‘‘కొత్త శతాబ్దములో మీ నడవడిక మరియు ముఖము ద్వారా ఫరిశ్తా స్వరూపాన్ని ప్రత్యక్షము చెయ్యండి’’
ఈరోజు బాప్‌దాదా పరమాత్మ పాలనకు అధికారులైన తమ పిల్లలను చూసి హర్షిస్తున్నారు. స్వయం పరమాత్మ పాలనలో పాలింపబడుతున్నారంటే వారు ఎంతటి భాగ్యవంతులు. ప్రపంచములోనివారు - మమ్మల్ని పరమాత్మ పాలన చేస్తున్నారని అంటారు, కానీ విశేష ఆత్మలైన మీరు కొద్దిమంది మాత్రమే ప్రాక్టికల్‌గా పాలింపబడుతున్నారు. పరమాత్మ పాలన ఉంది, పరమాత్మ శ్రీమతము ఉంది, ఆ శ్రీమతము ఆధారముగానే నడుస్తున్నారు, పాలింపబడుతున్నారు. ఈ విధంగా మిమ్మల్ని మీరు విశేష ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? మీ మహానత గురించి తెలుసా? వర్తమాన సమయములోనైతే బ్రాహ్మణ ఆత్మలు మహాన్గానే ఉన్నారు, అంతేకాక భవిష్యత్తులో కూడా సర్వ శ్రేష్ఠ మహానులుగా ఉంటారు. ద్వాపరములో కూడా మీ జడ చిత్రాలు ఎంత మహాన్‌గా తయారవుతాయంటే ఆ చిత్రాల ఎదురుగా ఎవరు వెళ్ళినా వాటికి నమస్కరిస్తారు. మీకు ఎంతటి మహానత ఉందంటే ఈరోజు వరకు కూడా ఒకవేళ ఏ ఆత్మనైనా కృత్రిమమైన దేవతగా తయారుచేస్తే అనగా లక్ష్మీ-నారాయణులుగా తయారుచేస్తే, శ్రీరామునిగా తయారుచేస్తే, ఎప్పటివరకైతే ఆ ఆత్మ దేవతా పాత్రను అభినయిస్తారో, ఆ ఆత్మ సాధారణమైన మనిషి అన్నది తెలిసినప్పటికీ కూడా, దేవతా పాత్రను అభినయిస్తున్న కారణంగా ఆ సాధారణ ఆత్మకు కూడా నమస్కరిస్తారు. కావున మీ రూపానికి మహానత అయితే ఎలాగూ ఉంది, అంతేకాక నామ మాత్రపు దేవతలను కూడా మహానులుగా భావిస్తారు. మరి అటువంటి మహానతను అనుభవము చేస్తున్నారా? మీ మహానత గురించి తెలుసా, అర్థం చేసుకున్నారా లేదా ఇమర్జ్ రూపంలో స్వయాన్ని అనుభవము చేస్తున్నారా? ఎందుకంటే ముఖ్యమైన ఆధారమే అనుభవం చేయడము.
బాప్‌దాదా పిల్లలందరినీ అనుభవీ మూర్తులుగా తయారుచేస్తారు. కేవలము వినేవారిగా మరియు తెలుసుకునేవారిగా మాత్రమే కాదు. అనుభవము గురించైతే ప్రతి ఒక్కరి ముఖము ద్వారా, నడవడిక ద్వారా తెలిసిపోతుంది. నడవడిక ద్వారా వారి స్థితి గురించి తెలిసిపోతుంది. అందుకే మా నడవడిక ఎలా ఉంది? అన్నది ఆలోచించండి. బ్రాహ్మణ నడవడిక ఉందా? బ్రాహ్మణులు అనగా సదా సంపన్న ఆత్మలు. శక్తులతో కూడా సంపన్నులు, గుణాలతో కూడా సంపన్నులు... మరి అటువంటి నడవడిక ఉందా? వీరు సాధారణమైనవారిగా ఉన్నా కూడా అలౌకికమైనవారు అన్నది మీ ముఖము ద్వారా కనిపిస్తుందా? మీ అందరి దృష్టి, వృత్తి, వైబ్రేషన్లు అన్నీ అలౌకికమైనవిగా అనుభవం చేస్తున్నారా? చివరి జన్మ వరకు కూడా మీ దివ్యతను, మహానతను జడ చిత్రాల ద్వారా కూడా అనుభవము చేస్తున్నప్పుడు, మరి వర్తమాన సమయములో చైతన్య శ్రేష్ఠ ఆత్మల ద్వారా అవి అనుభవమవుతున్నాయా? జడ చిత్రాలైతే మీవే కదా!
అమృతవేళ నుండి ప్రతి నడవడికను చెక్ చేసుకోండి - మా దృష్టి అలౌకికంగా ఉందా? ముఖము యొక్క పోజ్ (వైఖరి) సదా హర్షితంగా ఉంటుందా? అది ఏకరసంగా, అలౌకికంగా ఉంటుందా లేక ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుందా? అలౌకిక స్మృతి మరియు వృత్తి కేవలం యోగంలో కూర్చునే సమయములో లేక ఏదైనా విశేష సేవ చేసే సమయములోనే ఉంటున్నాయా లేక సాధారణ కార్యాన్ని చేస్తున్నప్పుడు కూడా ముఖము మరియు నడవడిక విశేషంగా ఉంటున్నాయా? ఎవరైనా మిమ్మల్ని కార్య వ్యవహారాలలో చాలా బిజీగా ఉన్నప్పుడు గానీ, ఏదైనా అలజడి కలిగించే విషయము మీ ఎదురుగా ఉన్నప్పుడు గానీ చూస్తే, వారు మిమ్మల్ని అలౌకికమైనవారిగా భావిస్తున్నారా? కనుక చెక్ చేసుకోండి - మాటతీరు, ముఖము సాధారణ కార్యము చేస్తున్నప్పుడు కూడా అతీతముగా మరియు ప్రియముగా అనుభవమవుతున్నాయా? ఏ సమయంలోనైనా అకస్మాత్తుగా ఏ ఆత్మయైనా మీ ఎదురుగా వచ్చినట్లయితే మీ వైబ్రేషన్ల ద్వారా, మాటతీరు ద్వారా వీరు అలౌకిక ఫరిశ్తా అని భావిస్తారా? ఎందుకంటే ఈరోజు సంగమము యొక్క రోజు, పాతది వెళ్ళిపోతుంది, కొత్తది వస్తుంది. మరి ఏ నవీనత విశ్వం ఎదురుగా కనిపించాలి? లోపల స్మృతి ఉంటుంది లేదా అర్థం చేసుకుంటున్నారు అనేది వేరే విషయము, కానీ స్థాపనా సమయము గురించి ఆలోచించండి - స్థాపనా సమయములో ఎంత సమయం గడిచిపోయింది! గడిచిపోయిన సమయం బట్టి ఇప్పుడింకా ఎంత కొద్ది సమయం మిగిలి ఉంది? మరి ఏం అనుభవమవ్వాలి? బాప్‌దాదాకు తెలుసు - చాలా మంచి-మంచి పురుషార్థులు పురుషార్థము కూడా చేస్తున్నారు, ఎగురుతున్నారు కూడా, కానీ బాప్‌దాదా ఈ 21వ శతాబ్దములో నవీనతను చూడాలనుకుంటున్నారు. అందరూ మంచివారు, విశేషమైనవారు కూడా, మహానులు కూడా, కానీ బాబా ప్రత్యక్షతకు ఆధారము - సాధారణ కార్యములో ఉంటున్నప్పటికీ ఫరిశ్తాల వంటి నడవడిక మరియు స్థితి ఉండాలి. విషయం అలాంటిది, పని అలాంటిది, పరిస్థితులు అటువంటివి, సమస్య అటువంటిది, అందుకే సాధారణత వచ్చేసింది అని అనటమును బాప్‌దాదా చూడాలనుకోవటం లేదు. ఫరిశ్తా స్వరూపము అనగా స్మృతి స్వరూపములో ఉండాలి, సాకార రూపములో ఉండాలి. కేవలము అర్థం చేసుకునేవరకు, స్మృతి వరకు ఉండటమే కాదు, కానీ స్వరూపములో ఉండాలి. ఎలాంటి పరివర్తన రావాలంటే - ఏ సమయంలోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా అలౌకిక స్వరూపము అనుభవమవ్వాలి. అలానే ఉన్నారా లేక కాస్త మారుతుందా? విషయమనుసారంగా మీ స్వరూపాన్ని తయారుచేసుకోకండి. విషయము మిమ్మల్ని ఎందుకు మార్చాలి, మీరు విషయాన్ని మార్చండి. పరిస్థితులు మిమ్మల్ని మార్చాలా లేక మీరు పరిస్థితులను మార్చాలా? పరివర్తన అని దేనిని అంటాము? ప్రాక్టికల్ జీవితము యొక్క శ్యాంపుల్ అని ఎవరిని అంటాము? ఎటువంటి సమయమో, ఎటువంటి పరిస్థితియో, అటువంటి స్వరూపము తయారవ్వటము అనేది సాధారణ వ్యక్తుల విషయములో కూడా జరుగుతుంది. కానీ ఫరిశ్తా అనగా పాత మరియు సాధారణ స్థితి-పరిస్థితి నుండి కూడా అతీతముగా ఉండాలి.
