‘‘హోలీ అనే పదము యొక్క అర్థ స్వరూపములో స్థితులవ్వటము అనగా బాబా సమానంగా అవ్వటము’’
ఈరోజు బాప్‌దాదా తమ హోలియెస్ట్ (అతి పవిత్రులైన), హైయెస్ట్ (అతి ఉన్నతులైన) మరియు రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచములో అతి ధనవంతులైన) పిల్లలను నలువైపులా చూస్తున్నారు. సాకారంలో సమ్ముఖంగా ఉన్నా, లేక దూరంగా ఉంటూ మనసుతో సమీపంగా ఉన్నా... నలువైపులా ఉన్న పిల్లలను చూసి హర్షిస్తూ ఉంటారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఎంత హోలియెస్ట్గా అవుతారంటే మొత్తము కల్పములో మరెవ్వరూ ఇంతటి మహాన్ పవిత్ర ఆత్మలుగా అవ్వలేదు, అవ్వలేరు కూడా. ఎప్పటికప్పుడు ధర్మాత్మలు, మహానాత్మలు పవిత్రంగా ఉన్నారు, కానీ వారి పవిత్రతకు మరియు మీ పవిత్రతకు తేడా ఉంది. ఈ సమయంలో మీరు పవిత్రంగా అవుతారు, ఈ పవిత్రత యొక్క ప్రాప్తి మరియు ప్రారబ్ధముగా భవిష్యత్తులో అనేక జన్మల వరకు తనువు, మనను, ధనము, సంబంధ-సంపర్కాలు మరియు వాటితో పాటు ఆత్మ, అన్నీ పవిత్రంగా ఉంటాయి. శరీరము కూడా పవిత్రంగా ఉంటుంది మరియు ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది - ఇటువంటి పవిత్రతను ఆత్మలైన మీరు ప్రాప్తి చేసుకుంటారు. మనస్సు-మాట-కర్మ, ఈ మూడు పవిత్రంగా అవ్వటం ద్వారా ఇటువంటి ప్రారబ్ధము ప్రాప్తిస్తుంది. కనుక మీరు ఇటువంటి హోలియెస్ట్ (అతి పవిత్రులైన) ఆత్మలు. మిమ్మల్ని మీరు ఇటువంటి శ్రేష్ఠ హోలియెస్ట్ ఆత్మలుగా భావిస్తున్నారా? ఇప్పుడు అలా తయారయ్యారా లేక అవుతూ ఉన్నారా? అలా తయారవ్వటము సహజమా లేక కొంచెం-కొంచెం కష్టమా? కానీ కల్పపూర్వము కూడా అలా తయారయ్యారు మరియు ఇప్పుడు కూడా తయారవ్వాల్సిందే. పక్కానా లేక కొంచెం-కొంచెం ఉంటుందా? అలా కాదు. స్వప్నమాత్రము కూడా అపవిత్రత సమాప్తమవ్వాల్సిందే. ఈరోజు తయారవుతూ ఉన్నాము మరియు రేపటికి తప్పకుండా తయారైపోతాము అన్న ఇంతటి నిశ్చయము ఉంది కదా. మీరు హోలియెస్ట్ (అతి పవిత్రులు) కూడా, అలాగే హైయెస్ట్ (అతి ఉన్నతులు) కూడా.
ఉన్నతోన్నతుడైన తండ్రి పిల్లలు ఉన్నతోన్నతులు. హైయెస్ట్‌గా అవుతారు కనుకనే పూజింపబడతారు. ఈరోజుల్లోని ఉన్నత ఆత్మలైనా, ఫలితాన్ని ఆశించి రాజ్యం చేసే రాజులైనా, ఇప్పుడు అటువంటివారు లేరనుకోండి, ప్రెసిడెంట్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, వారు పూజ్యులుగానైతే అవ్వరు. పూజ్యులుగా అయ్యే ఆత్మలైన మీ ముందు పూజారులుగా అయ్యి నమస్కరిస్తారు మరియు పూజిస్తారు. ఇప్పుడు కూడా స్వరాజ్య అధికారులుగా అవుతారు మరియు భవిష్యత్తులో కూడా రాజులకే రాజులుగా అవుతారు. కనుక అటువంటి హైయెస్ట్ (అతి ఉన్నత) పదవిని ప్రాప్తి చేసుకుంటారు. దానితో పాటు మీరు రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ (ప్రపంచములోని అతి ధనవంతులు). మీ టైటిల్యే పదమాపదమ్పతి అని ఉంది. మీ వద్ద ఎటువంటి ఖజానా ఉందంటే దానిని కోటీశ్వరులు, కోటానుకోట్ల కోటీశ్వరులు కూడా వారి కోటాను కోట్లతో ఇటువంటి ఖజానాను ప్రాప్తి చేసుకోలేరు. శ్రేష్ఠ ఆత్మలైన మీరు బాబా ద్వారా ఎటువంటి భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారంటే - మా అడుగులో పదమాలు ఉన్నాయి అని మీరు అనుభవము చేస్తారు మరియు వర్ణన కూడా చేస్తారు. అడుగులో పదమాలు ఉన్నాయా లేక వందలు ఉన్నాయా, వేలు ఉన్నాయా? అత్యంత పెద్ద మిలియనియర్ కూడా ఇంత సంపాదనను చేసుకోలేరు. అడుగు వెయ్యటానికి ఎంత సమయము పడుతుంది? అడుగు వెయ్యండి, ఎంత సమయము పడుతుంది? ఒక్క క్షణము. పోనీ రెండు క్షణాలు అనుకోండి. ఒకవేళ రెండు క్షణాలు అని అన్నా కానీ రెండు క్షణాలలో పదమాలు అంటే, మరి మొత్తము రోజంతటిలో ఎన్ని పదమాలు అయ్యాయి? లెక్క పెట్టండి. ఒక్క రోజులో ఇంతటి సంపాదనను చేసుకునే మిలియనియర్ ఎవరైనా ఉన్నారా? ఇలా ఎవరైనా ఉంటారా? కనుక మీరు రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ కదా! మీది ఎటువంటి ఖజానా అంటే దానిని నిప్పు కూడా కాల్చలేదు, నీరు ముంచెయ్యలేదు, దొంగలు దోచుకోలేరు, రాజులు కూడా తినలేరు. ఇటువంటి ఖజానాను ఈ పురుషోత్తమ సంగమయుగములో ప్రాప్తి చేసుకుంటారు. మరి ఇటువంటి మీ స్వమానము స్మృతిలో ఉంటుందా? ఉంటుందా, ఉండటం లేదా? వెనుక ఉన్నవారు చేతులూపుతున్నారు. వెనుక ఉన్నవారు ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు కదా? రిచెస్ట్ ఇన్ ది వరల్డ్ కనుక ప్రశాంతతే ప్రశాంతత. అత్యంత పెద్ద యూనివర్శిటీలలో కూడా చదువు చదువుకునేందుకు ఇటువంటి సోఫాలలో కూర్చోరు, కానీ మీరు బెగ్గర్ టు ప్రిన్స్ (బికారి నుండి యువరాజు) గా అయ్యేవారు. మీరు బికారి కూడా, అలాగే యువరాజు కూడా. సర్వస్వ త్యాగము అనగా బికారి. సర్వ ప్రాప్తులు అనగా యువరాజు. త్యాగము లేకుండా ఇంత పెద్ద భాగ్యము లభించదు. త్యాగానికే భాగ్యము లభించింది. తనువు-మనను-ధనము, సంబంధాలు అన్నింటినీ త్యాగము చేసారు అనగా పరివర్తన చేసారు. తనువును నాదికి బదులుగా నీదిగా చేసారు. మనసు, ధనము, సంబంధాలను ఒక్క పదాన్ని పరివర్తన చెయ్యటం ద్వారా నావి అన్నదానికి బదులుగా నీవిగా చేసారు, వాస్తవానికి అది ఒకే పదము యొక్క పరివర్తన, కానీ ఈ త్యాగము ద్వారానే భాగ్యానికి అధికారులుగా అయ్యారు. కనుక భాగ్యం ముందు ఈ త్యాగం ఎంత? చిన్న విషయమా లేక కొంచెం పెద్దది కూడానా? అప్పుడప్పుడు పెద్దదైపోతుంది. నీది అని అనటమంటే పెద్ద విషయాన్ని చిన్నదిగా చెయ్యటము మరియు నాది అని అనటమంటే చిన్న విషయాన్ని పెద్దదిగా చెయ్యటము. ఏం జరిగినా సరే, 100 హిమాలయ పర్వతాల కంటే కూడా పెద్ద సమస్య వచ్చినా కానీ, నీది అని అనటమంటే పర్వతాన్ని దూదిలా చెయ్యటము, ఆవగింజ అంత కూడా కాదు, దూది అంత. సమస్య దూదిలా క్షణంలో ఎగిరిపోవాలి. కేవలము నీది అని అనటం కాదు, దానిని స్వీకరించాలి, స్వీకరించటమే కాదు, దాని అనుసారంగా నడవాలి. ఒక్క పదాన్ని పరివర్తన చెయ్యటము సహజమే కదా! మరియు అందులో లాభమే ఉంది, నష్టమైతే లేదు. నీది అని అనటం ద్వారా మొత్తము భారమంతటినీ బాబాకు ఇచ్చేసినట్లు. నీది నీకే తెలుసు. మీరు కేవలము నిమిత్తమాత్రులు. ఇందులో లాభమే ఉంది కదా? అతీతులుగా మరియు పరమాత్మునికి ప్రియులుగా అయిపోయారు. ఎవరైతే పరమాత్మునికి ప్రియులుగా అవుతారో, వారు విశ్వానికి ప్రియులుగా అవుతారు. ఇందులో కేవలం భవిష్య ప్రాప్తియే కాదు, వర్తమానములో కూడా ప్రాప్తి ఉంటుంది. ఒక్క క్షణంలో అనుభవం చేసారు కూడా మరియు ఇంకా చేసి చూడండి. ఏ విషయం వచ్చినా సరే, నీది అని అనండి, స్వీకరించండి మరియు నీదిగా భావించి చెయ్యండి, అప్పుడు చూడండి, భారము తేలికవుతుందో లేదో. అనుభవం ఉంది కదా? అందరూ అనుభవీలే కూర్చుని ఉన్నారు కదా! వాస్తవానికి ఏం జరుగుతుందంటే, నాది నాది అని అనటం చాలా అలవాటైపోయింది కదా, 63 జన్మల అలవాటు, కనుక నీది నీది అని అంటూ మరల నాది అని అనేస్తారు, మరియు నాది అని అన్నారంటే పోయినట్లే, తర్వాత ఆ విషయము ఒక గంటలో, రెండు గంటలలో, ఒక రోజులో సమాప్తమైపోతుంది, కానీ నీది నుండి నాది అని ఏదైతే అన్నారో దాని ఫలితం మాత్రం చాలాకాలం ఉంటుంది. విషయం అరగంటదే ఉంటుంది, కానీ పశ్చాత్తాప రూపంలోనైనా లేక పరివర్తన చేసుకునే లక్ష్యంతోనైనా, ఆ విషయము పదే-పదే స్మృతిలోకి వస్తూ ఉంటుంది, అందుకే బాబా పిల్లలందరికీ చెప్తున్నారు - ఒకవేళ ‘నాది’ అనే పదం పట్ల ప్రేమ ఉన్నట్లయితే, అది అలవాటైపోయింది, సంస్కారమైపోయింది అంటే, ఆ పదాన్ని ఉపయోగించాల్సిందే అని అంటే, ‘నా బాబా’ అని అనండి. అలవాటుకు వశమైపోతారు కదా. కనుక ఎప్పుడెప్పుడు నాది-నాది అనేది వచ్చినా, ‘నా బాబా’ అని అంటూ దానిని సమాప్తము చేసేసెయ్యండి. అనేక ‘నాది’ అనేవాటిని ఒక్క ‘నా బాబా’లో కలిపెయ్యండి.
