Search for a command to run...
18 Jan 2002
‘‘స్నేహ శక్తి ద్వారా సమర్థులుగా అవ్వండి, సర్వాత్మలకు సుఖ-శాంతుల దోసిలిని ఇవ్వండి’’
18 January 2002 · తెలుగు
ఈరోజు సమర్థులైన బాబా తమ స్మృతి స్వరూపులు, సమర్థ స్వరూపులు అయిన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈరోజు విశేషంగా నలువైపులా ఉన్న పిల్లలలో స్నేహము యొక్క అల తేలియాడుతూ ఉంది. విశేషంగా బ్రహ్మా బాబా యొక్క స్నేహ స్మృతులలో ఇమిడి ఉన్నారు. ఈ స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ జీవితము యొక్క వరదానము. పరమాత్మ స్నేహమే మీ అందరికీ క్రొత్త జీవితాన్ని ఇచ్చింది. పిల్లలు ప్రతి ఒక్కరినీ ఈ స్నేహ శక్తియే బాబాకు చెందినవారిగా చేసింది. ఈ స్నేహ శక్తి అన్నింటినీ సహజము చేసేస్తుంది. ఎప్పుడైతే స్నేహములో ఇమిడిపోతారో, అప్పుడు ఎటువంటి పరిస్థితినైనా సహజంగా అనుభవము చేస్తారు. బాప్‌దాదా కూడా ఏమంటారంటే, సదా స్నేహ సాగరములో ఇమిడి ఉండండి. స్నేహము ఛత్రఛాయ వంటిది, ఈ ఛత్రఛాయ లోపలకి ఎటువంటి మాయ నీడ కూడా పడలేదు. సహజముగానే మాయాజీతులుగా అయిపోతారు. ఎవరైతే నిరంతరము స్నేహములో ఉంటారో, వారికి ఏ విషయములోనూ శ్రమించాల్సిన అవసరము ఉండదు. స్నేహము సహజముగానే బాబా సమానంగా తయారుచేస్తుంది. స్నేహము కోసం దేనినైనా సమర్పితము చెయ్యడం సహజమవుతుంది.
ఈరోజు కూడా అమృతవేళ నుండి పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహ మాలలను బాబాకు వేసారు మరియు బాబా కూడా స్నేహి పిల్లలకు స్నేహ మాలను వేసారు. ఏ విధంగానైతే ఈ విశేష స్మృతి దివసములో అనగా స్నేహము యొక్క దివసములో స్నేహములో ఇమిడి ఉన్నారో, అలాగే సదా ఇమిడి ఉండండి, అప్పుడు శ్రమతో కూడిన పురుషార్థము చెయ్యవలసిన అవసరము ఉండదు. ఒకటేమో స్నేహ సాగరములో ఇమిడి ఉండటము, మరొకటి స్నేహ సాగరములో కొద్ది సమయము కోసం మునకలు వేయటము. కొంతమంది పిల్లలు ఇమిడి ఉండటం లేదు, త్వరగా బయటకు వచ్చేస్తున్నారు, అందుకే సహజము కూడా కష్టమైపోతుంది. మరి ఇమిడి ఉండటము వస్తుందా? ఇమిడి ఉండటములోనే ఆనందము ఉంది. బ్రహ్మా బాబా సదా బాబా స్నేహాన్ని హృదయములో ఇముడ్చుకుని ఉంచుకున్నారు, దీని స్మృతిచిహ్నాన్ని కలకత్తాలో చూపించారు. (గంగ సాగరములో కలవడము)
