‘‘సర్వ ప్రాప్తి సంపన్న జీవితము యొక్క విశేషత - అప్రసన్నతా ముక్తులు మరియు ప్రసన్నతా యుక్తులు’’
ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్‌దాదా తమ ప్రేమ స్వరూప ఆత్మలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ ప్రేమ ఇమిడి ఉంది. ఈ పరమాత్మ ప్రేమ అనేది ప్రాప్తించడం కూడా ఒక్క జన్మలోనే ప్రాప్తిస్తుంది. 83 జన్మలు దేవాత్మల ద్వారా లేక సాధారణాత్మల ద్వారా లభించింది. ఆలోచించండి, గుర్తు చేసుకోండి, మొత్తము కల్పమంతా తిరిగి రండి - మీరు స్వదర్శన చక్రధారులు కదా! ఒక్క క్షణములో మొత్తము కల్పమంతా తిరిగి వచ్చారా? 83 జన్మలలో పరమాత్మ ప్రేమ లభించిందా? లభించలేదు. కేవలము ఈ సంగమములో ఈ ఒక్క జన్మలోనే పరమాత్మ ప్రేమ ప్రాప్తించింది. మరి తేడాను తెలుసుకున్నారు కదా! ఆత్మల ప్రేమ మరియు పరమాత్మ ప్రేమ - రెండింటిలో ఎంత తేడా ఉంది! సాధారణ ఆత్మల ప్రేమ ఎక్కడకు తీసుకువెళ్ళింది? అది ఏమి ప్రాప్తిని అందించింది - అనుభవమే కదా? మరియు పరమాత్మ ప్రేమ ఎక్కడకు తీసుకువెళ్తుంది? మీ మధురమైన ఇంటికి మరియు మధురమైన రాజధానికి. ఆత్మల ప్రేమ రాజ్య భాగ్యాన్ని పోగొడుతుంది మరియు పరమాత్మ ప్రేమ రాజ్య భాగ్యాన్ని ఇప్పిస్తుంది, అది కూడా ఈ జన్మలోనే. అలాగని మీరు కేవలము భవిష్యత్తు ఆధారముపైనే నడుస్తున్నారని కాదు. అలా కాదు. డైరెక్ట్ పరమాత్మ ప్రాప్తి అయితే ఇప్పుడే ఉంది. వర్తమానము ముందు భవిష్యత్తు కూడా అసలేమీ కాదు. స్వర్గములో ఏం ఉంటుంది మరియు ఏం ఉండదు అని మీరు పాట పాడుతారు కదా. మరి ఇప్పటి పాట ఏమిటి? పొందాల్సినదేదో పొందేసాము... లేక పొందాలా? పొందేసారు. పాండవులు పొందారా? గోపికల విషయంలోనైతే గాయనము ఉండనే ఉంది. బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్న వస్తువేదీ లేదు అన్నది ఇప్పటి గాయనమే. దేవతల ఖజానాలో కాదు, బ్రాహ్మణుల ఖజానాలో అప్రాప్తి అన్నది లేదు. మరి ఇప్పుడు మీరు బ్రాహ్మణులే కదా? మరి అప్రాప్తి అన్న వస్తువేదీ లేదు అని అనుభవము చేస్తున్నారా? అంతేకాక ఈ ప్రాప్తులు అవినాశీ అయినవి, అల్పకాలికమైనవి కావు. మరి ఎవరికైతే సర్వ ప్రాప్తులూ ఉంటాయో, వారి జీవితములో ఏ విశేషత ఉంటుంది? అన్ని ప్రాప్తులు ఉన్నాయి, ఒక్కటి కూడా లోటు లేదు అన్నప్పుడు వారి నడవడికలో మరియు ముఖములో ఏ విశేషత కనిపిస్తుంది? సదా ప్రసన్నత. ఏమి జరిగినా సరే, సర్వ ప్రాప్తి స్వరూపులు తమ ప్రసన్నతను వదలలేరు. ఎప్పుడైనా అప్రసన్నత అనుభవమైతే చెక్ చేసుకోండి - అప్రాప్తి అనుభవం అవుతుందా లేక సర్వ ప్రాప్తులు అనుభవం అవుతున్నాయా?
ఈరోజు బాప్‌దాదా చాలానే సేవాకేంద్రాలను మరియు ఉప సేవాకేంద్రాలను చూసారు, విదేశాలలోనివి కావు, దేశములోనివి చూసారు. సేవాకేంద్రాలలోనైతే విశేషంగా సేవాధారులు ఉన్నారు. ఈ రోజు అంతా తిరుగుతూ సేవాధారులను మరియు సేవాస్థానాలను, రెండింటినీ చూసాము. ప్రతీ స్థానములోనూ, చిన్నవైనా లేక పెద్దవైనా, అన్నింటిలోనూ చెక్ చేసాము - సేవాధారులు తనువుతో, మనస్సుతో, ధనముతో మరియు సేవ యొక్క సంబంధ-సంపర్కాలతో ఎంత ప్రసన్నంగా ఉన్నారు? ఎందుకంటే విశేషమైనవైతే ఈ విషయాలే కదా! మరి ఏం చూసాము?