రష్యావారు ఒక బొమ్మను తీసుకొస్తారు కదా, బొమ్మలో బొమ్మ... ఉంటూ ఒకే బొమ్మగా అయిపోతుంది. అలా మీరు కూడా ఒక్క ‘నా బాబా’లో అనేక ‘నావి’ అనేవాటిని కలిపేయండి, సమాప్తము. ఇలా చెయ్యగలరా? చేస్తారు కానీ అప్పుడప్పుడు నాది అనేదాని విస్తారములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఒక్కోసారి ‘నీది’ అని అంటారు, కానీ సదా ‘నాది’ అనేది ‘నీది’గా అయిపోవటంలో నంబరువారుగా ఉన్నారు. నంబర్‌వన్‌గా ఉన్నవారు కూడా ఉన్నారు, ఏ వన్‌గా ఉన్నవారు కూడా ఉన్నారు, కానీ వెనుక నంబర్ వారు కూడా ఉన్నారు. హోలీని జరుపుకోవటానికి వచ్చారు కదా? కనుక ఈ మంత్రమునే గుర్తుంచుకోండి - నేను బాబాకు హోలీ (బాబా వానిగా అయిపోయాను), పరమాత్ముని పరివారానికి చెందినవానిగా అయిపోయాను. మరి ఇటువంటి హోలీని జరుపుకున్నారా? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు ఇంకా కాల్చాలా లేక కాల్చేసారా? ఇందులో కాల్చేసాము అని అనటం లేదు, ఆలోచిస్తున్నారా?
చూడండి, భక్తి మార్గంలో ఏయే ఉత్సవాలనైతే జరుపుతారో, అవి స్మృతిచిహ్నాలు, కానీ అవి కూడా కొంత అర్థసహితంగా తయారుచేయబడ్డాయి. హోలీ పండుగలో ముందు కాల్చాలి, ఆ తరువాత జరుపుకోవాలి. ముందు జరుపుకోవటము, ఆ తరువాత కాల్చటము కాదు. ముందు భస్మము చెయ్యండి, అశుద్ధాన్ని, బలహీనతను, చెడును కాల్చేయండి, ఆ తరువాత జరుపుకోండి. మీరైతే చాలా ముందుగానే కాల్చేసారు కదా లేక ఇప్పుడు కూడా కండువా అంచులు ఏవైనా మిగిలిపోయి ఉన్నాయా? పాండవుల బుష్ షర్టు (వదులుగా ఉండే పొడవాటి కాటన్ చొక్కా) లేక మీరు వేసుకునే డ్రస్సులో మూలలేమైనా మిగిలిపోయి ఉన్నాయా? చీర అంచులైతే మిగిలిపోలేదు కదా? వాస్తవానికి చూడండి, ఆత్మికంగా జరుపుకోవాలి మరియు అలా జరుపుకోవటం ద్వారా శక్తిని, అతీంద్రియ సుఖాన్ని అనుభవము చెయ్యటమనేది ఎప్పుడు చెయ్యగలరంటే, ముందుగా కాల్చేసినప్పుడే. మనోరంజనం రూపంలో జరుపుకోవటమనేది వేరే విషయము. అలా చూస్తే సంగమయుగము ఉన్నదే ఆనందాల యుగము, అందుకే మనోరంజనం రీతిలో కూడా జరుపుకుంటారు మరియు జరుపుకోండి కూడా, బాగా జరుపుకోండి. కానీ పరమాత్ముని రంగులో రంగరించబడటము అనగా బాబా సమానంగా అవ్వటము. ఇది వారి రంగులో రంగరించబడటము అంటే (వారి ప్రభావము తమపై పడటము). ఏ విధంగా బాబా అశరీరులో, అవ్యక్తులో, అలా అశరీరితనమును అనుభవము చెయ్యటము మరియు అవ్యక్త ఫరిశ్తాతనమును అనుభవము చెయ్యటము - ఇదే రంగులో రంగరించబడటము అంటే. కర్మలు చెయ్యండి కానీ అవ్యక్త ఫరిశ్తాలుగా అయ్యి పని చెయ్యండి. అశరీరితనపు స్థితిని ఎప్పుడు కావాలంటే అప్పుడు అనుభవము చెయ్యండి. ఇలా మనసు మరియు బుద్ధి మీ కంట్రోల్లో ఉండాలి. అశరీరిగా అవ్వు అని ఆజ్ఞాపించండి. ఆజ్ఞాపించగానే జరిగిపోవాలి, ఫరిశ్తాగా అయిపోవాలి. మనసును ఎక్కడ ఏ స్థితిలో స్థితి చేసుకోవాలనుకుంటే అక్కడ క్షణంలో స్థితులైపోండి. ఎక్కువ సమయం పట్టలేదు కానీ, 5 క్షణాలే పట్టాయి, 2 క్షణాలే పట్టాయి అని అనుకోకూడదు. అలా జరిగితే ఆర్డర్లో అయితే లేనట్లే, కంట్రోల్లో అయితే లేనట్లే. ఎటువంటి పరిస్థితి అయినా, అలజడి ఉన్నా, అలజడిలో కూడా అచలంగా అవ్వండి. అటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? లేక అశరీరిగా అవ్వాలి, అశరీరిగా అవ్వాలి... అని ఆలోచిస్తూ-ఆలోచిస్తూ ఇలా ఆలోచించటంలోనే సమయము గడిచిపోతుందా? కొంతమంది పిల్లలు చాలా రకరకాల పోజులను మారుస్తూ ఉంటారు, బాబా చూస్తూ ఉంటారు. అశరీరిగా అవ్వాలి అని అనుకుంటారు, మళ్ళీ ఇలా ఆలోచిస్తారు - అశరీరి అనగా ఆత్మ రూపములో స్థితులవ్వటము, అవును, నేను ఉన్నదే ఆత్మగా, శరీరమునైతే కానే కాదు, నేను ఆత్మనే, నేను వచ్చిందే ఆత్మగా, అవ్వాల్సింది కూడా ఆత్మగా... ఇప్పుడు ఇటువంటి ఆలోచనలతో అశరీరిగా అయ్యారా లేక అశరీరిగా అయ్యేందుకు యుద్ధము చేసారా? మీ మనసుకు - క్షణంలో అశరీరిగా అవ్వు అని ఆజ్ఞాపించారేగానీ, అశరీరి