Search for a command to run...
31 Dec 2001
‘‘ఈ క్రొత్త సంవత్సరములో సఫలతా భవ అన్న వరదానము ద్వారా బాబా మరియు స్వయము యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి’’
31 December 2001 · తెలుగు
ఈరోజు నవయుగ రచయిత తమ మాస్టర్ నవయుగ రచయితలైన పిల్లలతో కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. క్రొత్త సంవత్సరాన్ని జరుపుకోవటము, దీనినైతే ప్రపంచములో అందరూ చేస్తారు. కానీ మీరందరూ నవ యుగాన్ని తయారుచేస్తున్నారు. నవయుగము యొక్క సంతోషము పిల్లలు ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నవయుగము ఇప్పుడు ఇక రానున్నది అని మీకు తెలుసు. ప్రపంచములోనివారి క్రొత్త సంవత్సరము ఒక్క రోజు జరుపుకునేది మరియు మీ అందరి నవయుగము పూర్తి సంగమయుగమంతా జరుపుకునేది. క్రొత్త సంవత్సరములో సంతోషాన్ని జరుపుకుంటారు, ఒకరికొకరు కానుకలను ఇచ్చుకుంటారు. ఆ కానుకలు కూడా ఎటువంటివి! కొద్ది సమయము కొరకు ఆ కానుకలు ఉంటాయి. నవయుగ రచయిత అయిన బాబా పిల్లలైన మీ అందరికీ ఏ కానుకను తీసుకువస్తారు? బంగారు కానుక, ఈ బంగారు కానుకలో అనగా బంగారు యుగములో అంతా స్వతహాగానే బంగారంగా అయిపోతుంది, క్రొత్తగా అయిపోతుంది. కొద్ది సమయము తర్వాత క్రొత్త సంవత్సరము ప్రారంభమవుతుంది కానీ అంతా క్రొత్తగా అయిపోదు. మీ నవయుగములో ప్రకృతి కూడా క్రొత్తదిగా అవుతుంది. ఆత్మ కూడా క్రొత్త వస్త్రాన్ని (శరీరాన్ని) ధరిస్తుంది. ప్రతి వస్తువు క్రొత్తదిగా అనగా సతోప్రధానముగా, బంగారు యుగానికి చెందినదిగా ఉంటుంది. కనుక క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటూ మీ మనసులో, బుద్ధిలో క్రొత్త యుగమే గుర్తుకు వస్తూ ఉంది. క్రొత్త యుగము గుర్తుంది కదా, లేక ఈరోజున క్రొత్త సంవత్సరము గుర్తుందా?
బాప్‌దాదా ముందుగా నవయుగానికి శుభాకాంక్షలను ఇస్తున్నారు, తరువాత దానితోపాటు క్రొత్త సంవత్సరానికి శుభాకాంక్షలను ఇస్తున్నారు, ఎందుకంటే మీరందరూ క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు కదా! జరుపుకోండి, బాగా జరుపుకోండి. బాప్‌దాదా ద్వారా లభించిన అవినాశి కానుక ఏదైతే ఉందో దాని అవినాశి శుభాకాంక్షలను జరుపుకోండి. సదా ఒకరికొకరు శుభ భావన యొక్క శుభాకాంక్షలను ఇచ్చుకోండి. ఇవే సత్యమైన శుభాకాంక్షలు. శుభాకాంక్షలను తెలిపినప్పుడు స్వయం కూడా సంతోషపడతారు మరియు ఇతరులు కూడా సంతోషపడతారు. మరి సత్యమైన హృదయము యొక్క శుభాకాంక్షలు ఏమిటంటే - ఇతరుల పట్ల హృదయపూర్వకంగా శుభ భావన, శుభ కామనల శుభాకాంక్షలు. శుభ భావన అనేది ఎటువంటి శ్రేష్ఠమైన శుభాకాంక్షలంటే ఏ ఆత్మకు ఎటువంటి భావన ఉన్నా సరే, మంచి భావన మరియు మంచి భావము లేకపోయినా సరే, మీ శుభ భావన వారి భావాన్ని కూడా మార్చగలదు, స్వభావాన్ని కూడా మార్చగలదు. మామూలుగా కూడా స్వభావము అన్న మాటకు అర్థమేమిటంటే - స్వ (సు) యొక్క భావము అనగా శుభ భావము. ప్రతి సమయము, ప్రతి ఆత్మకు ఈ అవినాశి శుభాకాంక్షలనే ఇస్తూ వెళ్ళండి. మీకు ఎవరు ఏం ఇచ్చినా సరే, మీరు అందరికీ శుభ భావనను ఇవ్వండి. అవినాశి ఆత్మ యొక్క అవినాశి ఆత్మిక స్థితిలో స్థితియై ఉండటం ద్వారా ఆత్మ తప్పకుండా పరివర్తన అయిపోతుంది. మరి ఈ క్రొత్త సంవత్సరములో ఏ విశేషతను చేస్తారు? స్వయములో కూడా, సర్వులలో కూడా మరియు సేవలో కూడా? క్రొత్త సంవత్సరము అన్న పేరు ఉన్నప్పుడు ఏదైనా నవీనతను చేస్తారు కదా! మరి ఏ నవీనతను చేస్తారు? ప్రతి ఒక్కరూ తమ నవీనతకు చెందిన ప్లాన్‌ను తయారుచేసారా లేక ఇప్పుడు కేవలం క్రొత్త సంవత్సరాన్ని జరుపుకుంటారా? మిలనాన్ని జరుపుకున్నారు, క్రొత్త సంవత్సరాన్ని జరుపుకున్నారు, నవీనతకు సంబంధించి ఏ ప్లాన్‌ను తయారుచేసారు?
బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరికీ ఈ సంవత్సరము కోసం విశేషంగా ఈ సూచనను ఇస్తున్నారు - సమయమనుసారముగా ఇప్పుడు పిల్లలందరినీ, వారు ఇక్కడ సాకారములో సమ్ముఖంగా కూర్చుని ఉన్నా లేక దేశ-విదేశాలలో విజ్ఞాన సాధనాల ద్వారా వింటున్నా, చూస్తున్నా, బాప్‌దాదా కూడా అందరినీ చూస్తున్నారు. అందరూ చాలా ప్రశాంతముగా, ఆనందముగా చూస్తున్నారు. కనుక విశ్వములోని బాప్‌దాదా యొక్క అతి ప్రియమైన, అతి మధురమైన పిల్లలందరికీ బాప్‌దాదా ఇదే సూచనను ఇస్తున్నారు - ‘‘ఇప్పుడు మీ ఈ బ్రాహ్మణ జీవితములో అమృతవేళ నుండి రాత్రి వరకు పొదుపు ఖాతాను పెంచండి, జమ ఖాతాను పెంచండి.’’ ప్రతి ఒక్కరూ తాము చేసే కార్యము అనుసారంగా తమ ప్లాన్‌ను తయారు చేసుకోండి, బ్రాహ్మణ జీవితములో ఏయే ఖజానాలైతే లభించాయో, ఆ ప్రతి ఖజానా యొక్క పొదుపు ఖాతాను మరియు జమ ఖాతాను పెంచండి ఎందుకంటే బాప్‌దాదా ఈరోజు ఈ సంవత్సరము యొక్క చివరిలో నలువైపులా ఉన్న పిల్లల యొక్క రిజల్ట్‌ను చూసారు. ఏం చూసారు, తెలిసిపోయింది కదా. టీచర్లకు కూడా తెలిసిపోయింది. డబల్ విదేశీయులకు కూడా తెలిసిపోయింది. మహారథులకు కూడా తెలిసిపోయింది. జమ ఖాతా ఎంతగా ఉండాలో అంతగా... ఏమని చెప్పాలి? మీరు స్వయమే చెప్పండి, ఎందుకంటే బాప్‌దాదాకు తెలుసు - సర్వ ఖజానాలను జమ చేసుకునే సమయము కేవలం ఇప్పుడు ఈ సంగమయుగమే. ఈ చిన్నని యుగములో ఎంతగా జమ చేసుకుంటారో దాని అనుసారముగానే మొత్తము కల్పమంతా ప్రారబ్ధాన్ని ప్రాప్తి చేసుకుంటూ ఉంటారు. మీ అందరి స్లోగన్ ఉంది కదా - ఏ స్లోగన్ ఉంది? ఇప్పుడు కాకపోతే... తరువాత ఏంటి? ‘‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు’’. ఈ స్లోగన్ బుద్ధిలోనైతే చాలా బాగా గుర్తుంది. కానీ మనసులో, స్మృతిలో మర్చిపోతారు కూడా, గుర్తుంటుంది కూడా. అన్నింటికంటే అతి పెద్ద ఖజానాలు, ఈ బ్రాహ్మణ జీవితములోని శ్రేష్ఠతకు ఆధారము - సంకల్పాల ఖజానా, సమయము యొక్క ఖజానా, శక్తుల ఖజానా, జ్ఞాన ఖజానా, ఇకపోతే స్థూల ధనము యొక్క ఖజానా అయితే మామూలు విషయమే. కనుక బాప్‌దాదా చూసారు, బ్రాహ్మణులైన మీరు ప్రతి ఒక్కరూ ఎంతగా శ్రేష్ఠ సంకల్పాల ఖజానా ద్వారా స్వయాన్ని మరియు సేవను శ్రేష్ఠంగా చేయగలుగుతారు అన్న విషయములో ఇప్పుడు మరింత అండర్లైన్ చేయవలసి ఉంటుంది.
బ్రాహ్మణులైన మీ యొక్క ఒక్క శ్రేష్ఠ సంకల్పములో, శుభ సంకల్పములో ఎంతటి శక్తి ఉందంటే, దాని ద్వారా మీరు ఆత్మలకు ఎంతో సహయోగాన్ని ఇవ్వగలరు. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు ఇంకా ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. సైన్స్ సాధనమైన రాకెట్‌ను, దూరంలో కూర్చుని ఉన్నా, ఎక్కడికి కావాలంటే అక్కడకు, ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ స్థానానికి చేర్చాలనుకుంటే ఆ స్థానానికి ఒక్క క్షణములో చేర్చగలరు అన్నప్పుడు మీ శుభ, శ్రేష్ఠ సంకల్పాల ముందు ఈ రాకెట్ ఎంత! రిఫైన్ (మెరుగైన) విధితో కార్యములో వినియోగించి చూడండి, మీ విధితో లభించే సిద్ధి చాలా శ్రేష్ఠమైనది. కానీ ఇప్పుడు అంతర్ముఖత యొక్క భట్టీలో కూర్చోండి. కనుక ఈ క్రొత్త సంవత్సరములో మీకు మీరే సర్వ ఖజానాలకు సంబంధించి పొదుపు స్కీమ్‌ను తయారు చెయ్యండి, జమ ఖాతాను పెంచండి. మొత్తం రోజంతటిలో మీరు స్వయమే మీ కోసం అంతర్ముఖతా భట్టీ కొరకు సమయాన్ని ఫిక్స్ చేసుకోండి. మీకు మీరే చెయ్యగలరు, ఇది ఇతరులు మీ కోసం చెయ్యలేరు.
బాప్‌దాదా ప్రత్యక్షతా సంవత్సరము కంటే ముందు ఈ సంవత్సరాన్ని ‘‘సఫలత భవ సంవత్సరము’’ అని అంటారు. సఫలతకు ఆధారము ప్రతి ఖజానాను సఫలం చేసుకోవటము. సఫలము చెయ్యండి, సఫలతను ప్రాప్తి చేసుకోండి. సఫలత ప్రత్యక్షతను స్వతహాగానే ప్రత్యక్షము చేస్తుంది. వాచా సేవను చాలా బాగా చేసారు కానీ ఇప్పుడు సఫలతా వరదానము ద్వారా బాబా యొక్క, స్వయము యొక్క ప్రత్యక్షతను సమీపంగా తీసుకురండి. ప్రతి ఒక్క బ్రాహ్మణాత్మ జీవితములో సర్వ ఖజానాల సంపన్నత అనేది ఆత్మలకు అనుభవమవ్వాలి. ఈరోజుల్లోని ఆత్మలు మీ అనుభవీమూర్తి ద్వారా అనుభూతి చెయ్యాలని కోరుకుంటున్నారు. వినడం తక్కువ వినాలనుకుంటున్నారు, అనుభూతి ఎక్కువ కోరుకుంటున్నారు. ‘‘అనుభూతికి ఆధారము - ఖజానాల జమ ఖాతా’’. ఇప్పుడు మొత్తము రోజంతటిలో మధ్యమధ్యలో మీ ఈ చార్టును చెక్ చేసుకోండి - సర్వ ఖజానాలను ఎంత జమ చేసుకున్నాను? జమ ఖాతాను తియ్యండి, లెక్కాపత్రాన్ని తియ్యండి. ఒక్క క్షణములో ఎన్ని సంకల్పాలు నడుస్తాయి? సంకల్పాల వేగము ఫాస్ట్‌గా ఉంటుంది కదా. ఎన్ని సఫలమయ్యాయి, ఎన్ని వ్యర్థమయ్యాయి? ఎన్ని సమర్థముగా ఉన్నాయి, ఎన్ని సాధారణముగా ఉన్నాయి? చెక్ చేసుకునే మెషీన్ అయితే మీ వద్ద ఉంది కదా లేక లేదా? అందరి వద్ద చెకింగ్ మెషీన్ ఉందా? టీచర్ల వద్ద ఉందా? మీ సెంటర్లలో ఏ విధంగా కంప్యూటర్, ఈ-మెయిల్ ఉన్నాయో అలా ఈ చెకింగ్ మెషీన్ ఉందా? డబల్ విదేశీయుల వద్ద ఉందా? ఆ మెషీన్ పని చేస్తుందా లేక ఆగిపోయి ఉందా? పాండవుల వద్ద చెకింగ్ మెషీన్ ఉందా? అందరి వద్దా ఉంది, ఎవరి వద్దనైనా లేకపోతే అప్లికేషన్ పెట్టండి. ఎక్కడైనా ఆఫీసు తెరిచేటప్పుడు ముందే ఆలోచిస్తారు కదా, ఆఫీసు తెరిచే కంటే ముందు ఈరోజుల్లో కంప్యూటర్ కావాలి, ఈ-మెయిల్ కావాలి, టైప్ మెషీన్ కావాలి, కాపీలు తీసే మెషీన్ కావాలి. కావాలి కదా? మరి బ్రాహ్మణ జీవితములో, మీ హృదయము అనే ఆఫీసులో ఈ అన్ని మెషీన్లు ఉన్నాయా, లేవా?