తనువైతే అందరిదీ పాతదే, యువత అయినా, పెద్దవారైనా, అక్కడక్కడ చిన్నవారు పెద్దవారికంటే బలహీనంగా ఉన్నారు, ఆ అనారోగ్యం పెద్దదే అయ్యి ఉండవచ్చు కానీ - నేను బలహీనుడిని, నేను అనారోగ్యంగా ఉన్నాను అనే ఈ ఫీలింగ్ అనారోగ్యాన్ని పెంచుతుంది ఎందుకంటే తనువు యొక్క ప్రభావం మనస్సుపై పడేటప్పటికి డబల్ వ్యాధిగ్రస్తులుగా అవుతారు. తనువు మరియు మనస్సు, రెండింటిపరంగా డబల్ వ్యాధిగ్రస్తులుగా అయిన కారణంగా పదే-పదే ఆత్మ-అభిమానులుగా అయ్యేందుకు బదులుగా వ్యాధి-అభిమానులుగా అవుతారు. కావున ఏం చూసాము? తనువు ద్వారానైతే మెజారిటీ, అనారోగ్యం అనండి లేక లెక్కాచారాలు తీర్చుకోవడం అనండి, అది చేస్తున్నారు కానీ 50 శాతం డబల్ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు, 50 శాతం సింగిల్ వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు. కానీ అసలు జరగాల్సింది ఏమిటి? ఎప్పుడూ కూడా మనస్సులో - నేను వ్యాధిగ్రస్తుడిని, నేను వ్యాధిగ్రస్తుడిని... అంటూ అనారోగ్యానికి సంబంధించిన సంకల్పాలను తీసుకురాకూడదు. కానీ జరిగేది ఏమిటి? నేను వ్యాధిగ్రస్తుడిని... అనే ఈ పాఠం పక్కా అయిపోతుంది. అప్పుడప్పుడు ఒక్కోసారి అనారోగ్యం ఏమీ ఉండదు కానీ మనస్సులో సంతోషం లేని కారణంగా, నాకు నడుం నొప్పి ఉంది అని సాకు చెప్తారు ఎందుకంటే మెజారిటీకి అయితే కాలు నొప్పి లేక నడుం నొప్పి ఉంటుంది. చాలా సార్లు నొప్పి ఉండదు, అయినా కానీ నాకు నడుం నొప్పి ఉంది అని అంటారు. ఇప్పుడు అది ఎలా చెక్ చేయాలి? నడుం నొప్పి ఉందా, లేదా అన్నదానిని చెక్ చెయ్యటానికి డాక్టర్ల వద్ద ఏదైనా థర్మామీటర్ ఉందా? ఎక్స్-రేలు అవీ చేయించాలంటే వాటికి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కావున ఏం చూసాము అంటూ తనువు గురించి వినిపించాము. చాలామంది సేవాధారులు ఇలా కనిపించారు. మీరందరూ సేవాధారులే. ఇది కేవలము టీచర్ల విషయమే అని అనుకోకండి. ప్రవృత్తిలో ఉన్న మీరు కూడా సేవాధారులే కదా? లేక ఎవరైతే సెంటర్లలో ఉంటారో, వారే సేవాధారులా? ప్రవృత్తిలో ఉండే మీరు కూడా సేవాధారులే. ఎప్పుడైనా మీ ఇళ్ళను కూడా తిరిగి చూస్తాము. ఎలా నిద్రపోతున్నారు, ఎలా లేస్తున్నారు, డబల్ బెడ్ ఉందా, సింగిల్ బెడ్ ఉందా, ఇవన్నీ చూస్తాము. అచ్ఛా, ఇది ఈ రోజు తిరిగినదాని విషయము.
ఈ రోజుల్లో మందులు వేసుకోవటాన్ని పెద్ద విషయముగా భావించకండి ఎందుకంటే కలియుగ వర్తమాన సమయములో అన్నింటికంటే శక్తిశాలీ ఫలాలు ఈ మందులే. చూడండి, అవి రంగురంగులుగా ఉంటాయి కదా. కలియుగ అంతిమములోని ఫలాలు ఇవే, కనుక ప్రేమగా వేసుకోండి. మందులు వేసుకోవడమంటే అది అనారోగ్యాన్ని గుర్తు తెప్పించదు. ఒకవేళ మందులను తప్పదు అన్నట్లుగా వేసుకుంటే అలా వేసుకునే మందులు అనారోగ్యాన్ని గుర్తు తెప్పిస్తాయి, కానీ శరీరాన్ని నడిపించటానికి అవి ఒక శక్తిని నింపుతున్నాయి అన్న స్మృతితో వేసుకుంటే ఆ మందులు అనారోగ్యాన్ని గుర్తు తెప్పించవు, అవి సంతోషాన్ని కలిగిస్తాయి, కనుక కేవలం రెండు-మూడు రోజులలో మందులతో బాగైపోతారు. ఈ రోజుల్లోనైతే చాలా క్రొత్త ఫ్యాషన్ వచ్చింది, కలియుగంలో అన్నింటికంటే ఎక్కువగా జరిగే ఆవిష్కరణ ఈ రోజుల్లోని మందులు లేక రకరకాల థెరపీలు. ఈ రోజు ఫలానా థెరపీ, మరో రోజు మరో థెరపీ, కనుక ఇవి కలియుగ సీజన్లో వచ్చే శక్తిశాలీ ఫలాలు, అందుకే గాభరా పడకండి. కానీ మందుల కాన్షస్‌గా లేక అనారోగ్యం కాన్షస్‌గా అయి వేసుకోకండి. తనువుకు అనారోగ్యం వచ్చేదే ఉంటుంది, ఇది కొత్త విషయమేమీ కాదు, అందుకే అనారోగ్యానికి ఎప్పుడూ గాభరా పడకండి. అనారోగ్యం వచ్చింది, దానికి కాస్త ఫలాలను తినిపించండి మరియు వీడ్కోలు ఇచ్చేసెయ్యండి. అచ్ఛా, ఇది తనువు యొక్క రిజల్టు. ఇంకా ఏం చూసాము?
