Search for a command to run...
28 Mar 2002
‘‘ఈ సంవత్సరాన్ని నిర్మాణ, నిర్మల సంవత్సరముగా మరియు వ్యర్థము నుండి ముక్తులుగా అయ్యే ముక్తి సంవత్సరముగా జరుపుకోండి’’
28 March 2002 · తెలుగు
ఈరోజు బాప్‌దాదా నలువైపులా ఉన్న తమ పిల్లల మస్తకములో మెరుస్తున్న మూడు రేఖలను చూస్తున్నారు. ఒక రేఖ ప్రభు పాలన యొక్క రేఖ, రెండవ రేఖ శ్రేష్ఠ చదువు యొక్క రేఖ మరియు మూడవ రేఖ శ్రేష్ఠ మతము యొక్క రేఖ. మూడు రేఖలూ మెరుస్తున్నాయి. ఈ మూడు రేఖలు సర్వుల భాగ్యరేఖలు. మీరందరూ కూడా మీ మూడు రేఖలను చూస్తున్నారు కదా! ప్రభు పాలనా భాగ్యము బ్రాహ్మణ ఆత్మలైన మీకు తప్ప మరెవ్వరికీ ప్రాప్తించదు. పరమాత్మ పాలన, ఈ పాలన ద్వారా ఎంతటి శ్రేష్ఠమైన పూజ్యనీయులుగా అవుతారు. ఆత్మనైన నాకు పరమాత్మ చదువు యొక్క అధికారము ప్రాప్తిస్తుంది అని ఎప్పుడైనా స్వప్నములోనైనా అనుకున్నారా! కానీ ఇప్పుడు సాకారములో అనుభవము చేస్తున్నారు. స్వయంగా సద్గురువు అమృతవేళ నుండి రాత్రి వరకు ప్రతి కర్మకు శ్రేష్ఠ మతాన్ని ఇచ్చి కర్మ బంధనాలను కర్మ సంబంధములోకి పరివర్తన చేసేందుకు శ్రీమతాన్ని ఇచ్చేందుకు నిమిత్తంగా తయారుచేస్తారు - ఇది కూడా స్వప్నములో లేదు. కానీ ఇప్పుడు మా ప్రతి కర్మ శ్రీమతము అనుసారంగా నడుస్తూ ఉంది అని అనుభవంతో అంటారు. ఇటువంటి అనుభవం ఉందా? పిల్లలందరి యొక్క ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తూ బాప్‌దాదా కూడా హర్షిస్తారు - వాహ్ నా శ్రేష్ఠ భాగ్యవంతులారా వాహ్! పిల్లలు - వాహ్ బాబా వాహ్ అని అంటారు మరియు బాబా - వాహ్ పిల్లలూ వాహ్ అని అంటారు!
ఈరోజు అమృతవేళ నుండి పిల్లలు చేసే రెండు సంకల్పాల స్మృతి బాప్‌దాదా వద్దకు చేరుకుంది. ఒకటేమో, కొంతమంది పిల్లలకు తమ అకౌంట్‌ను ఇవ్వాలన్నది గుర్తుంది. రెండవది, బాబా సాంగత్యపు రంగు యొక్క హోలీ గుర్తుంది. అందరూ హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా! బ్రాహ్మణుల భాషలో జరుపుకోవటము అనగా తయారవ్వటము. హోలీ జరుపుకుంటారు అనగా హోలీ (పవిత్రం)గా అవుతారు. బ్రాహ్మణ పిల్లలు అతి పవిత్రులుగా అవ్వటము అన్నింటికంటే ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది అన్నదానిని బాప్‌దాదా చూసారు. ఆ మాటకొస్తే ద్వాపరము యొక్క ఆదిలోని మహానాత్మలు మరియు కాలానుగుణంగా వచ్చిన ధర్మపితలు కూడా పవిత్రముగా, హోలీగా అయ్యారు. కానీ మీ పవిత్రత అన్నింటికంటే శ్రేష్ఠమైనది కూడా, అతీతమైనది కూడా. మొత్తము కల్పములో మహాత్ములు కానీ, ధర్మాత్మలు కానీ, ధర్మపితలు కానీ మీలా అతి పవిత్రులుగా అవ్వలేదు, అవ్వలేరు, ఎందుకంటే మీ విషయములో ఆత్మ కూడా పవిత్రము, శరీరము కూడా పవిత్రము, ప్రకృతి కూడా సతోప్రధాన పవిత్రము. మీ భవిష్య స్వరూపాన్ని ఎదురుగా తెచ్చుకోండి. అందరి ఎదురుగా తమ-తమ భవిష్య రూపము వచ్చిందా? లేకపోతే అలా అవుతామా అవ్వమా లేక ఎలా అవుతామో తెలియనే తెలియదు అని అనుకుంటున్నారా! ఎలా అయినా కానీ పవిత్రముగా అయితే అవుతారు కదా! శరీరము కూడా పవిత్రము, ఆత్మ కూడా పవిత్రము మరియు ప్రకృతి కూడా పవిత్ర పావనము, సుఖదాయకము... నిశ్చయమనే కలముతో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోగలరు. నిశ్చయము ఉంది కదా! టీచర్లకు నిశ్చయముందా? అచ్ఛా, ఒక్క క్షణములో మీ భవిష్య చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోగలరా? సరే, కృష్ణుడిగా అవ్వకపోయినా కానీ అతని సహచరులుగానైతే అవుతారు కదా! ఎంత ప్రియముగా అనిపిస్తుంది. ఆర్టిస్ట్‌గా అవ్వటము వస్తుందా లేక రాదా? ఎదురుగా చూడండి, అంతే. ఇప్పుడు సాధారణంగా ఉన్నాను, రేపటి రోజున (అంటే డ్రామాలోని రేపు, రేపు రాబోయే మరుసటి రోజు అని కాదు) మరి రేపు ఆ పవిత్ర శరీరధారిగా అవ్వాల్సిందే. పాండవులు ఏమనుకుంటున్నారు? పక్కాయే కదా, అవుతామా, అవ్వమా అన్న అనుమానమేమీ లేదు కదా? అనుమానమేమైనా ఉందా? లేదు కదా! పక్కాయే. రాజయోగులు అన్నప్పుడు రాజ్యాధికారులుగా అవ్వాల్సిందే. బాబా మీ కొరకు కానుకను తీసుకువచ్చారు అని బాప్‌దాదా చాలా సార్లు గుర్తుచేస్తారు కదా, మరి ఏ కానుకను తీసుకువచ్చారు? బంగారు ప్రపంచము, సతోప్రధాన ప్రపంచము యొక్క కానుకను తీసుకువచ్చారు. కనుక నిశ్చయము ఉంది, నిశ్చయానికి గుర్తు ఆత్మిక నషా. ఎంతగా మీ రాజ్యానికి సమీపంగా వస్తూ ఉన్నారో, ఇంటికి కూడా సమీపంగా వస్తూ ఉన్నారో మరియు మీ రాజ్యానికి కూడా సమీపంగా వస్తూ ఉన్నారో, అంతగానే పదే-పదే మీ స్వీట్ హోమ్ మరియు మీ స్వీట్ రాజ్యము యొక్క స్మృతి స్పష్టంగా రావాలి. ఇది సమీపంగా వస్తున్నందుకు గుర్తు. మీ ఇల్లు, మీ రాజ్యము చాలా స్పష్టంగా స్మృతిలోకి రావాలి, మూడవ నేత్రము ద్వారా స్పష్టంగా కనిపించాలి. ఈరోజు ఇది, రేపు అది అని అనుభవమవ్వాలి. ఎన్ని సార్లు పాత్రను పూర్తి చేసి మీ ఇంటికి మరియు మీ రాజ్యానికి వెళ్ళారు, గుర్తుకొస్తుంది కదా! ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. డబల్ విదేశీయులకు స్పష్టంగా గుర్తుకు వస్తుందా లేక కష్టపడవలసి వస్తుందా? ఏమవుతామో, ఎలా అవుతామో అని అనుకుంటున్నారా? ఆలోచించవలసి వస్తుందా లేక స్పష్టంగా కనిపిస్తుందా? గుర్తుందా? స్పష్టంగా ఉందా? వెనుక ఉన్నవారికి గుర్తుందా? (ఈనాటి సభలో 16-17 వేల మంది ఉన్నారు). బాప్‌దాదా చూస్తున్నారు, బయట కూడా కూర్చున్నారు, విశ్వంలోని మూలమూలలలో కూడా కూర్చుని ఉన్నారు. మరి హోలీ జరుపుకున్నారు కదా! ఉన్నారే హోలీగా, (పవిత్రంగా) ఇంక హోలీ ఏమి జరుపుకుంటారు? ఇవైతే సంగయముగ ఆనందాలు.
