‘‘సహచరుడిని తోడుగా పెట్టుకుని సాక్షి మరియు సంతోషము అనే సింహాసనాధికారులుగా అవ్వండి’’
ఈరోజు విశ్వ కళ్యాణకారి తండ్రి విశ్వములో నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలందరి స్నేహము మరియు సహయోగము యొక్క రేఖలు పిల్లల ముఖము ద్వారా కనిపిస్తూ ఉన్నాయి. ప్రతి ఒక్కరి మనసు నుండి వచ్చే ‘‘నా బాబా’’ అన్న పాటను బాప్‌దాదా వింటున్నారు. బాప్‌దాదా కూడా బదులుగా ‘ఓ నా అతి ప్రియమైన, అతి స్నేహీ అల్లారు ముద్దు పిల్లలూ’ అని అంటారు. ప్రతి బిడ్డ ప్రియమైన బిడ్డ, అలాగే అల్లారు ముద్దు బిడ్డ కూడా, ఎందుకు? కోట్లలో కొందరు మరియు ఆ కొందరిలో కూడా కొందరు అయినవారు. కనుక అల్లారు ముద్దు పిల్లలయ్యారు కదా! బాప్‌దాదా కూడా అల్లారు ముద్దు పిల్లలను చూసి సంతోషిస్తారు. పిల్లలను కూడా సదా సంతోషంలో నాట్యం చేస్తూ ఉండటాన్ని చూస్తున్నారు మరియు సదా చూడాలనుకుంటారు. సంతోషంలోనైతే ఉంటారు కానీ సదా అలా ఉండాలని తండ్రి కోరుకుంటారు. సదా సంతోషంగా ఉంటున్నారా లేక సంతోషంలో ఏమైనా తేడా వస్తుందా? ఒక్కోసారి చాలా సంతోషము, ఒక్కోసారి కాస్త తక్కువ మరియు ఒక్కోసారి చాలా తక్కువ అన్నట్లు ఉంటుందా!
బాబా ఇంతకుముందు కూడా వినిపించారు - వర్తమాన సమయములో విశ్వానికి పిల్లలైన మీ ద్వారా ఏ సేవ యొక్క అవసరముందంటే - ముఖము ద్వారా, నయనాల ద్వారా, రెండు మాటల ద్వారా ప్రతి ఆత్మ యొక్క దుఃఖాన్ని దూరం చేసి సంతోషాన్ని ఇవ్వండి. మిమ్మల్ని చూడటంతోనే సంతోషపడాలి, అందుకే సంతోషకరమైన ముఖము మరియు సంతోషకరమైన మూర్తి సదా ఉండాలి ఎందుకంటే మనసులోని సంతోషము ముఖము ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఎవరు ఎంతగా భ్రమిస్తూ ఉన్నా, వ్యాకులతతో ఉన్నా, దుఃఖపు అలలోకి వచ్చినా, సంతోషంగా ఉండటము అసంభవము అని భావించినా కానీ మీ ముందుకు రావటంతోనే మీ మూర్తి, మీ వృత్తి, మీ దృష్టి ఆత్మను పరివర్తన చేయాలి. ఈరోజుల్లో మనసు సంతోషంగా ఉండేందుకు ఎంత ఖర్చు చేస్తున్నారు, మనోరంజనం కొరకు ఎన్ని క్రొత్త-క్రొత్త సాధనాలను తయారుచేస్తున్నారు. అవి అల్పకాలికమైన సాధనాలు మరియు మీది సదాకాలికమైన సత్యమైన సాధన. కావున ఈ సాధన ఆ ఆత్మలను పరివర్తన చేయాలి. అయ్యో-అయ్యో అని అనుకుంటూ వచ్చినవారు వాహ్-వాహ్ అంటూ వెళ్ళాలి. పరమాత్మకు చెందిన ఆత్మలది ఎంత అద్భుతము, వాహ్! అని అనాలి. ఈ సేవను చెయ్యండి. ఎప్పటికప్పుడు అల్పకాలిక సాధనాల ద్వారా ఎంతగా వ్యాకులపడుతూ ఉంటారు, అటువంటి సమయంలో మీ సంతోషము వారికి ఆధారంగా అవుతుంది ఎందుకంటే మీరు ఉన్నదే భాగ్యశాలురుగా. భాగ్యశాలురా కాదా? అసంపూర్ణంగా అయితే లేరు కదా? ఉన్నదే భాగ్యశాలురుగా. మీ వంటి భాగ్యశాలురుగా మొత్తం కల్పంలో ఇతర ఏ ఆత్మలూ లేరు. అంతటి నషాను ముఖము మరియు నడవడిక ద్వారా అనుభవం చేయించండి. చేయించగలరా లేక చేయిస్తూ ఉన్నారు కూడానా?
