‘‘బ్రహ్మాబాబా యొక్క మరొక రెండు అడుగులు - ఆజ్ఞాకారీ, విశ్వాసపాత్రులు’’
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ స్నేహీ మరియు సహయోగీ పిల్లలను మరియు శక్తిశాలిగా, సమానులుగా ఉండే పిల్లలను చూస్తున్నారు. పిల్లలందరూ స్నేహీలే కానీ శక్తిశాలిగా యథాశక్తి ఉన్నారు. స్నేహీ పిల్లలకు స్నేహానికి రిటర్న్‌లో పదమా రెట్ల స్నేహము మరియు సహయోగము ప్రాప్తిస్తాయి. శక్తిశాలిగా, సమానులుగా ఉన్న పిల్లలకు సదా సహజ విజయీ భవ అన్న రిటర్న్ లభిస్తుంది. లభించడమైతే అందరికీ లభిస్తుంది. స్నేహీ పిల్లలు యథా శక్తిశాలిగా ఉన్న కారణంగా సదా సహజ విజయాన్ని అనుభవం చేయలేకపోతారు. ఒక్కోసారి సహజంగా, ఒక్కోసారి శ్రమతో కూడినదిగా అనిపిస్తుంది. బాప్‌దాదా స్నేహీ పిల్లలకు కూడా శ్రమను సహజతరం చేసేందుకు సహయోగాన్ని ఇస్తారు. ఎందుకంటే స్నేహీ ఆత్మలు సహయోగులుగా కూడా ఉంటారు. కావున సహయోగానికి రిటర్న్‌లో బాప్‌దాదా సహయోగాన్ని తప్పకుండా ఇస్తారు కానీ యోగము యథార్థముగా ఉండని కారణంగా సహయోగము లభిస్తున్నప్పటికీ ప్రాప్తిని అనుభవం చేయలేకపోతారు. యోగము ద్వారానే సహయోగము అనుభవమవుతుంది. శక్తిశాలిగా, సమానులుగా ఉన్న పిల్లలు సదా యోగయుక్తంగా ఉంటారు, అందుకే సహయోగాన్ని అనుభవం చేస్తూ సహజ విజయులుగా అవుతారు. కానీ, తండ్రికి ఇరువురు పిల్లలూ ప్రియమైనవారే. ప్రేమ మరియు సదా విజయులుగా ఉండే శుభమైన కోరిక పిల్లలందరిలోనూ ఉంటుంది కానీ శక్తి తక్కువగా ఉన్న కారణంగా సమయానికి సర్వ శక్తులను కార్యంలో వినియోగించలేకపోతారు. తండ్రి వారసత్వం యొక్క అధికారంగా సర్వ శక్తుల యొక్క అధికారాన్ని ఇవ్వడంలో బాప్‌దాదా వ్యత్యాసం చూపించరు, అందరినీ సంపూర్ణ అధికారులుగా తయారుచేస్తారు కానీ తీసుకోవడంలో నంబరువారుగా అవుతారు. బాప్‌దాదా ఎవరికైనా స్పెషల్‌గా, వేరుగా ట్యూషన్ చెప్తారా? అలా చెప్పరు. చదువు అందరికీ ఒక్కటే, పాలన అందరికీ ఒక్కటే. పాండవులకు వేరే పాలన, శక్తులకు వేరే పాలన - ఇలా ఏమైనా ఉందా? అందరికీ ఒకే విధమైన పాలన మరియు చదువు ఉన్నాయి. కానీ దానిని తీసుకోవడంలో మరియు రిజల్టులో ఎంత తేడా ఉంటుంది! అష్ట రత్నాలు ఎక్కడ మరియు 16108 రత్నాలు ఎక్కడ - ఎంత తేడా ఉంది! ఈ వ్యత్యాసం ఎందుకు ఏర్పడింది. చదువును, పాలనను, వరదానాలను ధారణ చేయడము మరియు కార్యంలో వినియోగించడము - ఇందులో వ్యత్యాసం ఏర్పడుతుంది. చాలామంది పిల్లలు ధారణ కూడా చేస్తారు కానీ సమయమనుసారంగా కార్యంలో వినియోగించడం రాదు. బుద్ధి వరకు చాలా నిండుగా ఉంటారు కానీ కర్మలలోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది.
బ్రహ్మా బాబా నంబర్‌వన్ ఎందుకు అయ్యారు? రెండు అడుగులు ఇంతకుముందు వినిపించాము కదా! మూడవది - సదా తండ్రి, శిక్షకుడు మరియు సద్గురువుకు ఆజ్ఞాకారిగా అయ్యారు. ప్రతి ఆజ్ఞకు హాజీ, నేను హాజరై ఉన్నాను అని అన్నారు. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - సదా సర్వ ఖజానాల వారసత్వంలో సంపన్నంగా తయారవ్వాలి మరియు తయారుచేయాలి. ప్రత్యక్షంగా చూసినదేమిటంటే - సర్వ ఖజానాలను - జ్ఞానాన్ని, శక్తులను, గుణాలను, శ్రేష్ఠ సమయాన్ని, శ్రేష్ఠ సంకల్పాల ఖజానాను మొదటి రోజు నుండి చివరి రోజు వరకు కార్యంలో వినియోగించారు. చివరి రోజున కూడా సమయాన్ని, సంకల్పాలను పిల్లల కోసమే వినియోగించారు. జ్ఞానం యొక్క ఖజానాను, స్మృతి యొక్క శక్తిని మరియు సహనశీలతా గుణం యొక్క స్వరూపాన్ని - ఈ అన్ని ఖజానాలను చివరి సమయం వరకు శరీరాన్ని కూడా మరచి సేవలో ప్రాక్టికల్‌గా వినియోగించి చూపించారు. ఇటువంటివారినే ఆజ్ఞాకారీ నంబర్‌వన్ బిడ్డ అని అంటాము ఎందుకంటే తండ్రి యొక్క విశేషమైన ఆజ్ఞ ఏమిటంటే - స్మృతి మరియు సేవలో సదా తండ్రి సమానంగా ఉండండి. కావున ఆది నుండి అంతిమ ఘడియ వరకు ఈ రెండు ఆజ్ఞలను ప్రాక్టికల్లోకి తీసుకురావడం చూసారు కదా? స్నేహానికి గుర్తు ఫాలో చేయడము. కావున చెక్ చేసుకోండి - ఆది నుండి ఇప్పటి వరకు సర్వ ఖజానాలను స్వయంతో పాటు సేవలో కూడా వినియోగించారా? తండ్రి ఆజ్ఞ ఏమిటంటే - ఒక్క శ్వాసను లేక ఒక్క సంకల్పాన్ని, ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థంగా పోనివ్వద్దు. మరి రోజంతటిలో ఈ ఆజ్ఞను ప్రాక్టికల్లోకి తీసుకొచ్చారా లేక ఒక్కోసారి తీసుకొచ్చారు, ఒక్కోసారి తీసుకురాలేదా? ఒకవేళ అప్పుడప్పుడు ఆజ్ఞాకారులుగా అయి మళ్ళీ అప్పుడప్పుడు అవ్వకుండా ఉంటే ఏ లిస్ట్‌లోకి వెళ్తారు? ఒకవేళ బాప్‌దాదా ఆజ్ఞాకారుల లిస్ట్‌ను తయారుచేస్తే మీరు ఏ లిస్ట్‌లో ఉంటారు? మీ గురించైతే మీకు తెలుసు కదా? ఎందుకంటే మీరందరూ సర్వ ఖజానాలకు ట్రస్టీలు, యజమానులు. కావున ఒక్క సంకల్పాన్ని కూడా తండ్రి ఆజ్ఞ లేకుండా ఉపయోగించలేరు. లేక ఇలా ఆలోచిస్తున్నారా - మేము బాలకులము మరియు యజమానులము, అందుకే వ్యర్థంగా పోగొట్టినా లేక ఏం చేసినా ఇందులో తండ్రిది ఏం పోతుంది! తండ్రి ఇచ్చేసారు కదా, ఇప్పుడు లెక్క ఎందుకు అడుగుతున్నారు? అలా అనకూడదు. మీరు ప్రతి రోజూ బాబా ఎదురుగా - సర్వస్వము మీదే, నాది కాదు అని అంటూ ఉంటారు కదా. అంటూ ఉంటారు కదా! లేక సమయం వచ్చినప్పుడు నాది, వేరే సమయంలో మీది అంటారా! నాకు అవసరమైనప్పుడు నాది, మామూలుగా అయితే మీది... ఇటువంటి చతురతనైతే చూపించడం లేదు కదా? బ్రహ్మా బాబాను చూసారు - తమ విశ్రాంతి సమయాన్ని కూడా విచార సాగర మథనం చేస్తూ పిల్లల కోసం వినియోగించారు. రాత్రివేళలో కూడా మేల్కొని పిల్లలకు యోగశక్తిని ఇస్తూ ఉండేవారు. ఈ చరిత్రనైతే విన్నారు కదా? బ్రహ్మా యొక్క జీవితగాథను విన్నారు కదా? మరి ఫాలో ఫాదర్ చేసారా లేక కేవలం విన్నారా? వినడము అంటే చేయడము.
కావున మూడవ అడుగు - సదా హాజరై ఉన్నాను అని అనడము, అప్పుడు ప్రభువు సదా హాజరై అన్నీ చూస్తారు. ఎప్పుడూ బ్రహ్మా బాబా నుండి శివబాబా వేరవ్వలేదు, సదా హాజరై అన్నీ చూస్తూ ఉండేవారు కదా! పిల్లలు, బాబా అని అన్నారు మరియు బాబా, మధురమైన పిల్లలూ అని అన్నారు. కావున మనసు యొక్క స్థితిలో - వారు సదా హాజరై అన్నీ చూస్తున్నారు అన్నట్లు అనుభవం చేసారు. బ్రహ్మా బాబా సేవలో - హాజీ, సదా హాజరై ఉన్నాను అని అన్నారు. అది రాత్రి అయినా, పగలు అయినా, సేవ యొక్క డైరెక్షన్ లభించగానే ప్రాక్టికల్‌గా చేసారు మరియు కర్మలో సదా హాజీ అన్నారు. హాజీ పాఠాన్ని నేర్పించారు కదా? మరి మీరు ఏమి ఫాలో చేస్తున్నారు? ఒక్కోసారి హాజీ, ఒక్కోసారి నాజీ అని అనడం లేదు కదా? మరి ప్రేమకు ఋజువు చూపించండి. ఫాలో ఫాదర్ చేయడమే ఋజువు. కావున చెక్ చేసుకోండి - స్థితిలో, సేవలో, కర్మలో అనగా సంబంధ-సంపర్కంలో, (సంబంధ-సంపర్కంలోకి రావడమే కర్మ) - మూడింటిలోనూ సదా ఫాలో ఫాదర్ చేస్తున్నారా? ప్రతి ఆజ్ఞ కేవలం బుద్ధి వరకే ఉంటుందా లేక కర్మలోకి కూడా వస్తుందా? రిజల్టులో ఏం గమనించడం జరిగిందంటే - బుద్ధి మరియు వాణిలో 100 విషయాలు ఉన్నాయంటే కర్మలలో 50 ఉంటున్నాయి. మరి వారిని ఫాలో ఫాదర్ చేస్తున్నారు అని అంటామా? సగం-సగం రిజల్టు ఉన్నవారిని ఫాలో ఫాదర్ చేసే లిస్ట్‌లో పెట్టాలా? మీరు ఏం అనుకుంటున్నారు? వారు ఆజ్ఞాకారులేనా? లేక మీరు సగానికే రాజీగా ఉన్నారా? కొద్ది-కొద్దిగా తేడా ఉంటే ఇష్టమేనా! ప్రారంభంలో మాలను కూడా తయారుచేసేవారు, బంగారము, వెండి అని లిస్ట్‌లను కూడా తయారుచేసేవారు. మరి ఇప్పుడు మళ్ళీ లిస్ట్ తీయాలా? లేక వెండి లిస్ట్‌లో తమ పేరును చూసి రాగిగా అయిపోతారా?
