‘‘సమయం యొక్క పిలుపు - దాతగా అవ్వండి’’
ఈరోజు సర్వ శ్రేష్ఠ భాగ్యవిధాత, సర్వ శక్తుల దాత అయిన బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు. మధుబన్‌లో సమ్ముఖంగా ఉన్నా, దేశ-విదేశాలలో స్మృతిలో వింటున్నవారైనా, చూస్తున్నవారైనా, ఎక్కడ కూర్చున్నా సరే మనసుతో సమ్ముఖంగా ఉన్నారు, ఆ పిల్లలందరినీ చూసి బాప్‌దాదా హర్షిస్తున్నారు. మీరందరూ కూడా హర్షిస్తున్నారు కదా! పిల్లలు కూడా హర్షితముగా ఉన్నారు మరియు బాప్‌దాదా కూడా హర్షితముగా ఉన్నారు. మనసులోని ఈ సదాకాలికమైన సత్యమైన సంతోషము మొత్తము ప్రపంచములోని దుఃఖాలను దూరం చేసేటువంటిది. ఈ మనసులోని సంతోషము ఆత్మలకు బాబా యొక్క అనుభవాన్ని చేయిస్తుంది ఎందుకంటే బాబా కూడా సదా సర్వాత్మల పట్ల సేవాధారి మరియు పిల్లలైన మీరందరూ బాబాతోపాటు సేవా సహచరులు. సహచరులే కదా! బాబాకు సహచరులు మరియు విశ్వములోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్ని అందించే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. మీరు సదా సేవాధారులు. సేవ అంటే కేవలం నాలుగు గంటలో, ఆరు గంటలో చేసేవారు కాదు, మీరు ప్రతి సెకండ్ సేవా స్టేజ్‌పై పాత్రను అభినయించే పరమాత్ముని సహచరులు. స్మృతి నిరంతరమైనది, అలాగే సేవ కూడా నిరంతరమైనది. మిమ్మల్ని మీరు నిరంతర సేవాధారులుగా అనుభవము చేస్తున్నారా? లేక 8-10 గంటల సేవాధారులా? ఈ బ్రాహ్మణ జన్మ ఉన్నదే స్మృతి మరియు సేవ కొరకు. వేరే ఏమైనా చేసేది ఉందా? ఇదే కదా! ప్రతి శ్వాసలో, ప్రతి సెకండు స్మృతి మరియు సేవ కలిసి ఉన్నాయా లేక సేవ గంటలు వేరుగా మరియు స్మృతి గంటలు వేరుగా ఉన్నాయా? అలా లేవు కదా! అచ్ఛా, బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100 శాతము సేవ ఉన్నట్లయితే 100 శాతము స్మృతి ఉందా? రెండింటి బ్యాలెన్స్ ఉందా? తేడా వచ్చేస్తుంది కదా? కర్మయోగి అంటే అర్థమే కర్మ మరియు స్మృతి, సేవ మరియు స్మృతి - రెండింటి బ్యాలెన్స్ సమానంగా ఉండటము, ఇవి సమానంగా ఉండాలి. కొంత సమయం స్మృతి ఎక్కువగా ఉండి సేవ తక్కువగా ఉండటము లేక సేవ ఎక్కువగా ఉండి స్మృతి తక్కువగా ఉండటము, ఇలా ఉండకూడదు. ఏ విధంగా ఆత్మ మరియు శరీరము ఎప్పటివరకైతే స్టేజిపై ఉంటాయో అప్పటివరకు కలిసి ఉంటాయి కదా. వేరవ్వగలవా? అలా స్మృతి మరియు సేవ కలిసి ఉండాలి. స్మృతి అనగా బాబా సమానము, స్వయము యొక్క స్వమానము యొక్క స్మృతి కూడా ఉండాలి. బాబా స్మృతి ఉంటే స్వతహాగానే స్వమానము యొక్క స్మృతి కూడా ఉంటుంది. ఒకవేళ స్వమానములో లేకపోతే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు.
స్వమానము అనగా బాబా సమానము. సంపూర్ణ స్వమానములో ఉండటమే బాబా సమానంగా ఉండటము. ఇటువంటి స్మృతిలో ఉండే పిల్లలు ఎల్లప్పుడూ దాతలుగా ఉంటారు. వారు తీసుకునేవారిగా ఉండరు, దేవత అనగా ఇచ్చేవారు. ఈరోజు బాప్‌దాదా పిల్లలందరి దాతాతనపు స్థితిని చెక్ చేస్తున్నారు - దాత పిల్లలు ఎంతవరకు దాతలుగా అయ్యారు? బాబా ఎప్పుడూ తీసుకోవాలి అన్న సంకల్పాన్ని చెయ్యరు, వారు ఇవ్వాలి అన్న సంకల్పాన్నే చేస్తారు. ఒకవేళ మీ పాతవాటినన్నింటినీ ఇచ్చేయండి అని అన్నా సరే, మళ్ళీ ఆ పాతవాటికి బదులు కొత్తవాటిని ఇస్తారు. బాబా విషయములో తీసుకోవటము అనగా బాబా ఇవ్వటము. వర్తమాన సమయంలో బాప్‌దాదాకు పిల్లలది ఒక టాపిక్ చాలా మంచిగా అనిపించింది. ఏ టాపిక్? విదేశీయుల టాపిక్ అది. అది ఏమిటి? కాల్ ఆఫ్ టైమ్ (సమయం యొక్క పిలుపు).
