Search for a command to run...
25 Oct 2002
‘‘బ్రాహ్మణ జీవితానికి ఆధారము - పవిత్రత యొక్క రాయల్టీ’’
25 October 2002 · తెలుగు
ఈరోజు స్నేహ సాగరుడు తమ స్నేహీ పిల్లలను చూస్తున్నారు. నలువైపులా ఉన్న స్నేహీ పిల్లలు ఆత్మిక సూక్ష్మ దారముతో బంధింపబడి తమ మధురమైన ఇంటికి చేరుకున్నారు. పిల్లలు ఏ విధంగా స్నేహములో ఆకర్షింపబడి చేరుకున్నారో, అలాగే బాబా కూడా పిల్లల స్నేహమనే దారముతో బంధింపబడి పిల్లల సమ్ముఖానికి చేరుకున్నారు. బాప్‌దాదా చూస్తున్నారు, నలువైపులా ఉన్న పిల్లలు కూడా దూరముగా కూర్చుని ఉన్నా కానీ స్నేహములో నిమగ్నమై ఉన్నారు. సమ్ముఖములో ఉన్న పిల్లలను కూడా చూస్తున్నారు మరియు దూరముగా కూర్చుని ఉన్న పిల్లలను కూడా చూస్తూ-చూస్తూ హర్షిస్తున్నారు. ఈ ఆత్మిక అవినాశీ స్నేహము, పరమాత్మ స్నేహము, ఆత్మిక స్నేహము మొత్తము కల్పములో ఇప్పుడే అనుభవం చేస్తున్నారు.
బాప్‌దాదా పిల్లల ప్రతి ఒక్కరి పవిత్రత యొక్క రాయల్టీని చూస్తున్నారు. బ్రాహ్మణ జీవితము యొక్క రాయల్టీనే ప్యూరిటీ (పవిత్రత). పిల్లలు ప్రతి ఒక్కరి తలపై ఆత్మిక రాయల్టీకి గుర్తుగా పవిత్రతకు చెందిన ప్రకాశ కిరీటాన్ని చూస్తున్నాము. మీరందరూ కూడా మీ పవిత్రత యొక్క కిరీటాన్ని, ఆత్మిక రాయల్టీ యొక్క కిరీటాన్ని చూస్తున్నారా? వెనుక ఉన్నవారు కూడా చూస్తున్నారా? కిరీటధారుల సభ ఎంతటి శోభాయమానంగా ఉంది. పాండవులూ, అవును కదా? కిరీటము మెరుస్తూ ఉంది కదా! అటువంటి సభను చూస్తున్నారు కదా! కుమారీలు, కిరీటధారులైన కుమారీలే కదా! పిల్లల రాయల్ ఫ్యామిలీ ఎంతటి శ్రేష్ఠమైనది అన్నదానిని బాప్‌దాదా చూస్తున్నారు! మీ అనాది రాయల్టీని గుర్తు తెచ్చుకోండి, ఆత్మలైన మీరు పరంధామములో ఉన్నప్పుడు కూడా, ఆ ఆత్మ రూపములో కూడా మీ ఆత్మిక రాయల్టీ విశేషమైనది. ఆత్మలందరూ కూడా లైట్ రూపములో ఉంటారు కానీ మీ మెరుపు సర్వాత్మలలోకెల్లా శ్రేష్ఠమైనది. పరంధామము గుర్తొస్తుందా? అనాది కాలము నుండి మీ మెరుపు, శుద్ధ గర్వము అతీతమైనది. ఏ విధముగా ఆకాశములో చూసి ఉంటారు కదా, సితారలన్నీ మెరుస్తూ ఉంటాయి, అన్నింటిలోనూ ప్రకాశము ఉంటుంది కానీ, అన్ని సితారలలోకీ కొన్ని విశేషమైన సితారల మెరుపు అతీతంగా మరియు ప్రియంగా ఉంటుంది. అలాగే ఆత్మలందరి మధ్యలో మీ ఆత్మల మెరుపు ఆత్మిక రాయల్టీ, ప్యూరిటీ యొక్క మెరుపు అతీతమైనది. గుర్తొస్తూ ఉంది కదా? ఆ తర్వాత ఆది కాలములోకి రండి, ఆదికాలమును గుర్తు చేసుకున్నట్లయితే ఆది కాలములో కూడా దేవతా స్వరూపములో ఆత్మిక రాయల్టీ యొక్క పర్సనాలిటీ ఎంత విశేషమైనదిగా ఉంది? మొత్తము కల్పములో దేవతా స్వరూపములో ఉన్న రాయల్టీ మరెవరికైనా ఉండేదా? ఆత్మిక రాయల్టీ, ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ (వ్యక్తిత్వం) గుర్తుంది కదా! పాండవులకు కూడా గుర్తుందా? గుర్తొచ్చిందా? ఆ తర్వాత మధ్యకాలములోకి వస్తే, మధ్యకాలమైన ద్వాపరము నుండి మొదలుకుని మీ పూజ్య చిత్రాలను ఏవైతే తయారుచేస్తారో, ఆ చిత్రాల రాయల్టీ మరియు పూజ యొక్క రాయల్టీ ద్వాపరము నుండి ఇప్పటివరకు మరే చిత్రానికైనా ఉందా? చిత్రాలైతే చాలామందివి ఉన్నాయి, కానీ ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరే ఆత్మలకైనా ఉందా? ధర్మపితలవైనా, నేతలవైనా, అభినేతలవైనా, చిత్రాలైతే అందరివీ తయారవుతాయి, కానీ చిత్రాలలోని రాయల్టీని మరియు పూజలోని రాయల్టీని ఎవరిదైనా చూసారా? డబల్ విదేశీయులు తమ పూజను చూసారా? మీరు చూసారా లేక కేవలం విన్నారా? ఇటువంటి విధిపూర్వకమైన పూజ మరియు చిత్రాలలోని మెరుపు, ఆత్మికత మరెవ్వరికీ ఇంతవరకు లేదు మరియు ఉండదు కూడా. ఎందుకని? అది పవిత్రత యొక్క రాయల్టీ, పవిత్రత యొక్క పర్సనాలిటీ. అచ్ఛా, మీ పూజను చూసుకున్నారా? చూడకపోతే చూడండి. ఇప్పుడు చివరకు అనగా సంగమయుగానికి వచ్చినట్లయితే సంగమములో కూడా మొత్తము విశ్వములో పవిత్రత యొక్క రాయల్టీనే బ్రాహ్మణ జీవితానికి ఆధారము. పవిత్రత లేకపోతే ప్రభు ప్రేమ యొక్క అనుభవము కూడా ఉండదు. పరమాత్ముని సర్వ ప్రాప్తుల అనుభవము ఉండదు. బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ పవిత్రత మరియు పవిత్రతయే ఆత్మిక రాయల్టీ. కనుక ఆది అనాదిలో, ఆదిమధ్యాంతాలలో, మొత్తం కల్పములో ఈ ఆత్మిక రాయల్టీ ఉంటూ ఉంది.
