‘‘పాత సంస్కారాలను సమాప్తము చేసి తమ నిజ సంస్కారాలను ధారణ చేసుకుని ఎవరెడీగా అవ్వండి’’
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపుల ఉన్న విశ్వపిత యొక్క ప్రేమలో లవలీనులైన మరియు అదృష్టవంతులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి బాబాకు కూడా ఏమని గర్వంగా ఉంటుందంటే - వర్తమాన సమయములో నా పిల్లలు ఎంతటి గొప్పవారంటే మొత్తము కల్పములో, దేవతా స్వరూపములోగానీ, ధర్మనేతల రూపంలోగానీ, మహాత్ముల రూపంలోగానీ, పదమపతి ఆత్మల రూపంలోగానీ బ్రాహ్మణులైన మీకు ఎంతటి భాగ్యము ఉందో, అంతటి భాగ్యము ఇంకెవ్వరికీ లేదు. మరి ఇటువంటి మీ శ్రేష్ఠ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటున్నారా? వాహ్ భాగ్యవిధాత బాబా మరియు వాహ్ శ్రేష్ఠ ఆత్మనైన నా భాగ్యము అని ఈ ప్రణవనాద గీతాన్ని మనసులో సదా పాడుకుంటూ ఉంటారా! భాగ్యానికి చెందిన ఈ పాట సదా స్వతహాగానే మ్రోగుతూ ఉంటుందా? బాబా పిల్లలను చూస్తూ-చూస్తూ సదా హర్షితులవుతారు. పిల్లలు కూడా హర్షితులవుతారు కానీ అప్పుడప్పుడు మధ్యమధ్యలో తమ భాగ్యాన్ని ఇమర్జ్ చేసేందుకు బదులుగా మర్జ్ చేసేస్తారు. పిల్లలలో తమ సౌభాగ్యపు నషా, నిశ్చయము మర్జ్ అయిపోవటాన్ని చూసినప్పుడు బాబా ఏమంటారు? డ్రామా. కానీ బాప్‌దాదా పిల్లలందరినీ సదా భాగ్యం యొక్క స్మృతి స్వరూపులుగా చూడాలనుకుంటారు. మీరందరూ కూడా ఇదే కోరుకుంటారు కానీ మధ్యలో ‘కానీ...’ అనేది వస్తుంది. ఎవరిని అడిగినా సరే, పిల్లలందరూ - నేను బాబా సమానంగా అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్నే పెట్టుకుని నడుచుకుంటున్నాను అని అంటారు. లక్ష్యము చాలా బాగుంది. లక్ష్యము శ్రేష్ఠమైనది అన్నప్పుడు, చాలా మంచిది అన్నప్పుడు మరి ఒక్కోసారి ఇమర్జ్ రూపంలో, ఒక్కోసారి మర్జ్ రూపంలో ఎందుకుంటుంది? కారణమేమిటి? బాప్‌దాదాతో ఎంతో మంచి-మంచి ప్రతిజ్ఞలు కూడా చేస్తారు, ఆత్మిక సంభాషణ కూడా చేస్తారు, అయినా మళ్ళీ లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఎందుకుంటుంది? బాప్‌దాదా రిజల్టులో కారణమేంటి అన్నదానిని చూసారు. వాస్తవానికి అదేమిటి అనేది మీ అందరికీ తెలుసు, అది కొత్త విషయమేమీ కాదు, అయినా కూడా బాప్‌దాదా రివైజ్ చేయిస్తారు.
బాప్‌దాదా చూసారు, మూడు విషయాలు ఉన్నాయి - ఒకటేమో ఆలోచించటము, సంకల్పము చెయ్యటము. రెండవది మాట్లాడటము, వర్ణన చెయ్యటము మరియు మూడవది కర్మలలో ప్రాక్టికల్ అనుభవములోకి మరియు నడవడికలోకి తీసుకురావటము, కర్మలలోకి తీసుకురావటము. మూడింటిలో సమాన బ్యాలెన్స్ తక్కువగా ఉంది. బ్యాలెన్స్ ఉన్నప్పుడు నిశ్చయము మరియు నషా కనిపిస్తాయి మరియు బ్యాలెన్స్ తక్కువగా ఉంటే నిశ్చయము మరియు నషా మర్జ్ అయిపోతాయి. రిజల్టులో ఏమి చూడటం జరిగిందంటే - ఆలోచించే విధానము చాలా మంచిగా కూడా ఉంది మరియు వేగంగా కూడా ఉంది. మాటలలో వేగం మరియు నషా, అవి కూడా 75 శాతం కరెక్టుగానే ఉన్నాయి. మాట్లాడటంలో మెజారిటీ తెలివైనవారిగానే ఉన్నారు కానీ ప్రాక్టికల్ నడవడికలోకి తీసుకురావటంలో టోటల్ మార్కులు తక్కువగా ఉన్నాయి. కావున రెండు విషయాలలో బాగానే ఉన్నారు కానీ మూడవ విషయంలో చాలా తక్కువగా ఉన్నారు. కారణమేమిటి? సంకల్పాలు కూడా బాగున్నాయి, మాటలు కూడా చాలా సుందర రూపంలో ఉన్నాయి అన్నప్పుడు మరి ప్రాక్టికల్‌లో ఎందుకు తక్కువైపోతుంది? కారణమేమిటో తెలుసా? తెలుసా, తెలియదా చెప్పండి. మీకు చాలా బాగా తెలుసు. ఒకవేళ ఎవరికైనా - ఈ టాపిక్‌పై భాషణ చెయ్యండి లేక క్లాస్ చెయ్యండి అని చెప్తే ఎంత బాగా క్లాస్ చేయిస్తారు! చాలా నిశ్చయము, నషా, ఆత్మిక గర్వంతో భాషణ కూడా చేస్తారు, క్లాస్ కూడా చేయిస్తారు. చేయిస్తారు. ఏమేమి చెప్తున్నారు అని బాప్‌దాదా అందరి క్లాసులు వింటారు. వాహ్! వాహ్ పిల్లలూ వాహ్! అనుకుని నవ్వుకుంటూ ఉంటారు.
