‘‘సర్వ ప్రాప్తుల స్మృతిని ఇమర్జ్ చేసుకుని అచల స్థితిని అనుభవము చెయ్యండి మరియు జీవన్ముక్తులుగా అవ్వండి’’
ఈరోజు భాగ్యవిధాత బాబా విశ్వములోని తమ సర్వ శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరి భాగ్యము యొక్క మహిమను స్వయంగా భగవంతుడు గానం చేస్తున్నారు. బాబా మహిమనైతే ఆత్మలు గానం చేస్తారు కానీ పిల్లలైన మీ మహిమను స్వయంగా తండ్రి చేస్తారు. మాకు ఇంతటి శ్రేష్ఠ భాగ్యము తయారై ఉంది అని ఎప్పుడైనా స్వప్నములోనైనా ఆలోచించారా, కానీ అది తయారై ఉంది, తయారయ్యింది. ప్రపంచములోని వారు - మమ్మల్ని భగవంతుడు రచించారు అని అంటారు కానీ వారికి భగవంతుని గురించీ తెలియదు, రచనను గురించీ తెలియదు. భాగ్యవాన్ పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ అనుభవంతో మరియు నషాతో - మేము శివ వంశీ బ్రహ్మాకుమారులము, బ్రహ్మాకుమారీలము, మమ్మల్ని బాప్‌దాదా ఎలా రచించారో మాకు తెలుసు అని అంటారు! చిన్న పిల్లవాడినైనా, వృద్ధ పాండవులనైనా, శక్తులనైనా, ఎవరినైనా సరే - మీ తండ్రి ఎవరు అని అడిగితే ఏం అంటారు? నషాతో అంటారు కదా - మమ్మల్ని శివబాబా బ్రహ్మా బాబా ద్వారా రచించారు, కనుక మేము భగవంతుని పిల్లలము, మేము భగవంతుడిని డైరెక్ట్‌గా కలుసుకుంటాము, ఆ పరమాత్మ లేక భగవంతుడు కేవలం మాకు తండ్రి మాత్రమే కాదు, వారు తండ్రి కూడా, శిక్షకుడు కూడా మరియు సద్గురువు కూడా. అందరికీ ఈ నషా ఉందా? (చప్పట్లు కొట్టారు) ఒక చేతితో చప్పట్లు కొట్టాలి - ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ను వృద్ధులకు నేర్పించాల్సి ఉంటుంది. పిల్లలు సంతోషంగా ఉండటాన్ని చూసి బాప్‌దాదా కూడా సంతోషములో ఊగుతారు మరియు వాహ్, నా ప్రతి ఒక్క శ్రేష్ఠ భాగ్యవాన్ విశేష ఆత్మలూ... అని సదా అంటారు. తండ్రి రూపములో పరమాత్మ పాలనను అనుభవము చేస్తున్నారు. ఈ పరమాత్మ పాలన మొత్తం కల్పంలో కేవలం ఈ బ్రాహ్మణ జన్మలోనే పిల్లలైన మీకే ప్రాప్తిస్తుంది, ఈ పరమాత్మ పాలనలో ఆత్మకు సర్వ ప్రాప్తి స్వరూపము అనుభవమవుతుంది. పరమాత్మ ప్రేమ సర్వ సంబంధాలను అనుభవము చేయిస్తుంది. పరమాత్మ ప్రేమ తమ దేహ భానాన్ని కూడా మరపింపజేస్తుంది, దానితోపాటు అనేక స్వార్థంతో కూడిన ప్రేమలను కూడా మరపింపజేస్తుంది. ఇటువంటి పరమాత్మ ప్రేమ, పరమాత్మ పాలనలో పాలింపబడే భాగ్యవాన్ ఆత్మలు మీరు. ఆత్మలైన మీది ఎంతటి భాగ్యము, స్వయంగా బాబా తమ వతనాన్ని వదిలి ఈశ్వరీయ విద్యార్థులైన మిమ్మల్ని చదివించేందుకు వస్తారు. ప్రతిరోజూ ఉదయాన్నే దూరదేశం నుండి చదివించడానికి వచ్చేటువంటి టీచర్ ఎవరినైనా చూసారా? ఇటువంటి టీచర్‌ను ఎప్పుడైనా చూసారా? కానీ పిల్లలైన మీ కోసం ప్రతి రోజూ బాబా శిక్షకునిగా అయ్యి మీ వద్దకు చదివించడానికి వస్తారు మరియు అది కూడా ఎంత సహజంగా చదివిస్తారు. ఇది రెండు పదాల యొక్క చదువు - మీరు మరియు బాబా, ఈ రెండు పదాలలోనే చక్రము అనండి, డ్రామా అనండి, కల్పవృక్షము అనండి, మొత్తము జ్ఞానమంతా ఇమిడి ఉంది. ఇతర చదువులలోనైతే ఎంతగా మెదడుపై భారము పడుతుంది, కానీ బాబా చదివించే చదువుతో బుద్ధి తేలికైపోతుంది. తేలికదనానికి గుర్తు పైకి ఎగరటము. తేలికైన వస్తువు స్వతహాగనే పైన ఉంటుంది. ఈ చదువుతో మనసు-బుద్ధి ఎగిరే కళను అనుభవం చేస్తాయి. కనుక బుద్ధి తేలిక అయ్యింది కదా! మూడు లోకాల జ్ఞానం లభిస్తుంది. మరి ఇటువంటి చదువును మొత్తం కల్పంలో ఎవ్వరైనా చదివారా! ఈ విధంగా చదివించేవారు ఎవ్వరైనా లభించారా! కనుక ఇది భాగ్యము కదా! అలాగే సద్గురువు ద్వారా ఎటువంటి శ్రీమతము లభిస్తుందంటే, దాని ద్వారా సదాకాలం కొరకు - ఏం చేయను, ఎలా నడవను, ఇలా చెయ్యనా వద్దా, ఏమవుతుంది... ఈ ప్రశ్నలన్నీ సమాప్తమైపోతాయి. ఏం చెయ్యను, ఎలా చెయ్యను, ఇలా చెయ్యనా లేక అలా చెయ్యనా... ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్క మాటలో సమాధానము ఏమిటంటే - ఫాలో ఫాదర్. సాకార కర్మలలో బ్రహ్మా బాబాను ఫాలో చెయ్యండి, నిరాకారీ స్థితిలో అశరీరులుగా అవ్వటంలో శివబాబాను ఫాలో చెయ్యండి. బాబా మరియు దాదా, ఇరువురినీ ఫాలో చెయ్యటము అనగా ప్రశ్నార్థకము సమాప్తమవ్వటము మరియు శ్రీమతముపై నడవటము. ఇది కష్టమా? అడగాల్సిన అవసరము ఉంటుందా? కాపీ చెయ్యాలి, మీ బుద్ధిని నడిపించకూడదు. బాబా సమానంగా అవ్వటము అనగా ఫాలో ఫాదర్ చెయ్యటము. కష్టమా లేక సహజమా? సహజమే కదా? 