ఇప్పుడు బాప్‌దాదా పిల్లలందరి నుండి ఇదే కోరుకుంటున్నారు, బాబాపై ఉన్న ప్రేమకు రుజువుగా బాబా సమానంగా అయ్యి చూపించండి. సదా సంకల్పములో సమర్థంగా ఉండండి, ఇప్పుడు వ్యర్థము యొక్క సమాప్తి సమారోహమును జరుపుకోండి ఎందుకంటే వ్యర్థము సమర్థముగా అవ్వనివ్వదు మరియు ఎప్పటివరకైతే నిమిత్తులుగా అయిన పిల్లలైన మీరు సదా సమర్థులుగా అవ్వరో అప్పటివరకు విశ్వాత్మలకు సమర్థతను ఎలా ఇప్పిస్తారు! సర్వాత్మలు శక్తులలో పూర్తిగా ఖాళీ అయిపోయారు, శక్తులలో బికారులుగా అయిపోయారు. కనుక ఓ సమర్థ ఆత్మల్లారా, ఇటువంటి బికారి ఆత్మలను ఈ బికారీతనము నుండి ముక్తులుగా చెయ్యండి. ఆత్మలు సమర్థ ఆత్మలైన మిమ్మల్ని పిలుస్తూ ఉన్నారు - ముక్తిదాత పిల్లలైన ఓ మాస్టర్ ముక్తిదాతలారా, మాకు ముక్తినివ్వండి అని. ఈ శబ్దము మీ చెవులకు చేరుకోవటం లేదా? వినిపించటం లేదా? ఇప్పటివరకూ మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకోవటంలోనే బిజీగా ఉన్నారా? విశ్వాత్మల కోసం అనంతమైన స్వరూపము ద్వారా మాస్టర్ ముక్తిదాతలుగా అవ్వటం వలన స్వయము యొక్క చిన్న-చిన్న విషయాల నుండి స్వతహాగానే ముక్తులైపోతారు. ఇప్పుడు ఇది ఆత్మల పిలుపును వినే సమయము. పిలుపు వినిపిస్తుందా లేక వినిపించటం లేదా? వ్యాకులతతో ఉన్న ఆత్మలకు సుఖ-శాంతుల అంచలిని(దోసిలిని) ఇవ్వండి. ఇదే బ్రహ్మా బాబాను ఫాలో చెయ్యటము.
ఈరోజు విశేషంగా బ్రహ్మా బాబాను ఎక్కువగా స్మృతి చేసారు కదా! బ్రహ్మా బాబా కూడా పిల్లలందరినీ స్మృతి స్వరూపులుగా మరియు సమర్థ స్వరూపులుగా స్మృతి చేసారు. కొంతమంది పిల్లలు బ్రహ్మా బాబాతో ఆత్మిక సంభాషణ చేస్తూ మధురాతి మధురమైన ఫిర్యాదును కూడా చేసారు - మీరు ఇంత త్వరగా ఎందుకు వెళ్ళిపోయారు? మరొక ఫిర్యాదు ఏం చేసారంటే, పిల్లలైన మా అందరి నుండి సెలవు తీసుకుని ఎందుకు వెళ్ళలేదు. అప్పుడు బ్రహ్మా బాబా ఏమన్నారంటే - నేను కూడా శివబాబాను అడిగాను, నన్ను ఇలా అకస్మాత్తుగా ఎందుకు పిలిచారు అని, అప్పుడు బాబా ఏమన్నారంటే - ఒకవేళ నేను మిమ్మల్ని సెలవు తీసుకుని రమ్మని చెప్తే మీరు పిల్లలను వదిలిపెట్టగలిగేవారా లేక పిల్లలు మిమ్మల్ని వదిలిపెట్టగలిగేవారా? అర్జునుడు అయిన మీ యొక్క స్మృతిచిహ్నమే - అంతిమములో నష్టోమోహా స్మృతి స్వరూపులుగా ఉన్నట్లు ఉంది. అప్పుడు బ్రహ్మా బాబా నవ్వుతూ ఇలా అన్నారు - ఇదైతే అద్భుతము, మేము వెళ్తున్నాము అని పిల్లలు కూడా అనుకోలేదు మరియు వెళ్తున్నాము అని బ్రహ్మా కూడా అనుకోలేదు. ఎదురుగా ఉన్నా సరే రెండు వైపులా నిశ్శబ్దముగా ఉన్నారు ఎందుకంటే సమయ ప్రమాణంగా పిల్లలు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు అన్న పాత్ర డ్రామాలో నిశ్చితమై ఉంది, దీనినే వాహ్ డ్రామా వాహ్ అని అంటాము! సేవ యొక్క పరివర్తన నిశ్చితమై ఉంది. బ్రహ్మా బాబా పిల్లలకు వెన్నెముకగా అయ్యేది ఉంది. కనుక అవ్యక్త రూపములో తీవ్రగతితో సేవ చేసే పాత్రను అభినయించవలసే ఉంది.
