‘‘బాలకులు మరియు యజమానులు అనే నషాలో ఉండేందుకు మనసుకు రాజుగా అవ్వండి’’
ఈరోజు విశ్వానికి యజమాని అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న యజమానులు మరియు బాలకులు అయిన పిల్లలను చూస్తున్నారు. మీరు బాలకులు కూడా, అలాగే యజమానులు కూడా. విశ్వానికి యజమానులుగానైతే భవిష్యత్తులో అవుతారు కానీ తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులుగా ఇప్పుడే ఉన్నారు. విశ్వ రాజ్యాధికారులుగా భవిష్యత్తులో అవుతారు కానీ స్వరాజ్యాధికారులుగా ఇప్పుడే ఉన్నారు, అందుకే మీరు బాలకులు కూడా మరియు యజమానులు కూడా. ఇద్దరూ కదా! బాలకులము అన్న నషా అయితే సదా ఉండనే ఉంటుంది. బాప్‌దాదా చూసారు - బాలకులము అన్న నషా అయితే ఇమర్జ్ రూపంలోనైనా, మర్జ్ రూపంలోనైనా మెజారిటీలో ఉంటుంది ఎందుకంటే స్మృతిలో కూర్చున్నప్పుడు కూడా ఏ స్మృతి ఉంటుంది? బాబా. ‘బాబా’ అని ఇలా ఆలోచించటము లేక అనటము అంటే పిల్లలు కాబట్టే కదా బాబా అని అంటారు. మరియు సత్యమైన సేవాధారులు ఎవరైతే ఉంటారో, వారి నోటి నుండి పదే-పదే ఏమి వెలువడుతుంది? బాబా ఇది చెప్పారు, బాబా ఇలా అంటారు. మొత్తం రోజంతటిలో చెక్ చేసుకున్నట్లయితే - ఎన్ని సార్లు ‘బాబా-బాబా’ అన్న మాటను సేవలో ఉపయోగిస్తూ ఉంటారు? కానీ ‘బాబా’ అన్న మాటను రెండు రకాలుగా అనేవారు ఉన్నారు. ఒకరేమో హృదయముతో ‘బాబా’ అని అంటారు, మరొకరు జ్ఞానం యొక్క బుద్ధితో అంటారు. ఎవరైతే హృదయముతో ‘బాబా’ అని అంటారో వారికి హృదయములో సదా సహజంగా బాబా నుండి ప్రత్యక్ష ప్రాప్తిగా సంతోషము మరియు శక్తి లభిస్తాయి. ఎవరైతే కేవలము బుద్ధి మంచిగా ఉన్న కారణంగా జ్ఞానమనుసారంగా ‘బాబా-బాబా’ అని అంటారో వారికి ఆ సమయానికి అలా అనటం వలన స్వయానికి కూడా సంతోషం కలుగుతుంది మరియు వినేవారికి కూడా ఆ సమయానికి సంతోషం కలుగుతుంది, మంచిగా అనిపిస్తుంది కానీ సదాకాలానికి హృదయములో సంతోషము మరియు శక్తి - ఈ రెండూ సదా ఉండవు, ఒక్కోసారి ఉంటాయి, ఒక్కోసారి ఉండవు, ఎందుకు? హృదయముతో ‘బాబా’ అని అనలేదు. కావున బాప్‌దాదా చూసారు - బాలకులము అన్న నిశ్చయము అందరికీ ఉంది, కానీ నషా ఒక్కోసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండటం లేదు. మేము బాబాకు చెందినవారము - ఈ నిశ్చయము ఉండటంలో మెజారిటీ బాగానే ఉన్నారు. మీరు ఎలాగూ బాలకులే కానీ కేవలం బాలకులు మాత్రమే కాదు, బాలకులు మరియు యజమానులు కూడా. డబల్.
యజమానత్వము అంటే - ఒకటి, స్వరాజ్యాధికారీ యజమానులు మరియు రెండవది, తండ్రి యొక్క సర్వ ఖజానాలకు యజమానులు, ఎందుకంటే సర్వ ఖజానాలను ‘నా వారసత్వము’ అంటూ మీవిగా చేసుకుంటారు. దాత అయితే తండ్రే కానీ ఆ వారసత్వానికి మీరే యజమానులు అంటూ తండ్రి ఇచ్చారు. మరి ఈ వారసత్వం అందరికీ లభించిందా? కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా అయితే లభించలేదు కదా? అందరికీ ఒకే విధంగా లభించింది కదా? లేక ఒకరికి ఒక కోటి మరియు ఇంకొకరికి పది కోట్లు లభించాయి అన్నట్లు అయితే కాదు కదా? ఎందుకంటే తండ్రి ఖజానాలు అనంతమైనవి. ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ తండ్రి ఖజానాలు అనేవి పంచడం వలన తక్కువయ్యేవి కావు. తెరిచి ఉన్న సంపన్న భాండాగారము ఉంది కావున తండ్రి ఎవరికైనా తక్కువ ఎందుకు ఇవ్వాలి! ఉన్నదే పిల్లల కోసమన్నప్పుడు కొందరికి ఎక్కువగా, కొందరికి తక్కువగా ఎందుకు ఇవ్వాలి! కనుక ఒకటేమో తండ్రి వారసత్వానికి అధికారులైన యజమానులు మరియు రెండు స్వరాజ్యానికి యజమానులు. మరి స్వరాజ్యం లభించిందా? రెండింటికీ యజమానులేనా? పక్కాయే కదా? మరి యజమానులుగా ఉంటూ ఎంత సమయము నడుస్తున్నారు? స్వరాజ్యం మా జన్మ సిద్ధ అధికారము అని అంటారు కూడా. అలానే అంటారు కదా లేదా అది మహారథులకు జన్మ సిద్ధ అధికారము, మాకు మాత్రం కొద్దిగానే ఉంటుంది అని అంటారా? స్వరాజ్యం యొక్క అధికారము అందరికీ లభించిందా లేక కొద్ది-కొద్దిగానే లభించిందా? ఈ విషయంలో పూర్తిగా దృఢంగా ఉండండి. కనుక చెక్ చేసుకోండి - స్వయం యొక్క సర్వ కర్మేంద్రియాలు ఆజ్ఞానుసారంగా ఉన్నాయా? కర్మేంద్రియాలు అనేవి స్వరాజ్యాధికారీ పిల్లలైన మీకు కర్మచారులు కదా? అవి యజమానులైతే కాదు కదా? మీరు యజమాని, అంతేనా? లేక కర్మచారులు యజమానులుగా మరియు మీరు కర్మచారులుగా అయిపోతారా?