‘‘సమయము యొక్క పిలుపు’’ అనేది ఇప్పుడు మీ టాపిక్ కదా. విశేష మహానాత్మలైన మీ కొరకు ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమిటంటే - ఇప్పుడు ఫరిశ్తా అనగా అలౌకిక జీవితము స్వరూపములో కనిపించాలి. ఇది సాధ్యమా? టీచర్లు చెప్పండి, సాధ్యమా? ఎప్పుడు అవుతుంది? సాధ్యమే అంటే అది చాలా మంచి విషయము కదా, కానీ ఎప్పుడు అవుతుంది? ఒక సంవత్సరం కావాలా, 2000 సంవత్సరం పూర్తయిపోవాలా? ఎవరైతే కొద్ది సమయమైతే కావాలి అని అనుకుంటున్నారో, సరే, ఒక సంవత్సరం కాకపోతే 6 నెలలు, 6 నెలలు కాకపోతే 3 నెలలు కావాలా? దీనికి చేతులు ఎత్తడం లేదు. మీ స్లోగన్ ఏమిటి? గుర్తుందా? ‘‘ఇప్పుడు కాకుంటే మరెప్పుడూ కాదు’’ ఈ స్లోగన్ ఎవరిది? బ్రాహ్మణులదా లేక దేవతలదా? బ్రాహ్మణులదే కదా! కనుక ఈ కొత్త శతాబ్దములో బాప్‌దాదా ఇదే చూడాలనుకుంటున్నారు - ఏమి జరిగినా కానీ అలౌకికత పోకూడదు. దీని కొరకు కేవలం నాలుగు మాటలపై అటెన్షన్ పెట్టాల్సి ఉంటుంది, అవి ఏమిటి? అవి కొత్త విషయాలేమీ కావు, పాతవే, కేవలము రివైజ్ చేయిస్తున్నాము.
ఒక విషయము, శుభ చింతకులు. రెండవది శుభ చింతన, మూడవది శుభ భావన, వాళ్ళు మారితే నేను మారుతాను అన్న ఈ భావన ఉండకూడదు. వారి పట్ల కూడా శుభ భావన, స్వయం పట్ల కూడా శుభ భావన ఉండాలి మరియు నాల్గవది శుభ శ్రేష్ఠ స్మృతి మరియు స్వరూపము. కేవలం శుభ అన్న ఈ ఒక్క మాటను గుర్తు పెట్టుకోండి, ఇందులో 4 విషయాలూ వచ్చేస్తాయి. కేవలం అన్నింటిలోనూ శుభ అన్న మాటను గుర్తుపెట్టుకోవాలి. ఈ మాటలను వినటమైతే ఎన్నో సార్లు విన్నారు. చాలా సార్లు వినిపించారు కూడా. ఇప్పుడు ఇంకా ఎక్కువగా స్వరూపములోకి తీసుకువచ్చేందుకు అటెన్షన్ పెట్టాలి. తయారవ్వవలసిందైతే మీరే అన్నది బాప్‌దాదాకు తెలుసు మరియు వచ్చేవారు కూడా సాకార రూపములోనైతే మిమ్మల్నే చూస్తారు.
ఈరోజు సంవత్సరములోని చివరి రోజు కదా! అందుకని బాప్‌దాదా మెజారిటీ పిల్లల సంవత్సరమంతటి లెక్కల ఖాతాను చూసారు. ఏం చూసి ఉంటారు? ముఖ్యంగా ఒక కారణాన్ని చూసారు. బాప్‌దాదా ఏం చూసారంటే - తొలగించుకునే శక్తి మరియు ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది. తొలగిస్తారు కూడా, తప్పులు చూడటం, వినటం, ఆలోచించటం, గతాన్ని కూడా తొలగిస్తారు (చెరిపివేస్తారు) కానీ మీరు అంటూ ఉంటారు కదా - ఒకటేమో కాన్షస్ (చేతన), రెండవది సబ్ కాన్షస్ (ఉప చేతన). దానిని తొలగిస్తారు, కానీ మనస్సు అనే ప్లేట్ అనండి, స్లేట్ (పలక) అనండి, కాగితం అనండి, ఏమన్నా అనండి, దాని నుండి పూర్తిగా తొలగించటం లేదు. ఎందుకని తొలగించుకోలేకపోతున్నారు? దానికి కారణమేమిటంటే - ఇముడ్చుకునే శక్తి పవర్‌ఫుల్‌గా లేదు. సమయమనుసారంగా ఇముడ్చుకుంటారు కూడా, కానీ మళ్ళీ సమయము వచ్చినప్పుడు బయటకు వచ్చేస్తుంది, అందుకే బాప్‌దాదా నాలుగు మాటలనేవైతే వినిపించారో, వాటిని సదా ఆచరించటం లేదు. ఒకవేళ మనస్సు అనే ప్లేట్ లేక కాగితం పూర్తిగా శుభ్రమవ్వకపోతే, పూర్తిగా దానిపై ఉన్నది చెరగకపోతే, మరి మీరు వేరే ఏదైనా మంచిగా వ్రాయాలనుకున్నా కానీ అది స్పష్టంగా ఉంటుందా? అనగా సర్వ గుణాలను, సర్వ శక్తులను ధారణ చెయ్యాలనుకున్నా కానీ సదా మరియు పూర్తి శాతంలో చెయ్యగలుగుతారా? పూర్తిగా శుభ్రంగా కూడా ఉండాలి, స్పష్టంగా కూడా ఉండాలి, అప్పుడు ఈ శక్తులను సహజంగా కార్యములో పెట్టగలరు. కారణము ఇదే, ఏమిటంటే మెజారిటీ యొక్క స్లేట్ స్పష్టంగా, శుభ్రంగా లేదు. కొద్దికొద్దిగానైనా గడిచిపోయిన విషయాలు లేక గడిచిపోయిన నడవడిక, వ్యర్థ విషయాలు మరియు వ్యర్థమైన నడత-నడవడిక సూక్ష్మ రూపములో లోపల ఉండిపోతాయి, మళ్ళీ సమయము వచ్చినప్పుడు అవి సాకార రూపములోకి వచ్చేస్తాయి. కనుక సమయమనుసారంగా ముందు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, ఇతరులను చెక్ చెయ్యటంలో నిమగ్నమైపోకండి ఎందుకంటే ఇతరులను చెక్ చెయ్యటం సహజమనిపిస్తుంది, స్వయాన్ని చెక్ చేసుకోవటం కష్టమనిపిస్తుంది. కనుక చెక్ చేసుకోండి - నా మనస్సు అనే ప్లేట్ వ్యర్థము నుండి మరియు గతం నుండి పూర్తిగా స్వచ్ఛంగా ఉందా? అన్నింటికంటే సూక్ష్మ రూపము ఏమిటంటే - వైబ్రేషన్ల రూపములో ఉండిపోతుంది. ఫరిశ్తా అనగా పూర్తిగా స్వచ్ఛము మరియు స్పష్టము. ఇముడ్చుకునే శక్తితో నెగెటివ్‌ను కూడా పాజిటివ్ రూపములోకి పరివర్తన చేసి ఇముడ్చుకోండి. నెగెటివ్‌ను నెగెటివ్‌గానే ఇముడ్చుకోకండి, దానిని పాజిటివ్‌లోకి మార్చి ఇముడ్చుకోండి, అప్పుడు కొత్త శతాబ్దములో నవీనత వస్తుంది.
