‘‘క్రొత్త సంవత్సరములో అనుభవీ మూర్తులుగా అయ్యి అందరినీ అనుభవజ్ఞులుగా చెయ్యండి’’ (శాంతివనములోని డైమండ్ జూబిలీ హాల్ ప్రారంభోత్సవము సందర్భంగా)
ఈరోజు దృష్టితో తృప్తి పరిచే బాప్‌దాదా అతి స్నేహీలు, సహయోగులు మరియు స్నేహములో లవలీనమయ్యే పిల్లలైన మిమ్మల్నందరినీ చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకములో, హృదయంలో స్నేహము యొక్క ఋజువు కనిపిస్తూ ఉంది. (హాల్లో వెనుక ఉన్న సోదర-సోదరీలతో) మేము వెనుక ఉన్నాము కావున కనిపించము అని మీరు అనుకుంటారు కానీ బాప్‌దాదా నయనాలలో ఎంత అద్భుతమైన టి.వి. ఉందంటే దాని వలన దూరంలో ఉన్న వస్తువు కూడా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ, ఏ మూల కూర్చున్నా కానీ తండ్రి ఎదురుగా ఉన్నారు. ఎంతైనా ఇప్పుడైతే ప్రశాంతంగా కూర్చున్నారు కదా. (చప్పట్లు కొట్టారు) ఈరోజు చాలా ఉల్లాస-ఉత్సాహాలు మరియు సంతోషము ఉన్నాయి కదా, అది చప్పట్ల ద్వారా చూపిస్తున్నారు. కానీ బాప్‌దాదాకు మీ మనసులోని సంతోషము తెలుసు. బాప్‌దాదా చూస్తున్నారు - పిల్లలు ప్రతి ఒక్కరికీ సహయోగమనే ఋజువును ఇవ్వటంలో చాలా సంతోషము ఉంటుంది, అందుకే వేలాది భుజాలను చూపించారు. భుజాలు అనేవి సహయోగానికి గుర్తు. బాప్‌దాదాకు తెలుసు - పిల్లలు ప్రతి ఒక్కరూ నలువైపులా, అది దేశంలోనైనా లేక విదేశాలలోనైనా, అందరూ ధనం ద్వారానైనా, మనస్సు ద్వారానైనా, తనువు ద్వారానైనా సహయోగాన్ని తప్పకుండా ఇచ్చారు. మరియు మీ అందరి సహయోగానికి ఋజువుగా ఈరోజు మీరు ప్రశాంతంగా కూర్చుని చూస్తున్నారు కూడా, వింటున్నారు కూడా. ఇప్పుడు ఎక్కువ చప్పట్లు కొట్టకండి. మీ మనసులోని సంతోషం యొక్క చప్పట్లు బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి.
చూడండి, ఈరోజు రెండు విశేషతలు ఉన్నాయి. ఒకటేమో, అందరూ ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో తయారుచేసిన ఈ శాంతివనాన్ని బాప్‌దాదాతో పాటు పిల్లలైన మీరు కూడా ప్రారంభిస్తున్నారు. రెండవది, ఈరోజు డ్రామా అనుసారంగా క్రొత్త సంవత్సరము కూడా ప్రారంభమవ్వనున్నది, అందుకే బాప్‌దాదా పిల్లలందరినీ తమ రెండు బాహువులలో ఇముడ్చుకుంటూ ఈ రెండు విషయాలకు అభినందనలను ఇస్తున్నారు. అంతేకాక ఏ విధంగా ఇప్పుడు ఈ సమయంలో సాకార రూపంలో తండ్రితోపాటు ఉల్లాస-ఉత్సాహాలు మరియు సంతోషములో నాట్యం చేస్తున్నారో, అలాగే క్రొత్త సంవత్సరంలో సదా, సదా అవ్యక్త రూపంలో సహచరులుగా భావించండి, అనుభవం చేయండి, ఈ తోడు యొక్క అనుభవము చాలా ప్రియమైనది. బాప్‌దాదాకు కూడా పిల్లలు లేకుండా మంచిగా అనిపించదు. (మైక్ ఆగిపోయింది) మొట్టమొదటి అనుభవం కదా, అందుకే ఇది కూడా డ్రామాలో ఆటగా భావించాలి, ఏదో కింద-మీద అయిపోయిందని అనుకోకండి. అంతా మంచిగా ఉంది మరియు మంచిగానే ఉంటుంది. చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది అని అంటూ మీరు కూడా మంచిగా అయిపోతారు మరియు డ్రామాలోని ప్రతి దృశ్యము కూడా మంచిగా అయిపోతుంది ఎందుకంటే మీరు మంచిగా తయారవుతున్న ఆ వైబ్రేషన్, ఎటువంటి దృశ్యాన్ని అయినా, నెగెటివ్‌ను కూడా పాజిటివ్‌లోకి మార్చేస్తుంది. పిల్లలలో అంతటి శక్తి ఉంది, కేవలం దానిని ఉపయోగించండి. శక్తులైతే ఎన్నో ఉన్నాయి, వాటిని సమయానికి ఉపయోగించి చూడండి, అప్పుడు చాలా మంచి-మంచి అనుభవాలు చేస్తారు.