బాప్‌దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - బాప్‌దాదా వద్దకు నేను ఎవరెడీగా ఉన్నాను అని చెప్పడానికి ప్రకృతి కూడా వస్తుంది, సమయము కూడా బ్రాహ్మణులు సిద్ధముగా ఉన్నారా అని బ్రాహ్మణులను పదే-పదే చూస్తూ ఉంటుంది, పదే-పదే బ్రాహ్మణుల చుట్టూ తిరుగుతుంటుంది. మరి బాప్‌దాదా ప్రశ్నిస్తున్నారు, చేతులైతే చాలా బాగా ఎత్తుతారు, బాప్‌దాదా కూడా సంతోషిస్తారు. ఇప్పుడు ఎలా ఎవరెడీగా అవ్వండంటే - ప్రతి సంకల్పము, ప్రతి క్షణము, ప్రతి శ్వాస ఏదైతే గడిచిందో, అది వాహ్, వాహ్ అనే విధంగా ఉండాలి. వై (ఎందుకు) అన్నట్లు ఉండకూడదు, వాహ్ వాహ్ అనే విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక్కో సమయములో వాహ్ వాహ్ అన్నట్లు ఉంటుంది, ఒక్కో సమయములో వాహ్ అని అనేందుకు బదులుగా వై (ఎందుకు) అన్నట్లు అయిపోతుంది. ఒక్కో సమయములో బిందువు పెడతారు, ఒక్కో సమయములో ప్రశ్నార్థక గుర్తు లేక ఆశ్చర్యార్థక గుర్తు పడుతుంది. మీ అందరి మనసు కూడా వాహ్ అని అనాలి మరియు ఎవరి సంబంధ-సంపర్కములోకి వచ్చినా, అది బ్రాహ్మణులు కావచ్చు లేక సేవ చేసేవారు కావచ్చు, అందరి నుండి వాహ్! వాహ్! అనే మాట రావాలి. అచ్ఛా!
ఈ సీజన్‌లోని చివరి టర్న్‌కు ఎన్ని నెలలు ఉన్నాయి? (మూడు నెలలు) మరి మూడు నెలల తర్వాత బాప్‌దాదా పిల్లలు ప్రతి ఒక్కరి పొదుపు అకౌంట్‌ను చెక్ చేస్తారు. సరేనా? ఎవరైతే మూడు నెలలలో చెక్ చేయించుకోవడానికి తయారుగా ఉన్నారో వారు చేతులెత్తండి. తయారైపోతారా? ఎంత శాతం తయారవుతారు? ఉల్లాసం బాగుంది. ఎవ్వరూ చేతులెత్తడం లేదు, ఆలోచిస్తున్నారా? మూడు నెలలలో అకౌంట్ చెకింగ్ జరుగుతుంది. మీరు మీ అకౌంట్‌ను చెక్ చేసుకోండి, తర్వాత బాప్‌దాదా చెక్ చేస్తారు. బాప్‌దాదాకు సమయం పట్టదు. ఇక్కడైతే అకౌంట్స్‌లో ఎంతో తల బద్దలుకొట్టుకుంటారు. అంతే కదా? అలసిపోతారు. బాప్‌దాదాకు తెలుస్తుంది, మాలిశ్ జరుగుతుంది. మధుబన్ వారు అకౌంట్స్ పెట్టడంలో తెలివైనవారే కదా? అంతా వాహ్, వాహ్ జరుగుతుంది. ఏమీ ఫర్వాలేదు.
బాప్‌దాదా టీచర్లను చూసి చాలా సంతోషిస్తారు. (అందరూ చప్పట్లు కొట్టారు) చప్పట్లు అయితే చాలా బాగా కొట్టారు. అసలైతే మీరందరూ టీచర్లే కదా, లేక ఈ టీచర్లే టీచర్లా? కోర్స్ చేయించేటప్పుడు లేక సందేశం ఇచ్చేటప్పుడు ఏమవుతారు? టీచర్ అవుతారు కదా? బాప్‌దాదా ఈ సంవత్సరంలో ఒక నవీనతను చూడాలనుకుంటున్నారు, వినిపించమంటారా? చేస్తారా? పాండవులు చేస్తారా? పక్కా? పక్కాగా చేస్తారా? ఏమి జరిగినాగానీ చేయవలసిందే. తయారుగా ఉన్నారా? పాండవులు అందరూ తయారుగా ఉన్నారా? యూథ్ కూడా తయారుగా ఉందా? బాప్‌దాదా వినిపిస్తే చేస్తారా? మాతలు చేస్తారా? (అందరూ చేస్తాము అని జవాబు చెప్పారు) మంచిది, బాప్‌దాదా పిల్లల ధైర్యానికి అభినందనలు ఇస్తున్నారు. ఇప్పుడు ఒక విషయాన్ని వినండి, రెండు చేతుల చప్పట్లు కొట్టకండి, ఒక్క చేతి చప్పట్లు కొట్టండి. లేకపోతే గందరగోళం అయిపోతుంది కదా.
ఈరోజు గ్రేట్-గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన బ్రహ్మాబాబాకు ఒక శుభ ఆశ ఉంది. బ్రహ్మాబాబా అన్నారు, నా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ సన్స్‌కు విశేషంగా ఒక మాట చెప్పాలి, అదేమిటి? అదేమిటంటే, సదా ప్రతి బిడ్డ ముఖముపై, సదా ఒకటేమో ఆత్మికతతో కూడిన చిరునవ్వు ఉండాలి, విన్నారా! చెవులు బాగా తెరుచుకుని వినండి. రెండవది - నోటిలో సదా మధురత ఉండాలి. ఒక్క మాట కూడా మధురత లేకుండా ఉండకూడదు. ముఖముపై ఆత్మికత ఉండాలి, నోటిలో మధురత ఉండాలి మరియు మనను-బుద్ధిలో సదా శుభ భావన, దయాహృదయ భావన, దాతాతనపు భావన ఉండాలి. ప్రతి అడుగులో ఫాలో ఫాదర్ చెయ్యాలి. మరి ఇది చెయ్యగలరా? టీచర్లు ఇది చెయ్యగలరా? యువత చెయ్యగలరా? (జ్ఞాన సరోవర్‌లో దేశ-విదేశాలకు చెందిన యువత యొక్క రిట్రీట్ జరుగుతూ ఉంది). బాప్‌దాదా వద్దకు యూథ్ గ్రూప్ యొక్క రిజల్ట్ చాలా మంచిగా వచ్చింది. పదమా రెట్లు అభినందనలు. మంచి రిజల్ట్. అనుభవం కూడా బాగా చేసారు, బాప్‌దాదా సంతోషించారు. బాప్‌దాదా అనుభవాలు కూడా విన్నారు. ఇతరులు వినిపిస్తే విన్నది కాదు, డైరెక్టుగా బాప్‌దాదా మీ అనుభవాలను విన్నారు, కానీ ఇప్పుడు ఈ అనుభవాలను అమర భవ అనే వరదానముతో అవినాశిగా ఉంచుకోండి. ఏది ఏమైనా కానీ, మీ ఆత్మిక అనుభవాలను సదా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. వాటిని తగ్గించకండి. మూడు నెలల తర్వాత మధుబన్కు వచ్చినా, రాకపోయినా, మూడు నెలల తర్వాత విదేశాల నుండైతే రారు కానీ మీ అకౌంట్‌ను పెట్టుకోండి మరియు దానిని బాప్‌దాదా వద్దకు పంపించండి, బాప్‌దాదా రైట్ పెడతారు లేదా ఎలా ఉంటే ఆ పర్సెంటేజ్ ఇస్తారు. సరేనా? అయితే, ఒక్క చేతితో చప్పట్లు కొట్టండి. అచ్ఛా!