30 సంవత్సరాల వారు చేతులెత్తండి. అచ్ఛా, 30 సంవత్సరాలలో కష్టమనిపించిందా లేక సహజమనిపించిందా? ఇప్పుడు చూడండి, 30 సంవత్సరాల వారికి కూడా సహజమనిపించినప్పుడు, మీలో ఎవరైతే తర్వాత తర్వాత వచ్చారో, వారికి కష్టమవుతుందా లేక సహజమవుతుందా? సహజమే కదా? (వేడి కారణంగా అందరి చేతులలో రంగురంగుల విసనకర్రలు ఉన్నాయి, వాటిని ఊపుతున్నారు). బాగుంది, విసనకర్రల సందడి కూడా మంచిగా అనిపిస్తుంది. సీన్ బాగుంది. నవీనత ఉండాలి కదా. ఈ గ్రూపుకు ఇది కూడా నవీనత, ఇది కూడా టీ.వి.లో వచ్చింది. మంచిది, అందరూ పరుగుపరుగున చేరుకున్నారు, బాప్‌దాదా కూడా ఈ స్నేహానికి అభినందనలను తెలుపుతున్నారు. చూడండి, ఇతర హద్దులోని గురువులు ఎవరైతే ఉంటారో, వారు ఎన్ని వరదానాలను ఇస్తారు? ఒకటి లేదా పది, అంతకన్నా ఎక్కువ ఇవ్వరు. కానీ మీకు సద్గురువు ద్వారా ప్రతిరోజూ వరదానం లభిస్తుంది. ఇటువంటి గురువును ఎప్పుడైనా చూసారా? చూడలేదు కదా! మీరే చూసారు, కల్పకల్పమూ చూసారు. కనుక సదా మీ భాగ్యము యొక్క ప్రాప్తులను ఎదురుగా పెట్టుకోండి. కేవలం బుద్ధిలో మర్జ్ చేసి పెట్టుకోకండి, ఇమర్జ్ చేయండి. మర్జ్ చేసి పెట్టుకునే సంస్కారాన్ని మార్చుకుని ఇమర్జ్ చెయ్యండి. మీ ప్రాప్తుల లిస్టును సదా బుద్ధిలో ఇమర్జ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే ప్రాప్తుల లిస్టు ఇమర్జ్ అవుతుందో, అప్పుడు ఏ రకమైన విఘ్నమూ దాడి చెయ్యదు. అది మర్జ్ అయిపోతుంది మరియు ప్రాప్తులు ఇమర్జ్ రూపములో ఉంటాయి.
ఈ రోజు ఏదో ఒక కారణం చేత కొంతమంది పిల్లలు శ్రమ పడుతున్నారు, యుద్ధము చేస్తున్నారు, యోగం చెయ్యాలనుకుంటున్నారు కానీ కుదరటం లేదు, ఆత్మాభిమానానికి బదులుగా దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారు అని బాప్‌దాదా విన్నప్పుడు, అది బాప్‌దాదాకు మంచిగా అనిపించదు. ఇక్కడ కారణము ఏమిటి? తమ భాగ్యము యొక్క ప్రాప్తులు ఇమర్జ్ అయి ఉండవు, మర్జ్ అయి ఉంటాయి. మళ్ళీ ఎవరైనా గుర్తు చేసినప్పుడు - అవును, ఇలా జరగాలి కదా... అని ఆలోచించడం మొదలుపెడతారు. అందుకే చాలా సహజమైన పురుషార్థం ఏమిటంటే - ప్రాప్తులను ఇమర్జ్ చేసి పెట్టుకోండి. ఎప్పటి నుండైతే బ్రాహ్మణులుగా అయ్యారో, అప్పటి నుండి మీ భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకోండి. అలజడిలోకి రాకండి, అచలముగా కండి ఎందుకంటే ఇక్కడ ఆబూలో ఏ స్మృతిచిహ్నము ఉంది? అచల్ ఘర్ ఉందా లేక అలజడి ఘర్ ఉందా? అచల్ ఘర్ కదా? ఇది ఎవరి స్మృతిచిహ్నము? మీ స్మృతిచిహ్నమే కదా? కనుక ఎప్పుడైనా ఏదైనా సూక్ష్మ పురుషార్థం యొక్క మార్గము కష్టమనిపిస్తే, బుద్ధి ఎక్కువ అలజడిగా ఉంటే, మీ స్మృతిచిహ్నాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి. చాలాసార్లు పిల్లలు జ్ఞానం యొక్క పాయింట్లు చెప్తూ ఉంటారు కూడా - నేను ఆత్మను, ఇది డ్రామా, ఇది విఘ్నము కదా, ఇది సైడ్ సీన్ కదా, ఇలా మాట్లాడుతూ కూడా ఉంటారు కానీ కదులుతూ కూడా ఉంటారు. కదులుతూ, కదులుతూ మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైతే బుద్ధి ఈ విధంగా తయారవుతుందో, అప్పుడు అచలంగా అవ్వలేరు, అప్పుడు మధుబన్ యొక్క అచల్ ఘర్ను గుర్తు చేసుకోండి. ఇదైతే స్థూలమైనదే కదా, సూక్ష్మమైనదైతే కాదు. ఇది కనుల ద్వారా చూడగలిగేది. నా స్మృతిచిహ్నము అచల్ ఘర్, అలజడి ఘర్ కాదు. ఎందుకంటే బాప్‌దాదా ఈ సంవత్సరాన్ని పిల్లలందరి కొరకు ముక్తి సంవత్సరంగా జరపాలని కోరుకుంటున్నారు. చేతులు ఎత్తిస్తే కొందరు ఎత్తి, కొందరు ఎత్తకుండా అన్నట్లు జరగకూడదు. అందరూ సంతోషంగా చేతులతో చప్పట్లు కొట్టాలి (అందరూ చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు) సరే, ఇప్పుడే కొట్టేసారు సరే, కానీ ఇలాగే బాప్‌దాదా ఈ సంవత్సరం యొక్క సమాప్తిలో ఇంతే జోరుగా చప్పట్లు కొట్టడం చూడాలి. ఇప్పుడైతే చప్పట్లు కొట్టారు, మంచిది కానీ అప్పుడు కూడా కొట్టాలి. కొడతారా? చూడండి, చేతులతో చప్పట్లు కొట్టి అయితే సంతోషపరిచారు కానీ బాప్‌దాదా కొత్త సంవత్సరములో, జనవరి 18న, విశేషంగా మన బ్రహ్మా బాబా శరీరం నుండి ముక్తి అయిన రోజు ఉంది కదా, ఆ జనవరి 18న బాప్‌దాదా - ముక్తి సంవత్సరాన్ని జరుపుకున్నారా లేక కేవలం ఆలోచించారా అని మళ్ళీ చేతులు ఎత్తిస్తారు. జరుపుకోవాలి, జరుపుకోవాలి అని కేవలం ఆలోచిస్తూనే ఉండిపోలేదు కదా. స్వరూపంలోకి తీసుకొచ్చారా లేక ఆలోచిస్తూ-ఆలోచిస్తూ అంతిమంలో కూడా ఆలోచిస్తూనే ఉండిపోతారా! ఈ రిజల్టును బాప్‌దాదా చూడాలనుకుంటున్నారు. చూపిస్తారా? అచ్ఛా. గుర్తుంటుంది కదా! ప్రాప్తులను ఎదురుగా పెట్టుకోండి. బాబా స్మృతితోపాటు, బాబా ఏదైతే ఇచ్చారో, అది కూడా ఇమర్జ్ చేయండి - ఎలా తయారుచేసారు మరియు ఏం లభించింది!
