Search for a command to run...
18 Jan 2003
"బ్రాహ్మణ జన్మ యొక్క స్మృతుల ద్వారా సమర్థులుగా అయ్యి సర్వులను సమర్థులుగా చేయండి"
18 January 2003 · తెలుగు
ఈరోజు నలువైపులా ఉన్న సర్వ స్నేహి పిల్లల యొక్క స్నేహముతో కూడిన మధురాతి-మధురమైన స్మృతుల యొక్క రకరకాల మాటలు, స్నేహపు ముత్యాల మాలలు బాప్‌దాదా వద్దకు అమృతవేళ కంటే ముందే చేరుకున్నాయి. పిల్లల స్నేహము బాప్‌దాదాను కూడా స్నేహ సాగరములో ఇమిడిపోయేలా చేస్తుంది. బాప్‌దాదా చూసారు - పిల్లలు ప్రతి ఒక్కరిలో స్నేహ శక్తి ఎడతెగనిదిగా ఉంది. ఈ స్నేహ శక్తి పిల్లలు ప్రతి ఒక్కరినీ సహజయోగిగా తయారుచేస్తూ ఉంది. స్నేహము ఆధారముతో సర్వ ఆకర్షణల నుండి ముక్తులై ఇంకా, ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. బాప్‌దాదా ద్వారానైనా లేక విశేష ఆత్మల ద్వారానైనా అతీతమైన మరియు ప్రియమైన స్నేహము యొక్క అనుభవము లేకుండా ఉన్న పిల్లలను ఒక్కరిని కూడా చూడలేదు. బ్రాహ్మణులైన ప్రతి ఒక్కరి బ్రాహ్మణ జీవితము యొక్క ఆది కాలము స్నేహ శక్తి ద్వారానే జరిగింది. బ్రాహ్మణ జన్మలోని ఈ స్నేహ శక్తి వరదానముగా అయ్యి ముందుకు తీసుకువెళ్తుంది. కనుక ఈరోజు విశేషముగా తండ్రి మరియు పిల్లల స్నేహ దివసము. ప్రతి ఒక్కరూ తమ హృదయములో స్నేహమనే ముత్యాలతో కూడిన చాలా, చాలా మాలలను బాప్‌దాదాకు ధరింపజేసారు. ఇతర శక్తులు ఈరోజు మర్జ్ అయి ఉన్నాయి కానీ స్నేహ శక్తి ఇమర్జ్ అయి ఉంది. బాప్‌దాదా కూడా పిల్లల స్నేహ సాగరములో లవలీనమై ఉన్నారు.
ఈరోజును స్మృతి దివసము అని అంటారు. స్మృతి దివసము కేవలము బ్రహ్మాబాబా యొక్క స్మృతి దివసమే కాదు. బాప్‌దాదా అంటారు - ఈరోజు మరియు సదా ఏమి గుర్తుండాలంటే - బ్రాహ్మణ జన్మ తీసుకుంటూనే ఆది నుండి ఇప్పటివరకు బాప్‌దాదా ఏయే స్మృతులను కలిగించారు, ఆ స్మృతుల మాలను గుర్తు చేసుకుంటే చాలా పెద్ద మాల తయారవుతుంది. అందరికీ అన్నింటికంటే మొదటి స్మృతిగా ఏమి లభించింది? మొదటి పాఠము గుర్తుంది కదా! నేను ఎవరిని! ఈ స్మృతియే నూతన జన్మను ఇచ్చింది, వృత్తి, దృష్టి, స్మృతిని పరివర్తన చేసింది. ఇటువంటి స్మృతులు గుర్తుకు రావటముతోనే ఆత్మిక సంతోషముతో కూడిన మెరుపు నయనాలలో, ముఖములో రానే వస్తుంది. మీరు స్మృతులను గుర్తు చేసుకుంటారు మరియు భక్తులు మాలను స్మరణ చేస్తారు. ఒక్క స్మృతి అయినా కూడా అమృతవేళ నుండి కర్మయోగిగా అయ్యే సమయము వరకు పదే-పదే గుర్తున్నట్లయితే, ఆ స్మృతి సమర్థ స్వరూపమును తయారుచేస్తుంది ఎందుకంటే ఎటువంటి స్మృతియో అటువంటి సమర్థత స్వతహాగానే వస్తుంది, అందుకే ఈరోజును స్మృతి దివసము అని అనడముతోపాటు సమర్థ దివసము అని కూడా అంటాము. బ్రహ్మాబాబా మన ఎదురుగా రావటముతోనే, బాబా దృష్టి పడటముతోనే ఆత్మలలో సమర్థత వచ్చేస్తుంది. అందరూ అనుభవజ్ఞులే. అందరూ అనుభవజ్ఞులే కదా! సాకార రూపములో చూసినా లేక అవ్యక్త రూపము యొక్క పాలన ద్వారా పాలింపబడుతూ అవ్యక్త స్థితి యొక్క అనుభవాన్ని చేసినా, క్షణములో మనస్ఫూర్తిగా బాప్‌దాదా అని అంటూనే సమర్థత స్వతహాగా వచ్చేస్తుంది, అందుకే ఓ సమర్థ ఆత్మల్లారా, ఇప్పుడు ఇతర ఆత్మలను మీ సమర్థతతో సమర్థులుగా చెయ్యండి. ఉల్లాసము ఉంది కదా! ఉందా ఉల్లాసము, అసమర్థులను సమర్థులుగా తయారుచెయ్యాలి కదా! బాప్‌దాదా చూసారు - నలువైపులా బలహీన ఆత్మలను సమర్థముగా తయారుచేసే ఉల్లాసము చాలా బాగుంది.