మరి మిమ్మల్ని మీరు చూసుకోండి - దర్పణమైతే మీ అందరి వద్దా ఉంది కదా? దర్పణము (అద్దము) ఉందా? చూసుకోగలరా? మరి చూసుకోండి. మా లోపల పవిత్రత యొక్క రాయల్టీ ఎంత శాతము ఉంది? మా ముఖములో పవిత్రతతో కూడిన మెరుపు కనిపిస్తుందా? నడవడికలో పవిత్రతతో కూడిన శుద్ధ గర్వము కనిపిస్తుందా? శుద్ధ గర్వము అనగా నషా. నడవడికలో ఆ శుద్ధ గర్వము అనగా ఆత్మిక నషా కనిపిస్తుందా? మిమ్మల్ని మీరు చూసుకున్నారా? చూసుకునేందుకు ఎంత సమయము పడుతుంది? ఒక్క క్షణం కదా? మరి అందరూ స్వయాన్ని చూసుకున్నారా?
కుమారీలు:- మెరుపు, శుద్ధ గర్వము ఉన్నాయా? మంచిది, అందరూ లేవండి, నిలబడండి. (కుమారీలు ఎరుపు రంగు పట్టీలు వేసుకుని ఉన్నారు, దానిపై ఏకవ్రత అని వ్రాసి ఉంది). సుందరంగా అనిపిస్తుంది కదా. ఏకవ్రత యొక్క అర్థమే పవిత్రత యొక్క రాయల్టీ. మరి ఏకవ్రత పాఠాన్ని పక్కా చేసుకున్నారా! అక్కడికి వెళ్ళి మళ్ళీ కచ్చాగా అవ్వకూడదు. కుమారుల గ్రూప్ లేవండి. కుమారుల గ్రూప్ కూడా బాగుంది. కుమారులు మనసులో ప్రతిజ్ఞా పట్టీని ధరించారు, వీరు (కుమారీలు) బయటకు కూడా ధరించారు. ఏ ప్రతిజ్ఞా పట్టీని ధరించారంటే - సదా అనగా నిరంతరము పవిత్రత యొక్క పర్సనాలిటీలో ఉండే కుమారులము అని. అటువంటివారే కదా? అవును అని చెప్పండి. కాదా లేక అవునా? లేకపోతే అక్కడకు వెళ్ళి - కొంచెం, కొంచెం ఢీలా అయిపోయాము అని ఉత్తరం వ్రాస్తారా? అలా చెయ్యకండి. ఎప్పటివరకైతే బ్రాహ్మణ జీవితములో జీవించి ఉండాలో, అప్పటివరకు సంపూర్ణ పవిత్రముగా ఉండాల్సిందే. అటువంటి ప్రతిజ్ఞను చేసారా? పక్కా ప్రతిజ్ఞ అయితే చేయి ఊపండి. టి.వి.లో మీ ఫోటో తీస్తున్నారు. ఎవరైతే ఢీలా అవుతారో వారికి ఈ చిత్రాన్ని పంపుతాము, అందుకే ఢీలా అవ్వకండి, పక్కాగా ఉండండి. అవును, పక్కాగా ఉన్నారు, పాండవులైతే పక్కాగా ఉంటారు. పక్కా పాండవులు, చాలా మంచిది.
