‘‘సేవలతోపాటు అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా అవ్వండి’’
ఈరోజు అనంతమైన తండ్రి తమ అనంతమైన సదా సహయోగీ సహచరులను చూస్తున్నారు. నలువైపుల ఉన్న సదా సహయోగీ పిల్లలు, సదా తండ్రి హృదయంలో ఉండే హృదయ సింహాసనాధికారులుగా ఉంటారు. నిరాకార తండ్రికి తనకంటూ అకాల సింహాసనము కూడా లేదు, కానీ పిల్లలైన మీకు ఎన్ని సింహాసనాలు ఉన్నాయి? బాప్‌దాదా హృదయ సింహాసనాధికారి పిల్లలను చూసి సదా హర్షితముగా ఉంటారు - వాహ్, నా హృదయ సింహాసనాధికారి పిల్లలూ! పిల్లలు తండ్రిని చూసి సంతోషిస్తారు, మీరందరూ బాప్‌దాదాను చూసి సంతోషిస్తారు కానీ బాప్‌దాదా ఎంతమంది పిల్లలను చూసి సంతోషిస్తారు, ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ విశేషాత్మలు. చివరి నంబరులో ఉన్నవారైనా కానీ, విశేషంగా కోట్లల్లో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా కొద్దిమందిగా ఉన్నవారి లిస్టులో ఉన్నారు. కనుక ఒక్కొక్క బిడ్డను చూసి తండ్రికి ఎక్కువ సంతోషముందా లేక మీకు ఉందా? (ఇద్దరికీ) తండ్రికి ఎంతమంది పిల్లలు ఉన్నారు! ఎంతమంది పిల్లలో అంత సంతోషము. మీకు కేవలం డబల్ సంతోషమే ఉంటుంది, అంతే. మీకు పరివారపు సంతోషము కూడా ఉంటుంది. కానీ తండ్రి సంతోషము సదాకాలికమైనది, మరి మీ సంతోషము సదాకాలికమైనదా లేక ఒక్కోసారి కింద-మీద అవుతుందా?
బ్రాహ్మణ జీవితము యొక్క శ్వాస సంతోషము అని బాప్‌దాదా భావిస్తారు. సంతోషము లేదంటే బ్రాహ్మణ జీవితమే లేదు, అది కూడా అవినాశీ సంతోషము ఉండాలి, అప్పుడప్పుడు ఉండేది కాదు, పర్సెంటేజ్లో ఉండేది కాదు. సంతోషమంటే సంతోషమే. ఈ రోజు 50 శాతం సంతోషం ఉంది, రేపు 100 శాతం సంతోషం ఉందంటే జీవిత శ్వాస కింద-మీద అవుతున్నట్లు కదా! శరీరము పోయినా కానీ సంతోషము పోకూడదు అని బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు. మరి ఈ పాఠము సదా పక్కాగా ఉందా లేక కొద్ది-కొద్దిగా కచ్చాగా ఉందా? సదా అండర్లైన్ చేయబడి ఉందా? అప్పుడప్పుడు సంతోషములో ఉండేవారు ఏమవుతారు? సదా సంతోషములో ఉండేవారు పాస్ విత్ ఆనర్లుగా అవుతారు మరియు అప్పుడప్పుడు సంతోషములో ఉండేవారు ధర్మరాజుపురిని దాటాల్సి ఉంటుంది. పాస్ విత్ ఆనర్ అయ్యేవారు ఒక్క క్షణంలో తండ్రితోపాటు వెళ్తారు, ఆగరు. మరి మీరందరూ ఎవరు? తోడుగా వెళ్ళేవారా లేక అగిపోయేవారా? (తోడుగా వెళ్ళేవారము) మరి అటువంటి చార్ట్ ఉందా? ఎందుకంటే విశేషంగా డైమండ్ జూబిలీ సంవత్సరములో బాప్‌దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరి పట్ల ఏ శుభమైన ఆశ ఉందో తెలుసు కదా?