శివరాత్రి ప్రోగ్రామును చాలా వైభవముగా తయారు చేస్తున్నారు. అందరికీ ఉల్లాసము ఉంది కదా! ఇక ఈ శివరాత్రికి అద్భుతము చేస్తాము అని ఎవరిలో అయితే ఉల్లాసము ఉందో వారు చేతులెత్తండి. ఎటువంటి అద్భుతము అంటే దాని ద్వారా హంగామాలు, అల్లకల్లోలాలు సమాప్తమైపోవాలి. వాహ్! వాహ్ సమర్థ ఆత్మలూ వాహ్! అనే జయజయకారాలు మ్రోగాలి. అన్ని జోన్లవారు ప్రోగ్రామును తయారుచేసారు కదా! పంజాబువారు కూడా తయారుచేసారు కదా! మంచిది. భ్రమిస్తున్న ఆత్మలు, దప్పికతో ఉన్న ఆత్మలు, అశాంత ఆత్మలు, ఇటువంటి ఆత్మలకు అంచలినైతే ఇవ్వండి. ఎంతైనా, వారు మీ సోదరసోదరీలు. కనుక మీ సోదరులపై, మీ సోదరీలపై దయ కలుగుతుంది కదా! చూడండి, ఈరోజుల్లో పరమాత్మను ఆపద కాలములోనే తలుచుకుంటారు, కానీ శక్తులను, దేవతలలో కూడా గణేశుడు ఉన్నారు, హనుమంతుడు ఉన్నారు, ఇంకా ఇతర దేవతలు కూడా ఉన్నారు, వారందరినీ ఎక్కువగా తలుచుకుంటారు. మరి వారు ఎవరు? మీరే కదా! మిమ్మల్ని ప్రతి రోజూ తలుచుకుంటారు. ఓ కృపాళువు, దయాళువు, దయ చూపించండి, కృప చూపించండి, సుఖ-శాంతులతో కూడిన ఒక్క బిందువునైనా ఇవ్వండి అని పిలుస్తున్నారు. మీ ద్వారా లభించే ఒక్క బిందువు కొరకు వారు దప్పికతో ఉన్నారు. దుఃఖములో ఉన్న, దప్పికతో ఉన్న ఆత్మలు - ఓ శక్తులూ, ఓ దేవతలూ అంటూ పిలుస్తున్న ఆ ధ్వని మీకు చేరటం లేదా! చేరుతుంది కదా? బాప్‌దాదా ఈ పిలుపును విన్నప్పుడు శక్తులను మరియు దేవతలను గుర్తు చేసుకుంటారు. దాదీ మంచి ప్రోగ్రామును తయారుచేసారు, బాబాకు అది నచ్చింది. స్మృతి దివసమైతే ఎల్లప్పుడూ ఉంటుంది, అయినా కూడా నేటి ఈరోజున స్మృతి ద్వారా సర్వ సమర్థతలను విశేషముగా ప్రాప్తి చేసుకున్నారు, ఇప్పుడు రేపటి నుండి శివరాత్రి వరకు బాప్‌దాదా నలువైపులా ఉన్న పిల్లలకు ఏం చెప్తున్నారంటే - ఈ విశేషమైన రోజున ఈ లక్ష్యమునే పెట్టుకోండి - ఎక్కువలో ఎక్కువమంది ఆత్మలకు మనసా ద్వారా, వాణి ద్వారా మరియు సంబంధ-సంపర్కముల ద్వారా, ఏదో ఒక విధితో సందేశమనే అంచలిని(దానమును) తప్పకుండా ఇవ్వాలి. మీపై వచ్చే ఫిర్యాదును తొలగించుకోండి. ఇప్పుడు వినాశన తారీఖు అయితే కనిపించటం లేదు, కనుక ఎప్పుడో ఒకప్పుడు ఫిర్యాదును తొలగించుకుంటాములే అని పిల్లలు ఆలోచిస్తున్నారు, కానీ అలా అవ్వదు. ఒకవేళ ఇప్పటినుండే ఫిర్యాదును పూర్తి చేసుకోకపోతే - మీరు మాకు ముందుగానే ఎందుకు చెప్పలేదు, మేము కూడా ఎంతోకొంత తయారు చేసుకునేవాళ్ళము కదా అని అంటారు. అప్పుడిక కేవలం ఓహో ప్రభూ అని మాత్రమే అంటారు. అందుకే వారిని కూడా కొంచెమైనా వారసత్వము యొక్క అంచలిని తీసుకోనివ్వండి, వారికి కూడా కొంచెం సమయాన్ని ఇవ్వండి. ఒక్క బిందువు ద్వారానైనా దప్పికనైతే తీర్చండి. దాహముతో ఉన్నవారికి ఒక్క బిందువు అయినా చాలా మహత్వపూర్ణముగా ఉంటుంది. కనుక ప్రోగ్రాం ఇదే