ఈరోజు శుభాకాంక్షల రోజు కావున బాప్‌దాదా ఇంకొక శుభవార్తను విన్నారు మరియు చూసారు కూడా. చిన్న-చిన్న పిల్లలు కిరీటధారులై కూర్చున్నారు. మీకైతే కిరీటము లభిస్తుంది, వీరికి ఇప్పుడే లభించేసింది. లేచి నిలబడండి. చూడండి, కిరీటధారుల గ్రూప్‌ను చూడండి. పిల్లలంటే సదా సత్యమైన మనస్సు కలిగినవారు. సత్యమైన మనసు కలవారే కదా! మంచిది, పిల్లల రిజల్ట్‌ను కూడా బాప్‌దాదా మంచిగా చూసారు. అభినందనలు. అచ్ఛా!
డబల్ విదేశీయులు:- వీరి ఉత్తరాలను మరియు చీటీలను కూడా చూసాము. ఉల్లాసముతో కూడిన చీటీలు. కానీ ఒక విషయాన్ని బాప్‌దాదా చూసారు, అది కొన్ని-కొన్ని చీటీలలో ఉంది. కొందరు చాలా ఉల్లాస-ఉత్సాహాలతో పరివర్తనను కూడా వ్రాసారు, ఉల్లాసాన్ని కూడా వ్రాసారు, కానీ కొందరు కాస్త తమ నిర్లక్ష్యాన్ని చూపించారు. నిర్లక్ష్యులుగా ఎప్పుడూ అవ్వకండి. అలర్ట్‌గా ఉండాలి. బాప్‌దాదాకు ఒకటేమో నిర్లక్ష్యము మంచిగా అనిపించదు, రెండవది నిరాశకు లోనవ్వడం మంచిగా అనిపించదు. ఏమి జరిగినా కానీ పెద్ద మనసు పెట్టుకోండి. నిరాశకు లోనైన హృదయము చిన్న మనసుగా ఉంటుంది, సంతోషకరమైన హృదయముంటే పెద్ద మనసు ఉంటుంది. కనుక నిరాశాపరులుగా అవ్వకండి, నిర్లక్ష్యులుగా అవ్వకండి. ఉల్లాస-ఉత్సాహాలతో సదా ఎగురుతూ ఉండండి. బాప్‌దాదాకు డబల్ విదేశీయులపై కోటాను కోట్ల ఆశలు ఉన్నాయి. డబల్ విదేశీయులు తమ సత్తాను ఎలా చూపిస్తారంటే, దానిని చూసి ఇండియాలోని ఆత్మలు ఆశ్చర్యచకితులైపోతారు. రాబోతుంది, ఆ రోజు కూడా రాబోతుంది, త్వరలోనే రాబోతుంది. రాబోతుంది కదా? ఆ రోజు రాబోతుంది కదా? వస్తుందా ఆ రోజు? (త్వరత్వరగా వస్తుంది) హా జీ అనైతే చెప్పండి. బాప్‌దాదా ముందుగానే అభినందనలను పళ్ళాలలో నింపి ఇస్తున్నారు. ఇంతటి ధైర్యాన్ని బాప్‌దాదా డబల్ విదేశీయులలో చూస్తున్నారు, అంతే కదా? విదేశాలపై చాలా ఆశలు ఉన్నాయి. మంచిది. యువత కూడా బాగున్నారు, ప్రవృత్తిలోనివారు కూడా చాలామంది ఉన్నారు, కుమారీలు కూడా చాలామంది ఉన్నారు, అద్భుతమే అద్భుతము. సరేనా? సింధీ పరివారము వారు చెప్పండి, ఏ అద్భుతాన్ని చేస్తారు? నిమిత్తమాత్రముగా సింధీ వారు కానీ వాస్తవానికి బ్రాహ్మణులు. ఏం చేస్తారు, చెప్పండి? (బాబా పేరును ప్రసిద్ధం చేస్తాము) ఎప్పుడు చేస్తారు? (ఈ సంవత్సరములో) మీ నోట్లో గులాబ్‌జామ్. మీరు ధైర్యం కలవారు. (మీ వరదానము మాకు తోడుగా ఉంది) వరదాతయే తోడుగా ఉన్నప్పుడు ఇక వరదానము ఉండటము ఏమంత పెద్ద విషయము. అచ్ఛా!
ఎవరెవరైతే ఈ కల్పములో మొదటిసారి వచ్చారో వారు లేచి నిలబడండి. ఎవరైతే మొదటిసారి వచ్చారో, ఆ పిల్లలతో బాప్‌దాదా అంటున్నారు - మీరు వచ్చింది వెనుక కానీ మీరు వెళ్ళాల్సింది ముందుకు, మీరు ఎంత ముందుకు వెళ్ళండంటే అందరూ మిమ్మల్ని చూసి సంతోషపడాలి మరియు అందరి నోటి నుండి అద్భుతము, అద్భుతము, అద్భుతము అన్న మాటే రావాలి. అంతటి ధైర్యము ఉందా? మొదటిసారి వచ్చినవారిలో ధైర్యము ఉంది కదా! క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు, మరి క్రొత్త సంవత్సరములో ఏదైనా అద్భుతాన్ని చేస్తారు కదా! అయినా కూడా బాప్‌దాదాకు పిల్లలందరూ అతి ప్రియమైనవారు. అయినా చాలా తెలివైన పని చేసారు, టూ లేట్ కంటే ముందే వచ్చేసారు. ఇప్పుడు ఎంతైనా ఈ హాల్లో కూర్చోవటానికి సీట్ అయితే దొరికింది కదా! ఉండటానికి మంచమో, నేలో లభించింది కదా! ఎప్పుడైతే టూ లేట్ అన్న బోర్డు పెట్టబడుతుందో అప్పుడిక క్యూలో నిలబెట్టాల్సి ఉంటుంది, అందుకే మంచి సమయములో బాప్‌దాదాను గుర్తించారు, తెలివైన పని చేసారు. అచ్ఛా!