బాప్‌దాదా పిల్లలందరి చార్టును చూసారు. అందులో ఏం చూసారంటే - వర్తమాన సమయమనుసారంగా ఒక విషయంలో ఇంకా ఎక్కువ అటెన్షన్ అవసరము. సేవలో చాలా ఎక్కువ ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తున్నారు మరియు డైమండ్ జూబిలీలో విశేషంగా సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయి, ఇందులో పాస్ అయ్యారు. ప్రతి ఒక్కరూ యథాశక్తి సేవ చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు విశేషంగా ఏం కావాలి. సమయం సమీపంగా ఉంది కనుక సమయం యొక్క సమీపత అనుసారంగా ఇప్పుడు ఏ అల ఉండాలి? (వైరాగ్యము) ఏ వైరాగ్యము - హద్దు వైరాగ్యమా లేక అనంతమైన వైరాగ్యమా? సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు ఎంతగా ఉన్నాయో, అంతగానే సమయం యొక్క ఆవశ్యకత అనుసారంగా స్వ స్థితిలో అనంతమైన వైరాగ్యము ఎంతవరకు ఉంది? ఎందుకంటే మీ సేవలో సఫలత ఏమిటంటే - త్వరత్వరగా ప్రజలు తయారవ్వటము, అందుకే సేవ చేస్తారు కదా? కనుక ఎప్పటివరకైతే నిమిత్త ఆత్మలైన మీలో అనంతమైన వైరాగ్య వృత్తి ఉండదో, అప్పటివరకు ఇతర ఆత్మలలో కూడా వైరాగ్య వృత్తి కలగదు మరియు ఎప్పటివరకైతే వైరాగ్య వృత్తి ఉండదో, అప్పటివరకు తండ్రి పరిచయం లభించాలని మీరు ఏదైతే కోరుకుంటున్నారో, అది లభించదు. అనంతమైన వైరాగ్యము సదాకాలిక వైరాగ్యము. ఒకవేళ సమయమనుసారంగా లేక పరిస్థితుల అనుసారంగా వైరాగ్యము వస్తే, అప్పుడు సమయము నంబర్‌వన్ అయినట్లు మరియు మీరు రెండవ నంబరు అయినట్లు. పరిస్థితి లేక సమయము వైరాగ్యాన్ని కలిగించాయి. పరిస్థితి గడిచిపోతే, సమయము దాటిపోతే వైరాగ్యము కూడా పోతుంది. మరి దీనిని ఏమంటారు - అనంతమైన వైరాగ్యమా లేక హద్దు వైరాగ్యమా? ఇప్పుడు అనంతమైన వైరాగ్యము కావాలి. ఒకవేళ వైరాగ్యము ఖండితమైతే దానికి ముఖ్యమైన కారణము - దేహభానము. ఎప్పటివరకైతే దేహభానము పట్ల వైరాగ్యము ఉండదో, అప్పటివరకు ఏ విషయం యొక్క వైరాగ్యమైనా సదాకాలికముగా ఉండదు, అల్పకాలికముగానే ఉంటుంది. సంబంధాలలో వైరాగ్యము ఉండటము - ఏమంత గొప్ప విషయము కాదు, ఈ విషయములో ప్రపంచములోని చాలామందికి మనసులో నుండి వైరాగ్యము వస్తుంది. కానీ ఇక్కడ దేహభానము యొక్క రకరకాల రూపాలేవైతే ఉన్నాయో, ఆ రకరకాల రూపాల గురించైతే తెలుసు కదా? దేహభానము యొక్క రూపాలు ఎన్ని ఉన్నాయో, వాటి విస్తారమైతే మీకు తెలుసు కానీ ఈ అనేక దేహభానపు రూపాలను తెలుసుకుని అనంతమైన వైరాగ్యంలో ఉండండి. దేహభానము దేహీ-అభిమానములోకి మారిపోవాలి. దేహభానము ఏ విధంగా సహజమైపోయిందో, అలా దేహీ-అభిమానము సహజమైపోవాలి ఎందుకంటే ప్రతి విషయంలోనూ మొదటి మాటగా దేహమే వస్తుంది. సంబంధాలు అయినా దేహపు సంబంధాలే, పదార్థాలైనా దైహిక పదార్థాలే. కనుక మూల ఆధారము దేహభానము. ఎప్పటివరకైతే దేహభానము అనేది ఏదో ఒక రూపంలో ఉంటుందో, అప్పటివరకు వైరాగ్య వృత్తి ఏర్పడదు. బాప్‌దాదా ఏమి చూసారంటే - వర్తమాన సమయములో దేహభానమనే