు వెళ్తుంది, మట్టి వైపుకు కాదు! మట్టితో ఆడుకోవటము కూడా బాగుంటుంది కదా! మరి ఈ వ్యర్థ సంకల్పాలు కూడా ఏమిటి? వజ్రమా లేక మట్టినా? మరి మట్టితో ఆడుకుంటూ ఉంటారు కదా! అలవాటైపోయింది కదా, అందుకేనా! వ్యక్తి కూడా ఏమిటి? మట్టే కదా! మట్టి మట్టిలో కలిసిపోతుంది. చూడటానికి మీకు చాలా సుందరంగా అనిపిస్తారు, అది ముఖం వల్లనైనా లేక ఏదైనా విశేషత వల్లనైనా లేక ఏదైనా గుణం వల్లనైనా, అప్పుడేమంటారంటే - నాకు వేరే ఏ మోహమూ లేదు, స్నేహమూ లేదు కానీ వీరి ఈ గుణము చాలా బాగుంది. అప్పుడు ఆ గుణము యొక్క ప్రభావము కాస్త పడుతుంది లేదా ఇలా అంటారు - వీరిలో సేవా విశేషత చాలా ఉంది కనుక సేవా విశేషత కారణంగా కాస్త స్నేహముంది అని, మాటలలో చెప్పరు కానీ ఒకవేళ విశేషంగా ఏ వ్యక్తి వైపు అయినా లేక వైభవాల వైపు అయినా పదే-పదే సంకల్పము వెళ్ళినా కానీ - వీరు ఉంటే చాలా బాగుంటుంది... ఇది కూడా ఆకర్షణే. వ్యక్తిలో ఉన్న సేవా విశేషత యొక్క దాత ఎవరు? ఆ వ్యక్తినా లేక తండ్రి ఇస్తారా? ఎవరు ఇస్తారు? ఈ వ్యక్తి చాలా మంచివారు - మంచివారు అన్నది సరే, కానీ ఎప్పుడైనా ఏదైనా విశేషతను చూసినప్పుడు, గుణాలను చూసినప్పుడు, సేవను చూసినప్పుడు, అవి ఇచ్చిన దాతను మర్చిపోవద్దు. ఆ వ్యక్తి కూడా తీసుకునేవారే, దాత కాదు. తండ్రికి చెందినవారిగా అవ్వకుండా ఆ వ్యక్తిలో ఈ సేవా గుణము లేక విశేషత రాగలదా? లేక ఆ విశేషతను అజ్ఞానము నుండే తీసుకొస్తారా? ఈశ్వరీయ సేవ యొక్క విశేషత అజ్ఞానములో ఉండదు. ఒకవేళ అజ్ఞానములో కూడా ఏదైనా విశేషత లేక గుణము ఉన్నా గానీ జ్ఞానములోకి వచ్చిన తర్వాత ఆ గుణము లేక విశేషతలో జ్ఞానాన్ని నింపకపోతే ఆ విశేషత లేక గుణము జ్ఞాన మార్గములోకి వచ్చిన తర్వాత అంతటి సేవ చేయలేదు. న్యాచురల్ గుణంలో కూడా జ్ఞానాన్ని నింపవలసి ఉంటుంది. మరి జ్ఞానాన్ని నింపేవారు ఎవరు? తండ్రి. అంటే అది ఎవరి కానుక అయినట్లు, దాత ఎవరు? మరి మీకు తీసుకునేవారు మంచిగా అనిపిస్తారా లేక దాత మంచిగా అనిపిస్తారా? మరి తీసుకునేవారి వెనుక ఎందుకు పరుగెడుతారు?
తండ్రి ఎదురుగా లేక దాదీల ఎదురుగా చాలా మధురాతి-మధురంగా మాట్లాడుతారు, ఏమంటారంటే - దాదీ, నాకు ఎటువంటి మోహము లేదు, అస్సలు లేదు, కేవలం సేవ కారణంగా కొద్దిగా ఉంది. కొద్దిగా అని అంటూ స్వయాన్ని తప్పించుకుంటారు. కానీ ఈ మోహము అనేది, గుణానికి చెందినది కావొచ్చు లేక సేవకు చెందినది కావొచ్చు, కానీ మోహము అనేది ఈ రోజు కాకపోతే రేపు అయినా ఎక్కడికి తీసుకువెళ్తుంది? కొందరినైతే మోహము పాత ప్రపంచము వరకూ తీసుకువెళ్తుంది కానీ మెజారిటీ పాత ప్రపంచము వరకు వెళ్ళరు, కొందరు వెళ్తారు. మెజారిటీకి మోహము అనేది పురుషార్థంలో నిర్ల్యక్షము వైపుకు తీసుకువెళ్తుంది. ఇదైతే ఎంతోకొంత జరుగుతూనే ఉంటుంది అని అనుకుంటారు, అప్పుడిక తండ్రికి కూడా అర్థం చేయించడం మొదలుపెడతారు, ఏమంటారంటే - బాబా, మీరైతే సాకారములో లేరు, బ్రహ్మాబాబా కూడా అవ్యక్తమైపోయారు మరియు మీరైతే బిందువు, జ్యోతి. ఇప్పుడు మేమైతే సాకారములో ఉన్నాము, ఇంత భారీ-తాజా శరీరము ఉంది మరియు శరీరంతో అన్నీ చెయ్యాలి, నడుచుకోవాలి, కావున మేము సాకారులము, మీరేమో ఆకారీ మరియు నిరాకారీ, ఇప్పుడు సాకారములోనైతే ఎవరో ఒకరు కావాలి కదా! అచ్ఛా, ఎక్కువమంది కాదు కానీ ఒక్కరైతే కావాలి కదా! ఒక్కరు కూడా వద్దా? చూడండి, బాప్‌దాదా అయితే ఒకరు ఉండాలి అని అంటున్నారు. వద్దా? (ఒక్క బాబా కావాలి) తండ్రి అయితే ఉన్నారు కానీ చాలా సార్లు మనసులోకి ఎన్నో విషయాలు వస్తాయి మరియు మనసు భారీ అయిపోతుంది, ఎప్పటివరకైతే మనసును తేలిక చేసుకోరో అప్పటివరకు యోగము కూడా కుదరదు. అప్పుడేమి చెయ్యాలి? తండ్రికి కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది - అటువంటి సమయంలో ఏం చెయ్యాలి? మనసు భారీగా ఉంది మరియు యోగము కుదరటం లేదు, అప్పుడేమి చెయ్యాలి? వాంతి చేసుకోకుండా, లోలోపలే ఆరాటంగా ఉంచుకోవాలా? డాక్టర్లు ఏమంటారు? ఒకవేళ కడుపు బరువుగా అయితే వాంతి చేసి బయటకి తీయాలా లేక లోపలే ఉంచుకోవాలా? డాక్టర్లు ఏమంటారు? వాంతి చేసుకోవాలి కదా! కావున డాక్టర్లు కూడా - వాంతి చేసుకోవాలి అని చెప్తారు. అచ్ఛా.
