‘‘సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకుని దానిని పెంచుకోండి మరియు ప్రయోగములోకి తీసుకురండి’’
ఈరోజు ఉన్నతోన్నతులైన బాబా నలువైపుల ఉన్న తమ శ్రేష్ఠమైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు ఎందుకంటే మొత్తం విశ్వములోని ఆత్మలందరికంటే పిల్లలైన మీరు శ్రేష్ఠమైనవారు అనగా హైయెస్ట్ (అతి ఉన్నతమైనవారు). ప్రపంచములోనే హైయెస్ట్ అని ప్రపంచములోనివారు అంటారు మరియు అది కూడా ఒక్క జన్మ కొరకు కానీ పిల్లలైన మీరు మొత్తం కల్పములోనే హైయెస్ట్ మరియు శ్రేష్ఠమైనవారు. మొత్తము కల్పమంతటిలో మీరు శ్రేష్ఠంగా ఉంటారు. తెలుసు కదా? మీ అనాది కాలాన్ని చూడండి, అనాది కాలములో కూడా ఆత్మలైన మీరందరూ బాబాకు సమీపంగా ఉండేవారు. చూస్తున్నారు కదా, అనాది రూపములో బాబాతోపాటు సమీపంగా ఉండే శ్రేష్ఠ ఆత్మలు మీరు. ఉండడము అందరూ ఉంటారు కానీ మీ స్థానము చాలా సమీపంగా ఉంటుంది. కనుక అనాది రూపములో కూడా ఉన్నతోన్నతమైనవారు. తర్వాత ఆది కాలములోకి రండి, ఆది కాలములో పిల్లలందరూ దైవీ పదవితో దేవతల రూపములో ఉంటారు. మీ దైవీ స్వరూపము గుర్తుందా? ఆది కాలములో సర్వ ప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. తనువు-మనసు-ధనము మరియు జనము, ఈ నాలుగు స్వరూపాలలోనూ శ్రేష్ఠమైనవారు, సదా సంపన్నులు, సర్వ ప్రాప్తి స్వరూపులు. ఇటువంటి దైవీ పదవి మరెవ్వరికీ ప్రాప్తించదు. ధర్మాత్ములైనా లేక మహాత్ములైనా కానీ ఈ విధంగా సర్వ ప్రాప్తులలో శ్రేష్ఠంగా ఉంటూ అప్రాప్తి యొక్క నామ-రూపాలు లేకుండా ఉండడము అంటే ఇలా ఎవ్వరూ అనుభవము చేయలేరు. ఆ తర్వత మధ్యకాలములోకి రండి, మధ్యకాలములో కూడా ఆత్మలైన మీరు పూజ్యులుగా అవుతారు. మీ జడచిత్రాలు పూజింపబడతాయి. మరే ఇతర ఆత్మలకూ ఇలా విధి పూర్వకంగా పూజ జరగదు. పూజ్యాత్మలకు ఏ విధంగా విధిపూర్వకంగా పూజ జరుగుతుందో, ఆలోచించండి, ఇలా విధిపూర్వకంగా మరెవ్వరికైనా పూజ జరుగుతుందా! ప్రతి కర్మకూ పూజ జరుగుతుంది ఎందుకంటే కర్మయోగులుగా అవుతారు. కనుక పూజ కూడా ప్రతి కర్మకూ జరుగుతుంది. ధర్మాత్మల లేక మహానాత్మల చిత్రాలను మీతోపాటు మందిరాలలో పెడతారు కానీ వారికి విధిపూర్వకమైన పూజ జరగదు. కనుక మధ్యకాలములో కూడా మీరు హైయెస్ట్ అనగా శ్రేష్ఠమైనవారు. ఆ తర్వాత వర్తమాన అంతిమకాలములోకి రండి, అంతిమకాలములో కూడా ఇప్పుడు సంగమయుగములో శ్రేష్ఠ ఆత్మలు. ఏ శ్రేష్ఠత ఉంది? స్వయం బాప్‌దాదా, పరమాత్ముని ఆత్మ మరియు ఆది ఆత్మ అనగా బాప్‌దాదా, ఇరువురి ద్వారా పాలనను కూడా తీసుకుంటారు, చదువును కూడా చదువుకుంటారు, అలాగే సద్గురువు ద్వారా శ్రీమతాన్ని తీసుకునే అధికారులుగా అవుతారు. కనుక అనాదికాలము, ఆదికాలము, మధ్యకాలము మరియు ఇప్పుడు అంతిమకాలములో కూడా హైయెస్ట్, శ్రేష్ఠమైనవారు. ఇంతటి నషా ఉంటుందా?
ఈ స్మృతిని ఇమర్జ్ చేసుకోండి అని బాప్‌దాదా అంటారు. మనసులో, బుద్ధిలో ఈ ప్రాప్తిని రిపీట్ చేసుకోండి. స్మృతిని ఎంతగా ఇమర్జ్ చేసి ఉంచుకుంటారో అంతగా ఆ స్మృతితో ఆత్మిక నషా కలుగుతుంది. సంతోషం కలుగుతుంది, శక్తిశాలిగా అవుతారు. ఇంతటి హైయెస్ట్ ఆత్మలుగా అయ్యారు. మేమే హైయెస్ట్‌గా, శ్రేష్ఠంగా ఇంతకుముందు కూడా అయ్యాము, ఇప్పుడు కూడా అయ్యాము మరియు సదా అలా అవుతూ ఉంటాము అన్న ఈ నిశ్చయము పక్కాగా ఉందా? నషా ఉందా? పక్కా నిశ్చయమున్నట్లయితే చేతులెత్తండి. టీచర్లు కూడా చేతులెత్తారు.
