‘‘ఈ నూతన సంవత్సరాన్ని ముక్తి సంవత్సరంగా జరుపుకోండి, సఫలము చెయ్యండి సఫలతను పొందండి’’
ఈరోజు బాప్‌దాదా నవ జీవితము కల శ్రేష్ఠ ఆత్మలకు, నవ యుగ రచయితలైన ఆత్మలకు క్రొత్త సంవత్సరం యొక్క శుభాకాంక్షలను ఇస్తున్నారు. ప్రపంచము కొరకు క్రొత్త సంవత్సరము ఆరంభమవుతోంది, పిల్లలైన మీ మనసులో క్రొత్త యుగము గుర్తుకొస్తూ ఉంది. ఎలా అయితే క్రొత్త సంవత్సరము రేపు రానున్నదో అలా క్రొత్త యుగము కూడా రేపు రానున్నది. మా క్రొత్త యుగము వచ్చేస్తోంది అన్న స్మృతి కలుగుతోందా? ఎలా అయితే నేడు క్రొత్త సంవత్సరము సందర్భంగా మనుష్యాత్మల మనసులో సంతోషము ఉందో, అల్పకాలిక ఉత్సాహము ఉందో, అలా ఆత్మలైన మీకు క్రొత్త యుగము రానున్నది అని సదాకాలిక సంతోషము ఉంది. ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అన్నట్లు అనిపిస్తుంది. ఈరోజు పాత యుగము ఉంది, రేపు క్రొత్త యుగము ఎదురుగా ఉంటుంది. డ్రామానుసారంగా ఇది ఈరోజు మరియు రేపటి విషయమే అన్న స్పష్ట స్మృతి అనుభవమవుతుందా? లేక కేవలము క్రొత్త సంవత్సరాన్ని మాత్రమే జరుపుకోవటానికి వచ్చారా? క్రొత్త సంవత్సరము క్రొత్త యుగాన్ని గుర్తుకు తెప్పిస్తుంది. రేపు మేము ఎలా అవుతాము అన్న ఈ ఉల్లాస-ఉత్సాహాలు మనసులో ఉంటున్నాయా? మీ క్రొత్త శరీరము అనే డ్రెస్ మీ ముందుకు వస్తుందా? క్రొత్త యుగములో మీ క్రొత్త శరీరము ఎంత సుందరంగా ఉండేదో గుర్తుందా? అది ఎటువంటి యుగము, ఎటువంటి రాజ్యం ఉండేది, ప్రకృతి దాసిగా ఎలా ఉండేది, ఎంత సతోప్రధానంగా ఉండేది! ఆ రాజ్య అధికారీ స్థితి యొక్క స్మృతి స్పష్టంగా ఉందా? ఆ క్రొత్త ప్రపంచము ఎంత సుందరంగా ఉందో కనిపిస్తుందా? ఒక్క క్షణకాలంలో మీ రాజ్యాధికారాన్ని అనుభవము చెయ్యగలరా లేక చేస్తున్నారా? ఒక్క క్షణంలో నవ యుగములోకి వెళ్ళిపోండి. వెళ్ళటం వస్తుందా? ఎన్ని సార్లు ఈ రాజ్యాధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారో గుర్తుందా? మీ రాజ్యం ఎంత ప్రియమైనదో అనుభవము చెయ్యండి! అది అతీతమైనది కూడా మరియు ప్రియమైనది కూడా. ఒక్క క్షణంలో మన రాజ్యం మరియు మన విశ్వ రాజ్యాధికారీ స్వరూపము స్మృతిలోకి రావాలి. వారు క్రొత్త సంవత్సరంలో ఒకరికొకరు అల్పకాలికమైన కానుకలను ఇచ్చుకుంటారు మరియు బాబా ఏమో నవ యుగపు విశ్వ రాజ్యాధికారాన్ని కానుకగా ఇస్తారు. ఈ అవినాశీ కానుక ఈ సమయములో బాబా ద్వారా మీ అందరికీ నిశ్చితమైన విధిగా లభిస్తుంది. ఈ విధిని ఎవ్వరూ తప్పించలేరు. ఇది అచంచలమైనది, అఖండమైనది. మరి ఇటువంటి కానుక లభించింది కదా? ఈ కానుకను జాగ్రత్తగా ఉంచుకోండి, దొంగలెవ్వరూ ఈ కానుకను తీసుకుపోకూడదు. అందరి దగ్గర డబల్ లాక్ ఉంది కదా? ఈరోజుల్లో సింగల్ లాక్ పని చెయ్యటం లేదు, డబల్ లాక్ కావాలి. గోద్రేజ్ లాక్ కాదు, గాడ్ యొక్క లాక్ కావాలి. గాడ్ ఎటువంటి లాక్‌ను ఇచ్చారంటే దానిని ఎవరూ విరగ్గొట్టలేరు. ఒకవేళ నిర్లక్ష్యులుగా అయ్యారంటే దొంగలు వచ్చేస్తారు. దొంగలు కూడా తెలివైనవారిగా ఉంటారు, ఈరోజు వీరి లాక్ ఢీలాగా ఉంది అని వాళ్ళకు కూడా తెలిసిపోతుంది, అందుకే నిర్లక్ష్యులుగా అవ్వకండి.