సమయం యొక్క సూచనను తండ్రి అయితే ఇస్తూనే ఉన్నారు, అంతేకాక ప్రకృతి కూడా ఇస్తూ ఉంది. ప్రకృతి కూడా ఛాలెంజ్ చేస్తూ ఉంది, అలాగే సమయమనుసారంగా మీరు ఇతరులకు కూడా సూచనలు ఇస్తూ ఉంటారు. భాషణ చేసేటప్పుడు - సమయం వచ్చేసింది, సమయం వచ్చేసింది అని అందరికీ చెప్తూ ఉంటారు. మరి ఇది మీకు కూడా చెప్పుకుంటున్నారా లేక కేవలం ఇతరులకే చెప్తున్నారా? ఇతరులకు చెప్పడం సహజం అనిపిస్తుంది కదా? కావున స్వయం కూడా ఈ ఛాలెంజ్‌ను స్మృతిలోకి తెచ్చుకోండి. సమయమనుసారంగా మీ పురుషార్థం యొక్క వేగం ఎలా ఉంది? బాప్‌దాదా ఒక విషయంలో లోలోపలే నవ్వుకుంటూ ఉంటారు. ఏ విషయంలో నవ్వుకుంటారు, తెలుసా? ఒకవైపు మెజారిటీ పిల్లలు అప్పుడప్పుడు ఒక్క క్షణం ఇలా ఆలోచిస్తారు - సమయం అనుసారంగా పురుషార్థంలో తీవ్రత ఉండాలి అని. మళ్ళీ ఇంకొకవైపు మాయ తన ప్రభావాన్ని చూపించినప్పుడు మరుక్షణం ఇలా ఆలోచిస్తారు - ఇదంతా నడుస్తూనే ఉంటుంది, మహారథుల విషయంలో కూడా ఎప్పటినుండో కొనసాగుతూ వస్తుంది అని. అప్పుడు బాప్‌దాదా ఏమి చేస్తారు? కోపమైతే చేయరు కదా! చిరునవ్వు నవ్వుతారు. దీనికి విశేష కారణం ఏమిటంటే – ఎప్పటికప్పుడు పురుషార్థాన్ని చాలా సులభం చేసేసుకున్నారు, ఈజీ చేసేసుకున్నారు. స్వభావాన్ని ఈజీ చేసుకోరు, స్వభావంలో టైట్‌గా ఉంటారు కానీ పురుషార్థంలో ఈజీ అయిపోతారు. మళ్ళీ ఇది సహజయోగం కదా అని అనుకుంటారు! కానీ జీవితంలో, పురుషార్థంలో ఈజీగా ఉండడాన్ని సహజయోగం అని అనరు ఎందుకంటే ఈజీగా ఉండడం ద్వారా శక్తులు మర్జ్ అయిపోతాయి, ఇమర్జ్ అవ్వవు. మీరందరూ మీ బ్రాహ్మణ జీవితంలోని ఆది సమయాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ సమయంలో పురుషార్థం ఎలా ఉంది? ఈజీ పురుషార్థం ఉందా లేక అటెన్షన్‌తో కూడిన పురుషార్థం ఉందా? అటెన్షన్‌తో కూడిన, ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన పురుషార్థం ఉండేది మరియు ఇప్పుడేమో నిర్లక్ష్యం అనే డన్లప్ తలగడ మరియు పరుపు లభించాయి. సాధనాలు ఎక్కువ విశ్రాంతి ప్రియులుగా చేసేసాయి. కావున మీ ఆది పురుషార్థాన్ని, ఆది సేవను మరియు ఆదిలోని ఉల్లాస-ఉత్సాహాలను చెక్ చేసుకోండి - అవి ఎలా ఉండేవి? విశ్రాంతి ప్రియులుగా ఉండేవారా? (లేదు). మరి ఇప్పుడు కొద్ది-కొద్దిగా ఉన్నారా? సాధనాలు సేవ కోసం ఉన్నాయి, సాధనాలనేవి స్వయాన్ని విశ్రాంతి ప్రియులుగా చేసేందుకు లేవు. కావున ఇప్పుడు డన్లప్ తలగడను మరియు పరుపును తీసేయండి. పట్టపురాణులుగా-పట్టపురాజులుగా (నేలపై పడుకునే రాణులుగా, నేలపై పడుకునే రాజులుగా) అవ్వండి. పడుకోవడం నేలపై పడుకున్నా కానీ స్థితి మహారాజు-మహారాణిలా ఉండాలి. చూడండి, ఆది సేవా సమయంలో సాధనాలు లేవు, కానీ సాధన ఎంత శ్రేష్ఠంగా ఉండేది. ఆ ఆదిలోని సాధనే ఈ వృద్ధినంతటినీ తీసుకొచ్చింది. కావున సాధన యొక్క బీజాన్ని విస్తారంలో దాచివేయకండి. విస్తారమైనప్పుడు బీజం దాగిపోతుంది. కావున సాధన బీజము, సాధనాలు విస్తారము. కావున సాధన అనే బీజాన్ని దాగిపోనివ్వకండి, ఇప్పుడు మళ్ళీ బీజాన్ని ప్రత్యక్షం చేయండి.
బాప్‌దాదా ఈ సీజన్లో మీకు పని ఇచ్చారు కానీ చేయలేదు. ఏం పని ఇచ్చారో గుర్తుందా? లేక కేవలం పుస్తకాలలో ఉండిపోయిందా! ఏం పని ఇవ్వడం జరిగిందంటే - అనంతమైన వైరాగ్య వృత్తి గురించి స్వయంతో కూడా చర్చించుకోండి మరియు పరస్పరంలో కూడా చర్చించండి మరియు ప్రాక్టికల్‌గా ఈ సాధన యొక్క బీజాన్ని ప్రత్యక్షం చేయండి, మరి చేసారా? లేక కేవలం ఒకరోజు దాని గురించి డిబేట్ చేసి, వర్క్‌షాప్ చేసేసాము కానీ కార్యంలోకి రాలేదు అన్నట్లు లేదు కదా. కావున వర్తమాన సమయం అనుసారంగా ఇప్పుడు మీ సేవను మరియు సేవా స్థానాల యొక్క దినచర్యను అనంతమైన వైరాగ్య వృత్తితో కూడినవిగా తయారుచేయండి. ప్రస్తుతం విశ్రాంతితో కూడిన దినచర్య మిక్స్ అయిపోయింది. ఈ నిర్లక్ష్యము శరీరానికి వచ్చే చిన్న-చిన్న వ్యాధులకు కూడా సాకులు చెప్పేలా చేస్తుంది. ఇంతకుముందు కూడా వ్యాధులు ఉండేవి కదా, కానీ సేవ యొక్క ఉల్లాసము వ్యాధులను మర్జ్ చేసేస్తుంది. ఎప్పుడైనా మీ మనసుకు ఇష్టమైన సేవ ఉంటే ఆ సమయంలో వ్యాధి గుర్తుకొస్తుందా? ఒకవేళ మీ ఇంఛార్జ్ అక్కయ్య - వద్దు, మీ ఆరోగ్యము బాగోలేదు, ఇతరులను చేయనివ్వండి అని అంటే మీరు చేయనిస్తారా? ఆ సమయంలో జ్వరము లేక తలనొప్పి ఎక్కడికి వెళ్ళిపోతాయి? అదే ఏ సేవ అయినా ఇష్టం లేనప్పుడు ఏమవుతుంది? తలనొప్పి కూడా వచ్చేస్తుంది, కడుపునొప్పి కూడా వచ్చేస్తుంది. ఇంతకుముందు వినిపించాము కదా - సాకులు చెప్పేటప్పుడు జ్వరం అని చెప్తే థర్మామీటర్ పెట్టండి అని టీచర్ అంటారు కానీ కడుపునొప్పికి మరియు తలనొప్పికి థర్మామీటర్ అయితే ఉండదు కదా! నిజానికి మూడ్ సరిగ్గా ఉండదు కానీ కడుపు నొప్పి అని చెప్తారు! కావున ఇవన్నీ నిర్లక్ష్యపు సాకులు. అనంతమైన వైరాగ్య వృత్తి మర్జ్ అయిపోయింది మరియు సాకులు ఇమర్జ్ అయ్యాయి.