పిల్లల కొరకు సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నదానిని బాప్‌దాదా చూస్తున్నారు! విశ్వము కొరకు, సేవ కొరకు బాప్‌దాదా అయితే సేవా సహచరునిగా ఉండనే ఉన్నారు. కానీ పిల్లల కొరకు ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నదానిని బాప్‌దాదా చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటి అన్నది మీకు కూడా అర్థమవుతుంది కదా. మీ కోసం ఆలోచించండి. సేవ కొరకైతే భాషణ చేసారు, చేస్తున్నారు కదా! కానీ మీ కోసం మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి - మా కొరకు సమయం యొక్క పిలుపు ఏమిటి? వర్తమాన సమయంలోని పిలుపు ఏమిటి? బాప్‌దాదా చూస్తున్నారు - ఇప్పటి సమయమనుసారంగా ప్రతి సమయం, పిల్లలు ప్రతి ఒక్కరూ దాతాతనపు స్మృతిని ఇంకా పెంచుకోవాలి. స్వ ఉన్నతి పట్ల దాతాతనపు భావము, సర్వుల పట్ల స్నేహము ఇమర్జ్ రూపములో కనిపించాలి. ఎవరెలా ఉన్నా కానీ, ఎటువంటివారైనా కానీ, నేను ఇవ్వాలి. దాత ఎల్లప్పుడూ అనంతమైన వృత్తి కలవారిగా ఉంటారు, హద్దులోని వృత్తి కలవారిగా కాదు, అంతేకాక దాత సదా సంపన్నులుగా, నిండుగా ఉంటారు. దాత ఎల్లప్పుడూ క్షమాభావములో మాస్టర్ సాగరులుగా ఉంటారు. ఈ కారణంగా హద్దులోని తమ సంస్కారాలేవైతే ఉంటాయో లేక ఇతరుల సంస్కారాలు ఏవైతే ఉంటాయో, అవి ఇమర్జ్ అవ్వవు, మర్జ్ అయి ఉంటాయి. నేను ఇవ్వాల్సిందే. ఎవరు ఇచ్చినా, ఇవ్వకపోయినా కానీ నేను దాతగా అవ్వాలి. ఏ సంస్కారానికైనా వశమైన పరవశ ఆత్మ అయినా కానీ, ఆ ఆత్మకు నేను సహయోగాన్ని ఇవ్వాలి, అప్పుడు ఎవరి హద్దు సంస్కారాలూ మిమ్మల్ని ప్రభావితం చెయ్యవు. ఎవరైనా గౌరవాన్ని ఇచ్చినా, ఇవ్వకపోయినా కానీ, నేనైతే ఇవ్వాలి. ఇటువంటి దాతాతనము ఇప్పుడు ఇమర్జ్ అయి ఉండాలి. మనసులో భావన అయితే ఉంది కానీ... ఈ కానీ అనే మాట రాకూడదు. నేను చెయ్యాల్సిందే. ఎవరైనా అలాంటి-ఇలాంటి నడవడిక నడుస్తున్నా, మాటలు మాట్లాడుతున్నా, ఒకవేళ అవి మీకు పనికిరాకపోతే, మంచిగా అనిపించకపోతే వాటిని తీసుకోనే తీసుకోకండి. చెడిపోయిన వస్తువును తీసుకోవటం జరుగుతుందా ఏమిటి? మనసులో ధారణ చెయ్యటము అనగా తీసుకోవటము. అది బుద్ధిలోకి కూడా రాకూడదు. బుద్ధిలోకి కూడా విషయము వచ్చేసింది కదా, అలా కూడా రాకూడదు. అది ఉన్నదే చెడిపోయిన వస్తువు అన్నప్పుడు, అది మంచిది కాదు అన్నప్పుడు దానిని బుద్ధిలోకి మరియు మనసులోకి తీసుకోకండి అనగా దానిని ధారణ చెయ్యకండి. తీసుకునేందుకు బదులుగా ఇంకా శుభ భావన, శుభ కామనలను దాతగా అయ్యి ఇవ్వండి. చెడు విషయాలను తీసుకోకండి, ఎందుకంటే ఇప్పుడు సమయమనుసారంగా ఒకవేళ బుద్ధి మరియు మనసు ఖాళీగా లేకపోతే నిరంతర సేవాధారులుగా అవ్వలేరు. మనసు మరియు బుద్ధి ఇతర విషయాలలో బిజీ అయిపోయినట్లయితే ఇక సేవ ఏమి చేస్తారు? అప్పుడిక లౌకికములో ఎలాగైతే కొందరు 8 గంటలు, కొందరు 10 గంటలు పని చేస్తారో, ఇక్కడ కూడా అలాగే అయిపోతుంది. 8 గంటల సేవాధారి, 6 గంటల సేవాధారిగా అవుతారు, నిరంతర సేవాధారులుగా అవ్వలేరు. మనసా సేవ అయినా చెయ్యండి, వాచా సేవ అయినా చెయ్యండి లేక కర్మల ద్వారా అనగా సంబంధ-సంపర్కాల ద్వారా అయినా సేవ చెయ్యండి, ప్రతి సెకండూ దాత అనగా సేవాధారి. బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటే బాబాకు సేవా సహచరులుగా అవ్వగలరు. మనసును సదా స్వచ్ఛంగా ఉంచుకోవటం ద్వారా నిరంతరం బాబా యొక్క సేవా సహచరులుగా అవ్వగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? మీతో పాటు ఉంటాము, మీతో పాటే వస్తాము అని. ప్రతిజ్ఞ ఉంది కదా? లేక మీరు ముందు ఉండండి, మేము వెనుక-వెనుక వస్తాము అని అంటారా? అలా కాదు కదా? తోడుగా ఉంటామని ప్రతిజ్ఞ చేసారు కదా? బాబా సేవ లేకుండా ఉంటారా? అలాగే స్మృతి లేకుండా కూడా ఉండరు. బాబా ఎంతగా స్మృతిలో ఉంటారో, అంతగా మీరు కూడా ఉంటారు కానీ మీరు శ్రమతో ఉంటారు. స్మృతిలో ఉంటున్నారు కానీ శ్రమతో, అటెన్షన్‌తో ఉంటున్నారు. బాబాకు ఎవరు ఉన్నారు? పరమాత్మకు ఉన్నది ఆత్మలే. ఆత్మలు నంబరువారుగా ఉన్నారు. పిల్లల స్మృతి లేకుండా బాబా ఉండనే ఉండలేరు. బాబా పిల్లల స్మృతి లేకుండా ఉండగలరా? మీరు ఉండగలరా? అప్పుడప్పుడు అల్లరి పిల్లలుగా అయిపోతారు.