మనస్సు. మనస్సులో ఏం చూసాము? ఒక సంతోషకరమైన విషయం ఏమి చూసామంటే, మెజారిటీ ప్రతి ఒక్క సేవాధారి మనస్సులో తండ్రి ప్రేమ మరియు సేవా ఉల్లాసము, రెండూ ఉన్నాయి. ఇకపోతే 25 శాతంవారు ఏదో తప్పదు కదా అన్నట్లు నడుస్తున్నారు, వారిని వదిలేయండి. కానీ మెజారిటీవారి మనస్సులో ఈ రెండు విషయాలను చూసాము. అంతేకాక ఇది కూడా చూసాము - తండ్రిపై ప్రేమ ఉన్న కారణంగా యోగంలో కూడా శక్తిశాలిగా అయ్యి కూర్చోవటంలో, నడవటంలో, సేవ చెయ్యటంలో చాలా అటెన్షన్ పెడతారు. కానీ ఆట ఏం జరుగుతుందంటే - స్మృతి అనే సీటుపై చాలా బాగా సెట్ అయ్యి కూర్చోవాలని కోరుకుంటారు కానీ కొద్ది సమయము సెట్ అవుతారు, మళ్ళీ ఇటూ-అటూ కదలటం మొదలవుతుంది. చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి, అతడిని ఎక్కువ సమయం సీటుపై కూర్చోపెడితే తప్పకుండా కదులుతాడు. అలాగే మనస్సు కూడా ఒకవేళ కంట్రోల్లో లేక ఆర్డర్లో లేకపోతే కొద్ది సమయం చాలా బాగా కూర్చుంటారు, నడుస్తారు, సేవ కూడా చేస్తారు కానీ ఒక్కోసారి సెట్ అవుతారు, ఒక్కోసారి అప్సెట్ కూడా అవుతారు. దీనికి కారణమేంటి? కోరుకుంటుందేమో సెట్ అవ్వాలని, మరి అప్సెట్ ఎందుకు అవుతారు? కారణమేమిటి? ఏకాగ్రతా శక్తి, దృఢతా శక్తిలో లోటు. ప్లాన్ చాలా బాగా ఆలోచిస్తారు, ఇలా కూర్చుంటాము, ఇలా అనుభవం చేస్తాము, తర్వాత ఈ సేవ చేస్తాము, ఆ తరువాత ఇలా నడుస్తాము, కానీ కర్మ చేసేటప్పుడు లేక కూర్చుని-కూర్చుని కూడా దృఢతా శక్తి తగ్గిపోతుంది. ఇతర విషయాల వైపుకు మనస్సు-బుద్ధి చెల్లాచెదురు అయిపోతాయి. పనిలో బిజీగా లేకపోయినా కానీ వ్యర్థ సంకల్పాలు, ఇవి అన్నింటికంటే పెద్ద పని, ఇవి తమవైపుకు లాక్కుని వెళ్ళిపోతాయి. కనుక స్థూలమైన పని లేకపోయినా కానీ దృఢతా శక్తి చెల్లాచెదురు అయిపోయిన కారణంగా మనస్సు, బుద్ధి సీటుపై సెట్ అయ్యేందుకు బదులుగా అలజడిలోకి వచ్చేస్తాయి.
బాప్‌దాదా మీ అందరికీ ఏదైతే పని ఇచ్చారో, దానిని చూసారు. బాప్‌దాదా వద్దకు అందరి చీటీలు చేరుకున్నాయి. కానీ చాలామంది పిల్లలు చాలా తెలివైనవారు. ఏ తెలివి చూపిస్తారు? చీటీ వ్రాస్తారు, కానీ పేరు వ్రాయరు. బాబాకైతే తెలుసు కదా అని అనుకుంటూ అలా చేస్తారు. బాబాకు తెలుసు, కానీ ఒక పని ఇచ్చారంటే ఆ పనిని పూర్తిగా చెయ్యండి కదా. ఒకవేళ టీచర్ ఏదైనా వ్రాసి తీసుకురమ్మని చెప్తే, నాకు ఇది వ్రాయడం వచ్చు అన్న సంగతి మీకు తెలుసు కదా అని టీచర్‌తో అంటే టీచర్ ఒప్పుకుంటారా? అలా చాలామంది పేరే వ్రాయరు. కానీ ఏ గ్రూప్‌కు ఏ పని ఇవ్వటం జరిగిందో, అందులో మెజారిటీలో సంతోషకరమైన విషయం ఏం చూసామంటే - మేము డైమండ్ జూబిలీ కల్లా చేసి చూపిస్తాము అని అందరూ వ్రాసారు. మెజారిటీ ఇలా వ్రాసారు. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? జీవన్ముక్తులుగా అయిపోతారా? ఒకవేళ అన్ని విషయాల నుండి ముక్తులుగా అయితే ఏం అవుతారు? జీవన్ముక్తులుగా అయిపోతారు కదా. కావున అందరూ తమ ధైర్యాన్ని, ఉల్లాసాన్ని మంచిగా చూపించారు, అది విదేశీయులైనా లేక భారతవాసులైనా, ఉల్లాస-ఉత్సాహాలు అందరివీ చాలా బాగున్నాయి. కొద్దిమంది మాత్రం, చాలా తక్కువమందే, మాకు సమయం పడుతుంది అని వ్రాసారు. వారికి సమయం పడితే పట్టనివ్వండి. మీరైతే జీవన్ముక్తులుగా అయిపోండి. కావున రిజల్టులో ఏం చూసామంటే - ఈ డైమండ్ జూబిలీలో ఏదైనా చేసి చూపించాలి అనే ఉల్లాసము అందరికీ ఉంది. కానీ బాప్‌దాదా చూసారు - మిమ్మల్ని మీరు వజ్రంగా తయారుచేసుకోవటానికి ఎంతగానైతే ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయో, అంతగానే డైమండ్ జూబిలీ సంవత్సరములో సేవ ప్లాన్లు కూడా చాలా వేగవంతమైనవి తయారుచేసారు. వేగవంతమైనవి తయారుచేసారు, దీనికి బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు, కానీ తర్వాత ఇలా అనకండి - సేవా భారం చాలా ఉంది కదా, అందుకే కాస్త కింద-మీద అయిపోయింది అని. బాప్‌దాదాకు ఇలా వద్దు. ఏ సేవ అయితే స్వయాన్ని లేక ఇతరులను డిస్టర్బ్ చేస్తుందో, అది సేవ కాదు, స్వార్థమవుతుంది. మరియు ఏదో ఒక స్వార్థం నిమిత్తమవుతుంది, అందుకే కింద-మీద అవుతారు. ఎప్పుడైతే, స్వయానిదైనా లేక ఇతరులదైనా స్వార్థము పూర్తి అవ్వదో, అప్పుడే సేవలో డిస్టర్బెన్స్ (అలజడి) కలుగుతుంది, అందుకే స్వార్థము నుండి అతీతముగా మరియు సర్వుల సంబంధంలో ప్రియముగా అయ్యి సేవ చెయ్యండి. అప్పుడు, డైమండ్ జూబిలీలో – డైమండ్గా అయ్యి డైమండ్ జూబిలీని జరుపుకుంటాము అన్న సంకల్పమునేదైతే చేసారో లేక లక్ష్యమునేదైతే పెట్టుకున్నారో, అది పూర్తి కాగలదు. కేవలం సగమే గుర్తు పెట్టుకోకండి. చాలామంది ఎలా జవాబు ఇస్తారంటే - డైమండ్ జూబిలీని జరుపుకునేది ఉంది కావున జరుపుకున్నాము, అందులో బిజీ అయిపోయాము. కానీ బాప్‌దాదా చెప్పిన రెండు మాటలనూ గుర్తుపెట్టుకోండి, సగం కాదు. డైమండ్గా అయ్యి డైమండ్ జూబిలీని జరుపుకోవాలి. కేవలము జరుపుకోవటమే కాదు, డైమండ్గా అయ్యి జరుపుకోవాలి. కావున ‘జరుపుకున్నాము కదా’ అంటూ కేవలం మీకు అనుకూలించే అర్థాన్ని మాత్రమే తీసుకోకండి. డైమండ్గా అయ్యి జరుపుకున్నారా? డైమండ్గా అయ్యి జరుపుకోవటమే డైమండ్ జూబిలీ లక్ష్యము. కనుక సగం లక్ష్యాన్ని పూర్తి చెయ్యకండి. రెండూ ఉండాలి - తయారవ్వాలి మరియు జరుపుకోవాలి. కేవలము తయారవ్వటమూ కాదు, కేవలము జరుపుకోవటమూ కాదు. రెండూ కలిసి ఉండాలి. మీ అందరికీ తెలుసు కూడా - మీరు డైమండ్ జూబిలీని జరుపుకోవాలని లేక డైమండ్గా అవ్వాలని ప్లాన్‌ను తయారు చేసుకుంటున్నప్పుడు మీ అందరికంటే ముందు మాయ కూడా తన ప్లాన్‌ను తయారు చేసుకుంటుంది. అందుకే ఇలా అనకండి - ఏం చెయ్యాలి బాబా, ధైర్యం తగ్గిపోయింది, మాయ చాలా తీవ్రంగా ఉంది, మాయను మీ వద్దనే పెట్టుకోండి. రాజ్యం చేసేది మీరు కానీ మాయను సంభాళించాల్సింది బాబానా! రాజ్యమైతే మీరే చెయ్యాలి కదా. మాయాజీతులే జగత్‌జీతులుగా అవుతారు, కావున మాయను జయించకుండా జగత్‌జీతులుగా ఎలా అవుతారు? అందుకే నలువైపులా అటెన్షన్ ప్లీజ్. అర్థమైందా? అచ్ఛా!
ఈరోజు తిరిగి గమనించినదానిలో సగం వినిపించాము, మిగిలిన సగం తర్వాత వినిపిస్తాము. కొన్ని-కొన్ని సెంటర్లు చాలా బాగా అలంకరించబడి ఉన్నాయి, కొన్ని సింపుల్‌గా ఉన్నాయి, కొన్ని చాలా రాయల్‌గా ఉన్నాయి, కొన్ని మధ్యస్థంగా కూడా ఉన్నాయి. ఎక్కువమంది ఏమనుకుంటారంటే - సెంటర్ రాయల్‌గా అనిపించాలి, ఎవరైనా వి.ఐ.పి.లు వస్తే వారికి సెంటర్ బాగుంది అని అనిపించాలి అని. కానీ ఆది నుండి ఇప్పటివరకు కల మీ (బ్రాహ్మణుల) నియమము ఏమిటంటే - చాలా సాధారణంగానూ ఉండకూడదు, అలా అని చాలా రాయల్గానూ ఉండకూడదు. మధ్యస్థంగా ఉండాలి. బ్రహ్మాను అయితే చాలా సాధారణంగా చూసారు, వారు సాధారణంగా ఉండేవారు. కానీ ఇప్పుడు సాధనాలు ఉన్నాయి, సాధనాలను ఇచ్చేవారు కూడా ఉన్నారు, అయినా కూడా ఏ కార్యము చేసినా మధ్యస్థంగా ఉండేటట్లు చెయ్యండి. వీరు ఏం పెట్టారో అర్థం కావటం లేదు అని కూడా ఎవరూ అనకూడదు, అలాగే వీరిది ఇప్పుడే రాజరికంగా ఉంది అని కూడా ఎవరూ అనకూడదు. కనుక ఈ రోజు పాఠం ఏమిటి? ముక్తులుగా అయితే అన్నింటి నుండి అయ్యారు కదా! అన్నింటి నుండి ముక్తులుగా అయ్యే ప్రతిజ్ఞను చేసారు కదా! దృఢంగా ఉన్నారా లేక ఇంటికి వెళ్ళిన తర్వాత ‘కష్టము’ అని అంటారా! దృఢంగా ఉండండి. డైమండ్ జూబిలీలో మాయకు పాఠం నేర్పించి చూపించండి. మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు, తక్కువేమీ కాదు!
