‘‘డైమండ్ సంవత్సరంలో ఫరిశ్తాగా అయ్యి బాప్‌దాదా యొక్క ఛత్రఛాయను మరియు ప్రేమను అనుభూతి చెయ్యండి’’
ఈరోజు విశ్వాన్ని సత్యమైన డైమండ్ సమానంగా మెరిపింపజేసేవారు, ప్రకృతిని కూడా డైమండ్ సమానంగా మెరిపింపజేసేవారు, విశ్వాత్మలలోని తమ డైరెక్ట్ పిల్లలను డైమండ్లుగా తయారుచేసేవారు, అలాగే కొత్త సంవత్సరముతోపాటు కొత్త యుగాన్ని, కొత్త విశ్వాన్ని స్థాపన చేసే తండ్రి డైమండ్లుగా తయారయ్యే పిల్లలను చూస్తున్నారు. సాకార స్వరూపములో కూడా బాప్‌దాదా ఎదురుగా ఎంతమంది డైమండ్లుగా మెరుస్తున్నారు మరియు విశ్వములోని మూలమూలల్లో నలువైపులా మెరుస్తున్న డైమండ్లను చూస్తున్నారు. అందరి మస్తకంలో మెరుస్తున్న డైమండ్‌లా ఉన్న ఆత్మ ఎంత మంచిగా అనిపిస్తుంది! ఎదురుగా మెరుస్తున్న ఆత్మ డైమండ్లు ఉన్నారు మరియు ఇంతమంది సంగఠిత రూపంలో నలువైపులా డైమండ్లే డైమండ్లు, చూడటానికి ఈ దృశ్యము ఎంత ప్రియముగా అనిపిస్తుంది! మరి ఈ సంగఠన ఎవరిది? డైమండ్లది కదా? నంబరువారుగా ఉన్నా కానీ మెరవటమైతే మెరుస్తున్నారు. మెరుస్తున్న డైమండ్ల సభ తండ్రి ఎదురుగా ఉంది. మీరు కూడా ఏం చూస్తున్నారు? డైమండ్నే చూస్తున్నారు కదా లేక శరీరాన్ని చూస్తున్నారా? 63 జన్మలు శరీరాన్నే చూసారు కానీ ఇప్పుడు శరీరములో మెరుస్తున్న డైమండ్ కనిపిస్తుందా లేక అది దాగి ఉంది కనుక ఒక్కోసారి కనిపిస్తుంది మరియు ఒక్కోసారి దాగిపోతుందా?
డైమండ్ జూబిలీ కదా, మరి జూబిలీలో ఏం చేస్తారు? ఏం అలంకరిస్తారు? ఈ రోజుల్లో రకరకాల లైట్లతో అలంకరణ ఎక్కువగా జరుగుతుంది. మీరు కూడా చెట్టుకు అక్కడక్కడ లైట్లు పెడతారు కదా? వారైతే ఒక్క రోజు కోసమే జూబిలీని జరుపుకుంటారు లేక క్రిస్మస్ను జరుపుకుంటారు లేక మరేదైనా ఉత్సవాన్ని జరుపుకుంటారు కానీ మీరు ఏం జరుపుకుంటున్నారు? డైమండ్ రోజు అని అంటారా లేక డైమండ్ సంవత్సరము అని అంటారా? (డైమండ్ సంవత్సరము). డైమండ్ సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు - పక్కాయేనా? ఒకవేళ డైమండ్ సంవత్సరాన్ని జరుపుకుంటున్నాము అన్నదే అందరి దృఢ సంకల్పమైతే మీ నోట్లో గులాబ్ జామూన్. అయితే జరుపుకోవటము అనగా తయారవ్వటము. మరి మొత్తము సంవత్సరమంతా డైమండ్గా అవుతారా లేక కొద్ది-కొద్దిగా మచ్చ పడుతుందా? బాప్‌దాదా అయితే పిల్లల ఉల్లాస-ఉత్సాహాలను చూసి పదమా రెట్లు డబల్ శుభాకాంక్షలను ఇస్తారు. ఈరోజు డబల్ కదా, ఒకటేమో కొత్త సంవత్సరము, ఇంకొకటి డైమండ్ జూబిలీ - ఇది రెండింటి సంగఠన. మరి డైమండ్ సంవత్సరములో బాప్‌దాదా ఈ విశేషతనే చూడాలనుకుంటున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరినీ ఎప్పుడు చూసినా, ఎవరిని చూసినా, వారు మెరుస్తున్న డైమండ్గానే కనిపించాలి. మట్టిలో ఉన్న డైమండ్గా కాదు, మెరుస్తున్న డైమండ్. మరి మొత్తం సంవత్సరానికి ఇటువంటి డైమండ్గా అయ్యారా? ఎందుకంటే డైమండ్గా అవుతాము కూడా మరియు డైమండ్‌ను చూస్తాము కూడా అన్న సంకల్పాన్ని అయితే ఈ రోజే చెయ్యాలి కదా. అవతలివారు నల్లని బొగ్గులాంటి ఆత్మ అయినా, పూర్తిగా తమోగుణీ ఆత్మ అయినా, మీరు ఏం చూస్తారు? బొగ్గును చూస్తారా లేక డైమండ్నా? డైమండ్‌ను చూస్తారు, అచ్ఛా. మీ దృష్టి పడటం ద్వారా వారి నలుపుదనము కూడా తగ్గిపోతూ ఉంటుంది. డైమండ్ జూబిలీలో ఈ సేవనే చెయ్యాలి కదా? అమృతవేళ నుండి రాత్రి వరకు ఎంతమంది సంబంధ-సంపర్కములోకి వచ్చినా, డైమండ్గా అయ్యి డైమండ్ చూడాలి. ఈ విషయంలో దృఢంగా ఉన్నారా లేక డైమండ్ జూబిలీని జరుపుకోవాలి కావున ప్రతి స్థానములో కేవలము రెండు-మూడు ఫంక్షన్లు చేసేసి డైమండ్ జూబిలీ అయిపోయింది అని అనుకుంటారా? ఫంక్షన్లు చెయ్యండి, ఆహ్వానించండి, మేల్కొలపండి, ఇవైతే చెయ్యాల్సిందే మరియు చేస్తున్నారు కూడా కానీ కేవలం ఫంక్షన్లు చెయ్యటము మాత్రమే కాదు, ఈ డైమండ్ జూబిలీలో డైమండ్గా అయ్యి డైమండ్‌ను చూడాలి, డైమండ్గా తయారుచెయ్యాలి, ఇది ప్రతి రోజూ చేసే ఫంక్షన్. మరి రోజూ ఫంక్షన్ చేస్తారా లేక రెండు-నాలుగు రోజులు లేక వారం రోజులు చేస్తారా?
ఈ సంవత్సరంలో బాప్‌దాదాకు విశేషంగా పిల్లలందరి పట్ల ఉన్న శుభమైన ఆశ అనండి లేక శ్రేష్ఠ శ్రీమతము అనండి, అది ఏమిటంటే – డైమండ్గా తప్ప మరే విధంగానూ తయారవ్వకూడదు. ఏం జరిగినా సరే డైమండ్‌పై మచ్చ పడనివ్వకండి. ఒకవేళ ఏదైనా విఘ్నానికి వశమైనా లేక స్వభావానికి వశమైనా మచ్చ పడినట్లే. విఘ్నాలైతే రావాలి కదా! విఘ్న-వినాశకులు అన్న టైటిల్ ఉంది కావున విఘ్నాలు వస్తేనే కదా అవి వినాశనము అవుతాయి? ఒకవేళ ఎవరైనా విజయీ వ్యక్తి, శత్రువులు రాకూడదు కానీ నేను విజయీని అని అంటే ఎవరైనా అంగీకరిస్తారా? లేదు. కావున విఘ్నాలైతే వస్తాయి, ప్రకృతి ద్వారానైనా, ఆత్మల ద్వారానైనా, అనేక రకాల పరిస్థితుల ద్వారానైనా విఘ్నాలు వస్తాయి కానీ డైమండ్లైన మీరు ఎంత శక్తిశాలిగా ఉండాలంటే మచ్చ ప్రభావము మీపై పడకూడదు. ఇలా ఉండటం వీలవుతుందా?
