"జ్ఞాన సరోవర్ ప్రారంభోత్సవ శుభ ముహూర్త సందర్భంగా అవ్యక్త బాప్‌దాదా ఉచ్ఛరించిన మధుర మహావాక్యాలు" (ఉదయం 11.00 గంటలు)
ఈరోజు స్నేహ సంపన్న రోజున స్నేహ సాగరుడైన బాప్‌దాదా తమ అతి స్నేహీలు, స్నేహములో నిమగ్నమై ఉన్న లవలీనులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. అందరి స్నేహ గీతాలను బాప్‌దాదా వింటూ ఉన్నారు మరియు వింటూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరి స్నేహాన్ని బాప్‌దాదా చూసి, ఆ తండ్రి కూడా - వాహ్ నా స్నేహీ పిల్లలూ, వాహ్! అనే పాటను పాడుతారు. పిల్లలు కూడా నేటి ఈ సమర్థ దివసం నాడు సేవను సాకారము చేసారు మరియు చేస్తూ ఉంటారు. బ్రహ్మాబాబా కూడా పిల్లల గుణగానము చేస్తారు. కానీ సాకార రూపము కన్నా అవ్యక్త రూపములో ఇంకా ఎక్కువ సమీపతను మరియు తోడును విశేషంగా అనుభవం చేయిస్తున్నారు. తండ్రి తోడుగా లేరు అని పిల్లలకు అనిపిస్తుందా? అలా అనిపిస్తుందా? తండ్రితో పాటు కలిసి జన్మ తీసుకున్నారు, కలిసి సహచరులైన సేవాధారులుగా ఉన్నారు మరియు ఇక ముందు కూడా కలిసి-కలిసి ఉంటారు మరియు కలిసి వెళ్తారు. బ్రహ్మాబాబాకు కూడా ఒంటరిగా ఉండటం ఇష్టం అనిపించదు, ఒంటరిగా ఉన్నాము అని మీకు అనిపిస్తుందా? కలిసి ఉన్నారు, కలిసి ఉంటారు, కలిసి వెళ్తారు, కలిసి-కలిసి రాజ్యం చేస్తారు. శివబాబాకు విశ్రాంతిని ఇస్తారు మరియు మీతో పాటు బ్రహ్మా బాబా కూడా రాజ్యం చేస్తారు. మీ రాజ్యం గుర్తుంది కదా? ఈ రోజు సేవాధారులుగా ఉన్నారు మరియు రేపు రాజ్యాధికారులుగా ఉంటారు. మీ రాజ్యం ఎదురుగా కనిపిస్తుంది కదా? మీ రాజ్యానికి చెందిన ఆ స్వర్గమనే స్థానము, స్వర్గంలోని దివ్య శరీరం రూపీ వస్త్రము అందరి ఎదురుగా స్పష్టంగా ఉన్నాయి కదా. ఇప్పుడిక వాటిని ధరించబోతున్నారు. అలా అనుభవమవుతుంది కదా? మీ భవిష్యత్తు స్పష్టంగా ఉంది కదా? ఈ రోజు వర్తమానం ఉంది మరియు రేపు భవిష్యత్తు కూడా వర్తమానంగా అవుతుంది - ఈ నిశ్చయం ఉంది కదా? పక్కా నిశ్చయం ఉందా?
