‘‘నాది-నాది అన్న దేహ-అభిమానాన్ని వదిలి బ్రహ్మా బాబా అడుగులలో అడుగులు వెయ్యండి’’
ఈరోజు బాప్‌దాదా తమ నలువైపులా ఉన్న శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలను చూస్తున్నారు. బ్రాహ్మణులు అనగా బ్రహ్మా ముఖవంశావళి. ప్రతి బ్రాహ్మణ ఆత్మ యొక్క భాగ్యమును చూసి బాప్‌దాదా కూడా హర్షిస్తున్నారు. ప్రతి బ్రాహ్మణ ఆత్మకు జన్మతోనే స్వయం బ్రహ్మా బాబా ద్వారా మస్తకముపై స్మృతి తిలకము దిద్దబడుతుంది. స్వయం భగవంతుడు తిలకధారిగా చేస్తారు. దీనితో పాటు ప్రతి బ్రాహ్మణ ఆత్మకు పవిత్రత అన్న మహామంత్రము ద్వారా ప్రకాశ కిరీటాన్ని ధరింపచేయిస్తారు, అలాగే ప్రతి బ్రాహ్మణ ఆత్మనూ విశ్వ కళ్యాణకారీ ఆత్మగా తయారుచేసి బాధ్యతా కిరీటాన్ని ధరింపజేస్తారు, ఈ విధంగా రెండు కిరీటాలు ఉన్నాయి. అంతేకాక స్వయం భగవంతుడు తమ హృదయ సింహాసనాధికారులుగా చేస్తారు. కనుక జన్మించగానే తిలకధారులుగా, కిరీటధారులుగా మరియు సింహాసనాధికారులుగా అవుతారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము మొత్తము కల్పములో మరే ఇతర ఆత్మకూ ఉండదు. మరి బ్రాహ్మణులమైన మేము జన్మించగానే ఇటువంటి భాగ్యవంతులుగా అవుతాము అన్న ఇంతటి శ్రేష్ఠ భాగ్యము యొక్క స్మృతి మీకు ఉంటుందా? ప్రపంచములోనివారు బ్రాహ్మణులైన మీ గుర్తును శ్రీకృష్ణుని రూపంలో చూపించారు. కానీ తాను విశ్వ రాజకుమారుడు కనుక రాజ్యానికి గుర్తుగా తిలకాన్ని, కిరీటాన్ని, సింహాసనాన్ని ఇస్తారు. అయినాగానీ అతనికి చిన్నతనములోనైతే తిలకము, కిరీటము, సింహాసనము లభించవు, కానీ బ్రాహ్మణులైన మీకు తిలకము, కిరీటము మరియు సింహాసనము మూడూ ప్రాప్తిస్తాయి. పరమాత్మ తండ్రి ద్వారా ఈ మూడు ప్రాప్తులూ లభించడము అన్నది కేవలము బ్రాహ్మణుల భాగ్యములోనే ఉంది. కావున బాప్‌దాదా చూస్తున్నారు - నా పిల్లల ప్రతి ఒక్కరి మస్తకముపై ఎంతటి పెద్ద భాగ్య సితార మెరుస్తూ ఉంది. ఇటువంటి భాగ్య సితార మీకు మీలో కనిపిస్తూ ఉందా? సదా మెరుస్తూ ఉన్నట్లు కనిపిస్తుందా లేక ఒక్కోసారి చాలా బాగా మెరుస్తుంది మరియు ఒక్కోసారి ఆ సితార మెరుపు తగ్గిపోతుందా? ఈ భాగ్య సితార విచిత్రమైన సితార. బాప్‌దాదా పిల్లలైన మిమ్మల్ని అందరినీ ఎప్పుడు చూసినా లేక కలిసినా గానీ - పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకములో సితార మెరుస్తూ ఉండటాన్ని చూసి హర్షిస్తున్నారు. సితార మెరుస్తూ-మెరుస్తూ ఉండగా మెరుపు ఎందుకు మళ్ళీ తగ్గిపోతుంది? దానికి కారణము ఏమిటి అనేది మీ అందరికీ బాగా తెలుసు!
బాప్‌దాదాకు పిల్లల చార్టును చూస్తే నవ్వు కూడా వస్తుంది. ఎప్పుడైనా, ఎవరినైనా - మీరు ఏ విధంగా తయారవ్వాలి అనుకుంటున్నారు? మీ లక్ష్యం ఏమిటి? అని అడిగితే, మెజారిటీ ఒకటే జవాబు ఇస్తారు - మేము నంబరువన్‌గా అవ్వాలి, సూర్యవంశీయులుగా అవ్వాలి. చంద్రవంశీ రాజులైన సీతారాములుగా కూడా అవ్వాలని అనుకోరు. సూర్యవంశీ నంబరువన్‌గా కావాలన్నది లక్ష్యమైనప్పుడు, మరి ఎటువంటి లక్ష్యమో ఆ విధమైన సదా సూర్యవంశీ లక్షణాలు కనిపించటము అవసరము. పిల్లల లక్ష్యము ఏమిటంటే - సూర్యవంశీయులుగా అవ్వాలి అనగా సదా విజయులుగా అవ్వాలి, నంబరువన్ సూర్యవంశీయుల గుర్తు సదా విజయి. సూర్యుని కళలు ఎక్కువ తక్కువ అవ్వవు. సూర్యుడు ఉదయిస్తాడు మరియు అస్తమిస్తాడు, అంతేకానీ చంద్రవంశీయులలా కళలు తక్కువ అవ్వవు. కనుక సూర్యవంశీయుల గుర్తు - సదా ఏకరసము మరియు సదా విజయి. చంద్రవంశీయులను క్షత్రియులు అని అంటారు, క్షత్రియ జీవితంలో ఒక్కోసారి ఓటమి ఉంటుంది, ఒక్కోసారి గెలుపు ఉంటుంది. ఒక్కోసారి సఫలతామూర్తులుగా ఉంటారు మరియు ఒక్కోసారి శ్రమించే మూర్తులుగా ఉంటారు. యుద్ధము చెయ్యటము అనగా శ్రమించటము. చంద్రవంశీయుల కళలు ఏకరసంగా ఉండవు, అందుకే లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానంగా చేసుకోండి. బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ బాబా సమానంగా అవ్వాలనే అంటారు. మరి బాబా సదా సహజ విజయీ స్వరూపులు. ఒకవేళ ఏకరస అవస్థ లేకపోతే నంబరువన్‌గా అవుతారా లేక నంబరువారులోకి వస్తారా? ఒకటేమో నంబరువన్, ఇంకొకటి నంబరువారు. కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి - మేము నంబరువన్‌గా ఉన్నామా లేక నంబరువారు లిస్టులో ఉన్నామా. నంబరువన్ అనగా బ్రహ్మా బాబాను ఫాలో చేయటము.
