‘‘పాస్ విత్ ఆనర్‌గా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క అకౌంట్‌ను చెక్ చేసుకుని జమ చేసుకోండి’’
ఈరోజు బాప్‌దాదా దేశ-విదేశాలలో నలువైపులా ఉన్న చిన్న-పెద్ద పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తున్నారు. ఇటువంటి భాగ్యము మొత్తము కల్పములో బ్రాహ్మణ ఆత్మలకు తప్ప మరెవ్వరికీ ఉండదు. దేవతలు కూడా బ్రాహ్మణ జీవితాన్ని శ్రేష్ఠంగా భావిస్తారు. జన్మిస్తూనే మా భాగ్యము ఎంత శ్రేష్ఠముగా ఉంది అని ప్రతి ఒక్కరూ తమ జీవితమును ఆది నుండి చూసుకోండి. జీవితంలో జన్మిస్తూనే తల్లిదండ్రుల పాలన యొక్క భాగ్యము లభిస్తుంది. ఆ తర్వాత చదువు యొక్క భాగ్యము లభిస్తుంది. ఆ తర్వాత గురువు ద్వారా మతము మరియు వరదానము లభిస్తుంది. పిల్లలైన మీకు పాలనను, చదువును మరియు శ్రీమతాన్ని, వరదానాలను ఇచ్చేవారు ఎవరు? పరమ ఆత్మ ద్వారా ఈ మూడూ ప్రాప్తిస్తాయి. పాలనను చూడండి - పరమాత్మ పాలన ఎంత కొద్దిమందికి, కోట్లలో కొద్దిమందికి లభిస్తుంది. శిక్షకుడైన పరమాత్ముని చదువు మీకు తప్ప ఇంకెవ్వరికీ లభించదు. సద్గురువు ద్వారా శ్రీమతము, వరదానాలు మీకే ప్రాప్తిస్తాయి. మరి మీ భాగ్యము గురించి మంచి రీతిలో తెలుసా? భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకుని ఊయలలో ఊగినట్లు ఊగుతూ ఉంటారా, వాహ్ నా భాగ్యము అన్న పాటను పాడుతూ ఉంటారా?
అమృతవేళ ఎప్పుడైతే మేల్కొంటారో, అప్పుడు పరమాత్మ ప్రేమలో లవలీనులై మేల్కొంటారు. పరమాత్మ ప్రేమ మేల్కొలుపుతుంది. దినచర్య యొక్క ఆది పరమాత్ముని ప్రేమతో జరుగుతుంది. ప్రేమ లేకపోతే లేవలేరు. ప్రేమయే మీకు సమయము యొక్క అలారము. ప్రేమ అనే అలారము మిమ్మల్ని మేల్కొలుపుతుంది. మొత్తము రోజంతటిలో పరమాత్ముని తోడు ప్రతి కార్యాన్ని చేయిస్తుంది. స్వయంగా తండ్రి తమ పరంధామాన్ని వదిలి మీకు శిక్షణను ఇవ్వడానికి వస్తారు, ఇది ఎంతటి గొప్ప భాగ్యము. భగవంతుడు రోజూ తమ ధామాన్ని వదిలి చదివించటానికి వస్తారు అని ఎప్పుడైనా విన్నారా! ఆత్మలు ఎంత దూరదూరాల నుండి వచ్చినా కానీ, పరంధామము కన్నా దూరమైన దేశము మరేదీ లేదు. ఉందా ఏదైనా దేశము? అమెరికా, ఆఫ్రికా దూరమా? పరంధామము ఉన్నతోన్నతమైన ధామము. ఉన్నతోన్నతమైన ధామము నుండి ఉన్నతోన్నతుడైన భగవంతుడు, ఉన్నతోన్నతులైన పిల్లలను చదివించేందుకు వస్తారు. మీ భాగ్యాన్ని ఈ విధంగా అనుభవము చేస్తున్నారా? సద్గురువు రూపంలో ప్రతి కార్యానికి సంబంధించి శ్రీమతాన్ని కూడా ఇస్తారు మరియు తోడును కూడా అందిస్తారు. కేవలము మతాన్ని మాత్రమే ఇవ్వరు, తోడును కూడా అందిస్తారు. మీరు ఏ పాటను పాడుతారు? నాతో పాటు ఉన్నారు అనా లేక దూరంగా ఉన్నారు అనా? మీతో పాటే ఉన్నాము కదా? ఒకవేళ విన్నా పరమాత్మ టీచరు నుండే వింటారు, ఒకవేళ తిన్నా కూడా బాప్‌దాదాతో కలిసి తింటారు. ఒంటరిగా తిన్నారంటే అది మీ తప్పు. బాబా అయితే నాతో కలిసి తినండి అని అంటారు. పిల్లలైన మీ ప్రతిజ్ఞ కూడా ఏమిటంటే - కలిసి ఉంటాము, కలిసి తింటాము, కలిసి త్రాగుతాము, కలిసి నిద్రపోతాము మరియు కలిసి నడుస్తాము... నిద్రించటము కూడా ఒంటరిగా నిద్రించకూడదు. ఒంటరిగా నిద్రిస్తే చెడు కలలు లేక చెడు ఆలోచనలు కలలో కూడా వస్తాయి. కానీ బాబాకు ఎంత ప్రేమ ఉందంటే వారు సదా అంటారు - నాతో పాటు నిద్రించండి, ఒంటరిగా నిద్రించకండి. కావున లేచినా కూడా కలిసే లేవండి, నిద్రించినా కూడా కలిసే, తిన్నా కూడా కలిసే, నడుస్తున్నా కూడా కలిసే. ఒకవేళ ఆఫీసుకు వెళ్ళినా, వ్యాపారం చేసినా, మీరు వ్యాపారానికి ట్రస్టీలు, దానికి యజమాని బాబా. ఆఫీసుకు వెళ్ళినా కానీ మీకు తెలుసు - మా డైరెక్టర్, బాస్ బాప్‌దాదా, అక్కడున్నవారు నిమిత్తమాత్రులు, బాబా డైరెక్షన్ అనుసారంగా మేము పని చేస్తాము. ఎప్పుడైనా ఉదాసీనులుగా అయితే బాబా స్నేహితునిగా అయ్యి ఆహ్లాదపరుస్తారు. స్నేహితునిగా కూడా అవుతారు. ఎప్పుడైనా ప్రేమలో ఏడ్చారనుకోండి, అశ్రువులు వచ్చాయనుకోండి, బాబా వాటిని తుడిచేందుకు కూడా వస్తారు మరియు మీ అశ్రువులను హృదయమనే డిబ్బీలో ముత్యాల వలె ఇముడ్చుకుంటారు. ఒకవేళ అప్పుడప్పుడు అల్లరితనంతో అలిగితే, ఆ అలగటం కూడా చాలా మధురాతి మధురంగా అలుగుతారు, అప్పుడు అలిగినవారిని బుజ్జగించటానికి కూడా బాబా వస్తారు. పిల్లలూ, ఏం ఫర్వాలేదు, ముందుకు నడవండి. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి, గతం గతః అనుకోండి - అని ఈ విధంగా బుజ్జగిస్తారు కూడా. కనుక మీ దినచర్య అంతా ఎవరితో పాటు ఉంది? బాప్‌దాదాతో పాటు ఉంది. బాప్‌దాదాకు అప్పుడప్పుడు పిల్లల విషయాలకు నవ్వు వస్తుంది. బాబా, మిమ్మల్ని మర్చిపోతున్నాము అని అంటారు, ఒకవైపేమో కంబైండ్‌గా ఉన్నాము అని అంటారు, కంబైండ్‌గా ఉన్నవారిని ఎప్పుడైనా మర్చిపోతారా? మాతో ఉన్నారు అన్నప్పుడు తోడుగా ఉన్నవారిని మర్చిపోతారా? అప్పుడు బాబా అంటారు - శభాష్, పిల్లలలో ఎంత శక్తి ఉందంటే కంబైండ్‌గా ఉన్నవారిని కూడా వేరు చేసేస్తారు! ఉన్నదేమో కంబైండ్‌గా (కలిసి), కానీ కొంచెం మాయ కంబైండ్‌గా ఉన్నవారిని కూడా వేరు చేసేస్తుంది.