అంటే ఏమిటి, ఎప్పుడు అశరీరిగా అవుతారు, ఏ విధంగా అవుతారు అని ఆలోచించమనైతే చెప్పలేదు కదా? మరి ఆజ్ఞను అంగీకరించలేదనే కదా! ఇది కంట్రోలింగ్ పవర్ అయితే కాదు కదా! ఇప్పుడు సమయమనుసారంగా ఇటువంటి అభ్యాసము యొక్క అవసరమే ఉంది. ఒకవేళ కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఎన్నో పరిస్థితులు అలజడిలోకి తీసుకురాగలవు, అందుకే ఒక్క హోలీ అన్న పదాన్నే గుర్తు చేసుకున్నా సరే సరిపోతుంది. హోలీ - జరిగిపోయిందేదో జరిగిపోయింది మరియు హో లీ అనగా బాబాకు చెందినవారిగా అయిపోయారు. ఇంకా ఎలా అయ్యారు? హోలీగా అనగా పవిత్ర ఆత్మగా అయ్యారు. హోలీ అన్న ఒక్క పదాన్ని గుర్తు చేసుకున్నా సరే, ఆ హోలీ అన్న ఒక్క పదముకు కల మూడు అర్థాలను ఉపయోగించండి. అవును, హోలీ అంటే జరిగిపోయిందేదో జరిగిపోయింది అని వర్ణించకండి. అవును, జరిగిపోయిందేదో జరిగిపోయింది అని ఆలోచిస్తూ ఉండకండి, వర్ణిస్తూ ఉండకండి, అలా కాదు. అర్థ స్వరూపములో స్థితులవ్వండి. ఆలోచించారు మరియు అయిపోయారు అన్నట్లు ఉండాలి. అంతేకానీ ఆలోచిస్తూ ఆలోచనలలోనే ఉండిపోవటం కాదు. అలా కాదు. ఏదైతే ఆలోచించారో, ఆ విధంగా అయిపోయారు, తయారైపోయారు, స్థితులైపోయారు అన్నట్లు ఉండాలి.
(నిన్న 10 సంవత్సరాలకు పైగా పాతవారైన డబల్ విదేశీ సోదరసోదరీల సెరిమనీ జరుపబడింది)
ఎవరైతే సెరిమనీ(వేడుక) జరుపుకున్నారో, అటువంటి సెరిమనీనే జరుపుకున్నారు కదా! హోలీ జరుపుకున్నారు కదా! బాప్‌దాదా కూడా ప్రతి అతీతమైన, ప్రియమైన దృశ్యాన్ని చూసి హర్షితులవుతారు. కుటుంబమంతా కూడా సంతోషంగా ఉంది. మీ ఫోటోను బాగా చూసారా? బాగా అనిపించిందా? కేవలం ముఖాన్ని చూసారా లేక మనస్సు యొక్క స్థితిని కూడా చూసారా? ఈ అద్దంలో అయితే రూపాన్ని చూశారు, చాలా మంచిది. మంచిగా చేసారు. కానీ జ్ఞానమనే అద్దంలో మీ స్థితిని కూడా చూసుకున్నారా? చాలా మంచిది. బాప్‌దాదా కూడా 10-15 సంవత్సరాలను చూడరు, కానీ ఇంతకాలం నడుస్తూ ఉన్నారు, అవినాశీగా ఉన్నారు, అమరులుగా ఉన్నారు, దీనిని చూసి సంతోషిస్తారు. అద్భుతం చేసారు. కల్చర్ మారింది, దేశం మారింది, ఆచార-వ్యవహారాలు మారాయి, డబల్ ఫారెనర్స్ సంస్కారాలు మారాయి, భారతవాసులయ్యారు. ఇప్పుడు ఏమని చెబుతారు? మధుబన్ నివాసులా లేక అమెరికా, లండన్... ఎక్కడివారు? మధుబన్ వారా? (మధుబన్ నివాసులు) అమెరికా, రష్యా గుర్తు లేదా? మధుబన్ మీ శాశ్వత చిరునామా. అమెరికా, రష్యా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, జపాన్... ఎన్ని పేర్లు ఉన్నాయి! ఇవన్నీ మీ సేవా స్థానాలు. నివసించడానికి శాశ్వత చిరునామా మధుబన్. మిగిలినవి సేవ కోసం భిన్న పేర్లు, భిన్న రూపాలు, భిన్న భాషలు, భిన్న కల్చర్లలోకి వెళ్ళారు. లేకపోతే చూడండి, మీరు అక్కడ జన్మించకపోతే భారతదేశంలోని సోదరీలు ఎన్ని భాషలు నేర్చుకోవలసి వచ్చేది! ఎన్ని భాషలు నేర్చుకునేవారు? కాబట్టి మీరందరూ సేవ కోసమే వెళ్ళారు. బాప్‌దాదా చూసారు, డబల్ విదేశీయులకు సేవాకేంద్రాలు తెరవాలనే ఆసక్తి కూడా చాలా మంచిది. ఫ్లాట్ లభించింది, సెంటర్ తెరిచారు. చాలా మంచిది. అందుకే చూడండి, ఇన్ని దేశాలలో సేవాకేంద్రాలు తెరవబడ్డాయి.
అందుకే బాప్‌దాదా డబల్ విదేశీయుల ఈ ఉల్లాస-ఉత్సాహాలకు పదేపదే అభినందనలు తెలియజేస్తున్నారు. కొద్దికాలంలోనే సేవను బాగా విస్తరించారు. మరి ఫాస్ట్ అయ్యారు కదా! విదేశీ సేవకు మొత్తం ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? లండన్‌లో స్థాపన జరిగి ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? (27 సంవత్సరాలు). భారతదేశంలో 62 సంవత్సరాలు, విదేశాలలో 27 సంవత్సరాలు. కాబట్టి బాప్‌దాదా సేవా వృద్ధిని చూసి సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా ఒక సేవ మిగిలి ఉంది. బాప్‌దాదా ఇలా వదిలిపెట్టరు, అయిపోయింది అని కాదు. ఇంకా మిగిలి ఉన్నాయి.