మరి బాప్‌దాదా మీ అందరి అకౌంట్‌ను చూస్తారు కదా! మర్చిపోలేదు. అందరూ తమ అకౌంట్‌ను పెట్టుకున్నారు. ఎవరైతే తమ అకౌంట్‌ను ఎక్యురేట్గా పెట్టుకున్నారో, నియమ ప్రమాణంగా, నడిపించేలా కాదు, యథార్థ రూపంలో ఎలా ఉందో అలాగే ఎవరైతే తమ అకౌంట్‌ను పెట్టుకున్నారో, సత్యమైన అకౌంట్, నడిపించే అకౌంట్ కాదు, వారు చేతిని పెద్దగా ఎత్తండి. ఎవరైతే వ్రాసారో కాదు, పెట్టుకున్నారో వారు చేతులెత్తండి. కొద్దిమందే పెట్టారు. అచ్ఛా, వెనుక ఉన్నవారు ఎవరైతే పెట్టారో, వారు లేచి నిల్చోండి. అచ్ఛా. డబల్ విదేశీయులు ఎవరైతే పెట్టారో వారు లేవండి. అచ్ఛా. అభినందనలు. అచ్ఛా- ఎవరైతే పెట్టలేదో వారిని చేయి ఎత్తమని చెప్పము. ఎత్తడం మంచిగా అనిపించదు కదా. కానీ ఎవరైతే సత్యమైన అకౌంట్‌ను పెట్టారో, బాప్‌దాదా వద్ద స్పష్టం అవుతుంది. కొందరు లెక్క ప్రకారం కాకుండా, ఏవరేజ్ వేస్తారు కదా, అలా కూడా పెట్టారు. ఎక్యురేట్గా చాలా కొద్దిమంది వ్రాసారు లేక పెట్టారు. బాప్‌దాదా డైరెక్షన్‌ను అయితే పాటించారు కదా అందుకని బాప్‌దాదా రెండు రకాలుగా వారికి ఎక్స్ట్రా మార్కులను పెంచుతున్నారు, ఎందుకంటే శ్రీమతముపై నడుచుకోవడము కూడా ఒక సబ్జెక్టు. కనుక శ్రీమతముపై నడుచుకునే సబ్జెక్టులో పాస్ అయ్యారు అందుకని ఫస్ట్ నంబరు వారికి బాప్‌దాదా తమ వైపునుండి 25 మార్కులను పెంచారు, రెండవ నంబరు వారికి 15 మార్కులు పెంచారు. ఈ ఎక్స్ట్రా లిఫ్ట్ బాప్‌దాదా తమ వైపునుండి ఇచ్చారు. మరి ఫైనల్ పేపరులో మీ ఈ మార్కులు జమ అవుతాయి. పాస్ విత్ ఆనర్‌గా అవ్వడంలో సహాయం చేస్తాయి. కానీ ఎవరైతే పెట్టలేదో, కారణం ఏదైనా కావచ్చు, కారణం నిర్లక్ష్యమే, ఇంకేమీ లేదు అయినాగానీ ఏదైనా కారణంతో పెట్టలేకపోతే బాప్‌దాదా అంటారు, ఒక నెల తమ అకౌంట్‌ను ఇప్పటినుండి పెట్టండి. ఒకవేళ ఇప్పుడు కూడా ఒక నెల ఎక్యురేట్, నంబర్‌వన్ అకౌంట్‌ను పెడితే, శ్రీమతం అనుసారంగా పెట్టలేకపోయినందుకు బాప్‌దాదా వారి మార్కులను కట్ చేయరు. అర్థమయిందా! కట్ చేయము కానీ తప్పకుండా చేయాలి. శ్రీమతం పాటించకపోతే మార్కులు కట్ అవుతాయి కదా! అంతిమంలో మీ లెక్కపత్రాన్ని మీరు డ్రామా అనుసారంగా మీ మనసు అనే టి.వి.లో చూసినప్పుడు, మరేదో టి.వి. కాదు, మీ మనసు అనే టి.విలోనే బాప్‌దాదా చూపిస్తారు, అందులో ఈ శ్రీమతము కోసం మార్కులను కట్ చేయము. అయినా కూడా బాప్‌దాదాకు ప్రేమ ఉంది కదా. అనేక జన్మల నిర్లక్ష్యము యొక్క సంస్కారము పక్కాగా ఉంది కదా, జరుగుతుందిలే అని అర్థం చేసుకుంటారు. కానీ ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉండకండి, లేకపోతే ఏమి జరుగుతుందో తర్వాత చెప్తాము, ఇప్పుడు చెప్పము ఎందుకంటే బాప్‌దాదా అందరి యొక్క వర్తమాన సమయపు రిజల్ట్‌ను చూసారు. డబల్ విదేశీయులలోనైనా లేక భారతవాసులలోనైనా, అందరి రిజల్ట్‌లో ఏం చూసారంటే - వర్తమాన సమయములో నిర్లక్ష్యానికి చెందిన క్రొత్త-క్రొత్త రకాలు పిల్లలలో చాలా ఉన్నాయి. అనేక రకాల నిర్లక్ష్యాలు ఉన్నాయి. మనసు లోలోపలే - అంతా నడుస్తుందిలే... అని ఆలోచిస్తారు. ఈరోజుల్లో అన్ని విషయాలలోనూ ఉన్న విశేష స్లోగన్ ఏమిటంటే - ‘‘అంతా నడుస్తుందిలే’’ - ఇది నిర్లక్ష్యము. దీనితో పాటు పురుషార్థములో మరియు స్వ పరివర్తనలో నిర్లక్ష్యముతోపాటు కొంత పర్సెంటేజ్ లో - అయిపోతుందిలే, చేసేస్తాములే... అన్న సోమరితనము కూడా రకరకాలుగా ఉంది. బాప్‌దాదా క్రొత్త-క్రొత్త రకాల నిర్లక్ష్యపు విషయాలను చూసారు, అందుకే నిర్లక్ష్యపు రూపముతో కాకుండా సత్యమైన హృదయముతో మీ సత్యమైన అకౌంట్‌ను తప్పకుండా పెట్టుకోండి.