మరి ఏమి విన్నారు? సమయం యొక్క పిలుపు ఏమిటంటే - దాతగా అవ్వండి. దీని యొక్క అవసరము ఎంతో ఉంది. మొత్తం విశ్వములోని ఆత్మలందరి పిలుపు ఉంది - ఓ మా ఇష్ట దేవతలారా... మీరు ఇష్ట దేవతలే కదా! ఏదో ఒక రూపంలో మీరు సర్వాత్మలకు ఇష్టులు. ఇప్పుడు ఆత్మలందరి పిలుపు ఏమిటంటే - ఓ ఇష్టదేవులు, ఇష్టదేవీలు, పరివర్తన చెయ్యండి. వారి ఈ పిలుపు వినిపిస్తుందా? పాండవులకు ఈ పిలుపు వినిపిస్తుందా? మరి విని ఏం చేస్తున్నారు? వినిపిస్తుంది అన్నప్పుడు వారికి పరిష్కారము ఇస్తారా లేక ఆ, చేస్తాములే అని అలోచిస్తారా? పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపునేమో ఇతరులకు వినిపిస్తున్నారు కానీ మీరు ఆత్మల పిలుపును కేవలం విని ఊరుకుంటారా? కనుక ఇష్టదేవులు, ఇష్టదేవీలు - ఇప్పుడు మీ దాతాతనపు రూపాన్ని ఇమర్జ్ చెయ్యండి. ఇవ్వాలి, ఏ ఆత్మ కూడా వంచితముగా ఉండిపోకూడదు. లేదంటే ఫిర్యాదుల మాలలు మెడలో పడతాయి. ఫిర్యాదైతే చేస్తారు కదా! మరి మీరు ఫిర్యాదుల మాలలను ధరించే ఇష్ట దేవతలా లేక పూల మాలలను ధరించే ఇష్ట దేవతలా? ఎటువంటి ఇష్ట దేవతలు? మీరు పూజ్యులు కదా! మేమైతే వెనక వచ్చినవారము, పెద్ద-పెద్దవారెవరైతే ఉన్నారో, వారే దాతలుగా అవుతారు, మేమెక్కడ అవుతాము అని ఇలా భావించకండి. అలా కాదు. అందరూ దాతలుగా అవ్వాలి.
ఎవరైతే మొదటిసారి మధుబన్కు వచ్చారో, వారు చేతులెత్తండి. మొదటిసారి వచ్చినవారు దాతగా అవ్వగలరా లేక రెండో సంవత్సరం, మూడో సంవత్సరంలో దాతగా అవుతారా? ఒక సంవత్సరం వారు దాతగా అవ్వగలరా? (అవ్వగలము) చాలా మంచి తెలివైనవారు. బాప్‌దాదా ధైర్యాన్ని చూసి సదా సంతోషిస్తారు. ఒక నెలవారైనా, ఒక సంవత్సరంవారైనా లేక 6 నెలలవారైనా, బాప్‌దాదాకు తెలుసు, మీరు ఒక సంవత్సరంవారైనా లేక ఒక నెలవారైనా, ఒక్క నెలలోనే స్వయాన్ని బ్రహ్మాకుమార్ లేక బ్రహ్మాకుమారి అనే పిలుచుకుంటారు కదా! మరి బ్రహ్మాకుమార్ మరియు బ్రహ్మాకుమారి అనగా బ్రహ్మాబాబా వారసత్వానికి అధికారులు అయినట్లు. బ్రహ్మాను తండ్రిగా స్వీకరించారు కనుకనే కుమార, కుమారీలుగా అయ్యారు కదా? అందుకే బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలు బ్రహ్మాతండ్రి మరియు శివతండ్రి ఇచ్చే వారసత్వానికి అధికారులుగా అయ్యారు కదా! లేక ఒక నెలవారికి వారసత్వము లభించదని అనుకుంటున్నారా? ఒక నెలవారికి వారసత్వము లభిస్తుందా? మరి వారసత్వము లభించినప్పుడు అది ఇవ్వడానికి దాతలుగానైతే అవుతారు కదా! ఏదైతే లభిస్తుందో, దానిని ఇవ్వడమైతే ప్రారంభించాలి కదా.