ఫాలో చెయ్యటంలో శ్రమ తక్కువగా ఉంటుంది అని బాప్‌దాదా సహజ సాధనాన్ని తెలియజేస్తారు, బ్రహ్మా పాదము అనగా అడుగు, ప్రతి కార్యములో అడుగు రూపీ పాదానికి గుర్తు. కనుక అడుగుపై అడుగు వేసి నడవటము సహజమవుతుంది. కొత్త దారిని వెతికే అవసరం లేదు, అడుగుపై అడుగు అనగా అడుగులో అడుగు వెయ్యటము. ఏ కార్యము చేసినా సరే, మనసా సంకల్పాలు చేసినా, మాటలు మాట్లాడినా, కర్మలలో సంబంధ-సంపర్కములోకి వచ్చినా, ప్రతి కర్మ చేసే కంటే ముందు ఇది ఆలోచించండి - బ్రాహ్మణ ఆత్మనైన నేను ఏ కర్మనైతే చేస్తున్నానో అది బ్రహ్మా బాబా సమానంగా ఉందా? బ్రహ్మా బాబా సంకల్పాలు ఏ విధంగా ఉండేవి? నా సంకల్పాలు కూడా అదే విధంగా ఉన్నాయా? ప్రతి మాటా బ్రహ్మా బాబా సమానంగా ఉందా? ఒకవేళ అలా లేకపోతే మరి చెయ్యకూడదు. ఆలోచించకూడదు, మాట్లాడకూడదు, చెయ్యకూడదు. బ్రహ్మా బాబా అడుగు ఒకటైతే పిల్లల అడుగు వేరేలా ఉండటమనేది జరగకూడదు. అలా ఉంటే బాబా సమానంగా అవ్వాలన్న లక్ష్యము ఏదైతే ఉందో, గమ్యము ఏదైతే ఉందో, అది ఎలా నెరవేరుతుంది? ఒకవేళ బ్రహ్మా యొక్క ప్రతి అడుగు సమానంగా అడుగులో అడుగు వేస్తూ ఫాలో చేస్తూ ఉన్నట్లయితే - ఒకటేమో స్వయాన్ని సదా సహజ పురుషార్థులుగా అనుభవం చేస్తారు మరియు సదా సంపూర్ణత అనే గమ్యాన్ని సమీపంగా అనుభవం చేస్తారు.
బ్రహ్మా బాబా సమానంగా అవ్వటము అనగా సంపూర్ణతా గమ్యమును చేరుకోవటము. బ్రహ్మా బాబా వతనములోకి పిల్లలైన మీ అందరినీ సంపూర్ణ అవ్యక్త ఫరిశ్తాలుగా అవ్వమని ఆహ్వానిస్తున్నారు. బ్రహ్మా బాబా యొక్క ఆహ్వాన పాట లేక మధుర ఆహ్వాన ధ్వని వినిపించటం లేదా? ‘‘రండి పిల్లలూ, మధురమైన పిల్లలూ, త్వరత్వరగా రండి’’ - ఈ పాట లేక మాట వినిపించటం లేదా? బ్రహ్మా బాబా పిలుపును వినండి, క్యాచ్ చేయండి. బ్రహ్మా బాబా ఏమంటున్నారంటే - పిల్లలు 99వ సంవత్సరం గురించి చాలా ఆలోచిస్తున్నారు - ఏమవుతుందో, ఇది అవుతుందా, అది అవుతుందా... ఇది అవుతుందా అవ్వదా... ఇది అవుతుందా! ఈ ఆలోచనలలో ఎక్కువ ఉంటారు. ఇలా అయితే అవ్వదు కదా! ఇలా అవుతుంది అని ఒకసారి ఆలోచిస్తే, అలా అవ్వదు అని మరోసారి ఆలోచిస్తారు. అవుతుందేమో, అవుతుందేమో అన్న ఈ పాటను పాడుతూ ఉంటారు కానీ తమ ఫరిశ్తాతనము గురించి, సంపన్న సంపూర్ణ స్థితిలో తీవ్రగతితో ముందుకు వెళ్ళాలన్న శ్రేష్ఠ సంకల్పాన్ని తక్కువగా చేస్తారు. అది అవుతుందా, ఏమవుతుందో... ఇలా అవుతుందా, అవ్వదా అనే పాటను ఎక్కువగా పాడుతారు. బాబా అంటారు - ఏమి జరిగినా కానీ మీ లక్ష్యము ఏమిటి? ఏదైతే జరుగుతుందో, దానిని చూడాలి మరియు వినాలి అన్న లక్ష్యము ఉందా లేక బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తాగా అవ్వాలన్న లక్ష్యము ఉందా? దాని కోసం ఏర్పాట్లు చేసుకున్నారా? ప్రకృతి తన ఎటువంటి రంగు-రూపాలను చూపించినా కానీ మీరు ఫరిశ్తాలుగా అయ్యి, బాబా సమానంగా అవ్యక్త రూపధారులుగా అయ్యి ప్రకృతి యొక్క ప్రతి దృశ్యాన్నీ చూసేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రకృతి యొక్క అలజడి ప్రభావము నుండి ముక్తులై ఫరిశ్తాగా అయ్యారా? మీ స్థితిని తయారుచేసుకోవటంలో నిమగ్నమై ఉన్నారా లేక ఏమవుతుందో, ఏమవుతుందో అన్న ఈ ఆలోచనలలోనే మునిగి ఉన్నారా? ఏదైనా పరిస్థితి ఎదురుగా వస్తే ప్రకృతిపతులైన మీరు మీ ప్రకృతిపతి అనే సీట్‌పై సెట్ అయి ఉంటారా లేక అప్సెట్ అవుతారా? ఇలా అయిపోయింది ఏమిటి? ఇదైపోయింది... అదైపోయింది... అని ఈ దృశ్యాల సమాచారాలలోనే బిజీగా ఉంటారా లేక మీ సంపన్నతా స్థితిలో స్థితులై ఎటువంటి ప్రకృతి అలజడులనైనా ముందుకు వెళ్ళిపోతూ ఉన్న మేఘాలలా అనుభవం చేసుకుంటారా?