ఈ డైమండ్ జూబిలీ సంవత్సరము మహాన్ సంవత్సరము. ఏ విధంగా కొన్ని విశేష మాసాలను జరుపుకుంటారు కదా, అలా ఈ డైమండ్ జూబిలీ సంవత్సరము మహాన్ సంవత్సరము. బాప్‌దాదా ఈ సంవత్సరములో అందరినీ నడుస్తూ, తిరుగుతూ ఉన్న ఫరిశ్తాలుగా చూడాలనుకుంటున్నారు. ఎంతో మంది ఏమంటారంటే - ఆత్మను చూడాలనే ప్రయత్నమునైతే చేస్తాము కానీ ఆత్మ చాలా చిన్నని బిందువు కదా, అందుకే శరీరము కనిపించేస్తుంది. కావున బాప్‌దాదా అంటున్నారు - సరే, బిందువైతే జారిపోతుంది కానీ ఫరిశ్తా రూపమైతే పెద్ద శరీరము, అది బిందువైతే కాదు కదా! ఫరిశ్తా అనగా లైట్ ఆకారము. కనుక ఫరిశ్తా స్వరూపములో స్థితులై ప్రతి కర్మనూ చెయ్యండి. ఫరిశ్తా రూపములో కర్మ చెయ్యలేమని అనుకోకండి. చెయ్యగలరా లేక సాకార రూపము కావాలా? ఎందుకంటే సాకార శరీరము పట్ల అనేక జన్మల నుండి ప్రేమ ఉంది. అందుకే మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. అందుకే తండ్రి అంటున్నారు - సరే, ఒకవేళ మీకు శరీరాన్ని చూడడమే అలవాటైపోతే ఏం ఫర్వాలేదు, ఇప్పుడు ప్రకాశ శరీరాన్ని చూడండి. శరీరమే కావాలంటే ఫరిశ్తా కూడా శరీరధారియే. మాకు శివబాబాపై మరియు బ్రహ్మాబాబాపై చాలా ప్రేమ ఉంది అని మీరందరూ అంటారు. మరి ప్రేమకు అర్థం సమానంగా అవ్వటము. కావున ఎలా అయితే బ్రహ్మాబాబా ఫరిశ్తా రూపములో ఉన్నారో, అలా బ్రహ్మాబాబా సమానంగా ఫరిశ్తా స్వరూపములో స్థితులై ప్రతి కర్మనూ చెయ్యండి ఎందుకంటే డైమండ్ జూబిలీని జరుపుకుంటున్నారంటే స్థాపనా కార్యములో 60 సంవత్సరాలు సంపన్నమయ్యాయి. స్థాపనకు విశేషంగా నిమిత్తమైనది శివబాబాయే, కానీ నిమిత్తము బ్రహ్మా బాబా అయ్యారు. మీరు కూడా మిమ్మల్ని మీరు శివకుమారులు మరియు శివకుమారీలు అని పిలుచుకోరు, బ్రహ్మాకుమారులు-బ్రహ్మాకుమారీలు అని పిలుచుకుంటారు. కావున బ్రహ్మా బాబా యొక్క స్థాపనా కార్యానికి సంబంధించిన జూబిలీని జరుపుకుంటున్నారు. ఎవరిదైతే జూబిలీని జరుపుతారో, వారికి ఏమివ్వటం జరుగుతుంది? (కానుక), మరి మీరందరూ కానుకను ఇస్తారా? లేక ఈ గులాబీ పువ్వును తీసుకువచ్చి ఇచ్చి, ఆ కానుకను ఇచ్చేసాము అని అంటారా! కొంతమంది ఏనుగు బొమ్మను తీసుకొస్తారు, కొంతమంది గుర్రం బొమ్మను తీసుకొస్తారు, ఈ కానుకలన్నీ మనోరంజనం కోసం. ఈ మనోరంజనం కూడా మంచిదే. అందరూ వాటిని చూసి సంతోషిస్తారు. ఈ రోజు గుర్రం నాట్యం చేస్తుంది, ఈ రోజు మనిషి నాట్యం చేస్తున్నాడు అని ఆటబొమ్మలను చూసి సంతోషిస్తారు. వాటిని తీసుకురండి, ఫరవాలేదు కానీ బ్రహ్మా బాబా మనసుకు ఇష్టమైన ఏ కానుకను ఇస్తారు? చూడండి, ఎవరికైనా కానుకను ఇచ్చేటప్పుడు వారికి ఏమి ఇష్టము అన్నది చూడడం జరుగుతుంది. దీన్ని వీళ్ళు ఇష్టపడతారా, ఇష్టపడరా అన్నది చూస్తారు. మరి బ్రహ్మా బాబాకు ఏమి ఇష్టము? ఏ కానుక వారికి మంచిగా అనిపిస్తుంది? తండ్రి మనసుకు ఇష్టమైన కానుక - నడుస్తూ, తిరుగుతూ ఉన్న ఫరిశ్తా స్వరూపము. కావున ఫరిశ్తా సమానులుగా అవ్వండి. ఫరిశ్తా రూపములో ఎటువంటి విఘ్నము మీపై ప్రభావము వెయ్యదు. మీ సంకల్పాలు, వృత్తి, దృష్టి అన్నీ డబల్ లైట్‌గా అవుతాయి. మరి కానుకను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారా? (హా జీ). చూసుకోండి, మీది రికార్డ్ అవుతుంది. ఇది మంచి విషయము, స్వర్ణిమ ప్రపంచాన్ని తీసుకువచ్చేందుకు ఫరిశ్తాలుగా అయినట్లయితే, ఏ విధంగా డైమండ్ మెరుస్తుందో అలా మీ ఫరిశ్తా రూపము మెరుస్తుంది. ఈ అభ్యాసాన్ని బాగా చేస్తూ ఉండండి.