ముఖ్యమైన విషయము - బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, ఇప్పుడు రివైజ్ కోర్స్ నడుస్తూ ఉంది. బాబా ఏమంటున్నారంటే - కారణం ఒక్కటే ఉంది, ఎక్కువేమీ లేవు, ఒకటే కారణము ఉంది మరియు ఆ కారణాన్ని నివారణ చేయటము కూడా కష్టమేమీ కాదు, చాలా సహజము అని బాప్‌దాదా భావిస్తారు. కానీ సహజమైనదానిని కూడా కష్టంగా చేసుకుంటారు. అది కష్టమేమీ కాదు, కానీ అలా చేసుకుంటారు, ఎందుకని? నషా మర్జ్ అయిపోతుంది. ఒకటే కారణము ఉంది, ధారణకు సంబంధించిన విషయాలేవైతే వింటారో, చేస్తారో, శక్తుల రూపంలో కావచ్చు, గుణాల రూపంలో కావచ్చు, ధారణకు సంబంధించి చాలా మంచి-మంచి విషయాలను చెప్తారు, ఎంత బాగా చెప్తారంటే - వాటిని వినేవారు, వారు అజ్ఞానులు కావచ్చు, జ్ఞానులు కావచ్చు, వాటిని విని చాలా బాగుంది-చాలా బాగుంది అని అంటూ బాగా చప్పట్లు కొడతారు, చాలా బాగుంది అని అంటారు. కానీ, ఎన్ని సార్లు ‘కానీ’ అనేది వచ్చింది? ఈ ‘కానీ’ అన్నదే విఘ్నం కలిగిస్తుంది. ‘కానీ’ అన్న పదము సమాప్తమైపోవటము అనగా బాబా సమానంగా సమీపంగా రావటము మరియు బాబాకు సమీపంగా రావటము అనగా సమయాన్ని సమీపంగా తీసుకురావటము. కానీ ఇప్పటివరకు ‘కానీ’ అన్న పదాన్ని ఉపయోగించాల్సి వస్తుంది. ఇది బాబాకు మంచిగా అనిపించదు కానీ చెప్పాల్సి వస్తుంది. దీనికి కారణమేమిటి? ఏదైతే చెప్తున్నారో, ధారణ కూడా చేస్తున్నారో, అది ధారణ రూపంలో ధారణ చేస్తున్నారు మరియు ఆ ధారణ అనేది, కొందరికి కొద్ది సమయము నడుస్తుంది, కొందరికి ఎక్కువ సమయం కూడా నడుస్తుంది కానీ ఆ ధారణ అనేది ప్రాక్టికల్‌గా సదా పెరుగుతూ ఉండాలంటే దాని కొరకు ముఖ్యమైన విషయము ఇదే - ద్వాపరము నుండి అంతిమ జన్మ వరకు ఏవేవైతే అవగుణాలు లేక బలహీనతలు ఉన్నాయో, అవి సంస్కారాల రూపంలో ధారణ అయిపోయాయి మరియు సంస్కారాలుగా అయిన కారణంగా శ్రమించాల్సిన అవసరము ఉండదు. వదలాలని కూడా అనుకుంటారు, మంచిగా అనిపించదు కూడా, అయినా ఏం చెయ్యను, నా సంస్కారము అలా ఉంది అని అంటారు. మీరు తప్పుగా అనుకోవద్దు, నా సంస్కారమే అలా ఉంది అని అంటారు. కానీ సంస్కారము తయారైంది ఎలా? తయారుచేసుకున్నారు కాబట్టే తయారైంది కదా! కనుక ద్వాపరము నుండి ఈ తప్పుడు సంస్కారాలు ఏవైతే తయారయ్యాయో, వీటి వలన మీరు ఆ సమయానికి వద్దనుకున్నా వాటికి వశమవుతారు, కానీ మళ్ళీ - ఏం చెయ్యాలి, నా సంస్కారము అని అంటారు. అంటే సంస్కారాలు అనేవి సహజంగానే వద్దనుకున్నా కూడా ప్రాక్టికల్లోకి వచ్చేస్తాయి కదా! ఎవరికైనా క్రోధం వస్తే, వారు కాసేపటి తర్వాత - మీరు తప్పుగా అనుకోవద్దు, ఇది నా సంస్కారము అని అంటారు. క్రోధాన్ని సంస్కారంగా చేసుకున్నారు, అవగుణాన్ని సంస్కారంగా చేసుకున్నారు, మరి గుణాలను సంస్కారంగా ఎందుకు చేసుకోలేదు? క్రోధము అనేది అజ్ఞానపు శక్తి మరియు జ్ఞానము యొక్క శక్తి శాంతి, సహన శక్తి. మరి అజ్ఞానము యొక్క శక్తి అయిన క్రోధాన్ని చాలా బాగా సంస్కారంగా చేసుకున్నారు మరియు దానిని ఉపయోగిస్తూ కూడా ఉంటారు, మళ్లీ క్షమాపణలు కూడా అడుగుతూ ఉంటారు. క్షమించండి, ఇకపై ఇలా జరగదు అని అంటారు. కానీ మున్ముందు ఇంకా ఎక్కువగా జరుగుతుంది. కారణమేమిటి? ఎందుకంటే సంస్కారంగా చేసుకున్నారు. కనుక బాప్‌దాదా ఒకటే విషయాన్ని పిల్లలకు పదే-పదే వినిపిస్తున్నారు, అదేమిటంటే - ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞానపు విషయాన్ని సంస్కార రూపములో తయారుచేసుకోండి.
బ్రాహ్మణ ఆత్మల నిజ సంస్కారములు ఏవి? క్రోధమా లేక సహనశక్తా? ఏది? సహనశక్తి, శాంతి శక్తి... ఇవే కదా! మరి అవగుణాలనైతే సహజముగానే సంస్కారాలుగా చేసుకున్నారు, వాటిని బాగా లోతుగా లోపల నింపేసుకున్నారు, కనుక అవి వద్దనుకుంటున్నా బయటకు వస్తూ ఉంటాయి. అలా ప్రతి గుణాన్ని బాగా లోతుగా సంస్కారంగా చేసుకోండి. నా నిజ సంస్కారము ఏది? ఇది సదా గుర్తుంచుకోండి. అక్కడ రావణుని ఆస్తిని సంస్కారంగా చేసుకున్నారు. పరాయి వస్తువును మీదిగా చేసుకున్నారు. ఇప్పుడు బాబా ఖజానాను మీదిగా చేసుకోండి. రావణుని వస్తువును చాలా జాగ్రత్త చేసి పెట్టుకున్నారు కానీ బాబా వస్తువును మాయం చేసేస్తారు, ఎందుకిలా? రావణునిపై ప్రేమ ఉందా! రావణుడు మంచిగా అనిపిస్తాడా లేక బాబా మంచిగా అనిపిస్తారా? అనటానికైతే అందరూ బాబా మంచిగా అనిపిస్తారు అని అంటారు, మనసుతో ఇలానే అంటున్నారు కదా? కానీ ఎవరైతే మంచిగా అనిపిస్తారో, వారి మాట నిశ్చయమనే ఇంకుతో మనసులో ఇమిడిపోతుంది. ఎవరైనా రావణుని సంస్కారానికి వశమైనా కూడా - బాబా, మీరంటే నాకు చాలా ప్రేమ, చాలా ప్రేమ అని అంటూ ఉంటే, బాబా అడుగుతారు - ఎంత ప్రేమ ఉంది? ఆకాశం కంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది అని అంటారు. బాబా అది విని - వీరు ఎంత అమాయకపు పిల్లలు అని సంతోషిస్తారు కూడా. అయినా కూడా బాబా అంటారు, బాబా పిల్లలందరికీ మాట ఇచ్చారు - ఒకవేళ మనస్ఫూర్తిగా ఒక్కసారైనా కూడా ‘‘నా బాబా’’ అని అన్నారంటే, ఆ తర్వాత మళ్ళీ మధ్యమధ్యలో మర్చిపోయినా సరే, ఒక్కసారైనా మనస్ఫూర్తిగా ‘‘నా బాబా’’ అని అన్నారంటే బాబా కూడా - మీరు ఎవరైనా సరే, ఎలా ఉన్నా సరే, మీరు నా వారే అని అంటారు. నాతో పాటు అయితే తీసుకునే వెళ్ళాలి. కేవలం బాబా కోరుకునేది ఏమిటంటే - ఊరేగింపులో ఒకరిగా రావద్దు, ప్రేయసిగా అయ్యి రండి. ఇది విని అందరూ చాలా సంతోషిస్తున్నారు. మీపై మీకు నవ్వు కూడా వస్తుంది.
