Search for a command to run...
31 Dec 2002
‘‘ఈ క్రొత్త సంవత్సరములో సర్వ ఖజానాలను సఫలము చేసుకుని సఫలతామూర్తులుగా అయ్యే విశేషతను చూపించండి’’
31 December 2002 · తెలుగు
ఈరోజు నవయుగ రచయిత, నవ జీవనదాత అయిన బాప్‌దాదా క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారా లేక క్రొత్త యుగాన్ని జరుపుకునేందుకు వచ్చారా? క్రొత్త సంవత్సరాన్ని అయితే అందరూ జరుపుకుంటారు కానీ మీరందరూ నవ జీవితము, నవ యుగము మరియు నవ సంవత్సరము, ఈ మూడింటినీ జరుపుకుంటున్నారు. బాప్‌దాదా కూడా త్రిమూర్తి శుభాకాంక్షలను ఇస్తున్నారు. క్రొత్త సంవత్సరము సందర్భముగా ఒకరికొకరు శుభాకాంక్షలను తెలుపుకుంటారు, అలాగే దానితో పాటు ఏదో ఒక కానుకను కూడా ఇస్తారు. కానుకను ఇస్తారు కదా! కానీ బాప్‌దాదా మీ అందరికీ ఏ కానుకను ఇచ్చారు? స్వర్ణిమ ప్రపంచము అనే కానుకను ఇచ్చారు. అందరికీ స్వర్ణిమ ప్రపంచము అనే కానుక లభించేసింది కదా! ఆ స్వర్ణిమ ప్రపంచములో, నవ యుగములో సర్వ ప్రాప్తులు ఉన్నాయి. గుర్తుందా మీ రాజ్యము? ఎటువంటి అప్రాప్తి యొక్క నామ-రూపాలు లేవు. ఇటువంటి కానుకను బాప్‌దాదా తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మొత్తము ప్రపంచములో ఒకవేళ ఎవరైనా అతి పెద్ద కానుకను ఇచ్చినా కూడా ఏం ఇస్తారు? అతి పెద్ద కిరీటాన్ని లేక సింహాసనాన్ని ఇస్తారు. స్థాపన జరిగినప్పుడు (స్థాపన సమయములో ఉన్నవారు ముందు కూర్చుని ఉన్నారు) ఆదిలోనే బ్రహ్మాబాబా పిల్లలను ఇలా అడిగేవారు - ఒకవేళ మీకు ఈరోజుల్లోని రాణి ఎవరైనా కిరీటాన్ని మరియు సింహాసనాన్ని ఇస్తే మీరు వెళ్తారా? గుర్తుంది కదా! అప్పుడు పిల్లలు అనేవారు - ఈ కిరీటాన్ని, సింహాసనాన్ని ఏం చేసుకుంటాము. బాబానే లభించినప్పుడు ఇక ఇవన్నీ ఏమిటి! కనుక ఈ స్వర్ణిమ ప్రపంచమనే కానుక ముందు వేరే ఏ కానుకా గొప్పది కాలేదు. అక్కడ ఏయే ప్రాప్తులు ఉంటాయి అని కొంతమంది పిల్లలు అడుగుతారు. దానికి బాప్‌దాదా అంటారు, ప్రాప్తుల లిస్టు అయితే చాలా పెద్దది, కానీ సార రూపములో ఏమంటారు! ఏ వస్తువు యొక్క అప్రాప్తి ఉండదు. జీవితములో ఏమేమి కావాలో, ఆ ప్రాప్తులన్నీ ఉంటాయి. మీరు అటువంటి బంగారు కానుకకు అధికారీ ఆత్మలు. అధికారులే కదా! డబల్ విదేశీయులు అధికారులేనా? (చేతులు ఊపుతున్నారు) అందరూ రాజులుగా అవుతారా? అయితే అన్ని సింహాసనాలను తయారుచేయవలసి ఉంటుంది. బాప్‌దాదా అంటారు, ఆ సింహాసనము సింహాసనమే, సర్వ ప్రాప్తులు ఉంటాయి, కానీ ఈ సంగమయుగ స్వరాజ్యము దానికంటే తక్కువేమీ కాదు. మీరు ఇప్పుడు కూడా రాజులే కదా! మీరు ప్రజలా లేక రాయల్ కుటుంబమువారా? ఎవరు? నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని నషాతో చెప్పగలిగే తండ్రి ఒక్కరే ఉన్నారు. మీరు రాజులు కదా! రాజయోగులా లేక ప్రజాయోగులా? ఈ సమయములో అందరూ హృదయ సింహాసనాధికారి, స్వరాజ్య అధికారి రాజా పిల్లలు, ఇంతటి ఆత్మిక నషా ఉంటుంది కదా? ఎందుకంటే ఈ సమయములోని స్వరాజ్యము ద్వారానే భవిష్య రాజ్యము ప్రాప్తిస్తుంది. ఈ సంగమయుగము చాలా, చాలా, చాలా అమూల్యమైనది, శ్రేష్ఠమైనది. సంగమయుగము గురించి బాప్‌దాదాకు మరియు పిల్లలందరికీ తెలుసు, చాలా సంతోషముతో సంగమయుగానికి ఏ పేరు పెట్టారు? ఆనందాల యుగము. ఎందుకని? ఇక్కడ సంగమములో ఉన్నంత ఆనందము మొత్తము కల్పములో ఎప్పుడూ ఉండదు. కారణమేమిటి? పరమాత్మ మిలనము యొక్క ఆనందము మొత్తము కల్పములో ఇప్పుడే లభిస్తుంది. సంగమయుగములోని ఒక్కొక్క రోజు ఎలా ఉంటుంది? ఆనందమే ఆనందము. ఆనందము ఉంది కదా? ఆనందము ఉంది, అంతేకానీ తికమకపడటం లేదు కదా! ప్రతిరోజూ ఉత్సవమే ఎందుకంటే ఉత్సాహము ఉంది. మీ సోదర, సోదరీలందరినీ పరమాత్మ తండ్రికి చెందినవారిగా తయారుచెయ్యాలి అన్న ఉల్లాసము ఉంది, ఉత్సాహము ఉంది. సేవ చెయ్యాలన్న ఉల్లాస-ఉత్సాహాలు ఉంటాయి కదా! ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి... అని ప్లాన్లు తయారుచేస్తారు కదా! ఎందుకంటే ఏదైనా శ్రేష్ఠ ప్రాప్తి లభిస్తున్నప్పుడు దానిని ఇతరులకు వినిపించకుండా ఉండలేరు. ఈ సంగమయుగ ప్రాప్తియే స్వర్ణిమ ప్రపంచములో కూడా ఉంటుంది. ఇప్పటి పురుషార్థము యొక్క ప్రారబ్ధము భవిష్యత్తులోని స్వర్ణిమ ప్రపంచము. మరి సంగమయుగము బాగా అనిపిస్తుందా లేక సత్యయుగము బాగా అనిపిస్తుందా? ఏది బాగా అనిపిస్తుంది? సంగమయుగము బాగుంది కదా? కేవలం మధ్యమధ్యలో మాయ వస్తుంది. కొద్ది-కొద్దిగా అప్పుడప్పుడు తికమకపడతారు. కొంతమంది పిల్లలు సహజయోగాన్ని కష్టమైన యోగముగా తయారు చేసుకుంటారు. వాస్తవానికి అది కష్టమేమీ కాదు కానీ అలా తయారుచేసుకుంటారు. వాస్తవానికి అది చాలా సహజము. కష్టమనిపిస్తుందా? ఎవరికైతే కష్టమనిపిస్తుందో వారు చేతులెత్తండి. సదా కాదు కానీ అప్పుడప్పుడు కష్టమనిపిస్తుందా? లేక సహజమేనా? ఎవరైతే కష్టపడే యోగులో వారు చేతులెత్తండి. మాతలు కష్టపడే యోగులా లేక సహజయోగులా? ఎవరైనా కష్టపడే యోగులు ఉన్నారా? (ఎవ్వరూ చేతులెత్తటం లేదు) మొత్తం సభ మధ్యన చేతులెలా ఎత్తుతారు!
పిల్లలందరూ ‘మేరా బాబా (నా బాబా)’ అని నషాతో అంటారు. నా బాబానా లేక దాదీల బాబానా? నా బాబా కదా! ‘మొదట నా బాబా’ అని ప్రతి ఒక్కరూ అంటారు. అంతేనా? సింధ్ దేశము వారందరూ కూర్చుని ఉన్నారు కదా! ‘నా బాబానా’ లేక జానకి దాదీ బాబానా? ప్రకాశమణి దాదీ బాబానా? ఎవరి బాబా? నా బాబాయేనా? మొత్తము రోజంతటిలో ఏం గుర్తుంటుంది? మేరా (నా) అనేదే కదా! బాబా అంటారు, ఇది చాలా సహజ యుక్తి, ఎన్నిసార్లు మేరా, మేరా (నా, నా) అని అంటారు, మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు ‘నా’ అన్న పదాన్ని ఉపయోగిస్తారు? ఒకవేళ లెక్క పెట్టినట్లయితే చాలా సార్లు ‘నా’ అన్న పదాన్ని ఉపయోగిస్తారు. నా అన్న పదాన్ని ఉపయోగించినప్పుడు నా అనబడేవారు ఎవరు? నా బాబా, కష్టమా? అప్పుడప్పుడు మర్చిపోతారా? బాప్‌దాదా ఏమీ క్రొత్త మాట చెప్పటం లేదు. నేను మరియు నాది అనే పదాలను ఎప్పుడూ కార్యములో ఉపయోగిస్తూనే ఉంటారు, మరి నేను ఎవరిని మరియు నా వారు ఎవరు! చాలామంది పిల్లలు కష్టమైన పురుషార్థాన్ని ఎందుకు చేస్తారు? కేవలం బిందువు ఎదురుగా రావాలి అని అనుకుంటారు, బిందువు, బిందువు, బిందువు... అని అనుకుంటారు కానీ బిందువు జారిపోతుంది. బిందువే కానీ ఎటువంటి బిందువు? నేను ఎవరిని, ఈ మీ స్వమానాన్ని స్మృతిలోకి తెచ్చుకోవటం ద్వారా రమణీక పురుషార్థమవుతుంది, కేవలం జ్యోతిర్బిందువు అని అంటే కష్టమైపోతుంది. సహజ పురుషార్థాన్ని, ఆనందము కల పురుషార్థాన్ని చెయ్యండి.
ఈ క్రొత్త సంవత్సరములో పురుషార్థము కూడా శ్రేష్ఠముగా ఉండాలి కానీ శ్రేష్ఠముగా ఉండటం కంటే ముందు సహజముగా ఉండాలి. సహజముగా కూడా ఉండాలి మరియు శ్రేష్ఠముగా కూడా ఉండాలి, ఇది వీలవుతుందా? రెండూ కలిపి వీలవుతుందా? డబల్ విదేశీయులు చెప్పండి, వీలవుతుందా? మరి బాప్‌దాదా చూస్తారు. బాప్‌దాదా అయితే చెక్ చేస్తూ ఉంటారు కదా! అయితే కష్టపడే యోగులుగా ఎవరెవరు అవుతారు! సహజయోగి అంటే నిర్లక్ష్యపు పురుషార్థము ఉండడమని కాదు. పురుషార్థము శ్రేష్ఠముగా కూడా ఉండాలి మరియు సహజముగా కూడా ఉండాలి. మరి పాండవులు సహజ యోగులేనా? ఎవరైతే సహజయోగులో వారు చేతులెత్తండి. టి.వి.లో వస్తూ ఉంది చూడండి. అభినందనలు. ఈ సంవత్సరము ఎవరి ముందుకూ ఏ కష్టమూ రాదు ఎందుకంటే సహజ యోగులు. నిర్లక్ష్యము కలవారిగా అవ్వవద్దు.