ఒకవేళ తండ్రిగా భావించి కనెక్షన్‌ను జోడించినట్లయితే ఒక్క రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోగలరు. అవును, బాగుంది, ఏదో శక్తి ఉంది, అర్థమైతే అవుతుంది... అని కేవలం ఇలా అనటం కాదు. వారసత్వానికి అధికారులుగా పిల్లలు అవుతారు, అంతేకానీ అర్థం చేసుకునేవారు, చూసేవారు వారసత్వానికి అధికారులుగా అవ్వరు. ఒకవేళ ఒక్క రోజులోనైనా మనస్ఫూర్తిగా తండ్రి అని స్వీకరిస్తే వారసత్వానికి అధికారులుగా అవ్వగలరు. మీరందరూ అధికారులే కదా! మీరందరూ బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలే కదా లేక ఇప్పుడు అవుతున్నారా? అయిపోయారా లేక అవ్వడానికి వచ్చారా? మిమ్మల్ని ఎవరైనా మార్చగలరా? బ్రహ్మాకుమారులు, బ్రహ్మాకుమారీలకు బదులు కేవలం కుమారులు, కుమారీలుగా అవ్వండి అంటే అవ్వగలరా? బ్రహ్మాకుమారులు మరియు బ్రహ్మాకుమారీలుగా అవ్వటంలో ఎంత లాభం ఉంది? లాభం ఒక్క జన్మకు కాదు, అనేక జన్మలకు లాభం. పురుషార్థం చేసేదేమో సగం జన్మ లేక పావు జన్మ కానీ ప్రారబ్ధము మాత్రం అనేక జన్మలకు లభిస్తుంది. లాభమే లాభం కదా! బాప్‌దాదా సమయమనుసారంగా వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయంపై అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు ఎందుకంటే బాప్‌దాదా పిల్లల రిజల్టునైతే చూస్తుంటారు కదా! రిజల్టులో ధైర్యము చాలా బాగుంది అన్నది చూసారు. లక్ష్యము కూడా చాలా బాగుంది. లక్ష్యము అనుసారంగా చూస్తే ఇప్పటికీ లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. లక్ష్యమైతే అందరిదీ నంబర్‌వన్‌గానే ఉంది. మీ లక్ష్యము 21 జన్మల రాజ్యభాగ్యము తీసుకోవాలనా, సూర్యవంశీయులుగా అవ్వాలనా లేక చంద్రవంశీయులుగా అవ్వాలనా అని బాప్‌దాదా ఎవరిని అడిగినా, అందరూ ఎందులో చేతులెత్తుతారు? సూర్యవంశీయులుగా అవ్వాలనే కదా! చంద్రవంశీయులుగా అవ్వాలనుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. (ఒక్కరు చేతులెత్తారు) మంచిది, లేదంటే రాముడి సీట్ ఖాళీగా ఉండిపోతుంది. మరి లక్ష్యమైతే అందరిదీ చాలా బాగుంది. లక్ష్యము మరియు లక్షణాల యొక్క సమానత - దీనిపై అటెన్షన్ పెట్టడము చాలా అవసరము. దీనికి కారణం ఏమిటి? ఈరోజు వినిపించాము కదా, అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారు. ఇది అవ్వాలి, వీరు చెయ్యాలి, వీరు సహాయము చెయ్యాలి, వీరు మారితే నేను మారుతాను, ఈ విషయం సరిగ్గా ఉంటే నేను కూడా సరిగ్గా ఉంటాను - ఇలా అనటం అంటే తీసుకునేవారిగా అవ్వటము, ఇది దాతాతనము కాదు. ఎవరు ఇచ్చినా, ఇవ్వకపోయినా బాబా అయితే మొత్తము ఇచ్చేసారు. బాబా ఏమైనా కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఇచ్చారా? ఒకటే కోర్సు కదా! 60 సంవత్సరాలవారికైనా, ఒక నెలవారికైనా కోర్సు అయితే ఒకటే కదా. లేదా 60 సంవత్సరాలవారి కోర్సు వేరుగా, ఒక నెలవారి కోర్సు వేరుగా ఉందా? వారు కూడా అదే కోర్సు తీసుకున్నారు మరియు ఇప్పుడు కూడా అదే కోర్సు ఉంది. అదే జ్ఞానము, అదే ప్రేమ, అవే సర్వశక్తులు. అన్నీ ఒకేలా ఉన్నాయి. వారికి 16 శక్తులు, వీరికి 8 శక్తులు అన్నట్లు లేవు. అందరికీ ఒకే విధమైన వారసత్వము ఉంది. మరి బాబా అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతారు, తీసుకునేవారిగా అవ్వరు. నేను ఇవ్వాలి. ఎవరైనా ఇచ్చినా, ఇవ్వకపోయినా, వారు తీసుకునే కోరిక కలవారిగా ఉండరు, ఇచ్చే కోరిక కలవారిగా ఉంటారు. అంతేకాక ఎంతైతే ఇస్తారో, దాతగా అవుతారో, అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు మీరు ఎవరికైనా స్వమానాన్ని ఇచ్చారనుకోండి, అలా ఇతరులకు ఇవ్వటము అనగా మీ స్వమానాన్ని పెంచుకోవటము. అది ఇచ్చినట్లు అవ్వదు, ఇవ్వడం అనగా తీసుకోవడము. తీసుకోకండి, ఇవ్వండి, అప్పుడది తీసుకోవటముగానే అవుతుంది. మరి సమయం యొక్క పిలుపు ఏమిటో అర్థమైందా? దాతగా అవ్వండి. ఒక్క మాట గుర్తు ఉంచుకోండి. ఏం జరిగినా కానీ ‘‘దాత’’ అన్న పదాన్ని సదా గుర్తుంచుకోండి. కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా ఉండాలి. సూక్ష్మంగానూ తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు, స్థూలంగానూ తీసుకోవాలి అన్న కోరిక ఉండకూడదు. దాత అన్నదాని అర్థమే - కోరిక అంటే ఏమిటో తెలియనివారు, సంపన్నులు. తీసుకోవాలి అన్న కోరిక కలగటానికి అసలు వారికి అప్రాప్తి అనేదే అనుభవమవ్వదు. సర్వ ప్రాప్తి సంపన్నులుగా ఉంటారు. మరి మీ లక్ష్యము ఏమిటి? సంపన్నముగా అవ్వాలనే కదా? లేక ఎంత లభిస్తే అంతే చాలా? సంపన్నముగా అవ్వటమే సంపూర్ణముగా అవ్వటము.