మాతలైతే సదా సంతోషమనే ఊయలలో ఊగుతారు, ఊగుతుంటారు కదా! మాతలకు చాలా నషా ఉంటుంది, ఏ నషా ఉంటుంది? మా కోసం బాబా వచ్చారు. నషా ఉంది కదా! ద్వాపరము నుండి అందరూ మాతలను కింద పడేసారు, అందుకని బాబాకు మాతలపై చాలా ప్రేమ ఉంది మరియు ముఖ్యంగా మాతల కోసం బాబా వచ్చారు. సంతోషపడుతున్నారు, కానీ సదా సంతోషంగా ఉండండి. ఇప్పుడైతే చేతులెత్తుతున్నారు కానీ ట్రైన్లో వెళ్ళిన తర్వాత కాస్త కాస్త నషా తగ్గుతూ ఉండకూడదు, సదా ఏకరసమైన, అవినాశీ నషా ఉండాలి. అప్పుడప్పుడు నషా ఉండటము కాదు, సదాకాలము ఉండే నషా సదాకాలమూ సంతోషాన్ని ఇస్తుంది. మాతలైన మీ ముఖం సదా ఎలా ఉండాలంటే దూరము నుండే మీ ముఖము ఆత్మిక గులాబీలా కనిపించాలి ఎందుకంటే ఈ విశ్వ విద్యాలయములో అందరికీ మంచిగా అనిపించే విషయం ఏమిటంటే, అందరికీ కనిపించే విశేషత ఏమిటంటే - మాతలు ఆత్మిక గులాబీల వలె సదా వికసించిన పుష్పాలలా ఉంటారు మరియు మాతలే బాధ్యతను చేపట్టి, మాతలు ఇంత పెద్ద కార్యాన్ని చేస్తున్నారు అనే విశేషత కనిపిస్తుంది. మహామండలేశ్వరులైనా గానీ వారు కూడా ఇక్కడ మాతలే నిమిత్తమయ్యారు మరియు ఇంతటి శ్రేష్ఠ కార్యాన్ని సహజంగా నడిపిస్తున్నారు అని అనుకుంటారు. మాతల గురించి ఒక సామెత ఉంది, అది నిజం కాదు, ఆ సామెత ఏమిటంటే - ఇద్దరు మాతలు కలిసి ఏదైనా కార్యం చెయ్యాలన్నా అది చాలా కష్టము. కానీ ఇక్కడ ఎవరు నిమిత్తులు? మాతలే కదా! ఎప్పుడైనా ఎవరైనా కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఏమి అడుగుతారు? మాతలు నడిపిస్తున్నారు కదా, వారు పరస్పరంలో కొట్లాడుకోరా? గొడవపడరా? అని అడుగుతారు. కానీ వీరు సాధారణ మాతలు కారు, వీరు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు, మాతలు, పరమాత్మ వరదానము వీరిని నడిపిస్తూ ఉంది అన్నది వారికేం తెలుసు! మాతలకేనా గౌరవం, మాకేమీ లేదా అని సోదరులు (పాండవులు) అనుకోకండి. పంచ పాండవులు అని మీ గురించి కూడా మహిమ ఉంది కదా! శక్తులతోపాటు 7 శీతలతలను మరియు వారితోపాటు ఒక పాండవుడిని కూడా చూపిస్తారు. పాండవులు లేకుండా మాతలు నడిపించలేరు, మాతలు లేకుండా పాండవులు నడిపించలేరు. రెండు భుజాలూ కావాలి, కానీ మాతలను చాలా కిందపడేసారు కదా, అందుకని మాతల గురించి ప్రపంచములోనివారు ఏదైతే అసంభవము అని అనుకున్నారో, దానిని బాబా సంభవము చేసి చూపిస్తున్నారు. మాతలను చూసి మీరు సంతోషపడుతున్నారు కదా? లేదా? సంతోషంగా ఉన్నారు కదా! ఒకవేళ మాతలను బాబా నిమిత్తంగా చెయ్యకపోతే ఇది కొత్త జ్ఞానం, కొత్త సిస్టమ్ అయిన కారణంగా పాండవులను చూసి చాలా హంగామా జరిగుండేది. మాతలు ఢాలు వంటివారు ఎందుకంటే కొత్త జ్ఞానం కదా! ఇవి కొత్త విషయాలు. కానీ అక్కయ్యలతోపాటు అన్నయ్యలు సదా తోడుగా ఉంటారు. పాండవులు తమ కార్యంలో ముందు ఉన్నారు మరియు అక్కయ్యలు తమ కార్యంలో ముందు ఉన్నారు. ఇరువురి సలహా ద్వారా ప్రతి కార్యమూ నిర్విఘ్నంగా జరుగుతూ ఉంది.
బాప్‌దాదా ప్రతిరోజూ పిల్లల యొక్క రకరకాల కార్యాలను చూస్తుంటారు. కొత్త-కొత్త ప్లాన్లు తయారవుతూనే ఉంటాయి. సమయము గురించి అందరికీ గుర్తుంది. గుర్తుందా? 99 యొక్క ఆలోచన కూడా పూర్తయిపోయింది కదా! ఏం ఆలోచించేవారు, 99 వచ్చింది, 99 వచ్చింది అని ఆలోచించేవారు కదా. కానీ మీ అందరి కొరకు సేవ చేసే సంవత్సరము, నిర్విఘ్నంగా ఉండే సంవత్సరము లభించింది. చూడండి, 99లోనే మౌన భట్టీలు చేస్తున్నారు కదా! ప్రపంచము గాభరా పడుతుంది మరియు మీరు, వాళ్ళు ఎంతగా భయపడుతున్నారో అంతగానే మీరందరూ స్మృతి యొక్క లోతులలోకి వెళ్తున్నారు. మనసు యొక్క మౌనమైతే ఉండనే ఉంది, జ్ఞాన సాగరుని లోతులలోకి వెళ్ళటము మరియు కొత్త-కొత్త అనుభవాలనే రత్నాలను తీసుకురావటము. బాప్‌దాదా ఇంతకుముందు కూడా సూచనను ఇచ్చారు - అన్నింటికన్నా పెద్ద ఖజానా, వర్తమానమును మరియు భవిష్యత్తును తయారుచేసే పెద్ద ఖజానా, శ్రేష్ఠ సంకల్పాల ఖజానా. సంకల్పశక్తి చాలా పెద్ద శక్తి, అది పిల్లలైన మీ వద్ద ఉంది - అదే శ్రేష్ఠ సంకల్పాల శక్తి. సంకల్పాలైతే అందరి దగ్గరా ఉంటాయి కానీ శ్రేష్ఠ శక్తి, శుభ భావన శుభ కామనలతో కూడిన సంకల్ప శక్తి, మనసు-బుద్ధిని ఏకాగ్రము చేసే శక్తి - అది మీ వద్ద మాత్రమే ఉంది. మరియు ఎంతగా ముందుకు