పిల్లలందరూ ఎంతో స్నేహంతో మధుబన్కు చేరుకోవడాన్ని బాప్‌దాదా చూసారు. కావున స్నేహం అయితే చూపించారు, అందుకు అభినందనలు. బాప్‌దాదాకు కూడా పిల్లల సంతోషాన్ని చూసి సంతోషము కలుగుతుంది, కానీ ఇకపై ఏం చేయాలి? కేవలం మధుబన్ వరకు చేరుకోవాలా లేక స్నేహం యొక్క ఋజువును చూపించేందుకు ఫరిశ్తా రూపంలో వతనం వరకు చేరుకోవాలా? ఏం చేయాలి? మధుబన్కు చేరుకున్నారు, దానికి అభినందనలు కానీ ఫరిశ్తాగా అయి వతనంలోకి ఎప్పుడు చేరుకుంటారు? నడుస్తూ-తిరుగుతూ మీ అందరినీ ఫరిశ్తాలుగానే చూడాలి. మీ మాట, నడవడిక, జీవనశైలి అంతా ఫరిశ్తాల వలె అయిపోవాలి. మరియు ఫరిశ్తా అంటేనే డబల్ లైట్. కావున దినచర్యలో లైట్‌గా అవ్వకూడదు కానీ సంబంధ-సంపర్కాలలో, స్థితిలో లైట్‌గా అవ్వాలి. మరి లైట్‌గా అవ్వడం వస్తుందా లేక ఏదైనా భారము లాగుతుందా? బాప్‌దాదా స్నేహం యొక్క ఋజువును చూడాలనుకుంటున్నారు మరియు ఎప్పుడైతే స్నేహం యొక్క ఋజువును ఇస్తారో, అప్పుడు మీరు చప్పట్లు కొట్టవలసిన అవసరం ఉండదు కానీ మాయ - వాహ్ విజయీ వాహ్ అని చప్పట్లు కొడుతుంది, ప్రకృతి కూడా చప్పట్లు కొడుతుంది. కావున ఇప్పుడు ఏదైనా పరివర్తన తీసుకురండి.
ఈ రోజు ఇది ఈ సీజన్ యొక్క చివరి మేళా. ఫారెనర్స్ సీజన్ వేరుగా ఉంది, కానీ ఇండియన్ ప్రోగ్రామ్ ప్రకారం ఈ రోజు లాస్ట్. మేళా విషయం కూడా వేరు. దానిని బోనస్‌లో పెట్టేశారు. కానీ బాప్‌దాదా చూస్తున్నారు, మొత్తం సీజన్లో కలవడం, మనసును ఉల్లాసపరచుకోవడం, సంతోషాన్ని జరుపుకోవడం - ఇదంతా చాలా మంచిది, కానీ ఋజువు ఏమిటి! కాబట్టి సెంటర్స్‌లో లేదా ప్రవృత్తిలో ఉంటూ కూడా మీ టైమ్ టేబుల్, దినచర్యను పరివర్తన చేసుకోండి. మరి ఏ పరివర్తన చేసుకోవాలి? కేవలం ఫాలో ఫాదర్. బ్రహ్మా బాబా ఏం చేశారు? బ్రహ్మా బాబా నిర్లక్ష్యంగా ఉన్నారా? ఋజువు ఉంది కదా – చివరి రోజు వరకు విశ్రాంతి తీసుకున్నారా? మరి ప్రేమ ఉంది కదా? ఎంత ప్రేమ ఉంది? (టూ మచ్) మరి ఋజువు ఎంత ఉంది? ఇందులో టూ మచ్ అని చెప్పడంలేదే! కనుక, ఇప్పుడు స్వయాన్ని స్నేహం కలిగి ఉండడంతోపాటు శక్తిశాలిగా కూడా తయారుచేసుకోండి. స్వయం యొక్క పరివర్తనలో శక్తిరూపులుగా అవ్వండి. సహజయోగీ, సహజయోగీ అని అంటూ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి. స్వయం విషయంలో, సేవ విషయంలో మరియు ఇతరుల సంబంధ-సంపర్కాల విషయంలో నిర్లక్ష్యంలోకి ఎక్కువగా రావడాన్ని బాప్‌దాదా చూసారు. అంతా నడుస్తుందిలే అని భావించకండి. ఒకరినొకరు కాపీ చేయకండి, బాబాను కాపీ చేయండి. ఇతరులను చూసే అలవాటు కాస్త ఎక్కువయ్యింది. స్వయాన్ని చూసుకోవడంలో నిర్లక్ష్యము వచ్చేసింది. బాప్‌దాదా వినిపించారు కదా, దగ్గరి దృష్టి బలహీనమైపోయింది మరియు దూరపు దృష్టి తీవ్రమైపోయింది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఈ సీజన్ యొక్క ఫలముగా ఏమిస్తారు? లేక కేవలం తండ్రి వచ్చారు, కలిసారు, వేడుక జరుపుకున్నారు, మురళి విన్నారు - ఇదే ఫలమా? ప్రతి సీజన్‌కు ఫలము ఉంటుంది కదా? మరి ఈ సీజన్లో ఏ ఫలాన్ని బాప్‌దాదాకు భోగ్లో పెడతారు? భోగ్ పెట్టినప్పుడు భోగ్లో ఫలాలను కూడా పెడతారు కదా. ఆ ఫలాలైతే బజార్లో దొరుకుతాయి, వాటిని భోగ్లో పెట్టడం ఏమంత పెద్ద విషయం కాదు. ఇప్పుడు ఈ సీజన్లో ఏ ఫలాన్ని కానుకగా సమర్పిస్తారు లేక భోగ్ పెడతారు? భోగ్ పెట్టాలా లేక ఇది కష్టమా? మరి నంబర్‌వన్ భోగ్ ఎక్కడి నుండి వస్తుందో చూద్దాము. ప్రతిజ్ఞలైతే చాలా మంచిగా చేసి వెళ్తారు. ఎప్పుడూ, కాదు అని అనరు, హాజీ అనే అంటారు, సంతోషపెడతారు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? టీచర్లు నంబర్‌వన్ భోగ్ పెడతారు కదా! ఇప్పుడు అందరి టీచర్ల భోగ్‌ను చూస్తాము. ప్రవృత్తివారు కూడా భోగ్ పెడతారు కదా లేక మీకు మీరే తినేస్తారా? ఇది కేవలం సెంటర్ వారి పని మాత్రమే అని ఆలోచించకండి. ఇది అందరి పని. కావున ఆజ్ఞాకారీ అన్న అడుగును ప్రాక్టికల్లోకి తీసుకురావాలి.