ఈరోజు విదేశీయులకు విశేషంగా అవకాశము లభించింది. మంచిది. మొదటి అవకాశాన్ని విదేశీయులు తీసుకున్నారు, ప్రియమైన పిల్లలయ్యారు కదా. అందరినీ వద్దన్నారు కానీ విదేశీయులకు ఆహ్వానమునిచ్చారు. బాప్‌దాదాకు కూడా పిల్లలందరి స్మృతి ఉంటుంది, అయినా కానీ డబల్ విదేశీయులను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషమనిపిస్తుంది. ఇప్పుడు వర్తమాన సమయంలో అంతగా అలజడిలోకి రావటం లేదు. ఇప్పుడు మార్పు వచ్చింది. ప్రారంభములో ప్రశ్నలు ఉండేవి కదా - అది భారతీయ కల్చర్ (సంస్కృతి), ఇది విదేశీ కల్చర్ అని... ఇప్పుడు అంతా అర్థమయ్యింది. ఇప్పుడు బ్రాహ్మణ కల్చర్‌లోకి వచ్చేసారు. భారతీయ కల్చర్ లేదు, విదేశీ కల్చర్ లేదు, బ్రాహ్మణ కల్చర్‌లోకి వచ్చేసారు. భారతీయ కల్చర్‌లో కొంచెం ఇబ్బంది ఉంటుంది కానీ బ్రాహ్మణ కల్చర్ అయితే సహజము కదా! బ్రాహ్మణ కల్చర్ అంటేనే స్వమానములో ఉండండి మరియు స్వరాజ్య అధికారులుగా అవ్వండి. ఇదే బ్రాహ్మణ కల్చర్. ఇదైతే ఇష్టమే కదా? భారతీయ కల్చర్ ఎలా వస్తుంది, కష్టం కదా అని ఇప్పుడు ప్రశ్నలైతే ఏమీ లేవు కదా? సహజం అయిపోయింది కదా? మరి చూడండి, అక్కడకు వెళ్ళిన తరువాత మళ్ళీ ఇది కాస్త కష్టము అని అనకండి! అక్కడకు వెళ్ళిన తర్వాత ఇలా వ్రాయకండి. సహజము అని అనేసాము కానీ ఇది కాస్త కష్టము అని అనకండి! ఇది సహజమేనా లేక కొంచెం-కొంచెం కష్టమా? కొంచెం కూడా కష్టము కాదు. ఇది చాలా సహజము. ఇప్పుడు మొత్తం ఆట అంతా పూర్తయిపోయింది, అందుకే నవ్వు వస్తుంది. ఇప్పుడు పక్కాగా అయిపోయారు. చిన్ననాటి ఆటలు ఇప్పుడు సమాప్తమైపోయాయి. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయిపోయారు. బాప్‌దాదా చూస్తున్నారు - పాతవారు ఎంతగా పక్కాగా అవుతూ ఉంటారో, అంతగానే కొత్త-కొత్తగా వచ్చేవారు కూడా పక్కా అయిపోతారు. మంచిది, ఒకరినొకరు మంచిగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు. మంచిగా శ్రమిస్తున్నారు. ఇప్పుడిక దాదీల వద్దకు కథలనైతే తీసుకుపోవటం లేదు కదా. కథలు, వృత్తాంతాలను దాదీల వద్దకు తీసుకువెళ్తున్నారా? తగ్గింది కదా! మార్పు వచ్చింది కదా? (జానకి దాదీతో) మరి మీరు ఇప్పుడు అనారోగ్యంగా లేరు కదా? కథలు-వత్తాంతాలతో అనారోగ్యం వస్తుంది, అవి ఇప్పుడు సమాప్తమైపోయాయి. మంచిది, అందరిలో అన్నింటికంటే మంచి విశేషమైన గుణముంది, అదేమిటంటే - మనసు యొక్క స్వచ్ఛత బాగుంది. లోపల ఉంచుకోరు, బయటకు చెప్పేస్తారు. ఏదుంటే అది నిజం చెప్పేస్తారు. ఇలా కాదు అలా, ఇలా-అలా అని అనరు, ఏదుంటే అది చెప్పేస్తారు, ఈ విశేషత బాగుంది. అందుకే బాబా అంటున్నారు - సత్యమైన మరియు స్వచ్ఛమైన మనసుపై బాబా సంతుష్టులవుతారు. అవునంటే అవును అని చెప్తారు, కాదంటే కాదు అని చెప్తారు. అలా కాకుండా, చూస్తాములే... అని ఇలా అనరు! తప్పదు కదా అని నడవరు, నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకపోతే లేదు. అచ్ఛా.