బ్రహ్మా బాబా పిల్లలను అడుగుతున్నారు - నా సమానంగా ఫరిశ్తాలుగా సదాకాలము కొరకు అయ్యారా? ఎందుకంటే పిల్లలైన మీరు వ్యక్తంలో ఉంటూ అవ్యక్తులుగా అవ్వాలి. మీరు ఏమంటారంటే - బాబా అయితే అవ్యక్తమైపోయారు, మమ్మల్ని కూడా అలా అవ్యక్తంగా తయారుచేయండి కదా! బ్రహ్మా బాబా ఏమంటున్నారంటే, ముందుగా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి - విశ్వ కళ్యాణ బాధ్యతా కిరీటమేదైతే బాబా ధరింపజేసారో, ఆ కార్యాన్ని సంపన్నము చేసారా? విశ్వ కళ్యాణకారులు, విశ్వ కళ్యాణము సంపన్నమైందా? బ్రహ్మా బాబా ఎందుకు అవ్యక్తమయ్యారంటే - పిల్లలకు విశ్వ కళ్యాణ కార్యాన్ని అప్పజెప్పి, బంధనం నుండి ముక్తులుగా అయ్యి సేవా వేగాన్ని తీవ్రతరం చేయడానికి నిమిత్తులుగా అయ్యేది ఉంది, దీని ప్రత్యక్ష స్వరూపాన్ని నలువైపులా చూస్తున్నారు. ఈ దేశంలోనైనా, విదేశాలలోనైనా అవ్యక్త బ్రహ్మా ద్వారా సేవలలో తీవ్రగతి జరిగింది మరియు జరుగనున్నది కూడా. సేవలలో తీవ్రగతికి నిమిత్త ఆధారంగా బ్రహ్మా బాబానే అవ్వవలసి ఉంది. కానీ రాజ్యాధికారిగా అయితే ఒక్క బ్రహ్మా బాబానే అవ్వరు, వారితోపాటు పిల్లలు కూడా రాజ్యాధికారాన్ని తీసుకోవాలి, అందుకే సాకారములో నిమిత్తులుగా సాకార రూపధారి పిల్లలైన మిమ్మల్ని తయారుచేసారు. కానీ అంతిమములో పిల్లలైన మీరు వ్యక్తములో ఉంటూ అవ్యక్త ఫరిశ్తాలుగా అయ్యి విశ్వ కళ్యాణ సేవల వేగాన్ని తీవ్రతరం చేసి సమాప్తి చెయ్యాలి, సంపన్నంగా అవ్వాలి మరియు తయారుచెయ్యాలి.