సమయమనుసారముగా ఈ క్రొత్త సంవత్సరములో అందరూ విశేషముగా ఈ లక్ష్యాన్ని పెట్టుకోవాలి - ఏయే ఖజానాలైతే ప్రాప్తించాయో, సమయము, సంకల్పాలు, గుణాలు, జ్ఞానము, శక్తులు... అన్నింటికంటే పెద్ద ఖజానా సంకల్పాలు - శ్రేష్ఠ సంకల్పాలు, శుద్ధ సంకల్పాలు. ఈ ఖజానాలన్నింటినీ ప్రతిరోజూ సఫలము చేసుకోవాలి. బాగా పంచండి. దాత పిల్లలు, మాస్టర్ దాతలుగా అవ్వండి. బాగా పంచండి. ఎందుకని? సఫలము చేయటము అనగా సఫలతను ప్రాప్తి చేసుకోవటము. కావున ఈ సంవత్సరము యొక్క ఈ విశేషతను సదా నిలుపుకోండి. సఫలము చేసుకోవాలి మరియు సఫలత లభించే ఉంది. సఫలత మా జన్మసిద్ధ అధికారము అని అందరూ అంటారు కూడా కదా. ఉందా అధికారము? అయితే సఫలము చెయ్యండి మరియు సఫలతను ప్రాప్తి చేసుకోండి. ఏ కార్యము చేసినా, ఏదో ఒక ఖజానాను సఫలము చేస్తూ వెళ్ళండి మరియు సఫలతను అనుభవము చేస్తూ వెళ్ళండి. ఆలోచించండి - సఫలత యొక్క అధికారము బ్రాహ్మణాత్మలైన మీకు తప్ప మరెవరికైనా ప్రాప్తించగలదా! ఎందుకని? ఎందుకంటే బాబా మీకు సఫలతా భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. ఒక్కొక్క బ్రాహ్మణ ఆత్మ సఫలతా సితారలు, సఫలతా స్వరూపులు అని బాప్‌దాదా సదా అంటారు. సఫలతా సితారలు కదా లేక కష్టపడే సితారలా? బాప్‌దాదా పిల్లలందరినీ సఫలతా సితారలు అన్న ఈ స్వరూపములోనే చూస్తారు. బ్రహ్మాబాబా ఆదిలో ఎంత సమయములో అంతా సఫలము చేసారో గుర్తుందా? అంతిమము వరకు తమ సమయాన్ని సఫలము చేసుకున్నారు, కర్మాతీతముగా కూడా అయిపోయారు, అయినా కూడా ఎన్ని ఉత్తరాలను వ్రాశారు! సమయాన్ని సఫలము చేసుకున్నారు కదా! చివరి రోజు కూడా నోటి నుండి మహావాక్యాలను ఉచ్ఛరించారు. చివరి రోజు వరకు అంతా సఫలము చేసారు, అందుకే సఫలతను పొందారు. కనుక ఫాలో ఫాదర్. వాస్తవానికి సంగమయుగములో ఒక్కొక్క సంకల్పాన్ని, ఒక్కొక్క క్షణాన్నీ సఫలము చేయటమే సఫలతామూర్తులుగా అవ్వటము. బ్రహ్మాబాబా పట్ల మాకు చాలా ప్రేమ ఉంది అని అందరూ నిశ్చయముతో అంటారు కదా. మరి ప్రేమకు గుర్తు ఏమిటంటే - బాబాకు ఏది ప్రియమో, అది పిల్లలకు ప్రియముగా ఉండాలి. సమయము, సంకల్పాలు మరియు సర్వ ఖజానాలు సఫలమవ్వాలి, వ్యర్థమవ్వకూడదు. ప్రేమకు గుర్తు ఫాలో ఫాదర్. బ్రహ్మాబాబా ఏ విశేషతను చూపించారు? ఏది ఆలోచించారో, దానిని క్షణములో చేసారు. కేవలము ఆలోచించలేదు, కేవలము ప్లాన్‌ను తయారుచెయ్యలేదు, ప్రాక్టికల్‌లో చేసి చూపించారు. మరి మీరు అటువంటివారేనా? బాబాను ఫాలో చేసేవారే కదా? మంచిది.
ఈరోజు క్రొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు చాలామందే వచ్చారు. మంచిది. ఒకవేళ హాల్ చిన్నదైపోయినా కానీ మనసైతే పెద్దదే కదా. చూడండి, మనస్సు పెద్దది కావున ఇందులో ఇమిడిపోయారు కదా? (ఈరోజు సభలో 18-19 వేలమంది సోదర-సోదరీలు కూర్చుని ఉన్నారు). బయట కూర్చుని ఉన్నవారంతా కూడా వింటున్నారు కదా? బయట కూర్చుని ఉన్నవారు వింటున్నారు, వారు కనిపించరు. బాప్‌దాదా విన్నారు, విదేశాలలో అందరికంటే ఎక్కువగా ఆస్ట్రేలియావారు రాత్రి 12 గంటలకు కూర్చుని వింటారు మరియు 4 గంటలకు అమృతవేళ చేసి లేస్తారు. కావున బాప్‌దాదా కూడా ఈరోజు ఆస్ట్రేలియావారిని గుర్తు చేసుకున్నారు. వింటున్నారు. ఇక్కడ ఉన్న ఆస్ట్రేలియావారు చేతులెత్తండి. త్రిమూర్తి శుభాకాంక్షలు మొదట ఆస్ట్రేలియావారికి, ఆ తర్వాత అందరికీ.
ఈ సంవత్సరము యొక్క లక్ష్యాన్ని అయితే తెలియజేశాము - సఫలము చేయండి, సఫలత లభించే ఉంది. దీనిని అందరూ పక్కా చేసుకున్నారా? సఫలము చెయ్యాలి, వ్యర్థము కాదు. సంగమయుగము సమర్థ యుగము, సఫలతా యుగము, వ్యర్థముగా పోనిచ్చేది కాదు. వ్యర్థముతో 63 జన్మలు సమాప్తమైపోయాయి. ఇప్పుడు ఈ చిన్నపాటి యుగము సఫలము చేసుకునే యుగము. ఒకవేళ సమయాన్ని సఫలము చేసుకుంటే భవిష్యత్తులో కూడా అర్థకల్పములో పూర్తి సమయము రాజ్యాధికారులుగా అవుతారు. ఒకవేళ అప్పుడప్పుడు సఫలము చేసుకుంటే రాజ్యాధికారులుగా కూడా అప్పుడప్పుడు అవుతారు. సమయము సఫలమైనందుకు ప్రారబ్ధము ఇది. శ్వాసను సఫలము చేసుకుంటూ ఉంటే 21 జన్మలూ ఆరోగ్యముగా ఉంటారు. నడుస్తూ, నడుస్తూ గుండె ఆగిపోదు. కొందరికి గుండె ఆగిపోతుంది, కొందరికి రక్త నాళాలు మూసుకుపోతాయి, అలా జరగదు.