ఇప్పుడు వింటున్నప్పుడు మీపై మీరు నవ్వుకుంటారు కదా! మీపై మీకే నవ్వు వస్తుంది కానీ ఆవేశంలోకి వచ్చినప్పుడు ముఖం ఎర్రగా అయిపోతుంది, పాలిపోతుంది. కానీ బాబా రిజల్టులో చూసారు, పిల్లలలో ఒక విశేషత చాలా బాగుంది, అది ఏమిటి? పవిత్రతలో ఉండటము, దీని కొరకు ఎంతగా సహించాల్సి వచ్చినా, వ్యతిరేకించేవారు ఎంత ఎదుర్కున్నా కానీ ఈ విషయంలో 75 శాతం మంచిగా ఉన్నారు. కొంతమంది గొప్పలు చెప్పుకున్నా కానీ 75 శాతం మంది ఈ విషయంలో పాస్ అయ్యి చూపించారు. ఇప్పుడు దీని తర్వాత రెండవ సబ్జెక్టు ఏది వస్తుంది? క్రోధము. దేహభానమైతే మొత్తానికి సంబంధించినది. కానీ ఏం గమనించటం జరిగిందంటే, క్రోధమనే సబ్జెక్టులో చాలా తక్కువమంది పాస్ అయ్యారు. బహుశా క్రోధమనేది వికారమేమీ కాదు, అది ఒక శస్త్రము, వికారము కాదు అని భావిస్తుండవచ్చు. కానీ క్రోధము జ్ఞాన స్వరూప ఆత్మలకు మహాశత్రువు ఎందుకంటే క్రోధము అనేక ఆత్మల సంబంధ-సంపర్కములోకి రావటం ద్వారా ప్రసిద్ధమైపోతుంది మరియు క్రోధాన్ని చూసి బాబా పేరుకు చాలా నింద జరుగుతుంది. చూసాములే జ్ఞాన స్వరూప పిల్లలను అని అంటారు. క్రోధానికి చాలా రూపాలు ఉన్నాయి. ఒకటేమో, మహారూపము, దాని గురించి మీకు బాగా తెలుసు - ఫలానావారు క్రోధం చేస్తున్నారు అని అది కనిపిస్తుంది. రెండవది - క్రోధము యొక్క సూక్ష్మ స్వరూపముగా లోపల ఈర్ష్య, ద్వేషము, అయిష్టము ఉంటాయి. ఈ స్వరూపంలో గట్టిగా మాట్లాడటము ఉండదు, బయటకు ఏమీ కనిపించదు, కానీ ఏ విధంగా బయటకు క్రోధం ఉన్నప్పుడు ఆ క్రోధము అగ్ని రూపము కదా, అది లోపల స్వయాన్ని కూడా దహించి వేస్తూ ఉంటుంది మరియు ఇతరులను కూడా దహించి వేస్తుంది. అలాగే ఈర్ష్య, ద్వేషము, అయిష్టము లాంటివి ఎవరిలో అయితే ఉంటాయో, వారు ఈ అగ్నిలో లోలోపలే కాలిపోతూ ఉంటారు. బయటకు ముఖం ఎర్రగా, పాలిపోయినట్లు అవ్వదు, అలా ఎర్రగా, పాలిపోయినట్లు అవ్వటము కొంచెం నయమే, కానీ వీరు నల్లగా అయిపోతారు. మూడవది, క్రోధానికి చతురతతో కూడిన రూపం కూడా ఉంది, అది ఏమిటి? ఎలా మాట్లాడుతూ ఉంటారు మరియు ఎలా భావిస్తూ ఉంటారంటే - అక్కడక్కడ సీరియస్ అవ్వాల్సే ఉంటుంది, అక్కడక్కడ కళ్యాణం కోసం లా ను (చట్టాన్ని) చేతిలోకి తీసుకోవాల్సే వస్తుంది. ఇప్పుడిందులో కళ్యాణముందా లేదా అన్నది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. బాప్‌దాదా ఎవ్వరికీ ‘లా’ ను (చట్టాన్ని) తమ చేతిలోకి తీసుకునే అనుమతిని ఇవ్వలేదు. క్రోధం చేయకండి కానీ ‘లా’ ను చేతిలోకి తీసుకోండి అని ఏ మురళిలోనైనా చెప్పారా? ‘లా’ ను చేతిలోకి తీసుకునేవారి లోపలి రూపము క్రోధము యొక్క అంశముతో కూడినదే ఉంటుంది. నిమిత్త ఆత్మలెవరైతే ఉంటారో, వారు కూడా ‘లా’ ను చేతిలోకి తీసుకోరు, కానీ వారు ‘లా’ ను రివైజ్ చేయించాల్సి ఉంటుంది. ‘లా’ ను ఎవ్వరూ చేతిలోకి తీసుకోకూడదు కానీ నిమిత్తమైనవారు బాబా ద్వారా తయారుచేయబడిన ‘లా’ ను రివైజ్ చేయాల్సి ఉంటుంది. నిమిత్తమైనవారికే ఈ అనుమతి ఉంది, అందరికీ లేదు.
ఈరోజు బాప్‌దాదా కొంచెం గంభీరంగా శిక్షణనిస్తున్నారు, ప్రేమతో స్వీకరించండి ఎందుకంటే బాప్‌దాదా పిల్లలు వ్రాసిన, చేసిన ప్రతిజ్ఞలను చూసి, విని నవ్వుకుంటూ ఉంటారు. ప్రతి గుణాన్ని నిజ సంస్కారంగా చేసుకోండి అని బాప్‌దాదా ఇప్పుడు ఏదైతే వినిపించారో దానిని అండర్లైన్ చేసారా? మరి ఇప్పటినుండి - శాంత స్వరూపములో ఉండటము, సహనశీలురుగా అవ్వటము అనేది నా నిజ సంస్కారముగా అయిపోయింది అని అనాలి. మళ్ళీ బాప్‌దాదా మిలనాన్ని జరుపుకోవటానికి వచ్చే సమయానికి ఈ 5-6 నెలలలో వీటిని మీ నిజ సంస్కారంగా తయారుచేసుకుని చూపించండి. అందుకే ఈరోజు రిజల్టు వినిపిస్తున్నాము. క్రోధము యొక్క రిపోర్టులు చాలా వస్తాయి. చిన్నవారు, పెద్దవారు అందరూ రకరకాల రూపాలలో క్రోధం చేస్తారు. ఇప్పుడు బాప్‌దాదా ఎక్కువ వివరంగా తెలియజేయరు, కానీ కథలు చాలా సరదాగా ఉంటాయి. మరి ఈరోజు నుండి క్రోధాన్ని ఏం చేస్తారు? వీడ్కోలు ఇస్తారా? (అందరూ చప్పట్లు కొట్టారు). చూడండి, చప్పట్లు కొట్టడం చాలా సహజము కానీ క్రోధమనే చప్పట్లు మోగకూడదు. బాప్‌దాదా ఇప్పుడిక దీనిని పదే-పదే వినాలని అనుకోవటం లేదు, అయినా కూడా దయ కలుగుతుంది కావున వింటారు. కాబట్టి ఇప్పటినుండి ఇలా అనకండి - బాబా, ప్రతిజ్ఞనైతే చేసాము కానీ... మళ్ళీ-మళ్ళీ వచ్చేసింది, ఏం చెయ్యాలి! కోరుకోము, కానీ వచ్చేస్తుంది, మీరే మాయకు అర్థం చేయించండి, క్రోధానికి అర్థం