ఇది క్రొత్త హాల్ మరియు క్రొత్త సంవత్సరము, ఇందులో ఏం చేస్తారు? క్రొత్త సంవత్సరములో ఏదైనా నవీనతను చేస్తారు కదా. ఈ సంవత్సరము అనుభవీమూర్తులుగా అయ్యి ఇతరులకు కూడా అనుభవము చేయించే సంవత్సరము. ఏం చెయ్యాలో అర్థమైందా? అనుభవము చెయ్యాలి. వాణి ద్వారా వర్ణన అయితే చేస్తూనే ఉంటారు కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ ప్రతి శక్తిని, ప్రతి గుణాన్ని అనుభవము చెయ్యాలి. మీరు అనుభవీ మూర్తులు కదా! అనుభవీ మూర్తులా లేక వాణీ మూర్తులా? మీరు అనుభవజ్ఞులే కానీ ఈ సంవత్సరంలో పిల్లలలో ఏ ఒక్కరూ కూడా నాకు ఈ-ఈ విషయాల అనుభవమైతే ఉంది కానీ ఈ విషయంలో అనుభవము చాలా తక్కువ ఉంది అని అనకూడదు. ఈ విధంగా అనే పిల్లలు ఒక్కరు కూడా ఉండకూడదు ఎందుకంటే జ్ఞానము అంటే - కేవలం అర్థం చేసుకోవటం మాత్రమే కాదు కానీ అనుభవము చేయటము అని అర్థము మరియు ఎప్పటివరకైతే అనుభవం చెయ్యరో అప్పటివరకు ఇతరులను కూడా అనుభవజ్ఞులుగా చెయ్యలేరు. ఒకవేళ వాణి వరకే ఉండి, అనుభవము వరకు లేనట్లయితే, ఏ ఆత్మల సేవకైతే నిమిత్తులుగా అవుతారో, వారు కూడా వాణి ద్వారా చాలా బాగుంది, చాలా బాగుంది, అద్భుతము అని అంటారు, ఇంతవరకే వస్తారు. అనుభవజ్ఞులుగా అయ్యేవారు కోట్లలో కొద్దిమంది, ఆ కొద్దిమందిలో కూడా ఏ ఒక్కరో అవుతారు మరియు ప్రత్యక్షతకు ఆధారము అనుభవము. అనుభవము కల ఆత్మలు ఎప్పుడూ కూడా వాయుమండలము మరియు సాంగత్యపు ప్రభావములోకి రాలేరు. కేవలం వాణి ప్రభావంలోకి వచ్చేవారు ఒక్కోసారి నాట్యము చేస్తారు మరియు ఒక్కోసారి ఆలోచనలో పడతారు. అనుభవము అనగా దృఢమైన పునాది. సగం అనుభవము ఉంటే సగం పునాదే దృఢంగా ఉన్నట్లు, దానికి గుర్తు ఏమిటంటే - వారు చిన్న-చిన్న విషయాలలో కదిలిపోతారు, అచలంగా ఉండరు ఎందుకంటే ఆ వస్తున్న విషయాలు లేక సమస్యలు శక్తివంతమైపోతాయి, అందుకే సగం పునాది ఉన్నవారు ఊగిసలాడుతూ ఉంటారు. పడిపోరు కానీ ఊగిసలాడుతారు. కనుక ముందుగా ఈ సంవత్సరములో మీ అనుభవీమూర్తి అనే పునాదిని దృఢంగా చేసుకోండి. కొంతమంది పిల్లలు ఈరోజు చాలా వేగంగా నడుస్తారు కానీ రేపు కాస్త ముఖం మారిపోయి ఉంటుంది, కారణము? అనుభవమనే పునాది దృఢంగా లేదు. అనుభవము కల ఆత్మలు ఎంత పెద్ద సమస్యనైనా - అసలేమీ జరగనే జరగలేదు అన్నట్లు పరిష్కరిస్తారు. సమస్య వచ్చింది మరియు తన పాత్రను పోషించింది అన్నట్లు ఉంటారు, వారు సాక్షీగా అయ్యి, అతీతముగా మరియు ప్రియముగా ఉంటూ ఆటలా చూస్తారు. అది ఒక విషయము కాదు, అది ఒక ఆట, మనోరంజనము. మనోరంజనము మంచిగా అనిపిస్తుంది కదా? కనుక ఏ విషయమైనా, ఒకవేళ పునాది కొద్దిగా అపరిపక్వంగా ఉన్నా, అది మీకు పెద్ద విషయంగా అనిపిస్తుంది. 75 శాతం దృఢంగా ఉన్నా, 90 శాతం దృఢంగా ఉన్నా కూడా అది కదిలే అవకాశం ఉంది. బాప్‌దాదాకు పిల్లలు శ్రమ చెయ్యటము అనగా యుద్ధము చెయ్యటము మంచిగా అనిపించదు. శ్రమ ఎందుకు? యుద్ధమెందుకు? మీరు యోగీకి బదులుగా యోధులుగా అయ్యేవారా లేక యోగీ ఆత్మలా? యుద్ధము చేసే సంస్కారము చంద్రవంశములోకి తీసుకువెళ్తుంది మరియు యోగీ ఆత్మల సంస్కారము సూర్యవంశంలోకి తీసుకువెళ్తుంది. మరి ఎలా తయారవ్వాలి? సూర్యవంశీయులుగానా లేక చంద్రవంశీయులుగానా? సూర్యవంశీయులుగా అవ్వాలంటే యుద్ధము సమాప్తము. ఈ సంవత్సరంలో యుద్ధము సమాప్తమైందా? ఇందులో అవును అని అనటం లేదు? చెప్తే అంటారా? బాప్‌దాదా చూడకుండానే పిల్లల రిజల్టును చూసేస్తారు. ప్రతి సమయములోని రిజల్టు కళ్ళ ఎదురుగా కాదు కానీ హృదయంలోకి రానే వస్తుంది. ఇక్కడ సాకార వతనంలో ఎప్పుడైతే మీరు కొద్దికొద్దిగానైనా లేక ఎక్కువగానైనా కదిలిపోతారో, అప్పుడు ఎవరో కదులుతూ ఉన్నారు అన్నట్లు తండ్రికి అక్కడ వతనంలో అనుభవమవుతుంది. కావున ఏ విధంగా శాంతివనము యొక్క సంతోషము ఉందో, హాల్ యొక్క సంతోషముందో, అలా బాప్‌దాదా మరియు ఇంత పెద్ద సంగఠన మధ్యలో ఈ ప్రతిజ్ఞ చెయ్యండి - ఈ సంవత్సరములో అలజడికి అతీతంగా ఉంటూ అచలంగా-స్థిరంగా అవ్వాల్సిందే, అవుతాము అని కాదు, అవ్వాల్సిందే. ఇలానే ఉన్నారా? ఈ విధంగా ఎవరైతే ఆలోచిస్తాము, చేస్తాము, చూస్తాము అని కాకుండా అవ్వాల్సిందే అని భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. అచ్ఛా, అభినందనలు మరియు ఎవరైతే ఏ కారణంగానైనా చేతులెత్తలేదో, అలాగని అవ్వకపోవటమనేది జరగదు కానీ ఏ కారణంగానైనా చేతులెత్తకపోతే వారు ఇప్పుడు ఎత్తండి. చెయ్యి ఎత్తటానికి సిగ్గుగా అనిపిస్తుందా, మరి ఆలోచించండి - చెయ్యి ఎత్తటానికి సిగ్గుగా అనిపిస్తున్నప్పుడు, చేసే సమయంలో కూడా సిగ్గుపడండి. ఇది సిగ్గుపడే విషయము కదా అని అనుకోండి, అప్పుడిక అది జరగదు, దృఢంగా అయిపోతారు ఎందుకంటే కొంతమంది పిల్లలు పదే-పదే