వీరందరూ శరీరానికి డాక్టర్లు మరియు మీరందరూ మనసుకు డాక్టర్లు. శరీరానికి సంబంధించిన డాక్టర్లు తమ సమాధానాన్ని ఇచ్చారు, ఇప్పుడు మనసు యొక్క డాక్టర్లు చెప్పండి - ఒకవేళ మనసులో ఏదైనా అలజడి ఉంటే ఎక్కడ వాంతి చేసుకోవాలి? బాబా ఎదురుగా వాంతి చేసుకుంటారా! (బాబా గదిలోకి వెళ్ళి చేసుకోవాలి) గదిలో వాంతి చేసుకుని రావాలా! ఆలోచించండి! తండ్రి ఎదురుగా వాంతి చేసుకుంటారా? లేదంటే ఎక్కడ చెయ్యాలి? ఏదో ఒక స్థానమైతే చెప్పండి కదా? బాప్‌దాదా అయితే పిల్లల వైపు మాట్లాడుతున్నారు, ఆ సమయంలో ఎవరో ఒకరు తప్పకుండా కావాలి అని. (తండ్రికి వినిపించాలి) ఒకవేళ తండ్రి విననే వినకపోతే అప్పుడేమి చేయాలి? ఎంతోమంది పిల్లల ఫిర్యాదు ఉంది కదా - మేమైతే బాబాకు వినిపించాము, బాబా అయితే విననే వినలేదు, జవాబే ఇవ్వలేదు. అప్పుడేమి చేయాలి? వాస్తవానికి ఒకవేళ మనసులో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానము నిండుగా ఉన్నట్లయితే, ఏ మాత్రం ఖాళీ లేనట్లయితే ఎప్పుడూ ఎటువైపుకూ మోహము లేక స్నేహము వెళ్ళదు.
చాలా మంది - మోహము లేదు కానీ కేవలం బాగా అనిపిస్తారు అని అంటారు, మరి దీనిని ఏమంటారు? మోహము లేదు, బాగా అనిపిస్తారు అంటే ఇదేమిటి? ఈ మాత్రం అనుమతి ఇవ్వాలా - మంచిగా అనిపించినా ఫర్వాలేదు, మోహము లేదు కానీ వారితో కూర్చోవటం, వారితో మాట్లాడటం, వారితో సేవ చేయించటము, ఇవన్నీ మంచిగా అనిపిస్తాయి, మరి దీనికి అనుమతి ఇవ్వాలా? కాస్త అనుమతి ఇవ్వాలి, ఇప్పుడింకా సంపూర్ణంగా అవ్వలేదు, పురుషార్థము చేస్తున్నాము, కాస్త అనుమతి ఉండాలి! అని ఎవరైతే భావిస్తారో వారు చేతులు ఎత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తరు ఎందుకంటే సిగ్గుగా అనిపిస్తుంది కదా! కానీ ఒకవేళ కాస్త అనుమతి ఉండాలి అని మీరు భావిస్తే దాదీకి ప్రైవేట్‌గా చీటీ వ్రాసి ఇవ్వండి. అంతేకానీ, దాదీ, 5 నిమిషాలు మాట్లాడాలి అని అనకండి, దాని కోసం మళ్ళీ సమయం అవసరమవుతుంది. చీటీలో వ్రాసినట్లయితే బాప్‌దాదా వారికి మంచి సంగఠనను ఏర్పాటు చేస్తారు. అది ఇంకా బాగుంటుంది కదా! అచ్ఛా, ఇప్పుడు అందరూ వద్దు అంటున్నారు మరియు అందరి వీడియో తీయడం జరుగుతుంది. ఇప్పుడు వద్దు అని అన్న తర్వాత అలా చేస్తే మీరు వద్దన్నారు కదా, మళ్లీ ఎందుకు ఇలా చేసారు అని మీకు ఈ క్యాసెట్ పంపిస్తారు. పంపించాల్సి వస్తుందా లేక సురక్షితంగా ఉంటారా? పక్కానా లేక కాస్త-కాస్త కచ్చాగా, కాస్త-కాస్త పక్కాగా ఉన్నారా!
ఈ సీజన్ డైమండ్ జూబిలీని ప్రారంభించే సీజన్ అని ఆ రోజు కూడా వినిపించాము, కనుక ఈ సీజన్లో మీరందరూ కాన్ఫరెన్స్ లు, భాషణలు, మేళాల గురించి చాలా ప్రోగ్రాములను తయారుచేసారు, కానీ బాప్‌దాదా విశేషంగా ఈ డైమండ్ జూబిలీలో ఒక ప్రోగ్రామును తయారుచేయాలని కోరుకుంటున్నారు, తయారుగా ఉన్నారా?
బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారంటే డైమండ్ జూబిలీలో ఏ పిల్లలను చూసినా - వారు రెండు సంవత్సరాల వారైనా, 60 సంవత్సరాల వారైనా, రెండు నెలల వారైనా, టీచర్ అయినా, స్టూడెంట్ అయినా, సమర్పణ అయిన వారైనా లేక ప్రవృత్తిలో ఉన్నవారైనా కానీ ఈ డైమండ్ జూబిలీ సంవత్సరములో - పవిత్రత ద్వారా మేము ప్రకృతిని కూడా పావనంగా చేస్తాము అని తండ్రితోపాటు మీరందరూ కూడా ఈ బాధ్యతను తీసుకున్నారు కదా, మరి ఈ సంకల్పము ఉందా లేక తండ్రియే ఆ బాధ్యతను చేపట్టాలా? తండ్రికి సహచరులేనా? చేతిని కొంచెం అలా పెట్టుకుంటారు, చతురతను చేస్తారు. అలా చెయ్యవద్దు. బాప్‌దాదా కోరుకుంటున్నారు - మొత్తము విశ్వములో పిల్లలు ప్రతి ఒక్కరూ మోహ ముక్తులుగా అవ్వాలి - సాధనాల విషయంలోనైనా లేక వ్యక్తుల విషయంలోనైనా. సాధనాల పట్ల కూడా మోహము ఉండకూడదు. ఉపయోగించటము వేరే విషయము మరియు మోహము వేరే విషయము. కనుక బాప్‌దాదా మోహ ముక్త సంవత్సరాన్ని జరపాలని కోరుకుంటున్నారు. ఈ ఫంక్షన్ చెయ్యాలని కోరుకుంటున్నారు. మరి ఈ ఫంక్షన్లో మీరందరూ సహచరులుగా అవుతారా? మళ్ళీ తరువాత - ఈ కారణం ఉంది అని చెప్పరు కదా! కారణం ఏదైనా కానీ, హిమాలయ పర్వతము పడిపోయినా కానీ, మీరు ఆ హిమాలయ పర్వతాన్ని కూడా దాటి వచ్చేయండి. అంత ధైర్యము ఉందా? ముందు టీచర్లు చెప్పండి. బాప్‌దాదా మా టీచర్లకు చెప్తున్నారు అని విద్యార్థులు సంతోషపడతారు. టీచర్లు అయితే సహయోగము ఇవ్వటానికి ఎల్లప్పుడూ సహచరులే కదా ఎందుకంటే మున్ముందు ఈనాటి ప్రపంచములో అందరూ ఎవరెవరైతే తమను తాము ధర్మాత్ములుగా, మహాత్ములుగా పిలిపించుకుంటారో, వారి పవిత్రతా పునాది కూడా కదులుతుంది. మరియు అటువంటి సమయములో ఆదిలో బ్రహ్మా బాబా నిమిత్తంగా అయినప్పుడు ఏ కారణం వలన నిందలు పడ్డారు? పవిత్రత కారణంగానే కదా. లేదంటే పెద్ద వయసు వారికి కూడా – బ్రహ్మా బాబా గత జీవితం గురించి వేలెత్తి చూపించటానికి ధైర్యము ఉండేది కాదు. వారిది అటువంటి వ్యక్తిత్వము. కానీ పవిత్రత కారణంగా నిందలు పడాల్సి వచ్చింది. అంతేకాక ఈ పరమాత్మ జ్ఞానము యొక్క నవీనతయే పవిత్రత. నిప్పు-దూది కలిసి ఉన్నా కానీ నిప్పంటుకోదు అని నషాతో చెప్తారు కదా. ఛాలెంజ్ కదా! యుగళులు చేతులెత్తండి. యుగళులందరి ఛాలెంజ్ ఇదేనా లేక కాస్త-కాస్త నిప్పంటుకోవటము, మరల ఆర్పటము చేస్తారా? ప్రపంచానికి ఛాలెంజ్ చేసారు కదా? మీరు మొత్తము విశ్వానికి భాషణలలో చెప్తారు కదా - పవిత్రత లేకుండా యోగీ ఆత్మగా, జ్ఞానీ ఆత్మగా అవ్వనే అవ్వలేరు అని. ఇది మీ అందరి ఛాలెంజ్ కదా? ఇది నా ఛాలెంజ్ అని ఏ యుగళులైతే భావిస్తారో వారు చేతులెత్తండి. అచ్ఛా, ఒకే గ్రూపులో చాలామంది సహచరులు ఉన్నారు. మరి డైమండ్ జూబిలీలో ఏం చేస్తారు? మోహము నుండి ముక్తులు. క్రోధముక్త సంవత్సరం గడిపారు కదా. కొంచెం-కొంచెం క్రోధాన్ని అయితే బాప్‌దాదా కూడా చాలామందిలో చూసారు, కానీ ఈ సారి ఆ కొంచెం చేయడాన్ని వదిలేసారా! అయినా కానీ దేశ-విదేశాలలో ఎవరైతే అటెన్షన్ పెట్టి సంపూర్ణ రూపములో క్రోధముక్త జీవితాన్ని ప్రాక్టికల్‌గా అనుభవము చేసారో, చేసి చూపించారో, వారందరికీ బాప్‌దాదా పదమా రెట్లకంటే కూడా ఎక్కువ అభినందనలను తెలియజేస్తారు ఎందుకంటే ఈ సమయములో దేశము వారిదైనా లేక విదేశాల వారిదైనా, అందరి బుద్ధి రూపీ టెలిఫోన్ ఇక్కడ మధుబన్తో జోడించబడి ఉంది. ఇప్పుడు అందరి కనెక్షన్ మధుబన్తో