Search for a command to run...
8 Oct 2002
‘‘ఆత్మిక ప్రేమ మూర్తులుగా అయ్యి శిక్షణను మరియు సహయోగాన్ని కలిపి ఇవ్వండి’’
8 October 2002 · తెలుగు
(విశేషంగా మధుబన్ నివాసులైన సోదరీ-సోదరులతో మిలనము)
ఈరోజు ప్రేమ సాగరుడైన బాప్‌దాదా తమ మాస్టర్ జ్ఞాన సాగరులైన పిల్లలతో మిలనాన్ని జరుపుకుంటున్నారు. ఈ పరమాత్మ ప్రేమే పిల్లల పాలనకు ఆధారము. ఏ విధంగా పరమాత్మ ప్రేమ బ్రాహ్మణ జీవితానికి ఆధారమో, అదే విధంగా బ్రాహ్మణ సంగఠనకు ఆధారము ఆత్మిక ప్రేమ. ఆ ఆత్మిక ప్రేమను పిల్లలైన మీరే అనుభవం చేయగలుగుతారు. నేటి విశ్వములోని ఆత్మలు ఈ సత్యమైన, నిస్వార్థమైన ఆత్మిక-పరమాత్మ ప్రేమ కొరకు దాహముతో ఉన్నారు. ఇటువంటి సత్యమైన ప్రేమ బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. దాహముతో ఉన్న ఆత్మల దాహాన్ని తీర్చేవారు స్వయాన్ని ప్రతి సమయము పరమాత్మ ప్రేమ మరియు ఆత్మిక ప్రేమలో ఇమిడిపోయి ఉన్నట్లుగా అనుభవం చేస్తున్నారా? ప్రేమ దాతగా లేక ప్రేమ దేవతగా సదా ఉంటున్నారా? నడుస్తూ-తిరుగుతూ ఆత్మిక ప్రేమతో కూడిన వృత్తిని, దృష్టిని, మాటలను, సంబంధ-సంపర్కాలను అనగా కర్మలను అనుభవం చేస్తున్నారా? ఎటువంటి ఆత్మ అయినా గానీ బ్రాహ్మణులైన మీ నేచురల్ వృత్తి, బ్రాహ్మణ నేచర్‌గా తయారయ్యిందా? తయారు చేసుకోవలసి వస్తుందా లేక తయరైపోయిందా? ఫాలో ఫాదర్, ఫాలో మదర్. మీ బ్రాహ్మణ జన్మలోని ఆది సమయాన్ని గుర్తు చేసుకోండి. రకరకాల స్వభావాలు కలవారు బాబాకు చెందినవారిగా అయ్యారు. ప్రేమ సాగరుడైన బాబా ఒకే ఒక్క ప్రేమ సాగర స్వరూపము అనే అనాది నేచర్ ద్వారా తమవారిగా చేసుకున్నారు కదా! ఒకవేళ మీ అందరి రకరకాల నేచర్లను (స్వభావాలను) చూసినట్లయితే తమవారిగా చేసుకోగలిగేవారా? కనుక స్వయాన్ని ప్రశ్నించుకోండి - నా నేచురల్ నేచర్ (సహజ స్వభావము) ఏమిటి? ఎవరి బలహీన స్వభావమైనా గానీ, వాస్తవానికి బ్రాహ్మణ జీవితము యొక్క నేచురల్ నేచర్ (సహజ స్వభావము) మాస్టర్ ప్రేమ సాగర్. ప్రేమ రాతిని కూడా నీరుగా మార్చేస్తుంది అని ప్రపంచములోనివారు కూడా అంటారు, మరి ఆత్మిక ప్రేమను, పరమాత్మ ప్రేమను తీసుకుని ఇచ్చేవారు రకరకాల స్వభావాలు కలవారిని పరివర్తన చెయ్యలేరా? చెయ్యగలరా లేక చెయ్యలేరా? వెనుకవారు చెప్పండి. చెయ్యగలము అని ఎవరైతే భావిస్తున్నారో వారు ఒక చేతిని ఎత్తండి. చేతిని బాగా పైకెత్తండి, చిన్నగా కాదు (అందరూ చేతులెత్తారు) అచ్ఛా, అభినందనలు! మరి పరిస్థితులు వస్తుంటాయి. పరిస్థితులైతే వచ్చేదే ఉంది. ఇవి బ్రాహ్మణ జీవితములోని సైడ్ సీన్స్ (మార్గమధ్యములో వచ్చే దృశ్యాలు). అంతేకాక సైడ్ సీన్స్ ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు. కొన్ని సుందరంగా కూడా ఉంటాయి, కొన్ని చెడుగా కూడా ఉంటాయి. కానీ వాటిని దాటడము బాటసారి పని, అంతేకానీ సైడ్ సిన్స్ను మార్చే విషయము కాదు. మరి బాప్‌దాదా ఏం కోరుకుంటారు! అన్నీ తెలుసుకోవటములోనైతే తెలివైనవారిగా అయిపోయారు కదా!