అమృతవేళ లేస్తూనే స్మృతిలోకి తెచ్చుకోండి - నేను ఎవరిని? ఫరిశ్తాను. సంకల్పమైతే చేస్తారు మరియు అలా ఉండాలని కోరుకుంటారు కూడా, అయినా మళ్ళీ తమ రిజల్టును చూసుకున్నప్పుడు లేక రాసి కూడా ఇస్తారు, అప్పుడు మెజారిటీ ఏమంటారంటే - ఎంతైతే కావాలనుకుంటున్నామో అంతగా అవ్వలేదు అని. 50 శాతం అయ్యింది, 60 శాతం అయ్యింది. మరి డైమండ్ జూబిలీలో కూడా అలా పర్సెంటేజ్లోనే అవుతారా లేక ఫుల్‌గా అవుతారా? ఏమవుతుంది? డబల్ విదేశీయులు చెప్పండి, పర్సెంటేజ్ ఉంటుందా? అవునా, కాదా? కొద్ది-కొద్దిగా అనుమతి ఇవ్వమంటారా! శక్తులలో పర్సెంటేజ్ ఉంటుందా? ఉల్లాసంతో చెప్పటం లేదు, ఆలోచించి చెప్తున్నారు. డబల్ విదేశీయులైనా లేక భారతవాసులైనా, ఒకవేళ పర్సెంటేజ్ లేకుండా ఫుల్ పాస్ అయితే బ్రహ్మా బాబా ఏం చేస్తారో తెలుసా? (శభాష్ అంటారు). అంతేనా, కేవలం శభాష్ అనే అంటారా! ఇంకేమి చేస్తారు? ప్రతి రోజూ మిమ్మల్ని అమృతవేళ తమ బాహువులలో ఇముడ్చుకుంటారు. బ్రహ్మా బాబా బాహువులలో, అతీంద్రియ సుఖములో ఊగుతున్నాము అని మీకు అనుభూతి కలుగుతుంది. పెద్ద-పెద్దగా ఆలింగనం చేసుకుంటారు. బ్రహ్మా బాబాకు పిల్లలపై చాలా ప్రేమ ఉంది కదా, అందుకే అమృతవేళ ఆలింగనం చేసుకుంటారు, మరియు మొత్తము రోజంతటిలో ఏం లభిస్తుంది? ఏ విధంగా చిత్రాలలో చూపిస్తారు కదా - తుఫాను వచ్చినప్పుడు నీరు ఎక్కువైపోతే సర్పము ఛత్రఛాయగా అయ్యింది అని. వారైతే శ్రీకృష్ణుని గురించి స్థూల విషయాన్ని చూపించారు కానీ వాస్తవానికి ఇది ఆత్మిక విషయము. కావున ఎవరైతే ఫరిశ్తాగా అవుతారో వారి ఎదురుగా ఒకవేళ ఏదైనా పరిస్థితి వచ్చినా లేక ఎటువంటి విఘ్నము వచ్చినా, బాబా స్వయంగా మీ ఛత్రఛాయగా అవుతారు. చేసి చూడండి, ఎందుకంటే బాప్‌దాదా ఊరికే అలా చెప్పరు. అచ్ఛా.
ఏ పిల్లలదైతే డైమండ్ జూబిలీ ఉందో, వారు చేతులెత్తండి. ఇప్పుడు డైమండ్ జూబిలీ వారితో బాప్‌దాదా మాట్లాడుతారు. మీరైతే 14 సంవత్సరాలు యోగ తపస్యను చేసారు, అప్పుడు ఎన్ని విఘ్నాలు వచ్చాయి, కానీ మీకేమైనా అయిందా? అక్కడ బాప్‌దాదా ఛత్రఛాయగా అయ్యారు కదా, ఎన్ని పెద్ద-పెద్ద విషయాలు జరిగాయి. మొత్తము ప్రపంచమంతా, ముఖ్యమైనవారు, నేతలు, గురువులు అందరూ వ్యతిరేకమైపోయారు, కేవలం బ్రహ్మాకుమారీలు ఒక్కరే స్థిరంగా ఉన్నారు, ప్రాక్టికల్‌గా బెగ్గరీ జీవితాన్ని (పేద జీవితాన్ని) చూసారు, తపస్యా సమయంలో రకరకాల విఘ్నాలను కూడా చూసారు. తుపాకులు కూడా వచ్చాయి, ఖడ్గాలు కూడా వచ్చాయి, అన్నీ వచ్చాయి కానీ ఛత్రఛాయ ఉన్నది కదా. ఏదైనా నష్టం జరిగిందా? పాకిస్థాన్ ఏర్పడినప్పుడు వ్యక్తులు ఆ గొడవలకు భయపడి అన్నీ వదిలేసి పారిపోయారు. కానీ మీ విషయంలో టెన్నిస్ కోర్ట్ అంతా సామాన్లతో నిండిపోయింది ఎందుకంటే ఏవైతే మంచి వస్తువులుగా అనిపిస్తాయో, వాటిని ఎలా వదులుతారు, వాటిపై ప్రేమ ఉంటుంది కదా, అప్పట్లో సింధీవారు ఎవరైతే వ్యతిరేకంగా ఉండేవారో, వారు నిందించేవారు కూడా, అలాగే సామానులు కూడా ఇచ్చారు. మంచి-మంచి వస్తువులను చేతులు జోడించి ఇచ్చి - మీరే ఉపయోగించుకోండి అని చెప్పి వెళ్ళారు. కనుక ప్రపంచములోని వారికేమో అది అలజడి కానీ బ్రహ్మాకుమారీలకు 5 రూపాయలకే కూరగాయల బండి మొత్తం లభించేది. 5 రూపాయలకు కూరగాయలు. మీరు ఎంత ఆనందంగా కూరగాయలను తినేవారు. కావున ప్రపంచములోనివారు భయపడేవారు మరియు మీరు నాట్యము చేసేవారు. కావున ప్రాక్టికల్‌గా చూసారు, బ్రహ్మా బాబా మరియు దాదా - ఇరువురూ ఛత్రఛాయగా అయ్యి ఎంత సురక్షితంగా స్థాపనా కార్యాన్ని చేసారు. మరి వీరికి అనుభవం ఉన్నప్పుడు మీరు అనుభవం చెయ్యలేరా? ముందు మీరు. ఏం కావాలన్నా, ఎంత కావాలన్నా అంతా ఈ డైమండ్ సంవత్సరంలో ఛత్రఛాయను మరియు బ్రహ్మా బాబా ప్రేమను ప్రాక్టికల్‌గా అనుభవం చెయ్యగలరు. ఇది ఈ సంవత్సరానికి ఉన్న వరదానము అనగా సహజ ప్రాప్తి. ఎక్కువ పురుషార్థం చెయ్యవలసిన అవసరం ఉండదు. పురుషార్థంతో అలసిపోతారు కదా. ఎప్పుడైనా, ఎవరైనా పురుషార్థం చేసి అలసిపోతే ఆ సమయంలో బాప్‌దాదాకు వారి ముఖాన్ని చూస్తే దయ కూడా చాలా కలుగుతుంది. మరి ఇప్పుడు ఏం చేస్తారు? ఏ విధంగా తయారవుతారు? ఫరిశ్తా. ఫరిశ్తా రూపంలో నడవటం-తిరగటం, ఇదే డైమండ్గా అవ్వటము ఎందుకంటే ఏదైతే చాలా ఖరీదైన, విలువైన, మచ్చ లేని డైమండ్ ఉంటుందో, దాని గుర్తు ఏమిటి? దానిని లైట్ ఎదురుగా పెడితే అది మెరుస్తుంది మరియు మెరిసేటప్పుడు దాని నుండి కిరణాలు వెలువడుతాయి, వాటిలో రకరకాల రంగులు కనిపిస్తాయి. అలాగే, మీరు ఎప్పుడైతే రియల్ డైమండ్గా అవుతారో, ఫరిశ్తాగా అవుతారో, అప్పుడు మీ ఫరిశ్తా స్వరూపము నుండి ఈ అష్ట శక్తులు కనిపిస్తాయి. ఎలాగైతే ఆ రంగులు కిరణాల రూపంలో కనిపిస్తాయో, అలా మీరు డైమండ్గా అనగా ఫరిశ్తా రూపంగా అయినట్లయితే నడుస్తూ-తిరుగుతూ ఉన్న మీ ద్వారా అష్ట శక్తుల కిరణాల అనుభూతి కలుగుతుంది. కొందరికి మీ నుండి సహన శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది, కొందరికి మీ నుండి నిర్ణయ శక్తి యొక్క ఫీలింగ్ వస్తుంది, కొందరికి ఒక శక్తి, మరికొందరికి మరొక శక్తి యొక్క ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఎంత ఎక్కువ అభ్యాసము చేస్తే, ఇప్పుడు రేపటి నుండి కొత్త సంవత్సరము కూడా ప్రారంభమవుతుంది మరియు డైమండ్ జూబిలీ కూడా ప్రారంభమవుతుంది, కనుక రేపటి నుండి అనగా మొదటి మాసము అయిన జనవరి నుండి, ఆ ఒక్క మాసములో మీరు ఫరిశ్తా రూపములో అభ్యాసము చేస్తే, రెండో మానము వచ్చినప్పుడు అందులో మీ అభ్యాసము ఇంకా పెరుగుతుంది, మూడో మాసములో ఇంకా పెరుగుతుంది, ఇలా ఎంతెంతగా పెరుగుతూ ఉంటుందో, అంతంతగానే మీ ద్వారా ఇతరులకు అనుభూతి కలుగుతుంది. అర్థమైందా? కావున ఇది బ్రహ్మా బాబాకు ఇచ్చే కానుక. అందరూ ఇస్తారా లేక కొందరే ఇస్తారా?