బ్రాహ్మణ జీవితంలో ఒకవేళ సంతోషం లేకపోతే బ్రాహ్మణులుగా అయ్యి ఏం చేసినట్లు! బ్రాహ్మణ జీవితం అనగా సంతోషము యొక్క జీవితము. అప్పుడప్పుడు బాప్‌దాదా చూస్తూ ఉంటారు - కొందరి ముఖాలు ఎలా ఉంటాయంటే, అవి కాస్త... అప్పుడు ఏమవుతుంది? అది మీకు బాగా తెలుసు, అందుకే నవ్వుతున్నారు. బాప్‌దాదాకు అటువంటి ముఖాలను చూసి దయ కూడా కలుగుతుంది మరియు కొద్దిగా ఆశ్చర్యం కూడా కలుగుతుంది. నా పిల్లలు, కానీ ఉదాసీనులా! ఇది సాధ్యమేనా? కాదు కదా! ఉదాసీనులు అనగా మాయకు దాసులు. కానీ మీరైతే మాస్టర్ మాయాపతులు. మాయ మీ ముందు అసలేమిటి? మామూలు చీమ కూడా కాదు, అది చనిపోయిన చీమ. దూరం నుండి చూస్తే అది బ్రతికి ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వాస్తవానికి అది చనిపోయినది. కేవలం దూరం నుండే పరిశీలించే శక్తి కావాలి. ఏ విధంగా తండ్రి యొక్క జ్ఞానాన్ని విస్తారంగా తెలుసుకుంటారు కదా, అలా మాయ యొక్క బహురూపీ రూపాలను గుర్తించి, ఆ జ్ఞానాన్ని బాగా ధారణ చేయండి. అది కేవలం భయపెడుతుంది. ఏ విధంగా చిన్న పిల్లలు ఉంటారు కదా, వారిని నిర్భయులుగా చేయడానికి తల్లిదండ్రులు భయపెడతారు. నిజానికి ఏమీ చెయ్యరు కానీ కావాలని భయపెడతారు. అలాగే మాయ కూడా తనవారిగా చేసుకునేందుకు బహురూపాలను ధరిస్తుంది. మాయ బహురూపాలను ధరించినప్పుడు మరి మీరు కూడా బహురూపిగా అయ్యి దానిని పరిశీలించండి. పరిశీలించలేకపోతున్నారు కదా, అప్పుడు ఏ ఆటను ఆడుతారు? అయ్యో, మాయ వచ్చేసింది అని యుద్ధం చెయ్యటం మొదలుపెడతారు. అలా యుద్ధం చెయ్యటం వలన మనసు-బుద్ధి అలసిపోతాయి. అప్పుడు ఆ అలసటతో ఏమంటారు? మాయ చాలా ప్రబలమైనది, మాయ చాలా తీవ్రమైనది అని అంటారు. అది అసలేమీ కాదు. మీ బలహీనతయే రకరకాల మాయా రూపాలుగా అవుతుంది. బాప్‌దాదా సదా పిల్లలు ప్రతి ఒక్కరినీ భాగ్యపు నషాలో, సంతోషకరమైన ముఖంతో, సంతోషమనే ఔషధముతో ఆరోగ్యంగా ఉన్నట్లు మరియు సదా సంతోషపు ఖజానాలతో సంపన్నంగా ఉన్నట్లు చూడాలనుకుంటారు. జీవితంలో అసలేమి కావాలి? ఔషధము మరియు ఖజానా. వేరే ఇంకేమి కావాలి? మరి మీ వద్ద సంతోషమనే ఔషధము ఉందా లేక స్టాక్ ఎప్పుడైనా సమాప్తమైపోతుందా? సంతోషపు ఖజానా తరగనిది. తరగనిదే కదా? దాన్ని ఎంతగా ఖర్చు పెడతారో అంతగా పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ వేరే ఏ పురుషార్థము చెయ్యకపోయినా కానీ, కేవలం ఒక్క లక్ష్యాన్ని పెట్టుకోండి - ఏం జరిగినా కానీ, మానసిక స్థితి ద్వారానైనా, ఇతర ఆత్మల ద్వారానైనా, ప్రకృతి ద్వారానైనా, వాయుమండలము ద్వారానైనా, ఏం జరిగినా కానీ నేను సంతోషాన్ని వదిలిపెట్టకూడదు. ఇది సహజ పురుషార్థమే కదా లేక సంతోషం జారిపోతుందా? సహజమేనా లేక అప్పుడప్పుడు కష్టమవుతుందా? దృఢ సంకల్పాన్ని ఉంచండి మరియు విషయాలను మర్చిపోండి. ఒకే విషయాన్ని పక్కాగా ఉంచుకోండి - నేను సంతోషంగా ఉండాలి. అప్పుడు ఇతర విషయాలు ఎలా అనిపిస్తాయి? ఆట. ఆటలను చూసేందుకు సాక్షి స్థితి అనే మీ సీట్‌పై సదా స్థితులై ఉండండి. ఎవరైనా మిమ్మల్ని అవమానపరిచేవారైనా లేక మిమ్మల్ని వ్యాకులపరచి మీ సాక్షి స్థితి అనే గౌరవము నుండి కిందకు దించేవారైనా, మీరు సాక్షి స్థితి అనే సీట్ నుండి కిందకు రాకండి. మీరు కిందకు వచ్చేస్తారు, అందుకే సంతోషము తగ్గిపోతుంది.