ఈరోజు మధుబన్ నివాసులకు విశేషంగా అవకాశము లభించింది. సువర్ణావకాశము కదా. అచ్ఛా. ఈ సువర్ణావకాశానికి రిటర్న్ ఏమిటి? చాలా ఉల్లాస-ఉత్సాహాలతో అవకాశాన్ని తీసుకున్నారు. మామూలుగా క్రింద కూర్చుని ఉన్నవారు కూడా మధుబన్ నివాసులే (మధుబన్ నివాసి సోదర-సోదరీలు కాకుండా మిగిలినవారంతా పాండవ భవన్లో మురళిని వింటున్నారు) కానీ ఈరోజు కేవలం గ్రూపులవారీగా కలుసుకునే అవకాశముంది. ఎక్కువమంది ఒకేసారి అయితే దూర-దూరంగా ఉంటారు, అందుకే కొన్ని-కొన్ని విభాగాలుగా చేసారు. ఇకపోతే అందరూ మధుబన్ నివాసులే. సెంటరులో ఉండేవారిది కూడా పర్మనెంట్ ఎడ్రస్ మధుబనే కదా, కనుక బ్రాహ్మణులు అనగా పర్మనెంట్ ఎడ్రస్ మధుబన్. ఇల్లు మధుబనే, మిగిలినవి సేవా స్థానాలు. అందుకే ఈ రోజు మమ్మల్ని మధుబన్ నివాసుల నుండి వేరు చేసేసారు అని కింద ఉన్నవారు భావించకండి, అలా అనుకోకండి. మీరందరూ మధుబన్ నివాసులు. కేవలం మిమ్మల్ని బాప్‌దాదా ఎదురుగా చూడాలనుకుంటున్నారు, చిన్న గ్రూప్ అయితే చూడగలుగుతారు. ఇప్పుడు చూడండి, వెనుక నుండి చూసేవారు కూడా అంత స్పష్టంగా కనిపించరు, దగ్గరగా ఉన్న వీరు స్పష్టంగా కనిపిస్తారు. కానీ వెనుక ఉన్నవారు హృదయముతో దూరంగా లేరు. కింద ఉన్నవారు కూడా హృదయముతో దూరంగా లేరు. బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు - వర్తమాన సమయమనుసారంగా లవ్ మరియు లా (ప్రేమ మరియు నియమము) యొక్క బ్యాలెన్స్‌ను పెట్టవలసి ఉంటుంది, కానీ లా మరియు లవ్ యొక్క బ్యాలెన్స్ కలిసి అది లా (నియమము) లాగా అనిపించకూడదు. లా (నియమము)లో కూడా లవ్ (ప్రేమ) అనుభూతి అవ్వాలి. ఉదాహరణకు సాకార స్వరూపములో బాబాను చూసారు. లా (నియమము)తోపాటు లవ్ (ప్రేమ)ను ఎంతగా ఇచ్చారంటే ప్రతి ఒక్కరి నోటి నుండి - బాబాకు నాపై ప్రేమ ఉంది, వారు నా బాబా అని వెలువడేది. లా ను తప్పకుండా ఉపయోగించండి, కానీ లాతోపాటు లవ్ ను కూడా ఇవ్వండి. కేవలం లా కాదు. కేవలము లా ఉంటే అక్కడక్కడ ఆత్మలు బలహీనముగా ఉన్న కారణంగా నిరాశకు లోనవుతారు. ఎప్పుడైతే స్వయం ఆత్మిక ప్రేమ మూర్తులుగా అవుతారో, అప్పుడు ఇతరులకు ప్రేమను ఇవ్వగలుగుతారు (ఆత్మిక ప్రేమ, వేరే ప్రేమ కాదు). ఆత్మిక ప్రేమ అనగా ప్రతి సమస్యను పరిష్కరించడంలో సహయోగిగా అవ్వటము. కేవలం శిక్షణను ఇవ్వటము కాదు, శిక్షణతోపాటు సహయోగాన్ని కూడా