అందరూ పాతవారు, పక్కా అయినవారు వచ్చారు కదా. బాప్‌దాదాకు కూడా మరియు విశేషంగా బ్రహ్మా బాబాకు కూడా సంతోషంగా ఉంది, ఒకవైపు స్థాపనలోని సహచరులైన ఆది రత్నాలు ఎదురుగా కూర్చున్నారు, రెండవవైపు స్థాపనా వృద్ధి యొక్క శ్రేష్ఠ రత్నాలు ఉన్నారు. కనుక ఈ సంగఠనలో బ్రహ్మా బాబా రెండు రకాల రత్నాలను చూసి హర్షిస్తున్నారు మరియు పిల్లలు కూడా ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో శరీరం గురించి గాని, వసతుల గురించి గాని ఆలోచించకుండా చల్ల-చల్లని గాలులలో కూడా చేరుకున్నారు. ఈ చల్ల గాలులు పిల్లలైన మీకు నమస్కారం చేయటానికి వస్తాయి. మామూలుగా కూడా చూడండి, రాజ్య సింహాసనంపై కూర్చున్నప్పుడు వెనుక నుండి ఏం జరుగుతుంది? విసనకర్రతో విసురుతూ ఉంటారు, అప్పుడు దాని నుండి చల్ల-చల్లని గాలులు వస్తాయి. అలాగే ఈ చల్లని గాలులు కూడా మీకు విసనకర్ర వలె విసరడానికి వస్తున్నాయి ఎందుకంటే మీరందరూ కూడా ఉన్నతోన్నతమైన విశేష ఆత్మలు. నషా ఉంది కదా? ఈ రోజు బ్రహ్మా బాబా విశేషంగా తమ జన్మ నుండి సహచరులైన వారిని మరియు సేవలో సహచరులైన వారిని (సేవకు నిమిత్తులైన ఆది రత్నాలు మరియు జన్మ సమయంలోని ఆది రత్నాలు) ఇరువురినీ చూసి-చూసి హర్షిస్తున్నారు.
అచ్ఛా, ఈ హాలును కూడా రాజ్య దర్బారులా తయారుచేసారు. (జ్ఞాన సరోవర్‌లోని ఆడిటోరియం హాల్) రాజ్య దర్బారు ఏర్పాటు చేసినప్పుడు గ్యాలరీలో కూడా కూర్చుంటారు, అలా ఇక్కడ కూడా గ్యాలరీలోని వారు మంచిగా అనిపిస్తున్నారు. (హాలులో అన్నయ్యలు అందరూ కూర్చున్నారు, మాతలు అందరూ బయట కూర్చున్నారు) అచ్ఛా, ఈ రోజు మాతలు చేసిన త్యాగానికి భాగ్యం వారికి ఇప్పుడే లభించేస్తుంది. తపస్య చాలా బాగా చేస్తూనే ఉన్నారు. తపస్యకు ఫలం లభిస్తుంది. చల్ల-చల్లని గాలులు కూడా వస్తున్నాయి మరియు ఎండ కూడా వస్తుంది. అచ్ఛా.
దీనిని జ్ఞాన సరోవర్ అందామా లేక స్నేహ సరోవర్ అందా? జ్ఞాన సరోవర్‌లో స్నేహ సరోవరం బాగుంది. ఈ జ్ఞాన సరోవర్ సేవకు విశేషమైన లైట్ హౌస్ మరియు మైట్ హౌస్. ఈ భూమి నుండి అనేక ఆత్మల భాగ్యపు సితార మెరుస్తుంది. దూరమైపోయిన అనేక మంది ఆత్మలు తమ తండ్రితో మిలనం జరుపుకుంటారు. ఇది అనేక ఆత్మల దుఃఖాన్ని దూరం చేసే భూమి. సరోవరంలోకి రాగానే సుఖం యొక్క అలలలో తేలియాడుతున్నట్లుగా అనుభవం చేస్తూ ఉంటారు. ఈ జ్ఞాన సరోవర్ ద్వారా మూడు రకాల వారు మూడు రకాల ప్రాప్తులకు అధికారులుగా అవుతారు - కొందరు వారసత్వానికి అధికారులుగా, కొందరు వరదానాలకు అధికారులుగా, మరికొందరు ఆశీర్వాదాలకు అధికారులుగా అవుతారు. కావున మూడు రకాల ప్రాప్తులతో సంపన్నంగా అవుతారు. ఇది శ్రేష్ఠ సరోవరము. సాధారణ ఆత్మలు వస్తారు మరియు ఫరిశ్తా జీవితాన్ని అనుభవం చేసి వెళ్తారు. అంతేకాక అనేక బ్రాహ్మణాత్మలు తపస్య యొక్క