బాప్‌దాదా ఈ సంవత్సరము తర్వాత పిల్లలు ప్రతి ఒక్కరినీ జీవన్ముక్తి స్థితిలో చూస్తారు. భవిష్యత్తులో జీవన్ముక్తులుగా ఉంటారు కానీ జీవన్ముక్తులుగా అయ్యే సంస్కారాన్ని ఇప్పటి నుండే ఇమర్జ్ చేసుకోవాలి. నిరంతర కర్మయోగి, నిరంతర సహజ యోగి, నిరంతర ముక్త ఆత్మ యొక్క సంస్కారాలను ఇప్పటి నుండి అనుభవంలోకి తీసుకురండి. ఎందుకు? బాప్‌దాదా ఇంతకుముందు కూడా సూచనను ఇచ్చారు - సమయ పరివర్తన విశ్వ పరివర్తక ఆత్మలైన మీ కొరకు ఎదురుచూస్తూ ఉంది. ప్రకృతి, ప్రకృతిపతి ఆత్మలైన మిమ్మల్ని విజయమాలతో ఆహ్వానిస్తూ ఉంది. సమయము విజయ గంట మ్రోగించేందుకు భవిష్య రాజ్యాధికారి ఆత్మలైన మిమ్మల్ని చూస్తుంది, ఎప్పుడు గంటను మ్రోగించాలి అని చూస్తుంది. భక్త ఆత్మలు, ఎప్పుడు మా పూజ్య దేవాత్మలు మాపై ప్రసన్నులై మాకు ముక్తి యొక్క వరదానాన్ని ఇస్తారు అని ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నారు! దుఃఖహర్త-సుఖకర్త ఆత్మలు ఎప్పుడు ప్రత్యక్షం అవుతారు అని దుఃఖిత ఆత్మలు పిలుస్తున్నారు! వీరందరూ మీ కొరకు ఎదురుచూస్తున్నారు మరియు ఆహ్వానిస్తున్నారు, అందుకే - ఓ దయార్ద్ర హృదయులైన విశ్వ కళ్యాణకారీ ఆత్మల్లారా, ఇప్పుడు వీరి ఎదురుచూపులను సమాప్తం చెయ్యండి. అందరూ మీ కొరకు ఆగి ఉన్నారు. మీరందరూ ముక్తులైపోతే సర్వ ఆత్మలు, ప్రకృతి, భక్తులు ముక్తులైపోతారు. కనుక ముక్తులుగా అవ్వండి, ముక్తి దానాన్ని ఇచ్చే మాస్టర్ దాతలుగా అవ్వండి. ఇప్పుడు విశ్వ పరివర్తనా బాధ్యత యొక్క కిరీటధారీ ఆత్మలుగా అవ్వండి. బాధ్యత కలవారు కదా! బాబాతోపాటు సహాయకారులు. మీకు దయ కలగటం లేదా, మనసులో దుఃఖపు విలాపము అనుభవం అవ్వటం లేదా. ఓ విశ్వ పరివర్తక ఆత్మల్లారా, ఇప్పుడు మీ బాధ్యత యొక్క పట్టాభిషేకాన్ని జరపండి. ఇప్పటివరకు చాలా ఫంక్షన్స్ చేశారు. కానీ ఫంక్షన్స్ ఫలితం ఏమిటి? కేవలం గోల్డెన్ చున్నీ, కిరీటము ధరించారు, ఉత్సవం జరుపుకున్నారు... దీనికి బాప్‌దాదా కూడా సంతోషంగా ఉన్నారు. కానీ చున్నీ ధరించడం, మాల ధరించడం, తిలకము పెట్టుకోవడం, పాండవులు కూడా కిరీటము వలె పాగాను ధరించడం - ఇవన్నీ జరుపుకోవడం అంటే బాధ్యతను సంభాళించడము. పిల్లలు సంతోషించారు, బాబా అంతకంటే ఎక్కువగా సంతోషించారు. కానీ భవిష్యత్తు ఏమిటి? దుపట్టా అల్మారాలో, చింది(తిలకము) అల్మారాలో భద్రపరచబడింది, అంతేనా జరుపుకోవడం? కాదు. ఈ దుపట్టా గోల్డెన్ స్థితికి గుర్తుగా ఉన్న జ్ఞాపక చిహ్నం. దానిని కేవలం అల్మారాలో పెట్టకండి, మనస్సులో స్మృతిగా ఉంచుకోండి. జరుపుకోవడం అంటే బాబా కార్యంలో బాధ్యతగలవారిగా అవ్వడం. నచ్చిందా? లేక చున్నీ ధరించాం, చాలా బాగుంది అనుకున్నారా? బాగానే జరిగింది. బాప్‌దాదా కూడా చాలా బాగా జరిగిందని భావిస్తున్నారు. కానీ అవినాశీ సహయోగిగా అవ్వండి.