ఈ క్రొత్త సంవత్సరంలో స్వయము కొరకు మరియు సేవ కొరకు ఏ క్రొత్త ప్లాన్‌ను తయారుచేసారు? కాన్ఫరెన్సులు చెయ్యాలి, డైలాగ్ కార్యక్రమాలు చెయ్యాలి, ఇవైతే ఎలాగూ చేస్తూనే ఉన్నారు. క్రొత్త ప్లాన్ ఏమి తయారుచేసారు? బాప్‌దాదా ఈ క్రొత్త సంవత్సరంలో, దేశ-విదేశాలలోని వెరైటీ వర్గాల విశేష ఆత్మలతో కూడిన ఒక పుష్పగుచ్ఛాన్ని చూడాలని కోరుకుంటున్నారు. వర్గాల సేవనైతే చాలా చేసారు కదా, ఇప్పుడు ప్రతి వర్గం నుండి ఒక్కొక్క రత్నాన్ని తయారుచెయ్యండి, ఒక్క వర్గం కూడా మిస్ అవ్వకూడదు. ఎందుకని? ఇప్పుడు సమయము సమీపంగా వస్తూ ఉంది కనుక ఏ వర్గం వారూ మా వర్గము ఉండిపోయింది అని ఫిర్యాదు చెయ్యకూడదు. ఒక్కొక్క వర్గం నుండి క్వాలిటీవారు విశేషంగా ఒక్కొక్కరు ఉండాలి, వారు మైక్‌లా పని చెయ్యాలి ఎందుకంటే సమయం సమీపంగా వచ్చే కొద్దీ అన్ని వర్గాల వారు, అన్ని ధర్మాల వారు, అందరి నోటి నుండి ఒకే ధ్వని వెలువడాలి - బాబా వచ్చేసారు, ఎందుకంటే ఈ సంగమ యుగములోనే ధర్మ స్థాపక ఆత్మలందరిలోనూ మరియు అన్ని వర్గాలవారిలోనూ బీజము పడాలి. వారు తమలో ఎంతటి శక్తిని నింపుకుని తీసుకువెళ్తారంటే మళ్ళీ తమ-తమ సమయంలో ఆ వర్గాన్ని లేక ధర్మాన్ని ఆవిష్కరించేవారిగా అవుతారు. కనుక అన్ని బీజాలను మీరే తయారుచెయ్యాలి, వారు సమయము వచ్చినప్పుడు తమ-తమ డిపార్టుమెంట్లకు నిమిత్తులుగా అవుతారు ఎందుకంటే బీజము బాబా మరియు బ్రాహ్మణ ఆత్మలైన మీరు కాండము, సర్వాత్మలూ బీజము మరియు కాండము ద్వారానే వెలువడుతారు. విదేశాలవారు కూడా మరియు ఈ దేశం వారు కూడా ఇటువంటి పుష్పగుచ్ఛాన్ని బాబా ముందుకు తీసుకురండి. ఒక్కొక్క శ్యాంపుల్ను తీసుకురండి, శ్యాంపుల్ ద్వారా ఇతర అనేకులు స్వతహాగానే తయారవుతారు. కానీ ఒక్కొక్కరూ శక్తిశాలి మైక్‌గా అవ్వాలి, కనుక అటువంటి బీజము అనండి, ధర్మము అనండి లేక వర్గము అనండి లేక వెరైటీ పూలతో కూడిన పుష్పగుచ్ఛము అనండి, తయారవ్వాలి. ఒక్కరు కూడా మిస్ కాకూడదు. అప్పుడే విశ్వ కళ్యాణకారులు లేక సర్వాత్మల ఉద్ధరణకు నిమిత్త ఆత్మలుగా పిలువబడతారు. ఒక్క శాఖ కూడా తక్కువ కాకూడదు, అన్ని శాఖలూ ఉండాలి. మీ క్రొత్త యుగములో కొన్ని వర్గాలు ఉండవు, కానీ ఆ ఆత్మలలో కూడా ద్వాపరములోనైనా లేక కలియుగములోనైనా ఎవరైతే ఆవిష్కరణకు నిమిత్తమవుతారో, వారికి శక్తి మీ ద్వారానే లభించాలి. ఎలాగైతే ధర్మ పితలందరూ మీ ముందు బాబా జెండాను, ప్రత్యక్షతా జెండాను ఎగురవేయటంలో సహయోగులుగా అవుతారో, అలాగే అన్ని వర్గాల వారు కూడా ప్రత్యక్షతా జెండాను ఎగురవేయటంలో సహయోగులుగా అవుతారు, అందుకే సర్వుల సహయోగం ద్వారా సుఖమయ ప్రపంచ స్థాపన అని అంటారు. సహయోగులుగా అవుతున్నారు కానీ వారిలో నుండి ఇప్పుడు విశేష ఆత్మను సహయోగము ఇవ్వడంలో ముందుకు తీసుకువెళ్ళండి, నిమిత్తులుగా చెయ్యండి. వారిని నిమిత్తులుగా తయారుచేసే బీజాన్ని వెయ్యండి. ఏం చెయ్యాలో అర్థమైందా? విదేశాలలో కూడా ఇప్పుడు ఐ.పి.లు లేక వి.ఐ.పి.ల కనెక్షన్ అయితే సహజమయ్యింది కదా. కష్టం కాదు కదా? కష్టమా లేక సహజమా? కనుక మీరందరూ మళ్ళీ రాబోయే క్రొత్త సంవత్సరంలో వచ్చినప్పుడు బాప్‌దాదా ఆ క్రొత్త సంవత్సరం యొక్క కానుకగా ఇటువంటి పుష్పగుచ్ఛాన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఒక సంవత్సరం సమయము ఉంది, తక్కువేమీ లేదు. ఈ దేశం వారు కూడా చేస్తారా, విదేశాల వారు కూడా చేస్తారా? (హాజీ). తప్పకుండా చేస్తారు. ఇది జరిగే ఉంది అని చెప్పండి. కేవలం నిమిత్తులుగా అవ్వాలి. డబల్ విదేశీయులు చెప్పండి? విదేశీయులందరూ చప్పట్లు కొట్టండి. అచ్ఛా, ఎవరు ముందుగా తయారుచేస్తారో చూస్తాము - దేశం వారా లేక విదేశాలవారా. మరియు ఎంత పెద్ద పుష్పగుచ్ఛాన్ని తయారుచేస్తారో చూస్తాము? సరేనా? నలువైపులా వింటున్నారు. ఈ దేశం వారు కూడా వింటున్నారు, విదేశాల వారు కూడా వింటున్నారు. ఇప్పుడు ఉల్లాసం వస్తూ ఉంది. ఇది చేస్తాము, అది చేస్తాము అని వారి మనసులలో ప్లాన్లు తయారవుతున్నాయి. అచ్ఛా, ఇది విశ్వ సేవ గురించి చెప్పాము.