వెళ్తూ ఉంటారో, అంతగా ఈ సంకల్ప శక్తిని జమ చేసుకుంటూ ఉంటారు, వ్యర్థంగా పోగొట్టుకోరు. వ్యర్థంగా పోగొట్టుకునేందుకు ముఖ్య కారణము వ్యర్థ సంకల్పాలు. ఎక్కువమంది పిల్లలలో రోజంతటిలో ఇప్పటికీ వ్యర్థం ఉంది అన్నదానిని బాప్‌దాదా చూసారు. ఏ విధంగా స్థూల ధనాన్ని పొదుపుగా ఉపయోగించేవారు సదా సంపన్నంగా ఉంటారు మరియు వ్యర్థంగా పోగొట్టుకునేవారు ఎక్కడో అక్కడ మోసపోతారు, అలా శ్రేష్ఠ శుద్ధ సంకల్పాలలో ఎంతటి శక్తి ఉందంటే మీ క్యాచింగ్ పవర్, వైబ్రేషన్లను క్యాచ్ చేసే పవర్ చాలా పెరగగలదు. ఏ విధంగానైతే ఈ సైన్స్ సాధనాలు – వైర్లెస్, టెలిఫోన్... ఇవి పని చేస్తాయో, అలా ఈ శుద్ధ సంకల్పాల ఖజానా పని చేస్తుంది. లండన్‌లో ఉన్న ఏ ఆత్మ యొక్క వైబ్రేషన్లు అయినా మీకు ఎంత స్పష్టంగా అందుతాయంటే ఈ వైర్లెస్, టెలిఫోన్, టి.వి... ఇలా ఏవైతే సాధనాలు ఉన్నాయో... ఎన్ని సాధనాలు వెలువడ్డాయి, వాటికంటే కూడా స్పష్టంగా మీరు క్యాచ్ చేయగలరు, మీ క్యాచింగ్ పవర్ ఏకాగ్రతా శక్తితో పెరుగుతుంది. ఈ ఆధారాలైతే అంతమయ్యేదే ఉంది. ఈ అన్ని సాధనాలూ ఏ ఆధారంతో నడుస్తున్నాయి? లైట్ (కరెంట్) ఆధారంతో. సుఖ సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువలో ఎక్కువ లైట్ ఆధారంతోనే ఉన్నాయి. మరి అటువంటప్పుడు మీ ఆధ్యాత్మిక లైట్, ఆత్మ లైట్ ఈ కార్యము చెయ్యలేవా! దగ్గరవైనా, దూరానివైనా ఏవి కావాలనుకుంటే ఆ వైబ్రేషన్లను క్యాచ్ చేయగలరు. ఇప్పుడు ఏమిటంటే, ఏకాగ్రతా శక్తితో మనస్సు, బుద్ధి రెండూ ఏకాగ్రమవ్వాలి, అప్పుడు క్యాచింగ్ పవర్ ఉంటుంది. చాలా అనుభవం చేస్తారు. నిస్వార్థంగా, స్వచ్ఛంగా, స్పష్టంగా సంకల్పం చెయ్యగానే అది చాలా త్వరగా అనుభవం చేయిస్తుంది. సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్స్ తల వంచుతుంది. సైన్స్ లో కూడా ఏదో లోటు ఉంది, దానిని నింపాలి అని ఇప్పుడు కూడా భావిస్తూ ఉంటారు, అందుకే బాప్‌దాదా మళ్ళీ అండర్లైన్ చేయిస్తున్నారు - అంతిమ స్థితి, అంతిమ సేవ - ఈ సంకల్ప శక్తి చాలా వేగంతో సేవ చేయిస్తుంది, అందుకే సంకల్ప శక్తిపై ఇంకా ఎక్కువ అటెన్షన్ పెట్టండి. పొదుపు చెయ్యండి, జమ చెయ్యండి. అది చాలా ఉపయోగపడుతుంది. ఈ సంకల్ప శక్తి ద్వారానే ప్రయోగులుగా అవుతారు. సైన్స్‌కు ఎందుకని మహత్వము ఉంది? ప్రయోగములోకి వస్తుంది కనుకనే ఈ సైన్స్ చాలా బాగా పని చేస్తుంది అని భావిస్తారు. అలాగే సైలెన్స్ శక్తిని ప్రయోగించేందుకు ఏకాగ్రతా శక్తి కావాలి మరియు ఏకాగ్రతకు ముఖ్య ఆధారము - మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్, దీని ద్వారా మనోబలము పెరుగుతుంది. మనోబలానికి చాలా ఎక్కువ మహిమ ఉంది, మంత్ర-తంత్రాలు చేసేవారు కూడా మనోబలం ద్వారా అల్పకాలికమైన చమత్కారాలను చూపిస్తారు. కానీ మీరైతే విధిపూర్వకంగా, మంత్ర-తంత్రాలతో కాదు, విధిపూర్వకంగా కళ్యాణం యొక్క చమత్కారాలను చూపిస్తారు, అవి వరదానాలుగా అయిపోతాయి, ఆత్మల కొరకు ఈ సంకల్ప శక్తి యొక్క ప్రయోగము వరదానము అయిపోతుంది. కనుక ముందుగా ఇది చెక్ చేసుకోండి - మనసును కంట్రోల్ చేసే కంట్రోలింగ్ పవర్ ఉందా? సైన్స్ శక్తి ఏ విధంగానైతే స్విచ్ ఆన్ చేస్తే క్షణంలో పనిచేస్తుందో, ఆఫ్ చేస్తే క్షణంలో ఆగిపోతుందో అలా ఒక్క క్షణములో మనసును ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం అన్నట్లు కంట్రోల్ చెయ్యగలరా? స్వయము కొరకు కూడా మరియు సేవ కొరకు కూడా దీని వలన చాలా మంచిగా సిద్ధించినట్లు కనిపిస్తాయి. కానీ సంకల్ప శక్తి యొక్క జమ ఖాతాపై ఇప్పుడు అటెన్షన్ చాలా సాధారణంగా ఉన్నట్లు బాప్‌దాదా గమనించారు. ఎంత ఉండాలో అంత లేదు. సంకల్పాల ఆధారంగా మాటలు మరియు కర్మలు స్వతహాగానే ఉంటాయి. వేరు వేరుగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈరోజు మాటలపై కంట్రోల్ పెట్టాలి, ఈరోజు దృష్టిపై అటెన్షన్ పెట్టాలి, కష్టపడాలి, ఈరోజు వృత్తిపై అటెన్షన్ పెట్టి మార్చుకోవాలి - ఇలా అనుకునే అవసరం లేదు. ఒకవేళ సంకల్ప శక్తి శక్తిశాలిగా ఉన్నట్లయితే ఇవన్నీ స్వతహాగనే కంట్రోల్లోకి వచ్చేస్తాయి. శ్రమ నుండి రక్షింపబడతారు. కనుక సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకోండి.