అడుగుతూ ఉంటారు, నిమిత్తంగా ఉన్న పిల్లలనైనా లేక ఆత్మిక సంభాషణలో బాప్దాదానైనా ఒకటే ప్రశ్న అడుగుతూ ఉంటారు - బాబా, వినాశనం యొక్క తారీఖు చెప్పండి. ఈ ప్రశ్న అందరిదీ కదా? అచ్ఛా, బాప్‌దాదా తారీఖు చెప్పారే అనుకోండి - సరే, 2000 సంవత్సరంలో పూర్తవుతుంది, ఏం చేస్తారు? అలాగని ఈ తారీఖు చెప్పటం లేదు, పొరపాటుగా అర్థం చేసుకోవద్దు. ఒకవేళ 2000 సంవత్సరం వరకు ఉంటుంది అని మీకు చెప్తే, మీరేం చేస్తారు అని బాప్‌దాదా అడుగుతున్నారు. నిర్లక్ష్యులుగా అవుతారా లేక తీవ్ర పురుషార్థులుగా అవుతారా? తీవ్ర పురుషార్థులుగా అవుతారా! ఒకవేళ బాప్‌దాదా ఈ సంవత్సరంలోనే అలజడి జరుగుతుంది అని చెప్తే అప్పుడేమి చేస్తారు? ఇంకా ఎక్కువ తీవ్ర పురుషార్థం చేస్తారా? లేక కొద్దికొద్దిగా డేట్ కాన్షస్‌గా అవుతారా - ఇంత సమయము పూర్తయ్యింది, ఒక నెల పూర్తయ్యింది, ఒక సంవత్సరము పూర్తయ్యింది, ఇంకా ఇన్ని నెలలు మిగిలి ఉన్నాయి... అని ఇలా లెక్క పెడుతూ ఉంటారా! డేట్ కాన్షస్‌గా అవుతారా లేక సోల్ కాన్షస్‌గా అవుతారా? ఏం చేస్తారు? నిర్లక్ష్యులుగా అవ్వరా? ఇప్పుడింకా నాలుగు సంవత్సరాలు ఉన్నాయి కదా అని ఆలోచించరు కదా? ఏముంది, చివరి సంవత్సరంలో చేసేస్తాములే అని అనుకుంటూ నిర్లక్ష్యులుగా అవ్వరా లేక కొద్ది-కొద్దిగా నిర్లక్ష్యులుగా అవుతారా? మీరు అలా అవ్వకపోయినా సరే మాయ అయితే వింటుంది, అది మీ ముందుకు ఎలాంటి విషయాలను తీసుకొస్తుందంటే ఇక నిర్లక్ష్యము, సోమరితనము అనేవి మధ్యమధ్యలో వస్తుంటాయి, అప్పుడేమి చేస్తారు? అందుకే బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - డేట్ కాన్షస్‌గా అవ్వకండి కానీ ప్రతి సమయాన్ని అంతిమ ఘడియగా భావిస్తూ ప్రతి ఘడియలో అంతగా ఎవరెడీగా ఉండండి. అచ్ఛా, ఒకవేళ బాప్‌దాదా 2000 సంవత్సరం తర్వాత వినాశనమవుతుంది అని చెప్పారనుకోండి, దానిని మీరు అంగీకరించారు అనుకోండి, అలా నిజంగా అవ్వదు కానీ మీరు అంగీకరించారు అనుకోండి, అప్పుడు మీరు 2000 సంవత్సరంలో సంపూర్ణులుగా అవుతారు, మరి ఇతరులను ఎప్పుడు తయారుచేస్తారు? సత్యయుగంలో తయారుచేస్తారా? తయారుచేసేవారు తక్కువమంది ఉన్నారు, కానీ తయారవ్వాల్సినవారు ఎక్కువమంది ఉన్నారు, వారి కొరకు కూడా సమయము కావాలా, వద్దా? కనీసం సత్యయుగము ఆది యొక్క 9 లక్షల మంది తయారయ్యారా అని ఇంతకుముందు సీజన్లో కూడా అడిగాము. అలా తయారవ్వనట్లయితే వినాశనము ఎలా జరుగుతుంది? ఎవరిపై రాజ్యం చేస్తారు? పాత ఆత్మలపై రాజ్యం చేస్తారా? క్రొత్త ఆత్మలు ఇంకా తయారవ్వలేదు, ఈలోపు వినాశనమైపోతే ఏం చేస్తారు? అందుకే బాప్‌దాదా ఈ పనిని తమ జ్యోతిష్కులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారికి అప్పజెప్పారు, ఏదైతే జ్యోతిష్కులు చెయ్యగలరో, ఆ పనిని తండ్రి ఎందుకు చేస్తారు! ఎంతైనా వారు తండ్రి పిల్లలే, వారిని సంపాదించుకోనివ్వండి. వారి సంపాదనకు సాధనము ఇదే. ఒకవేళ ఎవరికైనా తొందర ఉన్నట్లయితే ఆ పిల్లలను అడగండి. బాబా చెప్పరు.
మరి అర్థమైందా - ఈ సంవత్సరం ఏం చెయ్యాలో? అనుభవీ మూర్తులుగా అవ్వాలి. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు చాలా మధురాతి-మధురమైన ఆత్మిక సంభాషణను చేస్తారు. వారు ఏమంటారంటే - ఏం చెయ్యాలి బాబా, ఇంతైతే అయ్యింది, మిగిలినది మీరు చెయ్యండి, రాజ్యం మేము చేస్తాము కానీ సంపూర్ణంగా మీరు తయారుచెయ్యండి. అలా అవుతుందా? తండ్రి తప్పకుండా సహాయకులే మరియు అంతిమము వరకు సహాయకులుగానే ఉంటారు, ఇది గ్యారంటీ కానీ ఎవరికి సహాయకులు? ఎవరైతే ముందుగా ధైర్యమనే అడుగును వేస్తారో, వారికి తండ్రి సహాయమనే రెండవ అడుగును వేసి సంపూర్ణంగా సహాయం చేస్తారు. ధైర్యము అనే అడుగు వెయ్యకుండా కేవలం - బాబా, మీరు చెయ్యండి, బాబా, మీరు చెయ్యండి అని అంటే, అప్పుడు బాప్‌దాదా కూడా - చూద్దాము, ముందు అడుగైతే వెయ్యండి అని అంటారు. ఒక్క అడుగు కూడా వెయ్యకపోతే ఎలా అవుతుంది! అందుకే ఈ సంవత్సరంలో ప్రతి సమయము ఇది చెక్ చేసుకోండి - ధైర్యమనే అడుగు దృఢంగా ఉందా? తండ్రిని అడిగే కన్నా ముందు ఇది చెక్ చేసుకోండి. ధైర్యమనే అడుగు వేసారు కానీ సహాయం లభించలేదు అనేది అసంభవము. కేవలం కాస్త ధైర్యమనే అడుగును వెయ్యండి, అందుకే గాయనంలో కూడా మొదటి మాట ఏమి ఉంటుంది? ధైర్యం పిల్లలది సహాయం తండ్రిది, దీనిని - తండ్రి సహాయము, ఆ తర్వాత పిల్లల ధైర్యము అని తిరగేయకండి. తండ్రి అయితే చిరునవ్వు నవ్వుతూ ఉంటారు - వాహ్ నా ప్రియమైన పిల్లలూ, వాహ్! నిశ్చయంతో ధైర్యమనే అడుగును కాస్త ముందుకు వేసినా సరే, తండ్రి పదమాల రెట్లు సహాయము చేయడానికి పిల్లలు ప్రతి ఒక్కరి కోసము, ప్రతి సమయము సిద్ధంగా ఉన్నారు.