కదా. రేపటి నుండి బాప్‌దాదా కూడా పచ్చ జెండా ఊపటం కాదు, నగారాను మ్రోగిస్తున్నారు - ఓ తృప్త ఆత్మలారా, ఆత్మలకు సందేశాన్ని ఇవ్వండి, సందేశాన్ని ఇవ్వండి. కనీసం శివరాత్రి నాడు, బాబా పుట్టినరోజు సందర్భముగా, అవును, మాకు సందేశము లభించేసింది అనేదాని ద్వారా నోటిని అయితే తీపి చెయ్యండి. ఈ దిల్ఖుష్ మిఠాయిని అందరికీ వినిపించండి, తినిపించండి. సాధారణ శివరాత్రిని జరపకండి, ఏదైనా అద్భుతాన్ని చేసి చూపించండి. ఉల్లాసము ఉందా? మొదటి లైన్లో కూర్చున్నవారికి ఉందా? చాలా ఘనముగా చెయ్యండి. శివరాత్రికి ఇంత గొప్ప మహత్వము ఉంది అని కనీసం ఇదైతే వారు అర్థం చేసుకోవాలి. మా తండ్రి యొక్క జన్మదినము అనేది విని వారు సంతోషపడాలి.
అచ్ఛా – ఎంతమందైతే ఇక్కడ కూర్చున్నారో, అందరూ నలువైపులకైతే వెళ్ళవలసిందే, కానీ ఎంతమందైతే కూర్చుని ఉన్నారో, ఎంత సంఖ్య ఉంది? (12-13 వేలమంది కూర్చుని ఉన్నారు) అచ్ఛా, ఎవరైతే కూర్చుని ఉన్నారో, మధుబన్ వారు, మేము ఎక్కడ సందేశాన్ని ఇవ్వగలము అంటారు. ఈరోజుల్లో మధుబన్ చుట్టుప్రక్కల కూడా అనేక గ్రామాలు వచ్చాయి. క్రింద కావచ్చు, పైన కావచ్చు, చాలామంది ఉన్నారు. కనీసం ఒక్క ఆత్మనైనా తమవారిగా చేయండి, సందేశమైతే అనేకులకు ఇవ్వాలి కానీ ఒక్క ఆత్మనైనా తన వారసత్వాన్ని తీసుకునేందుకు యోగ్యులుగా తయారు చేయండి.
అందరూ ఒక్కొక్కరిని తయారు చేస్తే 9 లక్షలమంది పూర్తయిపోతారు. సమ్మతమేనా, చేస్తారా లేక కేవలం చెప్తారా? కేవలం చేతులెత్తడం కాదు, మనస్ఫూర్తిగా చేయాలి. చేయాలా? (నారాయణ్‌ను అడుగుతున్నారు) చేయాలా? మరి బాప్‌దాదా ఏదైతే 9 లక్షలమంది యొక్క లిస్టును కావాలని అడుగుతున్నారో, అదైతే వచ్చేస్తుంది కదా. మరి మరుసటి సీజన్లో బాప్‌దాదా 6 లక్షలు కాదు, 9 లక్షలు తయారైపోయారు, అంతకన్నా ఎక్కువమందే తయారయ్యారు అన్న శుభవార్తను వినాలనుకుంటున్నారు. సరేనా, శక్తులు, టీచర్లు సరేనా! టీచర్లు అయితే కంకణాన్ని తయారు చేయాలి. పంజాబ్ మరియు రాజస్థాన్ టీచర్లు చేతులెత్తండి. టీచర్లు అయితే చాలామందిని తయారు చేయవచ్చు, కానీ ఇతరులకు తయారు చేసే ప్రేరణను ఇవ్వండి. మంచిది, టీచర్లు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్కరు 9 మందిని తయారు చేస్తే 9 లక్షలు తయారైపోతారు. మరుసటి సీజన్‌కల్లా ఈ శుభవార్త లభిస్తుందా, ఏమనుకుంటున్నారు? నిర్వైర్ చెప్పండి, లభిస్తుందా? జరుగుతుందా? ఇదైతే ఏమంత పెద్ద విషయము కాదు. 6 లక్షలు ఉన్నారు, ఇంకా 3 లక్షలు కావాలి, అంతే. జరిగిపోతుంది, చేయవలసిందే అన్న ధైర్యాన్ని అందరూ పెట్టుకోండి, సరిపోతుంది. ఏమంటారు? చేయవలసిందే అని చెప్పండి. సంకల్ప శక్తి చాలా పెద్ద శక్తి. బ్రాహ్మణ ఆత్మలైన మీ సంకల్పాలు ఏమి చేయలేవు? ప్రతి ఒక్కరూ తమ శ్రేష్ఠ సంకల్పాల మహత్వమును స్మృతిలో పెట్టుకోవాలి.