పవిత్రత యొక్క వృత్తి అనగా శుభ భావన, శుభ కామన. ఎవరు ఎలా ఉన్నా కానీ పవిత్ర వృత్తి అనగా శుభ భావన, శుభ కామన మరియు పవిత్ర దృష్టి అనగా సదా ప్రతి ఒక్కరినీ ఆత్మిక రూపములో చూడటము లేక ఫరిశ్తా రూపములో చూడటము. కనుక వృత్తి, దృష్టి మరియు మూడవది కృతి, అనగా కర్మలలో, కర్మలలో కూడా సదా ప్రతి ఆత్మకు సుఖాన్ని ఇవ్వటము మరియు సుఖాన్ని తీసుకోవటము. ఇది పవిత్రతకు గుర్తు. వృత్తి, దృష్టి మరియు కృతి, మూడింటిలోనూ ఈ ధారణ ఉండాలి. ఎవరు ఏం చేసినా గాని, దుఃఖాన్ని ఇచ్చినా గాని, అవమానించినాగానీ మన కర్తవ్యం ఏమిటి? దుఃఖాన్ని ఇచ్చేవారిని ఫాలో చెయ్యాలా లేక బాప్‌దాదాను ఫాలో చెయ్యాలా? ఫాలో ఫాదర్ చెయ్యాలి కదా! మరి బ్రహ్మాబాబా దుఃఖాన్ని ఇచ్చారా లేక సుఖాన్ని ఇచ్చారా? సుఖాన్ని ఇచ్చారు కదా! మరి మాస్టర్ బ్రహ్మా అయిన మీరు అనగా బ్రాహ్మణ ఆత్మలు ఏం చెయ్యాలి? ఎవరైనా దుఃఖాన్ని ఇస్తే మీరేం చేస్తారు? మీరూ దుఃఖాన్ని ఇస్తారా? ఇవ్వరా? ఒకవేళ వారు చాలా దుఃఖాన్నిస్తే? చాలా నిందిస్తే, చాలా అవమానపరిస్తే కొంచెమైతే ఫీల్ అవుతారా లేక ఫీలవ్వరా? కుమారీలు ఫీల్ అవుతారా? కొంచెం. ఫాలో ఫాదర్ చెయ్యండి. నా కర్తవ్యము ఏమిటి అన్నదాని గురించి ఆలోచించండి. వారి కర్తవ్యాన్ని చూసి మీ కర్తవ్యాన్ని మర్చిపోకండి. వారు నిందిస్తున్నారు, మీరు సహనశీల దేవీలుగా, సహనశీల దేవతలుగా అవ్వండి. మీ సహనశీలతతో నిందించేవారు కూడా మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటారు. సహనశీలతలో ఇంతటి శక్తి ఉంది, కానీ కొద్ది సమయమైతే సహించాల్సి ఉంటుంది. కనుక మీరు సహనశీలతా దేవతలు మరియు దేవీలు కదా? అంతేనా? సదా ఇదే స్మృతిలో ఉంచుకోండి - నేను సహనశీలతా దేవతను, నేను సహనశీలతా దేవిని. దేవత అనగా ఇచ్చే దాత, ఎవరైనా నిందిస్తే, గౌరవించకపోతే, అది చెత్త కదా లేక మంచిదా? మరి మీరెందుకు తీసుకుంటారు? చెత్తను తీసుకోవటం జరుగుతుందా ఏమిటి? ఎవరైనా మీకు చెత్తనిస్తే మీరు తీసుకుంటారా? తీసుకోరు కదా. గౌరవించరు, అవమానిస్తారు, నిందిస్తారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తారు, ఇవన్నీ ఏమిటి? మంచి విషయాలా? మరి మీరెందుకు తీసుకుంటారు? కొద్దికొద్దిగా అయితే తీసుకుంటారు. అయ్యో, తీసుకోకుండా ఉండాల్సింది అని తర్వాత ఆలోచిస్తారు. కనుక ఇప్పుడిక తీసుకోకూడదు. తీసుకోవటము అనగా మనసులో దానిని ధారణ చెయ్యటము, ఫీల్ అవ్వటము. మరి మీ అనాది కాలము, ఆది కాలము, మధ్య కాలము, సంగమ కాలము, మొత్తము కల్పములోని పవిత్రత యొక్క రాయల్టీని, పర్సనాలిటీని గుర్తు చేసుకోండి. ఎవరు ఏం చేసినా కానీ మీ పర్సనాలిటీని ఎవ్వరూ లాక్కోలేరు. ఈ ఆత్మిక నషా ఉంది కదా? డబల్ విదేశీయులకైతే డబల్ నషా ఉంది కదా! డబల్ నషా ఉందా? అన్ని విషయాలలోనూ డబల్ నషా. పవిత్రతలో కూడా డబల్ నషా, సహనశీలతా దేవీ-దేవతలుగా అవ్వడములో కూడా డబల్ నషా. డబల్ ఉంది కదా? కేవలం అమరులుగా ఉండండి. అమర భవ అన్న వరదానాన్ని ఎప్పుడూ మర్చిపోకండి.
అచ్ఛా - ప్రవృత్తిలో ఉన్నవారు అనగా యుగళులు, అసలైతే సింగల్‌గా ఉంటారు, కానీ అనటానికి యుగళులు అని అంటాము, వారు లేవండి, నిలబడండి. యుగళులైతే చాలామంది ఉన్నారు. కుమార్, కుమారీలైతే తక్కువమంది ఉన్నారు. కుమారుల కంటే యుగళులు ఎక్కువమంది ఉన్నారు. యుగళమూర్తి అయిన బాప్‌దాదా మీ అందరికీ ప్రవృత్తిలో ఉండమనే డైరెక్షన్ ను ఎందుకని ఇచ్చారు? మీకు యుగళులుగా ఉండేందుకు అనుమతిని ఎందుకు ఇచ్చాము? ప్రవృత్తిలో ఉండమనే అనుమతిని ఎందుకు ఇచ్చామో తెలుసా? ఎందుకంటే యుగళుల రూపములో ఉంటూ ఈ మహామండలేశ్వరులను మీ పాదాలపై వంగేటట్లుగా చేయాలి. అంతటి ధైర్యము ఉందా? వాళ్ళు అంటారు, కలిసి ఉంటూ పవిత్రముగా ఉండటము కష్టము అని, కానీ మీరేమి అంటారు? కష్టమా లేక సహజమా? (చాలా సహజము). పక్కానా? లేకపోతే ఒక్కోసారి ఈజీ (సులభం)గా, ఒక్కోసారి లేజీ (సోమరులు)గా ఉంటారా? అందుకే బాప్‌దాదా డ్రామానుసారముగా మిమ్మల్నందరినీ ప్రపంచము ముందు, విశ్వము ముందు ఉదాహరణగా తయారుచేసారు. వారితో ఛాలెంజ్ చేసేందుకు ఇలా ఉదాహరణగా చేసారు. కనుక ప్రవృత్తిలో ఉంటూ కూడా నివృత్తులుగా, అపవిత్రత నుండి నివృత్తులుగా ఉండగలరా? మరి ఛాలెంజ్ చేసేవారే కదా? అందరూ ఛాలెంజ్ చేసేవారేనా, కొద్దికొద్దిగా భయపడటమైతే లేదు కదా! ఛాలెంజ్ అయితే చేసాము కానీ ఏం జరుగుతుందో తెలియదు అని అనుకోవటం లేదు కదా! కావున విశ్వాన్ని ఛాలెంజ్ చెయ్యండి ఎందుకంటే ఇక్కడ కొత్త విషయమేమిటంటే, కలిసి ఉంటూ కూడా స్వప్నమాత్రము కూడా అపవిత్రతా సంకల్పము రాకూడదు, ఇదే సంగమయుగ బ్రాహ్మణ జీవితము యొక్క విశేషత. విశ్వమనే షోకేస్ లో మీరు ఉదాహరణ, శ్యాంపుల్ అనండి లేక ఉదాహరణ అనండి. మిమ్మల్ని చూసి - మేము కూడా అవ్వగలము అని అందరిలోనూ శక్తి వస్తుంది. సరేనా? శక్తులూ, సరేనా? పక్కాగా ఉన్నారు కదా? కచ్చా-పక్కాగా అయితే లేరు కదా? పక్కాగా ఉన్నారు. బాప్‌దాదా కూడా మిమ్మల్ని చూసి సంతోషిస్తారు. అభినందనలు. ఎంతమంది ఉన్నారో చూడండి? చాలా మంచిది.