99వ సంవత్సరంలో సమాప్తి చెయ్యాలా అని బ్రహ్మా బాబా అడుగుతున్నారు. ఒక్కసారి చప్పట్లు కొట్టగానే ప్రకృతి సిద్ధంగా నిలబడుతుంది. మరి మీరు ఫరిశ్తా సమానంగా డబల్ లైట్‌గా అయ్యారా? కనీసం 108 మంది ఇటువంటి సదా విజయులుగా అయ్యారా, సంకల్పాలు, మాటలు మరియు కర్మలలో అనగా సర్వుల సంబంధ-సంపర్కములోకి వచ్చినప్పుడు, ఎటువంటి వ్యర్థము లేక నెగెటివ్ లేకుండా పాస్ అయ్యారా? వ్యర్థము మరియు నెగెటివ్ - ఈ భారమే సదాకాలమునకు డబల్ లైట్ ఫరిశ్తాగా అవ్వనివ్వదు. కనుక బ్రహ్మా బాబా అడుగుతున్నారు - ఈ భారము నుండి తేలికగా అయ్యి ఫరిశ్తాగా అయ్యారా? ఇక్కడ ‘‘సదా’’ అన్నది అండర్లైన్ చేయాలి. కనీసం 108 మంది అయితే సదా ఫరిశ్తా జీవితాన్ని అనుభవము చెయ్యాలి, అప్పుడే బ్రహ్మా బాబా సమానము అని అంటాము. మరి బాబా అడుగుతున్నారు - చప్పట్లు కొట్టాలా? లేక 2000లో చప్పట్లు కొట్టాలా, 2001లో చప్పట్లు కొట్టాలా, ఎప్పుడు చప్పట్లు కొట్టమంటారు? ఏమి ఆలోచిస్తున్నారు? చప్పట్లు మ్రోగితే తయారైపోతారా, అలానా? ఏమి ఆలోచిస్తున్నారు? చప్పట్లు మ్రోగితే, ఆ సమయంలో తయారైపోతారా? ఏమవుతుంది? కొట్టమంటారా చప్పట్లు? చెప్పండి, సిద్ధంగా ఉన్నారా? పరీక్ష తీసుకోమంటారా? ఊరికే అలా ఒప్పుకుంటామా, పరీక్ష పెట్టమంటారా? టీచర్లు చెప్పండి - పరీక్ష పెట్టమంటారా? అన్నింటినీ వదలాల్సి ఉంటుంది. మధుబన్ వారు మధుబన్ వదలాల్సి ఉంటుంది, జ్ఞాన సరోవర్ వారు జ్ఞాన సరోవర్‌ను, సెంటరులోని వారు సెంటరును, విదేశాలలోని వారు విదేశాలను, అన్నింటినీ వదలాల్సి ఉంటుంది. మరి ఎవరెడీగా ఉన్నారా? ఒకవేళ ఎవరెడీగా ఉన్నట్లయితే చేతులతో చప్పట్లు కొట్టండి. ఎవరెడీయేనా? పరీక్ష తీసుకోమంటారా? రేపు అనౌంన్స్‌మెంట్ చేయమంటారా? అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వదలకూడదు, అక్కడికి వెళ్ళి - కాస్త చక్కబెట్టుకుని వస్తాను, అలా కాదు. ఎక్కడ ఉంటే అక్కడే. అలా ఎవరెడీగా ఉండాలి. మీ ఆఫీసు ఉండదు, మంచం ఉండదు, గది కూడా ఉండదు, అలమారి కూడా ఉండదు. కొద్దిగా పని ఉంది కదా, రెండు రోజులలో చేసుకుని వచ్చేస్తాము అని అనకూడదు. అలా కాదు, ఆజ్ఞ అంటే ఆజ్ఞయే. ఆలోచించుకుని ‘సరే’ అని చెప్పండి. లేదంటే రేపు ఆజ్ఞ వస్తుంది - ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు అని. ఆజ్ఞాపించమంటారా, సిద్ధంగా ఉన్నారా? సరే, ఆజ్ఞాపించండి అని ధైర్యంగా అనటం లేదు. కాస్త ఒక రోజు టైమ్ లభిస్తే బాగుండు అని ఆలోచిస్తున్నారు. నేను లేకుండా ఇది జరగకూడదు, అది జరగకూడదు, అన్న ఇటువంటి వ్యర్థ సంకల్పాలు కూడా చెయ్యకండి. బ్రహ్మా బాబా ట్రాన్స్ఫర్ అయినప్పుడు - నేను లేకపోతే ఏమవుతుందో, నడుస్తుందా నడవదా అనేమైనా ఆలోచించారా? సరే, ఒక డైరెక్షన్‌ను ఇస్తాను అని ఏమైనా డైరెక్షన్ ఇచ్చారా? తమ సంపన్న స్థితి ద్వారా డైరెక్షన్ ఇచ్చారు కానీ నోటితో కాదు. అలా అంత సిద్ధంగా ఉన్నారా? ఆజ్ఞ లభించగానే వదిలేస్తే వదిలిపోతుంది. అలజడి సృష్టించమంటారా? ఇలా చెయ్యాలి అని చెప్పేస్తాము. ఆజ్ఞాపించడం జరుగుతుంది, అడిగి చెయ్యము, తారీఖును ముందే ఫిక్స్ చెయ్యము. రండి అని అకస్మాత్తుగా ఆజ్ఞాపిస్తాము, అంతే. ఇటువంటివారినే డబల్ లైట్ ఫరిశ్తాలు అని అంటాము. ఆజ్ఞ రావటంతోనే వెళ్ళిపోవాలి. మృత్యువు నుండి ఆజ్ఞ లభించినప్పుడు ఏమి ఆలోచిస్తారు – సెంటర్‌ను చూడాలి, అలమారీని చూడాలి, జిజ్ఞాసువులను చూడాలి, ఏరియా చూడాలి... అని ఆలోచిస్తారా! ఈరోజుల్లో ‘నాది-నాది’ అంటూ ఏరియా విషయంలో జంజాటము ఎక్కువైపోయింది, నా ఏరియా అని అంటారు! విశ్వ కళ్యాణకారులకు హద్దులోని ఏరియాలు ఏమైనా ఉంటాయా? వీటన్నింటినీ వదలాల్సి ఉంటుంది. ఇది కూడా దేహాభిమానము. దేహ భానము ఇంకా దీనికన్నా తేలికైనది, కానీ ఈ దేహము యొక్క అభిమానము చాలా సూక్ష్మమైనది. నాది-నాది అన్న దీనినే దేహ-అభిమానము అని అంటాము. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ అభిమానము తప్పకుండా ఉంటుంది. అది తమ విశేషతల విషయములోనైనా కావచ్చు, నా విశేషత, నా గుణము, నా సేవ, ఈ నావి అనేవన్నీ - ప్రభు ప్రసాదాలు, ఇవి నావి కావు. ప్రసాదాన్ని నాదిగా భావించటమంటే, ఇది దేహ-అభిమానము. ఈ అభిమానాన్ని వదలటమే సంపన్నంగా అవ్వటము. అందుకే ఇలా వర్ణిస్తాము - ఫరిశ్తా అనగా దేహ-అభిమానము ఉండదు, దేహ భానము ఉండదు, రకరకాల నావి అన్న సంబంధాలు ఉండవు. ఫరిశ్తా అనగా ఈ హద్దు సంబంధాలు సమాప్తము. మరి ఇప్పుడు ఏ ఏర్పాట్లను చేసుకుంటారు? బ్రహ్మా బాబా పిలుపును అటెన్షన్‌తో వినండి, వారు ఆహ్వానిస్తున్నారు. బాబా అంటున్నారు - సమాప్తి నగారాను మ్రోగించటమైతే చాలా సహజము, ఎప్పుడు కావాలంటే అప్పుడు మ్రోగించవచ్చు, కానీ కనీసం సత్యయుగం ఆది యొక్క 9 లక్షల మందైతే ఎవరెడీగా ఉండాలి కదా! కనీసం నంబరువారుగానైనా ఉండాలి, నంబరువన్‌గా అయితే కొద్దిమందే ఉంటారు. కనీసం 108 మంది నంబరువన్‌గా, 16 వేల మంది రెండవ నంబరుగా, 9 లక్షల మంది మూడవ నంబరుగా తయారవ్వాలి. కనీసం ఇంతమందైతే తయారవ్వాలి. రాజధాని అయితే తయారవ్వాలి కదా!