నాలుగవ అడుగు – విశ్వాసపాత్రత. ఎప్పుడూ మనసు ద్వారా, బుద్ధి ద్వారా, సంకల్పాల ద్వారా తండ్రికి అవిశ్వాసపాత్రులుగా అవ్వకూడదు. విశ్వాసపాత్రులు అంటే అర్థము - సదా ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేకుండా ఉండడము. సంకల్పంలో కూడా దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాలు లేక దేహధారీ వ్యక్తులు ఆకర్షించకూడదు. పతి-పత్ని ఒకరికొకరు విశ్వాసపాత్రులుగా అయినప్పుడు స్వప్నంలో ఇతరులు గుర్తుకువచ్చినా సరే దానిని విశ్వాసపాత్రత అని అనరు. బ్రహ్మాబాబాను చూసారు కదా! సంకల్పాలు కూడా ఇతరుల వైపు లేవు. ఒక్క బాబాయే సర్వస్వముగా ఉన్నారు, దీనినే విశ్వాసపాత్రత అని అంటాము. ఒకవేళ పదార్థాల ఆకర్షణ ఉన్నా, సాధనాల ఆకర్షణ ఉన్నా - సాధన ఖండితమైపోతుంది, విశ్వాసపాత్రత ఖండితమైపోతుంది. ఖండితులు ఎప్పుడూ సంపన్నంగా, పూజ్యులుగా గాయనం చేయబడరు. కావున సంకల్పంలో కూడా ఎటువంటి ఆకర్షణ అనేది అవిశ్వాసపాత్రులుగా చేయడం లేదు కదా అని చెక్ చేసుకోండి. కొద్దిగానైనా ఎవరి పట్లనైనా విశేషమైన ఆకర్షణ ఉంటే, కొద్దిగానైనా వ్యక్తిగత ఆకర్షణ ఉంటే, వారి గుణాల పట్లనైనా, సేవల పట్లనైనా, మంచి సంస్కారాల పట్లనైనా, కాస్త ఎక్ట్రా ప్రభావితులైనట్లయితే వారిని విశ్వాసపాత్రులు అని అనము. అందరి విశేషతలపై, అనంతమైన విశేషతలపై ఆకర్షితులవ్వడం, అది వేరే విషయము. కానీ ఒక విశేషమైన వ్యక్తి లేక వైభవం పట్ల ఆకర్షితులై ఉంటే వారి పేరు విశ్వాసపాత్రుల లిస్ట్ నుండి ఖండించబడింది అని అంటాము. కావున చెక్ చేసుకోండి - మేము ఖండితమూర్తులుగా అయితే లేము కదా? పూజ్యులుగా ఉన్నామా? మాకు ఎక్కడా ఎక్స్ట్రా మోహము లేక ఆకర్షణ లేదు కదా. సంకల్పమాత్రంగా కూడా ఆకర్షణ ఉండకూడదు, ఇక వాచా, కర్మణా విషయాన్ని అయితే వదిలేయండి. సంకల్పమాత్రం ఉన్నా కూడా ఖండిత లిస్టులోకి వస్తారు. మరి చెక్ చేసుకోవడం వస్తుంది కదా? అచ్ఛా!
ఇప్పుడు ఏదైనా కొత్తదనం చూపించండి. కొత్త సంవత్సరం ప్రారంభమైంది. బాప్‌దాదాకు ఆది సమయపు అనంతమైన వైరాగ్యం సదా గుర్తుకొస్తుంది. ఆ సమయపు ఫలమే మీరు. అనంతమైన వైరాగ్య వృత్తి లేకపోయి ఉంటే స్థాపన యొక్క వృద్ధి ఇంతగా జరిగేది కాదు. బ్రహ్మా బాబా అంతిమ సమయం వరకు పెద్ద వయస్సు ఉన్నప్పటికీ, తనువు యొక్క లెక్కాచారాన్ని తీరుస్తూ కూడా అనంతమైన వైరాగ్య స్థితిని ప్రత్యక్షంగా చూపించారు. సాధనాలను స్వయం కోసం స్వీకరించలేదు. సేవ కోసం అనేది వేరే విషయం. స్వయం కోసం స్వీకరించడం మరియు సేవ కోసం కార్యంలో ఉపయోగించడం - ఈ తేడా తెలుసు కదా? స్వయం పట్ల అనంతమైన వైరాగ్యం ఉండాలి, సేవ పట్ల సాధనాలను కార్యంలో ఉపయోగించండి. కానీ సాధనాలు నిర్లక్ష్యాన్ని తీసుకురాకూడదు. కాబట్టి ఫాలో ఫాదర్ చేయాల్సిందే కదా, లేక ఇంకా ఎవరైతే రానున్నారో వారు చేయాలా? మీరే చేయాలి. అచ్ఛా!