బాప్‌దాదా పిల్లల ఆటను చూస్తూ ఇదే అంటారు - పిల్లలూ, మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి. కానీ జరిగేది ఏమిటి? అవును, నా భాగ్యము చాలా ఉన్నతమైనది అని ఆలోచిస్తారు కానీ ఆలోచనా స్వరూపులుగా అవుతారే కానీ స్మృతి స్వరూపులుగా అవ్వరు. నేనైతే అది, నేనైతే ఇది, నేనైతే అది... అని ఆలోచించటమైతే చాలా బాగా ఆలోచిస్తారు, చెప్పటం కూడా చాలా బాగా చెప్తారు. కానీ ఏదైతే ఆలోచిస్తారో, ఏదైతే చెప్తారో ఆ స్వరూపముగా అవ్వండి. స్వరూపముగా అవ్వటములో తేడా వచ్చేస్తుంది. ప్రతి విషయము యొక్క స్వరూపముగా అవ్వండి. ఏదైతే ఆలోచిస్తారో, ఆ స్వరూపాన్ని కూడా అనుభవము చెయ్యండి. అన్నింటికన్నా గొప్ప విషయం అనుభవీమూర్తిగా అవ్వటము. అనాది కాలంలో పరంధామములో ఉన్నప్పుడు మీరు ఆలోచనా స్వరూపులుగా లేరు, స్మృతి స్వరూపులుగా ఉన్నారు. నేను ఆత్మను, నేను ఆత్మను అని ఇలా కూడా ఆలోచించాల్సిన అవసరము లేదు, స్వరూపమే అలా ఉంటుంది. ఆది కాలములో కూడా ఈ సమయములోని పురుషార్థము యొక్క ప్రారబ్ధ స్వరూపులుగా ఉంటారు. నేను దేవతను, నేను దేవతను... అని ఆలోచించాల్సిన అవసరము ఉండదు, స్వరూపము ఉంటుంది. కనుక అనాది కాలములో, ఆది కాలములో స్వరూపముగా ఉన్నారు కావున ఇప్పుడు కూడా అంతిమములో స్వరూపముగా అవ్వండి. స్వరూపముగా అవ్వటముతో మీ గుణాలు, శక్తులు స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. ఏదైనా ఉద్యోగం చేసేవారు తమ సీట్‌పై సెట్ అయినప్పుడు ఆ ఉద్యోగానికి సంబంధించిన గుణాలు, కర్తవ్యాలు ఆటోమేటిక్‌గా ఇమర్జ్ అవుతాయి. అదే విధంగా మీరు సదా స్వరూపము అనే సీట్‌పై సెట్ అయ్యి ఉన్నట్లయితే ప్రతి గుణము, ప్రతి శక్తి, అన్ని రకాల నషా స్వతహాగానే ఇమర్జ్ అవుతాయి. శ్రమించాల్సిన అవసరము ఉండదు. దీనినే బ్రాహ్మణత్వపు న్యాచురల్ నేచర్ (సహజ స్వభావము) అని అంటారు, ఇందులో మిగిలిన అనేక జన్మల స్వభావాలు సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జీవితము యొక్క సహజ స్వభావమే గుణ స్వరూపము, సర్వ శక్తి స్వరూపము, ఇతర పాత స్వభావాలు ఏవైతే ఉన్నాయో, అవి బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావాలు కాదు. నా స్వభావమే అటువంటిది అని అంటారు, కానీ నా స్వభావము అని అంటుంది ఎవరు? బ్రాహ్మణులా లేక క్షత్రియులా? లేక గత జన్మలోని స్మృతి స్వరూప ఆత్మ అంటుందా? బ్రాహ్మణుల స్వభావము ఏమిటంటే – బ్రహ్మా బాబా స్వభావమే బ్రాహ్మణుల స్వభావము. కావున ఆలోచించండి, ఎప్పుడైతే నా నేచర్, నా స్వభావము ఇటువంటిది అని అంటారో, బ్రాహ్మణ జీవితంలో - నా నేచర్, నా స్వభావము... అన్న ఇటువంటి పదాలు ఉండగలవా? ఒకవేళ ఇప్పటివరకూ వాటిని తొలగిస్తూనే ఉంటే, గతము యొక్క స్వభావము ఇమర్జ్ అవుతూనే ఉంటే, ఆ సమయములో నేను బ్రాహ్మణుడిని కాను, క్షత్రియుడిని, తొలగించుకునేందుకు యుద్ధం చేస్తున్నాను అని భావించాలి. మరి ఒక్కోసారి బ్రాహ్మణులుగా, ఒక్కోసారి క్షత్రియులుగా అవుతారా? ఏమని పిలిపించుకుంటారు? క్షత్రియ కుమార్ అనా లేక బ్రహ్మాకుమార్ అనా? మీరెవరు? క్షత్రియ కుమారులా? మీరు బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలు. రెండవ పేరు లేనే లేదు. ఓ క్షత్రియ కుమారుడా, రా అని ఎవరినైనా ఈ విధంగా పిలుస్తారా? నేను బ్రహ్మాకుమార్ను కాను, క్షత్రియ కుమార్‌ను అని అంటారా లేక స్వయాన్ని అనుకుంటారా? కావున బ్రాహ్మణులు అనగా బ్రహ్మాబాబా స్వభావము ఏదైతే ఉందో, అదే బ్రాహ్మణుల స్వభావము. ఏం చేయాలి, ఇది నా స్వభావము! అన్న మాటను ఇకపై ఎప్పుడూ అనకండి, పొరపాటున కూడా అనకండి, ఆలోచించకండి. ఇవి సాకులు. ఇలా అనటము కూడా తమను తాము విడిపించుకునేందుకు చెప్పే సాకులు. కొత్త జన్మను తీసుకున్నారు, కొత్త జన్మలో పాత నేచర్, పాత స్వభావము ఎక్కడి నుండి ఇమర్జ్ అవుతుంది? అంటే పూర్తిగా మరణించలేదు, కొంచెం బ్రతికి, కొంచెం చనిపోయి ఉన్నారా ఏమిటి? బ్రాహ్మణ జీవితము అనగా బ్రహ్మాబాబా యొక్క ప్రతి అడుగు ఏదైతే ఉందో, అదే బ్రాహ్మణుల అడుగు అయి ఉండాలి.
బాప్‌దాదా భాగ్యాన్ని కూడా చూస్తున్నారు, ఇది ఎంతటి శ్రేష్ఠమైన భాగ్యము, ఈ భాగ్యము ఉన్నప్పుడు ఈ మాటలు మంచిగా అనిపించవు. ఈ సారి ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా - ఏం క్లాస్ చేయిస్తారు? ఇది ముక్తి సంవత్సరము. మరి ఇది ముక్తి సంవత్సరమా లేక 99లో రావాలా? 98వ సంవత్సరము ముక్తి సంవత్సరమేనా? ఈ సంవత్సరమే ముక్తి సంవత్సరము అని ఎవరైతే భావిస్తున్నారో, వారు చేతులు ఊపండి. చూడండి, చేతులు ఊపటము చాలా సహజము. అసలు ఏం జరుగుతుందంటే, వాయుమండలములో కూర్చున్నారు కదా, సంతోషంలో ఊగుతున్నారు, కనుక చేతులు ఊపుతారు, కానీ మనసుతో చేతులు ఊపండి, ప్రతిజ్ఞ చెయ్యండి - ఏం జరిగినా కానీ ముక్తి సంవత్సరం యొక్క ప్రతిజ్ఞను వదలము. ఇటువంటి పక్కా ప్రతిజ్ఞ ఉందా? చూడండి, జాగ్రత్తగా చేతులెత్తండి. ఈ టి.వి. లో వచ్చినా, రాకపోయినా బాప్‌దాదా వద్దనైతే మీ ఫోటో తీయడం జరుగుతుంది. కనుక ఇటువంటి బలహీన మాటల నుండి కూడా ముక్తులుగా అవ్వండి. మాటలు ఎంతో మధురంగా ఉండాలి, బాబా సమానంగా ఉండాలి, సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావనతో కూడిన మాటలు ఉండాలి, వీటినే యుక్తియుక్తమైన మాటలు అని అంటారు. నడుస్తూ-తిరుగుతూ కూడా సాధారణ మాటలు ఉండకూడదు. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే, ఇవి మాటలా లేక ముత్యాలా అన్నట్లు అనుభవము చెయ్యాలి. శుభ భావన కల మాటలు వజ్రాలు, ముత్యాలతో సమానమైనవి ఎందుకంటే బాప్‌దాదా ఎన్నో సార్లు ఈ సూచనను ఇచ్చారు - సమయం అనుసారంగా సర్వ ఖజానాలను జమ చేసుకోవడానికి ఇప్పుడు కొద్ది సమయమే ఉంది. ఒకవేళ ఈ సమయంలో - సమయము యొక్క ఖజానాను, సంకల్పాల ఖజానాను, మాటల ఖజానాను, జ్ఞాన ధనము యొక్క ఖజానాను, యోగ శక్తుల ఖజానాను, దివ్య జీవితములోని సర్వ గుణాల ఖజానాను జమ చేసుకోకపోతే మళ్ళీ ఈ విధంగా జమ చేసుకునే సమయము లభించటము సహజమవ్వదు (సులువు అవ్వదు). మొత్తము రోజంతటిలో మీ ఈ ఒక్కొక్క ఖజానా యొక్క అకౌంట్‌ను చెక్ చేసుకోండి. ఏ విధంగా, ఇంత జమ అయ్యింది... అని స్థూల ధనం యొక్క అకౌంట్‌ను చెక్ చేసుకుంటారు కదా, అదే విధంగా ప్రతి ఖజానా యొక్క అకౌంట్‌ను జమ చేసుకోండి. చెక్ చేసుకోండి. అన్ని ఖజానాలూ కావాలి. ఒకవేళ పాస్ విత్ ఆనర్‌గా అవ్వాలనుకుంటే ప్రతి ఖజానా యొక్క జమ ఖాతా ఎంత నిండుగా ఉండాలంటే, ఆ జమ అయిన ఖాతాతో 21 జన్మలు ప్రారబ్ధాన్ని అనుభవించగలగాలి. ఇప్పుడు సమయము యొక్క టూ లేట్ (చాలా ఆలస్యమైంది) గంట ఇంకా మ్రోగలేదు, కానీ మ్రోగనున్నది. ఏ రోజు మరియు ఏ తారీఖు అనేది చెప్పము. అకస్మాత్తుగా టూ లేట్ అన్నది అవుట్ అవుతుంది. అప్పుడేమి చేస్తారు? ఆ సమయములో జమ చేసుకుంటారా? ఎంత చేసుకుందామనుకున్నా సమయము లభించదు, అందుకే బాప్‌దాదా ఎన్నో సార్లు సూచనను ఇస్తున్నారు - జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు కూడా - సర్వశక్తిమంతులు అన్న టైటిలే ఉంది, శక్తిమంతులు అని కాదు, సర్వశక్తిమంతులు. భవిష్యత్తులో కూడా సర్వగుణ సంపన్నులు, అంతేకానీ కేవలం గుణ సంపన్నులు కారు. ఈ ఖజానాలన్నింటినీ జమ చేసుకోవటము అనగా గుణాలు మరియు శక్తులు జమ అవుతున్నాయని అర్థము. ఒక్కొక్క ఖజానాకు గుణాలు మరియు శక్తులతో సంబంధము ఉంది. సాధారణంగా లేవు మాటలు అంటే అర్థము మధురంగా మాట్లాడే గుణము ఉందని. ఇలా ప్రతి ఒక్క ఖజానాకు కనెక్షన్ ఉంది.
బాప్‌దాదాకు పిల్లలపై ప్రేమ ఉంది, అందుకే మళ్ళీ పదే-పదే సూచనను ఇస్తున్నారు ఎందుకంటే ఈరోజు సభలో అన్ని వెరైటీల వారు ఉన్నారు. చిన్న పిల్లలూ ఉన్నారు, టీచర్లు కూడా ఉన్నారు ఎందుకంటే టీచర్లే సమర్పణ అయ్యారు కదా. కుమారీలూ ఉన్నారు, ప్రవృత్తిలోని వారూ ఉన్నారు. అన్ని వెరైటీల వారు ఉన్నారు. మంచిది. అందరికీ అవకాశాన్ని ఇచ్చారు, ఇది చాలా బాగుంది. మాకు కలుసుకునే అవకాశము ఎప్పుడు లభిస్తుంది అని చాలా సమయము నుండి పిల్లలు దరఖాస్తు పెట్టుకుని ఉన్నారు. పెట్టుకున్నారు కదా పిల్లలూ? కనుక మంచిది - అన్ని వెరైటీలతో కూడిన పుష్పగుచ్ఛము బాబా ఎదురుగా ఉంది. మరి పిల్లలు చేతులెత్తండి.
పిల్లలతో:- పిల్లలపై పెద్దలకు ప్రేమ ఉండనే ఉంటుంది. అందుకే బాబాకు కూడా పిల్లలంటే ప్రేమ ఉంది. ఈరోజు బ్రాహ్మణులైన పిల్లలు, రేపు ఏమవుతారు? చెప్పండి పిల్లలూ, రేపు ఏమవుతారు? (దేవతలు అవుతారు) అచ్ఛా, ఏ దేవతలు అవుతారో తెలుసా? పిల్లల్లో ఎవ్వరూ దేవీలు కారా, అందరూ దేవతలే అవుతారా? చాలా బాగుంది. పిల్లల వల్లే కళ వస్తుంది. అందుకే మిమ్మల్ని చూసి వీరందరూ సంతోషిస్తున్నారు, వాహ్ పిల్లలూ, వాహ్! కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. పిల్లలు, బ్రాహ్మణ ఆత్మలు పిల్లలు కదా, అయితే పెద్దల భాగ్యం ఏదైతే ఉందో, అదే పిల్లల భాగ్యం కూడా. అందుకే బాబాతో తోడును ఎప్పుడూ మర్చిపోవద్దు. మాయ ఎంత ఆకర్షించినా, బాబాను మాత్రం మర్చిపోవద్దు. అచ్ఛా. అందరూ పిల్లలు ప్రతిరోజూ క్లాస్‌కు వెళ్తారా, లేక ఆదివారాలే వెళ్తారా? (ప్రతిరోజూ క్లాస్‌కు వెళ్లేవారు చేతులు ఎత్తారు.) వీరు ప్రతిరోజూ వెళ్లేవారా! చాలామంది ఉన్నారు. అచ్ఛా. టి.వి. చూస్తారా? అందరూ నవ్వుతున్నారు. చూడండి, మంచి విషయాలు చూస్తే మంచిదే. కానీ చెడు విషయాలు కూడా చూస్తే మంచిది కాదు. ఈరోజు చెడు విషయాలు చూడకూడదనే సంకల్పం చేయండి - మేము ఎప్పుడైనా టి.వి. చూస్తున్నప్పుడు ఏదైనా చెడు విషయం వస్తే, వెంటనే ఆపేస్తాము. చేయగలరా? టి.వి.లో చెడు విషయాలు చూడనివారు చేతులు ఎత్తండి. చాలా తక్కువ మంది ఉన్నారు. పిల్లల టీచర్ ఎవరు? అయితే టీచర్లందరూ పిల్లల చార్ట్ చూడండి. పిల్లలందరూ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? నిజమైన హృదయంతో చేతులు ఎత్తండి. అచ్ఛా. చూడండి, దాదీలు మీకు అవకాశం ఇచ్చారు. అయితే దాదీలకు కృతజ్ఞతలు చెప్పారా? చెప్పారా లేదా? సరే, చెప్పి ఉంటే చాలా మంచిది. కానీ రేపు దాదీలకు ప్రేమతో కృతజ్ఞతలు చెప్పండి. దాదీలు అవకాశం ఇచ్చారు కదా, అందుకే ఈ ప్రతిజ్ఞ చేయండి - మేము కూడా ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటాము. కొట్లాడము, ఆవేశపడము, కోపం చేయము. చాలామంది చిన్న పిల్లలు ప్రతిజ్ఞలో పెద్దల కంటే కూడా ముందుకు వెళ్తారు అని బాప్‌దాదాకు తెలుసు. అందుకే మీరందరూ ముందుకు వెళ్లి చూపించండి. చాలా బాగుంది. పిల్లల సభ కూడా చాలా బాగుంది. అచ్ఛా.