విఘ్నము ఏదైతే ఉందో, దానికి కారణమేమిటంటే - దేహము యొక్క పాత సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాటి పట్ల వైరాగ్యము లేదు. మొదట దేహము యొక్క పాత సంస్కారాల పట్ల వైరాగ్యం కావాలి. సంస్కారాలు స్థితిని కిందకు తీసుకొస్తాయి. సంస్కారాల కారణంగా సేవలో మరియు సంబంధ-సంపర్కాలలో విఘ్నాలు కలుగుతాయి. కనుక రిజల్టులో ఏం చూసామంటే - దేహము యొక్క పాత సంస్కారాలపై ఎప్పటివరకైతే వైరాగ్యము రాదో, అప్పటివరకు అనంతమైన వైరాగ్యము సదా ఉండదు. సంస్కారాలు రకరకాల రూపాలలో తమవైపుకు ఆకర్షిస్తాయి. కనుక ఎక్కడైతే ఏ విధమైన ఆకర్షణ అయినా ఉంటుందో, అక్కడ వైరాగ్యము ఉండలేదు. కనుక చెక్ చేసుకోండి - నేను నా పాత మరియు వ్యర్థ సంస్కారాల నుండి విముక్తునిగా ఉన్నానా? ఎంత ప్రయత్నించినా కానీ, ప్రయత్నిస్తున్నారు కూడా - వైరాగ్య వృత్తిలో ఉండాలి అని, కానీ సంస్కారాలు అనేవి కొద్దిమంది వద్ద లేక మెజారిటీ వద్ద ఏదో ఒక రూపంలో ఎంత ప్రబలంగా ఉన్నాయంటే, అవి తమవైపుకు ఆకర్షిస్తాయి. కనుక ముందుగా పాత సంస్కారాల పట్ల వైరాగ్యము కలగాలి. సంస్కారాలు అనేవి వద్దనుకున్నా ఇమర్జ్ అవుతాయి, ఎందుకు? అలా జరగాలని కోరుకోరు కానీ అవి ఇమర్జ్ అవుతాయి, ఎందుకంటే సూక్ష్మంగా సంస్కారాలను భస్మం చెయ్యలేదు. ఎక్కడో ఒక చోట అంశమాత్రంగా ఉండిపోయాయి, దాగి ఉన్నాయి. అవి సమయానికి వద్దనుకున్నా కూడా ఇమర్జ్ అవుతాయి. అప్పుడిక ఏమంటారంటే - అలా అవ్వాలని కోరుకోలేదు కానీ ఏం చెయ్యాలి, అలా అయిపోయింది, అలా అవుతూ ఉంటుంది... ఇలా ఎవరు మాట్లాడుతారు? దేహభానము కలవారా లేక దేహీ-అభిమానము కలవారా?
కనుక బాప్‌దాదా చూసారు - సంస్కారాల పట్ల వైరాగ్య వృత్తి ఉండటంలో బలహీనంగా ఉన్నారు. వాటిని సమాప్తం చేసారు కానీ అంశము కూడా మిగలకూడదు అనే విధంగా సమాప్తం చెయ్యలేదు. ఎక్కడైతే అంశము ఉంటుందో, అక్కడ వంశము అనేది తప్పకుండా ఉంటుంది. ఈ రోజు అంశము ఉంది, అది సమయమనుసారంగా వంశము యొక్క రూపాన్ని ధరిస్తుంది. పరవశం చేసేస్తుంది. అనటానికైతే అందరూ అంటారు - తండ్రి ఏ విధంగా నాలెడ్జ్‌ఫుల్ (జ్ఞాన సంపన్నులు) గా ఉన్నారో, మేము కూడా అలా నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నాము అని. కానీ ఎప్పుడైతే సంస్కారాల దాడి జరుగుతుందో, అప్పుడు నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నట్లా లేక నాలెడ్జ్పుల్గా ఉన్నట్లా? ఎలా ఉన్నట్లు? నాలెడ్జ్‌ఫుల్‌గా అయ్యేందుకు బదులుగా నాలెడ్జ్పుల్గా అవుతారు. (నాలెడ్జ్పుల్ అనగా జ్ఞానాన్ని తీసుకునేవారు) ఆ సమయంలో ఎవరిని అడిగినా ఏమంటారంటే - అవును, అలా అవ్వకూడదు, చెయ్యకూడదు అని నేను కూడా అనుకుంటున్నాను, కానీ అలా అయిపోతుంది. మరి నాలెడ్జ్‌ఫుల్‌గా అయినట్లా లేక నాలెడ్జ్పుల్గా అయినట్లా? ఎవరైతే నాలెడ్జ్‌ఫుల్‌గా ఉంటారో, వారిపై ఎటువంటి సంస్కారాలు, సంబంధాలు, పదార్థాలు దాడి చేయవు.
