‘‘సదా సమర్థులుగా ఉండేందుకు సహజ విధి - శుభ చింతన చెయ్యండి మరియు శుభచింతకులుగా అవ్వండి’’
ఈరోజు ఇది స్నేహ సంపన్నమైన స్మృతి దివసము. నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహముతో కూడిన హృదయధ్వని బాప్‌దాదా వద్దకు చేరుకుంది. ఈ స్నేహము సుఖ స్వరూప స్నేహము. బాప్‌దాదా ఈ రోజును స్మృతి దివసము అని అనడంతో పాటు సమర్థ దివసము అని కూడా అంటారు ఎందుకంటే బ్రహ్మా బాబా తమ సాకార స్వరూపములో అన్ని కార్యాలను చేసే సమర్థతలను అనగా శక్తులను సాకార రూపములో పిల్లలకు అర్పించారు. ఈ రోజును ‘కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు’ (సన్ షోజ్ ఫాదర్) అన్న వరదానము యొక్క రోజు అని అంటాము. సాకార రూపములో పిల్లలను ముందుంచారు మరియు ఫరిశ్తా రూపములో తమ పిల్లల సేవను మరియు విశ్వ సేవను ప్రారంభించారు. ఈ జనవరి 18 దివసము బ్రహ్మా బాబా యొక్క సంపూర్ణ నష్టోమోహా స్మృతి స్వరూపం యొక్క దివసము. గీతలోని 18 అధ్యాయాల సారము ఏమిటంటే - భగవంతుడు అర్జునుడిని నష్టోమోహా స్మృతి స్వరూపునిగా తయారుచేసారు. ఈ 18 యొక్క స్మృతిచిహ్నము ఏమిటంటే - బ్రహ్మా బాబా పిల్లలతో చాలా స్నేహంగా ఉండేవారు, సదా సేవకు నిమిత్తులైన పిల్లలను ఎంతగా జ్ఞాపకం చేసేవారు అన్న విషయంలో పిల్లలు అనుభవజ్ఞులు - అనుభవము ఉంది కదా. మోహం ఉండేది కాదు, కానీ మనస్ఫూర్వకమైన ప్రేమ ఉండేది ఎందుకంటే ఎక్కడైతే స్వయం యొక్క స్వార్థం ఉంటుందో దానిని మోహము అని అంటాము. బ్రహ్మా బాబాకు స్వయం యొక్క స్వార్థమేమీ ఉండేది కాదు, పిల్లలపై సేవార్థం అతి స్నేహం ఉండేది. తోడుగా ఉంటూ, పిల్లలను ఎదురుగా చూస్తూ కూడా దేహం రూపంలో ఎటువంటి స్మృతి సతాయించలేదు. పూర్తిగా అతీతంగా మరియు ప్రియమైనవారిగా ఉండేవారు, అందుకే నష్టోమోహా స్మృతి స్వరూపము అని అంటాము. ఏ రకమైన నాది అనేదీ ఉండేది కాదు, దేహభానం నుండి కూడా నష్టోమోహులుగా ఉండేవారు. కనుక ఈ రోజు అటువంటి ఫాలో ఫాదర్ పాఠాన్ని నేర్చించే రోజు.
ఈ అవ్యక్త దివసము ప్రపంచంలోని అజ్ఞాని ఆత్మలను పరమాత్మ కార్యం వైపుకు మేల్కొలిపే రోజు ఎందుకంటే మెజారిటీ వ్యక్తులు బ్రహ్మా బాబాను చూసి - వీరి పరమాత్మ బ్రహ్మాయే, ఈ బ్రహ్మాకుమారీలు బ్రహ్మానే భగవంతునిగా భావిస్తారు అని ఆలోచించేవారు లేక అనుకునేవారు. బ్రహ్మా సాకార పాత్రను పరివర్తన చేసుకున్నప్పుడు - ఇప్పుడైతే బ్రహ్మాకుమారీల భగవంతుడు వెళ్ళిపోయారు కావున ఈ బ్రహ్మాకుమారీల పని ఈ రోజు కాకపోతే రేపైనా సమాప్తమైపోతుంది అని అనుకోవడం మొదలుపెట్టారు. కానీ మీకు తెలుసు - బ్రహ్మా ద్వారా ఇంతకుముందు చేయించినది, ఇప్పుడు చేయిస్తున్నది మరియు అంతిమం వరకు చేయించేది పరమాత్మయే. కావున ఇది పరమాత్మ కార్యము, వ్యక్తి యొక్క కార్యము కాదు. బ్రహ్మా బాబా యొక్క సాకార పాత్ర పరివర్తన అయిన తరువాత వీరిని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అని తెలుసుకున్నారు, కానీ ఇప్పటికీ పాపం పరమాత్మ గురించి తెలియదు. కానీ ఏదో శక్తి అయితే కార్యం చేయిస్తుంది అని అనుకుంటారు, ఆ శక్తి ఏమిటి, అది కూడా చూస్తున్నారు, ఆలోచిస్తున్నారు మరియు చివరికి అర్థం చేసుకోవాల్సిందే. మరి ఇది ఎవరి కార్యము? బ్రహ్మా బాబా కార్యమా లేక బ్రహ్మా ద్వారా జరుగుతున్న పరమాత్మ కార్యమా? ఇది ఎవరి కార్యము?