బాప్‌దాదా చూసారు - పిల్లల స్థితిలో అన్నింటికంటే ఎక్కువగా యజమానత్వాన్ని మరపింపజేసేది మరియు ఎప్పటికప్పుడు రాజును తన వశం చేసుకునేది - మనస్సు. అందుకే తండ్రి ఇచ్చిన మంత్రము కూడా మన్మనాభవ. తన్ మనాభవ, ధన్ మనాభవ లేక బుద్ధి మనాభవ కాదు. మన్మనాభవ. మనస్సు తన ప్రభావాన్ని చూపిస్తుంది. మనసు వశములోకి వచ్చేస్తారు. చూడండి, ఏదైనా చిన్నపాటి వ్యర్థ విషయమైనా లేక వ్యర్థ వాతావరణమైనా లేక వ్యర్థ దృశ్యమైనా, వీటన్నింటి ప్రభావము ముందుగా దేనిపై పడుతుంది? మనసుపై ప్రభావము పడుతుంది కదా, ఆ తర్వాత బుద్ధి దానికి సహయోగాన్ని ఇస్తుంది. ఒకవేళ మనను మరియు బుద్ధి ఇక అదే దిశలో నడుస్తూ ఉన్నట్లయితే, సంస్కారం తయారవుతుంది. ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి - నాలో వ్యర్థ సంస్కారము ఏదైతే ఉందో అది ఎలా తయారైంది? ఒకవేళ ఎవరిలోనైనా చిన్న విషయానికే సెకెండులో మనసులో ఫీలింగ్ వచ్చే సంస్కారం ఉందంటే, ఆ సంస్కారము తయారైంది ఎలా? ఇంకా ఏమంటారంటే - ఇలా అవ్వాలని అనుకోము, ఇలా అవ్వకూడదని ఆలోచిస్తాము కూడా, కానీ అలా అయిపోతుంది. దీనినే సంస్కారానికి వశము అని అంటారు. కొందరికి కాసేపటిలోనే మనను కుంగిపోతుంది, కొద్దిగా ఏదైనా చూసారు, విన్నారు అంటే మనసు కుంగిపోతుంది. అప్పుడు ఒకవేళ ఎవరైనా, ఏమైంది అని అడిగితే ఏమంటారు? ఏం లేదు, ఇది నా సంస్కారము, అదే బాగైపోతుందిలే, సంస్కారమే అని అంటారు. కానీ అది తయారైంది ఎలా? మనను మరియు బుద్ధి ఆధారంగా సంస్కారము తయారైంది. అలాగే బ్రాహ్మణ సంస్కారాలు కానటువంటి రకరకాల సంస్కారాలు ఉంటాయి. బాప్‌దాదా అనుకుంటారు, మీరు ఎవరు అని ఎవరైనా అడిగితే ఏమంటారు? బ్రహ్మాకుమారులు లేక బ్రహ్మాకుమారీలు అని అంటారు. మరి బ్రహ్మా పిల్లలు ఎవరైనట్లు? బ్రాహ్మణులు. కానీ వ్యర్థ సంస్కారాలకు వశమైనప్పుడు ఆ సమయములో బ్రహ్మాకుమారులా, బ్రాహ్మణులా లేక క్షత్రియులా? ఆ సమయములో మీరెవరు? ఇలా కాదు, ఈ విధంగా కాదు... అని ఒకవేళ మీతో మీరు యుద్ధము చేసుకుంటుంటే మీరు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? చాలామంది పిల్లలు అంటారు, రెండు రోజుల నుండి నా మనసులో సంతోషము మాయమైపోయింది, ఎందుకో తెలియదు! ఎందుకు అనేది వారికి లోపల తెలుసు కానీ బయటకు మాత్రం ఎందుకో తెలియదు అని అంటారు! మరి ఆ రెండు రోజులు బ్రాహ్మణులా లేక క్షత్రియులా? సంతోషం మాయమైపోయినవారు బ్రాహ్మణులా? మరి ఒక్కోసారి క్షత్రియులుగా, ఒక్కోసారి బ్రాహ్మణులుగా అవుతున్నారా? అందరూ - మేము యజమానులము అని అన్నారు కదా, మరి ఆ సమయములో మీరు ఏమిటి? యజమానులా లేక పరవశులా?
కావున బాప్‌దాదా చూసారు - యజమానత్వాన్ని కదిలించేది విశేషంగా మనస్సు. మీరు స్వరాజ్య అధికారులైన రాజులు, మనస్సు మీ మంత్రి. లేక మనస్సు యజమాని మరియు మీరు మంత్రా? మీరే రాజు కదా, మనస్సు అయితే రాజు కాదు కదా? అది మంత్రి, సహయోగి. కావున మనస్సుపై యజమానత్వము అనేది సదా ఉండాలి, అప్పుడే స్వరాజ్యాధికారి అని అంటాము. లేదంటే ఒక్కోసారి అధికారులుగా, ఒక్కోసారి అధీనులుగా ఉంటారు. దీనికి కారణమేమిటి? ఎందుకని పరివర్తన జరగటం లేదు? ఇది అర్థం చేసుకుంటారు కూడా, అయినా సంస్కారానికి వశమైపోతారు, అందుకే మొదట మనస్సును కంట్రోల్ చేసుకోండి. మేము రాజు అని అంటారు కానీ రాజు అంటే రూలింగ్ పవర్ (పరిపాలన శక్తి) కలవారు అని అర్థము. ఒకవేళ పేరేమో రాజు కానీ పరిపాలనా శక్తి లేకపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుంది? వారి రాజ్యం నడుస్తుందా? నడవదు. కనుక పరిపాలనా శక్తి ఎంత శాతం వచ్చింది - ఇది చెక్ చేసుకోండి.