ఇక మిగిలింది టీచర్లు. టీచర్లు లేకుండానైతే గతే ఉండదు. టీచర్లు లేవండి. అచ్ఛా - పాండవులు కూడా మంచి-మంచివారు ఉన్నారు. వాహ్! టీచర్ల విశేషత ఏమిటంటే - ప్రతి టీచరు యొక్క ఫీచర్స్ ద్వారా ఫ్యూచర్ (భవిష్యత్తు) కనిపించాలి. ప్రతి ఒక్క టీచరు యొక్క ఫీచర్స్ ద్వారా ఫరిశ్తా స్వరూపము కనిపించాలి. అటువంటి టీచర్లే కదా! ఫరిశ్తాలైన మిమ్మల్ని చూసి ఇతరులు కూడా ఫరిశ్తాలుగా అయిపోవాలి. ఎంతమంది టీచర్లు ఉన్నారో చూడండి. విదేశీయుల గ్రూపులో కూడా టీచర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడైతే కొద్దిమందే వచ్చారు. ఎవరైతే రాలేదో వారిని కూడా బాప్‌దాదా గుర్తు చేస్తున్నారు. మంచిది, ఇప్పుడు టీచర్లందరూ కలిసి ఒక ప్లాన్ తయారుచెయ్యండి, అదేమిటంటే - తమ నడవడిక మరియు ముఖము ద్వారా బాబాను ఎలా ప్రత్యక్షము చెయ్యాలి? పరమాత్మ సర్వవ్యాపి అని ప్రపంచములోని వారు అంటారు కానీ మీరు వారు సర్వవ్యాపి కారు అని అంటారు. కానీ బాప్‌దాదా అంటారు - ఇప్పుడు సమయమనుసారంగా ప్రతి టీచరులోనూ బాబా ప్రత్యక్షంగా కనిపించినట్లయితే వారు సర్వవ్యాపిగానే కనిపిస్తారు కదా! ఎవరిని చూసినా వారిలో బాబాయే కనిపించాలి. ఆత్మ అనేది పరమాత్మ ముందు దాగిపోవాలి మరియు పరమాత్మయే కనిపించాలి. ఇది వీలవుతుందా? అచ్ఛా, దీని తారీఖు ఏమిటి? తారీఖైతే ఫిక్స్ అవ్వాలి కదా? మరి దీని తారీఖు ఏమిటి? ఎంత సమయము కావాలి? (ఇప్పటి నుండే మొదలుపెడతాము) మొదలుపెడతారా, మంచి ధైర్యము ఉంది, ఎంత సమయము కావాలి? 2002 సంవత్సరమైతే నడుస్తుంది. ఈ రెండు వేలలో ఎంతవరకు చేస్తారు? కనుక టీచర్లు ఈ అటెన్షన్యే పెట్టాలి - కేవలం ఇప్పుడు బాబాలో నేను లీనమై ఉన్నట్లు కనిపించాలి, నా ద్వారా బాబా కనిపించాలి. ప్లాన్‌ను తయారుచేస్తారు కదా! డబల్ విదేశీయులు మీటింగ్‌లు చెయ్యటంలోనైతే తెలివైనవారు కదా? ఇప్పుడు ఈ మీటింగ్ చెయ్యండి - మన ప్రతి ఒక్కరిలో బాబా కనిపించటం ఎలా అని, ఈ మీటింగ్ చెయ్యకుండా వెళ్ళకండి. ఇప్పుడు బ్రహ్మాకుమారీలు కనిపిస్తున్నారు, బ్రహ్మాకుమారీలు చాలా మంచివారు అని కనిపిస్తున్నారు కానీ వీరి బాబా ఎంత మంచివారు అన్నది వారు చూడాలి. అప్పుడే కదా విశ్వ పరివర్తన జరుగుతుంది! మరి డబల్ విదేశీయులు ఈ ప్లాన్‌ను ప్రాక్టికల్‌గా ప్రారంభిస్తారు కదా! ప్రారంభిస్తారా? పక్కానా! అచ్ఛా! అప్పుడు మీ దాదీ ఉన్నారు కదా, వారి ఆశ పూర్తవుతుంది. సరేనా? అచ్ఛా!