ఈ సంవత్సరం కోసం బాప్‌దాదా ఇచ్చిన సూచన ప్రకారం, చివరగా జనవరి 18న ముక్తి సంవత్సర ఉత్సవాన్ని జరుపుకుంటాము. చప్పట్లు కొట్టేవారు తాము అలా అవుతామని భావిస్తున్నారా? తరువాత, ‘‘బాబా, అవ్వాలని అయితే అనుకున్నాము, కానీ ఏమి చేయాలి, ఇది జరిగింది, అది జరిగింది’’ అని చెప్పకండి. అలాంటి మాటల నుండి కూడా ముక్తి పొందండి. తప్పకుండా అవ్వాలి. ఏమి చేయాలి, కాదు. ఈ భాష నుండి కూడా ముక్తి పొందండి. తప్పకుండా జరగాలి, తప్పకుండా అవ్వాలి, ఏది జరిగినా సరే. బాప్‌దాదా ఇంతకుముందు కూడా చెప్పారు - 100 హిమాలయ పర్వతాల అంతటి అత్యంత పెద్ద విఘ్నము వచ్చినా కానీ పక్కకు జరగరు, ఓడిపోరు, పట్టాభిషేకాన్ని, ముక్తి సంవత్సరాన్ని తప్పకుండా జరుపుకుంటారు. బాప్‌దాదా ప్రతిరోజూ చార్ట్ చూస్తారు. ఇక్కడి నుండి వెళ్ళి, ట్రైన్లోనే ఏమైందో తెలియదు అని అనటం కాదు, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే కొంగలు మరియు హంసకు మధ్యన యుద్ధం జరగడం కాదు. ఇది జరిగింది, అది జరిగింది... అని చెప్పకండి. ఇది వినను. మీ ఉత్తరాలను చెత్తబుట్టలో వేస్తాను, వినను. దృఢ సంకల్పము చెయ్యండి - అవ్వాల్సిందే. ఎక్కడైతే దృఢత ఉంటుందో, అక్కడ సఫలత లభించకపోవటం అనేది అసంభవము. మరి అందరూ దృఢ సంకల్పం కలవారే కదా. టీచర్స్ చేతులెత్తండి. టీచర్స్ చాలామంది ఉన్నారు. మొత్తం సెంటర్లన్నీ ఖాళీ చేసి వచ్చారా ఏమిటి?
చూడండి, ఒక సంతోషకరమైన వార్తను వినిపిస్తాము - బాప్‌దాదా చూసారు, ఇప్పుడే చూసారు, విన్నారు - మధుబన్ వారందరూ తమ పరివర్తనా లక్ష్యాన్ని చాలా బాగా పెట్టుకున్నారు. లక్షణాలను చూద్దాము కానీ లక్ష్యమైతే చాలా బాగా పెట్టుకున్నారు, తమలో ఏ మార్పు అయితే వచ్చిందో, దానిని కూడా వ్రాసారు. బాప్‌దాదాకు ఏమి సంతోషం ఉందంటే - మార్పు రావటం ప్రారంభమైంది, మున్ముందు ఇంకా వస్తూ ఉంటుంది. అందరూ తమ దృఢ సంకల్పము యొక్క ఉల్లాస-ఉత్సాహాలను మంచిగా చూపించారు. ఇప్పుడింకా కాగితంపై ఉంది కానీ కాగితంపై వ్రాయడానికి ముందు మొదటి అడుగు వేసారు. బాప్‌దాదాకు సంతోషంగా అనిపించింది, ఎందుకు? మొత్తం ప్రపంచానికి మధుబన్ నివాసులు - హే అర్జున్ వంటివారు. నిమిత్తులు మధుబన్ నివాసులు, రెండవ నంబరువారు దేశ-విదేశాలలోని నిమిత్త సేవాధారీ టీచర్లు. మొత్తం పరివారంలోని బ్రాహ్మణ ఆత్మలు సర్వ సహయోగి సహచరులు. మధుబన్ పటాన్ని బాప్‌దాదా చూస్తారు, అది పూర్తిగా మారినట్లుగా కనిపించాలి. మధుబన్ వారు తక్కువ వచ్చి ఉంటారు. చాలామంది అయితే వ్రాయనే వ్రాయలేదు. ముందు కూర్చున్నవారిలో తక్కువమంది వ్రాసారు, చాలా బిజీగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పని ఇవ్వడం జరుగుతుందో, అప్పుడు వ్రాసినందుకు కూడా మార్కులు జమ అవుతాయి. ఒకవేళ వ్రాయకపోతే అదనంగా వచ్చే మార్కులు తక్కువైపోయాయి, నష్టపర్చుకున్నారు. ఏయే డైరెక్షన్లు అయితే లభిస్తాయో, అవి డైరెక్ట్‌గా బాబా ద్వారా లభించినా, నిమిత్త ఆత్మలైన దాదీల ద్వారా లభించినా, వాటికి గౌరవాన్ని ఇవ్వటము చాలా అవసరము. ఇందులో సాకులు చెప్పకండి, నిర్లక్ష్యము చెయ్యకండి. మార్కులు జమ అవ్వలేదు అని ఇకముందు కోసం బాప్‌దాదా చెప్తున్నారు, అందుకే దీనికి మహత్వాన్ని ఇవ్వటము అనగా మహాన్‌గా అవ్వటము. విషయాన్ని తేలికగా తీసుకోకండి. పిల్లలు చాలా తెలివైనవారు, బాప్దాదాకైతే తెలుసు కదా అని అంటారు. బాప్‌దాదాకు తెలుసు, కానీ ఎందుకు చెప్పారు? తెలిసే చెప్పారు కదా! అందుకే ఇలా చెప్పి తప్పించుకోకూడదు. చాలా పనులు ఎలా ఉంటాయంటే, అవి చిన్నచిన్నవే కానీ వాటికి ‘హాజీ’ చెయ్యటంలో ఎక్స్ట్రా మార్కులు జమ అవుతాయి. చాలామంది విద్యార్థులు ఎలా ఉన్నారంటే, వారు ఏదో ఒక గత సంస్కారానికి వశమై ఉన్నారు, చాలా మంచి ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్తారు కానీ ఏదో ఒక బంగారు దారము, చాలా సూక్ష్మమైన దారము వారిని ముందుకు వెళ్ళనివ్వదు. ఈ సూక్ష్మమైన దారం ఉండిపోయింది అని వారికి అర్థమవుతుంది కూడా కానీ... కానీ అనే అంటాము. కానీ కొందరు ఎలాంటి పురుషార్థులు ఉన్నారంటే, వారు చిన్న-చిన్న సాధారణ విషయాలలో ‘హాజీ’ చెప్పి మార్కులు తీసేసుకుంటారు. ఇలా కొన్ని-కొన్ని చొప్పున మార్కులు జమ అవుతూ-అవుతూ వారు ముందుకు వెళ్ళిపోవడము అనేది కూడా జరగవచ్చు, ఇటువంటివారు కూడా బాప్‌దాదా వద్ద ఉదాహరణ రూపంలో ఉన్నారు. కనుక సహజమైన పద్ధతి ఏమిటంటే - చిన్నచిన్న విషయాలలో ‘హాజీ’ అంటూ మార్కులను జమ చేసుకుంటూ వెళ్ళండి. కట్ చేసుకోకండి, జమ చేసుకోండి. ఇకపోతే బాప్‌దాదా చూసారు, మెజారిటీ తమ ఉల్లాస-ఉత్సాహాలను మంచిగా చూపించారు. అందుకే దృఢ సంకల్పం చేసినందుకు, విశేషంగా ఆ మధుబన్ నివాసి పిల్లలకు బాప్‌దాదా - ‘హాజీ’ అన్నందుకు అభినందనలను తెలుపుతున్నారు, ప్రియస్మృతులను కూడా ఇస్తున్నారు. లక్షలాది రెట్ల ప్రియస్మృతులను ఇస్తున్నారు. ఎందుకు? మధుబన్ అనేది బాప్‌దాదా స్వరూపాన్ని ప్రత్యక్షం చేసే అద్దాల మహలు. కావున ఒక విషయానికైతే సంతోషంగా ఉంది. ఇప్పుడు కాగితంపైకి వచ్చినదానిని కర్మలలోకి తీసుకురావాల్సిందే. సరేనా! అచ్ఛా! అభినందనలు.