స్వయం కొరకు ఏం చేస్తారు? ఆ ప్లాన్ కూడా తయారవుతుంది కదా? ఎందుకంటే ఒకవేళ స్వ కల్యాణమునకు సంబంధించి శ్రేష్ఠ ప్లాన్‌ను తయారుచేసుకోకపోతే విశ్వ సేవలో సకాష్ లభించదు, అందుకే బాప్‌దాదా అందరి మనసులలో ఉన్న ఉల్లాస-ఉత్సాహాల గురించి తెలిసి ఏమంటున్నారంటే - ప్రతి ఉత్సవంలో పిల్లలు గోల్డెన్ జూబ్లీవారు కావచ్చు, డైమండ్ జూబ్లీవారు కావచ్చు, సిల్వర్ జూబ్లీవారు కావచ్చు లేక మరే జూబ్లీవారైనా కావచ్చు, అందరూ మనస్ఫూర్తిగా ఉల్లాస-ఉత్సాహాలతో తమ మనుసులో బాబాతో ఈ ప్రతిజ్ఞను చేసారు - మేము బాబా సమానంగా అయ్యే చూపిస్తాము. అందరూ ఈ ప్రతిజ్ఞను చేసారు కదా? డబల్ విదేశీయులు ప్రతిజ్ఞను చేసారా? (అందరూ చేతులు ఊపారు) అచ్ఛా, అభినందనలు. ప్రతిజ్ఞనైతే చాలా మధురంగా, చాలా మంచిగా, చాలా ప్రేమగా, చాలా శక్తిశాలిగా చేసారు. ఇప్పుడు కేవలం ఆ ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ ఉండండి. ప్రతిజ్ఞ చేసేవారు ఆ సమయంలో చాలా ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తారు, ధైర్యం కూడా చాలా బాగా ఉంచుతారు. మరి తర్వాత ఏమవుతుంది? ఒక్కోసారి మాయ ఎలుక రూపంలో వస్తుంది, ఒక్కోసారి పిల్లి రూపంలో వస్తుంది, పిల్లి ఏం చేస్తుంది? మ్యావ్-మ్యావ్ అంటుంది కదా. మరి పిల్లలు ఏం చేస్తారు? మై-మై-మై (నేను-నేను-నేను) అని అంటారు. కనుక ఇలా పిల్లిలా మ్యావ్-మ్యావ్ అనకండి. ఎలుక ఏం చేస్తుంది? ఎలుక తెలివి లేకుండా దేనిని పడితే దానిని తినేస్తుంది, కొరుకుతుంది. అలాగే మాయ కూడా పిల్లల ఖజానాలను కొరికి తినేస్తుంది. ఒక్కోసారి సింహం వస్తుంది. సింహం ఏం చేస్తుంది? నిర్భయులుగా ఉన్నవారిలో భయాన్ని పుట్టిస్తుంది. సర్వశక్తిమంతులైన పిల్లలను నిరాశులుగా చేస్తుంది. ఇలా చెయ్యకండి, దానిని రానివ్వకండి, డబల్ లాక్ వేసే ఉంచండి. ఈ సంవత్సరం దేనినీ రానివ్వకండి.