ఎవరైతే పాత పాండవులు ఉన్నారో, వారు లేవండి. పాండవుల మహిమ కూడా తక్కువేమీ కాదు. పాండవపతి అన్నది బాప్‌దాదా టైటిల్. అంటే పాండవుల మహిమ ఉన్నట్లే కదా, పాండవ పతి మరియు విజయి పాండవులు అన్న గాయనము ఉంది. శక్తులు వారదానీలు అన్న గాయనము ఉంది కానీ పాండవులకు విజయి పాండవులు అన్న గాయనము ఉంది. మరి ప్రతి పాండవుని మస్తకంపై ఏ తిలకము పెట్టబడి ఉంది? విజయి తిలకము. మీరు మీ మస్తకంలో విజయి తిలకాన్ని చూస్తున్నారా లేక మర్చిపోతున్నారా? సదా తమ మస్తకంలో విజయి పాండవ్, విజయి తిలకము మెరుస్తూ ఉన్నట్లుగా చూడండి. విజయము ప్రతి పాండవుని జన్మసిద్ధ అధికారము. అధికారులే కదా? బాప్‌దాదా పాండవులను విజయి రత్నాల రూపంలో చూస్తూ అభినందనలు తెలుపుతున్నారు. చాలా మంచివారు, చాలామంది ఉన్నారు. పాండవులు తక్కువేమీ కాదు.
అచ్ఛా, పాత మాతలు ఎవరైతే ఇంతకముందు నుండి వస్తూ ఉన్నారో, వారు లేవండి. మాతల విశేషత ఏమిటి? మాతల చరణాలపై ఈ పెద్ద-పెద్ద హోదాలలో ఉన్న వారంతా మీ అందరి చరణాలపై వంగుతారు. మాత గురువు అన్న గాయనము ఏదైతే ఉందో దాని సత్యమైన పాత్రను మాతలైన మీరు చేస్తారు. ఎలా అయితే ఇప్పుడు ఏదైనా పెద్ద పండుగ రోజున భారత మాతలకు జై అని అంటారు కదా! రానున్న రోజుల్లో మాతలైన మీకు జయజయకారాలు చెప్తారు. మాతలకు బాప్‌దాదా ఇంతటి హోదాను ఇచ్చారు. మాతలు జయజయకారాల ధ్వనిని వింటారు. మాత గురువు అన్న గాయనాన్ని వీరు ప్రత్యక్ష రూపంలో చూపిస్తారు. మీరు ఇటువంటి మాతలే కదా! నిద్రిస్తున్న ఆత్మలను మేల్కొలుపుతారు. మాతలది చాలా మంచి పాత్ర ఉంది. ఎవరైతే మీ నిందను చేసారో వారే మీ కీర్తన చేస్తారు ఎందుకంటే బాబా వారిగా అయిపోయారు కదా! ఉన్నతోన్నతుడైన భగవంతుడికి సహవాసిగా అయిపోయారు కదా! ఈ నషా ఉన్నదా? మరి ఇటువంటి మాతలకు బాప్‌దాదా కూడా నమస్తే చెప్తున్నారు. అచ్ఛా .
కుమారీలతో:- కుమారీలు చేయి ఊపండి. కుమారీలు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పుడు మీరు సాధారణ కుమారీలు కాదు. ఇప్పుడు మీరు సు-కుమారీలుగా అయ్యారు, శ్రేష్ఠ కుమారీలుగా అయ్యారు. కుమారీల కోసం బాప్‌దాదా మనసులో ఒక ఉమంగం వస్తుంది, వినిపించమంటారా? కుమారీలు, వింటారా? కుమారీల గురించి గాయనము ఉంది – 21 తరాలను ఉద్ధరించేది అని, మరి బాప్‌దాదా అంటారు, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క కుమారి 21 మందిని అన్న మాటను విడిచిపెట్టండి, ఒక్కొక్క కుమారి ఒక్కొక్క వారస క్వాలిటీ వారిని తయారు చేయాలి, వీలవుతుందా? ధైర్యము ఉందా? ఎంతమంది కుమారీలు ఉండవచ్చు? (షుమారుగా 1000 మంది ఉన్నారు) మరి ఈ సంవత్సరంలో వెయ్యి మంది వారసులు తయారైపోతారు. (హా జీ) ఇన్ అడ్వాన్స్ అభినందనలు. ఇప్పుడు వారసుల మాలను తయారు చేస్తాము. మిక్స్ మాల అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు వారసుల మాలను తయారు చేస్తాము? సరేనా? వారసులు అని ఎవరిని అంటాము, వారసుల క్వాలిఫికేషన్లు ఏమిటి అన్న విషయంలో ముందుగా దాదీల వద్ద ట్రైనింగ్ తీసుకోండి. అర్థమయిందా! మరి ఈ సంవత్సరంలో ఒక్కొక్కరు, ఒక వారసుడిని తయారు చేస్తారు, అప్పుడు బాప్‌దాదా వారసుల మాలను తయారు చేస్తారు. ఈ సంవత్సరం ఏదైనా నవీనతను చేస్తారు కదా. మరి వారసులను తయారు చేయండి. ఢిల్లీ కూడా చేస్తుంది, అప్పుడు అందరూ చేస్తారు. చేయవలసిందేనా? ఇంకేమి చేస్తారు? ఇదే చేయాలి. ఎవరైతే వారసులను తయారు చేస్తారో వారు తమ సమాచారాన్ని మధుబన్కు పంపించండి, దాదీ వారస ఆత్మ తయారయింది. కుమారీలు, సరేనా? హా జీ అనైతే అనండి.
మధుబన్ నివాసులతో:- మధుబన్ వారు చేసే సేవా చమత్కారము అందరినీ మధుబన్కు ఆకర్షిస్తుంది. ఎవరిని అడిగినా, మధుబన్ అంటే మధుబనే అని అందరూ చెప్తారు. సేవలో నంబర్‌వన్, అంతే కదా? నంబర్‌వన్ ఉన్నారా లేక నంబరువారీగా ఉన్నారా? నంబర్‌వన్ ఉన్నారు. బాప్‌దాదా సదా మధుబన్ నివాసులను నంబర్‌వన్ దృష్టితో చూస్తారు. నంబర్వార్ కాదు, నంబర్‌వన్. నంబర్‌వన్ కదా? దాదీ వద్ద ఏ ఫిర్యాదు ఉండకూడదు. అందరూ కంప్లీట్ అవుతున్నారు అందుకే కంప్లెయిన్ (ఫిర్యాదు) లేదు. మంచిగా ఉన్నారు, అలసట లేకుండా చేస్తున్నారు. మధుబన్ సేవాధారులను అందరూ అడుగుతారు. మహామండలేశ్వరులు కూడా మధుబన్ సేవాధారులను మా వద్దకు పంపండి అని అడుగుతారు. అంటే నంబర్‌వన్ ఉన్నారనే కదా అర్థము! మంచిగా ఉన్నారు. పక్కాగా కూడా ఉన్నారు, మంచిగా కూడా ఉన్నారు. అంతే కదా! అంతేకానీ బాప్‌దాదా ఊరికే అలా చెప్తున్నారు అని అనరు కదా? బాప్‌దాదాకు మంచిగా అనిపిస్తారు. ఒక్కోసారి పని ఎక్కువైపోతుంది. అప్పుడప్పుడు భారం ఎక్కువగా ఉండటాన్ని బాప్‌దాదా చూస్తారు. అయినాగానీ అమరులుగా ఉన్నారు. అమర భవ అన్న వరదానము లభించి ఉంది. సరేనా! అమరులే కదా? అచ్ఛా. అభినందనలు, అభినందనలు, అభినందనలు.