బాప్‌దాదా డబల్ విదేశీయులందరికీ భవిష్యత్తు కోసం ఇదే సూచన ఇస్తున్నారు - ఇప్పుడు వార్తాపత్రికల ద్వారా సేవను ఎక్కువగా చేయండి. విదేశీ వార్తాపత్రికలు భారతదేశానికి సేవ చేస్తాయి. ఇప్పుడు కొద్దికొద్దిగా కారణంగా అకారణంగా ప్రారంభమైతే అయ్యాయి. కానీ స్థాపన ఆది సమయంలో ప్రారంభమైనట్లుగా, విదేశీ వార్తాపత్రికలలో వార్తలను చదివారు. ఇప్పుడు మళ్ళీ విదేశీ వార్తాపత్రికలలో ఇటువంటి విషయాలు రావాలి, వాటి ద్వారా భారతవాసుల కళ్ళు తెరుచుకోవాలి. భారతదేశ వార్తాపత్రికలలో అయితే రావడం ప్రారంభమైంది. కానీ విదేశీ వార్తాపత్రికలు కూడా భారతదేశాన్ని మేల్కొల్పుతాయి. రెండవది, ప్రపంచ రేడియోలలో కూడా ఇలా రావాలి. మీరు బ్రహ్మాకుమారీస్ను కంప్యూటర్లో పెట్టారు కదా. కాబట్టి ఎవరికి కావాలంటే వారు చూడగలరు. పెట్టడం చాలా మంచిది. కానీ దాని సమాచారం ఎవరికీ తెలియదు. భారతదేశంలో దాని ప్రయోజనం పొందవచ్చు, కానీ ప్రచారం జరగలేదు. ఆవిష్కరణ బాగా చేశారు. చాలా మంచిది. డబల్ ఫారెన్‌లో ప్రకృతి సాధనాల ప్రయోజనాన్ని బాగా పొందుతున్నారు. భారతదేశంలో అందరూ ఈ బీ.బీ.సీని వింటారు. అందులో వస్తే, ఎంత ధ్వని వ్యాపిస్తుందో చూడండి. అద్భుతం చేయండి. పరిచయాలను వెలికి తీయండి. స్థానిక టీవీ, రేడియోలలో మీది వస్తూనే ఉంది. కానీ వినని వారు కూడా వినేలా అటువంటి ధ్వని వ్యాపించాలి. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏదో కొత్తది చేస్తారు కదా! ప్రణాళికలు రూపొందిస్తారు కదా! సమావేశాలు కూడా చాలా చేస్తారు. చేయండి, బాగా చేయండి. పిల్లల ధైర్యం, బాబా సహాయం అయితే ఉంది. కేవలం ఎవరో ఒకరు నిమిత్తమవ్వాలి. ప్రతి కార్యానికి ఎవరో ఒకరు నిమిత్తమవుతారు, అది జరిగిపోతుంది కూడా. ఎందుకంటే డ్రామాలో జరగడం నమోదు చేయబడి ఉంది. కేవలం సమయానికి ఎవరో ఒకరు నిమిత్తమవుతారు. కాబట్టి ఈ కార్యానికి కూడా ఎవరో ఒకరు తప్పకుండా నిమిత్తమవ్వాలి.
(బాప్‌దాదా డ్రిల్ చేయించారు)
ఇప్పుడు సమయము అనుసారంగా సదా స్మృతి మరియు సేవలలో ఉండే నిమిత్త ఆత్మలైన మీలోని ప్రతి ఒక్కరూ స్వ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తనా వైబ్రేషన్లను శక్తివంతంగా మరియు తీవ్ర వేగంతో పెంచాలి. నలువైపులా మానసిక దుఃఖము మరియు అశాంతి, మానసిక ఆందోళనలు చాలా తీవ్రగతితో పెరుగుతున్నాయి. బాప్‌దాదాకు విశ్వాత్మలపై దయ కలుగుతుంది. కనుక ఎంత తీవ్రగతితోనైతే దుఃఖపు అల పెరుగుతూ ఉందో, అంతగానే సుఖదాత పిల్లలైన మీరు మీ మనసా శక్తితో, మనసా సేవ మరియు సకాష్ సేవతో, వృత్తితో నలువైపులా సుఖము యొక్క దోసిలిని అనుభవము చేయించండి. బాబానైతే పిలుస్తూనే ఉంటారు కానీ పూజ్య దేవాత్మలైన మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపంలో పిలుస్తూ ఉంటారు. కనుక ఓ దేవాత్మలారా, పూజ్యాత్మలారా, మీ భక్త ఆత్మలకు సకాష్ను ఇవ్వండి. సైన్స్ వారు కూడా - దుఃఖం సమాప్తి అయ్యే ఆవిష్కరణలను ఆవిష్కరించాలి అని అనుకుంటారు. విజ్ఞాన సాధనాలు సుఖంతోపాటు దుఃఖాన్ని కూడా ఇస్తాయి. కానీ దుఃఖం ఉండకుండా కేవలం సుఖమే ప్రాప్తించాలి అని కూడా తప్పకుండా ఆలోచిస్తారు. కానీ స్వయంలోనే అనగా ఆత్మలోనే అవినాశీ సుఖం యొక్క అనుభవం లేకపోతే ఇతరులకు ఎలా ఇవ్వగలరు? కానీ మీ అందరి వద్ద సుఖము, శాంతి మరియు నిస్వార్థమైన సత్యమైన ప్రేమ యొక్క స్టాక్ జమ అయి ఉంది. జమ అయి ఉందా లేక ఎంతైతే కూడబెడతారో అంతా ఖర్చు అయిపోతుందా? ఇది కూడా చెక్ చేసుకోండి - జమ అయితే అవుతుంది, కానీ జమతో పాటుగా ఖర్చు కూడా అవ్వటం లేదు కదా? జ్ఞాన ఖజానా అయితే ఖర్చు చేసే కొద్దీ పెరుగుతుంది, తక్కువ అవ్వదు. ఒకవేళ పదే-పదే తమ స్వభావ-సంస్కారాల విషయంలోనో లేక మాయ వైపు నుండి వచ్చే సమస్యలలోనో తమ శక్తులను ఉపయోగించినట్లయితే