‘‘బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ - అన్ని ప్రశ్నల నుండి అతీతముగా సదా ప్రసన్నచిత్తులుగా ఉండటము’’
ఈరోజు సర్వ ప్రాప్తుల దాత, బాప్‌దాదా తమ సర్వ ప్రాప్తి స్వరూప పిల్లలను చూస్తున్నారు. బాప్‌దాదా ద్వారా ప్రాప్తులైతే ఎన్నో కలిగాయి, ఒకవేళ వాటిని వర్ణన చేస్తే చాలా ఉన్నాయి, కానీ పెద్ద లిస్టు చెప్పేందుకు బదులుగా ‘ఈ బ్రాహ్మణ జీవితంలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు’ అని వర్ణన చేస్తారు. కావున బాప్‌దాదా చూస్తున్నారు - ప్రాప్తులైతే చాలానే ఉన్నాయి, పెద్ద లిస్టు ఉంది కదా! మరి ఎవరికైతే సర్వ ప్రాప్తులు ఉన్నాయో, దానికి గుర్తుగా ప్రత్యక్ష జీవితంలో ఏమి కనిపిస్తుంది - అది తెలుసు కదా? సర్వ ప్రాప్తులకు గుర్తు - సదా వారి ముఖము మరియు నడవడికలో ప్రసన్నత యొక్క పర్సనాలిటీ కనిపిస్తుంది. పర్సనాలిటీయే ఎవరినైనా ఆకర్షిస్తుంది. కనుక సర్వ ప్రాప్తులకు గుర్తు - ప్రసన్నతా పర్సనాలిటీ, దీనిని సంతుష్టత అని కూడా అంటాము. కానీ ఈ రోజుల్లో ముఖంలో ఏదైతే ప్రసన్నత యొక్క మెరుపు కనిపించాలో, అది కనిపించటం లేదు. అప్పుడప్పుడు ప్రసన్నచిత్తులుగా మరియు అప్పుడప్పుడు ప్రశ్నచిత్తులుగా ఉంటున్నారు. రెండు రకాలవారు ఉన్నారు, ఒకరేమో - కొద్దిగా ఏదైనా పరిస్థితి రాగానే - ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు... అని ప్రశ్నచిత్తులవుతారు. ఇటువంటివారు ప్రశ్నచిత్తులు. ప్రాప్తి స్వరూపులు సదా ప్రసన్నచిత్తులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ ఏ విషయంలోనూ ప్రశ్నలు ఉండవు ఎందుకంటే సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. కావున - ఈ ఎందుకు, ఏమిటి అనేవి ఏవైతే ఉన్నాయో, ఇవి అలజడి కలిగించేవి. ఎవరైతే సంపన్నంగా ఉంటారో, వారిలో అలజడి ఉండదు. ఎవరైతే ఖాళీగా ఉంటారో, వారిలో అలజడి ఉంటుంది. కావున మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - నేను సదా ప్రసన్నచిత్తముగా ఉంటున్నానా? అప్పుడప్పుడు కాదు, సదా? 10 సంవత్సరాల వారు సదా ఉంటున్నారా లేక ఉండటం లేదా? అవును అని అనటం లేదు, ఆలోచిస్తున్నారా? ఒకవేళ ప్రసన్నత తక్కువైతే, దానికి కారణము - ప్రాప్తి తక్కువగా ఉండటము మరియు ప్రాప్తి తక్కువగా ఉండటానికి కారణము - ఏదో ఒక కోరిక. కోరికకు పునాది - ఈర్ష్య మరియు అప్రాప్తి. చాలా సూక్ష్మమైన కోరికలు అప్రాప్తి వైపుకు లాగుతాయి, మళ్ళీ రాయల్ రూపంలో ఏమంటారంటే - నాకు కోరిక లేదు, కానీ ఇలా జరిగితే మంచిగా ఉంటుంది. కానీ ఎక్కడైతే అల్పకాలికమైన కోరిక ఉంటుందో, అక్కడ మంచి అనేది జరగదు. కావున చెక్ చేసుకోండి - జ్ఞానం యొక్క జీవితంలో, జ్ఞానానికి సంబంధించిన రాయల్ రూపంలోని కోరికలైనా, పెద్ద-పెద్ద కోరికలైనా, పెద్ద-పెద్ద కోరికలు ఇప్పుడు సమాప్తమైపోయాయి అని గమనించటం జరిగింది కానీ రాయల్ కోరికలు, జ్ఞానం లభించిన తర్వాత సూక్ష్మ రూపంలో ఇంకా ఉన్నాయి, వాటిని చెక్ చేసుకోండి ఎందుకంటే బాప్‌దాదా ఇప్పుడు పిల్లలందరినీ తండ్రి సమానంగా సంపన్నంగా, సంపూర్ణంగా తయారుచేయాలని అనుకుంటున్నారు. ఎవరి పట్లనైతే ప్రేమ ఉంటుందో, వారి సమానంగా అవ్వటము అనేది కష్టమైన విషయమేమీ కాదు.