డైమండ్ జూబిలీని జరుపుకుంటున్నారు, డైమండ్ జూబిలీ అంటే అర్థము – డైమండ్గా అవ్వటము అనగా అనంతమైన వైరాగులుగా అవ్వటము. ఎంతగా అయితే సేవల ఉల్లాసము ఉందో, అంతగా వైరాగ్య వృత్తి పట్ల అటెన్షన్ లేదు. ఇందులో నిర్లక్ష్యము ఉంది. నడుస్తుంది... అవుతుంది... అయిపోతుందిలే... సమయం వచ్చినప్పుడు బాగైపోతుంది... మరి సమయం మీ శిక్షకుడా లేక బాబా శిక్షకుడా? ఎవరు? ఒకవేళ సమయం వచ్చినప్పుడు పరివర్తన జరిగితే, సమయము మీ శిక్షకునిగా అయినట్లు, మీ రచనయే మీకు శిక్షకునిగా అయితే, అది బాగుంటుందా? కనుక ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏమంటారు? సమయానికి సరిదిద్దుకుంటాను, అయిపోతుందిలే అని అంటారు. చింతించకండి, అయిపోతుంది, సమయము వచ్చినప్పుడు పూర్తిగా ముందుకు వెళ్ళిపోతాము అని తండ్రికి కూడా ఓదార్పును, ధైర్యాన్నీ ఇస్తారు. కావున సమయాన్ని శిక్షకునిగా చేసుకోవటము - ఇది మాస్టర్ రచయితలైన మీకు శోభిస్తుందా? మంచిగా అనిపిస్తుందా? అనిపించదు. సమయము రచన, మీరు మాస్టర్ రచయితలు. మరి రచన మాస్టర్ రచయితలకు శిక్షకునిగా అవ్వటము, ఇది మాస్టర్ రచయితలకు శోభించదు. కనుక ఇప్పుడు బాప్‌దాదా ఇచ్చిన సమయం ఏదైతే ఉందో, ఇందులో వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చేయండి ఎందుకంటే సేవ యొక్క పెనుగులాటలో వైరాగ్య వృత్తి సమాప్తమైపోతుంది. మామూలుగానైతే సేవలో సంతోషము కూడా లభిస్తుంది, శక్తి కూడా లభిస్తుంది మరియు ప్రత్యక్ష ఫలం కూడా లభిస్తుంది కానీ అనంతమైన వైరాగ్య వృత్తి సమాప్తం అవ్వడమనేది కూడా సేవలోనే జరుగుతుంది, అందుకే ఇప్పుడు మీ లోపల ఈ వైరాగ్య వృత్తిని మేల్కొలపండి. కల్పపూర్వం కూడా మీరే తయారయ్యారా లేక ఇంకెవరైనానా? మీరే కదా. అది కేవలము మర్జ్ అయ్యి ఉంది, దానిని ఇమర్జ్ చెయ్యండి. సేవ ప్లాన్లు కూడా ప్రాక్టికల్‌లో ఇమర్జ్ చేసినప్పుడే సఫలత లభిస్తుంది కదా. అలాగే ఇప్పుడు అనంతమైన వైరాగ్య వృత్తిని ఇమర్జ్ చెయ్యండి. ఎన్ని సాధనాలు ప్రాప్తించినా కానీ, సాధనాలైతే మీకు రోజురోజుకు ఎక్కువగానే లభిస్తాయి కానీ అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క సాధన మర్జ్ అవ్వకూడదు, ఇమర్జ్ అయి ఉండాలి. సాధనాలు మరియు సాధన యొక్క బ్యాలెన్స్ ఉండాలి, ఎందుకంటే మున్ముందు ప్రకృతి మీకు దాసిగా అవుతుంది. గౌరవం లభిస్తుంది, స్వమానం లభిస్తుంది. కానీ అన్నీ ఉంటూ కూడా వైరాగ్య వృత్తి తగ్గకూడదు. కావున అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క వాయుమండలాన్ని స్వయంలో అనుభవం చేస్తున్నారా లేక సేవలో బిజీ అయిపోయారా? ఏ విధంగానైతే ప్రపంచంలోనివారికి సేవల ప్రభావం కనిపిస్తుంది కదా, అలా అనంతమైన వైరాగ్య వృత్తి యొక్క ప్రభావము కనిపించాలి. ఆదిలో మీ అందరి స్థితి ఎలా ఉండేది? కరాచీలో ఉండేటప్పుడు, బయట సేవలేమీ ఉండేవి కావు, సాధనాలు ఉండేవి కానీ అనంతమైన వైరాగ్య వృత్తి కల వాయుమండలము సేవను పెంచింది. కనుక డైమండ్ జూబిలీ వారు ఎవరైతే ఉన్నారో, వారిలో ఆది సంస్కారాలు ఉన్నాయి, అవి ఇప్పుడు మర్జ్ అయ్యాయి. ఇప్పుడు మళ్ళీ ఈ వృత్తిని ఇమర్జ్ చెయ్యండి. ఆది రత్నాల యొక్క అనంతమైన వైరాగ్య వృత్తి స్థాపన చేసింది. ఇప్పుడు కొత్త ప్రపంచ స్థాపన కొరకు మళ్ళీ అదే వృత్తిని, అదే వాయుమండలాన్ని ఇమర్జ్ చెయ్యండి. మరి ఇప్పుడు ఏమి అవసరమో విన్నారా?