జ్ఞాన ఖజానాను కూడా సఫలము చేసుకోండి, జ్ఞానము అంటే అర్థము వివేకము, అక్కడ ఎంతటి వివేకవంతులుగా అవుతారంటే ఇక మంత్రుల అవసరమేమీ ఉండదు. ఈరోజుల్లో చూడండి, ప్రమాణ స్వీకారము చేయగానే వెంటనే మంత్రిమండలిని తయారుచేస్తారు. అక్కడ సహచరులు ఉంటారు కానీ మంత్రులు ఉండరు. రాయల్ ఫ్యామిలీలోని ప్రతి ఒక్కరూ దర్బారులో కూర్చునే కిరీటధారులుగా ఉంటారు. రాయల్ ఫ్యామిలీవారు తక్కువైనవారు కారు, వారు సింహాసనముపై కూర్చోకపోయినా సరే పదవి అయితే ఒకేలా ఉంటుంది, అందుకే సింహాసనాధికారులుగా కొద్దిమందే అవుతారు కదా అని ఇలా ఆలోచించకండి. మీ తలపై కూడా కిరీటము ఉంటుంది మరియు మీకు పూర్తి అధికారాలు ఉంటాయి. మరి ఎవరిగా అవుతారు? నంబర్వన్గానా లేక నంబరువారుగానా, ఎవరిగా అవుతారు? నంబరువారుగా అవుతారా లేక నంబర్‌వన్‌గా అవుతారా? మరి ఏం చెయ్యాల్సి వస్తుందో తెలుసా? ధైర్యాన్ని చూపించారు, ఇది చాలా మంచిది. కానీ వన్ నంబరువారిగా అయ్యేందుకు ముందు విన్ అవ్వాల్సి (జయించాల్సి) ఉంటుంది. అవుతున్నారు కదా! చేస్తాము అని ఇలా అనటం కాదు, చేస్తున్నాము అనాలి. ఇతరులు కూడా వింటున్నారు. ఈరోజు సింధ్ ప్రాంతములోని పాతవారు, బ్రహ్మాబాబా సహచరులు చాలామంది వచ్చారని విన్నాము. చేతులెత్తండి. చిన్నపిల్లలు లేచి నిలబడండి, కుటుంబాలు కుటుంబాలే వచ్చాయి. మంచిది. ఏదైనా అద్భుతాన్ని చూపిస్తారు కదా! ఏమి చూపిస్తారు? (సందేశాన్ని ఇస్తాము). అదైతే చేస్తూనే ఉన్నారు. అచ్ఛా, 38 మంది వచ్చారు, మరి ఏ అద్భుతాన్ని చేస్తారు? సరే, ఎక్కువ ఏమీ చెప్పము, చిన్న విషయాన్ని చెప్తాము, చేయడానికి సిద్ధముగా ఉన్నారా? పిల్లలు కూడా అద్భుతము చేస్తారు కదా? (38 లక్షల మందిని తయారుచేస్తాము) పదమా రెట్లు అభినందనలు. మీరైతే చాలా ఎక్కువ చెప్పారు కానీ బాప్‌దాదా చిన్న విషయము చెప్తున్నారు, అదేమిటంటే, మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకురండి. తీసుకువస్తారా? ఒకరు ఒకరిని తీసుకురండి. పిల్లలైతే పిల్లలను తీసుకురండి. మాతలైతే సోదరులను లేక సోదరీలను తీసుకురావాలి, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకురావాలి. ఈ గ్రూప్‌ను చూడండి, మీరు వీరికి గైడ్ చేయండి, మరుసటి సంవత్సరానికి తీసుకునే రావాలి, డబల్ గ్రూప్‌ను తీసుకురావాలి. ఎక్కడి నుండైతే ఆది జరిగిందో, అక్కడే ప్రత్యక్షత జరగాలి, బాప్‌దాదా ఇదే కోరుకుంటున్నారు. దయ కలుగుతుంది కదా! మీరు బ్రహ్మాబాబా దేశవాసులు కనుక దేశవాసులపై ప్రేమ ఉంటుంది.
మీ వద్ద చాలా ఖజానాలు ఉన్నాయి, గుణాల ఖజానా ఎంత పెద్దది, శక్తుల ఖజానా ఎంత పెద్దది. కనుక గుణ దానాన్ని, శక్తుల దానాన్ని చేసే మాస్టర్ దాతలుగా అవ్వండి. ఎవరు వచ్చినా కానీ, సంబంధములోకి వచ్చినా, సంపర్కములోకి వచ్చినా, వారికి ఏదో ఒక గుణాన్ని లేక శక్తిని కానుకగా ఇవ్వండి. ఎవ్వరూ ఖాళీ చేతులతో వెళ్ళకూడదు. వేరే ఏమీ లేకపోయినా కానీ బాబా సందేశము యొక్క మధురమైన మాటలైనా, ఆ మధురమైన మాటలనైనా కానుకగా ఇవ్వండి. ప్రపంచములోని వారు ఏదైనా ఉత్సవము జరిగితే ఒకరికొకరు నోరు తీపి చేసుకుంటారు. కానీ బాప్‌దాదా అంటున్నారు, నోటినైతే తీపి చేయవలసిందే కానీ మీ మధురమైన ముఖాన్ని కూడా చూపించాలి. కేవలం నోటిని తీపి చెయ్యటం కాదు, ముఖాన్ని కూడా మధురంగా చేసుకోవాలి. అంతటి మధురత జమ అయ్యి ఉంది కదా! దానిని పంచుతూ ఉన్నా కూడా అది నిండుగా ఉండాలి. అంతేకాక ఈ ఖజానాలనైతే ఎంతగా పంచుతారో, అంతగా పెరుగుతాయి, తక్కువ అవ్వవు. కనుక ఈ సంవత్సరము ఇది నోట్ చేసుకోండి, ఏ ఆత్మ వచ్చినా సరే, వారికేమైనా ఇచ్చారా? ఒకవేళ వారు వినేవారు కానట్లయితే మధురమైన శక్తిశాలీ దృష్టిని ఇవ్వండి. కానీ ఇవ్వటమైతే తప్పకుండా ఇవ్వండి. వారు ఖాళీగా వెళ్ళకూడదు. ఇది సహజమే కదా! లేక కష్టమా? యూథ్ గ్రూప్, సహజమేనా? చేతినైతే చాలా బాగా ఊపుతున్నారు. యూథ్ గ్రూప్ కూడా మంచి సంఖ్యలో వచ్చారు.