వర్తమాన సమయములో నెగటివ్ మరియు వ్యర్థ సంకల్పాల రూపీ మాయ స్వరూపము మెజారిటీలో ఉంది అన్నదానిని బాప్‌దాదా ఇప్పుడు రిజల్టులో చూసారు. విశ్వ కళ్యాణకారీ స్థితి అనగా సదా అనంతమైన వృత్తి ఉండాలి, దృష్టి ఉండాలి మరియు అనంతమైన స్థితి ఉండాలి. వృత్తిలో కొంచెము కూడా ఏ ఆత్మ పట్ల నెగటివ్ లేక వ్యర్థ భావన ఉండకూడదు. నెగటివ్ విషయాన్ని పరివర్తన చెయ్యటము అనేది వేరే సంగతి. కానీ ఎవరైతే స్వయం నెగటివ్ వృత్తి కలవారిగా ఉంటారో వారు ఇతరుల నెగటివ్‌ను కూడా పాజిటివ్‌లోకి మార్చలేరు, అందుకే ప్రతి ఒక్కరూ స్వయం యొక్క సూక్ష్మ చెకింగ్‌ను చేసుకోవాలి - సర్వుల పట్ల వృత్తి, దృష్టి సదా అనంతమైనవిగా మరియు కళ్యాణకారిగా ఉన్నాయా? కొద్దిగా కూడా కళ్యాణ భావనకు బదులుగా హద్దు భావన, హద్దు సంకల్పాలు, మాటలు సూక్ష్మంగా కూడా లేవు కదా. సూక్ష్మంగా ఉన్నట్లయితే అందుకు గుర్తు సమయము వచ్చినప్పుడు లేక సమస్య వచ్చినప్పుడు ఆ సూక్ష్మము స్థూలములోకి వచ్చేస్తుంది. ఎప్పుడూ బాగానే ఉంటారు కానీ సమయము వచ్చినప్పుడు అది ఇమర్జ్ అయిపోతుంది. ఆ తర్వాత ఎలా ఆలోచిస్తారంటే - వీరు ఉన్నదే అలా, ఈ విషయమే అలాంటిది, ఈ వ్యక్తియే అలాంటివారు అని. వ్యక్తి అలాంటివారే, కానీ నా స్థితి శుభ భావన, అనంతమైన భావన కలిగినదిగా ఉందా, లేదా, మీ పొరపాటును చెక్ చేసుకోండి. అర్థమైందా!
విషయాలను చూడకండి, స్వయాన్ని చూసుకోండి. అంతే. 99వ సంవత్సరంలో లోలోపల ఇదే తపన పెట్టుకోండి - బ్రహ్మా బాబా అడుగు ఏదైతే ఉందో, బ్రహ్మా బాబా సమానంగా నా ప్రతి అడుగు అలా ఉండాలి. బ్రహ్మా బాబాపై అందరికీ ప్రేమ ఉంది కదా. మరి ప్రియమైనవారినే ఫాలో చేయటము జరుగుతుంది. బాబా సమానంగా అవ్వాల్సిందే. సరేనా! 99లో అందరూ తయారైపోతారా? ఒక సంవత్సరము సమయం ఉంది. ఇదైపోయింది, అదైపోయింది... అని ఆలోచించకండి. ఇవన్నీ జరిగేదే ఉంది. ఇవన్నీ జరిగేదే ఉంది అని ముందు నుండే తెలుసు, కానీ బాబా సమానంగా ఫరిశ్తాగా అవ్వాల్సిందే. అర్థమైందా. చెయ్యాలి కదా? చెయ్యగలరా? ఒక్క సంవత్సరంలో తయారవుతారా లేక అర సంవత్సరంలో తయారైపోతారా? మీరు సంపన్నంగా అయ్యేందుకై బ్రహ్మా బాబా కూడా ఆహ్వానిస్తున్నారు మరియు ప్రకృతి కూడా ఎదురుచూస్తూ ఉంది. 6 నెలలలో ఎవరెడీగా అవ్వండి. సరే, 6 నెలలలో కాకపోతే ఒక సంవత్సరంలో అయినా తయారవ్వండి. అలజడిలోకి రావద్దు, అచలంగా ఉండాలి. లక్ష్యాన్ని విడిచిపెట్టకండి. ఏది ఏమైనా సరే, బాబా సమానంగా అవ్వాల్సిందే. కొందరు బ్రాహ్మణులు కదిలింపజేసినా, బ్రాహ్మణులు విఘ్నరూపులై ఎదురుగా వచ్చినా కానీ మేము బాబా సమానంగా అవ్వాల్సిందే. ఈ సలహా ఇష్టమేనా? (బాప్‌దాదా అందరిచేత చేతులు ఎత్తించారు మరియు అందరి వీడియో, ఫోటో తీయించారు) ఈ ఫోటో అందరికీ పంపిస్తాము. ఈ వీడియో నుండి అయితే ఎవరైనా మిస్ అవ్వచ్చు కానీ వతనం యొక్క వీడియో నుండి అయితే ఎవ్వరూ మిస్ అవ్వలేరు.