అచ్ఛా, డబల్ విదేశీయులు కూడా చాలామంది వచ్చారు. స్థాపనా కార్యము యొక్క డబల్ శోభ - డబల్ విదేశీయులు. ఎంత శ్రమతో, ఎంత యుక్తితో ఇక్కడకు చేరుకుంటారో బాప్‌దాదాకు తెలుసు. ఒకవేళ తపన తక్కువైతే, చేరుకోవటం కూడా కష్టమనిపిస్తుంది. ఒకవైపేమో ధనం విలువ పడిపోయింది అని బాప్‌దాదా వింటారు, మళ్ళీ సంవత్సరం చూస్తే విదేశీయులు ఇంకా ఎక్కువగా వచ్చి ఉంటారు. ఇదీ ధైర్యమంటే. రష్యావారి గ్రూప్ కూడా వచ్చింది కదా! రష్యావారు టికెట్‌ను ఎక్కడి నుండి తీసుకొచ్చారు? వీరి కథలు వినటానికి చాలా బాగుంటాయి. టికెట్ డబ్బులను ఎలా పోగు చేస్తారు అన్నదాని కథ చాలా బాగుంటుంది. ఇవన్నీ జరగవలసిందే. అది కాగితమే కదా, డాలర్ అన్నా, పౌండ్ అన్నా, అది కాగితమే కదా, కాగితమే అన్నప్పుడు కాగితం ఎంతవరకు నడుస్తుంది! బంగారానికి విలువ ఉంది, వజ్రానికి విలువ ఉంది, కాగితానికి ఏం విలువ ఉంది? ధనం విలువ పడిపోవాల్సిందే. మీ ధనమైతే అన్నింటికంటే ఎక్కువ విలువైనది. ఏ విధంగానైతే ప్రారంభంలో వార్తాపత్రికలలో వేయించారు కదా - ఓం మండలి రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ఓం మండలి – ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనది) అని. అప్పట్లో సంపాదించే సాధనం ఏదీ లేదు. బ్రాహ్మా బాబాతో పాటు ఒకరిద్దరు సమర్పణ అయ్యారు మరియు వార్తాపత్రికలలో ప్రపంచంలోనే అన్నింటికంటే సంపన్నమైనది అని వేసారు. అలాగే ఇప్పుడు కూడా నలువైపులా స్థూల అలజడి జరుగుతుంది, అప్పుడు మీరు వార్తాపత్రికలలో వేయించాల్సిన పని ఉండదు. ఆ పత్రికలవారే మీ వద్దకు వస్తారు మరియు వారు స్వయమే - బ్రహ్మాకుమారీలు ప్రపంచంలోనే అందరికన్నా ధనవంతులు అని పత్రికలలో వేస్తారు, టి.వి.లో చూపిస్తారు ఎందుకంటే ఏం జరిగినా కానీ మీ ముఖాలు మెరుస్తూ ఉంటాయి. రోజులో తినటానికి రొట్టె దొరకకపోయినా కానీ మీ ముఖాలైతే మెరుస్తూనే ఉంటాయి. నలువైపులా దుఃఖం ఉంటుంది కానీ మీరు సంతోషంలో నాట్యం చేస్తూ ఉంటారు. దీనినే వేటగానికి వేట మరియు వేటకు మృత్యువు అని అంటారు. అందుకే బాప్‌దాదా ఈ రోజు చెప్పారు - సత్యమైన బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో, బ్రాహ్మణ జీవితంలో ఎవరైతే శ్రేష్ఠ జీవితం యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నారో, వారి విశేషత ప్రసన్నత. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తున్నా కూడా మీ ముఖంపై దుఃఖపు అల రాకూడదు. ప్రసన్నచిత్తులుగా ఉండాలి. నిందించేవారు కూడా అలసిపోతారు... ఇలా ఉండటం సాధ్యమేనా? వారు ఒక గంట అన్నారు, కానీ నేను కేవలం ఒక్క క్షణమే అన్నాను అన్నట్లు కాదు. క్షణకాలమైనా మాట్లాడారు లేక ఆలోచించారు, ముఖంపై అప్రసన్నత వచ్చిందీ అంటే ఫెయిల్ అయిపోయినట్లు. ఎంతో సహనం చేసారు కదా, ఒక గంటసేపు సహనం చేసారు, కానీ తర్వాత బెలూన్ నుండి గ్యాస్ బయటకు వచ్చేస్తుంది. కనుక గ్యాస్ ఉన్న బెలూన్లా అవ్వకండి. ఇంకా ఏం కావాలి? తండ్రి లభించారు, అంతా లభించింది - ఈ పాటనే పాడుతారు కదా. కనుక అటువంటి సమయంలో ఇలాంటి-ఇలాంటి విషయాలను గుర్తు చేసుకుంటే ముఖం మారదు. అలాగని వారి ముందు గట్టి-గట్టిగా నవ్వడం మొదలుపెట్టకండి, అలా చేస్తే వారు ఇంకా వేడెక్కిపోతారు. ప్రసన్నత అనగా ఆత్మిక మందహాసం. అది బాహ్యమైనది కాదు, ఆత్మికమైనది. కావున ఈ రోజు పాఠం ఏమిటి? సదా అప్రసన్నతా ముక్తులు మరియు ప్రసన్నతా యుక్తులు, డబల్ - అర్థమైందా? అచ్ఛా!
పంజాబ్:- పంజాబ్ వారు ఏదైనా సింహాన్ని మధుబన్ వరకు తీసుకొచ్చారా? చిరుతను తీసుకొచ్చారా లేక సింహాన్ని తీసుకొచ్చారా? లేక ఇంకా సింహాన్ని బాగా అలంకరిస్తున్నారా! చిన్నవారు అయితే వచ్చారు. అయినా పంజాబ్ సేవలో తేడా అయితే ఉంది. కనుక అది కూడా జరిగిపోతుంది.
ఇందోర్:- ఇందోర్ వారు ఏమి తయారు చేస్తున్నారు? అతి పెద్దవారు మధుబన్ వరకు చేరుకునేలా ఏ కొత్త ప్లాన్ తయారు చేసారు? డైమండ్ జూబిలీ చివరిలో అన్ని వైపుల నుండి విశేష వి.ఐ.పి.లు చేరుకునేలా ఒక ప్రోగ్రామ్ చేయండి. ఐ.పి.లు కాదు, వి.ఐ.పి.లు. విదేశాల నుండి కావచ్చు, దేశం నుండి కావచ్చు - రెండు వైపుల నుండి వి.ఐ.పి. గ్రూప్ చేరుకోవాలి. సంఖ్య కొద్దిగా ఉన్నా మొత్తం గ్రూప్ వి.ఐ.పి.లదే అయి ఉండాలి. వేలమందిని తీసుకురండి అని బాప్‌దాదా చెప్పడం లేదు, అది సాధ్యం కాదు. కొద్దిమందిని తీసుకురండి కానీ క్వాలిటీ ఉన్నవారిని తీసుకురండి, వారిలో ఒక్కొక్కరు స్వయంగా సేవ చేసేవారిగా ఉండాలి. తయారు చేస్తున్నారు కదా? సేవ అయితే వృద్ధిని పొందుతోంది మరియు పొందుతూనే ఉంటుంది. జరగాల్సిందే. మీరు కేవలం డైమండ్గా అయిపోతే చాలు, నలువైపులా మీ మెరుపు ఆకర్షించి తీసుకొస్తుంది.