బాప్‌దాదా ఇంతకుముందు కూడా రెండు మాటలను వినిపించారు - సహచరుడు మరియు సాక్షి. బాప్‌దాదా తోడుగా ఉన్నట్లయితే సాక్షి స్థితి అనే సీట్ సదా దృఢంగా ఉంటుంది. బాప్‌దాదా తోడుగా ఉన్నారు, బాప్‌దాదా తోడుగా ఉన్నారు అని అనటానికి అందరూ అంటారు కానీ మాయ యొక్క ప్రభావం కూడా పడుతూ ఉంటుంది, మళ్ళీ బాప్‌దాదా తోడుగా ఉన్నారు, బాప్‌దాదా తోడుగా ఉన్నారు అని అంటూ ఉంటారు. తోడుగా ఉన్నారు, కానీ సహచరుడిని అటువంటి సమయములో ఉపయోగించుకోరు, పక్కకు పెట్టేస్తారు. ఎలాగైతే ఎవరైనా తోడుగా ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా పనిలో బాగా బిజీ అయిపోతే లేక అలాంటి-ఇలాంటి విషయం ఏదైనా జరిగితే, అప్పుడు ఆ తోడుగా ఉన్నవారు గుర్తుండరు, విషయాలలో పడిపోతారు. ఆ మాటకొస్తే బాబా తోడుగా ఉన్నారు అని అంగీకరిస్తారు కూడా, అనుభవం కూడా చేస్తారు. తోడుగా లేరు అనే అనేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ అలా అనరు. అందరూ నాతోనే ఉన్నారు అని అంటారు, నీతో ఉన్నారు అని కూడా అనరు. ప్రతి ఒక్కరూ నాతో ఉన్నారు అనే అంటారు. నా సహచరుడు అనే అంటారు. ఇలా మనసుతో అంటారా లేక నోటితోనా? మనసుతో అంటారా?
బాప్‌దాదా అయితే ఆటను చూస్తారు, బాబా తోడుగా కూర్చుని ఉన్నారు కానీ మీరు మీ పరిస్థితులలో, వాటిని ఎదుర్కోవటంలో ఎంతగా లీనమైపోతారంటే తోడుగా ఎవరు ఉన్నారు అన్నది కూడా చూడరు. మరి అప్పుడు బాబా కూడా ఏం చేస్తారు? బాబా కూడా సహచరుడి నుండి మారిపోయి సాక్షిగా అయ్యి ఆటను చూస్తారు. అలా చెయ్యకండి కదా. సహచరుడు అని అంటున్నప్పుడు ఆ తోడును నిర్వర్తించండి, పక్కకు ఎందుకు పెట్టేస్తారు? బాబాకు ఇది మంచిగా అనిపించదు. పిల్లలు ప్రతి ఒక్కరూ స్వరాజ్య అధికారుల నుండి విశ్వ అధికారులుగా అవుతారు అని బాబా ఈ శుభ ఆశను పెట్టుకుంటారు మరియు అది వాస్తవం కూడా. మీరేమైనా ప్రజలా! ప్రజలుగా అయితే అవ్వకూడదు కదా? మీరు రాజులు, మహారాజులు, విశ్వ రాజులు కదా! మీరు ప్రజలను తయారుచేసేవారు, అంతేకానీ ప్రజలుగా తయారయ్యేవారు కాదు. మీరు రాజులుగా తయారయ్యేవారు, ప్రజలను తయారుచేసుకునేవారు. మరి రాజు ఎక్కడ కూర్చుంటారు? సింహాసనంపై కూర్చుంటారు కదా! ప్రాక్టికల్‌గా రాజు యొక్క నషాలో ఉన్నట్లయితే సింహాసనంపై కూర్చుంటారు కదా! కావున సాక్షి స్థితి అనే సింహాసనాన్ని వదలకండి. వేరే-వేరే పురుషార్థాలేవైతే చేస్తారో వాటిలో అలసిపోతారు. ఈరోజు మనసా చేసారు, రేపు వాచా చేసారు, సంబంధ-సంపర్కాలది చేసారు, ఇలా అయితే అలసిపోతారు. ఒకటే పురుషార్థము చెయ్యండి - సాక్షి మరియు సంతోషము అనే సింహాసనాధికారులుగా ఉండాలి. ఈ సింహాసనాన్ని ఎప్పుడూ వదలకూడదు. ఎవరైనా రాజు చాలా సీరియస్‌గా సింహాసనంపై కూర్చుని ఉంటే, కూర్చున్నది సింహాసనంపైనే కానీ వారు చాలా క్రోధంగా, అఫిషియల్‌గా ఉంటే మంచిగా అనిపిస్తుందా? వీరు రాజు కాదు అని అంటారు. మరి మీరు సదా సింహాసనాధికారులే కదా! ఆ రాజులైతే ఒక్కోసారి సింహాసనంపై కూర్చొంటారు, ఒక్కోసారి కూర్చోరు, కానీ సాక్షి స్థితి అనే సింహాసనం ఎటువంటిదంటే ప్రతి కార్యాన్ని చేస్తూ కూడా సింహాసనాధికారులుగా ఉండవచ్చు, కిందకు దిగాల్సిన అవసరం