రెండవ గ్రూప్ - కుమారీలది:- కుమారీలు చాలా మంది ఉన్నారు. (సుమారు 2000 మంది కుమారీలు వచ్చారు.) చాలా బాగుంది. కుమారీలు ధైర్యము ఉంచారు. కుమారీల గురించి బాప్‌దాదా ఎప్పుడూ ‘‘భాగ్యశాలి కుమారీ జీవితం’’ అని అంటారు. చూడండి, కుమారులు అంటారు, కుమారీ టీచర్ అయి సెంటర్‌కు వెళ్తే, వెళ్లగానే అందరూ దీదీ-దీదీ అని పిలుస్తారు. కానీ కుమారుడు ఎంత పాతవాడైనా, దాదా-దాదా అని ఎవరూ పిలవరు. కుమారీలకు ట్రైనింగ్ ఇచ్చి బయటకు పంపిస్తారు. కుమారులు సెంటర్‌ను సంభాస్తమని ఆఫర్ చేస్తే దాదీలు ఆలోచిస్తారు. అందుకే కుమారీల భాగ్యం చాలా సులభంగా తయారై ఉంది. ఒక కుమారి ట్రైనింగ్ చేసి, యోగ్యురాలైతే, కట్నంగా సెంటర్ లభిస్తుంది. అయితే కుమారీ జీవితం ఎంత శ్రేష్ఠమైనది, ఎన్ని గోల్డెన్ అవకాశాలు ఉన్నాయో ఆలోచించండి. ఇప్పటి నుంచే సేవాధారులుగా కాకపోతే, భవిష్యత్తులో ఏమవుతారు? సేవాధారులు ఎవరికి లభిస్తారు? ఎవరైతే సేవ చేస్తారో వారికి లభిస్తారు. అందుకే కుమారీలు తమ నిర్ణయాన్ని వీలైనంత త్వరగా తీసుకోవాలి. కానీ బాప్‌దాదా కుమారీలతో ఒక విషయం ఎప్పుడూ అంటారు. నిజమైన సేవాధారి కుమారి అంటే శక్తి స్వరూపమైన కుమారి. నిమిత్త సేవాధారి శక్తిశాలిగా లేకపోతే, ఇతరులను శక్తిశాలులుగా చేయలేరు. కుమారీ శక్తిశాలిగా లేక, బలహీనంగా ఉంటే... ఒకటి బలహీనంగా ఉండటం. మరొకటి ఎవరి ప్రభావంలోకైనా వచ్చేయడం. జ్ఞానం యొక్క ప్రభావం చూపేవారు కాదు, కానీ ఇతరుల ప్రభావానికి లోనయ్యేవారు. కుమారీల విషయంలో దాదీలకు ఎప్పుడూ ఇదే ఒక భయం ఉంటుంది. బాబా వైపు ప్రభావితం చేయించడానికి నిమిత్తమవుతారు కానీ తానే ప్రభావితమైపోతే, ఫలితం ఏమవుతుంది? కుమారీలు, సరే, వెళ్తాము, బయలుదేరుతాము అని అంటారు కానీ బాప్‌దాదా అంటారు, ఇప్పుడు సమయానుసారంగా, ఎవరైతే ఏ సేవాకేంద్రానికి వెళ్తారో, ఆ సేవాకేంద్రాన్ని నిర్విఘ్నంగా ఉంచగలరో అటువంటి కుమారీలు కావాలి. నిర్విఘ్నము యొక్క సర్టిఫికెట్ తమకు తామే ఇచ్చుకోవాలి. తోటి వారివద్ద నుండి కూడా తీసుకోవాలి. అలాంటివారా? లేక చిన్న చిన్న విషయాలకు, వ్యక్తులకు ప్రభావితమయ్యేవారా? ఎలాంటివారు? ఏమని అనుకుంటున్నారు? బాప్‌దాదాకు ఇటువంటి కుమారీలు కావాలి - నిర్విఘ్న కుమారీలు, విఘ్న-వినాశక కుమారీలు, బలహీనులను శక్తిశాలులుగా చేసేవారు. బాప్‌దాదా లేదా దాదీలు హ్యాండ్స్‌గా పంపిస్తే, హ్యాండ్స్‌కు బదులుగా హెడేక్ (తలనొప్పి)గా మారేవారు వద్దు. అలాంటి కుమారీలు వద్దు. అయితే ఏమని అనుకుంటున్నారు? అలాంటి కుమారీలు సిద్ధంగా ఉన్నారా? మేము విఘ్న-వినాశకులుగా ఉంటాము అన్న ధైర్యము ఉందా? అలా అయ్యేవారు చేతులు ఎత్తండి. హృదయంతో ఎత్తుతున్నారా? సంగఠనలో ఉన్నారని సిగ్గుపడి ఎత్తడం కాదుగా? ఎవరైతే సెంటర్లకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారో, అలాగే విఘ్న-వినాశకులుగా అవుతారో, వారే లేవండి. మిగతావారు కూర్చోండి. 18 సంవత్సరాల వయస్సు దాటినవారు, విఘ్న-వినాశకులుగా అయి సెంటర్‌కు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నవారు నిలబడండి. వీరంతా విఘ్న-వినాశక నిమిత్త సేవాధారులేనా? (హా జీ) ఫోటో తీయండి. ఇప్పుడు ఈ క్యాసెట్‌ను దాదీలకు ఇవ్వండి. తర్వాత ఎవరు ఎవరు ఉన్నారో నోట్ చేసుకోండి. అభినందనలు, అభినందనలు. కుమారీలకు బాప్‌దాదా కూడా అభినందనలు ఇస్తున్నారు. కానీ కుడి భుజంగా అవ్వాలి, ఎడమ భుజంగా కాదు. అచ్ఛా.
మూడవ గ్రూప్ - గీతా పాఠశాల వారిది:- వారు చేతులు ఎత్తండి. నిలబడి చేతులు ఊపండి. (సుమారు 4000 మంది సోదరసోదరీలు ఉన్నారు) చాలా మంది ఉన్నారు. అచ్ఛా. గీతా పాఠశాలకు నిమిత్తమైన పిల్లలను కూడా బాప్‌దాదా నిమిత్త సేవాధారులు అని అంటారు. తమ ప్రవృత్తిని కూడా సంభాళించడము చేస్తున్నారు. అలౌకిక సేవకు కూడా నిమిత్తమయ్యారు. అందుకే డబల్ పని చేస్తున్నారు. కానీ గీతా పాఠశాలకు నిమిత్తమైన ఆత్మల విశేషత ఏమిటంటే, ప్రతి కార్యంలో తమను తాము ట్రస్టీలుగా భావించి నడవడం. ఎందుకంటే బాప్‌దాదా ఏమి చబసారంటే, గీతా పాఠశాలను ప్రారంభించే వారు భిన్న భిన్న సంకల్పాలతో ప్రారంభిస్తారు. కొంతమంది నిజమైన హృదయంతో సేవ కోసం గీతా పాఠశాలను ప్రారంభిస్తారు లేదా నడుపుతారు. కానీ కొంతమందిలో వృద్ధి జరిగిన తర్వాత, అక్కడక్కడా భావనలు కూడా కలిసిపోతాయి. అందుకే బాప్‌దాదా చూస్తున్నారు, కొంతమంది గీతా పాఠశాలను తమ కుటుంబ పోషణ కోసం కూడా ప్రారంభిస్తారు. కుటుంబ పోషణ కూడా జరగాలి, నిమిత్త సేవ కూడా జరగాలి అని. అందుకే గీతా పాఠశాల అంటే ట్రస్టీగా అయి సేవ చేయడం. ఎందుకంటే వచ్చే ఆత్మలందరూ బాబాపై ప్రేమతో వస్తారు. అందుకే ట్రస్టీగా అయి కార్యాన్ని నడపడం చాలా అవసరం. పూర్తిగా నిస్వార్థ భావనతో నడిపేవారిదే నిజమైన గీతా పాఠశాల అని అంటాము. మిగతా విషయాల్లో బాప్‌దాదా మెజారిటీ శుభభావనతో సేవ చేస్తున్న నిమిత్త ఆత్మలపై చాలా సంతోషంగా ఉన్నారు. తమ సమయాన్ని సఫలం చేసుకుంటున్నారు. డబల్ కార్యాన్ని అదే శుద్ధ భావనతో సంభాళించడము చేస్తున్నారు. ఇంకే భావన కలిసిపోలేదు. పేరు కోసం కాదు. లౌకిక కుటుంబ పోషణ కోసం కాదు. అందుకే అలాంటి శుద్ధ సేవాభావం ఉన్న ట్రస్టీ ఆత్మలకు బాప్‌దాదా చాలా చాలా చాలా అభినందనలు ఇస్తున్నారు. మంచివారే. మంచిగా ఉన్నారు, ఇంకా మంచిగా ఉంటారు. కానీ ఒకటి చెక్ చేసుకోవాలి. ఇంకే భావన కలవకూడదు. సేవాభావం తప్ప మరే భావనను రానివ్వకూడదు. మిగతా విషయాల్లో మీరు సేవ చేస్తున్నారు అంటే అనేక ఆత్మల కళ్యాణం చేస్తున్నారు. ఒక విషయం గమనించబడింది. గీతా పాఠశాల వారి విశేషత ఏమిటంటే, ప్రవృత్తిలో ఉన్నవారిని చూసి, ప్రవృత్తిలో ఉన్నవారికి కూడా ధైర్యము వస్తుంది. సెంటర్‌కు వెళ్లాలంటే, మనం కూడా అన్నీ వదలాల్సి వస్తుందేమో అని ఆలోచిస్తారు. కానీ ప్రవృత్తిలో ఉంటూ సేవకు నిమిత్తమైన పిల్లలను చూసి, ఇతర ప్రవృత్తి వారికి కూడా ధైర్యము, ఉల్లాస-ఉత్సాహాలు వస్తాయి. అందుకే బాప్‌దాదా గీతా పాఠశాల వారికి కూడా ఎంతో సేవ చేసినందుకు అభినందనలు, ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఒక చేతితో చప్పట్లు కొట్టండి. అచ్ఛా.