బాప్‌దాదా చూసారు - అమృతవేళలో మెజారిటీ వారి స్మృతి మరియు ఈశ్వరీయ ప్రాప్తుల నషా చాలా బాగా ఉంటుంది. కానీ కర్మయోగి స్థితిలో ఉన్నప్పుడు అమృతవేళలో ఏదైతే నషా ఉంటుందో దానితో పోలిస్తే తేడా ఉంటుంది. కారణమేమిటి? కర్మలు చేస్తున్నప్పుడు, సోల్ కాన్షస్ (ఆత్మాభిమాని స్థితి) మరియు కర్మ కాన్షస్, ఈ రెండు రకాలుగానూ ఉంటున్నారు. దీనికి విధి ఏమిటంటే - కర్మలు చేస్తూ ఆత్మనైన నేను, ఎటువంటి ఆత్మను అన్నదైతే మీకు ఎలాగూ తెలుసు, ఆత్మకు సంబంధించిన రకరకాల స్వమానాలు ఏవైతే లభించి ఉన్నాయో, అటువంటి ఆత్మను చేయించే ఆత్మగా అయ్యి ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయించేవాడిని, ఈ కర్మేంద్రియాలు కర్మచారులు, కర్మచారుల ద్వారా కర్మలు చేయించే నేను చేయించేవాడిని, అతీతముగా ఉన్నాను. లౌకికములో కూడా డైరెక్టరు తన సహచరులతో, నిమిత్తముగా సేవ చేసేవారితో సేవ చేయిస్తున్నప్పుడు, డైరెక్షన్లు ఇస్తున్నప్పుడు, డ్యూటీ చేస్తున్నప్పుడు - నేను డైరెక్టరును అన్నది మర్చిపోతారా? కనుక స్వయాన్ని - నేను చేయించే శక్తిశాలి ఆత్మను అని భావిస్తూ కార్యము చేయించండి. ఆత్మ మరియు శరీరము, ఆత్మ చేయించేది, శరీరము చేసేది, ఈ స్మృతి మర్జ్ అయిపోతుంది. బ్రహ్మా బాబా ప్రారంభములో ఏ అభ్యాసము చేసారు అన్నది మీ అందరికీ తెలుసు, పాత పిల్లలకు తెలుసు. ఒక డైరీని చూసారు కదా. మొత్తం డైరీ అంతా ఒకటే మాట ఉంది - నేను కూడా ఆత్మను, యశోద కూడా ఆత్మ, ఈ పిల్లలు కూడా ఆత్మలు, ఆత్మ, ఆత్మ... ఈ సదాకాలికమైన పునాదిని అభ్యాసము చేసారు. కనుక నేను ఎవరిని అన్నది మొదటి పాఠము. దీనిని పదే-పదే అభ్యాసము చెయ్యాలి. చెకింగ్ కావాలి, నేను ఉన్నదే ఆత్మగా అని ఊరికే అనుకోవటము కాదు. ఆత్మనైన నేను చేయించేవానిగా అయ్యి కర్మలు చేయిస్తున్నాను అని అనుభవము చెయ్యాలి. చేసేవారు వేరు, చేయించేవారు వేరు. బ్రహ్మా బాబా యొక్క మరొక అనుభవాన్ని కూడా విన్నారు, అదేమిటంటే - ఈ కర్మేంద్రియాలు కర్మచారులు. ప్రతి రోజూ రాత్రిపూట చేసే కచేరీ గురించి విన్నారు కదా! కనుక యజమానిగా అయ్యి ఈ కర్మేంద్రియాలు అనే కర్మచారులను వాటి స్థితిగతుల గురించి అడిగేవారు కదా! బ్రహ్మా బాబా పునాది అయిన ఈ అభ్యాసాన్ని చాలా పక్కా చేసుకున్నారు, అందుకే ఏ పిల్లలైతే చివరి సమయములో కూడా బాబాతో పాటు ఉన్నారో, వారు ఏం అనుభవము చేసారు? బాబా కార్యాలు చేస్తూ కూడా, శరీరములో ఉంటూ కూడా, అశరీరి స్థితిలో నడుస్తూ-తిరుగుతూ ఉన్నట్లుగా అనుభవము అవుతుండేది. కర్మల లెక్కాచారము సమాప్తి చేసుకోవలసి వచ్చినా కూడా సాక్షిగా అయ్యి, స్వయమూ కర్మల లెక్కాచారానికి వశమవ్వలేదు, అలాగే కర్మల లెక్కాచారము పూర్తి అవుతున్న అనుభవము ఇతరులకు కూడా కలగనివ్వలేదు. బ్రహ్మా బాబా అవ్యక్తమవుతున్నారు అన్నది మీకు తెలిసిందా? తెలియలేదు కదా! కనుక ఇంతటి అతీతమైన స్థితిని, సాక్షి స్థితిని, అశరీరి స్థితిని అనగా కర్మాతీత స్థితిని చాలా కాలము