ఈ సంవత్సరాన్ని అన్ని విషయాల నుండి ముక్తి సంవత్సరంగా జరుపుకోండి. ముక్తి సంవత్సరము. ఈ ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నప్పుడే ముక్తిధామములోకి వెళ్తారు. దీని కొరకు ఏం చేస్తారు? ఇది చాలా చిన్న విషయము, పెద్ద విషయమేమీ కాదు. బాప్‌దాదా కేవలం ఒక చిన్న స్లోగన్‌ను ఇస్తున్నారు - ‘‘సఫలము చెయ్యండి, సఫలతను పొందండి.’’ అర్థమైందా! సఫలము చెయ్యండి, సఫలతను పొందండి. ఏం సఫలం చెయ్యాలి? మీ వద్ద ఏదైతే ఉందో, మీ ప్రాపర్టీ ఉంది కదా - సమయం, సంకల్పాలు, శ్వాస మరియు తనువు-మనసు-ధనము, వీటిని సఫలము చెయ్యండి, వ్యర్థంగా పోగొట్టుకోకండి, అలాగే అవసరమైన సమయంలో పనికొస్తాయిలే అని సంభాళించి పెట్టుకోకండి. సంకల్పాలను కూడా సఫలము చెయ్యండి. ఒక్కొక్క సంకల్పము - ఇది మీ ప్రాపర్టీ. ఏ విధంగా ధనము అనేది స్థూల ప్రాపర్టీనో, అలా సమయము, శ్వాస, సంకల్పాలు సూక్ష్మ ప్రాపర్టీ. ఒక్క సంకల్పము కూడా వ్యర్థంగా పోకూడదు, సఫలము అవ్వాలి. మనసా సేవ ద్వారానైనా, వాచా ద్వారానైనా, కర్మల ద్వారానైనా - చెక్ చేసుకోండి, ఎంత సఫలము చేసుకున్నాను, ఎంత జమ చేసుకున్నాను? అంతేకాక బాప్‌దాదా ఈ సంవత్సరము ఈ విశేష వరదానాన్ని ఇస్తున్నారు - సఫలము చెయ్యండి మరియు పదమాల రెట్ల సఫలతను అనుభవము చెయ్యండి. ఈ ప్రత్యక్ష ఫలాన్ని సహజంగా ప్రాప్తి చేసుకోగలరు, కేవలము సత్యమైన హృదయము ద్వారా. సత్యమైన హృదయముపై భోళానాథుడైన తండ్రి చాలా సహజంగా రాజీ అవుతారు, అందుకే సఫలము చేసుకోండి. జ్ఞాన ధనాన్ని, శక్తుల ధనాన్ని, గుణాల ధనాన్ని ప్రతి సమయము సఫలము చెయ్యండి. సఫలము చెయ్యటము వస్తుందా లేక ప్రక్కన పెట్టడము లేక అలా జాగ్రత్తగా అట్టే పెట్టుకోవడము బాగా వస్తుందా? అలా ప్రక్కన పెట్టకండి, వాటిని ఉపయోగించండి. అంతా అకస్మాత్తుగా జరుగనున్నది, ఎవరెడీగా ఉండాలి అని మీరే అంటారు కదా, మరి అటువంటప్పుడు మీ వద్ద ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ సఫలము చేసుకోండి. అవి బాప్‌దాదాకు ఏమీ వద్దు, మీ కొరకు జమ చేసుకోండి. బాప్‌దాదా అయితే దాత, కానీ సఫలము చెయ్యటము అనగా జమ చేసుకోవటము ఎందుకంటే బాప్‌దాదా సమయమనుసారంగా జమ ఖాతాను చూసారు, పిల్లలు ప్రతి ఒక్కరి జమ ఖాతా బాప్‌దాదా వద్ద ఉంది. జమ ఖాతాలో ఏం చూసారు? చాలా మంది పిల్లలు ఏమనుకుంటారంటే లేక ఏమంటారంటే - మా వద్ద ఇది కూడా జమ అయ్యింది, అది కూడా జమ అయ్యింది, అలా జమ ఖాతాను పైకి చాలా వర్ణిస్తారు కానీ బాబా దగ్గర ఉన్న జమ ఖాతాలో ఎవరు ఎంతెంత చెప్పారో, ఎంతెంత ఉందని అనుకుంటున్నారో, దానికంటే చాలా తక్కువగా జమ అయ్యి ఉంది. ఎందుకని? ఎందుకంటే అదే మొదటి పాఠము ‘‘నేను మరియు నాది అన్న భావము’’. నేను చేసాను, ఇది నా సేవ, ఇది నా కార్యము. జమ చేసుకునే సమయంలో వారు, జమ చేసుకుంటున్నాను అని భావిస్తారు, కానీ అది ఆటోమేటిక్‌గా జమ ఖాతా నుండి తొలగిపోయి వ్యర్థ ఖాతాలో జమ అవుతుంది. ఇది ఆటోమేటిక్ సూక్ష్మ మెషినరీ. బాబా చేయించారు, ఇది బాబా సేవ, నా సేవ కాదు. నేను చేసాను - కాదు. వర్ణన చేయకండి - నేను ఇది చేసాను, నేను ఇది చేస్తాను, నేను అది చేస్తాను... ఈ నేను-నేను అనేది ఉండకూడదు. బాబా-బాబా అని అన్నారంటే పదమాల రెట్లు జమ అవుతాయి. అలా కాకుండా నేను-నాది అని అన్నారంటే అది ట్రాన్స్ఫర్ అయ్యి వ్యర్థ ఖాతాలో జమ అయిపోతుంది. ఈ ఆటోమేటిక్ మెషినరీ చాలా వేగవంతమైనది, మీకు తెలియను కూడా తెలియదు. ఈ చెకింగ్‌ను కూడా చాలా సత్యమైన హృదయంతో, నేను అనే భావన నుండి అతీతంగా ఉంటూ చెక్ చేసుకునేవారే చెయ్యగలరు. ఆది రత్నాలైన మీరు ఆదిలో, స్థాపనా సమయంలో వెలువడినప్పుడు, సేవలో వెలువడినప్పుడు, మీలో ఏ భావము ఉండేది? ఏ మాటలు వెలువడుతూ ఉండేవి? నేను అన్న భావన ఉండేదా? బాబా-బాబా అని అన్నారు, అందుకే బాబాకు వారసులు తయారయ్యారు, వారే ఈరోజు సేవకు ఆద్యులుగా అయ్యారు, ఇది బాబా-బాబా అని అన్నదానికి ఋజువు.