అచ్ఛా, మధుబన్ వారు కూడా కానుకను ఇస్తారు కదా! మధుబన్ వారైతే హాజీ అనటంలో తెలివైనవారు. (జ్ఞాన సరోవర్‌లో కూడా మురళిని వింటున్నారు) జ్ఞాన సరోవర్ వారు ఫరిశ్తాలుగా అయిపోతారు మరియు ఈ అనువాదం చేసేవారు, మైక్ ఏర్పాట్లు చేసేవారు, లైట్ ఏర్పాట్లు చేసేవారు, అందరూ డబల్ లైట్‌గా, ఫరిశ్తాగా అవ్వాలి. కష్టమనిపించటం లేదు కదా? 63 జన్మలుగా ఈ శరీరంపై ప్రేమ ఉంది, మరి కష్టమనిపించిందా? ఎవరైతే దృఢ నిశ్చయం పెట్టుకుంటారో, నిశ్చయం పెట్టుకున్నందుకు లభించే విజయము ఎప్పుడూ చలించదు. పంచ తత్వాలు మరియు ఆత్మలు ఎంతగా ఎదిరించినా కానీ వారు ఎదిరిస్తారు మరియు మీరు ఇముడ్చుకునే శక్తి ద్వారా ఆ ఎదిరించడాన్ని ఇముడ్చుకుంటారు ఎందుకంటే చలించని నిశ్చయము ఉంది. స్థాపన యొక్క ఈ 60 సంవత్సరాలు ఏవైతే గడిచాయో, అందులో ఆది నుండి అద్భుతమంతా బ్రహ్మా బాబా మరియు అనన్యులైన పిల్లలదే. ఎప్పుడూ నిశ్చయంలో అలజడి కలగలేదు. విజయం తప్పకుండా రానే వస్తుంది - అని బ్రహ్మాబాబా ఎప్పుడూ ఈ మాటనే అనేవారు.
ఈరోజు బ్రహ్మాబాబా పిల్లలందరికీ విశేషంగా శుభాకాంక్షలను మరియు చాలా-చాలా ప్రేమను ఇచ్చారు. ఎంతమంది ఉన్నా కానీ, నాలుగు లక్షల మంది ఉన్నా లేక 14 లక్షల మంది ఉన్నా, బ్రహ్మాబాబా బాహువులు ఎంత పెద్దవి అంటే 14 లక్షల మంది కూడా ఒకేసారి బాహువులలో ఇమిడిపోగలరు, అందుకే పరమాత్మను భక్తి మార్గంలో విరాట రూపములో చూపిస్తారు, ఆ రూపములో అన్నీ ఇమిడిపోయాయి. కావున అందరూ బ్రహ్మా బాబా భుజాలలో ఇమిడిపోయారు. ఏమి జరిగినా సరే, చిన్న పిల్లలు ఏం చేస్తారు, ఒకవేళ ఎవరైనా వారిని ఏదైనా అన్నా లేక ఏదైనా జరిగినా వారు తల్లి లేక తండ్రి బాహువులలో ఇమిడిపోతారు. అలాగే జరుగుతుంది కదా! మరి మీరు కూడా అలాగే చెయ్యండి. మీరు పిల్లలే కదా లేక ఇప్పుడు పెద్దవారైపోయారా? 100 సంవత్సరాలవారైనా కూడా బాబా ముందు చిన్న పిల్లలే. కనుక మీకు కూడా ఏదైనా జరిగితే, వెంటనే బ్రహ్మా బాబా బాహువులలో ఇమిడిపోండి, అంతే. ఇదైతే సహజమే కదా? అచ్ఛా.
అచ్ఛా, ఇవి డైమండ్ జూబిలీ విషయాలు. ఇప్పుడు దీనితో పాటు ఈరోజు నూతన సంవత్సరాన్ని కూడా జరుపుకుంటారు కదా? 12 గంటలకు ఈ సంవత్సరం పూర్తవుతుంది. ఇంకా కొంచెం టైమ్ ఉంది. ఇప్పుడు పాత సంవత్సరంలో కూర్చుని ఉన్నారు, కానీ నూతన సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు. దీని కోసమే వచ్చారు కదా? డబల్ విదేశీయులు ఎక్కువగా ఎందుకు వచ్చారు? నిజానికి ఇది ఇండియా టర్న్, డబల్ విదేశీయులు ఎందుకు వచ్చారు? న్యూ ఇయర్ జరుపుకోవడానికి, క్రిస్మస్ జరుపుకోవడానికి. డబల్ విదేశీయులతో చిట్‌చాట్ చేయడం బాప్‌దాదాకు చాలా బాగుంటుంది. నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలి అంటే పాత సంవత్సరాన్ని ఏమి చేస్తారు? వీడ్కోలు ఇస్తారు. కేవలం నోటితో వీడ్కోలు ఇస్తామని చెప్పేశారా? లేక చిత్రం తయారుచేస్తారా-అది వెళ్తోంది, ఇది వస్తోంది అని? పాత సంవత్సరానికి వీడ్కోలు ఎలా ఇస్తారు? కేవలం పాటలు పాడుతారా, నాట్యం చేస్తారా, గెంతుతారా! ఏమి చేస్తారు? చూడండి, సంవత్సరం పూర్తవుతోంది, అది వీడ్కోలు తీసుకుంటోంది. మళ్లీ ఈ సంవత్సరం ఎప్పుడు వస్తుంది? (5 వేల సంవత్సరాల తర్వాత) అయితే ఇది ఐదు వేల సంవత్సరాల కోసం మీ నుండి వీడ్కోలు తీసుకుంటుంది! వీడ్కోలు తీసుకునేవారికి కూడా ఏదో ఒకటి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీరు కూడా వెళ్లేటప్పుడు మీకు వీడ్కోలు గిఫ్ట్ లభిస్తుంది. మరి మీరు ఈ పాత సంవత్సరానికి ఏమి ఇస్తారు? ఏదైనా ఇస్తారా లేక ఖాళీగా పంపిస్తారా-వెళ్ళు, వెళ్ళు అని. ఏమి ఇస్తారు? పాతదానికి ఏమి నచ్చుతుంది? పాత వస్తువు. (బలహీనతలను ఇస్తాము) బలహీనతలను ఇస్తారు కానీ మళ్లీ వెనక్కి తీసుకోవడాన్ని బాప్‌దాదా చూసారు. చూడండి, అది (సంవత్సరం) తెలివైనది, ఐదు వేల సంవత్సరాల కన్నా ముందు అది తిరిగి రాదు. మరి మీరు పాత వస్తువులను తిరిగి ఎందుకు తీసుకుంటారు? చీటీ రాసి ఇస్తారు-హా... బాబా, ఇక క్రోధం నుండి ముక్తులైపోతాము... చాలా బాగా రాస్తారు. ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు కూడా చాలా బాగా తల ఊపుతూ హా, హా అంటారు. తర్వాత ఎందుకో మళ్లీ వెనక్కి తీసుకుంటారు. పాత వస్తువులపై ప్రీతి ఉంచుకుంటారు. మళ్లీ అంటారు-మేమైతే వదిలేశాము, అది మమ్మల్ని వదలడం లేదు. బాబా అంటారు, మీరు నడుస్తూ వెళ్తున్నారు, నడుస్తున్నప్పుడు ఏదైనా ముల్లు లేదా అటువంటి వస్తువు మీ వెనుక అంటుకుంటే మీరు ఏమి చేస్తారు? ఇది నన్ను వదలాలా లేక నేను దానిని వదలాలా అని ఆలోచిస్తారా? ఎవరు వదులుతారు? అచ్ఛా, అయినా అది గాలిలో ఎగురుతూ మళ్లీ మీ దగ్గరకు వస్తే ఏమి చేస్తారు? మళ్లీ దాచిపెడతారా లేక విసిరేస్తారా? విసిరేస్తారు కదా? మరి ఈ వస్తువును ఎందుకు విసరడం లేదు? పొరపాటున మళ్లీ వచ్చినా, మీకు అది నచ్చనప్పుడు ఆ వస్తువు మళ్లీ మీ దగ్గరకు వస్తే దానిని జాగ్రత్తగా దాచిపెడతారా? పొరపాటున