ఉండదు. నిద్రిస్తున్నా సింహాసనాధికారులు, లేస్తూ-తిరుగుతూ, సంబంధ-సంపర్కాలలోకి వస్తూ ఉన్నా సింహాసనాధికారులు. సింహాసనంపై కూర్చోవటం వస్తుందా లేక రాదా, జారిపోతూ ఉంటారా? సాక్షి స్థితి యొక్క సింహాసనాధికారిగా ఉన్న ఆత్మ ఎప్పుడూ ఏ సమస్యలోనూ వ్యాకులతకు లోనవ్వదు. సమస్య సింహాసనం కింద ఉండిపోతుంది మరియు మీరు పైన సింహాసనాధికారులుగా ఉంటారు. సమస్య మీ ముందు తలెత్తలేదు, కిందే అణిగి ఉంటుంది, మిమ్మల్ని వ్యాకులపరచదు. ఎవరినైనా అణిచేస్తే లోలోపలే సమాప్తమైపోతారు కదా. బాప్‌దాదాకు అటువంటి సమయంలో ఆశ్చర్యమనిపిస్తుంది. మీరు ఆశ్చర్యపడకండి, మీ విషయంలో అశ్చర్యపడితే ఆశ్చర్యపడండి కానీ ఇతరులను చూసి కాదు. ఏం ఆశ్చర్యమనిపిస్తుందంటే - నా పిల్లలు అసలు ఏం చేస్తున్నారు, సింహాసనంపై నుండి దిగిపోతున్నారు. సింహాసనాధికారులుగా అయ్యే సంస్కారాన్ని ఇప్పటి నుండే అలవరచుకున్నట్లయితేనే విశ్వ సింహాసనంపై కూడా కూర్చుంటారు. ఇక్కడ సదాకాలికముగా సింహాసనాధికారులుగా ఉండకపోతే, అక్కడ కూడా సదా అనగా పూర్తి సమయమంతా కూర్చోలేరు. అన్ని సంస్కారాలనూ ఇప్పుడే నింపుకోవాలి. నింపుకున్న ఈ సంస్కారాలే సత్యయుగములో పని చేస్తాయి. రాయల్టీ యొక్క సంస్కారాలను ఇప్పటి నుండే నింపుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం సమయం ఉందిలే, ఇంతలోనే వినాశనమవ్వదులే అని అనుకోకండి. వినాశనం అకస్మాత్తుగా జరుగనున్నది. సరేనా, సిద్ధంగా ఉన్నారా అని అడిగి రాదు. అంతా అకస్మాత్తుగా జరుగనున్నది. మీరు కూడా బ్రాహ్మణులుగా ఎలా అయ్యారు? అకస్మాత్తుగానే సందేశం లభించింది, ప్రదర్శనీని చూసారు, సంబంధ-సంపర్కములోకి వచ్చారు, మారిపోయారు. ఈ తారీఖుకు బ్రాహ్మణులుగా అవుతాము అని ఏమన్నా ఆలోచించారా? అకస్మాత్తుగానే అలా అయ్యారు కదా! కనుక పరివర్తన కూడా అకస్మాత్తుగా జరుగనున్నది. ముందు మాయ మిమ్మల్ని ఇంకా నిర్లక్ష్యులుగా చేస్తుంది. ఎలా ఆలోచిస్తారంటే - మేమైతే 2000 సంవత్సరము అని అనుకున్నాము, అది కూడా పూర్తయిపోయింది, ఇప్పుడు కాస్త రెస్ట్ తీసుకుంటాము. ముందుగా మాయ తన గారడీని వ్యాపింపజేస్తుంది, నిర్లక్ష్యులుగా చేస్తుంది. ఏ విషయంలోనైనా, సేవలోనైనా, యోగంలోనైనా, ధారణలోనైనా, సంబంధ-సంపర్కములోనైనా - ఇది నడుస్తూనే ఉంటుంది, ఇది జరుగుతూనే ఉంటుంది... అని మొదట మాయ నిర్యక్ష్యులుగా చేసే ప్రయత్నం చేస్తుంది. తర్వాత అకస్మాత్తుగా వినాశనం అవుతుంది, అప్పుడు మళ్ళీ - బాప్‌దాదా చెప్పనే లేదు, ఇలా కూడా జరుగుతుందా అని అనకండి. అందుకే ముందుగానే వినిపిస్తున్నాము - ఎప్పుడూ ఏ విషయములోనూ నిర్ల్యక్షులుగా అవ్వకండి. నాలుగు సబ్జెక్టులలోనూ అలర్ట్‌గా ఉండాలి. ఇప్పటికిప్పుడే ఏమైనా జరిగినా అలర్ట్. ఆ సమయములో మళ్ళీ – బాప్‌దాదా, ఇప్పుడు రండి, ఇప్పుడు తోడుగా ఉండండి, ఇప్పుడు కాస్త శక్తినివ్వండి అని అనకండి, ఆ సమయములో ఇవ్వరు. ఇప్పుడు ఎంత శక్తి కావాలంటే అంత, ఏది కావాలంటే అది జమ చేసుకోండి. అందరికీ పూర్తి అవకాశం ఉంది, ఇది తెరిచి ఉన్న ఖజానా, ఎంత శక్తి కావాలంటే అంత, ఏ శక్తి కావాలంటే అది తీసుకోండి. పరీక్ష సమయంలో టీచర్ లేక ప్రిన్సిపాల్ సహాయం చెయ్యరు.