చేయించండి. ఈ పురుషార్థాన్ని కూడా బాబానే చెయ్యాలి కానీ ప్రారబ్ధాన్ని పిల్లలు తీసుకుంటారా? ఈ శ్రమను కూడా బాబానే చెయ్యాలా? ఇటువంటి ప్రతిజ్ఞను చెయ్యవద్దు, మళ్ళీ 5 నెలల తర్వాత రిజల్టును చూస్తాము. మీరు చెప్పినా, చెప్పకపోయినా కానీ బాబా వద్దకైతే చేరుకుంటుంది. ఏం చెయ్యాలి, అలా అయిపోతుంది, పరిస్థితులు అలా వస్తాయి, విషయం చాలా పెద్దదైపోయింది కదా - అని ఇటువంటి రిజల్టు ఉండకూడదు. బాబాకు కూడా అర్థం చేయించడానికి ప్రయత్నిస్తారు, చాలా తెలివైనవారు. ఏమంటారంటే - బాబా, చిన్న-చిన్న విషయాలను మేము దాటేస్తాము, కానీ ఈ విషయము పెద్దది కదా! ఇప్పుడు దోషాన్ని ఎవరిపై మోపారు? విషయముపై. విషయము ఏం చేస్తుంది? వస్తుంది-పోతుంది. 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ విషయము వస్తుంది. ఏ విషయమైతే 5000 సంవత్సరాల తర్వాత వచ్చేది ఉందో, దానిపై దోషం మోపుతారు. అలా చెయ్యకండి. ఏం చెయ్యాలి...! అనేది సంకల్పములో కూడా రానివ్వకండి. బాప్‌దాదా క్రోధం గురించి ఎందుకు ఇంత విశేషంగా చెప్తున్నారు? ఎందుకంటే ఒకవేళ మీరు క్రోధానికి వీడ్కోలు ఇచ్చారంటే, ఇందులో లోభము, కోరిక అన్నీ వచ్చేస్తాయి. లోభమనేది కేవలము ధనం, తినటం విషయములోనే ఉండదు, అది రకరకాలుగా ఉంటుంది. జ్ఞానానికి సంబంధించైనా, అజ్ఞానానికి సంబంధించైనా, ఏ కోరిక ఉన్నా, అది కూడా లోభమే. క్రోధాన్ని సమాప్తం చెయ్యటం ద్వారా లోభం స్వతహాగానే సమాప్తం అయిపోతుంది, అహంకారం కూడా సమాప్తం అయిపోతుంది. అభిమానము వస్తుంది కదా - నేను పెద్దవాడిని, నేను తెలివైనవాడిని, నాకు తెలుసు, వీళ్ళు అసలు వీళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? అప్పుడు క్రోధము వస్తుంది. కనుక అభిమానము మరియు లోభము, ఈ రెండూ కూడా వీడ్కోలు తీసేసుకుంటాయి, అందుకే బాప్‌దాదా విశేషంగా లోభము గురించి చెప్పకుండా క్రోధం గురించి అండర్లైన్ చేయిస్తున్నారు. మరి సంస్కారముగా చేసుకుంటారా? ఇప్పుడు అందరూ చేతులెత్తండి మరియు అందరి ఫోటోను తియ్యండి (అందరూ చేతులెత్తారు). ఇప్పుడు కొద్దిగా అభినందిస్తాము, ఎక్కువ అభినందించము, తర్వాత మళ్ళీ రిజల్టు చూసినప్పుడు వతనములోని దేవతలు కూడా, స్వర్గములోని దేవతలు కూడా మీపై వాహ్, వాహ్ అనే పూలను వేస్తారు.
ఈరోజు నుండి ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోండి, ఇతరులను చూడకండి. ఇతరులలో ఈ విషయాలను చూసే మనసు యొక్క నేత్రాన్ని మూసెయ్యండి. ఈ నేత్రాలనైతే మూయలేరు కదా, కానీ మనసు యొక్క నేత్రాన్ని మూసెయ్యండి. రెండోవారు చేస్తున్నారా, మూడోవారు చేస్తున్నారా, నేను అది చూడను. బాబా ఇంకెంత ఫోర్స్ పెట్టి చెప్తున్నారంటే ఒకవేళ అరుదుగా ఎవరైనా మహారథి ఇటువంటి బలహీనతను చూపించినా కూడా, దానిని చూసేందుకు మరియు వినేందుకు మనసును అంతర్ముఖిగా చేసుకోండి. ఒక నవ్వొచ్చే విషయం చెప్పమంటారా, బాప్‌దాదా ఈరోజు కాస్త స్పష్టంగా వినిపిస్తున్నారు, తప్పుగా అనుకోవడం లేదు కదా. అచ్ఛా, ఇంకొక విషయాన్ని కూడా స్పష్టంగా వినిపిస్తాము. బాప్‌దాదా చూసారు - మెజారిటీ ఎప్పటికప్పుడు, సదా కాదు కానీ అప్పుడప్పుడు మహారథులలోని విశేషతలను తక్కువగా చూస్తారు మరియు బలహీనతలను చాలా లోతుగా చూస్తారు మరియు ఫాలో చేస్తారు. ఒకరికొకరు చెప్పుకుంటారు కూడా - ఏంటిది, అందరినీ చూసేసాము, మహారథులు కూడా చేస్తారు, మేమైతే తర్వాత వచ్చినవారము, ఇప్పుడు మహారథులు మారితే మేము మారుతాము. కానీ మహారథుల తపస్య, మహారథులు బహుకాలపు పురుషార్థము వారికి అదనంగా మార్కులను ఇప్పించి పాస్ విత్ ఆనర్‌గా చేసేస్తాయి. కానీ మీరేమో - మహారథులు మారితే మేము మారుతాము అని ఈ ఎదురుచూడటంలోనే ఉండిపోతారు కావున మోసపోతారు, అందుకే మనసును అంతర్ముఖిగా చేసుకోండి. అర్థమైందా. బాప్‌దాదా ఈ మాటలను కూడా చాలా వింటూ ఉంటారు - చూసాములే... చూసాములే, మాకు కూడా కళ్ళున్నాయి కదా, మాకు కూడా చెవులున్నాయి కదా, మేము కూడా చాలానే వింటాము అని అంటారు. కానీ ఈ విషయంలో మహారథులతో పోటీ పడవద్దు. మంచిలో పోటీ పడండి, చెడులో పోటీ పడవద్దు లేదంటే మోసపోతారు. బాబాకు దయ కలుగుతుంది ఎందుకంటే మహారథుల విషయంలో నిశ్చయమనే పునాది ఎడతెగనిది, అచంచలమైనది, కనుక ఆ విషయంలో మహారథులకు అదనపు ఆశీర్వాదాలు లభిస్తాయి, అందుకే ఎప్పుడూ కూడా మనసు యొక్క నేత్రాన్ని ఈ విషయంలో తెరవద్దు, మూసెయ్యండి. వినేందుకు బదులు మనసును అంతర్ముఖీగా ఉంచుకోండి. అర్థమైందా!