అధర్ కుమారులు మరియు మాతలు:- ఎవరైతే ఒంటరిగా ఉన్నారో వారు నిల్చోండి. మంచిది, మీరు కూడా ఒంటరివారు కాదు. మీ జీవితతోడు చాలా శక్తిమంతుడు. ఎందుకంటే బాప్‌దాదా పిల్లలందరికీ చెప్తున్నారు. మీరందరూ అనగా మీరు మరియు బాబా కంబైండ్. కంబైండ్‌గా ఉంటున్నప్పుడు ఒంటరివారు అయ్యారా? లౌకిక జీవితం అనేది వేరే విషయం, కానీ మీరు బ్రాహ్మణ జీవితంలో కంబైండ్‌గా ఉన్నారు. ఎంత కంబైండ్‌గా ఉన్నారు అంటే ఎవరూ కూడా వేరు చేయలేరు, అంత కంబైండ్‌గా ఉన్నారు కదా! లేక ఒంటరిగా ఉన్నారా? కంబైండ్ కదా! మీ ప్రతి కార్యంలో సదా బాబా మీకు సహయోగిగా ఉంటారు. మీకు తోడుగా ఉంటారు. ఈ నషా ఉంటుంది కదా? లేక ఒంటరిగా ఉన్నారా? కంబైండ్‌గా ఉన్నారా? సదా ప్రతి కార్యంలో బాబాకి సహయోగులు, సహచరులు. ఈ నషా ఉంటుంది కదా? ఎప్పుడూ మిమ్మల్ని మీరు ఒంటరిగా భావించడం లేదు కదా? అప్పుడప్పుడు భావిస్తున్నారా? లేదు కదా? మొదట బాప్‌దాదా మీ అందరి సహచరుడు మరియు తోడుగా నిలిచేవారు, బాబా అనగానే బాబా హాజరవుతారు. మజాలో ఉంటున్నారు కదా! ఉదాసీనంగా అవ్వటం లేదు కదా! అవుతున్నారా? అవును లేదా కాదు అని చెప్పటం లేదు. ఉదాసీనంగా లేరు కదా! మజాలో ఉంటున్నారు కదా! మజాయే మజా, మేము బాబా వారిమి, బాబా మా వారు. బాబా మీ యొక్క ప్రతీ సేవలో సహయోగం ఇస్తారు. అందువలన బాబా మరియు నేను కంబైండ్ అనే ఆత్మిక నషాలోనే సదా ఉండండి. కంబైండ్ కదా! చాలా మంచి ఆత్మిక నషా ఉన్నవారు ఉన్నారు. నషా ఉంది కదా! బాప్‌దాదాకు అతి ప్రియాతి ప్రియమైనవారు.
చిన్న పిల్లలు కూడా వచ్చారు:- పిల్లలు బాప్‌దాదాకు స్పెషల్ కార్డును పంపించారు. కార్డును పంపించారు కదా? మీ అందరి కార్డులు లభించాయి. విన్నారా పిల్లలూ? మంచి మంచి కార్డులు ఉన్నాయి. (అందరికీ కార్డులను చూపించారు) చాలా మంచి కార్డులు వ్రాసారు. పిల్లల యొక్క అద్భుతాన్ని చూసారు కదా! పిల్లల యొక్క తపన బాగుంది అందువలనే ఇక్కడికి వచ్చారు. ఈ తపనయే, పిల్లలకి బాబాపై ఉన్న ప్రేమయే వారిని ముందుకు నడిపిస్తూ ఉంటుంది.
మొదటిసారి చాలామంది వచ్చారు:- మంచిది. చేతులెత్తుండి. మొదటసారి వచ్చినవారు మొదటి నెంబరులోకి వెళ్ళాలి. లాస్ట్ సో ఫాస్ట్ అవ్వాలి. అంతే కదా! ఫాస్ట్ వెళ్తారు కదా, మొదటి నెంబరు తీసుకోవాలి. మొత్తం బ్రాహ్మణ పరివారం మొదటిసారి వచ్చిన మీ అందరికీ చాలా-చాలా-చాలా శుభాకాంక్షలు ఇస్తున్నారు. మంచిది.
ఇక భారతవాసులు ఎవరైతే కూర్చున్నారో వారు నిల్చోండి:- భారతదేశం మహాన్ దేశం అయితే భారతవాసులు కూడా మహాన్ ఆత్మలు. భారతదేశం అంటే బాబాకి ప్రేమ అందువలన భారతదేశంలోనే వచ్చారు. విదేశంలో రాలేదు, భారతదేశంలోనే వచ్చారు. కానీ విదేశీయులు, భారతదేశవాసులను మేల్కొల్పేందుకు నిమిత్తం అవుతారు. భారతవాసులు అయితే అవకాశం తీసుకోవటంలో తెలివైనవారు. డబల్ విదేశీయుల మిలనంలో కూడా ఎంతమంది భారతవాసులు వచ్చారో చూడండి? అందువలనే ఇప్పుడు భారతవాసుల మిలనంలో డబల్ విదేశీయులకి కూడా ఆహ్వానం ఉంది. స్వాగతం. డబల్ విదేశీయులు తెలివైనవారు. అక్కడికి వెళ్తూనే ముందుగానే టికెట్ కొరకు ధనం జమ చేసుకుంటారు. మధువనం అంటే కూడా ప్రేమ కదా! మధువనం లేదా భారతదేశం అంటే మాకు ప్రేమ అంటారు ఎందువలన? ఎందుకంటే వాస్తవానికి మీరందరూ భారతవాసులు. సేవ కారణంగా విదేశానికి వెళ్ళారు. ఒకవేళ మీరు ఒకప్పుడు భారతవాసులు కాకపోతే భారతదేశ చరిత్రతో కూడా మీకు ప్రేమ ఉండదు. భారతదేశ సంస్కృతితో కూడా ప్రేమ ఉండదు. కానీ మీకు ప్రేమ ఉంది అంటే మీరు భారతవాసులే. కేవలం విశ్వసేవార్థం అక్కడికి వెళ్ళారు. విశ్వసేవార్థం వేర్వేరు స్థానాలకు వెళ్ళారు. భాషలు కూడా ఎన్ని ఉన్నాయో చూడండి. భారత్ వారు సేవ చేయాలంటే ఆ భాషలు నేర్చుకోవాల్సి ఉంటుంది. అందువలన సేవ కొరకే మీకు అక్కడ జన్మ లభించింది. ఆదిలో అనగా సత్యయుగంలో భారతదేశంలోనే ఉండేవారు, మధ్యలో కూడా భారతదేశంలోనే ఉండేవారు ఇప్పుడు కొద్ది సమయం కొరకు సేవ కొరకు విదేశం వెళ్ళారు. మేము భారతీయులమే అనే నషా ఉంది కదా! సంతోషం ఉంది కదా! ఒకప్పుడు భారతీయులే, ఇప్పుడు మరియు ఇక ముందు కూడా భారతీయులే. ప్రతీ కల్పంలో అవుతారు. అచ్ఛా.