విశేషంగా ఈరోజు డబల్ విదేశీయులు చాలా మధురాతి మధురమైన ఫిర్యాదులు చేసారు. డబల్ విదేశీయులు ఫిర్యాదులు చేసారా? డబల్ విదేశీయులు బ్రహ్మా బాబాతో ఇలా అన్నారు, కేవలం రెండు, మూడు సంవత్సరాలు మీరు ఆగి ఉండుంటే మేము మిమ్మల్ని చూసి ఉండేవారము. అప్పుడు బ్రహ్మా బాబా నవ్వుతూ ఇలా అన్నారు, సరదాగా అన్నారు - అలా అయితే డ్రామాతో మాట్లాడండి, డ్రామా ఇలా ఎందుకు చేసిందో అడగండి. కానీ భారత్‌లో అయినా, విదేశాలలో అయినా లాస్ట్ సో ఫాస్ట్ యొక్క ఉదాహరణ తయారయ్యేదే ఉంది, అందుకే ఇప్పుడు లాస్ట్ సో ఫాస్ట్‌గా అయ్యే ప్రత్యక్ష రుజువును చూపించండి. ఏ విధంగా ఈరోజు సమర్థ దివసాన్ని జరుపుకున్నారో, అలాగే ఇప్పుడు ప్రతి రోజూ సమర్థ దివసముగా ఉండాలి. ఏ విధమైన అలజడి ఉండకూడదు. బ్రహ్మా బాబా ఈరోజున ఏ మూడు పదాలలో శిక్షణను ఇచ్చారో (నిరాకారి, నిర్వికారి, నిరహంకారి), ఈ మూడు పదాల యొక్క శిక్షణా స్వరూపులుగా అవ్వండి. మనసాలో నిరాకారి, వాచాలో నిరహంకారి, కర్మణాలో నిర్వికారి. క్షణములో సాకార స్వరూపములోకి రండి, క్షణములో నిరాకారి స్వరూపములో స్థితులవ్వండి. ఈ అభ్యాసాన్ని మొత్తము రోజంతటిలో పదే-పదే చెయ్యండి. కేవలం స్మృతిలో కూర్చున్న సమయములోనే నిరాకారి స్థితిలో స్థితులై ఉండటము కాదు, మధ్యమధ్యలో సమయాన్ని వెచ్చించి ఈ దేహభానము నుండి అతీతమై నిరాకారి ఆత్మ స్వరూపములో స్థితులై ఉండే అభ్యాసాన్ని చెయ్యండి. ఏ కార్యము చేసినా, ఆ కార్యాన్ని చేస్తూ కూడా ఈ అభ్యాసము చెయ్యండి - నిరాకార ఆత్మనైన నేను ఈ సాకార కర్మేంద్రియాల ఆధారముతో కర్మలు చేస్తున్నాను. నిరాకారి స్థితి కరావన్‌హార్ (చేయించే) స్థితి. కర్మేంద్రియాలు చేసేవి, ఆత్మ చేయించేది. కనుక నిరాకారి ఆత్మ స్థితితో నిరాకారి బాబా స్వతహాగానే గుర్తుకు వస్తారు. ఏ విధంగా బాబా చేయించేవారో, అలా ఆత్మనైన నేను కూడా చేయించేవాడిని, ఇలా అనుకోవటం వలన కర్మ యొక్క బంధనములో బంధింపబడరు, అతీతముగా ఉంటారు, ఎందుకంటే కర్మ యొక్క బంధనములో చిక్కుకోవటం వలనే సమస్యలు వస్తాయి. మొత్తము రోజంతటిలో చెక్ చేసుకోండి - చేయించే ఆత్మగా అయ్యి కర్మలు చేయిస్తున్నానా? అచ్ఛా! ఇప్పుడు ముక్తిని ఇప్పించే మెషినరీని తీవ్రతరం చెయ్యండి.
అచ్ఛా - ఈసారి ఈ కల్పములో ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేతులెత్తండి. క్రొత్త-క్రొత్తగా వస్తున్న పిల్లలకు బాప్‌దాదా, సరైన సమయములో బాబాను గుర్తించి బాబా నుండి వారసత్వానికి అధికారులుగా అయినందుకు వారికి విశేషమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు. సదా - మేము బాబాను గుర్తించాము అన్న మీ ఈ భాగ్యాన్ని గుర్తు పెట్టుకోండి.