ఒక పొరపాటును చాలా ఎక్కువ చేస్తుంటారు, దాని కారణంగా కూడా సంస్కారాలపై విజయాన్ని పొందలేకపోతారు, చాలా సమయం పడుతుంది. రేపటి నుండి చెయ్యము అని అనుకుంటారు కానీ ఆ రేపు వచ్చేసరికి ఈ రోజు కన్నా రేపటి విషయం పెద్దదైపోతుంది. అప్పుడు ఏమంటారంటే - నిన్నటిది చిన్న విషయం కదా, ఈ రోజుది చాలా పెద్ద విషయము, అది పెద్ద విషయమైన కారణంగా ఏదో కాస్త జరిగింది, తర్వాత సరి చేసేస్తానులే - ఇలా అంటూ పెద్దవారికి మరియు తమ హృదయానికి ఓదార్పును ఇచ్చుకుంటారు. ఈ విధంగా ఓదార్పును ఇచ్చుకుంటూ గడిపేస్తారు, కానీ ఇది ఓదార్పు కాదు, ఇది మోసము. ఆ సమయములో కాసేపటి కోసం స్వయానికి మరియు ఇతరులకు - అంతే, ఇప్పుడిక బాగైపోతాము అని ఓదార్పును ఇవ్వటం అంటే అది స్వయాన్ని మోసము చేసుకునే అలవాటును దృఢంగా చేసుకుంటున్నట్లు. అది ఆ సమయంలో అర్థం కాదు కానీ ఎప్పుడైతే ప్రాక్టికల్‌గా మోసపోతారో అప్పుడు - అవును, ఇది మోసమే అని అర్థం చేసుకుంటారు. కనుక పొరపాటు ఏమి చేస్తున్నారు? చిన్నవారైనా లేక పెద్దవారైనా ఒకరికొకరు శిక్షణను ఇచ్చుకునేటప్పుడు ఏమంటారు? ఇది నా స్వభావము, నా సంస్కారము అని అంటారు, కొందరికి ఫీలింగ్ యొక్క సంస్కారము, కొందరికి పక్కకు తప్పుకునే సంస్కారము, కొందరికి పదే-పదే పరచింతన చేసే సంస్కారము, కొందరికి పరచింతన వినే సంస్కారము, ఇలా రకరకాలుగా ఉంటాయి, వాటి గురించైతే తండ్రి కంటే ఎక్కువ మీకే తెలుసు. కానీ బాప్‌దాదా ఏమంటారంటే - దేనినైతే మీరు నా సంస్కారము అని అన్నారో అది మీదా? అది ఎవరిది? (రావణుడిది) మరి నాది అని ఎందుకన్నారు? ఎప్పుడూ కూడా, ఇవి రావణుడి సంస్కారాలు అని అనరు. నా సంస్కారాలు అనే అంటారు. ఈ ‘నాది’ అన్న పదమే పురుషార్థాన్ని ఢీలా చేస్తుంది. ఈ రావణుడి వస్తువును లోపల ఎందుకు దాచిపెట్టుకున్నారు? లోకులైతే రావణుడిని హతమార్చిన తర్వాత కాల్చేస్తారు, కాల్చేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో దానిని నీటిలో కలిపేస్తారు, కానీ మీరు దానిని నాదిగా చేసుకుని మీ వద్ద అట్టి పెట్టుకున్నారు! మరి ఎక్కడైతే రావణుడి వస్తువు ఉంటుందో అక్కడ అశుద్ధతతో పాటు శుద్ధ సంస్కారము కలిసి ఉంటుందా? ఈ రాజ్యం ఎవరిది? అశుద్ధతది. శుద్ధత యొక్క రాజ్యమైతే కాదు కదా! కావున రాజ్యం అశుద్ధతది, మీరేమో బంగారాన్ని మరియు వజ్రాలను సంభాళించి పెట్టుకున్నట్లుగా అశుద్ధమైన వస్తువును మీ వద్ద సంభాళించి పెట్టుకున్నారు. అందుకే అశుద్ధతకు మరియు శుద్ధతకు, రెండింటికీ యుద్ధము జరుగుతుంటుంది, కనుక పదే-పదే బ్రాహ్మణుల నుండి క్షత్రియులుగా అవుతారు. నా సంస్కారము ఏమిటి? తండ్రి సంస్కారమే నా సంస్కారము, అందులోనూ విశేషంగా విశ్వ కళ్యాణకారి, శుభచింతనధారి. అందరి పట్ల శుభభావన, శుభకామనధారి. ఇవి నా అసలైన సంస్కారాలు. మిగిలినవి నావి కావు. లోపల దాగి ఉన్న ఈ అశుద్ధత ఉంది కదా, ఇదే సంపూర్ణంగా శుద్ధంగా అవ్వటంలో విఘ్నం వేస్తుంది. అందుకే తయారవ్వాలని అనుకుంటారు, లక్ష్యాన్ని పెట్టుకుంటారు కానీ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది.