పీస్ ఆఫ్ మైండ్ రిట్రీట్‌కు వచ్చిన అతిథులు కూడా కూర్చుని ఉన్నారు:- మంచిది, మీరందరూ గెస్ట్ (అతిథులు కారు), హోస్ట్. పిల్లలందరూ గెస్ట్ కాదు, హోస్ట్. గుర్తు కోసం గెస్ట్ అని అనడం జరుగుతుంది, కానీ మీరు హోస్ట్. మధుబన్ మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు ఇతరులను కూడా ఆహ్వానించి మీకు సహచరులుగా చేయండి. మేము పరమాత్మ సందేశాన్ని ఇచ్చే సందేశ వాహకులము అని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మంచిది. మరి సదా బాబా స్మృతి మరియు సేవను చేస్తూ ఉండండి. అచ్ఛా.
పాండవ భవన్లో చాలామంది కూర్చున్నారు, జ్ఞాన సరోవర్, శాంతివన్ అన్ని చోట్ల కూర్చుని వింటున్నారు:- సైన్సు యొక్క లాభాన్ని మీరు తీసుకుంటున్నారు. సైన్సు మీ కొరకే తయారయ్యింది. స్థాపన యొక్క పాత్రకి కొద్ది సమయం ముందు నుండే సైన్సు యొక్క ఆవిష్కరణలు తీవ్రతరం అయ్యాయి. ప్రజలు సైన్సు నుండి లాభం తీసుకున్నా, నష్టం తీసుకున్నా కానీ మీరు మాత్రం లాభమే తీసుకుంటున్నారు. కదా! అందువలన బాప్‌దాదా, సైన్సు సాధనాలను ఇచ్చే వారికి కూడా శుభాకాంక్షలు చెప్తున్నారు. క్రింద కూడా విశ్రాంతిగా వింటున్నారు. విదేశాలలో కూడా కొంతమంది వింటున్నారు. మోహిని అక్కయ్య (న్యూయార్క్) మరియు చంద్రా అక్కయ్య (శాన్ఫ్రాన్సిస్కో) కూడా వింటున్నారు. (న్యూయార్క్ మోహిని అక్కయ్యకు ఆపరేషన్ జరిగింది) ఏది వచ్చినా కానీ అంటే శారీరక రోగం వచ్చినా, సేవకు అవకాశం వచ్చినా రెండింటినీ తమ శక్తి ద్వారా దాటి విజయి అవుతున్నారు. శారీరక రోగం అనేది కూడా ఒక పరీక్ష. ఇతర పరీక్షలలో ఎలా అయితే పాస్ అవుతున్నారో ఇది కూడా ఒక పరీక్ష, దీనిలో కూడా పాస్ అవుతూ ఉన్నారు మరియు సహజంగా పాస్ అవుతున్నారు.
మధుబన్ నివాసులు అందరికీ అంటే శాంతివన్ వారిని, హాస్పిటల్ వారిని, ఇక్కడ ఆబూ నివాసులను, జ్ఞాన సరోవర్ నివాసులను, సంగమ్ నివాసులను, అందరినీ బాప్‌దాదా మధుబన్ నివాసులు అంటారు. ఇతరులకు అవకాశం ఇచ్చి మంచి పుణ్యాన్ని జమ చేసుకున్నారు. అవకాశం ఇవ్వటం కూడా మీకు పుణ్య ఖాతాలో జమ అయిపోయింది. విశ్రాంతిగా కూర్చుని వింటున్నారు. ఎవరైతే క్రింద కూర్చుని వింటున్నారో వారిని బాప్‌దాదా కూడా మొదట స్మృతి చేస్తున్నారు. వారితో పాటు ఎవరైతే విదేశంలో వింటున్నారో వారిని, ఎవరైతే దూరంగా కూర్చుని వింటున్నారో వారిని, భారతదేశంలో అయినా, విదేశంలో అయినా మొదట వారికి స్మృతిని ఇస్తున్నాము. అలాగే పిల్లలందరూ ఎవరైతే కార్డులు, ఉత్తరాలు పంపించారో వారందరి ఉత్తరాలు, కార్డులు, మనస్సు యొక్క సమాచారం, సేవ యొక్క సమాచారం, ధైర్యం యొక్క సమాచారం అన్నీ బాప్‌దాదా దగ్గరకు చేరుకున్నాయి. ఇందుకు రిటర్న్‌గా బాప్‌దాదా ఒక్కొక్క పిల్లవానికి పేరుపేరున మనస్సులో చాలా, చాలా ప్రియస్మృతులు ఇస్తున్నారు. చాలా ప్రేమతో ఉత్తరాలు వ్రాస్తారు. ఎంత ఖర్చు చేస్తున్నారు! ఎంత మంచి కార్డులు పంపిస్తున్నారు! కానీ బాప్‌దాదా ఖర్చు చూడటంలేదు, వారి యొక్క ప్రేమను చూస్తున్నారు. ప్రేమ ముందు ఏదీ గొప్ప వస్తువు కాదు. అచ్ఛా.