మరి బాప్‌దాదా పట్ల అందరికీ చాలా ప్రేమ ఉందా లేక ప్రేమ ఉందా? (చాలా ప్రేమ ఉంది) పక్కాయేనా? మరి ప్రేమ వెనుక త్యాగం చేయటము లేక పరివర్తన చేయటము ఏమైనా పెద్ద విషయమా? (కాదు). మరి పూర్తిగా త్యాగం చేసారా? బాబా ఏదైతే చెప్తున్నారో, బాబా ఏదైతే కోరుకుంటున్నారో, అది చేసారా? సదా చేసారా? అప్పుడప్పుడు చేస్తే దానితో పని అవ్వదు. సదాకాలిక రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకోవాలా లేక అప్పుడప్పుడు ఉండే రాజ్య భాగ్యాన్నా? సదాకాలికమైనది కావాలి కదా? కనుక సదా ప్రసన్నత ఉండాలి, మరే ఇతర భావము ముఖంపై లేక నడవడికలో కనిపించకూడదు. అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా - ఈ రోజు అక్కయ్యగారి మూడ్ లేక అన్నయ్యగారి మూడ్ వేరేలా ఉంది అని. ఈ రోజు నా మూడ్ వేరేలా ఉంది అని మీరు కూడా అంటారు. మరి దీనిని ఏమంటారు? సదా ప్రసన్నత ఉన్నట్లా? చాలా మంది పిల్లలు ప్రశంస ఆధారంగా ప్రసన్నతను అనుభవం చేస్తారు కానీ ఆ ప్రసన్నత అల్పకాలికమైనది. ఈ రోజు ఉంటుంది, మళ్ళీ కొద్ది సమయం తర్వాత సమాప్తమైపోతుంది. కనుక ఇది కూడా చెక్ చేసుకోండి - నా ప్రసన్నత ప్రశంస ఆధారంగానైతే లేదు కదా? ఏ విధంగానైతే ఈ రోజుల్లో ఇల్లు కట్టే సమయంలో, సిమెంట్ లో ఇసుక శాతాన్ని ఎక్కువ వేస్తారు, కలిపేస్తారు. ఇది కూడా అలాంటిదే, పునాది మిక్స్ అయి ఉంది, యథార్థంగా లేదు. కావున కాస్త ఏదైనా పరిస్థితి అనే తుఫాను వచ్చినా లేక ఏ రకమైన అలజడి కలిగినా, అది ప్రసన్నతను సమాప్తం చేసేస్తుంది. మరి మీ పునాది ఇలా అయితే లేదు కదా?
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ఇప్పుడు మళ్ళీ అండర్లైన్ చేస్తున్నారు - రాయల్ రూపంలో కోరిక యొక్క స్వరూపము - పేరు, గౌరవము మరియు ప్రతిష్ఠ. సేవలో పేరు లభించాలి అని సేవను ఆధారంగా తీసుకుంటారు. కానీ ఎవరైతే పేరు కోసం సేవ చేస్తారో, వారికి - చాలా మంచి సేవాధారులు, చాలా బాగా ఆకర్షించేవారు అని అల్పకాలికంగా పేరు వస్తుంది, కానీ పేరు ఆధారంగా సేవ చేసేవారి యొక్క పేరు ఉన్నత పదవిలో వెనుకకు వెళ్ళిపోతుంది ఎందుకంటే పచ్చి ఫలాన్ని తినేసారు, అది ఇంకా మగ్గలేదు. కనుక ఇక మగ్గిన ఫలాన్ని ఎక్కడ తింటారు, పచ్చిగానే తినేసారు. ఇప్పుడిప్పుడే సేవ చేసారు, ఇప్పుడిప్పుడే పేరు పొందారు అంటే అది పచ్చి ఫలము. సేవనైతే నేను చాలా చేసాను, సేవకు నిమిత్తంగా అందరికన్నా ఎక్కువగా నేనే ఉన్నాను అంటూ కోరిక పెట్టుకున్నట్లయితే, ఇది పేరు ఆధారంగా సేవ చేసినట్లు - ఇటువంటివారిని పచ్చి ఫలం తినేవారు అని అంటాము. మరి పచ్చి ఫలంలో శక్తి ఉంటుందా? నేను సేవ చేసాను కనుక సేవ రిజల్టుగా నాకు గౌరవం లభించాలి అని అనుకుంటారు. ఇది గౌరవము కాదు, ఇది అభిమానము. ఎక్కడైతే అభిమానము ఉంటుందో, అక్కడ ప్రసన్నత ఉండదు. అన్నింటికన్నా పెద్ద గౌరవముగా - బాప్‌దాదా హృదయంలో గౌరవాన్ని ప్రాప్తి చేసుకోండి. ఆత్మల హృదయంలో ఒకవేళ గౌరవము లభించినా కానీ ఆత్మ స్వయమే తీసుకునేటువంటిది, ఆత్మ మాస్టర్ దాత, అంతేకానీ దాత కాదు. కనుక గౌరవం కావాలనుకుంటే సదా బాప్‌దాదా హృదయంలో మీ గౌరవాన్ని ప్రాప్తి చేసుకోండి. ఈ రాయల్ కోరికలన్నీ ప్రాప్తి స్వరూపులుగా అవ్వనివ్వవు, అందుకే ప్రసన్నతా పర్సనాలిటీ సదా ముఖము మరియు నడవడికలో కనిపించదు. ఏ పరిస్థితిలోనైనా ప్రసన్నత యొక్క మూడ్ మారిపోయిందంటే దానిని సదాకాలికమైన ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితము యొక్క మూడ్ - సదా చియర్ఫుల్గా మరియు కేర్‌ఫుల్‌గా(హర్షితముగా మరియు జాగ్రత్తగా) ఉండటము. మూడ్ మారిపోకూడదు. తర్వాత రాయల్ రూపంలో ఏమంటారంటే - ఈ రోజు నాకు చాలా ఏకాంతము కావాలి. ఎందుకు కావాలి? ఎందుకంటే సేవ నుండి మరియు పరివారం నుండి పక్కకు తప్పుకోవాలని అనుకుంటారు. కానీ అనడమేమో - శాంతి కావాలి, ఏకాంతము కావాలి, ఈ రోజు నా మూడ్ ఇలా ఉంది అని అంటారు. మూడ్‌ను మార్చుకోకండి. కారణం ఏదైనా