నుండి అభ్యాసము చేసారు కావుననే అంతిమములో కూడా అదే స్వరూపము అనుభవమైంది. ఈ బహుకాలపు అభ్యాసము పనికొస్తుంది. అంతిమములో దేహభానాన్ని వదిలేస్తాము అని ఇలా అనుకోకండి. బహుకాలపు అశరీరితనము యొక్క, దేహము నుండి అతీతమై చేయించే స్థితి యొక్క అనుభవము కావాలి. అంతిమ సమయమనేది యువకులకైనా, వృద్ధులకైనా, ఆరోగ్యవంతులకైనా, రోగులకైనా ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు, అందుకే బహుకాలపు సాక్షితనము యొక్క అభ్యాసముపై అటెన్షన్ పెట్టండి. ఎన్ని ప్రాకృతిక ఆపదలు వచ్చినా కానీ ఈ అశరీరితనపు స్థితి మిమ్మల్ని సహజముగా అతీతముగా మరియు బాబాకు ప్రియముగా తయారుచేస్తుంది. అందుకే బహుకాలము అన్న మాటను బాప్‌దాదా అండర్లైన్ చేయిస్తున్నారు. ఏదేమైనా కానీ, మొత్తం రోజంతటిలో సాక్షి స్థితిని, చేయించేవాడిని అన్న స్థితిని, అశరీరితనపు స్థితిని పదే-పదే అనుభవము చేయండి, అప్పుడు అంతిమ సమయములో ఫరిశ్తా నుండి దేవతగా అవ్వడము అనేది నిశ్చితము. బాబా సమానముగా అవ్వాలనుకుంటే బాబా నిరాకారుడు మరియు ఫరిశ్తా, బ్రహ్మాబాబా సమానముగా అవ్వటము అనగా ఫరిశ్తా స్థితిలో ఉండటము. ఏ విధంగా ఫరిశ్తా రూపాన్ని సాకారములో చూసారో, ఎవరైనా మాట్లాడింది వింటున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కార్య వ్యవహారాలు చేస్తున్నప్పుడు కూడా బాబా శరీరములో ఉంటూ కూడా అతీతముగా ఉన్నారు అన్నది అనుభవము చేసారు. కార్యాన్ని వదిలేసి అశరీరిగా అవ్వటము అనేది కొద్ది సమయము వరకే వీలవ్వగలదు కానీ కార్యము చేస్తూ, సమయాన్ని కేటాయించి అశరీరి, శక్తిశాలి స్థితి యొక్క అనుభవమును చేస్తూ ఉండండి. మీరందరూ ఫరిశ్తాలు, బాబా ద్వారా ఈ బ్రాహ్మణ జీవిత ఆధారమును తీసుకుని సందేశాన్ని ఇచ్చేందుకై సాకారములో కార్యము చేస్తున్నారు. ఫరిశ్తా అనగా దేహములో ఉంటూ దేహము నుండి అతీతము మరియు దీనికి ఉదాహరణగా బ్రహ్మా బాబాను చూసారు, కనుక అది అసంభవము కాదు. చూసారు, అనుభవము చేసారు. ఎవరైతే నిమిత్తులుగా ఉన్నారో, ఇప్పుడు విస్తారము ఎక్కువగా ఉన్నా కానీ బ్రహ్మా బాబాకు ఈ క్రొత్త జ్ఞానము, క్రొత్త జీవితము, క్రొత్త ప్రపంచాన్ని తయారుచేసే బాధ్యత ఎంతగా అయితే ఉందో, అంతగా ఇప్పుడు ఎవ్వరికీ లేదు. కనుక అందరి లక్ష్యము బ్రహ్మా బాబా సమానముగా అవ్వటము అనగా ఫరిశ్తాగా అవ్వటము. శివబాబా సమానముగా అవ్వటము అనగా నిరాకార స్థితిలో స్థితులవ్వటము. ఇది కష్టమా? బాబా మరియు దాదాపై ప్రేమ ఉంది కదా! కనుక ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలా అవ్వటము, అంతేకాక బాబా సమానముగా అవ్వాల్సిందే అన్న సంకల్పము కూడా ఉన్నప్పుడు, ఇక అది కష్టమేమీ కాదు. కావలసింది కేవలము పదే-పదే అటెన్షన్ పెట్టడము. సాధారణ జీవితము ఉండకూడదు. సాధారణ జీవితాన్ని జీవించేవారు ఎందరో ఉన్నారు, పెద్ద-పెద్ద కార్యాలను చేసేవారు ఎందరో ఉన్నారు, కానీ మీవంటి కార్యాన్ని బ్రాహ్మణ ఆత్మలైన మీరు తప్ప ఇతరులెవ్వరూ చెయ్యలేరు.