ఉంది. కనుక అందరూ ఈ అనుభవము అయితే చేసి ఉంటారు - ఎవరైతే చాలా మంచిగా దృఢ సంకల్పము చేసారో వారికి బాప్‌దాదా వైపు నుండి విశేషంగా అదనపు సహాయము కూడా లభించింది. కావున ఇలా అనుకోకండి - ఒక సంవత్సరము క్రోధాన్ని సమాప్తము చేసాము, ఇప్పుడు ఫ్రీ అయిపోయాము అని. ఒకవేళ సంపూర్ణంగా మోహ ముక్తులుగా అనుభవము చేసినట్లయితే క్రోధముక్తులుగా ఆటోమేటిక్‌గా అయిపోతారు. ఎందుకు? క్రోధం కూడా ఎందుకు వస్తుంది? ఏ విషయాన్ని అయితే, ఏ వస్తువునైతే మీరు కోరుకుంటున్నారో, అది పూర్తి కాకపోతే లేక అది లభించకపోతే క్రోధము వస్తుంది కదా! క్రోధానికి కారణము - మీ సంకల్పము ఏదైతే ఉందో అది సరైనది అయినా కాకపోయినా, అది పూర్తి కాకపోతే క్రోధం వస్తుంది. ఉదాహరణకు కాన్ఫరెన్స్ జరిగినప్పుడు లేక ఫంక్షన్ జరిగినప్పుడు - అందులో మా పాత్ర కూడా ఉండాలి, చివరకు మాకు అవకాశం ఎప్పుడు వస్తుంది అని మీరు కోరుకున్నారనుకోండి. మీకు కోరిక ఉంది మరియు మీరు సూచన కూడా ఇస్తారు కానీ మీకు అవకాశము లభించకపోతే ఆ సమయములో మీకు చికాకు వస్తుందా, రాదా? ఒకవేళ మహాక్రోధము చేయకపోయినా కానీ ఎవరైతే వద్దు అన్నారో వారి గురించి వ్యర్థ సంకల్పాలు వస్తాయి కదా? మరి అది పవిత్రత కాదు. ఆఫర్ చేసుకోవటము, ఆలోచన చెప్పటము, వీటికైతే అనుమతి ఉంది కానీ ఆలోచన వెనుక ఆ ఆలోచనను కోరిక రూపములోకి మార్చకండి. ఎప్పుడైతే సంకల్పము కోరిక రూపములోకి మారుతుందో అప్పుడు చికాకు కూడా వస్తుంది, నోటి ద్వారా కూడా క్రోధము జరుగుతుంది మరియు కాళ్ళు-చేతులు కూడా ఉపయోగిస్తారు. కాళ్ళు-చేతులను ఉపయోగించటమంటే అది మహాక్రోధము అయినట్లు. కానీ నిస్వార్థులుగా అయ్యి ఆలోచన చెప్పండి, అంతేకానీ స్వార్థము పెట్టుకుని కాదు - నేను చెప్పానంటే జరగాల్సిందే, ఇలా ఆలోచించకండి. ఆఫర్ చేసుకోండి, అందులో తప్పేమీ లేదు. కానీ ఎందుకు-ఏమిటి అనేవాటిలోకి వెళ్ళకండి. లేదంటే ఈర్ష్య, ద్వేషము, ఇలాంటి సహచరులు ఒక్కొక్కటిగా వస్తాయి, అందుకే ఒకవేళ పవిత్రతా నియమాన్ని పక్కా చేసుకున్నట్లయితే, మోహ ముక్తులుగా అయినట్లయితే - ‘ఇది జరగాల్సిందే’ అన్న ఈ మోహాన్ని కూడా పెట్టుకోరు. ‘ఇది జరగాల్సిందే’ అన్నట్లు ఉండకూడదు. ఆఫర్ చేసుకున్నారు, మంచిది, మీ నిస్వార్థమైన ఆఫర్ త్వరగా చేరుకుంటుంది. స్వార్థానికి లేక ఈర్ష్యకు వశమై చేసుకున్న ఆఫర్ ఇంకా ఎక్కువ క్రోధాన్ని ఉత్పన్నం చేస్తుంది. మరి టీచర్లు ఏం చేస్తారు? 100 శాతము మోహ ముక్తులు. చెప్పండి, సరేనా, కాదా? హాజీ యేనా అని విదేశీయులు చెప్పండి.
బాప్‌దాదాకు అయితే తమ టి.వి.లో చాలా కొత్త-కొత్త విషయాలు కనిపిస్తాయి. ఇప్పుడు 60 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి కనుక ఇప్పటివరకు జరగని విషయాలు, కొత్త-కొత్త ఆటలు కూడా చాలా కనిపిస్తున్నాయి. ఈ సీజన్లో ఒక్కొక్కటిగా వర్ణిస్తాము. కానీ గుర్తుంచుకోండి, ఎవరి పట్ల అయినా స్వప్నమాత్రంగా కూడా మమకారం ఉన్నా, స్వార్థం ఉన్నా స్వప్నంలో కూడా సమాప్తం చేసేయండి. చాలామంది మేము కర్మలోకి తీసుకురాము కానీ స్వప్నాలు వస్తాయి అని అంటారు. కానీ ఏదైనా వ్యర్థమైన లేదా వికారీ స్వప్నం, మమకారానికి సంబంధించిన స్వప్నం వస్తే తప్పకుండా నిద్రపోయే సమయంలో మీరు నిర్లక్ష్యంగా నిద్రపోయారని అర్థం. చాలామంది రోజంతటిలో నాకు ఏ సంకల్పమూ నడవలేదు, ఏమీ జరగలేదు, అయినా స్వప్నం వచ్చింది అని అంటారు. కనుక చెక్ చేసుకోండి - నిద్రపోయే