ఈరోజు వేడి వేడి హల్వా తినిపించాము. కానీ మీ నిజ సంస్కారాలను తయారు చేసుకోండి. మీరు చేసే శ్రమ కూడా బాప్‌దాదాకు నచ్చదు. బాప్‌దాదా పిల్లల ఒక అద్భుతమైన చిత్రాన్ని చూశారు. ఆ చిత్రాన్ని చూస్తారా? వినాలనుకుంటున్నారా లేక చాలా హల్వా తినేశారా? చాలా అద్భుతమైన చిత్రం. బాప్‌దాదాకు కూడా అది ఆశ్చర్యంగా అనిపించింది. ఆ చిత్రంలో ఏమి చూశారు? పిల్లలు ఒకటి చెబుతున్నారు, మరొకటి చేస్తున్నారు. నోటితో, మేము లక్ష్మీ-నారాయణులం అవుతాం, సీతారాములు కాదు, లక్ష్మీ-నారాయణులం అవుతాం అంటున్నారు. చెప్పేవారి నోట్లో గులాబ్జామున్. కానీ చేస్తున్నారు ఏమిటి? అడగండి, లక్ష్మీ-నారాయణులవుతారా? పక్కాగా అవుతారా? అంటారు - అవును, 100 శాతం లక్ష్మీ-నారాయణులమే అవుతాం. కానీ చిత్రం ఏమి చూపిస్తోంది? త్రేతాయుగంలోని రామునిలా యుద్ధం చేస్తూనే ఉంటారు. చేతిలో విల్లు, బాణం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. లక్ష్మీ-నారాయణులం అవుతాం అంటారు, కానీ ప్రాక్టికల్‌లో త్రేతాయుగ రామునిలా యుద్ధమే చేస్తుంటారు. సగం సమయం యుద్ధంలో, సగం సమయం యోగంలో. అందరూ కాదు, కానీ చాలామంది. అందుకే బాప్‌దాదాకు ఈ చిత్రం చూసి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మీరు ఏదైతే చెప్తున్నారో, ఏదైతే మంచిమంచిగా ఆలోచిస్తున్నారో వాటినే చేయాలి. దానికి సులభమైన విధిని చెప్పాము, మీ అసలైన నిజ సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. సంస్కారం ద్వారా సహజంగానే కర్మ జరుగుతుంది. శ్రమ తక్కువ, విజయం ఎక్కువ. శ్రమ నుండి విముక్తి పొందుతారు. ఎలా అయితే, అర్థకల్పం విశ్వానికి అధిపతులుగా అయినప్పుడు అనేక రకాల శ్రమల నుండి సహజంగానే విముక్తి పొందుతారో, అలాగే ఈ సమయంలో నిజ సంస్కారాలను తయారు చేసుకుంటే సులభంగా శ్రమ నుండి విముక్తి పొందుతారు. అప్పుడప్పుడు విల్లు ఎత్తి యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు. నిరంతర యోగి, సహజ యోగి, కర్మయోగి, రాజయోగిగా సహజంగానే అయిపోతారు. యోగం చేయాల్సిన అవసరం ఉండదు. ప్రతి సెకను, ప్రతి సమయంలో యోగి జీవితం సహజంగానే ఉంటుంది. అలానే కావాలనుకుంటున్నారు కదా!
జ్ఞానం, యోగం, ధారణ, సేవ - ఈ నాలుగు సబ్జెక్టుల సారం రెండు మాటలు. ఒకటి - బాబాయే నా ప్రపంచం. రెండవది - ప్రతి గుణం, ప్రతి శక్తి నా నిజ సంస్కారం. కాబట్టి రెండు మాటలు గుర్తుంచుకోండి - ప్రపంచం మరియు సంస్కారం. కష్టమా? కొంచెం కొంచెం కష్టమా? పరిస్థితి వచ్చినప్పుడు కష్టమవుతుందా? కానీ పరిస్థితి పెద్దదా, బాబా పెద్దవారా? ఎవరు పెద్దవారు? కానీ ఆ సమయంలో పరిస్థితే పెద్దదిగా అనిపిస్తుంది. బాప్‌దాదా దగ్గర అలాంటి సమయాల్లో పిల్లల ఫోటోలు చాలా ఉన్నాయి. ఒక మ్యూజియం ఉంది. ఎప్పుడైనా వస్తే చూడండి. మీ ఫోటోనే చూసుకోండి. కానీ ఇప్పుడు సమాప్తి సెరిమనీ జరుపుకోండి. మీరు ఈ సమాప్తి సెరిమనీ జరుపుకున్నప్పుడు విశ్వ పరివర్తన సెరిమనీ మీ ముందుకు వస్తుంది.
ఇంకొక విషయం వినిపించమంటారా? వినడానికి సిద్ధంగా ఉన్నారా? పిల్లలు యజమానులు కదా! కాబట్టి యజమాని ఆర్డర్ తీసుకొని చెప్పాలి. ఇది అనంతమైన హాల్ కదా. చూడండి, రౌండ్ మాలలా కనిపిస్తోంది కదా. ఇక్కడికి వచ్చి చూస్తే కూడా రౌండ్ మాలలానే కనిపిస్తుంది. మీకు ముఖాలే కనిపిస్తాయి అంతే. కాబట్టి ఈ అనంతమైన హాల్లో బాప్‌దాదా కూడా ఈరోజు విశాల హృదయంతో అనంతమైన విషయాలు చెబుతున్నారు. నిన్న ఏ రోజు? (బుధవారం). కాబట్టి ఇది బుధవారం జరిగిన విషయం. ఈరోజు అయితే రాత్రి జరిగిన ఆట చూసి అందరూ కొంచెం అలసిపోయారు. కొంచెం ఇబ్బంది అయింది కదా! (రాత్రి తుఫానుతో కూడిన వర్షం వచ్చింది.) కానీ చివరి సమయంలో ఇంకా చాలా జరుగుతుంది. కొంచెం రిహార్సల్ అయితే మంచిదే. కొంచెం రిహార్సల్ కావాలి. బ్యాగులు, సామాన్లు సర్దుకొని పరుగెత్తడం - ఇదంతా ఒక వ్యాయామం అయ్యింది. సాధారణంగా వృద్ధ మాతలు పరుగెత్తరు, కానీ రాత్రి పరుపు, సూట్‌కేసు తీసుకొని పరుగెత్తారు. అందుకే ఇదీ ఒక ఆటే. వ్యాయామం అయింది కదా! కాళ్లు కదిలాయి కదా. ఈ చిన్న రిహార్సల్ ఫైనల్ ముందు ఏమాత్రం కాదు. దీనికీ అభ్యాసం ఉండాలి. బాప్‌దాదా చెప్పారు - ఎవరెడీగా ఉండండి. ఇందులో కూడా ఎవరెడీ. వర్షం పడింది అంటే సెకనులో బయలుదేరాలి. ఎవరైనా డిస్టర్బ్ అయ్యారా? సెకనులో సెట్ అయిపోయారు. బాప్‌దాదాకు కూడా తెలుసు, ఇంకా పూర్తిగా సిద్ధం కాలేదంటే పిల్లలు కొంచెం తక్కువగా వస్తారని. కానీ ఎంత తక్కువగా రమ్మని చెప్పినా అంత ఎక్కువగా వస్తూనే ఉన్నారు. ఎర్రజెండా చూపించినా, రాకండి అన్నా, అయినా వచ్చేస్తున్నారు. ఇదీ ఆటే. పిల్లల స్నేహం చూసి బాప్‌దాదాకు చాలా సంతోషం కలుగుతుంది. అందుకే ఎప్పుడూ పిల్లలతో, రండి పిల్లలూ, రండి అని అంటారు. రాకండి అని ఎలా అంటాను? అలా చెప్పగలనా? కాబట్టి ఎంతమంది వచ్చారో, అందరూ సంతోషంగా వచ్చారు, సంతోషంతోనే వెళ్లండి. టోలీతో పాటు ముందుగా సంతోషాన్ని పంచండి. ఆ తరువాత టోలీని పంచండి. అచ్ఛా.