పిల్లలను సదా ఏమని అంటాము? కుల దీపకులు. మరి బ్రాహ్మణ కులంలో సదా వెలుగుతూ ఉండే దీపకులు కదా? బాబా యొక్క శ్రేష్ఠ ఆశల దీపాన్ని వెలిగించే కుల దీపకులు. అలా ఉన్నారు కదా?
అచ్ఛా, ఈ రోజు టీచర్లు ముందు కూర్చునే ఛాన్స్ తీసుకున్నారు - కేవలం కూర్చునే ఛాన్స్లోనే సంతోషపడిపోకండి. ఇందులో కూడా నంబర్‌వన్ ఛాన్స్ తీసుకోండి. ఇప్పుడు పరస్పరం ఇలాంటి దినచర్యను తయారుచేసుకుంటే అంతా పరివర్తన అయిపోతుంది. ఏది వస్తే అది చేయడం, ఎలా వస్తే అలా చేయడం కాదు, దినచర్యను టైట్ చేయండి. ఇది మంచిదే కదా, సహజయోగికి బదులుగా కష్టయోగిగా అయిపోతారా?
అచ్ఛా, ఈ రోజు అన్ని జోన్లకు బాప్‌దాదా ఇదే విశేష వరదానం లేదా సేవను ఇస్తున్నారు - సదా బాబాను ఫాలో చేయడంలో నంబర్‌వన్ అవ్వండి. ఏ జోన్లో ఏ సెంటర్ ఫాలో ఫాదర్లో నంబర్‌వన్‌గా ఉందో బాప్‌దాదా చూస్తారు. నేను నంబర్‌వన్‌గా ఉన్నాను కానీ ఇతరులు లేరు అని అనుకోకండి, అప్పుడు నంబర్‌వన్ ప్రైజ్ లభించదు. ఇప్పుడు ఏ జోన్లో ఏ సేవాకేంద్రం నంబర్‌వన్‌గా ఉంటుందో దానికి చాలా మంచి ప్రైజ్ ఇస్తారు. కాబట్టి సెంటర్స్ రిజల్ట్ చూపించాలి. సెంటర్‌కు వచ్చే స్టూడెంట్స్ కూడా వస్తారు. ఒకరు సెంటర్ సహచరులు, రెండవవారు వచ్చే స్టూడెంట్స్ - ఇద్దరూ నంబర్‌వన్‌గా ఉండాలి. మరి ఎంత టైమ్‌లో బహుమానం తీసుకుంటారు? ఎంత చెబితే అంత సమయం ఇస్తాము. రెండు సంవత్సరాలు అంటే రెండు సంవత్సరాలు కూడా ఇస్తాము. చెప్పండి, రెండు సంవత్సరాలు కావాలా? ఒక సంవత్సరం కావాలా? ఎంత కావాలి? (6 మాసాలు) అచ్ఛా, సరే 6 మాసాలే. ఎందుకంటే మరుసటి సీజన్ 6 మాసాల తరువాతే ఉంటుంది. కాబట్టి మొదటిసారే బాప్‌దాదా రిజల్ట్ చూపించిన వారికి విశేషంగా చాలా మంచి వసతి ఏర్పాట్లు ఇస్తారు. కుంజ్ భవన్ మంచిది కదా! ఒక గదిలో ఇద్దరు చొప్పున పడుకోండి.
మధుబన్ వారు అయితే ఓటే సో అర్జున్‌గా ఉన్నారు(ఎవరు ముందు బాధ్యత తీసుకుంటే వారు అర్జునులు). మధుబన్ వైబ్రేషన్ అన్ని వైపులా వ్యాపిస్తుంది. కాబట్టి మధుబన్ వారు సదా జీ హాజిర్. హా జీ అనేవారు కదా, లేక మధ్య మధ్యలో కొద్దిగా నా జీ కూడా బాగుంటుందా? చాలా మంచి ప్రైజ్ ఇస్తాము. పూర్తిగా అనంతమైన వైరాగ్య ఆత్మగా అనుభవమవ్వాలి, మియా మిట్టూ అవ్వకూడదు. ఇతరులు సర్టిఫికెట్ ఇవ్వాలి - అవును, వీరు నంబర్‌వన్ అని. మూడు సర్టిఫికెట్లు ఉన్నాయి కదా, ఒకటి మనసుకు నచ్చినది, రెండవది బాబాకు నచ్చినది, మూడవది లోకానికి నచ్చినది. ఈ మూడు సర్టిఫికెట్లు తీసుకునేవారికి ఎక్స్ట్రా వసతి ఏర్పాట్లు కూడా ఇస్తాము, బ్రహ్మా భోజనం కూడా ఎక్స్ట్రాగా చేయిస్తాము. అన్నింటికంటే ముందు విజేతలుగా అనౌన్స్ అవుతారు, అది ఎంత మంచిగా ఉంటుంది! విజయి రత్నాల మాల తయారవుతుంది. అందరూ నంబర్ తీసుకోవచ్చు. కేవలం టీచర్లే కాదు. ప్రవృత్తిలో ఉండేవారికి కూడా టీచర్లు సర్టిఫికెట్ ఇస్తే నంబర్ లభిస్తుంది. లేక నా టీచర్ నాకు ఇవ్వరు అని అనుకుంటున్నారా! అలాంటి విషయం ఏదైనా ఉంటే దాదీలతో వెరిఫై చేయించండి.