రెండవ విషయం ఏమి చూసామో చెప్పమంటారా? చెప్పమంటారా లేక డోస్ ఎక్కువైపోయిందా? బాప్‌దాదా ఇంతకుముందు చెప్పి ఉన్నారు - ఎలాగైనా సరే, నేను మిమ్మల్ని నాతోపాటు పరంధామానికి తీసుకువెళ్ళాల్సిందే, అది కొట్టి అయినా సరే లేక ప్రేమతో అయినా సరే తీసుకువెళ్ళాల్సిందే. అజ్ఞానులను కొట్టడంతో మరియు పిల్లలైన మిమ్మల్ని ప్రేమతో తీసుకువెళ్తాను. అలాగే బాప్‌దాదా ఇప్పుడు కూడా ఏమంటున్నారంటే - ఎలాగైనా సరే ప్రపంచము ఎదురుగా మహానాత్మలను ఫరిశ్తాల రూపములో ప్రత్యక్షము చెయ్యాల్సిందే. మరి సిద్ధముగా ఉన్నారు కదా? బాప్‌దాదా వినిపించి ఉన్నారు కదా - ఏం చేసైనా సరే తయారుచెయ్యాల్సిందే. లేకపోతే కొత్త ప్రపంచము ఎలా వస్తుంది! అచ్ఛా, రెండవ విషయం ఏం చూసాము?
సంవత్సరం చివర కదా ఇది. చూడండి, బాప్‌దాదా మెజారిటీ అని అంటున్నారు, అందరూ అని అనటం లేదు, మెజారిటీ అని అంటున్నారు. మరి రెండవ విషయం ఏం చూసాము? ఎందుకంటే కారణాన్ని నివారణ చేసినప్పుడే నవ నిర్మాణము జరుగుతుంది. కావున రెండవ కారణము ఏమిటంటే - నిర్లక్ష్యాన్ని రకరకాల రూపాలలో చూసాము. కొంతమందిలో చాలా రాయల్ రూపములోని నిర్లక్ష్యాన్ని కూడా చూసాము. నిర్లక్ష్యానికి కారణము ఒకటే మాట - ‘‘అంతా నడుస్తుందిలే’’. ఎందుకంటే సాకారములోనైతే ప్రతి ఒక్కరి ప్రతి కర్మను ఎవ్వరూ చూడలేరు, సాకార బ్రహ్మా కూడా సాకారములో చూడలేకపోయారు కానీ ఇప్పుడు అవ్వక్త రూపములో ఒకవేళ చూడాలనుకుంటే ప్రతి ఒక్కరి ప్రతి కర్మను చూడగలము. పరమాత్మకు వేయి కళ్ళు ఉంటాయి, లక్షల కళ్ళు ఉంటాయి, లక్షల చెవులు ఉంటాయి అని గాయనము ఉంది. ఇప్పుడు ఆ నిరాకారుడు మరియు అవ్యక్త బ్రహ్మా ఇరువురూ కలిసి చూడగలరు. ఎవరు ఎంతగా దాచినా కానీ, ఆ దాచటం కూడా చాలా రాయల్టీతో దాచిపెడతారు, సాధారణంగా దాచరు. కనుక నిర్లక్ష్యమనేది ఒకటి స్థూల రూపంలో ఉంటుంది, ఇంకోటి సూక్ష్మ రూపంలో ఉంటుంది. కానీ రెండింటిలోనూ మాట ఒకటే ఉంటుంది - ‘‘అంతా నడుస్తుందిలే, ఏమవుతుందో చూసాములే, ఏమీ అవ్వదు, ఇప్పటికైతే కానిచ్చేద్దాము, తర్వాత చూసుకుందాము!’’ ఇవి నిర్లక్ష్యముతో కూడిన సంకల్పాలు. కావాలనుకుంటే బాప్‌దాదా అందరికీ వినిపించగలరు కూడా, కానీ కాస్త గౌరవాన్ని నిలబెట్టండి అని మీరు అంటారు కదా, కనుక బాప్‌దాదా కూడా గౌరవాన్ని నిలబెడతారు, కానీ ఈ నిర్లక్ష్యము పురుషార్థాన్ని తీవ్రం కానివ్వదు. పాస్ విత్ ఆనర్లుగా కానివ్వదు. ‘‘అంతా నడుస్తుందిలే’’ అని స్వయం అనుకుంటే, ఫలితంగా మీరు కూడా నడిచే వెళ్తారు, అంతేకానీ ఎగరరు. మరి ఏ రెండు విషయాలను చూసామో విన్నారా! పరివర్తనలో ఏదో ఒక రూపంతో, ప్రతి ఒక్కరిలో వేరు-వేరు రూపాలతో నిర్లక్ష్యము ఉంది. కనుక బాప్‌దాదా ఆ సమయములో చిరునవ్వు నవ్వుతారు. ఏమవుతుందో చూద్దాములే అని పిల్లలు అనుకుంటారు, కావున బాప్‌దాదా కూడా, ఏమవుతుందో చూడండి అని అంటారు! ఈరోజు దీనిని ఎందుకు వినిపిస్తున్నాము? ఎందుకంటే మీరు కావాలనుకున్నా లేక వద్దనుకున్నా, బలవంతంగానైనా మిమ్మల్ని తయారుచెయ్యవలసిందే మరియు మీరు తయారవ్వవలసే ఉంటుంది. ఈరోజు కాస్త కఠినంగా వినిపించాము ఎందుకంటే - మేము ఇది చేస్తాము, అది చేస్తాము... అని మీరు ప్లాన్ తయారుచేసుకుంటున్నారు, కానీ కారణము యొక్క నివారణ జరగకపోతే అది అల్పకాలికం అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఏదైనా విషయం వస్తే - విషయమే అటువంటిది కదా, కారణమే అటువంటిది, నా లెక్కాచారమే అలా ఉంది అని అంటారు, అందుకే తయారవ్వవలసిందే. అంగీకారమే కదా! టీచర్లకు అంగీకారమేనా? విదేశీయులకు అంగీకారమేనా? తయారవ్వవలసిందే అని బాప్‌దాదా అంటారు. అప్పుడు తయారయ్యాము అని కొత్త శతాబ్దములో అంటారు. అంతే కదా! తక్కువలో తక్కువ సమయం తీసుకోవాలి. కానీ బాప్‌దాదా ఒక సంవత్సరం సమయాన్ని ఇస్తున్నారు కాబట్టి సహజమే కదా. ఆరామ్‌గా (ప్రశాంతంగా) చెయ్యండి. ఆరామ్ అంటే అర్థము - ఆ రామ్ అనగా రామా రండి అనగా బాబాను గుర్తు చేసుకుని, ఆ తర్వాత చెయ్యండి. ఆ డన్లప్ పరుపుపై పడుకునే ఆ ఆరామ్ (విశ్రాంతి) కాదు. బాప్‌దాదాకు మీపై ఎక్కువ ప్రేమ ఉందా లేక మీకు బాబాపై ఎక్కువ ప్రేమ ఉందా? ఎవరికి ఉంది? బాబాకా లేక మీకా?