డబల్ విదేశీ యూథ్ రిట్రీట్ గ్రూప్:- యూథ్కు ఉన్నటువంటి అతి పెద్ద శ్రేష్ఠమైన శక్తి – పరివర్తన శక్తి. ఆలోచించారు – చేసేసారు. యూథ్ అయితే చాలా ప్రతిజ్ఞలు చేసారు కదా! బాప్‌దాదా సమాచారాన్ని విన్నారు. యూథ్ అందరూ ఎలా అయ్యారు? (యూథ్ అందరూ చేతులూపుతున్నారు) అందరూ తిలకధారులుగా అయ్యి వచ్చారు, ఎవరైతే విశేషంగా రిఫ్రెష్మెంట్ పొందారో ఆ తిలకధారులు నిలబడండి. (తిలకము పెట్టబడి ఉంది) మంచి గుర్తును పెట్టుకున్నారు. ఆత్మ మెరిసిపోయింది కదా? ఈ ట్రైనింగ్‌తో మాది గోల్డెన్ హార్ట్ అయింది అని భావిస్తున్నవారు చేతులెత్తండి. గోల్డెన్ హార్ట్ అయిపోయిందా! వీరైతే చాలా ముందు వెళ్ళిపోయారు. గోల్డెన్ స్టార్ కాదు, గోల్డెన్ హార్ట్. అయితే సఫలతామూర్తులుగా అయిపోయినట్లే. ఇప్పుడు విమానంలో ఈ గోల్డెన్ హార్ట్ కొంచెం క్రిందకు రాదు కదా, పోనీ, మీ దేశంలోకి వెళ్ళిన తర్వాత గోల్డెన్, సిల్వర్‌గా అయిపోదు కదా? అవ్వదా? మంచిది. భారత దేశ ఆత్మలను మేలుకొలిపే విధంగా తయారవ్వండి. ధైర్యము ఉందా? భారత్‌ను మేలుకొల్పుతారా? భారత్ వారు చాలా వంకర-టింకర ప్రశ్నలు అడుగుతారు, సమాధానం చెప్తారా? మీ అందరి ఫోటో టి.విలో వస్తుంది. అయితే మీ అందరికీ భారత్‌ను మేలుకొల్పడానికి ఆహ్వానం వస్తుంది. ఎవరెడీగా ఉండండి. టికెట్ లేకపోయినా లభిస్తుంది. బాప్‌దాదాకు డబల్ విదేశీయుల విశేషత తెలుసు, ఒక సంవత్సరం వస్తారు, తర్వాత మరో సంవత్సరం కోసం పూర్తి సంవత్సరం తయారీలు చేసుకుంటారు. మంచిది. ఎన్ని దేశాల యూత్ ఉన్నారు? (21 దేశాలు) ఈ గోల్డెన్ హార్ట్ అద్భుతం చేస్తుందని బాప్‌దాదాకు తెలుసు. అటెన్షన్ మంచిగా పెట్టారు. స్వ పురుషార్థంపై అటెన్షన్‌ను ఈసారి ఎక్కువ అండర్లైన్ చేసారు. బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఇలా గ్రూపు-గ్రూపుగా అవ్వడం వలన అటెన్షన్ ఉంటుంది. పూర్తి సంగఠనకు బదులు ఇలా గ్రూప్ చేయడం మంచిది కానీ పాజిటివ్‌గా ఉండాలి. అచ్ఛా – (బాప్‌దాదా గ్రూప్-గ్రూప్‌ను లేపుతున్నారు) (అంతర్ముఖి గ్రూప్) పురుషార్థం బాగా చేసారు. మేము అందరికంటే ముందుకు వెళ్ళాలి అని ప్రతి గ్రూప్ వారు అనుకుంటున్నారు. రీస్(ఈర్ష్య) చేయరు, రేస్ చేస్తారు. మంచిది. అంతర్ముఖి సదా సుఖి. (శక్తి గ్రూప్) ప్రత్యక్షత జెండాను ఎప్పుడు ఎగురవేస్తారు అని బాప్‌దాదా శక్తి గ్రూప్‌ను అడుగుతున్నారు? చెప్పండి, శక్తులైతే జెండాను ఎగురవేసేవారు కదా! అంటే ప్రత్యక్షతా జెండాను శక్తులే ఎగురవేస్తారు కదా! మంచిది. ఇప్పుడు పరస్పరం సంభాషించుకుని డేట్ ఫిక్స్ చేయండి. ఎలా అయితే ఇతర డేట్లు ఫిక్స్ చేస్తారో అలాగే ఈ డేట్‌ను కూడా ఫిక్స్ చేయండి – ప్రత్యక్షతా జెండా ఎప్పుడు ఎగురుతుంది? ఎగురవేస్తారు కదా? (మహావీర్ గ్రూప్) మహావీర్ గ్రూప్ ఏమి చేస్తుంది? సంవత్సరంతో పాటు సదా కోసం మాయకు కూడా వీడ్కోలు చెప్పండి. వీలవుతుందా? మాయకు వీడ్కోలు చెప్తారా? లేకపోతే మాయ వచ్చినాగానీ ఫర్వాలేదా? మహావీర్ అంటే అర్థము – ఎలా అయితే బ్రహ్మా బాబా ఏది చెప్పారో అదే చేసారో, ఏది అనుకున్నారో దానిని త్వరిత దానము మహాపుణ్యము సమానంగా చేసారో అలా మహావీర్ గ్రూప్ యొక్క లక్ష్యము ఇదే ఉంది కదా? మంచిది. ధైర్యము మంచిగా ఉంది.