కానీ మీరు కారణాన్ని నివారణ చేసేవారా లేక కారణంలోకి వచ్చేవారా? మీరు నివారణ చేసేవారు. కాంట్రాక్ట్ ఏమి తీసుకున్నారు? మీరు కాంట్రాక్టర్ కదా? మరి ఏ కాంట్రాక్ట్ తీసుకున్నారు? ప్రకృతి యొక్క మూడ్‌ను కూడా మారుస్తాము అన్న కాంట్రాక్ట్‌ను తీసుకున్నారు. ప్రకృతిని కూడా మార్చాలి కదా? మరి ప్రకృతిని పరివర్తన చేసేవారు తమ మూడ్‌ను పరివర్తన చేసుకోలేరా? మూడ్ మారుతుందా, లేదా? అప్పుడప్పుడు మారుతుందా? అప్పుడు, సాగర తీరానికి వెళ్ళి కూర్చుంటాను అని అంటారు. జ్ఞాన సాగరము కాదు, స్థూల సాగరము. విదేశీయులు ఇలా చేస్తారు కదా? లేదా, ఈ రోజు చాలా ఒంటరిగా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు అని అంటారు. మరి తండ్రి యొక్క కంబైండ్ రూపము ఎక్కడికి వెళ్ళింది? వేరు చేసేసారా? కంబైండ్ నుండి వేరు అయిపోయారు, దీనిని ప్రేమ అంటారా? కనుక ఏ విధమైన మూడ్ అయినా - ఒకటేమో మూడ్ ఆఫ్ అవ్వటము, ఇదైతే పెద్ద విషయము, కానీ మూడ్ మారటము అనేది కూడా కరెక్ట్ కాదు. మూడ్ ఆఫ్ అయ్యేవారైతే చాలా రకరకాల ఆటలు చూపిస్తారు, బాప్‌దాదా చూస్తూ ఉంటారు, పెద్దవారికి చాలా ఆటలు చూపిస్తారు లేక తమ సహచరులకు చాలా ఆటలు చూపిస్తారు. ఇటువంటి ఆటలు ఆడకండి ఎందుకంటే బాప్‌దాదాకు పిల్లలందరిపై ప్రేమ ఉంది. ఎవరైతే విశేషంగా నిమిత్తులుగా ఉన్నారో, వారు బాబా సమానంగా అవ్వాలి, మిగిలినవారు అయినా, అవ్వకపోయినా ఫర్వాలేదు అని బాప్‌దాదా ఇలా కోరుకోరు. అందరినీ సమానంగా తయారుచేయాల్సిందే అనుకుంటారు, ఇదే బాప్‌దాదా యొక్క ప్రేమ. మరి ప్రేమకు బదులు ఇవ్వటం వస్తుందా లేక ఆటలాడుతూ బదులు ఇస్తారా? ఒక్కోసారి ఆటలు చూపిస్తారు మరియు ఒక్కోసారి సమానంగా అయ్యి చూపిస్తారు. ఇప్పుడు ఆ సమయం సమాప్తమైపోయింది.
ఇప్పుడు డైమండ్ జూబిలీ జరుపుకుంటున్నారు కదా? మామూలుగా కూడా 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థము మొదలవుతుంది. కావున ఇప్పుడు చిన్న పిల్లలు కారు, ఇప్పుడు వానప్రస్థులు అనగా అన్నీ తెలిసినవారు, అనుభవీ ఆత్మలు, నాలెడ్జ్‌ఫుల్, పవర్ఫుల్, సక్సెస్ఫుల్ అయినవారు. ఎలాగైతే సదా నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారో, అలానే పవర్‌ఫుల్‌గా మరియు సక్సెస్‌ఫుల్‌గా కూడా ఉన్నారు కదా? అప్పుడప్పుడు ఎందుకు సక్సెస్ఫుల్ అవ్వరు, దానికి కారణమేమిటి? సఫలత మన జన్మ సిద్ధ అధికారం అన్నప్పుడు మరి అధికారం ప్రాప్తించడంలో, అనుభవం అవ్వటంలో లోపం ఎందుకు ఉంటుంది? కారణమేమిటి? బాప్‌దాదా ఏమి చూసారంటే - మెజారిటీ తమ బలహీన సంకల్పాలను ముందే ఇమర్జ్ చేసేస్తారు - అవుతుందో లేదో తెలియదు అని అనుకుంటారు! తమ ఈ బలహీన సంకల్పాలే ప్రసన్నచిత్తులుగా కాకుండా ప్రశ్నచిత్తులుగా చేస్తాయి. అవుతుందో అవ్వదో? ఏమవుతుందో? ఏమో తెలియదు... ఈ సంకల్పాలు అడ్డుగోడలా అవుతాయి, మరియు సఫలత ఆ గోడ లోపల దాగిపోతుంది. నిశ్చయబుద్ధి విజయీ... మీ స్లోగన్ ఇదే కదా! ఈ స్లోగన్ ఇప్పటిదే, భవిష్యత్తుది కాదు, వర్తమానముదే అన్నప్పుడు సదా ప్రసన్నచిత్తులుగా ఉండాలా లేక ప్రశ్నచిత్తులుగానా? కావున మాయ మీ బలహీన సంకల్పాలు అనే వలను పరుస్తుంది, మరియు మీ వలలోనే మీరు చిక్కుకుపోతారు. నేను విజయీనే - అన్నదానితో ఆ బలహీన సంకల్పాల వలను సమాప్తం చేయండి. అందులో చిక్కుకోకండి, దానిని సమాప్తం చేయండి. సమాప్తం చేసే శక్తి ఉందా? నెమ్మది-నెమ్మదిగా చేయకండి, ఒక్కసారిగా ఒక్క క్షణంలో చేయండి. ఈ వలను పెరగనివ్వకండి. ఒకవేళ ఈ వలలో ఒక్కసారి చిక్కుకున్నా సరే, దాని నుండి బయటపడటం చాలా కష్టమవుతుంది. విజయము నా జన్మసిద్ధ అధికారము, సఫలత నా జన్మసిద్ధ అధికారము. ఈ జన్మసిద్ధ అధికారము, పరమాత్మ ఇచ్చిన జన్మసిద్ధ అధికారము, దీనిని ఎవ్వరూ లాక్కోలేరు - ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారు సదా ప్రసన్నచిత్తులుగా సహజంగా మరియు స్వతహాగా ఉంటారు. శ్రమించాల్సిన అవసరం కూడా ఉండదు.