పిల్లలైన మీరందరూ ప్రేమకు రిటర్నులో అవ్యక్త బ్రహ్మాబాబా సమానంగా తప్పకుండా తయారవుతారు అని బాప్‌దాదాకు మీ అందరిపై నిశ్చయము ఉంది. తయారవుతారు కదా! బాప్‌దాదా వదిలిపెట్టరు! ప్రేమ ఉంది కదా! ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారి తోడును వదిలిపెట్టరు. మరి బ్రహ్మాబాబాకు మీ అందరిపై చాలా ప్రేమ ఉంది. నా పిల్లలు ఎప్పుడు వస్తారు అని ఎదురుచూస్తూ ఉంటారు! కనుక సమానులుగా అయితే అవుతారు కదా!
బ్రహ్మాబాబా యొక్క ఒక ఆత్మిక సంభాషణను వినిపిస్తాము. బ్రహ్మాబాబా శివబాబాతో ఇలా అంటారు - మీరు పిల్లలచేత డేట్‌ను ఫిక్స్ చేయించండి, నేను ఎప్పటివరకు ఎదురుచూడను? ఈ డేట్‌ను ఫిక్స్ చేయించండి. అప్పుడు శివబాబా ఏమి అంటారు? నవ్వుతారు. అయినా కూడా బాప్‌దాదా అంటారు - పిల్లలే డేట్ ఫిక్స్ చేస్తారు, బాప్‌దాదా చెయ్యరు. కనుక బ్రహ్మాబాబా చాలా గుర్తు చేస్తున్నారు. మరి డేట్‌ను ఫిక్స్ చేస్తారా?
కొత్త సంవత్సరంలో సమానంగా అయ్యే ఈ దృఢ సంకల్పాన్ని చెయ్యండి. మేము ఫరిశ్తాగా అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ఇప్పుడు పాత విషయాలను సమాప్తము చెయ్యండి. మీ అనాది మరియు ఆది సంస్కారాలను ఇమర్జ్ చేసుకోండి. నడుస్తూ-తిరుగుతూ నేను బాబా సమానమైన ఫరిశ్తాను, నా పాత సంస్కారాలతో, పాత విషయాలతో నాకు ఎటువంటి సంబంధము లేదు అన్న ఈ విషయాలను స్మృతిలో పెట్టుకోండి. అర్థమైందా. పరివర్తన యొక్క ఈ సంకల్పానికి నీరు పోస్తూ ఉండండి. ఏ విధంగానైతే విత్తనానికి నీరు కూడా కావాలి, ఎండ కూడా కావాలి, అప్పుడే ఫలాలు వస్తాయి. కనుక ఈ సంకల్పానికి, బీజానికి స్మృతి అనే నీటిని మరియు ఎండను ఇస్తూ ఉండండి. పదే-పదే రివైజ్ చేసుకోండి - నేను బాప్‌దాదాతో చేసిన ప్రమాణము ఏమిటి! అచ్ఛా! ఈరోజు ఏ ఏ గ్రూపులు ఉన్నాయి? జ్యూరిస్ట్ మరియు కల్చరల్)
జ్యూరిస్టులతో:- మీలో మీరు మీటింగ్ చేసుకున్నారు. అచ్ఛా, ఏ కొత్త ప్లాన్ తయారుచేసారు? వారసులను ఎప్పుడు తయారుచేస్తారు, దానికి తేదీ నిర్ణయించారా? ఇది మంచి విషయం. వారసులను కూడా తయారుచేస్తారు, మైక్‌లను కూడా తీసుకువస్తారు. కానీ మైక్‌లు కొద్దికొద్దిగా వచ్చారు. విదేశీయులు తీసుకువచ్చారు. ఇప్పుడు ఇంకా సమీపంగా వస్తారు. ఎవరైతే తీసుకువచ్చారో, వారు సమీపంగా ఉన్నారా? ప్రసంగం చేసేలా సిద్ధంగా ఉన్నారా? మీ బదులుగా వారు పరిచయం ఇవ్వగలిగేలా సిద్ధంగా ఉన్నారా? (అవకాశం ఉంది.) అయితే భారత్వారు వారికంటే ముందుకు వెళ్లండి. వారైతే తీసుకువచ్చారు. సెకండ్ నంబర్ మైక్ అయినా, ఫస్ట్ అయినా. అయితే భారతవారు కొంచెం కూడా అవకాశం వదలవద్దు. ఇంకా తీసుకురండి. ఇది రేస్, రీస్ కాదు. రీస్ చేయకండి, రేస్ చేయండి. విదేశీయులు ధైర్యము అయితే ఉంచారు. వారిలో కొన్ని కొన్ని క్వాలిటీలు బాగున్నాయి, అవి ముందుకు వెళ్లగలవు. భారతదేశం యొక్క టీచర్లు ఏమి చేస్తారు? ఎప్పుడు మైక్‌లను తీసుకువస్తారు? భారతదేశం యొక్క టీచర్లు వారసులను లేదా మైక్‌లను తీసుకువచ్చారా? పాండవులు తీసుకువచ్చారా? లోపల సిద్ధం చేస్తున్నారా? స్టేజ్‌పైకి రావాలి కదా! ప్రజలపై ప్రభావం పడే వ్యక్తినే మైక్ అని అంటాము. ఎలాగైతే మీరు ప్రసంగం చేస్తారు, కొంత ప్రభావం అయితే పడుతుంది కదా! పూర్తిగా పడకపోయినా, కొంత అయితే పడుతుంది. అలాగే అలాంటి మైక్‌లను సిద్ధం చేయండి. సమయం అనుసారంగా మీరు మైట్ అవుతారు, వారు మైక్ అవుతారు అని బాప్‌దాదా చెప్పారు. చివరి వరకు మీరే ప్రసంగాలు చేస్తూ ఉంటారా? మీ పరిచయాన్ని మీరే ఇస్తూ ఉంటారా? కనుక వారిని ముందుకు తీసుకురండి. ఒకవేళ సిద్ధంగా ఉంటే, బాప్‌దాదా ముందు కాదు, దాదీల ముందుకు తీసుకురండి. అచ్ఛా.
అయితే బాప్‌దాదా జ్యూరిస్ట్ మీటింగ్ వారితో అంటున్నారు, మీటింగ్‌లో ఎలా ప్లాన్ తయారుచేసారో, ప్లాన్ అయితే అందరూ బాగానే తయారుచేసారు. అభినందనలు. ఇప్పుడు ఎలాగైతే ప్రోగ్రామ్ యొక్క తేదీని నిర్ణయించి చెప్పారు, రెండు ప్రోగ్రామ్‌లు నిర్ణయించేసారు. (ఒకటి జైపూర్‌లో జ్యూరిస్ట్ కాన్ఫరెన్స్ పెట్టారు, రెండవది అబూలో.) మంచి పని చేసారు. రాజస్థాన్‌ను ముందుకు తీసుకువచ్చారు. అలాగే, వారసులు లేదా మైక్‌ల యొక్క తేదీ నిర్ణయమైపోయేలా అలాంటి మీటింగ్‌లు చేయండి. న్యాయవాదులు మరియు న్యాయమూర్తులు కేసులో తీర్పు ఇస్తారు కదా! అలాగే దీనికి కూడా తీర్పు ఇవ్వండి. జ్యూరిస్ట్ మీటింగ్ వారి పేర్లయితే నోట్ అయ్యి ఉన్నాయి కదా. మరి బాప్‌దాదా వారికి ప్రత్యేకంగా లడ్డూ తినిపిస్తారు. చాలా శక్తివర్ధకమైన లడ్డూను దాదీ తయారు చేయిస్తారు. (ఈరోజు టీచర్లకు తినిపించాము) అయితే టీచర్లు మైక్‌ను తీసుకువస్తారు కదా. లడ్డూ తిన్నారు కనుక మైక్‌లు వస్తారు కదా.