ఇవన్నీ అలవాటు కావాలనే విశేషంగా ఈ భట్టీలను చేయించటం జరుగుతుంది. ఇక్కడి ఈ అలవాటును భవిష్యత్తులో కూడా అటెన్షన్ పెట్టి చేస్తూ ఉన్నట్లయితే అది అవినాశీ అవుతుంది. ఏం మహత్వం ఉందో అర్థమైందా? బాబా మీకు చాలా ఉన్నతోన్నతమైన ఖజానా ఇచ్చారు. ఈ శ్రేష్ఠ సంకల్పాలు, శుభ భావన, శుభ కామనలతో కూడిన సంకల్పాల ఖజానా ఉందా? వీటిని బాబా అందరికీ ఇచ్చారు కానీ నంబరువారుగా జమ చేసుకుంటారు మరియు ప్రయోగములోకి తీసుకువచ్చే శక్తి కూడా నంబరువారుగా ఉంది. ఇప్పుడు కూడా శుభభావన మరియు శుభకామనల ప్రయోగాన్ని చేసారా? విధిపూర్వకంగా చెయ్యటం ద్వారా సిద్ధి అనుభవమవుతుందా? ఇప్పుడు కొద్ది-కొద్దిగా అవుతుంది. చివరికి మీ సంకల్ప శక్తి ఎంత మహాన్‌గా అవుతుందంటే - సేవలో నోటి ద్వారా సందేశాన్ని ఇచ్చేందుకు సమయాన్నీ పెడతారు, సంపదనూ పెడతారు, అలజడిలోకి కూడా వస్తారు, అలసిపోతారు కూడా... కానీ శ్రేష్ఠ సంకల్పాలతో కూడిన సేవలో ఇవన్నీ పొదుపు అవుతాయి. దీనిని పెంచండి. ఈ సంకల్ప శక్తిని పెంచటం ద్వారా ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది. ఇప్పుడు 62-63 సంవత్సరాలైపోయాయి, ఇంత సమయంలో ఎంతమంది ఆత్మలను తయారుచేసారు? 9 లక్షల మంది కూడా పూర్తవ్వలేదు. అంతేకాక మొత్తం విశ్వమంతటికీ సందేశాన్ని చేర్చాలి అంటే ఎన్ని కోట్ల మంది ఆత్మలు ఉన్నారు? ఇప్పటికీ కూడా - భగవంతుడు వీరి యొక్క టీచరు, భగవంతుడు వీరిని నడిపిస్తున్నారు, చేయించేవారైన పరమాత్మ చేయిస్తున్నారు... అన్నది స్పష్టమవ్వలేదు. ఇది మంచి కార్యము మరియు శ్రేష్ఠ కార్యాన్ని చేస్తున్నారు అన్న మాట అయితే వచ్చింది, కానీ చేయించేవారు ఇప్పటికీ కూడా గుప్తంగానే ఉన్నారు. మరి ఈ సంకల్ప శక్తి ద్వారా ప్రతి ఒక్కరి బుద్ధిని పరివర్తన చెయ్యగలరు. ‘అహో ప్రభూ’ అంటూ అయినా ప్రత్యక్షం అవ్వాలి లేక తండ్రి రూపములోనైనా ప్రత్యక్షం అవ్వాలి. బాప్‌దాదా ఇప్పుడు కూడా మళ్ళీ అటెన్షన్‌ను ఇప్పిస్తున్నారు - సంకల్ప శక్తిని పెంచండి మరియు ప్రయోగములోకి తీసుకొస్తూ ఉండండి. అర్థమైందా.