నాల్గవ గ్రూప్ - సమర్పణ అయిన టీచర్లది:- చాలా బాగుంది. ధైర్యము ఉంచి సేవకు నిమిత్తమవ్వడానికి ప్రత్యక్షంగా స్టేజ్‌పైకి వచ్చారు. బాబాకు చెందినవారిగా అవ్వడం, చేతిలో చేయి వేయడం అనే కార్యక్రమం 5–6 సంవత్సరాల క్రితమే జరిగింది. కానీ ఇప్పుడు మరింత దృఢంగా చేతిలో చేయి వేశారు, ఇక విడిపోకుండా. అందుకే బాప్‌దాదా సమర్పణ అయిన టీచర్లకు అభినందనలు ఇస్తున్నారు - ఎల్లప్పుడూ చేతిలో చేయి, తోడుగా తోడును పక్కా చేసుకుని విజయమాలను తమ మెడలో ధరించండి. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారో, ఆ స్థానాన్ని మరియు తమను తాము నిర్విఘ్నంగా చేసుకోండి. ఎలాంటి విఘ్నం గురించి రిపోర్ట్ రాకూడదు. స్వపురుషార్థంలో కూడా విఘ్నరూపంగా కాకూడదు. చాలాసార్లు బయట విఘ్నం లేకపోయినా, మనసులో అయితే వస్తుంది కదా! అందుకే మనసులో విఘ్నం ఉండకూడదు. తోటి వారివల్ల విఘ్నం ఉండకూడదు. స్టూడెంట్ల వల్ల కూడా ఎలాంటి విఘ్నం ఉండకూడదు. స్వయం నిర్విఘ్నం. సెంటర్ నిర్విఘ్నం. తోటి వారు నిర్విఘ్నం. ఈ మూడు సర్టిఫికెట్లు ఈ ముక్తి సంవత్సరంలో తీసుకోవాలి. సమ్మతమేనా? ఎవరైనా విఘ్నం కలిగిస్తే ఏమి చేస్తారు? మీరు అయితే నిర్విఘ్నంగా ఉంటారు. మరి ఎవరైనా విఘ్నం కలిగిస్తే ఏమి చేస్తారు? విఘ్న-వినాశకులుగా అవుతారా? అయితే సమర్పణ కార్యక్రమం అంటే సంపూర్ణత కార్యక్రమం. కేవలం సమర్పణ కార్యక్రమం అని మాత్రమే గుర్తుంచుకోకండి. అది కూడా గుర్తుంచుకోండి. కానీ సమయానుసారంగా ఇప్పుడు సంపూర్ణత దినాన్ని జరుపుకోవాల్సిందే. ఇంత దృఢ నిశ్చయం అనే కంకణం కట్టుకొని వెళ్లండి. బాప్‌దాదా టీచర్లందరికీ చెబుతున్నారు. దేశానికి చెందిన వారైనా, విదేశానికి చెందిన వారైనా, టీచర్లందరూ చేతులు ఎత్తండి. అచ్ఛా. ఈరోజు విదేశీయులు కూడా చాలా మంది ఉన్నారు. విదేశంలోని సెంటర్లకు వచ్చినందుకు స్వాగతం.
అచ్చా - బాప్‌దాదాకు టీచర్ల పట్ల ఒక శుభ భావన ఉంది, వినిపించమంటారా? కేవలం వింటారా లేక చేస్తారు కూడానా? కేవలం ఆలోచిస్తారా లేక స్వరూపంగా అవుతారా? వింటారు, చేస్తారు... అచ్ఛా, చాలా చిన్న శుభ భావన. పెద్ద విషయం కూడా కాదు, చాలా చిన్నది. దాదీ సందేశం పంపించారు - ఇప్పుడు అన్ని సేవాకేంద్రాలు నిర్విఘ్నంగా అవ్వడానికి బాధ్యత టీచర్లది. ఇప్పటికీ టీచర్ల గురించి ఫిర్యాదులు వస్తుంటాయి. దాదీల దగ్గర ఆ ఫైల్ ఉంది కదా. సేవాకేంద్రాల నుండి ఎన్ని అనవసరమైన లేఖలు వస్తాయంటే వాటితో చెత్త బుట్ట నిండిపోతుంది అని ఆఫీస్ యొక్క ఈషూ చెబుతుంది. అంతేనా? వాటిని చదవడానికి కూడా సమయం పడుతుంది, తర్వాత చింపడానికి కూడా సమయం పడుతుంది, తర్వాత పెట్టెలో వేయడానికి కూడా సమయం పడుతుంది. ఇలా ఈ శ్రమ అంతా వ్యర్థమైపోతుంది కదా. అందుకే బాప్‌దాదా యొక్క శుభ భావన ఏమిటంటే - టీచర్లు అందరూ బాబా యొక్క రైట్ హ్యాండ్స్, లెఫ్ట్ హ్యాండ్స్ కాదు, రైట్ హ్యాండ్స్. రైట్ హ్యాండ్స్ ఉంటున్న స్థానముల నుండి, సేవాకేంద్రాల నుండి వచ్చే వార్తలతో చెత్తబుట్ట నిండిపోవడం – ఇది మంచిదేనా? చెప్పండి, మంచిదా కాదా? ఈ సంవత్సరం మేము మూడు సర్టిఫికేట్లు తీసుకుంటామని భావించే వారు - స్వయం విఘ్న-వినాశకులు, సేవాకేంద్రం విఘ్న-వినాశకం, తోటి సహచరులు విఘ్న-వినాశకులు. ఈ మూడు సర్టిఫికెట్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న టీచర్లు చేతులు ఎత్తండి. సేవాకేంద్రంలో ఉండే పాండవులు కూడా చేతులు ఎత్తండి. (అందరూ చేతులు ఎత్తారు) థాంక్యూ.