ఏ పిల్లలైతే సాకారుని తర్వాత వచ్చారో, వారు ఆలోచిస్తారు - బ్రహ్మా బాబా తమ సాకార పాత్రను ఇంత త్వరగా ఎందుకు పూర్తి చేసారు? మేము చూసేవారము కదా! మేము కలిసేవారము కదా! ఇలానే ఆలోచిస్తారు కదా? కానీ కల్పక్రితం యొక్క గాయనము కూడా ఉంది - కౌరవ సైన్యానికి నిమిత్తులైన మహావీరుల కళ్యాణము ఎవరి ద్వారా జరిగింది? శక్తుల ద్వారా జరిగింది కదా! కావున డ్రామాలో శక్తుల పాత్ర సాకార రూపంలో నిశ్చయించబడి ఉంది. మరియు మాతృశక్తి లేకుండా ఈ విశ్వ కళ్యాణం జరగటం అసంభవము అని అందరూ ఒప్పుకుంటారు. మరి బ్రహ్మా బాబా ఫరిశ్తాగా ఎందుకు అయ్యారు? సాకార పాత్ర ఎందుకు పరివర్తన అయ్యింది? ఒకవేళ బ్రహ్మా బాబా ఫరిశ్తా రూపాన్ని ధారణ చేసి ఉండకపోతే ఇంతమంది ఆత్మలైన మీరు ఇక్కడికి చేరుకోలేకపోయేవారు ఎందుకంటే వాయుమండలము యొక్క భ్రాంతులు ఈ విశ్వ క్రాంతి యొక్క కార్యాన్ని ఢీలా చేస్తున్నాయి. కావున బ్రహ్మా బాబా ఫరిశ్తాగా అవ్వడమనేది ఎంతోమంది పిల్లలైన మీ యొక్క భాగ్యాన్ని మేల్కొలిపేందుకు కారణం అయ్యింది. ఇప్పుడు ఫరిశ్తా రూపంలో సేవ యొక్క తీవ్ర వేగము ఏదైతే ఉందో, దానిని చూస్తున్నారు కదా! వేగము పెరిగిందా లేక తగ్గిందా? పెరిగింది కదా! వేగము పెరిగింది కావుననే మీరు ఇక్కడికి చేరుకున్నారు. లేకపోతే మంచిగా నిద్రపోతూ ఉన్నారు. కనుక మనుష్యులు ఎలాగైతే - వెళ్ళిపోయారు, వెళ్ళిపోయారు... అని జరుపుకుంటారో, ఈ రోజు అటువంటిది కాదు. కానీ ఫాలో ఫాదర్ చేయాలి, మేము కూడా ఇలా నష్టోమోహా స్మృతి స్వరూపులుగా అవ్వాలి అని ఉల్లాస-ఉత్సాహము కలుగుతుంది. ఈ రోజు ప్రాక్టికల్ పాఠాన్ని చదువుకునే రోజు.
ఈ రోజు మీలో ఎవరికైనా మనసు నుండి దుఃఖముతో కూడిన కన్నీళ్ళు వచ్చాయా? బయటకు వచ్చాయా లేక లోలోపల కాస్త వచ్చాయా! ఎవరికైతే దుఃఖం యొక్క అల కొద్దిగానైనా వచ్చిందో, వారు చేతులెత్తండి. దుఃఖం కలిగిందా? కలగలేదా? ఈ రోజు బ్రహ్మా బాబాకు సేవా సహచరులుగా అయ్యే రోజు. మీరందరూ సహచరులా లేక సాక్షీగా ఉండేవారా? సేవలో సహచరులు మరియు మాయా పరిస్థితులలో సాక్షి. మాయనైతే స్వాగతం చేసారు కదా లేకపోతే - అయ్యో, ఏమైపోయింది! అని గాభరా పడతారా. కొద్ది-కొద్దిగా గాభరా పడతారా? మాయ యొక్క తేలికపాటి రూపాలనైతే మీరు కూడా తెలుసుకున్నారు మరియు మాయ కూడా - వీరు తెలుసుకున్నారు అని అనుకుంటుంది, కానీ ఎప్పుడైనా ఏదైనా భయంకర రూపంలో మాయ వచ్చినట్లయితే సదా సాక్షిగా అయ్యి ఆటను ఆడండి. కుస్తీ ఆట ఉంటుంది కదా, చూసారా లేక చూపించమంటారా? ఇక్కడ పిల్లలు చేసి చూపిస్తారు కదా! అలాగే ఇక్కడ కుస్తీ ఆట ఆడుతున్నాము అని భావించండి, బాగా దెబ్బ వేయండి. గాభరా పడకండి, ఇది ఆట. కావున సాక్షిగా అయి ఆటను ఆడినట్లయితే మజా వస్తుంది, అలా కాకుండా మాయ వచ్చేసింది, మాయ వచ్చేసింది అని అనుకుంటే గాభరా పడతారు. ఇప్పుడు మాయలో ఏ మాత్రము శక్తి లేదు. కేవలం బయటకు సింహం యొక్క రూపం ఉంది, కనీసం అది పిల్లిలా కూడా