కల్చరల్ వింగ్ వారు చేతులు ఎత్తండి:- మీరు ఏమి ప్లాన్ తయారుచేసారు? ఏమి మీటింగ్ చేసారు? మీరు కల్చరల్ది తయారుచేసారా లేక కల్చర్ది తయారుచేసారా? (మీటింగ్ చేయడం ఇంకా మిగిలి ఉంది.) అయితే లడ్డూ కూడా ఇంకా మిగిలి ఉంది. ఏ వర్గం అయితే ముందుగా వారసులను లేదా మైక్‌లను తీసుకువస్తుందో, వారికి 8-8 లడ్డూలు తినిపిస్తాము. భండారం అయితే నిండుగా ఉంది. (మీరు చెబితే 16 కూడా తినిపిస్తాము.) పెద్ద దాదీ కాబట్టి పెద్ద మనసు ఉంది. చాలా బాగుంది. ఈ వర్గం యొక్క ప్రోగ్రామ్‌లు కూడా సేవలో బాగా సమీపంగా తీసుకువస్తున్నాయి. మరియు అన్ని వర్గాలు తమ తమ సేవలో బాగా ముందుకు వెళ్తున్నాయి. ప్రతి వర్గానికి అవకాశం ఇచ్చారు కదా, అది కూడా చాలా బాగుంది. ఎవరు ఎవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది కనిపిస్తుంది. వచ్చేవారు తక్కువమందే అయి ఉండవచ్చు. కానీ ఈ వర్గం ఉంది, ఏదో చేస్తున్నారుఅనేది అయితే తెలుస్తుంది.
అచ్ఛా, ఈరోజు ఏమి ప్రోగ్రామ్ ఉంది? అంటే 12 గంటలు కొట్టేవరకు ఉంచుతారా, సంగమాన్ని పూర్తి చేస్తారా! ఈ 12 గంటలు అవ్వనివ్వండి, కానీ సంగమం యొక్క అంతిమమును కూడా త్వరగా తీసుకురండి.
డబల్ విదేశీయులు:- ఎలాగైతే భారతదేశం ప్రతి టర్న్‌లో వస్తుందో, అలాగే విదేశీయులు కూడా తక్కువవారు కాదు.
ప్రతి టర్న్‌లో తమ హక్కును తీసుకుంటారు. చాలా బాగుంది. విదేశీయులు ఈ జన్మలో విదేశీయులు కానీ అనేక జన్మల నుండి బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు అని బాప్‌దాదా ఎప్పుడూ అంటారు. ఒకవేళ మీరు విదేశీయులుగా కాకపోతే, విదేశాలలోని వివిధ దేశాల సేవ ఎలా జరిగేది! ఒకవేళ మీరు విదేశీయుల రూపంలో రాకపోతే, బాప్‌దాదా అన్ని దేశాల భాషలకు ఇక్కడ క్లాస్‌లు పెట్టవలసి వచ్చేది, సిద్ధం చేయవలసి వచ్చేది. కాబట్టి మీరు వివిధ దేశాలకు వెళ్లారు అంటే, సేవ కోసం వెళ్లారు. అర్థమైందా? మూలంగా మీరు బ్రాహ్మణ ఆత్మలు, విదేశీ ఆత్మలు కాదు. విశ్వంలోని వివిధ దేశాల సేవ కోసం వెళ్లారు. చూడండి, భారతదేశంలో కూడా ప్రతి భాషకు చెందిన పిల్లలు వచ్చారు మరియు సేవ చేస్తున్నారు. లేకపోతే మొదట సింధ్ యొక్క ఒకే గ్రూప్ ఉండేది. తర్వాత నెమ్మదిగా భారతదేశానికి చెందిన, విదేశాలకు చెందిన వివిధ గ్రూపులు వస్తూ వచ్చాయి మరియు పెరుగుతూ వచ్చాయి. ఇది కూడా డ్రామాలో రూపొందించబడిన ఆటే. నిజానికి, ఆరంభంలో వేర్లలో కొద్దిమందే ఉంటారు. తర్వాత నెమ్మదిగా కాండం మరియు కొమ్మలు వస్తాయి. ఆ పునాది ఏర్పడింది - నిమిత్తంగా సింధ్ దేశంలో. తర్వాత నెమ్మదిగా వృక్షం పెరుగుతూ వచ్చింది. భాషలు మరియు దేశాలు కొమ్మలు. మీరు కొమ్మలలో లేరు. మీరు అయితే బాప్‌దాదాతో ఉన్నారు.
ఢిల్లీ గ్రూప్ సేవకు వచ్చింది:- ఢిల్లీ వారు చేతులు ఎత్తండి. సేవకు సేవ కూడా చేసారు మరియు వెరైటా మేవా కూడా తిన్నారు కదా! సేవ యొక్క మేవా తప్పకుండా లభిస్తుంది.
ఎవరైతే సేవలోకి వస్తారో, వారికి అన్నింటికంటే మంచి అవకాశం ఏమి లభిస్తుందో తెలుసా? ఇంత పెద్ద కుటుంబానికి సేవ చేస్తారు కాబట్టి, మొదట బాప్‌దాదా యొక్క ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి. కానీ ఇంత పెద్ద కుటుంబంలోని ఆత్మలందరి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలు చాలా పనికి వస్తాయి. ఈ సమయంలో అయితే సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఆశీర్వాదాల ఖజానా సమయానికి చాలా బలం ఇస్తుంది. అచ్ఛా, మీరు కొత్త సంవత్సరంలో చాలా కార్డులు పంపారు కదా. బాప్‌దాదా చూసారు. కార్డులు ఉన్నాయి, ఉత్తరాలు కూడా ఉన్నాయి. అయితే కొత్త సంవత్సరంలో కేవలం కార్డు ఇచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అని మాత్రమే చెప్పకండి. కార్డుతో పాటు ప్రతి ఆత్మకు హృదయపూర్వకంగా గౌరవం ఇవ్వండి. గౌరవం యొక్క కార్డు ఇవ్వండి. ఒకరికొకరు కానుకగా చిన్న చిన్న వస్తువులు అయితే ఇస్తారు కదా! వాటిని కూడా ఇవ్వండి. కానీ వాటితో పాటు ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఎవరైనా ఇవ్వకపోయినా, మీరు తీసుకోండి. మీ వైబ్రేషన్స్ ద్వారా వారి దీవెన కాని దానిని కూడా ఆశీర్వాదంగా మార్చుకోండి. అయితే గౌరవం ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు ఇవ్వండి, ఆశీర్వాదాలు తీసుకోండి. ఇదే కొత్త సంవత్సరం యొక్క బహుమతి. శుభ భావన ద్వారా మీరు ఆశీర్వాదాలు తీసుకోండి. అచ్ఛా.
దేశ-విదేశాలలోని పిల్లలు సాకార రూపంలో కూడా కూర్చున్నారు. కానీ ఆకారీ రూపంలో కూడా మధుబన్‌లో హాజరై ఉన్నారు. అయితే ఇలా నాలుగు వైపుల నుండి హాజరైన పిల్లలందరికీ హజూర్ కూడా జీ హాజిర్ యొక్క ప్రియస్మృతులు ఇస్తున్నారు. మంచి ధైర్యముతో, శ్రమతో కొందరు మేల్కొని కూడా ఉన్నారు. కొందరు ఏ సమయంలో కూర్చుంటారు, మరికొందరు ఏ సమయంలో కూర్చుంటారు. అందుకే ప్రతి ఒక్క పిల్లవానికి పేరు సహితంగా పదమారెట్లు అభినందనలు కూడా ఉన్నాయి మరియు వీడ్కోలు మరియు శుభాకాంక్షల సంగమం యొక్క అభినందనలు కూడా ఉన్నాయి, గ్రీటింగ్స్ కూడా ఉన్నాయి. ఎవరైతే కార్డులు పంపారో, ప్రియస్మృతులు పంపారో, ఆ దేశ-విదేశాల పిల్లలందరికీ బాప్‌దాదా దిలారామ్ హృదయం నుండి తిరిగి ప్రియస్మృతులు ఇస్తున్నారు. ఎల్లప్పుడూ ముందుకు ఎగురుతూ ఉండండి.