ఎవరైనా చెడ్డ వస్తువును ఇస్తే దానిని అల్మారాలో అలంకరించి ఉంచుతారా? విసిరేస్తారు కదా? దాని రూపం మళ్లీ కనిపించకుండా విసిరేస్తారు. మరి వీటిని మళ్లీ ఎందుకు తీసుకుంటారు? తిరిగి తీసుకోండి అనేది బాప్‌దాదా శ్రీమతమా? మరి ఎందుకు తీసుకుంటారు? అది తిరిగి వస్తుంది, ఎందుకంటే దానికి మీపై ప్రేమ ఉంది. కానీ మీకు దానిపై ప్రేమ లేదు. దానికి మీరు నచ్చుతారు, మీకు అది నచ్చదు. మరి ఏమి చేయాలి? కాబట్టి బాప్‌దాదా పిల్లలందరికీ చెబుతున్నారు-పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడం అంటే, హృదయంలో ఆలోచించిన విషయాలు ఉన్నాయి కదా, ఎన్ని విషయాల గురించి సూచన ఇచ్చాము? ఎన్ని విషయాలు ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయా? (8 విషయాలు ఉన్నాయి) అయితే వీడ్కోలుతో పాటు ఈ ఎనిమిదింటినీ బాగా అలంకరించి వీడ్కోలు ఇచ్చేయండి. అర్థమైందా? ఇవ్వగలరా? ఇచ్చే ధైర్యం ఉందా? (హా జీ) బాప్‌దాదాకు అన్నింటికంటే బాగా నచ్చేది ఏమిటంటే హా జీ చాలా త్వరగా అంటారు.
ఇప్పుడు సంవత్సరం ఐదు వేల సంవత్సరాల కోసం వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు, మీరు కనీసం ఈ చిన్న బ్రాహ్మణ జన్మ-ఇది ఒకే జన్మ, ఎక్కువ కాదు, ఒక్కటే. అందులో కూడా రేపటి నమ్మకం లేదు. అది ఐదు వేల సంవత్సరాలకు వీడ్కోలు తీసుకుంటుంటే, మీరు కనీసం ఒక జన్మ కోసం అయినా వీడ్కోలు ఇవ్వండి. ఇవ్వగలరా? హా జీ అయితే అంటారు. కానీ అది తిరిగి వచ్చినప్పుడు ఆలోచిస్తారు-చాలా కష్టంగా అనిపిస్తోంది, వదలడం లేదు, ఏమి చేయాలి! మీరు వదిలితేనే అది వదులుతుంది. అది మిమ్మల్ని వదలదు, మీరు దానిని వదలాలి. ఎందుకంటే మీరు దానితో చాలా ప్రేమ పెట్టుకున్నారు, అందుకే అది వదలదు. మీరు వదలాలి. కాబట్టి పాత సంవత్సరానికి దృఢ సంకల్పం మరియు సంపూర్ణ నిశ్చయం అనే ఈ ట్రేలో ఈ ఎనిమిది విషయాలను అలంకరించి ఇచ్చేయండి. అప్పుడు అవి మళ్లీ తిరిగి రావు. నిశ్చయాన్ని కదలనివ్వకండి. నిశ్చయం కదిలిపోతుంది-ఏమైంది, అయిపోతుంది, ఇంకా రెండు వేల సంవత్సరం పూర్తి కాలేదు, రెండు వేల నాటికి సరి అయిపోతుంది... ఇది నిశ్చయంలో అలసత్వం. బాప్‌దాదాకు కూడా చాలా మంచి మంచి విషయాలు చెబుతారు-బాబా, మీరు చింతించకండి, రెండు వేల నాటికి పూర్తి అయిపోతుంది. ఇప్పుడు కొంచెం కొంచెం... కానీ రెండు వేల సంవత్సరం అనే తేదీని బాబా ఇవ్వలేదు. కాబట్టి మీరు రెండు వేల కోసం ఎదురుచూస్తూ ఉండి, కొత్త ప్రపంచం యొక్క ఏర్పాట్లు ముందుగానే జరిగిపోకుండా చూసుకోండి. అందుకే అలసత్వంగా ఉండకండి. రివైజ్ చేయండి, పదే పదే రివైజ్ చేయండి. ఎందుకు మర్చిపోతారు? ఏదైనా పని ప్రారంభించినప్పుడు చాలా బాగా ఆలోచిస్తారు-నేను ఆత్మను, నేను ఆత్మను, ఇతను కూడా ఆత్మ, ఆత్మ శరీరం ద్వారా ఈ పని చేయిస్తోంది-ఇలా ప్రారంభిస్తారు. కానీ పని చేస్తూ చేస్తూ ఆత్మ అనే స్మృతి మర్జ్ అయిపోతుంది. మీరు చేసే పనిలో చేతులు పని చేస్తూనే ఉంటాయి, కానీ మనసు-బుద్ధితో సహా మిమ్మల్ని మీరు బిజీ చేసుకుంటారు. బాడీ కాన్షస్ తక్కువగా ఉన్నా, యాక్షన్ కాన్షస్ ఎక్కువగా అయిపోతారు. అప్పుడు అంటారు-బాబా, నా వల్ల ఏ తప్పూ జరగలేదు, నేను ఎవరినీ ఏమీ అనలేదు. కానీ బాప్‌దాదా అంటారు, మీరు బాడీ కాన్షస్ కాకపోయినా యాక్షన్ కాన్షస్‌గా ఉన్నారు. అదే సమయంలో ఏదైనా జరిగితే రిజల్ట్ ఏమవుతుంది? సోల్ కాన్షస్‌గా ఉన్నంత ఫలితం లభించదు. దీనికి విధి-పదే పదే రివైజ్ చేయండి, పదే పదే చెక్ చేసుకోండి. నేచురల్‌గా సోల్ కాన్షస్ అయ్యేంత వరకు ఈ సహజ విధి-పదే పదే రివైజ్ చేయడం. రివైజ్ చేస్తే తర్వాత ఆలోచించాల్సిన అవసరం ఉండదు. రివైజ్ చేయడానికి టైమ్ ఉందా లేక చాలా బిజీగా ఉంటారా? ఎప్పుడైనా మీ చార్టును చెక్ చేసేటప్పుడు రెండు విషయాలు చెక్ చేయండి. ఒక విషయం మాత్రమే కాదు. నేను చెడు చేయలేదు అంటే ఏమీ పోగొట్టుకోలేదు-అది మంచిదే, దానికి అభినందనలు. కానీ ఎంత జమ చేసుకున్నారు? పోగొట్టుకోలేదు, అది సరే. కానీ పోగొట్టుకోలేదు, సంపాదించలేదు కూడా అంటే అది ఏ లిస్టులోకి వెళ్తుంది? కాబట్టి నేను ఎంత జమ చేసుకున్నాను అని చెక్ చేయండి. జమ ఖాతాను చెక్ చేయండి. ఎందుకంటే మొత్తం కల్పంలో రాజ్యం చేసినా, పూజింపబడినా, జమ ఇప్పుడు చేయాలా లేక ద్వాపరంలో లేదా సత్యయుగంలో చేస్తారా? కాబట్టి నేను ఎంత జమ చేసుకున్నాను అని చెక్ చేయండి. కనీసం 21 జన్మలు రాయల్ ఫ్యామిలీలో ప్రారబ్ధాన్ని అనుభవించేంత జమ చేసుకోండి. తక్కువ జమ అయితే త్రేతాలో వస్తారు, సత్యయుగాన్ని మిస్ అవుతారు. త్రేతాలో రావడం ఇష్టమా? మొట్టమొదటి సుఖాన్నంతా సూర్యవంశీయులు తీసుకుంటారు, చంద్రవంశీయులకు తర్వాత మిగిలింది లభిస్తుంది. కాబట్టి జమ ఖాతాను చెక్ చేయండి. రోజంతా ఎక్కువలో ఎక్కువ జమ అయితే సహజంగానే మీరు నిర్విఘ్నంగా అయిపోతారు మరియు ఫరిశ్తా రూపంలో స్థితులైపోతారు. మరి విధి ఏమిటి? ప్రతి గంటకు రివైజ్ చేయండి. ఏ కాన్షస్‌లో ఉన్నారు? చేయగలరా? సాధ్యమా?