అచ్ఛా, క్రొత్త సంవత్సరంలో ఇంకేం చేస్తారు? సేవకు సంబంధించి ఇప్పటికీ ఒక విషయము మిగిలిపోయి ఉంది, అది ఏమిటి? గీతా భగవంతునికి సంబంధించిన విషయమైతే నిరూపణ అయిపోతుంది. కానీ బాప్‌దాదా ఇంతకుముందు సంవత్సరం ప్రతి జోన్ వారికి చెప్పారు - స్నేహీలు, సహయోగులు, సంపర్కములోకి వచ్చేవారైతే చాలా మంది తయారయ్యారు మరియు తయారవుతారు కానీ ఇప్పుడు వారసులను తయారుచెయ్యండి. వారసులుగా తక్కువమందిని తయారుచేస్తున్నారు ఎందుకంటే బాప్‌దాదా ప్రతి సేవాకేంద్రము యొక్క రోజువారీ రిజల్టును చూస్తారు. నలువైపుల కల రిజల్టులో వారసులు తక్కువగా ఉన్నారు. స్నేహీలు, సహయోగులు బాగా ఉన్నారు, వారిని ముందుకు తీసుకువెళ్ళండి. ఎవరైనా క్రొత్తవారిని, చివర్లో వచ్చినవారిని వేగంగా తయారుచేసి వారస క్వాలిటీ వారిని తండ్రి ఎదురుగా తీసుకురండి. కొంతమంది తయారవుతున్నారు కానీ అటువంటివారిని లెక్కపెట్టవచ్చు. 2000 సంవత్సరం నాటికి పరివర్తన అవ్వాలి అని కోరుకుంటున్నప్పుడు, అందరూ ఈ విధంగానే కోరుకుంటున్నారు, మరి వారసులుగా ఎంతమందిని తయారుచేసారు? సత్యయుగ ప్రజలు కూడా రాయల్‌గా ఉండేవారు కావాలి. అలా తక్కువమంది ఉన్నారు. ప్రజలు తయారయ్యారు, ఇప్పుడు ఏవైతే అనేక రకాల కాన్ఫరెన్సులు చేసారో మరియు బయట స్టేజ్‌పై ఏవైతే ప్రోగ్రాములు లభించాయో, వాటిలో ఈ సంవత్సరంలో ప్రభావం మరియు ప్రజలు యొక్క రిజల్టు బాగుంది. కానీ బాప్‌దాదా ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు వారస క్వాలిటీ వారిని తయారుచెయ్యండి. ఇక్కడ వారసులను తయారుచేసినట్లయితే అడ్వాన్స్ పార్టీ కూడా ప్రత్యక్షమవుతుంది మరియు తండ్రి పేరు, ప్రత్యక్షతా ఢంకా నలువైపులా మ్రోగుతుంది. ఇప్పటివరకు వచ్చిన రిజల్టులో - వీరు కూడా మంచి పని చేస్తున్నారు అని అంటారు. మరికొంతమంది - వీరే చెయ్యగలరు అని అంటారు. కానీ పరమాత్మ వైపుకు అటెన్షన్ వెళ్ళాలి. పరమాత్మ యొక్క ఈ కార్యము నడుస్తూ ఉంది అన్నది ఇప్పుడింకా గుప్తంగా ఉంది. పిల్లలు తమ శక్తితో, స్నేహంతో తండ్రిని ప్రత్యక్షము చేసేందుకు మంచి పురుషార్థం చేస్తున్నారు కానీ ఎప్పటివరకైతే స్నేహీలుగా, సహయోగులుగా మాత్రమే ఉంటారో అప్పటివరకు తండ్రి యొక్క ప్రత్యక్షత అనేది మైదానములోకి రాదు. ఇంతవరకు చేరుకున్నారు, అది మంచిదే. కానీ ఎప్పుడైతే అందరి నోటి నుండి - ఇప్పుడిక సమయం వచ్చేసింది, తండ్రి వచ్చేసారు అనే మాట వస్తుందో, అప్పుడు వినాశనం కూడా వస్తుంది. కనుక తండ్రి అంటారు - వినాశనం ఎప్పుడు అవుతుంది అని తండ్రిని అడగకండి. తండ్రి మిమ్మల్ని అడుగుతారు - మీరు ఎప్పుడు తయారవుతారు? పరదా తెరవాలా? తయారుగా ఉన్నారా? లేక పరదా తెరవబడుతుంది కానీ ఇంకా తయారవుతూ ఉంటారా? కనీసం 16108 మంది పక్కా-పక్కా రత్నాలను ప్రత్యక్షం చెయ్యండి. మాలనైతే తయారుచెయ్యండి. తయారైందా అని తండ్రి కూడా చూస్తారు. ఇంత అవకాశం ఉంది, ఎక్కువమందిని చెప్పటం లేదు, 9 లక్షల మంది అని చెప్పటం లేదు, 16108 మాలను తయారుచెయ్యండి, ఈ సంవత్సరంలో తయారుచెయ్యండి, 16108 మందితో కూడిన నిర్విఘ్నమైన, అచలమైన మాల తయారుగా ఉందా లేక ఇప్పుడు కొద్దికొద్దిగా ఊగిసలాడుతూ ఉన్నారా అన్నదానిని చూస్తాము. కొద్దికొద్దిగా ఆటను చూపిస్తారా? పాండవులు ఏమనుకుంటున్నారు? చెప్పండి, తయారుగా ఉన్నారా? దాదీలైతే ‘అవును’ అని చెప్తున్నారు. శక్తులందరూ ‘అవును’ అని చెప్తున్నారా? 16108 మంది తయారుగా ఉన్నారా? అచ్ఛా, 18వ తారీఖున మాలను తయారుచేసి ఇవ్వాలి, చేతులు ఎత్తమని చెప్తే సగం సభ 16000లో ఉన్నామని అంటారు. మేము 16000లో ఉన్నామని ఎవరైతే భావిస్తున్నారో, వారు - నేను 16000లో ఉన్నానా లేక 108లో ఉన్నానా అన్నదానిని చీటీపై రాసి దాదీలకు ఇవ్వండి, అప్పుడు దాదీలు పాస్ చేస్తారు. చీటీ ఇచ్చేసాము కదా, అయిపోయింది అని అనుకోకండి. ముందు వీరు పాస్ చేస్తారు, ఆ తర్వాత బాప్‌దాదా పాస్ చేస్తారు, ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ చెప్తాము. అచ్ఛా.