అచ్ఛా - డబల్ విదేశీయులు చేతులెత్తండి. చాలా మంచిది. బాప్‌దాదా డబల్ విదేశీయులను - మీరు బ్రహ్మా యొక్క సంకల్పం ద్వారా జన్మించినవారు అని అంటారు. ఒకటేమో డైరెక్ట్ నోటి ద్వారా వచ్చిన వంశావళి, రెండవది సంకల్పము ద్వారా వచ్చిన వంశావళి. సంకల్ప శక్తి చాలా గొప్పది. ఏ విధంగా సంకల్ప శక్తి వేగవంతమైనదో, అలాగే మీ రచన అయిన డబల్ విదేశీయులు తీవ్ర పురుషార్థాన్ని మరియు తీవ్ర ప్రారబ్ధాన్ని అనుభవము చేసుకునేవారు, అందుకే మొత్తము బ్రాహ్మణ పరివారములో డబల్ విదేశీయులు డబల్ సికీలధే పిల్లలుగా ఉన్నారు. భారత్‌లోని సోదరీ-సోదరులు మిమ్మల్ని చూసి సంతోషిస్తారు, వాహ్, డబల్ విదేశీయులూ, వాహ్ అని అంటారు! డబల్ విదేశీయులకు సంతోషము ఉంటుంది కదా? ఎంత సంతోషము ఉంది? చాలా ఉందా? మీ సంతోషంతో పోల్చదగినదేదీ లేదు. డబల్ విదేశములో కూడా మురళిని వింటున్నారు, చూస్తున్నారు కూడా. మంచిది. ఈ సైన్స్ సాధనాలు మీకు అనంతమైన సేవలను చెయ్యటంలో చాలా సహకరిస్తాయి మరియు సహజ సేవను చేయిస్తాయి. మీ స్థాపన యొక్క కనెక్షన్‌తోనే ఈ సైన్స్ యొక్క తీవ్రగతి జరిగింది.
అచ్ఛా - పాండవులందరూ సమర్థులేనా? బలహీనులుగా అయితే లేరు కదా, అందరూ సమర్థులేనా? మరియు శక్తులు బాబా సమానంగా ఉన్నారా? మీరు శక్తి సేన. శక్తుల శక్తి మాయాజీతులుగా చేస్తుంది. అచ్ఛా.
ఈరోజు విశేషంగా అలంకరించేవారు కూడా వచ్చారు (కలకత్తా సోదరీసోదరులు పూలు తీసుకువచ్చారు, అన్నిచోట్లా పూలతో చాలా బాగా అలంకరించారు). ఇది కూడా స్నేహానికి గుర్తు. మంచిది, మీ స్నేహానికి రుజువును ఇచ్చారు. అచ్ఛా! టీచర్లు చేతులెత్తండి. ప్రతి గ్రూపులో టీచర్లు చాలామంది వస్తారు. టీచర్లకు మంచి అవకాశము లభిస్తుంది. సేవకు ప్రత్యక్ష ఫలము లభిస్తుంది. మంచిది, ఇప్పుడు మీ ఫీచర్స్ (ముఖము) ద్వారా అందరికీ ఫ్యూచర్ (భవిష్యత్తు)ను సాక్షాత్కారం చేయించండి. ఏం చెయ్యాలో విన్నారా? అచ్ఛా!
మధుబన్ వారు చేతులెత్తండి - చాలా మంచిది. మధుబన్ వారికి చాలా అవకాశము లభిస్తుంది, అందుకే బాప్‌దాదా అంటారు, మధుబన్ వారు ఆత్మిక ఛాన్సలర్లు. మీరు ఛాన్సలర్లు కదా? సేవ చెయ్యాల్సి ఉంటుంది. అయినా కూడా మధుబన్ నివాసులు అందరినీ సంతుష్టపరుస్తారు కదా! అందుకే బాప్‌దాదా మధుబన్ వారిని ఎప్పుడూ మర్చిపోరు. మధుబన్ నివాసులను ప్రత్యేకంగా గుర్తు చేస్తారు. మధుబన్ వారిని ఎందుకు గుర్తు చేస్తారు? ఎందుకంటే మధుబన్ వారు బాబాపై ప్రేమ ఉండటములో మెజారిటీ పాస్ అయ్యారు. మెజారిటీకి, బాబాపై ఉన్న ప్రేమ ఎడతెగనిది. మధుబన్ వారు తక్కువేమీ కారు. చాలా మంచివారు.