హాస్పిటల్ ట్రస్టీలు కూడా అందరూ వచ్చారు:- మంచిది, ఈ హాస్పటల్ కూడా విశ్వంలో ధ్వని వ్యాపింపచేయడానికి మంచి సాధనం. ఎందుకంటే దీనిలో డబల్ లాభం లభిస్తుంది. ఒకటి శరీరానికి మరియు రెండు, ఆత్మకి కూడా లాభం లభిస్తుంది. అందువలన బాప్‌దాదా హాస్పిటల్లో ఎవరైతే నిమిత్తంగా లేక సేవాధారిగా ఉన్నారో వారందరికీ విశేషంగా సేవ కోసం శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇది పేరుకు హాస్పిటల్ కానీ ఆత్మలను బాబాతో కలపడానికి సాధనం. హాస్పటల్ అనే పేరుతో సహజంగా అందరూ వస్తారు. అందరూ మంచిగా నడుస్తున్నారు కదా! ఎక్కడ హాస్పిటల్స్ ఉన్నాయో అవన్నీ మంచిగా నడుస్తున్నాయి కదా! బొంబాయి హాస్పిటల్ మంచిగా నడుస్తుందా? గ్లోబల్ హాస్పిటల్ యొక్క పేరు అయితే ప్రసిద్ధం అయిపోయింది. చాలా మంచిది, శుభాకాంక్షలు.
విదేశాల పాత అన్నయ్యలు, అక్కయ్యలను చూస్తూ:- ఆదిరత్నాలు కదా! ఛార్లీ మొదలైనవారు కూడా ఉన్నారు. ఈ ఆది రత్నాలు, విదేశీ సేవకు ఆదిరత్నాలు చాలా మంచి సేవాధారులు అని బాప్‌దాదాకు సంతోషంగా ఉంటుంది. అలసిపోనివారు మరియు ముందుకు వెళ్ళేవారు కూడా! (25 సంవత్సరాల నుంచి జ్ఞానంలో ఉన్నవారు చాలామంది కూర్చున్నారు) పెద్దగా చేతులు ఎత్తండి! మంచిది. అమరభవ యొక్క వరదానీలు. జన్మ నుండే అమరులు అన్న వరదానం లభించింది. అమరంగా ఉన్నారు, అమరంగా ఉంటారు. మంచిది! అందరితో మిలనం జరిగిందా లేక ఎవరైనా ఉండిపోయారా?
సింధీ గ్రూప్ ఉండిపోయింది:- సింధీ గ్రూప్ ఇప్పుడు బ్రాహ్మణ గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని మీరు సింధీలుగా భావిస్తున్నారా లేక బ్రాహ్మణులుగా భావిస్తున్నారా? ఏమని భావిస్తున్నారు? కానీ ఎక్కడ నుండి బ్రహ్మాబాబా వచ్చారో అక్కడివాళ్ళము మేము అనే నషా అయితే ఉంది. ఈ నషా మంచిదే కానీ ఇప్పుడు బ్రాహ్మణ పరివారం యొక్క విశేష సేవాధారి ఆత్మలు. సేవాధారులు కదా? మొత్తం గ్రూప్‌కు సేవపై ఆసక్తి ఉంది అని బాప్‌దాదాకు తెలుసు. నెమ్మది నెమ్మదిగా సింధీ గ్రూప్‌ను పెంచుతున్నారు, పెరుగుతుంది, పెరుగుతూనే ఉంటుంది. అందువలనే మీ అందరికీ డబల్ శుభాకాంక్షలు – ఒకటి, సింధీ వారిగా అయినందుకు మరియు రెండు, బ్రాహ్మణ జీవితానికి శుభాకాంక్షలు, అందరూ పక్కాగా ఉన్నారా! బాప్‌దాదా చూసి సంతోషిస్తున్నారు. అచ్ఛా.
డబల్ విదేశీయులు ఎంత మంచి సేవాధారులో చూడండి, మీ కారణంగా అందరికీ ప్రియస్మృతులు లభిస్తున్నాయి. బాప్‌దాదాకు కూడా డబల్ విదేశీయులపై ఎక్కువ ప్రేమ ఉంది అని అనరు కానీ విశేషమైన ప్రేమ ఉంది. ప్రేమ ఎందుకు ఉంది? ఎందుకంటే డబల్ విదేశీ ఆత్మలు ఎవరైతే సేవకు నిమిత్తమయ్యారో, వారు విశ్వములోని మూలమూలల్లో బాబా సందేశాన్ని చేర్చడానికి నిమిత్తమయ్యారు. లేదంటే విదేశాలలో నలువైపులా ఉన్న ఆత్మలు దప్పికతో ఉండిపోతారు. ఇప్పుడు బాబాకు ఫిర్యాదు అయితే రాదు కదా, బాబా భారత్‌లోకే వచ్చారు, విదేశాలలో ఎందుకు సందేశాన్ని ఇవ్వలేదు అని. కనుక బాబాపై ఫిర్యాదు రాకుండా ఉండేందుకు నిమిత్తం అయ్యారు. జనక్కు (జానకి దాదీకి) అయితే సందేశము అందకుండా ఏ దేశమూ మిగిలిపోకూడదు అని చాలా ఉల్లాసము ఉంది. మంచిది. బాబాపై వచ్చే ఫిర్యాదును తొలగిస్తారు కదా! కానీ వీరు (జానకి దాదీ) సహచరులను చాలా అలసిపోయేటట్లు చేస్తారు. అలసిపోయేటట్లు చేస్తారు కదా! జయంతి, అలసిపోయేటట్లు చేయటం లేదా? కానీ ఈ అలసటలో కూడా ఆనందము ఇమిడి ఉంది. పదే పదే ఏంటిది అని ముందు అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే భాషణ చేసి ఆశీర్వాదాలను తీసుకువస్తారో, అప్పుడు ముఖం మారిపోతుంది. మంచిది, ఇద్దరు దాదీలలోనూ ఉల్లాస-ఉత్సాహాలను పెంచే విశేషత ఉంది. వీరు శాంతిగా కూర్చోలేరు. ఇప్పుడింకా సేవ అయితే మిగిలి ఉంది కదా? ఒకవేళ మ్యాప్ పెట్టుకుని చూస్తే, భారత్‌లోనైనా లేక విదేశాలలోనైనా, ఒకవేళ మ్యాప్‌లో ఒక్కొక్క స్థానానికి రైట్ పెట్టుకుంటూ వెళ్తే, ఇప్పటికీ కొన్ని దేశాలు మిగిలిపోయి ఉన్నాయి అన్నది కనిపిస్తుంది. అందుకే బాప్‌దాదా సంతోషిస్తున్నారు కూడా మరియు ఎక్కువ అలసిపోయేటట్లు చేయకండి అని కూడా చెప్తున్నారు. మీరంతా సేవలో సంతోషంగా ఉన్నారు కదా! ఇప్పుడు ఈ కుమారీలు కూడా టీచర్లుగా అవుతారు కదా. ఎవరైతే టీచరుగా ఉన్నారో, వారు టీచరే కానీ ఎవరైతే టీచరుగా లేరో వారు టీచరుగా అయ్యి ఏదో ఒక సెంటర్‌ను సంభాళిస్తారు కదా. హ్యాండ్స్‌గా తయారవుతారు కదా! డబల్ విదేశీ పిల్లలకైతే రెండు పనులూ చేసే అభ్యాసమైతే ఉండనే ఉంది. ఉద్యోగము కూడా చేస్తారు, సెంటర్‌ను కూడా సంభాళిస్తారు, అందుకే బాప్‌దాదా డబల్ అభినందనలను కూడా ఇస్తారు. అచ్ఛా!