అచ్ఛా, ఈరోజు మాతల ఛాన్స్ ఉంది. ఒకటి మాతల గ్రూప్ మరియు మెడిసిన్ (మెడికల్) వారు, రెండు వర్గాలు ఉన్నాయి. మాతలు ఏమి అద్భుతం చేస్తారు? మెంబర్ అయితే అయిపోయారు కదా! మహిళా వర్గం యొక్క మెంబర్లు అయ్యారు. మంచి విషయమే కదా! కానీ ఎవరైతే మెంబర్లు అయ్యారో, మంచి పని చేసారు. ఇప్పుడు మీ అందరి జాబితాను ప్రభుత్వానికి పంపిస్తాము. ఎందుకు పంపిస్తాము? భయపడవద్దు. ఇన్కమ్ ట్యాక్స్ వారు మీ దగ్గరకు రారు. ఈ మాతలందరూ ఇప్పుడు జగత్ మాతలుగా అయి, జగత్తును సరిదిద్దుతున్నారు అని చెప్పి పంపిస్తాము. ఈ కార్యం చేస్తారు కదా! ఇంతమంది మాతలు ప్రపంచాన్ని స్వర్గంగా చేసేవారు ఉన్నారు అని ప్రభుత్వానికి మీ పేరు పంపాలా? పంపాలా? చేతులు ఎత్తండి. భయపడటం లేదు కదా! భయపడవద్దు. కానీ ఇది గుర్తుంచుకోండి, ఒకవేళ మీ గురించి ఇలా విచారణ చేస్తే, ముందు మీ ఇల్లు స్వర్గంగా అయిందా? ఎందుకంటే ముందు ఇల్లు, తర్వాత విశ్వం. ఏ మాత దగ్గరకు వచ్చి చూసినా, ఇంట్లో సుఖశాంతులు ఉన్నాయా? అది కనిపిస్తుంది కదా! ముందు ఇల్లు స్వర్గంగా చేస్తారా? లేక విశ్వాన్ని స్వర్గంగా చేస్తారు, ఇంటిని చేయరా? ముందు ఇంటిని స్వర్గంగా చేస్తారు. అప్పుడు మాత్రమే ఇతరులపై కూడా ప్రభావం పడుతుంది. లేకపోతే, ఇంట్లో కలహమే ఉంది, స్వర్గం ఎక్కడ ఉంది అని అంటారు. అందుకే మాతలు అలాంటి వాతావరణాన్ని తయారుచేయాలి. ఎవరైనా చూసినా, మాతలు మంచి పరివర్తన చేసారు అనే విషయం కనిపించాలి. అచ్ఛా. ఎవరైతే మెంబర్లు ఉన్నారో వారు చేతులు ఎత్తండి. ఎంతమంది మెంబర్లు ఉన్నారు? (వెయ్యి మంది వచ్చారు.) వెయ్యి మంది కూడా చాలా మందే. ఎవరైతే చేతులు ఎత్తారో, వారు మెంబర్లు కదా! వారి ఇంట్లో సుఖశాంతులు ఉన్నాయా? ఉంటే చేతులు ఎత్తండి. నిలబడండి. అర్థమై నిలబడ్డారా, లేక అలాగే నిలబడ్డారా? ఇల్లు స్వర్గంగా ఉందా? ఇంట్లో శాంతి ఉందా? అచ్ఛా, వీరి ఫోటో తీయండి. చాలా బాగుంది.
మీ టీచర్‌ను మీ ఇంటికి పంపించమంటారా చూడడానికి. అయితే ధైర్యము ఉన్నవారే. కొందరు అర్థం చేసుకున్నారు, కొందరు ఇంకా అర్థం చేసుకోలేదు. చాలా బాగుంది. ఒకవేళ కొంచెమైనా గొడవ ఉంటే, ఇప్పుడు వెళ్లి ముందు ఇంటిని సరిచేసుకోండి. తర్వాత విశ్వ సేవ చేయగలరు. బాగుంది కదా! ఎవరు చేతులు ఎత్తలేదో, వారు కూడా చేయాలి. శుభభావనతో, జవాబు ఇవ్వకూడదు, గొడవ చేయకూడదు. దీనివల్ల కూడా తేడా వస్తుంది. చూడండి, యజ్ఞ చరిత్రలో ఇలాంటి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. చాలా కొట్టేవారు, కొడతారు కదా! అయితే ఎంతోమంది మాతల శుభభావనతో చేసిన సేవ వల్ల వారు బాబా పిల్లలుగా అయిపోయారు. అయితే మీరు కూడా ఇలా అనుకోవచ్చు - మా ఇంట్లో అయితే గొడవలు జరుగుతాయి, కొడతారు కూడా, ఇది జరుగుతుంది, అది జరుగుతుంది. కానీ ఎవరినైనా మార్చగలిగినప్పుడు, మీరు మారలేరా? శుభభావన మరియు మీ నడవడిక పరివర్తన అయిపోతే, వారు కూడా మెత్తగా అయిపోతారు. వేడిగా ఉండరు, మెత్తగా అయిపోతారు. అందుకే మాతలు ముందు తమ ఇళ్లను, పిల్లలను సరిచేయండి. సరే, ఇది మంచిదని వారు అంగీకరించరు. కానీ ప్రేమతో నడుచుకోండి, జ్ఞానాన్ని నింద చేయకూడదు, ఇంతైతే చేయవచ్చు కదా! సరే, వారు గొడవపడేవారే, ఏమి అయినా సరే, అలవాట్లు చెడ్డవే. కానీ, మాతాజీ చాలా మంచివారు. మేము ఇలా ఉన్నాము, కానీ మాత మంచివారు అని అయినా అనాలి. అంత ప్రభావం అయితే ఉండాలి. పరివర్తన ఉండాలి కదా! అప్పుడు సేవ ఎంతగా వ్యాపిస్తుందో చూడండి. సరేనా, మాతలారా! చాలా బాగుంది. చూడండి, మీ వర్గానికి కూడా ఛాన్స్ లభించింది కదా! అయితే లక్కీ అయిపోయారు కదా!