అస్సాం, గౌహతి:- గౌహతి వారు ఏ విశేషత చేస్తున్నారు? ఏ కొత్త ప్లాన్ తయారు చేసారు? గౌహతికి చెందిన ఏ మినిస్టర్ అయినా వచ్చారా? (లేదు) అయితే తీసుకురండి కదా. గౌహతి మినిస్టర్ మిగిలిపోతే ఫిర్యాదు వస్తుంది.
బొంబాయి:- బొంబాయి వారు ఏమి చేస్తున్నారు? ఏ కొత్త ప్లాన్ తయారు చేసారు? చూడండి, భాషణ చేసారు, మినిస్టర్ వచ్చారు, ప్రెసిడెంట్ వచ్చారు, వారు వచ్చారు మరియు వెళ్ళిపోయారు. కానీ మారిషస్ వారు ఎలా సమీపంగా తీసుకొచ్చారో అలా సమీపంగా తీసుకురండి. వారు స్వయంగా తమ ధైర్యంతో ప్రోగ్రామ్ తయారు చేసారు మరియు ఇండియా గవర్నమెంట్ పూర్తి సహాయం ఇచ్చింది. ఇది మొదటి ధైర్యవంతమైన ఉదాహరణ. లేకపోతే విదేశాల వారు - రావాలని అయితే ఉంది, మీరు ఏర్పాటు చేయండి అని అంటారు. అలా ఉండకూడదు. వారు ధైర్యం ఉంచి, తమ ప్రోగ్రామ్‌ను ఇచ్చినట్లే, విదేశాల నుండి తమ ప్రోగ్రామ్‌ను తయారు చేసుకొని ఇక్కడి మినిస్ట్రీ కళ్ళు తెరిపించండి - ఇంత దూరం నుండి వారు వస్తున్నారు, మనం ఇక్కడే ఉండిపోయాము అని. కనుక మారిషస్ చిన్నదే అయినా ధైర్యంలో చిన్నవారే అద్భుతం చేసారు. మారిషస్ వారికి ఈ సేవకు అభినందనలు. బాగుంది. చూడండి, దీనిని ఎవరికైనా దృష్టాంతంగా ఇవ్వవచ్చు కదా! ఎగ్జాంపుల్ ఇవ్వవచ్చు - వీరు వచ్చినట్లే పెద్దవారికి ఇంకా ఎక్కువ సహాయం లభిస్తుంది అని. కనుక మారిషస్ ఐ.పి.లు రావడానికి ద్వారం తెరిచింది - ఇది బాగా చేసింది.
అచ్ఛా, బొంబాయి వారు ఏమి చేస్తారు? (పీస్ పార్క్ తయారు చేస్తారు) పీస్ పార్క్ తయారు చేస్తారు, అది కూడా బాగుంది. ఏదైనా అద్భుతం చేసి చూపించండి. పీస్ పార్క్ తయారు చేయడం కూడా మంచి ధైర్యమే. కానీ డైమండ్ జూబిలీలో ఏదైనా కొత్తదనం చేయండి. సేవ చేసి ఏదైనా సింహాన్ని తీసుకురండి... బొంబాయిలో పెద్ద పెద్ద ప్రముఖ ఇండస్ట్రియలిస్టులు(పారిశ్రామికవేత్తలు) అనే సింహాలు ఉన్నారు. అలాంటి వారిలో ఎవరినైనా తీసుకురండి, వారు ఒక్కరే అనేకమందిని మేల్కొలిపి సేవకు నిమిత్తంగా అవ్వాలి. కనుక బొంబాయి వారు అలాంటి ప్రముఖులను తీసుకురండి. తర్వాత కూడా సంపర్కంలోకి వచ్చేవారిని మరియు ఇతరులను తీసుకొచ్చేవారిని తీసుకురండి. హైదరాబాద్‌లో రాజు యొక్క చిన్న ఉదాహరణ చూసారు కదా, చాలా చిన్నవాడే అయినా స్వయంగా వచ్చాడు మరియు ఇతరులను కూడా తీసుకొచ్చాడు. అలాంటి వారిని తీసుకురండి. పేరు అయితే ప్రసిద్ధి చేసి వెళ్ళాడు కదా.
అచ్ఛా, దీనికే ట్రైనింగ్ జరుగుతోంది. (జ్ఞాన సరోవర్‌లో సెల్ఫ్ మేనేజ్మెంట్ లీడర్షిప్ ట్రైనింగ్ కార్యక్రమం జరుగుతోంది) చూస్తాము, ట్రైనింగ్ అయితే చేసారు, ట్రైనింగ్ యొక్క ఏ ఫలాన్ని బాప్‌దాదా ముందు తీసుకొస్తారు? ట్రైనింగ్ చేయించేవారు డైమండ్ జూబిలీలో బాప్‌దాదా ముందు ఫలాన్ని తీసుకురండి. అర్థమైందా? సేవ చాలా బాగుంది కానీ ఇప్పుడు సంబంధ-సంపర్కంలోకి తీసుకురండి, జ్ఞాన-యోగంలోకి తీసుకురండి. కేవలం బాగుంది, బాగుంది - ఇంతవరకే ఉంటే ఇది ఫలం కాదు. ఇది చిన్న ద్రాక్షపండు మాత్రమే. పెద్ద ఫలాన్ని తీసుకురండి. ఎక్కడికైనా వెళ్ళి ఎవరికైనా ఫలం ఇవ్వాలంటే ఒక్క ద్రాక్షపండు తీసుకెళ్తారా? గిఫ్ట్ ఇస్తే ఏదైనా పెద్ద ఫలం తీసుకెళ్తారు కదా. బాగుంది, చేస్తున్నారు కానీ డైమండ్గా అయ్యి, డైమండ్ జూబిలీలో కొత్తదనం చేసి చూపిస్తాము అనే లక్ష్యంతో చేయండి. దీనినే ట్రైనింగ్ యొక్క సఫలత అని అంటాము. ఛాన్స్ అయితే బాగా లభించింది. ఇప్పుడు చూస్తాము ఎన్ని ఫలాలతో పళ్ళెం నింపుకొని వస్తారో లేక ఒక్క ఫలం వస్తుందో లేక ఒక్క ద్రాక్షపండు వస్తుందో? అచ్ఛా.