డబల్ విదేశీ పిల్లలను చూసి తండ్రికి కూడా డబల్ సంతోషము కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది? ఎందుకంటే డబల్ విదేశీయులకు స్వయాన్ని పరివర్తన చేసుకోవటంలో డబల్ శ్రమ చెయ్యవలసి వచ్చింది. కనుక బాప్‌దాదాకు డబల్ విదేశీ పిల్లలను చూసినప్పుడు డబల్ సంతోషము కలుగుతుంది. వాహ్ నా డబల్ విదేశీ పిల్లలూ వాహ్! డబల్ విదేశీయులు చేతులెత్తండి (విశ్వములోని అనేక దేశాలకు చెందిన సుమారుగా ఒక వెయ్యి మంది సోదర-సోదరీలు సభలో హాజరై ఉన్నారు). వాహ్, చాలా బాగుంది. డబల్ చప్పట్లు కొట్టండి. బాప్‌దాదా విదేశాలలోని సేవా సమాచారాన్ని వింటూ ఉంటారు, చూస్తూ కూడా ఉంటారు, రిజల్టులో సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు చాలా బాగున్నాయి. కేవలం అప్పుడప్పుడు స్వయంపై కొద్దిగా సేవ యొక్క భారాన్ని తీసుకుంటారు. భారాన్ని తీసుకోకండి. భారాన్ని బాబాకు ఇచ్చెయ్యండి. బాబాకు అసలు అది భారమే కాదు, కానీ మీరు సేవా భారాన్ని తీసుకున్నారంటే అలసిపోతారు. సేవను చాలా బాగా చేస్తారు, సేవ చేసే సమయంలో అలసిపోరు. ఆ సమయంలో చాలా మంచి ముఖాలతో ఫోటో తీసే విధంగా ఉంటారు. కానీ కొంతమంది (అందరూ కాదు) సేవ చేసిన తరువాత కాస్త అలసిపోయిన ముఖాలతో కనిపిస్తారు. బాబా అంటారు, భారాన్ని ఎందుకు ఎత్తుతారు. భారాన్ని ఎత్తటం మంచిగా అనిపిస్తుందా లేక అలవాటైపోయిందా? భారాన్ని ఎత్తకండి. బాబా తోడుగా లేనప్పుడు భారమనిపిస్తుంది. నేను చేసాను, నేను చేస్తాను అని అనుకుంటే భారమైపోతుంది. బాబా తోడుగా ఉన్నారు, బాబా కార్యము, బాబా చేయిస్తున్నారు అని అనుకుంటే భారముండదు. తేలికగా ఉంటూ నాట్యం చేస్తూ ఉంటారు. ఏ విధంగా డ్యాన్స్ చాలా బాగా చేస్తారు కదా. డబల్ విదేశీయుల డ్యాన్స్ చూడండి, చాలా బాగుంటుంది. స్వయాన్ని అలసిపోయేలా చేసుకోరు, ఫరిశ్తాలలా చేస్తారు. భారతీయులు చేసే డ్యాన్స్‌లో కాళ్లు అలసిపోయేలా చేసుకుంటారు, చేతులు కూడా అలసిపోయేలా చేసుకుంటారు. అదే విదేశీయులైతే డ్యాన్స్ కూడా చాలా తేలికగా చేస్తారు. అలాగే సేవను కూడా ఒక డ్యాన్స్‌లా భావించండి, ఆటలా భావించండి, అలసిపోకండి. బాప్‌దాదాకు ఆ ఫోటో మంచిగా అనిపించదు. సేవ యొక్క ఉల్లాస-ఉత్సాహాలు చాలా బాగున్నాయి. ఇప్పుడు చిన్న విషయానికే అలజడిలోకి వచ్చేవారి శాతం చాలా తక్కువగా ఉంది, ఈ రిజల్టు తండ్రి వద్ద ఉంది. మెజారిటీ బాగున్నారు, ఇకపోతే కొద్దిమంది మాత్రం అప్పుడప్పుడు కాస్త అలజడిలో కనిపిస్తారు. కానీ ఆది యొక్క రిజల్టులో మరియు ఇప్పటి రిజల్టులో చాలా మంచి తేడా ఉంది. అలానే కనిపిస్తుంది కదా? ఇప్పుడు నాజూకుతనాన్ని వదులుతూ ముందుకు వెళ్తున్నారు. బాప్‌దాదాకు రిజల్టు చూసి సంతోషంగా ఉంది.
ఇప్పుడు చిన్న-చిన్న మైకులను కూడా తయారుచేస్తున్నారు. ఇప్పుడు చిన్న మైకులు ఉన్నారు, కానీ ఇప్పుడిక చిన్నవారి నుండి పెద్దవారిని తయారుచేసే వరకు కూడా చేరుకుంటారు. బాప్‌దాదాకు గుర్తుంది - ఆదిలో విదేశీ టీచర్లు ఏమనేవారంటే - వి.ఐ.పి.లను కలుసుకోవటమే కష్టము, వారు రావటము సంగతి పక్కన పెట్టండి, వారిని కలుసుకోవటమే కష్టము. కానీ ఇప్పుడు సహజమైపోయింది ఎందుకంటే మీరు కూడా వి.వి.వి.ఐ.పి.లుగా అయిపోయారు, కావున మీ ముందు వి.ఐ.పి.లు ఎంత! పూర్తి విదేశాల రిజల్టు అంతా బాగుంది. సెంటర్లు కూడా బాగున్నాయి, వృద్ధిని చెందుతూ ఉన్నాయి. భారత్‌లో హ్యాండ్స్ (సహయోగులు) లేరు, లేదంటే భారత్‌లో కూడా సేవాకేంద్రాలు ఎన్నో తెరుచుకునేవి. హ్యాండ్స్ లేరు అని ప్రతి జోన్ వారూ అంటారు. కనుక ఈ సంవత్సరము హ్యాండ్స్‌ను తయారుచేసే సేవను చెయ్యండి. హ్యాండ్స్‌ను అడగటం కాదు, వారిని తయారుచెయ్యండి, మరింత దాన పుణ్యాలు చెయ్యండి.