ఇప్పుడు బాప్‌దాదా వద్దకు వారస క్వాలిటీవారు చాలా తక్కువమంది వస్తున్నారు, ఎందుకని? బాబా మరియు నేను అనే భావన మిక్స్ అయిపోతుంది. అందుకే ఈ సంవత్సరము బాప్‌దాదా పెద్ద మనసుతో ఈ వరదానాన్ని ఇస్తున్నారు - ఎంత జమ చేసుకోవాలనుకుంటే అంత చేసుకోండి, చేసుకోండి, చేసుకోండి. సఫలము చేసుకోండి, సఫలతా మూర్తులుగా అవ్వండి. అచ్ఛా.
ఇప్పుడు ఏ ఉత్సవాన్ని జరుపుకున్నారు? సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ వారు చేతులెత్తండి. ఎవరెవరి ఉత్సవం జరిగిందో వారు చేతులెత్తండి. డబల్ ఉత్సవాన్ని జరిపారు. భారత్ వారిది కూడా, విదేశాలవారిది కూడా. మంచిది, ఈ ఉత్సవము జరుపుకోవటము అనగా మీకు మీరే పక్కా ప్రతిజ్ఞ అనే స్టాంపును వేసుకోవటము. ఉత్సవాన్ని జరుపుకున్నారు, బాప్‌దాదాకు కూడా ఈ దృశ్యము మంచిగా అనిపిస్తుంది. అలాగే ఏ సంకల్పమైతే చేస్తారో, దానికి ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క స్టాంప్ వేయండి, అది సదా అవినాశీగా, అచంచలంగా ఉండాలి. జరుపుకోవటము అనగా ప్రతిజ్ఞను నిలబెట్టుకోవటము. మరి ఇటువంటి దృఢమైన స్టాంపును వేసుకున్నారా? లేక బలహీనమైన స్టాంపును వేసుకున్నారా? దృఢమైనది వేసుకున్నారా? ఈ సిల్వర్ జూబ్లీ కుమారులు చేతులైతే బాగా ఊపుతున్నారు, పక్కాగా జరుపుకున్నారా? మంచిది. ఈ దృశ్యాన్ని మర్చిపోవద్దు. ఎప్పుడైనా ఏదైనా బలహీనత వస్తే, మీ ఈ ఉత్సవం ఫోటోను ఎదురుగా తెచ్చుకోండి. ప్రతి ఒక్కరికీ ఫోటో తీస్తారు కదా. ఆ ఫోటో అందరికీ అందుతుందా? కావున ఫోటోను ఊరికే తీయడం జరగదు, ఒక ఉద్దేశ్యంతో తీయడం జరుగుతుంది. ఫోటో ఎందుకు తీయడం జరుగుతుందంటే - అలాంటి-ఇలాంటి సమయము ఏదైనా వస్తే ఈ ఫోటోను ఎదురుగా పెట్టుకోండి, అంతేకానీ అవసరమైన సమయానికి కనీసం గుర్తు కూడా రానంతగా అలమారీలో లాక్ చేసి పెట్టుకోవటం కాదు. ఇది అన్నింటికన్నా పెద్ద కానుక, ఇది స్మృతిని కలిగించే గుర్తు.
ఈ సింధీ గ్రూపు ఎవరైతే వచ్చారో వారు చేతులు ఎత్తండి. అచ్ఛా - మీరు ఉత్సవాన్ని జరుపుకున్నారా? ఫోటో తీసారా? ఇప్పుడు ఏమి చేస్తారు? జాగ్రత్తగా ఉంచుకుంటారు కదా! ఈ గ్రూపుకు హెడ్ ఎవరు? (నారీ భాయి మరియు గోవింద్ భాయి) హెడ్ అయితే శక్తిశాలిగా ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రూపును చాలా-చాలా-చాలా పక్కాగా ఉంచాలి, సంభాళించాలి. ఉత్సవాన్ని జరుపుకుంది ఎల్లప్పుడూ ఉత్సాహంలో ఉండడం కోసం. ఈ జ్ఞానం, యోగం యొక్క ఉత్సాహం తగ్గిపోకూడదు. ఎల్లప్పుడూ పెరుగుతూ ఉండాలి. శక్తులలో బాధ్యతగలవారు ఎవరు? (త్రిమూర్తి) అందరి యూనిటీ చాలా ఉంది. అమరులుగా ఉండండి. అమర భవ. మంచివారు. చూడండి, బాప్‌దాదా సింధీ గ్రూపును ఎందుకు ముందుంచుతారు? అలా అయితే అందరూ ఉన్నారు కదా? అందరూ ఒకరిని మించి మరొకరు ముందున్నారు మరియు ప్రియమైనవారే. కానీ ప్రత్యేకంగా సింధీ గ్రూపును ఎందుకు ముందుంచుతాము? ఈ సింధీ గ్రూపుకు, చారిటీ బిగిన్స్ అట్ హోమ్...