కనుక ఈరోజు స్మృతి దివసము నాడు బాప్‌దాదా - సమానతలో సమీపముగా రండి, సమీపముగా రండి, సమీపముగా రండి అన్న వరదానాన్ని ఇస్తున్నారు. అందరూ హద్దు తీరాలను, సంకల్పాలలోనైనా, మాటలలోనైనా, కర్మలలోనైనా, సంబంధ-సంపర్కాలలోనైనా, ఎటువంటి హద్దు తీరాలనైనా వదిలేయండి. మీ మనస్సు అనే నావను ఈ హద్దు తీరాల నుండి విముక్తి చెయ్యండి. ఇప్పటినుండి జీవితములో ఉంటూనే ముక్తులుగా ఉండండి, జీవన్ముక్తి యొక్క ఇటువంటి అలౌకిక అనుభవాన్ని బహుకాలము నుండి చెయ్యండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న పిల్లల ఉత్తరాలు చాలా అందాయి మరియు మధుబన్ వారి క్రోధముక్త రిపోర్టు, సమాచారము కూడా బాప్‌దాదా వద్దకు చేరుకుంది. ధైర్యము పెట్టినందుకు బాప్‌దాదా సంతోషిస్తున్నారు మరియు ఇకముందు కొరకు కూడా సదా ముక్తులుగా ఉండేందుకు సహన శక్తి యొక్క కవచాన్ని ధరించి ఉంచుకోండి, అప్పుడు ఎవరు ఎంత ప్రయత్నం చేసినా కానీ మీరు సదా సురక్షితముగా ఉంటారు.
ఇటువంటి దృఢ సంకల్పధారులందరికీ, సదా స్మృతి స్వరూప ఆత్మలకు, సదా సర్వ సమర్థతలను అవసరమైన సమయానికి కార్యములోకి తీసుకువచ్చే విశేష ఆత్మలకు, సదా సర్వ ఆత్మలపై దయ చూపించే దయాహృదయ ఆత్మలకు, సదా బాప్‌దాదా సమానముగా అయ్యే సంకల్పాన్ని సాకార రూపములోకి తీసుకువచ్చే అటువంటి చాలా, చాలా, చాలా ప్రియమైన మరియు అతీతమైన పిల్లలకు బాప్‌దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.
పంజాబ్ సేవాధారులతో:- పంజాబ్వారు కూడా తమకిచ్చిన అనంతమైన సేవా పాత్రను మంచిగా చేసారు, బాప్‌దాదా సంతోషిస్తున్నారు – ప్రతి జోన్ ఎంతో ఉల్లాస-ఉత్సాహాలతో సేవ యొక్క సువర్ణ అవకాశాన్ని ప్రాక్టికల్‌లో తీసుకు వస్తున్నారు. పంజాబ్ పేరే నదుల కారణంగా వచ్చింది. ఈరోజుల్లో పావనంగా చేసేవి నదులు అని నమ్ముతున్నారు. మరి పంజాబ్ వారు అందరికీ సందేశాన్ని ఇవ్వడంలో నంబర్‌వన్ కదా! నదులైతే చాలా ఉంటాయి, పంజాబ్ కూడా సందేశం ఇస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది. చాలా ప్రోగ్రాములను మంచిగా తయారు చేసారు కదా! బాప్‌దాదా విన్నారు, అందరికీ మంచి ఉత్సాహము ఉంది. ఆది స్థాపన యొక్క స్థానము అది, కావున శక్తి ఎక్కువ ఉంటుంది, అందుకే మీకు నిమిత్తమైన చంద్రమణి బచ్చీకి టైటిల్ ఇచ్చాము కదా – పంజాబ్ పులి. మరి మీరంతా పులులే కదా! బలహీనంగా లేరు కదా! పాండవులు బలహీనంగా లేరు కదా, శక్తిశాలిగా ఉన్నారు కదా? హా జీ అని చెప్పండి. పంజాబ్‌లోని ప్రతి పులి వేటాడటంలో చాలా తెలివైనవారు అని బాప్‌దాదాకు తెలుసు. పులి అయితే వేటాడటంలో తెలివైనదిగా ఉంటుంది కదా. మరి మీరెంత తెలివైనవారు! మరుసటి సీజన్లో అందరికంటే ఎక్కువ సంఖ్యను పంజాబ్ తీసుకు వస్తుంది. మరి ఇన్‌అడ్వాన్స్ అభినందనలు. మంచిది. ఒక్కొక్కరినీ చూసి బాప్‌దాదా సంతోషిస్తున్నారు. వాహ్, నా సేవాధారి పిల్లలూ వాహ్! పాండవులు కూడా వాహ్! వాహ్! శక్తులు కూడా వాహ్! వాహ్! ఇప్పుడు వాహ్ బాబా వాహ్ అనే నగారాను మ్రోగించండి. వాహ్ మా బాబా వాహ్! అని అందరూ అనాలి. సరేనా? ధైర్యము ఉందా? ధైర్యము కూడా ఉంది మరియు బాప్‌దాదా యొక్క పదమారెట్ల సహాయం కూడా ఉంది. సరేనా. చూడండి, పేరే ఉంది అచల్ మరియు ప్రేమ్. ఎక్కడ ప్రేమ ఉంటుందో, అచల్ ఉంటుందో అక్కడకు అన్నీ వచ్చేస్తాయి కదా. కావలసినది ఏమిటి, ప్రేమ మరియు అచల స్థితి, ఇంకేమి కావాలి? నిమిత్తమైనవారి పేర్లను తీసుకుంటున్నాము. అందరి పేర్లు చాలా అర్థవంతంగా ఉన్నాయి. ఎదురుగా ఉన్నారు కాబట్టి వీరిద్దరి పేర్లను తీసుకుంటున్నాము, కానీ అందరూ ఒక్కొక్క రత్నము, బాప్‌దాదా హృదయ సింహాసనాధికారులు. అంతా బాగుంది కదా!