సమయంలో బాప్‌దాదాకు రోజంతటి చార్టును ఇచ్చి, బుద్ధిని ఖాళీ చేసుకొని నిద్రపోయారా? అలా కాకుండా అలసిపోయి వచ్చారు, మంచం మీదకు వెళ్లారు, వెంటనే నిద్రపోయారు - ఇది నిర్లక్ష్యం. వికర్మ చేయకపోయినా, సంకల్పం చేయకపోయినా ఇది నిర్లక్ష్యానికి లభించే శిక్ష. ఎందుకంటే నిద్రపోయే సమయంలో సదా మీ బుద్ధిని క్లియర్ చేసుకోండి, మంచిదైనా, చెడ్డదైనా అన్నీ బాబాకు అప్పగించండి మరియు మీ బుద్ధిని ఖాళీ చేసుకోండి అనేది బాబా ఫర్మాన్ (ఆజ్ఞ). బాబాకు ఇచ్చేసి, బాబాతో పాటు నిద్రపోండి, ఒంటరిగా కాదు. ఒంటరిగా నిద్రపోతారు కదా, అందుకే స్వప్నాలు వస్తాయి. బాబాతో పాటు నిద్రపోతే ఇటువంటి స్వప్నాలు ఎప్పుడూ రావు. కానీ ఫర్మాన్‌ను పాటించకపోతే ఫర్మాన్‌కు బదులుగా అర్మాన్ (దుఃఖము) లభిస్తుంది. ఉదయం లేచినప్పుడు నా పవిత్రత స్వప్నంలో సమాప్తమైపోయింది అని హృదయంలో అర్మాన్ (పశ్చాత్తాపము) ఉంటుంది కదా. ఇది ఎంతటి అర్మాన్(దుఃఖము)! దీనికి కారణం నిర్లక్ష్యం. కనుక నిర్లక్ష్యంగా అవ్వకండి. పడుకోవడానికి వచ్చి, ఇక్కడి అక్కడి విషయాలు మాట్లాడుకుంటూ నిద్రపోకండి. ఎందుకంటే సమాచారాలు అయితే చాలా ఉంటాయి మరియు ఆసక్తికరమైన సమాచారాలు ఎక్కువగా వ్యర్థమైనవే ఉంటాయి. చాలామంది - మాకు వేరే సమయమే దొరకదు, ఒకే గదిలోకి వెళ్ళినప్పుడు ఒకరికొకరు చెప్పుకుంటాము అని అంటారు. కానీ ఎప్పుడూ వ్యర్థ విషయాలను వర్ణిస్తూ-వర్ణిస్తూ నిద్రపోకండి, ఇది నిర్లక్ష్యం. ఇది ఆజ్ఞను ఉల్లంఘించడం. వేరే సమయం లేకపోయినా, ముఖ్యమైన విషయం ఉంటే నిద్రపోయే గదిలో కాదు, గది బయట రెండు సెకండ్లలో ఒకరికొకరు చెప్పుకోండి, నిద్రపోతూ చెప్పుకోకండి. కొంతమంది పిల్లలకు అలవాటు ఉంది. ఎలా నిద్రపోతున్నారు అని బాప్‌దాదా అందరినీ చూస్తారు కదా! ఒక్క సెకండులో బాప్‌దాదా మొత్తం విశ్వమంతా చక్కర్ వేస్తారు మరియు టి.వి. ద్వారా ఎలా నిద్రపోతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు... అన్నీ బాప్‌దాదా చూస్తారు. బాప్‌దాదాకు ఒక్క సెకండు పడుతుంది, ఎక్కువ సమయం పట్టదు. ప్రతి సేవాకేంద్రం, ప్రతి ప్రవృత్తిలో ఉండేవారు - అందరి వద్దకు వెళ్ళి వేస్తారు. కేవలం సేవాకేంద్రం మాత్రమే కాదు, మీ ఇళ్ళు కూడా టి.వి.లో కనిపిస్తాయి. కనుక ఆది అనగా అమృతవేళ మరియు అంతం అనగా నిద్రపోయే సమయం మంచిగా ఉంటే మధ్య స్వతహాగానే సరిగ్గా ఉంటుంది. అర్థమైందా? మాట్లాడుతూ-మాట్లాడుతూ కొంతమంది పన్నెండు, పన్నెండున్నర కూడా చేసేస్తారు. అందులో మస్త్ అయిపోతారు, వారికి సమయం తెలియనే తెలియదు. తర్వాత అమృతవేళ లేచి కూర్చుంటే సగం సమయం నిద్రాలోకంలో, సగం సమయం యోగంలో ఉంటుంది. ఎందుకంటే నిర్లక్ష్యంగా నిద్రపోతే అమృతవేళ కూడా నిర్లక్ష్యంగానే ఉంటుంది కదా! మమ్మల్ని ఎవరూ చూడటం లేదు అని అనుకోకండి. బాప్‌దాదా చూస్తారు. ఈ నిద్ర కూడా చాలా శాంతి మరియు సుఖాన్ని ఇస్తుంది, అందుకే మిక్స్ అయిపోతుంది. అడిగితే - లేదు, నేను చాలా శాంతిని అనుభవిస్తున్నాను అని అంటారు. చూడండి, నిద్రను కూడా విశ్రాంతి అని అంటారు. ఎవరైనా అనారోగ్యంగా ఉంటే డాక్టర్లు కూడా - విశ్రాంతి తీసుకోండి అని అంటారు. విశ్రాంతి ఎలా తీసుకుంటారు? సమయానికి నిద్రపోతారు. కనుక నిద్ర కూడా విశ్రాంతిని ఇచ్చేది. ఫ్రెష్ చేస్తుంది కదా. నిద్ర నుండి ఫ్రెష్‌గా లేస్తారు కదా, అప్పుడు ఈ రోజు యోగంలో చాలా ఫ్రెష్ అయ్యాము అని అంటారు. అచ్ఛా!