నలువైపులా ఉన్న అతి స్నేహి, అతి సమీప ఆత్మలు, సదా ఆదికాలము నుండి ఇప్పటివరకు రాయల్టీ యొక్క అధికారులు, సదా తమ ముఖము మరియు నడవడిక ద్వారా పవిత్రతా మెరుపును చూపించేవారు, సదా స్వయం సేవ మరియు స్మృతిలో తీవ్ర పురుషార్థము ద్వారా నంబరువన్‌గా అయ్యేవారు, సదా బాబా సమానంగా సర్వ శక్తుల, సర్వ గుణాల సంపన్న స్వరూపములో ఉండేవారు, అన్ని వైపులా ఉండే ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికీ బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీతో:- (ఆరోగ్యం బాగుంది) బాగా ఉంది, సదా బాగా ఉంటుంది. అందరి ఆశీర్వాదాలు లభించాయి కదా. ఆశీర్వాదాలు అన్నిటికంటే పెద్ద మందు. ఈ ఆశీర్వాదాలు అనే మందు సరిగ్గా చేస్తుంది, మిగతా అంతా నిమిత్తము. (మీరిచ్చే మందు కూడా రోజూ తీసుకుంటున్నాము) అది కూడా ఆశీర్వాదాలే. అందరికీ దాదీలపై ఎంతో ప్రేమ ఉంది. ఎంత ప్రేమ ఉంది? బాబాకైతే ప్రేమ ఉండనే ఉంది. కానీ సాకార రూపంలోనైతే మీరు ఉన్నారు కదా. నిమిత్తులు కదా!
విదేశీ ముఖ్య టీచర్ అక్కయ్యలతో:- అందరూ సేవా ప్లాన్లను చాలా మంచి మంచివి తయారుచేసారు కదా ఎందుకంటే సేవ సమాప్తమైన తర్వాతే మీ రాజ్యము వస్తుంది. కనుక సేవా సాధనము కూడా తప్పనిసరి. కానీ అది మనసా కూడా ఉండాలి, వాచా కూడా ఉండాలి, ఈ రెండూ కలిపి-కలిపి ఉండాలి. సేవ మరియు స్వ ఉన్నతి, రెండూ కలిసి ఉండాలి. ఇటువంటి సేవ సఫలతను సమీపంగా తీసుకువస్తుంది. మరి సేవకు నిమిత్తులుగా అయితే ఉండనే ఉన్నారు మరియు అందరూ తమ-తమ స్థానాలలో సేవను చాలా బాగా చేస్తున్నారు కూడా. ఇకపోతే, ఇప్పుడు ఏ పనినైతే ఇచ్చామో, దానికి సంబంధించిన ప్లాన్‌ను తయారుచెయ్యండి. దాని కొరకు స్వయములో మరియు సేవలో ఏయే వృద్ధి కావాలి, ఏమేమి చేర్చాలి అన్నదాని ప్లాన్‌ను తయారుచెయ్యండి. ఇకపోతే బాప్‌దాదా సేవాధారులను చూసైతే తప్పకుండా సంతోషిస్తారు. సేవాకేంద్రాలన్నీ బాగా ఉన్నతిలోకి వెళ్తున్నాయి కదా! ఉన్నతి ఉంది కదా? మంచిది. అంతా మంచిగా జరుగుతుంది కదా, జరుగుతూ ఉంది మరియు మున్ముందు కూడా జరుగుతుంది. కేవలము ఇప్పుడు చెయ్యవలసిందేమిటంటే, విడివిడిగా చెల్లాచెదురై ఉన్నవారి సంగఠన చేసి వారిని పక్కా చెయ్యండి. అందరి ముందూ ప్రాక్టికల్ ఋజువును చూపించండి. ఏ సేవ చేస్తున్నా సరే, రకరకాల ప్లాన్లు తయారుచేస్తున్నా సరే, చేస్తున్నారు కూడా, అవి బాగా నడుస్తున్నాయి కూడా, ఇప్పుడు ఇక వారందరి గ్రూప్‌లలో ఒకదానిని ఎదురుగా తీసుకురండి. సేవకు ఋజువు ఇప్పుడు మొత్తము బ్రాహ్మణ పరివారము ముందుకు రావాలి. సరేనా! ఇకపోతే, అందరూ మంచివారు, చాలా చాలా మంచివారు. అచ్ఛా!