బాప్‌దాదా ఫారెన్ మరియు ఇండియా వారి మీటింగులను చూసారు. చాలా మీటింగులు చేసారు కదా! సమయం కేటాయించి అందరూ ప్లాన్లు అయితే తయారు చేసారు, బాగా కష్టపడ్డారు,సంగఠన కూడా బాగుంది. సంగఠనతో ఏ కార్యము జరిగినా అది సహజంగా సఫలమవుతుంది. డబల్ విదేశీయులు మీటింగ్‌లో సంగఠన శక్తిని చాలా బాగా ప్రత్యక్షం చేసారు. ఏ ప్లాన్లు అయితే తయారు చేసారో, అందరి ధైర్యము మరియు శ్రమను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఓ.ఆర్.సి గ్రూప్, ఎవరైతే విశేషంగా సేవ కోసం వచ్చారో, ఓ.ఆర్.సి వారందరూ (5 ఖండాల సేవ కోసం ముఖ్య సోదరసోదరీలు) అందరికీ బాప్‌దాదా అభినందనలు చెప్తున్నారు. ఎక్కడ ఎలా నడుచుకోగలరో, ఎంత నడవగలరో అంతే చేయండి, పెద్ద పట్టణం మరియు చిన్న పట్టణంలో తేడా అయితే ఉంటుంది కదా. ఎంత ధైర్యాన్ని చూపారో, ఎంత సమయమిచ్చి కష్టపడ్డారో, దానంతటినీ ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. కేవలం ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకోండి – సేవ మరియు స్వ ఉన్నతి యొక్క బ్యాలెన్సులో తేడా రాకూడదు. ప్లానును ప్రాక్టికల్లోకి తీసుకు వచ్చిన తర్వాత సేవలో బిజీ అయిపోయాను, అందుకే స్వ ఉన్నతిలో తేడా వచ్చింది అని అనకండి. రెండిటి బ్యాలెన్సును సదా గుర్తుంచుకోండి. ఎందుకని? ఇతరుల సేవను చేస్తూ స్వ సేవను చేయకపోతే అది మంచిది కాదు కదా. రెండింటి బ్యాలెన్సు పెట్టడంలోనే సఫలత ఉంటుంది. అర్థమయిందా! అచ్ఛా!
ఓ.ఆర్.సి వారు చేతులెత్తండి. ఇంటర్నేషనల్ సేవా గ్రూపు కూడా చేతులెత్తండి. అచ్ఛా. అభినందనలు. సమయం కేటాయించి భట్టీలో కూడా కూర్చున్నారు, ఇది మంచిది. మధుబన్‌లో ఛాన్సు కూడా బాగుంది. అందరూ పరస్పరం కలిసిపోతారు. అన్ని వైపుల సమాచారము కూడా అందరికీ లభిస్తుంది. బాప్‌దాదా అభినందనలు చెప్తున్నారు. చాలా బాగా చేసారు. అచ్ఛా, ఎవరెవరు, ఎక్కడి నుండైతే వచ్చారో వారందరికీ బాప్‌దాదా స్నేహముతో కూడిన అభినందనలు చెప్తున్నారు. అందరూ ఉత్తరాలు, స్మృతి పత్రాలు చాలా పంపారన్న సమచారాము కూడా అందింది. బాప్‌దాదా అయితే ఉత్తరము అందక మునుపే ప్రియస్మృతులను ఇచ్చేసారు. పిల్లలైన మీరు వ్రాస్తున్నప్పుడే, సంకల్పం చేస్తున్నప్పుడే, ఎలా అయితే ఇక్కడ సైన్సు సాధనాలు ఉంటాయి కదా, వాటి ద్వారా త్వరగా చేరుకుంటాయి కదా, ఉత్తరం తర్వాత చేరుకుంటుంది, త్వరగా ఈ-మెయిల్ చేరుతుంది. మీరు ఈ-మెయిల్ ఇవ్వడం ప్రారంభిస్తారు కదా, దానికంటే ముందే బాబా వద్దకు చేరుకుంటుంది. ఈ సాధనాలన్నీ పిల్లలైన మీ సేవకు సహయోగం చేయడానికి వెలువడ్డాయి. బ్రహ్మా బాబా ఎప్పుడైతే సమాచారాన్ని వింటారో – ఈ-మెయిల్ వచ్చింది, వీరు ఇది, అప్పుడు సంతోషిస్తారు – వాహ్! పిల్లలూ వాహ్! ఇంత సహజమైన సాధనాలు బ్రహ్మా బాబాకు కూడా సాకారంలో లభించలేదు కానీ పిల్లల వద్ద ఉన్నాయి. సంతోషిస్తారు. కేవలం వాటిని సేవా సాధనాలుగా భావించి మాత్రమే ఉపయోగించండి. ఈ మధ్య సమయంలో ఈ సేవా సాధనాలు లభించాయి. ఆదిలో ఇన్ని సాధనాలు లేవు మరియు అంతిమంలో కూడా ఉండవు. ఇవి ఇప్పటి కోసమే. సేవను పెంచడం కోసం ఉన్నాయి. ఇవి సాధనాలు మాత్రమే, సాధన చేసేది మీరు. సాధనాల వెనుక సాధన తగ్గకూడదు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. పిల్లల దృశ్యాన్ని కూడా చూస్తాము. త్వరగా