బాప్‌దాదా అందరి చార్టును చెక్ చేసినప్పుడు మొత్తం 50 పర్సెంట్ పిల్లలు ఇతరులను చూసి స్వయం అలసత్వంగా ఉంటున్నారు. అక్కడక్కడ మంచి మంచి పిల్లలు కూడా అలసత్వంలోకి చాలా వస్తున్నారు. ఇది జరుగుతూనే ఉంటుంది... ఇది నడుస్తూనే ఉంటుంది... నడవనివ్వండి... అందరూ చేస్తున్నారు... అని. బాప్‌దాదాకు నవ్వు వస్తుంది-ఒకరు దెబ్బ తిన్నారని చూసి మీరు కూడా అలసత్వంలోకి వచ్చి దెబ్బ తింటే, అది తెలివైన పనా? ఈ అలసత్వానికి పశ్చాత్తాపం చాలా చాలా చాలా పెద్దది. ఇప్పుడు పెద్ద విషయంగా అనిపించదు-హా, సరేలే... కానీ బాప్‌దాదా అన్నీ చూస్తారు. ఎంతమంది అలసత్వంగా ఉంటున్నారు, ఎంతమంది ఇతరులు కిందికి వెళ్లడాన్ని ఫాలో చేస్తున్నారు? అప్పుడు బాప్‌దాదాకు చాలా దయ కలుగుతుంది-పశ్చాత్తాపపు ఘడియలు ఎంత కఠినంగా ఉంటాయో! అందుకే అలసత్వపు అలను, ఇతరులను చూసే అలను ఈ పాత సంవత్సరంలో మనస్ఫూర్తిగా వీడ్కోలు ఇవ్వండి. కొంచెం ఉల్లాస-ఉత్సాహం వచ్చినప్పుడు కొంత సమయం కోసం వైరాగ్యం వస్తుంది, కానీ అది అల్పకాలిక వైరాగ్యం. అందుకే బాప్‌దాదా ముక్తులవ్వడానికి ఏ విషయాలు చెప్పారో వాటిపై చాలా అటెన్షన్ పెట్టండి. ఎంత పాతవారైతే, పాతవారిలో అలసత్వం ఎక్కువగా వస్తుందని చూడటం జరిగింది. మొదట్లో ఉన్న ఉత్సాహం, ఉల్లాసం ఇప్పుడు ఉండదు. చదువులో కూడా అలసత్వం వస్తుంది-అన్నీ విన్నాము, అర్థం చేసుకున్నాము అని. ఆలోచించండి, అర్థం చేసుకున్నారు, అన్నీ తెలుసుకున్నారు అంటే బాప్‌దాదా చదువును పూర్తి చేసేవారు. స్టూడెంట్ చదివేసినప్పుడు మళ్లీ ఎందుకు చదివించాలి? ముగించేయవచ్చు కదా! కానీ ఈ అలసత్వానికి బాగా వీడ్కోలు ఇవ్వండి. ఇతరులను చూడకండి. బాబాను చూడండి. బ్రహ్మా బాబాను చూడండి. ఎవరైనా దెబ్బ తింటే మహారథి పని వారిని దెబ్బ నుండి కాపాడటం, స్వయం ఫాలో చేయడం కాదు. అయితే పాత సంవత్సరానికి బాగా వీడ్కోలు ఇస్తారు కదా? ఇప్పుడు ఎంత సమయం అయింది? పావు తక్కువ పది. అచ్ఛా! ఇంకా రెండు గంటలు ఉన్నాయి. రెండు గంటల్లో వీడ్కోలు సామాను సిద్ధం చేసేయండి. బాబాకు గిఫ్ట్ ఇవ్వడంలో డబల్ విదేశీయులు ఎక్కువ నంబర్ తీసుకుంటారా లేక భారతవాసులు తీసుకుంటారా అని బాప్‌దాదా చూస్తారు. ఇద్దరూ తీసుకుంటారు కదా? అవా లేక కాదా అని చెప్పండి.
అచ్ఛా, డబల్ విదేశీయులు ఎన్ని దేశాల నుండి వచ్చారు? (36) భారతదేశం నుండి ఎన్ని జోన్లు వచ్చాయి? (ఐదు) భారతదేశంలోని ఐదు జోన్ల నుండి వచ్చారు, వారు 36 దేశాల నుండి వచ్చారు. డబల్ విదేశీయులు సదా బాప్‌దాదాను తమ సహచరునిగా భావించి కలిసి ఉంటారు కదా? పేరు ఎంత విదేశము అయినా, బాబా సాంగత్యాన్ని అంతే సమీపంగా అనుభవిస్తున్నారా? ఎందుకంటే బాబా తోడుగా ఉన్నంత వరకు మాయ కూడా బాబా సాంగత్యాన్ని చూసి దూరం నుండే పారిపోతుంది. ఒంటరిగా ఉంటే మాయకు ఛాన్స్ లభిస్తుంది. ఒంటరిగా లేకపోతే మాయకు ఛాన్స్ లభించదు. బాబా స్వయంగా నేను పిల్లల సహచరుడిని అని ఆఫర్ చేస్తున్నప్పుడు, భగవంతుని ఈ ఆఫర్ మొత్తం కల్పంలో మళ్లీ లభిస్తుందా? కాబట్టి స్వయంగా బాబా ఆఫర్-కలిసి ఉండండి. ఏ కష్టమైన విషయమైనా సాంగత్యంతో సహజమైపోతుంది. మరి సాంగత్యపు అనుభవం ఉందా? డబల్ విదేశీయులు బ్రాహ్మణ పరివారానికి విశేష అలంకారం. ఈరోజు విశేషంగా అలంకరించారు కదా. (మొత్తం స్టేజ్ సుగంధభరితమైన పూలమాలలతో అలంకరించబడింది) బాగుంది కదా! అలాగే మీలో ప్రతి ఒక్క రత్నం బ్రాహ్మణ పరివారానికి అలంకారం. అలంకారం ఎప్పుడూ పడిపోకూడదు. అలంకారం పడిపోతే ఎలా ఉంటుంది? ఇప్పుడే అలంకరించారు, అది పడిపోతే బాగుంటుందా? సదా మనం బ్రాహ్మణ పరివారపు కిరీటంలోని వజ్రాలము అని భావించండి. కిరీటం నుండి ఒక్క వజ్రం పడిపోయినా బాగుంటుందా? కాబట్టి మీ ప్రాముఖ్యతను అంతగా అర్థం చేసుకోండి. మిమ్మల్ని మీరు సాధారణంగా భావించకండి, మహానులు.