ఈ సంవత్సరంలో ఇంకా ఏమి చేస్తారు? బాప్‌దాదా పిల్లలందరి ఒక రిజల్ట్‌ను చూశారు. ఇక్కడ ఉన్నవారిది మాత్రమే కాదు, నలువైపులా ఉన్న పిల్లలందరి ఒక విషయం యొక్క రిజల్ట్‌ను చూశారు. అది ఏమిటి? జమ ఖాతాలో ఎవరు ఎంత జమ చేసుకున్నారు? మనసా ద్వారా అయినా, వాచా ద్వారా అయినా, కర్మణా ద్వారా అయినా, సంబంధ-సంపర్కాల ద్వారా అయినా, మీ అందరి ఛాలెంజ్ ఏమిటంటే, మీ కోసమే కాదు, ప్రపంచం ముందే కూడా చెబుతున్నారు కదా, ఒక జన్మలోనే 21 జన్మల జమను చేసుకోవాలి అని. ఇలా అంటారు కదా! తెలుసు కదా! మరి ఒక జన్మలో 21 జన్మలకు జమ చేసుకోవాలంటే ఎంత చేయాలి?
ఇప్పుడు మనసా ద్వారా మీరు చేసే జమ వల్ల, మొదటిది, అర్థకల్పం వరకు మనసా ద్వారా వృత్తి లేదా వైబ్రేషన్స్‌ను వ్యాప్తి చేయవలసిన అవసరమే ఉండదు. 21 జన్మలు ఈ పురుషార్థం చేయవలసిన అవసరం ఉండదు. రెండవది, ద్వాపరయుగం నుండి మీ జడ చిత్రాలు అనేక రూపాలలో పూజింపబడతాయి. మేము ఏ రూపంలో పూజింపబడుతున్నాము అన్న విషయం మీకు తెలియదు. కానీ పూజ్యులే కదా! 33 కోట్ల దేవతలుగా గుర్తింపు ఉంది కదా! అర్థకల్పం వరకు గౌరవనీయులుగా, పూజనీయులుగా ఉంటారు. ఆ జడ చిత్రాల ద్వారా కూడా మీ మనసా సేవ ఆటోమేటిక్‌గా జరుగుతూనే ఉంటుంది. ఏ భక్తుడైనా మీ జడ చిత్రం ముందు వచ్చినప్పుడు, మనసా వైబ్రేషన్స్ ద్వారా శాంతి, సంతోషం, శక్తి అనుభవిస్తారు. ఇదే మనసా ద్వారా చేసిన జమ యొక్క ప్రభావం. వాణి ద్వారా జమ చేసుకునేవారి ఖాతా మంచిగా ఉంటుంది. అటువంటి వారి వాణి ద్వారా వారి గాయనం, పూజ ఎక్కువగా జరుగుతుంది. వారి వాణి ద్వారా వారి మహిమ, పూజ యుక్తియుక్తంగా జరుగుతుంది. పేరుకే పూజ కాదు, యుక్తియుక్తమైన పూజ జరుగుతుంది. ఎందుకంటే వాణి ద్వారా మీరు అందరికీ సుఖాన్ని, శాంతిని ఇస్తారు. అందుకే అర్థకల్పం వరకు మీ వాణి ద్వారా ఎంతో యుక్తియుక్తమైన గాయనం జరుగుతుంది. ఒకటి గాయనం జరుగుతుంది. రెండవది, యుక్తియుక్తంగా పూజింపబడతారు. కర్మ ద్వారా ప్రతి కర్మలో సేవ చేసే ఆత్మలు - సగం రోజు చేశారు, సగం రోజు చేయలేదు, ఒకసారి చేశారు, ఒకసారి చేయలేదు - అలాకాదు. ప్రతి కర్మలో ఎల్లప్పుడూ జమ చేసుకుంటే, మీ ప్రతి కర్మ కూడా పూజింపబడుతుంది. చాలా కొద్దిమంది దేవతల ప్రతి కర్మ పూజింపబడుతుంది. అప్పుడప్పుడు చేసే వారి కర్మలు రోజంతా అప్పుడప్పుడు మాత్రమే పూజింపబడతాయి. స్నేహం, సహయోగం ద్వారా జమ చేసుకునే ఆత్మలు - స్నేహంతో, సహయోగంతో జమ చేసుకునేవారి విగ్రహం చిన్నదైనా, దేవాలయం చిన్నదైనా, ఆ విగ్రహం ద్వారా స్నేహం, సహయోగం అనే వరదానం ప్రత్యక్షంగా అనుభవమవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఈ నాలుగు విషయాలలో నా జమ ఖాతా ఎంత ఉంది? మూడింటిలో ఎక్కువగా ఉందా, ఒకదాంట్లో తక్కువగా ఉందా? లేక ఒకదాంట్లో తక్కువగా, మూడింటిలో కూడా తక్కువగా ఉందా?
బాప్‌దాదా ఏదైతే రిజల్ట్ చూసారో అది బాప్‌దాదాకు నచ్చలేదు. ఇప్పుడు కూర్చొని అంతా చెప్పలేం. అందుకే సంక్షిప్తంగా చెబుతున్నాము - వినాశనాన్ని త్వరగా తీసుకురావాలంటే ఈ సంవత్సరం నుండి ఈ నాలుగు విషయాలలోనూ జమ ఖాతాను పెంచండి. తక్కువ ఖర్చు చేసి ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నవారిగా అవ్వండి. వాణి ద్వారా కూడా చాలా వ్యర్థం వెళ్తుంది. అవసరం లేని విషయాలలో కూడా సమయాన్ని ఖర్చు చేస్తారు. మనసాలో కూడా ఆలోచించాల్సిన అవసరం లేని విషయాలను ఆలోచించడం ప్రారంభిస్తారు. దాంతో జమ ఖాతా తగ్గిపోతుంది. అది వ్యర్థమవుతుంది, జమ కాదు. కాబట్టి వినాశనానికి ముందు జమ ఖాతాను పెంచండి. అప్పుడు బాప్‌దాదాకు వినాశనానికి ఆర్డర్ ఇవ్వడానికి ఎంత సమయం పడుతుంది? ఒక చప్పట్లు కొట్టారు, అయిపోయింది. ఈ చప్పట్లు అయితే కొట్టారు కదా! ఇప్పుడు తయారీ యొక్క చప్పట్లు కొట్టండి. (అందరూ మళ్లీ మళ్లీ చప్పట్లు కొడుతున్నారు) ఈ రోజు చప్పట్ల సభ ఎక్కువగా ఉంది. బాప్‌దాదా పిల్లలను చూసి సంతోషిస్తున్నారు. ఈ సంవత్సరం ఏమి చేయాలో అర్థమైందా?