30 సంవత్సరాల వారు అయితే చాలా ఆనందంలో ఉన్నారు కదా! (1000 మంది వచ్చారు.) చూడండి, లేచి నిలబడండి అని బాప్‌దాదా అంటే, మాతలు వీరికి బదులుగా ముందుకు వచ్చేస్తారు. అందుకే లేపడం లేదు. సెరిమనీ చేసుకున్నవారు చేతులు ఎత్తండి. ఈ గ్రూపు పట్ల బాప్‌దాదాకు హృదయపూర్వకంగా ఎంతో గౌరవం ఉంది. ఎందుకు? వీరే ఆ పాండవులు, వీరే ఆ మాతలు. సేవా స్థాపనలో, సేవాకేంద్రాల స్థాపనలో, బేగరీ జీవితం ఉన్న సమయంలోనే సేవాకేంద్రాలను ప్రారంభించారు. అలాంటి కష్టకాలంలో ఈ సైన్యం తమ తనువు-మనస్సు-ధనంతో నిమిత్తమై సేవాస్థానాలను స్థాపించింది. అలాంటి సమయంలో సహయోగిగా అయ్యేవారి ఎనిమిది ఆణాలు ఎనిమిది కోట్లుగా మారిపోతాయి. బాప్‌దాదాకు గుర్తుంది - తమకే తినడానికి లేకపోయినా, ఒక గిన్నెలో పిండి, ఒక గిన్నెలో చక్కెర, ఒక గిన్నెలో నెయ్యి ఇలా చిన్న చిన్న గిన్నెలలో తీసుకొచ్చేవారు. ఆలోచించండి, వీరు ఎంత సత్యహృదయులు! తమ ఇంటి ఖర్చుతోనే బాప్‌దాదా సేవాకేంద్రాలను నడిపించారు. తమ వ్యక్తిగత పొదుపు ఖాతా నుండి, తమ ఖర్చులో పొదుపు చేసి సేవాకేంద్రాలను స్థాపించారు. మరి వీరి భాగ్యం ఎంత గొప్పది! అలాంటి సమయంలో సహయోగి ఆత్మలకు బాప్‌దాదా కూడా నమస్తే చెబుతున్నారు. వీరి అనుభవాలు చాలా గొప్పవి. భాగవతమంతా వీరిదే. అందుకే బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. అలాగే అందరూ ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో ప్రయత్నించి ఇక్కడికి చేరుకున్నారు. దానికీ బాప్‌దాదా సంతోషంగా ఉన్నారు. కర్రలు పట్టుకొని అయినా వచ్చారు. మీకు రెండు కాళ్లు ఉన్నాయి, వీరికి మూడు కాళ్లు ఉన్నాయి. నడుస్తుంటే దృశ్యం చాలా బాగుంటుంది కదా! ఒకసారి వీరు ఎలా నడుస్తారో చూడండి. రేపు వీరి కోసం క్లాస్ నుండి భండారా వరకు ఒక చిన్న యాత్ర నిర్వహించండి. ఎంత బాగా నడుస్తారో చూడండి. చాలా మంచి దృశ్యంగా ఉంటుంది. కానీ ఎవరూ పడిపోవద్దు. పడిపోతామనిపిస్తే కూర్చోండి, కానీ పడిపోవద్దు. బాప్‌దాదా అయితే వీరితో నృత్యం చేయించాలని కోరుకుంటున్నారు. కానీ అలా చేస్తే మీరు అందరూ డిస్టర్బ్ అవుతారు. అందుకే కూర్చున్నచోటే ఆనందంతో నృత్యం చేయండి, చేతులు కాళ్లతో కాదు. బాగుంది కదా! మీకూ బాగా నచ్చింది కదా! పెద్దల ఆశీర్వాదాలు చాలా శ్రేష్ఠమైనవి. పాండవులు కూడా చాలా మంచివారు. పాండవులు కూడా తక్కువ సహయోగం చేయలేదు. పరుగులు తీస్తూ అన్ని పనులు చేసినవారు పాండవులే. అందుకే పాండవులకు కూడా బాప్‌దాదా మరియు మొత్తం పరివారం తరఫున హృదయపూర్వకంగా ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. అచ్ఛా.
(బాల బ్రహ్మచారి దంపతులు కూడా కూర్చున్నారు) బాల బ్రహ్మచారులుగా ఉన్నవారు తమ స్థానంలోనే లేచి నిలబడండి. అచ్ఛా, అందరూ కలిసి కూర్చున్నారు. చేతులు ఊపండి. ఇప్పటివరకు మీరు విజయ వ్రతాన్ని నిలబెట్టుకున్నారు. దానికి బహుమానం తప్పకుండా లభిస్తుంది, లభించింది కూడా. ఇక ముందు కూడా స్వప్నంలో అయినా, సంకల్పంలో అయినా పవిత్రతకు భంగం కలగకూడదు. అఖండ పవిత్రత - ఇదే బాల బ్రహ్మచారుల లక్ష్యం, లక్షణం. ఇప్పటివరకు చేసిన దానికి అభినందనలు. కానీ ఇక ముందు కూడా బాప్‌దాదా ఇదే చెబుతారు - సదా ‘అమర్ భవ’ వరదానీగా ఉండాలి. అమరులే కదా! ఖండితం కాలేదు కదా! చూడండి, ఖండితమైన విగ్రహాన్ని ఎప్పుడూ పూజించరు. అలాగే ఏ వ్రతమైనా భంగమైతే, అటువంటి వారు అమర్ భవ వరదానీ ఆత్మలుగా కాలేరు. ద్వాపర యుగం నుండి కలియుగాంతం వరకు పూజింపబడే ఇష్టదేవతలుగా కూడా కాలేరు. అందుకే సదా అమర్ భవ. మంచి ధైర్యం ఉంచారు. ధైర్యానికి సహాయం ఎల్లప్పుడూ లభిస్తుంది. మీకు దానికి అధికారం ఉంది. కానీ అఖండ బాల బ్రహ్మచారులుగా ఉండండి. ఐదు సంవత్సరాలు, పది సంవత్సరాలు కాదు - అఖండంగా. బ్రాహ్మణ జీవితం ఉన్నంతకాలం ఈ అమర్ భవ వరదానాన్ని నిలబెట్టుకోవాలి. సరేనా? అంగీకరించారా? ధైర్యం ఉందా? ఒక చేతితో చప్పట్లు కొట్టండి.