కేరళ, కర్ణాటక:- కేరళ ఏమి చేస్తుంది? కేరళ విశేషత ఏమిటి? (చదువుకున్నవారు చాలా మంది ఉంటారు) అయితే ఈ చదువులో లేరా? సెంటర్లు అయితే ఉండాల్సిందే. కృష్ణ అయ్యర్ లాంటి వారిని కేరళ తయారు చేయలేదు, ఢిల్లీ తయారు చేసింది. అలాంటి వారిని ఎవరినైనా తయారు చేయండి. అలా నలుగురు-ఐదుగురి గ్రూప్ తయారు చేయండి. అచ్ఛా, కేరళలో కొబ్బరి చెట్లు చాలా ఉంటాయి కదా! అయితే ఐ.పి.ల మొత్తం చెట్టునే తీసుకురండి. కృష్ణ అయ్యర్ చిన్న మైక్ అయితే ఉన్నారు, ఆది నుండి అంతిమం వరకు సేవలో సహయోగిగా ఉన్నారు మరియు ఉంటారు. బాగుంది. కృష్ణ అయ్యర్ లాంటి వారు, మద్రాస్ గవర్నర్ లాంటి వారిని తయారు చేయండి. అలాంటి వారి సంగఠనను తయారు చేయండి. అప్పుడు చూడండి, మీరు విశ్రాంతిగా కూర్చుంటారు మరియు వారు ధ్వనిని వ్యాపింపజేస్తూ ఉంటారు. ఈ రోజుల్లో కొత్త కొత్త టీచర్లు వచ్చినప్పుడు చూస్తారు కదా - పాత దాదీలు చాలా విశ్రాంతిగా ఉంటున్నారు, మమ్మల్ని మాత్రం పరుగులు పెట్టిస్తున్నారు అని. మిమ్మల్ని తయారు చేసారు కదా, అందుకే వారు విశ్రాంతిగా కూర్చున్నారు. కనుక మీరు కూడా అలాంటి వారిని తయారు చేయండి, అప్పుడు మీరు విశ్రాంతిగా కూర్చోవచ్చు. అచ్ఛా.
ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ నుండి ఒక రాజు అయితే వచ్చాడు, కానీ త్వరగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంకా ఒక గ్రూపును తయారు చేయాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌లో ఐ.పి.లు చాలా మంది ఉన్నారు. వారు ఎక్కడైనా మినిస్టర్ అయినా, తమ దేశానికి విలువ ఇస్తారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఎవరైనా కలిస్తే వారిని గౌరవంతో కలుస్తారు. తమ దేశం అనే నషా ఉంటుంది కదా. కనుక ఆంధ్ర కూడా గ్రూపును తయారు చేయాలి. సెంటర్లు పెరుగుతున్నాయి, గీతా పాఠశాలలు పెరుగుతున్నాయి, ఇది జరగాల్సిందే, ఇది ఇప్పుడు పెద్ద విషయం కాదు. ఏదైనా కొత్తదనం చేయండి. ఇంకా గీతా పాఠశాలలు, సెంటర్లు పెంచండి, కానీ దానితో పాటు ప్రత్యక్షత చేసే మైక్‌లను కూడా తయారు చేయండి. అచ్ఛా.
బెలగాం:- బెలగాం ఏమి చేస్తోంది? ఎంతమంది ఐ.పి.లను తయారు చేసారు? కనీసం ఒక కంకణం అయినా తయారు చేయండి. మాలను వదిలేయండి. అచ్ఛా.
డబల్ విదేశీయులు:- (యు.కె., జర్మనీ, అందరినీ చేతులు ఎత్తించి బాప్‌దాదా కలుస్తున్నారు.) ఫ్రాంక్ఫర్ట్ తన వాగ్దానాన్ని పూర్తి చేసింది. బాప్‌దాదా ఫ్రాంక్ఫర్ట్ వారి ధైర్యాన్ని చూసి సంతోషిస్తున్నారు మరియు సుదేశ్ బచ్చీ కూడా మనసుతో సేవ చేస్తోంది, అందుకే వారికి కూడా అభినందనలు. సాధారణంగా సేవ చేయడం పెద్ద విషయం కాదు, చెడిపోయినదాన్ని బాగు చేయడం, అనేకతలో ఏకతను తీసుకురావడం - ఇది పెద్ద విషయం. కనుక జర్మనీ వారికి మీరందరూ కూడా అభినందనల చప్పట్లు కొట్టండి. (స్పెయిన్, ఫ్రాన్స్, హాలండ్) హాలండ్ కూడా బాగా నడుస్తోంది. (సౌత్ ఆఫ్రికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్) అచ్ఛా, ఆస్ట్రేలియా వారు సంతోషంగా ఉన్నారా, సంతుష్టంగా ఉన్నారా? యెస్ లేదా నో చెప్పండి. (యెస్)
చూడండి, ఎక్కడి నుండి వచ్చినా డబల్ విదేశీయులు సదా తమ మస్తకంపై విజయ తిలకం (విక్టరీ తిలకం) పెట్టబడి ఉన్నట్లు చూడండి. ఎందుకంటే మీరు బాబాకు మరియు సర్వ బ్రాహ్మణులకు ప్రియమైనవారు. కనుక మనం విజయులము, విజయులుగా ఉండేవారము మరియు విజయులుగానే ఉంటాము. ఈ విజయ తిలకాన్ని సదా మీ మస్తకంపై చూడండి. మీరు చాలా-చాలా-చాలా లక్కీ. మూలమూలల నుండి బాప్‌దాదా మిమ్మల్ని వెతికి తీసారు. ప్రేమతో వెతికి మిమ్మల్ని తమవారిగా చేసుకున్నారు. చూడండి, మీరు ఎన్ని మూలమూలల్లో ఉన్నా బాబా మిమ్మల్ని గుర్తించారు కదా! అందుకే మనం సదా విజయులము - ఈ నషాను ప్రాక్టికల్‌గా అనుభవించండి. కేవలం నోటితో చెప్పకండి. నోటితో విజయం అని చెబుతూ ఓడిపోవడం - అలా కాదు. ఓటమి ఉండనే ఉండదు, మీరు విజయులే. కనుక విజయులమనే నషా డబల్ విదేశీయులకు సహజంగా మరియు సదా ఉండాలి. అర్థమైందా?