సాధనాలే లేనప్పుడు మాకు వైరాగ్యము ఉంది అని అంటే ఎవరు అంగీకరిస్తారు? సాధనాలు ఉన్నా కూడా వైరాగ్యం ఉండాలి. ముందున్న సాధనాలకు మరియు ఇప్పటి సాధనాలకు ఎంత తేడా ఉంది? సాధన దాగిపోయింది మరియు సాధనాలు ప్రత్యక్షమయ్యాయి. సాధనాలను విశాల హృదయంతో ఉపయోగించండి, మంచిదే, ఎందుకంటే సాధనాలు మీ కోసమే ఉన్నాయి, కానీ సాధనను మర్జ్ చెయ్యకండి. పూర్తి బ్యాలెన్స్ ఉండాలి. ఏ విధంగా ప్రపంచంలోని వారికి - కమలపుష్ప సమానంగా అవ్వండి అని చెప్తారో, అలానే సాధనాలు ఉంటూ కూడా కమలపుష్ప సమానంగా అవ్వండి. సాధనాలు చెడ్డవి కావు, సాధనాలు అనేవి మీ కర్మ మరియు యోగము యొక్క ఫలము, కానీ ఇక్కడ ఇది వృత్తికి సంబంధించిన విషయము. సాధనాల ప్రవృత్తిలో, సాధనాలకు వశమై చిక్కుకుపోరు కదా? కమలపుష్ప సమానంగా అతీతంగా మరియు తండ్రికి ప్రియమైనవారిగా ఉండాలి. వాటిని ఉపయోగిస్తూ కూడా వాటి ప్రభావంలోకి రాకూడదు, అతీతంగా ఉండాలి. సాధనాలు అనేవి అనంతమైన వైరాగ్య వృత్తిని మర్జ్ చెయ్యకూడదు. ఇప్పుడు విశ్వము అతిలోకి వెళ్తుంది కనుక ఇప్పుడు సత్యమైన వైరాగ్య వృత్తి యొక్క అవసరముంది మరియు అటువంటి వాయుమండలాన్ని తయారుచేసేవారు మీరే - ముందుగా స్వయంలో, ఆ తర్వాత విశ్వంలో.
మరి డైమండ్ జూబిలీ వారు ఏం చేస్తారు? అలను వ్యాపింపజేస్తారు కదా? మీరైతే అనుభవజ్ఞులు. ప్రారంభంలోని అనుభవము ఉంది కదా! అన్నీ ఉండేవి, తినగలిగినంత దేశీ నేతిని తినవచ్చు, అయినా కూడా అనంతమైన వైరాగ్య వృత్తి ఉండేది. ప్రపంచములోనివారైతే దేశీ నేతిని తింటారు కానీ మీరైతే త్రాగేవారు. నేతి నదులను చూసారు. డైమండ్ జూబిలీ వారు విశేష కార్యము చెయ్యాలి - పరస్పరం కలిసి ఆత్మిక సంభాషణ చేసుకోండి. ఏ విధంగా సేవా మీటింగ్ చేస్తారో, అలా ఈ మీటింగ్ చేయండి. బాప్‌దాదా ఏదైతే క్షణంలో అశరీరిగా అవ్వాలని చెప్తారో, కోరుకుంటారో - దానికి పునాది ఈ అనంతమైన వైరాగ్య వృత్తి, అది లేకపోతే ఎంతగా ప్రయత్నించినా కానీ ఒక్క క్షణంలో అవ్వలేరు, యుద్ధం చెయ్యటంలోనే గడిచిపోతుంది. ఎక్కడైతే వైరాగ్యం ఉంటుందో, అక్కడ ఈ వైరాగ్యం అనేది యోగ్యమైన ధరణి వంటిది, అందులో ఏది వేసినా దాని ఫలం వస్తుంది. కనుక ఏం చెయ్యాలి? ఇప్పుడు మేము కూడా వైరాగ్య వృత్తిలోకి వెళ్ళాలి అని అందరికీ అనిపించాలి. అచ్ఛా, ఏం చెయ్యాలో అర్థమైందా? సహజమా లేక కష్టమా? కొద్దిగా-కొద్దిగా ఆకర్షణ ఉంటుందా, ఉండదా? సాధనాలు వాటివైపుకు ఆకర్షించవా?
ఇప్పుడు ఈ అభ్యాసము కావాలి - ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా - స్థితిని క్షణములో సెట్ చెయ్యగలగాలి. సేవలోకి రావాలంటే సేవలోకి రావాలి. సేవ నుండి అతీతులుగా అవ్వాలంటే అతీతులుగా అవ్వాలి. సేవ మమ్మల్ని లాగుతుంది, సేవ లేకుండా ఉండలేము అన్నట్లు ఉండకూడదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా ఉండడానికి విల్ పవర్ కావాలి. విల్ పవర్ ఉందా? స్టాప్ అంటే స్టాప్ అవ్వాలి. పెట్టాలనుకుంటున్నది స్టాప్ కానీ అది ప్రశ్నార్థకంగా మారిపోవడం అనేది జరగకూడదు. ఫుల్స్టాప్. స్టాప్ కూడా కాదు, ఫుల్స్టాప్. ఏది అనుకుంటే దానిని ప్రాక్టికల్‌లో చెయ్యగలగాలి. చెయ్యాలనుకుంటాము, కానీ జరగటము కష్టము అని అంటే దానినేమంటారు? విల్ పవరా లేక పవరా? వ్యర్థము సమాప్తమవ్వాలి అని సంకల్పం చేసారంటే క్షణంలో సమాప్తమైపోవాలి.