విదేశాలలో ఇది చాలా మంచి పద్ధతి ఉంది - ఎక్కడ సెంటర్ తెరిస్తే, అక్కడి నుండే హ్యాండ్స్ తయారవుతారు, లౌకిక కార్యాన్ని కూడా చేస్తారు, సెంటర్‌ను కూడా నడిపిస్తారు. కనుక సెంటర్ ఎలా నడుస్తుంది, ఎవరు నడిపిస్తారు అన్న ఈ సమస్య తక్కువ ఉంది. మేము లౌకిక కార్యాన్ని ఎందుకు చెయ్యాలి అని మీరు ఆలోచించకండి. ఇది మీ సేవా సాధనము. మీరు లౌకిక కార్యాన్ని చెయ్యటం లేదు, అలౌకిక కార్యానికి నిమిత్తంగా అయ్యేందుకు లౌకిక కార్యాన్ని చేస్తున్నారు. ఎక్కడకు వెళ్ళినా సరే, అక్కడ సెంటర్ తెరవాలనే ఉల్లాసం ఉంటుంది కదా. కనుక లౌకిక కార్యాన్ని ఎప్పటివరకు చెయ్యాలి అని ఆలోచించకండి. లౌకిక కార్యాన్ని అలౌకిక కార్యం నిమిత్తం చేస్తారు కావున మీరు సమర్పణ అయినట్లే. అది లౌకికతనము కాదు, అలౌకికతనము, కనుక లౌకిక కార్యములో కూడా సమర్పణ అయి ఉన్నారు. లౌకిక కార్యాన్ని వదిలి సమర్పణ సమారోహాన్ని జరుపుకోవాలి అనేమీ లేదు. అలా చేస్తే వృద్ధి ఎలా అవుతుంది! అందుకే లౌకిక కార్యాన్ని చేస్తూ అలౌకిక కార్యానికి నిమిత్తులుగా అవుతారు, కనుక ఎవరైతే లౌకికాన్ని నిమిత్తంగా భావించి అలౌకికతలో ఉంటున్నారో, అలాంటి ఆత్మలకు డబల్ ఏంటి, పదమా రెట్లు అభినందనలు. కేవలం ట్రస్టీలుగా భావించి చెయ్యండి, నేను అన్న భావనలోకి రాకండి. నేను ఇంత పని చేస్తాను అని అనుకుంటూ నేను అనే భావన ఉండకూడదు. చేయించేవారు చేయిస్తున్నారు. నేను ఇన్స్ట్రుమెంటును. పవర్ ఆధారంగా నడుస్తున్నాను. అచ్ఛా.
ఈరోజు డబల్ విదేశీయుల టర్న్ కదా. మీకు కూడా డబల్ విదేశీయులను చూసి సంతోషంగా అనిపిస్తుంది కదా! మరి డబల్ విదేశీయులందరూ సంతోషంగా ఉన్నారా? చేతులతో చప్పట్లు కొట్టండి. ఇప్పుడు మధుబన్‌లో అయితే మాయ రాదు కదా?
భారతదేశం యొక్క టీచర్లు మరియు డబల్ విదేశీయుల కలయికను చూడండి, ఎంత బాగుందో! మీరు టీచర్లు డబల్ విదేశీయుల సీజన్‌ను చాలా తక్కువసార్లే చూసి ఉంటారు. అలాగే డబల్ విదేశీయులు కూడా అందరు టీచర్ల సంగఠనను మొదటిసారిగా చూసారు. ఈ రెండు సమూహాల కలయిక అందంగా అనిపిస్తోంది కదా! టీచర్లకు బాగానే అనిపిస్తోంది కదా? డబల్ విదేశీయులకు కూడా బాగానే అనిపిస్తోంది కదా? అచ్ఛా. టీచర్లు కూడా ఆహ్వానంపై వచ్చారు. ఇలాంటి ఆహ్వానం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా? ఇదీ చూడండి, అకస్మాత్తుగా జరిగింది కాబట్టి బాగానే అనిపించింది కదా! అచ్ఛా, ఆహ్వానంపై వచ్చిన టీచర్లందరూ చేతులు పైకి ఎత్తండి.
ఢిల్లీ వారు కూడా మంచి సందేశాన్ని ఇచ్చారు. బాప్‌దాదాకు ప్రత్యేకంగా ఒక విషయంపై చాలా సంతోషంగా ఉంది. అదేంటంటే, సంఘటిత రూపంలో నిర్విఘ్నంగా కార్యాన్ని నిర్వహించారు. దానికి అభినందనలు. నిమిత్తం ఎవరైనా అవుతారు. కానీ బాప్‌దాదా ఫలితాన్ని చూసారు. నిమిత్తమైన పిల్లలు రాత్రైనా, పగలైనా, నిలబడి ఉన్నా, కూర్చొని ఉన్నా అలుపెరుగని వారిగా ఉండి లక్ష్యాన్ని ఉంచుకున్నారు. ఆ లక్ష్యం యొక్క సఫలత లభించింది. ప్రధానమంత్రి రావడం, రాష్ట్రపతి రావడం లేదా మరే ముఖ్యమైన వ్యక్తి రావడం, ఇవన్నీ ఆ లక్ష్య సఫలతకు నిదర్శనాలు. మనమందరం కలిసి సహకారపు వేలు అందించాలి, సంతోషంగా చేయాలి, అలుపెరుగని వారిగా ఉండాలి అనే ఒకే లక్ష్యం ఉన్నప్పుడు, ఆ లక్ష్యం ప్రత్యక్ష రూపంలో కనిపించింది. అందువల్లే ఈ దృఢత విజయానికి తాళంచెవిగా మారింది. ఎక్కడైనా కార్యం చేసినా, ఈ లక్ష్యాన్ని పక్కాగా ఉంచుకుని సంఘటిత రూపంలో చేయండి. ‘‘నేను పని చేయలేదు’’ అని ఒక్కరు కూడా చెప్పకూడదు. ఎవరు ఏ పని చేసినా, అందరి సహకారం సంఘటిత రూపంలో ఉండాలి. అలాగే అందరికీ ‘‘మేమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము’’ అనే సంతోషం ఉండాలి. ‘‘వాళ్లు చేస్తున్నారు, మేము చూస్తున్నాం’’ అని కాదు. మనం చూసేవారు కాదు, చేసేవారము. అది మనసా అయినా, వాచా అయినా, కర్మణా అయినా. చిన్నవారైనా, పెద్దవారైనా, వేదికపై సేవ చేసినా, ఇంట్లో నుంచే మనసా సేవ చేసినా, వాచా సేవ చేసినా, అందరూ సేవలో సహకారపు వేలు అందించాల్సిందే.