సూక్ష్మ అనుభూతుల ద్వారా అవ్యక్త పాలనను మరియు సూక్ష్మ యోగం యొక్క సహజ అనుభవాలు మరియు ప్రాప్తుల యొక్క లాభాన్ని పొందుతారు. ఎంతో మంది బ్రాహ్మణాత్మలకు స్వ ఉన్నతి పట్ల ఉన్న శ్రేష్ఠ ఆశలను పూర్తి చేసే ఈ సాధనము చాలా శ్రేష్ఠమైనది. స్థానము సాధారణమైనదే కానీ స్థితిని శ్రేష్ఠంగా అనుభవం చేయిస్తుంది. ఇది విధిపూర్వకంగా జ్ఞానాన్ని విశ్వంలో ప్రత్యక్షం చేసే స్థానము మరియు అన్నింటికన్నా మొదటి లాభము, తండ్రి మరియు పిల్లల మిలనము. చూడండి, డబల్ సంఖ్యలో కలుసుకుంటున్నారు కదా! బయట కూర్చున్నా లేక ఎక్కడ కూర్చున్నా గాని డబల్ సంఖ్య అయితే ఉంది కదా. కావున ప్రత్యక్ష ఫలం ఏమిటంటే - పిల్లలు డబల్ సంఖ్యలో మిలనం జరుపుకుంటున్నారు. అర్థమైందా? ఇటువంటి సరోవరంలో, సరోవరము తయారుచేసేవారికి, సహయోగం ఇచ్చేవారికి, సంకల్పాలతో ధైర్యాన్ని అందించేవారికి, స్నేహ హస్తాలతో సరోవరాన్ని సంపన్నము చేసే దేశ-విదేశాల పిల్లలకు పదమా రెట్ల అభినందనలు, అభినందనలు.
చిన్న పిల్లల నుండి మొదలుకొని బ్రాహ్మణులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి తనువు, మనసు, ధనం యొక్క సహయోగం అందిన మొదటి స్థానము ఇదే. తనువుతో ఇటుకలు మోయకపోయినా కానీ తనువుతో తమ-తమ సహచరులను ఈ సేవలో సహచరులుగా చేసారు, ఉల్లాసాన్ని ఇప్పించారు, అలా స్నేహము, సహయోగము, శక్తి యొక్క బిందువు-బిందువుతో అలంకరించబడిన ఈ సరోవరం శ్రేష్ఠ సఫలతను అనుభవం చేయిస్తూ ఉంటుంది. కనుక సహయోగం చేసిన వారందరికీ, మూల-మూలల్లోని దేశ-విదేశాల వారికి మరియు విశేషంగా ఎవరైతే చల్ల-చల్లని గాలులు మరియు వర్షంలో కూడా ధైర్యాన్ని కోల్పోలేదో వారికి విశేషమైన అభినందనలు, అభినందనలు. బాప్‌దాదాకు తెలుసు, పిల్లలకు కొంచెం కష్టం అనిపించినా కానీ దానిని ప్రేమతో స్వీకరించారు. ప్రేమలో శ్రమను అనుభవం చేయలేదు. అంతేకాక ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ బాప్‌దాదా యొక్క పదమా రెట్ల సహాయం కూడా ఉండనే ఉంటుంది. అందుకే బాప్‌దాదా మసాజ్ చేస్తూ ఉన్నారు మరియు చేస్తూ ఉంటారు. అచ్ఛా, ఇక్కడ ఇంజనీర్లు చేతులు ఎత్తండి. సమయానికి పూర్తి చేసినందుకు చాలా, చాలా అభినందనలు. మీరు కూర్చోవటానికి వీలుగా అయితే తయారుచేసి ఇచ్చారు కదా! బాబా అయితే వచ్చేసారు కదా. ప్రతిజ్ఞ ఇదే కదా. మీరందరూ కూడా వీరికి అభినందనలను ఇస్తున్నారు కదా! హాలును అలంకరించినవారు ఎక్కడ ఉన్నారు? వీరు మున్నీ పార్టీ వారు. చూడండి, ఇది స్నేహ సరోవరం కదా, అందుకే కలకత్తా నుండి ఇక్కడకు పువ్వులు వచ్చాయి. (కలకత్తా నుండి చాలా సుందరమైన రంగు-రంగుల పువ్వులు వచ్చాయి, వాటితో మొత్తం స్టేజ్ అంతా అలంకరించబడి ఉంది) అచ్ఛా! మీ అందరికి కూడా చేరుకున్నందుకు అభినందనలు మరియు మాతలకు పదమా రెట్ల అభినందనలు.