బాప్‌దాదా వద్ద ప్రతి బిడ్డ యొక్క టి.వి. ఉంది. బాప్‌దాదా అప్పుడప్పుడు అకస్మాత్తుగా ప్రతి బిడ్డ యొక్క టి.వి. స్విచ్ ఆన్ చేస్తారు. అప్పుడు చాలా ఆసక్తికరమైన దృశ్యం కనిపిస్తుంది. ముందే చెబితే అందరూ సరిగ్గా కూర్చుంటారు, సరిగ్గా చేస్తారు. కానీ అకస్మాత్తుగా చూసే ఆటలో, ఇప్పటికీ ఎక్కువమంది వ్యర్థ ఖాతానే ఎక్కువగా ఉంది. ఇంతకు ముందు బాప్‌దాదా ఒక స్లోగన్ ఇచ్చారు - తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. గుర్తుందా? అందరూ ఆ స్లోగన్‌ను నలువైపుల గోడలపై కూడా వ్రాసి పెట్టారు. కానీ అది గోడలపైనే ఉంది, ఇప్పుడు దానిని హృదయంలో పెట్టండి. అడ్వాన్స్ పార్టీ గురించి అందరూ అడుగుతున్నారు - వారు ఎక్కడున్నారు? ఏమి చేస్తున్నారు? ఎందుకు ప్రత్యక్షం కావడం లేదు? ఆ ఆత్మలు చెబుతున్నాయి - మేము ప్రత్యక్షమైతే, మేము ఒక్కరమే ప్రత్యక్షమవుతామా? లేక అందరితో కలిసే ప్రత్యక్షమవుతామా? అడ్వాన్స్ పార్టీ పాత్ర ప్రత్యక్షమైతే, అందులో మీరు ఉండరా? అడ్వాన్స్ పార్టీ మాత్రమే ప్రత్యక్షమవుతుందా? వారు కూడా మీ కోసం ఎదురు చూస్తున్నారు - ఒకేసారి చప్పట్లు కొట్టాలని. మరోవైపు వినాశన సమయం కూడా మీ కోసం ఎదురుచూస్తోంది. మీరు దాని కోసం ఎదురు చూడడం లేదు; అది మీ కోసం ఎదురు చూస్తోంది. సమయం మీ సృష్టే. మీరు ఆర్డర్ ఇస్తే అది ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అందుకే ఇప్పుడు మిమ్మల్ని మీరు అచలంగా, నిశ్చలంగా తయారుచేసుకునే తయారీ చేయండి. మీ సంబంధ-సంపర్కంలోకి వచ్చే వారందరినీ - టీచర్లు కావచ్చు, నిమిత్త పెద్ద అన్నయ్యలు లేదా అక్కయ్యలు కావచ్చు, వారి సంబంధ-సంపర్కంలో ఉన్న గ్రూపును ఈ సంవత్సరం అలా తయారుచేయాలి, ప్రతి ఒక్కరి నోటి నుండి, ‘మేము అనుభవీ మూర్తులం’ అనే మాట రావాలి. సెంటర్లోని సహయోగులు కావచ్చు, ప్రవృత్తిలో ఉన్నవారు కావచ్చు - ప్రతి ఒక్కరి సహయోగం, వృత్తి ద్వారా అలాంటి గ్రూపును తయారుచేయండి. ఎవరినైనా చూసినప్పుడు, వారి వృత్తిని చూసినప్పుడు ‘వీరు అనుభవీమూర్తులు అవ్వబోతున్నారు, ఇంకా కాలేదు’ అనే భావన రాకూడదు. అర్థమైందా? సెంటర్‌కు పెద్దవారే అవ్వాలి, మేమైతే అవసరం లేదు అని అనుకోకండి. అందరి వేలు అవసరం. భండార సేవ చేసే వారైనా సరే, అందరూ బాధ్యతగలవారే.
ఈ సంవత్సరం చివర్లో ఈ రిజల్ట్ అడుగుతాము. ఎందుకంటే డైమండ్ జూబిలీ అయిపోయింది. ఇప్పుడు సమాప్తికి దగ్గరలో ఉన్నారు. డైమండ్ జూబిలీలో కూడా డైమండ్లు కాకపోతే, ఇంకే జూబిలీ జరుపుకుంటారు? ఇంకా జరుపుకోవాలా, లేక సమాప్తి చేయాలా? 100 సంవత్సరాల జూబిలీ జరుపుకోవాలా? జరుపుకోవాలంటే అప్పుడు నెమ్మదిగా నడవండి. త్వరగా చేయాలంటే ఈ సంవత్సరంకన్నా ముందే మీరు తయారవ్వండి. ప్రతిరోజూ వచ్చే వారు, అప్పుడప్పుడు వచ్చే వారు, బ్రాహ్మణుల జాబితాలో ఉన్న వారందరూ సిద్ధమవ్వండి. మీరు సిద్ధమైతే అప్పుడు చప్పట్లు కొడతాం. రేపే సిద్ధమైతే రేపే కొడతాం. అందరూ సిద్ధమా? లేక సిద్ధం కావాలా? సెంటర్లో ఉండేవారు, సెంటర్‌కు వచ్చేవారు, ప్రతి ఒక్కరి రిజల్ట్ చూస్తాం. ఎవరు నంబర్ తీసుకుంటారో చూస్తాం. సరేనా? పాండవులు సరేనా? పాండవులు మౌనంగా ఉన్నారు. ఆలోచనలో ఉన్నారా?
చూడండి, బాప్‌దాదా అయితే తమ వాగ్దానాన్ని నెరవేర్చారు. తేదీకి వచ్చారు కదా! ఇప్పుడు మీరు కూడా తేదీకి పూర్తిగా సిద్ధమై ఉండండి. ఈ పెద్ద హాల్ నచ్చిందా? లేక చిన్న హాల్ సరిపోతుందా? ఇంకా వృద్ధి అయితే తప్పదు. ఈ హాల్లో కూడా వెనుక నిలబడాల్సి వస్తుంది. మీరు అదృష్టవంతులు, హాయిగా కూర్చున్నారు. ఎంత పెద్దగా నిర్మించినా, అంత చిన్నదిగా అనిపిస్తుంది. అచ్ఛా, ఈ స్థలం నిర్మాణ సేవకు నిమిత్తులైన వారందరికీ బాప్‌దాదా చాలా చాలా అభినందనలు తెలుపుతున్నారు. కొంచెం ఏదైనా మిగిలి ఉంటే, దాని గురించి ఆలోచించకండి. దాదాపు సిద్ధమే అయింది. అయినప్పటికీ చూడండి, చాలా తక్కువ సమయంలో ఎంత వేగంగా పని చేశారు అన్నది బాప్‌దాదా గమనించారు! సమయాన్ని దృష్టిలో పెట్టుకుంటే చాలా మంచి ప్రగతి చేశారు. మిగిలిన కొద్దిగా కూడా పూర్తవుతుంది. బాప్‌దాదాకు నచ్చింది. దాదీ మీపై ఫిర్యాదు చేసారు కానీ బాప్‌దాదా అభినందనలు ఇస్తున్నారు. దాదీ తయారుచేసేందుకు నిమిత్తము కదా, వారు చెప్పకపోతే మీరు ఈ రోజు ఇలా తయారు చేసేవారు కాదు. దాదీ పని చెప్పడం, బాప్‌దాదా పని అభినందించడం. పేర్లు చెప్పలేం. చాలా మంది ఉన్నారు. కానీ నిర్మాణానికి ముఖ్య నిమిత్తులైన వారు లేచి నిలబడండి.