ఈరోజు ఈ సీజన్‌కు చివరి టర్న్ కదా! బాప్‌దాదా రిజల్టును వినిపిస్తున్నారు. వినిపించాలి కదా! లేక కేవలం ప్రేమనే చూపించాలా? ఇది కూడా ప్రేమే. ప్రతి ఒక్కరిపై బాప్‌దాదాకు ఎంతటి ప్రేమ ఉంటుందంటే పిల్లలందరూ బ్రహ్మా బాబాతోపాటుగా తమ ఇంటికి వెళ్ళాలి అని కోరుకుంటారు. వెనుక-వెనుక రాకూడదు, సహచరులుగా అయ్యి రావాలి. మరి దాని కోసం సమానంగా అయితే అవ్వాల్సి ఉంటుంది కదా! సమానత లేకుండా సహచరులుగా అయ్యి వారితో పాటు కలిసి వెళ్ళలేరు మరియు ఆ తర్వాత మీ రాజ్యములో మొదటి జన్మ, మొదటి జన్మ అంటే మొదటి జన్మే కదా, ఒకవేళ రెండవ, మూడవ జన్మలోకి వచ్చినా కానీ, పోనీ రాజుగా అయినా కానీ రెండవ జన్మ, మూడవ జన్మ అనే అంటారు కదా! వారితో పాటే వెళ్ళాలి మరియు బ్రహ్మా బాబాతోపాటుగా మొదటి జన్మలో అధికారులుగా అవ్వాలి - వీరే నంబర్‌వన్ పాస్ విత్ ఆనర్లు. మరి పాస్ విత్ ఆనర్లుగా అవ్వాలా లేక కేవలం పాస్ మార్కుల వారైనా ఫర్వాలేదా? మేము ఏం చేస్తున్నామో, ఏం జరుగుతూ ఉందో అన్నదానిని బాప్‌దాదా చూడరు అని ఎప్పుడూ అనుకోకండి. ఇందులో ఎప్పుడూ నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఒకవేళ పిల్లలెవరైనా తమ మనసులోని చార్టు గురించి అడిగితే బాప్‌దాదా చెప్పగలరు, కానీ ప్రస్తుతం చెప్పేది లేదు. బాప్‌దాదా ప్రతి ఒక్క మహారథి, గుర్రపు స్వారీవారు... ఇలా అందరి చార్టును చూస్తున్నారు. వీరు ఉన్నది ఎవరు కానీ చేస్తున్నది ఏమిటి అని చాలా సార్లు బాప్‌దాదాకు చాలా జాలి కలుగుతుంది. కానీ బ్రహ్మా బాబా చెప్పేవారు కదా - ఏం చెప్పేవారో గుర్తుందా? బెల్లానికి తెలుసు, బెల్లపు సంచికి తెలుసు అని అనేవారు. అలాగే శివబాబాకు తెలుసు మరియు బ్రహ్మా బాబాకు తెలుసు ఎందుకంటే బాప్‌దాదాకు చాలా జాలి కలుగుతుంది, కానీ అటువంటి పిల్లలు బాప్‌దాదా యొక్క దయతో కూడిన సంకల్పాలను టచ్ చెయ్యలేరు, క్యాచ్ చెయ్యలేరు, అందుకే బాప్‌దాదా అన్నారు - రకరకాల రాయల్ నిర్లక్ష్యాలను బాప్‌దాదా చూస్తుంటారు అని. చాలా జాలి కలుగుతుంది అని ఈరోజు బాప్‌దాదా చెప్పేసారు. కొంతమంది పిల్లలు ఎలా భావిస్తారంటే - ఎవరు ఎలా ఉంటారు అనేది సత్యయుగములో తెలియనే తెలియదు కదా, ఇప్పుడైతే సరదాగా గడిపేద్దాము, ఇప్పుడు ఏం చెయ్యాలనుకుంటే అది చేసేద్దాము, ఎవరూ ఆపేవారు లేరు, ఎవరూ చూసేవారు లేరు. కానీ ఇలా అనుకోవటము తప్పు. కేవలం బాప్‌దాదా పేర్లు వినిపించరు, పేర్లు వినిపిస్తే రేపటికి బాగైపోవాలి.