అన్ని జోన్లు ఏం అనుకున్నాయి? అందరూ నంబర్‌వన్ అవుతారా! అచ్ఛా, ఇండోర్ నంబర్‌వన్ అవుతుందా! భోపాల్ కూడా నంబర్‌వన్, 100%! మరి ఇండోర్ 100% కంటే కూడా 10-20 నంబర్లు ఎక్కువ! పంజాబ్ 1000%! పంజాబ్ అయితే నాలుగు లక్షల మాలను తీసుకురావాలి కదా! పక్కాగా ఉంది కదా! మర్చిపోలేదు కదా! చూద్దాం, నాలుగు లక్షలలో వచ్చే సీజన్ వరకు ఒక లక్ష అయినా తీసుకురండి. పంజాబ్ వారు ఏం చేస్తారు? ఇప్పుడు పంజాబ్‌కు నిమిత్తమైన దాదీ చంద్రమణిలో జ్ఞాన సరోవర్ బీజం పడింది, డబల్ బాధ్యత అయింది. కాబట్టి పంజాబ్ టీచర్లు చేస్తారు కదా? హా జీ అని చెప్పండి. చేస్తారా? అచ్ఛా. ఢిల్లీ ఎంత నంబర్ తీసుకుంటుంది? అందరూ నంబర్‌వన్ తీసుకుంటారు! ఢిల్లీ వారు ఏ-వన్ అని చెప్పాలి. ఢిల్లీ నిమిత్తం కావాలి కదా? గతసారి అన్ని జోన్లకు డ్యూటీ ఇచ్చాము, ఏం చేయాలో గుర్తుందా? చిన్న మైక్‌లను తీసుకురాకూడదు, పెద్ద పెద్ద మైక్‌లను సంగఠన రూపంలో తీసుకురావాలి. ఇండోర్ ధనవంతుల గుంపును తీసుకురావాలి. భోపాల్ సంగఠిత రూపంలో తీసుకురావాలి. పంజాబ్ ప్రపంచంలో పేరు వచ్చేలా ఒక సంగఠనను తీసుకురావాలి. దేనితో పేరు వస్తుంది? పెద్ద పెద్ద ఉగ్రవాదులు అంతర్ముఖులైపోవాలి. అప్పుడు గవర్నమెంట్ బ్రహ్మాకుమారీస్కు బహుమానాన్ని ఇస్తుంది. పేరుపొందిన, ప్రసిద్ధి చెందిన, ఎవరి కోసం బహుమానం నిర్ణయించబడిందో అలాంటి ఉగ్రవాదులు. అద్భుతం అంటే ఇలాంటిదే చేయండి కదా. మినిస్టర్లు వస్తూనే ఉంటారు. పంజాబ్ వారు చేయగలరా? లేక ఉగ్రవాదులకు భయపడతారా! చూద్దాం, ఏ సెంటర్ ఎవరిని తీసుకువస్తుందో? ఏదైనా కొత్త విషయం చేసి చూపించండి. చూడండి, ఒక దొంగ వచ్చినా ఎంత సేవ జరిగింది. కానీ వారిని దొంగ నుండి బ్రాహ్మణులుగా మార్చి తీసుకురండి, అలాగే తీసుకురాకండి. ఇక్కడికి వచ్చి బయటకు వెళ్లి ఏదైనా హింసాత్మక కార్యం చేస్తే బ్రహ్మాకుమారీస్ పేరు కూడా చెడిపోతుంది. అందుకే పరివర్తన చేసి తీసుకురండి. అచ్ఛా.
ఈస్టర్న్ వారు ఏం చేస్తారు? నంబర్‌వన్ తీసుకుంటారా? నేపాల్ చెప్పండి. నంబర్‌వన్ తీసుకుంటారా, పక్కానా? మొత్తం ఈస్టర్న్ తీసుకుంటుందా లేక నేపాల్ తీసుకుంటుందా? బీహార్ వారు ఏం చేస్తారు, నంబర్ తీసుకుంటారా? (బాప్‌దాదా వేర్వేరు స్టేట్స్కు చెందిన సోదరసోదరీలతో చేతులు ఎత్తించారు) మరి అందరూ ఏ నంబర్ తీసుకుంటారు? ఫస్ట్ లేదా సెకండ్? అచ్ఛా!
మహారాష్ట్ర ఏం చేస్తుంది? లక్ష పర్సెంట్ బహుమానం తీసుకుంటారా లేక వంద పర్సెంట్! ఎంత చేస్తే అంత మీ వర్తమానం మరియు భవిష్యత్తును శ్రేష్ఠంగా తయారుచేసుకుంటారు. అచ్ఛా. గుజరాత్ అందరికంటే ముందుకు వెళ్తుంది కదా. కర్ణాటక అద్భుతం(కమాల్) చేసి చూపిస్తుంది. ధమాల్ చేయకండి. సంఖ్య ఎక్కువైపోతే కొద్దికొద్దిగా ధమాల్ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి సదా అద్భుతం చేసి చూపించండి. ఆంధ్రా ప్రపంచంలోని అంధకారాన్ని సెకండ్లో దూరం చేస్తుంది. ముందు తమది చేస్తేనే ప్రపంచానిది జరుగుతుంది. మంచిది, ఆంధ్రా వారు కూడా ఉల్లాస-ఉత్సాహాల్లో ఉన్నారు. కాబట్టి సదా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తూ ఉండండి. మరి తమిళ్ ఏం చేస్తుంది? తమిళ్ తమోగుణాన్ని సమాప్తం చేయండి. అందరూ సతోప్రధానంగా అయిపోవాలి. కేరళ మరియు తమిళ్ చిన్నవే కానీ అద్భుతం చేసేవారు. రాజస్థాన్ వారు ఏ అద్భుతం చేస్తారు? రిజల్ట్‌లో కూడా అందరికంటే రాజుగా అయిపోండి. అర్థమైందా! రాజుగా అవ్వడం అంటే నంబర్ ముందుగా తీసుకోవడం. రాజస్థాన్ అంటేనే రాజ్య స్థానం. కాబట్టి రిజల్ట్‌లో కూడా రాజు బహుమానాన్ని తీసుకోండి.
యు.పి. వారు ఏ అద్భుతం చేస్తారు? భక్తిమార్గంలోని అన్ని తీర్థాలను ఆబూ తీర్థంలో ఇముడ్చుకుంటారు. అద్భుతం చేస్తారు కదా! ఎవరైనా తీర్థయాత్రకు వెళ్లాలంటే ఎక్కడికి వెళ్లాలి? ఆబూ తీర్థానికి రావాలి, మహా తీర్థానికి రావాలి. కాబట్టి అన్ని తీర్థాలు మహా తీర్థంలో ఇమిడిపోవాలి. ఆగ్రా చిన్నది, కానీ బాప్‌దాదా ఎప్పుడూ అంటారు - ఛోటే సుభాన్ అల్లా. కాబట్టి ఆగ్రా వారు ఏదైనా అద్భుతం చేసి చూపించండి.