అసఫలతకు రెండవ కారణము ఏమిటి? సమయము, సంకల్పాలు, సంపద - అన్నింటినీ సఫలం చేసుకోండి అని మీరు ఇతరులకు కూడా చెప్తారు. కావున సఫలం చేయటము అనగా సఫలతను పొందటము. సఫలం చేయటమే సఫలతకు ఆధారము. ఒకవేళ సఫలత లభించటం లేదంటే తప్పకుండా ఏదో ఒక ఖజానాను సఫలం చేయలేదు, అందుకే సఫలత లభించలేదు. ఖజానాల లిస్ట్ అయితే తెలుసు కదా, కనుక చెక్ చేసుకోండి - ఏ ఖజానాను సఫలం చేయలేదు, వ్యర్థంగా పోగొట్టుకున్నాను? అప్పుడు స్వతహాగానే సఫలత ప్రాప్తిస్తుంది. సఫలం చేయండి మరియు సఫలతను పొందండి - అనేది వారసత్వము కూడా మరియు వరదానము కూడా. మరి సఫలము చేయడము వస్తుందా, రాదా? మరి సఫలత లభిస్తుందా? సఫలం చేయటము బీజము మరియు సఫలత అనేది ఫలము. ఒకవేళ బీజం బాగుంటే ఫలం లభించకపోవటము అనేది జరగనే జరగదు. సఫలం చేయటము అనే బీజములో లోపం ఉంది కావుననే సఫలత అనే ఫలం లభించదు. మరి ఏమి చెయ్యాలి? సదా ప్రసన్నత యొక్క పర్సనాలిటీలో ఉండండి. ప్రసన్నచిత్తులుగా ఉన్నట్లయితే చాలా మంచి అనుభవాలను పొందుతారు. మామూలుగా కూడా ఎవరైనా ప్రసన్నచిత్తులను చూసినప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది! వారి సాంగత్యంలో ఉండటము, వారితో మాట్లాడటము, కూర్చోవటము ఎంత బాగా అనిపిస్తుంది! అదే ఎవరైనా ప్రశ్నచిత్తులు వస్తే విసుగు అనిపిస్తుంది. కనుక ఈ లక్ష్యాన్ని పెట్టుకోండి - ఎలా తయారవ్వాలి? ప్రశ్నచిత్తులుగా కాదు, ప్రసన్నచిత్తులు.
ఈరోజు సీజన్ యొక్క చివరి రోజు, చివరిలో ఏం చేస్తారు? ఏదైనా యజ్ఞాన్ని రచించినప్పుడు కూడా చివరిలో ఏం చేస్తారు? స్వాహా చేస్తారు. మరి మీరేం చేస్తారు? ప్రశ్నచిత్తాన్ని స్వాహా చేయండి. ఇది ఎందుకు జరుగుతుంది? ఏం జరుగుతుంది?... ఇలా అనకూడదు. మీరు నాలెడ్జ్‌ఫుల్ కదా కావున ఎందుకు, ఏమిటి అనేది వద్దు. ఈరోజు నుండి ఈ వ్యర్థ ప్రశ్నలు స్వాహా. మీ సమయం కూడా పొదుపు అవుతుంది మరియు ఇతరుల సమయం కూడా పొదుపు అవుతుంది. ఇది ఎందుకు? ఇదేమిటి? ఇది ఎలా? అని దాదీల సమయము కూడా వీటిలో పోతుంది. కనుక మీ సమయాన్ని మరియు ఇతరుల సమయాన్ని పొదుపు చేయండి. పొదుపు ఖాతాను జమ చేసుకోండి. అప్పుడిక 21 జన్మలు ప్రశాంతంగా తినండి, త్రాగండి, ఆనందించండి, అక్కడ జమ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి స్వాహా చేసారా? లేక ఆలోచిస్తారా? ఆలోచించాలంటే ఆలోచించుకోండి. ఇది ఎలా అవుతుంది, ఇది చేయగలనా లేదా... అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్క నిమిషంలో ఆలోచించుకోండి, ఈ పనిని ఖచ్చితంగా చేయండి. మిమ్మల్ని మీరు ఎన్ని ప్రశ్నలు అడగాలనుకున్నా ఒక్క నిమిషంలో అడిగేయండి. అడిగేసారా? స్వాహా కూడా చేసారా లేక కేవలం ప్రశ్నలే అడిగారా? ఇక ముందు కోసం ప్రశ్నలు సమాప్తం. (ఒక నిమిషం సైలెన్స్ తర్వాత) సమాప్తం చేసారా? (హాజీ) ఊరికే అలా హాజీ అనటం కాదు. ప్రశ్నచిత్తులుగా అవ్వటము అనగా వ్యాకులపడటము మరియు ఇతరులను వ్యాకులపర్చటము అన్న బహుకాలపు అనుభవం ఉంది కదా? ఈ అనుభవము మంచిగా ఉంది కదా? కనుక మీ నిశ్చయం మరియు జన్మసిద్ధ అధికారపు గౌరవంలో ఉంటే వ్యాకులత చెందరు. ఈ గౌరవము నుండి దూరమైనప్పుడు వ్యాకులత చెందుతారు. అర్థమైందా! బాగా అర్థమైందా లేక ఇప్పుడేమో - అర్థమైంది అని చెప్పి, మళ్ళీ విదేశానికి వెళ్ళిన తర్వాత కష్టమంటారా? అలా అనరు కదా? అచ్ఛా.