బాప్‌దాదా వినిపించారు కదా, కొంతమంది పిల్లలు ఏమంటారంటే - మేము యోగంలో కూర్చుంటాము కానీ యోగానికి బదులుగా యుద్ధములో ఉంటాము. యోగీలుగా ఉండరు, యోధులుగా ఉంటారు. ఒకవేళ యుద్ధం చేసే సంస్కారం చాలా కాలం ఉన్నట్లయితే ఏమవుతారు? సూర్యవంశీయులుగానా లేక చంద్రవంశీయులుగానా? ఆలోచించగానే అయిపోవాలి. ఆలోచించటము మరియు అవ్వటము అనేది ఒక్క క్షణంలో జరగాలి, దీనినే విల్ పవర్ అని అంటాము. విల్ పవర్ ఉందా లేదంటే ప్లాన్లు చాలా మంచిగా తయారుచేస్తారు కానీ 10 ప్లాన్లు తయారుచేస్తే, ప్రాక్టికల్‌లో 5 జరుగుతాయి, ఇలా అయితే జరగటం లేదు కదా? ఇది చేస్తాము, ఇది అవుతుంది, అది అవుతుంది అని చాలా మంచిగా ఆలోచిస్తారు కానీ ప్రాక్టికల్లోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు ఎటువంటి విల్ పవర్ ఉండాలంటే సంకల్పము చెయ్యగానే కర్మల్లో ప్రాక్టికల్‌గా జరిగే ఉంది అన్నట్లు ఉండాలి, ఇటువంటి అనుభవం ఉండాలి. ఏమి గమనించటం జరిగిందంటే - అమృతవేళ తండ్రితో ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలా మంచి-మంచి మాటలు మాట్లాడుతారు, ఇది చేస్తాము, అది చేస్తాము... అని అంటారు. కానీ రాత్రి అయ్యేసరికి రిజల్టు ఏముంటుంది? తండ్రిని చాలా సంతోషపెడతారు, ఎంత మధురాతి-మధురమైన విషయాలను మాట్లాడుతారు, ఎంత మంచి-మంచి విషయాలను మాట్లాడుతారు, వాహ్ నా పిల్లలూ అంటూ తండ్రి కూడా సంతోషిస్తారు! బాబా, మీరు ఏదైతే చెప్పారో అది జరగాల్సిందే, అది జరిగే ఉంది అని అంటారు. చాలా మంచి-మంచి విషయాలు మాట్లాడుతారు. కొంతమంది పిల్లలు తండ్రికి ధైర్యాన్నీ, ఓదార్పును ఇస్తారు - బాబా, మేము కాకపోతే ఇంకెవరు తయారవుతారు, బాబా, కల్పకల్పము మేమే తయారయ్యాము కదా అని అంటూ సంతోషపడిపోతారు.
(హాల్లో వెనుక కూర్చున్నవారితో) వెనుక కూర్చున్నవారు బాగా వింటున్నారు కదా?
ముందున్నవారికంటే మొదటగా వెనుక ఉన్నవారు చేస్తారా? కూర్చున్నది వెనుకనే కానీ అందరికంటే సమీపంగా మనసులో ఉన్నారు. ఎందుకు? ఇతరులకు ఛాన్స్ ఇచ్చే సేవ చేసారు కదా! కనుక సేవాధారులు సదా తండ్రి మనసులో ఉంటారు. మేము కూడా ఒకవేళ దాదీలుగా ఉన్నట్లయితే కాస్త... అని ఇలా ఎప్పుడూ ఆలోచించవద్దు. ఎదురుగా ఏంటి, హృదయంలోనే ఉన్నారు. మరియు హృదయం కూడా సాధారణమైనది కాదు, అది సింహాసనము. కనుక హృదయ సింహాసనాధికారులు కదా. ఎక్కడ కూర్చున్నా సరే, ఈ మూలలో కూర్చున్నా, కింద కూర్చున్నా, క్యాబిన్లో కూర్చున్నా... హృదయంలో ఉన్నారు. అచ్ఛా!