అచ్ఛా, ఇప్పుడు మెడికల్ వర్గం వారు:- చేతులు ఎత్తండి. గ్లోబల్ హాస్పిటల్ వారు కూడా చేతులు ఎత్తండి. వారు కూడా మెడికల్ వింగ్‌కి చెందినవారే. డబల్ విదేశీయులలో కూడా ఎవరైనా ఉన్నారా? మెడికల్ వింగ్ చాలా సులభంగా సేవ చేయగలదు. ఎందుకు? ఎందుకంటే పేషెంట్లు వస్తారు. మీ దగ్గరకు అయితే పేషెంట్లే వస్తారు. పేషెంట్లు ఎప్పుడూ డాక్టర్‌ను భగవంతుని రూపంగా భావిస్తారు. ఆ భావన కూడా ఉంటుంది. ఒకవేళ డాక్టర్ ఇది తినకూడదు అని చెబితే, భయంతో తినరు. అదే మాటను ఏ గురువు చెప్పినా కూడా వినరు. అందుకే మెడికల్ వారికి సులభమైన సేవా సాధనం ఉంది. ఎవరైతే వస్తారో, వారికి ఒక సమయం నిర్ణయించాలి. ఎందుకంటే పని సమయంలో మీరు ఏమీ చేయలేరు. కానీ ఏదైనా అలాంటి విధానాన్ని రూపొందించండి. పేషెంట్ కొంచెమైనా ఆసక్తి చూపిస్తే, వారిని ఒక సమయానికి పిలిచి, వారికి 15 నిమిషాలు లేదా అరగంట కూడా పరిచయం ఇస్తే ఏమవుతుంది? మీ సేవ పెరుగుతూనే ఉంటుంది. సందేశం ఇవ్వడం వేరే విషయం. సందేశంతో సంతోషిస్తారు. కానీ రాజయోగులుగా అవ్వరు. మీరు ఎన్నిసార్లు సందేశం ఇచ్చారు! ఇప్పుడు కూడా చూడండి, యాత్రలు నిర్వహిస్తున్నారు కదా! అప్పుడు ఎంతమందికి సందేశం చేరుతుంది. కొందరు కరపత్రాలు ముద్రించారు, కొందరు ఏదో ఒక రూపరేఖ తయారుచేశారు, కార్యక్రమం పెట్టారు. కానీ కొంత సమయం అయినా ఎవరికైనా అనుభూతి కలగకపోతే, వారు స్టూడెంట్ కాలేరు. చూడండి, సేవలో ఎక్కువ ఫలితం ఎక్కడ వస్తుందంటే, యోగ శిబిరాలు నిర్వహించి, ఒక వారం పాటు సంబంధంలోకి తీసుకువచ్చి, యోగం ద్వారా ఏదైనా అనుభూతి కలిగిస్తే, వారు రెగ్యులర్ అవుతారు. అందుకే, వారు స్టూడెంట్లు అయ్యేలా మీరు కూడా అలాంటి ఒక విధానాన్ని రూపొందించండి. ఎందుకంటే 9 లక్షల మంది తయారవుతారు. వారు కేవలం సందేశం తీసుకున్నవారు కాదు. 9 లక్షల మంది సత్యయుగం యొక్క మొదటి ప్రజలు. కాబట్టి వారు కేవలం సందేశం తీసుకున్నవారు కాదు. రెగ్యులర్‌గా ఏదో ఒక అనుభూతిని పొందినవారు అలా అవుతారు. అందుకే అలాంటి విధానాన్ని రూపొందించండి. సందేశం తీసుకున్నవారు కూడా కావాలి. ఎందుకంటే చివరికి 33 కోట్ల దేవతలు అవుతారు అని అంటారు. కలియుగం అంతం వరకు వారు కూడా కావాలి. కానీ ముందు 9 లక్షల మందిని సిద్ధం చేయండి. మీరు వెళ్లిపోతే, ప్రజలు వెనుక వస్తారా? మీరు రాజ్యం చేయడానికి ప్రజలు కూడా కావాలి కదా! అందుకే ముందు ఏదో ఒక అనుభూతిని కలిగించండి. ఎవరికైతే ఏదైనా అనుభూతి కలుగుతుందో, వారు దానిని విడిచిపెట్టలేరు. ఇకపోతే ఎవరి దుఃఖాన్నయినా తొలగించడం చాలా మంచిదే. కార్యం అయితే చాలా మంచిగా చేస్తున్నారు. కానీ శాశ్వతంగా చేయడం లేదు. మందు తింటే వ్యాధి తగ్గుతుంది. మందు ఆపేస్తే వ్యాధి మళ్లీ వస్తుంది. అందుకే ఎలాంటి మందు ఇవ్వాలంటే వ్యాధి అనే పేరే లేకుండా పోవాలి. అదే మెడిటేషన్. అయినా కూడా డాక్టర్లు, నర్సులు లేదా ఏ పని చేసే వారైనా తప్పకుండా కావాలి. అందుకే బాప్‌దాదా సంతోషిస్తారు. డాక్టర్లు కలిసి ఉన్నప్పుడు బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. ఎందుకంటే బ్రాహ్మణ కుటుంబంలో కూడా ఉపయోగపడతారు కదా! సమయం ఎంత నాజూకుగా వస్తుందో, వ్యాధులు కూడా అంతగా పెరుగుతాయి కదా! అందుకే మంచి మంచి డాక్టర్లు కావాలి. అందుకే బాప్‌దాదా డాక్టర్లను అడుగుతున్నారు - మెడికల్ కార్యంలో అయితే బాగున్నారు. కానీ మెడిసిన్ మరియు మెడిటేషన్, ఈ రెండింటిలో మీకు బ్యాలెన్స్ ఉందా? ఎంతగా ఈ కార్యంలో బిజీగా ఉండి ప్రగతి చేస్తూ వెళ్తున్నారో, అంతగానే మెడిటేషన్లో కూడా పెరుగుతూ వెళ్తున్నారా? పెరుగుతున్నారా? ఎవరైతే మా మెడిటేషన్ మరియు మెడిసిన్ కార్యంలో బ్యాలెన్స్ ఉంటుంది అని భావిస్తున్నారో, వారు చేతులు ఎత్తండి. బ్యాలెన్స్ ఉందా? వీరి ఫోటో కూడా తీయండి. వీరందరూ కార్యంలో ఉపయోగపడేవారు. అందుకే మీ ఫోటో తీస్తున్నాము. అచ్ఛా.