మెజారిటీ ఆలోచించారు, చాలా మంది సంకల్పం కూడా చేసారు, వ్రాసారు కూడా - ఈ డైమండ్ జూబ్లీలో తండ్రి సమానంగా డైమండ్గా అవ్వాల్సిందే అని. మరి ఈ సంకల్పం ఉందా లేక ఆలోచించాలా? ఆలోచించాలంటే ఆలోచించుకోండి! కానీ నంబరు వెనుక లభిస్తుంది. నానుడి కూడా - ఎవరు చేస్తే వారు పొందుతారు అని ఉంది. ఎవరు ఆలోచిస్తే వారు పొందుతారు అని కాదు కదా! సంకల్పాలను అయితే చాలా బాగా చేస్తారు. బాప్‌దాదా కూడా అవి చదివి, విని సంతోషపడతారు కానీ ఈ రావణుడి వస్తువునేదైతే దాచిపెట్టుకున్నారు కదా, అది మనస్సును యజమానిగా అవ్వనివ్వదు. నా అలవాటు, నా స్వభావము, నా సంస్కారము, నా నేచర్ - ఈ రావణుడి ఆస్తినంతటినీ మీతో పాటు హృదయంలో పెట్టుకుంటే, ఇక మనోభిరాముడు ఎక్కడ కూర్చుంటారు! రావణుడి ఆస్తిపై కూర్చోవాలా! అందుకే ఇప్పుడు వీటిని తీసేసెయ్యండి.
‘నాది’ అన్న పదాన్ని ఉపయోగిస్తున్నప్పుడు - నా స్వభావము లేక నా నేచర్ ఏమిటి అన్నది గుర్తు చేసుకోండి. మనస్సు గురించి ప్రపంచంలోనివారు కూడా - ఇది గుర్రం వంటిది, చాలా పరుగెడుతుంది మరియు వేగంగా పరుగెడుతుంది అని అంటారు కానీ మీ మనస్సు పరుగు పెట్టాలా? మీ విషయంలో శ్రీమతమనే కళ్ళెము దృఢంగా ఉంది. ఒకవేళ కళ్ళెము సరిగ్గా ఉంటే ఎటువంటి అలజడి కలగదు. కానీ చేస్తున్నది ఏమిటి? బాప్‌దాదా చూస్తూ ఉంటారు కదా, అప్పుడు నవ్వు కూడా వస్తుంది. సవారీని నడుపుతూ ఉంటారు, కళ్ళెము చేతిలో ఉంది కానీ ఒకవేళ నడుస్తూ-నడుస్తూ ఉండగా కళ్ళెమును పట్టుకున్నవారి బుద్ధి లేక మనస్సు ఏదైనా సైట్సీన్ (దారిలోని దృశ్యము) వైపు వెళ్ళినట్లయితే ఏమవుతుంది? కళ్ళెము లూజ్ అవుతుంది! కళ్ళెము లూజ్ అయిందంటే మనస్సు తప్పకుండా చంచలత్వం చేస్తుంది. కనుక శ్రీమతమనే కళ్ళెమును సదా మీ లోపల స్మృతిలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఏదైనా విషయం జరిగితే, మనస్సు చంచలమైతే శ్రీమతమనే కళ్ళెమును టైట్ చేయండి. అప్పుడు ఏమీ అవ్వదు. ఇక గమ్యానికి చేరుకుంటారు. శ్రీమతము అనేది ప్రతి అడుగు కొరకు ఉంది, శ్రీమతము అంటే కేవలం బ్రహ్మచారిగా అవ్వండి అన్నది మాత్రమే కాదు. ప్రతి కర్మ కొరకు శ్రీమతము ఉంది. నడవటము, తినటము, తాగటము, వినటము, వినిపించటము - అన్నింటికీ శ్రీమతము ఉంది. ఉందా, లేదా? మీరు పరచింతన చేస్తున్నారనుకోండి, అది శ్రీమతమా? శ్రీమతాన్ని ఢీలా చేస్తే చంచలమవ్వటానికి మనస్సుకు అవకాశం లభిస్తుంది. ఇక ఆ తర్వాత అదే అలవాటైపోతుంది. కావున అలవాటు చేస్తున్నవారు ఎవరు? మీరే కదా! అందుకే ముందు మనస్సుకు రాజుగా అవ్వండి. చెక్ చేసుకోండి - ఈ మంత్రి లోలోపలే తన రాజ్యాన్ని అయితే స్థాపించుకోవటం లేదు కదా. ఏ విధంగా ఈ రోజుల్లోని రాజ్యంలో వేరే గ్రూపును తయారుచేసుకుని పవర్లోకి వస్తారు మరియు ముందు ఉన్నవారిని కదిలించేందుకు ప్రయత్నం చేస్తారు. ఈ మనస్సు కూడా అలానే చేస్తుంది, బుద్ధిని కూడా తనదిగా చేసుకుంటుంది, నోటిని, చెవులను అన్నింటినీ తనవిగా చేసుకుంటుంది. కనుక ప్రతి రోజూ చెక్ చేసుకోండి, సమాచారాన్ని అడగండి - ఓ మనస్సు అనే మంత్రి, నీవు ఏం చేసావు? ఎక్కడా మోసగించలేదు కదా? లోలోపలే గ్రూపును తయారుచేసుకుని మిమ్మల్ని రాజుకు బదులుగా బానిసగా చేయవచ్చు! ఆ విధంగా జరగకూడదు. చూడండి, బ్రహ్మాబాబా ఆదిలో ప్రతి రోజూ ఈ దర్బారును పెట్టేవారు, అందులో సహయోగీ సహచరులందరినీ సమాచారం అడిగేవారు, ఆదిలో బ్రహ్మా బాబా యొక్క రోజువారీ దినచర్య ఇది. విన్నారు కదా? మరి బ్రహ్మాబాబా కూడా శ్రమించారు కదా! అటెన్షన్ పెట్టారు కావుననే స్వరాజ్యాధికారిగా మరియు విశ్వ రాజ్యాధికారిగా అయ్యారు. శివబాబా అయితే ఎలాగూ నిరాకారుడే, కానీ బ్రహ్మా బాబా అయితే మీ వలె మొత్తము జీవితమంతా పురుషార్థం చేసి ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకున్నారు. కనుక బ్రహ్మా బాబాను ఫాలో చేయండి. ఈ మనస్సు చాలా చంచలమైనది మరియు చాలా వేగవంతమైనది, ఒక్క సెకెండులో మిమ్మల్ని మొత్తము విదేశాలన్నీ తిప్పి తీసుకురాగలదు. కావున ఏం విన్నారు? బాలకులు మరియు యజమానులు. బాలకులుగా అయితే అయిపోయాము, వారసత్వమైతే లభించేసింది అని ఇందులోనే సంతోషపడడం కాదు, ఒకవేళ వారసత్వానికి యజమానులుగా అవ్వలేదంటే ఆ బాలక స్థితి ఏమైనట్లు? బాలకులు అంటేనే యజమానులు అని అర్థము. కానీ స్వరాజ్యానికి కూడా యజమానులుగా అవ్వండి. కేవలము వారసత్వాన్ని చూసి సంతోషపడకండి, స్వరాజ్యాధికారులుగా అవ్వండి. కనుపాప ఇంత చిన్ననిది, అది కూడా మోసం చేసేస్తుంది. యజమానులుగా అవ్వలేదు కాబట్టే మోసం చేస్తుంది. బాప్‌దాదా పిల్లలందరినీ స్వరాజ్యాధికారి రాజులుగా చూడాలని కోరుకుంటున్నారు. అధికారులు అనేవారు ఆధీనులుగా ఉండరు. అర్థమైందా? ఏమవుతారు? బాలకులు మరియు యజమానులు. రావణుడి వస్తువునైతే ఇక్కడ హాల్లోనే విడిచిపెట్టి వెళ్ళండి. ఇది తపస్యా స్థానము కదా. మరి తపస్యను అగ్ని అని అంటారు. కావున అగ్నిలో అంతమైపోతుంది.