అందరూ డైమండ్ జూబిలీ జరుపుకోవడానికి పరుగెత్తుకుంటూ వచ్చారా? అయితే కేవలం దాదీలే డైమండ్‌లా లేక మీరు కూడా డైమండ్లేనా? మీరు కూడా డైమండ్లే కదా! నిమిత్తమైన ఆది రత్నాల జూబిలీని జరుపుకుంటున్నారు, కానీ ముందుగా మీరు. అచ్ఛా, డైమండ్ జూబిలీ వారు చేతులు ఎత్తండి. వీరి డైమండ్ జూబిలీని మీరు జరుపుకుంటున్నారు, కానీ మీరు లేకపోతే జరుపుకునేవారు ఎవరు? జరుపుకునేవారి వల్లనే శోభ ఉంటుంది. కాబట్టి అందరికీ జరుపుకోవడంలో సంతోషం ఉంది. ఎందుకంటే వీరి డైమండ్ జూబిలీ జరగడం అంటే మన నంబర్ వచ్చేసింది అని భావిస్తున్నారు. వీరు నిస్వార్థ సేవాధారులు. అందుకే వారిని చూసి సంతోషం కలుగుతుంది, ఈర్ష్య కలగదు - వీరిదే ఎందుకు జరుపుతున్నారు, మాది ఎందుకు కాదు అని. వీరిదే ఎందుకు జరుపుతున్నారు అని ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నారా? కాదు. చాలా సంతోషంగా ఉంది. ఇది ఆదికాల రత్నాల త్యాగానికి లభించిన భాగ్యం. అందుకే ఎవరికీ ఈర్ష్య కలగదు, సంతోషమే కలుగుతుంది. సమానంగా పోటీ పడేవారు ఉంటే, ఎవరికైనా ఈర్ష్య కలుగవచ్చు - మేమూ ఉన్నాము, మేమూ ఉన్నాము అని. కానీ ఇది వీరి త్యాగానికి లభించిన భాగ్యం. అందుకే ఎవరికీ ఈర్ష్య కలగదు. చూడండి, వీరి త్యాగమే మీ అందరినీ తీసుకొచ్చింది. వీరు నిమిత్తులు కాకపోయి ఉంటే, విదేశాలలో కూడా ఆది రత్నాలు నిమిత్తులు కాకపోయి ఉంటే, మీరు ఎలా జన్మించేవారు? కాబట్టి చాలా బాగా, ఎంతో ఘనంగా జరుపుకోండి. బాప్‌దాదా కూడా సంతోషంగా ఉన్నారు. అచ్ఛా.
10 సంవత్సరాల వారి జూబిలీని కూడా జరుపుకుంటూనే ఉన్నారు. డబల్ విదేశీయులది జరుపుకున్నారు కదా! ఇప్పుడు ఈ గ్రూపులో కూడా చాలామంది 10 సంవత్సరాల వారు ఉండవచ్చు. కాబట్టి 10 సంవత్సరాల వారైనా, 10 సంవత్సరాల కంటే పాతవారైనా, వారందరికీ బాప్‌దాదా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ జరుపుకుంటున్నారు. (అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు.) జరుపుకోవడం అంటే అందరి ఆశీర్వాదాలు పొందడం. ఈ చప్పట్లు కొట్టడం అంటే మీ అందరికీ అందరి ఆశీర్వాదాలు లభించాయి. మొదటిసారి వచ్చినవారు కూడా చాలా మంది ఉన్నారు. మొదటిసారి వచ్చిన మీ అందరికీ వేగంగా ముందుకు వెళ్లేందుకు ఆశీర్వాదాలు. మొదటిసారి వచ్చినవారైనా, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాల వారైనా, ప్రతి ఒక్క ఆత్మ ఈ బ్రాహ్మణ కుటుంబానికి విశేషమైన శోభ. ఒక్క రత్నం తగ్గినా శోభ ఉండదు. అందుకే బాప్‌దాదా ప్రతి పిల్లవాడినీ ఈ దృష్టితో చూస్తారు - ప్రతి ఒక్క రత్నం ఈ బ్రాహ్మణ కుటుంబానికి అలంకారం. మీరు అలంకారమే కదా! చాలా విలువైన అలంకారం. అందుకే ఇప్పటివరకు మీ జడచిత్రాలను ఎంతగా అలంకరిస్తూనే ఉన్నారు. చివరి జన్మ వరకు కూడా అలంకరణ జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి సంతోషం ఉందా? భగవంతునికి అలంకారంగా అవ్వడం చిన్న విషయమా!
అచ్ఛా, ఇప్పుడు ఎవరి డైమండ్ జూబిలీ జరుపుకుంటున్నారో ఆ ఆది రత్నాలను ఒక ప్రశ్న అడుగుతున్నాము. ఆది రత్నాలకు ఏ విషయం చాలా సహజంగా ఉంటుంది? ఇతరులకు కొంత సమయం పడుతుంది, కానీ ఆది రత్నాలకు చాలా సహజంగా, నేచురల్‌గా ఉంటుంది. ఆ విషయం ఏమిటి? సమాధానం చెప్పండి. (బాబాను తనవారిగా చేసుకోవడం.)