ఢిల్లీకి వరదానం ఉంది. అందులోనూ ఆది రత్నమైన జగదీష్‌కు స్థాపన కార్యానికి సంబంధించిన ప్రత్యేక వరదానం ఉంది. ఈసారి బాప్‌దాదా చూశారు, ఢిల్లీలోని ఒక్క సెంటర్ కూడా సహకారం చేయకుండా మిగలలేదు. వందకిపైగా సెంటర్లు ఉంటాయి. దూర ప్రాంతాలను వదిలేస్తే, ఢిల్లీలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఆనందంతో సేవను స్వీకరించి, ఆచరణలో చేశారు. ఇదే విజయానికి సాధనం. అలాగే జరిగిందా కదా? జగదీష్‌ను అడగండి. కాబట్టి ఎక్కడైనా కార్యక్రమం చేసినా ముందుగా అందరినీ కలుపుకోండి. మీటింగ్ చేయండి. సమయం లేకపోతే ఫోన్లోనే మీటింగ్ చేయవచ్చు. వీళ్లు కూడా మీటింగ్ చేశారు. ఢిల్లీ ఒక్కటే కాబట్టి అక్కడ మీటింగ్ చేయడం సులభం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఎక్కడ సంఘటిత శక్తి ఉంటుందో అక్కడే విజయం ఉంటుంది. విఘ్నాలు రావడం సహజమే. లేకపోతే ‘‘విఘ్న వినాశకులు’’ అనే పేరు ఎందుకు పెట్టాము! విఘ్న వినాశకుడు అంటే ఏమిటి? విఘ్నం రావాలి, మీరు దానిని వినాశనం చేయాలి. ఇదే జరగాల్సింది. విఘ్నాల పని రావడం, మీ పని వాటిని వినాశనం చేయడం. వాటి గురించి చింతించకండి. ఇదంతా ఒక ఆట. ఆటలో ఆడటం, ఆటను చూడటం - రెండింట్లోనూ ఆనందమే కదా!
రెండవ విషయం — ఎక్కడైనా ఉన్న సహయోగి ఆత్మలను అవసరమైన సమయంలో ఉపయోగించండి. ఉదాహరణకు లండన్‌లో ఏదైనా కార్యక్రమం జరుగుతుంటే, అమెరికాలో సమీపంలో ఉన్న ఒక ముఖ్యమైన సహయోగి ఆత్మ ఉంటే, ఆ కార్యానికి అనుగుణంగా ఎక్కడ ఎవరు సహకరించగలరో వారిని నిమిత్తంగా చేయండి. వీరినే బాప్‌దాదా ‘‘చిన్న మైక్‌లు’’ అంటారు. వారి ప్రభావం కూడా ఉంటుంది. అలాగే సంపర్కంలోకి వచ్చిన వారిని సమయానుసారం సహయోగులుగా తయారు చేస్తూ ఉండండి. కాన్ఫరెన్స్ జరిగితే వెళ్లి వచ్చి మళ్లీ తమ తమ సేవలో నిమగ్నమైపోవడం మాత్రమే కాదు. కొత్త కొత్త సేవల్లో బిజీ అయిపోతారు. అప్పుడు పాత సంపర్క ఆత్మల కోసం సమయం తక్కువ కేటాయిస్తారు. ఇకపై అలాకాదు. సహయోగుల ప్రత్యేక సమూహాన్ని తయారు చేయండి. ఎక్కడ ఉన్నా, విదేశాల్లో ఉన్నవారైతే భారతదేశంలో వారి సహకారాన్ని తీసుకోవచ్చు. భారతదేశంలోని వారు భారతదేశంలో, విదేశాల్లో ఉన్నవారు విదేశాల్లో, ఎక్కడ ఉన్నా సహయోగుల నుండి లాభం పొందండి.
ఢిల్లీ వారు చేతులు పైకి ఎత్తండి. చాలా బాగుంది. ఒకరికొకరు కూడా మంచి సహకారం అందించుకున్నారు. బృజ్‌మోహన్ ఎక్కడున్నారు? చూడండి, నిమిత్తమైనవారు ‘‘హా జీ, హా జీ’’ అని స్పందించడం, ఒకరికొకరు సహకరించడం వల్ల విజయం దగ్గరికి వచ్చింది. కాబట్టి ఈ పాఠాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. సేవ చేసే సమయంలో స్వభావాలను, సంస్కారాలను అసలు చూడకండి. ‘‘ఇతను ఇలా చేశాడు, అతను అలా అన్నాడు...’’ అని చూస్తారు కదా! అప్పుడు విజయం దూరమవుతుంది. అసలు చూడకండి. చాలా బాగుంది, చాలా బాగుంది. హా జీ మరియు చాలా బాగుంది - ఈ రెండు పదాలను ప్రతి కార్యంలో ఉపయోగించండి. స్వభావాలు రకరకాలుగా ఉంటాయి, ఉండాల్సిందే. స్వభావాన్ని చూస్తే సేవ ముగిసినట్టే. ‘‘బాబా చేయిస్తున్నాడు, బాబాను చూడండి. ఇది ఇతని డ్యూటీ కాదు, బాబా డ్యూటీ.’’ బాబాలో స్వభావం లేదు కదా! కాబట్టి స్వభావం కనిపించదు. ఢిల్లీ వారు మంచి ఆదర్శాన్ని చూపించారు. అందుకే బాప్‌దాదా కూడా ఢిల్లీ వారికి అభినందనలు తెలుపుతున్నారు.