జమ ఖాతా తగ్గిపోతుంది. కనుక చెక్ చేసుకోండి - జమ చేసుకున్నారు కానీ ఖర్చు కూడా చేస్తుంటే అకౌంట్లో ఎంత మిగిలి ఉంది? సంపాదించారు మరియు తినేసారు, ఇలా అయితే లేదు కదా? రెండు రోజులు సంపాదించుకున్నారు మరియు ఒక్క రోజులో జమ చేసుకున్నది కూడా ఖర్చు చేయవలసి వచ్చేలా అంతగా పోగొట్టుకున్నారు అనేటువంటి అకౌంట్ అయితే లేదు కదా? ఒకవేళ ఇలానే సంపాదించారు మరియు తినేసారు లేక స్వయం కొరకే ఖర్చు చేసుకుని సమాప్తం చేసారు అంటే ఇక 21 జన్మలకు ఏం జమ చేసుకున్నట్లు? జమ చేసుకుంటే సంతోషము కలుగుతుంది కానీ ఖర్చు అయినదాని లెక్కను చూసుకోకపోతే సమయానికి మోసపోతారు. జమ ఖాతాను కూడా చూసుకోండి, దానితో పాటు స్వయం కొరకు ఎంత ఖర్చు చేసాను అన్నదానిని కూడా చూసుకోండి. ఇతరులకు ఏదైనా గుణాన్ని ఇచ్చారు, శక్తిని ఇచ్చారు, జ్ఞాన ఖజానాను ఇచ్చారు, అది ఖర్చు కాదు, అది జమ ఖాతాలోనే జమ అవుతుంది కానీ స్వయము కొరకే ఎప్పటికప్పుడు ఖర్చు చేసినట్లయితే ఖాతా ఖాళీ అయిపోతుంది. అందుకే మంచి విశాల బుద్ధితో చెకింగ్ చేసుకోండి. జమ ఖాతా చాలా ఎక్కువ ఉండాలి. వాస్తవానికి ఇది సహజమే. ఒకవేళ ప్రతి అడుగులో పదమాలు జమ చేసుకుంటూ వెళ్ళినట్లయితే జమ అకౌంట్ చాలా ఎక్కువవుతుంది. కనుక చెక్ చేసుకోండి - ప్రతి కర్మ లేక ప్రతి అడుగు బ్రహ్మా బాబా సమానంగా ఉందా? మీరు అనుభవజ్ఞులు. ఎప్పుడైనా ఏదైనా మంచి కర్మ చేసినట్లయితే ఆ కర్మ ఫలంగా ఆ సమయములోనే ప్రత్యక్ష రూపంలో లభించే సంతోషము, శక్తి మరియు సఫలతల కారణంగా డబల్ లైట్‌గా ఉంటారు ఎందుకంటే బాబా తోడుతో కర్మ చేసాము అన్నది గుర్తుంటుంది. ఒకవేళ ఇప్పుడు ఏదైనా వికర్మ జరిగినట్లయితే దాని వలన కలిగే పశ్చాత్తాపము చాలా ఎక్కువ ఉంటుంది. ఆ మాటకొస్తే ఇప్పుడు వికర్మలేమీ జరగకూడదు, ఆ సమయం ఇప్పుడు గడిచిపోయింది. ఇప్పుడు ఎటువంటి వ్యర్థ సంకల్పాలు మరియు వ్యర్థ కర్మలు, వ్యర్థ మాటలు, వ్యర్థ సంబంధ-సంపర్కాలు కూడా ఉండకూడదు ఎందుకంటే వ్యర్థ సంబంధ-సంపర్కాలు కూడా చాలా మోసం చేస్తాయి. ఎటువంటి సాంగత్యమో అటువంటి రంగు అంటుకుంటుంది. కొంతమంది పిల్లలు చాలా తెలివైనవారు, వారేమంటారంటే - మేము వారితో సాంగత్యము చెయ్యము, కానీ వారు నన్ను వదలటం లేదు, నేను చెయ్యను కానీ వారు వదలటం లేదు. మరి అటువంటప్పుడు పక్కకు తప్పుకోవటం రాదా? ఒకవేళ ఎవరైనా ఏదైనా చెడిపోయిన వస్తువును ఇస్తే మీరు ఎందుకు తీసుకుంటారు! తీసుకునేవారు తీసుకోకపోతే ఇచ్చేవారు ఏం చేస్తారు? వ్యర్థ సంబంధాలు మరియు సంపర్కాలు కూడా అకౌంట్‌ను ఖాళీ చేసేస్తాయి. అంతేకాక ఆ సమయంలో - ఇది చెయ్యకూడదు అని మనసులో అనిపిస్తుంది కూడా, మనసు తింటుంది. చెయ్యకూడదు, అయినా కానీ చేసేస్తారు. వినకూడదు కానీ వినిపిస్తుంటే నేనేమి చెయ్యను అని అంటారు! కానీ ఒకవేళ మీరు పురుషార్థులైతే వ్యర్థ కర్మ కూడా జరగకూడదు. ఒకవేళ మీరు నిర్లక్ష్యులైతే ఇక ఆ విషయాన్నే వదిలేయండి, హాయిగా నిద్రపోండి, త్రేతాయుగములో రండి. కానీ ఒకవేళ మీరు పురుషార్థులైతే - ఇది చెయ్యకూడదు అని ఆ సమయములో మనసులోకి వస్తుంది, మనసు తింటుంది, అయినా కూడా చేస్తుంటే బాప్‌దాదా అంటారు - ఇటువంటి పిల్లలది విచిత్రము, వద్దనుకున్నా కూడా చేస్తుంటారు, మనసు తింటూ ఉంటుంది కానీ వింటూ కూడా ఉంటారు, చేస్తూ కూడా ఉంటారు, అంటే చాలా శక్తిశాలి ఆత్మలు కదా! అందుకే వ్యర్థం విషయంలో కూడా చెకింగ్‌ను అటెన్షన్‌తో చేసుకోండి. నిర్లక్ష్యంతో చెక్ చేసుకోకండి – ఏమీ ఫర్వాలేదు, ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి, ఇది నడుస్తూనే ఉంటుంది, ఇప్పుడెక్కడ సంపూర్ణంగా అయ్యాము, అయిపోతాములే... ఇటువంటి నిర్లక్ష్యము వద్దు. చేయాలి, అది కూడా తీవ్రగతితో చేయాలి, దీనినే హోలీ జరుపుకోవడము అని అంటాము.