అచ్ఛా, బాబా అడుగుతున్నారు - ఒక్క క్షణములో అందరూ ఇప్పుడిప్పుడే విదేహులుగా అవ్వగలరా? మరి ఇప్పుడు ఒక్క క్షణములో విదేహీ స్థితిలో స్థితులైపోండి. (డ్రిల్) అచ్ఛా, ఇప్పుడు దేహములోకి రండి. ఇప్పుడు మరల విదేహులుగా అవ్వండి. ఇలా మొత్తము రోజులో మధ్యమధ్యలో ఒక్క క్షణకాలము లభించినా కానీ పదే-పదే ఈ అభ్యాసమును చేస్తుండండి. అచ్ఛా!
సర్వ శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మలకు, సదా బ్రహ్మా బాబా అడుగులో అడుగు వేసి ఫాలో ఫాదర్ చేసే ఆజ్ఞాకారీ పిల్లలకు, సదా బ్రహ్మా బాబా సమానంగా ఫరిశ్తా స్థితిలో స్థితులై ఉండే సమీప ఆత్మలకు, సదా ప్రకృతిపతులుగా అయి ప్రకృతిలోని ప్రతి దృశ్యాన్నీ సాక్షీగా అయ్యి చూసే అచలమైన, స్థిరమైన ఆత్మలకు, సదా అనంతమైన వృత్తి మరియు దృష్టిలో ఉండే భాగ్యవంతులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే. దేశములోనైనా, విదేశములలోనైనా బయట ఎవరైతే వింటున్నారో ఆ పిల్లలకు కూడా విశేష ప్రియస్మృతులు.
దాదీలతో:- నిమిత్తం అవడం ద్వారా ఆశీర్వాదాలు లభిస్తాయి. మీకు అయితే మందు కూడా ఆశీర్వాదాలే. నిమిత్త దాదీలు గానీ, లేదా నిమిత్త కార్యంలో సహాయకులుగా అయ్యేవారు గానీ అందరికీ విశేషంగా ఆశీర్వాదాల లిఫ్ట్ లభిస్తుంది. యజ్ఞ చరిత్రలో ఏ ఆత్మ ఏ కార్యానికి ఆదినుండి ఇప్పటివరకు నిమిత్తంగా అయిందో, వారికి ఆ నిమిత్త కార్యానికి సంబంధించిన విశేష ఆశీర్వాదాలు లభిస్తాయి. నిమిత్తం అవడం అనేది ఒక భాగ్యం లభించినట్లే. ఒకటి - నిమిత్తంగా అయ్యేవారిపై అందరి దృష్టి ఉండటం వల్ల వారికి తమపై కూడా అటెన్షన్ ఉంటుంది. వారి స్వపురుషార్థం కూడా సహజమైపోతుంది. స్టేజ్‌పై కూర్చుంటే స్టేజ్‌పై కూర్చోవడం వల్ల స్వతహాగానే అటెన్షన్ ఉంటుంది కదా! అలాగే నిమిత్తం అవడం అంటే స్టేజ్‌పై ఉన్నట్లే. కాబట్టి స్టేజ్‌పై ఉండటం వల్ల స్వపురుషార్థం సహజమైపోతుంది. అందరి సహకారపు ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. నిమిత్తంగా అయిన ఆత్మ యథార్థంగా పాత్రను పోషిస్తే, ఇతరుల సహయోగము అనే సహాయం కూడా లభిస్తుంది. అచ్ఛా. (డ్రిల్ చాలా బాగా అనిపించింది.) ఇది ప్రతి ఒక్కరూ ప్రతిరోజూ చేయాలి. మేము బిజీగా ఉన్నామని కాదు. మధ్య మధ్యలో, సమయానుసారం, ఒక సెకను - ఎవరైనా కూర్చున్నా, మాట్లాడుతున్నా కూడా - ఒక సెకను వారికీ డ్రిల్ చేయించవచ్చు, తామూ అభ్యాసం చేయవచ్చు. ఇందులో ఎటువంటి కష్టం లేదు. రెండు నాలుగు సెకన్లైనా తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల చాలా సహాయం లభిస్తుంది. లేకపోతే ఏమవుతుంది? రోజంతా బుద్ధి నడుస్తూనే ఉంటుంది కదా! అప్పుడు విదేహిగా అవడానికి సమయం పడుతుంది. మధ్య మధ్యలో అభ్యాసం ఉంటే, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెంటనే అయిపోతారు. ఎందుకంటే అంతిమ సమయంలో అన్నీ అకస్మాత్తుగా జరగనున్నాయి. కాబట్టి అకస్మాత్తుగా వచ్చే పేపరులో ఈ విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం. అలా కాదు - మాట పూర్తయిన తర్వాత విదేహిగా అవడానికి పురుషార్థమే చేస్తూ ఉండటం. అప్పుడు