(10 సంవత్సరాలు పూర్తిచేసుకున్న 200 మంది డబల్ విదేశీ సోదరసోదరీల సెరిమనీ కూడా ఉంది) వీరు నిజంగా ఎంతో అదృష్టవంతులు. డబల్ విదేశీయులు కూడా మంచి నంబర్ సాధించారు. డబల్ విదేశీయులు వెనుకబడలేదు; ప్రతి విషయంలో మంచి నంబర్ తీసుకుంటున్నారు అనేది చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇది ఏమి సూచిస్తోంది అంటే, ఇప్పటివరకు కొద్ది కాలంలోనే ఎంత వేగంగా పురుషార్థం చేశారో, అలాగే చివర్లో కూడా తీవ్రమైన పురుషార్థంతో అత్యుత్తమ నంబర్ సాధిస్తారు. అలాంటి నిశ్చయం ఉందా? ఉంది కదా! 108 మాలలోకి రావాలనుకుంటున్నారు కదా! అచ్ఛా, 108 మాల డబల్ విదేశీయులదే అవుతుందా? మరి భారతవాసులది? మీదీ ఉంటుంది కదా! బాప్‌దాదా అందరికీ స్వేచ్ఛ ఇచ్చారు. 108లోకి రావాలనుకునేవారు భారతవాసులైనా, డబల్ విదేశీయులైనా అందరికీ అవకాశం ఉంది. అవసరమైతే బాప్‌దాదా మాలను పెంచేస్తారు. కానీ మిమ్మల్ని మాత్రం తప్పకుండా అందులో చేర్చుతారు; బయట ఉంచరు. అర్థమైందా? అనువాదం జరుగుతోంది. అచ్ఛా. అనువాదం చేస్తున్నవారికీ కూడా అభినందనలు.
బాప్‌దాదా వీరికి కూడా (ముందు కూర్చున్న మధుబన్ నివాసులకు) అభినందనలు తెలుపుతున్నారు. సేవలో ముందుండి పనిచేస్తున్నవారు, కేబిన్లలో కూర్చొని సేవ చేస్తున్నవారు గొప్ప తపస్సు చేస్తున్నారు. ఒక విషయంలో మాత్రం మీరు మంచి మార్కులు పొందుతారు - హృదయపూర్వకంగా సేవ చేస్తున్నందుకు. ఈ ఖాతాలో మీకు అదనపు మార్కులు లభిస్తాయి. హృదయంతో సేవ చేయండి. విసుగుతో కాదు. “అయ్యో! ఏమి చేయాలి? చాలా ఇబ్బంది పెడుతున్నారు” అని కాదు. ఎంత ఇబ్బంది పెట్టినా మీరు హర్షితంగా ఉండాలి. ప్రేమతో “రండి అక్కయ్యలు, రండి సోదరసోదరీలు, ఏమి కావాలి?” అని అడగండి. సరేనా? లేక “లేదు, ఇప్పుడుకాదు” అని అనకండి. వస్తువు ఇవ్వకపోయినా ఫర్వాలేదు; ఇవ్వలేకపోతే తప్పు లేదు. కానీ మధురమైన మాటలు మాత్రం చెప్పగలరు కదా! ఆ మధురమైన మాటలే సగం వస్తువు పొందిన అనుభూతిని కలిగిస్తాయి. “ఇప్పుడుకాదు, వెళ్లండి, వెళ్లండి” అని కాదు. “హా జీ, చేస్తాము, చూస్తాము, ఇస్తాము” అని చెప్పండి. హృదయాన్ని గెలుచుకోండి. వస్తువు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. సంతృప్తిపరచాలనే లక్ష్యం ఉంటే వస్తువులు కూడా స్వయంగా వస్తాయి. బాప్‌దాదా చూశారు - స్టోర్ బాధ్యత వహించే వారి హృదయంలో “ఇది తప్పకుండా చేయాలి” అనే సంకల్పం ఉంటే, ఎక్కడినుంచో అవసరమైన వస్తువులు వచ్చేస్తాయి; స్టాక్ నిండిపోతుంది. కావలసింది ఒక్క హృదయపూర్వక సంకల్పమే. మధుబన్ నివాసులు ఎంతో తెలివైనవారు. వస్తువులు సమకూర్చడంలో కూడా తెలివైనవారే. తెలివైనవారు కాబట్టే ఈ బాధ్యత లభించింది. డ్రామా మిమ్మల్ని నిమిత్తులుగా చేసింది అంటే, తప్పకుండా మీలో ఏదో ఒక విశేషత ఉంది. అదే విశేషత మిమ్మల్ని మధుబన్‌లో నిమిత్తులుగా చేసింది. ఆ విశేషతను సమయానుసారం శాంతభావంతో, ప్రేమభావంతో ఉపయోగించండి. మిగతా విషయాల్లో మీరు అలసటలేని సేవాధారులు. మధుబన్లా అలసటలేకుండా సేవ చేసే వారు ఇంకెక్కడా లేరు. “అథక్ భవ” అనే వరదానం మధుబన్కే ఉంది. ఇక ఈ సంవత్సరం మధుబన్ ఏమి చేస్తుంది?
ఇప్పుడు ఈ ముక్తి సంవత్సరంలో నంబర్‌వన్ మధుబన్ నివాసులే కావాలి. సరేనా? సాధ్యమా? లేక కష్టమా? (హా జీ) అప్పుడు బాప్‌దాదా మధుబన్ నివాసులకు కూడా గోల్డెన్ బ్యాడ్జ్ ఇస్తారు. అందరికీ ఇచ్చారు, కానీ మధుబన్ నివాసులకు ముక్తి సంవత్సరపు ప్రత్యేక బహుమానం ఇస్తారు. మంచి బ్యాడ్జ్ ఇస్తారు. అచ్ఛా.