(ఈ రోజు బాప్‌దాదా ఎదుట జ్ఞానంలో 10 సంవత్సరాలుగా నడుస్తున్నవారు కూర్చున్నారు) వీరంతా 10 సంవత్సరాల వారు కూర్చున్నారు, సెరిమనీ జరుపుకున్నారా? బాప్‌దాదా 10 సంవత్సరాల మహావీరులు మరియు మహావీరనీలైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు. అభినందనలు ఇస్తున్నారు, “సదా నిర్విఘ్న భవ” అనే వరదానాన్ని ఇస్తున్నారు. 10 సంవత్సరాలు ధైర్యము ఉంచి బాబా తోడు మరియు హస్తం ఆధారంగా ఎలా దృఢంగా ఉన్నారో, అలాగే సదా ధైర్యాన్ని సహయోగిగా ఉంచుకోండి. ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఎక్కడ ధైర్యము ఉంటుందో, అక్కడ బాబా తప్పకుండా ఉంటారు. కాబట్టి డబల్ విదేశీయులు భిన్న-భిన్న రకాల ఆకర్షణల స్థానాలలో ఉంటూ, భిన్నమైన ధర్మాలు మరియు భిన్నమైన కల్చర్ ఉన్నప్పటికీ బ్రాహ్మణ కల్చర్‌లో నడుస్తూ ఉన్నారని చూసి బాప్‌దాదాకు సంతోషంగా ఉంది. ఇది చాలా ధైర్యానికి సాంపిల్‌ను చూపించారు. మీ సాంపిల్‌ను చూసి అనేక ఆత్మలు లాభం పొందుతారు. అందుకే ధైర్యానికి కూడా అభినందనలు మరియు ధైర్యము ద్వారా చేసిన సేవకు కూడా అభినందనలు. మిమ్మల్ని అందరినీ చూసి బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. అచ్ఛా.
ఏఏ ప్రాంతాలకు చెందిన 10 సంవత్సరాల వారు ఉన్నారో, చేతులు ఎత్తండి. (బాప్‌దాదా అందరితో విడివిడిగా చేతులు ఎత్తించి మిలనము చేస్తున్నారు) అచ్ఛా, ఆస్ట్రేలియా వారి సంతోషకరమైన వార్త విన్నాము. ధైర్యము ఉంచారు, సేవా ప్లాన్లు కూడా మంచిగా తయారుచేశారు మరియు దానితో పాటు రిట్రీట్ హౌస్‌ను కూడా తీసుకుంటున్నారు. ఆస్ట్రేలియాకు ఎన్ని భుజాలు ఉన్నాయి? (13) ఆస్ట్రేలియాతో సంబంధం ఉన్న ఏషియావారు చేతులు ఎత్తండి. 13 భుజాలు ఉన్నాయి. మరి భుజాలు ఏమి చేస్తాయి? సహయోగం ఇస్తాయి. అయితే ఈ 13 భుజాలు ఏమి చేస్తాయి? కేవలం చూసి, విని సంతోషిస్తారా? కాదు. ఆస్ట్రేలియా నివాసుల సేవకు ప్రతిఫలంగా భుజాలన్నీ యథాశక్తిగా ఇవ్వాలి. పాలన తీసుకుంటున్నారు కదా! కాబట్టి పాలనకు ప్రతిఫలం ఇవ్వడం ఒక కర్తవ్యం. అర్థమైందా? భుజాలకు అర్థమైందా? మంచివారు. ఏషియా గ్రూపు చాలా మంచిది. ఏషియా సమీపంగా కూడా ఉంది కదా! ఇండియా కూడా ఏషియాలోనే ఉంది. ఏషియాలో హెడ్‌క్వార్టర్ ఉంది. కాబట్టి ఏషియావారికి ఎక్స్ట్రా నశా ఉండాలి, ఏషియాలోనే బాప్‌దాదా వస్తారు. లండన్, అమెరికాలో రారు. బాప్‌దాదాకు ఏషియా ప్రియమైనది. చూడండి, యూరప్ మహిమ దానిది, ఏషియా మహిమ దానిది. డబల్ విదేశీయులందరికీ యూరప్ ఫౌండేషన్ స్థానం. సేవ యొక్క ప్రారంభం యూరప్‌లో జరిగింది. యు.కె. అని చెప్పండి లేదా యూరప్ అని చెప్పండి, కానీ బాప్‌దాదా రావడం ఏషియాలో జరిగింది. అచ్ఛా.
అచ్ఛా, 10 సంవత్సరాల వారు చేతులు ఎత్తండి. వాస్తవానికి చాలా మంది ఉండవచ్చు, కానీ ఈ గ్రూపుకు ఛాన్స్ లభించింది. ఇది కూడా అదృష్టమే. మంచిది. పాండవులు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి 10 సంవత్సరాల వారికి బాప్‌దాదా మరియు సర్వ కుటుంబం తరఫున పదమారెట్లు అభినందనలు. అచ్ఛా.