ఇవ్వటము - ఇదే ఆత్మిక ప్రేమమూర్తిగా అవ్వటము. కనుక ఈ రోజు విశేషంగా బాప్‌దాదా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు, వారు ఈ దేశవాసులైనా, విదేశీయులైనా, నలువైపులా ఉన్న పిల్లలందరికీ విశేషంగా ఇదే అండర్లైన్ చేస్తున్నారు - ఆత్మిక ప్రేమమూర్తిగా అవ్వండి. మరియు ఆత్మల యొక్క ఆత్మిక ప్రేమ దాహాన్ని తీర్చే దాతగా, దేవతగా అవ్వండి. సరేనా! అచ్ఛా.
(తర్వాత బాప్‌దాదా మధుబన్ వారితో చిట్-చాట్ చేసారు మరియు అందరినీ దృష్టి ద్వారా తృప్తిపరుస్తూ దృష్టిని ఇచ్చారు)
హాస్పిటల్ వారు, ఆబు నివాసులు మరియు పార్టీలతో అవ్యక్త బాప్‌దాదా మిలనము:- అందరూ తమను తాము అదృష్టవంతులుగా భావిస్తున్నారా? మొత్తము విశ్వములో అందరికంటే ఎక్కువ భాగ్యము ఎవరిది? ప్రతి ఒక్కరూ - అందరికంటే గొప్ప భాగ్యము నాది అని భావిస్తున్నారా! ప్రతి ఒక్కరూ ఇలా భావిస్తున్నారా? అదృష్టవంతులు అన్నప్పుడు మరి సంతోషంగా ఉంటారా? సదా సంతోషంగా ఉంటారా? అప్పుడప్పుడు అయితే కాదు కదా! బాప్‌దాదా భాగ్య సితారను మెరిపింపజేసినప్పుడు మరి మెరుస్తున్న సితారను చూసి సంతోషంగా ఉంటున్నారా? మనసులో సదా సంతోషపు భజంత్రీలు మ్రోగుతాయి. మ్రోగుతాయా? హృదయము ఏ పాటను పాడుతుంది? ‘‘వాహ్ నా శ్రేష్ఠ భాగ్యము’’ - ఈ పాటను పాడుతారా? మొత్తము కల్పమంతా మీ భాగ్యము యొక్క గాయనము జరుగుతూ ఉంటుంది. అర్థకల్పము భాగ్యము యొక్క ప్రారబ్ధాన్ని అనుభవిస్తారు మరియు అర్థకల్పము మీ భాగ్యము యొక్క గాయనమును అనేక ఆత్మలు పాడుతూ ఉంటారు. అన్నింటికంటే విశేషమైన విషయము ఏమిటంటే బాబాకు మొత్తము విశ్వములో ఎవరు ఇష్టమనిపించారు? మీరే ఇష్టమనిపించారు కదా! ఎంతమంది ఆత్మలు ఉన్నారు కానీ మీరే ఇష్టమనిపించారు. ఎవరినైతే భగవంతుడు ఇష్టపడ్డారో, అంతకంటే ఎక్కువ ఇంకేముంటుంది! కనుక సదా బాబాతోపాటు మీ భాగ్యాన్ని కూడా గుర్తు పెట్టుకోండి. భగవంతుడు మరియు భాగ్యము. మొత్తము కల్పములో ఈ విధంగా ప్రతిరోజూ ప్రియస్మృతులు లభించే మరియు ప్రభు ప్రేమ లభించే ఆత్మ ఎవరైనా ఉంటారా! ప్రతిరోజూ ప్రియస్మృతులు లభిస్తాయి కదా. అందరికంటే ఎక్కువ ప్రియమైన పిల్లలు ఎవరు? మీరే ప్రియమైన పిల్లలు కదా. కనుక సదా మీ భాగ్యాన్ని గుర్తు చేసుకోవటం ద్వారా వ్యర్థమైన విషయాలు పారిపోతాయి. పారద్రోలవలసిన అవసరం లేదు, సహజంగానే పారిపోతాయి.