లేదు. కేవలం మిమ్మల్ని గాభరా పెట్టేందుకు పెద్ద రూపాన్ని ధరిస్తుంది, అప్పుడు మీరు - ఇప్పుడేమి జరుగుతుందో ఏమిటో అని ఆలోచిస్తారు. కావున - ఏం చేయను, ఎలా అవుతుందో, ఏం అవుతుందో... అని ఎప్పుడూ అనకండి. బాప్‌దాదా ఇంతకుముందు కూడా ఈ పాఠాన్ని చదివించారు - ఏదైతే జరుగుతూ ఉందో అది మంచిది మరియు ఏదైతే జరగబోతుందో అది ఇంకా మంచిది. బ్రాహ్మణులుగా అవ్వటము అంటేనే అంతా మంచే మంచి. మీ స్వప్నంలో కూడా ఎప్పుడూ లేనటువంటి విషయాలు జరుగవచ్చు మరియు ఎన్నో విషయాలు అజ్ఞాన కాలంలో జరగలేదు కానీ జ్ఞానంలోకి వచ్చిన తర్వాత జరిగాయి అన్నట్లు ఉంటాయి. అజ్ఞాన కాలంలో ఎప్పుడూ వ్యాపారంలో కింద-మీద అయి ఉండకపోవచ్చు కానీ జ్ఞానంలోకి వచ్చిన తరువాత అలా జరిగిందంటే - అయ్యో, జ్ఞానం వదిలేద్దాము అని గాభరా పడిపోతారు. కానీ ఏదైనా పరిస్థితి వస్తే, ఆ పరిస్థితిని కాసేపటి కోసం మీ శిక్షకునిగా భావించండి. శిక్షకుడు ఏం చేస్తారు? శిక్షణను ఇస్తారు కదా! అలాగే పరిస్థితి మిమ్మల్ని విశేషంగా రెండు శక్తులలో అనుభవజ్ఞులుగా చేస్తుంది - ఒకటేమో, సహనశక్తి, అతీతత్వము, నష్టోమోహా మరియు రెండవది, ఎదుర్కొనే శక్తి యొక్క పాఠాన్ని చదివిస్తుంది. ఈ పరిస్థితి ఈ రెండు పాఠాలను నేర్పించటానికి వచ్చింది అని ఆ రెండు పాఠాలను ఇక ముందు కోసం కూడా నేర్చుకోండి. అంతేకాక - మేము ట్రస్టీలము, నాది అంటూ ఏదీ లేదు అని అంటూ ఉంటారు కదా, ఇది మోసం చేస్తూ అనటం లేదు కదా! మనస్సుతో అంటున్నారా? ట్రస్టీలేనా లేక కొద్దిగా గృహస్థులా? అప్పుడప్పుడు గృహస్థులుగా, అప్పుడప్పుడు ట్రస్టీలుగా అవుతున్నారా?
కొత్త సంవత్సరంలో బాప్‌దాదాకు మూడు-నాలుగు ఆటబొమ్మలను ఇచ్చారు, ఆ బొమ్మ ఎలా ఉందంటే - ఒకవైపు తిప్పితే అన్నయ్య, మరోవైపు తిప్పితే స్త్రీ బొమ్మ వస్తుంది, ఒకే బొమ్మ మారుతూ ఉంటుంది. ఒక క్షణం అలా అవుతుంది, ఒక క్షణం ఇలా అవుతుంది. మీరు అటువంటి బొమ్మ అయితే కాదు కదా. ఇప్పుడిప్పుడే గృహస్థులుగా, ఇప్పుడిప్పుడే ట్రస్టీలుగా ఉండటం లేదు కదా. కొద్ది-కొద్దిగా అప్పుడప్పుడు అలా అవుతున్నారా? గాభరా పడిపోతే - వీరు గాభరా పడ్డారు, ఇప్పుడు బాగా దెబ్బ వేద్దాము అని మాయ అనుకుంటుంది, అందుకే గాభరా పడకండి. ట్రస్టీలుగా ఉండటము అంటే మొదటి నుండే అన్నీ వదిలిపోయినట్లు. ట్రస్టీ అంటే అంతా బాబాకు అర్పణ చేసేసారు. ఇక నాది ఏమవుతుంది! ఏమవుతుందో, ఎలా అవుతుందో అని అనేటప్పటికి గడబిడ అవుతుంది. అంతా మంచిదే మరియు మంచిగా అవ్వాల్సిందే, నిశ్చింత ఉన్నాము - దీనినే సమర్థ స్వరూపము అని అంటాము. కనుక ఈ రోజు ఏం రోజు? సమర్థముగా అయ్యే రోజు, నష్టోమోహాగా అయ్యే రోజు. బాబా చాలా గుర్తుకొచ్చారు అని కేవలం పాట పాడటము కాదు. కావున బ్రహ్మా బాబా ఫరిశ్తాగా అవ్వటమనేది డ్రామాలో పరమాత్మ కార్యాన్ని ప్రత్యక్షం చెయ్యటానికి నిమిత్తమయ్యింది. బ్రహ్మా బాబా ఉన్నారా, లేరా? (ఉన్నారు). కనిపించటం లేదు మరి!