(ఎవరైతే దేశ-విదేశాలలో ఇంటర్నెట్ ద్వారా మురళిని పంపుతున్నారో, వారిని బాప్‌దాదా ఎదురుగా పిలిచారు)
మీ ద్వారా ఎటు ఎటు చేరుతోందో, ఆ ఆత్మలందరి తరఫున మరియు బాప్‌దాదా తరఫున చాలా చాలా అభినందనలు, అభినందనలు. మీరు చేస్తున్నది చాలా మంచి పని. ఇంకా ఒక విషయం చేయాలి. చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు చేసిన ఈ కార్యానికి అభినందనలు ఇచ్చాము. ఇప్పుడు మంచి మంచి ఆత్మలను సిద్ధం చేయండి, వారు తక్కువ ఖర్చుతో నడిచే విధంగా ఉండాలి. చాలా ఖర్చు అవుతోంది అని బాప్‌దాదా వద్దకు రిజల్ట్ వచ్చింది. అందుకే ఎలాగైతే మీరు ఈ పురుషార్థం చేసి సఫలత పొందా, అలాగే ఇప్పుడు లక్ష్యం పెట్టుకోండి. బాప్‌దాదా ఉచితంగా చేయండి అని చెప్పడం లేదు. తక్కువ ఖర్చుతో నడిచే విధంగా ఉండాలి. అలా సహయోగులుగా అయ్యే వారిని సిద్ధం చేయండి. అలా చేయగలరా? అచ్ఛా, ఇప్పుడు చూస్తాము. ఈ పని అయితే ఆశీర్వాదాలు పొందే చాలా మంచి పని. అందరూ చాలా ఆశీర్వాదాలు ఇస్తారు. ఇప్పుడు కేవలం ఒకటి కలపండి - తక్కువ ఖర్చు. కొద్దికొద్దిగా ఖర్చు తగ్గిస్తూ ఉండండి. కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉండండి. బాప్‌దాదా వద్దకు ఈ రిపోర్ట్ రావాలి - తక్కువ ఖర్చుతో నడిచే విధంగా ఉంది అని. భారతదేశంలో చేయండి, విదేశాలలో చేయండి, ఎక్కడి నుండి అయినా చేయండి. కానీ ఈ లక్ష్యం ఉంచండి. లక్ష్యంతో అన్నీ జరుగుతాయి మరియు జరగాల్సిందే. ఈ సైన్స్ మీ అందరి కోసమే తయారైంది. చూడండి, స్థాపనకు 100 సంవత్సరాల ముందునుండే ఇవన్నీ నెమ్మదిగా వెలుగులోకి వచ్చాయి. అయితే ఎవరి కోసం వెలుగులోకి వచ్చాయి? సుఖం అయితే బ్రాహ్మణులకే లభించాలి కదా! చాలా బాగుంది. టోలీ పంచినప్పుడు మీరు తీసుకోండి. ఇప్పుడు టోలీ తినండి. తర్వాత తక్కువ ఖర్చుతో నడిచే విధంగా తయారైతే లడ్డూలు లభిస్తాయి. చాలా బాగుంది.
నలువైపులా ఉన్న మహానాత్మలకు, సదా పరివర్తన శక్తిని ప్రతి సమయము కార్యములో ఉపయోగించేవారికి, విశ్వ పరివర్తక ఆత్మలకు, సదా దృఢ నిశ్చయముతో ప్రత్యక్ష రూపాన్ని చూపించే బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా స్వరూప ఆత్మలకు, సదా ఒక్క బాబా తప్ప ఇంకెవ్వరూ లేరు అని బాబా సమానంగా అయ్యేవారికి, బాప్‌దాదా యొక్క ప్రేమకు రిటర్న్ ఇచ్చే మహావీరులైన ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
నలువైపులా ఉన్న పిల్లలకు కొత్త సంవత్సరమునకు, కొత్త యుగానికి, కొత్త జీవితానికి అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈ కొత్త సంవత్సరములో బ్రహ్మాబాబా ద్వారా ఉచ్చరించబడిన మహావాక్యాలను సదా గుర్తుంచుకోవాలి - నిరాకారి, నిరహంకారి, వాటితో పాటు నవ నిర్మాణధారి. సదా నిర్మానత మరియు నిర్మాణ కర్తవ్యము యొక్క బ్యాలెన్సు ఉంచుతూ ఎగురుతూ ఉండండి. ఈ సంవత్సరములో విశేషంగా స్వ పరివర్తన అన్న విశేషతను ఎదురుగా ఉంచుకుంటూ ఎగురుతూ మరియు ఎగిరింపజేస్తూ ఉండండి. సదా బ్రహ్మాబాబాను ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చేస్తూ ఉండండి. అందరికీ అభినందనలు, అభినందనలు, పదమాల రెట్ల అభినందనలు. అచ్ఛా!
1 జనవరి 2000 ప్రాతఃకాలం (రాత్రి 12 గంటల తర్వాత) బాప్‌దాదా పిల్లలందరికీ నూతన సంవత్సరం, నూతన శతాబ్దం యొక్క అభినందనలు ఇచ్చారు
అందరూ న్యూ ఇయర్ జరుపుకున్నారు. నాలుగు వైపుల పిల్లలందరికీ నూతన సంవత్సరం, నూతన యుగం, నూతన జీవితం యొక్క అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఈ నూతన సంవత్సరంలో బ్రహ్మా బాబా ద్వారా ఉచ్ఛరించబడ్డ మహావాక్యాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి - నిరాకారీ, నిరహంకారీ, దానితో పాటు నవ నిర్మాణధారి. ఎల్లప్పుడూ నిర్మానం మరియు నిర్మాణం చేసే కర్తవ్యం యొక్క బ్యాలెన్స్ ఉంచుకొని ఎగురుతూ ఉండండి. ఈ సంవత్సరంలో ప్రత్యేకంగా స్వ-పరివర్తన యొక్క విశేషతను ఎదురుగా ఉంచుకొని, మీరు ఎగురుతూ మరియు ఇతరులను కూడా ఎగిరిస్తూ ఉండండి. ఎల్లప్పుడూ ప్రతి అడుగులో బ్రహ్మా బాబాను ఫాలో ఫాదర్ చేస్తూ ఉండండి. అయితే అభినందనలు, అభినందనలు. పదమారెట్లు అభినందనలు.
(ఢిల్లీలో అకాడమీ నిర్మించడానికి భూమి తీసుకున్నారు. ఆ సమాచారాన్ని బాప్‌దాదాకు వినిపించారు)
మీ అందరికీ తెలుసు కదా, అనంతమైన సేవ యొక్క బహుమతి ఢిల్లీకి లభించింది. ఇందులో ఎల్లప్పుడూ అనంతమైన సేవ యొక్క ప్లాన్లు తయారవుతూ, నాలుగు వైపులా సందేశం చేరుతూ ఉంటుంది. ఇందులో అందరి సహయోగం ఉంది. ఎందుకంటే ఇది అందరి రాజధానిగా అవ్వబోతోంది. అయితే విత్తనం నాటితే ఫలం లభిస్తుంది. ఇప్పుడు విత్తనం నాటుతారు, అక్కడ భవిష్యత్తులో తప్పకుండా పదమారెట్లు రిటర్న్ లభిస్తుంది. అందుకే ప్లాన్ కూడా అలానే తయారుచేయండి, సిస్టమ్ కూడా అలానే తయారుచేయండి, అనంతమైనది అనే అనుభూతి కలగాలి. ఇది ఏదో చిన్న సెంటర్ అని కాదు. ఇది ఫలానా వారి సెంటర్, ఫలానా వారి సెంటర్ అని కాదు. ఇది అందరిదీ. అనంతమైన సిస్టమ్ ద్వారా అనంతమైన స్థాపన చేస్తూ ఉండండి. ఒక ఉదాహరణగా అవ్వండి. పేరు ఢిల్లీది. కానీ అందరూ ఇది మాదే అని భావించాలి. ఎలాగైతే బాప్‌దాదా మావారు అని అందరూ భావిస్తారో, దాదీలు మావారు అని అందరూ భావిస్తారో, అలాగే ఈ సేవ మా సేవ అని, ఈ అనంతమైన రూపంతో, నవీనత రూపంతో ఈ స్థానాన్ని నడిపించి చూపించండి. ఢిల్లీ వారికి ఈ అనంతమైన సేవ యొక్క కానుక లభించింది. దేశ-విదేశాల బీజము ద్వారా ఈ వరదానం లభించింది. అందుకే ప్రతి ఒక్కరూ ఇది అనంతమైన స్థానం అని భావించాలి. దీని ద్వారానే అనంతానికి సందేశం చేరుతుంది. చాలా బాగుంది. నూతన సంవత్సరంలో దీనిని ఫైనల్ చేసి మీ అందరికీ బహుమతి లభించింది. లభించింది కదా బహుమతి! (పేరు ఏమి పెట్టాలి?) ముందు అలంకరించండి. భవనం నిర్మించండి. తర్వాత పేరు వస్తుంది. కానీ ఎల్లప్పుడూ బాబా మరియు బాబా యొక్క అనంతమైన స్థానం. ఎల్లప్పుడూ మనసు, వాణి మరియు కర్మ ద్వారా, ఏ విధంగా సహయోగం ఇవ్వగలరో, అలా ఇస్తూ ఉండండి. ఒక ఉదాహరణగా ఉండాలి. నవీనత ఉండాలి. అందుకే మీలో మీరు సలహా చేసుకొని అలాంటి ప్లాన్ తయారుచేయండి. అచ్ఛా, అందరికీ గుడ్‌నైట్ కూడా అయింది, గుడ్‌మార్నింగ్ కూడా అయింది.