డబల్ విదేశీయులతో:- డబల్ విదేశీయులకు డబల్ నషా ఉంది. ఎందుకని డబల్ నషా ఉంది? ఎందుకంటే బాబా ఏ విధంగా దూరదేశానికి చెందినవారో, అలాగే మేము కూడా దూరదేశము నుండి వచ్చాము అని భావిస్తారు. బాప్‌దాదా డబల్ విదేశీ పిల్లల్లో ఒక విశేషతను చూసారు, అదేమిటంటే, దీపముతో దీపాన్ని వెలిగిస్తూ అనేక దేశాలలో ఉన్న బాప్‌దాదా యొక్క వెలుగుతున్న దీపాల యొక్క దీపావళిని జరిపారు. ఇప్పుడు కూడా ఎన్ని దేశాల నుండి వచ్చారు? (35) ఈ టర్న్‌లో 35 దేశాల నుండి వచ్చారు, బయట ఇంకెంతమంది ఉండవచ్చు? డబల్ విదేశీయులకు సందేశాన్ని ఇచ్చే అభిరుచి చాలా మంచిగా ఉంది. ప్రతి గ్రూపులో 35-40 దేశాలవారు ఉండటాన్ని బాప్‌దాదా చూసారు. అభినందనలు. సదా స్వయము కూడా ఎగురుతూ ఉండండి మరియు ఫరిశ్తాగా అయ్యి, ఎగురుతూ, ఎగురుతూ సందేశాన్ని ఇస్తుండండి. మంచిది. కేవలము మీ 35 దేశాలవారినే బాప్‌దాదా చూడటం లేదు, ఇంకా ఇతర దేశాలవారిని కూడా మీతోపాటు చూస్తున్నారు. నంబర్‌వన్ బాబా సమానముగా అయ్యేవారు కదా! మీరు నంబర్‌వన్‌గా అయ్యేవారా లేక నంబరువారుగా అయ్యేవారా? నంబర్వన్యేనా? నంబరువారుగా అయ్యేవారు కాదా? నంబర్‌వన్‌గా అవ్వటము అనగా ప్రతి సమయము విన్ (విజయులు) అయ్యేవారు. ఎవరైతే విన్ అవుతారో వారే వన్ అవుతారు. మరి అటువంటి వారేనా? చాలా మంచిది. మీరు విజయులు మరియు సదా విజయులుగా ఉండేవారు. అచ్ఛా, మీరు ఎక్కడెక్కడకు వెళ్ళినా కానీ అక్కడ ఉన్న ఇతరులకు ఈ స్మృతిని కలిగించండి - డబల్ విదేశీయులందరూ వన్ నంబరు వారిగా అవ్వాలి అని. అచ్ఛా, అందరికీ స్మృతిని ఇవ్వండి. మీరు శివరాత్రిని ఇక్కడ జరుపుకున్నాగానీ మీరు సందేశమైతే ఇవ్వవచ్చు కదా! మరి ఇప్పుడు సంఖ్య అయితే ఉందో, అంతకు డబల్ సంఖ్య మరుసటి సీజన్లో ఉండవలసిందే. ఉంటుంది కదా! ఉండాలి.
అచ్ఛా, బాప్‌దాదా మాతలందరికీ, గోపాలుని ప్రియమైన మాతలందరికీ చాలా-చాలా హృదయపూర్వకమైన ప్రియస్మృతులను ఇస్తున్నారు మరియు పాండవులకు, వారు యువత అయినా లేక ప్రవృత్తిలోని వారైనా, పాండవులు సదా పాండవపతికి సహచరులుగా ఉన్నారు, అటువంటి సహచరులైన పాండవులకు కూడా బాప్‌దాదా చాలా, చాలా ప్రియస్మృతులను ఇస్తున్నారు. మమ్మల్ని బాప్‌దాదా చూడటం లేదు అని టీచర్లు ఆలోచిస్తున్నారు, చూస్తున్నాము.