విదేశీ చిన్న పిల్లల గ్రూప్‌తో:- అందరూ తమ గుర్తును పెట్టుకున్నారు (యూథ్ తిలకాన్ని పెట్టుకున్నారు, పిల్లలు బ్యానర్‌ను పట్టుకున్నారు, చిన్న జెండాలు చేతులో ఉన్నాయి) ఏంజిల్ నుండి దేవతగా అయ్యారు, ఎంత బాగుంది. దేవత అంటే దివ్య గుణాలు కలిగినవారు. దివ్య గుణాలను ఎప్పుడూ విడిచిపెట్టకండి. మంచిది. పిల్లల ఉల్లాస-ఉత్సాహాలు పెరుగుతాయి. చిన్న జెండాలు పట్టుకున్న పిల్లలు కూడా లేవండి. (భారత్ నుండి 1000 మంది పిల్లలు వచ్చారు) బాగుంది, భారత్ మరియు విదేశాలలోని అన్ని దేశాలు కలిసి ఢిల్లీని చుట్టుముట్టండి. (ఈశ్వరీయ సేవతో చుట్టుముట్టండి) ఢిల్లీని తమ రాజధానిగా చేసుకోవాలి కదా? మరి ముందు రాజధానిని తయారు చేసుకుంటే అప్పుడు కదా రాజ్యం చేస్తారు! భారతదేశంలోని వి.ఐ.పీలందరూ వచ్చేలా భారత్‌ను చుట్టుముట్టండి. భారత్ యొక్క పిల్లలు కూడా చేస్తారు కదా! బాగున్నారు, భారత్ కూడా తక్కువేమీ కాదు. మంచి-మంచి పిల్లలు వచ్చారు. అచ్ఛా.
ఇప్పుడు ఈ సంవత్సరం ఏ నవీనతను చేస్తారు? బాప్‌దాదా ఏదైతే పని ఇచ్చారో అది చేయలేదు. మైక్ మరియు వారసుల గ్రూప్‌ను ఎక్కడ తీసుకువచ్చారు! వెయిట్ అండ్ సీ అని బాప్‌దాదా అంటారు. ప్రత్యక్షతా జెండాను ఎగురవేయడంలో ఈ మైక్‌లు తెలివైనవారు. వేరు-వేరు దేశాలలో కొద్ది-కొద్దిమంది మైక్‌లు ఉన్నారు కానీ సంగఠన రూపంలో ఎదురుగా రావడం లేదు, ఇప్పుడు వారిని ఒకచోట చేర్చండి. ఒకచోట చేర్చడం వలన ఏమవుతుంది? ఒకరినొకరు చూసుకుని ఉత్సాహంలోకి వస్తారు, ఉల్లాసంలోకి వస్తారు. భారత్‌లో కూడా మైక్‌లు కావాలి, విదేశాలలో కూడా మైక్‌లు కావాలి. తయారవుతున్నారు కదా? కానీ ఇప్పుడు దాగి ఉన్నారు, పరదా లోపల ఉన్నారు, ఇప్పుడు బయటకు తీసుకురండి. బయటకు తీసుకురావాలి కదా! చాలా మంచిది.
మాతల సమూహము అయితే చాలా పెద్దదిగా ఉంది. మాతలను చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. ఎందుకని సంతోషిస్తారు? ఎందుకంటే సంగమంలో మాతలకే బాప్‌దాదా ద్వారా అవకాశం లభిస్తుంది. ద్వాపర, కలియుగాలలో లభించదు, ఇప్పుడే లభిస్తుంది. మహాత్ములలో కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ ఛాన్స్ లభిస్తుంది. ప్రభుత్వంలో కూడా మాతలకు సేవ చేసే అవకాశం లభిస్తుంది. మాతలు ఏ సెంటర్లో ఉన్నాగానీ ఆ సెంటర్ నిండుగా ఉంటుంది అని బాప్‌దాదా సదా అంటారు. సంపాదించకపోయినాగానీ మనసు పెద్దది, భావన పెద్దది. బాబా కూడా భావనను, సత్యమైన మనసును ఇష్టపడతారు. ప్రతి గ్రూప్‌లో మాతలు ఎక్కువమంది ఉండటాన్ని చూస్తున్నాము. మరి ఇప్పుడు మాతలు తమ తోటివారిని మేలుకొల్పండి. మీరు తీసుకువస్తే హాల్ దానంతటదే పెద్దది అయిపోతుంది. హాల్ ఇప్పుడే నిండిపోయింది, ఇంకా వస్తే ఎక్కడ కూర్చుంటారు అని ఆలోచించకండి, మీరు తీసుకువస్తే అన్నీ జరిగిపోతాయి. ఇలా జరుగుతుంది కదా? ఏమి చేయాలి అని దాదీ ఆలోచించరు. కనీసం 9 లక్షలమంది కూర్చోవాలి, ఇంతమంది ప్రజలనైతే తయారు చేయాలా వద్దా? ఎప్పుడు చేస్తారు? ఎప్పుడు చేస్తారు అన్న డేట్‌ను ఫిక్స్ చేయండి. ముందు 9 లక్షలమందిని తీసుకురండి, పాండవులు తీసుకువస్తారు. బాప్‌దాదా హాల్‌ను తయారు చేస్తారు కానీ ముందు 9 లక్షలమందిని తీసుకురండి. (ప్రతి సంవత్సరం ఒక్కొక్క లక్షమందిని తీసుకువస్తాము) అలా కాదు. అలా రండి, అందుకు కాదనడం లేదు. చివరకు స్టేజీ మీదకు 9 లక్షల మందిని తీసుకువస్తారా లేదా? లేకపోతే రాజ్యం ఎవరిపై చేస్తారు? మీ మొదటి జన్మలో 9 లక్షల ప్రజలు లేక రాయల్ ఫామిలీ వారు లేకపోతే ఎవరిపై రాజ్యం చేస్తారు?