ఈరోజు ధురియా జరుపుకుంటున్నారు కదా! ధురియాలో ఒకరికొకరు ఏదుంటే అది స్పష్టంగా ఇచ్చేస్తారు. మరి ఏం చెయ్యాలో అర్థమైందా, పాండవులు అర్థమయ్యిందా, అర్థమవ్వలేదా! నడిచిపోతుందా? నడవదు, ఎందుకంటే బాప్‌దాదా వద్దకు ప్రతి ఒక్కరి ప్రతి రోజు యొక్క రిపోర్ట్ వస్తుంది. బాప్-దాదా ఇరువురూ పరస్పరంలో కూడా ఆత్మిక సంభాషణ చేసుకుంటారు. కనుక బాప్‌దాదా పిల్లలందరికీ మళ్ళీ ఈ సూచనను ఇస్తున్నారు - సమయము అన్ని రకాలుగా అతిలోకి వెళ్తుంది, మాయ కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది, ప్రకృతి కూడా తన అతి యొక్క పాత్రను అభినయిస్తుంది, ఇటువంటి సమయములో బ్రాహ్మణ పిల్లలకు తమవైపు అటెన్షన్ కూడా అతిగా ఉండాలి అనగా మనసా-వాచా-కర్మలలో అటెన్షన్ అతిగా ఉండాలి. సాధారణ పురుషార్థము ఉండకూడదు. బాప్‌దాదా సూచనను కూడా ఇచ్చి ఉన్నారు – 66 సంవత్సరాలలో ఇప్పటి వరకు 6 లక్షలమందినే తయారు చేసారు, ఇప్పుడు 9 లక్షలు కూడా అవ్వలేదు. మరి విశ్వ కళ్యాణి ఆత్మల్లారా, సర్వ ఆత్మల కళ్యాణాన్ని ఎప్పుడు చేస్తారు? మరో 66 సంవత్సరాలు కావాలా ఏమిటి? మరో 66 సంవత్సరాలు వద్దా? డబల్ విదేశీయులకు కావాలా? వద్దా? మరి ఏమి చేస్తారు? సరే, సగం, 33 సంవత్సరాలు కావాలా? వద్దా? 33 సంవత్సరాలు కూడా వద్దా, మరి ఏమి చేస్తారు? ఆ మాటకొస్తే బాప్‌దాదా చూసారు - సేవ పట్ల లగనము బాగుంది, సేవ కొరకు ఎవరెడీగా ఉన్నారు, అవకాశం లభిస్తే ప్రేమగా సేవ చేయడానికి ఎవరెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు సేవలో దీనిని చేర్చండి - వాణితోపాటు మనసా, మీ ఆత్మను విశేషముగా ఏదో ఒక ప్రాప్తి యొక్క స్వరూపములో స్థితి చేసుకుని వాణితో సేవ చెయ్యండి. ఒకవేళ భాషణ చేస్తున్నారనుకోండి, వాణితోనైతే భాషణ చాలా బాగా చేస్తారు కానీ ఆ సమయములో తమ ఆత్మిక స్థితిలో విశేషంగా శక్తి అయినా లేక శాంతి అయినా లేక పరమాత్మ ప్రేమ అయినా, ఇలా ఏదో ఒక విశేష అనుభూతి యొక్క స్థితిలో స్థితి అయ్యి మనసా ద్వారా ఆత్మిక స్థితి యొక్క ప్రభావాన్ని వాయుమండలములో వ్యాపింపజేయండి మరియు వాణితో సందేశాన్ని ఇవ్వండి. వాణి ద్వారా సందేశాన్ని ఇవ్వండి, మనసా ఆత్మిక స్థితి ద్వారా అనుభూతిని చేయించండి. భాషణ చేసే సమయములో మీ మాటలు మీ మస్తకము ద్వారా, నయనాల ద్వారా, ముఖము ద్వారా ఆ అనుభూతి యొక్క గుణము కనిపించాలి, ఎలా అంటే - ఈరోజు భాషణనైతే విన్నాము కానీ పరమాత్ముని ప్రేమ యొక్క అనుభూతి చాలా బాగా జరిగింది అని ఎదుటివారు అనాలి. భాషణ చేసినప్పుడు దాని రిజల్టులో చాలా బాగా చెప్పారు, చాలా బాగుంది, చాలా మంచి విషయాలు వినిపించారు అని అంటుంటారు కదా, అలాగే మీ ఆత్మిక స్వరూప అనుభూతిని కూడా వారు వర్ణించాలి. మనుష్యాత్మలకు వైబ్రేషన్లు చేరాలి, వాయుమండలము తయారవ్వాలి. సైన్స్ సాధనాలు చల్లని వాతావరణాన్ని తయారుచెయ్యగలవు, చాలా మంచి చల్లదనం వస్తుంది అని అందరూ అనుభూతి చెందుతారు, అలాగే వేడి వాతావరణాన్ని కూడా అనుభవం చేయించగలవు. సైన్స్ చలిలో వెచ్చదనాన్ని అనుభవం చేయించగలదు, వేడిలో చల్లదనాన్ని అనుభవం చేయించగలదు, మరి మీ సైన్స్ ప్రేమ స్వరూప, సుఖ స్వరూప, శాంత స్వరూప వాయుమండలాన్ని అనుభవం చేయించలేదా! దీని రీసెర్చ్ చెయ్యండి. కేవలం మంచిగా ఉంది అని అనటం కాదు, కానీ మంచిగా తయారవ్వాలి, అప్పుడు సమాప్తి సమయాన్ని సమాప్తము చేసి తమ రాజ్యాన్ని తీసుకువస్తారు. ఎందుకు, మీకు మీ రాజ్యము గుర్తుకురాదా? సంగమయుగము శ్రేష్ఠమైనదే, అది కరక్టే, ఇది వజ్రతుల్యమైనదే, కానీ ఓ దయా హృదయులారా, విశ్వకళ్యాణి పిల్లలారా, దుఃఖముతో, అశాంతితో ఉన్న మీ సోదరీసోదరులపై దయ కలగడం లేదా? ఉల్లాసము రావటం లేదా, దుఃఖమయ ప్రపంచాన్ని సుఖమయ ప్రపంచముగా తయారుచెయ్యాలి అన్న ఈ ఉల్లాసము రావటం లేదా? దుఃఖాన్ని చూడాలనుకుంటున్నారా, ఇతరుల దుఃఖము చూసి కూడా దయ కలగటం లేదా? వారు మీ సోదరులు, మీ సోదరీలు, మరి వారి దుఃఖాన్ని చూడటం మంచిగా అనిపిస్తుందా? మీ దయాళు, కృపాళు స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. ఈ ప్రోగ్రామ్ చేసాము, ఆ ప్రోగ్రామ్ చేసాము... సంవత్సరం పూర్తయిపోయింది అని కేవలం ఇటువంటి సేవలోనే ఉండిపోకండి. ఇప్పుడు దయా స్వరూపులుగా అవ్వండి. దృష్టి ద్వారానైనా, అనుభూతి ద్వారానైనా, ఆత్మిక స్థితి యొక్క ప్రభావము ద్వారానైనా ఇప్పుడు దయా స్వరూపులుగా అవ్వండి, దయా హృదయులుగా అవ్వండి. అచ్ఛా! 66 సంవత్సరాలు పూర్తయ్యాయి. 66 సంవత్సరాలు తక్కువేమీ కాదు. బ్రహ్మా బాబా అవ్యక్తమై కూడా 33 సంవత్సరాలయ్యాయి. బ్రహ్మా బాబా ఎప్పుడు-ఎప్పుడు అని అంటున్నారు! ఎప్పుడు పిల్లలు వస్తారు, ఎప్పుడు ద్వారాన్ని తెరుస్తారు! మరి ఇంటి ద్వారాన్ని కలిసి తెరుస్తారా లేక వెనుక-వెనుక వస్తారా? వేచి ఉన్నారు. మరి సేవలో దీని ఎడిషన్ చేయండి. ఈ విధితో సేవ చేస్తే కొద్ది సమయంలోనే మీ వద్ద క్వాలిటీ యొక్క వర్షం కురుస్తుంది, ఇది బాప్‌దాదా గ్యారెంటీ ఇస్తున్నారు. వారస క్వాలిటీ వారి వర్షం కురుస్తుంది. ఇంత కష్టపడే అవసరమే లేదు. ఇప్పుడు ఈ కార్యం జరుగనున్నది, ఇందులో సహయోగిగా అవ్వండి అని చెప్పాల్సిన అవసరం కూడా రాదు. స్వయమే తమ సహయోగాన్ని ఆఫర్ చేస్తారు. కానీ సాధారణ పురుషార్థాన్ని, సాధారణ విధిని సేవలో పరివర్తన చేయండి. ఛిమ్-ఛిమ్ జరగాలి. జరగవలసిందే. కేవలం అనుభూతిని చేయించే విధిని ఆలోచించండి. కేవలం భాషణ మరియు కోర్సు చేయించడం కాదు, అది చాలా చేసారు. వర్గీకరణ ప్రోగ్రాములు కూడా చాలా చేసారు. ఎవరు వస్తే వారిపై ముద్ర పడాలి, 9 లక్షల ముద్ర పడాలి. అర్థమయిందా, ఏమి చేయాలి? సర్వీసు ప్లాన్‌ను వినిపించండి అని బాబాతో అన్నారు కదా, అన్నారు కదా? ఇప్పుడు ఇటువంటి ఛిమ్-ఛిమ్ చేసి చూపించండి. ఇప్పుడు నెమ్మది నడక ఉంది. లక్ష్మీ యొక్క రెండు చేతులలో సంపద ఛిమ్-ఛిమ్ అంటుంది అని అంటారు కదా, మరి మీరందరూ శ్రేష్ఠమైన బ్రాహ్మణులుగా అయ్యి అనుభూతుల ఛిమ్-ఛిమ్ చేయండి. కానీ ఎవరైతే వ్యర్థ చింతన, వ్యర్థ దర్శనము మరియు వ్యర్థంగా సమయాన్ని గడపని వారుంటారో వారే అనుభూతిని చేయించగలరు. ఈరోజుల్లో కొద్ది-కొద్దిగా, బాప్‌దాదా కొద్దిగా చూసారు. అది కూడా వినిపించమంటారా? అచ్ఛా, ఈరోజు అంతా వినిపించేస్తాము. హోలీ కదా! హోలీలో చెడుగా భావించరు. అచ్ఛా.