(శ్రీలంక ప్రభుత్వం సేవ కోసం 10 ఎకరాల భూమి ఇచ్చింది. గ్లోబల్ హౌస్ దగ్గర కూడా భూమి లభించింది)
మీరు వింటున్నారు కదా. అయితే ఇది ఢిల్లీకి లభించింది, లండన్‌కు లభించింది, శ్రీలంకకు లభించింది అని అనుకోకండి. లేదు. మీ అందరికీ లభించింది. ఇది మీ అందరిదీ. రాజస్థాన్‌కు కూడా లభించాలి. అయితే అందరికీ ఎన్ని స్థానాలు లభిస్తున్నాయి! అవి మీవే కదా! అయితే నూతన సంవత్సరంలో సేవ కోసం చాలా చాలా బహుమతులు లభించాయి. ఇప్పుడు అందరూ బాగా చప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఢిల్లీకి ఇంకా ఎక్కువ భూమి ఉచితంగా లభించేలా ప్రయత్నం చేయండి. అప్పుడు ఇంకా ఎక్కువ చప్పట్లు కొట్టండి. (అందరూ చాలా గట్టిగా చప్పట్లు కొట్టారు.) ఇలా చప్పట్లు కొడుతున్నారు అంటే, లభిస్తుంది అని నిరూపణ అయింది. అచ్ఛా, చప్పట్లు అయితే చాలా త్వరగా కొట్టారు. ఇప్పుడు ఒక సెకనులో ఫరిశ్తాగా అవ్వగలరా? అయితే ఇప్పుడు ఫరిశ్తాగా అయిపోండి. అచ్ఛా.
జోన్లవారీగా సేవాధారుల గ్రూప్‌తో:-
1- గుజరాత్:- నిర్విఘ్న గుజరాత్? టీచర్లు కూడా అందరూ ధైర్యము ఉన్నవారే. ఎప్పుడు పిలిచినా, అప్పుడు గుజరాత్ "హా జీ హాజిర్" అనే పాఠాన్ని చదువుతుంది. హా జీ, హా జీ అని చేసే వారికి అనేక జన్మల పాటు అందరూ హా జీ, హా జీ అని అంటారు. చాలా బాగుంది. చూడండి, మొదటి సేవ చేసే అవకాశం గుజరాత్‌కు లభించింది. దాదీల ఆజ్ఞ ఉంది - పిలవండి, హాజరు.
2- యూ.పి.:- సేవాధారులకు ఎన్ని లాభాలు ఉన్నాయి. బ్రాహ్మణుల సేవ చేస్తే మహా పుణ్యం అని సదా గాయనం ఉంది. భక్తి మార్గంలో 100 లేదా 200 మంది బ్రాహ్మణులకు సేవ చేస్తారు. కానీ మధుబన్‌లో ఎంతమంది బ్రాహ్మణులకు సేవ చేస్తారు! ప్రతి ఒక్క బ్రాహ్మణుని ఆశీర్వాదాలు సేవాధారులకు స్వతహాగానే లభిస్తాయి. చెప్పవలసిన అవసరం లేదు. కానీ జమా అయితే అయిపోతాయి. ఒకటి ఆశీర్వాదాల ఖాతా జమా అవుతుంది. రెండవది సేవ యొక్క పుణ్య ఖాతా జమా అవుతుంది. మూడవది బ్రాహ్మణుల సమీప సంబంధంలోకి వస్తారు. మరియు బాప్‌దాదాను కలిసే అదనపు టర్న్ లభిస్తుంది. అయితే సేవ యొక్క ఫలం ఎంత ఉంది! సేవాధారి అంటే జమా చేసుకునే వారు. అందుకే చాలా మంచి సేవ చేసారు. హృదయంతో సేవ చేసారు మరియు దిలారామ్ వద్దకు చేరిపోయింది. అయితే ఎవరైతే సేవాధారిగా వస్తారో, వారికి ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. భవిష్యత్తులో అయితే లభిస్తుంది. కానీ వర్తమాన సమయంలో కూడా జమా అవుతుంది.
3- బొంబాయి:- ఈ సేవ చేసే అవకాశం మంచిగా అనిపిస్తుందా? ఈ కారణంతో సేవ ద్వారా బ్రాహ్మణుల పరిచయం లభిస్తుంది. బ్రాహ్మణ కుటుంబం పరిచయం అయిపోతుంది మరియు బేహద్దులోకి వచ్చే అవకాశం లభిస్తుంది. సేవ యొక్క బలం కూడా తక్కువ కాదు. చూడండి, ఎవరైతే పాతవారు ఉన్నారో, ఎవరిని దాదీలు అని అంటారో, వీరిలో అదనపు బలం ఉంది. ఏ బలం ఉంది? సేవ యొక్క బలం. స్థాపనలో సేవ చేసారు. మీరు అందరూ ఇక్కడ కూర్చున్నారు. ఆది సమయంలో వీరి శ్రమ, సహనశక్తి, త్యాగ వృత్తి - వాటి ఫలితం మీరే. వీరికి బలం లభించింది, మీకు ఫలం లభించింది. అందరి చరిత్రలు విన్నారు కదా! ఏమి త్యాగం చేయలేదు! మీరైతే సిద్ధంగా ఉన్న ఆధారం మీదకు వచ్చారు. వెన్నను వీరు తీశారు, మీరు తినడానికి వచ్చారు. మంచిగా అనిపిస్తుంది కదా! ఆది పాండవులు కూడా ఉన్నారు. వారు కూడా త్యాగం చేసారు. ఇప్పుడు కూడా చూడండి, ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగినా, ఇప్పటికీ కూడా ఎవరైనా దాదీలు రావాలి అని అంటారు. అయితే దాదీలకు త్యాగం యొక్క భాగ్యం ఉంది కదా! త్యాగం యొక్క చరిత్రలు, కథలు అయితే చాలా ఉన్నాయి కదా! ఇప్పుడు కూడా సేవాధారులు నాలుగు వైపులా సేవ చేసే వారు చాలా మంది ఉన్నారు. వీరు ఆది వారు, మరియు మీరు ఇప్పుడు సేవాధారులు కూడా చాలా మంచివారు. ఎన్ని ఎన్ని సెంటర్లు తెరిచారు! బాప్‌దాదా ఒక్కొక్కరి మహిమను చెప్పడం ప్రారంభిస్తే, ఎన్ని రాత్రులు పడతాయో! మరియు ప్రతి ఒక్కరి మహిమ ఉంది. ప్రతి ఒక్కరి విశేషత ఉంది మరియు ఉంటుంది.