అచ్ఛా – టీచర్లు లేవండి. ప్రతి టీచర్ యొక్క ఫీచర్లలో బాప్‌దాదా ఫీచర్లు కనిపించాలి అన్న దృష్టితోటే బాప్‌దాదా సదా టీచర్లను చూస్తారు. ముఖంలో బ్రహ్మా బాబా ఫీచర్లు మరియు భృకుటిలో జ్యోతిర్బిందువు యొక్క ఫీచర్లు, ఏ టీచర్‌ను చూసినాగానీ, వీరైతే బాబా సమానంగా ఉన్నారు అన్న మాటే అందరి నోటి నుండి వెలువడాలి. వీరైతే బ్రహ్మా బాబా వలె అనిపిస్తున్నారు, వీరైతే శివ బాబా వలె అనిపిస్తున్నారు అనాలి. అలా ఉన్నారు మరియు ఉండవలసిందే. టీచర్లు ఆధారమూర్తులు. ఎలా అయితే బాబా గురించి అంటారు కదా – బ్రహ్మా బాబా యొక్క స్లోగన్ సదా ఇదే ఉండేది – ‘‘ఏ కర్మ నేను చేస్తానో నన్ను చూసి ఇతరులు చేస్తారు’’ – అలా ప్రతి టీచర్‌కు ఈ స్లోగన్ గుర్తుండాలి – ఏ కర్మ, ఏ మాట, ఏ వృత్తి, ఏ విధిని మేము చేస్తామో, మమ్మల్ని చూసి సర్వులు చేస్తారు’’. బాప్‌దాదా బ్రహ్మా బాబా యొక్క గద్దెను టీచర్లు అయిన మీకు కూర్చోవడానికి ఇచ్చారు. మురళిని వినిపించడానికి టీచర్లు నిమిత్తులు, బాబా గద్దె లభించింది. డ్రామా టీచర్లు అయిన మీకు ఎంతో ఉన్నత హోదాను ఇచ్చింది. బాప్‌దాదా కూడా సదా టీచర్లను ఈ విశేషమైన మహత్వంతో చూస్తారు. మహాన్ మీరు, మహత్వం ఉన్నవారు మీరు. ఇలాంటి వారే కదా? అయితే ఇప్పుడు మీ స్టూడెంట్ల నుండి సర్టిఫికేట్ తీసుకోమంటారా? బాప్‌దాదా అయితే చూస్తూ ఉంటారు (బాబా, టీచర్లను పట్టుకోండి) వీరైతే ప్రేమతో పట్టుకుని ఉన్నారు, అందుకే టీచర్లుగా అయ్యారు కదా. ఇప్పుడు దాదీ మీ చెవి మెలి వేస్తారు, బాబా అయితే ప్రేమతో పట్టుకుంటారు. అయినాగానీ ధైర్యమును ఉంచి నిమిత్తంగా అయితే అయ్యారు కదా! (టీచర్లు చాలామంచి వారు అని దాదీ అంటున్నారు) చాలా మంచివారు, అభినందనలు. మంచివారే. ఒకవేళ టీచర్లు లేకపోతే ఇన్ని సెంటర్లు ఎలా తెరుచుకుంటాయి! మీ అందరికీ అభినందనలు. బాప్‌దాదా అయితే చాలా-చాలా ఉన్నతమైన దృష్టితో మిమ్మల్ని చూస్తారు. టీచర్లు కూడా చాలామంది వచ్చారు. మంచిగా ఉన్నారు – ధైర్యము మరియు శ్రమ విషయంలో అభినందనలు.
ఇకపోతే హాస్పిటల్ వారు ఉండిపోయారు. హాస్పిటల్ వారు నూతన సంవత్సరంలో వారికున్న ఉల్లాస-ఉత్సాహాలను మంచిగా వ్రాసారు. హాస్పిటల్ వారు అనేక ఆత్మలను బ్రాహ్మణ జీవితంలోకి తీసుకు వస్తారు అన్న నిశ్చయము బాప్‌దాదాకు సదా ఉంది మరియు నిశ్చింతగా కూడా ఉంటారు. బ్రాహ్మణుల సేవ కూడా చేస్తున్నారు మరియు బ్రాహ్మణులను కూడా తయారు చేస్తున్నారు. పెద్ద-పెద్ద వి.ఐ.పీలు హాస్పిటల్ పేరు విని ప్రభావితులవుతారు. ఇప్పుడు మీ వద్దకు వస్తారు. చార్ట్ మంచిగా వ్రాసారు మరియు ప్రతిజ్ఞ కూడా మంచిగా చేసారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. అందరూ ఎంతో అభిరుచితో చేసారు. అచ్ఛా. మీ అందరి ప్రతిజ్ఞ పత్రములు చదివి బాప్‌దాదా సంతోషించారు, అందుకని అభినందనలు.
ఇప్పుడు సైన్స్ సాధనాల ద్వారా ఎవరైతే చూస్తున్నారో వారు కూడా సంతోషిస్తున్నారు, బాప్‌దాదా మా పేరు తీసుకోలేదు అని అనుకుంటున్నారు. ఎవరు ఎక్కడి నుండి చూస్తున్నాగానీ, వింటున్నాగానీ, మీ అందరూ కూడా లేచి నిల్చోండి. విని సంతోషిస్తున్నారు, నవ్వుతున్నారు. బాప్‌దాదాకు పిల్లలందరి ఉల్లాస-ఉత్సాహాలు మరియు హృదయము యొక్క ప్రేమ చాలా శ్రేష్ఠంగా అనిపిస్తాయి. చూడండి, హృదయము యొక్క ప్రేమ ఉంది కనుకనే సమయానికి చేరుకుంటారు. ఎంతో ఉత్సాహంగా వింటారు కూడా, చూస్తున్నారు కూడా, కొందరు చూస్తున్నారు, కొందరు చూడటం లేదు కేవలం వింటున్నారు, కానీ చాలామంది వింటున్నారు. బాప్‌దాదా నవ యుగానికి, నూతన సంవత్సరానికి, పిల్లలు ఒక్కొక్కరికి పేరు సహితంగా, విశేషత సహితంగా అభినందనలు చెప్తున్నారు. వారు కూడా చేయి ఎత్తుతున్నారు, ఊపుతున్నారు.