ఇప్పుడు వర్తమాన సమయమనుసారంగా సంగమయుగ సమయపు మహత్వాన్ని అర్థం చేసుకుని ప్రతి క్షణము మీ ప్రారబ్ధాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకుంటూ ఉండండి. ఒక్క క్షణము కూడా వ్యర్థంగా పోకూడదు ఎందుకంటే ఒక్కొక్క క్షణానికి చాలా ఎక్కువ మహత్వము ఉంది. క్షణము పోయినట్లు కాదు, కానీ చాలా సమయము పోతుంది మరియు ఈ సమయము తిరిగి లభించేది లేదు. సమయము యొక్క పరిచయము బాగా ఉంది కదా. స్మృతిలో ఉంటుందా? చూడండి, ఈ రోజు మీ అందరికీ స్పెషల్ సమయము లభించింది కదా. ఒకవేళ అందరూ కలిపి వస్తే కనిపించేవారు కూడా కాదు. ఇప్పుడైతే ఎవరెవరు ఉన్నారు అనేది చూస్తున్నాము. అందరూ విశేష ఆత్మలే. కేవలం మీ విశేషతలను తెలుసుకుని ఆ విశేషతలను కార్యములో ఉపయోగించండి. డ్రామా అనుసారంగా ప్రతి బ్రాహ్మణ ఆత్మకు ఏదో ఒక విశేషత ప్రాప్తించింది. ఎటువంటి విశేషత లేని వారంటూ ఎవ్వరూ లేరు. కనుక మీ విశేషతను సదా స్మృతిలో పెట్టుకోండి మరియు దానిని సేవలో ఉపయోగించండి. ప్రతి ఒక్కరి విశేషత ఎగిరే కళకు చాలా తీవ్ర విధిగా తయారవుతుంది. సేవలో పెట్టండి కానీ అభిమానములోకి రాకండి ఎందుకంటే సంగమములో ప్రతి విశేషత డ్రామా అనుసారంగా పరమాత్ముని కానుక. పరమాత్ముని కానుక అనుకున్నప్పుడు అభిమానము రాదు. ఉదాహరణకు ప్రసాదము ఉంటుంది కదా, దానిని ఎవ్వరూ - ఇది నాది, నా ప్రసాదము అని అనరు. అది ప్రభు ప్రసాదము. ఈ విశేషతలు కూడా ప్రభు ప్రసాదము. ప్రసాదము అనేది కేవలం స్వయం కొరకే ఉపయోగించటం జరగదు, అది పంచటం జరుగుతుంది. మీరు పంచుతారు, మీరు మహాదానులు, వరదానులు కూడా. పాండవులు కూడా వరదానులు, మహాదానులు. శక్తులు కూడా మహాదానులేనా? ఒకటి-రెండు గంటల మహాదానులు కారు, తెరిచియున్న భాండాగారము ఉండాలి. అందుకే బాబాను భోళా భండారీ అని అంటారు, వారిది తెరిచియున్న భాండాగారము కదా. ఆత్మలకు అంచలిని ఇస్తూ వెళ్ళండి. బికారులది ఎంత పెద్ద లైన్ ఉంది. మరి మీ వద్ద ఎంతటి నిండు భాండాగారము ఉంది? తరగని భాండాగారము ఉంది, అది తరిగిపోయే భాండాగారమా? పంచటములో ఎకానమీ (పొదుపు) అయితే చెయ్యటం లేదు కదా? ఇందులో విశాల హృదయముతో పంచండి. వ్యర్థముగా పోగొట్టే విషయములో ఎకానమీ (పొదుపు) చెయ్యండి కానీ పంచటములో పెద్ద మనసుతో పంచండి.