చూడండి, మీరు ఎవరైతే తరువాత వచ్చారో వారు చాలా అదృష్టవంతులు. ఎందుకని? ఇప్పుడు సేవలో రెడీమేడ్ సాధనాలు లభించే సమయానికి వచ్చారు. 60 సంవత్సరాల వారు వెన్న తీసారు మరియు వెన్న తినేందుకు మీరు వచ్చారు. ఈ రోజు హిస్టరీ విని ఉంటారు కదా, అంత శ్రమ మీరు చేసి ఉంటే పారిపోయి ఉండేవారు. అంతేకాక వర్తమాన సమయంలో సేవ యొక్క వాయుమండలము తయారై ఉంది. ఇప్పుడు రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఏ నేత అయినా కావచ్చు, మెజారిటీ ఒప్పుకుంటారు కదా - ఈ కార్యం బాగుంది అని. వారు చేస్తారా, చేయరా అనేది వేరే విషయం. ఎవరి పాత్ర వారిది. కానీ - ఈ కార్యం మంచిది మరియు ఈ కార్యం ఇంకా ముందుకు వెళ్ళాలి అని ఇలా అయితే అంటారు కదా! ఇంతకుముందైతే - బ్రహ్మాకుమారీల ముఖం కూడా చూడకూడదు అని అనేవారు. ఆదిలో ఆహ్వానం అందించటానికి వెళ్ళినా సరే తలుపులు మూసేసుకునేవారు. కావున మీరైతే మంచి సమయానికి వచ్చారు కదా! సేవా అవకాశం చాలా ఉంది. ఎంత సేవ చేయాలనుకుంటే అంత చేయవచ్చు. ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు - సాకార బ్రహ్మా బాబా తర్వాత కూడా బ్రహ్మాకుమారీలు సిల్వర్ జూబ్లీని కూడా జరుపుకున్నారు, గోల్డెన్ జూబ్లీని కూడా జరుపుకున్నారు, ఇప్పుడు డైమండ్ జూబ్లీ వరకు చేరుకున్నారు ఎందుకంటే ఎవరైనా పెద్ద గురువు వెళ్ళిపోతే అస్తవ్యస్తము అయిపోతుంది. ఇక్కడ ఏమన్నా అస్తవ్యస్తము అయ్యిందా? ఇక్కడైతే ఇంకా ఎక్కువ వృద్ధి జరిగింది, పెరుగుతూ ఉంది. దీని ద్వారా ఏం ఋజువు అవుతుందంటే ఈ కార్యాన్ని చేయించేవారు తండ్రి అయిన పరమ ఆత్మ, నిమిత్త మాధ్యమము బ్రహ్మా బాబా. ఇప్పుడు కూడా మాధ్యమంగా బ్రహ్మా బాబా ఉన్నారు. ఈ పాత్ర వేరు. కానీ డ్రామాలో మాధ్యమముగా మొదట సాకార బ్రహ్మా ఉండేవారు మరియు ఇప్పుడు ఫరిశ్తా రూపంలో ఉన్న బ్రహ్మా ఉన్నారు. బ్రహ్మాను తండ్రి అంటారు, రచయిత బ్రహ్మాయే కదా. ఈ పాత్ర అయితే మధ్యమధ్యలో పిల్లల పాలన చేయడానికి నిమిత్తంగా ఉంది. కానీ రచయిత బ్రహ్మాయే మరియు రచన యొక్క కార్యంలో ఇప్పుడు కూడా అంతిమం వరకు బ్రహ్మా పాత్రయే ఉంటుంది.
మరి, ఈ రోజు, రోజంతటిలో ఎవరి వద్దకు మాయ వచ్చింది? మనవలు, మునిమనవలు ఎవ్వరూ గుర్తుకురాలేదా? సదా ఇలాగే సమర్థంగా ఉండండి. ఇందుకు అన్నింటికన్నా సహజ విధి - రెండు మాటలను గుర్తుంచుకోండి. రెండు మాటలైతే గుర్తుంటాయి కదా? మొత్తం మురళీ అంతా మర్చిపోయినా కానీ రెండు మాటలను గుర్తుంచుకోండి మరియు వాటిని ప్రాక్టికల్‌గా చేస్తూ వెళ్ళండి. ఆ రెండు మాటలు ఏమిటో మీకు తెలుసు కూడా, కొత్త విషయమేమీ కాదు, ఒకటి, శుభచింతన, నెగటివ్‌ను కూడా పాజిటివ్‌గా చెయ్యండి, దీనినే శుభ చింతన అని అంటాము. నెగటివ్ పాజిటివ్‌గా అవ్వగలదు మరియు అలా మార్చగలరు, కేవలం చెక్ చేసుకోండి - కర్మలు చేస్తూ ఉన్నప్పుడు కూడా శుభ చింతన నడిచిందా? రెండవది, అందరి పట్ల శుభ చింతకులు. శుభ చింతన మరియు శుభ చింతకులు, ఈ రెండింటికి సంబంధము ఉంది. ఒకవేళ శుభ చింతన లేకపోతే శుభ చింతకులుగా కూడా అవ్వలేరు, అందుకే ఈ రెండు విషయాలపై అటెన్షన్ పెట్టండి. అర్థమైందా? ఏం చేస్తారు? ఇది మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే వర్తమానంలో ఏం గమనించడం జరిగిందంటే - ఎన్నో సమస్యలు ఎలా ఉన్నాయంటే, వ్యక్తులు ఎలా ఉన్నారంటే, వారు మీ వాణి ద్వారా అర్థం చేసుకోరు కానీ శుభ చింతకులుగా అయ్యి శుభమైన వైబ్రేషన్లను ఇచ్చినట్లయితే మారిపోతారు. మరియు ఒక విషయం నుండి