మధుబన్ వారు ఏమి అనుకుంటున్నారు? 9 లక్షలు కావాలా వద్దా? 9 లక్షలు కావాలి, ముఖ్యమైన పాండవులు ఏమంటారు? కావాలా లేక వద్దా? అయిపోతుంది. 9 లక్షలు వస్తే సాధనాలు స్వతహాగా వచ్చేస్తాయి. హాల్ తయారు చేయాల్సి ఉంటుంది అని గాభరా పడకండి. చూడండి, భవిష్యత్తు చాలా-చాలా ఉజ్జ్వలంగా ఉంది. అన్ని సాధనాలు లభిస్తాయి. తయారై ఉన్న హాళ్ళు మీకు లభిస్తాయి. తయారు చేయవలసిన అవసరం లేదు. కేవలం ఈ సంవత్సరం యొక్క స్లోగన్ ఏదైతే ఉందో – సఫలం చేయండి, సఫలత ఉండనే ఉంది- ఇది గుర్తుంచుకోండి. అచ్ఛా. పాండవులు చేతులెత్తండి.
టీచర్లు:- టీచర్లు ఇప్పుడు స్వయం కూడా సఫలం చేయండి మరియు సఫలం చేయించండి. సేవలో వృద్ధి జరగడము అంటే ఖజానాలను సఫలం చేయడం మరియు చేయించడము. మరి ఈ సంవత్సరము ఈ స్లోగన్‌ను ప్రాక్టికల్లోకి తీసుకురండి అప్పుడు స్వతహాగా వృద్ధి జరుగుతూ ఉంటుంది. బాప్‌దాదా ఏమి చూసారంటే, కొన్ని-కొన్ని స్థానాలలో ధైర్యాన్ని తక్కువగా ఇచ్చే శక్తి ఉంది. ధైర్యాన్ని ఇవ్వండి, ప్రతి కార్యంలో మనసాలో కూడా, వాచలో కూడా, సంబంధ-సంపర్కంలో కూడా, కర్మలో కూడా ధైర్యాన్ని ఇవ్వండి. టీచర్ల సీట్ – ధైర్యములో ఉండటము మరియు ధైర్యాన్ని ఇవ్వడము. ఎందుకని? ఎందుకంటే టీచర్లకు బాబా మురళిని వినిపించే అవకాశం ఏదైతే లభించిందో మరియు సింహాసనం లభించిందో, ఇది ఎక్స్ట్రా సహాయము. కావున ధైర్యము మరియు ఉల్లాసాన్ని ఇవ్వండి. పూర్తి క్లాసు ఆత్మిక వికసించిన గులాబిగా ఉండాలి. టీచర్లు విన్నారా! క్లాసును ఉల్లాసంలోకి తీసుకురండి.
సేవ టర్న్ ఇండోర్ జోన్ వారిది:- అచ్ఛా, ఇండోర్ గ్రూప్ లేవండి. మంచిది – సేవ కోసం డైమండ్ ఛాన్స్ లభించింది. ఒకటి కర్మణ మరియు రెండు స్వ ఉన్నతికి కూడా డైమండ్ ఛాన్స్ లభించింది. అచ్ఛా – అందరూ ధైర్యాన్ని మంచిగా పెట్టారు. సేవ పట్ల ఉత్సాహాన్ని కూడా మంచిగా ఉంచారు. అన్నిటికన్నా పెద్ద గ్రూప్‌ను సంభాళించాలి. మరి ధైర్యానికి రిటర్న్‌గా బాప్‌దాదా పదమా-పదమరెట్లు అభినందనలు ఇస్తున్నారు. సదా డైమండ్గా అయ్యి సేవలో డైమండ్ ఛాన్స్‌ను తీసుకుంటూ ఉండండి. చాలా మంచిది.
జ్యూరిస్ట్ వింగ్ సోదరసోదరీల మీటింగ్ జరుగుతుంది:- ఇంటర్నేషనల్ కదా. ఒకవేళ ఇంతమంది వకీళ్ళు మరియు జడ్జ్‌లు తయారైతే, గీతా భగవంతుడు సిద్ధి అవుతారు. మంచిది. చాలా మంచిది. ఎవ్వరూ చేయనటువంటి ప్లాన్‌ను తయారు చేయండి, వర్గాలైతే చాలా తయారై ఉన్నాయి కదా! మరి మీ వర్గము అందరికన్నా నంబర్‌వన్ తీసుకోవాలి. మంచిది. గ్రూప్ బాగుంది. పాము చావాలి కర్ర విరగకూడదు అనేలా ప్లాన్‌ను తయారు చేయండి. ప్రత్యక్షత జరగాలి, ధమాల్ కాదు, కమాల్ జరగాలి. బాగుంది, సంగఠనను ఇంకా తయారు చేయండి. (ప్లాన్‌ను తయారు చేసాము) అభినందనలు. అచ్ఛా.