పిల్లలందరి కార్డులు, ఉత్తరాలు, నూతన సంవత్సర అభినందనలు చాలా-చాలా వచ్చాయి. పిల్లలూ, మీ కార్డుకన్నా ముందు మీ హార్ట్ నాకు చేరుకుంటుంది అని బాప్‌దాదా అంటారు. బాప్‌దాదా అందరి హృదయాలను చూసి సంతోషిస్తారు. సరే, ఖర్చు అయితే అవుతుంది, రేపటి నుండి ఈ కార్డులు గుర్తుగా మాత్రమే మిగిలిపోతాయి, కానీ ఖర్చు గురించి ఆలోచించడం లేదు అన్న విషయం చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. పిల్లల హృదయంలో ఎటువంటి ధ్వని వస్తుంది అన్నది బాప్‌దాదా చూస్తారు. మనసులోని ప్రేమ చేతులతో కార్డులోకి వస్తుందా అని చూస్తాము. అందుకే ఒకరిని మించి మరొకరు కార్డులను ఎంతో మంచిగా తయారు చేసారు. ఇక్కడ కార్డులు ఉన్నాయి, మీ అందరూ కూడా చూడండి. అచ్ఛా.
జ్యూరిస్టులతో:- జ్యూరిస్ట్ మీటింగుకు వచ్చినవారు లేవండి. బాప్‌దాదా చెప్పిన ఒక విషయం ఇంకా మిగిలిపోయి ఉంది, తెలుసా? ఏ పాయింట్ మిగిలి ఉంది? (గీతా భగవంతుడు ఎవరు అన్న పాయింట్) మరి దీని కోసం ప్లాన్ ఎప్పుడు తయారు చేస్తారు? పుస్తకం వ్రాసారు, అది మంచిగానే చేసారు, కానీ, వీరు ఏదైతే చెప్తున్నారో అది సరైనదే అని చెప్పే ఒక గ్రూపును తయారు చేయండి. ఏదైనా ఇటువంటి ఒక చిన్న గ్రూపునైనా తయారు చేయండి కదా. ఈ సంవత్సరంలో తీసుకు వస్తారు కదా ఎందుకంటే ఏదైతే ఎవ్వరూ చేయలేదో అది చేసి చూపించాలి కదా. అవును, గీతా భగవంతుడు విషయంలో మీరు చెప్పినదే సరైనది అన్న మాట ఎవరైనా అథారిటీ వారి నుండి రావాలి. అటువంటి పత్రమును నింపి తీసుకురండి. ఇక సాధారణ జనుల కోసం గీతా భగవంతుడు కృష్ణుడైనా, నిరాకారుడైనా ఒకటే. ఎవరైనా అథారిటీ వారు చెప్పాలి, నిరూపించాలి, అవును, ఈ విషయము చాలా అవసరము అని చెప్పే ఒక గ్రూపును తయారు చేయండి. చెయ్యగలరు, ఏమంత పెద్ద విషయము కాదు. ధార్మిక సంస్థ, మీ ధార్మిక వింగ్ మరియు జస్టిస్, వకీళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి ధర్మ క్షేత్రానికి సంబంధించిన వారి గ్రూపును తయారు చేయండి, వారు విశేషంగా నిమిత్తంగా అవ్వాలి. ఇప్పుడు మహాత్ములు కూడా చాలామంది వచ్చారు కదా. బాగుంది-బాగుంది అని చెప్పి వెళ్ళారు. ఇటువంటి మాటలను వారితో వ్రాయించుకోండి. రెండు వర్గాలు కలిసి చేయండి, జరిగిపోతుంది, ఏమంత పెద్ద విషయము కాదు. నిజానికి అన్ని వర్గాలు ఒకరికొకరు సహయోగిగా ఉండనే ఉన్నారు, ఎవరి సహయోగం కావాలన్నా లభిస్తుంది కానీ ఏదైనా చేసి చూపించండి. దీనితోటే ప్రత్యక్షత జరుగుతుంది. జనాలకు ఏదైనా క్రొత్త విషయము కావాలి. సరేనా! చేసి చూపిస్తారు కదా! అవ్వవలసిందే. కల్ప క్రితం జరిగినప్పుడు ఇప్పుడు కూడా రిపీట్ అవ్వవలసిందే. తప్పకుండా రండి. అభినందనలు. మంచిది – ఎప్పటి నుండైతే ఇలా వేరు వేరు వర్గాలు ఏర్పాటు అయ్యాయో అప్పటి నుండి సేవలో వృద్ధి వచ్చింది. ప్రతి ఒక్కరికీ మేము ఏదైనా చేసి చూపించాలి అన్న ఉత్సాహం కనిపిస్తుంది. కానీ వారసులను తయారు చేయలేదు. ప్రతి వర్గం వారు వారసులను తయారు చేయాలి. ఇప్పుడు మిక్స్‌గా అయితే వస్తూ ఉంటారు కానీ ఇప్పుడు చివరలో వారసుల మాలను తయారు చేయండి. ఎలా అయితే ఆదిలో నిమిత్తమైన కొద్దిమంది వారసులుగా అయ్యారో, అలాగే అంతిమంలో కూడా ఇటువంటి వారస క్వాలిటీ నిమిత్తం అవుతుంది. అచ్ఛా.
మహారాష్ట్ర సేవాధారులతో:- నిజానికి అందరికీ అభినందనలు లభించేసాయి, అయినాగానీ ఎవరైతే సేవ యొక్క మహా పుణ్యాన్ని జమ చేసుకున్నారో వారికి సేవా పుణ్యం యొక్క అభినందనలు. ఈ పుణ్యం తక్కువైనదేమీ కాదు. ఇది కూడా జీవితంలో సహజంగా జమ ఖాతాను పెంచుతుంది ఎందుకంటే బ్రాహ్మణుల ప్రసన్నత, సంతుష్టత పుణ్య ఖాతాను పెంచుతాయి. ఇది కూడా చాలా బాగుంది, ప్రతి జోన్ ఈ అవకాశాన్ని తీసుకుంటుంది, ఇది బాగుంది. మంచిగా అనిపిస్తుంది కదా! పుణ్యం కూడా జమ అవుతుంది, సమీపంగా కూడా రావడం జరుగుతుంది, అందుకు మహారాష్ట్రకు అభినందనలు. అచ్ఛా.
విశ్వములోని నలుమూలలలో ఉన్న సర్వ సఫలతామూర్తులైన పిల్లలకు, అన్నింటినీ సఫలము చేసే తీవ్ర పురుషార్థీ పిల్లలకు, సదా తమ అకౌంట్‌ను చెక్ చేసుకుని చెకర్లు (పరిశీలకులు)గా మరియు భవిష్య మేకర్లుగా అయ్యే అటువంటి శ్రేష్ఠ ఆత్మలకు, సదా తమ ప్రతి అడుగులో బాబాను ప్రత్యక్షము చేసే గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ యొక్క సర్వ గ్రాండ్ సన్స్‌కు బాబా మరియు దాదా యొక్క చాలా, చాలా, చాలా, చాలా ప్రియస్మృతులు, అభినందనలు మరియు నమస్తే.