నిన్నటి విషయం చెబుతాను. నిన్న వతనంలో అడ్వాన్స్ పార్టీ ఇమర్జ్ అయింది. వారు బాప్‌దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు. మమ్మల్ని ఏ సేవ కోసం నిమిత్తంగా పంపించారో, ఆ సేవ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అని అడిగారు. బాప్‌దాదా ఏమి సమాధానం చెప్పి ఉంటారు? వారు మళ్లీ మళ్లీ ఇదే చెబుతున్నారు, అడ్వాన్స్ పార్టీలో మాకు జన్మనిచ్చింది ఒక విశేష కార్యం కోసం. అత్యుత్తమ యోగీ ఆత్మలు, జ్ఞానీ ఆత్మలు, మహావీరులు కూడా చాలామంది అడ్వాన్స్ పార్టీలోకి వెళ్లారు. వారితో పాటు వెళ్లిన వారిలో కూడా ఎక్కువ మంది స్నేహశీలులు, గుప్త యోగులు. అందరిలోనూ మిక్స్ ఉంటారు. కానీ మీ లెక్క ప్రకారం మహారథులు కానివారిగా భావించే సాధారణ ఆత్మలు కూడా స్నేహం కారణంగా యోగంలో ఎంతో శక్తివంతంగా ఉన్నారు. ముఖ్యంగా యోగం సబ్జెక్టులో ముందున్న అలాంటి ఆత్మలు యోగబలం ద్వారా జన్మనిచ్చే నిమిత్తమై కొత్త సృష్టి స్థాపన చేస్తారు. అందుకే వారు అడుగుతున్నారు, మా సేవ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఇందులో కూడా కొన్ని ఆత్మలకు ప్రత్యేకమైన పాత్ర ఉంది. అందరిదీ ఒకేలా కాదు. కానీ ఎక్కువమందికి కొత్త సృష్టి స్థాపన పాత్ర ఉంది. అలా ఆత్మిక సంభాషణ జరుగుతోంది. బాప్‌దాదా చిరునవ్వుతో వారిని వేరే విషయాలలో బిజీ చేశారు. ఎందుకంటే ‘‘ఎప్పుడు’’ అనే ప్రశ్నకు సమాధానం బాప్‌దాదా ఒక్కరే ఇవ్వరు. మీ అందరూ ఇవ్వాలి. మీరు ఎవరెడీ అని చెప్పినప్పుడు వారి సేవ ప్రారంభమవుతుంది. అందుకే వినాశన సమయం ఎప్పుడూ ఫిక్స్ కాదు. అకస్మాత్తుగా జరుగుతుంది. బాప్‌దాదా ముందే సూచన ఇచ్చారు. బాబా, కొంచెం ముందే చెప్పాల్సింది అని అప్పుడు అభ్యంతరం చెప్పకండి. అకస్మాత్తుగా జరుగుతుంది. ఎవరెడీగా ఉండాలి. దీనికోసం ఒక నిమిత్త మహారథిని ఉదాహరణగా చేశారు. (దాదీ చంద్రమణి). అంతా డ్రామా ప్రకారమే అయినా, ఒక విశాల సేవకు ఉదాహరణ కూడా ఉంటుంది. కాబట్టి ఏమి చేస్తారు? బాప్‌దాదాను కలిసినప్పుడు అందరూ మనసుతో చెప్పండి. కాగితంపై చేసే వాగ్దానం కాదు, నోటితో చేసే వాగ్దానం కాదు. మనసుతో వాగ్దానం చేసి చూపండి - మేమందరం పాత సంస్కారాలను సమాప్తం చేసి, మా నిజ సంస్కారాలను ధారణ చేసుకునే ఎవరెడీ ఆత్మలము. సరేనా? చేస్తారా? చిన్న చిన్న విషయాలను సమాప్తం చేయండి. అరవై సంవత్సరాల వృద్ధుడు చిన్నపిల్లల్లా బంతితో ఆడుకుంటున్నట్లు ఉంటుంది. బాగుండదు. బంతితో కాదు, మట్టితో ఆడుకుంటున్నారు. దేహాభిమానమనే మట్టితో ఆడుకుంటున్నారు. ఇప్పుడు జ్ఞాన రత్నాలతో ఆడండి. గుణాలతో ఆడండి. శక్తులతో ఆడండి. మట్టితో కాదు. ఎలాంటి దేహాభిమానమైనా మట్టితో ఆడుకోవడమే. విన్నారా! వతనం యొక్క సమాచారము విన్నారా!
మీ అందరి యజ్ఞమాత సరస్వతి మాత విశేషంగా అందరికీ ప్రియస్మృతులు పంపించారు. అందరూ పంపించారు కానీ ప్రత్యేకంగా యజ్ఞమాత మీ అందరికీ హృదయపూర్వక ప్రియస్మృతులు పంపిస్తూ ఒక మహామంత్రాన్ని గుర్తు చేశారు - ఇప్పుడు ఇంటికి వెళ్లడానికి సిద్ధం అవ్వండి. అన్ని ఒడ్డులను వదిలేయండి. పదండి, ఎగిరండి. యజ్ఞమాతపై ప్రేమ ఉంది కదా! అచ్ఛా.
ఈరోజు చాలా విషయాలు చెప్పాము. ఇప్పుడు ఒక సెకనులో మనస్సు, బుద్ధిని పూర్తిగా ప్రశాంతంగా చేసి, ఒక్క బాబాయే అన్ని సంబంధాలు, బాబాయే ప్రపంచం. వ్యక్తి సంబంధాలైనా, ప్రాప్తులైనా, ఇదే ప్రపంచం. కాబట్టి ఒక్క బాబాయే ప్రపంచం. ఆ బాబా స్మృతిలో, ఆ రూపంలో, ఆ రసంలో, ఆ అనుభూతిలో లీనమైపోండి. (బాప్‌దాదా 3 నిమిషాలు డ్రిల్ చేయించారు.) అచ్ఛా.
ఈరోజు టీచర్లు కూడా వచ్చారు కదా. టీచర్లు చేతులు ఎత్తండి. ప్రత్యేక కార్యక్రమం ప్రకారం భట్టీకి వచ్చినవారు చేతులు ఎత్తండి. విశేషంగా టీచర్ల పట్ల బాప్‌దాదా ఎప్పుడూ సంతోషిస్తారు. పెద్దవారైనా, చిన్నవారైనా, తమ జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకోవడంలో చాలా మంచి న్యాయనిర్ణేతలుగా ఉన్నారు. వెంటనే తమ జీవితంపై నిర్ణయం తీసుకున్నారు - నేను ఈ సేవాజీవితమే గడపాలి. ఈ వాగ్దానం టీచర్లందరూ చేశారు కదా! లేదా కొన్నిసార్లు, ఇలా ఉంటుందని ముందే తెలిసి ఉంటే చేసేవాళ్లం కాదు అని అనుకుంటారా? అలా అనుకోరు కదా! ఇక్కడ మీరు ఒక పాట వేస్తారు. అది బయటిది కావచ్చు లేదా మీది కావచ్చు. అందులో బాబాతో, మీ పూలంటే ప్రేమ, ముళ్లంటే కూడా ప్రేమ (తేరే ఫూలేం సే భీ ప్యార్...) అని పాడుతారు. ఆ పాట పాడుతారు కదా! అది మనసులో కూడా ధారణ అయిందా? ముళ్లపై ప్రేమ ఉంటే ముళ్లు గుచ్చుతాయి కదా! ముళ్లను ప్రేమగా, జాగ్రత్తగా ఎత్తుకుంటే అవి కూడా ప్రియంగా అనిపిస్తాయి. నిర్లక్ష్యంగా పట్టుకుంటే కోపమనే రక్తం కూడా వస్తుంది. అలాంటివారు కాదు కదా మీరు! మీరు ప్రేమించే వారు కదా. చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న ముళ్లలాంటివి. కానీ మీకు ముళ్లంటే కూడా ప్రేమ. ఎందుకంటే ముళ్లు అంటే చిన్న చిన్న విషయాలే, అవే మిమ్మల్ని అనుభవీలుగా చేస్తాయి.