సూర్యవంశీయులు కాలేరు కదా! అందుకే ఎంత బిజీగా ఉన్నవారైనా మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేయడం తప్పనిసరి. అప్పుడు సేవలో కొన్నిసార్లు వచ్చే అలసట, లేదా అప్పుడప్పుడు పరస్పరం జరిగే అలజడి ఉండదు. అభ్యాసకులు అవుతారు కదా! ఒక సెకనులో అతీతంగా అయ్యే అభ్యాసం ఉంటే, ఏ విషయం జరిగినా ఒక సెకనులోనే తమ అభ్యాసం ద్వారా ఆ విషయాల నుండి దూరమైపోతారు. ఆలోచించారు - అయిపోయింది. యుద్ధం చేయాల్సిన అవసరం ఉండదు. యుద్ధపు సంస్కారాలు, కష్టపడే సంస్కారాలు సూర్యవంశీయులుగా అవ్వనివ్వవు. చివరి ఘడియ కూడా యుద్ధంలోనే గడిచిపోతుంది, ఒకవేళ ఒక సెకనులో విదేహిగా అయ్యే అభ్యాసం లేకపోతే. ఇంకా ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో - స్వభావంలో గానీ, సంబంధాలలో గానీ, సంకల్పశక్తిలో గానీ, వృత్తిలో గానీ, వాతావరణ ప్రభావంలో గానీ - ఏ విషయంలో బలహీనంగా ఉన్నారో, అదే రూపంలో మాయ కావాలని చివరి పేపర్ తీసుకుంటుంది. అందుకే విదేహిగా అయ్యే అభ్యాసం చాలా అవసరం. ఏ రూపంలో మాయ వచ్చినా, మీకు అవగాహన అయితే ఉంది కదా! ఒక సెకనులో విదేహిగా అయిపోతే మాయ ప్రభావం పడదు. ఎలా అంటే, ఒక మృతుడిపై ఏ ప్రభావమూ ఉండదు కదా! విదేహి అంటే దేహానికి అతీతంగా అయిపోయాడు. దేహంతో పాటు స్వభావం, సంస్కారాలు, బలహీనతలు అన్నీ దేహంతోనే ఉన్నాయి. దేహానికి అతీతంగా అయిపోతే, అన్నిటికీ అతీతంగా అయిపోయినట్లే. అందుకే ఈ డ్రిల్ చాలా సహాయకారిగా ఉంటుంది. ఇందులో కంట్రోలింగ్ పవర్ కావాలి. మనస్సును కంట్రోల్ చేయగలగాలి, బుద్ధిని ఏకాగ్రం చేయగలగాలి. లేకపోతే అలవాటు లేకుంటే ఇబ్బందిపడుతూనే ఉంటారు. ముందుగా ఏకాగ్రం చేయాలి, అప్పుడే విదేహిగా అవుతారు. అచ్ఛా. మీ అందరికీ అయితే 14 సంవత్సరాల అభ్యాసం ఉంది కదా! (బాబా సంస్కారం వేసేశారు.) పునాది బలంగా ఉంది. మీ అందరికీ అయితే 14 సంవత్సరాల్లో అది నేచర్ అయిపోయింది. సేవలో ఎంత బిజీగా ఉన్నా, సమయం లేదనే సాకులు పనికిరావు. ఎందుకంటే బాప్‌దాదాకు ఇప్పుడు త్వరత్వరగా 108 మంది, తరువాత 16 వేల మంది సిద్ధం చేయాలి. లేకపోతే పని ఎలా సాగుతుంది? తోడుగా ఉండేవారు కావాలి కదా! ముందుగా 108, తరువాత 16 వేల మంది, తరువాత 9 లక్షల మంది. 9 లక్షల మంది అయితే అయిపోతారు, అందులో పెద్ద విషయం లేదు. ముందుగా 108 మంది సిద్ధం కావాలి. (సభతో) మీరు అనుకుంటున్నారా - మేము 108 మందిలోకి వస్తామని? ఇప్పుడున్నది ఏదైనా తొలగించుకోండి. తరువాత దాదీతో చెప్పండి - మేము ఎవరెడీ. అవును, మీ మీ పేర్లు ఇవ్వండి. ఆఫర్ చేయండి - మేము 108 మందిలో ఉన్నాము అని. తరువాత వెరిఫై చేస్తారు. తమ పేరును తామే ఇవ్వడం చాలా మంచిది.
ఒకసారి అందరినీ తప్పకుండా ఛేంజ్ చేయాలి. ఇప్పుడు ముందుగానే తెలియజేస్తున్నాము కాబట్టి ఎవరెడీగా ఉండండి. తరువాత ఆర్డర్ చేస్తాము. మధుబన్వారినీ ఛేంజ్ చేస్తాము. మధుబన్వారు సెంటర్లకు వెళ్తారు, సెంటర్లవారు మధుబన్కు వస్తారు. మీ అల్మారాలు ఖాళీ చేయండి. ఎవరికీ తాళం వేయనివ్వము. అచ్ఛా - ఇదీ ఒక సరదా కదా! ఇదీ సరదా ఆటే. అచ్ఛా, ఇప్పుడు ఏమి చేయాలి?