అందరూ చాలా దూర-దూరాల నుండి వచ్చారు. ఈ గ్రూపులో మొదటిసారి వచ్చినవారు చేతులు ఎత్తండి. చిన్న పిల్లలు ఉంటారు కదా, వారు పెద్దవారి కంటే ఇంకా ప్రియంగా ఉంటారు. కానీ కొత్త-కొత్తగా వచ్చినవారు మేకప్ చేయండి. పెద్దవారు 10 సంవత్సరాలలో చేసినది మీరు 10 రోజులలో చేయండి. మీరు చేయగలరు కూడా, ఎందుకంటే కొత్త-కొత్తగా వచ్చినప్పుడు ఉత్సాహ-ఉల్లాసాలు చాలా ఉంటాయని బాప్‌దాదా భావిస్తారు. ఎంత పాతవారవుతారో అప్పుడు... పాతవారు అర్థం చేసుకున్నారు! అందుకే చెప్పవలసిన అవసరం ఏముంది! కొత్తవారందరూ, కుమారీలు కావచ్చు, కుమారులు కావచ్చు, ప్రవృత్తిలో ఉండేవారు కావచ్చు - ప్రవృత్తిలో ఉండేవారు ఈ మహాత్ములందరినీ మీ పాదాల ముందు వంగేలా చేయాలి. వీరు ప్రవృత్తిలో ఉంటూ కూడా నిర్విఘ్నంగా పవిత్రతా బలంతో ముందుకు వెళ్తున్నారు అని అందరూ మీ గుణగానం చేస్తారు. ఒక రోజు వస్తుంది, అప్పుడు ఈ మహాత్ములు మీ అందరి ముందు వంగుతారు. కానీ మీ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి – మోహం నుండి ముక్తులుగా ఉండండి. అచ్ఛా.
టీచర్లతో:- టీచర్లు ప్రతి విషయంలో నిమిత్తంగా ఉన్నారు. నిమిత్తంగా ఉన్నారు కదా - ఈ విషయం పక్కాగా ఉంది కదా! టీచర్ అంటేనే నిమిత్తం. కనుక ఇప్పుడు కూడా ఈ సంవత్సరం – మోహం నుండి ముక్తులుగా అవ్వడంలో టీచర్లు నంబర్‌వన్ నిమిత్తంగా అవ్వండి. సరేనా! పక్కా! చప్పట్లు కొట్టండి. బాప్‌దాదా కూడా టీచర్లైన మీ కోసం విశేషంగా చప్పట్లు కొడుతున్నారు. అచ్ఛా.
కుమారీలు:- కుమారీలు చేతులు ఎత్తండి. కుమారీలు ఏమి చేస్తారు? కుమారీలు తమ జీవితానికి స్వయమే తమకు మిత్రులుగా అయ్యి, నిర్బంధనంగా అవ్వడంలో నంబర్‌వన్‌గా వెళ్ళాలి. ఈ కుమారీల లిస్ట్ తయారు చేయండి, అప్పుడు నిజంగా ఎంతమంది నిర్బంధనంగా అవుతారో చూస్తాము. కుమారీలు మేము నిర్బంధనంగా అయ్యి సేవలో నిమిత్తంగా అవుతాము అని భావిస్తే చేతులు ఎత్తండి. వీరికి ట్రైనింగ్ పెడతాము. ఇప్పుడు జ్ఞాన సరోవర్‌లో కూడా పెడుతున్నారు. కనుక కుమారీలు ఏమవుతారు? నిర్బంధన్. మనసు యొక్క బంధనం లేదు, సంబంధాల బంధనం లేదు. డబల్ బంధనాల నుండి ముక్తులు. అచ్ఛా.
కుమారులు:- కుమారులు చేతులు ఎత్తండి. కుమారులు చాలా మంది ఉన్నారు. కుమారులు ఏ విశేషతను చూపిస్తారు? కుమారులు మిమ్మల్ని మీరు ఇలా తయారు చేసుకోండి - మీ-మీ స్థానాలలో ఉన్నా, ఎక్కడ ఉన్నా అక్కడ మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలంటే, మీలో 400-500 మందితో ఒక గ్రూప్ తయారు చేసి గవర్నమెంట్‌లోని ఈ పెద్దవారిని కలిపించి - చూడండి, ఇంతమంది యూత్ విశ్వ సేవ కోసం లేదా భారతదేశ సేవ కోసం డిస్ట్రక్షన్ పని చేయకుండా, కన్స్ట్రక్షన్ పని చేస్తున్నారు అని చూపించాలి. కనుక ఇటువంటి గ్రూప్ తయారు చేయండి. మరి ఎంత సమయంలో మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటారు? ఎందుకంటే గవర్నమెంట్ యూత్‌ను ముందుకు తీసుకురావాలని కోరుకుంటుంది, కానీ వారికి ఇటువంటి యూత్ లభించడం లేదు. బాబా వద్ద అయితే ఉన్నారు కదా! కనుక ఆల్మైటీ గవర్నమెంట్ ఈ అలజడితో ఉన్న గవర్నమెంట్ ముందు ఒక ప్రాక్టికల్ ఉదాహరణను చూపించగలదు. కానీ పచ్చిగా ఉండకూడదు. మీరు - మేము చాలా బాగా నడుస్తున్నాము అని చెప్పడం, మీ సహచరులు మాత్రం - లేదు, ఇతను ఊరికే అలా చెబుతున్నాడు అని రిపోర్ట్ చేయడం, అలా ఉండకూడదు. పవిత్రత కోసం విరోధిస్తే ఆ విషయం వేరు, కానీ దివ్యగుణాల ధారణలో మీ ప్రభావం ఇంటివారి మీద పడాలి. అర్థమైందా? డైమండ్ జూబిలీ వరకు మేము తయారవుతాము అని భావించేవారు చేతులు ఎత్తండి. ఇప్పుడు కొంచెం చేతులు తగ్గిపోయాయి. అచ్ఛా, టీచర్లు ఈ డైమండ్ జూబిలీ మధ్యలోనే రిపోర్ట్ ఇవ్వండి, చివరిలో కాదు. గవర్నమెంట్‌కు యూత్‌ను చూపించాలి. ఇప్పుడు 8 నెలలు ఉన్నాయి. కనుక ఎనిమిది నెలలు సరిపోతాయి.