(నిర్వైర్ అన్నయ్య) వీరే మీ బ్యాక్‌బోన్ కదా! అందరూ హృదయపూర్వకంగా చెప్పండి - అభినందనలు, అభినందనలు.
ఈసారి రిజల్ట్‌లో బాప్‌దాదాకు ప్రతి బిడ్డకు బాబాపై ఎంత స్నేహం ఉందో ప్రత్యక్ష సాక్ష్యం లభించింది. బాబా చెప్పారు, పిల్లలు జీ హజూర్, జీ హాజిర్ అన్నారు. (కాంట్రాక్టర్లతో) వీరికి సమయం తక్కువ లభించింది. అయినప్పటికీ ఆ సమయానికి తగినంతగా చాలా పని చేశారు. బాగా చేశారు. మీరందరూ కూడా సహయోగం ఇచ్చారు. అందుకే బాప్‌దాదా ప్రతి ఒక్కరి పేరును నోటి ద్వారా కాదు, హృదయంలో స్మరిస్తున్నారు. దేశ-విదేశాల పిల్లలందరికీ వారి స్నేహానికి నిదర్శనంగా అభినందనలు తెలియజేస్తున్నాము. పిల్లలు ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా తమ వేలును ఇచ్చారు (సహయోగమును ఇచ్చారు). ఏ రూపంలో అయినా సరే, అందరి సహయోగంతో ఈ శాంతివనం సమయానికి సిద్ధమైంది. కూర్చోవడానికి సిద్ధంగా ఉంది కదా! బాగుంది. ఇది బేహద్దు హాల్. కానీ ఇక ముందు ఏమి చేస్తారు? ఇంతే సరిపోతుందా? చాలామంది పిల్లలు బాప్‌దాదాకు మధురమైన ఫిర్యాదు కూడా ఇచ్చారు, ఇప్పుడిక సంఖ్య రాదు అనుకున్నాం. ఎవరికి రావాలనిపిస్తే వారు రావచ్చు అని. కానీ సంఖ్య ఇంకా తక్కువే వచ్చింది. చాలా తక్కువ మందికి అవకాశం లభించింది. ఇక ఏమి చేయాలో ఆలోచించండి. అచ్ఛా.
టీచర్లు కూడా ఇంకా ఎక్కువ సంఖ్య లభించాలని భావిస్తున్నారు కదా! టీచర్లు చేతులు ఎత్తండి. టీచర్లకు మంచి అవకాశం లభిస్తుంది. ఒక గ్రూపులో వస్తే, మరొక గ్రూపులో కూడా వస్తారు. ఇప్పుడు టీచర్లందరూ ఏమి చేస్తారు? రిజల్ట్ ఇస్తారు కదా! సెంటర్‌ను సిద్ధం చేస్తారు కదా! ఇది సాధ్యమే అని భావించే వారు చేతులు ఎత్తండి. అందరూ నిమిత్తులే. చిన్న కుమారి అయినా, కుమార్ అయినా, అన్నయ్యలు అయినా, అందరూ బాధ్యతగలవారే. ఒక సంవత్సరం సమయం ఇచ్చాము. ఒక నెల కాదు, ఒక సంవత్సరం ఇచ్చాము. మధుబన్ కూడా సిద్ధమవుతుంది కదా! మధుబన్ వారు చేతులు ఎత్తండి. మొదటి ఉదాహరణ ఎవరు అవుతారు? మధుబనా? లేక అందరూ కలిసి అవుతారా? మధుబన్ను కాపీ చేయడం అందరికీ బాగా వస్తుంది. మంచి విషయమైనా, ఏ విషయమైనా మధుబన్ను కాపీ చేయడం చాలా సులభంగా చేస్తారు అన్నది బాప్‌దాదా గమనించారు. పైగా స్లోగన్ కూడా తయారైంది - మధుబన్‌లో కూడా అలాగే జరుగుతుంది! ఈ సంవత్సరం మాత్రం ఈ స్లోగన్ చెప్పకండి. ఈ సంవత్సరపు స్లోగన్ - నేను చేయాలి. అది కూడా జరుగుతుంది, ఇది కూడా జరుగుతుంది, కాదు. నేనే చేయాలి. అర్జునుడు నేనే. వేరొకరు అర్జునుడు కాదు. నేను అర్జునుడిని. నేను నిమిత్తుడిని.
అచ్ఛా, ఈ మేళాలో మీకు లభించిన ఏర్పాట్లతో అందరూ సంతృప్తిగా ఉన్నారా? ఇప్పుడూ సంతృప్తిగానే ఉన్నారు, ఇక ముందు కూడా అలాగే ఉంటారు. మరి ఈ సంవత్సరం చివర, రాబోయే సంవత్సరం ఆరంభం - సంగమం అయింది కదా! ఈ సంగమ సమయంలో బాప్‌దాదా అందరికీ ఒక బిరుదును ఇస్తున్నారు - సంతుష్ట ఆత్మలు, సంతుష్ట మణులు. అన్నయ్యలైనా, అక్కయ్యలైనా, ఆత్మ మణియే. అందుకే అందరూ సంతుష్ట మణులే. ఎల్లప్పుడూ అలాగే ఉంటారు. సంతుష్టతను ఎప్పుడూ విడిచిపెట్టకండి. మీ సంతుష్టతను కదిలించడానికి ఎవరైనా ఎంత ప్రయత్నం చేసినా, మీరు కదలకండి. ఎల్లప్పుడూ సంతుష్టంగా ఉండండి. మీ ముఖం ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. ఒక్కోసారి ఇలా, ఒక్కోసారి అలా కాదు. ఎప్పుడూ చిరునవ్వుతో ఉన్న ముఖం. ముఖంలో కొంచెం మార్పు వచ్చినా, మీ పూజింపబడే చిత్రాన్ని ముందుంచుకుని చూడండి - నా చిత్రం నవ్వుతోంది, నేను మాత్రం ఆలోచిస్తున్నాను! అని. చిరునవ్వే సంతుష్టతకు గుర్తు. మరి ఏమవుతారు? ఏమి చేస్తారు? సంతుష్టమణులు అవుతారు. మీ ముఖంపై చిరునవ్వు తప్ప మరే గీతలు ఉండకూడదు. ఉదాసీనతను మీ దాసిగా చేసుకోండి. దానిని మీ ముఖంపైకి రానివ్వకండి. ఆర్డర్ ఇవ్వండి, అది రాదు. అచ్ఛా.