డబల్ విదేశీయులు:- డబల్ విదేశీయులు ఏం చేస్తారు? ఇండియా కంటే కూడా డబల్ పని చేస్తారు. డబల్ అద్భుతం చూపిస్తారు - ఏది? అందరూ ఆకర్షితులై భారతదేశంలో బాబాను కలుసుకోవడానికి రావాలి. అలాంటి జిజ్ఞాసను వారిలో ఉత్పన్నం చేయండి, అందరూ భారతదేశం వైపు ఆకర్షితులై రావాలి. ముందు మైక్‌లను తీసుకువస్తారు కదా. విదేశాల మైక్‌లు కూడా బిగ్గరగా ధ్వని చేసేవారు. అందుకే విదేశాల మైక్‌లు అనేకమందిని బిగ్గర ధ్వనితో మేల్కొలుపుతూ వచ్చారు, మేల్కొలుపుతూనే ఉంటారు. విదేశాల్లోనే బ్రహ్మాకుమారీస్కు పీస్ ప్రైజ్ లభించింది కదా! కాబట్టి ఇది సేవ యొక్క ఋజువును చూపించింది. అలాగే విదేశం బాబా యొక్క విశేష ఆశను పూర్తి చేసింది. ముఖ్యమైన స్థానంలో (లండన్‌లో రేపు 27వ తేదీన అక్కడి ముఖ్యమైన స్థానంలో మ్యూజియం ప్రారంభోత్సవం ఉంది) అనేక ఆత్మలకు సందేశం లభించాలి. ఈ రోజు అందరూ బ్రాహ్మణులు విశేష సేవకు నిమిత్తమవుతున్నారు. భారతదేశంలో ఇలాంటి మెయిన్ స్థానంలో ఇప్పటివరకు చేయలేదు. ఇక్కడైతే వీధివీధిలో మ్యూజియంలు తెరిచారు, కానీ మెయిన్ స్థానంలో మ్యూజియం ఉండటంలో నంబర్‌వన్ ఫారెన్ అయింది. కాబట్టి నంబర్‌వన్ వారికి అభినందనలు కూడా నంబర్‌వన్. అచ్ఛా!
నలువైపులా ఉన్న స్నేహం యొక్క ఋజువును ఇచ్చే పిల్లలకు, ప్రతి ఆజ్ఞను సంకల్పాల్లోకి, మాటల్లోకి మరియు కర్మల్లోకి తీసుకువచ్చేవారికి, సదా స్వయాన్ని తండ్రి సమానంగా సింపుల్‌గా మరియు శ్యాంపుల్‌గా తయారుచేసుకునేవారికి, బ్రహ్మా బాబా యొక్క ప్రతి అడుగుపై అడుగువేసేవారికి, ఇటువంటి తండ్రి సమానంగా అయ్యే దృఢ సంకల్పం కలిగిన శక్తిశాలి పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- నిశ్చింత చక్రవర్తి, అందుకే కార్యం సహజంగా జరుగుతుంది. ఎవరైతే స్వయంగా సమర్పిత స్థితిలో ఉంటారో వారికి అందరి సహయోగం స్వతహాగానే లభిస్తుంది. సహయోగం కూడా వారి ముందు సమర్పితమవుతుంది. ఎవరైతే హృదయపూర్వకంగా సమర్పితమై ఉంటారో వారికి సహయోగం కూడా హృదయపూర్వకంగా ఎదురుగా వస్తుంది. ఎక్కడ హృదయపూర్వకమైన ప్రేమ ఉంటుందో అక్కడ సహయోగం లభిస్తుంది. ప్రేమ లేకపోతే సహయోగం లేదు. మరి అందరి సహయోగం హృదయపూర్వకంగానే ఉంది కదా? ప్రతి ఒక్కరూ ఏమని భావిస్తున్నారు? ఇది మన కార్యమా లేక దాదీల కార్యమా? ఇది మన మధుబనా లేక మధుబన్ వారి మధుబనా? అందుకే బాబా కూడా అంటారు - ముందు మీరు. అచ్ఛా, అందరూ బాగున్నారా? కేవలం దాదీలే ముందుకు వెళ్తున్నారు అని అనుకోకండి. దాదీలలో మీరందరూ ఇమిడి ఉన్నారు. దూరంగా అనిపిస్తుందా లేక సమీపంగా అనిపిస్తుందా? సమీపంగానే ఉన్నారు కదా. వెనుక ఉన్నవారు కూడా కదా, లాస్ట్ కుర్చీలో కూర్చున్నవారు కూడా సమీపంగానే ఉన్నారు. అందరూ సదా ఎక్కడ ఉంటారు? హృదయంలో ఉంటారు కదా? లేక ఫారెన్‌లో ఉంటారా? పంజాబ్‌లో ఉంటారా, బాంబేలో ఉంటారా, నైరోబీలో ఉంటారా, ఎక్కడ ఉంటారు? అందరూ హృదయంలో ఉన్నారు. మరి హృదయం ఎక్కడ ఉంది, దూరంగా ఉందా, దగ్గరగా ఉందా? అందరూ హృదయంలోనే ఉన్నారు, అందుకే దూరంగా లేరు. ఒకవేళ దూరంగా ఉంటే బాబా మిమ్మల్ని వెతికి తీసుకురావాల్సి వస్తుంది. పిల్లలు ఇంటి ద్వారం దాటి బయటకు వెళ్లిపోతే ఏం చేస్తారు? వారిని తీసుకురావడానికి వెళ్తారు కదా? లేక వదిలేస్తారా? అలాగే బాబా కూడా చూస్తారు - వీరు హృదయ ద్వారం దాటి బయటకు వెళ్లిపోయారు అని. ఇతర కార్యాలలో బిజీ అయిపోతారు కదా, అప్పుడు కొద్దిగా ద్వారం దాటి బయటకు వెళ్లిపోతారు. అప్పుడు బాబా పిలవాల్సి వస్తుంది లేదా పట్టుకుని తీసుకురావాల్సి వస్తుంది.
అచ్ఛా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా? అక్కడికి వెళ్లి కొద్దికొద్దిగా ఇలా జరిగింది అని చెప్పే కంప్లైంట్ ఏదీ లేదు కదా? మీరు కూడా ఆలోచించండి, పెద్ద సంగఠనలో కొద్దో గొప్పో జరుగుతూనే ఉంటుంది. అయినా కుంభమేళా కంటే వెయ్యి రెట్లు మంచిది. మంచి బ్రహ్మా భోజనం లభిస్తుంది కదా! భోజనం విషయంలో ఎలాంటి కష్టం కలగలేదు కదా? అల్పాహారం లభించకపోతే ఎవరికైనా ఆకలి వేయలేదా? అచ్ఛా!
*** ఓంశాంతి ***