అందరూ సంతోషముగా ఉన్నారా? అప్పుడప్పుడు కొద్ది-కొద్దిగా ఏమైనా అవుతుంటుందా? ఒక్కోసారి మూడ్ ఆఫ్ అవ్వటము, ఒక్కోసారి మూడ్ చాలా సంతోషముగా ఉండటము, ఇలా అయితే ఉండరు కదా. ఫాలో ఫాదర్ చెయ్యండి. బాప్‌దాదా మూడ్ ఆఫ్ చేసుకుంటారా? మరి ఫాలో ఫాదర్ చెయ్యాలి కదా. బాప్‌దాదా వద్ద బ్రాహ్మణ పిల్లల గురించి స్పెషల్ టి.వి. ఉంది, అందులో అందరి రకరకాల మూడ్స్ వస్తాయి. అవి చూడటములో ఎంత మజా వస్తూ ఉండవచ్చు! సదా మహాదానులుగా అయ్యేవారి మూడ్ మారదు. దాతలు కదా, ఇస్తూ ఉండండి. దేవతగా అయ్యేవారు అనగా ఇచ్చేవారు. తీసుకునేవారు కారు, దేవత (ఇచ్చేవారు). ఎన్ని సార్లు దేవతలుగా అయ్యారు, అనేక సార్లు అయ్యారు కదా. కనుక దేవత అనగా ఇచ్చే సంస్కారము కలవారు. ఎవరు ఏమి ఇచ్చినా కానీ మీరు సుఖము యొక్క అంచలిని, శాంతి యొక్క అంచలిని, ప్రేమ యొక్క అంచలిని ఇవ్వండి. మనుష్యుల వద్ద ఉన్నదే దుఃఖము, అశాంతి అన్నప్పుడు వారేమి ఇస్తారు, అవే ఇస్తారు కదా. మరి మీ వద్ద ఏమున్నాయి - సుఖశాంతులు. అందరూ బాగున్నారు కదా! అచ్ఛా! మిలనాన్ని జరుపుకున్నారు. మేము వెనుక వచ్చాము అనైతే అనుకోరు కదా. స్పెషల్‌గా వచ్చారు. మధుబన్కు సమీపంగా ఉంటున్నారు. మధుబన్ను మంచిగా చుట్టుముట్టారు.
హాస్పిటల్ వారు కూడా సేవ బాగా చేస్తున్నారు. శాంతివన్ వారు కూడా చాలామంది ఉన్నారు. పార్టీవారు సికీలధే పిల్లలు. వీరు కొద్దిమందే ఉన్నారు, అందుకే సికీలధే పిల్లలు. విదేశీయులు లేకపోతే కూడా శోభ ఉండదు, అందుకే ప్రతి గ్రూపులో శోభను పెంచేందుకు మీరు మంచిగా వస్తారు. అచ్ఛా.