బాప్‌దాదాకు పిల్లల భిన్న-భిన్న ఆటలను చూసి నవ్వు కూడా వస్తుంది, దయ కూడా కలుగుతుంది. ఆ సమయంలో బాప్‌దాదా టచ్ చేస్తారు, దీనిని కూడా అనుభవం చేస్తారు. ఇది చేయకూడదు, ఇది శ్రీమతం కాదు, ఇలా చేయడం బాబా సమానంగా అవ్వడం కాదు అని టచ్ కూడా అవుతుంది. కానీ నిర్లక్ష్యం నిద్రపుచ్చేస్తుంది. అందువలన ఇప్పుడు స్వయం పట్ల ఎక్కువ ఖజానాలను ఖర్చు చేయకండి. జమ చేసుకోండి, కానీ ఖర్చు చేయకండి. సేవ చేయండి, కానీ వ్యర్థంగా ఖర్చు చేయకండి. చాలా జమ చేసుకోవాలి కదా! డబల్ ఫారెనర్స్‌కు సాధారణంగా జమ చేసుకునే అలవాటు లేదు, ఆ సంస్కారాలు లేవు. లభించింది, ఖర్చు చేశారు; తినండి, త్రాగండి, ఆనందించండి. కానీ ఈ సంపాదనలో అలా చేయకండి. ఇందులో అత్యధికంగా జమ చేసుకోండి.
అవ్యక్త రూపంలో బ్రహ్మా బాబా కూడా విశేషంగా డబల్ విదేశీయులను హృదయపూర్వకంగా ఎంతో ప్రేమిస్తారు. వారిని చూస్తూ-చూస్తూ సంతోషిస్తారు. కనుక బ్రహ్మా బాబా యొక్క విశేష స్నేహానికి రిటర్న్ ఇస్తూ ఉండండి. రిటర్న్ ఇచ్చే సాధనం స్వయాన్ని టర్న్ చేసుకోవడం. డబల్ విదేశీయులకు ఛాన్స్ లభించింది కదా! విశేషమైన టర్న్ లభించింది. భారతవాసులకు అటువంటి టర్న్ లభించలేదు. డబల్ విదేశీయులకు టర్న్ లభించింది కనుక విశేషమైనవారు కదా! కనుక రిటర్న్ కూడా విశేషంగా చేయాలి. భారతవాసులు సంతోషిస్తారు. అసూయపడరు, మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. చూడండి, మధుబన్వాసులు ఎంత త్యాగం చేశారు! మధుబన్‌లో బాబా కలుస్తున్నారు, కానీ మధుబన్వాసులు క్రింద (మెడిటేషన్ హాల్లో) కూర్చున్నారు. కనుక మీకు ఛాన్స్ ఇచ్చారు కదా! ప్రేమ ఉంది కదా! మధుబన్వాసులకు కూడా బాప్‌దాదా వద్ద జమ ఉంది. ఇప్పుడు చూడండి, పైన-క్రింద అయినప్పుడు పైన ఉండేవారు కూడా మిస్ అవుతారు. పైన ఉన్నప్పుడు క్రిందివారు మిస్ అవుతారు. కానీ మీరు రెండు చోట్ల అటెండ్ అవుతున్నారు. (డబల్ విదేశీయులు కనుక డబల్గా లభిస్తుంది) వీరు విదేశీయులే కాదు, వీరు మధుబన్ నివాసులే. అది సేవాస్థానం. భారతవాసులు సేవాస్థానానికి వెళ్ళినప్పటికీ ఏమని చెప్తారు? మేము మధుబన్ నివాసులము. కనుక విదేశం సేవాస్థానం, నిజానికి మధుబన్ నివాసులు. నచ్చిందా? సరే, ఇలాగే ఉండండి. అక్కడ విదేశానికి వెళ్ళి విదేశీయులుగా అయిపోకండి. భారతవాసులుగా ఉండండి, మధుబన్వాసులుగా ఉండండి. ఇప్పుడు చాలా మారిపోయారు. ఇంతకుముందు చాలా క్వశ్చన్స్ చేసేవారు - విదేశపు కల్చర్ వేరు, భారతదేశపు కల్చర్ వేరు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చేయడం లేదు. చాలా పరివర్తన కూడా వచ్చింది. ఇంతకుముందు త్వరగా కన్ఫ్యూజ్ అయిపోయేవారు, ఇప్పుడు అచలంగా అయ్యారు. బాప్‌దాదా కూడా పిల్లల ప్రోగ్రెస్‌ను చూసి సంతోషిస్తున్నారు. ఇంతకుముందు వేరువేరుగా అనిపించేవారు, ఇప్పుడు చాలా ప్రియమైనవారిగా అయ్యారు. అన్ని దేశాలవారు కూడా వింటున్నారు. వారూ కూడా మాలో పరివర్తన వచ్చింది అని నవ్వుతున్నారు. ఎవరైతే వింటున్నారో, బాప్‌దాదా అన్ని దేశాలవారికి, ప్రతి ఒక్క బిడ్డకు పేరు సహితంగా విశేష హోలీ అభినందనలు, అలాగే మిలన్ అభినందనలు ఇస్తున్నారు. ఇప్పుడు పేర్లు చెప్తే రాత్రి గడిచిపోతుంది, అందువలన పేర్లు చెప్పడం లేదు. అచ్ఛా, మంచి ఇన్వెన్షన్‌ను తయారుచేసిన జర్మనీవారికి అభినందనలు. జర్మనీ బాప్‌దాదా యొక్క ఒక ఆశను అయితే పూర్తి చేసింది. ఇంకా అన్ని ఆశలను పూర్తి చేయలేదు, కానీ ఒక ఆశను పూర్తి చేసింది. జర్మనీవారు చేతులు ఎత్తండి. అభినందనలు. ఇప్పుడు జర్మనీ పురుషార్థంలో కూడా నంబర్‌వన్ బహుమతిని తీసుకోండి. జర్మనీవారు బహుమానాన్ని తీసుకుంటారా? చెప్పండి, హా లేదా నా? కమాల్ చేసి చూపించండి. జర్మనీ పట్ల బాప్‌దాదాకు చాలా ఆశలు ఉన్నాయి. అలజడిలో అచలంగా అయి చూపించండి. అలజడి కూడా జర్మనీలో ఎక్కువగా ఉంది, అచలంగా కూడా జర్మనీవారే అవ్వండి. అవ్వవలసిందే. అచ్ఛా.