పని చేసేస్తారు. బాప్‌దాదా మీ ఆఫీసుకు వస్తారు. ఎలా పని చేస్తున్నారు అని చూస్తారు. చాలా బిజీగా ఉంటారు కదా. ఆఫీసు బాగా నడుస్తుంది కదా! ఎలా అయితే ఒక్క సెకండులో సాధనాలను ఉపయోగిస్తారో అలాగే మధ్య-మధ్యలో కొంత సమయం సాధన కోసం కూడా కేటాయించండి. సెకండు అయినా కేటాయించండి. ఇప్పుడు సాధనాలపై చేయి ఉంది, వెంటనే ఒక్క సెకండులో సాధనలో ఉండాలి, ఇలా మధ్య-మధ్యలో అభ్యాసం చేయండి. ఎలా అయితే సాధనాలతో ఎంతగా అభ్యాసం చేస్తారో అంతగా ఆటోమేటిక్‌గా వాటితో పని చేసేస్తారు కదా అలాగే ఒక్క సెకండులో సాధన కూడా అభ్యాసం చేయాలి. టైమ్ లభించలేదు, రోజంతా బిజీగా ఉన్నాను అని అనకండి. బాప్‌దాదా ఈ మాటను ఒప్పుకోరు. సాధనాలతో ఒక గంట పని చేస్తే, ఆ మధ్యలో 5-6 సెకండులు సాధన కోసం కేటాయించలేరా? 5 నిమిషాలు కూడా కేటాయించలేనంతగా ఎవరైనా బిజీగా ఉన్నారా? 5 సెకండ్లు కూడా కేటాయించలేరా? ఉన్నారా అలాంటివారు ఎవరైనా? కేటాయించగలిగితే కేటాయించండి.
బాప్‌దాదా ఎప్పుడైతే పిల్లల మాట వింటారో, ఈరోజు బిజీగా ఉన్నాము, ఈరోజు బిజీగా ఉన్నాము అంటూ పిల్లలు తమ ముఖాన్నే బిజీగా చేసేసుకుంటున్నారు. బాప్‌దాదా ఒప్పుకోరు. ఏది కావాలంటే అది చేయగలరు. అటెన్షన్ తక్కువగా ఉంది. 10 నిమిషాలలో ఈ లెటర్ పూర్తి చేయాలి అన్న విషయంలో అటెన్షన్ పెడ్తారు కదా, అందుకే బిజీగా ఉంటారు కదా, టైమ్ కారణంగా, 10 నిమిషాలలో ఈ పనిని పూర్తి చేయాలి అని టైమ్ టేబుల్ తయారు చేసుకుంటారు కదా, ఇందులో 1-2 నిమిషాలు ముందుగానే అదనంగా జత చేసేసుకోండి. 6 నిమిషాలు పట్టే పనికి 8 నిమిషాల సమయాన్ని మీ టైమ్ టేబుల్లో పెట్టుకోండి, అప్పుడు 2 నిమిషాలు సాధన కోసం కేటాయించండి. ఇది వీలవుతుందా?
(అమెరికా గాయత్రి అక్కయ్యను అడుగుతున్నారు) ఇక ఎప్పుడూ బిజీగా ఉన్నాను, బిజీగా ఉన్నాను అని చెప్పకండి. ఆ సమయంలో బాప్‌దాదా మీ ముఖాన్ని కూడా చూస్తారు, ఫోటో తీసేలా ఉంటుంది. ఎంత బిజీగా ఉన్నాగానీ ముందునుండే సాధనాలతో పాటు సాధన కోసం సమయాన్ని జత చేయండి. ఏమి జరుగుతుందంటే, సేవ అయితే చాలా బాగా చేస్తారు, సమయం కూడా కేటాయిస్తారు, అందుకు అభినందనలు. కానీ స్వ-ఉన్నతి మరియు సాధనను మధ్య-మధ్యలో చేయనందు వలన అలసట యొక్క ప్రభావం మీ మీద పడుతుంది. బుద్ధి కూడా అలసిపోతుంది, చేతులు కాళ్ళు కూడా అలసిపోతాయి. మధ్య-మధ్యలో సాధన కోసం సమయం కేటాయిస్తే అలసట దూరమైపోతుంది. సంతోషంగా ఉంటుంది కదా. సంతోషంలో అలసట అనిపించదు. పనిలో పడిపోతారు, చాలా సమయం వరకు కర్మ-కాన్సెస్ అయి ఉంటున్నారు అని బాప్‌దాదా అంటున్నారు. ఇలా జరుగుతుంది కదా? కర్మ-కాన్సెస్ కోసం మార్కులు లభిస్తాయి, వృధా అవ్వదు కానీ సోల్ కాన్సెస్ మార్కులు మరియు కర్మ కాన్సెస్ మార్కులలో తేడా ఉంది కదా! తేడా ఉంటుంది కదా? మరి ఇప్పుడు బ్యాలెన్సు ఉంచండి. లింక్‌ను తెంచకండి, జోడిస్తూ ఉండండి ఎందుకంటే మెజారిటీ డబల్ విదేశీయులు పని చేయడంలో బిజీగా ఉంటారు. చాలా కష్టపడతారు అని బాప్‌దాదాకు తెలుసు, కానీ బ్యాలెన్సును ఉంచండి. ఎంత వీలైతే అంత సమయాన్ని కేటాయించండి, సెకండు, నిమిషము, ఎంత కేటాయించగలిగితే అంత చేయండి. వీలవుతుందా? పాండవులు, వీలవుతుందా? టీచర్లు, వీలవుతుందా? ఆఫీసులో పని చేసేవారికి వీలవుతుందా? సరే అనైతే చాలా మంచిగా అంటారు. అచ్ఛా.