బాప్‌దాదా చూసారు - పిల్లలకు ఇప్పటికీ రావణుడిపై ప్రేమ ఉంది. మనస్సులో కోరుకోరు కానీ అలా ఉండిపోయింది. ఇప్పుడు దీనిని సమాప్తం చెయ్యండి. టీచర్లు ఏం చేస్తారు? ఇక్కడే విడిచిపెట్టి వెళ్తారా లేక ట్రైన్లో నుండి విసిరేస్తారా? ఎందుకంటే 63 జన్మల పాత వస్తువు కావున కాస్త ప్రీతి అయితే ఉంటుంది. పాండవులు ఏం చేస్తారు? ఇక్కడే విడిచిపెట్టి వెళ్తారా లేక కింద ఆబూ రోడ్లో విడిచిపెడతారా? ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళండి. విడిచిపెట్టడానికి సిద్ధముగా ఉన్నారా? సరే అని ఢీలా-ఢీలాగా అంటున్నారు. బాప్‌దాదా ప్రతి రోజూ పిల్లల విషయాలు ఏవో ఒకటి చెక్ చేస్తూ ఉంటారు. మరి మీరు కూడా చెక్ చేసుకుంటేనే కదా ఛేంజ్ (పరివర్తన) అవుతారు!
అచ్ఛా, ఈ అవకాశమైతే అదనంగా లభించింది. కొత్తవారికైనా లేక పాతవారికైనా, అకస్మాత్తుగా ఈ లాటరీ లభించింది. అకస్మాత్తుగా లభించే లాటరీకి మహత్వము ఉంటుంది. మరి ఈ లాటరీని సదా ప్రాక్టికల్ కర్మలలోకి తీసుకొస్తూ పెంచుతూ ఉండండి. ఎంతగా స్వయము పట్ల మరియు ఇతరుల పట్ల కార్యములో వినియోగిస్తారో, అంతగా పెరుగుతూ ఉంటుంది. కనుక పెంచుతూ ఉండండి, ఈ లాటరీ రోజును మర్చిపోకండి, గుర్తుంచుకోండి.
కుమారీలతో:- కుమారీలు ఏమి చేస్తారు? కుమారీ అంటేనే కమాల్ చేసేవారు. కాబట్టి కమాల్ చేయాలి. ఏమి కమాల్ చేస్తారు? బాప్‌దాదా కుమారీలను చూసినప్పుడల్లా ఇదే దృష్టితో చూస్తారు - వీరు కమాల్ చేసే కుమారీలు అని. కుమారీ స్వయంగా ఏదైనా చేసినా, బాప్‌దాదా ప్రతి కుమారీలో కమాల్ చేసే శుభ భావన, శుభకామనలను ఉంచుతారు. మరి కుమారీలు ఏమి చేస్తారు? ఎందుకంటే కుమారీలు చాలా బంధనాల నుండి ఫ్రీగా ఉంటారు. ఒకవేళ కుమారీ పురుషార్థంలో మంచిగా ఉంటే, ఆమెకు సెంటర్ లభిస్తుంది. ఒకటి, సెంటర్ సేవాధారిణిగా అయ్యే భాగ్యం లభిస్తుంది. రెండవది, సెంటర్లో ఒంటరిగా కాదు, సహయోగులు కూడా లభిస్తారు. కుమారులు అయితే ఒంటరిగా వంట చేసుకోవాలి. కానీ కుమారీలకు టర్న్ బై టర్న్ చేసినా, ఒకరికొకరు సహాయోగులుగా ఉంటారు కదా! ఇంకా సంపాదన గురించి ఎలాంటి చింత ఉండదు. ఒకవేళ ఏవరైనా కుమార్ మీ వద్దకు (దాదీల వద్దకు) వస్తే, మీరు ఉద్యోగం మానిపిస్తారా? ఉద్యోగం చేయమని చెబుతారు. కానీ కుమారీలకు అదృష్టం ఏమిటంటే - ఉద్యోగం వదిలి వచ్చేయమని చెబుతారు. కుమారీకి స్వయంగా చదువుపైనా లేదా ఉద్యోగంపైనా మమకారం ఉంటుంది. అది ఆమె అదృష్టం. కానీ కుమారీలకు అవకాశం చాలా మంచిది. ఇంకా సేవ చేసే అవకాశం ఎంత లభిస్తుంది? ఎంత చేయాలనుకుంటే అంత చేయవచ్చు.