(సభతో) మీకు బాబాను తనవారిగా చేసుకోవడం సహజమా లేక కష్టమా? అచ్ఛా, తనవారిగా చేసుకున్నారా లేక ఇంకా చేసుకుంటున్నారా? చేసుకున్నారు - పక్కానా? లేక అప్పుడప్పుడు ఇలా భుజాన్ని వెనక్కి తీసుకుంటారా? నాజూకుతనం, నఖరాలు చూపించరు కదా! అప్పుడప్పుడు చాలా ఆటలు చూపిస్తారు. కాబట్టి బాబాను తనవారిగా చేసుకున్నారు. బాబాను తనవారిగా చేసుకోవడం అంటే సదా వారి తోడు మరియు హస్తం యొక్క అనుభవాన్ని పొందడం. కాబట్టి ఆది రత్నాలకు బాబా తోడును అనుభవించడం చాలా సహజం. ఎందుకంటే సాకారంలో తోడు యొక్క అనుభవం చేశారు. మీరు మళ్లీ దానిని ఇమర్జ్ చేసుకోవాలి. కానీ వీరు ప్రాక్టికల్‌గా, నీతోనే ఉండటం, తినడం, నడవడం, తిరగడం - ఇవన్నీ సాకారంలో ప్రత్యక్షంగా అనుభవించారు. కాబట్టి సాకారంలో అనుభవించిన విషయం సహజంగా గుర్తుంటుంది. బాబా తోడు యొక్క అనుభవాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవం చేసుకోగలగడం వీరి అదృష్టం. అలాగే కదా! కానీ డ్రామాలో మీ కోసం విశేషంగా ఒక లిఫ్ట్ ఉంది. అవ్యక్త రూపంలో వచ్చినవారు, డ్రామా ప్రకారం సాకార రూపంలో తరువాత వచ్చినవారికి ఒక ఎక్స్ట్రా లిఫ్ట్ ఉంది. ఆ లిఫ్ట్ ఏమిటి? మీరు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు బాప్‌దాదా యొక్క అదనపు సహాయం లభిస్తుంది. సంకల్పంలో ఒక అడుగు మీది, సహయోగంలో అనేక అడుగులు బాబావి. అందుకే మీకు ఎక్స్ట్రా లిఫ్ట్ ఉంది. అర్థమైందా? మీరు కూడా తక్కువేమీ కాదు. అచ్ఛా. ఆది రత్నాలకు బాప్‌దాదా నుండి సర్వ సంబంధాల ద్వారా పదమారెట్లు అభినందనలు, అభినందనలు.
నలువైపులా ఉన్న సింహాసనాధికారి శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మలకు, సదా అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారుచేసే విశేష ఆత్మలకు, సదా తమ శ్రేష్ఠ విశేషతలను కార్యములో పెట్టే విశేష ఆత్మలకు, సదా ఒక్క తండ్రి తోడును మరియు శ్రీమతమనే చేతిని అనుభవము చేసే సమీప ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీలతో:- అందరికంటే ఎక్కువ ఆశీర్వాదాలు మీకే లభిస్తాయి. ఈ నిమిత్త రత్నాలను అందరూ ఎందుకు ప్రేమిస్తారు? దానికి కారణం ఏమిటి? ఎందుకంటే వీరికి ప్రతి శ్వాసలో బాబాపై ప్రేమ ఉంది. ప్రతి శ్వాసలో బాబా, బాబా అనేదే ఉంటుంది కదా! అది సహజం, అందులో శ్రమ లేదు. శ్రమ చేయవలసిన అవసరం ఉండదు. వీరికి బాబాపై ఎంత ప్రేమ ఉందో, మీకు వీరిపై కూడా అంతే ప్రేమ ఉంది. ఎందుకంటే వీరు సాకారంలో నిమిత్తులు, బాబా సమానం. కొన్నిసార్లు ఎవరికైనా శిక్షణ ఇచ్చినా, ఆ సమయంలో కొందరికి మనసుకు అనిపించవచ్చు. కానీ, మనపై కళ్యాణ భావనతోనే ఈ శిక్షణ ఇచ్చారు అని తరువాత అనుకుంటారు. వారి భావన శుభమైనది. అందుకే ఆ శిక్షణ హృదయానికి తాకుతుంది. నిమిత్తులైన వారి ప్రత్యేక బ్యాక్‌బోన్ బాబాయే. మాటలు వీరివే అయినప్పటికీ, బ్యాక్‌బోన్ మాత్రం బాబాయే. వీరి నోటి నుండి ఎప్పుడూ ‘నేను’ అనే పదం రాదు. బాబా, బాబా అనే వస్తుంది. అదే వారి యోగానికి నిదర్శనం. ‘నేను’ అనేది బాబాలో లీనమైపోయింది. అచ్ఛా.
(ఈ రోజు 60 సంవత్సరాలు మీ పాలనలో గడిచాయని చాలా సంతోషంగా ఉంది)
సంతోషమే మీ శ్వాస. మీ సంతోషాన్ని ఎవరూ తీసుకోలేరు. ఎప్పుడైనా సంతోషం కోల్పోతారా? కొందరు ఆది రత్నాలు స్థాపనకు సంబంధించినవారు, మరికొందరు సేవా స్థాపనకు సంబంధించిన ఆది రత్నాలు. ఇద్దరికీ వారి వారి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీరు స్థాపనకు సంబంధించిన ఆది రత్నాలు, వారు సేవా స్థాపనకు సంబంధించిన ఆది రత్నాలు. మీరు స్థాపన చేశారు, కానీ సేవ యొక్క వృద్ధిని మాత్రం వీరే చేశారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