అధర్కుమార్-కుమారీలు:- అధర్కుమార్-కుమారీలు ఏమి చేస్తారు? ప్రవృత్తిలో ఉండేవారు ఒక కొత్త ఋజువును ఇవ్వాలి. ఇంట్లో ఉన్నవారు, మీ ఫ్యామిలీలో ఎవరికైనా నలుగురు పిల్లలు ఉండవచ్చు, ఎవరికైనా ఎనిమిది మంది ఉండవచ్చు, ఎవరికైనా ఇద్దరు ఉండవచ్చు, ఎంతమంది ఉన్నా ప్రతి ప్రవృత్తిలో ఉండేవారు తమ పిల్లలకు ఇటువంటి విలువలను నేర్పించి తయారు చేయాలి, ఆ పిల్లల ధారణతో కూడిన ఒక గ్రూప్ స్యాంపుల్గా ఉండాలి. కాలేజ్-స్కూల్లో చదివేవారి ముందు ఆ పిల్లలను చూపించాలి. ప్రవృత్తిలో ఉండేవారు తమ పిల్లల గ్రూప్‌ను తయారు చేయాలి. ఎవరి దగ్గర రిపోర్ట్ అడిగినా, వారి టీచర్లను అడిగినా, వారి చుట్టుపక్కల స్నేహితులను అడిగినా, అందరూ వారి గురించి మంచి రిపోర్ట్ ఇవ్వాలి. మీరు - చాలా మంచివారు అని చెప్పడం, టీచర్ మాత్రం - వీరు చదవనే చదవరు అని చెప్పడం, అలా ఉండకూడదు. కనుక ప్రవృత్తిలో ఉండేవారు ఇటువంటి పిల్లలను తయారు చేయాలి. జ్ఞానంలోకి వస్తున్నారు, మంచిగా కూడా ఉన్నారు, కానీ వారికి కొంచెం ఇంకా అటెన్షన్ ఇప్పించి ఇటువంటి గ్రూప్‌ను తయారు చేయండి. అప్పుడు ఆ పిల్లలే ఎడ్యుకేషన్‌కు సర్టిఫికేట్ అవుతారు. లేకపోతే ఎడ్యుకేషన్ వారు మీరు సర్టిఫికేట్ ఇవ్వరు కదా అని అంటారు. అప్పుడు మీరు - సర్టిఫికేట్ చూడండి, ఇది చైతన్యమైనది. మీరు కాగితం సర్టిఫికేట్ ఇస్తారు, మేము మీకు చైతన్యమైన సర్టిఫికేట్‌ను చూపిస్తాము అని చెప్పండి. అర్థమైందా?
డైమండ్ జూబిలీని ఏదో అలా మామూలుగా జరపకూడదు. డైమండ్ జూబిలీలో ఏదైనా నవీనతను చూపించాలి. అది చూసి ఇదేమిటి అని గవర్నమెంటు కళ్ళు తెరుచుకోవాలి! ఏ కార్యానికి కూడా వారు చెయ్యము అని చెప్పలేకపోవాలి. ఇంకా ఎక్కువగా ఆఫర్ చెయ్యాలి. ఎలా అయితే ఇక్కడకు మహామండలేశ్వరులు వచ్చినప్పుడు వారు ఏమి ఆఫర్ చేసారు? మా ఆశ్రమాలను బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు నడిపించాలి అని ఆఫర్ చేసారు. అలా అడిగారు కదా! అలాగే మా డిపార్టుమెంటును మీరే నడిపించగలరు అని అన్ని డిపార్టుమెంటుల వారు ఆఫర్ చెయ్యాలి. ఇటువంటి ప్రాక్టికల్ స్వరూపాన్ని తయారుచేయ్యటము - ఇదే డైమండ్ జూబిలీ. కానీ మొట్టమొదటి ప్రతిజ్ఞ గుర్తుందా? ఎలా తయారవ్వాలి? (మోహ ముక్తులు). అప్పుడే ఇవన్నీ అవ్వగలవు. ఇప్పటికి కూడా పిల్లలను కొడుతూ ఉంటే పిల్లలు మంచిగా ఎలా అవుతారు. పరస్పరంలోనే బలహీనులుగా అవుతూ ఉన్నట్లయితే మహాత్ములు కాళ్ళ దగ్గరకు ఎలా వస్తారు. ఎంతెంతగా పవిత్రతా స్తంభాన్ని దృఢం చేస్తారో, అంతంతగా ఈ పవిత్రతా స్తంభం లైట్ హౌస్లా పని చేస్తుంది. అచ్ఛా!