బ్రహ్మా బాబా పాత పిల్లలతో ఇలా అంటున్నారు –సేవే లేదు. చాలా చేస్తున్నాం కానీ సేవ కనిపించడం లేదు. సేవ కోసం ఎవరూ దొరకడం లేదు అని ఎవరైనా అంటుంటే, బ్రహ్మా బాబా ఏమంటారు? అడవి అంతా ఉంది, కానీ వేటగాడు వేట దొరకడం లేదంటున్నాడు - అలా జరుగుతుందా! వేటగాడికి గుర్తించే శక్తి లేదు. చూడడానికి కావలసిన పదునైన దృష్టి లేదు. అడవిలో వేట లేకపోవడం అసంభవం. జనసంఖ్య ఎంత పెరుగుతోంది! చిన్న గ్రామమైనా, పెద్ద పట్టణమైనా ప్రతిచోటా జనసంఖ్య పెరుగుతోంది. మరి జనసంఖ్య పెరుగుతుంటే సేవ లేకపోవడం ఎలా సాధ్యం! చేయడం తెలియడం లేదు. అందుకే కుమారీలు ముందుగా తమను తాము నిర్బంధనులుగా చేసుకునే విశేష సేవ చేయాలి. ముందుగా తమను తాము నిర్బంధనులుగా చేసుకోండి. ఏమవుతోంది? కుమారీలు సెంటర్లో ఉండడానికి భయపడుతున్నారు. కుమారులు మాత్రం సెంటర్లో ఉండాలని కోరుకుంటున్నారు. కారణం ఏమిటి? బలహీన ఆత్మలు ఉన్నారు. నంబర్‌వార్‌గా ఉండడం సహజమే కదా. అటువంటి బలహీన ఆత్మల బలహీనతను చూసి భయపడిపోతున్నారు. మంచివారిని చూడడం లేదు. బలహీనులను ఫాలో అవుతున్నారు. అందుకే బాప్‌దాదా కూడా చెప్పారు -సీ ఫాదర్-మదర్. ఫాలో ఫాదర్-మదర్. కానీ బలహీనులను ఫాలో అవ్వవద్దు. కాబట్టి కుమారీల హృదయంలో ఉత్సాహం ఉప్పొంగాలి - సేవ చేయాలి, సేవకు, విజయానికి సితారలమవ్వాలి. బలహీనులుగా కాదు.
కుమారులతో:- కుమారులకు కూడా అవకాశం లభిస్తుంది. సేవ చాలా పెరిగినప్పుడు, ఇన్ని ఆత్మలకు సందేశం ఇవ్వాలి. కొద్దిమంది ఆత్మలతో అది సాధ్యమవుతుందా! కాబట్టి మీకు అవకాశం లభిస్తుంది. కానీ మీరు ముందుగానే అలా సిద్ధమవ్వండి. టీచర్లు ఒక వారం కోర్స్ చెప్పాల్సి వస్తుంది. కానీ మీరు ఒక్క సెకనులోనే మీ దృష్టి-వృత్తి ద్వారా పరిచయం ఇవ్వగలగాలి. అటువంటి సేవ కుమారులు చేయాలి. ఇప్పుడు చూడండి, బాప్‌దాదా స్పష్టంగా చెబుతున్నారు - కుమారులను సెంటర్లో ఎందుకు ఉంచడం లేదు? కారణం ఏమిటి? దాదీలకు భయం. అప్పుడప్పుడు ప్రాక్టికల్‌లో నష్టం కూడా జరుగుతుంది. అలా కారణం లేకుండా భయపడరు. జరుగుతుంది కూడా. ఒకవేళ కుమారులు పక్కా యోగులై, ఆత్మ తప్ప మరే విషయంపైనా సంకల్పం వెళ్లకుండా ఉంటే, కుమారులకు ఎన్నో సేవాకేంద్రాలు లభించవచ్చు. ప్రస్తుతం నష్టం జరుగుతుందనే భయం ఉంది. ఎందుకంటే రావణుని వస్తువు లోపల ఉంది కదా, అందుకే భయం. కానీ కుమారీలు ఇన్ని సంవత్సరాలు చేసిన సేవను, కుమారులు వేగంగా చేయగలరు. అవకాశం చాలా మంచిగా లభించబోతోంది. కానీ ముందుగా సిద్ధమవ్వండి. ముందుగా దాదీలను నిశ్చింత చక్రవర్తులుగా చేయండి. ఎక్కడ కుమారులు-కుమారీలు కలిసి ఉంటారో అక్కడ భయం ఉంటుంది. విదేశాల విషయం వేరు. అక్కడ ఫీమేల్ కూడా మేల్, మేల్ కూడా ఫీమేల్. అక్కడ పరిస్థితి వేరు. కానీ భారతదేశంలో ఇద్దరు ముగ్గురు అన్నయ్యలు కలిసి సెంటర్ నడిపితే, ముందుగా ప్రజలు చర్చించడం తప్ప ఇంకేమీ చేయరు. ఉత్సాహం ఎక్కువైతే దెబ్బలు కూడా పడవచ్చు. అందుకే మీరు సిద్ధమవ్వండి. మీకు సేవ చాలా లభించబోతోంది. కుమారీలకు ఎంత సేవ చేసే అవకాశం ఉందో, మీరు పక్కా యోగులైతే కొద్ది కాలంలోనే మీ ఖాతా కూడా అంతే జమ అవుతుంది. కానీ బాప్‌దాదాకు హృదయపూర్వకంగా గ్యారంటీ ఇవ్వండి. కాగితం మీద రాసిన గ్యారంటీని బాప్‌దాదా నమ్మరు. ఈరోజుల్లో కాగితంపై నీరు, సిరాతోనే కాదు, రక్తంతో కూడా రాసి ఇస్తారు. కానీ ఒక నెల తరువాత కుమారునిగా కాక యుగళ్గా వస్తారు. అలాంటి గ్యారంటీ వద్దు. డైమండ్ జూబిలీలో బాప్‌దాదా చూశారు - కుమారులు చాలా మంచిగా, అందరిలో నంబర్‌వన్ పురుషార్థం చేస్తున్నారు. కాబట్టి కుమారులు సమయాన్ని కూడా సమీపానికి తీసుకురాగలరు. సమయం సమీపానికి వస్తుంది మరియు మీ సేవ విశాలమవుతుంది. కానీ బాప్‌దాదా ప్రతిరోజూ వతనంలో చెక్ చేస్తారు. ఎవరైనా ఇక్కడ చెబితే నమ్మరు. ప్రాక్టికల్‌గా బాబా చెక్ చేస్తారు. అప్పుడు చూడండి, కుమారులు మొదటి నంబర్ తీసుకోగలరు. అర్థమైందా? సందేశం ఇవ్వడంలో కుమారులు ఎప్పటిలాగే తెలివైనవారు. ఇంకా చూడండి, ఏ సెంటర్‌కు కుమారులు రాకపోతే అక్కడ సేవ అభివృద్ధి చెందదు. అంతే కదా టీచర్లు? టీచర్లు అంటారు - సేవ కోసం ఎవరిని పంపాలి! కాబట్టి కుమారులు ఇప్పటికీ సేవ చేస్తున్నారు. కానీ ఒక్క దృఢ నిశ్చయం చేసుకోండి - ‘’మేము యోగి ఆత్మలమే. ఎల్లప్పుడూ యోగి ఆత్మలమే.’’ శరీరం వైపు స్వప్నంలో కూడా సంకల్పం వెళ్లకూడదు. అప్పుడు కుమారులు కమాల్ చేయండి. బాప్‌దాదా మిమ్మల్ని చెక్ చేసి గ్రూపును తయారు చేస్తారు. అచ్ఛా!