కల్చరల్ గ్రూప్:- ఆడటము పాడటము అయితే అందరికీ వస్తుంది, బాబా యొక్క గుణాల పాటను పాడటము వస్తుంది మరియు సంతోషంతో నాట్యము చేయడం కూడా వస్తుంది. బాగుంది. కల్చర్ ద్వారా భారత్ యొక్క క్యారెక్టర్‌ను ప్రసిద్ధి చేయండి. కల్చర్ ఉండాలి అందులో క్యారెక్టర్ సిద్ధి అవ్వాలి – శ్రేష్ఠ క్యారెక్టర్ అంటే ఏమిటో తెలియాలి. బాగుంది, ఎప్పటినుండైతే వర్గాలు తయారయ్యాయో, వేరువేరుగా సేవలైతే చేస్తున్నారు. కమాల్ చేసి చూపించండి. అందరూ కమాల్ చేసి చూపించేవారే కదా? కమాల్ చేయాలి కదా! ప్రతి వర్గం వారు ఇప్పుడు క్రొత్త-క్రొత్త ప్లాన్లను తయారు చేయాలి. ఈ వర్గం తయారై ఎన్ని సంవత్సరాలు అయ్యాయి? (20 సంవత్సరాలు) బాప్‌దాదా అన్ని వర్గాల వారికి చెప్పారు, తమ-తమ వర్గం నుండి విశేషంగా సేవలో మైక్ మరియు వారసులు తయారు కావాలి, అటువంటి సంగఠనను తయారు చేయండి అని బాప్‌దాదా చెప్పారు, గుర్తుందా? మరి మీ కల్చరల్లో ఎవరు తయారయ్యారు? తీసుకువచ్చారా? మరి బాబా సందేశాన్ని ఇవ్వడానికి మీవైపు (బాంబే నుండి ప్రసిద్ధ యాక్టర్ పరీక్షిత్ సహానీ మరియు వారి పరివారం బాప్‌దాదా ముందు నిల్చుని ఉన్నారు) వేలు చూపిస్తున్నారు. బాగుంది, ప్లాన్ తయారు చేస్తారు. ధైర్యము మీది, బాబా సహాయం ఉండనే ఉంది.
అచ్ఛా - ఒక్క క్షణములో మనస్సు యొక్క డ్రిల్ గుర్తుందా? ప్రతి ఒక్కరూ మొత్తము రోజంతటిలో ఎన్ని సార్లు ఈ డ్రిల్ చేస్తారు? ఇది నోట్ చేసుకోండి. ఈ మనసు డ్రిల్‌ను ఎన్ని సార్లు చేస్తే అంతగానే సహజయోగులుగా, సరళయోగులుగా అవుతారు. ఒకవైపు మనసా సేవ, మరొకవైపు మనసా ఎక్సర్సైజ్. ఇప్పుడిప్పుడే నిరాకారి, ఇప్పుడిప్పుడే ఫరిశ్తా. బ్రహ్మా బాబా ఫరిశ్తాలైన మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. ఫరిశ్తాలుగా అయ్యి బ్రహ్మా బాబాతోపాటు మీ ఇంటికి నిరాకార రూపములో వెళ్ళాలి, ఆ తర్వాత దేవతగా అవ్వాలి. అచ్ఛా.
నలువైపుల నుండి కార్డుల రూపములో, ఉత్తరాల రూపములో చాలా-చాలా ప్రియస్మృతులు బాప్‌దాదా వద్దకు చేరుకున్నాయి. పిల్లలు ప్రతి ఒక్కరూ నా స్మృతిని బాబాకు ఇవ్వండి అనే కోరుకుంటారు అన్నది బాప్‌దాదాకు తెలుసు, అందరిదీ లభించింది. ప్రియస్మృతులను ఇచ్చే చాలా ప్రియమైన పిల్లలు బాప్‌దాదా ఎదురుగా ఉన్నారు, అందుకే బాప్‌దాదా అంటున్నారు, పిల్లలు ప్రతి ఒక్కరూ తమ-తమ పేరు సహితముగా అభినందనలను మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలను స్వీకరించండి.
మీ అందరికీ కూడా నవ జీవితము, నవ యుగము మరియు నవ సంవత్సరము సందర్భముగా చాలా-చాలా పదమా, పదమాల, పదమా, పదమా రెట్లు అభినందనలు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు, ప్రియస్మృతులు మరియు నమస్తే.
దాదీజీ, దాదీ జానకి గారితో:- మీరిద్దరూ ఏకమతంతో ఉంటూ పూర్తి పరివారాన్ని నడిపించేందుకు నిమిత్తమయ్యారు. వీరంతా మీకు సహచరులు. వినిపించాము కదా – ఒకవేళ సఫలం చేస్తూ ఉంటే మాయాజీతులుగా అయిపోతారు. ఈ సంవత్సరం అందరూ ఏకమతంగా అయిపోవాలి అని దాదీలు అంటున్నారు. ఎవరిని చూసినా ఒకరే. వీరు ఒక్కరే అని దాదీల గురించి అంటారు కదా, అలాగే దీదీలు, దాదాలు అందరూ ఏకమతము. ఇందుకు స్లోగన్ – ఇప్పుడే బాలకులు – ఇప్పుడే యజమానులుగా అవ్వండి. బాలకులుగా అవ్వవలసిన సమయంలో యజమానులుగా అవ్వకండి, యజమానులుగా అవ్వవలసిన సమయంలో బాలకులుగా అవ్వకండి. మరి దాదీలకు ఈ సంకల్పం వచ్చింది, ఇది ఎవరు పూర్తి చేస్తారు? మీరందరూ చేస్తారు కదా? ఒకవేళ ఆలోచనలలో తేడా ఉంటే ఏమి చేస్తారు? అచ్ఛా. అందరినీ చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. మేమంతా స్వ-పరివర్తన చేసే శక్తి, పాండవ సైన్యం అని చెప్పే రోజు ఒకటి వస్తుంది, అది కూడా త్వరగా వస్తుంది. స్వ-పరివర్తన. పాత సంవత్సరానికి వీడ్కోలు ఇవ్వడంతోపాటు మాయకు కూడా వీడ్కోలు ఇవ్వండి. అది కూడా అలసిపోయింది. వీడ్కోలు మరియు అభినందనలు రెండూ కలిపి ఇవ్వండి.
బాప్‌దాదా పిల్లలందరికీ క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు:-
నలువైపులా ఉన్న చాలా మధురమైన, చాలా ప్రియమైన పిల్లలకు పదమా, పదమా రెట్ల క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు. గడిచిపోయిన ఈ క్షణము వీడ్కోలు మరియు శుభాకాంక్షల క్షణము. ఒకవైపు వీడ్కోలు ఇవ్వాలి, స్వయము సంపన్నముగా అవ్వటములో ఏ లోటునైతే అనుభవము చేస్తున్నారో, దానికి వీడ్కోలు. దానికి సదా కొరకు వీడ్కోలు ఇవ్వండి మరియు ముందుకు ఎగిరేందుకు అభినందనలు. అభినందనలు, అభినందనలు, అభినందనలు. అచ్ఛా!