ఇప్పుడు తర్వాతి సీజన్ ఏమిటి అనే ప్రశ్న ఉందా? ఇది అవసరమైన ప్రశ్న, అందుకే అడగవచ్చు. ఇది వ్యర్థమైన ప్రశ్న కాదు. డ్రామా ప్లాన్ ప్రకారం బాప్‌దాదా ప్లాన్ ఏమిటంటే, ఈ సంవత్సరం డైమండ్ జూబిలీ సంవత్సరం. డైమండ్ జూబిలీ సేవకు సంబంధించిన ఉల్లాస-ఉత్సాహాలు దేశ-విదేశాలలో నలువైపులా మంచిగా ఉన్నాయి మరియు మంచిగానే ఉంటాయి. మంచిగా జరగాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం మనసారా ఎంత సేవ చేయాలనుకుంటే అంత సేవ చేయండి. ఈ సంవత్సరంలో భారత్‌లో అయినా, విదేశాలలో అయినా యథాశక్తిగా పెద్ద పెద్ద ప్రోగ్రామ్‌లు చేయాలని అనేకమంది పిల్లలకు ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి. పెద్ద ప్రోగ్రామ్‌లు చేసినప్పుడు పెద్దవారిని పిలుస్తారు. కాబట్టి ఈ సంవత్సరం అలాంటి యోగ్యమైన ప్రోగ్రామ్‌లు ఎక్కడెక్కడ జరుగుతాయో అక్కడకు దాదీలు వెళ్ళవచ్చు, అంతేకానీ ఇంటి ఓపెనింగ్ ఉంది కాబట్టి దాదీ రావాలి అని అనకండి. డైమండ్ జూబిలీకి సంబంధించి ఎక్కడైనా, ఏ ప్రోగ్రామ్ అయినా యోగ్యంగా ఉంటే అక్కడకు దాదీలు వెళ్లవచ్చు. కానీ... ఒక కానీ ఉంది. దాదీల ఆరోగ్యంపై కూడా అందరికీ ప్రేమ ఉంది కదా, లేక కేవలం సేవపైనే ఉందా? సేవపై ప్రేమ ఉందా లేక వారి ఆరోగ్యంపై కూడా ప్రేమ ఉందా? రెండింటిపైనా ఉంది కదా! అందుకే మీరు కూడా ఆలోచించి, అర్థం చేసుకొని ఆహ్వానం ఇవ్వండి. రావాల్సిందే, లేకపోతే మేము కోపపడతాము అని కాదు. ఏడవడం ప్రారంభిస్తారు, అలా చేయకండి. చూడండి, ఒకవైపు మీరందరూ యజ్ఞానికి, ఇంటికి యజమానులు. మేము చిన్నవారము, మాకు ఏమి తెలుసు, మేము మా ఇంట్లో ఉన్నాము అని కాదు. మీరు విశ్వానికి బాధ్యులు. నిన్న కిరీటము ధరించారు కదా! (నిన్న 10 సంవత్సరాల వారికి సెరిమనీలో కిరీటము ధరింపజేశారు) అది బాధ్యత యొక్క కిరీటమా లేక అట్టతో చేసినదా? అందరూ బాధ్యత యొక్క కిరీటము ధరించారు కదా! కాబట్టి ఏ ప్రోగ్రామ్ తయారుచేసినా యజ్ఞాన్ని కూడా చూడండి. ఎందుకంటే ఈ రోజు మధుబన్ మిమ్మల్ని ఎందుకు ఆకర్షిస్తోంది? మీ సెంటర్లు కూడా జ్ఞానం-యోగం ఉన్నవే. కానీ మధుబన్ ఎందుకు ఆకర్షిస్తోంది? ఎందుకంటే అది బ్రహ్మా బాబా తపస్సు, వారి స్థితికి సంబంధించిన స్థలం. కాబట్టి నిమిత్తమైన పెద్ద దాదీలు యజ్ఞ వాతావరణాన్ని, యజ్ఞ వ్యవహారాలను కూడా చూడాలి. మీరందరూ కూడా బాధ్యతగలవారు. లేకపోతే మధుబన్కు వచ్చి వాతావరణంతో సంతోషంగా తిరిగి వెళ్తారు, దానికి కారణం ఏమిటి? పెద్దల స్థితి ఆ స్థలంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి దీనినీ చూడండి. ఎందుకంటే యజ్ఞం అంటే మధుబన్ వాతావరణం నలువైపులా వ్యాపిస్తుంది. మీ అందరికీ శక్తి మధుబన్ స్థలం నుండే లభిస్తుంది. కాబట్టి మధుబన్ వ్యవహారాలు, సేవలు, వాతావరణం, దానితో పాటు దాదీల ఆరోగ్యం, వీటన్నింటినీ చూసి ప్రోగ్రామ్ రూపొందించండి. మీరు రండి అని చెప్పి, తర్వాత ఎవరి ప్రోగ్రామ్ అయినా రద్దయితే స్థితిలో కొంత తేడా వస్తుంది. అందుకే ముందుగానే ఆలోచించి, అర్థం చేసుకొని, నాలెడ్జ్‌ఫుల్‌గా, బాధ్యతగలవారిగా అయ్యి తర్వాత ప్రోగ్రామ్‌ను రూపొందించండి. అర్థమైందా? ఇందుకోసం బాప్‌దాదా ఈ మొత్తం సీజన్‌ను సేవ కోసం అనుమతిస్తున్నారు. బాప్‌దాదా సీజన్ మరియు