ప్రవృత్తివారితో:- ప్రవృత్తివారిపై బాప్‌దాదాకు ఒక శుభ ఆశ ఉంది. కానీ ఇప్పటివరకు ప్రవృత్తివారు దానిని నెరవేర్చలేదు. అది ఏమిటి? సేవలో మాతలు చాలా అవసరం. ఎక్కడ మాతలు ఉంటారో అక్కడ దాదీలు కూడా నిశ్చింతగా ఉంటారు. కానీ ప్రవృత్తిలో ఉన్న మాతలు చాలా తక్కువగా ముందుకు వస్తున్నారు. కుమారీలకు ట్రైనింగ్ ఇస్తారు కదా, అలాగే మాతలకు 15 రోజుల ట్రైనింగ్ ఇచ్చి, ఒక నెల, రెండు నెలలు, మూడు నెలలు సేవలో ట్రయల్ చేయించండి. భారతదేశంలోని ఏ ప్రాంతమైనా సరే, మాతలు తమను తాము ఫ్రీ చేసుకొని రెండు నెలలు, నాలుగు నెలలు, ఆరు నెలలు ఏ విధంగానైనా సేవలో ముందుకు వస్తే, ఎంతో సేవ చేయగలరు. ఇప్పుడు ఆహ్వానాలు ఉన్నప్పటికీ సెంటర్లు తెరవబడటం లేదు. కారణం ఏమిటి? చిన్న చిన్న కుమారీలు సమయానుసారం నిలబడలేరు. కానీ మాతలు ఉంటే, ఒక్క నెలలోనే ఎన్నో సెంటర్లు తెరవబడతాయి. కానీ మాతలలో ఈ ధైర్యం లేదు. ఒకరికి మనవడు, ఒకరికి మునిమనవడు, ఒకరికి భర్త... ఇలా ఏదో ఒక బంధనం ఉంది. మాతలలో ఉత్సాహం రావాలి. ప్రవృత్తిని చూసుకోవాలి. కానీ ఒకరికొకరు సహాయకులై, రెండు నెలలు, మూడు నెలలు బయటకు వచ్చి సేవ చేయాలి. తరువాత సేవ యొక్క రుచి కలిగితే, మీరే మిమ్మల్ని మీరు నిర్బంధనులుగా చేసుకుంటారు. కాబట్టి ప్రవృత్తిలో ఉన్న పాండవులు ఏదో ఒక విధంగా మాతలకు సహయోగులుగా అయ్యి, వారిని సేవ కోసం స్వతంత్రులను చేయండి. కానీ ఇప్పటివరకు బాబా యొక్క ఈ ఆశను ప్రవృత్తివారు నెరవేర్చలేదు. డైమండ్ జూబిలీలో దాన్ని నెరవేర్చండి. అర్థమైందా ప్రవృత్తివారికి? అచ్ఛా!
డబల్ విదేశీయులతో:- చూడండి, డబల్ విదేశీయులకు మొత్తం సీజన్లో వచ్చే అవకాశం ఉంది. ఏ గ్రూపులోనూ డబల్ విదేశీయులు లేకుండా ఉండరు. కాబట్టి ఈ అదనపు అవకాశం డబల్ విదేశీయులకు లభించింది. ఈ సీజన్లో రావడం బాగుంటుందా? ఇండియన్ సీజన్లో రావడంలో ఆనందం కలుగుతుందా? ఎందుకంటే చూడండి, విదేశాలు కూడా చివరకు భారతదేశంలోనే ఇమిడిపోతాయి. సత్యయుగంలో అమెరికా, లండన్ ఉండవు. అవన్నీ భారతదేశంలోనే ఇమిడిపోతాయి. ప్రపంచమంతా ఒక్కటిగా మారుతుంది. డబల్ విదేశీయులు, భారతదేశం వేరు కాదు. ఈస్ట్, వెస్ట్ రెండూ కలిసి ఒకే ప్రపంచమవుతాయి. తరువాత రావాల్సిందే కాబట్టి, ఇప్పటినుండే తమ హక్కును ఉంచుకుంటున్నారు. అచ్ఛా. భారతదేశవారికి కూడా సంతోషమే. మీకూ సంతోషమే. ఇద్దరికీ సంతోషమే. అలాగే విదేశాలలో కూడా నాలుగు వైపులా సేవ జరుగుతోంది. వార్తలు వస్తూనే ఉన్నాయి. ఫలితంలో నాలుగు వైపులా ఉల్లాస-ఉత్సాహాలు మంచిగా ఉన్నాయి. ఫలితాలు కూడా మంచివే. కొన్ని చోట్ల క్లాసులలో స్టూడెంట్లు పెరిగారు. ఇది సేవ విజయమే. అర్థమైందా? సేవకు సంబంధించిన ఉత్తరాలు లేదా తమ స్థితికి సంబంధించిన ఉత్తరాలు, డైమండ్ జూబిలీ ఉల్లాస-ఉత్సాహాలకు సంబంధించిన ఉత్తరాలు పంపిన వారందరికీ బాప్‌దాదా రిటర్నలో పదమారెట్ల కంటే ఎక్కువ ప్రియస్మృతులను పంపుతున్నారు. విదేశాలలో కూడా ఇప్పుడు స్టూడెంట్లు పెరుగుతున్నారు కదా! విదేశాల నాలుగు వైపుల నుండీ వచ్చారు. ఈ సంవత్సరం దేశ-విదేశాలు కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది చాలా మంచిది. అలాగే ఎల్లప్పుడూ కలిసి, ఒకే అభిప్రాయంతో ముందుకు సాగుతూ ఉండండి.