బాప్‌దాదాకు ప్రతి వర్గం యొక్క మహత్వం ఉంది. ఎందుకంటే శరీరంలో ఒక అవయవం లేకపోయినా లేదా తక్కువగా ఉన్నా లోపం అనిపిస్తుంది కదా! అలాగే ఈ ప్రతి వర్గం చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి డాక్టర్ల వర్గాన్ని కూడా బాప్‌దాదా సేవాధారుల గ్రూప్‌గా చూస్తారు. కేవలం కొంత సమయాన్ని ఈ సేవకు కూడా ఇస్తూ ఉండండి. చాలామంది డాక్టర్లు, మాకు అసలు తీరికే ఉండదు అని అంటారు. తీరిక లేకపోయినా, ఎంత బిజీగా ఉన్నా, మీ దగ్గర ఒక కార్డు ముద్రించుకొని ఉంచండి. అందులో ఒక సూచన ఉండాలి, ఆకర్షణ కలిగించే ఏదైనా ఒక స్లోగన్ ఉండాలి. ఇంకా సఫలత కావాలంటే, ఇవి ఇవి అడ్రస్‌లు ఉన్నాయి అని, మీరు ఉండే చోటు యొక్క సెంటర్ల అడ్రస్ ఉండాలి. ఇక్కడికి వెళ్లి అనుభూతి చేయండి అని. కార్డు అయితే ఇవ్వగలరు కదా! ఎలాగైతే చీటీ వ్రాసి, ఈ మందు తీసుకోండి, ఆ మందు తీసుకోండి అని ఇస్తారో, అలాగే చీటీ ఇచ్చే సమయంలో ఈ కార్డు కూడా ఇవ్వండి. ఎవరికైనా బాణం తగలవచ్చు. ఎందుకంటే డాక్టర్ల మాటను నమ్ముతారు. టెన్షన్ అయితే అందరికీ ఉంటుంది. ఒకటి ప్రకృతి వైపు నుండి టెన్షన్, కుటుంబం వైపు నుండి టెన్షన్, మరియు తమ మనసు వైపు నుండి కూడా టెన్షన్. అందుకే టెన్షన్-ఫ్రీ లైఫ్ యొక్క మందు ఇది అని, ఆకర్షణ కలిగించే చిన్న విషయాన్ని వ్రాయండి. అప్పుడు ఏమవుతుంది? మీ సేవ యొక్క ఖాతాలో అయితే జమా అయిపోతుంది కదా! ఇలా చాలామంది చేస్తున్నారు. ఎవరైతే చేయడం లేదో, వారు చేయండి. డబల్ డాక్టర్లు కదా, సింగల్ కాదు. డబల్ డాక్టర్లు అయితే డబల్ సేవ చేయండి. అందరూ తమ తమ స్థానాలలో సేవలో బాగున్నారు కదా! ఎలాంటి గొడవలు లేవు కదా? అందరూ బాగున్నారా? అచ్ఛా. బాగాలేని వారు అయితే చేతులు ఎత్తరు. సిగ్గు వేస్తుంది కదా! కానీ డబల్ సేవ ద్వారా లౌకిక సేవ కూడా బాగైపోతుంది. ఎందుకంటే సేవకు కూడా బలం ఉంది. ఎలాగైతే యోగం యొక్క బలం ఉంది, జ్ఞానం యొక్క బలం ఉంది, దైవీ గుణాల బలం ఉంది, ధారణ యొక్క బలం ఉంది... అలాగే సేవ యొక్క బలం కూడా ఉంది. నాలుగు సబ్జెక్టుల్లో 100-100 మార్కులు ఉన్నాయి. కాబట్టి నాలుగు సబ్జెక్టులు లేదా నాలుగు బలాలు జమా అయిపోతే, మార్కులు పెరుగుతాయి కదా! సరే, ఏదో ఒకదానిలో 50 ఉండవచ్చు, మరొకదానిలో 75 ఉండవచ్చు. కానీ మొత్తం మార్కులు అయితే పెరుగుతాయి కదా! అందుకే నాలుగు సబ్జెక్టుల్లో కూడా మార్కులు జమా చేసుకుంటూ ఉండండి. ఇందులో అయితే తక్కువ ఉన్నాయి అని అనుకోకండి. చాలామంది పిల్లలు జవాబు ఇస్తారు. బాబా అంటారు కదా, చార్ట్ ఉంచండి అని. అప్పుడు, చార్ట్ ఉంచడానికి ప్రయత్నించాము, ఆ రోజు చార్ట్ బాగాలేదు, అందుకే వ్రాయలేదు అని అంటారు. అది ఒక సాకు మాత్రమే. సరే, చార్ట్ బాగాలేదు. వ్రాయడం వల్లే అది బాగుపడుతుంది కదా! మాటలు చెప్పడంలో అయితే తెలివైనవారే. అర్థమైందా? డాక్టర్లు ఫస్ట్ నంబరులో రావాలా లేక వెనుక వెనుక రావాలా? ఫస్ట్ వస్తారు కదా! అయితే ఫస్ట్ రావడానికి ఈ అటెన్షన్ ఉంచండి. మార్కులు పెంచుకోండి. ఎందుకంటే అక్కడ సత్యయుగంలో డాక్టర్లుగా అవ్వాల్సిన అవసరమే లేదు. రాజులుగా అవ్వాలి కదా! రాజయోగులు కదా! రాజయోగులు అయితే, రాజులుగా అవ్వాలి అంటే అటెన్షన్ కూడా ఉంచాలి. అచ్ఛా.
ఎవరైతే హార్ట్ యొక్క కోర్స్ చేస్తున్నారో, వారు చేతులు ఎత్తండి. హార్ట్ అయితే బాగానే ఉంది కదా! డాక్టర్ ఎక్కడ ఉన్నారు? (సతీష్ గుప్తాతో) చాలా బాగుంది. ఒకవేళ సులభమైన సాధనం ద్వారా బాగైపోతే, డబల్ లాభం ఉంది. మందు కూడా ఉంది మరియు మెడిటేషన్ కూడా ఉంది. అయితే డబల్ ఖాతా - ఒకటి తీరిపోతుంది, ఒకటి జమా అవుతుంది. చాలా మంచి లాభం ఉంది. ఒకవేళ చాలా బాగుంది అని భావిస్తే, ఒక చేయి ఎత్తండి. ఇది కూడా మంచి రీసెర్చ్. ఇలాగే బాగైపోతే, చాలా బాగుంది కదా! చూడండి, ఎవరైనా ఏదైనా శోధన చేస్తారు. అయితే ఇది కూడా ఏమిటి? సంకల్ప శక్తి ద్వారానే ఇన్వెన్షన్ జరుగుతుంది. ఏ ఇన్వెన్షన్కైనా ఆధారం ఏకాగ్రతతో కూడిన సంకల్ప శక్తే. అందుకే వీరికి చాలా మంచి అవకాశం లభిస్తుంది. మధుబన్ కూడా లభిస్తుంది, అనారోగ్యం కూడా సమాప్తమైపోతుంది మరియు మెడిటేషన్లో కూడా ముందుకు వెళ్తూ ఉంటారు. అచ్ఛా.