బాప్‌దాదా మరో విషయాన్ని కూడా చూసారు, దానిని వినిపించడం మంచిగా అనిపించదు. అప్పుడప్పుడు కొంతమంది పిల్లలు, చాలా-చాలా మంచి పిల్లలు కూడా ఇతరుల విషయాలలో చాలా జోక్యం చేసుకుంటారు. ఇతరుల విషయాలను చూడటము, ఇతరుల విషయాలను వర్ణన చెయ్యటము... చూసేది కూడా వ్యర్థమైన విషయాలు చూస్తారు. ఇతరుల విశేషతలను వర్ణన చేయడం తక్కువగా ఉంది. ప్రతి ఒక్కరిలోని విశేషతలను చూడటము, విశేషతలను వర్ణన చెయ్యటము, వాళ్ళ విశేషతల ద్వారా వాళ్ళకు ఉల్లాస-ఉత్సాహాలను కలిగించటము, ఇది తక్కువగా ఉంది. కానీ వదిలేయండి అని బాప్‌దాదా ఏ విషయాల గురించైతే చెప్తారో, ఆ వ్యర్థ విషయాలను, తమలో ఉన్న వ్యర్థ విషయాలను వదిలెయ్యటానికి ప్రయత్నమైతే చేస్తారు, కానీ ఇతరుల విషయాలను చూసే అలవాటు మాత్రం ఉంటుంది. ఇందులో చాలా సమయము పోతుంది. బాప్‌దాదా ఒక విశేషమైన శ్రీమతాన్ని ఇస్తున్నారు - ఇది చాలా మామూలు విషయమే కానీ చాలా సమయము చాలా వ్యర్థముగా పోతుంది. మాటలలో నిర్మాణులుగా అవ్వండి. మాటలలో నిర్మాణత తక్కువ అవ్వకూడదు. సాధారణ మాటలు మాట్లాడుతారు, ఇలా మాట్లాడవలసే వస్తుంది అని అనుకుంటారు, కానీ నిర్మాణతకు బదులుగా ఒకవేళ ఎవరైనా అథారిటీతో కూడిన మాటలు మాట్లాడితే, నిర్మాణచిత్తముగా మాట్లాడటకపోతే, వారు చేస్తున్న కార్యం యొక్క లేక సీట్ (పదవి) యొక్క అభిమానం 5 శాతం కనిపిస్తుంది. నిర్మాణత అనేది బ్రాహ్మణ జీవితానికి విశేష అలంకారము. నిర్మాణత మనసులో, వాణిలో, మాటలలో, సంబంధ-సంపర్కములలో... ఉండాలి. అలాగని మూడు విషయాలలో నేను నిర్మాణముగా ఉన్నాను, ఒక్కదాంట్లో తక్కువగా ఉంటే ఏమవుతుంది అని అనుకోకూడదు! కానీ ఆ ఒక్క లోపము పాస్ విత్ ఆనర్‌గా అవ్వనివ్వదు. నిర్మాణతయే మహానత. ఇది వంగడము కాదు, ఇది వంగేలా చేయటము. కొంతమంది పిల్లలు నవ్వుతూ ఇలా అనేస్తారు - నేనే వంగాలా, వాళ్ళు కూడా వంగాలి కదా. కానీ ఇది వంగటము కాదు, వాస్తవానికి ఇది పరమాత్మను కూడా మీపై వంగేలా చేసుకోవటము. ఆత్మల విషయమే కాదు, ఇది పరమాత్మను కూడా మీపై వంగేలా చేసుకోవటము, ఆత్మల విషయమైతే విడిచిపెట్టేయండి. నిర్మాణత అనేది స్వతహాగానే నిరహంకారులుగా చేస్తుంది. నిరహంకారులుగా అయ్యేందుకు ఇక ప్రత్యేకంగా పురుషార్థము చెయ్యవలసి ఉండదు. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి మనసులో మీ కొరకు ప్రేమ స్థానాన్ని ఏర్పరుస్తుంది. నిర్మాణత అనేది ప్రతి ఒక్కరి మనసు నుండి మీ కొరకు ఆశీర్వాదాలు వెలువడేలా చేస్తుంది. చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి. ఆశీర్వాదాలు అనేవి పురుషార్థములో లిఫ్ట్ కంటే కూడా రాకెట్లా అవుతాయి. నిర్మాణత అటువంటిది. ఎవరు ఎలా ఉన్నా సరే, బిజీగా ఉన్నా సరే, కఠిన మనస్కులైనా సరే, క్రోధీలైనా సరే, నిర్మాణత అనేది మీకు సర్వుల ద్వారా సహయోగాన్ని ఇప్పించేందుకు నిమిత్తంగా అవుతుంది. నిర్మాణతతో ఉన్నవారు, ప్రతి ఒక్కరి సంస్కారము అనుసారముగా స్వయాన్ని నడిపించుకోగలరు. వారు రియల్ గోల్డ్ (అసలైన బంగారము) అయిన కారణముగా వారిలో స్వయాన్ని మోల్డ్ చేసుకునే (మలుచుకునే) విశేషత ఉంటుంది. కనుక బాప్‌దాదా చూసారు - మాట తీరులో కూడా, నడవడికలో కూడా, సంబంధ-సంపర్కములో కూడా, సేవలో కూడా ఇతరులతో నిర్మాణ స్వభావులుగా ఉండటము అనేది విజయాన్ని ప్రాప్తి చేయిస్తుంది, అందుకే ఈ సంవత్సరములో, విశేషంగా బాప్‌దాదా ఈ సంవత్సరానికి నిర్మాణ, నిర్మల సంవత్సరము అనే పేరును ఇస్తున్నారు. ఈ సంవత్సరాన్ని ఇలా జరుపుకుంటారు కదా. జరుపుకోవటము అంటే అలా తయారవ్వటము. ఈ సంవత్సరము ఇది అని కేవలం చెప్పడము కాదు. తయారవ్వాలి. అవ్వాలి కదా? ఎలా మాట్లాడాలి అంటే ఇంకా మరిన్ని ముత్యాలు మాకు వినిపించండి, ముత్యాలు ఇవ్వండి అని అందరూ అనాలి. అంతేకానీ, వద్దు, వద్దు, వీరిది వినకూడదు, వెళ్దాము అని అనేలా ఉండకూడదు. ఇలా వద్దు. నోటి నుండి వజ్రాలు, ముత్యాలు రావాలి. అభిమానంతో మాట్లాడి ఎవ్వరికైనా దుఃఖాన్ని ఎందుకు ఇవ్వాలి. దుఃఖ ఖాతాలో అయితే జమ అవుతుంది కదా. ఏమవుతుంది, మాట్లాడేసాను, వారలాగే ఉన్నారు కదా అని మీరు అనుకుంటారు. కానీ మీ దుఃఖ ఖాతాలో జమ అవుతుంది. అర్థమయిందా. కనుక అకౌంట్‌ను పెట్టండి. అంతేకానీ ఇప్పుడు అకౌంట్ ఇచ్చేసాము కదా అని అనకండి. పెట్టడం వలన లాభం ఉంటుంది.