అచ్ఛా, నలువైపుల నుండి సేవా సమాచారాలు కూడా చాలా బాగా వస్తున్నాయి. భారతదేశానికి తన ప్రోగ్రామ్‌లు ఉన్నాయి, విదేశాలకు తమ ప్రోగ్రామ్‌లు ఉన్నాయి. సేవలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటున్నారు, సదా అలాగే ఉంచుకోవాలి కూడా. సేవ సేఫ్టీకి సాధనం. ఎంతగా మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటారో అంతగా సేఫ్‌గా ఉంటారు. అర్థమైందా?
(విదేశాల నుండి సింధీ సోదరసోదరీల గ్రూప్ వచ్చింది. బాప్‌దాదా వారందరినీ ముందుకు పిలిచి కూర్చోబెట్టారు) ఇంత పెద్ద బ్రాహ్మణ పరివారాన్ని చూసి సంతోషంగా ఉందా? చూడండి, మీ పరివారంలో ఎంతమంది ఉన్నారు! మొత్తం పరివారం ఎంపిక చేయబడిన శ్రేష్ఠ ఆత్మలది. భారతవాసులు మిమ్మల్ని చూసి సంతోషిస్తున్నారు, ఎందుకంటే విశేషంగా వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు అనుకూలంగా అయిపోయారు. సింధ్‌లో కాకే, చాచే, మామే అనే గాయనం కూడా ఉంది-మామా, కాకా, చాచా... అదే పరివారం నుండి బయటకు వచ్చారు. మరి ఎంత లక్కీగా ఉన్నారు. సింధీ ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉండేవారు కదా, ఇప్పుడు సమీపంగా వచ్చారు. అందుకే ఈ గ్రూపును సమీపంగా కూర్చోబెట్టారు. మీ గ్రూప్ అంతా సంతోషంగా ఉందా? అచ్ఛా.
డబల్ విదేశీయులందరూ సదా బాబా సహచరులు. అందుకే సహచరుని స్థానం ఏది? సహచరులు ఎక్కడ ఉంటారు? హృదయ సింహాసనంపై. మరి అక్కడే ఉంటున్నారా లేక అప్పుడప్పుడు దిగి వస్తున్నారా? సదా బాబా సహచరులు, అందుకే సింహాసనాధికారులు. సింహాసనంపై అధికారం ఉంది. సహచరుడు అంటే, ఉదాహరణకు రాజు సింహాసనంపై కూర్చుంటే రాణి కూడా అధికారి కదా, ఎందుకంటే సహచరి. అలాగే డబల్ విదేశీయులందరూ సహచరులు కదా? కాబట్టి హృదయ సింహాసనం సంగమయుగపు మీ అధికారం. దీని అర్థం భారతవాసులు కాదని కాదు. ఇప్పుడు డబల్ విదేశీయులతో మాట్లాడుతున్నాము కాబట్టి డబల్ విదేశీయులు అని అంటున్నాము. మిగిలిన వారిలో ఎవరైతే సహచరులుగా ఉన్నారో వారందరూ అధికారులు. అయినా పరుగులు తీస్తూ చేరుకుంటారు కదా! మరి ఏమి గుర్తుంచుకుంటారు? మీరు ఎవరు? సహచరులు మరియు సింహాసనాధికారులు. అర్థమైందా?
భారతవాసులతో:- భారతవాసులు బాగున్నారా? భారతవాసులకు నషా ఉంది - ఒకవేళ బాబా భారతదేశంలోకి రాకపోతే విదేశీయులు ఎక్కడి నుండి వచ్చేవారు? ఎందుకంటే డ్రామాలో బాప్‌దాదాను పేదల పెన్నిధి అని అంటారు. విదేశాలు పేదవి కావు, భారతదేశం పేదది మరియు బాబాకు పేదవారంటే ఇష్టం. అందుకే పేదలలోకెల్లా పేద దేశమైన భారతదేశంలోకి వచ్చారు, లండన్లోకి రాలేదు. అమెరికాలోకి కూడా రాలేదు. భారతదేశం అవినాశీ. అవినాశీ ఖండం మళ్లీ భారతదేశమే అవుతుంది. ఈ అమెరికా ఇప్పుడే వచ్చింది, ఇప్పుడే సమాప్తమైపోతుంది. బాబా అవినాశీ కనుక అవినాశీ ఖండంలోకే వస్తారు. భారతదేశానికి నషా కూడా చాలా ఉంది. భారతదేశానికి అన్నింటికంటే గొప్ప నషా ఏమిటంటే-మేము భగవంతుడిని కూడా మా ప్రేమ అనే తాడుతో బంధించాము. చూడండి, ఇప్పుడు కూడా భారతదేశంలోకే వస్తారు కదా. మీరందరూ కూడా భారతదేశంలో కలుసుకోవడానికి రావాలి. కాబట్టి భారతదేశం కూడా తక్కువ కాదు, విదేశాలు కూడా తక్కువ కాదు. ఇద్దరూ గారాల పిల్లలే. అచ్ఛా.
(సింధీ సోదరసోదరీలతో) ఎంతమంది వచ్చారు? 70 మంది వచ్చారు. ఇప్పుడు మళ్లీ మాలను పూర్తి చేసుకుని వస్తారు. రెండు రకాల వారు వచ్చారు. కానీ వస్తూ వస్తూ చివరికి ఎక్కడికి వెళ్తారు? ఎంతగా దూరంగా ఉంచడానికి ప్రయత్నించినా, అది సాధ్యం కాదు. బాబాను వదిలేయగలరా? మీరు రావద్దు అని బాబా చెబితే అప్పుడు ఏమి చేస్తారు? (వస్తాము) ఎందుకు వస్తారు? బాబా రావద్దు అని చెప్పినా ఎందుకు వస్తారు? అది నా అధికారం అని చెప్పండి. ఇది నా ఇల్లు, నా బాబా. కాబట్టి అధికారం ఉంది. బాబా కలుస్తారా కలవరా, చూస్తారా చూడరా... అని ఆలోచిస్తారు. చూసారు కదా! ఇప్పుడు వీరు సింధీలందరినీ మేల్కొలపాలి. అన్ని వైపులా మేల్కొంటున్నారు. ఎంత పెద్దగా చేయాలనుకుంటే అంత పెద్దగా చేయండి. అందరూ ముందుగానే హోటళ్లను బుక్ చేసుకునే విధంగా సీజన్లో చేయండి. ఏ హోటల్‌కు వెళ్లినా బ్రహ్మాకుమారీల వారే ఉండాలి. అందరినీ మేల్కొలపాలి. భారతదేశంలో మేల్కొలపడానికి చాలా మంచి మంచి ప్రోగ్రామ్‌లు పెట్టారు. భారతదేశం జంప్ చేస్తోంది, భారతదేశంలోని మూలమూలలా సందేశం అందాలి, ఎవరూ మిగిలిపోకూడదు అనే సమాచారమంతా బాప్‌దాదా వద్దకు వచ్చింది. ఇది చాలా మంచి విషయం. ఫిర్యాదు పూర్తయిపోతుంది.