ఇప్పుడు చెత్త బుట్ట ఖాళీగా ఉండాలి. చదవాల్సిన అవసరం రాకూడదు. లెటర్లు తెరచి తెరచి చేతులు అలసిపోతున్నాయి అని వీరు (ఈషూ) అంటున్నారు. కనుక ఇక్కడ కూర్చున్నవారైనా, విదేశాల నుండి వింటున్నవారైనా, దేశంలో వింటున్నా, మురళిని వింటున్నా కానీ, బాప్‌దాదాకు మొత్తము విశ్వములో నిమిత్తులైన టీచర్ల పట్ల ఒక శుభ భావన ఉంది, ఈ సంవత్సరము ఎవరి గురించి ఎటువంటి ఫిర్యాదు రాకూడదు. ఫిర్యాదుల ఫైల్ సమాప్తమైపోవాలి. బాప్‌దాదా వద్ద ఇప్పటి వరకు చాలా ఫైల్స్ ఉన్నాయి. కనుక ఈ సంవత్సరము ఫిర్యాదుల ఫైల్ సమాప్తము. అందరూ ఫైన్ (మంచి) గా అవ్వాలి. ఫైన్ కంటే కూడా రిఫైన్‌గా అవ్వాలి. ఇష్టమే కదా? ఎవరు ఎలా ఉన్నా కానీ వారితో కలిసి నడుచుకునే విధానాన్ని నేర్చుకోండి. ఎవరు ఏం చేసినా కానీ, పదే-పదే విఘ్న రూపంగా అయ్యి ఎదురుగా వచ్చినా కానీ ఆ విఘ్నాలలో సమయాన్ని వెచ్చించడము కూడా ఎప్పటివరకు? దీని సమాప్తి సమారోహం కూడా జరగాలి కదా? కనుక, వీరు ఇలా చేస్తున్నారు అని ఇతరులను చూడకండి. నేనేమి చెయ్యాలి? ఒకవేళ వారు పర్వతమైతే నేను పక్కకు తప్పుకోవాలి, పర్వతము పక్కకు తప్పుకోదు. వీరు మారితే నేను మారుతాను - అంటే పర్వతం పక్కకు తప్పుకుంటే నేను ముందుకు వెళ్తాను అన్నట్లు. అప్పుడు పర్వతమూ పక్కకు తప్పుకోదు, అలాగే మీరూ గమ్యానికి చేరుకోలేరు. అందుకే ఒకవేళ ఆ ఆత్మ పట్ల శుభ భావన ఉన్నట్లయితే, వారికి సూచనను ఇవ్వండి, ఇక ఆ తర్వాత మనసు-బుద్ధితో ఖాళీ అయిపోండి. స్వయాన్ని ఆ విఘ్న స్వరూపంగా అయినవారి యొక్క ఆలోచనలలో పడేసుకోకండి. నంబరువారుగా ఉన్నారు అన్నప్పుడు నంబరువారులో స్థితి కూడా నంబరువారుగానే ఉంటుంది కానీ మనము నంబరువన్‌గా అవ్వాలి. ఇలా విఘ్నాలను లేక వ్యర్థ సంకల్పాలను కలిగించే ఆత్మల పట్ల స్వయం పరివర్తన అయ్యి వారి పట్ల శుభ భావనను ఉంచుతూ నడవండి. ఇందుకు కొంచెం సమయం పడుతుంది, కాస్త కష్టమనిపిస్తుంది, కానీ చివరికి ఎవరైతే స్వ పరివర్తన చెందుతారో, విజయమాల వారి మెడలోనే పడుతుంది. ఒకవేళ శుభ భావనతో వారిని పరివర్తన చెయ్యగలిగితే చెయ్యండి, లేదంటే వారికి సూచనను ఇచ్చి మీ బాధ్యతను పూర్తి చేసుకోండి మరియు స్వ పరివర్తన చేసుకుని ముందుకు ఎగురుతూ వెళ్ళండి. ఈ విఘ్న రూపము కూడా మోహము అనే బంగారు దారం వంటిది. ఇది కూడా ఎగరనివ్వదు. ఇది చాలా సూక్ష్మమైనది మరియు సత్యత అనే పరదా వెనుక ఉన్న దారము. ఎలా ఆలోచిస్తారంటే - ఇదే సత్యమైన విషయము కదా, ఇలా అయితే జరుగుతుంది కదా, ఇలా జరగకూడదు కదా... కానీ ఎప్పటివరకు అలా చూస్తూ, ఎప్పటి వరకు అలా ఆగుతూ ఉంటారు? ఇప్పుడైతే స్వయాన్ని ఈ సూక్ష్మ దారాల నుండి కూడా విముక్తులుగా చేసుకోండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. అందుకే పిల్లల ఆశలు, ఉత్సాహాలు, ఉల్లాసాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బాప్‌దాదా ఫంక్షన్లు చేసి పూర్తి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరములోని చివరి ఫంక్షన్ ముక్తి సంవత్సరము యొక్క ఫంక్షన్ అవ్వాలి. ఫంక్షన్లో దాదీలకు కానుకను కూడా ఇస్తారు. మరి బాప్‌దాదాకు ఈ ముక్తి సంవత్సరము యొక్క ఫంక్షన్లో స్వయము యొక్క సంపూర్ణత అనే కానుకను ఇవ్వండి. అచ్ఛా.
మహారాష్ట్ర సేవాధారులతో:- ఇది మంచి పద్ధతిని తయారు చేసారు. మంచిది, సేవ ద్వారా అందరికీ బ్రాహ్మణ కుటుంబానికి సమీపంగా వచ్చే అవకాశం లభిస్తుంది. నిర్విఘ్న సేవ జరిగింది అంటే చేతులు ఎత్తండి. మహారాష్ట్ర సేవాధారులు అనంతమైన సేవ చేసారు కాబట్టి అనంతమైన దీవెనలు తీసుకున్నారు. మీ ఖాతాలో అనంతమైన దీవెనలు జమ అయ్యాయి. అందరూ సేవ యొక్క లాభం తీసుకున్నారు కదా. అందరికీ బాగా నచ్చింది కదా. చాలా మంచిది. మహారాష్ట్ర ముఖ్య సేవాధారులు లేవండి. బాప్‌దాదా మహారాష్ట్రకు చెందిన నిమిత్త సేవాధారులందరికీ నిర్విఘ్న సేవాధారులుగా అభినందనలు తెలియజేస్తున్నారు. అచ్ఛా. సెక్యూరిటీ వారు ప్రతిరోజూ దాదీలకు గుడ్ మార్నింగ్ లేదా గుడ్‌నైట్ చెప్పాలి. వారి సేవ ఎక్కువగా ఉంటుంది. అచ్ఛా. సెక్యూరిటీ వారు తమ టర్న్‌ను నిర్విఘ్నంగా పూర్తి చేసారు, ఇది చాలా ధైర్యము గల పని.
(డబల్ విదేశీయులు అంటున్నారు - ఒక మేళాను మేము కూడా సంభాళించగలము) కనీసం అందరూ విదేశాల భోజనం అయితే తింటారు. మంచిది, సేవ చేయడానికి ఆఫర్ చేసేవారికి ముందుగానే అభినందనలు.
డబల్ విదేశీయులు విశేష ఆత్మలుగా చేరుకున్నారు మరియు చేరుకుంటూనే ఉంటారు. బాప్‌దాదా విదేశాలలో అన్ని వైపులా జరుగుతున్న సేవను చూసి, ఉల్లాస-ఉత్సాహాలను చూసి సంతోషిస్తారు. ఎందుకంటే విదేశ సేవ ప్రారంభమైనప్పుడు కష్టంగా అనిపించిన విషయాలు ఇప్పుడు ఎంతో సహజంగా మారిపోయాయి. అందరూ సేవలో ఎగిరిపోతూ ఉన్నారు. ముందు విదేశాలలో పెద్ద ప్రోగ్రామ్ చేస్తే వినేవారితో హాల్ నింపడం చాలా కష్టమని అనుకునేవారు. వి.ఐ.పి.ల సేవ చాలా కష్టమని అనుకునేవారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు అయితే యు.ఎన్. వరకు కూడా చేరుకున్నారు. మరి చాలా సహజమైపోయింది కదా. బాప్‌దాదా ఎప్పుడూ చెబుతారు - వారు ఎంత పెద్దవారైనా, వారి దగ్గర శక్తి ఉంది, మీ దగ్గర పరమాత్మ విల్ పవర్ ఉంది. పరమాత్మ శక్తుల విల్ చేసారు, అందుకే విల్ పవర్ ఉంది. కాబట్టి పరమాత్మ విల్ పవర్ ముందు శక్తులు పరివర్తన చెందడం పెద్ద విషయం కాదు. కేవలం మీలో ఒక దృఢ సంకల్పం ఉండాలి - ఇది తప్పకుండా జరుగుతుంది. ఇది జరగదు, అది జరగదు, ఏమవుతుందో తెలియదు... ఈ విధమైన సంకల్పం పరమాత్మ టచింగ్ వారి బుద్ధికి చేరకుండా అడ్డుగా మారుతుంది. దేశంలో అయినా, విదేశంలో అయినా - ఎందుకు, ఎలా, ఇలా కాకపోతే... అనే సంకల్పాలతో ఎప్పుడూ ఏ కార్యం కోసం ఎదుటివారి వద్దకు వెళ్లకండి. ఎందుకు, ఏమిటి, ఇలా, అలా - ఇవన్నీ ముందుగా మీలో మీరు ఆలోచించి నిర్ణయించుకోండి, అది వేరే విషయం. కానీ ఎదురుగా వెళ్లేటప్పుడు ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో వెళ్లండి - ఇది తప్పకుండా జరుగుతుంది. చివరికి అందరూ తల వంచవలసిందే. కాబట్టి విదేశం కూడా సేవలో ఎగురుతోంది. భారత సేవ, విదేశ సేవ రెండూ కూడా ఎగిరే కళలో ఉన్నాయి. ఇప్పుడు సేవలో సకాశ్ ఇచ్చి, బుద్ధులను పరివర్తన చేసే సేవను కూడా జోడించండి. అప్పుడు చూడండి, విజయం స్వయంగా మీ ముందు తల వంచుతుంది. బాగుంది కదా? విదేశాలలో అనుభవం ఉంది కదా? మంచిది. సేవల వార్తలు బాప్‌దాదా వద్దకు చేరుతున్నాయి. విఘ్నాలు కూడా వస్తాయి, కానీ ముందు కనిపించేది విఘ్నం అనే తెర మాత్రమే. ఆ తెర వెనుక కల్యాణం దాగి ఉంటుంది. మనసా-వాచా శక్తితో ఆ విఘ్నం అనే తెరను తొలగించండి, అప్పుడు లోపల ఉన్న కల్యాణ దృశ్యం కనిపిస్తుంది.