బాప్‌దాదా, కొందరు మంచిగా పురుషార్థము చేయడాన్ని చూసారు. అటెన్షన్ పెట్టారు. మరి ఏమి గుర్తుంచుకుంటారు? నిర్మాణము. అప్పుడు నిర్మాణ కార్యము త్వరగా జరుగుతుంది. నిర్మాణులుగా అవ్వండి, నిర్మాణము చేయండి. బాబా, ఇప్పుడైతే ఛమ్-ఛమ్ జరిగింది అని మీరే అంటారు. జరగవలసిందే. పూర్తి విశ్వాత్మలు ఓహో ప్రభువా అంటూ మీ ముందు వంగవలసిందే. మరి ఈ సంవత్సరం యొక్క సేవ గురించి వినిపించాము కదా! ఇప్పుడు ఏ సెంటర్, ఏ జోన్, జోన్లో కూడా ఏ సెంటర్ ఈ విధితో వారసులను తయారు చేస్తుందో చూస్తాము. ఇప్పుడు ఎవరైనా వారసుల ఛమ్-ఛమ్ చేయండి. అది అనుభూతిని చేయించడం ద్వారానే జరుగుతుంది. అన్నిటికన్నా పెద్ద అథారిటీ అనుభవము. అనుభవాన్ని ఎవ్వరూ మార్చలేరు. అచ్ఛా.
డబల్ విదేశీయులకు ఒక్క సెకండులో వ్యర్థ విషయాలకు, వ్యర్థ మాటలకు, ఏదైనా గడిచిన విషయానికి, మనసుతో బిందువును పెట్టడం వచ్చా? ఎటువంటి గడిచిన విషయమైనాగానీ, మంచి విషయాన్ని అయితే మర్చిపోయేదే లేదు, వ్యర్థ విషయాలనే మర్చిపోవలసి ఉంటుంది, మరి ఏ విషయమైనా, దేనినైతే మర్చిపోవాలో, డబల్ విదేశీయులకు వాటికి సెకండులో బిందువు పెట్టడం వస్తుందా? ఏ విదేశీయులైతే పెట్టగలరో, వారు చేతిని పెద్దగా ఎత్తండి. అభినందనలు. అచ్ఛా, ఒక్క సెకండులో కాదు, ఒక గంట సమయం కావాలి అని భావించేవారు ఎవరున్నారు? సెకండు చాలా తక్కువ సమయం కదా. ఒక గంట తర్వాత బిందువును పెట్టగలను అనుకునేవారు చేతులెత్తండి. గంటలో బిందువు పెట్టగలము అని భావించేవారు చేతులెత్తండి. (ఎవ్వరూ చేతులెత్తలేదు) ఉన్నారు, బాప్‌దాదాకు తెలుసు. బాప్‌దాదా అయితే చూస్తూ ఉంటారు, చేతులెత్తడం లేదు, కానీ సమయం పడుతుంది. ఒకవేళ బిందవును పెట్టడానికి మీకు సగం రోజు పడుతుంది, ఒక గంట సమయం పడితే, మీకు అడ్వాన్స్ పార్టీ నుండి ఆహ్వానము లభిస్తే ఎలా? అప్పుడు రిజల్ట్ ఏమి వస్తుంది? అంతిమ మతిని బట్టి గతి ఏముంటుంది? తెలివైనవారే కదా? అందుకే మీ మనసును బిజీగా పెట్టుకోండి. మనసా సేవ కోసం మీ టైమ్ టేబుల్‌ను తయారు చేసుకోండి, మీ గురించి బిందువుగా భావించే అవసరమే లేదు, మీరున్నదే బిందు రూపము. కనుక, ఇప్పుడు మీ మనసు యొక్క టైమ్ టేబుల్‌ను ఫిక్స్ చేసుకోండి. మనసును సదా బిజీగా పెట్టుకోండి, ఖాళీగా ఉంచకండి. లేకపోతే కష్టపడవలసి ఉంటుంది. ఉన్నతోన్నతమైన భగవంతుని పిల్లలు మీరు, మీ ఒక్కొక్క సెకండు యొక్క టైమ్ టేబుల్ ఫిక్స్ అయ్యి ఉండాలి. బిందువు ఎందుకు పెట్టలేకపోతున్నారు? అందుకు కారణం ఏమిటి? బ్రేక్ పవర్‌ఫుల్‌గా లేదు. శక్తుల స్టాక్ జమ అయ్యి లేవు అందుకే సెకండులో స్టాప్ చేయలేకపోతున్నారు. కొంతమంది పిల్లలు చాలా ప్రయత్నం చేస్తారు, పిల్లలు కష్టపడటాన్ని బాప్‌దాదా చూసినప్పుడు, ఇది ఉండకూడదు, ఇలా ఉండకూడదు... అని అనుకుంటారు, అలా జరగకూడదు అని అనుకుంటారు కానీ అలాగే జరుగుతూ ఉంటుంది. బాప్‌దాదాకు పిల్లలు కష్టపడటం మంచిగా అనిపించదు. కారణము ఇదే, చూడండి, రావణుడిని చంపుతారు కూడా, కేవలం చంపి విడిచిపెట్టరు, కాలుస్తారు, కాల్చి ఎముకలను ఈరోజుల్లో నదిలో వేస్తున్నారు. ఎవరైనా మనుష్యులు చనిపోతే వారి ఎముకలను కూడా నదిలో వేస్తారు, అప్పుడే సమాప్తి జరుగుతుంది. మరి మీరు ఏమి చేస్తారు? జ్ఞానం యొక్క పాయింట్లతో, ధారణ యొక్క పాయింట్లతో ఆ విషయము అనే రావణుడిని చంపడమైతే చేస్తున్నారు, కానీ యోగ అగ్నిలో స్వాహా చేయడం లేదు. మిగిలి ఉన్న ఎముకలు అనే కొన్ని విషయాలను జ్ఞాన సాగరుడైన బాబాకు అర్పించడం లేదు. మూడు పనులు చేయండి – ఒక పని కాదు. పురుషార్థం చేసాను కదా, మురళి కూడా చదివాను, 10 సార్లు మురళి చదివాను అయినాగానీ వచ్చేసింది అని మీరనుకుంటారు కానీ మీరు యోగ అగ్నిలో కాల్చలేదు, స్వాహా చేయలేదు. అగ్ని తర్వాత నామరూపాలు మాయమైపోతాయి, ఆ తర్వాత వాటిని కూడా సాగరుడైన బాబాలో వేసేయాలి, సమాప్తము. అందుకని, బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఈ సంవత్సరములో వ్యర్థము నుండి ముక్తులుగా చూడాలనుకుంటున్నారు. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. ఏ లోపమున్నా, ఆ లోపానికి ముక్తినివ్వండి ఎందుకంటే ఎప్పటివరకైతే దానికి ముక్తినివ్వరో అప్పటివరకు బాబాతో పాటు ముక్తిధామానికి వెళ్ళలేరు. మరి ముక్తినిస్తారా? ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటారా? జరుపుకుంటాము అనేవారు ఇలా చేతులూపండి. జరుపుకుంటారా? ఒకరినొకరు చూసుకున్నారు కదా, జరుపుకుంటారు కదా! మంచిది. ఒకవేళ ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటే బాప్‌దాదా వజ్రాలతో పొదిగిన పళ్ళాల నిండుగా చాలా-చాలా అభినందనలు, గ్రీటింగ్స్, శుభాకాంక్షలను ఇస్తారు. మంచిది, స్వయాన్ని కూడా ముక్తులుగా చేసుకోండి, మీ సోదరసోదరీలను కూడా దుఃఖము నుండి దూరం చెయ్యండి. ఆ అభాగ్యుల మనసుల నుండి - మా తండ్రి వచ్చేసారు అని సంతోషముతో కూడిన ఈ మాట రావాలి. సరే. అచ్ఛా!
దాదీలు అడుగుతారు – బాప్‌దాదా ప్రోగ్రామ్ ఎలా ఉండబోతుంది? ఇదే క్వెశ్చన్ కదా! ఎలా అయితే ఇప్పటి వరకు ప్రోగ్రామ్ జరిగిందో, అదే విధితో జరుగనుంది అని బాప్‌దాదా అంటారు. ఎప్పుడైనా ఆవశ్యకత అనుసారంగా దాదీల కోరికను పూర్తి చేస్తాము, కానీ ఆవశ్యకత ఉంటేనే. బాబా రావడమైతే చాలా సహజము అని దాదీ అనుకుంటారు. ఎందుకు బాప్‌దాదా రారు అంటారు. కానీ రథాన్ని కూడా చూడండి. 33 సంవత్సరాలు పాత్రను చేయడము కూడా అభినందనీయము. ఇంత పెద్ద శక్తులను ధారణ చేయడము, చిన్న విషయము కాదు. దాదీ ఏమి చేస్తారో చెప్పమంటారా, ఏ విషయమైనా ఏమంటారంటే, ఇప్పుడే వెళ్ళండి, సందేశం తీసుకురండి అంటారు. దాదీ, ఇప్పుడు పగలు కదా, రాత్రి వెళ్తాను అని బచ్చీ అంటారు. లేదు, లేదు, ఇప్పుడే వెళ్ళండి అని దాదీ అంటారు. మరణించవలసి ఉంటుంది కదా. శరీరం నుండైతే మరణించవలసి ఉంటుంది కదా. సందేశం కావచ్చు, బాబా పధరామణి కావచ్చు. పధరామణి అయితే పెద్ద విషయము, కానీ సందేశంలో కూడా అశరీరిగా అవ్వాలి, తియ్యని మరణము ఉంటుంది కానీ మరణించడమైతే ఉంటుంది కదా! అయినా కూడా బాప్‌దాదాకు దాదీలపై చాలా-చాలా-చాలా గౌరవము మరియు ప్రేమ ఉన్నాయి. ప్రేమ త్రాళ్ళతో బంధించడం బాగా వచ్చు. అచ్ఛా.
మీటింగ్‌కు వచ్చిన సోదరసోదరీలతో:- మీటింగ్‌కు వచ్చిన వారు లేవండి. అచ్ఛా. ఇంకా కూడా వస్తుండవచ్చు. మీటింగ్‌లో ఈ విధితోటే సేవా ప్లాన్లను ఆలోచించండి మరియు ముక్తి సంవత్సరాన్ని జరుపుకునే సహజమైన విధిని చెప్పండి – పరస్పర సలహాలు తీసుకోండి. ఈ సంవత్సరం అందరూ ముక్తులైపోవాలి. వీలవుతుందా? ఒక సంవత్సరంలో వీలవుతుందా? చెప్పండి, వీలవుతుందా? అవుతుంది అనైతే చాలా బాగా చెప్తున్నారు, మనసును సంతోషపరిచారు. ఇలాగే సంతోషపెట్టండి. ప్రతి ఒక్కరూ తమను తాము ముక్తి చేసుకోండి, ఇతరులను చూడకండి. మీ బాధ్యతనైతే మీరు తీసుకోగలరు కదా. ఒకవేళ ప్రతి ఒక్కరూ తమ-తమ బాధ్యతను తీసుకుంటే అంతా సహజమైపోతుంది. మిమ్మల్ని ఫాలో చేసేవారు తామంతట తామే ఫాలో చేస్తారు. ఉదాహరణగా అయితే అవ్వండి కదా. అచ్ఛా. మరి ఇటువంటి ప్లాన్‌ను తయారు చేయండి. ఈ కాన్ఫరెన్సు జరిగింది, ఈ భాషణ జరిగింది, ఇది కాదు. మనసు యొక్క స్థితి కోసం ప్రోగ్రామ్‌ను తయారు చేయండి. అచ్ఛా.