టీచర్లతో:- టీచర్లు అయితే తమ ఫీచర్లతోటే బాప్‌దాదాను సాక్షాత్కారం చేయించేవారు. బాప్‌దాదాను మరియు తమ ఫ్యూచర్‌ను కూడా ఫీచర్ల ద్వారా ప్రత్యక్షం చేసే సేవ విశేషంగా టీచర్లది. ప్రతి ఒక్కరి ఫీచర్లు సదా ఒక ప్రదర్శనిలా ఉండాలి. ప్రదర్శని చిత్రాలు స్వతహాగానే తమ పరిచయాన్ని ఇస్తాయి, అలాగే మీ ఫీచర్లు నడుస్తూ తిరుగుతూ ఉన్న ప్రదర్శనిగా ఉండాలి మరియు ప్రతి ఒక్కరికీ స్వతహాగా స్మృతిని ఇప్పిస్తూ ఉండాలి. అర్థమయిందా! 100 బ్రాహ్మణులకన్నా ఉత్తమమైన కుమారీలకు కూడా చాలా-చాలా ప్రియస్మృతులు. అచ్ఛా.
పిల్లలతో:- పిల్లలు లేకపోతే అందమే లేదు. ఇంటికి అలంకారము, బాప్‌దాదాకు అలంకారము పిల్లలే. పిల్లలనైతే బాప్‌దాదా రాజా పిల్లల రూపంలో చూస్తారు. ఒక్కొక్క పిల్లవాడు రాజా పిల్లవాడు. అంతే కదా! అంతేనా పిల్లలూ, రాజా పిల్లలేనా లేక ప్రజా పిల్లలా? చాలా మంచిది. పిల్లలను చూసి అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు పిల్లలు అద్భుతాన్ని చేసి చూపించండి. పిల్లలు కూడా తమ తోటి పిల్లలను తయారు చేయండి. చేస్తారు కదా! అచ్ఛా.
దాదీజీతో:- ఈరోజు ఏం గుర్తుకు వస్తుంది? విల్ పవర్స్ లభించాయి కదా! విల్ పవర్స్ యొక్క వరదానము ఉంది. చాలా మంచి పాత్రను పోషించారు, ఇందుకు అభినందనలు. మీకు అందరి ఆశీర్వాదాలు ఎంతగానో ఉన్నాయి. మీరు మాట్లాడినా, మాట్లాడకపోయినా కానీ, మిమ్మల్ని చూస్తేనే అందరూ సంతోషపడిపోతారు. మీకు ఏదైనా అయితే అందరూ మాకే అలా అయిపోతుంది అన్నట్లుగా భావిస్తారు. మీపై అంతటి ప్రేమ ఉంది. అందరికీ ఉంది. (మాకు కూడా అందరిపై చాలా ప్రేమ ఉంది) అందరిపై అయితే చాలా ప్రేమ ఉంది. ఈ ప్రేమయే అందరినీ నడిపిస్తూ ఉంది. ధారణ ఎక్కువ, తక్కువ ఉన్నా కానీ ప్రేమయే నడిపిస్తూ ఉంది. చాలా మంచిది.
ఈషూ దాదీతో:- వీరు కూడా లెక్కాచారాన్ని సమాప్తి చేసుకున్నారు. ఏం ఫర్వాలేదు. వీరిది సహజ పురుషార్థము, సహజముగా లెక్కాచారము సమాప్తమైపోయింది. నిద్రిస్తూ-నిద్రిస్తూ సహజముగానే సమాప్తమైపోయింది. విష్ణువులా విశ్రాంతి లభించింది. అచ్ఛా. అయినా కూడా సాకార రోజుల నుండి ఇప్పటివరకు యజ్ఞ రక్షకులుగా అయ్యారు. కనుక యజ్ఞ రక్షకులుగా అయినందుకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి.
దాదీలందరూ బాప్‌దాదాకు చాలా-చాలా సమీపముగా ఉన్నారు. మీరు సమీప రత్నాలు మరియు అందరికీ దాదీలంటే విలువ ఉంది. సంగఠన కూడా బాగుంది. మీ దాదీల సంగఠనయే ఇన్ని సంవత్సరాలుగా యజ్ఞాన్ని రక్షించింది మరియు అలా చేస్తూ ఉంటుంది. ఈ ఏకతయే అన్ని సఫలతలకు ఆధారము (బాబా మధ్యలో ఉన్నారు) బాబాను మధ్యలో ఉంచారు, ఈ అటెన్షన్ చాలా బాగా పెట్టారు. అచ్ఛా. అందరూ బాగున్నారా!
మోహిని అక్కయ్యతో:- ఆరోగ్యం బాగుందా, మీలో కూడా ధైర్యం చాలా ఉంది, నడిపించేస్తారు. వస్తుంది, వెళ్ళిపోతుంది, ఇది కూడా శక్తియే.
మనోహర్ దాదీతో:- ప్రకృతిని నడిపించడం వచ్చేసింది. పాత బండిని మధ్య-మధ్యలో నెట్టాల్సి వస్తుంది. అందుకే నడిపిస్తున్నారు, చాలా బాగా నడిపిస్తున్నారు. మీరు హాజరు అవ్వడము, ఇదే అంతా సఫలత. బాగుంది. అందరూ స్మృతి దివసమును చూసేవారు. అచ్ఛా!