ఈ గ్రూపులో అయితే అన్ని జోన్లవారూ ఉన్నారు కదా! అందరిలో ఎక్కువ సంఖ్య ఎవరిది? (గుజరాత్) గుజరాత్ వారు మంచి ధైర్యం చూపించారు. (మహారాష్ట్ర, కర్ణాటక, ఈస్టర్న్, పంజాబ్, ఢిల్లీ, నేపాల్, యు.పి. మొదలైన అన్ని జోన్ల వారితో బాప్‌దాదా చేతులు ఎత్తించి కలుస్తున్నారు.) తమిళనాడు ఎక్కడుంది? తమిళనాడులో కూడా చాలా మంచి వృద్ధి ఉంది.
డబల్ విదేశీయులకు కూడా డబల్ అభినందనలు. నిర్మాణ సేవలో ఏ విభాగంలో పని చేసిన వారైనా లేచి నిలబడండి. నిర్మాణ సేవ చేసిన వారందరికీ బాప్‌దాదా వతనంలో మసాజ్ చేస్తారు.
ఎవరెవరు పని చేశారో వారందరూ వతనానికి రండి. వతనంలో మసాజ్ జరుగుతుంది. అచ్ఛా. చాలా బాగా చేశారు. (దీని వెనుక దాదీజీ, దాదీ జానకీజీల ప్రత్యేక ప్రేరణ ఉంది. అందరూ దాదీలకు అభినందనలు తెలిపారు) మీరందరూ చప్పట్లు కొట్టారు. బాప్‌దాదా కూడా మీ అందరికోసం చప్పట్లు కొడుతున్నారు. ఎందుకంటే మీరు అందరూ, ఈ సభ అంతా సహయోగులుగా నిలిచారు. అచ్ఛా.
నలువైపులా ఉన్న ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారందరికీ, సదా ఎకానమీ యొక్క అవతారమూర్తులుగా అయ్యి సమయాన్ని, సంకల్పాలను, వాణిని మరియు కర్మలను పొదుపు ఖాతాలో జమ చేసుకునేవారికి, సాకార మరియు ఆకార రూపంలో క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునే సికీలధే పిల్లలకు, బాప్‌దాదా చూస్తున్నారు - నలువైపులా ఉన్న పిల్లలు సాకారంలో కాకపోయినా ఆకార రూపంలోనైనా మధుబన్లోనే ఉన్నారు మరియు ఆకార రూపంలో జరుపుకుంటున్నారు. కావున అందరికీ బాప్‌దాదా క్రొత్త సంవత్సరానికి మరియు శాంతివన్ స్థాపనకు అభినందనలను మరియు ప్రియస్మృతులను ఇస్తున్నారు. సంతుష్టమణులందరికీ నమస్తే.
(దాదీజీ మరియు దాదీ జానకీజీ సింధీ సమ్మేళనం యొక్క సమాచారాన్ని బాప్‌దాదాకు వినిపించారు)
ఈ సమయంలో అందరూ కలిసి సేవ చేశారు. చివరగా సింధీ సమ్మేళనాన్ని కూడా నిర్వహించారు. భారతదేశంలో గానీ, విదేశాలలో గానీ సేవ చేసివారందరికీ, నిమిత్తులైన వారందరికీ నిజమైన జ్యోతిని వెలిగించినందుకు ప్రత్యేక అభినందనలు. (సింధీ సమ్మేళనానికి వచ్చిన సోదర సోదరీలను ఉద్దేశించి) ఇప్పుడు ఇక్కడ ఉన్నవారు లేచి నిలబడండి. చాలా మంచి బీజాన్ని వేశారు. దాని ఫలాన్ని చూస్తూ ఉండండి. చాలా మంచి సేవ చేశారు. అభినందనలు.
బాప్‌దాదా తమ కర కమలాలతో జెండాను ఆవిష్కరించారు, కొవ్వొత్తులను వెలిగించారు, కేక్‌ను కట్ చేసి, రాత్రి 12 గంటలకు పిల్లలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు ప్రియస్మృతులు అందించారు
పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి, నూతన సంవత్సరాన్ని ఆహ్వానించి, ప్రారంభించారు. ఎలా అయితే పాత సంవత్సరానికి వీడ్కోలు పలికారో, అలాగే ఈ సంవత్సరంలో ఏ లోపం, ఏ బలహీనత మిగిలి ఉన్నా వాటికి కూడా శాశ్వతంగా వీడ్కోలు పలికి, సర్వగుణాలను ఆహ్వానించి, నూతన ప్రపంచ స్మృతితో తీవ్ర గతితో ముందుకు సాగండి. పాత విషయాలను వదిలేయండి. పాత వాటికి వీడ్కోలు పలికారా? లేక అప్పుడప్పుడు మళ్లీ పిలుస్తారా? కాదు కదా! శాశ్వతంగా వీడ్కోలు పలికారా? ఈ 96వ సంవత్సరం ఇక మళ్లీ రాదు కదా! దానికి వీడ్కోలు పలికారు కదా! ఇప్పుడు 97వ సంవత్సరం వస్తుంది, 96వది కాదు. అందుకే పాత బలహీనతలను స్వాహా చేయండి. స్వాహా చేశారా? ఇది డైమండ్ జూబిలీ హాల్ కదా! డైమండ్ జూబిలీ హాల్ అంటే యజ్ఞం. యజ్ఞంలో స్వాహా చేసిన దానిని మళ్లీ తిరిగి తీసుకోరు. మరి మీరు స్వాహా చేశారా? అవునా? కాదా? అందరూ చేశారా? కొంచెం దాచుకుని పెట్టుకోలేదా? జేబు ఖర్చు అలవాటు ఉంటుంది కదా! అలాగే ఈ బలహీనతలను జేబు ఖర్చులా కూడా ఉంచుకోకండి. ఏం చేయాలి! పరిస్థితి అలాంటిది. కొంచెం చేయాల్సి వచ్చింది. అవసరానికి ఉంచుకోవాల్సిందే అని అనుకోకండి. జేబు ఖర్చులా కూడా ఉంచుకోకండి. స్వాహా అంటే పూర్తిగా స్వాహా. గతం గతమే. ఇక ఇప్పటి నుండి కొత్త విషయాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి నుంచే చేశారు కదా? అప్పుడు నిజమైన డైమండ్ అయ్యారు. అవ్వాలి, చూద్దాం, ఇంకా పక్కా కాదు, ఈ పాత భాషను ముగించండి. ఇక పాత మాటలు మాట్లాడకండి. తెలియదు, తెలియదు అని చెప్పకండి. చేయాల్సిందే అని కాదు. మనం ఏమి చేస్తామో అదే ఇతరులు కూడా చేస్తారు - ఈ పాఠాన్ని దృఢంగా చేసుకోండి. సరేనా? మరి అభినందనలు. శుభాకాంక్షలు. పదమారెట్లు శుభాకాంక్షలు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