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులపై బాప్‌దాదాకు, అందులోనూ విశేషంగా బ్రహ్మా బాబాకు డబల్ ప్రేమ ఉంది. ఎందుకు డబల్ ప్రేమ ఉందో చెప్పండి? డబల్ ప్రేమ ఉందని భావిస్తున్నారా? ఎందుకు డబల్ ప్రేమ ఉంది? (లౌకిక-అలౌకిక డబల్ కార్యాలు చేస్తారు) మంచి జవాబు ఇచ్చారు. కానీ ఇంకా కూడా ఉంది. బ్రహ్మా బాబాకు డబల్ విదేశీయులపై విశేషమైన ప్రేమ ఎందుకంటే, బ్రహ్మా బాబా ప్రతి కార్యంలో క్విక్ ఎగ్జాంపుల్‌గా స్వయంగా కూడా ఉన్నారు మరియు పిల్లలను కూడా అలా తయారు చేసారు. డబల్ ఫారెనర్స్ వచ్చిన వెంటనే కోర్సు చేస్తారు, కొద్దిగా పక్కా అవుతారు మరియు సేవాకేంద్రాన్ని తెరిచేస్తారు. ఇలా చేస్తారు కదా? వీరికైతే చాలా ట్రైనింగ్ జరుగుతుంది, కానీ డబల్ విదేశీయులు సేవలో క్విక్ ఎగ్జాంపుల్‌గా ఉన్నారు. కనుక ఇటువంటి పిల్లలు వెలువడాలని బ్రహ్మా బాబా చాలా కాలం నుండి ఆహ్వానించేవారు. అందువల్ల డబల్ విదేశీయులు సేవలో ఎక్కువ సమయం తీసుకోరు. త్వరగా సేవలో నిమగ్నమైపోతారు. ఎంత బిజీగా ఉన్నా కూడా సేవ పట్ల మంచి అభిరుచి ఉంటుంది. ఇప్పుడు కూడా వీరు మ్యూజియం తయారు చేయడానికి వచ్చారు. (జ్ఞాన సరోవర్‌లో 5 మంది డబల్ విదేశీ సోదరసోదరీలు మ్యూజియం తయారు చేస్తున్నారు) చూడండి, డబల్ విదేశీయులలో విశేషత ఉంది కాబట్టే విదేశాల నుండి విశేషంగా మిమ్మల్ని పిలిచారు. విశేషత ఉంది కదా! ఈ మొత్తం గ్రూప్ మంచిగా ఉంది. చూడండి, మీరు విశేష ఆత్మలు అయ్యారు కదా, విశేష కార్యం కోసం మిమ్మల్ని పిలిచారు కనుక విశేష ఆత్మలు అయ్యారు. బాప్‌దాదాకు అయితే మీరు మంచిగా అనిపిస్తారు. శివబాబాకు కూడా మంచిగా అనిపిస్తారు, బ్రాహ్మణ పరివారానికి కూడా మంచిగా అనిపిస్తారు. మిమ్మల్ని చూసినప్పుడు ఇక్కడ భారతవాసులకు కూడా - చూడండి, మనం కేవలం భారతదేశంలోనే కాదు, విశ్వమంతటా ఉన్నాము అనే నషా ఉంటుంది. కనుక మీరు అందరికీ సికీలధే. అచ్ఛా.
మ్యూజియం తయారు చేసే గ్రూపును బాప్‌దాదా సమ్ముఖంగా పిలిచారు:- ఇది కూడా డ్రామా అనుసారంగా విశేష వరదాత యొక్క వరదానం లభించడమే. ఏదైనా ఆర్ట్ ఉంటే ఆ ఆర్ట్‌ను వరదానంగా భావించి కార్యంలో ఉపయోగించండి. ఇది బాబా యొక్క వరదానం, డ్రామా అనుసారంగా విశేషంగా నిమిత్తమయ్యారు, కనుక దాని ద్వారా కార్యం సహజంగా మరియు సఫలమై ఉన్నట్లే. అలాగే ఉంది కదా? కనుక విశేష వరదానీ ఆత్మలు. దానిని అదే విశేషతతో కార్యంలో ఉపయోగిస్తూ ఉండండి. ఇది బాబా యొక్క వరదానం - ఈ స్మృతి సదా ఉండాలి. అప్పుడు కేవలం మీ చేతులు మాత్రమే పని చేయవు, బాబా యొక్క శక్తి మీ చేతులతో పాటు పని చేస్తుంది. చాలా బాగుంది. అచ్ఛా.
అహ్మదాబాద్:- మహాదేవ్ నగర్ సేవాకేంద్రం ప్రారంభోత్సవ సందర్భంగా 19 మంది కుమారీలు ఎవరైతే సమర్పణ సెరిమనీ జరుపుకున్నారో, వారందరూ బాప్‌దాదాను కలుసుకోవడానికి మధుబన్కు వచ్చారు. వారిని బాప్‌దాదా సమ్ముఖంగా పిలిచారు:- చూడండి, కుమారీలకు ఎలాగూ మహిమ ఉంది. భక్తిమార్గంలో మీరందరూ కుమారీల పాదాలను కూడా కడిగి ఉంటారు. పూజ కూడా చేసి ఉంటారు మరియు ఇప్పుడు ఈ కుమారీలే మీ అందరినీ పరమాత్మ మిలనము మరియు పరమాత్మ వారసత్వానికి అధికారులుగా తయారు చేస్తున్నారు. కుమారీలందరూ పక్కాగా ఉన్నారా? ఫోటో అయితే తీసేసారు. ఎవరూ పచ్చిగా లేరు కదా? ఎవరూ పాత ప్రపంచంలోకి వెళ్ళిపోరు కదా? పక్కాగా ఉన్నారు! అచ్ఛా.
నలువైపులా ఉన్న హృదయంలో ఇమిడి ఉన్న బాప్‌దాదా యొక్క చాలా కాలం తర్వాత కలిసిన శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను పాటించటం ద్వారా స్వయం యొక్క మరియు ఇతరుల యొక్క కోరికలను సమర్పితము చేయించేవారు, సదా పవిత్రతా స్తంభాన్ని దృఢంగా చేసుకునే మరియు పవిత్రత యొక్క లైట్‌ను లైట్ హౌస్‌గా అయ్యి వ్యాపింపజేసే విశేష ఆత్మలకు, సదా స్వయాన్ని మోహముక్తులుగా చేసుకునే, తండ్రి సమీపంగా వచ్చే మరియు సమీపంగా ఉండే పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
విదేశాలలో నలువైపులా ఉన్న పిల్లలకు బాప్‌దాదా యొక్క విశేష ప్రియస్మృతులు ఎందుకంటే వారు ప్రియస్మృతులతో కూడిన ఉత్తరాలను ఎప్పుడూ పంపుతూ ఉంటారు. ఎవరైతే ఉత్తరాలను పంపారో వారికి కూడా విశేషమైన స్మృతులు మరియు ఎవరైతే హృదయము ద్వారా ప్రియస్మృతులను పంపారో వారికి కూడా విశేషమైన ప్రియస్మృతులు.
*** ఓంశాంతి ***