(రాజస్థాన్ సేవను సంభాళించింది) రాజస్థాన్ వారు ఇంత పెద్ద జనసమూహాన్ని బాగా సంభాళించారు కదా! చూడండి, బాప్‌దాదా ఇలా చెప్పకూడదు కానీ ఒక సూచన ఇస్తున్నారు. అందరూ వచ్చారు, చాలా చాలా అభినందనలు. తప్పకుండా రావాలి. కానీ ఒక విషయం బాప్‌దాదా చెబుతారు. వినడానికి సిద్ధంగా ఉన్నారా? ముఖ్యంగా టీచర్లు సిద్ధంగా ఉన్నారా? అచ్ఛా. వచ్చారు, పదమారెట్లు స్వాగతం. కానీ ముందుగా సమాచారం ఇవ్వడం టీచర్ల కర్తవ్యం. అకస్మాత్తుగా వచ్చేసారు. బాప్‌దాదాకు అయితే ఆనందమే. బాప్‌దాదా వతనంలో ఉంటారు. కానీ మీరు సాకారంలో ఉంటారు కదా! అందుకే మీలో చాలామంది ఎండలో టెంట్లలో నిద్రపోవాల్సి వచ్చింది. పిల్లలు సంతోషంగానే ఉన్నారు; ఎవరూ బాధపడలేదు. అయినప్పటికీ టీచర్ల కర్తవ్యం ముందుగానే సంఖ్యను తెలియజేయడం. అలా చేసి ఉంటే కలిగిన ఇబ్బంది కొంతైనా ఉండేది కాదు. జరిగినది చాలా మంచిదే. శాంతివన్ హాల్ నిండిపోయింది. అది మంచిదే. కానీ ముందుగా సమాచారం ఇచ్చి ఉంటే మీ అందరికీ ఎంతో మంచి ఏర్పాట్లు చేయగలిగేవారు. ఇకపై మీరు వచ్చినప్పుడు తప్పకుండా రండి. మీకు స్వాగతమే. కానీ సౌకర్యంగా రండి. అర్థమైందా టీచర్లకు? ఇక ముందు ఇలా చేయకండి. ఫ్యాన్లు బాగానే అందాయా? వెనుక కూర్చున్నవారు ఫ్యాన్లు ఊపండి. (15 వేల ఫ్యాన్లు అందరి చేతుల్లో ఉన్నాయి.) బయట కూర్చున్న వారందరికీ బాప్‌దాదా ముందుగానే నంబర్‌వన్ ప్రియస్మృతులు తెలియజేస్తున్నారు. అలాగే ప్రత్యేకంగా భద్రతా సేవలో ఉండేందుకు త్యాగం చేసిన మధుబన్ నివాసులకు లక్షల రెట్లు అభినందనలు. అందరినీ బాగా సంభాళిస్తున్నారు కదా! అలాగే ఈ రోజు దేశ-విదేశాల్లో దూరంగా కూర్చొని సమీపానుభూతి పొందుతున్న వారందరికీ కూడా బాప్‌దాదా ప్రత్యేకంగా, ప్రత్యేకంగా, ప్రత్యేకంగా ప్రియస్మృతులు తెలియజేస్తున్నారు. మంచి సాధనం. అచ్ఛా.
రాజస్థాన్, కాన్పూర్ కిద్వయీ నగర్, ఇండోర్ నుండి సహాయం చేసినవారందరూ లేచి నిలబడండి. అచ్ఛా. చూడండి, మీకు డబల్ పుణ్యం లభించింది. వర్తమాన సేవ ద్వారా ఆశీర్వాదాలు లభించాయి; భవిష్య సేవకు సంబంధించిన ప్రారబ్ధం కూడా జమ అయింది. కాబట్టి రాజస్థాన్ వారు గానీ, సహాయకులుగా నిలిచిన వారందరూ గానీ, ఎల్లప్పుడూ సేవా సింహాసనంపై ఉండి ఆశీర్వాదాలు పొందుతూ, ఆశీర్వాదాలు ఇస్తూ, ఇలా అమరులుగా ఉండండి. ఎంతో మంచి పాత్ర పోషించారు. అందుకుగాను అందరూ సంతోషంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
డబల్ విదేశీయుల సీజన్ బాగా జరిగింది కదా! ఈ సీజన్లో డబల్ విదేశీయులందరూ ప్రత్యేకంగా జమ ఖాతాను పెంచుకొని వెళ్తున్నారు కదా! అలాగేనా? జమ చేసుకున్నారా? చాలా మంచిది. అచ్ఛా.
ఒకవేళ ఇప్పుడు మీ అందరికీ - ఇప్పుడిప్పుడే అశరీరులుగా అవ్వండి అని అకస్మాత్తుగా డైరెక్షన్ లభిస్తే, అలా అవ్వగలరా లేక అలజడి కలుగుతుందా? ఎందుకు? చివరి సమయంలోని ఈ అభ్యాసమే పాస్ విత్ ఆనర్‌గా చేస్తుంది. కనుక ఇప్పుడు బాప్‌దాదా కూడా చెప్తున్నారు - ఒక్క క్షణంలో అన్ని విషయాలను పక్కన పెట్టి అశరీరి భవ (డ్రిల్) అచ్ఛా.