(తరువాత బాప్‌దాదా అన్ని జోన్ల సోదరసోదరీలతో విడివిడిగా చేతులు ఎత్తించి మిలనము జరిపారు. ఢిల్లీలో డైమండ్ జూబిలీ సందర్భంగా నిర్వహించిన ఝాంకీల గురించి బాప్‌దాదా విన్నారు.)
అచ్ఛా, ఢిల్లీ వార్తలు కూడా విన్నాము. డైమండ్ జూబిలీ ప్రారంభం చాలా బాగా జరిగింది. మంచిదే చేశారు. ఢిల్లీ వారు తెలివిగా వ్యవహరించారు - ముందుగా చేస్తే దాదీలు వస్తారు, అందరితో కలిసి చేస్తే దాదీలు రారు అని. మంచి తెలివి చూపించారు. ఢిల్లీ మీ అందరిదీ కదా! రాజ్యం ఢిల్లీపైన చేస్తారా లేక లండన్లోనా? ఢిల్లీ అందరిదీ. ఎన్నిసార్లు ఢిల్లీలో రాజ్యం చేశారు? లెక్కలేనన్ని సార్లు. కాబట్టి అది మీదే కదా! అందుకే స్థాపన సేవ కూడా ఢిల్లీలోని యమునా తీరంలో ప్రారంభమైంది. రాజ్యం కూడా యమునా తీరంపైనే చేయాలి. కాబట్టి ప్రారంభమూ యమునా తీరం నుండే జరిగింది. శ్రమ చేశారు కానీ రాజ్య ముద్రను మాత్రం వేశారు కదా! కాబట్టి మంచిదే. మిగతా ప్రాంతాల్లో కూడా మంచి కార్యక్రమాలు రూపొందించారు. అవి ప్రాక్టికల్‌గా జరిగితే ఇంకా చాలా మంచిది. ప్రస్తుతం ప్రణాళికలు రూపొందిస్తున్నవారు చాలా మంచివే రూపొందిస్తున్నారు. విజయం అయితే తప్పకుండా లభిస్తుంది.
అచ్ఛా, వెనుక కూర్చున్నవారు బాగానే కూర్చున్నారు కదా! బాప్‌దాదా అయితే ఎక్కువగా వెనుకనే చూస్తారు. ఎందుకంటే వెనుకవారిని చూస్తే, ముందువారు తమంతట తామే ముందుకు వచ్చేస్తారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న బాలకులు మరియు యజమానులు అనే డబల్ అధికారాన్ని తీసుకునే శ్రేష్ఠ ఆత్మలకు, సదా స్వరాజ్యాధికారులుగా అయ్యి తమ రాజ్యాన్ని నడిపించే భాగ్యవంతులైన ఆత్మలకు, సదా తండ్రి సంస్కారాలే నా సంస్కారాలు అన్న ఈ విధి ద్వారా సేవలో ముందుకు వెళ్ళే శ్రేష్ఠ సేవాధారీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- ఎంత ఎక్కువ బాధ్యతలు పెరుగుతాయో, అంత ఎక్కువ అదనపు ఆశీర్వాదాలు మరియు బాబా ప్రేమ పెరుగుతూనే ఉంటుంది కదా! కానీ బాధ్యతలు బాబా లెక్క ప్రకారం చాలా ఉన్నాయి. మీ సహయోగులు బాబా భుజాలే కదా! అయినప్పటికీ బాధ్యతలు ఉన్నాయి, ఇంకా ఉంటాయి కూడా. చాలా బాధ్యతలు ఉన్నాయి కదా! మీరేమనుకుంటారు? ఒక్కొక్కరిపై చాలా బాధ్యతలు ఉన్నాయి కదా! చాలా బాధ్యతలు ఉన్నాయి కదా! (బాధ్యత అయితే బాబా మీదే. సూచన లభిస్తుంది, మేమందరం చేస్తాము) ఇది మంచి విషయం. మీరు డబల్ లైట్. డబల్ లైట్‌గా ఉన్నందున అవి మీకు భారంగా అనిపించవు. ఇది బాబా మరియు తల్లి ఇద్దరి నుండి లభించే అంతర్గత అదనపు సహాయం. ఎందుకంటే మాతా-పిత అయిన జగదంబ మరియు బ్రహ్మా బాబా ఇద్దరి స్థూల బాధ్యతలు మీపై ఉన్నాయి. సూక్ష్మంలో అయితే వారు తోడుగానే ఉన్నారు. కానీ బయటకు చూస్తే నిమిత్తులు మీరే. అందుకే అందరికీ మీపై నిర్మలమైన ప్రేమ ఎక్కువగా ఉంది. దాదీలకు కూడా ఉంది, ప్రపంచానికీ ఉంది. అచ్ఛా!
*** ఓంశాంతి ***