నలువైపులా ఉన్న హోలియెస్ట్ ఆత్మలకు, సదా హైయెస్ట్ స్థితిలో స్థితులై ఉండే హైయెస్ట్ ఆత్మలకు, సదా సర్వ ఖజానాలతో సంపన్నులైన రిచెస్ట్ ఆత్మలకు, సదా ప్రతి అడుగులో పదమాలను జమ చేసుకునేవారికి, బాబా సమానంగా అయ్యే శ్రేష్ఠ ఆత్మలకు, సదా దయార్ద్ర హృదయులకు, క్షమా సాగరుని పిల్లలుగా మాస్టర్ క్షమించే ఆత్మలకు, విశ్వములోని దుఃఖిత ఆత్మలకు సకాష్ ద్వారా సుఖ-శాంతుల దానమును అందించే ఆత్మలకు, ప్రతి సమయము తమ జమ ఖాతాను నిండుగా ఉంచుకునే అతి తీవ్ర పురుషార్థీ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- (దాదీజీకి 15వ తేదీన గ్లోబల్ హాస్పిటల్లో మైనర్ సర్జరీ (చిన్న ఆపరేషన్) జరగనుంది)
అశరీరిగా అయ్యే అభ్యాసం పక్కాగా ఉంది కదా! అందువలన శరీరానికి సంబంధించిన లెక్కాచారము సహజంగా తీరిపోతుంది. శక్తులు చాలా జమ అయ్యాయి. బాప్‌దాదా మస్తకంలో ప్రకాశిస్తూ ఉన్న పదాలను చూస్తున్నారు - నిశ్చింత చక్రవర్తి. ఫికర్(చింత) బాబాకు ఉంది, మీరు బెఫికర్ బాదుషా (నిశ్చింత చక్రవర్తి ). ఆది నుండి తోడుగా ఉన్నారు కదా! కనుక తోడుగా ఉన్నవారికి ఏది ఉన్నా దానిని బాబా తీసుకుంటారు. అందరి ఆశీర్వాదాలు మీతో ఉన్నాయి. ఆశీర్వాదాల ఖాతా ఎంత ఉంది? చాలా జమ అయ్యాయి కదా! ఎవరెవరికైతే రోజంతా ఆశీర్వాదాలు ఇస్తారో, అవి అనేక రెట్లు అయి లభిస్తాయి. అందువలన ఇచ్చేవారికి ఇవ్వడం కాదు, జమ అవుతుంది. మీ స్టాక్ అంతా జమ అయి ఉంది కదా! మీరు ఉదాహరణగా ఉన్నారు కనుక పరీక్షలో కూడా ఎక్స్ట్రా మార్కులు పొందే అధికారము ఉంది. ఇదే బాబా మరియు కుటుంబం యొక్క స్నేహం. మీ ప్రతి అడుగులో ఆశీర్వాదాలు వ్యాపించి ఉన్నాయి.
అందరూ ఈ ఉదాహరణను చూసి సంతోషిస్తున్నారు కదా! సంతోషిస్తున్నారా లేక దాదీలు మాత్రమే కలుస్తున్నారు, మేమైతే కలవడం లేదు అని ఆలోచిస్తున్నారా? దాదీలను చూసి సంతోషిస్తున్నారా? సంతోషిస్తున్నారు, కానీ స్వయంగా కూడా కలవాలని కోరుకుంటున్నారు. రెండు లడ్డూలు తినాలని కోరుకుంటున్నారు, ఒక లడ్డూ కాదు. చాలా మంచిది. డబల్ ఫారెనర్స్ తమ ఛాన్స్‌ను బాగా తీసుకున్నారు, చాలా తెలివైనవారు. మీ దాదీ (జానకి దాదీ) చాలా తెలివైనవారు.
అయినప్పటికీ మీరు చాలా లక్కీ. తరువాత వచ్చేవారికి ఇంత కూడా లభించదు. ఇప్పుడు డబల్ ఫారెనర్స్ ఏ అద్భుతాన్ని చేస్తారో చూద్దాం. ఈ సంవత్సరంలోనే చేయాలి కదా! లేక 99లో చేస్తారా? (6 నెలల్లో) అందువలన నవంబర్‌లో మొదటి ఛాన్స్ ఫారెనర్స్‌కు ఉంది. అచ్ఛా - అందరూ బాగున్నారు. మంచి సేవ చేస్తున్నారు.
మున్నీ అక్కయ్యతో:- బాగున్నారా లేక కొద్దిగా-కొద్దిగా చింత ఉందా? కొద్దిగా ఉంది. ప్రేమ ఉంది, ఇంకేమీ లేదు. అందరి ప్రేమ ఉంది.
(గాయత్రి అక్కయ్య ప్రియస్మృతులు పంపించారు) తమ సేవను తామే చూసుకోండి. బాప్‌దాదా లేదా దాదీ అయితే వద్దని చెప్పరు. డబల్ ఫారెనర్స్‌కు మంచి నషా ఎక్కింది. పరివర్తనతో కూడిన సేవ పెరుగుతోంది. అలాగే ఉంది కదా! ఇప్పుడు బాల్యం ముగుస్తోంది. ఇప్పుడు గంభీరంగా అయ్యారు. నాలెడ్జ్‌ఫుల్, సెన్సిబుల్(తెలివైనవారు), ఇన్సైట్ఫుల్(అంతర్దృష్టి)గా కూడా అయ్యారు.
ఇప్పుడు సేవను ఇంకా ముందుకు పెంచుతూ ఉండండి. అందరికీ ప్రియస్మృతులు ఇవ్వండి. ఎవరెవరైతే ప్రియస్మృతులు పంపించారో, వారందరికీ పేరు సహితంగా చాలా-చాలా ప్రియస్మృతులు ఇవ్వండి.
(దాదీజీ కోసం) రేపటి రోజు రెస్ట్ తీసుకోండి, కంగారు వద్దు. ఆ తరువాత కూడా చేయవలసి ఉంటుంది. వారు కోరుకోకపోయినా కూడా చేస్తారు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