బయట సేవకు పిలుపులు - ఈ రెండింటి మధ్య పెనుగులాట ఏర్పడుతుంది. అందుకే ఈ సీజన్లో బాప్‌దాదా, ఒకవేళ డిసెంబర్లో కిందిది సిద్ధమై, దాని ప్రారంభోత్సవం జరగాల్సిందే అయితే, డిసెంబర్లో విదేశీ మరియు భారతీయ రెండు సంగఠనలతో శాంతివన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభిద్దాము. విదేశీయులు పైన ఉండండి, భారతీయులు కింద ఉండండి. డబల్ ఛాన్స్ లభిస్తుంది. మీరు డబల్ విదేశీయులు కింద ఉంటారా? చాపపై నిద్రించాల్సి వస్తుందా? మీ అటాచీలను(సూట్‌కేసులను) దిండులుగా చేసుకోండి, స్థలం కావాలి కదా! కాబట్టి బాప్‌దాదా ఈ సీజన్లో, అంటే ప్రారంభమయ్యే మరుసటి సీజన్లో డిసెంబర్లో వస్తాము. డిసెంబర్ తర్వాత జనవరి 18న భారతీయుల కోసం, మూడవసారి విదేశీయుల కోసం శివరాత్రికి వస్తాము. నాలుగవది, ఒకవేళ ఏర్పాట్లు సరిగ్గా ఉంటే శివరాత్రి తర్వాత ఏప్రిల్ ప్రారంభంలో మళ్లీ ఒక మేళా నిర్వహిద్దాము. అందులో విదేశీయులు కూడా ఉంటారు, భారతీయులు కూడా ఉంటారు. కాబట్టి మరుసటి సీజన్ ప్లాన్ ఇది. ఎవరు ఎంత సేవ చేయాలనుకుంటే అంత హృదయపూర్వకంగా చేయండి. యోగ్యమైన అటెన్షన్ ఉంచుకొని దాదీలు కూడా చక్కర్లు వేయవచ్చు, కానీ మొదట ఆరోగ్యం, తర్వాత సేవ. పెనుగులాట చేయకండి. ఇప్పుడు సమయం చాలానే ఉంది. అందుకే దాని ప్రకారం ఒకసారి చక్కర్లు వేయండి. రెండవది బ్రాహ్మణుల రిఫ్రెష్మెంట్ కోసం, బాప్‌దాదా చెప్పినట్లు కర్మాతీతంగా అవ్వడం, అశరీరిగా అవ్వడం అనే అభ్యాసం చేయడానికి గ్రూపుల వారీగా బ్రాహ్మణుల సంగఠనను ఇక్కడ నిర్వహించవచ్చు. ప్రతి నెలకు విడివిడిగా ప్రోగ్రామ్ తయారుచేయండి. అందులో సేవ కూడా ఉండాలి, బ్రాహ్మణుల రిఫ్రెష్మెంట్ కూడా ఉండాలి. ఒకే సంవత్సరంలో పెనుగులాటతో విదేశాలకు తప్పకుండా వెళ్లాలి అనే ఒత్తిడి చేయకండి. ప్రశాంతంగా రూపొందించండి. ముందు ఇంకా చాలా సమయం ఉంది. అందుకే ఈ సంవత్సరం లేదా ఈ సీజన్లో ఒకసారి విదేశాలకు చక్కర్లు వేయండి, తరువాత మరొక సమయంలో రెండవసారి చక్కర్లు వేయండి. అప్పుడు ప్రశాంతంగా, స్నేహంతో, సేవకు మరియు దాదీల ఆరోగ్యానికి బ్యాలెన్స్ ఉంచండి. అర్థమైందా! కాబట్టి రెండవ సీజన్ ప్లాన్ ఇదే. మిగతాది తర్వాత చూద్దాము. ఎందుకంటే ప్రస్తుత సమయంలో దేశంలో అయినా, విదేశాలలో అయినా కల్లోలం జరగాల్సిందే. కాబట్టి ఎంత సేవా ఛాన్స్ తీసుకోగలరో అంత తీసుకోండి. అర్థమైందా!
(డ్రిల్) ఒక్క క్షణంలో అశరీరిగా అవ్వటము - ఈ పాఠం పక్కాగా ఉందా? ఇప్పుడిప్పుడే విస్తారములో, ఇప్పుడిప్పుడే సారములో ఇమిడిపోండి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు) అచ్ఛా - ఈ అభ్యాసాన్ని సదా తోడుగా పెట్టుకోండి.
నలువైపులా ఉన్న ప్రశ్నచిత్తుల నుండి పరివర్తన అయ్యే వారందరికీ, సదా ప్రసన్నచిత్త పర్సనాలిటీ కల శ్రేష్ఠాత్మలకు, సదా తమ విజయము మరియు జన్మ సిద్ధ అధికారం యొక్క స్మృతిలో ఉండేవారికి, స్మృతి స్వరూప విశేషాత్మలకు, సదా సఫలం చేయటం ద్వారా సహజంగా సఫలతను అనుభవం చేసేవారికి, తండ్రికి సమీపంగా ఉండే ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. నలువైపులా డబల్ విదేశీయులైన 10 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారికి కూడా విశేష అభినందనలు మరియు ప్రియస్మృతులు.