విదేశీయుల స్నేహమిలన (ఆబూ ఫోరం లేదా రిట్రీట్) కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం విజయవంతమవుతోంది. పునాది సిద్ధమవుతోంది. బాప్‌దాదా ఇంటిలో భూమి సిద్ధమవుతోంది. విత్తనాన్ని నాటడం ఇక్కడ జరిగింది. ఇప్పుడు దానికి నీరు పోయడం, ఫలాలను పొందడం, అది మీ మీ స్థానాల్లోని పని. బాప్‌దాదా ఇక్కడ మధుబన్‌లో నేలను సిద్ధం చేసి, విత్తనాన్ని నాటారు. ఇక నీరు పోయడం, ఫలాన్ని తీసుకురావడం మీ పని. తప్పకుండా ఫలాలు వస్తాయి. ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసి, జాబితా ప్రకారం వారితో నిరంతరం సంపర్కంలో ఉండండి. కొత్త కొత్త సేవల్లో బిజీ అయిపోతారు కాబట్టి ఇది కొంచెం సడలిపోతుంది. అయినప్పటికీ డబల్ విదేశీయుల వృద్ధి కూడా ఉంది, విధి కూడా చాలా చక్కగా అభివృద్ధి చెందుతోంది. అందుకే నిమిత్తమైన జనక్కీ, మీ అందరు రైట్ హ్యాండ్స్కీ, మొత్తం బ్రాహ్మణ కుటుంబం తరఫున అభినందనలు. అచ్ఛా.
అందరూ సంతోషంగా ఉన్నారు కదా! ఎల్లప్పుడూ సంతోషంగా ఉండేవారే కదా! అలాగే కదా! బాప్‌దాదా చెప్పేది సరియేనా? లేక ఏదైనా పరీక్ష వస్తే ముఖం మారిపోతుందా? కాదు, మారకూడదు. అప్పుడు ఏమవుతుందో తెలుసా? బాప్‌దాదాకు ఏమి కనిపిస్తుంది తెలుసా? ఈ రోజుల్లో ఒక ఫ్యాషన్ ఉంది కదా, వేషం వేస్తే మరో ముఖం (మాస్క్) పెట్టుకుంటారు. అలాగే ఆ సమయంలో మీ అసలు ముఖం కనిపించదు. ఎవరైనా లోభం అనే మాస్క్, ఎవరైనా మోహం అనే మాస్క్, ఎవరైనా అభిమానం అనే మాస్క్, ఎవరైనా ‘‘నేను’’ అనే మాస్క్, ఎవరైనా ‘‘నాది’’ అనే మాస్క్ ధరించేస్తారు. ముఖాలే మారిపోతాయి. తర్వాత మీరు బాధపడతారు కదా! మరో ముఖం పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంటుంది కదా! వేడిగా అనిపిస్తుంది కదా, ఇది ఏమి పెట్టుకున్నాను అని అనుకుంటారు! అందుకే ఇకపై అలాంటి మరో ముఖం ధరించవద్దు. మీ అసలు స్వరూపమైన ముఖాన్నే ఎల్లప్పుడూ ఉంచుకోండి. బాప్‌దాదా వద్ద ప్రతి ఒక్కరి ఫోటోలు చాలా ఉన్నాయి. ఈ సాకార ప్రపంచంలో అయితే మీ అందరి ఫోటోలను ఉంచడానికి కూడా స్థలం సరిపోదు.
అచ్ఛా, ఒక్క క్షణంలో పూర్తిగా తండ్రి సమానంగా అశరీరులుగా అవ్వగలరా? మరి ఒక్క క్షణంలో ఫుల్స్టాప్ పెట్టండి మరియు అశరీరి స్థితిలో స్థితులవ్వండి (బాప్‌దాదా 3 నిమిషాలు డ్రిల్ చేయించారు) అచ్ఛా, మొత్తం రోజంతటిలో పదే-పదే ఈ అభ్యాసము చేస్తూ ఉండండి.
నలువైపులా ఉన్న సర్వ మాయాజీతులు, ప్రకృతిజీతులు, సాక్షి స్థితి యొక్క సింహాసనాధికారులు, సహచరుడి తోడును సదా అనుభవము చేసేవారు, సదా దృఢత ద్వారా సఫలతను మెడలోని హారంగా చేసుకునేవారు, సదా తండ్రి సమానంగా లైట్‌గా ఉండేవారు, సదా తమ మైట్ (శక్తి) ద్వారా విశ్వాన్ని దుఃఖ-అశాంతుల బలహీనత నుండి విడిపించేవారు, ఇటువంటి మాస్టర్ సుఖ సాగరులు, సంతోష సాగరులు, ప్రేమ సాగరులు, జ్ఞాన సాగరులు అయిన తండ్రి సమానులైన పిల్లలకు ప్రియస్మృతులు మరియు నమస్తే.
*** ఓంశాంతి ***