4- ఢిల్లీ:- సేవకు సేవ కూడా చేసారు మరియు వెరైటీ మేవా కూడా తిన్నారు కదా! సేవ యొక్క మేవా తప్పకుండా లభిస్తుంది. ఎవరైతే సేవలో వస్తారో, వారికి అన్నింటికంటే మంచి అవకాశం ఏమి లభిస్తుందో తెలుసా? ఇంత పెద్ద కుటుంబానికి సేవ చేస్తారు కాబట్టి, మొదట బాప్‌దాదా యొక్క ఆశీర్వాదాలు అయితే ఉన్నాయి. అలాగే ఇంత పెద్ద కుటుంబంలోని ఆత్మలందరి ఆశీర్వాదాలు కూడా లభిస్తాయి. ఈ ఆశీర్వాదాలు చాలా పనికి వస్తాయి. ఈ సమయంలో అయితే సాధారణంగా అనిపిస్తుంది. కానీ ఆశీర్వాదాల ఖజానా సమయానికి చాలా బలం ఇస్తుంది.
5- రాజస్థాన్:- చాలా మంచి సేవ చేసే అవకాశం రాజస్థాన్‌కు లభించింది. రాజస్థాన్ పేరు ఎలాగైతే రాజస్థాన్ ఉందో, అలాగే రాజస్థాన్ నుండి రాజుల క్వాలిటీ ఉన్నవారిని తయారుచేయండి. ప్రజలను కాదు, రాజ వంశానికి చెందిన రాజులను తయారుచేయండి. అప్పుడు పేరు ఎలాగైతే ఉందో, అలాగే సేవ యొక్క క్వాలిటీ కూడా వస్తుంది. దాగి ఉన్న రాజులు ఎవరైనా ఉన్నారా, లేదా ఇంకా మేఘాలలో ఉన్నారా? ఎవరైతే బిజినెస్మెన్ ఉన్నారో, వారి సేవపై ప్రత్యేక అటెన్షన్ ఇవ్వండి. ఈ మినిస్టర్లు మరియు పొలిటికల్ నాయకులు అయితే మారుతూనే ఉంటారు. కానీ బిజినెస్మెన్ బాబాతో కూడా బిజినెస్ చేయడంలో ముందుకు వెళ్లగలరు. బిజినెస్‌మెన్‌కు సేవ చేయడం ద్వారా వారి కుటుంబంలోని మాతలు కూడా సులభంగా రాగలరు. మాతలు ఒంటరిగా నడవలేరు. ఇంటి స్తంభం వస్తే, కుటుంబం దానంతట అదే నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. అందుకే రాజస్థాన్ రాజుల క్వాలిటీ ఉన్నవారిని తయారుచేయాలి. అలాంటివారు లేరు అని అనకండి. కొంచెం వెతకాలి. కానీ ఉన్నారు. వారి వెనుక కొంత సమయం ఇవ్వాలి. వారు బిజీగా ఉంటారు కదా! వారు దగ్గరికి వచ్చేలా ఏదైనా విధానం తయారుచేయాలి. మిగతా విషయాల్లో చాలా బాగుంది. సేవ చేసే అవకాశం తీసుకున్నారు. ప్రతి జోన్ తీసుకుంటుంది. ఇది చాలా మంచి విషయం. దగ్గరికి రావడానికి మరియు ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇది ఒక సాధనం. మీ అందరినీ అందరూ చూస్తారో లేదో, తెలుసుకుంటారో లేదో. కానీ ఎంత మంచి సేవ జరుగుతుందో, ఆశీర్వాదాలు అయితే స్వతహాగానే వస్తాయి. ఆ ఆశీర్వాదాలు చాలా త్వరగా చేరుతాయి. అవి హృదయం నుండి వచ్చే ఆశీర్వాదాలు కదా! అందుకే హృదయానికి చాలా త్వరగా చేరుతాయి. బాప్‌దాదా అయితే అంటారు, అందరికంటే సులభమైన పురుషార్థం ఏమిటంటే, ఆశీర్వాదాలు ఇవ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి. ఆశీర్వాదాల ద్వారా ఖాతా నిండిపోతే, నిండిన ఖాతాలో మాయ కూడా విఘ్నం కలిగించదు. జమా యొక్క బలం లభిస్తుంది. రాజీగా ఉండండి మరియు అందరినీ రాజీ చేయండి. ప్రతి ఒక్కరి స్వభావం యొక్క రహస్యాన్ని తెలుసుకొని వారిని రాజీ చేయండి. ఇతను ఎప్పుడూ కోపంగానే ఉంటాడు అని అనకండి. మీరు స్వయంగా ఆ రహస్యాన్ని తెలుసుకోండి. అతని నాడిని తెలుసుకోండి. తర్వాత ఆశీర్వాదాల మందు ఇవ్వండి. అప్పుడు సులభమైపోతుంది. అందుకే సులభమైన పురుషార్థం చేయండి. ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి. తీసుకోవాలనే సంకల్పం చేయకండి. ఇస్తూ ఉండండి. అప్పుడు లభిస్తూ ఉంటుంది. ఇవ్వడమే తీసుకోవడం. దాత యొక్క పిల్లలు కదా! ఎవరైనా ఇస్తే తీసుకుంటాను అని కాదు. దాతగా అయి ఇస్తూ ఉండండి. అప్పుడు దానంతట అదే లభిస్తుంది. అచ్ఛా.
6- మహారాష్ట్ర:- మహారాష్ట్రలో సేవ యొక్క వృద్ధి బాగా జరుగుతోంది. అయితే మహారాష్ట్ర 9 లక్షలను త్వరగా తయారుచేయగలదు. 9 లక్షలను తయారుచేయడంలో మొదటి నంబరు తీసుకుంటారు కదా! చాలా బాగుంది. మీ అందరికీ కూడా సంతోషం కలుగుతుంది కదా! మీ కుటుంబంలో వృద్ధి జరిగితే సంతోషపడతారు కదా! అందరూ కూడా త్వరత్వరగా వృద్ధి జరగాలి అని కోరుకుంటారు. అయితే మహారాష్ట్ర వృద్ధి చేస్తోంది. అలాగే అన్ని జోన్లు కూడా ఇలాగే వృద్ధి చేసి, త్వరత్వరగా సంపన్నంగా అయి, సంపూర్ణంగా అయి బాబాతో కలిసి వెళ్లగలవు. కలిసి వెళ్లాలి. దీనిని మర్చిపోవద్దు. ప్రేమతో రాకపోతే, బలవంతంగానైనా కూడా తీసుకువెళ్తాను అని బాప్‌దాదా ముందు కూడా చెప్పారు. కలిసి రాకపోతే, వెనుక వెనుక కూడా తీసుకువెళ్తాము. కానీ అందులో ఆనందం ఉండదు. అచ్ఛా.
7- పంజాబ్:- సేవ చేసే ఈ అవకాశం అనంతమైన కార్యాన్ని నిర్వహించడం నేర్పిస్తుంది. సత్యయుగంలో రాజధానిని సంభాళిస్తారు కదా! అయితే నిర్వహించే అభ్యాసం ఇక్కడే చేయాలి కదా! బ్రాహ్మణులను సేవ ద్వారా సంతృప్తిపరచడానికి మరియు సంతృప్తి ద్వారా ఆశీర్వాదాలు జమా చేసుకోవడానికి ప్రతి జోన్‌కు ఈ మంచి అవకాశం లభిస్తుంది. అయితే పంజాబ్ వారు అనుభవం చేసారా? సంభాళించే అనుభవం వస్తూ ఉంది కదా! బేహద్దును సంభాళించడము. సెంటర్లో అయితే హద్దు మాత్రమే ఉంటుంది కదా! అనంతమైన రాజ్యాన్ని సంభాళించాలి. దాని సంస్కారాలు నిండుతూ ఉంటాయి. సేవతో పాటు రాజ్యాన్ని నడిపించే ట్రైనింగ్ కూడా లభిస్తూ ఉంటుంది. దగ్గరకు కూడా వస్తారు. సేవ ద్వారా సమీపత స్వతహాగానే వస్తుంది. అందుకే చాలా మంచి పని చేసారు. మరియు ఎల్లప్పుడూ ఇంకా మంచివారిగా అవ్వాల్సిందే. అచ్ఛా!
*** ఓంశాంతి ***