ముక్తులుగా కూడా అవ్వాలి. ఈ బ్రాహ్మణ జీవితంలో ముక్తులయ్యేవారే కదా, ముక్తులుగా అయ్యేందుకు 9 విషయాలు చెప్పాము, ఒకవేళ ఈ 9 విషయాల నుండి ముక్తులుగా అయినట్లయితే నవ రత్నాలుగా అవ్వగలరు. కావున ఈ రోజు బాప్‌దాదా ఒక విషయాన్ని గుర్తు తెప్పిస్తున్నారు - ఎప్పుడైనా ఏదైనా శారీరక అనారోగ్యం వచ్చినా, మనస్సులో తుఫాను వచ్చినా, తనువులో అలజడి కలిగినా, ప్రవృత్తిలో అలజడి వచ్చినా, సేవలో కూడా అలజడి వచ్చినా, ఏ రకమైన అలజడిలోనూ నిరాశపడకండి. విశాల హృదయం కలవారిగా అవ్వండి. బాబా మనసు ఎంత ఉంటుంది, చిన్నదా ఏంటి! తండ్రి ఏమో విశాల హృదయం కలవారు, కానీ పిల్లలు మనసును చిన్నబుచ్చుకుంటారు. అనారోగ్యం వచ్చిందంటే నొప్పి, నొప్పి అని ఏడవటం మొదలుపెట్టేస్తారు. మరి నిరాశపడటమనేది మందా? దాని వలన అనారోగ్యం పోతుందా లేక పెరుగుతుందా? లెక్కాచారము వచ్చింది, నొప్పి వచ్చింది అంటే, అది లెక్కాచారము కదా. నిరాశపడటం వలన అనారోగ్యాన్ని ఇంకా పెంచుకుంటారు, అందుకే ధైర్యం కలవారిగా అయినట్లయితే తండ్రి కూడా సహాయకులుగా అవుతారు. అంతేకానీ - అయ్యో, ఏం చేయను, ఏం చేయను అని ఏడుస్తూ, బాబా సహాయమైతే లేనే లేదు అని ఆలోచించడము కాదు. ఎవరైతే ధైర్యం పెడతారో, వారికే సహాయము లభిస్తుంది. ముందు పిల్లల ధైర్యము, ఆ తరువాత తండ్రి సహాయము. మరి ధైర్యాన్ని పోగొట్టుకుంటారు మరియు - తండ్రి సహాయమైతే లభించలేదు, బాబా కూడా అవసరమైన సమయానికి సహాయం చెయ్యరు అని ఆలోచించటం మొదలుపెడతారు! సగం మాటను గుర్తు పెట్టుకోకండి, బాబా సహాయకులే కానీ ఎవరికి? సగం మర్చిపోతారు మరియు సగం గుర్తుపెట్టుకుంటారు - బాబా కూడా ఎందుకో తెలియదు మహారథులకే సహాయం చేస్తారు, మాకైతే చెయ్యనే చెయ్యరు, మాకైతే ఇవ్వనే ఇవ్వరు అని అనుకుంటారు. ముందు మీరు, ఆ తరువాత మహారథులు. నిరాశపడకండి. ఒకవేళ మనసులో ఏదైనా అలజడి వచ్చినా సరే, అటువంటి సమయంలో నిర్ణయ శక్తి అవసరము మరియు - ఎప్పుడైతే మీ మనసు బాబా వైపు ఉంటుందో, అప్పుడే ఆ నిర్ణయ శక్తి వస్తుంది. ఒకవేళ మీరు అలజడిలోనే ఉంటే, అవునా కాదా, అవునా కాదా అన్న అలజడిలోనే ఉండిపోతారు, అందుకే మనసులో కూడా నిరాశపడకండి. అలాగే ధనం కూడా కింద-మీద అవుతుంది. కోటీశ్వరులదే కింద-మీద అవుతుంది అన్నప్పుడు మీరు వారి ముందు ఎంత. అదైతే జరిగేదే ఉంది. కానీ మీకైతే దృఢమైన నిశ్చయముంది - ఎవరైతే తండ్రికి సహచరులుగా ఉంటారో, సత్యమైనవారిగా ఉంటారో, వారికి ఎట్టి పరిస్థితిలోనూ బాప్‌దాదా పప్పు-రొట్టెను తప్పకుండా తినిపిస్తారు. రెండు-రెండు కూరలు తినిపించకపోయినా పప్పు-రొట్టె తినిపిస్తాము. కానీ అలాగని పనితో అలసిపోయి అలా కూర్చుండిపోయి - బాబా పప్పు-రొట్టె తినిపిస్తారు అని అనుకోకండి. ఇటువంటి నిర్లక్ష్యం చేసేవారికి, బద్దకించేవారికి లభించదు. సత్యమైన మనసుపై స్వామి రాజీ అవుతారు. కుటుంబంలో కూడా గొడవలైతే జరిగేదే ఉంది. అతి తర్వాత అంతము అవుతుంది అని మీరు అంటూ ఉంటారు కదా, ఇలా అంటారు కదా! అతిలోకి వెళ్తుంది మరియు వెళ్ళాలి కూడా, కావున కుటుంబంలో గొడవలు జరగకపోవడమనేది జరగదు, అవి జరుగుతాయి! కానీ మీరు ట్రస్టీగా అయ్యి, సాక్షిగా అయ్యి, తండ్రి నుండి శక్తి తీసుకుని పరిస్థితిని పరిష్కరించండి. గృహస్థులుగా అయ్యి ఆలోచించినట్లయితే ఇంకా ఎక్కువ గడబిడ అవుతుంది. ముందు పూర్తిగా ఆతీతులుగా, ట్రస్టీగా అవ్వండి. ‘నాది’ అనే భావం ఉండకూడదు. ఈ నాది అన్న భావం - నా పేరు పాడైపోయింది, నన్ను నిందిస్తారు, నా పిల్లలు-నేను... నా