యూథ్తో:- యూథ్ రిట్రీట్ జరుగుతోంది. దేశ-విదేశాల వారు కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నారు. వీరి టీచర్ ఎవరు? యూథ్ బాగుందా? స్టూడెంట్స్ కూడా సంతోషంగా ఉన్నారు, టీచర్ కూడా సంతోషంగా ఉన్నారు, ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అచ్ఛా. చాలా మంచి ప్రామిస్ చేసారు, దానిని పక్కాగా నిలబెట్టుకోండి. అందరూ కలిసి చేసిన ప్రామిస్‌ను నోటితో చెప్పండి. (అందరూ కలిసి ప్రామిస్ చెప్పారు) చాలా మంచిది, చప్పట్లు కొట్టండి. అచ్ఛా. చూడండి, ఇలా దేశ-విదేశాల యువత అందరూ కలిసి అద్భుతం చేసి చూపిస్తే గవర్నమెంట్ ఏమి చేస్తుంది? దేశ-విదేశాల వారందరూ కలిసి దృఢ సంకల్పం చేసారని చూసినప్పుడు, మీ యువత సంకల్పం ముందు వారంతట వారే సరెండర్ అయిపోతారు. ఎప్పుడైనా ప్రోగ్రామ్ తయారుచేస్తే దేశ-విదేశాల యువత కలిసి ఇండియా గవర్నమెంట్‌ను మేల్కొలుపుతారు. వారు కూడా సంతోషిస్తారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న మెరుస్తున్న సత్యమైన డైమండ్లకు, సదా నిశ్చయము మరియు దృఢ సంకల్పము ద్వారా స్వయాన్ని సత్యమైన డైమండ్గా తయారుచేసుకుని ఇతరులను కూడా అలా తయారుచేసేవారికి, సదా బాప్‌దాదా సమానంగా డబల్ లైట్ ఫరిశ్తా స్వరూపములో స్థితులయ్యే శ్రేష్ఠ ఆత్మలకు, సదా తండ్రి మరియు సేవలలో సదా బిజీగా ఉండేవారు, మాయాజీతుల నుండి విశ్వ రాజ్యభాగ్యాన్ని గెలుచుకునే అటువంటి సంగమయుగీ డైమండ్లకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
చూడండి, ఇక్కడి రీతి ప్రకారం 12 గంటలకు బెల్ మ్రోగుతుంది, కాబట్టి బాప్‌దాదా పిల్లల మాటను గౌరవించాల్సి ఉంటుంది. నిజానికి 11 గంటలకు బెల్ మ్రోగించినా లేదా 12 గంటలకు మ్రోగించినా ఒకటే. బ్రాహ్మణులు జరుపుకోకపోతే ఇంకెవరు జరుపుకుంటారు!
(డైమండ్ జూబిలీ సందర్భంగా పిల్లలు పాటలు పాడారు, నూతన సంవత్సర అభినందనలు తెలిపారు, కార్డులు మొదలైనవి బాప్‌దాదాకు ఇచ్చారు. ఆ తర్వాత నూతన సంవత్సరం ప్రారంభం కాగానే బాప్‌దాదా అందరికీ అభినందనలు తెలిపారు)
ఈరోజు డబల్ అభినందనలు - ఒకటి నూతన సంవత్సరానికి, రెండవది డైమండ్ జూబిలీ సంవత్సరానికి. కాబట్టి ఈ సంవత్సరం సదా మీ రెండు స్వరూపాలను గుర్తుంచుకోండి, ఒకటి డబల్ లైట్ ఫరిశ్తా, రెండవది సత్యమైన డైమండ్, మచ్చలేని డైమండ్, అమూల్యమైన డైమండ్. కాబట్టి డైమండ్గా అయి అనేక ఆత్మలను డైమండ్లుగా తయారుచేయడం, ఇదే ఈ సంవత్సరపు లక్ష్యం. బ్రాహ్మణ పిల్లలు లక్ష్యం మరియు లక్షణాలను రెండింటినీ కలిపి చేసి చూపిస్తారని బాప్‌దాదాకు తెలుసు. కాబట్టి ఈ డైమండ్ జూబిలీ సంవత్సరం అనేక ఆత్మలు బాబాకు సమీపంగా వచ్చే సంవత్సరం. దీనితో పాటు ఈ సంవత్సరం సహజంగా బాబాతో కలిసి ఉండటం ద్వారా సహజంగానే ప్రాప్తిని పొందే సంవత్సరం. అందుకే నలువైపులా ఉన్న పిల్లలు ఈ సహజ వరదానం యొక్క పూర్తి పూర్తి లాభాన్ని పొందుతారు మరియు ఇతరులకు కూడా ఇప్పిస్తారు. డైమండ్ గుడ్‌నైట్ మరియు గుడ్‌మార్నింగ్ రెండూ.
నలువైపులా ఉన్న పిల్లల నుండి ఎంతో సంతోషం మరియు ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన కార్డులు లభించాయి, ఉత్తరాలు కూడా లభించాయి. అందరికీ రిటర్న్‌లో డబల్ ప్రేమ మరియు అభినందనలు.
(జనవరి 4న తలహటిలో చాలా పెద్ద హాల్‌కు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు అనే సమాచారాన్ని బాప్‌దాదాకు వినిపించారు)
డైమండ్ జూబిలీలో సేవ చేసినప్పుడు, వారికి కూర్చోవడానికి స్థలం తయారుచేసారా? లేక మీరు బయట కూర్చుని వారిని లోపల కూర్చోబెడతారా, ఏమి చేస్తారు? మీరు లోపలే కూర్చుంటారు, బయట కాదు. ఒకవేళ బయట మైక్‌లో వినడానికి వచ్చినా లోపల కూర్చుంటారా? మరి ఏమి చేయాలి? ఈ శుభ సంకల్పంతోనే ఇప్పుడు కింద ఎక్కువకు ఎక్కువ మంది కలుసుకోవడానికి, కూర్చోవడానికి వీలుగా మొదట స్టేజ్‌కు ఫౌండేషన్ వేస్తున్నారు. అందరూ వేస్తారు కదా. నలువైపులా ఉన్న దేశ-విదేశాల పిల్లల వేలు సహాయంతో జ్ఞాన సరోవర్ తయారైనప్పుడు, ఇది దాని ముందు ఏమీ కాదు. ఇది అందరి సంకల్పం మరియు సహయోగంతో చాలా సహజంగా తయారవ్వాల్సిందే. మీకు నచ్చిందా? డబల్ విదేశీయులకు ఎక్కువగా నచ్చిందా లేక భారతవాసులకు నచ్చిందా? ఇద్దరికీ నచ్చింది. అయితే ఫౌండేషన్ వేయడం అంటే వేలు అందించడం. పర్వతం అయితే ఎత్తబడే ఉంది. బాగుంది కదా? దేశ-విదేశాల సంగఠన మేళా కాబట్టి దేశం మరియు విదేశం రెండూ కలిసి వేసే ఫౌండేషన్ ఎంత బాగుంటుంది! కాబట్టి ఎవరెవరైతే ఉంటారో వారందరి తరఫున ఆ ధరణిపై స్నేహంతో ఫౌండేషన్ వేస్తారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