భారతవాసులతో:- మీరందరూ చూసారు, మీ పరివారం ఎంత పెద్దదో! పంజాబ్ వారు చూసారు... బొంబాయి వారు చూసారు... భారతవాసులందరికీ - మన బాబా స్థానం మూలమూలలా ఉంది అనే సంతోషం ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా గర్వంగా - మా ఇల్లు ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది అని చెప్పగలరు. ఎక్కడికి వెళ్ళినా మీ ఇల్లే. కనుక భారతవాసులకు డబల్ విదేశీయులను చూసి సంతోషంగా ఉందా? అచ్ఛా!
నలువైపులా ఉన్న బాప్‌దాదా యొక్క ప్రేమ స్వరూప ఆత్మలకు, సదా స్వయాన్ని అప్రసన్నత నుండి విముక్తులుగా చేసుకునే తీవ్ర పురుషార్థీ ఆత్మలకు, సదా స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా సేవలో సఫలతను పొందే భాగ్యవంతులైన ఆత్మలకు, సదా తండ్రిని ప్రత్యక్షం చేయాలనే ఉల్లాస-ఉత్సాహాలలో ఉండే దేశ, విదేశాలలోని పిల్లలందరికీ, తండ్రికి తమ శుభవార్తను వ్రాసేవారికి, తమ సేవ యొక్క ఉల్లాసాన్ని ఉంచుకునేవారికి, తండ్రికి సదా స్నేహీ మరియు సమీపులైన పిల్లలకు, బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
(విదేశాలకు చెందిన నలుగురు సోదరులు ఫిల్మ్ తీస్తున్నారు)
అచ్ఛా, ఈ గ్రూప్ కూడా సేవ కోసం వచ్చారు. అందరూ సేవతో సంతోషంగా ఉన్నారా? ధైర్యము ఉంది కదా! ఏమవుతుంది, ఎలా అవుతుంది అని ఆలోచించకండి. బాగుంది, బాగానే జరగాలి. ఏ కార్యాన్ని శ్రేష్ఠ స్మృతితో చేస్తారో అది సదా మంచిగానే ఉంటుంది. కనుక ఏమవుతుందో తెలియదు అని ఎప్పుడూ ఆలోచించకండి, బాగా జరుగుతుందని తెలుసు. అర్థమైందా? అచ్ఛా, చాలా మంచి ధైర్యము ఉంచారు. ఎక్కడ ధైర్యము ఉంటుందో అక్కడ సహాయం ఉంటుంది. అచ్ఛా.
దాదీలతో:- మీరు మరియు వీరు (దాదీ మరియు దాదీ జానకి) కలిసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? (దాదీలు అన్నారు - బాబా, మీకు ఏమనిపిస్తుంది?) బాబాకు అయితే బాగనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? (బాబా మంచి జోడీని తయారు చేసారు, దేశ-విదేశాలు వేరుగా ఉన్నా కలిసి ఉన్నాము) ఇది కూడా డ్రామాలోని పాత్ర. అయినా మీరు బ్రాహ్మణ పరివారానికి ఫౌండేషన్ కదా. కనుక మీకు కూడా బాగనిపిస్తుంది కదా. బాప్‌దాదా నిమిత్తంగా ఉన్న ఫౌండేషన్ ఆత్మలను తనకంటే కూడా ముందుగా ఉంచుతారు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, బాబా నిరాకారుడు, బ్రహ్మా బాబా కూడా ఆకారీగా అయిపోయారు. ఇప్పుడు సాకారంలో వినాలి, వినిపించాలి, చూడాలి, ఇవ్వాలి - దీని కోసం నిమిత్తంగా ఉన్నది వీరే కదా. వీరు సహజంగా నడుస్తున్నారు అని చూసి మీరందరూ కూడా సంతోషిస్తారు కదా? చూడండి, మీ ద్వారా (దాదీ జానకి) ఈ విదేశీ సేవ నిశ్చయించబడి ఉంది, కనుక డ్రామాను ఎవరూ మార్చలేరు. మీరు వెళ్ళవలసి వచ్చింది మరియు నిమిత్తంగా అవ్వవలసి వచ్చింది. విదేశాలకు అవసరం కదా? (బాబా సకాశ్ ఉంది) బాప్‌దాదా అయితే వేరుగా ఉండనే ఉండలేరు, అంతగా అతుక్కొని ఉన్నారు. ఎందుకంటే మీరు రోజంతా - బాబా ఇలా చేస్తారు, బాబా ఇలా అంటారు... అని చెప్పవలసి వస్తుంది. బాబా-బాబా అనే మాటే వస్తూ ఉంటుంది కదా. స్మృతి ఇప్పించడానికి కూడా - శివబాబా గుర్తున్నారా? అని చెప్పవలసి వస్తుంది. ఎవరైనా ఏడుస్తూ వస్తే మీరు బాబా-బాబా అని చెప్పి వారిని నవ్విస్తారు. అంతే కదా? చూడండి, చాలా చిన్న గ్రూప్ కానీ చాలా ఉపయోగకరమైన గ్రూప్. ఎంత కొద్దిమంది ఉన్నారు.
ఇప్పుడు డైమండ్ జూబిలీ అయితే ఉంది. కానీ ఈసారి బాప్‌దాదా నిజంగా ఎంతమంది డైమండ్లుగా అయ్యారు అనే దానికి నంబర్ ఇస్తారు. విదేశం గెలుస్తుందా లేక దేశం గెలుస్తుందా అని చూస్తారు. ఇందులో కూడా యువత ఎక్కువ నంబర్ తీసుకుంటారా, ప్రవృత్తిలో ఉన్నవారు తీసుకుంటారా లేక యువ కుమారీలు తీసుకుంటారా? ఎవరైనా నంబర్ తీసుకుంటే బాప్‌దాదాకు సంతోషమే. కానీ ఇందులో సహచరుల సర్టిఫికెట్ కూడా కావాలి. కేవలం మీకు మీరే - నేను అయితే బాగున్నాను అని చెప్పడం కాదు. అలా కాదు, సర్టిఫికెట్ కావాలి. ఎంతమంది వస్తారో చూస్తాము. వృద్ధి అయితే జరగాల్సిందే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