దాదీలతో:- పరివారము యొక్క శిరోకిరీటాలైన నిమిత్త ఆత్మలైన మీ కొరకు బాప్‌దాదాకు సదా ఈ సంకల్పము ఉంటుంది - ‘‘సదా జీవిస్తూ ఉండండి, ఎగురుతూ ఉండండి మరియు ఎగిరేలా చేస్తూ ఉండండి’’. మీ యోగము యొక్క తపస్య శక్తితో శరీరాలనైతే నడిపిస్తున్నారు కానీ మీకంటే కూడా ఎక్కువగా బాప్‌దాదాకు చింత ఉంటుంది, అందుకే సమయానుసారంగా ఇప్పుడు ఎక్కువ వేగంగా తిరగకండి. ప్రశాంతంగా వెళ్ళండి మరియు రండి. ఎందుకంటే ప్రపంచంలోని పరిస్థితులు కూడా వేగంగా మారుతున్నాయి, అందుకే బాప్‌దాదా సేవ చేయడానికి వద్దు అని చెప్పడం లేదు, కానీ బ్యాలెన్స్. అందరి ప్రాణాలు మీ శరీరాలలో ఉన్నాయి, తనువు బాగుంటే సేవ కూడా బాగా జరుగుతూ ఉంటుంది కనుక సేవను బాగా చేయండి కానీ ఎక్కువ కష్టపెట్టకండి, కొద్దిగా చేయండి. ఎక్కువ కష్టపెడితే ఏమవుతుంది? బ్యాటరీ స్లో అయిపోతుంది, అందుకే ఇప్పటి నుండే బ్యాలెన్స్ పెట్టడం అవసరము. ఈ సంవత్సరమైతే చేసేద్దాము, వచ్చే సంవత్సరానికి ఏమవుతుందో తెలియదు అని ఆలోచించకండి, అలా కాదు. జీవించాలి మరియు ఎగిరేలా చేయాలి. ఇప్పుడైతే మీ పాత్ర ఉంది కదా? కనుక మీ పాత్రను అర్థం చేసుకుని శ్రమించండి కానీ బ్యాలెన్స్ పెడుతూ శ్రమించండి. సరేనా. వేగంగా చేయకండి, రెండు రోజులు ఇక్కడ ఉంటే మూడో రోజు అక్కడ ఉండటం, అలా కాదు. ఇప్పుడు సమయము అది కాదు. అటువంటి సమయం వచ్చినప్పుడు ఒకే రోజులో నాలుగు-నాలుగు స్థానాలకు కూడా వెళ్ళవలసి ఉంటుంది, కానీ ఇప్పుడు కాదు. అచ్ఛా!
(సభతో) మీ అందరి అభిప్రాయం ఏమిటి? సరే కదా? (నిర్మలా అక్కయ్యతో) మంచిది, నలువైపులా ఏషియాను బాగా సంభాళించారు. సేవ యొక్క పాత్రను కూడా బాగా పోషించారు. యూరప్ అయినా, ఆస్ట్రేలియా అయినా, ఆఫ్రికా అయినా... అందరూ చాలా బాధ్యతతో పాత్రను పోషించారు. ఎంత అటెన్షన్ ఇచ్చారో, దాని ప్రత్యక్ష ఫలంగా సఫలత కూడా లభించింది. ఆస్ట్రేలియావారి డ్యూటీ కాబట్టి వారే చేశారు అని కాదు. నలువైపులా ఉన్న డబల్ విదేశీయులందరూ మంచి మంచి ఆత్మలను మధుబన్ వరకు తీసుకువచ్చి సఫలతను పొందారు. బ్యాక్‌బోన్‌గా అందరూ సహయోగులుగా ఉన్నారు మరియు ఎల్లప్పుడూ అలాగే ఉండాలి.
(ఈసారి జర్మనీ నుండి చాలా మంది వచ్చారు) మంచిది. ఆస్ట్రేలియావారు ప్రత్యక్ష పరివర్తన స్వరూపాన్ని చూపించినట్లే, జర్మనీవారు కూడా అటువంటి ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించాలి. ప్రతి సెంటర్ అన్నింటికంటే మంచిగా ఉండాలి మరియు సంఖ్యలో కూడా నంబర్‌వన్‌గా ఉండాలి. ఇప్పుడు జర్మనీ కమాల్‌ను చూస్తాము. మొత్తం బ్రాహ్మణ కుటుంబం యొక్క దృష్టి జర్మనీపై ఉంది. ఎందుకంటే భవిష్యత్తులో జర్మనీ చాలా సహయోగిగా అవుతుంది. ఇప్పుడూ సహయోగిగానే ఉంది, అభినందనలు. ఇప్పుడు ఎవరూ చేయని అద్భుతాన్ని చేసి చూపించాలి, లండన్ కూడా చేయనిది.
(లండన్వారు త్యాగం చేశారు, సుదేశ్ అక్కయ్యను అక్కడ సేవకు పంపించారు) ఇది త్యాగం కాదు, భాగ్యం. లండన్వారు తమ భాగ్యాన్ని తయారుచేసుకున్నారా లేక త్యాగం చేశారా? ఏది నేర్పించారో దాని ఫలాన్ని కూడా ఇవ్వాలి కదా! ఆ ఫలం ఏమిటంటే ఇతరులకు సహయోగం ఇవ్వడం. ఇవన్నీ లండన్‌కు చెందిన గదులే కదా! లండన్ హాల్, మిగతావన్నీ గదులు. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి. సంతోషంగా ఉన్నారు కదా? అచ్ఛా.
టీచర్లు చేతులు ఎత్తండి. చాలా మంది ఉన్నారు. (ఈరోజు వెనుక కూర్చున్నారు) దూరంగా ఉన్నప్పటికీ సమీపంగా ఉన్నారు. శరీరంతో దూరంగా ఉన్నారు, కానీ హృదయంతో చాలా సమీపంగా ఉన్నారు. టీచర్లు బాగా శ్రమ చేస్తున్నారు. నలువైపులా ఉన్న టీచర్లు శ్రమ మరియు ధైర్యము యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపిస్తున్నారు. అచ్ఛా.
జయంతి అక్కయ్య (లండన్), మోహిని అక్కయ్య (అమెరికా):- (బాబాకు థ్యాంక్స్) పిల్లల ధైర్యము మరియు బాబా సహాయం. మొదటి అడుగు పిల్లల ధైర్యము, పదమారెట్లు బాబా సహాయం. మంచి బాధ్యతను తీసుకున్నారు మరియు ఇకముందు కూడా పెరుగుతూనే ఉంటుంది. బాగా నడుస్తోంది, ప్లాన్‌ను మంచిగా తయారుచేశారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