(దానము ఇంటి నుండి ప్రారంభమవుతుంది), ఎక్కడి నుండి స్థాపన జరిగిందో, ఆ వంశాన్ని జాగృతం చేయాలి. అందుకే బాప్‌దాదా మీ అందరినీ విశేషంగా గుర్తు చేసుకుంటారు, నిమిత్తులుగా కూడా చేశారు. కాబట్టి నిమిత్తులై మీ లౌకిక వంశమైన సింధీలను జాగృతం చేయండి, వారు మిగిలిపోకూడదు. అయినప్పటికీ బ్రహ్మా బాబా యొక్క స్థాపనా కార్యం సింధ్‌లో జరిగింది. కాబట్టి ఎక్కడ స్థాపన జరిగిందో, అక్కడి ఆత్మలు వంచితులుగా మిగిలిపోకూడదు. బాప్‌దాదాకు కూడా ఆ ఆత్మలపై దయ కలుగుతుంది. బ్రహ్మా యొక్క చారిటీ బిగిన్స్ అట్ హోమ్ కదా. అందుకే బ్రహ్మా బాబా మిమ్మల్ని నిమిత్తులుగా చేశారు. అర్థమైందా, బాధ్యత ఉందా లేదా? వీరు తెలివైనవారు. చూడండి, స్థాపన జరిగినప్పుడు మొదటి కుటుంబం బ్రహ్మా బాబాది మరియు దానితో పాటు మీ (నారీ భాయి) కుటుంబం నిమిత్తమైంది. తెలుసు కదా! మరి ఇప్పుడు మీరు ఏమి చేస్తారు? (జవాబు చాలా బాగా ఇస్తారు) బాప్‌దాదా అంటారు - మీ నోటిలో గులాబ్జామున్. గులాబ్ కాదు. కేవలం గులాబ్‌తో ఏమి చేస్తారు, గులాబ్జామున్ తింటారు కదా. ఇలా ఒక్కరినే అనడం లేదు, అందరూ నిమిత్తులు కావాలి. రెండవది సావిత్రి కుటుంబం. మీకు తెలుసు, మీ కుటుంబం సేవలో మొదట నిమిత్తమైంది. విశేషంగా సేవను ముందుకు తీసుకువెళ్ళారు. కాబట్టి ఇప్పుడు ఏమి చేయాలి? లౌకిక తల్లిదండ్రులను ఫాలో అవ్వండి. మరి ఫాలో అవుతారా? ఇప్పుడు బాప్‌దాదా చూస్తారు - రెండు కుటుంబాలు ఏమి కమాల్ చేసి చూపిస్తాయో. మంచిది, నిమిత్తులయ్యారు. ఎలా అయితే తల్లిదండ్రులు నిమిత్తులయ్యారో, పెద్దలు నిమిత్తులయ్యారో, అలాగే ఫాలో చేయండి. సరేనా. చూడండి, విశేషంగా బాప్‌దాదా మిమ్మల్ని కలుస్తున్నారు. మరి అదృష్టం ఉంది కదా. అచ్ఛా.
ఇప్పుడు కుమారులు ఏమి చేస్తారు? (కుమారులు 5 వేల మంది వచ్చారు.) చాలా మంచిది. కుమారులు ఏదైనా కొత్త కమాల్ చేసి చూపించండి. అసంభవాన్ని సంభవంగా చేసి చూపించే అటువంటి కమాల్ చూపించండి. కుమారులను బాప్‌దాదా విశ్వ వేదికపై ఒక ఎగ్జాంపుల్‌గా నిలబెట్టాలని కోరుకుంటున్నారు. అటువంటి కుమారులు హీరో పాత్రను అభినయిస్తారా? పక్కానా, లేక చేతులు ఎత్తేంతవరకేనా? చూడండి, హీరో పాత్రను అభినయించేవారు మచ్చలేని వజ్రంలా ఉండాలి. డబల్ హీరో. మచ్చలేని వజ్రమూ కావాలి మరియు హీరో పాత్రధారులుగానూ కావాలి. అటువంటివారేనా?
డబల్ విదేశీయులు ఏ అద్భుతాన్ని చేస్తారు? డబల్ విదేశీయులు ఎటువంటి అద్భుతాన్ని చేసి చూపించాలంటే భారత్‌కు మైక్‌గా తయారయ్యే ఆత్మలకు సందేశాన్ని ఇవ్వండి, ఎందుకంటే భారత్‌లో ఉన్న మైక్‌ల యొక్క ప్రభావము కూడా ఉంటుంది కానీ విదేశీ మైక్‌ల ప్రభావము డబల్ ఉంటుంది. కనుక డబల్ విదేశీయులు అటువంటి మైక్‌లను తయారుచెయ్యాలి. చేస్తారా? రాబోయే సంవత్సరము మైక్ రావాలి. వారు వచ్చి కేవలం భాషణ చేసి వెళ్ళిపోవటం కాదు, సంబంధములో సమీపమైనవారిగా ఉండాలి. వారు జ్ఞాన-యోగాలలో రెగ్యులర్‌గా లేనప్పటికీ ఈ విషయాన్ని మాత్రం అంగీకరించాలి - నిజంగా ఇది ఈశ్వరీయ కార్యమే మరియు జీవితాన్ని ఈ విధంగానే తయారుచేసుకోవాలి కానీ నాలో ధైర్యము తక్కువగా ఉంది. ఇలా ఉన్నా కూడా అభ్యంతరము లేదు ఎందుకంటే ఇతరుల కొరకు నిమిత్త మైక్లుగా అవుతూ- అవుతూ స్వయము కూడా తప్పకుండా తయారైపోతారు. డైరెక్టుగా విద్యార్థులుగా అవ్వరు కానీ సేవా బలము ద్వారా ఇతరులకు నిమిత్తులుగా అవుతారు, ఆ ప్రభావముతో తయారైపోతారు. మరి డబల్ విదేశీయులు విన్నారా? ఇందుకు ఏ దేశము నిమిత్తంగా అవుతుందో ఇప్పుడు చూస్తాము. ఏ దేశమైతే నిమిత్తంగా అవుతుందో, వారికి అవార్డు ఇస్తాము.