అత్తగారు నన్ను ఇలా చేస్తారు... ఈ నాది అన్న భావం వచ్చినప్పుడే అన్ని విషయాలు వచ్చేస్తాయి. నాది అన్నది ఎక్కడ వచ్చినా అక్కడ బుద్ధి తిరిగిపోతుంది, మారిపోతుంది. ఒకవేళ ఎక్కడైనా బుద్ధి అలజడిలో మారిపోయిందటే - అక్కడ నాది అనే భావం ఉన్నట్లు అర్థం చేసుకోండి. దానిని చెక్ చేసుకోండి మరియు దానిని ఎంతగా పరిష్కరించాలనుకుంటే అది అంతగా అలజడిలోకి తీసుకువస్తుంది. అందుకే అన్ని విషయాలలోనూ ఎలా అవ్వకూడదు? నిరాశపడకూడదు. ఎలా అవ్వరు? (నిరాశ కలవారిగా). కేవలము ఇలా చెప్పటము కాదు, చెయ్యాలి. భగవంతుని పిల్లలు, ఇదైతే దృఢమైన ప్రతిజ్ఞ కదా, దీనినైతే మాయ కూడా చలింపజేయలేదు. ఇదే మీ దృఢమైన ప్రతిజ్ఞ అన్నప్పుడు, ఈ నిశ్చయము ఉన్నప్పుడు, భగవంతుని పిల్లలు కూడా నిరాశకులోనైతే ఇక విశాల హృదయం పెట్టుకునేవారు ఎవరుంటారు? వేరే ఎవరైనా ఉంటారా? మీరే కదా ఉన్నది! మరి ఏం చేస్తారు? ఇప్పుడు సమర్థులుగా అవ్వండి మరియు కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు అన్న పాఠాన్ని పక్కా చేసుకోండి. ఇందులో కచ్చాగా ఉండకండి, పక్కా చేసుకోండి. అందరూ ధైర్యవంతులే కదా? ధైర్యము ఉందా? అచ్ఛా!
డైమండ్ జూబిలీ యొక్క సంతోషం ఉంది కదా! బాప్‌దాదా వార్తలను వింటూనే ఉంటారు. మంచిగా చేశారు. ముందుగా ఢిల్లీలో ప్రారంభించారు. రాజధానిలో మీ పాదాన్ని స్థిరపరిచారు. ఇప్పుడు అందరూ చేస్తున్నారు. కానీ గుర్తుంచుకోండి - ఈ డైమండ్ జూబిలీ సంవత్సరంలో బాప్‌దాదా ప్రతి జోన్‌కు ఏదో ఒక పని ఇచ్చారు. యూత్‌కు పని ఇచ్చారు, కుమారీలకు పని ఇచ్చారు, ప్రవృత్తివారికి పని ఇచ్చారు. కాబట్టి ఆ పని చేయడం మర్చిపోవద్దు. బాప్‌దాదా వద్దకు ఎవరో ఒకరిని తప్పకుండా తీసుకురావాలి. చిన్న నెక్లెస్ అయినా చేసి తీసుకురండి, కంకణం అయినా చేసి తీసుకురండి, పెద్ద హారం అయినా చేసి తీసుకురండి. కానీ తప్పకుండా తీసుకురావాలి. ఖాళీ చేతులతో రాకూడదు. ధైర్యం ఉంది కదా! తయారు చేస్తారు కదా! బాప్‌దాదా అయితే, సరే, కంకణమే అయినా తీసుకురండి అంటారు. ఎందుకంటే చాలా ఆత్మలు లోపల టెన్షన్‌తో ఎంతో దుఃఖంగా ఉన్నారు. పాపం వారిలో ముందుకు సాగడానికి ధైర్యం లేదు. కాబట్టి మీరు మాస్టర్ సర్వశక్తిమంతులు, వారికి ధైర్యాన్ని ఇవ్వండి, అప్పుడు వారు వచ్చేస్తారు. ఎవరికి కాలు లేకపోతే, వారికి చెక్క కాలును అమర్చి ఇస్తారు కదా, అప్పుడు వారు నడుస్తారు కదా! అలాగే మీరు వారికి ధైర్యం అనే కాలును ఇవ్వండి. చెక్కకాలును కాదు, ధైర్యం అనే కాలును ఇవ్వండి. ఎంతో దుఃఖంతో ఉన్నారు. దయాహృదయులుగా ఉండండి. లోపల వారి పరిస్థితి ఎలా ఉందో అని బాప్‌దాదా అయితే అజ్ఞాన పిల్లలను కూడా చూస్తూనే ఉంటారు! బయట నుండి చూస్తే మాత్రం చాలా బాగా, టిప్‌టాప్‌గా ఉంటుంది. కానీ లోపల చాలా-చాలా దుఃఖంగా ఉన్నారు. మీరు చాలా మంచి సమయంలో బాబా పిల్లలుగా అయ్యారు, అంటే రక్షించబడ్డారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న సర్వ సమర్థ ఆత్మలకు, సర్వ మాయాజీత్, ప్రకృతీజీత్ ఆత్మలకు, సదా కొడుకు తండ్రిని ప్రత్యక్షం చేస్తాడు అనేటువంటి పిల్లలకు, సదా మనసును సంతోషంగా పెట్టుకునే పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఈ రోజు విదేశీ పిల్లలు కూడా చాలా ఎక్కువ గుర్తొస్తున్నారు. నలువైపులా అందరి మనసులు మధుబన్తో ముడిపడి ఉన్నాయి. బాప్‌దాదా కూడా పిల్లలందరినీ ఎదురుగా చూస్తూ విశేషంగా స్మృతి మరియు సేవల కోసం ప్రియస్మృతులను ఇస్తున్నారు.