(కాఠ్మాండు, ఢిల్లీ, అహ్మదాబాద్, కలకత్తాలలో చాలా మంచి సేవలు జరిగాయి. కాఠ్మాండు వారు ఈరోజు ప్రత్యేకంగా ప్రియస్మృతులు పంపించారు)
ఎక్కడెక్కడ సేవ చేసారో, ఒకదానికంటే ఒకటి బాగుంది. ఆరంభం ఢిల్లీ చేసింది. కాబట్టి ఢిల్లీలో ప్రగతి మైదాన్ వరకు చేరుకోవడం కూడా సేవ యొక్క మంచి ఫలితం. ఢిల్లీ రాజధానిలో ఇలాంటి స్థలంలో ఉచితంగా భూమి పొందడం - ఇదీ సేవ విజయమే. ఎవరెవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా, ఢిల్లీలో పేరు ప్రఖ్యాతులు పొందడం అంటే నాలుగు వైపులా ధ్వని వ్యాపించడం. అందుకే ఇప్పుడు ప్రగతి మైదాన్‌లో జెండా ఎగురవేశారు. ఇప్పుడు ఇంకా ముందుకు వెళ్లాలి. ఇప్పుడు ఆధ్యాత్మిక జెండా, ఆధ్యాత్మికతకు పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చే జెండా ఢిల్లీలో తప్పకుండా ఎగరాలి. ఇంకా ముందుకు వెళ్లాలి. ఎందుకంటే ఢిల్లీ ధ్వని టి.వి. ద్వారా గానీ, వార్తాపత్రికల ద్వారా గానీ వ్యాపిస్తుంది. అలాగే యజ్ఞ కార్యాలు ఏవైతే జరుగుతాయో, వాటిలో నిమిత్త ఆత్మలుగా అయ్యేవారిపై కూడా పెద్ద కార్యక్రమాల ప్రభావం, పేరు ప్రభావం పడుతుంది. అందుకే బాప్‌దాదా దృష్టి ఢిల్లీపై ఉంది. స్థాపనలో సేవ యొక్క జెండా ఢిల్లీలో ఎగిరింది. అలాగే ప్రత్యక్షత యొక్క జెండా - ఆధ్యాత్మికతే శ్రేష్ఠమైనది, ఆధ్యాత్మిక ఆత్మలే వీరని - ఈ ధ్వని తప్పకుండా వ్యాపించాలి.
కాఠ్మాండులో కూడా అక్కడి మహారాజుపై ప్రజలకు ప్రేమ ఉంది. అందుకే మహారాజు రావడం వల్ల దేశవాసులందరిపైనా సహజమైన ప్రభావం పడింది. అలాగే గమనించినది ఏమిటంటే, నేపాల్ భూమిలో అక్కడ నిమిత్తంగా ఉన్న ఆత్మలు చాలా శక్తివంతమైనవారు. అందుకే నేపాల్‌లో సేవ జరగడం సహజం. పిల్లలు చాలా శ్రమపడ్డారు. చాలామంది ప్రభావితులయ్యారు, దగ్గరయ్యారు. ఒకటి ప్రభావితులు కావడం, రెండవది దగ్గరి సహయోగులుగా అవడం. నేపాల్‌లో దగ్గరి సహయోగి ఆత్మలు కూడా ఉన్నారు. ఇది మంచి ఫలితం.
ఇంకా గుజరాత్ చాలా మంచి శ్రమ చేసింది. సహయోగులను తయారు చేయాలనే లక్ష్యం పెట్టుకుని, అందులో మంచి విజయం సాధించింది. కాబట్టి సహయోగులుగా అయిన వారికి బాబా ద్వారా గానీ, డ్రామా ద్వారా గానీ ఏదో ఒక పుణ్యఫలం లభిస్తుంది. అందువల్ల వారు ముందుకు వెళ్తూ మరింత దగ్గరవుతారు. వారి ద్వారా సేవ వ్యాపిస్తూ ఉంటుంది. ఇది అందరిలోకెల్లా గొప్ప పని, అత్యుత్తమ పని. లక్ష్యం మంచిది. ప్రతి ఒక్కరూ తమ తమ పని చేసేటప్పుడు ఖర్చు గురించి గానీ, హద్దు విషయాల గురించి గానీ ఆలోచించకుండా, హృదయపూర్వకంగా, తనువుతో, మనసుతో, పరస్పర ప్రేమతో చేసారు. అందులోనే విజయం ఉంది. గుజరాత్‌కు విజయం లభించింది. ఇక ముందు కూడా లభిస్తూనే ఉంటుంది.
కలకత్తాలో కూడా ధైర్యం చాలా బాగుంది. అందరూ చిన్నవారే అయినా, ధైర్యం మాత్రం చాలా గొప్పది. ఆ ధైర్యం ఫలితంగా యజ్ఞం నుండి విశేష సహాయం లభించింది. ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వచ్చి పని పూర్తి చేసారు. మంచి పేరు కూడా వచ్చింది. యోగ శిబిరానికి కూడా చాలామంది వచ్చారు. మేళాకు కూడా చాలామంది వచ్చారు. మిగిలిన విషయాలను పట్టించుకోకుండా, సమయానుసారంగా ఉల్లాస-ఉత్సాహాలతో పని సాగిపోయింది. చాలా బాగా జరిగింది. అందుకే చిన్నవారైనా పెద్ద పని చేసారు. వారికి విశేష అభినందనలు. ఇకపై ఎలాంటి కార్యక్రమాలు జరిగినా చాలా బాగా జరుగుతాయి. సమయానికి వరదానం లభించింది. ఇప్పుడు ఎక్కడ చేసినా ఫలితాలు అత్యుత్తమంగా ఉంటాయి. అచ్ఛా.
లక్నో, బెంగళూరు, హైదరాబాద్ - ఈ మూడు చోట్ల పెద్ద కార్యక్రమాలు జరగనున్నాయి. మూడు కూడా చాలా మంచివి. బాప్‌దాదా ముందుగానే చెబుతున్నారు - చాలా బాగా జరుగుతుంది. (మద్రాస్, బాంబేలో కూడా పెద్ద కార్యక్రమాలు జరగనున్నాయి.) అందరికీ హోవన్హార్ అభినందనలు. అచ్ఛా. ఓం శాంతి.
*** ఓంశాంతి ***