డబల్ విదేశీయులు అక్కడ కూడా వింటున్నారు. వారి హృదయంలో కూడా ఈ ఆలోచన వస్తోంది - ఎవరిని నిమిత్తులుగా చేయాలి అని వెతుకుతున్నారు. అచ్ఛా. విదేశాల యూత్ గ్రూపు చేతులు ఎత్తండి. (20 దేశాల నుండి 170 మంది యువకులు రిట్రీట్‌లో పాల్గొన్నారు.) మంచిది. ఇప్పుడు విదేశాల యువకులు ఇటువంటి సేవ చేసి మీ గ్రూపును సిద్ధం చేయండి. అప్పుడు మహాత్ముల సమ్మేళనం జరిగినప్పుడు, మీ అందరి యూత్ గ్రూపుకు ఆహ్వానం ఇస్తారు. అప్పుడు మీ యువకుల ఎదుట ఈ మహాత్ములు తల వంచాలి, అర్థమైందా? కాబట్టి అటువంటి గ్రూపును సిద్ధం చేయండి.
(యూత్ గ్రూపుకు మాస్టర్, జపాన్‌కు చెందిన లీ భాయితో) మంచి గ్రూపును సిద్ధం చేశారు. ఇప్పుడు భారతదేశంలోని మహాత్ములు బ్రహ్మచర్యంలో ఉండడం అసంభవం లేదా చాలా కష్టం అని భావిస్తారు. అటువంటి వారికి ఈ యువకులు తమ అనుభవం ద్వారా - ఇది కష్టం కాదు, సహజం మరియు మేము సహజయోగులు, సహజ బ్రహ్మచారులమయ్యాము అని వినిపించాలి. అప్పుడు అటువంటి పక్కా బ్రహ్మచారి యోగి ఆత్మల ప్రభావం వారిపై కూడా పడుతుంది. ఇది కూడా ప్రత్యక్షతకు ఒక నిమిత్త దృశ్యమవుతుంది. ప్రభుత్వానికి కూడా చూపిస్తాము - ఈ యువకులను చూడండి, వీరు తమ మనసా ద్వారానే విశ్వకళ్యాణానికి నిమిత్తులుగా ఉన్నారు. సరేనా? ఇప్పుడు పక్కా గ్రూపు కావాలి. అలా కాదు, ప్రభుత్వం మరియు సన్యాసుల ఎదుట ఉంచి, కొంతకాలం తరువాత ఫెయిల్ అయిపోవడం కాదు. కాదు. పక్కాగా ఉండాలి. మేము అచల, నిశ్చల, అవినాశి బ్రాహ్మణ ఆత్మలము. ఏది జరిగినా కదలము అని గ్యారంటీ ఇచ్చే అటువంటి గ్రూపును బాప్‌దాదా ఎదుటకు తీసుకురండి. సరేనా? మంచి ధైర్యం ఉన్నవారు. ఎక్కడ ధైర్యం ఉంటుందో అక్కడ బాబా సహాయం తప్పకుండా ఉంటుంది. అచ్ఛా. అభినందనలు.
భారతదేశంలోని యూథ్ కూడా అలా సిద్ధమవ్వాలి. అటువంటి పక్కా యువతను సిద్ధం చేయండి. ఈరోజు పక్కాగా ఉండి, రేపు పచ్చిగా కాకూడదు. (అందరూ ప్రతిజ్ఞలను వ్రాసి ఇచ్చారు.) బాప్‌దాదా అటువంటి వ్రాతలను చాలా చూశారు. (అందరూ నవ్వారు.) నవ్వుతున్నారు. ప్రతిజ్ఞల ఉత్తరాలు బాప్‌దాదా వద్ద అందరివీ చాలా జమ అయ్యాయి. మరి భారతదేశ యువత చెప్పండి - ఈరోజు చేసిన వాగ్దానం ఫైల్లో ఉంటుందా, లేక ఫైనల్‌గా ఉంటుందా? ఏమవుతుంది? ఫైనల్ అవుతుందా లేక ఫైల్లో ఉంటుందా? పక్కాగా ఉన్నవారు చేతులు ఎత్తండి. వీరి వీడియో తీయండి. ఈ వీడియో మీ అందరికీ పంపబడుతుంది. ఫైనల్ వాగ్దానం చేసినవారు ఆదర్శంగా నిలుస్తారు. మిగిలిన ఫైళ్లు అయితే బాప్‌దాదా వద్ద చాలా-చాలా ఉన్నాయి. అర్థమైందా. ఫైల్లో ఉంచకండి, ఫైనల్ అయి చూపించండి. అచ్ఛా.
అచ్ఛా - (ఢిల్లీ వారు మేళాను సంభాళించారు.) అందరికీ మంచి సేవ చేసే లాటరీ లభించింది. కాబట్టి ఢిల్లీ వారు సేవ చేసే లాటరీని తీసుకున్నారు మరియు ఎల్లప్పటికీ సేవ యొక్క విధిని నమోదు చేసుకున్నారు. సేవ అంటే ఇష్టమా? సేవలో వచ్చిన ఢిల్లీ వారు లేవండి. ఆగ్రా వారు లేవండి. మంచిది, సహయోగులుగా అవ్వడం అంటే సమీపానికి రావడం. విశేష ఆత్మల సమీపానికి వచ్చే అవకాశం లభిస్తుంది. దానితో పాటు సేవ యొక్క బలం సమయానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు జమ కూడా చేసుకుంటారు మరియు శ్రేష్ఠ ఆత్మల సమీపానికి కూడా వస్తారు. అనేక బ్రాహ్మణ ఆత్మల సంబంధ-సంపర్కంలోకి వస్తారు. కాబట్టి సమీపంగా రావడానికి ఇది మంచి సాధనం. అందరికీ అవకాశం ఇచ్చారు, మంచిగా చేశారు. ఢిల్లీ వారికి నచ్చింది కదా! అచ్ఛా.