ఇకపోతే విదేశ సేవాకేంద్రాల పిల్లలందరూ చాలా మంచి కార్డులు కూడా పంపుతారు, లేఖలు కూడా పంపుతారు. ఎవరైనా వస్తుంటే చాలా-చాలా ప్రియస్మృతులు కూడా పంపుతారు. బాప్‌దాదా కూడా కార్డులకు రిగార్డ్ (గౌరవం) ఇస్తారు. హృదయపూర్వకంగా పంపుతారు, చూపించుకోవడానికి పంపరు. చూపించుకోవడం కోసం పంపడం ఎకానామీ అవుతుంది. హృదయపూర్వకంగా పంపితే దానికి విలువను కొలవలేము. ప్రతి ఉత్సవానికీ ప్రతి ఒక్కరి సంతకాలతో ఎన్నో కార్డులు బాప్‌దాదా వద్దకు వస్తుంటాయి. భారతవాసులవి కూడా వస్తాయి. బాప్‌దాదా అన్ని కార్డులకు, లేఖలకు ఒకే సమాధానం ఇస్తారు - అభినందనలు, శుభాకాంక్షలు, ఎల్లప్పుడూ విజయవంతులుగా ఉండండి మరియు ఇతరులను కూడా సఫలత స్వరూపులుగా చేసి ఎగురుతూ ఉండండి. నడవకండి, ఎగరండి. అచ్ఛా - దూరంగా కూర్చొని వింటున్న వారికి కూడా బాప్‌దాదా ఒక్కో దేశాన్ని పేరుతో సహా, ప్రతి సేవాకేంద్రం యొక్క విశేషతతో సహా, ఎదురుగా ఉన్నవారి కంటే ముందుగానే ప్రియస్మృతులు ఇస్తున్నారు. మంచి సాధనాన్ని కనుగొన్నారు. ఇంకా మరిన్ని వస్తూనే ఉంటాయి. ముందుముందు చూస్తారు కూడా. ఇప్పుడు సేవాకేంద్రాలు వింటున్నాయి, ఒక రోజు వస్తుంది - అన్ని వైపులా బాబా సందేశం చేరుతుంది. సైన్స్ కూడా ఇవన్నీ మీ కోసమే ఆవిష్కరణలు చేస్తోంది. అందుకే బాప్‌దాదా సైన్స్ సాధనాలను రూపొందించే పిల్లలకు కూడా ప్రేమతో అభినందనలు తెలియజేస్తున్నారు. బుద్ధిని బాగా ఉపయోగిస్తున్నారు. సైన్స్ వారు కూడా వస్తారు, మీ అంచలి తీసుకుంటారు. తర్వాత భవిష్యత్తులో మీ సేవలోకి వస్తారు. అచ్ఛా.
బాప్‌దాదా అన్ని సేవాకేంద్రాలకు సేవ కోసం డైరెక్షన్ (దిశానిర్దేశం) చేస్తున్నారు - సెప్టెంబర్ మరియు అక్టోబర్ ఈ రెండు నెలల్లో పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేయండి. ఎంతవరకు ధ్వని వ్యాప్తి చేయగలరో అన్ని మూలలకూ ధ్వనిని వ్యాప్తి చేయండి. ఒక్క మూల కూడా మిగలకూడదు. పెద్ద పెద్ద ప్రోగ్రాములలో కూడా లక్ష్యం ఏమిటంటే - కేవలం విని వెళ్లిపోకుండా, అవ్వాలనే శుభ కోరికతో వెళ్లేలా ఏదో ఒక విధానాన్ని రూపొందించండి. ఏదో ఒక అనుభవం పొంది వెళ్లాలి. ప్రస్తుత సమయంలో వాతావరణం కూడా అన్ని వైపులా సహయోగిగా ఉంది. అందుకే విజయం సహజంగా లభించే సమయం ఇది. బాగా ధ్వనిని వ్యాప్తి చేయండి. అదే సమయంలో చిన్న చిన్న ప్రదేశాలు, పెద్ద కార్యక్రమాలు చేయడానికి ధైర్యం లేని చోట్ల 10-12 మంది ఉన్నా సరే యోగ శిబిరాల ప్రోగ్రాములు పెట్టండి. స్థలం లేకపోతే కలిసి ఏదైనా స్థలం తీసుకోగలిగితే తీసుకోండి. అది కూడా కుదరకపోతే ఒక రోజు శిబిరమైనా పెట్టండి. ఒక సెలవు రోజున కూడా పెడితే, వారికి మంచి అనుభవం కలిగితే, తర్వాతి ఆదివారం వారే ఆఫర్ చేస్తారు. యోగ శిబిరం స్టూడెంట్లను తయారు చేయడాన్ని చూసాము. కాన్ఫరెన్స్‌లు, స్నేహ మిలనాలు, చిన్న చిన్న స్నేహ మిలనాలు సమీపానికి తీసుకువస్తాయి. కానీ పెద్ద ప్రోగ్రాములు ప్రభావితం చేస్తాయి. పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ప్రచారం బాగా జరుగుతుంది. కాబట్టి రెండూ అవసరం. కానీ చిన్న ప్రదేశాలు, చిన్న సేవాకేంద్రాలు చిన్న చిన్న స్నేహ మిలనాలు లేదా చిన్న యోగ శిబిరం ప్రోగ్రామ్ పెట్టండి.
దానితో పాటు బాప్‌దాదా ప్రతి బ్రాహ్మణుని స్వ-ఉన్నతి కోసం, ఎక్కడైతే సులభంగా ఒక నెల సమయం దొరుకుతుందో, కాలానికి అనుగుణంగా, ఏర్పాట్లకు అనుగుణంగా, ఒక నెల స్వ-ఉన్నతి కోసం, అన్ని ఖజానాలను జమ చేసుకునే అభ్యాసం కోసం భట్టీ ఉండాలి. ఒక నెల స్వ-ఉన్నతి కోసం కూడా తప్పకుండా కేటాయించాలి. అందులో కొంత కొత్తదనం తీసుకురండి. ఇప్పటివరకు భట్టీలు జరిగాయి, అవి కూడా మంచివే. కానీ అందులో కొంత కొత్తదనం జోడించండి. కొంత సమయం అంతర్ముఖతతో మౌనం, మనస్సు యొక్క మౌనం కూడా ఉండాలి. నోటి మౌనం ప్రపంచం కూడా పాటిస్తుంది. కానీ ఇక్కడ వ్యర్థ సంకల్పాల నుండి మనస్సు మౌనంగా ఉండాలి. ట్రాఫిక్ కంట్రోల్ చేసినట్లే వ్యర్థ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తారు కదా, అలాగే మధ్య మధ్యలో ఒక రోజు మనస్సులోని వ్యర్థ ట్రాఫిక్‌ను కంట్రోల్ చేయండి. జ్ఞాన మననంతో పాటు శుభ భావనలు, శుభకామనలు, సకాశ్ ఇచ్చే అభ్యాసం - ఇవి మనస్సు మౌనం లేదా ట్రాఫిక్ కంట్రోల్ కోసం మధ్య మధ్యలో ఒక రోజును నిర్ణయించండి. ఎవరికైనా సెలవు రాకపోయినా, వారానికి ఒక రోజు సెలవు వస్తుంది కదా, దానికి అనుగుణంగా మీ మీ ప్రదేశాలలో ప్రోగ్రామ్‌లు నిర్ణయించండి. కానీ ఒక నెల ప్రత్యేకంగా ఏకాంతవాసం మరియు ఖజానాల ఏకానామీ ప్రోగ్రామ్ తప్పకుండా ఉండాలి. ఏకనామీ మరియు ఎకానమీ. మిగిలినది బాప్‌దాదా తమ నియమం ప్రకారం నవంబర్ నుండి ప్రారంభిస్తారు. రథం యొక్క దృఢ సంకల్పం, ధైర్యము మరియు సంభాళించడము వల్ల ఈ సంవత్సరం నిర్విఘ్నంగా ముగిసింది మరియు ముగియడాన్ని చూసాము. ఇప్పటికీ బిడ్డలో ఉత్సాహము ఉంది - రథం సిద్ధంగా ఉన్నప్పుడు రథవాన్ రావడానికి ఏముంది. అవును, మధ్య మధ్యలో విశ్రాంతిని కూడా చూడాలి. రథానికి విశ్రాంతి కూడా ఇవ్వాలి. అలా కాకుండా పనిలో ఎక్కువగా పెట్టకూడదు. విశ్రాంతి సమయంలో విశ్రాంతి, సేవ సమయంలో సేవ. మంచిది.