(జాల్ మిస్త్రీ హాలులో సౌండ్‌ను ఏర్పాటు చేసారు) చూడండి, ఒకవేళ ఇతను ధైర్యం చేయకపోతే మీరు మురళిని వినలేకపోయేవారు. అందరూ మురళి కోసం పరితపించేవారే కదా. మురళి అనే సాధనం అన్నింటికన్నా శ్రేష్ఠమైనది. ఎంత మంచి ఏర్పాటు చేసారు. ప్రశాంతంగా వినిపిస్తుంది. బయట కూడా వినిపిస్తుంది. ఈ ఏర్పాటు చాలా బాగా చేసారు. ఎవరైతే సేవకు నిమిత్తులుగా అయ్యారో, ఒక్కొక్క డిపార్టుమెంట్ పేరును విడిగా తీసుకోవడం లేదు, కానీ ప్రతి ఒక్కరూ - నాకు స్నేహము మరియు సహయోగానికి అభినందనలు ఇచ్చారు అని భావించండి. అచ్ఛా, అందరికన్నా మొదటి అభినందనలు ఎవరికి ఇవ్వాలి? దాదీకు. (బాప్‌దాదాకు) బాప్‌దాదా అయితే ఇచ్చేవారు కదా. పిల్లలకు నంబర్‌వన్ సేవాధారి బాబా అని బాప్‌దాదా సదా అంటారు. బాబా అయితే సదా సేవాధారి కానీ పిల్లలు కూడా సేవలో బాబా కన్నా కూడా సహయోగులుగా ఉన్నారు. ఒక్కొక్కరి పేరు తీసుకోవాలా, మనసులో ఒక్కొక్క బిడ్డ పేరును తీసుకుంటున్నారు మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు. అన్ని డిపార్టుమెంట్ల వారికి అభినందనలు. లైట్ లేకుండా కూడా పని జరగదు, మైక్ లేకుండా కూడా పని జరగదు. లైట్, మైట్, మైక్ అందరికీ అభినందనలు.
(టీచర్లతో) మీరు లేకపోతే సెంటర్లు తెరుచుకోవు. ఒక్కొక్కరు ఎన్ని సెంటర్లను తెరిచారో చూడండి. ఇక్కడ సేవ యొక్క రాజధాని ఉంటుంది మరియు అక్కడ రాజ్యం యొక్క రాజధాని ఉంటుంది. అచ్ఛా. పాండవులు కూడా చూస్తున్నారు. మంచి-మంచి పాండవులు కూడా చేరుకున్నారు, పాండవులు లేకపోయినా కూడా గతి ఉండదు కానీ పాండవులు శక్తులను ముందుంచారు. మీరు ఉంచారా లేక బాబా ఉంచారా? ఫాలో ఫాదర్ చేసారు. ఆ మాటకొస్తే మీరందరూ కూడా తండ్రికి సమీపంగా కూర్చున్నారు. వీరే సమీపంగా ఉన్నారు అని అనుకోకండి, ఎవరైతే ఎదురుగా ఉన్నారో వారు అతి సమీపంగా ఉన్నారు.