దాదీజీతో:- నయనాల భాష ద్వారా సర్వ వరదానాలు లభించాయి కదా! బాబా యొక్క స్నేహం మరియు ధైర్యం అనే హస్తం ఎల్లప్పుడూ మస్తకంపై ఉండనే ఉంది.
దాదీలతో:- వీరందరూ సమర్థ సహయోగులు కదా! మీరందరూ మాయను బాగా గుర్తించగలవారు. మీరు నిమిత్తమైన ఆత్మల కారణంగానే డైమండ్ జూబిలీని జరుపుకుంటున్నారు. (బాప్‌దాదా దాదీలను తన ఎదురుగా కూర్చోబెట్టారు.) మిమ్మల్ని చూడడం కూడా ఆనందంగా ఉంటుంది కదా! ఈరోజు అమృతవేళ బాప్‌దాదా డైమండ్ జూబిలీకి చెందిన ఒక్కొక్క రత్నాన్ని చూస్తూ ఉన్నారు. అందులో మిక్స్‌గా ఉన్నారు. పాత సంగఠన చిన్నదే అయినా, కొత్త సంగఠన కూడా మీకు సహయోగులుగా అయ్యారు. కొత్తవారిలో కూడా చాలా మంచివారు ఉన్నారు. పేర్లు చెప్పడం లేదు కానీ ధైర్యం కలిగిన పుష్పగుచ్ఛం నిమిత్తమైంది కాబట్టే ఈ కార్యం డైమండ్ జూబిలీ వరకు చేరుకుంది. డైమండ్ జూబిలీ వారు చివరలో ఏ జెండాను ఎగరవేస్తారు? పూలు కట్టి చేసే ఈ జెండానే ఎగురవేస్తారా! బాబా వచ్చేశారు అనే జెండాను ఎగరవేయండి. లేక వస్త్రంతో చేసినదాన్ని, పూలతో చేసినదాన్ని ఎగరవేస్తారా? డైమండ్ జూబిలీలో నవీనత ఉండాలి కదా! పిల్లలు బాబా నుండి వంచితులైపోతే జాలి కలుగుతుంది కదా! అనాథలైపోయారు. వారికి బాబా పరిచయాన్ని ఇస్తారు కదా! లేదంటే వారే మీ చెవులు పట్టుకుంటారు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? అని వారే మీ చెవులు పట్టుకుంటారు. అందుకే బాప్‌దాదా అందరికీ అర్థమయ్యేలా ఒక ప్లాన్ చేయాలని చూస్తున్నారు. వెతుకుతున్నారు - ఎక్కడ ఉన్నారు? ఎక్కడ ఉన్నారు? అని. కానీ, ఎక్కడ ఉన్నారు అంటే - ఇక్కడ ఉన్నారు అనే అడ్రస్ ఇవ్వాలి కదా! కాబట్టి అలాంటి ప్లాన్ చేయండి. మీటింగ్‌లు చేస్తారు కదా! అందరికీ అడ్రస్ దొరికేలా ఒక ప్లాన్ రూపొందించండి.
తమిళనాడు రాష్ట్ర గవర్నర్ మహామహిమ డా. ఎం. చెన్నారెడ్డి గురించి అవ్యక్త బాప్‌దాదా యొక్క మధుర మహావాక్యాలు
మిమ్మల్ని మీరు బాలకుడిని మరియు యజమానిని అని భావిస్తారా? ఎవరు బాలకులో వారు తప్పకుండా యజమానులే. కాబట్టి ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు బాలకుడిని మరియు యజమానిని అని భావిస్తూ ఉండండి. మొత్తం కుటుంబం మిమ్మల్ని బాలకుడిని మరియు యజమానిని అని భావిస్తోంది. కాబట్టి బాబాకు చెందిన అవినాశి ఖజానాలైన శక్తులు, గుణాలు, జ్ఞానం - సర్వ ఖజానాలకు మీరు యజమానులయ్యారు. ఈ సంతోషంలో, ఈ నశాలో ఎల్లప్పుడూ ఉండండి. మీ సహజ విశేషత అయిన దృఢత్వం, ఇప్పుడు ఈ జ్ఞాన మార్గంలో కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మీరు నిరాశ చెందరని బాప్‌దాదా చూశారు. మీరు ధైర్యాన్ని నిలుపుకుంటారు. ధైర్యం మీ విశేషత. ఇప్పుడు ఆ శక్తిని అలౌకిక కార్యంలో వినియోగించండి. మీరు కోరింది చేయగలరు. విరోధులను కూడా శాంతపరచగలరు.