(ఢిల్లీ మరియు సోనీపత్ భవన నిర్మాణాల గురించి బాప్‌దాదా సూచన)
అందరూ బ్రాహ్మణ పరివారం యొక్క సమాచారాన్ని, ఉత్తరాల ద్వారా అన్ని సమాచారాలు వింటూ ఉంటారు. ఈ రోజుల్లో అందరి సంకల్పములో, సహయోగంలో ఏమి గుర్తుంటుంది? మా రాజధాని అని భావిస్తారా లేక మీ అందరి రాజధాని అనుకుంటారా? మధుబన్ అయితే ఇల్లు కదా, రాజ్యం ఎక్కడ చేస్తారు? ఢిల్లీలో చేయాలి, మధుబన్‌లో కాదు. కృష్ణుడి మహలు మధుబన్‌లో తయారవుతుందా లేక ఢిల్లీలోనా? మధుబన్‌లో అవ్వదా? మరి రాజధాని గుర్తుంటుందా, అందరికీ రాజధాని గుర్తుంటుందా? మరి అందరి సహయోగముతో ఇప్పుడు రాజధానిలో విశేషంగా సేవాస్థానము తయారవుతుంది, మీరందరూ బీజము వేసారా? అందరూ వేసారా? ఎందుకంటే బీజము వేస్తేనే ఫలం తింటారు కదా. బీజము వేయకుండా ఫలాన్ని ఎలా తింటారు? అందరూ బీజము వేసారు మరియు వేస్తూ ఉంటారు ఎందుకంటే ఈ బీజముతో అనేక రకాల ప్రత్యక్షతా ఫలాలు వెలువడుతాయి. కావున అందరూ తమ-తమ వైపు నుండి సఫలత సంవత్సరంలో అంతా సఫలం చేయవలసిందే. సర్వ ఖజానాలను సఫలం చేయాలి. దానితోపాటు బీజాన్ని కూడా వేయాలి, వేస్తూ ఉంటారు, వేస్తూ ఉంటారు. సరేనా! వేస్తూ ఉంటారు కదా! పూర్తి అయిపోయింది అని భావించేవారు చేతులెత్తండి. ఎప్పటి వరకు సేవ ఉంటుందో అప్పటివరకు సేవలో బీజాన్ని వేస్తూ ఉండండి, ఆ తర్వాత వచ్చే ఫలాలు కూడా మీరే తినాలి. ప్రత్యక్షతా ఫలం వెలువడినప్పుడు మీరందరూ ఆ ఫలాన్ని తింటారు, కేవలం ఢిల్లీవారు మాత్రమే మొత్తం తినరు. బాప్దాదాపై ప్రేమ ఉంది కదా! అంటే సేవపై కూడా ప్రేమ ఉంది! సేవ నుండి వచ్చే ఫలం కూడా చాలా ప్రియమైనది. మానేసర్ ధరణి నుండి సేవాధారులు ఎవరెవరు వచ్చారో వారు లేవండి. మంచిది, పని మంచిగా జరుగుతుందా? మంచిగా జరుగుతుంది మరియు మంచిగా జరుగుతూ ఉంటుంది. బాబా యొక్క సేవాస్థానాలకు బాబా యొక్క వరదానము లభించే ఉంది. జరగవలసిందే. సర్వుల సహయోగముతో సేవ సఫలం అవ్వవలసిందే. సరేనా! మంచిది. ఎలా అయితే ఉల్లాస-ఉత్సాహాలతో, అనంతమైన వృత్తితో స్థానము తయారయిందో, అలాగే అనంతమైన వృత్తి, దృష్టి మరియు సేవతో సఫలత కూడా అనంతంగా లభించనున్నది. అంతా అనంతంగా అవ్వనున్నది. మరి అనంతంలో మీరందరూ కూడా ఉన్నారు కదా. ఇది ఢిల్లీవారిది అని ఎప్పుడూ అనుకోకండి, ఇది మనది ఎందుకంటే ప్రత్యక్షతా బీజము మీ అందరిదీ. నిమిత్తము ఢిల్లీ అయింది కానీ ఫలము మీ అందరూ తింటారు, కలిసి తింటారు. అనంతమైన ఉల్లాస-ఉత్సాహాలతో అనంతమైన సేవ వృద్ధి అవుతుంది, వృద్ధి అవుతూ ఉంటుంది, ఇందుకు బాప్‌దాదాకు కూడా సంతోషంగా ఉంది. అచ్ఛా. సోనీపత్ కూడా తయారు కాబోతుంది. అది కూడా ఢిల్లీ కదా. ఎవరైనాగానీ, అది ఢిల్లీయే కదా. (లండన్‌లో కూడా డైమండ్ హౌస్ తయారవుతుంది) చూడండి, విదేశమైతే ప్రతి సమయము జంప్ చేస్తుంది. విదేశము జంప్ చెయ్యకుండా ఉండటము అన్నది జరగదు. ఈ డైమండ్ హౌస్ తయారైతే అక్కడ కూడా తప్పకుండా కావాలి. (మినీ మధుబన్ తయారవుతుంది) చిన్నదాని నుండి పెద్దది, వైట్ హౌస్ అంత స్థలం కూడా లభించేస్తుంది.
బాప్‌దాదా దేశ-విదేశాలలోని పిల్లలందరికీ క్రొత్త సంవత్సరము యొక్క శుభాకాంక్షలను తెలిపారు
నలువైపులా ఉన్న సఫలతా సితారలకు, పాత సంవత్సరం యొక్క వీడ్కోలు మరియు క్రొత్త సంవత్సరం యొక్క అభినందనల సంగమ సమయానికి, ఈ సంగమ సమయములో వీడ్కోలు కూడా, శుభాకాంక్షలు కూడా. సదా సఫలురుగా ఉన్నారు మరియు సఫలురుగా ఉంటారు. ఎప్పుడూ కూడా అసఫలత యొక్క నామ-రూపాలు ఉండవు. మీరు బాప్‌దాదాకు అతి సికీలధే, అతి ప్రియమైనవారు, అతి మధురమైనవారు, కంటి వెలుగులు. అందరూ నంబర్‌వన్‌గా అవ్వాల్సిందే, ఈ దృఢ సంకల్పముతో ప్రతి అడుగు బాబా సమానంగా వేస్తూ ఉండండి. పదమాల రెట్లు, కోటాను కోట్ల రెట్లు శుభాకాంక్షలు, శుభాకాంక్షలు, శుభాకాంక్షలు.
(2001, 1 జనవరి, 31 డిసెంబర్ రాత్రి 12 గంటల తర్వాత దాదీజీ అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పారు)
ఈరోజు నూతన సంవత్సరం మరియు పాత సంవత్సరం యొక్క సంగమ సమయంలో బాబానైతే ప్రతిజ్ఞ చేయించారు, మనమందరం ప్రతిజ్ఞను పాటిద్దాము మరియు అందరికీ చాలా-చాలా ప్రేమతో కూడిన హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. గుడ్ మార్నింగ్.
(వీడ్కోలు సమయంలో బాప్‌దాదా పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ మరియు డైమండ్ మార్నింగ్ చెప్పారు)
బాప్‌దాదా యొక్క చాలా-చాలా అమూల్యమైన డైమండ్లకు డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్, డైమండ్ మార్నింగ్.