డబల్ విదేశీయులు కూడా వచ్చారు. వీరు కూడా అద్భుతం చేస్తున్నారు. దేశ-విదేశాలలో ప్రత్యక్షం చేసే సేవను చాలా మంచిగా చేస్తూ ఉన్నారు మరియు చేస్తూ ఉంటారు. అచ్ఛా!
(తరువాత బాప్‌దాదా జ్ఞాన సరోవర్ యొక్క విశాలమైన స్టేజ్‌పై నిలబడి, ఇంజనీర్లతో పాటు కొవ్వొత్తులను వెలిగించారు, ముఖ్యమైన టీచర్లు మరియు దాదీలతో కలిసి కేక్ కట్ చేసారు, తరువాత ముఖ్యమైన దాదీలు బాప్‌దాదాతో పాటు హాలు బయట ప్లాజాలోకి వచ్చారు, అక్కడ బాప్‌దాదా 2000 కన్నా ఎక్కువ సంఖ్యలో కూర్చున్న మాతలకు చేయి ఊపుతూ వారిని కలిసారు మరియు జెండాను ఎగురవేసారు, ఆ తరువాత ఈ మహావాక్యాలను ఉచ్చరించారు):-
బాప్‌దాదా పిల్లలైన మీ అందరి మనసులలో తండ్రి స్నేహమనే జెండా ఏదైతే ఎగురుతుందో, దానిని చూసి హర్షిస్తున్నారు. ఇది సేవ కొరకు ఉంది మరియు తండ్రి-పిల్లల మధ్య మనసులో స్నేహమనే జెండా ఉంది. జెండాను ఎగురవేసే వేడుక జరిపినప్పుడు దానిని పైకి ఎగురవేస్తారు కదా, అలాగే సదా స్నేహంలో ఎంతో పైకి ఎగురుతూ ఉండండి. ఈ జెండా కూడా తండ్రిని ప్రత్యక్షం చేసే జెండా. ఇది వస్త్రంతో తయారుచేసిన జెండా కానీ ఈ వస్త్రంతో తయారుచేసిన జెండాలో - ‘‘బాబా వచ్చేసారు’’ అనే మీ అందరి ధ్వని నిండి ఉంది. ఈ ప్రత్యక్షతా జెండా ఇప్పుడిక ప్రతి మూలలోనూ ఎగురవేయబడుతుంది. మరియు మీరందరూ ఎగురవేయబడిన ఆ ప్రత్యక్షతా జెండాను చూస్తారు, వింటారు, హర్షిస్తారు. ఈ రోజు జ్ఞాన సరోవర్‌లో ఎగురవేయబడింది, రేపు విశ్వంలో ఈ జెండా ఎగురవేయబడుతుంది. మీరందరూ తపస్య చేయాల్సి వచ్చింది, దానికి అభినందనలు కానీ చాలా ప్రశాంతంగా మంచిగా కూర్చున్నారు, చూసేందుకు మీకు ఎంత బాగా కనిపిస్తుందో అంతగా లోపల వెనుకవైపు కూర్చున్నవారికి కనిపించటం లేదు. మీరు బయట లేరు, హృదయం లోపల ఉన్నారు. అందరూ చాలా-చాలా అదృష్టవంతులు, అందుకే సదా సంతోషాన్ని పంచుతూ ఉండండి. సంతోషంగా ఉండండి మరియు సంతోషాన్ని పంచుతూ ఉండండి. (తరువాత బాప్‌దాదా నలువైపుల తయారైన భవనాలకు తమ దృష్టిని ఇచ్చారు మరియు తిరిగి హాలులోకి వచ్చి ఇంజనీర్లు అందరికీ తమ చేతులతో టోలీని తినిపించారు మరియు వీడ్కోలు తీసుకున్నారు)
*** ఓంశాంతి ***