ఇండోర్ జోన్ సేవాధారులు వచ్చారు:- ఇండోర్ జోన్ వారు చేతులెత్తండి. చాలా మంది ఉన్నారు, మంచిది. సేవ చెయ్యటము అనగా సమీపంగా వచ్చే ఫలాన్ని తినటము. సేవా అవకాశాన్ని తీసుకోవటము అనగా పుణ్యమును జమ చేసుకోవటము, ఆశీర్వాదాలను జమ చేసుకోవటము. కావున సేవాధారులందరూ తమ పుణ్య ఖాతాను జమ చేసుకున్నారు. ఈ ఆశీర్వాదాలు మరియు పుణ్యము అదనంగా లిఫ్ట్ వలె పని చేస్తాయి.
అచ్ఛా - దేశములో లేక విదేశాలలో, ఎవరైతే దూరంగా కూర్చున్నప్పటికీ సమీపంగా ఉన్నారో, ఆ పిల్లలందరికీ బాప్‌దాదా స్నేహ దినోత్సవానికి రిటర్న్‌లో పదమారెట్లుగా స్నేహం యొక్క ప్రియస్మృతులను ఇస్తున్నారు. బాప్‌దాదా చూస్తూ ఉంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క టైమ్ అవుతుంది కానీ వెలుగుతున్న జ్యోతులు వలె, అలసిపోకుండా వింటున్నారు మరియు సంతోషిస్తున్నారు. బాప్‌దాదా పిల్లల సంతోషాన్ని చూస్తున్నారు. మరి చెప్పండి, అందరూ సంతోషంలో నాట్యం చేస్తున్నారు కదా? అందరూ, అవును బాబా అని తలూపుతున్నారు. జనక్ బచ్చీ కూడా చాలా మధురాతి మధురంగా చిరునవ్వు నవ్వుతున్నారు. ఆ మాటకొస్తే అందరూ బాబాకు గుర్తున్నారు కానీ ఎంతమంది పేర్లను తీసుకుంటాము. అనేకమంది పిల్లలు ఉన్నారు, అందుకే బాప్‌దాదా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ పేరు సహితంగా వ్యక్తిగతంగా ప్రియస్మృతులను స్వీకరిస్తున్నారు మరియు స్వీకరిస్తూ ఉండండి. అచ్ఛా - ఇప్పుడు ఒక్క క్షణములో నిరాకారి స్థితిలో స్థితులైపోండి. (బాప్‌దాదా డ్రిల్ చేయించారు).
లివింగ్ వేల్యూస్ ట్రైనింగ్ జరుగుతుంది:- ఇది మంచి సేవా సాధనము. లివింగ్ వేల్యూస్ చేయిస్తూ-చేయిస్తూ తమ లవ్లీ లివింగ్ యొక్క అభ్యాసాన్ని పెంచుకుంటూ ఉండాలి.
అచ్ఛా - బాప్‌దాదా ఈరోజు ఒక విషయాన్ని గుల్జార్ బిడ్డకు చెప్పారు, బ్రహ్మా తనువు యొక్క సేవలా ఈ రథము కూడా ఇప్పుడు 33 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు, అందుకు విశేషంగా అభినందనలను ఇస్తున్నారు. ఇది కూడా డ్రామాలోని పాత్ర. బాబా సహాయము మరియు బిడ్డ యొక్క ధైర్యము, ఈ రెండూ కలిసి పాత్రను పోషిస్తాయి. అచ్ఛా!