బాప్‌దాదాకు ఈ గ్రూపుపై, ఇప్పుడు వచ్చినవారిపైనా, ఇంకా రానున్నవారిపైనా, పెద్దలకంటే కూడా ఎక్కువ ప్రేమ ఉంది. ఎందుకు? పేరుకు చిన్నవారు, కానీ సేవలో పెద్దవారు. చూడండి, ప్రదర్శనను ఎవరు వివరిస్తారు? పెద్దవారా, లేక మీరా? కోర్స్ ఎవరు నిర్వహిస్తారు? మంచి ప్రసంగాలు ఎవరు చేస్తారు? మీరే కదా! అందుకే బాప్‌దాదా పేరుకు చిన్నవారైనా, సేవలో మిమ్మల్ని పెద్దలకంటే కూడా పెద్దవారిగా భావిస్తారు. ఒక్క విషయం - భయపడకండి. భయపడడం బలహీనుల పని. మీరు మహావీరులు, ధైర్యవంతులు. కాబట్టి భయపడవద్దు. మనసును ఎప్పుడూ చిన్నది చేసుకోవద్దు. విశాల హృదయంతో ఉండండి. మీరు గొప్పవారైన బాబా పిల్లలు కదా! చిన్న బాబా పిల్లలు కాదు కదా! కాబట్టి చిన్న హృదయం వద్దు. చిన్న హృదయం చేసుకోవద్దు, చిన్న చిన్న విషయాలకు భయపడవద్దు. ఎప్పుడూ ఈ స్లోగన్ గుర్తుంచుకోండి, చూడటానికి చిన్నవారమే అయినా, పెద్ద పని చేసి చూపిస్తాం. పెద్దల సహయోగులమవుతాం. పెద్దలపై కన్నెర్ర చేయము, సహయోగులమై ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు తెస్తాం. అలాంటి టీచర్లేనా? అలా అనుకుని, అలాగే చేస్తున్నాం, అలాగే చేస్తాం అని భావించే వారు చేతులు ఎత్తండి. వీరంతా చాలా ధైర్యవంతులు. చేతులు ఎత్తడం చాలా సులభం. చూస్తూ ఉండండి! అయినప్పటికీ మీ భాగ్యాన్ని చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మీకూ బాబాపై చాలా ప్రేమ ఉంది కదా! అందుకే బాబాకూ మీపై ఎంతో ప్రేమ ఉంది. ఒక్కటి మాత్రమే గుర్తుంచుకోండి - చిన్న హృదయం చేసుకోవద్దు. కోమలంగా ఉండవద్దు. మహావీరులుగా ఉండండి. ముఖంపై ఎప్పుడూ బలహీనత గానీ, కోమలత్వం గానీ కనిపించకూడదు. నిర్మాణత వేరు, కోమలత్వం వేరు. నిర్మాణంగా ఉండండి, కానీ కోమలంగా కాదు. కోమలం అంటే నీటి పండులా, నీళ్లు తగిలితే వెంటనే కరిగిపోవడం, అలాంటి కోమలత్వం కాదు. కమాల్ చేసి చూపించండి. పెద్దల ముందూ విషయాలు వస్తాయి, మీ ముందూ వస్తాయి. కానీ మీరు మాత్రం, మేము ఉదాహరణగా నిలుస్తాం. మేము జ్ఞానంలో, యోగంలో ముందుంటాం, ముందే ఉంటాం అని భావించండి. విషయాలను పట్టించుకోవద్దు. ముఖం ఎప్పుడూ హర్షితంగా ఉండాలి. మనసూ, శరీరమూ ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలి. అర్థమైందా? కమాల్ చేసి చూపిస్తారా? ఎప్పుడూ మనసు వాడిపోకూడదు. చిరునవ్వుతో ఉండాలి. సాధ్యమా?
టీచర్లు చెప్పండి - హా జీ? నిజంగానే హా జీ అంటున్నారా లేక కాదు జీ అంటున్నారా? మనసుతో అంటున్నారా లేక నోటితో? చూడండి, బాప్‌దాదా ప్రత్యేకంగా కలవడానికి కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాబట్టి ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి. అప్పుడు మీ పూజ్య స్వరూపం స్మృతిచిహ్నంగా నిలుస్తుంది. అందరూ సంతోషంగా ఉన్నారా? బాప్‌దాదాను కలిశారా? మాట్లాడారా? ఇప్పుడు జరిగే భట్టీలో ఈ గ్రూపులోని టీచర్లందరూ నంబర్‌వన్ కావాలి. సెకండ్ నంబర్ కాదు. అది సెకండ్ గ్రూపు పేరు. మీరు సెకండ్ కాదు. కాబట్టి ఈ సెకండ్ గ్రూపు అన్ని విషయాలలోనూ నంబర్‌వన్ కావాలి. అచ్ఛా.
టీచర్లు చాలా ప్రియమైనవారు కదా! సేవ కూడా చాలా చేస్తున్నారు కదా! పగలు-రాత్రి సేవలో నిమగ్నమై ఉన్నారు. అలాగే శాంతివన్, మధుబన్, జ్ఞాన సరోవర్, హాస్పిటల్, సంగమ్ భవన్ - ఎక్కడెక్కడ సేవలో ఉన్నారో, ఆ సేవాధారులందరికీ బాప్‌దాదా ప్రేమ మసాజ్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరైతే సేవ చేస్తున్నారో వారందరూ తమను తాము ప్రేమ మసాజ్‌ను అనుభవిస్తున్నట్లు భావించండి. ఎంతమంది పేర్లు చెబుతాను? చూడండి, మీ అందరి సేవ ఉంది. మీరు వచ్చారు కాబట్టే సేవాధారులకు సేవాభాగ్యం లభించింది. కాబట్టి మొదట మీరు. వచ్చేవారు రాకపోతే సేవాధారులు ఎవరికి సేవ చేస్తారు? కాబట్టి మీ మహత్వం కూడా ఉంది కదా! అచ్ఛా.
నలువైపులా ఉన్న బాప్‌దాదా యొక్క సర్వ లవలీన ఆత్మలకు, బాబా యొక్క సర్వ సేవాధారి ఆత్మలకు, సహజ పురుషార్థాన్ని అలవరచుకునే సర్వ శ్రేష్ఠ ఆత్మలకు, సదా బాబా సమానంగా అవ్వాలనే లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా తయారుచేసుకునేవారికి, బాబాకు సమీప ఆత్మలకు బాప్‌దాదా యొక్క చాలా-చాలా ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా, డబల్ విదేశీయులు బాగున్నారా? చేతులు ఊపండి. చాలా మంచిది - చూడండి, డబల్ విదేశీయులు అయితే కూర్చోవడానికి కూడా డబల్ హాల్ కావాలి. అందుకే మిమ్మల్ని ఈ డబల్, ట్రిబల్ హాల్లో కూర్చోబెట్టారు. డబల్ విదేశీయులకు బాగానే అనిపిస్తుందా? బాప్‌దాదాకు కూడా అనంతమైనదే మంచిగా అనిపిస్తుంది. కానీ ఈ అనంతమైనది కూడా హద్దుగా అయిపోయింది. ఇప్పుడే చిన్నదిగా అయిపోయింది. ఇప్పుడు ఏమి చేస్తారు? చూడండి, చివరి వరకు పూర్తిగా నిండిపోయి కూర్చున్నారు. వృద్ధి అయితే జరగాల్సిందే. అచ్ఛా.