సేవ టర్న్ రాజస్థాన్, ఇండోర్ వారిది:- సేవాధారులు చాలామంది ఉన్నారు. గ్రూప్ కూడా పెద్దది కదా! అచ్ఛా, అందరూ తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. ఆశీర్వాదాలు తీసుకున్నారా? ఇది చాలా సహజమైన విధి, జమ చేసుకోవడానికి సహజమైన విధి - ఆశీర్వాదాలు ఇవ్వండి అంటే ఆశీర్వాదాలు తీసుకోవడము. ఆశీర్వాదాలు ఇవ్వడమే ఆశీర్వాదాలు తీసుకోవడము. మరి మీరంతా ఆశీర్వాదాల ఖాతాను జమ చేసుకున్నారు అంటే మీ ఖాతాలో మార్కులు జమ అయినట్లే. మంచిది, ఇది కూడా ఒక ఛాన్స్ లభిస్తుంది. ముందుగా వినిపించాము కదా – వారు యూనివర్సిటీ ఛాన్సలర్లు, మీరు పుణ్య ఖాతాను జమ చేసుకునే ఛాన్సును తీసుకునే ఛాన్సలర్లు. మరి చాలా బాగా చేసారు. అందరూ చాలా బాగా సేవను చేసారు. అందరికీ సుఖాన్ని ఇచ్చారు. సరిగ్గా ఉన్నారా! సేవ మంచిగా జరిగిందా? సేవలో ఏదైనా కష్టం వచ్చిందా? లేదు. చాలా మంచిది.
కల్చరల్ వింగ్, సోషల్ వింగ్ మరియు సెక్యూరిటీ వింగ్ మీటింగ్ జరుగుతుంది:- కల్చరల్ వర్గం వారు కల్చరల్ చేసే ఆత్మలందరికీ బ్రాహ్మణ కల్చర్‌ను కూడా నేర్పిస్తారు కదా. మరి కల్చరల్ మరియు కల్చర్ రెండూ నేర్పిస్తూ ఆత్మలందరినీ బాబాకు సమీపంగా తీసుకు వస్తూ ఉండండి. కల్చరల్ అయితే మనోరంజనము, సదా మనోరంజనంలో ఎలా ఉండాలి అన్న శిక్షణ లేక విధిని కూడా నేర్పిస్తూ అందరినీ సదా సంతోషంగా చేయండి. బాగుంది, ఈ సేవా సాధనము కూడా బాగుంది. కానీ రెండూ కలిసి ఉండాలి. మరి అందరూ సేవలో సంతుష్టంగా ఉన్నారు కదా! సంతుష్టంగా ఉన్నారా? అచ్ఛా!
సెక్యూరిటీ వింగ్ వారు:- మనసు యొక్క సెక్యూరిటీ, తనువు యొక్క సెక్యూరిటీ మరియు ధనము యొక్క సెక్యూరిటీ మూడింటి సెక్యూరిటీ ఈరోజుల్లో చాలా అవసరము. సెక్యూరిటీ వింగ్ వారు ముందుగా ఆత్మలకు మనసును వికారాల నుండి సెక్యూరిటీ మరియు తనువుతో చెడు కర్మలు చేయకుండా సెక్యూరిటీ మరియు ధనమును సఫలం చేసే సెక్యూరిటీ... మరి ఈ మూడూ చేస్తున్నారు కదా! కేవలం స్థూల సెక్యూరిటీ మాత్రమే చేయడం లేదు కదా, ముందు మనసు యొక్క సెక్యూరిటీ, ఎంతగా తమ మనసు యొక్క సెక్యూరిటీ ఉంటుందో అంతగానే ఇతరుల మనసును కూడా సెక్యూరిటీలో ముందుకు తీసుకు వెళ్ళవచ్చు. మంచి పని ఇది, చాలా అవసరమైన పని. సెక్యూరిటీ అన్నటికన్నా చాలా అవసరము. ఇటువంటి సెక్యూరిటీ వారైతే విశ్వానికి చాలా కళ్యాణకారి ఆత్మలు. చాలా మంచి పని చేస్తున్నారు, సదా ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు నడిపిస్తూ ఉండండి. అచ్ఛా.
సోషల్ వింగ్:- ప్రతి వర్గం యొక్క కార్యం చాలా సుందరమైనది. వర్తమాన సమయంలో సోషల్ వర్గం యొక్క కార్యం కూడా అవసరమైనది. సోషల్ వర్కర్లో ఉండే విశేషత – అలసట లేకుండుట మరియు ప్రేమగా ప్రతి కార్యంలో సోషల్ వర్క్ చేయడము. మీరైతే మాస్టర్ సర్వశక్తిమంతులు, అందుకని అలసట లేనివారు మరియు ప్రతి కార్యంలో ప్రతి విధితో సోషల్ వర్గం ద్వారా ఆత్మల కళ్యాణం కూడా చేస్తున్నారు మరియు చేస్తూ ఉంటారు. చాలా మంచిది. ఇప్పుడు ప్రతి ఒక్క వర్గం బాప్‌దాదా ఏదైతే విధిని వినిపించారో ఆ విధి అనుసారంగా ప్రోగ్రామ్‌ను తయారు చేయండి. అచ్ఛా.
నలువైపులా ఉన్న అతి పవిత్రమైన ఆత్మలందరికీ, సదా నిర్మాణులుగా అయ్యి నిర్మాణము చేసే బాప్‌దాదా యొక్క సమీప ఆత్మలకు, సదా తమ పురుషార్థము యొక్క విధిని వేగముగా, తీవ్రతరం చేసుకుని సంపన్నముగా అయ్యే స్నేహీ ఆత్మలకు, సదా తమ పొదుపు ఖాతాను పెంచుకునే తీవ్ర పురుషార్థులకు, తీవ్ర బుద్ధి కల పిల్లలకు, విశాల బుద్ధికి అభినందనలు. హోలీకి కూడా అభినందనలు. హోలీ అంటే హో లీ, బిందువును పెట్టే పిల్లలకు చాలా-చాలా ప్రియస్మృతులు, మూలమూలన ఉన్న పిల్లలకు బాప్‌దాదా యొక్క విశేష ప్రియస్మృతులు. మీ లెక్కాపత్రము కూడా లభించింది, ప్రియస్మృతుల ఉత్తరాలు కూడా లభించాయి, కార్డులు కూడా చేరాయి, మనసు యొక్క సంకల్పాలు కూడా చేరుకున్నాయి, మనసుతో చేసిన ఆత్మిక సంభాషణ కూడా చేరుకుంది, వీటిన్నింటి రిటర్న్‌గా బాప్‌దాదా పదమాపదమరెట్ల ప్రియస్మృతులను ఇస్తున్నారు. ప్రియస్మృతులతోపాటు పిల్లలందరికీ నమస్తే.
దాదీలతో విశేష కలయిక:- ఇప్పుడు కూడా ఎంత సమీపంగా మీరు కలుస్తారో, అంతగా ఎవరు కలుస్తారు! (నిర్మల్శాంత దాదీతో) పాత్రను మంచిగా చేస్తున్నారు. ప్రకృతిని నడిపించే పద్ధతి బాగుంది. (బాబా నడిపిస్తున్నారు) మీరు నడుస్తున్నారు. నడిపించేవారు నడిపిస్తున్నారు. అందరూ మంచిగా నడుస్తున్నారు. శరీరాన్ని చక్కగా నడిపించడం వచ్చేసింది. బాగుంది, ఏదైతే జరుగుతుందో అది మంచిగా జరుగుతుంది. అచ్ఛా!