(రతన్ అన్నయ్య లండన్ మరియు ఇతర ఇద్దరు అన్నయ్యలతో) ఈశ్వరీయ సేవకు సంబంధించిన ఏ కార్యమైనా, దాని లక్ష్యం ఆత్మలను బాబా సమీప సంబంధంలోకి తీసుకురావడం. వారితో ఏదో ఒక విధంగా జమ చేయించే సాధనం అది. కాబట్టి మీరందరూ ఇదే లక్ష్యంతో సేవకు నిమిత్తులుగా ఉన్నారు కదా? ఇదే లక్ష్యం కదా? మరి బాప్‌దాదా చూస్తారు - ఎంతమంది ఆత్మల భవిష్యత్తును నిర్మించడానికి నిమిత్తులయ్యారో! గ్రూపును తీసుకువస్తారు కదా! అచ్ఛా, ఒక పుష్పగుచ్ఛాన్ని తీసుకురండి. ఫౌండేషన్ యొక్క పుష్పగుచ్ఛాన్ని తీసుకురండి. నచ్చిందా? ఏ కార్యం జరిగినా అందులో సేవ ఇమిడి ఉంది. కేవలం నిమిత్తులుగా కావాలి. కాబట్టి మంచిగా చేశారు. ఇప్పుడు బాప్‌దాదా ఎదుటకు పుష్పగుచ్ఛాన్ని తీసుకురండి. సరేనా? మంచి ఉత్సాహం ఉంది. ధైర్యం ఉన్నవారికి బాబా సహాయం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ కార్యానికి అభినందనలు మరియు ముందుగానే పుష్పగుచ్ఛాన్ని తీసుకు వచ్చినందుకు కూడా అభినందనలు. అచ్ఛా.
అందరికీ లభించిన అభినందనలు విని అందరూ సంతోషిస్తున్నారు. మరి మీ అందరికీ ఎన్ని అభినందనలు లభించాయి? అరబ్-ఖరబ్ల కంటే కూడా ఎక్కువ అభినందనలు లభించాయి. అచ్ఛా.
సర్వ నవయుగ విశ్వ అధికారులకు, నవ జీవితం ద్వారా విశ్వ పరివర్తక ఆత్మలకు, సదా సఫలం చేసుకోవటం ద్వారా సఫలతా మూర్తులుగా అయ్యే ఆత్మలకు, సదా తాము చేసిన ప్రతిజ్ఞలకు సాకార స్వరూపాన్ని ఇచ్చే అచంచల, అఖండ స్వరూప ఆత్మలకు, సదా ఉత్సవములో ఉంటూ, ఇతరులకు కూడా ఉత్సవము ద్వారా ఉత్సాహాన్ని కలిగించే ఆత్మలకు, క్రొత్త సంవత్సరమునకు మరియు క్రొత్త యుగ స్థాపనకు బాప్‌దాదా యొక్క శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. అలాగే ధైర్యం పెట్టుకుని ధైర్యం ద్వారా ముందుకు వెళ్ళి బాబా నుండి సహాయం పొందే అటువంటి పిల్లలందరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
(రాత్రి 12 గంటల తరువాత బాప్‌దాదా పిల్లలందరికీ మళ్ళీ క్రొత్త సంవత్సర శుభాకాంక్షలను తెలిపారు)
విశ్వములోని అన్ని మూలలలో ఉన్నవారికి, విశ్వములోని నలువైపులా విశేషంగా నవ జీవితంలో ఉండే, అందరికీ క్రొత్త సంవత్సరముతోపాటుగా క్రొత్త యుగానికి కూడా శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. బ్రాహ్మణ పిల్లలకైతే ప్రతి రోజు, ప్రతి క్షణమూ క్రొత్తదే. ఇప్పుడు పాత సంవత్సరానికి వీడ్కోలు మరియు క్రొత్త సంవత్సరానికి శుభాకాంక్షలు. ఇలా సదా ప్రతి క్షణము ఏ సంకల్పమునైతే చేస్తారో, ఏ కర్మనైతే చేస్తారో ఆ ప్రతి కర్మకు, సంకల్పమునకు అభినందనలు. సంపర్కములోకి ఎవరు వచ్చినా సరే వారు సదా అభినందనలు, అభినందనలు అన్న పాటనే పాడుతూ ఉండాలి. ఈ క్రొత్త సంవత్సరములో మీ అందరికీ ఎవరు కలిసినా, మీతో ఎవరు తోడుగా ఉన్నా, వారికి సదా సంతోషమనే దిల్ఖుష్ మిఠాయిని తినిపిస్తూ ఉండండి మరియు సదా సంతోషంతో మనస్సుతో నాట్యం చేస్తూ ఉండండి మరియు సేవలో అందరికీ సంతోషమనే ఖజానాను పూర్తిగా నింపి పంచుతూ ఉండాలి. నలువైపులా ఉన్న పిల్లలకు క్రొత్త సంవత్సరముతోపాటు ఇటువంటి క్రొత్త జీవితానికి, క్రొత్త ఉల్లాస-ఉత్సాహాలకు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. గుడ్ నైట్ మరియు గుడ్ మార్నింగ్. అచ్ఛా!
*** ఓంశాంతి ***