ప్రజారాజ్యం ప్రారంభమైనప్పటి నుండి గవర్నర్లు, మంత్రులు చాలామంది అయ్యారు. మీరు కూడా అయ్యారు. కానీ ప్రస్తుత సమయంలో మీకు లభించిన ఒక భాగ్య లాటరీ ఏమిటో తెలుసా? ఈ ఈశ్వరీయ కార్యాన్ని ప్రత్యక్షం చేయడంలో మీరు నిమిత్తమయ్యారు. కొద్దికాలం మాత్రమే పదవి లభించినా, ఈ జ్ఞాన సరోవరంలో బాబాను గుర్తించే ఆత్మలకు నిమిత్తమైన వారికి వాటా లభిస్తుంది. కాబట్టి మీరు ఎంతో పెద్ద షేర్ హోల్డర్ అయ్యారు. దానితో పాటు చూడండి, కార్యం కారణంగా ఇతరులకు కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి. కానీ మీకు ఇంతమంది బ్రాహ్మణుల ఆశీర్వాదాలు లభించాయి. ఒక్కొక్క బ్రాహ్మణుడు ఎంత గొప్పవాడు! బ్రాహ్మణులకు బాప్‌దాదాను కలిసే అవకాశం లభిస్తుంది కాబట్టి వారి ఆశీర్వాదాలు మీకు స్వయంగా లభిస్తున్నాయి. అందువల్ల మీ భవిష్యత్తు బ్యాంకులో జమ అవుతోంది. కారణం ఏమిటి? బాబాపై మరియు కుటుంబంపై ప్రేమ ఉంది. అది హృదయపూర్వక ప్రేమ, స్వార్థప్రేమ కాదు. హృదయపూర్వక ప్రేమకు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. స్వార్థప్రేమలో విజయం ఉండదు. హృదయపూర్వక ప్రేమే విజయాన్ని అందిస్తుంది.
మీ వద్ద ఒక బంగారు తాళంచెవి ఉంది. మీకు లభించిన ఆ బంగారు తాళంచెవి ఏమిటో తెలుసా? (మీ వరదానాలు.) అవి ఉండనే ఉన్నాయి, కానీ తాళంచెవి మాత్రం దృఢత్వం. దృఢత్వమే విజయానికి తాళంచెవి. ఆ తాళంచెవి మీ వద్ద ఉంది. మీరు సేవ చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు అని బాబాకు తెలుసు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ మరచిపోలేరు. ఇది మనుష్యాత్మలపై ప్రేమ కాదు, ఈశ్వరీయ ప్రేమ. ప్రేమ ఎల్లప్పుడూ దగ్గరకు తీసుకువస్తుంది. బాగుంది కదా! అచ్ఛా. కుటుంబం బాగుందా? కుటుంబానికి కూడా ప్రియస్మృతులు తెలియజేయండి. ఎక్కడికి వెళ్లినా సేవ చేస్తారు.
నారాయణ్ దాదాతో:- అడుగు ముందుకు వేస్తూనే ఉన్నారు కదా! అడుగు ముందుకు వేయడం అంటే ఫాలో ఫాదర్. మరి అడుగు ముందుకు పడిందా? ప్రత్యక్షంగా బాబా ద్వారా అవినాశి బీజం నాటబడింది - ఈ భాగ్యం చిన్నది కాదు! కాబట్టి ఈ భాగ్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఉండండి. చూడండి, దాదీలందరికీ మీపై ఎంత ప్రేమ ఉంది! ఆ ప్రేమకు ప్రతిస్పందనగా ముందుకు సాగాలి. మిగతావన్నీ బాగానే ఉన్నాయి కదా! కుటుంబం బాగుందా? అచ్ఛా!
జగదీష్ అన్నయ్యగారితో:- బాగా చేసింది ఢిల్లీ. ఢిల్లీ నంబర్ తీసుకుంది. ఇప్పుడు మీ తరఫున మాట్లాడే అలాంటి మైక్‌లను ఇంకా సిద్ధం చేయండి - ఇది పరమాత్మ మార్గం అని చెప్పాలి. దానిని చేసే నిమిత్తులు మీరే. ఆది నుంచే వరదానం ఉంది కాబట్టి చేస్తూ ఉండండి. ఢిల్లీ మంచిగా చేసింది. తన ధైర్యాన్ని, యూనిటీని, విజయాన్ని - ఈ మూడింటినీ చూపించింది. అందరికీ అభినందనలు ఉన్నాయి. కానీ ఇది ఈ ఒక్క కార్యానికి సంబంధించిన అభినందన. ఇక ముందూ కూడా చేయాలి.
బాప్‌దాదా నవ రత్నాలలోకి వచ్చేందుకు 9 విషయాల నుండి ముక్తులుగా అవ్వాలి అన్న సూచనను ఇచ్చారు, అవి ఏమిటంటే:-
1. క్రోధముక్తులు
2. వ్యర్థ సంకల్ప ముక్తులు
3. మోహ ముక్తులు
4. పరమతము, పరచింతన మరియు పరదర్శన ముక్తులు
5. అభిమానము మరియు అవమానము నుండి ముక్తులు
6. గందరగోళం నుండి ముక్తులు
7. వ్యర్థ మాటలు, డిస్టర్బ్ చేసే మాటల నుండి ముక్తులు
8. అప్రసన్నతా ముక్తులు
9. నిరాశ నుండి ముక్తులు.
*** ఓంశాంతి ***