సేవాధారులతో అవ్యక్త బాప్‌దాదా మిలనము:- అందరూ సేవ నిమిత్తంగా తమ భాగ్యాన్ని తయారు చేసుకునేవారే ఎందుకంటే ఆ యజ్ఞ సేవ యొక్క పుణ్యము చాలా గొప్పది. తనువు ద్వారానైతే సేవ చేస్తారు కానీ మనసు ద్వారా కూడా సేవ చేస్తూ ఉండండి, అప్పుడు డబల్ పుణ్యము లభిస్తుంది. మనసా సేవ మరియు తనువు సేవ. ఎవరు వచ్చినా సరే, సేవాధారుల సేవ ద్వారా వాయుమండలాన్ని చూసి లాభం పొంది వెళ్తారు. సేవ సమయములో ఎంతమందైతే వస్తారో, అంతమంది ఆత్మల పుణ్యము మరియు ఆశీర్వాదాలు జమ అవుతాయి. తనువు ద్వారా కూడా మరియు మనసు ద్వారా కూడా, ఇలాంటి సేవను చేస్తారు. డబల్ సేవాధారులా లేక సింగల్ సేవాధారులా, ఎవరు మీరు? డబల్. డబల్ చేస్తారా? సేవకు ప్రత్యక్ష ఫలము కూడా లభిస్తూ ఉంటుంది. ఎంత సమయమైతే ఉంటారో, అంత సమయమూ ఎక్స్ట్రా సంతోషము లభిస్తుంది కదా! కనుక ప్రత్యక్ష ఫలాన్ని కూడా తింటారు, ఆశీర్వాదాలు కూడా జమ అవుతాయి, భవిష్యత్తు కూడా తయారవుతుంది మరియు వర్తమానము కూడా తయారవుతుంది. పిల్లలు తమ ప్రారబ్ధాన్ని చాలా సహజంగా మరియు శ్రేష్ఠంగా తయారు చేసుకుంటున్నారు అని బాప్‌దాదాకు కూడా సంతోషము కలుగుతుంది. కేవలం సేవ, సేవ మరియు సేవ, అంతే. వేరే ఏ విషయాలలోకి వెళ్ళకండి. సేవ అనగా జమ చేసుకోవటము. ఎంత సమయమైతే లభిస్తుందో అంత సమయమూ డబల్ సంపాదన చేసుకోండి. ప్రత్యక్ష ఫలము కూడా, భవిష్య ఫలము కూడా. సేవా అవకాశము కూడా ఆత్మలైన మీకు ప్రాప్తించింది. సేవాధారుల పట్ల బాప్‌దాదాకు విశేష ప్రేమ ఉంటుంది ఎందుకంటే బాప్‌దాదా కూడా విశ్వ సేవకుడు. కనుక సమానులయ్యారు కదా! మనసును బిజీగా పెట్టుకుంటారా లేక ఖాళీగా పెట్టుకుంటారా? మధుబన్ అనగా స్మృతి మరియు సేవ. నడుస్తూ-తిరుగుతూ మనసు స్మృతిలో మరియు సేవలో బిజీగా ఉండాలి. అందరూ సంతోషముగా ఉంటారా? అప్పుడప్పుడు సంతోషముగా ఉండేవారైతే కారు కదా? సదా సంతోషముగా ఉండేవారు. మీ సంతోషాన్ని చూసి ఇతరులు కూడా సంతోషిస్తారు. సేవాధారులకు కూడా టర్న్ లభించింది, సంతోషముగా ఉన్నారు కదా! విశేషంగా టర్న్ లభించింది కదా? మధుబన్ వారి నిమిత్తంగా మీకు కూడా సువర్ణావకాశము లభించింది. స్వయం సదా స్వమానములో ఉంటూ ఎగురుతూ ఉండండి. స్వమానాన్ని ఎప్పుడూ వదలకండి. చీపురుతో ఊడుస్తున్నా కానీ మీ స్వమానము ఏమిటి? విశ్వములోని సర్వ ఆత్మలలో శ్రేష్ఠ ఆత్మను. కనుక ఏ పని చేస్తున్నా సరే మీ ఆత్మిక స్వమానాన్ని మర్చిపోకండి. నషా ఉంటుంది కదా, ఆత్మిక నషా, మేము ఎవరికి చెందినవారిగా అయ్యాము! భాగ్యము గుర్తుంటుంది కదా? మర్చిపోరు కదా? ఎంత సమయమైతే సేవ కోసం లభిస్తుందో అంత సమయమూ ప్రతి ఒక్క క్షణాన్నీ సఫలము చేసుకోండి. వ్యర్థముగా పోకూడదు, సాధారణముగా కూడా పోకూడదు. ఆత్మిక నషాలో, ఆత్మిక ప్రాప్తులలో సమయము గడవాలి. అటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటారు కదా. అచ్ఛా!