నలువైపులా ఉన్న అతి శ్రేష్ఠ భాగ్యవంతులు, పరమాత్మ పాలనకు అధికారి ఆత్మలు, పరమాత్మ చదువుకు అధికారులు, సద్గురువైన పరమాత్మ వరదానాలకు అధికారులు, సదా దృఢత ద్వారా సఫలతకు అధికారులు, సదా అఖండ యోగులు, అచల యోగులు, సదా విశ్వ పరివర్తన యొక్క బాధ్యతా కిరీటధారులు, సదా సర్వ ప్రాప్తులను ఇమర్జ్ రూపంలో అనుభవము చేసే అటువంటి విశేష ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
(ఈరోజు బాప్‌దాదాను దాదీజీ మొత్తం డైమండ్ హాల్లో తిప్పించారు. బాప్‌దాదా అందరు సోదరసోదరీలకు దృష్టినిచ్చారు. సభలో హాల్ లోపల, బయట కలిపి సుమారు 20–21 వేల మంది సోదరసోదరీలు హాజరయ్యారు)
దాదీలతో:- సీజన్ సమాప్తి నిర్విఘ్నంగా జరిగిందా? బాప్‌దాదా ప్రస్తుత సమయంలో ఇదే చూడాలనుకుంటున్నారు - విశేషంగా నిమిత్త ఆత్మలు ఎవరైతే ఉన్నారో, ఎలా అయితే, నోటి ధ్వని సైన్స్ సాధనాల ద్వారా దూరంగా కూర్చున్నవారికి చేరుతున్నట్లే, మనసు యొక్క ధ్వని అయిన సంకల్పం కూడా అలా చేరాలి. ప్రారంభంలో ఎలా సాక్షాత్కారాలు జరిగాయో, సూచనలు లభించాయో, ఆ సూచనల ద్వారా ఎంతోమందిలో జాగృతి వచ్చిందో, అలాగే ఆరంభంలో జరిగినది అంతిమంలోనూ జరగాలి. అప్పట్లో స్థాపన కాలం కాబట్టి ఒక్క బ్రహ్మా బాబా ద్వారా సాక్షాత్కారాలు జరిగాయి. కానీ ఇప్పుడు ప్రాక్టికల్‌లో శక్తుల పాత్ర ఉంది. బ్రహ్మా బాబా, శివబాబా గుప్తంగా బ్యాక్‌బోన్‌లా ఉన్నారు, కానీ స్టేజ్‌పై శక్తుల పాత్ర ఉంది. అలాంటి అనన్య శక్తులు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఒక్క బ్రహ్మా బాబా చేసిన కార్యాన్ని, ఇప్పుడు అలాంటి మనోబల శక్తి ప్రత్యక్షం చేయాలి. ఎలా అయితే నోటి ధ్వని స్పష్టంగా చేరుతుందో, అలాగే మనసు యొక్క ధ్వని కూడా క్రమంగా అందరికీ చేరాలి- బాబా వచ్చారు అనే సందేశం చేరాలి. ఈ ఒక్క ధ్వని చేరినా, వారు వెతకడం ప్రారంభిస్తారు. తరువాత వారే స్వయంగా చేరుకుంటారు. కానీ ఇప్పుడు ఈ మనోబల సేవ జరగాలి. ఈ ప్రపంచమంతటా ధ్వని వ్యాపించడానికి కొంత సైన్స్, కొంత సైలెన్స్ శక్తి, ఈ రెండూ కలిసి పనిచేస్తాయి. మనసు యొక్క ధ్వని ఎవరికి చేరుతుందో వారు మరింత సమీపంగా వస్తారు. నోటి ధ్వని ఎవరికి చేరుతుందో వారిలో నంబరువారీగా వస్తారు. అందువల్ల ఇప్పుడు ఈ సైలెన్స్ విశేషత ఏమిటి? సైలెన్స్ శక్తితో ఏమేమి చేయగలము? అనే విషయంపై ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి. ఎందుకంటే సమయం తక్కువగా ఉంది. సేవ ఏమిటంటే ప్రపంచంలోని ప్రతి ఆత్మకు సందేశం చేరవేయడం. అందుకే, ఒక విషయాన్ని వినిపిస్తాము అని బాప్‌దాదా చెప్పి ఉన్నారు. ఎందుకంటే వాతావరణంలో ఈ తరంగాలను వ్యాపింపజేసే నిమిత్తులు మీరే కదా! అవునా? కాబట్టి అలాంటి తరంగాలను వ్యాప్తి చేయండి. అందరూ సహయోగులుగా అవ్వండి. ఇప్పుడు మనసు యొక్క ధ్వని, నోటి ధ్వనికన్నా కూడా ఎక్కువ కార్యం చేయగలదు. కాబట్టి ఈ కార్యంపై ఆసక్తి ఉన్న గ్రూపులను తయారు చేయండి. వారు దీనికి నిరంతరం రిహార్సల్ చేస్తూ ఉండాలి. ఎలా ప్రారంభంలో యోగాభ్యాసం చేసారో, సేవ కోసం కొత్త కొత్త ప్లాన్లు రూపొందించారో, వాటి ద్వారా ఎంతటి వృద్ధి జరిగిందో చూశారు కదా! అలాగే మొదట సృష్టి నోటి ద్వారా ప్రత్యక్షంగా జరిగింది. తరువాత బ్రహ్మా ద్వారా మనసా సంకల్పం ద్వారా జరిగింది. ఇప్పుడు శక్తుల ద్వారా జరగాలి. శక్తులు బాణాలు ప్రయోగించారని చెబుతారు కదా! అలాగే ఈ సంకల్ప బాణాలు స్పష్టమైన ధ్వనిని అందించాలి - ఎవరో పిలుస్తున్నారు, ఎవరో ఏదో చెబుతున్నారు అనే అనుభూతి కలగాలి. కొందరికి ఒక స్వప్నం పదేపదే వస్తూ ఉంటుంది; ఆ పని పూర్తయ్యే వరకు ఆ స్వప్నం వారిని మళ్లీ మళ్లీ జాగృతం చేస్తూ ఉంటుంది. అలాగే కొంతమంది సిద్ధులు కూడా కొన్ని విధానాల ద్వారా అలాంటి అనుభూతి కలిగిస్తారు. కానీ యోగ విధానంతో ఈ ధ్వని వ్యాపించాలి. అలాంటి సేవా ప్రణాళికలను రూపొందించండి. ఎలా ఇప్పుడీ ఉత్సవాల సంవత్సరాన్ని జరుపుకున్నారో, అది పూర్తయింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఒక తరంగాన్ని వ్యాప్తి చేయండి, అది విహంగమార్గ సేవగా ఉండాలి. నోటి ద్వారా విహంగమార్గ సేవలు చాలానే చేశారు. వాటి ఫలితం కూడా ఉంది. ఇప్పుడు మళ్లీ ఏదైనా నవీనత తీసుకురండి. అర్థమైందా? ఇందులో ఎవరు నంబర్ తీసుకుంటారో చూద్దాం. అచ్ఛా. అందరూ బాగున్నారా? అందరూ కలిసి సేవ చేస్తే సేవ అనే పర్వతాన్ని కూడా సులభంగా దాటవచ్చు. అచ్ఛా. ఓం శాంతి.
ఇప్పుడు ముక్తి సంవత్సరములో నంబర్‌వన్ మధుబన్ నివాసులు, సరేనా? అవుతుందా లేక కష్టమా? (హాజీ) అలాగైతే బాప్‌దాదా మధుబన్ వారికి కూడా బంగారు బ్యాడ్జ్‌ను ఇస్తారు. మధుబన్ వారికి బ్యాడ్జ్ ఇవ్వాలి, ఇతరులు అందరికీ ఇచ్చారు, మధుబన్ వారికి ముక్తి సంవత్సరము యొక్క ప్రైజ్‌ను ఇస్తాము. మీకు మంచి బ్యాడ్జ్ ఇస్తాము. అచ్ఛా!
*** ఓంశాంతి ***