సదా స్నేహ సాగరములో ఇమిడి ఉండేవారందరికీ, సదా ప్రేమలో లీనమై ఉండేవారికి, సదా చేయించే ఆత్మ స్వరూపములో స్థితులై ఉండేవారికి, సదా మూడు పదాల ‘‘శివ-మంత్రము’’ను ప్రత్యక్ష జీవితములోకి తీసుకువచ్చేవారికి, సదా బాబా సమానంగా మాస్టర్ ముక్తిదాతలుగా అయ్యి విశ్వాత్మలకు ముక్తిని ఇచ్చేవారికి, అటువంటి సర్వ శ్రేష్ఠ ఆత్మలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీగారితో:- ఈరోజున బాబా పిల్లలను విశేషంగా విశ్వము ముందు ప్రత్యక్షము చేసారు. బాబా చేయించేవారిగా అయ్యారు మరియు పిల్లలను చేసేవారిగా తయారుచేసారు. మంచిది, ఈ స్నేహ అల అందరినీ స్నేహములో ఇమిడిపోయేలా చేస్తుంది. అచ్ఛా - శరీరాన్ని నడిపించే విధి వచ్చింది కదా! నడిపిస్తూ-నడిపిస్తూ బాబా సమానంగా అవ్యక్తమైపోతారు. సహజ పురుషార్థము - ఆశీర్వాదాలు. మొత్తము రోజంతటిలో ఎవ్వరూ అసంతుష్టులు అవ్వకూడదు, ఆశీర్వాదాలు లభించాలి - ఇదే ఫస్ట్ క్లాస్ పురుషార్థము. ఇది సహజమైనది కూడా, మొదటి పురుషార్థము కూడా. సరేనా! శరీరము ఎలా ఉన్నా సరే ఆత్మ అయితే శక్తిశాలిగా ఉంది కదా! మరి పిల్లలైన మీరందరూ 14 సంవత్సరాలు ఏ తపస్యనైతే చేసారో ఆ తపస్యా బలము సేవ చేయిస్తూ ఉంది. ఇప్పుడైతే మీకు చాలామంది సహచరులు తయారయ్యారు. మంచి-మంచి సేవా సహచరులు. మిమ్మల్ని చూసి సంతోషిస్తారు, ఇదే చాలు. సరే.
వరిష్టులైన పెద్ద అన్నయ్యలతో:- డ్రామా అనుసారంగా సేవా ప్లాన్లు ఏవైతే తయారవుతాయో, అవి మంచిగా తయారవుతున్నాయి మరియు ప్రతి ఒక్కరూ సదా సంగఠనలో స్నేహాన్ని మరియు ఆశీర్వాదాలను తీసుకునేందుకు బాలక్ సో మాలిక్ అన్న పాఠాన్ని పక్కా చేసుకుని ఇతరులను ముందుకు తీసుకువెళ్తూ, ఇతరుల ఆలోచనలకు కూడా గౌరవాన్ని ఇస్తూ ముందుకు వెళ్తారు కనుక సఫలతే సఫలత. సఫలత అయితే లభించవలసిందే. కానీ ఇప్పుడు నిమిత్త ఆత్మలెవరైతే ఉన్నారో వారిని విశేష స్నేహ సంబంధములోకి తీసుకురావడము, ఇది అందరి పురుషార్థాన్ని తీవ్రం చెయ్యడము. స్నేహము ఉండాలి, నిస్వార్థ స్నేహము ఉండాలి, ఎక్కడైతే నిస్వార్థ స్నేహము ఉంటుందో అక్కడ గౌరవాన్ని ఇస్తారు కూడా మరియు తీసుకుంటారు కూడా. వర్తమాన సమయములో స్నేహ మాలలోకి అందరూ వచ్చేటట్లుగా చెయ్యాలి, ఇదే విశేష ఆత్మల కార్యము మరియు దీని ద్వారానే, స్నేహము సంస్కారాలను పరివర్తన కూడా చేయించగలదు. జ్ఞానము అందరి వద్ద ఉంది కానీ స్నేహము ఎటువంటి సంస్కారాలు కలవారినైనా సమీపంగా తీసుకురాగలదు. కేవలం స్నేహం యొక్క రెండు మాటలు సదాకాలము కొరకు వారి జీవితానికి ఆధారంగా అవ్వగలవు. నిస్వార్థ స్నేహము అతి త్వరగా మాలను తయారుచేస్తుంది. బ్రహ్మా బాబా ఏం చేసారు? స్నేహముతో తమవారిగా తయారుచేసారు. కావున ఈరోజు దీని అవసరముంది. అంతే కదా!
(సోనీపత్ కోసం మీటింగ్ జరుగుతూ ఉంది. అక్కడ అనుభూతి చేయించేందుకు సాధనాల ఉపయోగాన్ని ఎలా చెయ్యాలి) ఆ ప్లాన్‌ను అయితే తయారుచేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరి సంకల్పాలు, ఆలోచనల్లో విశేషంగా మెజారిటీ ఏదైతే స్వీకరిస్తారో, ఆ విధంగా తయారుచెయ్యండి. అనుభూతి స్వరూపులుగా అయినప్పుడే అనుభూతిని చేయించగలరు. అచ్ఛా!