డబల్ విదేశీయులు ఈ సీజన్లో సంతోషంగా ఉన్నారా? జ్ఞాన సరోవర్‌లో సంతోషంగా ఉన్నారా? చూడండి, డబల్ విదేశీయులు, డబల్ భాగ్యవంతులు. దాదీలందరూ మీ కోసం జ్ఞాన సరోవర్కు వస్తారు. మీకు రావడానికి శ్రమ చేయాల్సిన అవసరం ఉండదు. వారే అక్కడికి వచ్చేస్తారు. సికీలధే కదా. కాబట్టి సికీలధేలకు శ్రమ ఇవ్వరు. మీ దగ్గరకు దాదీలందరూ, దాదాలందరూ వస్తారు కాబట్టి బాగానే అనిపిస్తుంది కదా. డబల్ విదేశీయుల సీజన్లో కేవలం మిమ్మల్ని మీరే చూస్తుంటారు. అప్పుడప్పుడు భారతవాసులను కూడా చూడండి. అందుకే ఇప్పుడు కలిపారు. కలిపి ఉండటం బాగుంటుందా లేక విడిగా ఉండటం బాగుంటుందా? అచ్ఛా. చివరికి ఇప్పుడు డబల్ విదేశీయులు అయినప్పటికీ, ఒరిజినల్‌గా మీరు భారతవాసులే కదా, విదేశీయులు కాదు కదా! భారతవాసులే కదా! రాజ్యం ఎక్కడ చేస్తారు? అమెరికాలోనా, లండన్లోనా లేక భారతదేశంలోనా? భారతదేశంలోనే చేస్తారు కదా. అందుకే ఇది భారతదేశం మరియు విదేశాల సంగమం. బాప్‌దాదా మిమ్మల్ని ఈ రూపంలోనే చూస్తారు - ఆది భారతవాసులు మరియు ఇప్పటికీ భారతదేశంలోనే ఉంటారు, భారతవాసులుగా అవుతారు. అచ్ఛా.
జగదీష్ అన్నయ్య మరియు ఇతర ముఖ్య అన్నయ్యలతో:- సేవలో మొదటి సేవకు నిమిత్తులుగా అవ్వడం మరియు సేవలో సమర్పితులుగా ఉండడం - ఇది మీ విశేష పార్ట్. అచ్ఛా. నలుగురికీ వారి వారి పార్ట్ ఉంది. అందరి విశేషత వారివారిదే.
అందరి విశేషత అవసరమే కదా. వీరి విశేషత కూడా అవసరం, మీది కూడా అవసరం. ఎన్నో పదార్థాలు కలిస్తేనే రుచికరమైన వంటకం తయారవుతుంది కదా. అలాగే అందరి విశేషతలు కలిసినప్పుడే సేవలో రుచి వస్తుంది.
అందరి విశేషత కావాలి. చాలా మంచిది. దాదీలు చెప్పారు, పాండవులు అంగీకరించారు - ఇది చాలా మంచి విషయం. ఎప్పుడైనా పిలిస్తే హా జీ, హా జీ. మీ సంఘటన ఆధారంగానే మొత్తం దైవీ కుటుంబం నడుస్తుంది. అందుకే దాదీలు ఎలా నిమిత్తులో, అలాగే మీరు కూడా నిమిత్తులే. బాధ్యతగలవారే. అలా ఉన్నారా లేదా? ప్రతి విషయంలో మేమంతా సేవకు తోడుగా ఉన్నాము అని భావించండి. ఇది 10-12 మంది కాదు, ఒక్కటే. ఇందులో యజ్ఞం యొక్క శోభ ఉంది. బాప్‌దాదా అందరినీ ఎవరెడీగా చూసి చాలా సంతోషిస్తున్నారు. కార్యాలు పెరుగుతూనే ఉంటాయి. తగ్గవు. సంఘటన యొక్క శక్తి వాతావరణానికి ఎంతో శక్తిని ఇస్తుంది. రైట్ హ్యాండ్స్ మీరే కదా! విశేష రైట్ హ్యాండ్స్. బాగానే ఉంది కదా? ఆలోచనలో అయితే లేరు కదా? లేరు. నిమిత్తులే. నిమిత్తులుగా ఉండి చివరి వరకు సహకారపు వేలు అందించాలి. అచ్ఛా.
అందరూ బాగున్నారా! సేవలో సఫలత ఉంది కదా! వృద్ధి కూడా జరుగుతోంది, విధి కూడా స్పష్టమవుతోంది. సహజంగానే ఉంది కదా?
(మోహిని అక్కయ్య అమెరికా సమాచారాన్ని వినిపిస్తున్నారు) హృదయపు ప్రేమను తీసుకువచ్చారు. ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు - ఎంతగా సేవతో ప్రేమ ఉందో, అంతే బాబాతో కూడా హృదయపూర్వక ప్రేమ ఉంది. కాబట్టి హృదయపు ప్రేమ హృదయానికి చేరుస్తుంది. చాలా బాగా చేశారు. ఇది ఎగిరే కళకు స్మృతిచిహ్నము. ఎలా స్థూలంలో ఎగిరి వచ్చారో కదా, అలాగే ఈ ఎగరడం, ఎగిరే కళ యొక్క విధిని సిద్ధం చేస్తుంది. మంచి వేగం ఉంది. బాగుంది.
వేదాంతి అక్కయ్యతో:- మీరు ఛత్రఛాయ మధ్యలో ఉన్నారు. సేవ బాగానే సాగుతోంది. డోంట్ కేర్.
సుదేశ్ అక్కయ్యతో:- అందరినీ ప్రేమతో నడిపించండి. ముందుగా వీరిని సరిచేస్తే, తర్వాత జరుగుతుంది. ఇంకా మరింత శక్తివంతమైన స్థితితో ముందుగా ఈ ఆత్మలను దృఢంగా చేయండి, సరేనా!
చక్రధారి అక్కయ్యతో:- రష్యా అయితే మంచిగా ఉంది. ఫలితం బాగుంది. భూమి కూడా మంచిగా ఉంది. రష్యా యొక్క భూమి మంచిగా ఉంది కాబట్టే ఫలాలు త్వరగా వస్తున్నాయి.
ఈ సమయంలో ఎవరైతే శాంతివన్ సేవలో హాజరై ఉన్నరో వారు చేతులు ఎత్తండి. ఇండోర్ వారు చేతులు ఎత్తండి. సేవ బాగా చేస్తున్నారు. ఉల్లాస-ఉత్సాహాలతో సేవ చేస్తున్నారు మరియు అనేకమంది ఆశీర్వాదాలను పొందుతున్నారు. ఇలాగే ఎల్లప్పుడూ సేవలో ఆశీర్వాదాలను పొందుతూ ఉండండి.
డా. అశోక్ మెహతా గారి బిడ్డతో:- అదృష్టవంతుడివి కదా! బ్రాహ్మణ కుటుంబానికి ప్రియమైనవాడివి. చూడండి, లౌకిక కుటుంబంలో కూడా అదృష్టవంతుడివి, అలౌకిక కుటుంబంలో కూడా అదృష్టవంతుడివి. ఇప్పుడు వెళ్లి ఏమి చేస్తావు? ఈరోజు ఏ పాఠం నేర్చుకున్నావు? (కోపం తగ్గించుకుంటాను.) అయితే ఇక్కడ కోపాన్ని వదిలి వెళ్తున్నావు. ఎప్పుడైనా కోపం వస్తే ఈ హాల్‌ను స్మృతిలోకి తీసుకురా. చాలా మంచిది. ఇలాగే వికసించిన ఆత్మిక గులాబీగా ఉండు.
*** ఓంశాంతి ***