బొంబాయి యొక్క సేవాధారులు నిలబడండి. ఈ సేవ యొక్క అవకాశం బాగానే అనిపిస్తుందా? ఈ నెపంతో సేవ ద్వారా బ్రాహ్మణుల పరిచయం లభిస్తుంది. బ్రాహ్మణ కుటుంబంలో పరిచయం అయిపోతుంది మరియు బేహద్దులోకి వచ్చే అవకాశం లభిస్తుంది. సేవ యొక్క బలం కూడా తక్కువ కాదు. చూడండి, ఎవరైతే పాతవారు ఉన్నారో, ఎవరిని దాదీలు అని అంటారో, వీరిలో అదనపు బలం ఉంది. ఏ బలం ఉంది? సేవ యొక్క బలం. (దగ్గు వచ్చింది.) బాజా (శరీరము) పాడవుతుంది కదా!
క్షణంలో మనసు ఏకాగ్రమవ్వాలి అని బాప్‌దాదా అభ్యాసాన్ని వినిపించారు, ఎందుకంటే సమస్య అనేది అకస్మాత్తుగా వస్తుంది మరియు ఆ సమయంలోనే ఒకవేళ మనోబలము ఉంటే సమస్య సమాప్తమైపోతుంది, కానీ సమస్య చదువును చదివించేదిగా అవుతుంది. కనుక ఇప్పుడిప్పుడే అందరూ మనసు-బుద్ధిని ఏకాగ్రము చెయ్యండి. చూడండి, అవుతుందా. (డ్రిల్) ఇలా మొత్తము రోజంతటిలో అభ్యాసము చేస్తూ ఉండండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు, ఆదిమధ్యాంతాలలో శ్రేష్ఠ పాత్రను పోషించే ఆత్మలకు, సదా తమ శ్రేష్ఠ సంకల్పాల విధిని అనుభవము చేసేవారికి, సదా సహజయోగితోపాటు ప్రయోగిగా అయ్యేవారికి, సదా సంకల్ప శక్తి ద్వారా సర్వ శక్తులను పెంచుకునేవారికి, మనసు మరియు బుద్ధిపై నియంత్రణను ఉంచుకునేవారికి, సదా ప్రయోగి పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దేశ-విదేశాలలోని పిల్లలను కూడా బాప్‌దాదా చూస్తున్నారు. సంకల్పాల ద్వారా ఏవైతే ప్రియస్మృతులు మరియు ఆత్మిక సంభాషణను చేస్తారో, అవి బాప్‌దాదా వద్దకు చేరుకుంటాయి. ఇప్పుడు కూడా ఎవరైతే సైన్స్ బలం ద్వారా వింటున్నారో, ఆ పిల్లలందరికీ, ప్రతి దేశములోని పిల్లలు ప్రతి ఒక్కరికీ ప్రియస్మృతులు. జానకి బచ్చీకి కూడా బాప్‌దాదా విశేష ప్రియస్మృతులను ఇస్తున్నారు ఎందుకంటే మనసుతో ఇక్కడ ఉన్నారు, తనువుతో అక్కడ ఉన్నారు. మరి అందరికీ, ఒక్కొక్కరికీ విశేషమైన ప్రియస్మృతులు. అచ్ఛా, యోగ భట్టీ యొక్క ప్రోగ్రామ్ చాలా బాగా జరుగుతూ ఉంది.
హాల్లోని వారందరికీ దృష్టిని ఇచ్చిన తర్వాత బాప్‌దాదా ఎదురుగా దాదీలందరూ కూర్చున్నారు:
సదా స్వయమును బాప్‌దాదా యొక్క కంటి రత్నాలుగా భావిస్తున్నారు కదా? నయనాలలో ఎల్లప్పుడూ ఇమిడి ఉంటారు, నయనాలలో ఇమిడి ఉండటం వలన ఎల్లప్పుడూ దృష్టిలో ఇమిడి ఉంటారు. ఇది కూడా బాబా మరియు పిల్లల సంగమయుగ మనోరంజనము. కలవటము, వినటము, తినటము, త్రాగటము, ఇవన్నీ సంగమయుగపు మనోరంజనములు. ఇలా మనోరంజనము చేసుకుంటూ-చేసుకుంటూ మీ ఇంటికి వెళ్ళిపోతారు. మళ్ళీ రాజ్యంలోకి వస్తారు. బ్రహ్మాబాబాతోపాటు రాజ్యం చెయ్యాలి. అచ్ఛా. ప్రపంచములోని వారు ఆలోచిస్తూనే ఉంటారు మరియు మీరు సదా జరుపుకుంటూ ఉంటారు. ఏమవుతుంది, ఎలా అవుతుంది అని ఎటువంటి ఆలోచన లేదు. ఏ విధమైన ఆలోచనా లేదు. అచ్ఛా!
జయంతి అక్కయ్యతో:- వీరు వచ్చారు. మంచి పాత్ర లభించింది. ఒక దేశం నుండి మరో దేశానికి, అక్కడి నుండి మరో దేశానికి, ఇలా ఎగురుతూ ఉండండి, ఎగిరిస్తూ ఉండండి. అచ్ఛా, బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మంచిది.
దాదీలతో:- మీ అందరి సహయోగంతోనే మొత్తం కార్యం నడుస్తోంది. సహయోగులు ప్రత్యేక భుజాలు. చాలా బాగుంది, మంచి గ్రూప్ లభించింది. (మోహిని అక్కయ్యతో) గ్రూప్‌లో ఉన్నారు కదా! అందరూ తోటి సహచరులే. అందరి సహయోగంతోనే కార్యం నడుస్తోంది. పాండవులు కూడా మంచి సహచరులుగా లభించారు. ఇది కూడా ఒక కంపెనీయే కదా! అయితే మంచి కంపెనీ యొక్క కార్యాన్ని చూసుకునే వారు కూడా ఉన్నారు, సేవాధారులు కూడా ఉన్నారు. అందరి చేయి ఉంది. విదేశాల్లో ఉన్నారు కాబట్టి యజ్ఞంలో మీ చేయి లేదు అని కాదు. ప్రతి ఒక్క పిల్లవాని చేయి యజ్ఞ సేవలో ఉంది. దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మీ ప్రతి ఒక్క బ్రాహ్మణుని చేయి ద్వారా యజ్ఞం నడుస్తోంది. యజ్ఞాన్ని రచించే బ్రాహ్మణులు. మేము యజ్ఞాన్ని రచించే వారమని భావిస్తారు కదా! బాలుకులు సో యజమానులు. అచ్ఛా!
*** ఓంశాంతి ***