భారతదేశం వారు కూడా ఏ ప్లాన్లు అయితే తయారు చేసారో అవి బాగున్నాయి. ఇరువురూ తమ-తమ వాయుమండలం అనుసారంగా ప్లాన్లు మంచిగా తయారు చేసారు.
ఏ పిల్లలైతే ప్రియస్మృతులను పంపారో, ఉత్తరాల ద్వారానైనా లేదా ఇంకే రకంగానైనా ఏవైతే ప్రియస్మృతులను పంపారో బాప్‌దాదాకు అవన్నీ అందాయి. బాప్‌దాదా వాటికి బదులుగా పిల్లలందరికీ దాతతనపు (దాతా స్థితి) వరదానాన్ని ఇస్తున్నారు. అచ్ఛా! ఒక్క సెకండులో ఎగరగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా? బాబా అని అనగానే ఎగిరిపోవాలి. (డ్రిల్).
నలువైపులా ఉన్న సర్వ శ్రేష్ఠ బాబా సమానంగా దాతాతనపు భావనను ఉంచుకునేవారికి, శ్రేష్ఠ ఆత్మలకు, నిరంతరం స్మృతి మరియు సేవలో తత్పరులై ఉండేవారికి, పరమాత్మ సేవా సహచరులైన పిల్లలకు, సదా లక్ష్యాన్ని మరియు లక్షణాలను సమానం చేసుకునేవారికి, సదా బాబా యొక్క స్నేహీలు మరియు సమానులకు, సమీపంగా చేరుకునే బాప్‌దాదా నయన సితారలకు, సదా విశ్వ కళ్యాణ భావనలో ఉండే దయార్ద్ర హృదయులకు, మాస్టర్ క్షమాసాగరులైన పిల్లలకు, దూరంగా కూర్చున్నవారికి, మధుబన్‌లో కింద కూర్చున్నవారికి మరియు బాప్‌దాదా ఎదురుగా కూర్చున్న పిల్లలందరికీ ప్రియస్మృతులు మరియు నమస్తే.
ఇంటర్నేషనల్ మీటింగ్ గ్రూపుతో కలయిక:- ఒక్కొక్క రత్నము చాలా చాలా విలువైనది. బాప్‌దాదా సదా ఒక్కొక్క రత్నములోని విశేషతల మాలను జపిస్తారు. విశేషతలు ఉన్నాయి కనుకనే విశేష ఆత్మలుగా గాయనం ఉంది. కేవలం ఆ విశేషతలను సదా కార్యంలో వినియోగిస్తూ ఉండాలి. బాప్‌దాదా ప్రతి ఒక్కరి విశేషతల మాలను త్రిప్పుతా ఉంటారు మరియు ఇదే పాటను పాడుతూ ఉంటారు – వాహ్! నా విశేష రత్నామా వాహ్! బాప్‌దాదా సదా పిల్లల స్మృతిలోనే ఉంటారని అందుకే చెప్పాము. పిల్లలు, మహనీయులు. తమ మహనీయతతో విశ్వాన్ని మహనీయంగా చేసేవారు. ఎంత మహిమ ఉంది? ఎలా అయితే పిల్లలు తండ్రి మహిమను చేస్తారో అలాగే బాబా కూడా పిల్లలు ప్రతి ఒక్కరి మహిమను చేస్తారు. ఆత్మిక నషా ఉంటుంది కదా? సదా స్వయాన్ని నిమిత్తంగా, విశ్వ స్టేజీపై హీరో పాత్రను పోషించే హీరో పాత్రధారిగా భావించి నడుచుకోండి. అందరూ హీరోలే కదా? బాప్‌దాదా అయితే పిల్లలు ప్రతి ఒక్కరితో రోజంతటిలో అనేక సార్లు కలుస్తూ ఉంటారు. కలుస్తారు కదా! ప్రతి ఒక్కరి యాక్ట్‌ను చూసి సంతోషిస్తారు. మంచి పాత్రను పోషించేవారు. బాప్‌దాదా కూడా సదా చాలా మంచిది, చాలా మంచిది అన్న పాటను పాడుతూ ఉంటారు. చాలా మంచివారు. మంచిగా ఉన్నారు మరియు సదా మంచిగా ఉంటారు. గ్యారంటీ ఉంది కదా, మంచిగా ఉండేవారు. ఉంటారు కూడా, ఇందులో అడిగే అవసరం లేదు. ప్రశ్న ఉందా? మంచిగా ఉన్నారా అని అడగమంటారా? మంచిగా ఉన్నారు, ఉంటారు. అచ్ఛా, చాలా మంచి సంగఠన. అచ్ఛా!
*** ఓంశాంతి ***