అమృతవేళలో ప్లానింగ్ బుద్ధి ఉన్న ముఖ్యమైన వారిని బాప్‌దాదా కార్యానికి నిమిత్తంగా చేస్తారు. వారికి సేవకు సంబంధించిన కొత్త కొత్త విధానాలు టచ్ అవుతాయి. కేవలం మీ బుద్ధిని బాబాకు అప్పగించి కూర్చోండి. బుద్ధివంతుల బుద్ధి మీ బుద్ధిని టచ్ చేస్తారు. ఈ ప్లానింగ్ బుద్ధి ఉన్నవారికి ఈ వరదానం తప్పకుండా లభిస్తుంది. నిమిత్తంగా ఉండండి. బాగుంది కదా పాండవులారా. చూడండి, ప్లానింగ్ బుద్ధి ఉన్నవారంతా కూర్చున్నారు - టీచర్లు కూడా, విదేశీయులు కూడా, భారత్వారు కూడా. మరి ఏమవుతుంది? చాలా-చాలా మంచిగా జరుగుతుంది. మిగిలినది వేసవి, వర్షాకాలంలో చిన్న చిన్న స్నేహ మిలనాలు చేయవచ్చు. శాంతివనంలో కూడా, బాప్‌దాదా ముందే చెప్పారు - చాలా మంది మిత్రులు, బంధువులు, సమీపవారు యోగ శిబిరం చేయాలనుకుంటున్నారు. వారికి హాల్లలో కొద్దిమంది చొప్పున ఉంచి, ప్రతి హాల్లో నిర్మించిన చిన్న చిన్న గదుల్లో, ఇప్పుడు టీచర్లు ఉంటున్న చోట, ఎవరైనా ప్రత్యేక వి.ఐ.పి.లు ఉంటే ఆ గదుల్లో విడిగా ఉంచవచ్చు. పెద్ద హాల్ ఉంది కాబట్టి డబల్ కనాత్తో విభజించవచ్చు కూడా. ఇప్పటి సీజన్‌కు నిర్మించలేకపోయినా, తర్వాత ఏర్పాట్లు చేయవచ్చు. అలాగే ఇక్కడ సోదరీల కోసం, సోదరుల కోసం వేర్వేరు భవనాలు నిర్మించారు. అక్కడ కూడా బ్రాహ్మణ ఆత్మలు తమను తాము సర్దుబాటు చేసుకోగలిగితే, ఈ సంవత్సరం ప్రత్యేక వి.ఐ.పి.లను అక్కడ ఉంచవచ్చు. అలాంటి ప్రత్యేక వి.ఐ.పి.లు ఉంటే. మిగిలిన బ్రాహ్మణులు తమను తాము సర్దుబాటు చేసుకోగలరు. యోగ శిబిరాల గ్రూపులను తోటి టీచర్లే తీసుకువస్తారు. మిగిలిన రెండో సీజన్‌కు వి.ఐ.పి.లు సిద్ధమవుతారు. తమ జోన్‌కు చెందిన రిఫ్రెషర్ కోర్స్‌ను శాంతివనంలో చేయాలనుకునే జోన్ వారికి శాంతివనం అవకాశం లభిస్తుంది. అక్కడక్కడా స్థలం వెతకడం కంటే సంఖ్య తక్కువైనా, ఇక్కడ ఉన్న సౌకర్యాలు బయట ఎక్కడా లభించవు. అందుకే జోన్ వారికి ఆహ్వానం. తమ గ్రూపును తీసుకువచ్చి రిఫ్రెష్ అయి వెళ్లండి. ఇక్కడ దాదీలు అయినా కలుస్తారు. అక్కడ దాదీలు వస్తారో రారో, ఇక్కడ ఈ అవకాశం లభిస్తుంది. అలాగే ఏదైనా గ్రూప్ ఆఫర్ చేస్తే, ఉదాహరణకు యువత లేదా ప్రవృత్తి వారు, 4-6 జోన్లు కలిసి గ్రూప్ ఏర్పరచగలిగితే ఏర్పరచవచ్చు. పైన వర్గాల సేవ జరుగుతుంది. కింద చిన్న చిన్న గ్రూపులకు కూడా ఇలాంటి ప్రోగ్రామ్‌లు చేయవచ్చు. శాంతివనాన్ని బిజీగా ఉంచండి. అవకాశం తీసుకోవాలనుకునేవారు తీసుకోవచ్చు. మిత్రులు, బంధువుల సేవను హృదయపూర్వకంగా చేయవచ్చు. అచ్ఛా.
నలువైపులా ఉన్న పరమాత్మ పాలన, చదువు మరియు శ్రీమతము అనే భాగ్యానికి అధికారులైన విశేష ఆత్మలకు, సదా ఆలోచించటము మరియు స్వరూపముగా అవ్వటము, ఈ రెండింటినీ సమానముగా చేసే బాబా సమానులైన ఆత్మలకు, సదా పరమాత్మ విల్ పవర్ ద్వారా స్వయములో మరియు సేవలో సహజ సఫలతను ప్రాప్తి చేసుకునే నిమిత్త సేవాధారి పిల్లలకు, సదా బాబాను కంబైండ్ రూపములో అనుభవము చేసేవారికి, సదా తోడును నిర్వర్తించే సహచరులైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
అచ్ఛా - అందరూ బాగానే ఉన్నారా? ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగిందా? ఎలాంటి ఇబ్బంది కలగలేదుకదా? సంతోషంగా ఉన్నారా? పిల్లలు సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నారు, పిల్లలు ఆనందంతో నృత్యం చేస్తున్నారు. కుమారీలు సంతోషంగా ఉన్నారా? కుమారీలు కూడా ఆనందంలో ఉన్నారు. టీచర్లు అందరికంటే ఎక్కువ సంతోషంగా ఉన్నారు, పాండవులు ఆనందంలో ఎగిరిపోతున్నారు. చాలా మంచిది.
దాదీలతో:- పిల్లలు హా జీ బాబా అంటారు, అలాగే బాబా కూడా హా జీ పిల్లలూ అంటారు. బాబాకు, పిల్లలకు మధ్య ఉన్న ఈ ప్రేమబంధమే నిజమైన స్నేహసూత్రం.
జగదీశ్ భాయితో:- ఆరోగ్యం బాగా ఉంది. ఇంకా చాలా సేవ చేయాలి. ఇప్పుడు పాండవులందరూ కలిసి కొన్ని కొత్త ప్రణాళికలు రూపొందించాలి. నవీనతకు నిమిత్తమవ్వాలి. ఆది నుంచే ఏదో ఒక సేవకు నిమిత్తమవుతూ వచ్చారు. ప్రతి ఒక్కరిలోనూ విశేషత ఉంది. అందుకే ఇకముందు కూడా మరిన్ని టచింగ్స్ లభిస్తూనే ఉంటాయి. చాలా మంచిది. ఢిల్లీలో కూడా మంచి కోలాహలం చేయాలి. ఢిల్లీ సేవాధారి పాండవులు మొదటగా నిమిత్తమయ్యారు. ఢిల్లీ ద్వారా బాబా పేరు ప్రసిద్ధి అవ్వాలి కదా! అందరి సకాశ్ సహకారంతో ఢిల్లీ ద్వారా పేరు ప్రతిష్ఠలు తప్పకుండా రావాలి. బాంబే, ఢిల్లీ వారు కలిసి కొత్త కొత్త ఆవిష్కరణలకు సంబంధించిన ప్రణాళికలు రూపొందించండి. మధుబన్‌లో అయితే సేవలు డ్రామా ప్రకారం పెరుగుతూనే ఉన్నాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ఈ వింగ్స్ సేవా ప్రణాళిక కూడా చాలా బాగా కొనసాగుతోంది, అలాగే కొనసాగుతూనే ఉంటుంది. ఎవరు నిమిత్తమవుతారో వారికి సేవ విజయానికి సంబంధించిన వాటా లభిస్తుంది. అందుకే నిమిత్తమవుతూ ఉండండి, విజయపు వాటాలను కూడబెట్టుకుంటూ ఉండండి. చాలా మంచిది. ఎవరైతే నిమిత్తమవుతారో వారికి అదనపు లిఫ్ట్ లభిస్తుంది. స్వపురుషార్థం అయితే ఉంటుంది, కానీ ఇది బహుమతిగా లభించే లిఫ్ట్. విదేశీయులకు కూడా సేవ అనే బహుమతి లభిస్తూనే ఉంటుంది. భారతవాసులు విదేశాలకు కూడా సకాశ్ ఇస్తున్నారు. కాబట్టి చాలా మంచిది. మంచి మంచి పాండవులు ఉన్నారు, మంచి మంచి శక్తులు కూడా ఉన్నాయి. ఈ సైన్యం చాలా మంచి, అందమైన సైన్యం. బాప్‌దాదా అయితే ప్రతి ఒక్కరి విశేషతను హృదయంలో మహిమ చేస్తూనే ఉంటారు. అలాగే కదా! అచ్ఛా!
*** ఓంశాంతి ***
